Update 05
పెంట్ హౌస్ నుంచి బైటికి వచ్చి కిందకి చూస్తుంటే రోడ్డు కాళీగా ఉంది. "ఇంత ప్రశాంతంగా ఉండకూడదే.." అనుకుంటూనే కిందకి వెళ్ళాడు. నూడుల్స్ బండి దెగ్గరికి వెళ్లి కుర్చీలో కూర్చుని చికెన్ నూడుల్స్ చేయించుకుని తింటుంటే మెయిన్ రోడ్ మీద కొత్తగా పెట్టిన చిరంజీవి కటౌట్ చూసాడు. ఖైదీ నెం 150, కింద బాస్ ఈజ్ బ్యాక్ అని ఉంది. అది చూడగానే అమ్మమ్మని తలుచుకున్నాడు. ఫోనులో తేదీ చూసుకుంటే రేపు అమ్మమ్మ వర్ధంతి అని గుర్తొచ్చింది. తిన్నాక డబ్బులు ఇచ్చేసి నేరుగా బస్సు ఎక్కాడు. అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసాడు.
ట్రైన్ ఎక్కితే కాళీ దొరకలేదు, పైన సీటు ఉంటే ఎక్కి కూర్చున్నాడు. కిందకి చూస్తే ఒక బాబు తననే చూసి నవ్వుతున్నాడు, తిరిగి నవ్వాడు చిన్నా. అది వాళ్ళ అమ్మ చూసింది. ఆమె వైపు చూసాడు, నలభై కిందే ఉంటుందేమో ఆమె వయసు, మొహంలో నవ్వు లేదు, ఇందాకే ఏడ్చినట్టు ఉంది తన మొహం. ఆమె భుజం మీద గిచ్చాడు ఆమె పక్కనే కూర్చున్న వాడు. అల్లరి చేస్తున్నాడా అనిపించింది, ఇంతలో బాబు, వెళుతున్న సమోసాల వాడి వంక చూసి "డాడీ సమోసా" అనేసరికి చిన్నా ఏమి అనలేక కూర్చున్నాడు. ప్రయాణం అంతా ఆమెని గిచ్చుతు కొడుతూ అరుస్తూనె ఉన్నాడు, ఆమె కన్నీళ్లు పెట్టుకుంది తప్పితే ఒక్కమాట కూడా ఎదురు చెప్పలేదు. ఆఖరికి పక్కన కూర్చున్న వాళ్ళు కూడా ఎందుకలా ఏడిపిస్తున్నావని కోప్పడబోతే వాళ్ళతో కయ్యం పెట్టుకున్నాడు. "ఛీ.. ఎక్కడికెళ్లినా ప్రశాంతత లేదు"
మూడు స్టేషన్ల తరువాత వాళ్ళు దిగిపోయారు, బాబు నా వంక చూసి బాయ్ చెపితే చెయ్యి ఊపాను, ఆమె వెళుతు నన్ను చూసి వెళ్ళిపోయింది.
xxx xxx
అక్షిత : ఒసేయి రేపు మేము ఊరెళుతున్నాం
శృతి : ఎక్కడికి ?
అక్షిత : అమ్మమ్మ వాళ్ళ ఊరికి, ఆమె చనిపోయి రేపటితొ ఏడేళ్లు. అందరం కలుస్తున్నాం.
శృతి : ఓహ్.. ఎప్పుడొస్తారు మళ్ళీ ?
అక్షిత : అయిపోగానే బైలుదేరడమే
శృతి : అవును మీ తమ్ముడు లేడా, మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు కాళీగా ఉంది రూము
అక్షిత : వాడెప్పుడో వెళ్ళిపోయాడు
శృతి : అవునా ఎప్పుడు ?
అక్షిత : ఇప్పుడెక్కడ వెళ్ళిపోయి నాలుగు నెలలు అవుతుంది
శృతి : అవునా.. అంటే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడా.. ఎక్కడికి ?
అక్షిత : ఏమో.. వెళ్ళిపోయాడు.. ఎక్కడికో తెలీదు
శృతి : అయ్యో.. మరి ఎలా.. మీరు వెతకలేదా ?
అక్షిత : ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతావ్ అని అడిగించింది మా అమ్మ నాన్నతో.. ఇక మళ్ళీ వాడి కోసం వెతకడం కూడానా అని నవ్వింది.
శృతి : అదేంటే.. మతి స్తిమితం లేకుండా ఎవర్నో చంపి జైలుకి వెళ్లిన వాడిని మీరు అలా ఎలా వదిలేసారు. ఎక్కడ ఉంటాడు, ఏం తింటాడు, ఎవర్నైనా ఏమైనా చేసుంటే..? తనని ఎవరైనా ఏమైనా చేసుంటే
అక్షిత మొహంలో నవ్వు ఆగిపోయింది
అక్షిత : ఏమో..
