Update 09
ఘోర కలి అరాచకాలు - 2
కపాలిని దేవి ఆలయం
ఘోర కలికి రక్షక భటుడి నుండి పిలుపొచ్చింది. కపాలిని దేవి ఉండే చోటు నుండి కబురొచ్చిందని ఆ భటుడు వణుకుతూ ఘోర కలికి చెప్పాడు. ఆ రోజు సాయంత్రమే తన సామ్రాజ్యంలో పది దేశాల నుండి వచ్చిన పదిహేను మంది బోర్డు డైరెక్టర్ లను తన రూపంలోకి మార్చే ప్రక్రియ మొదలవ్వబోతుంది. అది జరిగేటప్పుడు తను అక్కడ వుండకూడదు. ఈ ప్రక్రియ తంత్రం ద్వారా జరుగుతుంది.
ఘోర కలి తంత్ర విద్యలను అర్థం చేసుకున్న వైద్య బృందం అక్కడుంది. వారికి ఆజ్ఞ రాగానే ఈ పదిహేను మందిని అచ్చు గుద్దినట్టు ఘోర కలిలా మార్చేస్తారు. వారికి ఆజ్ఞ ఇవ్వటానికి రాయబారిగా ఘోర కలికి బాగా నమ్మకస్తుడైన సురా ను నియమించాడు. సురా ఘోర కలికి బాగా దగ్గరైన వ్యక్తి. బాల్యం నుండి మిత్రుడే. ఘోర కలి ఎక్కడుంటే సురా అక్కడుంటాడు. వారి స్నేహం అలాంటిది. సురా తంత్రంతో సిద్ధించిన ఆ యంత్రాన్ని తీసుకొచ్చి వైద్య బృందానికి అందిస్తాడు. అప్పుడు వారు అచేతనంగా అక్కడ ఉన్న పదిహేను మందిపై ఆ యంత్రాన్ని ఉంచుతారు. ఘోర కలి అనుకునే లక్ష్యాలు, ఆశయాలు, ఆశలు అన్నీ యంత్రం ద్వారా ఆ పదిహేను మందిలో నరనరాన నిండిపోయాక ఆ వైద్య బృందం ఘోర కలిలా వారి బాహ్యరూపాల్ని కూడా మార్చేస్తుంది.
నాగమణితో, తంత్రంతో ఘోర కలి కపాలిని దేవి సాక్షాత్కారము పొందుతాడు. ఆ దేవి మంత్రాన్ని ప్రసాదిస్తుంది. ఆ మంత్రాన్ని ఘోర కలి అక్కడి నుండే పఠిస్తాడు.సూరాకు తను ఇచ్చి పంపే యంత్రంతో తన సామ్రాజ్యంలో ఉన్న ఆ పదిహేను మందిని తన రూపంలోకి మార్చేస్తారు వైద్య బృందం. దేవి ఇచ్చిన మంత్రంతో కఠోర దీక్షతో సాధన పూర్తయ్యాక పరిపూర్ణమైన కామరూపధారిగా మారిపోతాడు ఘోర కలి. తను అనుకున్నట్టే ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు.
ఇది ఘోర కలి ప్రణాళిక.
ప్రపంచంపై తను సాధించబోయే ఆధిపత్యాన్ని గుర్తుచేసుకుంటూ, తన ఇన్ని యుగాల నిరీక్షణను గుర్తుచేసుకుంటూ ఒక పక్క వికృతంగా నవ్వుతూనే మరో పక్క కంటి నిండా నీరు నిండిపోయి ఉండగా ఒక్క నిమిషం ఆగి మంచి నీళ్లు తాగి ముందుకు కదిలాడు. తన చీకటి సామ్రాజ్యం నుండి కపాలిని దేవి ఉండే స్థలానికి బయలుదేరాడు.
ఘోర కలి తన దగ్గరున్న నాగమణిని వెంట తీసుకెళుతూ
కాళీ….
కపాలిని….
శూలిని…..
జగజ్జనని…..
అని అమ్మవారి నామాలను పదే పదే గట్టిగా బయటికి వినబడేలా ఘోషిస్తూ వెళుతున్నాడు.
కపాలిని దేవి ఆలయాన్ని సమీపిస్తున్నాడు. చీకటి తెరలు తెరలుగా కమ్ముకొంటోంది. చిన్న వెలుగు రేఖ కూడా దరిదాపుల్లో కనబడనంత దూరం అయిపోతోంది. ఘోర కలిని సైతం వణికించే పెను చీకటిలా ఉందది.
బాహ్యప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతున్నట్టుంది. మనకు కనిపించే ఈ వెలుగు ప్రపంచంలోనే కనబడని అంధకారం ఇంత దాగుందా అనిపించేలా ఉంది ఆ కపాలిని దేవి ఆలయ ప్రాంగణం. గాలి వల్ల, వాసన వల్ల, గుళ్లోని గంటల చప్పుడు వల్ల మాత్రమే ఘోర కలి అడుగులు ముందుకు పడుతున్నాయి కానీ దారి తెలిసి కాదు.
