Update 07
"ఎవరు నువ్వు, వదలండి ప్లీజ్.." ఏడ్చేసింది ఆ అమ్మాయి
ఏదో పాడు బడ్డ స్టేషన్, వాడకుండా వదిలేసారు. తుప్పు పట్టిన సువ్వల జైలులో పడేసాడు చిన్నా
"నన్ను ఎందుకు తీసుకొచ్చారు, నేనేం చేసాను. నా వల్ల ఏదైనా తప్పు జరిగితే చెప్పండి, సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను" అరుస్తూనే ఉంది ఆ అమ్మాయి.
చిన్నా : అరవకు, నీ గొంతు ఎండిపోతే దాహం తీర్చడానికి నీళ్లు కూడా లేవిక్కడ
ఫోన్ వస్తుంటే స్పీకర్లో పెట్టాడు. "చెప్పు శృతి"
శృతి : రాత్రి నుంచి మా నాన్న మీ నాన్న వెతుకుతున్నారు. రెండిళ్ళు టెన్షన్ పడుతున్నాం. ఏమైనా తెలిసిందా ?
బంధీలో ఉన్న అమ్మాయి ఆ గొంతు గుర్తు పట్టింది, వెంటనే "శృతి.. శృతి.. " అని అరిచింది.
శృతి : లావణ్యా...!
చిన్నా : ఈ అమ్మాయి నీకు తెలుసా ?
శృతి : తెలుసు తను నా ఫ్రెండ్, మేమిద్దరం ఒకే బెంచ్
చిన్నా : దీనయ్య అక్షితని ఎత్తుకెళ్ళాడు, నేను దీన్ని ఎత్తుకొచ్చా. దాన్ని వదిలితే దీన్ని వదులుతా
శృతి : ఒకసారి దానికివ్వు
చిన్నా : వింటుంది మాట్లాడు
శృతి : లావణ్యా.. భయపడకు, నీ మీద చెయ్యి పడదు. ప్లీజ్ కొంచెం కొ ఆపరేట్ చెయ్యి. నన్ను నమ్ము. అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. ఒరేయి చెప్పు తనకి
చిన్నా : ఒరేయి నా
శృతి : అది నా బెస్ట్ ఫ్రెండ్, దాని మీద ఈగ వాలితే నేను నీ మీద నేను వాలతాను. జాగ్రత్త
చిన్నా : అబ్బో.. సరే సరే అని పెట్టేసాడు.
శృతి మాటలు విన్నాక లావణ్య కొంచెం నెమ్మదించింది. మెలకుండా ఉంటే చిన్నా మాట్లాడాడు.
చిన్నా : నా చెల్లిని వదలగానే నిన్ను వదిలేస్తా
లావణ్య : శృతి చెప్పింది కాబట్టి మౌనంగా ఉంటున్నాను
చిన్నా : ఆ లేకపోతే ఏం సేతువేటి
లావణ్య మెలకుండా కూర్చుంది. కాసేపటికి "మా నాన్న మంచోడు కాదు, మీరు జాగ్రత్తగా ఉండండి" అంది.
చిన్నా : మీ నాన్న గురించి నాకు తెలుసులే.. ఇదిగో మీ నాన్నే అని ఫోను చూపించి ఎత్తి స్పీకర్లో పెట్టాడు.
దామోదర్ : నా డబ్బులు
చిన్నా : నువ్వింకా నా పిల్లని వదల్లేదా మావా
దామోదర్ : ఎవడ్రా నీకు మావ
చిన్నా : ఇందాక నీ బిడ్డని చూసాలే.. బాగుంది మావయ్యా
దామోదర్ : లావణ్య..
చిన్నా : ఎందుకు మావా టెంషన్.. నా దెగ్గరా భద్రంగా ఉంది. లావణ్య పాపా ఒకసారి హాయ్ చెప్పు
లావణ్య : డాడీ..
దామోదర్ : నిన్ను వదలను రా
లావణ్య : ముందు వదలాల్సిన వాళ్ళని వదులు, ఆడోళ్ళతొ ఎందీ పంచాయితీ.. మనం మనం చూసుకుందాం మావా
చిన్నా మావా అన్నప్పుడల్లా దామోదర్కి ఒళ్ళు మండిపోతుంది. వెంటనే ఫోన్ పెట్టేసి తన మనుషలకి ఫోన్ చేసాడు.
xxxx xxxx
షటర్ చప్పుడు కాగానే మెలుకువ వచ్చి లేచింది అక్షిత.
