Update 16

ఇదంతా ...... మొదటిసారి వాళ్ళని బార్ లో కలవడం దగ్గరనుండి, నిన్న మధ్యాన్నం తన రూమ్ లో కూర్చుని మాట్లాడినంత వరకు, అలాగే చివరిసారి తను, రాహుల్ వెళ్లి స్మిత ఇంటిని గమనించి వచ్చి నంతవరకు, జరిగిన అన్నీ సంఘటనలు శరత్ కి గుర్తుకొచ్చాయి. అందులో స్మిత తలపుల్లో వున్న వెచ్చదనం, ఆమె శరీరం తాలూకా స్పర్శ, ప్రేమ కూడా వున్నాయి.

ఈరోజు మంగళవారం సాయంత్రం, తన స్నేహితులతో, తమ రేపటి పధకానికి నాందిని, ఈరోజు జరుపుకుంటున్నారు. తన గదిలో ఇది మూడవ సమావేశం. అది ఎన్నో సమావేశం అన్నది కాదు ముఖ్యం. ఇప్పుడు తనతో రాహుల్, ఆదినారాయణ, రంజిత్ ఉన్నారనేది ముఖ్యం. వాళ్ళతో పార్టీ చేసుకోడం అనేది ముఖ్యం. గత రెండు గంటల నుండి పార్టీ జరుగుతుంది. వాళ్ళందరూ రేపు జరగబోయే తమ సాహస కృత్యాన్ని తలుచుకుని చిందులు వేస్తున్నారు. తను అనుకున్న ప్రయోగం ఇంకా కొన్ని గంటల్లో మొదలవుతుంది.

"హే రాహుల్, అందులో ఇంకా కొంచెం మందు పోసుకో" చెప్పాడు శరత్.

"వద్దు. ఎక్కువ తాగితే రేపు పొద్దున్న లేవడం కష్టం. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటే రేపటికి అన్నీ విధాలుగా తయారుగా వుంటా" చెప్పాడు రాహుల్.

అప్పటికే ఆదినారాయణ, రంజిత్ వెళ్లిపోవాలంటూ తలుపు దగ్గరికి వెళ్లిపోయారు.

"ఇంకో పెగ్ వేసుకోండి" అంటూ శరత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.

ఇద్దరూ ఒప్పుకోలేదు.

"ఇప్పటికే తగినంత అయింది. రేపు అన్నీ రకాలుగా సిద్ధంగా ఉండాలి. శరత్, నేను రేపు ఉదయాన్నే ఇక్కడికి వస్తా. నా జుట్టుకి రంగు వేయాలి" అన్నాడు రంజిత్.

"తప్పకుండా. నేను మర్చిపోను. మనం అన్నిటికి తయారై వున్నాం కదా. రాహుల్, నువ్వు రేపు ఉదయమే అయిదు గంటలకి వెళ్లి ఆ ఇంటి గేట్ తెరిచేలా చూడాలి. అక్కడినుండి ఇంటికి వెళ్లి, ఇంటి దగ్గర పెట్టిన ట్రక్ తీసుకుని, ఆరు గంటలకి నేరుగా ఇక్కడికి వస్తే, మేము ముగ్గురం తయారుగా ఉంటాము" చెప్పాడు శరత్.

"నేను ఇక్కడికి ఆరు గంటల కన్నా ముందే వస్తా. నా జుట్టు కి రంగు వేయాలిగా" అన్నాడు రంజిత్.

"తప్పకుండా. అయితే ఇక మిగిలింది మనతో స్మిత ని తీసుకపోవడమే అన్నమాట" అన్నాడు శరత్.

"నిజమే, రేపు ఇదే రాత్రికి --- నేను నమ్మలేకపోతున్నా. ప్రపంచంలో అందరూ కోరుకునే అమ్మాయితో మనం ---- మనం మాత్రమే ---- మనకే దక్కుతుంది ---- ప్రపంచంలో ఎవరూ అనుభవించని ఆనందాన్ని మనం అనుభవిస్తాం" అన్నాడు రంజిత్.

