Update 05
శివుని జటాజూటంలోని గంగను
మర్యాద పురుషోత్తముడైన ఆ శ్రీరామచంద్రుడు తానే స్వయంగా సిద్ధపురుషునికి ఇవ్వటం అన్నది మామూలు విషయం కాదు. ఇందులో ఏదో కార్యకారణ సంబంధం ఉన్నదని ఆ సమర్థ రాఘవుడు అను నామధేయం కలిగిన సిద్ధపురుషునికి వెంటనే అర్థం అయిపోయింది. ఎన్ని వేల కోట్ల జన్మలెత్తినా దొరకని అదృష్టం తనను వరించింది అనిపించింది.
శ్వేతద్వీప వైకుంఠం వదిలి అదృశ్య మందిరానికి వచ్చే ముందు ఆ శ్రీమహావిష్ణువు ,"ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటాను సిద్ధా", అన్న మాటే గుర్తుకొచ్చింది ఆ క్షణాన సమర్థ రాఘవుడికి. హృదయం ద్రవించిపోయింది ఆయన చూపిన కరుణకి.
అక్కడ కొంతసేపు నిశ్శబ్దం ఏర్పడింది. ఆ రామలక్ష్మణులను సంజయ్, అభిజిత్, అంకితలు భక్తిభావంతో మైమరచిపోయి అలానే చూస్తూ ఉన్నారు.
రాముడిలా చెప్పాడు, "మీరు ఇక్కడి నుండి వాయవ్య దిశగా పయనం అయితే మీరు కోరుకునే గమ్యాన్ని చేరుకునే మార్గం సుగమం అవుతుంది. సీతానది దాటిన తర్వాత కూడా వాయవ్య దిశగానే మీరు పయనించాలి. ఎన్నో కఠినమైన పరీక్షల తర్వాత మీకు ఒక సముద్రం కనబడుతుంది. అది దాటితే వచ్చేదే శంభల నగరం. ఆ సముద్రం దాటడానికి మైనాకుడు మీకు తోడ్పడతాడు."
ఆ మాటలు పూర్తవ్వగానే రామలక్ష్మణులు ఇరువురూ అంతర్ధానమయ్యారు.*
-----------------------------------------------------------
శంభల రాజ్యానికి పయనం – 3
సంకల్ప బలానికి శల్య పరీక్ష
రాముడు చెప్పినట్టే వాయవ్య దిశగా వెళ్లగా ఒక యోజనము దూరం అనగా 8 /10 మైళ్ళ దూరం లేదా 16 కిలోమీటర్ల దూరం నడిచాక వారికి సీతా నది కనిపించినది. నది దర్శనం చేసుకున్న తర్వాత వారు అక్కడే కొంత సేపు విశ్రాంతి తీసుకున్నారు. అంతలో అక్కడికి ఒక మునీశ్వరుడు వచ్చాడు. సిద్ధపురుషునికి అభివాదం చేసి సంజయ్, అభిజిత్, అంకితలను ఒకసారి తీక్షణంగా చూసాడు.
"మీలో అచంచలమైన దీక్ష, పట్టుదలలు మెండుగా ఉన్నవి. మీకు సిద్ధపురుషుని సాంగత్యం దొరకటం ఒక వరం. ఎంత గొప్ప శిష్యుడికైనా సరైన గురువు దొరికినప్పుడే తను నేర్చుకునే విద్యకు సార్థకత చేకూరుతుంది. అలానే ఇన్ని కష్టనష్టాలు అనుభవిస్తూ మీరు చేస్తున్న ఈ ప్రయాణం సిద్ధపురుషుని వల్లే గమ్యం దిశగా చేరుకుంటోంది. మీకు ఈ మహానుభావుడి వల్లే రామలక్ష్మణుల దర్శన భాగ్యం కలిగింది. ఇదంతా మీకు చెప్పటానికి ఒక బలమైన కారణం ఉన్నది. సీతా నదిని దాటిన తర్వాత మీకు ఎదురయ్యే ప్రతీ ఒక్కరు మీ నమ్మకాలను, విశ్వాసాలను చాలా లోతుగా పరీక్షిస్తారు. ఎక్కడ ఏ చిన్న లోపం ఉన్నట్టు వారికి అనిపించినా మీ ఉనికినే దెబ్బ తీయ్యాలని ప్రయత్నిస్తారు. లంకిని లాంటి రాక్షస స్త్రీలు, శంఖినీ జాతి స్త్రీలు, శాకిని, డాకిని లాంటి పిశాచ స్త్రీలు మీకు కనబడతారు. శంఖినీ స్త్రీలు చెప్పుడు మాటలు వింటూ ఉంటారు. వారి పాదాలు చాలా పెద్దవిగా ఉంటాయి. వారు పురుషుణ్ణి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు. శంభల రాజ్యానికి మీరు వెళ్ళాలి అంటే ఈ కఠిన పరీక్షల్ని ఎదుర్కోక తప్పదు. ఆడవారికి రాక్షస స్త్రీలు తారసపడతారు. మగవారికి శంఖినీ జాతి స్త్రీలు ఎదురవుతారు. శృంగార భావనలని ప్రేరేపిస్తారు. పిశాచ స్త్రీలు ఆడవారికి, మగవారికి ఎదురవుతారు. ఇవన్నీ ఎలా ఉన్నా సరే ఒక్క విషయం మాత్రం మనసులో స్థిరంగా గుర్తు పెట్టుకోండి. మన భావనకు చాలా బలమున్నది. మనసుయందు ఆ మహాశివుణ్ణే నెలకొల్పి మీరు అడుగు ముందుకేస్తూ ఉంటే చాలు మిగతాది ఆయనే చూసుకుంటాడు. హంస దేవత వివేకాన్ని ఇచ్చి చీకట్లను పారద్రోలుతుంది. అందుకే మీకు ఈ
హంస గాయత్రి
మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను.
