Update 12
శంభల రాజ్యం – 9
జ్వాలా జిహ్వుడు - భైరవిల పూర్వజన్మ కథ
"సింహదత్తుడు శంభల రాజ్యంలోనే ఉన్నాడా స్వామి?" అడిగింది అంకిత విక్రమసింహుడిలో సింహదత్తుడిని చూసి ఆశ్చర్యపోతూ.
"సింహదత్తుడు విజయకుమారిని వివాహం చేసుకున్న తర్వాత శంభలకే పరిమితం అయిపోయాడు. విక్రమసింహుడు పుట్టిన కొద్ది కాలానికి సింహదత్తుడు తనకున్న శక్తులన్నీ విక్రమసింహుడికి ధారబోసి తన దేహం విడిచివెళ్లిపోయాడు", అనేసి అంతకంటే ఇక చెప్పటం ఇష్టం లేదేమో అన్నట్టు ఆగిపోయాడు రుద్రసముద్భవ.
"ఏమైంది స్వామి?" అడిగాడు సంజయ్.
"సింహదత్తుడిది మామూలు మరణం కాదు. పోరాడుతూ వీరమరణం పొందాడు", అన్నాడు బాధగా రుద్రసముద్భవ.
ఆ వీరగాథను చెప్పాలనిపించి ఇలా చెప్పటం మొదలు పెట్టాడు రుద్రసముద్భవ.
“జ్వాలా జిహ్వుడు అనే ఒక ప్రమాదకరమైన వ్యాళి శంభలలోని అనల ప్రాకారంలో ఉండేవాడు.
భైరవి అనే ఒక భయంకరమైన గరుడపక్షి మేఖల అనే ప్రాకారంలో ఉండేది.
జ్వాలా జిహ్వుడు, భైరవి ఇద్దరికీ పరస్పర వైరం ఉంది. అది ఈనాటిది కాదు.
జ్వాలా జిహ్వుడు పూర్వ జన్మలో ఒక యువరాజు. భైరవి గతజన్మలో అదే రాజ్యంలో ఒక సేవకుని ఇంట్లోని అమ్మాయి. ఆ యువరాజు ఒకనాడు వేటకు తన రాజ్యం నుండి కొన్ని యోజనాల దూరంలో ఉన్న ఝర్ఝరీ అనే అడవికి వేటకు వెళ్ళాడు. ఆ అడవిలో వేటకు వచ్చిన ఎవ్వరైనా సరే ఝర్ఝరీ శబ్దానికి భయభ్రాంతులకు లోనయ్యి దృష్టి నిలపలేక వేటను అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఇది తెలిసే అక్కడికి వచ్చాడు ఆ యువరాజు. వేటకు వెళ్లే ముందు అక్కడున్న సింధు నదీ తీరంలో మంచి నీరు తాగటానికి తన గుర్రం పై నుండి కిందకు దిగాడు. మంచినీరు తాగుతున్నప్పుడే ఆ నీటిలో ఒక అందమైన యువతి ప్రతిబింబం కనిపించింది. యువరాజు అందాన్ని చూస్తూ మైమరచిపోయి అక్కడే నిలబడి ఉన్నది ఆ యువతి. మంచినీరు తాగటం అయిపోయాక తల పైకెత్తి ఆ యువతినే చూస్తూ ఉన్నాడు యువరాజు. ఇద్దరూ అలా కాసేపు ఒకరిని ఒకరు చూసుకున్నారు.
ఆ యువతి మొట్టమొదట ఎవరినైతే చూస్తుందో అతను ఆమె మోహానికి వశం ఐపోతాడని తన జాతకంలో ఉన్నది. ఆ మోహాగ్నిలో రగిలిపోతూ ఎన్నో తప్పులు చేస్తూ విచిత్రమైన జంతు జన్మను పొందుతాడని కూడా జ్యోతిష్యుడు హెచ్చరించాడు. అతను అలా జంతు జన్మను పొందిన వెంటనే ఆ యువతి కూడా పక్షిగా మారిపోతుందని సూచించాడు. అందుకే ఆ రోజు నుండి ఆ యువతిని ఎవ్వరి కంట పడకుండా కాపాడుకుంటూ ఒక ఇంట్లోనే నిర్బంధించి ఉంచారు. కానీ అన్ని రోజులూ ఒకలా ఉండవు కదా. సరిగ్గా యువరాజు వేటకు బయలుదేరిన రోజే ఆ యువతి సింధు నదీ తీరం దాకా వెళ్ళొస్తానని వాళ్ళ నాన్న గారిని అడగటం, యువరాజును చూడటం సంభవించాయి.