శృతి : చిన్న వాడు కదే.. కనీసం ఎవరికైనా అప్పగించాల్సింది కదా.. ఏం ఆలోచిస్తారు అంకుల్ ఆంటీ వాళ్ళు అస్సలు, నేనందుకే మీ ఇంటికి రాను సరిగ్గా
అక్షిత : వాడేమి చిన్న వాడు కాదు, నేను పుట్టిన తెల్లారి పుట్టాడు
శృతి : అదెలా అయినా మనమెమైనా పెద్ద వాళ్ళమా
అక్షిత : వాడికి లోపల పేగు చుట్టుకుంది, నేను పుట్టిన ఇరవై నాలుగు గంటల తరువాత ఆపరేషన్ చేసి బైటికి తీసారని గుర్తు
శృతి : గుర్తా..! మీ తమ్ముడి పేరేంటి, అదైనా గుర్తుందా ?
అక్షిత తెల్ల మొహం వేసింది
శృతి : ఏమైందే..?
అక్షిత : వాడి పేరు..
శృతి : హా..!
అక్షిత : నాకు గుర్తులేదు
శృతి : మీరేం మనుషులే.. వాళ్ళ కంటే నువ్వు ఇంకా వరస్ట్ గా ఉన్నావ్. నీతొ పాటు పుట్టిన వాడి పేరు గుర్తులేదా !
అక్షిత : గుర్తులేక కాదు, అస్సలు తెలీదు. నేనెప్పుడూ వాడితో గడపలేదే. వాడు మా దెగ్గర లేడు.
శృతి : కవర్ చేస్తున్నావా ?
అక్షిత : కాదే నిజంగా.. వాడు పుట్టినప్పటి నుంచి అమ్మమ్మ దెగ్గరే ఉన్నాడు. అక్కడే పెరిగాడు. మా అమ్మమ్మ పోయాక వాడికి మెంటల్ అని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడే ఎవర్నో చంపేస్తే ట్రీట్మెంట్ కం జువైనల్లో వేశారు.
శృతి : కనీసం వాడిని చూడటానికి కూడా వెళ్లలేదా ?
అక్షిత : లేదు.. వాడిని అమ్మ వాళ్ళు వదిలేసుకున్నారు. అందుకే వాడు ఇంట్లో నుంచి వెళ్లిపోయినా మేమెవ్వరం అంత రియాక్ట్ అవ్వలేదు. మాకు వాడితో బాండ్ లేదు.
శృతి : మీ ముగ్గురికి దణ్ణం పెట్టాలి. ఇలా కూడా ఉంటారా మనుషులు. నాకెందుకు ఎప్పుడు చెప్పలేదు ?
అక్షిత : నాకే గుర్తులేవు ఇవన్నీ.. మొన్న వాడు వెళ్ళిపోయాక అమ్మా నాన్న మాట్లాడుకుంటుంటే విన్నా ఇవన్నీ
"ఏమోలే.. మీ ఇష్టం.. " అనేసింది శృతి కానీ తను చూసిన చూపు అక్షితకి ఎక్కడో గుచ్చుకుంది. లేచి ఇంటికి వచ్చేసింది అక్షిత.
అక్షిత : అమ్మా వాడి పేరేంటి ?
భారతి : ఎవరు ?
అక్షిత : తమ్ముడి పేరేంటి ?
భారతి : ఏ తమ్ముడు ? వింతగా చూసింది
అక్షిత : నాతో పాటు కన్నావ్ కదే.. ఆ తమ్ముడు
భారతి : ఇప్పుడు వాడి గురించి ఎందుకే
అక్షిత : చెప్పు వాడి పేరేంటి ?
భారతి : చిరంజీవి.. మీ అమ్మమ్మకి చిరంజీవి అంటే పిచ్చిలే
అక్షిత : ఓహ్.. అనుకుంటూ తన రూములోకి వచ్చేసింది.
xxx xxx
ట్రైను దిగి ఊళ్ళోకి నడుస్తూ టిఫిన్ సెంటర్ కనిపించగానే లోపలికి వెళ్లి ఇడ్లీ తిన్నాడు. ఆటో వచ్చినా ఎక్కకుండా నడుస్తుంటే కనపడింది సీతామాలక్ష్మి థియేటర్.
