Update 11
శంభల రాజ్యం – 4
విక్రమసింహుడి పరాక్రమం
అభిజిత్ సింహాల వెంట పర్వత శ్రేణులపై ఉన్న శిక్షణా కేంద్రాన్ని సమీపిస్తున్నాడు. ముందుగా వెళ్తున్న సింహం ఒక్కసారి ఆగి అభిజిత్ వైపు తిరిగి చూసింది. ఆ చూపు స్పర్శ అభిజిత్ ని బలంగా తాకింది. అలాంటి సన్నివేశం ఎన్నో సార్లు అక్కడ జరిగినట్టు అనిపించింది. తన స్మృతి పథంలోకి వెళ్ళిపోయాడు. ఇదే సింహం అలా ఎన్నో సార్లు వెనక్కి తిరిగి చూసేది. కానీ అప్పుడున్నదేదో ఇక్కడ కనబడటం లేదు. అసలేంటది ? ఒక వస్తువా? మనిషా? అభిజిత్ చుట్టూ ఉన్న సింహాలు కూడా ఇప్పుడు అభిజిత్ నే చూస్తూ ఉన్నాయి అదేదో గుర్తించు అన్నట్టు. ఒకే సారి ఎనిమిది సింహాల వంక చూస్తూ ఉన్నాడు అభిజిత్. ప్రతీ సింహం తనను ఒకేలా చూస్తోంది. వాటి చూపుల స్పర్శ తాలూకు గాంభీర్యం అదే. ఏ మాత్రం తేడా లేదందులో. అభిజిత్ కే తెలియకుండా కన్నీళ్ళొచ్చేస్తున్నాయి. ఏం చెప్పాలని చూస్తున్నాయో అంతుబట్టక కలిగే బాధ నుండి వస్తున్న కన్నీటి అలలవి. కన్నీళ్లు తుడుచుకుని మళ్ళీ ఒకసారి వాటి వంక చూసాడు. ఇప్పుడు సరిగ్గా అర్థం అవుతోంది. అక్కడ ఒకప్పుడు ఉండే మనిషి ఎవరో కాదు. తనే అని. ఇప్పుడు అభిజిత్ లా కాదు. విక్రమసింహుడిలా ఆలోచించాడు. విక్రమసింహ చూపు ఎలా ఉంటుందో అలా చూసాడు అక్కడున్న సింహాసనం వైపు.
ఎదురుగా ఉన్న అడ్డంకులు అన్నీ గుర్తుకొచ్చాయి. ఇదొకప్పుడు తన శిక్షణా కేంద్రమే. ఆ సింహాసనం పై తన గురువు సమవర్తి ఉండేవాడు. ఆ సింహాసనం వైపుగా నడుచుకుంటూ వెళ్లి గురువును గుర్తుచేసుకోగానే ఆయన రూపం మెదిలింది అక్కడ. ఆయన పాదపద్మాలకు నమస్కరిస్తున్నప్పుడు కన్నీటి బొట్లు అక్కడ పడ్డాయి. ఆ కన్నీటి చుక్కలు ఆ నేలపై పడ్డాయి. అంటే ఆయన అక్కడ లేకపోయినా తనకు కనిపిస్తున్నాడు అన్న దానికి సంకేతం అది.
"విక్రమసింహా....జయించు....జయించు....జయించు
నీలో ఉన్న ఆవరణలు దాటు
నీ ముందున్నదేదీ నీకు అడ్డు కాదు....నీలో ఉన్నది మాత్రం ఖచ్చితంగా నీకు అడ్డుపడుతోందని తెలుసుకో
విక్రమసింహా......జయించు.....జయించు....విజయం నీదే తెగించు "
అవే మాటలు. ఎన్నో సార్లు తన చెవులతో తనే విన్న విజయ డంకాలు.
అగాధపు అంచుల్లోకి తను పడిపోతున్నప్పుడు పైకి తీసుకొచ్చిన చేతులలాంటి మాటలవి.
ఓటమి అంటే భయపడే విక్రముడిని విజయం తప్ప మరొకటి తెలియని విక్రమసింహుడిగా మార్చిన మంత్రాలవి.
విక్రముడు విక్రమసింహుడిగా మారితే అతని నడక చాలు సింహాలు కనిపెట్టేస్తాయి. ఒక నిఖార్సయిన యోధుడిని అదీ విక్రమసింహుడి లాంటి ప్రాణాలకు తెగించైనా వీరత్వాన్ని ప్రదర్శించే యోధుడిని అవి ఎప్పటికీ మరిచిపోవు. అందుకే అవి మామూలు సింహాలు కావు అన్నది.
అభిజిత్ ఇప్పుడు విక్రమసింహుడైపోయాడు. తన ఎదురుగా ఉన్న అడ్డంకులు ఇప్పుడు కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యాయి.