ఆ యువరాజు ఆ రోజు రాత్రి ఆ యువతి ఇంట బస చేసాడు. అదొక సేవకుని ఇల్లు అనుకున్నాడు. కానీ ఆ ఇంట్లో కొన్ని గదులు మూసివెయ్యబడి ఉన్నాయి. ఆ యువతి నాన్నకు విషయం మొత్తం అర్థం అయిపోయింది. ఇప్పుడు యువరాజుకు నిజం చెప్పటం ఒక్కటే మార్గం అనుకున్నాడు. భోజనానికి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాడు. అంతలో ఆ యువరాజు ఒక గదిలోకి వెళ్ళాడు. అక్కడున్న వాద్యములని చూసాక అవి ఎలాంటి శబ్దాలు చేస్తాయన్న కుతూహలం పెరిగి ఒక చెయ్యి వేసాడు. విచిత్రంగా తాను రాజ్యంలో చిన్నప్పటి నుండి కథలు కథలుగా వింటూ వచ్చిన ఝర్ఝరీ శబ్దం ప్రతిధ్వనించింది. తన పూర్వీకులు ఎందరో ఈ ఝర్ఝరీ శబ్దం విని హడలిపోయి ప్రాణాలు వదిలారు. వారు ఏదో భయంకరమైన ప్రాణిని అక్కడ చూసారని చెప్పేవారు. అది అంతవరకూ చూడనిది, విననిది అంటూ భయం గొలిపే కథలు చెబుతూ వచ్చారు ఇన్నిరోజులూ. ఆ శబ్దాలు ఇక్కడి నుంచే వస్తున్నాయని తన పూర్వీకులు తెలుసుకోలేకపోయారని అమితంగా బాధపడి కంటతడి పెట్టాడా యువరాజు. తన తాతగారిని, నాన్నగారిని ఎందుకు కోల్పోయాడో ఇప్పుడర్థం అయింది. వెంటనే కళ్ళు ఎర్రబడ్డాయి. కానీ అక్కడ ఆ సమయంలో మాట్లాడటం భావ్యం కాదని మౌనం వహించాడు. ఆ రోజు రాత్రి ఆ యువతితో రతిలో పాల్గొన్నాడు. ప్రేమతో కాదు. ఈ రకమైన ప్రతీకార వాంఛలతో. ఆ ప్రతీకార జ్వాలలు ఆ యువతిని తాకాయి. తెల్లవారగానే ఆ యువరాజు మాయమైపోయాడు. ఆ యువతి నాన్నకు ఆందోళన మొదలైంది.
యువరాజు తన రాజ్యంలో కొంత మంది సైనికులను ఆజ్ఞాపించి ఈ గ్రామానికి పంపించి వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చెయ్యమన్నాడు. అక్కడి ఆడవారిపై కూడా అమానుషంగా ప్రవర్తించారు ఆ సైనికులు. ఇది యువరాజు ఊహించని పరిణామం. దాంతో ఆ యువతి కళ్ళ ఎదుటే ఒక గ్రామం మొత్తం దహించుకుపోయింది. వాళ్ళ నాన్న గారు ఆ యువతి కళ్ళల్లోకి నిరసనగా చూస్తూ ప్రాణాలు వదిలాడు. ఆ యువతి మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎటు వెళ్లిపోయిందో ఎవ్వరికీ తెలియలేదు.