అమ్మమ్మతొ కలిసి ఎన్నో సినిమాలు చూసాను, చిరంజీవిని చూడటానికి వారానికి రెండు సార్లు తీసుకొచ్చేది ఈ థియేటర్కి. గేటు లోపలికి వెళ్లి టికెట్ తీసుకుని హాల్లోకి వెళ్లాను, ఏదో సినిమా నడుస్తుంది. అప్పటికి ఇప్పటికి ఏ మార్పు లేదు, అవే డొక్కు సీట్లు. నేను అమ్మమ్మ బాల్కనీలో కూర్చునే వాళ్ళం, నాకు విజిల్ వెయ్యడం నేర్పింది కూడా అమ్మమ్మె.. ఎవ్వరు లేకపోతే పాట వచ్చినప్పుడు నేను అమ్మమ్మా డాన్స్ వేసే వాళ్ళం. గుర్తుకురాగానే నవ్వొచ్చింది.
బైటికి వచ్చేసాను, నడుస్తుంటే రామాలయం కనిపించింది. లోపలికి వెళ్లాను. మధ్యలో అరుగు ఉండేది, ఇప్పుడేదో మండపం కట్టారు ఇక్కడ. ప్రతీ రోజు రాత్రి మైకు పెట్టి భజన చేసే వాళ్ళు, గుంత గిన్నెలో అన్నం కలుపుకుని నన్ను ఎత్తుకుని వచ్చి ఇక్కడ కూర్చునేది. హరే రామ హరే రామ.. భజన నాకింకా గుర్తుంది. భజన అయిపోయాక పెద్ద వాళ్ళు వెళ్లిపోయేవారు, ఆడ పిల్లలు మైకు తీసుకుని పాటలు పాడుతుంటే, అక్కలని చూస్తూ అన్నం పూర్తిగా తినేసేవాడిని. అప్పట్లో రిలీజ్ అయిన ఇప్పటింకా నా వయసు నిండా పదహారే అనే పాట తెగ మొగిపోయేది. వాటి అర్ధం పిల్లలకి తెలీదు కానీ పాడుతుంటే పెద్ద వాళ్ళు నవ్వుకునే వాళ్ళు.
బైటికి వచ్చేసాను. అమ్మమ్మ ఇంటికి వెళ్లాలని అనిపించలేదు, అక్కడ నా మావయ్య ఉంటాడు. అమ్మమ్మ సమాధి దెగ్గరికి నడుస్తున్నాను. స్మశానం దెగ్గరకి నడుస్తుంటే నా మావయ్య కనిపించాడు. చెట్టు వెనక నిలుచున్నాను. కాసేపాగాక వెళ్ళిపోయాడు.
అమ్మమ్మ సమాధి దెగ్గరికి వచ్చి చాలా ఏళ్ళు అయిపోయింది. శుభ్రం చేశారు, మావయ్య పనే.. ఊరికే చూడాలనిపించింది, చూసేసాను. ఇక ఇక్కడ వద్దని వెనక్కి నడుస్తుంటే అమ్మమ్మ ఇల్లు కనిపించింది. గేటు దెగ్గర హడావిడి కనిపిస్తే దెగ్గరికి వెళ్ళాను. అమ్మా నాన్నా అక్క ముగ్గురు లోపలికి వెళుతున్నారు. ఒక గంట అక్కడే కూర్చుంటే ఎవరో ఒకబ్బాయి చికెన్, సామాను, కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు లోపలికి తీసుకెళ్లాడు. అమ్మమ్మ పేరు మీద ఎంజాయి చెయ్యడానికి ఒక రోజు వీళ్ళకి.. నవ్వొచ్చింది. ఇవ్వాల్టి రోజుల్లో అన్నిటికి ఎంజాయి చెయ్యడమే.. సందర్భం అవసరం లేదు. పోను పోను మనిషి చచ్చిన రోజు కూడా ఎంజాయి చేస్తారేమో. స్మశానంలో కార్యక్రమం అయిపోగానే బిర్యానీ వండుకుని తింటారా ?
ఎవరో ఒక అమ్మాయి బైటికి వచ్చి కిరాణ కొట్టు వైపు నడుస్తుంది, లేచి తన దెగ్గరికి వెళ్లాను.
చిన్నా : బద్రి నీకు ఏమవుతాడు ?
"మా నాన్న, ఎవరు నువ్వు.. నిన్నెప్పుడు ఈ ఊర్లో చూడలేదే" అంది అమ్మాయి
ఓహ్.. బద్రి మావయ్య కూతురు, పేరు లహరి. సెలవలకి వచ్చినప్పుడు తనతో ఆడుకునేవాడిని
చిన్నా : ఏదో ఫంక్షన్ జరుగుతుంది
లహరి : అవును
చిన్నా : అందరిని పిలిచి అసలోడిని పిలవలేదని నీ అయ్యకి చెప్పు
లహరి : ఓయి ఎవరు నువ్వు
చిన్నా : నువ్వు ఒప్పుకుంటే నీ మొగుడిని
లహరి : నీకు దమ్ముంటే ఇక్కడే ఉండరా నీ సంగతి చెప్తా అని ఇంట్లోకి పరిగెత్తింది, నవ్వుకుని అక్కడి నుంచి వచ్చేసాను. స్టేషన్ కి వెళితే అరగంటకి రైలు ఉంది. తినేసి ట్రైన్ ఎక్కితే కాళీగా ఉంది, కళ్ళు మూసుకున్నాను.
xxx xxx
అక్షిత : ఎవడో పోరంబోకు పోనీ..
