Update 03

అశుతోష్ ఇన్ డేంజర్

మాయా రూపధారి సృష్టించిన గందరగోళం


ఆ సిద్ధపురుషుడికి ముంబైలో మొట్టమొదటగా కనిపించిన దృశ్యం అశుతోష్ ఆ మాసిన గడ్డం ఉన్న పెద్దాయనని ఫాలో అవుతూ వెళ్ళటం. వెంటనే తనకు కనిపించిన దృశ్యాన్ని సంజయ్, అంకిత, అభిజిత్ లతో ఇలా వివరించాడు.

"మీ పై అధికారి ఎవరో తన వాహనాన్ని మధ్యలోనే ఆపేసి ఒక మాసిన గడ్డం వున్న పెద్దాయనని వెంబడిస్తున్నాడు. ఆ మాయా రూపధారులని తలచుకోగానే నాకు కనిపించినది ఇదే. ఆయనతో మీలో ఎవరైనా మాట్లాడగలరా ఇప్పుడు? వెంటనే ఆయనని హెచ్చరించండి. ఆయన ఒక మయా రూపధారి వలలో చిక్కుకున్నాడని చెప్పండి. ఎవరో అనుకుని పొరబడినట్టున్నాడు."

"ఆయనకు వెంటనే ఫోన్ చేసి చెప్తాను స్వామి", అంటూ అశుతోష్ తో మాట్లాడటానికి బయటికి వెళ్ళాడు సంజయ్.

"మాసిన గడ్డం ఉన్న పెద్దాయన అంటే మైథాలజీ ప్రొఫెసర్ రాధాకృష్ణన్ కదా?", అంది అంకిత అభిజిత్ తో.

"అందులో డౌట్ ఏం ఉంది? ఒక్కసారి చూస్తే మర్చిపోయే ప్రొఫైల్ పిక్కా అయ్యగారిది!" అన్నాడు సర్కాస్టిక్ గా అభిజిత్.

"హహహ...అందరూ నీలా హ్యాండ్సమ్ గా ఉండరు లే", అని మెల్లగా అభిజిత్ కి మాత్రమే వినబడేలా అంది అంకిత.

"ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడేది ! ఇవ్వాళ ఏమైంది నీకు?" అన్నాడు అభిజిత్.

"ఏంటి ఒక్క కాంప్లిమెంట్ కే అంతలా ఎగ్జైట్ అయిపోతున్నావ్", అంది అంకిత.

"సరే అవ్వను లే", అని ఠక్కున బదులిచ్చాడు.

"నీకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు", అంది.

"ఇప్పుడు నువ్వే కదా మాట్లాడింది", అన్నాడు.

"అవును నేనే మాట్లాడా. అయితే ఏంటి?" అంది.

"ఏం లేదు. ఇంతకీ ఈ కేసు ఎప్పుడు సాల్వ్ అవుతుంది అంటావ్?" అన్నాడు.

"ఇప్పట్లో కాదు. ఎందుకు అలా అడిగావు?" అంది.

"నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఇదంతా. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఇలా రాజవరానికి రావటం. ఇవన్నీ జరగటం. ఈ కేసు సాల్వ్ అయిపోయి మళ్ళీ మనం ముంబై బ్యాక్ వెళ్ళిపోతే ఇవన్నీ మిస్ అయిపోతానని ఓ పక్క బాధగా, మరో పక్క భయంగా ఉంది", అన్నాడు.

"ఏంటి నీకు ఇదంతా జోక్ లా ఉందా? అక్కడ అశుతోష్ ట్రాప్ అయ్యాడు బాబు", అంది.

"లైఫ్ లో ఆ మాత్రం థ్రిల్ ఉండాల్సిందే", అన్నాడు.

"ఏదైనా చెప్పటం చాలా ఈజీ.....చెయ్యటం కష్టం", అంది.

"ఏదైతే అందరికీ కష్టంగా అనిపిస్తుందో అదే ఎగ్జైట్ చేస్తుంది నన్ను.......చిన్నప్పటి నుంచి నా నేచర్ అంతే", అనేశాడు సూటిగా అంకిత కళ్ళలోకి చూస్తూ.

"క్యూటీ", అంది చిన్నగా తనకు మాత్రమే వినబడేలా.