ఓం
హంస హంసాయ విద్మహే
పరమ హంసాయ ధీమహి
తన్నో హంసః ప్రచోదయాత్ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఏదైనా ఉపద్రవము వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని మూడు సార్లు మననం చేసుకోండి. మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది.
ఓం నమః శివాయ
", అనేసి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆ మునీశ్వరుడు.
"మనల్ని గెలిపించటానికి గొప్ప గొప్పవాళ్ళు దారి పొడుగునా తారసపడుతూ జ్ఞానోపదేశం చేస్తున్నారు కదా!" అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు సిద్ధపురుషుడు.
మౌనదీక్షలో ఉండటంతో సంజయ్, అభిజిత్, అంకితలు ఏం మాట్లాడలేకపోయారు. వారి కళ్ళల్లో మాత్రం ఆ కృతజ్ఞతా భావం కనబడింది. ఆ మునీశ్వరుడు ఉపదేశించిన మంత్రాన్ని జపం చేస్తూ గడిపారు కాసేపు.
ఆ తర్వాత రాముడు చెప్పినట్టుగానే సీతా నదికి వాయవ్య దిశగా బయలుదేరారు.
కొంత దూరం వెళ్ళగానే వెలుగు అమాంతం తగ్గిపోయింది. తగ్గిపోవటం కాదు అస్సలు లేకుండా పోయింది. సంజయ్, అభిజిత్, అంకితలు ఎవరు ఎక్కడున్నారో వారికే తెలియట్లేదిప్పుడు. మౌనదీక్షలో ఉన్నారు కాబట్టి బయటికి గట్టిగా మాట్లాడలేరు. సిద్ధపురుషుడు ఎక్కడున్నాడో కూడా వారికి తెలీదు. సిద్ధపురుషుడు ఏదైనా మాట్లాడతాడేమో అని లోలోపల ఆశతో ఎదురుచూస్తూ ముందుకెళ్తున్నారు ఆ చీకట్లోనే. అది అలాంటి ఇలాంటి చీకటి కాదు. చుట్టూ చీకటి. కింద, పైన చీకటి. నిశీథినీ సముద్రంలా అనిపించింది వారికి.
ఏ శబ్దమూ లేదు. ఏ అలికిడి లేదు. అంత సేపు మౌనదీక్షలో ఉన్నా కూడా అనుభవించనంత నిశ్శబ్దాన్ని వాళ్ళు అక్కడ అనుభవిస్తున్నారు. కానీ అది ఆనందాన్ని ఇచ్చే నిశ్శబ్దంలా అనిపించట్లేదు. భయాన్ని పెంచి పోషించే క్రూరమైన నిశ్శబ్దంలా అనిపిస్తోంది. ఆ నిశ్శబ్దంలో, ఆ చీకట్ల సాగరంలో, ఆ భయాందోళనలో సంజయ్, అభిజిత్, అంకితలకు వారిలో ఉన్న నిజమైన ధైర్య, సాహసాలేంటో తెలిసొచ్చాయి. ఇదంతా దేని కోసం చేస్తున్నాం అన్న ప్రశ్న మొదలైంది వారిలో. చాలా ముఖ్యమైన ప్రశ్న అది. జీవితంలో మనం ఏ పనినైనా విజయవంతంగా చెయ్యాలంటే ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిస్తే చాలు. అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది.
అశుతోష్ ని కాపాడటానికి ఇంత రిస్క్ చేశారా?
ప్రపంచాన్ని ఘోర కలి నుండి కాపాడటానికా?
సిద్ధపురుషుడి మీదున్న నమ్మకంతో ఆయన ఏది చెప్తే అది చేశారా?
ఇవేవి కావు. ముగ్గురికీ ఒక్కటే అనిపించింది. శంభల రాజ్యానికి వెళ్ళటం అన్నది విధి లిఖితం. ఎలాగైనా సరే అది జరిగే తీరుతుంది అని అనిపించింది ఆ క్షణంలో సంజయ్, అభిజిత్, అంకితలకు. ఏదైతే విధి లిఖితమో దాన్ని ధైర్యంగా ఎదుర్కోవటమే ముందున్న లక్ష్యం అని ఎవరో హితబోధ చేసినట్టుగా అనిపించింది ముగ్గురికీ. వెంటనే వాళ్లలో ఉన్న సంశయాలన్నీ పటాపంచలు అయ్యాయి. ధైర్యంగా అడుగేస్తూ ముందుకెళ్లారు ఆ చీకట్లలోనే.
--------------------------------------------------
అంతటి చీకట్లో కూడా శంఖినీ జాతి స్త్రీ తన చుట్టూ కాంతితో అణువణువూ కనబడేలా అందంగా తయారయ్యి సంజయ్, అభిజిత్ లకు తారసపడింది.
"అమ్మాయి నడుము ఎంత మృదువుగా ఉంటుందో తెలుసా? లేత కొబ్బరిలా ఉంటుంది. తాకి చూస్తారా?" అంటూ సంజయ్, అభిజిత్ లకు దగ్గరిగా వస్తూ వారి చేతులను తీసుకుని తన నడుమును తాకించింది.