"రేయి సూరి.. సూరీ.. ఏడి వీడు.." లేచిన అక్షితని చూసి "మా వాడు ఎక్కడా ?" అని అడిగితే, అక్షిత "నేను పడుకున్నా, ఎటైనా వెళ్ళాడేమో" అని తాపిగా సమాధానం చెప్పింది. వాళ్ళు అక్షితని ఇంటి దెగ్గర వదిలిపెట్టి వెళ్లారు.
దామోదర్ వెంటనే చిన్నాకి ఫోన్ చేస్తే సరే అని పెట్టేసి "వెళదామా" అన్నాడు లావణ్యని చూసి. ఈ లోపే అక్షిత నుంచి ఫోన్ వచ్చింది.
అక్షిత : వాళ్ళు వదిలేసారు
చిన్నా : తెలుసు
అక్షిత : ఇక్కడితొ పోనీ ఇక, గొడవలు వద్దు
చిన్నా : సరే
అక్షిత : ఇంట్లో నీ దెగ్గరికి వచ్చా అని చెప్తా
చిన్నా : హా..
లావణ్యని తీసుకుని నేరుగా దామోదర్ ఇంటికి వెళ్ళాడు. "ఇదేనా మీ ఇల్లు" అని లోపలికి నడుస్తుంటే, పక్కనే లావణ్య ఉండటంతొ ఈ విషయాలేవి తెలియని మనుషులు చిన్నాని ఆపలేదు.
లావణ్య : వెళ్ళిపో
చిన్నా : మీ అయ్య రానీ అని ఇంటి లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటే లావణ్య వాళ్ళ అమ్మ వచ్చింది. ఆమెని చూడగానే షాక్ కొట్టినట్టు లేచి నిలుచున్నాడు చిన్నా
"నువ్వు చిన్నా" కదూ అంది ఆశ్చర్యపోతూ, "అవును" అన్నాడు చిన్నా.. వెంటనే "మీరు ?" అని అడిగాడు.
పిచ్చి ఆస్పత్రిలో తనని అమ్మలా సాకిన మధుమతి లాగే ఉంది ఈమె, చెప్పాలంటే అచ్చు గుద్దినట్టు ఉంది. ఆమె లావణ్యని చూసి "మంచినీళ్లు తీసుకురా" అని పంపించి, చిన్నా వైపు చూసి "తను నా అక్క, మేము కవలలం. దీని గురించి తరువాత మాట్లాడుకుందాం", నీ నెంబర్ ఇవ్వు అంటే ఇచ్చి అక్కడ నుంచి వచ్చేసాడు.
xxx xxx
భారతి : ఎక్కడికి వెళ్లి సచ్చావ్
అక్షిత : తమ్ముడు కనిపిస్తే వాడి దెగ్గరికి వెళ్ళా అక్కడ చీకటి పడితే పొద్దున్నే వెళ్ళమన్నాడు. నీకు ఫోన్ చేద్దామంటే ఛార్జింగ్ అయిపోయింది. అక్కడ చార్జర్ లేదు. పొద్దున్నే దెగ్గరుండి వదిలి పెట్టి వెళ్ళాడు.
రాజా : వచ్చేసిందిగా పోనీ, ఇంకోసారి చెప్పి వెళ్ళు. వాడు ఎలా ఉన్నాడు ?
అక్షిత : బాగున్నాడు అని శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళింది.
శృతి టెన్షన్ తొ కాలేజీకి కూడా వెళ్ళలేదు. చూడగానే వాటేసుకుని ఏడ్చేసింది.
శృతి : నువ్వింకోసారి వాడి దెగ్గరికి వెళ్ళావంటే చంపేస్తా
"ఇక నుంచి నేను వాడితోనే ఉంటానే" మనసులో అనుకున్నా బైటికి మాత్రం "అలాగేలే" అంది.
శృతి : ఇంతకీ అదెలా ఉందో అని లావణ్యకి ఫోన్ చేసింది.