"తప్పకుండా. ఆమె ఈరోజు ఎక్కువగా మేలుకోకుండా త్వరగా నిద్రపోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రేపటి నుండి ఆమెకి మనం నిద్ర లేకుండా చేస్తాం కాబట్టి. ఏమంటారు మీరందరూ ?" క్రూరంగా నవ్వుతూ చెప్పాడు రాహుల్.

ఇంకా మంగళవారం రాత్రే. దాదాపుగా అర్ధరాత్రి అవుతుంది. ఇంకొన్ని గంటల్లో బుధవారం వస్తుంది. అదొక విశాలమైన పెద్ద భవంతి. అందులోని ఏ వస్తువును చూసినా, అందులో డబ్బే కనబడుతుంది. పెద్ద పెద్ద పెయింటింగ్స్, ఖరీదైన షాండ్లియర్ లు, దర్పానికి చిహ్నంగా ఖరీదైన కార్పెట్ లు, అది పగలేమో అనిపించేంత వెలుగునిచ్చే బల్బులు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. అక్కడ అన్ని వయసుల వాళ్ళు వున్నారు. కొందరు డ్రింక్స్ తో, ఇంకొందరు షాంపేన్ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. ఆ హాల్ కి ఒక మూలలో స్మిత అయిష్టంగా నిలబడి వుంది. అది ఆమె ఇల్లు.

ఆమె చుట్టూ నిర్మాతలు, దర్శకులు, ఒక వ్యాపారవేత్త మొత్తం నలుగురు నిలబడి వున్నారు. తాను ఎల్లుండి అమెరికా కి వెళ్లాల్సి ఉండగా, వీళ్ళు తమ తమ వ్యాపార లావాదేవీల గురించి, సినిమా ల గురించి ఆమెతో చర్చిస్తున్నారు. ఆమెని తమ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టమని ఒప్పించడానికి చూస్తున్నారు. మొదట్లో ఆమెకి ఒకింత శ్రద్ద వున్నా ఇప్పుడు ఆమెకి ఆ సంభాషణ చిరాకు తెప్పించసాగింది. వాళ్ళ ముందు శ్రద్దగా విన్నట్లు నటిస్తుంది కానీ తనని వాళ్ళు ఒంటరిగా వదిలిపెడితే బావుండు అని కోరుకుంటుంది.

తన కొత్త సినిమా సూపర్ హిట్ అయినందువల్ల కృతజ్ఞతగా అందరికి పార్టీ ఇవ్వాలని అనుకుంది. సినిమాకి పనిచేసిన అందరు, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ పిలిచింది. ముఖ్యులని కూడా పిలిచింది. తన స్నేహితులని పిలిచింది. అందరికి పేరు పేరునా కృతఙ్ఞతలు చెప్పింది. మొదట్లో ఈ పార్టీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూసినా, ఇంత రాత్రి అయ్యేసరికి ఇప్పుడు పార్టీ ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూడసాగింది.

ఎదుటి మనుషుల గొప్పదనాలు, వాళ్ళ తెలివి తేటలు తన ముందు చూపించాలన్న వాళ్ళ ప్రయత్నాలు, ఆమెకి చాలా చిరాకుని తెప్పిస్తున్నాయి. ఆ చిరాకు తన ముఖంలో ఎక్కడైనా కనబడుతుందేమో అన్న భయం కూడా ఆమెలో వుంది. ఆమె ఎప్పుడూ తన మనసులో వుండే భావాలని బయటపడనివ్వకుండా మనసుకి ముసుగు వేసింది. తన ఆలోచనలు, తన కోరికలు, తన భావాలూ ఏవీ ఎప్పుడూ ఎవరితో చెప్పలేదు.