"ఎలా వుంది? మాట పడిపోయిందా? హహహ", అంటూ అందంగా నవ్వింది ఆ శంఖినీ జాతి స్త్రీ.
సంజయ్, అభిజిత్ లు నోరు మెదపలేదు.
"నాతో రతి కోసం శంభల రాజ్యంలోని ప్రతీ మగాడు తహతహలాడిపోతాడు. కానీ నన్ను సుఖపెట్టేవాడిని నేనే ఎంపిక చేసుకుంటాను. నాకు అంత తేలికగా ఏ మగాడూ నచ్చడు. మీ ఇద్దరూ మంచి వయసులో ఉన్నారు. సింహాలలా ఆకలి మీదున్నారు. మిమ్మల్ని రెచ్చగొడితే రాత్రి, పగలు అనే నియమం పెట్టుకోకుండా నాతో సంభోగిస్తారు. హహహ", అంటూ సరసం ఒలకబోస్తూ కొంటెగా కన్ను గీటింది. తన శిరోజాలని సవరిస్తూ తన కుచద్వయం కనిపించేలా కళ్ళ నిండా తమకంతో రెచ్చగొడుతోంది.
"యువకులారా! మీ వయసును వృధా చేసుకోవటానికా ఇంత దూరం వచ్చింది? హహహ" అంటూ సంజయ్, అభిజిత్ ల బుగ్గ మీద ముద్దు పెట్టింది.
"నా వెచ్చని శ్వాస మీ బుగ్గలను తాకితేనే ఇలా తమకంలో తేలిపోతున్నారే! హహహ. ఇక మీ పెదాలతో నా పెదాల్ని బంధిస్తే ఏ అప్సరసా ఇవ్వనంత మధువును నేను మీకందిస్తాను. అప్పుడేం ఐపోతారో ఊహించుకుంటేనే నవ్వొస్తోంది" అంటూ మాటలతోటే కాదు చేతలతోనూ కవ్విస్తోంది.
హంస దేవత
వివేకాన్ని ఇచ్చి చీకటిని దూరం చేస్తుందని చెప్పిన ఆ మునీశ్వరుడి మాటలు ఇప్పటికి గుర్తుకొచ్చాయి వారిద్దరికీ. బాహ్యమైన దృష్టికి కనబడేది కాదు శంభల రాజ్యం అన్న సిద్ధపురుషుని మాటలు కూడా గుర్తుకొచ్చాయి. భౌతికమైన సుఖాలను ఎరగా చూపి వశపరుచుకోవాలని చూసే ఈ శంఖినీ జాతి స్త్రీ తమలోని సంకల్ప శక్తిని మాత్రమే పరీక్షిస్తున్నదని అర్థం అయిపోయింది సంజయ్, అభిజిత్ లకు. వెంటనే ఆ మునీశ్వరుడు ఉపదేశించిన
హంస గాయత్రి
మంత్రాన్ని పఠించారు. ఆ మంత్రం పఠించగానే తన మాయా రూపాన్ని వీడి ఆ శంఖినీ జాతి స్త్రీ ఇలా అన్నది.
"శంభల రాజ్యంలో మిమ్మల్ని మోహానికి గురిచేసే అందగత్తెలు ఎందరో ఉంటారు. వారి మాయలో పడిపోయి మీ కార్యాచరణను పూర్తిగా మరిచిపోయి వారికే వశం అయిపోయే ప్రమాదం ఎంతైనా ఉన్నది. అందుకే ఇలా శంఖినీ జాతి స్త్రీలా వచ్చి మీలో కామోద్రేకాన్ని కలిగించి మీలో వున్న మానసిక బలాన్ని పరీక్షించాను. ఈ పరీక్షలో మీరు ఇరువురూ విజయం సాధించారు. విజయోస్తు. శంభల రాజ్యంలో మీరు కోరుకున్న అన్ని శక్తులూ మీకు లభిస్తాయి" అని చెప్పి అక్కడి నుండి కనుమరుగు అయిపోయింది ఆ అదృశ్య దేవత.
సంజయ్, అభిజిత్, అంకితలు ఆ చీకట్లలోనే ఎంతో దూరం నడిచారు. అలా ఒక పది యోజనాల దూరం నడిచాక ఒక కొండ చివరి అంచు కనిపించింది. చీకటి తెర వీడిపోయింది. సంజయ్, అభిజిత్ లకు అంకిత కనిపించింది. సిద్ధపురుషుడు వీళ్లందరి కంటే ముందే అక్కడికి చేరుకున్నాడు. ఆ కొండ చివరి అంచు దగ్గర నిలబడి ఉన్నాడు.
ఆకాశంలో నుండి సూర్యుని కిరణాలు తేజోవంతంగా ప్రకాశిస్తున్నాయి.
వాళ్ళు ముగ్గురూ నడుచుకుంటూ సిద్ధపురుషుని వైపుగా వెళ్తున్నారు. వీళ్ళ ముగ్గురినీ చూడగానే సిద్ధపురుషుడు అమితానందం పొందాడు.
"మొత్తానికి అనుకున్నది సాధించారు. ఇక్కడే కొంత సేపు సేద తీరుదాం. మైనాకుడి కోసం ఎదురుచూడాల్సిందే. ఈ సముద్రాన్ని దాటడం మనవల్ల కాదు", అంటూ ఆ కొండ చివరి అంచు వరకూ వెళ్లి కిందున్న ఆ మహాసముద్రాన్ని చూపిస్తూ అన్నాడు.