లహరి : హా పారిపోయ్యాడు వెధవ
అక్షిత : సరేలే.. నీ గురించి చెప్పు
లహరి : అసలు నాకు ఇక్కడికి రావడం ఇష్టం లేదు వదినా, మీరు వస్తారని మాత్రమే వచ్చాను
అక్షిత : థాంక్స్
లహరి : అలా కాదు నాకంటూ నాన్న తరుపున చుట్టాలు అంటే మీరే కదా, బావ రాలేదా. ఎలా ఉన్నాడు ?
ఇంట్లోకి అడుగు పెట్టె ముందే చెప్పింది భారతి కూతురుతొ వాడి గురించి అడిగితే ఇంకా పిచ్చి తగ్గలేదు. రూములో నుంచి బైటికి రాడు, ఇక్కడి కూడా రానన్నాడని చెప్పమంది.
అక్షిత : రాలేదు
లహరి : అమ్మమ్మ కోసం కూడా రాలేదా.. ఈ ఇంట్లో ఎక్కడ చూసినా బావ ఫొటోలే ఉంటాయి. నానమ్మ పోయినా నాన్న ఇంట్లో ఏ మార్పులు చెయ్యలేదు.
అక్షిత : అవును అంది చుట్టు చూస్తూ
లహరి : మన చిన్నప్పటి బొమ్మలు చూద్దాం రా అని లోపలికి తీసుకెళ్ళింది.
లోపల చెక్క బాక్సుల్లో పెట్టి ఉంచారు. అవన్నీ చూస్తుంటే చాలా గుర్తొచ్చాయి అక్షితకి. ముఖ్యంగా తమ్ముడు గుర్తొచ్చాడు. ఇంకో బాక్స్ చూస్తుంటే "అది బావదే" అంది లహరి. తెరిచి చూసింది, అమ్మమ్మ వాడితో దిగిన ఫోటోలు కుప్పలుగా పడి ఉన్నాయి. వాడు వేసిన డ్రాయింగులు చూస్తుంటే ఒక పేజీలో పిచ్చి అమ్మాయి బొమ్మ వేసి పక్కన అక్క అని రాసాడు. ఇంకో ఫొటోలో అబ్బాయి అమ్మాయి ఫోటో అమ్మాయికి పొడుగ్గా గీసాడు జుట్టు, గీతలు పెట్టి అక్కి, చిన్నా అని రాసాడు. అది అమ్మమ్మ చేతిరాత, అమ్మమ్మ వాడు కలిసి వేశారేమో.
బాక్సులో సగం కొరికిన స్పంజ్ బాల్ కనిపించగానే తీసి చూసింది, చివరన కొన్ని స్ప్రింగు బాల్స్, చెక్క బొంగరం, గాలిపటాలు, ఒక రాఖీతొ పాటు హ్యాపీ బర్తడే అక్కీ అని వాడి చేత్తో రాసిన గ్రీటింగ్ కార్డు కూడా ఉంది.
చేతిలో స్పంజ్ బాల్ చూస్తుంటే మెల్లగా గుర్తుకువస్తున్నాయి. చిన్నప్పటి నుంచి ఎప్పుడు అమ్మమ్మ ఇంటికి వచ్చినా బాగా కొట్టుకునేవారు, ఒక రూములో నుంచి ఇంకో రూములో దాక్కుంటూ స్పంజ్ బాల్ తొ కొట్టుకోవడం గుర్తుకురాగానే నవ్వుకుంది, అదే క్షణంలో వాడు ఇంట్లో నుంచి వెళ్లిపోయేటప్పుడు స్పంజ్ బాల్ తొ కొట్టి నవ్వుతూ బై చెప్పి వెళ్లిపోవడం గుర్తుకురాగానే చేతిలో ఉన్న బాల్ కింద పడిపోయింది.
చిన్నా తిరిగి హైదరాబాద్ వచ్చి పెంట్ హౌస్ కి వచ్చి చూస్తే ఇల్లంతా చిందర వందరగా ఉంది. మొత్తానికి మొదలయింది అనుకున్నాడు. చిన్నా రావడం చూసిన ఓనర్ పది మంది వచ్చి గొడవ చెయ్యడం చెప్పి వెంటనే కాళీ చెయ్యమన్నాడు. చిన్నా సరే అన్నాడు కానీ కాళీ చెయ్యడని ఓనర్ కి అర్ధమైంది.