"ఏంటి ఏదో అన్నావ్...డ్యూటీ నా?" అన్నాడు.

"నీకు వినబడింది అని నాకు తెలుసు. ఎందుకు ఆస్కార్ యాక్టింగ్ లు చేస్తావ్ నా దగ్గర", అంది.

"హే....నిజంగానే నాకు వినబడలేదు", అన్నాడు ఏమీ తెలియనట్టు అమాయకంగా. కానీ ఏం లాభం? ఎంతగా నవ్వు ఆపుకుందామని ట్రై చేసినా చిరునవ్వు కబ్జా చేసేసింది అభిజిత్ ఫేస్ ని.

అది చూసి అందంగా నవ్వింది అంకిత.

అభిజిత్ కి మరింత ఆనందం కలిగించే నవ్వు అది.

డిస్ప్లే లో సంజయ్ నెంబర్ కనబడగానే అశుతోష్ కాల్ లిఫ్ట్ చేసాడు.

అశుతోష్: హా చెప్పు సంజయ్

సంజయ్: సర్ మీరు ఫాలో చేస్తున్న వ్యక్తి ప్రొఫెసర్ రాధాకృష్ణన్ కాదు....

అశుతోష్: అసలు ఎలా తెలిసింది నీకు? ఆర్ యు వాచింగ్ మీ ఫ్రొం ఏ డిస్టెన్స్?

చుట్టూ ఒక సారి చూసాడు అశుతోష్.

సంజయ్: సర్ ఇందాక మీకు కాల్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని విచిత్రాలు జరుగుతున్నాయి అని చెప్పాను కదా. సో నన్ను నమ్మండి. మీరు రాధాకృష్ణన్ అనుకుని ఎవరిని అయితే ఫాలో అవుతున్నారో మాయా రూపధారి అతను.

అశుతోష్: వాట్ !

సంజయ్: షేప్ షిఫ్టర్ సర్

అశుతోష్: వాట్ ఆర్ యు టాకింగ్, సంజయ్? ఈజ్ థిస్ సమ్ కైండ్ అఫ్ ఏ ప్రాంక్ ?

సంజయ్: లేదు సర్. నాకు ఎన్నో విషయాలు తెలిసాయి ఇక్కడ. ఐ విల్ అప్డేట్ ఆల్ అఫ్ దెమ్ టు యు వన్స్ యు ఆర్ సేఫ్....

ఇప్పుడు మాత్రం నేను చెప్పేది మాత్రమే గుర్తుపెట్టుకోండి. చాలా మంది షేప్ షిఫ్టర్లు బయట ప్రపంచంలో తిరుగుతున్నారు. అతనితో జాగ్రత్తగా ఉండండి. అతని మాయలో పడకండి. ఫాలో చెయ్యండి కానీ తొందరపడి అతన్ని ఫిజికల్ గా ఎటాక్ చెయ్యటం కానీ, కస్టడీ లోకి తీసుకోవటం కానీ చెయ్యొద్దు. చాలా డేంజరస్ అది.

అతను రాధాకృష్ణన్ కాదు అంటున్నావ్. షేప్ షిఫ్టర్ అంటున్నావ్. అసలు ఎవరు ఇంతకీ?

సంజయ్: చీకటి రాజ్యం అతనిది. పాతాళలోకం కింద వుండే మహాపాతకులలో ఒకడు అతను. ఈ భూమ్మీద ఇంకొన్ని రోజుల్లో ఎన్నో చీకటి రాజ్యాలు తమ సామ్రాజ్యాలను విస్తరించుకోనున్నాయి.

అశుతోష్ : ఏంటో నాకేం అర్థం కావట్లేదు. దీని గురించి మనం రేపు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి నేను అతన్ని ఫాలో అవుతున్నాను. లీడ్ ఏదైనా దొరికితే నేను అప్డేట్ చేస్తాను. అండ్ ఐ విల్ స్టే సేఫ్. ఐ విల్ మైంటైన్ మై డిస్టెన్స్ ఫ్రం ది షేప్ షిఫ్టర్, యాజ్ యు కాల్ ఇట్.

