Update 10
ఘోర కలి అరాచకాలు - 4
సింహం రక్తం తాగే ఘోర కలి
సురా యంత్రాన్ని తీసుకుని చీకటి రాజ్యానికి చేరుకున్నాడు. వైద్య బృందం సురా తెచ్చే యంత్రం కోసం ఎదురు చూస్తోంది. సురా యంత్రాన్ని అందివ్వగానే ఒక 10 ఘడియల తరువాత శస్త్రచికిత్స మొదలు పెట్టారు. పది దేశాల నుండి వచ్చిన ఆ పదిహేను మంది జీకే కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ లనూ పూర్తిగా ఘోర కలి రూపంలోకి మార్చేశారు. సురా చీకటి రాజ్యం బయటే ఘోర కలి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
అంతలో ఘోర కలి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ, వికృతమైన నాట్యం చేస్తూ వస్తున్నాడు. ఈ ప్రపంచానికి అప్పుడే రారాజునైపోయాననే గర్వం కళ్ళల్లో ఉప్పొంగుతోంది. సురా మిత్రుడు కాబట్టి తేలికగానే పసిగట్టాడు.
చీకటి రాజ్యం చేరుకోగానే ఘోర కలి సురాను కౌగిలించుకుంటూ, "సురా నాకిప్పుడు సింహం రక్తం తాగాలని ఉంది రా ", అన్నాడు.
సురా, "సింహం రక్తం ఎందుకన్నా?" అన్నాడు ఏమీ పాలుపోక.
"సింహం తన వేటకు చిక్కిన జంతువు రక్తం తాగటం వల్లే అంత బలంతో ఉంటుంది సురా. అలాంటి సింహం రక్తమే నేను తాగితే ఎలా ఉంటుందా అన్న అద్భుతమైన ఆలోచన తట్టింది రా. ఏమంటావు సురా?" అడిగాడు ఘోర కలి.
"అన్నా అడవికి సింహం రారాజు. ఇందాక మనం కపాలిని దేవి ఆలయంలో సూసినాం కదా. అమ్మోరు సింహం మీదనే ఉండాది. అట్టాంటి సింహంతో మనకు వైరము దేనికి అన్నా? ఆలోచించు", అన్నాడు సురా.
"రేయ్ సురా, నేను నేరుగా పోయి సింహాన్ని చంపుతానా ఏంది? భలే ఉండావే! సింహంలా మారి సింహాన్ని చంపి ఘోర కలిగా రక్తాన్ని తాగుతా. ఇప్పుడు నేను కామరూపధారిని కదరా", అన్నాడు ఘోర కలి ఆనందం పట్టలేనివాడిగా.
"నీకిచ్చిన శక్తిని పరీక్షించుకుంటాను అంటావ్. అంతేనా?" అడిగాడు సురా.
"అది రా సురా. ఇప్పుడర్థం అయ్యిండాది నా మనసు", అన్నాడు ఘోర కలి.
"అయినా సింహం రక్తం తాగితే ఏమొస్తుందన్నా?" ఆశ్చర్యపోతూ అడిగాడు ఘోర కలి.
"సింహం అంటే నాకు పడదురా. ఒక జన్మలో సింహంతో పోరుకు వెళ్ళా. సింహం చేతిలో చనిపోయా. ఆ సింహం దెబ్బ ఇప్పటికీ నన్ను దెబ్బతీస్తూనే ఉందిరా.....దాన్ని నా చేతులతో చంపాలి. దాని రక్తం తాగి దానికంటే గొప్ప రారాజును నేనేనని దాని శవం ముందు చిందెయ్యాలి. కామరూపధారిగా నాకొచ్చిన ఈ శక్తితోనే అది సాధ్యంరా సురా. ఏమంటావ్?" అన్నాడు ఘోర కలి సూటిగా సురా కళ్ళల్లోకి చూస్తూ.
తన మిత్రుడు తనలా మారిపోయిన ఆ పదిహేనుమందినీ చూడటానికి ఉత్సాహపడతాడేమో అనుకున్న సూరాను ఇలాంటి ప్రతిపాదన విస్మయానికి గురి చేసింది. తను ఇప్పుడు కాదన్నాడంటే ఘోర కలికి అది తీరని కోరికగా మిగిలిపోయి మళ్ళీ భవిష్యత్తులో అయినా సింహాన్ని చంపాలని అనిపిస్తుందేమో. అదేదో ఇప్పుడే చంపేస్తే పోతుంది అనుకుని సరే అన్నాడు సురా. ఇదే సురా చెయ్యబోయే అతి పెద్ద తప్పిదం అని బహుశా అతనికి కూడా తెలియదేమో.
సురా నుండి సరే అన్న పదం వినబడగానే సూరాను వెంటబెట్టుకుని చీకటి రాజ్యానికి దగ్గర్లో ఉన్న అడవికి తీసుకెళ్లాడు. అక్కడ అదే సమయంలో ఒక సింహం వేట ముగించుకుని ఆహారాన్ని భుజిస్తోంది.
దూరం నుండి ఇదంతా చూస్తున్న ఘోర కలి సురాతో," ఇప్పుడు దాని నోటి కింది కూడు లాక్కుంటాను చూడు", అంటూ వికృతంగా నవ్వాడు.