హైదరాబాదులో ఇది కొంచెం ఎత్తు ప్రదేశం, ఎప్పుడూ గాలి వీస్తుంది, అదీ కాక సిటీ హడావిడికి కొంచెం దూరంగా ఉండే ఇల్లులు. ఈ వాతావరణం బాగా నచ్చింది చిన్నాకి.
సాయంత్రం బైట తిరుగుతుంటే రెండు జీపుల్లో వచ్చారు మనుషులు. అన్న రమ్మన్నాడని రుబాబు చేస్తే ఎక్కి కూర్చున్నాడు. వాళ్ళు నేరుగా దామోదర్ దెగ్గరికే తీసుకెళ్లారు. లోపల ఆఫీసులో కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు దామోదర్. పక్కనే వాడి బామ్మర్ది కట్టు కట్టుకుని నిల్చుని ఉన్నాడు.
దామోదర్ : నా డబ్బు ఎక్కడ ?
చిన్నా : ఏ డబ్బు
దామోదర్ : వీడితో పాటు ఇంకో ఇద్దరినీ కాల్చి ఎత్తుకుపోయావ్ కదా ఆ డబ్బు
చుట్టు ఉన్న వాళ్లంతా కోపంగా చూస్తున్నారు.
చిన్నా : నేనా ! ఇదిగో ఇది నా గన్ను, మొత్తం ఏడు బుల్లెట్లు ఇందులోనే ఉన్నాయి. నేను కాల్చి ఉంటే ఇందులో బుల్లెట్లు తగ్గేవి కదా ? (గన్ నా దెగ్గర కూడా ఉంది, కాల్చుకోవడానికి నేను రెడీ అన్నట్టు చూసాడు )
దామోదర్ : అయితే నీకు దీనికి ఏ సంబంధం లేదంటావ్ ?
చిన్నా : లేదు
పక్కనే ఉన్న బామ్మర్ది "బావా వీడిని.." అని అరుస్తుంటే చెయ్యి ఎత్తాడు. దామోదర్ బామ్మర్ది సైలెంట్ అయిపోయాడు.
దామోదర్ : నీ చేతికి ఆ కట్టు
చిన్నా : మూడు బొద్దింకలని కొడుతుంటే చూసుకోకుండా తలుపు కొట్టుకున్నా
దామోదర్ : నువ్వెళ్లొచ్చు.. నేనేంటో కూడా చూపిస్తా
చిన్నా : ఏదైనా పనుంటే చెప్పండి, చేసి పెడతాను
దామోదర్ : నా బాత్రూం కడగాలి వస్తావా అనగానే అందరూ నవ్వారు
చిన్నా కూడా నవ్వుతూ "వస్తాను, కోటి రూపాయలు ఖర్చు అవుద్ది" అన్నాడు లేచి నిలబడుతూ
దామోదర్ : కోటి రూపాయలా ! ఏమేసి కడుగుతావురా అని నవ్వాడు, అందరూ నవ్వారు.
చిన్నా : రక్తంతొ అని కోపంగా ఒక్క చూపు చూసాడు.
అక్కడున్న అందరి మొహాల్లో నవ్వు ఆగిపోయింది. చిరంజీవి వెళ్ళిపోయాక, దామోదర్ బామ్మర్ది "వాడి దెగ్గర గన్ చూసి వదిలేసావా వాడిని" అని అరిచాడు.
దామోదర్ : దిగిన బుల్లెట్లు సరిపోలేదా. వీడెవడో కనుక్కోండి, వాడికి అస్సలు భయం లేదు.
xxx xxx
రాత్రి పదకొండు గంటలకి అక్షిత ఒక్కటే మేడ పైన కూర్చుని ఫోను మాట్లాడుతుంది.
శృతి : చెప్పవే
అక్షిత : ఊరికే బాధగా ఉంది
శృతి : ఎందుకో
అక్షిత : నా తమ్ముడి కోసం
శృతి : హ్మ్మ్
అక్షిత : వాడి పేరు చిరంజీవి. చిన్నా ముద్దు పేరు
శృతి : వాట్...!
అక్షిత : చిరంజీవి
శృతికి ఆరోజు చెప్పిన పేరు "చిరంజీవి". ఫోనులో చదివిన విషయాలు, వేసిన డేట్లు అన్నీ గుర్తుకువస్తున్నాయి.
అక్షిత : ఒసేయి ఉన్నావా
శృతి : నేను మళ్ళీ చేస్తానే అని పెట్టేసింది.
ఫోను పక్కకి పెట్టి ఆకాశంలో చుక్కలని చూస్తుంటే లహరి గొంతు విని పక్కకి చూసింది.