లావణ్య : నువ్వు కాలేజీకి రావే రేపు, చంపుతా నిన్ను
శృతి : నా వల్లే నువ్వు బాగున్నావ్ మర్చిపోకు
లావణ్య : అవునులే
శృతి : తనేమైనా అన్నాడా ?
లావణ్య : లేదు.. మంచివాడిలా ఉన్నాడు కానీ మాటలే భయం పుట్టిస్తున్నాయి
శృతి నవ్వి పెట్టేసి జరిగిన విషయం అక్షితకి చెప్పింది.
xxxx xxxx
చిన్నా ఆలోచిస్తూ ఇంటికి వెళ్లి ఎప్పటిలానే తలుపులు తీసాడు. లోపల సుల్తాన్ అక్క ఫాతిమా అప్పుడే బట్టలు మార్చుకుంటుంది. తెల్లని నగ్న వీపు కనపడగానే ఒక్క ఉదుటున బైటికి దూకి తలుపులు దెగ్గరికి వేశాడు. కాసేపాగాక ఆమె బైటికి వచ్చింది.
చిన్నా : తలుపులు వేసుకుని గడి పెట్టుకోవచ్చు కదండీ
ఫాతిమా : మాఫ్ కర్నా.. నేను మర్చిపోయాను
చిన్నా : నన్ను కూడా క్షమించండి.. నేను మీ గురించి మర్చిపోయాను, ఎప్పటిలానే వచ్చేసా.. సుల్తాన్ ఎక్కడా ?
ఫాతిమా : ఏదో పనుందని వెళ్ళాడు.
చిన్నా : మీరు మళ్ళీ నా దెగ్గరికి ఎందుకు వచ్చారు. నాతొ ఉంటే వాడికి రిస్క్ అని చెప్పి మరీ పంపించాను. అయినా మిమ్మల్ని కూడా తీసుకొచ్చాడు.
ఫాతిమా : నేనే అడిగాను, అందుకే ఇక్కడికి వచ్చాం
చిన్నా : మీరా !
ఫాతిమా : మీ ప్రాణాలు పణంగా పెట్టడం వల్ల పది మంది ఇప్పుడు సంతోషంగా పడుకోగలుగుతున్నారు. మీరు ఎలా ఉంటారో చూద్దామని నేనే అడిగాను.
చిన్నా : ఎలా ఉన్నాను ?
ఫాతిమా నవ్వి "బాగున్నారు, కానీ చాలా చిన్నవారు మీరు" అంది.
చిన్నా : అప్పుడు మర్యాద తగ్గించి, నన్ను చిన్నా అని పిలవండి.
ఫాతిమా : అలాగే
చిన్నా : ఏమైనా తిన్నారా
ఫాతిమా : లేదు, ఒక రిక్వెస్ట్
చిన్నా : చెప్పండి అక్కా
ఫాతిమా : నేను సుల్తాన్ నీతో ఉంటాము. నీకు ఎవ్వరు లేరని విన్నాను. అక్కలా ఉండి వండి పెడతాను. కాదనకు.
చిన్నా : అది అంత ఈజీ కాదక్కా, నేనాలోచించి చెపుతాను.
xxxx xxxx
రెండు రోజులు గడిచాయి, సుల్తాన్ గాడు గ్యాప్ లేకుండా తిరుగుతున్నాడు. ఫాతిమాకి బైట తెచ్చుకుని తినడం నచ్చలేదు.
సాయంత్రం అక్షితతొ ఫోను మాట్లాడుతుంటే దామోదర్ నుంచి ఫోన్ వచ్చింది.