అనంతమైన మహా సాగరంలా ఉందది. ఇంతవరకూ భూమ్మీద అలాంటి సముద్రాన్ని ఎప్పుడూ చూడలేదనిపించేలా ఉందది.
సంజయ్, అభిజిత్, అంకితలు ఆ సముద్రాన్నే చూస్తూ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు.

శంభల రాజ్యానికి పయనం – 4
మైనాకుని సహాయంతో సముద్ర లంఘనము....శంభల నగరానికి ఆగమనం
సిద్ధపురుషుని నిర్దేశంతో సంజయ్, అభిజిత్, అంకితలు తమ
మౌన దీక్షను విడిచి పెట్టారు. ఆ కొండ చివరి అంచునే ఆసీనులై మహాసముద్రాన్ని చూస్తూ ఉన్నారు. సిద్ధపురుషుడు మాత్రం ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు.
"ఏమిటి స్వామి అంతలా ఆలోచిస్తున్నారు?" అడిగాడు సంజయ్.
"ఆ రోజున రాముడు మనకు దిశానిర్దేశం చేస్తున్నప్పుడు చివరిలో సముద్రం దాటాల్సి వస్తే మైనాకుడు మనకు తోడ్పాటుని అందిస్తాడన్నాడు. దాని గురించే ఆలోచిస్తున్నాను", అని బదులిచ్చాడు ఆ సిద్ధపురుషుడు.
"స్వామి....అసలు ఎవరీ మైనాకుడు?" అడిగాడు అభిజిత్.
"క్షమించండి స్వామి....మా వాడికి పురాణాలతో కాస్త కూడా పరిచయం లేదు", అన్నాడు సంజయ్.
అభిజిత్ వంక వింతగా చూస్తూ, "ఏంటి నీకు మైనాకుడు ఎవరో కూడా తెలీదా !" అన్నది అంకిత.
"అందరికీ అన్ని విషయాలూ తెలియాల్సిన అవసరం లేదు కదా. అభిజిత్ అడిగాడు కాబట్టి మైనాకుడి గురించి, రామాయణంలో మైనాకుని ప్రస్తావన గురించి మీకు చెబుతాను.
జంబూద్వీపంలోని అన్నిపర్వతాలకు రారాజు హిమవంతుడు. ఇతను మేరు పర్వతరాజు పుత్రిక అయిన మేనకను పెళ్లి చేసుకున్నాడు. మేనకా, హిమవంతుల కుమారుడే ఈ మైనాకుడు. అప్పట్లో పర్వతాలకు రెక్కలు ఉండేవి. అవి ఒక చోట నుండి మరొక చోటకు యథేచ్ఛగా సంచరిస్తూ ఉండేవి. ఒకానొక పర్వతం చేసిన తప్పిదం వల్ల కొన్ని పక్షులకు, జీవులకు ప్రాణనష్టం జరిగింది. ఇంద్రునికి ఆగ్రహం రావటంతో ఆ పర్వతాల రెక్కలు అన్నింటినీ తన వజ్రాయుధంతో ఖండిస్తూ పోతున్నాడు. ఆ సమయంలో ఇంద్రునికి భయపడ్డ మైనాకుడు వాయుదేవుని సహాయముతో దక్షిణ సముద్రంలో దాక్కున్నాడు.
హనుమంతుడు సీతాదేవిని వెతుకుతూ లంకకు పయనం అయ్యి సముద్రమును దాటుతుండగా, సముద్రుని కోరిక మేరకు మైనాకుడు తన ఆతిథ్యమును స్వీకరించమని హనుమను కోరాడు. సముద్ర గర్భంలో ఎక్కడో అడుగున ఉన్న మైనాకుడు వాయుదేవుని మీదున్న కృతజ్ఞతతో వాయుదేవుని పుత్రుడైన హనుమంతుడు సేద తీరటం కోసమని తన శృంగము పై అనగా తన పర్వతశిఖరము పై విశ్రమించమని వినమ్రముగా అడిగాడు. రామకార్యం పూర్తయ్యే వరకూ తనకు విశ్రాంతి అన్నది లేదని హనుమ మైనాకుని విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించాడు. హనుమంతుడికి సహాయపడి తన ఋణం తీర్చుకోవాలని తపన పడిన ఆ మైనాకుడికి ఇంద్రుడు అభయం ఇచ్చాడు.
ఇప్పటికీ రెక్కలు కలిగిన పర్వతంగా మనకు మైనాకుడు ఒక్కడే కనిపిస్తాడు."
"వావ్...అంటే మనల్ని ఇప్పుడు ఆ మైనాకుడే శంభల రాజ్యానికి తీసుకెళ్తాడన్నమాట!" అన్నాడు అభిజిత్.
"చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అంకిత....ఫ్లయింగ్ మౌంటైన్ ని చూడబోతున్నాం ఫస్ట్ టైం మన లైఫ్ లో!" అని ఎగ్జైట్ అయ్యాడు అభిజిత్.
అంకిత,"నీతో ఇదే ప్రాబ్లం....తెలిసే దాకా ఆపవు, తెలిసాక అస్సలు ఆగవు"
సంజయ్,"ఇందాకటి నుంచి దేని గురించి స్వామి తీవ్రంగా ఆలోచిస్తున్నారు?" అడిగాడు సిద్ధపురుషుణ్ణి.
"రాముడు మనకు చేసిన ఆ దిశానిర్దేశంలోనే ఏదో ఒక ఆంతర్యం దాగుంది. అదేంటో అంతుపట్టట్లేదు", అన్నాడు ఆ సిద్ధపురుషుడు.