పార్టీ మొదలయ్యి దాదాపుగా అయిదు గంటలు అవుతున్నా, మొదటి అతిధి ని ఆహ్వానించినపుడు ఎలా వుందో, ఇప్పుడు కూడా అలానే వుంది. అలానే కనిపిస్తుంది. ఈ పార్టీకి నడుము వరకు మాత్రమే వున్న జాకెట్, క్రిందుగా మోకాళ్ళ మీదకి వుండే స్కర్ట్ ని వేసుకుంది. అయితే జాకెట్ లోపల బ్రా వేసుకోకుండా, స్కర్ట్ లోపల మినీ అండర్వేర్ మాత్రమే వేసుకుంది. అయితే ఎలాంటి నగలు పెట్టుకోలేదు. ఒక చిన్న గొలుసు, దానికి వున్న ఒక చిన్న వజ్రం మాత్రమే వేసుకుంది. లో నెక్ జాకెట్ అవడం వల్ల ఆ గొలుసు ఆమె బలిసిన స్తనాల మధ్యలో ఇరుక్కుని పోయింది. ఆమె పెద్దగా మేకప్ కూడా వేసుకోలేదు. పార్టీ మొదలవడానికి ముందు, ఇంట్లో తయారయ్యి అలానే నగ్నంగా అద్దం ముందుకి వచ్చి నిలబడి చూసుకుంటే, తన స్థనాల బిగుతు, సైజు చూసి తనకి తానే మురిసిపోయింది. ఇరవై ఎనిమిది ఏళ్లకే తన కొలతలు అలా ఉండడం, తన కఠోర శ్రమ, క్రమం తప్పని వ్యాయామాలు అని గుర్తుచేసుకుంది.

అలసట బాగా పెరిగి పోతుంది. నిలబడి కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. చేతులు కలిపి మాట్లాడడం వల్ల భుజాలు కూడా. అయినా ఓపికగా అవేమి ఎదుటి వారికి తెలియకుండా మేనేజ్ చేస్తుంది. సమయం ఎంత అయిందో చూడాలని వున్నా, అది సభ్యతగా ఉండదని ఆపని చేయలేదు. తన ఎదురుగా వున్నవ్యక్తులు ఇప్పుడు తనతో మాట్లాడడం లేదని, వాళ్లలో వాళ్ళే ఎదో వాదించుకుంటున్నారని స్మిత గ్రహించింది. అదే అదునుగా భావించి మెల్లిగా నిలబడి ఎదురుగా వున్న గడియారం వైపు చూసింది. సమయం పదకుండు యాభై అయింది.

మెల్లిగా పక్కకి జరిగి, తన దోస్త్ ఇంకా సెక్రటరీ అయిన సునీత కి సైగ చేసింది. సునీత కి అర్ధం అయింది. మెల్లిగా తాను కూడా లేచి, బ్రహ్మం మోచేతి మీద తట్టింది. పక్కకు తీసుకుని వెళ్లి చెవిలో నెమ్మదిగా చెప్పింది. అదంతా స్మిత గమనిస్తూనే వుంది. బ్రహ్మం చాలా విషయాల్లో నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెబుతాడు. అలా చెప్పడం స్మిత కూడా ఇష్టపడుతుంది. గత కొన్ని ఏళ్లుగా బ్రహ్మం ఆమెకి మేనేజర్ అయ్యాక చాలా వృధా ఖర్చుల్ని, అనవసర వ్యక్తులతో సమావేశాల్ని, ముఖ్యమైన వాళ్లతో సంబంధాల్ని ఏర్పరిచి ఆమె కెరీర్ ని చాలా ఎత్తుకి లేపాడు. అతను సమయాన్ని అసలు వృధా కానివ్వడు.

బ్రహ్మం తన నటనని మొదలుపెట్టాడు. ఒక చెయ్యిని నోటికి అడ్డం పెట్టుకుని పెద్దగా ఆవులిస్తూ
"ఒహ్హ్, అర్ధరాత్రి అవుతుంది. నేను ఇంతవరకు గమనించలేదు. ఇప్పుడు మనం స్మిత గారికి సెలవిస్తే తను వెళ్లి రెస్ట్ తీసుకుంటుంది" అన్నాడు ఆ మొత్తం హాల్ కి వినిపించేంత పెద్ద గొంతుతో.

వెంటనే ఒక్కొక్కళ్ళు సెలవు తీసుకోవడం మొదలు పెట్టారు. తన ఎదురుగా వున్న వాళ్ళతో స్మిత నవ్వుతూ
"అందరు బయలుదేరుతున్నారు. నేను వెళ్లి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వాలి" అనగానే ఆమె వెళ్ళడానికి వాళ్ళు దారి ఇచ్చారు.