ఆ యువరాజు ఆ రోజు నుండి పిచ్చివాడు అయిపోయాడు. ఆ యువతి గురించి కలలు కంటూ తనతో గడిపిన ఆ రాత్రినే మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకుంటూ మోహాగ్నిలో భస్మం అయిపోతూ పోతున్నాడు. కొన్ని రోజులకు ఆ యువరాజు కూడా ఎవ్వరికీ కనిపించకుండా మాయమైపోయాడు”, అంటూ అమాంతం చెప్పటం ఆపేసాడు రుద్రసముద్భవ.
“అంటే ఆ యువరాజు, ఆ యువతి ఇద్దరూ...."అంటూ నీళ్లు నమిలారు అంకిత, సంజయ్ లు .
"అవును. మీరు ఊహించినది నిక్కమే. ఆ యువరాజు జ్వాలా జిహ్వుడు అయ్యాడు. ఆ యువతి భైరవిగా మారిపోయింది. ఒకరు అనలలో. మరొకరు మేఖలలో. అనంతమైన శక్తి సంపన్నులు. అతి భయంకరులు కూడా. అలాంటి ఈ ఇద్దరి నుండి శంభలను రక్షించిన బలశాలి సింహదత్తుడు. ఆ సింహ దత్తుడి రక్తమే ఈ విక్రమసింహుడు", అంటూ అనిలుడిపై నిరంతరంగా స్వారీ చేస్తూ అలసట అన్నది లేకుండా ఆలోచనలతో పరిగెడుతున్న విక్రమసింహుడిని రుద్రసముద్భవ వారికి చూపిస్తూ గర్వం నిండిన కళ్ళతో ఆ మాటలు చెప్పాడు.
----------------------------------------------------
శంభల రాజ్యం – 10
సింహళ రాజ్య చరిత్ర
తురగ ప్రాకారంలో అనిలుడిపై నిరంతరాయంగా స్వారీ చేస్తోన్న విక్రమసింహుడు అక్కడున్న అంకిత, సంజయ్ ల కళ్ళకు ఒక అద్భుతంలా కనిపిస్తున్నాడు. విక్రమసింహుడిలోని ఏ ఆలోచన మేల్కొందో అర్థం కావట్లేదు వారిరువురికీ. రుద్రసముద్భవ అది గమనించాడు.
"విక్రమసింహుడు అంతలా దేని గురించి ఆలోచిస్తున్నాడా అనుకుంటున్నారా?" అని అడిగాడు.
"అవును స్వామి. తనలో అంతర్మథనం జరుగుతోంది. కన్నీటి చుక్కలు రాలుతూ పక్కకు పడిపోతున్నాయి. మొదట్లో స్వేదం అనుకుని పొరబడ్డాను", అంది అంకిత.
అంకితలోని నిశితమైన పరిశీలనకు ఆశ్చర్యపోయాడు రుద్రసముద్భవ.
"ఒక యోధుడి స్వేదం ఏదో, కన్నీరేదో నీకు తెలిసిపోయిందంటే తురగ ప్రాకార చరిత్రలోని కీలకమైన ఘట్టాలు చెప్పే సమయం ఆసన్నమైనట్టే. సంజయ్, నీ మౌనానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా?" అడిగాడు రుద్రసముద్భవ.
"విక్రమసింహుడి స్వారీ చూస్తూ, తనలోనే వాళ్ళ నాన్న సింహదత్తుడిని చూసుకుంటూ మీరు చెబుతున్న ఒక్కో గాథ వింటూ ఉంటే నా కళ్ళ ముందే అవన్నీ కదలాడుతూ ఉన్నాయి. ఏం చెప్పమంటారు నన్ను?
నా మౌనం నిర్లిప్తత కాదు. ధ్యానం....వీళ్ళ వీరత్వంలో ధ్యానం
నా మౌనం నిస్తేజం కాదు. గానం.....వీళ్ళ శౌర్యంతో గానం
నా మౌనం నిశ్శబ్దం కాదు. పానం.....వీళ్ళ సంకీర్తనా పానం"
అని ఇంకేం మాట్లాడలేకపోయాడు.
సంజయ్ మాటలలోని రుచి రుద్రసముద్భవ మనసును తాకితే, శక్తి గుండెను తాకింది.