"వాయవ్య దిశగా వెళ్ళమన్నాడు. ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడి నుంచి వాయవ్య దిశగా ఎటు వెళ్తాము? కింద సముద్రం ఉంది. వీ హావ్ టు వెయిట్ ఫర్ మిస్టర్ మైనాక", అన్నాడు అభిజిత్.
"ఏది ఇంకోసారి చెప్పు", అని అభిజిత్ ని అడిగాడు ఆ సిద్ధపురుషుడు.
"వాయవ్య దిశగా ఇక్కడి దాకా వచ్చాము. ఆ దిశగానే వెళ్ళాలి. బట్ ఇక్కడి నుంచి కదలటానికి లేదు. సో..." అని అభిజిత్ అంటూ ఉండగానే
"మార్గం దొరికేసింది", అన్నాడు ఆ సిద్ధపురుషుడు.
"అభిజిత్ మాటలే ఇప్పుడు మనకు దారి చూపించాయి", అని ఆనందంతో చెప్పాడు సిద్ధపురుషుడు.
అభిజిత్ మాటలు దారి చూపించటం ఏంటి అన్న ప్రశ్న మొదలయింది సంజయ్, అంకితలకు. సిద్ధపురుషుని మాటల్లోని లోతైన భావం ఏంటో వాళ్లకు అర్థం కావట్లేదు.
"అదెలాగ స్వామి?" అని అడిగాడు సంజయ్.
"వాయవ్య దిక్కుకు అధిపతి వాయుదేవుడు. మైనాకుడిని ఆనాడు కాపాడినది వాయుదేవుడే. వాయుదేవునికి కృతజ్ఞతగా మైనాకుడు మనకు సహాయాన్ని అందిస్తాడు. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటంటే మన నలుగురిలో వాయుదేవునితో సంబంధం వున్న వాళ్ళు ఎవరు అన్నది. మీ ముగ్గురి జన్మ నక్షత్రాలు నాకు చెప్పండి", అన్నాడా సిద్ధపురుషుడు.
"స్వాతి", అని సంజయ్ బదులిచ్చాడు.
"శతభిషం", అని అభిజిత్ జవాబు ఇవ్వగా, "ధనిష్ఠ", అని అంకిత సమాధానమిచ్చింది.
"ఈ జన్మ నక్షత్రాలు ఎందుకు స్వామి? ఇంతకీ మీ జన్మ నక్షత్రం ఏదో చెప్పనేలేదు", అని క్యూరియాసిటీతో అడిగాడు అభిజిత్.
"ప్రతీ నక్షత్రానికి అధిదేవత ఒకరుంటారు. అలా మన నలుగురి నక్షత్రాలలో వాయుదేవుడు అధిదేవతగా ఉన్న నక్షత్రం ఎవరిదో తెలియాలి. అప్పుడు ఆ వ్యక్తి వాయుదేవుడిని కానీ, హనుమంతుడిని కానీ ప్రార్థిస్తే మనకు మైనాకుడి నుండి సహాయం వెంటనే అందుతుంది. అభిజిత్, నాది శ్రవణ నక్షత్రం", అన్నాడు ఆ సిద్ధపురుషుడు.
"సంజయ్, మన నలుగురిలో వాయుదేవుడు అధిదేవతగా కల స్వాతి నక్షత్రంలో పుట్టినది నువ్వే. సాక్షాత్తు ఆ మహాశివుని అంశతో వాయుదేవుని ఆత్మజుడు అయిన ఆ హనుమంతున్ని ప్రార్థిస్తే మనకు ఓ మార్గం తప్పక దొరుకుతుంది", అన్నాడు సిద్ధపురుషుడు.
సంజయ్,"తప్పకుండా స్వామి" అని తనకు తెలిసిన
హనుమద్గాయత్రి మంత్రాన్ని జపించాడు.
ఓం అంజనీ సుతాయ విద్మహే,
వాయుపుత్రాయ ధీమహి,
తన్నో మారుతిః ప్రచోదయాత్ ||
సిద్ధపురుషుడు
శ్రీ రామ రామ రామేతి
మంత్రాన్ని పఠించాడు. అభిజిత్, అంకితలు కూడా అదే మంత్రాన్ని పఠించారు.
సిద్ధపురుషుడు, అభిజిత్, అంకితలు ముగ్గురూ రామ నామ జపంలో ఉన్నారు. సంజయ్ హనుమద్గాయత్రి చేస్తూ ధ్యానంలో ఉన్నాడు. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు.
-----------------------------------------------------------------------
ఇంతలో సంజయ్ ని వెనక నుండి ఎవరో భుజం తట్టినట్టు అనిపించింది. హనుమద్గాయత్రిలో నిమగ్నమై ఉండటంతో సంజయ్ కి ఆ స్పర్శ కూడా తెలియలేదు. పదే పదే అదే స్పర్శ కలగటంతో కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి చూసేసరికి ఒక వృద్ధుడైన సాధువు కనిపించాడు.
"ఏమయ్యా వాళ్లంతా చక్కగా రామనామ జపం చేస్తుంటే నువ్వేమిటయ్యా హనుమ, హనుమ అంటావు?" అన్నాడా సాధువు.
ఒక్క నిమిషం సంజయ్ కి ఏం అర్థం కాలేదు.
"ఏమిటి అలా బిక్కమొహము వేస్తావు? నేనే హనుమంతుడిని అనుకో ఒక్క నిమిషం. హనుమంతుడికి రామనామ జపం చేసేవాళ్ళే ఇష్టం. ఆ విషయం తెలుసా నీకు?" అన్నాడు ఆ సాధువు.