మెల్లిగా పసిపాపల ఏడుపులు మొదలయ్యాయి. ఘోర కలి ఘోషలు ఆగిపోయాయి. పసిపాల ఏడుపులు ఇంకా ఇంకా ఎక్కువయ్యాయి. ఒకరు ఇద్దరు ముగ్గురు అలా కొన్ని వేల, లక్షల, కోట్ల ఏడుపులు పసిపాపల ఏడుపులు తీవ్రతరం దాల్చాయి. ఘోర కలి కంట నీరు తిరిగింది. ఘోర కలికి ఏడుపంటేనే అసహ్యం. పసిపిల్లలు ఏడిస్తే తన బాల్యం గుర్తుకొచ్చి కోపం తెచ్చేసుకుంటాడు. అక్కడి నుండి నిష్క్రమిస్తాడు. అలాంటిది ఈ రోజు అన్ని ఏడుపులు ఒకేసారి ఎలా విన్నాడో, విని ఎలా తట్టుకున్నాడో కూడా తెలియట్లేదు. ఒంట్లోని ప్రతి కణం స్పందించినట్టు అనిపించింది. కొన్ని సంవత్సరాల, దశాబ్దాల, శతాబ్దాల బాధ కన్నీటి సంద్రమై ఎగసెగసి పడ్డట్టు అనిపించింది. కన్నీరు ధారలా ప్రవహించింది. వానలా ఎడతెరపి లేకుండా కురిసింది.
ఇన్నాళ్లూ తన అంతరంగం ఎండిపోయిన ఎడారి అనుకున్నాడు. ఇవ్వాళే తెలిసింది. తనను కూడా ఏడిపించగల శక్తి ఒకటుందని. అది ఈ కపాలిని దేవి ఆలయంలోనే ఉంటుందని మాత్రం కలలో కూడా కల కనలేదు. కపాలిని దేవిని ఇప్పుడు చూడాలంటేనే భయంగా అనిపించేలా ఉంది ఆ పసిపాపల రోదన.
ఘోర కలికి ఏమీ పాలుపోవట్లేదు. అంతు చిక్కట్లేదు. ఏడుపు ఎప్పుడాగిపోతుందో తెలియట్లేదు. కపాలిని దేవి కనిపిస్తుందో లేదో కూడా తెలియదు. కనిపించినా కరుణిస్తుందో లేదో తెలియదు. తన చీకటి సామ్రాజ్యం నుండి ధైర్యంగా బయలుదేరిన ఘోర కలి ఇప్పుడు భయంతో వణికిపోతున్నాడు. కాళీ....కపాలిని....శూలిని....జగజ్జనని అంటూ ఊగిపోతూ వచ్చిన ఘోర కలికి ఇప్పుడు నోరు పెగలట్లేదు.
-------------------------------------------------
శంభల రాజ్యం – 2
అనిరుద్ధుడి ఆగమనం – ఆదేశం
శంభల రాజ్యాధిపతి అనిరుద్ధుడు. ఆయన మహా విష్ణు భక్తుడు. భూలోకవాసులలో విష్ణువును అత్యంత భక్తితో కొనియాడిన అన్నమయ్య, త్యాగరాజు వంటి వాగ్గేయకారుల సంకీర్తనలు నిత్యం వింటూ కన్నీటి పర్యంతం అవుతూ ఉంటాడు. ఆయన భూలోకవాసులను ఇంతవరకు కలిసింది లేదు. మొదటి సారి సిద్ధపురుషుడి మీదున్న నమ్మకంతో అభిజిత్, అంకిత, సంజయ్ లను కలుస్తున్నాడు. సిద్ధపురుషుడు శ్వేతద్వీప వైకుంఠ వాసి. సిద్ధపురుషుడి గురించి ముల్లోకాలలో తెలియని వారు లేరు. అంత గొప్ప విష్ణు భక్తుడు. సమర్థ రాఘవుడు అనే పేరుతో చివరి జన్మలో నామధేయాన్ని సార్థకం చేసుకున్న తెలివైన మంత్రివర్యుడు. అతని మాటకంత విలువుంది.
అనిరుద్ధుడి దినచర్య రోజూ పొద్దున్నేఎన్నో సేవలతో విష్ణు మూర్తికి పూజలు చెయ్యటంతో మొదలవుతుంది. అటు పిమ్మట సర్వలోక రక్షకుడైన ఈశ్వరుణ్ణి వేడుకుంటాడు. కావ్యాలెన్నో చదువుతాడు. యుద్ధవిద్యలెన్నిటినో పర్యవేక్షిస్తాడు. శంభల రాజ్యం చాలా తెలివైనవారిని సైతం మాయకు గురి చేసే లోకం. ఇక్కడి మగువలకు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అందులో ఒక మర్మం దాగుంది. యుద్ధం జయించాలంటే ప్రతి క్షణం గెలుపు మీదనే దృష్టి నిలపాలి. ఆ దృష్టిని తమవైపుకు తిప్పుకునే శక్తి పుష్కలంగా కలవారు శంభల రాజ్యం లోని సౌందర్యవతులు. వీరికున్నఅపురూప లావణ్యంతో చూపులను బంధించి వేస్తారు. వీరు నిత్య యవ్వనంతో అలరారే స్త్రీ శక్తి కలవారు. యుద్ధవీరుల గురించి వీరి ద్వారా సేనాధిపతికి ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తుంది. వీరికి సంబంధించిన రహస్యం ఒకటుంది. అనిరుద్ధుడికీ, మంత్రికి, సేనాధిపతికి తప్ప శంభల రాజ్యంలో మరెవరికీ తెలియదది.