అగ్ని వలయం కనిపించింది మొదటగా. మరో ఆలోచన లేకుండా దూకేసాడు. దాన్ని చూసిన సింహాలు గర్జిస్తూ వచ్చాయి. ఒక దాని వెంట మరొకటి అదే అగ్ని వలయంలో విక్రమసింహ ఆజ్ఞ జారీ చేసినట్టు కళ్ళు మూసుకుని దూకేశాయి. అగ్ని వలయం మాయమై సుడి గుండం ప్రత్యక్షం అయ్యింది. మరో ఆలోచన లేకుండా సుడి గుండంలో దూకేసాడు. సుడి గుండాన్ని చూస్తే గుండె ఆగిపోయే భయం వేస్తుంది ఎవ్వరికైనా. అలాంటి సుడి గుండం విక్రమసింహుడికి కనిపించట్లేదు. మరేదో కనిపిస్తోంది. ఆపద కనిపిస్తే ఎవ్వరైనా ఆగిపోతారు. ఒక యోధుడికి మామూలు వాడికి సరిగ్గా ఇక్కడే వ్యత్యాసం ఉంటుంది. యోధుడికి ఆపద చివరన ఉన్న ఉపాయం కనిపిస్తుంది. అందుకే కళ్ళ ముందున్న ఈ ఉపద్రవం అపాయంలా అనిపించదు. విక్రమసింహుడి వెంట ఈ సుడి గుండంలోకి సింహాలు రక్షక భటులలా వెంట వచ్చేసాయి. అనుకున్నట్టే ఆ సుడిగుండం కూడా ఆగిపోయింది.
---------------------------------------------------------------
ఇప్పుడు కళ్ళ ముందు కత్తుల వలయం ఉంది. ఆ వలయంలో అడుగుపెడితే కత్తుల మీదే నడక. ఒక్క ఘడియ అయినా అవి కత్తులు అన్న స్పృహ కలిగితే ఆ మరుక్షణమే చచ్చినట్టు లెక్క. నొప్పి తెలిస్తే నడక ఆగిపోతుంది. నొప్పి తెలిసేలోపు వలయం ఆగిపోవాలనుకున్నాడు విక్రమసింహుడు. పరుగులో వేగం కాలాన్ని సైతం ఓడిస్తుంది. విక్రమసింహుడి దగ్గర మాత్రమే ఉన్న నైపుణ్యం ఇది. అలాంటి పరుగు అతనిది. లిప్తకాలంలో జయించుకు రాగలడు. కత్తులు తోరణాలలా, బాటలలా, గోడలలా చుట్టూ ఉన్న వలయంలోకి ఎప్పుడు వెళ్ళాడో ఎప్పుడు వచ్చాడో తెలియని వేగంతో పరిగెత్తాడు. సింహాలు గర్జిస్తూ వెళ్లాయి. ఏనుగులలా ఘీంకరిస్తూ బయట పడ్డాయి. కత్తుల వలయం పోయి శబ్దారావం మొదలయింది.
ధ్వని యోధుడి దృష్టిని మార్చేస్తుంది. ఈ శబ్దారావంలోకి అడుగుపెడితే మాత్రం రకరకాల భావనలు కలిగించే శబ్దాలు మార్మోగుతుంటాయి. అవి కొంతసేపు మాత్రమే. అసలైన ప్రమాదం ముందున్నది. నిషాదం మొదలయ్యిందంటే ముందు ఏడుపొస్తుంది ఆ తర్వాత బాధ ఆ తర్వాత మనో వ్యథ ఆ తర్వాత బలహీనపడిపోయి అనంతమైన విషాదంలోకి మనల్ని ఎవరో నెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. నిషాదం అనగా ఏనుగు ఘీంకారం. ఆ తర్వాత గాంధార, మధ్యమ, రిషభ, దైవత రాగాలు మొదలవుతాయి. వీటిని ఉపయోగించి ఏమైనా చెయ్యొచ్చు. అంతటి శక్తి కలిగిన సంగీతం ఉంది వీటిలో. బాధనే ఆయుధంగా చేసుకున్న ఈ శబ్దారావంలోకి ఏ బాధ లేకుండా అడుగు పెట్టాడు విక్రమసింహుడు. అన్నీ క్షణికాలే అన్న స్పృహతో ఎల్లప్పుడూ బతికే వాడు, దాన్ని బలంగా నమ్మేవాడు నిజమైన యోధుడు. ఒక యోధుడు భావోద్వేగాలకు లోనవ్వడు. వాటికి అతీతమైన వాడే. ఎన్నో దాటొచ్చిన వాడు. ఈ ధైర్యంతోనే విక్రమసింహుడు కదిలాడు.
సింహాలు కదిలాయి.
శబ్దారావం దాటేసరికి విక్రమసింహుడికి కన్నీళ్లు వచ్చేసాయి. బాధతో కడుపులో మెలి తిప్పినట్టయ్యింది. గతంలోని బాధంతా బయటికొచ్చేసింది. ఓడిపోయానేమోనని ఆగిపోయాడు అక్కడే.
సమవర్తి ప్రత్యక్షం అయ్యాడు. తలదించుకున్న విక్రమసింహుడి వైపు చూస్తూ ఇలా మాట్లాడాడు.
"బాధనెప్పుడూ జయించలేవు విక్రమా...బాధ అనేది ఎప్పుడూ మనతో ఉండిపోయే గాయమే.
కాలం మాత్రమే ఆ బాధను తీసివెయ్యగలదు. మన చేతుల్లో లేనిదది. నీ బాధకు కాలమే పరిష్కారం చూపిస్తుంది. నువ్వు ఓటమి అని దేన్నైతే అనుకుంటున్నావో అది నీలో ఉన్న బాధ మాత్రమే. బాధ కలగటం ఎప్పుడూ ఓటమి కాదు. అసలు ఓటమి అన్నదే నీకు కలగకపోతే అప్పుడు నిజంగా బాధపడాలి. ఎందుకంటే ఈ అనంత విశ్వంలో ఓడిపోకుండా గెలిచిన యోధుడే లేడు. ఓటమి లేదంటే గెలుపు లేనట్టే", అనేసి అంతర్ధానం అయిపోయాడు.