"స్వామీ...మైనాకుడు", అని సంజయ్ అంటూ ఉండగా
"ఇదిగో రాముడు నాకు అన్ని విషయాలూ చెప్పే పంపించాడులే కానీ.....ఒక్క సారి నాకోసం రామనామ జపం చెయ్యవయ్యా....ఇంతగా అడుగుతుంటే అర్థం చేసుకోవెందుకు?" అన్నాడు.
సంజయ్ వెంటనే రామనామ జపంలో లీనమయ్యాడు. ఆ సాధువు కూడా ఆనందంగా రామనామ జపం చేస్తూ గడిపాడు.
అలా రామనామ జపంతో ఆ ప్రదేశం అంతా పరమ పావనం అయినది.
వీరి రామనామ జపంతో సముద్రుడు ప్రత్యక్షం అయ్యాడు.
సిద్ధపురుషుడు, అభిజిత్, సంజయ్, అంకితలు అచేతన స్థితిలోకి వెళ్లిపోయారు. వృద్ధుడైన ఆ సాధువు రూపంలో ఉన్న ఆంజనేయుడు సముద్రుడితో ఇలా మాట్లాడాడు.
"ఆనాడు నా రాముడు 3 రోజుల పాటు నిన్ను ఉపాసించినా నీవు ఆయన ఎదుట నిలువలేదు. ఈనాడు నా రాముడి పేరు వినగానే వచ్చితివే ? సముద్రా నీలో ఎంత మార్పు?" అని అడిగాడు హనుమ.
"ఆ దోషమును బాపుకొనుటకే ఈనాడు నీ ముందు ఇలా నిలిచితిని, హనుమ. ఆజ్ఞాపించు. నేనే విధముగా ఉపయోగపడగలనో విన్నవించు", అన్నాడా సముద్రుడు.
"సిద్ధపురుషుడు అయిన ఈ సమర్థ రాఘవుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని శ్వేతద్వీపవైకుంఠవాసి. ఆయనను, ఆయనతోటి వచ్చిన ఈ పరివారమును సముద్రగర్భంలో ఉన్న మైనాకుడి ద్వారా శంభల నగరానికి క్షేమంగా చేర్చే బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను", అన్నాడు హనుమంతుడు.
"ఆఘమేఘాలమీద ఈ కార్యాన్ని మైనాకుడికి ఇచ్చెదను. శ్రీరామ జయరామ", అంటూ సముద్రుడు అంతర్ధానమయ్యాడు.
వృద్ధుడైన సాధువు రూపంలో ఉన్న ఆ హనుమంతుడు అచేతనులై ఉన్న ఆ నలుగురి వంక ఒక్కసారి చూసి వారి నుదుటన సింధూరం దిద్ది, "జై శ్రీరామ్" అంటూ అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు.
కొంతసేపటికి నలుగురూ కళ్ళు తెరిచి చుట్టూ చూసారు.
"హే...అక్కడ చూడండి...మిస్టర్ మైనాక అనుకుంటా", అన్నాడు అభిజిత్.
ఆ కొండ అంచు చివర మానవరూపంలో ఉన్న మైనాకుడితో సిద్ధపురుషుడు ఇలా అన్నాడు," ప్రణామములు మైనాక ! శంభల రాజ్యానికి చేరుటకు నీ సహాయము లేనిదే మా ప్రయత్నము సర్వమూ వ్యర్థమగును."
"శ్రీరాముడి సాక్షాత్కారము కలిగిన మీ నలుగురికీ సహాయపడుట నా అదృష్టముగా భావించెదను. ఈ విధముగానైనను వాయుదేవుని ఋణము కొంత తీర్చుకున్నవాడిని అవుతాను", అన్నాడు మైనాకుడు.
మానవరూపంలో ఉన్న ఆ మైనాకుడు వెంటనే పర్వతరూపం ధరించాడు.
సిద్ధపురుషుడు, సంజయ్, అభిజిత్, అంకితలు నలుగురూ ఆ పర్వతాన్ని అధిరోహించగానే స్వతః సిద్ధముగా కల రెక్కలతో ఆ మైనాకుడు గరుడపక్షి వలె వాయువేగంతో ఆ మహాసముద్రాన్ని లంఘించాడు.
కొన్ని ఘడియలలోనే ఆ సముద్రాన్ని దాటి శంభల నగరానికి చేరుకున్నాడు.
శంభల నగరానికి ఉన్న ప్రవేశ ద్వారానికి దగ్గరలో వారిని సురక్షితంగా చేర్చి తన దారిన తాను వెళ్లిపోయాడా మైనాకుడు.
శంభల నగర ప్రవేశ ద్వారాన్ని చూస్తూ అలానే నోరెళ్ళబెట్టుకుని ఉండిపోయారు సంజయ్, అభిజిత్, అంకితలు.
ఆ ప్రవేశ ద్వారం వైపుగా నడుచుకుంటూ వెళ్తున్నాడా సిద్ధపురుషుడు.