సింహదత్తుడి గురించి తాను ఏమేం అనుకునేవాడో సరిగ్గా అవే ఈనాడు సంజయ్ నోటి వెంట వినబడ్డాయి. అందుకు అమితానందం పొందాడు.
"జజీరా విక్రమసింహుడికి ఈ ప్రాకారంలో పెట్టిన విషమ పరీక్ష గురించి మీకు చెప్పబోయే ముందు సింహదత్తుడి గురించి మీరు తెలుసుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ఆయన పూర్తిగా అవగతం కానిదే విక్రమసింహుడు మీకు అర్థం అవ్వడు", అంటూ రుద్రసముద్భవ సింహదత్తుడి జీవితంలోని ప్రముఖమైన ఘట్టాలు చెప్పటం మొదలు పెట్టాడిలా.
అది సింహళ రాజ్యం. శంభల రాజ్యంలోని వరుణ ప్రాకారం ఎక్కడైతే ఉందో కొన్ని కోటానుకోట్ల సంవత్సరాల క్రిందట సరిగ్గా అక్కడే సింహళ రాజ్యం ఉండేదని శంభల శాస్త్రవేత్తలు అంచనా వేశారు. శంభల రాజ్య చరిత్ర గురించి తెలిసిన శాస్త్రజ్ఞులు వీళ్ళు. ఈ సింహళ రాజ్యం అప్పట్లో భూమిపైనే ఉండేది. భౌతికమైన దృష్టికి కనిపిస్తూ ఉండేది. అప్పుడెన్నో రాజ్యాలుండేవి. ఎన్ని రాజ్యాలున్నా సింహళ రాజ్యానిదే పై చేయి. ఎందుకంటే సింహళ రాజ్యం సింహదత్తుడిది. సింహదత్తుడి వంశస్థులు అధికారం కోసం ఎన్నడూ రాజ్యపాలన చేసి ఎరుగరు. వారి రాజ్యంలోని ప్రజలు వారి మంత్రులకంటే తెలివైనవారు. సింహళలోని సివంగికి కూడా నాద తరంగాలు అందేవని ఒక ప్రతీతి. అలాంటి సింహళ రాజ్యంలో ఒకానొక రోజు ఎడతెరపి లేకుండా వర్షం భోరున కురవటం మొదలయింది. సింహళ రాజ్యాన్ని పరిపాలించే సింహదత్తుడు తన పూర్వీకుల అన్వేషణలో ఎక్కడికో వెళ్లాడని మంత్రులు, సైన్యాధిపతులు మాట్లాడుకోవటం మొదలు పెట్టి అప్పటికి ముప్పై మూడు జాములు గడిచినవి. రాను రానూ వర్షం ఎక్కువయ్యిందే గాని తగ్గే సూచనలు మాత్రం ఎక్కడా లేవు.
అలాంటి సమయంలో సింహళలోని ఒక కవి పరుగు పరుగున ఆస్థానానికి వచ్చాడు. మంత్రులు, రాజ్యాధిపతులు తీవ్ర చర్చలలో తలమునకలై ఉండగా ఒక భటుడు అక్కడికొచ్చాడు.
"ప్రభూ, ఈ కవి సార్వభౌముడు మీతో ఏదో విన్నవించుకోవాలని తడుస్తూ ఇంత దూరం వచ్చాడు. అతను ఏం చెబుతాడో మరి", అంటూ భటుడు కవిని ప్రవేశపెట్టి అక్కడి నుండి నిష్క్రమించాడు.
"చెప్పండి మహాశయా ! ప్రజలెవ్వరినీ వారి వారి ఇళ్ల నుండి బయటకు రావద్దని వారి క్షేమం కోరి మేము జారీ చేసిన ఆజ్ఞను సైతం విస్మరించి శ్రమపడి ఇంత దూరం వచ్చారు. చెప్పండి", అన్నారు అక్కడి మంత్రివర్యులు.
"ఇప్పుడు మన రాజ్యంలో కురుస్తున్నది జడివాన కాదు. సింహదత్తుడి కన్నీరు", అన్నాడు ఆ కవి.