జటిలలో మూసివున్న సింహ ద్వారం తెరుచుకుంది.
అంకిత, సంజయ్ అలెర్ట్ అయ్యారు.
-------------------------------------------------------------
"విక్రమసింహుడు గెలిచాడు. తురగము పై మెరుపులు మెరిపించటానికి వస్తున్నాడు.
తురగ ప్రాకారానికి సమాయత్తం కండి. విక్రమసింహుడి అశ్వహృదయ విద్య చూద్దురు గాని. నలుడు నేర్పిన విద్య", అంటూ మందహాసం చేస్తూ ముందుకు కదిలాడు రుద్రసముద్భవ.
విక్రమసింహుడే అభిజిత్ అని తెలియక తికమక పడ్డారు అంకిత, సంజయ్ లు.
------------------------------------------------------------
శంభల రాజ్యం – 5
తురగ ప్రాకారానికి పయనం
విక్రమసింహుడు సింహద్వారం దగ్గరకు వచ్చాడు. అంకిత, సంజయ్ అతన్ని విచిత్రంగా చూస్తున్నారు.
"అభిజిత్..." అని కాసేపు పాజ్ ఇచ్చింది అంకిత.
విక్రమసింహుడి వైపు నుండి ఏ స్పందన లేదు.
రుద్రసముద్భవ, "విక్రమసింహా నీ కోసం అనిలుడు ఎదురుచూస్తున్నాడు" అనగానే అక్కడున్న సింహద్వారం నుండి బలంగా గాలి వీచింది ఎవరో అటుగా వస్తున్నట్టు.
భూలోకంలో అంకిత, సంజయ్ లు అంతక ముందు గుర్రపు డెక్కల చప్పుడును ఎన్నో సార్లు విని ఉన్నారు. కానీ ఇప్పుడొచ్చేది శబ్దమో, చప్పుడో కాదు. హోరు. హోరెత్తిస్తూ వచ్చే అనిలుడు. తురగ ప్రాకారంలోని అశ్వమే ఈ అనిలుడు. అనిలుడికి విక్రమసింహుడు వస్తాడని తెలుసు. తనను అధిరోహిస్తాడనీ తెలుసు. అది తన స్వామి భక్తికి నిదర్శనం. తన ఉనికికి దర్పణం. నల్లటి చీకటిలో నుండి తెల్లటి ధూపము ఏదో వస్తోంది. ఆ సింహద్వారం నుండి తురగ ప్రాకారం కనిపించట్లేదు కానీ అనిలుడి రాకను తెలియజేసేలా ఈ ధూపము చీకటిని చీల్చుకుంటూ వస్తోంది.
తనను సమీపిస్తున్న కొద్దీ అనిలుడి శ్వాసను కూడా వినగలుగుతున్నాడు విక్రమసింహుడు. అంకిత, సంజయ్ లకు గుండెలు అదిరిపోతున్నాయి. అంతలోనే సింహద్వారం పైన నుండి డంకా మోగటం మొదలైంది.
"అనిలుడి రాకకు సూచన", అన్నాడు రుద్రసముద్భవ.
సింహద్వారం దాకా వచ్చిన అనిలుడు ఆగిపోయాడేమో అన్నట్టు అప్పటి దాకా ఉన్న ఆ తెల్లటి ధూపం ఆగిపోయింది. అంతా చీకటే అన్నట్టుంది ఇప్పుడు. సింహద్వారం ఆవల అంతా చీకటి సముద్రమేమో అన్న భ్రమను కలిగిస్తోంది. సరిగ్గా అప్పుడే రెండు కళ్ళు విక్రమసింహుడిని చూస్తున్నట్టు మెరిసాయి.
ఆ చిక్కటి చీకట్లో తళుక్కున మెరిసిన కళ్ళను చూసేసరికి అంకిత, సంజయ్ లకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
విక్రమసింహుడే అని తెలిసిందో ఏమో కుడి కాలు పెట్టి సింహద్వారానికి ఈవలననున్న జటిలలోకి ఇలా అడుగుపెట్టిందో లేదో పెద్ద ఉరుము ఒకటి ఇటు పడ్డట్టు అక్కడ ఒకటే మోత. ఒక కాంతి పుంజమేదో అక్కడ వెలిసినట్టు ఎంతో వెలుగు. ఆ వెలుగు ఎప్పుడాగిపోతుందా అన్నట్టు నొప్పెడుతున్న కళ్ళతో చూస్తున్నారు అంకిత, సంజయ్ లు.
అంతలో అక్కడ అనిలుడు ప్రత్యక్షం అయ్యాడు. తెల్లటి మేనిఛాయ. ఆ విగ్రహం చూస్తే అది మామూలు లాకలూకాయలు నడిపే అశ్వం కాదని ఎవరికైనా ఇట్టే అర్థం అయిపోతుంది. దేవతా మూర్తిలా అనిపిస్తుంది. ఆ ఎత్తే ఏడు అడుగులు పైన ఉంటుందేమో.