ఆమెకి చాలా అలసటగా అనిపించింది. అయితే అది శారీరక శ్రమ వల్ల కాదు. జనాలను చూడడంవల్ల వచ్చింది. ఎక్కువమంది మనుషులు ఉండడాన్ని ఆమె ఇష్టపడదు. ఆమెకి నచ్చే వ్యక్తులు - సునీత (వున్న ఒకేఒక దోస్త్), బ్రహ్మం - కళ్ళు మూసుకుని గుడ్డిగా నమ్మే ఒకేఒక వ్యక్తి, తన హెయిర్ డ్రెస్సేర్, తన ఇంట్లో పని చేసే ఇద్దరు (భార్య భర్తలు). వాళ్ళు అప్పటికే ఆమె కి సంబంధించిన వస్తువుల్ని సర్దడం మొదలుపెట్టారు.

వెళ్ళిపోతున్న అతిదులందరికి నవ్వుతు నమస్కరించి వీడ్కోలు పలికింది. అందరు వెళ్ళిపోయాక బ్రహ్మం ఆమె దగ్గరికి వెళ్ళాడు.
"నీకు బాగా బోర్ కొట్టింది కదా. అయితే వచ్చిన అతిధులు అందరు బాగానే గడిపారు. ఇక నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను రేపు ఫోన్ చేస్తాను" అన్నాడు.

"నువ్వు ఫోన్ చేయకు. నేనే నీకు ఫోన్ చేస్తా. రేపంతా నేను ఇంట్లోనే వుంటాను. సరుకోవాల్సిన వస్తువులు చాలా వున్నాయి. నా బాధ అర్ధం చేసుకుని అందరిని పంపివేసినందుకు నీ మేలు మర్చిపోలేను. నువ్వు నిజంగా నా దేవుడువి" నవ్వుతూ చెప్పింది స్మిత.

బ్రహ్మం కూడా వెళ్ళిపోయాడు.

అక్కడ ఆమె ఒక్కటే నిలబడి వుంది. చివరిగా బయటికి వెళ్లిపోయిన అతిధుల వాహనాలు వెళ్లిపోయిన శబ్దం ఆమెకి వినిపించింది.

"సునీత! నువ్వు గేట్ తెరిచే ఉంచావా ?" స్మిత అడిగింది.

"ఎప్పుడో తెరిచి ఉంచా. అయిన అవన్నీ నీకెందుకు ? హాయిగా వెళ్లి నీ బెడ్ రూమ్ లోని హంసతూలికా తల్పం మీద పడుకో. నీకు ఇప్పుడు ఎక్కువ నిద్ర అవసరం. నేను ఇక్కడే ఉండి, చివరి గెస్ట్ కూడా వెళ్ళిపోయాక, గేట్ మూసి, ఇంట్లో వున్న చెత్త చెదారం అంతా తీయించి, సెక్యూరిటీ అలారం ఆన్ చేసి పడుకుంటాలే" చెప్పింది సునీత.

"చాలా బోర్ పార్టీ కదా ఇది ?" అంది స్మిత.

"అలా కాదులే. ఎప్పుడు జరిగే పార్టీ లాంటిదే ఇది. మనం పెట్టిన అన్ని పదార్ధాలని ఏమి మిగిల్చకుండా తినేశారు" చెప్పింది సునీత.

"అసలు మనమెందుకు పార్టీ ఇఛ్చాము..... అయినా ఇలాంటివి తప్పవులే" అని మళ్ళీ తానే చెప్పింది స్మిత.

"సరే సునీ, నేను పడుకుంటా. పొద్దున్న మాట్లాడుకుందాం" అని స్మిత వెళ్ళబొయింది.

"ప్రొద్దున్నే ఎందుకు లేస్తావు ? రేపు ఇంకొంచెం ఎక్కువసేపు పడుకో" చెప్పింది సునీత.

"అలా నాకు ఇష్టం ఉండదు. నాకు నేను గా ఎంజాయ్ చేసే టైం అది. రోజు మొత్తం లో నాకు ఇష్టమైన సమయం అదొక్కటే" అన్నది స్మిత.