అనిరుద్ధుడి ఆజ్ఞను అనుసరించి సిద్ధపురుషుడు అభిజిత్, అంకిత, సంజయ్ లతో శంభల రాజ్యంలోని ఆస్థానంలో ఆయన రాకకై ఎదురుచూస్తూ ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ దుందుభి మ్రోగింది. జయజయ ధ్వానంలా వినిపించే ఆ భేరి అనిరుద్ధుడి రాకను సూచిస్తుంది. అందుకు చిహ్నంగా సభలోని ప్రతి ఒక్కరూ లేచి నిల్చున్నారు. అందరి కళ్ళూ ఆయన పైనే ఉన్నాయి. రాజే రాజ్యానికి రవి అనిపించేలా ద్వారాలు తెరుచుకోగానే కిరణాలు చుట్టూ పరివారంలా ఉండగా మధ్యలో నక్షత్రంలా వెలిగిపోతూ వస్తున్నాడు అనిరుద్ధుడు. ఆయన చిరునవ్వు చూస్తే చాలు మనం గెలిచేసినట్టే అన్నట్టు ఉంటుంది. ఆయన నవ్వు మన హృదయ సామ్రాజ్యాన్ని ఎప్పుడు ఆక్రమించిందో తెలిసేలోపే మన మోముపై చిరునవ్వు వెల్లివిరుస్తుంది. అది ఆయన ఘనత.
ఎంతో తెలిసినా ఏమీ తెలియనట్టు ఉంటాడనిపిస్తుంది. ఎంత తెలిసినా ఇంకేదో తెలుసుకుంటూనే ఉంటాడనిపిస్తుంది. ఎన్నో యుద్ధాలను చూసిన చిరుతపులి కళ్ళలా ఆయన కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి. ఎంతో మందిని మట్టికరిపించిన చేతులలా అనిపిస్తాయి. ఆయన ఠీవి చూస్తే ఎక్కడా లేశమాత్రమైనా అహం కనబడదు. పైగా ఆభరణంలా అనిపిస్తుంది. ఆయన రాజసం చూస్తే అది ఆయన మకుటంలా మెరిసిపోతూ ఉంటుంది. ఆయన ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా అనే మన గుండెచప్పుడు మనకే ఆ ఆస్థానంలో ప్రతిధ్వనిస్తూ వినబడుతూ ఉంటుంది. అంతటి మౌనం నెలవై ఉంటుందక్కడ. అది ఆయన మహిమ. నీలివర్ణంలో ఉన్న పట్టు వస్త్రముతో, మెడలో వైకుంఠ హారము ధరించి వస్తుంటే ఆ శోభతోనే సభ విరాజిల్లుతోందా అన్నట్టుంది.
సింహాసనం పై ఆసీనుడైన అనిరుద్ధుడు తన హావభావాలతో, చేతి సైగతో అక్కడున్న మంత్రికి ఏదో చెబితే మంత్రి మర్యాదపూర్వకంగా సిద్ధపురుషుణ్ణి మాట్లాడవలసిందిగా కోరాడు.
సిద్ధపురుషుడు, "ప్రణామములు అనిరుద్ధా, మీరు ఈ రోజున ధృవ నక్షత్రం వలే విష్ణుకాంతితో ధగధగా మెరిసిపోతున్నారు."
మధ్యలోనే సిద్ధపురుషుణ్ణి అడ్డుకున్న అనిరుద్ధుడు, " అందుకు ఒక కారణం ఉన్నది. నేను పూజలో నిమగ్నమై ఉండగా మీ గురించి స్వామివారు అడిగారు. మీరు తేజస్సుతో వెలిగిపోతున్నారని వారికి చెప్పాను. ఆయన నవ్వు నాకు వినిపించింది. రోజూ ఆయనను దర్శించే మీరు ఇంకెంత అదృష్టవంతులో అనిపించింది."
సిద్ధపురుషుడు ఆనందపడిపోతూ,"ఆయన నా గురించి మిమ్మల్ని అడిగారా !"
శ్వేతద్వీప వైకుంఠాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, "వారు తండ్రివలే వాత్సల్యం చూపిస్తారు. ఆ ప్రేమ రుచి చూసినవాడికి వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కాదు. వారి ఆజ్ఞను అనుసరించే ఇంత దూరం వచ్చాను. వారిని నేనెప్పుడూ మరిచిపోలేదు."
అనిరుద్ధుడు అందుకుని," మరిచిపోలేరు. వారి దర్శనభాగ్యం నాకు కలుగుతుందో లేదో తెలియదు కానీ వారిని చూసిన మిమ్మల్ని నేరుగా ఇలా కలుసుకోవటం నన్నెంతో భక్తిపారవశ్యానికి గురి చేస్తోంది" అంటూ ఆయన సింహాసనం పై నుండి లేచి సిద్ధపురుషుడి వద్దకు నడుస్తూ వచ్చి ఆయనకు శిరస్సు వంచి అభివందనం చేసి తిరిగి తన పీఠాన్ని అధిష్టించారు.
సిద్ధపురుషుడు, "భూలోకంలో ఘోరకలి ఆధిపత్యం చేపడతాడు. ఘోరకలిని అడ్డుకోవాలంటే శంభల రాజ్యం లోని యుద్ధవిద్యలలో వీరు రాటుదేలాలి", అంటూ అభిజిత్, అంకిత, సంజయ్ లను పరిచయం చేసాడు.
"శంభల రాజ్యంలోని వీరులు కొందరు మాకు కావాలి. వారు లేనిదే ఘోర కలిని ఎదిరించలేము. మీ సైన్యం, మీ వ్యూహ రచన, మీ ఆయుధాలు, మీ అస్త్రాలు...ఇలా మీరు ఇవ్వగలిగినది ఏదైనా అది మాకు భాగ్యమే" , అని సిద్ధపురుషుడు ముగించాడు.