వృద్ధ సాధువు ఇచ్చిన మంత్రం జపించిన కొద్ది నిమిషాల్లోనే సింహంలా మారిపోయాడు ఘోర కలి. పరిగెత్తుకుంటూ ఆ సింహం దగ్గరికెళ్లి తన ఆహారాన్ని లాక్కుని తినటం మొదలు పెట్టాడు. ఆ సింహం ఉగ్రరూపం ధరించి పంజా విసిరింది. ఆ సింహాన్ని చిత్తుగా ఓడించాడు సింహం రూపంలో ఉన్న ఘోర కలి. రెండే రెండు దెబ్బలకు నేలకొరిగింది.
వెంటనే తన స్వంత రూపంలోకి మారిపోయిన ఘోర కలి సింహం బ్రతికున్నదా, చచ్చినదా అని పరీక్షగా చూసాడు. కొనఊపిరితో ఉండటంతో ఆ సింహం పంజా చురుకుగా ఘోరకలి మొహాన్ని తాకింది. ఘోరకలి అసలు రూపాన్ని చూస్తూ ఆ సింహం తుది శ్వాస విడిచింది. చనిపోయే ముందు కూడా తన గుర్తును వదిలి వెళ్ళింది. ఘోర కలి మొహంపై ఏటవాలుగా పెట్టిన గాటు ఇందుకు తార్కాణం. ఘోర కలి ఆవేశం కట్టలు తెంచుకుంది. తన దగ్గరున్న కత్తి తీసి ఆ సింహాన్ని నిలువునా చీల్చేసి మరిగే ఆ రక్తాన్ని తాగాడు. తనేం చేస్తున్నాడో తనకే అంతుబట్టని కోపంలో ఊగిపోతున్నాడు ఘోర కలి. సింహం మెడ పై కాలు పెట్టి, "చచ్చిందిది చివరికి....హహ్హాహ్హా", అంటున్నప్పుడు తన మొహం పై పడ్డ సింహం గాటు బలంగా ఉండటంతో రక్తం కారుతూ బొట్లు బొట్లుగా నిర్జీవంగా పడి ఉన్న సింహం పై పడ్డాయి.
సరిగ్గా సింహం నాలుక తెరుచుకుని ఉన్న చోట ఈ రక్తం బొట్లు పడ్డాయి. అంటే సింహం కూడా ఘోర కలి రక్తాన్ని రుచి చూసిందన్న అర్థం వచ్చేలా ఉందా దృశ్యం. కానీ అప్పటికి సింహంలో ప్రాణం లేదు. ఈ దృశ్యాన్ని దూరం నుండి చూస్తున్న సూరాకు భవిష్యత్తులో జరగబోయే దేనికో ఇది సంకేతంలా అనిపించింది.
ఘోర కలి దగ్గరకొచ్చి, "అన్నా ! తృటిలో తప్పించుకున్నావ్ . సింహాన్ని చంపి, రక్తం తాగావు కదా. మన చీకటి రాజ్యానికి పోదాం పద", అన్నాడు సురా.
"నాకు సింహం రక్తం బాగా నచ్చిందిరా. దాని కడుపు నిండా పౌరుషమే. ఆ పౌరుషం మొత్తం తాగేసానురా.
హహహ...ఇలాగే ప్రతీ వారం నాకు సింహం రక్తం కావాలిరా", అంటూ ఆవేశం కట్టలు తెంచుకున్నవాడిలా నడుస్తూ ముందుకెళ్లాడు ఘోర కలి.
కనీసం వెనక్కి తిరిగి తన వంక కూడా చూడకుండా వెళ్తున్న ఘోర కలి వైపే చూస్తూ స్థాణువులా నిలబడిపోయాడు సురా. ఇలాగే కొనసాగితే తన మిత్రుడేమైపోతాడా అన్న భయంతో, బాధతో ఆలోచనలో పడ్డాడు.
---------------------------------------------------
జోసెఫ్ సెబాస్టియన్ డిస్గైజ్
జోసెఫ్ సెబాస్టియన్ aka ముత్తుస్వామి అయ్యర్
బెంగళూరులో క్యాబ్ లో ఉన్న జోసెఫ్ సెబాస్టియన్ డ్రైవర్ కి కృష్ణ స్వామి ఇంటి అడ్రస్ చెప్పాడు. కృష్ణ స్వామి బెంగళూరులోని బసవనగుడిలో ఉన్న ఒక సాదాసీదా అపార్ట్మెంట్ లో ఉంటాడు. అతను అక్కడ ఉంటున్నట్టు చాలా తక్కువ మందికి తెలుసు. జోసెఫ్ సెబాస్టియన్ తన ఇన్వెస్టిగేటివ్ మైండ్సెట్ తో కృష్ణస్వామి ప్రతి మూవ్ మెంట్ నీ ట్రాక్ చేసిన ఆ ఏరియాలోని జర్నలిస్ట్ ద్వారా ఈ విషయం తెలుసుకున్నాడు. కృష్ణస్వామి దగ్గర 'అదృశ్య మందిరం' ప్రాజెక్ట్ ఫండింగ్ డీటెయిల్స్ ఉన్న ఫోల్డర్ ఒకటుంది. అది లాప్టాప్ లో ఉందో, హార్డ్ కాపీలో ఉందో తెలీదు. జోసెఫ్ సెబాస్టియన్ వెళుతున్న క్యాబ్ ని బ్లాక్ కలర్ చెవరోలెట్ వోల్ట్ కార్ ఫాలో చేస్తోంది. అందుకే జోసెఫ్ టెన్షన్ పడుతున్నాడు.