అనిలుడి చూపులు అక్కడున్న విక్రమసింహుడి మీద తప్ప ఎవ్వరి మీద పడటం లేదు. విధేయుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే మనం అనిలుడినే చూపించాలి. కొంత మందిని చూస్తే చాలు మళ్ళీ ప్రత్యేకించి వారి గుణగణాలని విడమరచి చెప్పఖ్ఖర్లేదు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్న దేవతా అశ్వం ఈ అనిలుడు. మెల్లగా అడుగులో అడుగు వేస్తూ విక్రమసింహుడి దగ్గరికొచ్చి నిలబడ్డ అనిలుడు తల వంచి రెండు కన్నీటి బొట్లను కార్చాడు. అవి సరిగ్గా విక్రమసింహుడి పాదాల్ని తడిపాయి. తన రాజుకు ఆ క్షణానే జరిగిన అభిషేకం అది. విక్రమసింహుడేమైనా తక్కువా !
ముంచుకొస్తున్న సంద్రాన్ని ఆపగలమా అలాంటి కన్నీటిని ఆపే ధైర్యం విక్రమసింహుడికి కూడా లేదు. ఆ కన్నీరు నిండిన మొహంతో తన రెండు చేతులతో అనిలుడి తల పట్టుకుని కళ్ళు మూసి కన్నీటిని మాత్రం చెంపల కిందకు జారవిడిచారు ఇద్దరూ. ఆ దృశ్యాన్ని చూస్తున్న రుద్రసముద్భవ కూడా తన కన్నీటిని ఆపుకోలేకపోయాడు. అంకిత, సంజయ్ లకు ఇదంతా అర్థం కాకపోయినా ఏదో అంతుబట్టని బలమైన కారణం చేత కన్నీరొచ్చేసింది. అలా ఉంది అక్కడి పరిస్థితి.
లోకాల్ని చుట్టే అశ్వమా
శంభల రాజ్య మకుటమా
అనిలా
అందుకో ఈ రుద్రసముద్భవుని వందనాలు అంటూ రుద్రసముద్భవుడు నమస్కారం చేసాడు.
ఎరుకగలిగినట్టు అనిలుడు తల ఊపాడు. ఆనందంగా రుద్రసముద్భవ తల ఆడించాడు.
చాకచక్యంగా అనిలుడిని అధిరోహిస్తున్న విక్రమసింహుడిని చూస్తూ విస్తుపోతున్నారు అంకిత, సంజయ్ లు.
వాళ్ళు చూస్తూ ఉండగానే వాయువేగంతో జటిల దాటేసి తురగ ప్రాకారం వెళ్ళిపోయాడు విక్రమసింహుడు అనిలుడితో.
అక్కడున్న ధూళి కొంత పైకెగసింది. రుద్రసముద్భవకు ఏదో గుర్తొచ్చినట్టు గట్టిగా నవ్వాడు.
"పదండి వెళదాం", అంటూ రుద్రసముద్భవ అంకిత, సంజయ్ లను చూస్తూ అన్నాడు.
ఇప్పటికీ సింహద్వారం ఆవల మొత్తం చిక్కటి చీకటితో దారే కనిపించకుండా ఉంటే ఎలా వెళ్ళాలిరా దేవుడా అని భయపడుతూ బిక్కుబిక్కు మంటున్న అంకిత, సంజయ్ లను తీసుకుని రుద్రసముద్భవ జటిల దాటాడు.
---------------------------------------------------------
శంభల రాజ్యం – 6
విక్రమసింహుడి అంతర్మథనం
రుద్రసముద్భవ నేతృత్వంలో జటిల నుండి అనంతమైన చీకటి సముద్రంలోకి దూకేశారు అంకిత, సంజయ్ లు. తురగ ప్రాకారం మొత్తం ఇంకా చీకటిమయంగానే ఉంది.
అడుగులు అయితే పడుతున్నాయి గానీ ఎటు వెళుతున్నారో తెలియట్లేదు అంకిత, సంజయ్ లకు.
"అంతా చీకటిగానే ఉంది స్వామి", అన్నాడు సంజయ్.
"అది చీకటి కాదు. మీ కంటికి కనిపించని వెలుగు. విక్రమసింహుడి పరాక్రమాన్ని చూసిన ఈ ప్రాకారంలో ఆ శౌర్యం చూడని కన్నులు మీవి. మీకు అలాగే ఉంటుంది. అందులో మీ తప్పేం లేదు. ఈ ప్రాకార చరిత్రని తెలియజేసే గమన వాహిని ఇక్కడొకటి ఉండాలి. దానికోసమే వెతుకుతున్నాను."
అంతలో అక్కడొక సుడిగాడ్పు వీచింది. అదేదో శక్తి అనిపించేలా వీళ్ళ చుట్టూతా తిరుగుతోంది. వీళ్ళకేదో చెప్పాలి అనుకుంటుందేమో అన్నట్టుంది. అలా ఒక ఐదు నిమిషాల పాటు సాగింది. రుద్ర సముద్భవ కాళ్ళ దగ్గర ఆగిపోయిన ఆ పెనుగాలి చివరికి వెళుతూ వెళుతూ గమన వాహినిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది.
"ఇదే మనకు కావలసిన గమన వాహిని. మీకీ ప్రాకారాన్ని చూపించి దిశానిర్దేశం చేసేది ఇదే", అంటూ తన రెండు చేతులతో ఆ గమన వాహినిని తీసుకున్నాడు.