-------------------------------------------------------
శంభల నగర ప్రవేశం
దేవశిల్పి విశ్వకర్మ వృత్తాంతము
శంభల నగర ప్రవేశ ద్వారం దగ్గరికెళ్ళాక సిద్ధపురుషుడు వెనక్కి తిరిగి చూసాడు. సంజయ్, అభిజిత్, అంకితలు ఆశ్చర్యంగా మైమరచిపోయి ఆ ముఖద్వారాన్నే చూస్తూ ఉండటం గమనించాడు. 1500 అడుగులకు పైనే ఉన్న ఆ ద్వారాన్ని ఇంతవరకూ భూలోకంలో ఎప్పుడూ, ఎక్కడా చూసి ఉండరనుకున్నాడు ఆ సిద్ధపురుషుడు. ఆ సింహద్వారంతో పాటు సమానమైన ఎత్తులో వున్న ప్రహరీ గోడ కూడా అనంతంగా అన్ని వైపులకూ వ్యాపించి ఉండటంతో అందనంత ఎత్తులో వున్న ఆకాశాన్నే తాకుతోందేమో అన్నట్టుగా కళ్ళను మాయ చేస్తోందా రాజప్రాకారం.
సిద్ధపురుషుడు దూరం నుంచి తన చేతులతో సైగ చెయ్యటంతో సంజయ్, అభిజిత్, అంకితలు ఈ లోకంలో కొచ్చారు. పరుగులాంటి నడకతో ఆ నగర ద్వారం వైపుగా వెళ్లారు.
అక్కడికి చేరుకోగానే వాళ్లకు ఆ ద్వారాన్ని దగ్గరి నుండి చూసే అవకాశం దొరికింది. ఆ సింహద్వారం మధ్యలో ఐదు ముఖాలతో, పది చేతులతో వున్న ఒక ఋషిలాంటి వ్యక్తి యొక్క చిత్రపటము కనిపించింది. దూరం నుండి చూసినప్పుడు శంభల రాజ్యానికి రాజేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు దగ్గరగా చూసేసరికి ఆ చిత్రంలో వున్న వ్యక్తి రాజులా అనిపించలేదు.
"ఎవరు స్వామి ఆయన?" అని తన చూపుడు వేలితో ఆ చిత్రం వైపుగా చూపిస్తూ సిద్ధపురుషుణ్ణి అడిగాడు అభిజిత్.
"అలా వేలితో చూపించకు, అభిజిత్. అది మంచి పధ్ధతి కాదు. చిత్రాన్నే కాదు, ఒక వ్యక్తిని అయినా సరే చూపుడువేలితో అలా చూపిస్తూ మాట్లాడటం సంస్కారం కాదు",అన్నాడా సిద్ధపురుషుడు. "ఇది మానవలోకం కాదు. శంభల నగరం. ఇచట మన ప్రతీ కదలికనీ గమనించే దేవతాగణాలుంటాయి. అందుకే ప్రత్యేకించి ఈ విషయాన్ని చెబుతున్నాను", అన్నాడు.
"తెలియక అలా చేసాను స్వామి. ఆయన ఎవరో తెలుసుకుందామనే తొందరపాటులో అలా ప్రవర్తించాను. క్షమించగలరు", అని వినమ్రంగా అడిగాడు అభిజిత్.
"ఆయన దేవశిల్పి విశ్వకర్మ", అన్నాడు సిద్ధపురుషుడు.
"మనోడికి దేవశిల్పి అంటే అర్థం అయినట్టు లేదు", అని అంకితతో సంజయ్ అంటూనే అభిజిత్ తో,"అభిజిత్, దేవతలకు ఆర్కిటెక్ట్ ఆయనే", అన్నాడు.
స్వామి, మనం లోపలికి వెళ్ళటానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉన్నది. అంతలోపల విశ్వకర్మ గురించి చెప్తారా?" అడిగాడు అభిజిత్.
"అవును స్వామి. చూస్తుంటే ఇప్పట్లో మనకు లోపలికి వెళ్లే అనుమతి దొరికేలా లేదు.
విశ్వకర్మ మాకు తెలియని విషయాలన్నీ చెప్పండి", అని అడిగాడు సంజయ్.
"ఏంటి నీకు కూడా ఆయన గురించి తెలీదా సంజయ్?" అడిగింది అంకిత.
"తెలీదు. నేనేం మైథాలజీ ప్రొఫెసర్ రాధాకృష్ణన్ ని కాదు కదా. సిబిఐలో వర్క్ చేసే ఆఫీసర్ ని అంతే", అన్నాడు సంజయ్.
"కదా. నాకూ అలాగే దేవశిల్పి అంటే ఏంటో తెలీదు. నాకంటే నీకు కాస్తెక్కువ తెలుసంతే. స్టార్టింగ్ లో నీ నాలెడ్జ్ చూసి అనవసరంగా టెన్షన్ పడిపోయా. ఇప్పుడర్థం అయిపోయింది", అన్నాడు అభిజిత్.
"ఏమర్థం అయింది?" అన్నాడు సంజయ్.
"సమర్థ రాఘవుడి లాంటి గురువు ఉంటే నీకంటే నేనే బ్రైట్ స్టూడెంట్ ని అని", కాన్ఫిడెంట్ గా కనుబొమ్మలు ఎగరేస్తూ చెప్పాడు అభిజిత్.
"స్పర్థయా వర్ధతే విద్యా అని మన పెద్దలెప్పుడో చెప్పారు", అంటూ నవ్వాడు ఆ సిద్ధపురుషుడు. "సరే మీరు అడిగినట్టే విశ్వకర్మ గురించి క్లుప్తముగా చెప్తాను. శ్రద్ధగా వినండి", అంటూ ఇలా చెప్పసాగాడు ఆ సిద్ధపురుషుడు.