బసవనగుడి లోని వీవీ పురంలో న్యూ మోడరన్ హోటల్ ఉంది. అక్కడే క్యాబ్ దిగాడు జోసెఫ్. హోటల్ లోకి ఎంటర్ అయ్యాడు. లంచ్ టైం కావటంతో బాగా రద్దీగా ఉంది. థాలి ఆర్డర్ చేసాడు. రావటానికి ఐదు నిమిషాల సమయం ఉంది. వెనకాలే తనని ఫాలో చేస్తున్న వ్యక్తి తన టేబుల్ కనబడేలా రెండు టేబుల్స్ అవతల కూర్చున్నాడు. అతను కాఫీ ఆర్డర్ చేసాడు. కాఫీ వెంటనే వచ్చేసింది. ఇంతలో జోసెఫ్ హ్యాండ్ వాష్ కోసం పక్క సెక్షన్ కెళ్ళాడు. హ్యాండ్ వాష్ ఎక్కడా అని అక్కడున్న వెయిటర్ ని అడిగితే ఆ వెయిటర్ అదిగో అటే అని చేత్తో చూపించటం ఆ స్ట్రేంజర్ కి కనబడింది. జోసెఫ్ తిన్నగా ఆ హ్యాండ్ వాష్ సెక్షన్ కెళుతున్నట్టే వెళ్లి రూట్ మార్చి కిచెన్ వైపుగా వెళ్ళాడు. అక్కడున్న వంటతను విచిత్రంగా చూసేసరికి, అతని చేతిలో ఒక 500 /- నోట్ పెట్టేసి అక్కడున్న ఎగ్జిట్ డోర్ గుండా వెళ్ళిపోయాడు. కృష్ణస్వామి ఉంటున్న అపార్ట్మెంట్ కి రెండే రెండు నిమిషాల్లో చేరుకున్నాడు.
కృష్ణ స్వామి రెండో ఫ్లోర్ లో ఉంటాడు. ఆ అపార్ట్మెంట్ పేరు కూడా సరిగ్గా కనబడదు. కానీ జోసెఫ్ కి అడ్రస్ ఫొటోలతో సహా పక్కాగా తెలియటంతో వెంటనే గుర్తుపట్టేసాడు.
కృష్ణస్వామి ఉండే ఇంటి కీని తను ఎక్కడ దాచుంచాడో రాధాకృష్ణన్ ఇంట్లో దొరికిన టూర్ దే అదృశ్య మందిరం ప్రాజెక్ట్ ఫైల్ లో రాసి ఉంది. ఆ ఫైల్ ని స్టడీ చెయ్యటం ఇందుకు పనికొచ్చింది. టైం వేస్ట్ చెయ్యకుండా జోసెఫ్ సెల్లార్ లోని కృష్ణస్వామి పాత కార్ దగ్గరికి వెళ్ళాడు. మారుతి 800 కార్ అది. చాలా ఓల్డ్ మోడల్. తన దగ్గరున్న పిక్చర్ లో మూడో టైర్ రింలో ఎక్కడ దాచాడో క్లియర్ గా మార్క్ చేసాడు. అక్కడి నుండి కీ తీసుకుని సెకండ్ ఫ్లోర్ కెళ్లిన జోసెఫ్ కు నమ్మబుద్ధి కావటం లేదు. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫైల్స్ ఉన్న కృష్ణస్వామి ఇంటి తాళాన్ని ఇలా మారుతి 800 టైర్ రింలో దాచటం ఏంటా అనుకున్నాడు. కృష్ణస్వామి ఇంటి డోర్ తెరవగానే ఒక అలార్మ్ ఆక్టివేట్ అయినట్టు సౌండ్ వచ్చింది. జోసెఫ్ చుట్టూ చూసాడు. ఆ డోర్ వెనకే టైమర్ ఉంది. అందులో 05 :00 మినిట్స్ అన్న టైమర్ చూపిస్తోంది. అంటే జోసెఫ్ దగ్గరున్న టైం 5 నిమిషాలు మాత్రమే. ఆ ఐదు నిమిషాల్లో ఫైల్ ఎక్కడుందో కనిపెట్టాలి. లేదా అక్కడేదైనా జరగొచ్చు. అంటే తను ఇంతక్రితం మారుతి 800 టైర్ రింలో నుండి తెచ్చిన కీ తో ఓపెన్ చెయ్యటం వల్లే ఇది ఆక్టివేట్ అయ్యింది. జోసెఫ్ నిర్ఘాంతపోయాడు. ఫ్లాట్ లో మూడే మూడు రూమ్స్ ఉన్నాయి. స్టడీ రూమ్ కెళ్ళాడు చాలా మెటీరియల్ కనబడింది. కానీ ఫండింగ్ డీటెయిల్స్ ఎక్కడుంటాయో తెలియట్లేదు. అందుకే అక్కడున్న లాప్టాప్ ని తీసుకొచ్చాడు. టైం ఎక్కువ లేకపోవటంతో వెంటనే అపార్ట్మెంట్ బయటికొచ్చేసాడు.