అది పైకి చూడటానికి ఒక బంగారం దాచే పెట్టెలా ఉంది. బయటికి మెరిసిపోతూ ఉంది. రుద్రసముద్భవ ఆ గమన వాహినిని తెరిచాడు. తెరవగానే ఆ గమన వాహిని లో నుండి వెలుగులు విరజిమ్ముతూ ఆ తురగ ప్రాకార ఆవిష్కరణ వాళ్ళ కళ్ళ ముందే జరుగుతుందేమోనన్నట్టు ఒక దాని వెంట మరొకటి ఆ ప్రాకారంలో జరిగిన విశేషాలన్నీ వారి ఎదుటే తెర మీద కనిపించే బొమ్మలలా కదిలిపోతూ ఉన్నాయి. ఇదంతా చూస్తూ అంకిత, సంజయ్ లు ఆశ్చర్యపోయారు.
అంతలో ఆ గమన వాహిని నుండి ఒక స్వరం వినిపించింది. చాలా గాంభీర్యం నిండిన స్వరమది.
"కాలగమనంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని మాత్రమే ఎప్పటికీ చిరస్థాయిలో గుర్తుండిపోతాయి. అదేదో నిన్నే జరిగిందేమోనన్నట్టు మిగిలిపోతాయి. అలాంటి అశ్వహృదయ విద్యా ప్రదర్శన ఈ శంభల రాజ్యంలోని తురగ ప్రాకారంలో మాత్రమే జరిగింది. ఎందరో యోధులు పాల్గొన్నారు. విక్రమసింహుడు జయించి ఓడిన చోటిది. ఒక గొప్ప యోధుడు గెలిచి ఓటమితో వెనుదిరిగిన చరిత్ర ఇది. అందుకే ఈ చరిత్ర మీకు భౌమ్యభూమిక నందు కనబడదు. ఈ ప్రాకారం ఒక యుద్ధభూమిక. ఆ భూమికలోకి మీరు అడుగుపెడితే కానీ ఈ చరిత్ర మీకు కనబడదు. ఆ భూమిక మీకు పూర్తిగా కనబడాలంటే రుద్రసముద్భవ వేసే మంత్రంతో మాత్రమే అది సాధ్యపడుతుంది", అంటూ అంతటితో ఆ స్వరం ఆగిపోయింది.
"స్వామీ, ఈ గమన వాహిని నుండి వెలువడిన ఈ కంఠం ఎవరిది?" అడిగాడు సంజయ్.
"గమన వాహిని ఒక సేన. ఆ సేనాధిపతి స్వరమే మీరు విన్నది", అన్నాడు రుద్రసముద్భవ.
"కాలం ఒక నిరంతర సంగ్రామం. ఆ సంగ్రామంలో ఎప్పటికప్పుడు గెలుస్తూ మన గొప్ప చరిత్రను కాపుడుతూ మనకందించే సైన్యమే ఈ గమన వాహిని. సత్యం, అసత్యం అనే రెండు వర్గాల మధ్య జరిగే పోరు. కాలం అనే యుద్ధభూమిలో తలపడినప్పుడు మీకు వినబడే స్వరం ఇది", అంటూ గర్వంగా గమన వాహిని వైపు చూసాడు రుద్రసముద్భవ.
అప్పుడు ఒక యోధుడి ఆకారంలో గమన వాహిని సైన్యాధిపతి రుద్రసముద్భవకు నమస్కరిస్తూ కనిపించాడు. ఒక్క నిమిషం గగ్గుర్పాటుకు గురయ్యారు అంకిత, సంజయ్ లు.
"భౌమ్య భూమిక అంటే ఏంటి స్వామి?" అని అడిగింది అంకిత.
"భూమి నుండి వచ్చిన మీ చూపుకు అందే భూమిక. అంటే భూలోక ప్రదేశంలా కనబడే చోటు. అలాంటి భౌమ్యభూమిక లు కానివి మీకు కనబడవు. అంతా చీకటి మయంలా అనిపిస్తుంది. అందుకే ప్రస్తుతం మీ చుట్టూ పెను చీకటి నిండి ఉంది", అన్నాడు రుద్రసముద్భవ.
"నేనిప్పుడు మనసులో ఒక మంత్రం స్మరిస్తాను. అలా అనుకోగానే మీ చుట్టూ ఉన్న చీకటి మాయమైపోయి మీకీ ప్రాకారం అసలు స్వరూపం కళ్లముందుంటుంది. అప్పుడు ఎంతో వేగంగా అనిలుడితో వస్తున్న విక్రమసింహుడు మీకు కనిపిస్తాడు. భయపడకండి. అశ్వహృదయ విద్యలో ఆరితేరిన వాడతను. అతని గమన వేగానికి దేవతలు సైతం ఆశ్చర్యపోయారు. మీరు తప్పకుండా భయపడతారు. అందుకే ముందుగానే హెచ్చరిస్తున్నాను", అనేసి మంత్రాన్ని మనసులో మననం చేసుకోవటానికి రెండు కన్నులు మూసి ఏదో స్మరించటం మొదలు పెట్టాడు రుద్రసముద్భవ.
మెల్లగా ఒక పక్క నుండి చీకటి తొలగిపోతూ వస్తోంది. చీకటి చెదరిపోతోందేమో అన్నంత వేగంతో అనిలుడిపై వస్తున్నాడు విక్రమసింహుడు.