సంజయ్: థాంక్ యు సర్. ప్లీజ్ స్టే సేఫ్

ఒక నిర్మానుష్యమైన వీధిలోకి ఆ మాయారూపధారుడు అడుగుపెట్టాడు. అతన్నే అనుసరిస్తూ అడుగులో అడుగు వేస్తూ వెళ్ళాడు అశుతోష్. కొంత దూరం నడిచాక ఆ మాయా రూపధారి కనబడలేదు.

ఎటు వెళ్లిపోయాడా అని ప్రతీ చోటా వెతికాడు అశుతోష్. చుట్టూ చూసాడు. ఎక్కడా కనబడలేదు.

ఇంతలో వెనక నుండి ఎవరిదో చెయ్యి అశుతోష్ భుజాన్ని తాకినట్టు అనిపించింది.

తిరిగి చూసాడు.

చీకటి సామ్రాజ్యాల నాయకుడు ఘోర కలి కనిపించాడు.

భయంతో వణికిపోయాడు అశుతోష్.

---------------------------------------------------------------

అశుతోష్ తో ఘోర కలి మాటా మంతి

ఘోర కలి చెప్పే ముచ్చట్లు


ఘోర కలి : ఆర్యా....నన్ను ఘోర కలి అందురు. నేను పెద్ద సదువులు సదవలేదయ్యా. అందుకే గదా ఇట్టాగుండాను....కానీ జీవితం సదివా. మనుషుల్ని ఇంకా సదివా. మగువల్ని ఇంకా ఇంకా సదివా. కికికికి...ఏంది అట్టా జూత్తావు !

అశుతోష్ : రేయ్ నువ్వేమైనా ప్రైమ్ మినిస్టర్ వా? నీ గురించి ఏముంది చెప్పుకోవటానికి?

ఘోర కలి : ఏందయ్యా అట్టా మాట్టాడతావు....నేనెవరు అనుకున్నావు ?

అశుతోష్ : చెప్పావు కదా ఘోర కలి అని.

ఘోర కలి : కలి అంటే యేందో ఎరుకనా నీకు ! ఇదాయకంగా మాట్టాడు నాతోటి....పెద్ద పెద్ద సదువులు సదివినోడి లెక్క ఉండావు.....బలవంతుడితో ఇట్టాగేనా మాట్టాడేది

అశుతోష్ : ఏంటి నీ బలం?

ఘోర కలి : నీ బలహీనతే నా బలం....కికికికి

అశుతోష్ : ఎందుకలా దరిద్రంగా నవ్వుతావు ?

ఘోర కలి : వాయబ్బో.....ఏందయ్యా నువ్వు.... ఎట్టా నవ్వాలో కూడా సెబుతావా ఏంది....కికికికి

అశుతోష్ : అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావ్?

ఘోర కలి : అది సెప్తా వుంటేనే కదా మధ్యలో ఏందేందో పేలతా వున్నావు

అశుతోష్ : సరే చెప్పు

ఘోర కలి : ఎలుక తోలుదెచ్చి ఏడాది యుతికిన....నలుపు నలుపెగాని తెలుపురాదు....కొయ్యబొమ్మ దెచ్చి కొట్టినబలుకదు.....విశ్వదాభిరామ వినురవేమ

ఈ పద్యం ఇన్నావా?

అశుతోష్ : వేమన పద్యాలు చిన్నప్పుడు విన్నా

ఘోర కలి : నేను అడిగేది ఏంది....నువ్వు సెప్పేది ఏందీ....ఈ పద్యం ఇన్నావో లేదో సెప్పవయ్యా

అశుతోష్ : వినలేదు

ఘోర కలి : అగ్గది...సిన్నప్పటి నుంచి రోజుకొకటి సదివినా....ఈ పాటికి నువ్వే ఓ శతకం రాసేటోడివి గదయ్యా.....ఏందో లే....కికికికి

అశుతోష్ : ఇప్పుడు ఆ పద్యం ఎందుకు చెప్పావో చెప్పు?

ఘోర కలి : ఆత్రగాడికి బుద్ధి మట్టం అని ఏందయ్యా ప్రతి దానికీ తొందర పడతాండావు....సెబుతా కదా...ఓపిక ఓపిక ఉండాలి మగాడికి....

అశుతోష్ ఇంకేం మాట్లాడలేదు.