"నువ్వు ఒక్కసారి అమెరికాలో దిగాక, వెళ్లి నీ RK ని కలిసాక, ఇంతకన్నా మంచి సమయం అప్పుడు ఉందని అనిపిస్తుందిలే" అంది సునీత.

"ఏమో! అనిపించొచ్చు. చెప్పలేము. చూద్దాం. ఎవరు ఎలా ఉండాలో అలానే వుంటారు. అయినా ఇప్పుడు నాకేం బాధ అనిపించడం లేదు" చెప్పింది స్మిత.

తన చెప్పుల్ని వదిలేసి కార్పెట్ మీద నడుస్తూ చెప్పింది
"నేను వంటరిగా వున్నప్పుడు, నా గురించి నేనే కొత్త సంగతులు తెలుసుకుంటాను. అది జీవితానికి చాలా ముఖ్యం. అలా తెలుసుకోవడం వల్లే మనం జీవితంలో ఎదగగలం. కానీ చాలామంది ఈ సత్యాన్ని తమ జీవితకాలం తెలుసుకోలేరు. ఇందులో నువ్వు చేసిన సహాయాన్ని నేనెప్పుడూ మర్చిపోను. థాంక్ యు. నేను పడుకోడానికి వెళుతున్నా" అంది.

"ఓయ్, ఇందులో నేను చేసిందేమి లేదు. అంతా నీ మంచితనమే" చెప్పింది సునీత.

"నువ్వు నన్ను ప్రోత్సహించావు. ఒక విత్తుని నాటి చెట్టుని పెంచినట్లు, నాలో మార్పుని తెచ్చావు. నన్ను ఎవరు ఇష్టపడాల్సిన అవసరం లేదు. నాకు ఎవరి అనుమతి అక్కరలేదు. ఈ ఆలోచన ఎంత బాగుంది. నన్ను నేను ప్రేమిస్తా. నేను ఎలా ఉన్నానో, ఏమి అనుభూతి పొందుతానో, దానినే ఇష్టపడతా. అయితే ఒక స్టార్ యాక్ట్రెస్ లా కాదు. ఒక మామూలు మనిషిలా. నా జీవితం లోకి ఎవరన్నా రావాల్సిన అవసరం వుందా ? ఏమో. తెలియదు. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లిపోవాలని అనిపిస్తుంది. అందరికి దూరంగా. ఈ కృత్రిమ మనుషులకి దూరంగా. నేనెక్కడికి వెళ్లానో ఎవరికీ తెలియకూడదు. ఎవరూ నా గురించి ఆలోచించకూడదు. నాకేం ఇష్టమో అవి వేసుకోవాలి. నాకేం ఇష్టమో అదే తినాలి. సమయం అనే పట్టింపు ఉండకూడదు. అప్పోయింట్మెంట్ లు ఉండొద్దు. ఫోన్ వద్దు. మేక్-అప్ లు వద్దు. ఫోటో షూట్ లు వద్దు. రిహార్సల్స్, ఇంటర్వూస్ వద్దు. నేను మాత్రమే ఉండాలి" తనలో తను చెప్పుకున్నట్లు అన్నది.

"తప్పకుండా ఉందువు కాని. ఇప్పుడు వద్దు. మనం దానికి సమయం ఎంచుకుందాం"

"అవును, నేను అందుకోసం ప్లాన్ చెయ్యాలి. దానికి ముందు నేను RK ని కలవాలి. నేను వస్తా అని తను ఎదురుచూస్తున్నాడు. వెళ్లి కలిసాక మాకు ఈ బంధం ముందుకు వెళుతుందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ సెట్ అయితే మంచిదే. సంతోషంగా డ్యూయెట్ పాడుకోవచ్చు. లేదంటే నా మార్గమేదో నేను ఎంచుకోవాలి. ఇంతవరకు సరిగ్గానే ఆలోచిస్తున్నానా ?" సునీత ని అడిగింది.