అనిలుడి పరుగుతో పోటీ పడే సత్తా లేక చీకటి అమాంతం ఎగిరిపోయింది. ఆ ప్రాకారంలో మొట్టమొదటగా వారికి త్రివిక్రమ స్వరూపంలో ధీరత్వానికి ప్రతీకగా కనిపించింది అనిలుడిపై నున్న విక్రమసింహుడే. అలా మెరిసాడో లేదో అలా మాయమైపోతున్నాడు. అంతటి గమన వేగం అనిలుడిది. అలుపు లేని పరుగు. అదుపు లేని పరుగు. మెరుపు లాంటి పరుగు. మరువలేని పరుగు. అలా వెళ్ళిపోతున్న అనిలుడినీ, విక్రమసింహుడినీ చూస్తూ చూస్తూ అలా ఒకసారి ఆ ప్రాకారాన్ని చూసేసరికి అది ఎంత పెద్ద యుద్ధభూమో అర్థం అయ్యిండప్పుడు. లోకాలన్నీ పరుచుకున్నంత పెద్దగా ఉందది. అలా ఎలా నిర్మించారో అంతుబట్టడం లేదు. ఒక్కటి మాత్రం నిజం. అదొక పద్మ వ్యూహం లాంటిది. అక్కడి నుండి బయటపడటానికి గెలుపు తప్ప వేరొక మార్గం లేదు. బరిలో ఎవ్వరూ లేనప్పుడే ఇంత దడ పుట్టిస్తోందంటే అంత మంది యోధుల ముందు విక్రమసింహుడు తన పరాక్రమాన్ని ఎలా చూపించాడా, ఎలా గెలిచాడా అని అంకిత ఆశ్చర్యపోయి చూస్తోంది.
విక్రమసింహుడు అలా అనిలుడిపై స్వారీ చేస్తూ ఎంత సేపు పరిగెట్టాడో తెలీదు.
విక్రమసింహుణ్ణి తదేకంగా అలా చూస్తున్న అంకిత, సంజయ్ లకు వారి కళ్ళ ముందే విక్రమసింహుడి చరిత్ర పరుచుకుంటోంది. తురగ ప్రాకారంలోని విక్రమసింహుడి చరిత్ర కళ్ళ ముందే ఆవిష్కృతం అయ్యే సమయం ఆసన్నమయింది. అదేంటో తెలుసుకుందామనే ఆదుర్దా ఘడియ, ఘడియకూ రెట్టింపు అవుతోంది అంకితలో.

శంభల రాజ్యం – 7
తురగ ప్రాకార చరిత్ర
తురగ ప్రాకారం చరిత్ర అంకిత, సంజయ్ ల కళ్ళ ఎదుటే ప్రారంభమయ్యింది.
శంభల రాజ్యంలో ఈ ప్రాకారం ఏర్పడక మునుపు 108 పర్వత శ్రేణులుండేవి. ఆ పర్వత శ్రేణులు ఒక్కొక్కటీ ఒక్కో శక్తి రూపానికి ప్రతీకగా శంభలలో చూసేవారు. ప్రతీ పర్వతమునందు ఒక చిద్గుహ ఉండేది. చిత్ అంటే తెలివి. చిదానందం అంటే జ్ఞానంలోనే ఆనందాన్ని పొందేవాడు అని అర్థం. చిద్గుహ అనగా జ్ఞానాన్ని ఇచ్చే క్షేత్రం లాంటిదన్నమాట. అంతవరకు శంభలలో ఆ 108 చిద్గుహలనూ సందర్శించినవారెవ్వరూ లేరు. అలా వెళ్ళటం కూడా శంభల రాజ్య నిబంధనలకు విరుద్ధం. ఒకే ఒక్క సందర్భంలో మాత్రమే శంభల రాజు అంగీకారంతో ఆ చిద్గుహలలో అడుగు పెట్టవచ్చు. అలాంటి సందర్భం రావటం కోసమే ఎదురుచూసేవాడు జజీరా.
జజీరా విక్రమసింహుడికి ప్రతీ విషయంలో సమవుజ్జీని అనుకుంటూ ఉండేవాడు.