"మరి పరాక్రమము?" అన్నాడు అనిరుద్ధుడు.
అభిజిత్ మాట్లాడకుండా ఉండలేకపోయాడు.
"సర్...మీకు మా భూలోకవాసుల గురించి తెలీదు అనుకుంటా. మాకుండేదే పరాక్రమము. చిన్నప్పటి నుండి మేము రాసినన్ని పరీక్షలు ఏ లోకంలోనూ రాసుండరు. ప్రాణానికి తెగించి ఘోర కలితో నేను పోరాడతాను. మీకు కుదిరితే హెల్ప్ చెయ్యండి. లేకపోతే లేదు."
----------------------------------------------------
అనిరుద్ధుడు మళ్ళీ లేచి నిలబడి అభిజిత్ ఉన్న చోటికి నడుచుకుంటూ వచ్చి అభిజిత్ కళ్ళల్లోకి సూటిగా చూసి నవ్వుతూ, "అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసే నీ ఉయ్యాల పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపెనీ ఉయ్యాల" అంటూ అభిజిత్ భుజాల పై తన రెండు చేతులూ వేసి గట్టిగా పట్టుకునేసరికి ఏదో తెలియని జ్ఞానం అతనిలో ప్రవేశించినట్టు అభిజిత్ అనిరుద్ధుడినే చూస్తూ ఉండిపోయాడు.
“పరాక్రమం నీలో కనిపించింది అభిజిత్. ఈ జోరు కాస్త తగ్గిస్తే సరిపోతుంది", అనేసి సభాప్రాంగణం మధ్యలో నిలబడి అనిరుద్ధుడు అక్కడున్న వాళ్ళ అందరి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఇలా చెప్పాడు.
"మన శంభల నుండి ఘోర కలిని సంహరించేందుకు కొంత సైన్యాన్ని తరలిస్తున్నాను. ఇందులో మీకెలాంటి అభ్యంతరాలు లేవనే భావిస్తున్నాను. సిద్ధపురుషుడు శ్వేతద్వీప వైకుంఠ వాసి. ఆయన నేతృత్వంలో ఈ ముగ్గురూ మన రాజ్యంలో యుద్ధవిద్యలనభ్యసిస్తారు. వీరికి మీ సహకారం కావాలి. పరాక్రమం అంటే ఏంటో అదెలా ఉంటుందో వీరికి పరిచయం చెయ్యండి రుద్రసముద్భవా" అంటూ సేనాధిపతి వైపు సూటిగా చూస్తూ ఆజ్ఞాపించటంతో సభ ముగిసింది. అనిరుద్ధుడు నిష్క్రమించాడు.
ఆయన వచ్చేటప్పుడు ఎలా అయితే అందరూ నిలబడ్డారో, వెళ్లిపోయేటప్పుడు కూడా గౌరవప్రదంగా నిల్చున్నారు. ఒక రాజుకిచ్చే గౌరవం శాసనాల్లో రాయబడి ఉండదు. ఆయనని చూసిన మరుక్షణమే అది పుడుతుంది. రాజు వెడలె రవి తేజములలరగా అంటూ అదిగో వెళుతున్నాడే ఆ అనిరుద్ధుడే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. ఇదే ఆయన శంభల రాజ్యం.
---------------------------------------------------------
ఘోర కలి అరాచకాలు - 3
కపాలిని దేవి సాక్షాత్కారం - ఘోర కలి కామరూపధారిగా మారుట
ఘోర కలి కపాలిని దేవి ఆలయంలో అయితే ఉన్నాడు కానీ, తన మనసంతా వేదనకు గురి అయ్యి పసిపిల్లల రోదనలతో నిండి ఉంది. చుట్టూ చూస్తున్నాడు కానీ ఆ ఏడుపులు ఎక్కడి నుండి వస్తున్నాయో కనిపించట్లేదు. చిమ్మ చీకటి ఒక పక్క, ఈ ఆర్తనాదాలు మరో పక్క ఘోర కలిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
అంతలో సురా కపాలిని దేవి ఆలయంలోకి ప్రవేశించాడు. ఘోర కలి భుజం తట్టాడు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసాడు. ఎదురుగా సురా. చీకటి వీడిపోయింది. ఏడుపు ఆగిపోయింది. అంతవరకూ తనకు కనిపించనివి కూడా ఇప్పుడు కళ్ళముందున్నాయి. ఘోర కలి ఆశ్చర్యపోయాడు.
సురా,"ఏమైందన్నా? అలా భయపడ్డావు? ఇక్కడికి నేను కాక ఇంకెవరొస్తారు?" అని అడిగాడు.
"నువ్వొచ్చే దాకా ఇక్కడ వెలుతురు లేదురా. దారంతా చీకటి. కటిక చీకటి. నేనిక్కడికి ఎలా రాగలిగానో కూడా అర్థం కాలేదు. ఒకటే ఏడుపులు వినిపించాయి. పసిపిల్లల ఏడుపులు. నా జీవితంలో అంత మంది ఏడుపులు ఒకేసారి వినటం ఎప్పుడూ జరగలేదు. కంట నీరు తిరిగింది", అన్నాడు ఘోర కలి.
సురా విస్తుపోయాడు.