ఆస్థానంలోని ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆశ్చర్యం, ఆందోళన వెనువెంటనే భయం ఒకదాని తరువాత ఒకటి ప్రస్ఫుటముగా వెల్లడి అయ్యాయి.
"ఏమిటి మీరనేది? అదెలా సాధ్యం? ఆయనకు అంతగా బాధ కలిగించిన విషయం ఏది?
తెలిసో తెలియకో మనం ఏదైనా పాపం చేశామా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు మంత్రి.
"సింహ దత్తుడు తన పూర్వీకుల చరిత్ర తెలుసుకుంటూ వస్తున్నాడు. వారిలో కొందరు చేసిన పాపాలు సింహాళ రాజ్య చరిత్రలో లేకుండా కనుమరుగు అయినవి అని తెలుసుకున్నాడు. ఆ బాధలోనే చాలా రోజులు గడిపాడు.
ఇప్పుడు ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఆయన మనసంతా మన రాజ్యం పైనే ఉంది. ప్రజల క్షేమం పైనే ఉంది. ఆయన పూర్వీకుల పాపాలు ఎక్కడ మన రాజ్యాన్ని కబళిస్తాయోనని ఆయన పడుతున్న వేదనకు సాక్ష్యం ఈ వర్షం. ఇది ఇప్పట్లో ఆగదు. ఎడతెరపి లేకుండా కనీసం రెండేళ్లయినా పడుతుంది."
ఒక్కసారిగా అంతటా నిశ్శబ్దం ఆవహించింది. సింహళ చరిత్రలో సింహళ రాజులు పాపాలు చెయ్యటమా ! ఇది అసలు నమ్మేలా లేదు. కొన్ని నిజాలు ఎవరు చెప్పినా నమ్మలేం. అలాంటి నిజంలా అనిపించిందిది.
అందరూ తీవ్ర మనోవేదనకు గురి అవ్వటం ఆ కవి శ్రేష్ఠుడు గమనించాడు.
"సింహళ పూర్వ రాజులు కాలబంధనాలలో చిక్కుకుని ఉండటం సింహ దత్తుడు కళ్లారా చూసాడు. వారి శక్తినంతా ధారబోసి ఆ కాలబంధనాలను వారే నిర్మించుకుని వారి పాపాలు మనల్ని తాకకుండా కఠోర దీక్షలో ఉన్నారు. అందుకే మన రాజ్యం ఇన్నాళ్ళూ సుభిక్షంగా ఉంది. ఈ సత్యం తెలుసుకున్న సింహ దత్తుడు మౌనంలోకి వెళ్ళిపోయాడు. అంతా సింహళ ప్రజల తెలివి, సింహళ ప్రభ అనుకునేవాడు. ఈ నిజం ఆయనను చాలా కుదిపేసింది. తన ఉనికి మీదే నమ్మకం కోల్పోయాడు. ఎవరో చేస్తున్న యుద్ధానికి గెలుపు తనది అనుకోవటం మూర్ఖత్వం అనిపించింది. అజ్ఞానం వీడింది. తన పూర్వీకుల పాపాలు ఈ త్యాగాల ముందు వెలవెలబోయాయి. అలాంటి వారిని సింహదత్తుడు కళ్లారా వీక్షిస్తూ ఆయన నోట మాట రాక ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. మన క్షేమం గురించి అనుక్షణం తపన పడే ఆయన కన్నీటి జల్లు ఇలా మన సింహళలో కురుస్తోంది", అని చెప్పటం ముగించాడు ఆ కవి.
------------------------------------------------------
ఆ కవి శ్రేష్ఠుడు సామాన్యమైనవాడు కాదు. అతనికి సింహళ చరిత్ర మొత్తం కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. ఎన్నో కావ్యాల రచన చేసినవాడు. అలాంటి అతని మాట సింహళకు వేదప్రమాణం. ఆయన వర్షం పడుతున్నా సరే తడుస్తూ ఎందుకొచ్చాడో వివరించాడిలా.
"నేను ఈ సమయంలో మీతో ఈ నిజాన్ని పంచుకోకపోతే అటు పిమ్మట మీకు ఇదే విషయాన్ని ఇలాగే చెప్పినా మీరు నమ్మే పరిస్థితిలో ఉండరు", అన్నాడు.