లహరి : ఏంటి వదినా నిద్ర రావట్లేదా
అక్షిత : లేదే, కూర్చో
లహరి కూర్చుని అక్షిత భుజం మీద తల పెట్టుకుంది.
లాహరి : ఏం ఆలోచిస్తున్నావ్ వదినా
అక్షిత : ఏవేవో ఆలోచనలు
లహరి : బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని నవ్వింది
అక్షిత : లేడు.. నీకు ?
లహరి : నాన్న వీపు చీరేస్తాడు
అక్షిత : హహ్హ.. మౌనంగా కూర్చుంది
లహరి : బావ వస్తే బాగుండు, అప్పటికి ఇప్పటికి బావలో మార్పు వచ్చిందా ఏమైనా.. ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఫోటో చూపించు
అక్షిత : ఫొటోస్ తీయలేదే
లహరి : అదేంటి వదినా
అక్షిత : మొన్నే వాడు రిలీజ్ అయ్యింది. అయినా నువ్వెంటి వాడి మీద తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నావ్ (మాట మార్చేసింది)
లహరి క్షణంలో సిగ్గుపడటం అక్షిత చూసేసింది.
లహరి : బావ కదా
అక్షిత : అబ్బో
లహరి : వరస కదా
అక్షిత : ఇష్టం కదా
లహరి : అవును కదా
అక్షిత : అబ్బో..
లహరి : వదినా.. అని వాటేసుకుంది
అక్షిత : ఇష్టమా నీకు బావంటే
లహరి : ఇష్టమె కానీ ఆమ్మో నాకు భయం. బావకి కోపం ఎక్కువ. అస్సలు మేము బావని చూద్దామని వచ్చే వాళ్ళమే కానీ అత్తయ్య మమ్మల్ని రానివ్వలేదు.
అక్షిత : వస్తాడులే.. అయినా ఎలా ఇష్టమే నీకు వాడంటే.. మనుషులని చంపి జైలుకి వెళ్లిన వాడు, పైగా పిచ్చి ఉంది.. అంటుంటే లహరి అక్షిత నోరు మూసేసింది.
లహరి : నానమ్మ ఇంట్లో ఉన్నాం, బావ గురించి అలా మాట్లాడకు. నానమ్మ ఆత్మ చూస్తే మనల్ని కూడా తీసుకెళ్లిపోద్ది
ఇద్దరు నవ్వారు
లహరి : నాకు నానమ్మ అంటే చాలా ఇష్టం వదినా.. నాకు చిన్నప్పుడు నానమ్మ ఒకసారి చెప్పింది, బావది పిచ్చి కాదట, అది బాధ అని చెప్పింది. ఇంకోటి కూడా చెప్పింది, బావ ఎప్పుడు తప్పు చెయ్యడు, ఒక వేళ ఏదైనా తప్పు చేస్తే దాని వెనక చాలా పెద్ద కారణం ఉంటుంది అని..
అక్షిత : సారీ మీ బావని చులకనగా మాట్లాడినందుకు
లహరి : ఊరుకో వదినా, మీరెంత ప్రేమగా ఉంటారో నాకు తెలీదా, నన్ను టెస్ట్ చేసావ్ బావ గురించి నా ఒపీనియన్ తెలుసుకోవడానికి అంతే కదా ?
అక్షిత నవ్వు మొహం పెట్టింది. లోపల మాత్రం మనసు అనే గుండెకి బాణాలు చాలా లోతుగా గుచ్చుతున్నాయి
అక్షిత : చిన్నప్పటి విషయాలు గుర్తున్నాయా ఏమైనా
లహరి : అస్సలు మర్చిపోతే కదా.. నానమ్మ దెగ్గర బావ ఒక్కడే కదా ఉంది. మనకేమో సెలవలు వచ్చినప్పుడే. పక్కూరే కాబట్టి నేనెప్పుడూ నీకంటే ఓ నాలుగు రోజులు ముందు వచ్చేదాన్ని. నీకోసం మేమిద్దరం కలిసి అన్నీ తయారు చేసేవాళ్ళం. నువ్వు వచ్చాక ఆడుకోవాలని ఎన్ని చేసేవాళ్ళం.. రాకెట్లు వదలడానికి కొబ్బరి ఆకులు ముందే కోసి కొంచెం ఒలిచి పెట్టె వాళ్ళం, బంక మట్టి రెడీగా పెట్టేవాళ్ళం, తాటి ఆకులతో ఇల్లు రెడీ చేసి ఉంచే వాళ్ళం. నిజం చెప్పనా వదినా.. బావతొ కలిసి నీకోసం అవన్నీ రెడీ చేసేటప్పుడు నేనెంత హ్యాపీగా ఉండేదాన్నో..
అక్షిత భుజం మీద వాలిపోయిన లహరి అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే తనని ప్రేమగా చూసింది.