ఘోర కలి : ఏంది మొహం సెపాతిలా బెట్టావు.....నవ్వవయ్యా మగడా.....కికికికి

అశుతోష్ : హహహ

ఘోర కలి : ఏందిరో…. ఎక్కిరింతగా నవ్వుతున్నావు.....ఒక్క పిడిగుద్దు పడ్డాదనుకో రాగిముద్ద లెక్క అయితది మోహము.....ఏది సక్కగా నవ్వు ఇప్పుడు

అశుతోష్ సీరియస్ గా ఫేస్ పెట్టాడు.

ఘోర కలి : ఒకప్పుడు నీ తాన సక్కని సిరునవ్వు ఉండేది అనుకుంటా....ఏందో ఐనది మధ్యల....ఇట్టా ఐపోయావు

అశుతోష్ షాక్ అయ్యాడు. అంత కరెక్ట్ గా తన పర్సనల్ లైఫ్ గురించి ఎలా గెస్ చేసాడో అర్థం కానట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.

ఘోర కలి : ఏంది అట్టా జూత్తావు.....ఆ కూసింత కానొచ్చే బొమ్మ పెట్టెల్లో పొద్దుగూకే దాకా మాట్టాడతా ఉంటే బుర్రలో గుజ్జు ఏదైనా మిగులుతుందా ఏందీ?

అశుతోష్ : నేను ఎవ్వరితోనూ మాట్లాడను....మా టీం వాళ్ళతో తప్ప

ఘోర కలి : సర్లే...ఇంతకీ ఆ వేమన పద్యం అర్థం ఏంటంటే....ఎంత ఉతికినా ఎలుక తోలు తెల్లగా కాదు అని....ఆడ వేమన సెప్పింది మన గురించే..... ఏ లోకానికి పంపినా కలి ఇంతే....కికికికి……

ఘోర కలి వచ్చాడు ఈ భూమ్మీదకి....ఇప్పుడు...ఇప్పుడు మొదలయ్యింది అసలైన ఆట.

ఈ సారి క్రూరంగా నవ్వాడు ఘోర కలి. చూడటానికే కాదు వినటానికి కూడా ఇంకా భయంకరంగా ఉంది ఆ నవ్వు.

అశుతోష్ : ఏం చెయ్యాలి అనుకుంటున్నావు మమ్మల్ని? నీకేం కావాలి?

ఘోర కలి : మంచోళ్ళు నాకొద్దు....సెడ్డాళ్లే ముద్దు.....

అశుతోష్ : ఈ భూమ్మీద మంచిగా బతికేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మమ్మల్ని వదిలెయ్యి. ఇక్కడ నీకు చెడ్డవాళ్ళు దొరకరు.

ఘోర కలి : కికికికి....ఏం సిత్రమయ్యా ఇది....నువ్వు అన్నీ ఇలా సిత్రమైన మాటలే సెబుతావు

అశుతోష్ : నీ ప్లాన్ ఏంటి? ఏం సాధించాలి అనుకుంటున్నావు?

ఘోర కలి : అందరికీ నేను రాజునవ్వాలి.....అందరూ నాకు లా ఎదవలు అవ్వాలి....ఇప్పుడు గూడా అందరూ ఎదవలే....కానీ పైకి నటిత్తా వుండారు....నేనొచ్చా కదా...ఈ నటనలకి కాలం సెల్లిపోయింది ఇక....కికికికి

ఇంతలో పైన ఆకాశంలో నుండి ఒక నల్లరంగులో వుండే విమానం వీళ్ళుండే చోటికి వచ్చింది. చీకటి రాజ్యం వాళ్ళు అశుతోష్ చేతులు కట్టేశారు.

ఘోర కలి గట్టిగా అడుగులు వేస్తూ భూమి దద్దరిల్లేలా వెళ్తున్నాడు.

అశుతోష్ ని తీసుకుని ఘోర కలి, అతని భటులూ విమానం వైపుకి వెళ్తూ ఉన్నారు.

చుట్టూ ఉండే ముంబై ప్రజలకి ఇదంతా వేరే రకంగా కనిపిస్తోంది.

ఘోర కలి మాయా రూపధారి కాబట్టి తన ఐడెంటిటీ తెలియనివ్వకుండా మాఫియా డాన్ లా మారిపోయాడు.