"అదేంటి స్వామి ?" అని ఆశ్చర్యపోతూ అడిగాడు మంత్రి.
"కాలం చేసే మాయ అది. కాలంలో కనుమరుగు ఐపోయినవాళ్లు ఎందరో. మనమెంత? మన ఉనికెంత? అందుకే ముహూర్తం చూసుకుని బయలుదేరాను. మార్గంలో ఎన్నో ఆటంకాలొచ్చాయి. ఎన్నో విషనాగులు కనిపించాయి. నాకు ఏ హానీ తలపెట్టలేదు. కానీ భయపెట్టాయి. అప్పుడు మొదటిసారి అర్థం అయింది. ఏ భయం లేకుండా బ్రతికే నాకు కూడా భయం కలుగుతోంది అంటే రాజ్యంలో మునుముందు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నట్టు రూఢి అయ్యింది ఆ క్షణాన", అన్నాడా కవి.
మంత్రి కళ్ళల్లోని సంశయాన్ని గుర్తించి ఇలా వివరించాడు కవి
"ఒక రాజ్యంలో యోధుడు, కవి మాత్రమే ఏ భయం లేకుండా బ్రతుకుతారు. అలాంటి వారికి భయం కలుగుతోంది అంటే ఆ రాజ్యానికి అపాయమే కదా", అన్నాడు.
ఆ కవి శ్రేష్ఠుడికి పాదాభివందనం చేసుకుని మంత్రి ఆయనతో,
"సింహ దత్తుడు తిరిగొచ్చే లోపు మన కార్యాచరణను మీరే నిర్దేశించండి కవివర్యా!" అంటూ ప్రాధేయపడ్డాడు.
"ఈ వర్షంలో మన రాజ్య ప్రజలందరూ అంటే మనం అందరం బయటికొచ్చి మోకాళ్లపై నిలబడి తడవాల్సిందే. ఇదొక్కటే మార్గం. ఇది తప్ప మరో ఉపాయం కనిపించటం లేదు. సింహ దత్తుడి ఆనందం మన ఆనందం అయినప్పుడు ఆయన బాధ మన బాధ కాదా ?" అంటూ ఎదురు ప్రశ్న వెయ్యటంతో కవి చెప్పదలుచుకున్న విషయం సూటిగా దూసుకెళ్ళిపోయింది యోధుడి బాణంలా.
ఈ వృత్తాంతాన్ని మధ్యలో ఆపి
"అలా రెండేళ్లు ఒక రాజ్య ప్రజలందరూ మోకాళ్ళపై నిలబడి రాజు కన్నీటిలో తడిసిన నేల ఒకప్పటి ఈ సింహళ రాజ్యం....ఇప్పటి మన శంభలలోని వరుణ ప్రాకారం", అంటూ మాటరాని మౌనంలోకి వెళ్ళిపోయాడు రుద్రసముద్భవ.
విక్రమసింహుడి కన్నీటి బొట్టు సూటిగా ఒక బాణంలా అంకిత చెంపను తాకింది. తన వైపుగా దూసుకొస్తున్న ఆ కన్నీటి బిందువులో సింహళలోని ఒకానొక సన్నివేశం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఒక్క నిమిషం గగ్గుర్పాటుకు గురయింది అంకిత. సంజయ్ వైపు తిరిగి చూస్తే అక్కడ సంజయ్ లేడు.
మోకాళ్లపై నిలబడి ఆకాశం వైపు చూస్తూ, "ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ శంభల రాజ్యంలోకి అడుగుపెట్టే అర్హతను నాకిచ్చిన నా పూర్వీకులు ఎంత గొప్పవారో. వారికి నేను చెయ్యగలిగింది ఏమైనా ఉందా !" అంటూ బాధపడ్డాడు.
"ఆదిత్యోపాసన చేసే నీకు పితృదేవతల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి సంజయ్", అన్నాడు రుద్రసముద్భవ.
సంజయ్ ఆశ్చర్యపోతూ రుద్రసముద్భవకు ప్రణామం చేసాడు.
-----------------------------------------------