లహరి : వదినా నేను కూడా మీతో పాటు వస్తా కొన్ని రోజులు, నాన్నని అడగవా
అక్షిత ప్రేమగా లహరి సంకలో చెయ్యి దూర్చి "లాక్కుపోతా నిన్ను" అంటే నవ్వింది. కింద నుంచి ఇక పడుకోమని అరుపులు వినిపిస్తే కిందకి దిగారు. అక్షిత మంచం ఎక్కింది కానీ నిద్ర పోలేదు. ఇప్పట్లో నిద్ర వచ్చేలా కూడా లేదు.
అక్షిత : ఒక మనిషిని అందులో నాతో పుట్టిన వాడిని ఎలా మర్చిపోయూను. నన్ను ఉప్పు ఎక్కించుకుని ఎంత దూరమైనా నొప్పి కనపడనివ్వకుండా వెళ్లే వాడు. మామిడి కాయ కావాలి అంటే ఫెన్సింగ్ దూకి వాళ్ళతొ కొట్టించుకుని మరీ నాకు తెచ్చిచ్చేవాడు. అస్సలు ఎలా పెరిగాను నేను, ఏం ఆలోచిస్తున్నాను, ఎవడో ముక్కు మొహం తెలియని వాడి మొడ్డ కోసం రోడ్లు తిరిగాను. చిన్నా..
"రేయి నువ్వు నాకంటే చిన్న వాడివి, ఇప్పటి నుంచి నిన్ను చిన్నా పిలుస్తాను ఓకే నా..?"
"నాకు ఇష్టం లేదు, కావాలంటే పెద్దా అని పిలుపు పలుకుతా లేదంటే పలకను"
"చిన్నా చిన్నా చిన్నా చిన్నా..." అక్షిత నవ్వులు, వెక్కిరింపులు, చిన్నా గాడి మాడిపోయిన మొహం.
చిన్నా.. నేను వాడికి పెట్టిన ముద్దు పేరు. ఇన్ని సంగతులు మా ఇద్దరి మధ్య ఉన్నాయి, ఇవేమి ఎందుకు పట్టించుకోలేదు. జైల్లో ఉన్నప్పుడు వాడిని చూద్దామని నేను ఎందుకు అడగలేదు. అస్సలు వాడిని చూడడానికి మేము ఎందుకు వెళ్ళలేదు. వాడు రాగానే వాడిని నేను ఎందుకు పలకరించలేదు, ఎందుకు వాడి మొహం కూడా చూడలేదు.
గట్టిగా గస పీలుస్తూ.. ఓ వైపు కళ్ళలో నీళ్లతో.. ఇంకో వైపు తన మీద తనకే కోపంలో చేతిలో ఉన్న ఫోను ఒక్కసారిగా నేలకేసి గట్టిగా కొట్టింది. ఆ శబ్దానికి అందరూ లేచి లైట్లు వేశారు. అక్షిత వెంటనే మంచం ఎక్కి దుప్పటి కప్పుకుంది. కాసేపటికి లైట్లు ఆరిపోయినా అక్షిత కంట్లో నీళ్లు మాత్రం ఆగలేదు.
"నాకే ఇలా ఉంటే మరి వాడు. వాడెంత బాధ పడ్డాడో.." లేచి కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది. మొహానికి దిండు అడ్డం పెట్టుకుంటే దిండు మొత్తం తడిచిపోయింది.
xxx xxx
భారతి : అక్షితా.. అక్షితా.. లెగు.. ట్రైన్ టైం అవుతుంది. లేగవే..
ఉలిక్కి పడి లేచింది అక్షిత : ఏంటి.. ఏమైంది ?
భారతి : వెళ్ళొద్దా
అక్షిత లేచి కూర్చుంది, బైటికి వచ్చి చూస్తే లహరి సోఫాలో కూర్చుంది. అక్షితని చూసి నాన్నని అడిగావా అన్న చూపులో అర్ధం అయ్యి ఎక్కడా అని అడిగితే పైన అని వేలు చూపించింది. అక్షిత పైకి వెళ్ళింది.
కోడలు పిల్లని చూడగానే సిగరెట్ పక్కకి విసిరేసి "రా అక్షితా" అన్నాడు నవ్వుతూ
అక్షిత : ఊరికే వచ్చా మావయ్యా
బద్రి : లహరిని పంపించమని అడక్కు, అది ఆల్రెడీ నన్ను అడిగింది, నేను వద్దన్నాను.
అక్షిత : ఏ మావయ్యా
బద్రి : నిజం చెప్పమంటావా
అక్షిత : చెప్పు
బద్రి : నేను అనేవి మనుసులో పెట్టుకోకు అక్షితా.. నాకు మీరంటే నచ్చదు. మీ అమ్మ నా చెల్లెలు కాబట్టి దాన్ని మిమ్మల్ని భరిస్తున్నాను అంతే..