చీకటి రాజ్యం వాళ్ళు కూడా కార్పొరేట్ అసిస్టెంట్ లలా సూట్ లలోకి మారిపోయారు.

విమానం క్షణాలలో టేక్ ఆఫ్ అయ్యింది అక్కడి నుంచి.

కొంత మంది జరుగుతున్న ఈ తతంగాన్ని అంతా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు....

అశుతోష్ కిడ్నాప్డ్ అని హాష్ టాగ్ ట్రెండ్ అయ్యింది ఆ రోజు రాత్రి సిటీ ట్రెండ్స్ లో.

-------------------------------------------------------------

ఘోర కలి వార్నింగ్

ప్రపంచానికి చీకటి రాజ్యాల అధినేత ఘోర కలి హెచ్చరిక


ఘోర కలి, అతని అనుచరులు అశుతోష్ చేతులు కట్టేసి బలవంతంగా లాక్కుని వెళ్తున్న ఆ వీడియో క్షణాల్లో దేశం అంతటా వైరల్ అయిపోయింది. అశుతోష్ చాలా పేరున్న ఆఫీసర్ అవ్వటంతో అతి తక్కువ కాల వ్యవధిలోనే ప్రపంచంలో చాలా మందికి తెలిసిపోయింది. అశుతోష్ మాజీ భార్య స్మిత సంజయ్ కి కాల్ చేసింది.

స్మిత: హలో సంజయ్...ఎక్కడున్నావ్?

సంజయ్: ఏమైంది మేడం? మీరు కాల్ చేశారేంటి? ఎనీథింగ్ రాంగ్?

స్మిత: అసలు న్యూస్ ఫాలో అవుతున్నావా నువ్వు?

సంజయ్: అశుతోష్ కి ఏమైనా జరిగిందా ?

స్మిత: అశుతోష్ ని కిడ్నాప్ చేశారు ఎవరో కొందరు.....లుక్స్ లైక్ దే ఆర్ ఫ్రొం మాఫియా

సంజయ్: వాట్?....మాఫియా నా?....ఓహ్ షిట్ ! వాళ్ళా...చెబుతూనే ఉన్నా దూరంగా ఉండమని....వింటేనా?

స్మిత: ఏంటి, నీకు ముందే తెలుసా?

సంజయ్: అదొక పెద్ద స్టోరీ మేడం....తరవాత చెబుతాను మీకు....ఇప్పుడు అశుతోష్ ఎలా ఉన్నారు? కరెంట్ సిట్యుయేషన్ ఏంటి అక్కడ?

స్మిత: ఏమో నాకు తెలీదు....న్యూస్ లో చూసాను....చాలా బాధ అనిపించింది....సిన్సియర్ ఆఫీసర్ తను.....జాబ్ అంటే పిచ్చి....అలాంటి ప్యాషనేట్ వ్యక్తిని నేనెప్పుడూ చూడలేదు నా లైఫ్ లో

కాసేపు సైలెన్స్ తర్వాత....

సంజయ్: మరి ఎందుకు మేడం తనని వదిలేశారు?

స్మిత: నాకు తన సపోర్ట్ కావాల్సిన టైం లో కూడా జాబ్ జాబ్ అంటూ నన్ను అస్సలు పట్టించుకోలేదు.....ఏం చేయమంటావ్? ఐ హాడ్ నో ఛాయస్ !

సంజయ్: మీకు తనంటే చాలా రెస్పెక్ట్ అని నాకు తెలుసు....ఇలాంటి టైములో మీ లాంటి వాళ్ళు ప్రేయర్ చెయ్యటం చాలా ఇంపార్టెంట్.....ఐ హోప్ దే రీచ్ హిం అండ్ ప్రొటెక్ట్ హిం ఫ్రొం బాడ్ ఫోర్సెస్

స్మిత: యా సంజయ్....నువ్వు చెప్పింది నిజం.....ఐ విల్ డెఫినిట్లీ ప్రే ఫర్ హిం

సంజయ్: ఓకే థెన్....ఉంటాను...మేడం, ప్లీజ్ టేక్ కేర్

స్మిత: బై....టేక్ కేర్

సంజయ్ వెంటనే తన ఫ్రెండ్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ జోసెఫ్ సెబాస్టియన్ కి కాల్ చేసాడు.