శంభల రాజ్యంలోని యోధులలో జజీరాది ఒక విలక్షణమైన ఘట్టం. శంభల రాజ్యంలోనే పుట్టిన యోధుడు విక్రమసింహుడైతే ఐదు జన్మల తరువాత ఒక ద్వీపంలో పుట్టిన యోధుడు జజీరా. ఆ ద్వీపం పేరు శాంకరి. భూమిపై ఉన్న ఆ ద్వీపాన్ని జజీరా అని బాహ్య ప్రపంచంలో పిలుస్తారు. ఆ ద్వీపంపై ఎంతో మంది మనుషులు జన్మించినా ఎవ్వరికీ మాటలు రాలేదు. మామూలు మనుషులలానే అన్ని పనులూ చేస్తారు కానీ వారి కుటుంబాలలో జన్మించిన వారికి మాట్లాడే యోగాన్ని మాత్రం ఆ దేవుడు ఇవ్వలేదు. అలాంటి సమయంలో పుట్టినవాడే ఈ జజీరా. అతను జన్మించిన తరువాత అతనికి పేరు పెట్టేవాళ్ళు ఎవ్వరూ లేకపోవటంతో యవ్వన దశ వరకూ ఏ పేరూ లేకుండానే ఆ ద్వీపంలో బతికాడు అతను. ఇతని వల్లే ఆ ద్వీపం ఒకటుంది అన్న విషయం ప్రపంచానికి తెలిసొచ్చింది. ఒక అరబ్ ప్రయాణికుడు ఈ ద్వీపాన్ని కనుగొని జజీరా అనటంతో జజీరా నామధేయంగా స్థిరపడిపోయింది ఇతనికి. ఆ ద్వీపానికున్న శాంకరి అను పేరు పోయి ఇతగాడి వల్లే జజీరా అన్న కొత్త పేరొచ్చింది. ప్రపంచానికి ఈ ద్వీపం జజీరా గా ప్రసిద్ధికెక్కితే శాంకరిలోని వారికి మాత్రం ఇతడే జజీరా అయ్యాడు. శాంకరి ద్వీపంలో నివసించే ఈ జజీరా అమ్మ కోరిక మేరకు తన జీవితాన్ని తృణప్రాయంగా అర్పించి శంభల రాజ్యానికి యోధుడిగా వచ్చేసాడు.
జజీరా అలా శంభలకు యోధుడిగా వెళ్ళటం వలన ఆ శాంకరి ద్వీపంలోని తరువాతి తరం వాళ్లందరికీ మాటలొచ్చేస్తాయి. అలా వారికి శాప విమోచనం కలుగుతుంది. తరువాతి రోజుల్లో ప్రపంచానికి ఆ ద్వీపం పేరు శాంకరిగా వెలుగులోకొస్తుంది. జజీరా అన్న పేరు స్మృతిపథంలో నుండి కనుమరుగైపోతుంది.
శంభల రాజ్యంలోకి అడుగుపెట్టిన క్షణం నుండి జజీరా దృష్టి మొత్తం విక్రమసింహుడి పైనే. ఎందుకంటే శంభల రాజ్యంలో విక్రమసింహుడి గురించే ప్రతీ ఒక్కరూ మాట్లాడుకునేవారు.
విక్రమసింహుడికి అమ్మపైనున్న అమితమైన ప్రేమ, భక్తి గురించి చెప్పుకునేవాళ్ళు. విక్రమసింహుడితో ఏకాంతంగా గడపటానికి శంభల అందగత్తెలు అందరూ వెన్నెల ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవారు. విక్రమసింహుడి శౌర్యం కంటికి ఇంపుగా కనబడే వారి సొంపుగల సోయగాలని చూస్తూ జజీరా ఈర్ష్యపడేవాడు. విక్రమసింహుడికి తను ఎందులోనూ తక్కువ కాదన్న స్వాభిమానం తనని కుదురుగా ఉండనిచ్చేది కాదు. అలాంటి జజీరా వేసిన ఒక ఎత్తుగడ విక్రమసింహుడి జీవితాన్నే శాశ్వతంగా మార్చేసింది. తనకిష్టం ఉన్నా లేకపోయినా ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది.
ఇదంతా చూస్తూ విస్తుపోతున్న అంకిత, సంజయ్ లను రుద్రసముద్భవ ఒక ప్రశ్న వేసాడు.
"జజీరా ఎవరో తెలుసా?" అని అడిగాడు. ఎవరు ? అన్నట్టు సంశయంతో చూసారు వాళ్లిద్దరూ.
"ఇప్పుడు మీ భూలోకాన్ని వణికిస్తున్నాడే ఆ ఘోర కలి. వాడే. ఆ ఘోర కలిది ఇప్పుడు ఏడో జన్మ. వాడి అసలు రూపమే ఈ జజీరా", అన్నాడు ఆగ్రహజ్వాలలతో నిండిన కళ్ళతో చూస్తోన్న రుద్రసముద్భవ.
----------------------------------------------------------------
శంభల రాజ్యం – 8
సింహ దత్తుడి వృత్తాంతము
"విక్రమసింహుడి గురించి తెలుసుకోవాలనే తపన జజీరాలో రోజురోజుకీ పెరుగుతూ పోయింది. విక్రమసింహుడి పుట్టు పూర్వోత్తరాల గురించి విచారించే దాకా వెళ్ళిందది.
విక్రమసింహుడి పుట్టుక గురించి శంభలలో తెలిసింది ఇద్దరికే. ఒకటి నాకు. రెండు శంభల రాజుకు. జజీరాకు తానొక గొప్ప యోధుడిని అని ప్రపంచానికి తెలిసేలా చెయ్యాలనే తహతహ ఎక్కువ అవుతున్న రోజులవి. అందుకు కారణాలు లేకపోలేదు.
శంభలలో జరిగే ఎన్నో పోటీలలో జజీరా ఎప్పటికప్పుడు గెలుస్తూ వచ్చేవాడు. ఆ పోటీలలో విక్రమసింహుడి జాడ కూడా కనబడేది కాదు. ఎవరైనా విక్రమసింహుడి ప్రస్తావన తెస్తే మాత్రం జజీరా తట్టుకోలేకపోయేవాడు. విక్రమసింహుడి పరాక్రమం ఏంటో శంభల చూసింది. జజీరా ఇంకా చూడలేదు.