అక్షిత తల దించింది
బద్రి : చిన్నా గాడు మీ ఇంట్లో లేడని నాకు తెలుసు
అక్షిత తల ఎత్తింది
బద్రి : వాడు రిలీజ్ అయినా రోజు చూద్దామని వచ్చాను. అప్పుడే మీ అమ్మా నాన్న వాడితో ప్రవర్తిస్తున్న తీరు నాకు నచ్చలేదు. ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి వాళ్ళు అంతే.. వాడిని వదిలించుకున్నారు, భారం అంతా మీ అమ్మమ్మ పైన వదిలేసారు. మీ అమ్మమ్మ పోయాక వాడిని నేను తీసుకెళదాం అనుకున్నాను కానీ మీ అత్తయ్య ఒప్పుకోలేదు, కన్నవాళ్ళు ఉండగా మనం చూడటం బాగోదు అంది. మీరెప్పుడు కనీసం వాడు ఎలా ఉన్నాడా అని కూడా చూడలేదు. పుట్టిన వాళ్లలో ఏదైనా లోపం ఉంటే వదిలేస్తారా, మీ అమ్మమ్మ ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే మీ అమ్మ వాడిని ఎప్పుడో పుట్టినప్పుడే చెత్త బుట్టలో పారేసేది. ఆ రోజు మా అమ్మ చనిపోయిందని మేమంతా ఏడుస్తుంటే మీ అమ్మ మాత్రం చిన్నా గాడిని ఎక్కడ తనతో పాటు తీసుకెళ్లాల్సి వస్తుందో అన్న భయమె ఎక్కువ ఉంది. ఆ రోజు నా చెల్లి మీద పుట్టిన అసహ్యం ఇంకా తగ్గలేదు.
లహరికి చిన్నా అంటే చాలా ఇష్టం, అందుకే నేనెప్పుడూ దానికి చిన్నా గురించి చెప్పలేదు. పిచ్చి ఉంది, ట్రీట్మెంట్ జరుగుతుంది, బాగున్నాడు, నిన్ను అడిగాడు, నువ్వు వాడిని చూస్తే ఇబ్బంది పడతాడు, చిన్నతనంగా ఫీల్ అవుతాడు అని చెప్పి ఆపేసాను. ఇప్పుడు దానికి ఇవన్నీ తెలిస్తే.. వద్దులే..
అక్షిత ఏడుస్తూ మావయ్యని వాటేసుకుంటే బద్రి దెగ్గరికి తీసుకున్నాడు.
అక్షిత : నేను చేసిన తప్పులు మాత్రం నేను సరిదిద్దుకు తీరతాను మావయ్యా
బద్రి : నీతప్పేం లేదులే అక్కీ.. వాళ్ళ మైండ్సెట్లో నువ్వు కూడా అలా అయిపోయావ్
అక్షిత : థాంక్స్ మావయ్యా.. నాతో మాట్లాడినందుకు
బద్రి : ఎంత కాదన్నా నువ్వు నా కోడలివిరా అని నుదిటి మీద ముద్దు పెట్టి జేబులో నుంచి ఒక రెండు వేలు తీసి ఇచ్చాడు.
అక్షిత : మావయ్య వద్దు
బద్రి : మావయ్య దెగ్గర నుంచి ఏది తీసుకున్నా హక్కులా తీసుకోవాలి, అది మేనమామరికం. ఇలాంటివి అస్సలు ఉండకూడదు. వెళ్ళు అన్నాడు
అక్షిత డబ్బులు తీసుకుని "సిగరెట్" అంటే బద్రి నవ్వుతూ "కింద చెప్పకు" అన్నాడు. అక్షిత కిందకి రాగానే లహరి చూసింది "ఏమన్నాడు ?" అంటే అక్షిత "వద్దన్నాడే" అంది. లహరి బాధగా తల దించితే గడ్డం పట్టుకుని ఎత్తింది.
అక్షిత : వీలైనంత త్వరలో నేను బావ కలిసి ఇక్కడికి కాదు నువ్వుండే ఊళ్ళో మీ ఇంటికి వస్తాం
లహరి : నిజంగా
అక్షిత : ప్రామిస్
లహరి : సరే అయితే.. ఎదురుచూస్తాను.. నాకు బావ ఫోటో పెట్టు అని సిగ్గు పడితే అలాగే అంది అక్షిత.
రూములోకి వచ్చి చూసుకుంటే ఫోను స్క్రీను ముక్కలు ముక్కలు అయ్యింది, బాటరీ కూడా బైటికి వచ్చేసింది. "ఇది ఇక పని చెయ్యదు". సిం తీసుకుని ఫోను బైట పారేసాను.