"అన్నా....నాకు అల్లంత దూరం నుండి చూస్తే నువ్వు కాళీ....కపాలిని...శూలిని...జగజ్జనని అంటున్నట్టు కనిపించింది. ఏదో పెద్ద వెలుగు నీ ముందు ఉండాదంట. దాన్ని చూస్తూ మైమరచిపోయి నువ్వు ఇట్టా అంటున్నావంట. అది కనబడే పరిగెత్తుకుంటూ నీ దగ్గరికొచ్చాను. ఇప్పుడేమో నువ్వు చీకటి అంటున్నావ్. నాకేం అర్థం కావట్లేదు"
ఘోర కలికి అక్కడేం జరుగుతోందో అర్థం కావట్లేదు. కపాలిని దేవి పరీక్షిస్తోందని అర్థం అయ్యింది.
తన రెండు మోకాళ్ళ మీద నిలబడి నలుదిక్కులా కపాలిని దేవి కోసం వెతికే వేదనాభరితమైన కళ్ళతో ఇలా ప్రార్థించటం మొదలు పెట్టాడు.
" కాళీ.....
కపాలిని.....
శూలిని.....
జగజ్జనని
ఎందుకమ్మా నా కళ్ళల్లో చీకట్లు నింపావు? నేనేం పాపం చేసాను?
ఎన్ని జన్మలకు నాకీ శిక్ష? మరెన్ని జన్మలు నాకీ నిరీక్షణ?
నేను అంటరాని వాడినా? నరరూప రాక్షసుడినా?
ఎంతో మంది పసిపిల్లలను ఈ భూమ్మీదకు రానివ్వకుండా చేసే ఎందరో పుణ్య దంపతులకంటే క్రూరుడను కాను కదా?
నాకు నువ్వు వినిపించిన ఈ ఆర్తనాదాలతో నా బాల్యాన్ని గుర్తుకు చేసి ఏడిపించావు తల్లీ.....
నేను పుట్టినప్పుడు అక్కడెవరూ లేరంట ! నేనొక్కడినే ఆ గ్రామంలో బ్రతికానంట ! నా కోసం ఒక గ్రామం చనిపోయిందంట ! నన్నందరూ భయపడుతూనే చూసేవారు తల్లీ !
ప్రేమకు నోచుకోని జన్మలు ఇప్పటికి ఆరు ఇచ్చావు. నాకు ఏడో జన్మ లేదంట. నా బతుకు పాతాళలోకంలోనే సమాధి అంట. అసలు జన్మంటూ లేని నా బ్రతుక్కి ఏడో జన్మనిచ్చింది నా ప్రాణానికి ప్రాణమైన సురా !
సురా....సురా.....సురా
ఎంత గొప్ప మిత్రుడైనా మహా అయితే ప్రాణ త్యాగం చేస్తాడేమో...కానీ ఈ సురా నన్ను పాతాళలోకం నుండి విముక్తిడిని చెయ్యటానికి తన కర్మ త్యాగం చేసి నాతో ఈ భూమి మీదకి వచ్చాడు.
అలాంటి సూరాకు నువ్వు కనిపించావంట. నాకు కనపడవేం తల్లీ ?
ఈ కపాలిని దేవి ఆలయంలో నువ్వున్నావన్న ఆశ కల్పించు.....నీ అఖండ జ్యోతిలోని చిన్న వెలుగు రేఖను ఇటుగా పంపించు......నా ఏడో జన్మను సార్థకం చేసే నీ దర్శనం కలిగించు......ప్రపంచాన్ని పట్టి పీడించే అన్ని జాడ్యాలనూ వదిలించే ఈ ఘోర కలిని ఆశీర్వదించు.....
నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను పూజించిన మాతృమూర్తివి నీవే తల్లీ.....
కాళీ
కపాలిని
శూలిని
జగజ్జనని
ఘోర కలిగా కాదమ్మా.....ఇక్కడికి నీ బిడ్డగా వచ్చాను
నన్నీ ప్రపంచానికి రాజునైనా చెయ్యి......లేదా నా బూడిదెతో ఈ పుడమి మీద నిప్పు రాజుకునేలా చెయ్యి
నువ్వేం చేసినా సరే....నీ ఆనకే కట్టుబడి ఉంటా”
కాళీ....కపాలిని.....శూలిని....జగజ్జనని
అంటూ ఘోర కలి అలా అమ్మను పిలుస్తూనే ఉన్నాడు. కన్నీరు మున్నీరవుతూనే ఉన్నాడు.
తన మాటలే అమ్మకు మంత్రాలనుకుంటున్నాడు. అలా మాట్లాడుతూనే ఉన్నాడు.
తన కన్నీళ్లే అమ్మకు అభిషేకం అనుకుంటున్నాడు. అలా కన్నీరాభిషేకం చేస్తున్నాడు.
కాలానికే జాలి కలిగిందేమో అమ్మ జాడ కనిపించింది. అయినా ఆ మహాకాలుడు రుద్రుడే కదా. ఆయనే అమ్మను వెళ్ళమన్నాడేమో.
ఘోర కలి నిరీక్షణ ఫలించింది. ఆదమరచి పడి ఉన్న ఘోర కలిని చూస్తూ కపాలిని దేవి రాల్చిన ఒక కన్నీటి చుక్క ఘోర కలి చెక్కిలి పై పడింది.