హీట్ డిటెక్టర్ సర్క్యూట్ మైక్రో కంట్రోలర్ కి సిగ్నల్ పంపటం వల్ల మారుతి 800 సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయి పేలిపోయింది. చూస్తుండగానే రెండో ఫ్లోర్ లో ఉన్న కృష్ణస్వామి ఇంటి నుండి పేలిన శబ్దం వినబడింది. అది చూసిన జోసెఫ్ కు ముచ్చెమటలు పట్టేసాయి. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
జోసెఫ్ వెంటనే ఒక్క నిమిషం టైం వేస్ట్ చెయ్యకుండా నెక్స్ట్ ఫ్లైట్ కోసం బెంగళూరు ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. తనని ఎవరైనా ఫాలో చేస్తున్నారేమోనని చుట్టూ చూసాడు.
బెంగళూరు ఎయిర్పోర్ట్ బయట బ్లాక్ కలర్ చెవరోలెట్ వోల్ట్ కార్ ఆగింది. ఆ స్ట్రేంజర్ వేగంగా అడుగులు వేస్తూ జోసెఫ్ ని వెతుకుతూ వస్తున్నాడు.
ఎయిర్పోర్ట్ చెక్ ఇన్ దగ్గర జోసెఫ్ లగేజ్ మొత్తం స్కాన్ అయిపోయి అక్కడున్న కన్వేయర్ బెల్ట్ మీదుగా వెళ్తోంది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న జోసెఫ్ కు అప్పుడే ఆ స్ట్రేంజర్ కనిపించాడు. ఆ స్ట్రేంజర్ కూడా అదే ఫ్లైట్ ఎక్కబోతున్నాడని అర్థమైంది. టెన్షన్ స్టార్ట్ అయింది.
--------------------------------------------------------
అప్పుడే సరిగ్గా ఒక విచిత్రం జరిగింది. ఆ స్ట్రేంజర్ బుక్ చేసుకుంది ముంబై ఫ్లైట్. జోసెఫ్ బుక్ చేసుకున్న నెక్స్ట్ ఫ్లైట్ డైరెక్ట్ గా చెన్నై కెళ్తుంది. బెంగళూరు - చెన్నై - దుబాయ్ ఇలా జోసెఫ్ ఫ్లైట్ బుక్ చేసాడు. జోసెఫ్ డైరెక్ట్ గా ముంబై కే ఫ్లైట్ బుక్ చేసుకుని ఉంటాడు అనుకుని ఆ స్ట్రేంజర్ బెంగళూరు - ముంబై ఫ్లైట్ చేసాడు.
జోసెఫ్ చెన్నై చేరుకోగానే అక్కడున్న కొరియర్ సర్వీస్ ద్వారా తాంబరంలోని ప్రియా కృష్ణన్ ఇంటికి కృష్ణ స్వామి లాప్టాప్ ని చేరవేసేలా అరేంజ్ చేసాడు. తను కంగారు పడకుండా ఒక ఉత్తరం కూడా జత చేసాడు. అన్నీ అందులోనే వివరించాడు.
చెన్నై డొమెస్టిక్ వింగ్ లో నుండి తన లగేజ్ కలెక్ట్ చేసుకుని ఇంటర్నేషనల్ సర్వీస్ వింగ్ కెళ్ళి దుబాయ్ కి బుక్ చేసిన నెక్స్ట్ ఫ్లైట్ కోసం చెక్ ఇన్ అయ్యాడు.
దుబాయ్ లోని జీకే కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ లో డేటా అనలిస్ట్ గా మరుసటి రోజే జాయిన్ అవ్వబోతున్నాడు జోసెఫ్ సెబాస్టియన్. కాదు కాదు. ఇప్పుడు తన పేరు ముత్తుస్వామి అయ్యర్. ఈ డిస్గైజ్ తోనే జీకే కార్పొరేషన్ జాయిన్ అయ్యి, అక్కడే ఉంటూ ఘోర కలిని దగ్గర నుండి చూస్తూ అశుతోష్ ఇప్పుడెలా ఉన్నాడో, ఎక్కడున్నాడో తెలుసుకుంటూ ఘోర కలికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నీ సిబిఐకి ఎప్పటికప్పుడు అందించేలా పెద్ద ప్లాన్ తోటే బయలుదేరుతున్నాడు.
చెన్నై డొమెస్టిక్ వింగ్ కి సరిగ్గా అదే టైములో ఆ స్ట్రేంజర్ రాగలిగాడు. చాలా హై లెవెల్ ఇన్ఫ్లూయెన్స్ వాడి బెంగళూరు నుండి చెన్నై కి చేరుకోగలిగాడు. కానీ ఇప్పుడు చెన్నై డొమెస్టిక్ వింగ్ లో జోసెఫ్ కనబడటం లేదు. ఆ స్ట్రేంజర్ కి జోసెఫ్ ప్లాన్ అంతుబట్టడం లేదు. అటు ఇటు చూస్తున్నాడు. అంతలో జోసెఫ్ ఒక ఎయిర్పోర్ట్ బస్సు లో కనిపించాడు. డొమెస్టిక్ వింగ్ నుండి బయటికొచ్చిన ఆ స్ట్రేంజర్ అక్కడున్న స్టాఫ్ ని ఆ బస్సు ఎక్కడికెళ్తోందని అడిగాడు. దుబాయ్ కెళ్లే బస్సు అని చెప్పాడు. షాక్ లో ఉండిపోయిన ఆ స్ట్రేంజర్ అలా చూస్తుండగానే తన కళ్ళముందే దుబాయ్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు జోసెఫ్.