సంజయ్: జోసెఫ్....అశుతోష్ సర్ మిస్సింగ్ ....తెలుసు కదా ?

జోసెఫ్: యా సంజయ్...అసలు అదే హాట్ టాపిక్ నేషన్ మొత్తం

సంజయ్: కెన్ యు హెల్ప్ మీ?

జోసెఫ్: యా చెప్పు

సంజయ్: నాకు ఇక్కడ ఒక యోగి అండ్ సిద్ధపురుషుడు కనిపించారు....అశుతోష్ ప్రస్తుతం ఎక్కడున్నారో ఆయన చెప్పగలరు. ఆయన నాకు డీటెయిల్స్ చెప్పగానే లొకేషన్ నీకు షేర్ చేస్తాను జిపిఎస్ లో

జోసెఫ్: ఓకే....ఇంతకీ ఎవరు ఆ యోగి? అసలు లొకేషన్ డీటెయిల్స్ ఎలా చెప్పగలుగుతున్నాడు?

సంజయ్: నాకు తెలీదు.....హి కెన్ లిటరల్లీ సీ దోస్ ఇమేజెస్ ఇన్సైడ్ హిస్ హెడ్ అండ్ షేర్ దెమ్ విత్ మీ

జోసెఫ్: వావ్ ! గ్రేట్ ! కెన్ ఐ మీట్ హిం వన్స్?

సంజయ్: డెఫినిట్ గా చెప్పలేను....అడిగి చూస్తాను....ఆయన కారణం లేకుండా ఎవ్వరినీ కలవరు

జోసెఫ్: ఓకే

సంజయ్: అశుతోష్ సర్ ని మాత్రం ఎలా అయినా నువ్వే రెస్క్యూ చెయ్యాలి...ప్లీజ్

జోసెఫ్ : డెఫినిట్ గా సంజయ్....ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్

సంజయ్: వన్ థింగ్....అశుతోష్ ని కిడ్నాప్ చేసింది మాఫియా వాళ్ళు కాదు.....వాళ్ళు షేప్ షిఫ్టర్స్

---------------------------------------------------

జోసెఫ్: వాట్ !

సంజయ్: యా....వాళ్ళ గురించి నీకే తెలుస్తుంది మీట్ అయినప్పుడు.....ఐ యాం జస్ట్ వార్నింగ్ యు

జోసెఫ్: ఓకే....థిస్ ఈజ్ గెట్టింగ్ ఇంటరెస్టింగ్ .....ఐ విల్ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ థిస్ ఆపరేషన్....డోన్'ట్ వర్రీ

సంజయ్: థాంక్ యు జోసెఫ్

జోసెఫ్: ఛలో....సీ యు

సంజయ్: బై

విమానం దిగగానే, ఘోర కలి, తన మనుషులూ తమ మొట్టమొదటి చీకటి రాజ్యంలోకి ఉత్సాహంతో అడుగుపెట్టారు.

అశుతోష్ కళ్ళకి గంతలు కట్టేసి ఉండటంతో వాళ్ళు తనని ఎక్కడికి తీసుకొచ్చారో తెలుసుకోలేకపోయాడు.

మధ్యలో ఒకే ఒక్క లైట్ మాత్రమే ఉన్న చీకటి గదిలోకి అశుతోష్ ని తీసుకుని వెళ్లారు. అక్కడ చైర్ లో అశుతోష్ ని కట్టేసి ఉంచారు. ఘోర కలి అశుతోష్ కి ఎదురుగా ఇంకొక చైర్ వేసుకుని కూర్చున్నాడు.

ఘోర కలి చెబుతుంటే వీడియో రికార్డు అయ్యేలా అక్కడ అరేంజ్మెంట్స్ చేశారు ఒక ట్రైపాడ్ స్టాండ్, కెమెరా మరియు నెట్ కనెక్షన్ తో వీడియో లైవ్ అయ్యేలా ప్లాన్ చేశారు.

ఘోర కలి ఇలా చెప్పటం స్టార్ట్ చేసాడు.

"ప్రపంచంలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు. చరిత్రలో ఎంతో మంది నాయకులు ఉన్నారు. చాలా దేశాలలో నియంతలు ఉన్నారు. కానీ ఈ చీకటి రాజ్యాలకు మాత్రం ఘోర కలి ఒక్కడే ఉన్నాడు.