కళ్ళు తెరిచిన ఘోర కలి, "అమ్మా నీ అశ్రువు నా చెంపను తాకింది తల్లీ ! చాలమ్మా ఇది చాలు ఈ ఏడో జన్మలో నేనెలా చచ్చినా పరవాలేదు. ఈ ఒక్క సంఘటన తలుచుకుంటూ బ్రతికేస్తాను"
"నువ్వు కోరుకునే ప్రపంచాధిపత్యం మహాప్రళయ సంగ్రామానికి దారి తీస్తుంది. చూస్తూ చూస్తూ నీకు అలాంటి ఆధిపత్యాన్ని కట్టబెట్టమంటావా !

నా స్థానంలో ఉంటే నువ్వేం చేస్తావురా? ఒక అమ్మలా ఆలోచించి చెప్పు", అని బాధపడుతూ అంది కపాలిని దేవి.
"బిడ్డ ఏది కోరినా అమ్మ అది తీర్చాలి. అది అమ్మ బాధ్యత. మంచైనా చెడైనా దాని పాపపుణ్యాలతో అమ్మకు సంబంధం లేదు. ఇదే సృష్టి ధర్మం", అని నిర్మొహమాటంగా చెప్పేసాడు ఘోర కలి.
"బిడ్డ కోరాడు కదా అని చెప్పి ప్రపంచం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా?" అని అడిగింది కపాలిని దేవి.
"ఊరుకోవాలి", అన్నాడు ఘోర కలి.
"ఏమిటి దానర్థం?" అని కోపంగా చూస్తూ అడిగింది కపాలిని దేవి.
"ఇదంతా నీ సృష్టే తల్లీ! నువ్వు అందరికీ అమ్మవు. నేను అడిగింది నీకు నచ్చలేదు కాబట్టి అదివ్వను అంటున్నావ్. అంటే నీకు నచ్చినవే బిడ్డలు అడగాలా? వారి ఇష్టాయిష్టాలు వారికుండవా? చెప్పు తల్లీ ", అని బాధపడుతూ అడిగాడు ఘోర కలి.
"ఇష్టపడిన ప్రతిదీ ఇస్తూ పోతే అది వినాశనానికి దారి తీస్తుంది. కాదంటావా?" అని అడిగింది కపాలిని దేవి.
"నీ సృష్టి పట్ల నీకే అంతటి మోహం ఉంటే ఇక అల్ప జీవులం మాకెంత మోహం ఉంటుంది తల్లీ", అని తన సందేహాన్ని బయటపెట్టాడు ఘోర కలి.
"నాది మోహం కాదురా", అంటూనే,"సరే నీకు నచ్చినట్టే చెయ్యి. కానీ ఒక షరతు", అంది కపాలిని దేవి.
"అదేంటో విన్నవించు తల్లీ", అంటూ రెండు కళ్ళూ పెద్దవి చేసి అమ్మ వైపు ఆశగా చూస్తున్నాడు ఘోర కలి.
"ప్రతి రోజూ సాయంసంధ్యా సమయంలో 10 ఘడియలు నిరంతరాయంగా నా నామావళి జపిస్తేనే నీకీ ప్రపంచం పైన ఆధిపత్యం నిరవధికంగా కొనసాగుతూ ఉంటుంది. అలా జరగని మరుసటి రోజే నీ చరమాంకం. ఇదే నా ఆన" అనేసి అంతర్ధానం అయ్యింది.
అక్కడి నుండి పది యోజనాల దూరంలో ఉన్న గుహలో కపాలిని దేవి అమ్మవారి నామావళి రాతిగోడలపై వెలుగుతూ కనిపిస్తుంది. ప్రతీ నామం చివర నమః అని మాత్రం ఉండదు. కపాలిని దేవి వినూత్నమైన పేర్లు మాత్రమే కనిపిస్తాయి. వాటినే అక్షర దోషం లేకుండా జపించాలి. ఒక్క సారి నోరారా ప్రతి నామాన్ని పఠిస్తే స్మృతిలో అవే గుర్తుండిపోతాయని అక్కడ రాసి ఉన్నది.
అక్కడే యంత్రం ఉన్నది. అందుకు కావలసిన తంత్రాన్ని అందించేందుకు ఒక వృద్ధ యోగి ఘోర కలిని, సురాని చూస్తూ అక్కడే ఉన్న చెట్టు కింద ధ్యానంలో ఉన్నాడు.
ఘోర కలి కపాలిని దేవి నామావళి మొత్తం పఠించాడు. ప్రతీ నామం ఇప్పుడు తేనె కంటే మధురంగా అనిపిస్తోంది. గుహ నుండి బయటకు రాగానే మొహములో తేజస్సు రెట్టింపు అయ్యింది. ఆ వృద్ధ యోగి కూడా కన్నార్పకుండా ఘోర కలినే చూస్తూ ఉన్నాడు.
తంత్రం ఘోర కలి మననం చేస్తూ ఉంటాడు. యంత్రాన్ని మాత్రం సురా ఇక్కడి నుండి తీసుకెళ్లి ఎదురుచూస్తోన్న వైద్య బృందం వద్దకు తీసుకెళతాడు.
ఘోర కలి తంత్రం, సురా యంత్రం, వైద్య బృందం శాస్త్రం మూడూ ఒకేసారి పని చేసి పది దేశాల నుండి వచ్చిన ఆ పదిహేను మంది బోర్డు డైరెక్టర్ లనూ ఘోర కలి రూపంలోకి మార్చేస్తాయి. ఘోర కలిని ప్రపంచానికి రారాజును చేస్తాయి. ఇప్పుడు ఘోర కలి కామరూపధారి కూడా అవుతాడు. అంటే తను కోరుకున్న రూపంలోకి మారగలిగే విద్యను కూడా కలిగినవాడని అర్థం.