జోసెఫ్ ప్లాన్ ఏంటో అంతుబట్టక, తన బాస్ కి తన మొహం ఎలా చూపించుకోవాలిరా దేవుడా అని ఆ స్ట్రేంజర్ కి తల దిమ్మెక్కిపోయింది. తన బాస్ కి ఇప్పుడేం చెప్పాలో తెలియక తికమక పడుతున్నాడు.
---------------------------------------------------------------
జోసెఫ్ సెబాస్టియన్ - అశుతోష్ మీటింగ్
జోసెఫ్ సెబాస్టియన్ వాళ్ళ నాన్న గారిని గుర్తు చేసుకోవటం
అశుతోష్ చీకటి రాజ్యంలో బందీగా ఉన్నాడు. సరైన తిండి లేక కృశించిపోయి ఉన్నాడు.
తనని ఒక డార్క్ రూంలో బంధించి ఉండటంతో అక్కడికొచ్చే ధైర్యం ఎవ్వరూ చెయ్యలేదు. ఘోర కలి చెప్పినట్టుగా టైం కి ఫుడ్, మంచి నీళ్లు, స్నానం చెయ్యటానికి ఒక పది నిమిషాలు, కాలకృత్యాలు తీర్చుకోవటానికి మరో పది నిమిషాలు మాత్రమే కేటాయిస్తూ తనను ఒక ఖైదీ కంటే దారుణంగా ట్రీట్ చేస్తున్నారక్కడ. ఏ కాంటాక్ట్ డివైస్ కూడా అశుతోష్ కి అందుబాటులో లేకపోవటంతో అసలు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
కానీ అశుతోష్ జేబులో మాత్రం ఒక పాత హ్యాండ్సెట్ ఒకటి ఉండిపోయింది. ఆ నెంబర్ ప్రస్తుతం అతను వాడుతున్నది కాదు. పైగా అదొక బేసిక్ హ్యాండ్సెట్. సంజయ్ జోసెఫ్ సెబాస్టియన్ కి ఈ మొబైల్ నెంబర్ ని ఒకప్పుడు షేర్ చేసాడు. అశుతోష్ తో ఫోన్ కాల్ లో జోసెఫ్ గురించి సంజయ్ మాట్లాడిన తర్వాత సంజయ్ బై మిస్టేక్ అశుతోష్ పాత నెంబర్ ని జోసెఫ్ కు ఫార్వర్డ్ చేసాడు. జోసెఫ్ మొబైల్ లో అశుతోష్ పేరు మీద ఈ నెంబర్ స్టోర్ అయ్యి ఉంది. అలా ఇప్పుడీ అశుతోష్ పాత మొబైల్ కి కొత్త నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది.
"హాయ్....అశుతోష్
జోసెఫ్ సెబాస్టియన్ హియర్"
ఆ మెసేజ్ చూడగానే అశుతోష్ కళ్ళు మెరిసిపోయాయి. ఇన్ని రోజులూ హోప్ వదిలేసి బతుకుతున్నాడు. ఇప్పుడు కొత్తగా ఆ డార్క్ రూమ్ లో ఎగ్జిట్ పాయింట్స్ వెతకటం మొదలు పెట్టాడు. కిటికీలు ఏవీ తెరుచుకోవటం లేదు. పైన ఒక హాపర్ విండో ఒకటుంది. ఆ హాపర్ విండో లో నుండి చూస్తే తను ఎక్కడున్నాడో అర్థం అవుతుందేమోనన్న చిన్న ఆశ చిగురించింది. అక్కడ చాలా పెద్ద పెద్ద టేబుల్స్ ఉన్నాయి. పెద్ద కుర్చీలు కూడా ఉన్నాయి. అంతకముందు అక్కడ కార్పెంటరీ మరియు ఎలక్ట్రికల్ వర్క్స్ ఏవైనా జరిగాయేమో అనిపించేలా వుడెన్ ఫర్నిచర్, డ్రిల్లింగ్ మెషీన్లు ఉన్నాయి. అక్కడున్న పెద్ద టేబుల్ ని జరిపి మధ్యలో ఒక కుర్చీ వేసుకుని దాని పైకెక్కాడు అశుతోష్. టేబుల్ జరుపుతున్నప్పుడే అక్కడ బైనాక్యూలర్స్ దొరికింది. దాని సాయంతో హాపర్ విండో తెరిచి చూసాడు. జీకే నేషనల్ ఆయిల్ కంపెనీ అని కనబడింది. వెంటనే జోసెఫ్ కు మెసేజ్ చేసాడు.
"జీకే నేషనల్ ఆయిల్ కంపెనీ...