"నువ్వు చెప్పేది కరెక్ట్"

"కాబట్టి నాకు చాలా మార్గాలు వున్నాయన్న మాట. అందుకు సంతోషం. నా జాతకం ఎలా వుందో మరి. చూద్దాం. కొంచెం ఇక్కడికి వచ్చి నా జాకెట్ గుండీలు తీస్తావా ?"

సునీత వెళ్లి గుండీలు తీయసాగింది.

"నా సైక్రియాటిస్ట్ ఏమి చెప్పాడో తెలుసా ? మనం మన ఆలోచనల్ని దాచుకోవద్దన్నాడు. లోపల ఎం ఆలోచిస్తామో, బయటికి అలానే ఉండమని చెప్పాడు. నేను అలా ఎవరి దగ్గర ఉండగలనో మరి. నువ్వు లేకపోతె నేను ఏమయ్యేదానినో" అంది.

సునీత కి గుడ్ నైట్ చెప్పి, త్వరగా పడుకోమని చెప్పి తన బెడ్ రూమ్ కి వెళ్ళింది. ఒంటరిగా పడుకోవడం ..... తనకి ఇష్టం.
***

అరగంట తర్వాత, స్మిత తన పలుచని నైట్ డ్రెస్ లో, బెడ్ రూమ్ లో వున్న విశాలమైన మంచం మీది పరుపులో, దుప్పటిని గొంతు వరకు కప్పుకుని పడుకుంది. తనకి నిద్ర రావడం లేదు కానీ మత్తుగా వుంది.
పడుకోవడానికి ముందు రోజు తాను వేసుకునే Nembutal మాత్ర ని వేసుకుంది. అది పని చేయడానికి ఇంకో పది నిమిషాల సమయం పడుతుందని తనకి తెలుసు.

హాయిగా పడుకుని, రిలాక్స్ గా, ప్రశాంతంగా తన మనసుని పాత ఆలోచనల వైపు కాకుండా, ప్రస్తుత పరిస్థితులపై, తన భవిష్యత్తు పనులపై ద్రుష్టి సారించింది. తన డాక్టర్ చెప్పినట్లు ఇది మానసిక ఎదుగుదలకి చాలా ముఖ్యం. గతం గురించే ఆలోచించడం అంటే మనకి మానసిక జబ్బు వున్నట్లే.

ఈరోజు రాత్రి తనకి హాయిగా, భద్రతతో ఉన్నట్లు అనిపిస్తుంది.

ఒకప్పుడు తన మంచంపై పడుకుంటుంటే, ఇబ్బందిగా, కోపంగా అనిపించేది. తాను ఎదగడానికి కష్టపడే రోజుల్లో తాను గడిపిన నిద్ర లేని రాత్రులు, కోల్పోయిన సుఖాలు, భరించిన కష్టాలు అన్నీ కలిపి తనలో ఒక విధమైన కోపాన్ని పెంచాయి. కాని ఇప్పుడు సక్సెస్ ని అందుకున్నాక ఒక లాంటి ఊరట లభించింది. అయితే కొన్ని కోట్ల మంది జనాలకి తానొక కోరిక, ఒక సెక్స్ కోరిక లా మిగిలింది. ఎవరైనా తన గురించి సెక్స్ లో ఎలా అనుభవిస్తామా అని ఆలోచిస్తారే తప్ప ఒక మనిషిలా గుర్తించరు. తనని ఇలాంటి మంచానికే పరిమితం చేస్తారు తప్ప, వేరే విలువ ఇవ్వరు.

అయితే ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఇదే అనుభవాన్ని అందరు అనుకోవాలని, తాను కష్టపడుతున్న రోజుల్లో భావించింది. తీరా తీరాన్ని చేరాక ఇప్పుడు అలా అందరు అనుకోవడాన్ని తాను అంగీకరించలేక పోతుంది. జనాల సంగతి పక్కన పెడితే, తన నిర్మాతలు, తన డైరెక్టర్ లు, ఆఖరికి తన PR వ్యవహారాలు చూసే ఏజెంట్ కూడా తనని ఇప్పటి లాగే ఉండాలని కోరుకుంటున్నారు.