------------------------------------------------------------
శంభల రాజ్యం – 3
జటిల
రుద్రసముద్భవ ఆధ్వర్యంలో అభిజిత్, అంకిత, సంజయ్ లు శంభల రాజ్యంలోని ప్రాకారాలన్నీ తిరిగి యుద్ధ విద్యా నైపుణ్యాన్ని, వ్యూహాలను, అస్త్ర విద్యలను నేర్చుకునేందుకు పయనమయ్యారు. సిద్ధపురుషుడు మాత్రం శంభల రాజ్యంలో ఇచ్చిన అతిథి గృహంలోనే ఉండిపోయాడు. ధ్యానంలో నిమగ్నమయ్యాడు.
ఆ ప్రయాణంలో మొదటిగా వారికి స్వాగతం పలికింది ' జటిల'.
" జటిల శంభల రాజ్యంలోని మహా మహా యోధులకు కూడా అంతుచిక్కని ప్రాకారం. ఇక్కడ ఏ క్షణానైనా సింహాలతో తలపడవలసి రావొచ్చు. సింహానికి స్నేహితుడివి అయ్యావంటే మాత్రం అవే దగ్గరుండి మరీ ఎన్నో కఠినమైన విద్యలను నేర్పిస్తాయి. శంభల రాజ్యంలోని ప్రతీ యోధుడూ జటిల పేరు చెబితే చాలు వణికిపోవటానికి కారణం ఇదే. ఇక్కడి సింహాలు భూలోకంలో కనిపించే క్రూర సింహాలు కావు. ఎంతో రాజసం కలిగినవి. ఒక యోధుడిని ఇట్టే కనిపెట్టేస్తాయవి. ఎన్ని విద్యలొచ్చినా సరే జటిలలోని సింహాలు అంగీకారం తెలిపితేనే ఆ వ్యక్తి పరిపూర్ణమైన యోధుడి కింద లెక్క", అంటూ చెప్పటం ముగించాడు రుద్రసముద్భవ.
"ఏంటి? సింహాలతో ఫైట్ చెయ్యాలా?" అంటూ నీళ్లు నమిలాడు అభిజిత్.
"మరి అనిరుద్ధుడి సంస్థానంలో ప్రాణాలకు తెలిగించి అయినా సరే ఘోర కలితో పోరాడతాను అని శపథం చేసొచ్చావు కదా", అని గుర్తుచేశాడు సంజయ్.
"మన చేతిలో ఏం లేదు, అభిజిత్. ఫైట్ చెయ్యాల్సిందే", అంటూ భయం నటిస్తూ అంది అంకిత.
"తప్పదా?" భయంగా అడిగాడు అభిజిత్.
"అసలు ఇక్కడ ప్రొసీజర్ ఏంటి సర్? ఆ యోధుడిని సింహాలు ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటాయి ?" అని రుద్రసముద్భవను అడిగాడు అభిజిత్.
"యోధుడిని అవే ఎంచుకుంటాయి. అందుకోసం అవి పెట్టుకునే ప్రమాణాలేంటో మాకు కూడా తెలియదు. జటిలలోని అతిపెద్ద రహస్యం అది. ఇక్కడ మొత్తం 8 సింహాలుంటాయి. ఇంతవరకు నేను 5 సింహాలను ఒకేసారి చూసాను. నీ అదృష్టం బావుంటే 8 సింహాలనూ చూస్తావేమో", అంటూ నవ్వుతూ చెప్పాడు రుద్రసముద్భవ.
అభిజిత్ షాక్ తిన్నాడు.
జటిల చూడటానికి ప్రాకారంలా ఉండదు. ఎండు గడ్డి మొలిచిన నేలపై దూరం నుండి సూర్యుని కాంతితో ఎదురుగా ఎనిమిది పర్వత శ్రేణులతో మధ్యలో మూసి వున్న ఒక సింహ ద్వారంతో కళ్ళకు గంభీరంగా ఉంటుంది.
"ఆ మధ్యలో ఉన్న పెద్ద డోర్ మూసేసి ఉందేంటి?" అని అభిజిత్ రుద్రసముద్భవను అడిగాడు.
"జటిలలో జయించిన పిమ్మట ఆ ద్వారం తెరుచుకుంటుంది", అన్నాడు రుద్రసముద్భవ.
"లేనిచో?" అని భయపడుతూ అడిగాడు అభిజిత్.
"శంభలలో లేనిచో, కానిచో అను పదాలకు చోటు లేదు అభిజిత్. జటిలలో నీ ఆగమనమే నీ విజయానికి సంకేతం", అనేశాడు రుద్రసముద్భవ.
"ఇలాంటి సమయంలో సిద్ధపురుషుడు పక్కనే ఉండుంటే ఎంత బావుణ్ణు", అని మనసులో అభిజిత్ అనుకున్నాడో లేదో ప్రత్యక్షం అయ్యాడు ఆయన.
"స్వామీ!" అని ఆశ్చర్యపోతూ, "ఇప్పుడు నేనేం చెయ్యాలి?" అని అడిగాడు.