కమ్యూనిటీ 309
జీకే స్ట్రీట్"
అన్న మెసేజ్ వచ్చింది జోసెఫ్ మొబైల్ కు.
జోసెఫ్ సెబాస్టియన్ అదే ముత్తుస్వామి అయ్యర్ జీకే కార్పొరేషన్ లో జాయిన్ అయిన మొదటి రోజే జీషాన్ అన్న వ్యక్తిని పరిచయం చేసుకున్నాడు. జీషాన్ జీకే కార్పొరేషన్ మొదలైనప్పటి నుండి అక్కడే పని చేస్తున్నాడు. జీషాన్ కి ఆ జాబ్ వాళ్ళ పెద్దనాన్న ద్వారా వచ్చింది. వాళ్ళ పెద్దనాన్న జీకే కార్పొరేషన్ దుబాయ్ బోర్డు డైరెక్టర్. ఆయన ప్రస్తుతం అక్కడ లేరు. చీకటి రాజ్యంలో ఉన్నాడు.
జీషాన్ ని ఆ అడ్రస్ గురించి వాకబు చేసాడు జోసెఫ్. జీషాన్ కి జీకే స్ట్రీట్ మొత్తం బాగా తెలిసుండటంతో
"జీకే స్ట్రీట్ లో జీకే కార్పొరేషన్ ఎంప్లాయిస్ కి తప్ప బయటి వారికి చోటు లేదు. జీకే స్ట్రీట్ లోని ఏ కమ్యూనిటీకి వెళ్లాలన్నా సరే నీకొక ఐడి కార్డు కావాలి. నేను అరేంజ్ చేస్తాను. బట్ బీ కేర్ఫుల్. అక్కడ ఎవరిని కలవటానికి వెళుతున్నావ్?" అని అడిగాడు జీషాన్.
"మా మావయ్య. తనే నాకీ జాబ్ వచ్చేలా చేసాడు", అని వెంటనే సమాధానం ఇచ్చాడు జోసెఫ్.
"ఇంటరెస్టింగ్. మీ మావయ్య ఎక్కడుంటాడు?" అని అడిగాడు.
" కమ్యూనిటీ 309..."అని చెప్పి సంశయించాడు జోసెఫ్.
"హే, ఇట్స్ ఓకే. జస్ట్ అడిగాను. డీటెయిల్స్ చెప్పటం ఇష్టం లేకపోతే ఇబ్బందేం లేదు", అన్నాడు జీషాన్.
కమ్యూనిటీ 309 లో జీకే కార్పొరేషన్ ఎంప్లాయిస్ ఇళ్ళు చాలా ఉన్నాయి. అందుకే జీషాన్ పెద్దగా అనుమాన పడలేదు. వెంటనే జోసెఫ్ అక్కడికి వెళ్లేందుకు కావలసిన ఐడి కార్డును నిమిషాల్లో అరేంజ్ చేసిచ్చాడు.
కానీ అశుతోష్ ఉన్న డార్క్ రూమ్ కమ్యూనిటీ 309 లో లేదు. అశుతోష్ హాపర్ విండో లో నుండి చూస్తూ తన కంటికి ఏదైతే సైన్ బోర్డు కనబడిందో వెంటనే అదే చెప్పేసాడు తొందర్లో. డార్క్ రూమ్ కి సరిగ్గా వెనక వైపున ఉందది.
ఇప్పుడు కమ్యూనిటీ 309 కి వెళ్ళాక అశుతోష్ ఎక్కడున్నాడో వెతకాల్సిన పజిల్ మాత్రం జోసెఫ్ దే. ఎందుకంటే ఆ డార్క్ రూమ్ వేరే కమ్యూనిటీ పరిధి కిందకు వస్తుంది. డార్క్ రూమ్ బ్యాక్ సైడ్ నుండి చూసినప్పుడు ఎదురుగా కనబడే సైన్ బోర్డు మీద కమ్యూనిటీ 309 అని ఉందంటే డార్క్ రూమ్ ఉండేది 310 అయినా అయ్యి ఉండాలి లేదా 308 అయినా అయ్యుండాలి.
పైగా అశుతోష్ కి కేటాయించిన ఆ డార్క్ రూమ్ జీకే కార్పొరేషన్ ఎంప్లాయిస్ నివసించే కమ్యూనిటీలో ఉందో లేదోనన్నది అసలైన పజిల్. జీకే కార్పొరేషన్ ఎంప్లాయిస్ లేని కమ్యూనిటీ లలో ఎంటర్ అవ్వటం చాలా కష్టమని జీషాన్ హెచ్చరించడంతో జోసెఫ్ ఆలోచనలో పడ్డాడిప్పుడు. సరే ఏదైతే అదైంది అనుకుని ముందుగా కమ్యూనిటీ 309 చేరుకున్నాడు జోసెఫ్.
జోసెఫ్ తను వచ్చే టైం అండ్ ప్లేస్ మెసేజ్ చెయ్యటంతో సరిగ్గా అదే టైంకి అశుతోష్ అలెర్ట్ అయ్యాడు. జోసెఫ్ కమ్యూనిటీ 309 సైన్ బోర్డు దగ్గరే నిల్చుని ఉన్నాడు. హాపర్ విండో లో నుండి జోసెఫ్ ను అశుతోష్ చూసాడు. ఎలా సైగ చెయ్యాలో తెలియట్లేదు.