"విశ్వకర్మకు మూడు రూపాలున్నాయి. వాటిల్లో మొదటిది విరాట్ స్వరూపమైన పరమాత్మ తత్వము
. ఆ పరమాత్మ ఐన విశ్వకర్మనే ప్రవేశ ద్వారం మీదున్న చిత్రంలో మీరు చూస్తున్నారు. తన సంకల్ప బలంతో పునఃసృష్టి చేసి ఈ సమస్త జీవకోటినీ సృష్టించాడని ఋగ్వేదం చెబుతోంది. స్వయంభువుగా ఉద్భవించిన ఆయనకు ఐదు ముఖాలు, పది చేతులని వేదాలలో చెప్పబడి వున్నది.
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠ స్థవిరో ధ్రువః
అని విష్ణుసహస్రనామ స్తోత్రంలో వుంది. అంటే ఆయన పరమాత్మ స్వరూపం అన్నట్టే కదా.
రెండవది
భౌవనపుత్ర విశ్వకర్మ. ఇతను భువనుడు అనే రాజర్షి యొక్క పుత్రుడు. ఒక శిరస్సు, నాలుగు హస్తములు మరియు ఏనుగును వాహనంగా కలవాడు. ఇతను వేదకాలంలోనే తన తండ్రిలా చక్రవర్తి పట్టాభిషేకం జరిపించుకున్న శిల్పర్షి, రాజర్షి. ఇతను భూమి నుండి జన్మించినటువంటి సువర్ణరత్న శిల్పి యని మహాభారతములో చెప్పబడి వుంది. సహస్ర శిల్పముల కర్త అని కూడా మహాభారతమునందు చెప్పబడి వున్నది. శ్రీమహావిష్ణువు యొక్క రూపమని విశ్వకర్మసంహితలో వున్నది.
మూడవదైనటువంటి రూపమే మనం ఎక్కువగా వినే
దేవశిల్పి విశ్వకర్మ . దేవతలకు, మానవులకు శిల్ప గురువు ఇతడే. తన తపో శక్తితో భౌవన పుత్ర విశ్వకర్మ సాక్షాత్కారం పొందటం చేత ఆయన నుండి సర్వశక్తులను పొందినవాడయ్యాడు ఈ దేవశిల్పి విశ్వకర్మ. ఒక శిరస్సు, రెండు భుజములు మరియు హంసను వాహనంగా కలవాడు.పార్వతీదేవిని పరిణయమాడిన తర్వాత శివుడు ఒక అందమైన భవనాన్ని నిర్మించమని విశ్వకర్మను అడగటంతో ఆయన స్వర్ణలంకను సృజించాడు. తర్వాతి రోజుల్లో ఇదే రావణాసురుని దగ్గరికి చేరింది. దధీచి వెన్నెముకతో ఇంద్రునికి
వజ్రాయుధాన్ని తయారు చేసిచ్చింది కూడా ఈ విశ్వకర్మే.
సత్యయుగంలో దేవతల స్వర్గలోకమును , ద్వాపరయుగంలో
ద్వారకా నగరాన్ని , కలియుగంలో హస్తినాపురాన్ని ,
ఇంద్రప్రస్థాన్ని కూడా ఈ దేవశిల్పి విశ్వకర్మే సృజన చేసాడు.
శ్రీమహావిష్ణువుకు సుదర్శన చక్రాన్ని కూడా ఈయనే చేసిచ్చాడు. ఇలా ఎన్నెన్నో చేసాడు. మీరిప్పుడు చూడబోయే శంభల నగరాన్ని, శంభల రాజ్యాన్ని కూడా విశ్వకర్మ సంతానమే సృజించి ఉంటారు. అందులో ఎటువంటి సందేహము లేదు”, అని అక్కడితో ముగించాడు సిద్ధపురుషుడు.
-------------------------------------------------------------------
ఇంతలో సూర్యోదయా సమయం కావటంతో ఆ ప్రవేశ ద్వారం తలుపులు ఒక యోజనం మేర తెరుచుకున్నాయి. ఆ తలుపుల మధ్యలో నుంచి వాళ్లకు అందమైన ఆ శంభల నగరం కనిపించింది. అనంతమైన ఆ సింహద్వారంలో ఒక యోజనం మేర తెరుచుకున్న తలుపులు కూడా కిటికీలలా అనిపించాయి. ఆ రాజప్రాకారమే అంత పెద్దగా ఉంటే ఇక శంభల నగరం ఎంత పెద్దగా ఉంటుందో ఊహించుకోవటానికి కూడా హద్దు లేకుండా పోయింది.
శంభల రాజ్యం నుండి వచ్చిన ఇద్దరు సైనికులు మాత్రం వాళ్ళ కళ్ళ ముందే నిలబడి ఉన్నారక్కడ.
"శంభల నగరాన్ని మీకు చూపించిన తరువాతే శంభల రాజ్యానికి మిమ్మల్ని తీసుకురమ్మని అనిరుద్ధుల వారి ఆజ్ఞ. శంభల నగరం మొత్తం చూడటానికి మీకొక రోజు పడుతుంది", అని చెప్పి మౌనంగా ఉండిపోయారు ఆ సైనికులు.
"అబ్బో....అంతా వీళ్లిష్టమేనా ఇక్కడ? మన ఒపీనియన్ కి వేల్యూ లేదన్నమాట", అన్నాడు అభిజిత్.
"శంభల నగరాన్ని చూస్తే జీవితాంతం మీకు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది", అంటూ చిరునవ్వు చిందిస్తూ అన్నాడా సిద్ధపురుషుడు.
"అయితే డెఫినిట్ గా చూడాల్సిందే” అంటూ ఎగ్జైట్ అయ్యాడు అభిజిత్.