ఎంత గొప్ప యోధుడికైనా సరే అవతల ఉన్న వాడి సామర్థ్యం పైన చిన్న చూపు ఉండకూడదు. తానే గొప్ప అనే అహం భావం తగదు. ఒక్కసారి ఆ అహం ఆక్రమిస్తే మన చేత ఎంతటి పనినైనా చేయిస్తుంది. సరిగ్గా జజీరా విషయంలో జరిగింది ఇదే", అంటూ చెప్పటం ముగించాడు రుద్ర సముద్భవ.
అప్పుడే అక్కడొక విచిత్రం జరిగింది. అనిలుడి పై స్వారీ చేస్తూ వస్తోన్న విక్రమసింహుడు అంకిత, సంజయ్ ల కంటికి వేరే రూపంలో కనిపించాడు. అనిలుడు కూడా వృద్ధ అశ్వంలా మారిపోయాడు. అసలక్కడ ఏం జరుగుతోందో అంతుబట్టడం లేదు వాళ్లకు. కానీ కళ్ళ ముందే ఏదో చరిత్ర ఆవిష్కృతం అవుతోందని అర్థం అయ్యింది.
"అతనే సింహదత్తుడు. విక్రమసింహుడి తండ్రి", అన్నాడు రుద్రసముద్భవ.
"శంభలలోని ఈ ప్రాకారానికి విచ్చేసిన సింహళ ద్వీప రాజు. సింహళ అనగానే భూలోకంలోని రావణాసురుని లంక అనుకుని పొరబడతారేమో. అది కాదు. ఇందిరా పరిధి అనే గ్రహవాసి. మనది సౌర కుటుంబం. అలాంటి మరొక సౌర కుటుంబంలోని మరొక గ్రహం అది. మానవుల కంటే ఎన్నో వేల రెట్లు శక్తివంతులైన వారు నివసించే గ్రహం అది. అక్కడి నుండి శంభలకు ఎలా వచ్చాడో తెలీదు కానీ ఒక వృద్ధ అశ్వంపై మొట్టమొదటి సారి ప్రత్యక్షం అయ్యాడు. ఆ అశ్వం పైనే వచ్చాడేమోనని మా ఊహ. ఆ అశ్వాన్ని చూసిన అదృష్టవంతులలో నేనొకడ్ని. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అనిలుడ్ని శంభలకు బహుమతిగా ఇచ్చేసి తన దారిన తాను వెళ్లిపోయిన ధీశాలి సమర. అలాంటి సమర సింహ దత్తుడిని విడిచి వెళుతూ వెళుతూ కంట తడి పెట్టింది. అనిలుడ్ని ఇచ్చేటప్పుడు కూడా నవ్వుతూ ఉన్న సమర తన స్వామి సింహ దత్తుడిని విడిచిపెడుతున్నందుకు బాధపడింది.
సింహ దత్తుడి రాకతో శంభలకు పరాక్రమం పరిచయం అయింది. అంతవరకూ తెలియని యుద్ధ విద్యా మెళకువలెన్నో నేర్పాడు సింహ దత్తుడు. అతనిలో ఎన్నడూ లేశమాత్రమైన గర్వాన్ని నేను చూడలేదు. సింహ దత్తుడిని శంభలలోని విజయకుమారి అనే రాజపుత్రిక ఇష్టపడింది. విజయకుమారి శంభల రాజపుత్రిక. ఆమెకు వివాహం విధి లిఖితం కాదు. అందుకని శంభలలో అంజనము వేసి చూసారు. అప్పుడు అందులో అశ్వం పై వస్తున్న ఒక యోధుడి ఆకారంలో ఉన్న జ్వాల శంభల రాజులకూ, నాకూ ఆ రోజు కనిపించింది. సింహ దత్తుడి రాకను సూచిస్తూ మరెన్నో విషయాలు తెలిసాయి. సింహ దత్తుడి రాకతో విజయకుమారి జాతకం మారిపోయిందని జ్యోతిష్య శాస్త్రం తెలిసిన పండితుడు చెప్పాడు. అందుకే అందరి అంగీకారంతో సింహ దత్తుడితో విజయకుమారి వివాహం లాంఛనంగా జరిగింది.”
సింహ దత్తుడిలా కనిపిస్తోన్న విక్రమసింహుడిని, సమరలా అనిపిస్తోన్న అనిలుడిని చూస్తూ ఇదంతా వింటున్న అంకిత, సంజయ్ లకు ఇదంతా ఎలా సాధ్యం అన్న ప్రశ్న ఉదయించింది.
"మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే చేరాలి కదా. విక్రమసింహుడి పరాక్రమం నేర్చుకుంటే అబ్బిన విద్య కాదు. సింహ దత్తుడు పంచి ఇచ్చిన రక్తం. అనిలుడి స్వామి భక్తి అతని గొప్పతనం కాదు సమర నుండి వస్తోన్న పరంపర.
అందుకే వాళ్ళల్లో వీళ్ళు కనిపిస్తారు. అవి పోలికలు కావు. వారి బలమైన జీవితపు ముద్రలు", అంటూ
"ఎన్ని జన్మలెత్తినా పేరు, రూపం మారతాయేమో కానీ పరాక్రమం ఎక్కడికి పోతుంది?
విక్రమసింహుడు అన్నా...అభిజిత్ అన్నా అది సింహ దత్తుడి రక్తమే. సింహ దత్తుడి సంకల్పమే", అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు రుద్రసముద్భవ.