ప్రతి సారి వోటింగ్ వెయ్యటం.... ఒక నాయకుడిని ఎన్నుకోవటం.... బోర్ కొట్టట్లేదా?

ప్రపంచం మొత్తం ఒకటే వరల్డ్ ఆర్డర్ ఉంటుంది ఇక నుంచి.

ఎవ్వరైనా సరే ఈ ఘోర కలికి భయపడాల్సిందే.

చీకటి రాజ్యాల్ని సపోర్ట్ చేసే దేశాలు, ఎదురుతిరిగే దేశాలు ఈ రెండే కులాలు ఉంటాయి ప్రపంచంలో.

సపోర్ట్ చేసే దేశాల ప్రజలు సేఫ్ గా ఉంటారు. ఎదురు తిరిగిన దేశాల ప్రజలు పాతాళంలో ఉంటారు.....కికికికి

ఇది నా సిగ్నేచర్ స్మైల్ ! బావుందా ?

అశుతోష్ అనే ఈ సిబిఐ ఆఫీసర్ 'అదృశ్య మందిరం' కేసు ని ఇన్వెస్టిగేట్ చేసి నిజాలు బయట పెడతాడంట....కికికికి

చూసారుగా ఏమైందో ! కిడ్నాప్ అయ్యి మా చీకటి రాజ్యం లోనే సేఫ్ గా ఉన్నాడు.

'అదృశ్య మందిరం' కేసు ని మర్చిపోండి. అలాగే ఈ ఘోర కలికి ఎదురుతిరగాలి అనే ఆలోచనను మర్చిపోండి.

ప్రాణాలతో మిగులుతారు. ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్."

ఆ వీడియో నిమిషాల్లో ప్రపంచం మొత్తం చూసేసింది.

హైయెస్ట్ వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది.

ప్రపంచ దేశాల నాయకులు వెంటనే సమావేశం అయ్యారు.

సిద్ధపురుషుడు, సంజయ్, అభిజిత్, అంకిత లు ఆ వీడియో చూసారు.

"స్వామి, అశుతోష్ ఎక్కడున్నాడో మీరే ఎలా అయినా కనుక్కుని చెప్పాలి", అన్నాడు సంజయ్.

ఘోరకలి దగ్గరున్న అరుదైన నాగమణి వల్ల అతను ఎక్కడున్నాడో ఆ సిద్ధపురుషునికి వెంటనే తెలిసిపోతుంది.

ఆ నాగమణి వల్లే ఘోరకలి తను ఏది అనుకుంటే అది చెయ్యగలుగుతున్నాడు.

అతనెక్కడ ఉన్నాడో ఏ మానవుడూ కనిపెట్టలేకపోతున్నాడు.

సిద్ధపురుషుడు కాసేపు మౌనం వహించి ఇలా చెప్పాడు.

"ఘోరకలి ఎక్కడున్నాడో మీకు చెప్తాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అతనిని ఎదుర్కోవటం అంత సులభం కాదు. దానికి ఎన్నో తెలివితేటలు, ఓర్పు, నేర్పు కావాలి.

మనకు కొన్ని అరుదైన శక్తులు కూడా కావాల్సిన అవసరం ఉంది. చీకటి రాజ్యంలో ఎంత మంది సైనికులున్నారో, ఎన్ని మారణాయుధాలున్నాయో మనకు తెలీదు.

అందుకే మనం ఇప్పుడు శంభల రాజ్యానికి పయనం అవ్వాలి. మీరు ముగ్గురూ నాతో రావాలి"

సంజయ్, అభిజిత్, అంకిత ముగ్గురికీ ఈ శంభల రాజ్యం గురించి ఏమీ తెలీదు. సంజయ్, అంకిత లు ఇద్దరికీ ఏం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూస్తుంటే

"మీరెప్పుడంటే అప్పుడు నేను రెడీ స్వామి. నాకు రాజులు అన్నా, రాజ్యాలు అన్నా చాలా ఇష్టం", అనేశాడు అభిజిత్.

సిద్ధపురుషుడు మృదువుగా నవ్వాడు.​
Next page: Update 04
Previous page: Update 02