ఆఖరికి ఇప్పుడు ప్రతి వాడు తనని తానొక మంచం మీది సుఖాన్నిచ్చే వస్తువు గా చూస్తున్నారు. బహుశా అందుకే అనుకుంటా తనకి మంచం అంటే అంత విరక్తి.

ఇప్పుడిప్పుడే అలాంటి ఆలోచనలని పట్టించుకోవడం మానేసింది. ఇప్పుడు తన ఇష్టప్రకారం బ్రతకడం మొదలుపెట్టింది. తాను ముందు ముందు ఏమేం చెయ్యాలో గమ్యాలను నిర్దేశించుకుంది. ఎందుకో మొదటిసారి తాను భద్రతతో ఉన్నట్లు, మగవాడి కోరిక చూపుల నుండి, వాళ్ళ కబంద హస్తాల నుండి తప్పుకుని, తనకంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నట్లు భావించింది.

మొదటిసారి, తనేం కోరుకుంటుందో, ఎప్పుడు అనుకుంటుందో, ఎలా అనుకుంటుందో అవన్నీ సాధించుకునే స్థాయిలో వుంది. మగాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తాను వాళ్ళ కన్నా పై స్థాయిలో వుంది. మగాడి కన్నా తానే ఎక్కువ.

ఇరవై ఎనిమిదేళ్ల తన జీవితం, తన మనసు, తన శరీరం - తనకే స్వంతం. అవును. నేనెవరికీ జవాబుదారీ కాదు. నాకు నేనే జవాబుదారీ.

తనేమన్నా కోల్పోతుందా ? లేదనుకుంటా. జీవితంలో తనకి ఎలాంటి లోటు లేదు. ఉందా ? నన్ను నేను ప్రేమించుకోవడం వల్ల జీవితాన్ని సంతోషంగా గడపగలనా ? ఈ కొత్తదనం పోయాక కూడా ఇలానే ఉండగలనా ? అప్పుడు నాకు ఇంకెవరి తోడైనా కావాలని అనిపించొచ్చా ? అప్పుడు నన్ను నన్నుగా ఇష్టపడే మనిషి, నాపై ప్రేమను చూపించి నన్ను సుఖపెట్టే మనిషి, రోజూ కొత్తదనాన్ని చూపించే మనిషి నాకు అవసరం అవుతుందా ? RK మంచి మనిషే. కాకపోతే అతనికి ఇగో వుంది. అన్నీ తన ఇష్టప్రకారం నడవాలని అనుకుంటాడు. అందుకే గొడవలు వచ్చాయి. మళ్ళీ అతనితో కలిసిపోగలనా ?

ఇప్పుడు కొత్త ఆలోచనలు వస్తున్నాయి. తానే సర్దుకుంటే తప్పేంటి ? అలాగే తనకి ఎక్కడ విలువ ఇవ్వాలో అతనికి చెబితే సరిపోతుందేమో. ఎల్లుండి, కాదు కాదు రేపు తాను అమెరికా వెళుతుంది. అతనితో గడిపి, అతని గురించి ఇంకొంచెం తెలుసుకుని, తన గురించి అతనికి తెలియచెప్పి, మళ్ళి తమ బంధం కొనసాగించే అవకాశం ఉందేమో చూడాలి.

ఆమెకి ఆవలింతలు వచ్చాయి. ఒత్తిగిలి పక్కకు తిరిగింది.

"మనమేమి నిజాలు సృష్టించుకున్నామో అవి మన శరీర భాగం అవ్వడానికి చాలా సంవత్సరాలు గడవాలి." ఫ్రెంచ్ కవి Paul Valery రాసిన సూక్తి గుర్తుకొచ్చింది.

అలాంటప్పుడు ఇప్పుడే తొందర ఎందుకు ? రూపాంతరం జరగాలి, జరుగుతుంది, జరిగి తీరాలి.

ఆమె నిద్ర పోయే క్షణం ముందు తనకి వచ్చిన చివరి ఆలోచన - రేపు అద్భుతంగా, అత్యద్భుతంగా ఉండబోతుంది.

ఆమె నిద్రలోకి జారిపోయింది.......​
Next page: Update 17
Previous page: Update 15