"జటిల నీ సాహసానికి, నీ లోని పరాక్రమానికి అంతిమ పరీక్ష. కొన్ని ఘడియల తరువాత ఇక్కడ 5 సార్లు గంటలు మోగుతాయి. 5 వ గంట మోగిన మరుక్షణమే సింహాలు కదిలి వస్తాయి. నువ్వు నిజమైన యోధుడివైతే 8 సింహాలొస్తాయి. అవి నిన్ను ఆటపట్టిస్తాయి. వాటితో పాటు తీసుకెళతాయి. అవి వచ్చే వరకే నీలోని సంశయాలు, భయాలు. ఒక్కసారి వాటిని చూసాక నీ ధైర్యం వెయ్యి రెట్లు పెరుగుతుంది. నీ మనోబలం నీకు తెలుస్తుంది. అక్కడ కనిపించే ఎనిమిది పర్వత శ్రేణులలో నీకు ఆ సింహాలు పరాక్రమాన్ని పరిచయం చేస్తాయి. ఎంతో కఠినమైన శిక్షణ లభిస్తుంది. అది పూర్తి చేసిన పిమ్మట ఎదురుగా కనబడే సింహద్వారం తెరుచుకుంటుంది. ఆ తలుపులు తెరుచుకున్నాయంటే నువ్వు జటిలను దాటినట్టే. విజయోస్తు", అని చెప్పి సిద్ధపురుషుడు అదృశ్యమైపోయాడు.
సూర్యుని మేలిమి కాంతి ఎక్కువయింది. ఎండు గడ్డి మీద బంగారు కిరణాలు పడుతూ ఆకాశం బంగారు వర్ణంలో ఉండగా ఎదురుగా ఉన్న పర్వతాల నుండి గంటలు మోగుతున్నాయి.
మొదటి గంట మోగింది.
సింహం గర్జన వినబడింది. సింహం పరుగు కళ్ళకు కట్టినట్టుగా అంత దూరం నుండే కనిపిస్తోంది. ఆ పరుగులో ఉన్న శక్తికి మనలోని దుర్గుణాలు ఎగిరిపోతాయి. ఆ గర్జన చెవిన పడంగానే మనలోని సంశయాలు తొలగిపోతాయి. ధైర్యం హుంకరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సింహం అంత దూరం నుండే అభిజిత్ ని మాత్రమే చూస్తూ వస్తోంది. అభిజిత్ కూడా సింహాన్నే చూస్తున్నాడు. కళ్ళల్లో ఎక్కడా క్రూరత్వం లేదు. రాజసం అణువణువునా నిండిన దైవీ శక్తి గల పార్వతీ దేవి వాహనంలా అనిపించింది. సింహం అభిజిత్ ని సమీపించగానే సంజయ్, అంకిత కాస్త టెన్షన్ పడ్డారు. రుద్రసముద్భవ సైగ చేసి వాళ్ళను వారించాడు. అభిజిత్ సింహాన్నే చూస్తున్నాడు. సింహం అభిజిత్ కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తోంది.
అభిజిత్ చుట్టూ తిరుగుతూ సింహం చూస్తోంది. అభిజిత్ ఏ మాత్రం బెదరలేదు. సింహం కాసేపు ఆగి ఒక్క ఉదుటున అభిజిత్ పైకి ఎగిరింది. అభిజిత్ వెంటనే తనకు బాగా తెలిసినవాడిలా సింహపు గోర్లు తనకు తగలకుండా సింహం మెడను పట్టుకుని తన తలను సింహం నుదుటికి తాకిస్తూ జూలు పట్టుకున్నాడు. వెంటనే ఆ సింహం పట్టు విడిపించుకుని ముందుకెళ్లి గట్టిగా హుంకరించింది.
అవన్నీ అభిజిత్ ని చుట్టుముట్టగా మొదటి సింహం మాత్రం ముందుకు పరిగెడుతూ అభిజిత్ కు దారి తెలిసేలా పర్వత శ్రేణుల వైపుగా వెళుతోంది. అభిజిత్ దాన్నే అనుసరిస్తూ వెళుతున్నాడు. అభిజిత్ ను అనుసరిస్తూ ఈ ఏడు సింహాలు వెళుతున్నాయి. అభిజిత్ పర్వత శ్రేణులను చేరుకోగానే రెండో గంట ఆగిపోయింది.
దూరంగా కనబడుతున్న సంజయ్, అంకిత లకు చేత్తో సైగ చేసాడు. వాళ్ళు కూడా తిరిగి చేతులు ఊపుతూ సైగ చేశారు.
--------------------------------------------------------------
"ఈ అభిజిత్ ఏంటో మనకు అర్థం కాడు", అన్నాడు సంజయ్
"యా. ఇంతకు ముందు వరకూ భయపడుతూ ఉన్నాడు.
అంతలోనే ఇలా...", ఆశ్చర్యపోతూ,"అస్సలు అర్థం కాడు" అంది అంకిత.
"అభిజిత్ ఒక జన్మలో శంభల యోధుడు", అన్నాడు రుద్రసముద్భవ.
"అందుకే పరాక్రమం గురించి అనిరుద్ధుడు మాట్లాడగానే అభిజిత్ మాత్రమే తీవ్రంగా స్పందించాడు. అభిజిత్ గురించి అనిరుద్ధుడికి మొత్తం తెలుసు. ఆయన గురించి మీకు ముందు ముందు ఎన్నో విషయాలు తెలుస్తాయి", అంటూ నవ్వుతూ చెప్పటం ముగించాడు రుద్రసముద్భవ.