అలాంటి టైంలో అశుతోష్ అక్కడున్న వుడెన్ ప్లాంక్ ని, డ్రిల్లింగ్ మెషిన్ ని తీసుకుని హాపర్ విండో పైన పెట్టి డ్రిల్ల్ చెయ్యటం మొదలు పెట్టాడు. వెంటనే గాలికి ఆ పొట్టు అంతా వ్యాపించింది. డ్రిల్లింగ్ సౌండ్ ని, గాలికి ఎగసి పడి తన వైపుగా వస్తోన్న ఈ పొట్టును రెంటిని ఒకేసారి గమనించిన జోసెఫ్ అశుతోష్ ఎక్కడున్నాడో కనిపెట్టగలిగాడు.
------------------------------------------------------------
కమ్యూనిటీ 310 పరిధిలోని డార్క్ రూమ్ అది.
జోసెఫ్ కమ్యూనిటీ 310 లోకి అడుగుపెట్టాడు. అక్కడున్న బాడీ గార్డ్స్ కి తన ఐడి కార్డు చూపించాడు. తను జీకే కార్పొరేషన్ ఎంప్లాయ్ ని అని చెప్పాడు. అయితే నీకు ఇక్కడేం పని అన్నట్టు వాళ్ళు చూసారు. తన మావయ్యను కలవటానికి ఇటు వైపు వచ్చానని చెప్పాడు. కలిసాక తిరిగి బయలుదేరబోతూ మధ్యలో లఘుశంక కోసం తనకు దారిలో రెస్ట్ రూమ్స్ ఏవీ కనబడకపోవడంతో ఇటొచ్చానని చెప్పాడు. ఆ బాడీ గార్డ్స్ పైన నుండి కింద దాకా ఎగాదిగా చూసి ఒకరితో ఒకరు మాట్లాడుకుని జోసెఫ్ కు పర్మిషన్ ఇచ్చారు. జోసెఫ్ వెంటనే లేట్ చెయ్యకుండా అశుతోష్ డార్క్ రూమ్ ఉన్న వైపుగా వెళ్ళాడు. అశుతోష్ డార్క్ రూమ్ బయట బాడీ గార్డ్ ఎవ్వడూ లేదు. పైగా అక్కడున్న బెంచ్ పైన కీస్ ఉన్నాయి. వెంటనే జోసెఫ్ అక్కడున్న కీ తో డార్క్ రూమ్ డోర్ తెరిచాడు. తెరవగానే అశుతోష్ బయటకొచ్చేసాడు. అశుతోష్, జోసెఫ్ వెంటనే అక్కడున్న రెస్ట్ రూమ్ వైపుగా వెళ్లారు.
అశుతోష్, "నువ్వు వెంటనే నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్లే ప్లాన్ చెయ్యాలి....ప్లీజ్ హెల్ప్ మీ" అంటూ ప్రాధేయపడ్డాడు.
జోసెఫ్, "సర్ నా దగ్గర రెండు జీపీఎస్ ట్రాకింగ్ డివైజెస్ ఉన్నాయి. ఒకటి వ్యక్తికీ, మరొకటి వెహికల్ కి ఫిక్స్ చెయ్యొచ్చు", అంటూ తన దగ్గరున్న డివైజెస్ ని అశుతోష్ కిచ్చేసాడు.
అశుతోష్,"థాంక్ యూ జోసెఫ్. ఘోర కలి ఇక్కడి నుండి వెళుతూ చివరి సారిగా నాతో మాట్లాడి వెళ్ళాడు. మళ్ళీ కనబడలేదు. ఘోర కలికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడని ఈ బాడీ గార్డ్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను. సురా అతని పేరు. అతనికి ఒక జీపీఎస్ ట్రాకర్ ఫిక్స్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అతనికి ఎలాంటి సెక్యూరిటీ చెక్ అప్స్ లేవంట. మిగతా అందరికీ టైట్ సెక్యూరిటీ చెక్ ఉందిక్కడ. అండ్ ఇంకో డివైజ్ ని నేను టైం చూసి ఒక వెహికల్ కి ఫిక్స్ చేస్తాను. ఈ ట్రాకింగ్ డివైజెస్ తో వీళ్ళ మూవ్ మెంట్స్ తెలిసినా చాలు మనం ఏదైనా ప్లాన్ చెయ్యొచ్చు"
జోసెఫ్, "ఘోర కలి ఇంకా ఇక్కడికి రాలేదు సర్. చీకటి రాజ్యంలోనే ఉన్నాడు. మీ బేసిక్ హ్యాండ్సెట్ కోసం చార్జర్ అడిగారు కదా ఇదిగో", అంటూ తను తెచ్చిన చార్జర్ ఇచ్చాడు.
అశుతోష్,"హమ్మయ్య థాంక్ యూ జోసెఫ్. డార్క్ రూమ్ లో ఒక డొక్కు చార్జర్ ఉంది. ఇన్ని రోజులూ దానితోనే నెట్టుకొచ్చా", అంటూ జోసెఫ్ ను హగ్ చేసుకుని అశుతోష్ ఎమోషనల్ అయిపోయాడు.
"అసలు ఈ డార్క్ రూమ్ లోనే చచ్చిపోతానేమో అనిపించింది. నా లైఫ్....నా లైఫ్ ఎవ్వరికీ పనికిరాకుండా ఈ చీకట్లోనే అంతమైపోతుందేమో అనిపించింది. నాకు ఇలాంటి గతి పట్టించిన ఘోర కలిని ఊరికే వదలను. ఐ విల్ టీచ్ హిం ఏ వాల్యూబిల్ లెసన్", అంటూ తన కన్నీళ్లు తుడుచుకుంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు.
అశుతోష్ తిరిగి డార్క్ రూమ్ లోకి వెళ్తూ, "జోసెఫ్ నీ గురించి నాకు సంజయ్ చెప్పాడు. కానీ నా ఈ పాత మొబైల్ నెంబర్ నీకెవరిచ్చారు?"
జోసెఫ్,"సంజయ్ ఆ రోజు మీతో ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత ఈ నెంబర్ ఫార్వర్డ్ చేసాడు. అది మీ పాత మొబైల్ నెంబర్ అని నాకు తెలీదు. లైఫ్ ఈజ్ సో స్ట్రేంజ్ కదా",అంటూ డోర్ క్లోజ్ చేస్తూ అన్నాడు.
అశుతోష్ జోసెఫ్ వైపు చూస్తూ ఒక నవ్వు నవ్వాడు. లైఫ్ లోని ఫిలాసఫీ అంతా అర్థం ఐపోయేలా ఉందా చిరునవ్వు.
డార్క్ రూమ్ కి తాళం వేసి కీ ని అక్కడే బెంచ్ మీద పెట్టేసి జోసెఫ్ తను వచ్చిన దారినే వెళ్ళిపోయాడు.
జోసెఫ్ కమ్యూనిటీ 310 నుండి బయటపడ్డాడు.
రోడ్ మీద నడుస్తూ ముందుకు వెళుతున్నాడు.
ఇప్పుడిప్పుడే తను దుబాయ్ లో చెయ్యాల్సిన పనులు క్రిస్టల్ క్లియర్ గా కళ్ళ ముందు కనబడుతున్నాయి.
అశుతోష్ కెరీర్ లో సాధించిన ఎన్నో విజయాలను సంజయ్ ద్వారా విని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో తిరుగులేని ఆర్టికల్స్ ఎన్నింటినో రాసాడు.
అవార్డ్స్ కూడా అందుకున్నాడు జోసెఫ్. అలాంటి గొప్ప ఆఫీసర్ ఇప్పుడు తనను ప్రాధేయపడుతున్నాడు.
అలాంటి సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ లో ఆ దైన్యం చూడటం చాలా బాధేసింది.
విధి మరీ ఇంత బలీయమైనదా ! మానవ యత్నం చెయ్యటం తప్ప మన చేతుల్లో ఏమీ లేదా అన్న వేదాంతం జీర్ణం కావటం లేదు.
జీవితపు లోతు తెలిసే కొద్దీ మనిషి మరింత కృషి చేస్తాడు విధిని తనకు నచ్చినట్టుగా మలచుకోవటానికి. కానీ ఇప్పుడు జోసెఫ్ విధిని మార్చాలి అనుకోవటం లేదు. ఒక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ గౌరవాన్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. ఎందుకంటే జోసెఫ్ వాళ్ళ నాన్న కూడా ఒక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ కాబట్టి. జోసెఫ్ కి వాళ్ళ నాన్న గుర్తుకొచ్చి రోడ్ నడిమధ్యలో మోకాళ్ళ మీద కూర్చుని ఆకాశం దిక్కు చూస్తూ ఏడ్చాడు. జోసెఫ్ వాళ్ళ నాన్న గారు చనిపోయారు. ఒక రెస్క్యూ ఆపరేషన్ లో టెర్రరిస్ట్ ల బందీలో ఇలాగే అశుతోష్ లా చీకటి గదిలో నిర్బంధింపబడి అతి కిరాతకంగా వాళ్ళ చేతుల్లో చనిపోయాడు. వాళ్ళ నాన్న ఆ రోజున ఎంతటి వేదనను అనుభవించి ఉంటాడో ఈ రోజున అశుతోష్ ను చూసాక జోసెఫ్ కు సరిగ్గా అర్థం అయ్యింది. అందుకే కన్నీటి రూపంలో తన ఆవేదనను, ఆవేశాన్ని వ్యక్తపరుస్తున్నాడు.
అశుతోష్ లో ఇప్పుడొక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ ని కాదు. వాళ్ళ నాన్నగారిని చూసుకుంటున్నాడు జోసెఫ్.
వాళ్ళ నాన్న గారిని కాపాడుకోలేకపోయానని ప్రతీ ఆదివారం చర్చిలో జీసస్ తో ఎన్నో సార్లు వేడుకున్నాడు. ఆ దేవుడు తన మొర ఆలకించినట్టున్నాడు. ఇలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చాడేమో అనిపించింది. ఇప్పుడు అశుతోష్ ని నిండు ప్రాణాలతో ఇంటికి చేర్చటం జోసెఫ్ ముందున్న మిషన్.