చిన్నా : మావా.. చెప్పు ఏంటి సంగతి
దామోదర్ కోపం ఆగబట్టుకుని, "నా మనిషి ఒకడు ఒక రాత్రి ఆ అమ్మాయితొ ఉన్నాడు. వాడు ఆ రోజు నుంచి కనిపించట్లేదు" అని చెప్పాడు
చిన్నా : ఏమో మరి, పడుకుని లేచేసరికి వెళ్లిపోయాడని చెప్పింది. అయినా నీ పీత బుర్ర కింద ఎవడు పని చెయ్యాలనుకుంటాడు మావా. వాడు వెళ్ళిపోయి ఉంటాడు. ఏదైనా అయ్యుంటే నాకు అమ్మాయి మాట తీరులోనే తెలుస్తుంది. అలాంటిదేమి లేదు మరి
దామోదర్ ఫోన్ పెట్టేసాడు
పెంట్ హౌస్ కి నడుస్తుంటే ఒక పిల్లాడు కనిపించాడు. చూస్తే అమ్మమ్మ వర్ధంతి రోజు ట్రైన్లో వెళుతుంటే కనిపించిన పిల్లాడు. ఇప్పుడు చూస్తే తెలుస్తుంది వాడికి పదేళ్ల పైనే ఉంటాయని, పక్కనే వాళ్ళ అమ్మ రోడ్డు పక్కన కూర్చుని ఉంది. ఆమె మొహం చూస్తే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉంది. ఆమె మొగుడు కోసం చూసాను, తాగుబోతు నా కొడుకు ఆ రోజు ఈమెని కొడుతూనే ఉన్నాడు. మనకెందుకులే వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆమె కళ్ళు తిరిగి పడిపోతే వీడి పరిస్థితి అర్ధం కాలేదు. ఆమె దెగ్గరికి వెళ్ళగానే ఆమె చూపులోనే నన్ను గుర్తు పట్టినట్టు అనిపించింది. "మా ఇల్లు ఇక్కడే, ఏమైనా తిన్నాక మాట్లాడుకుందాం రండి" అని చేయిస్తే నా చెయ్యి పట్టుకుని లేచింది. పెంట్ హౌస్కి నడిపించుకుళుతునే పార్సెల్ తీసుకుని పైకి ఎక్కించాను. ఆమె కళ్ళు మూసుకుని పడుకుంటే, వాడు ప్లేట్లో పెట్టిచ్చిన బిర్యానీ కుమ్ముతున్నాడు. ఫాతిమా అడిగితే జరిగింది చెప్పా ఆమె నన్ను ఇష్టంగా చూసింది.
ప్రతీ ఒక్కళ్ళు నేనేదో మంచోడిని అన్నట్టు, నేనో సమాజ సేవకుడినన్నట్టు చూస్తున్నారు. నేను కాదురా బాబు అని అరిచి చెప్పాలని ఉంది.
బైటికి వెళ్లొచ్చాక సుల్తాన్ గాడు మళ్ళీ ఏటో పోతుంటే ముందు ఆడిని పిలిచాను.
చిన్నా : రేయి నీ బాధ ఏంటో చెప్పకపోతే తంతా, ఏం కావాలి నీకు
వింటున్న ఫాతిమ ఫక్కున నవ్వింది. సుల్తాన్ చెప్పాడు.
చిన్నా : అన్నదానం కాంటీన్ పెడతావ్ అంతేనా.. అందరికి నువ్వే వండుతావా, నీకెవడు ఇస్తాడు ఫండ్స్
సుల్తాన్ : యాడ్స్ ఇస్తాం. సరుకులు ఎవరైనా ఎంతైనా దానం చెయ్యచ్చు ఇంకోటి ఏంటంటే ఎవరైనా వచ్చి వండి వెళ్ళచ్చు. సభ్యత్వం కార్డులు ఉంటాయి అందరికీ ఇవ్వరు, సభ్యత్వం ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి వండి వెళ్ళగలరు.
చిన్నా : నా వల్ల కాదులే, అదేంటో నువ్వే తిరుగు
ఫాతిమా మళ్ళీ నవ్వింది.
ఇక ఈమె సంగతి. చూస్తే తింటుంది. అయిపోయాక లేచి తనే ప్లేట్ కడిగి వచ్చి నా ముందు నిలుచుంది.
చిన్నా : ఇప్పుడు చెప్పండి, మీరేంటి ఈ ఊళ్ళో ? మీ పేరేంటి ?
"నా పేరు శ్రామిక, మా ఆయనతొ కలిసి వచ్చాను. ఇక్కడ నాకు రావాల్సిన ఆస్తి ఒకటి ఉంది, అది మా అన్నయ్య ఇవ్వడం లేదు. ఆస్తి ఇస్తే నా భర్త తినేస్తాడు, ఇవ్వక పోతే నా అన్నయ్య తినేస్తాడు. ఏటోచ్చి నేను నా కొడుకు దిక్కు లేని వాళ్ళం అయిపోతాము"
చిన్నా : ల్యాండ్ ఆ ?
శ్రామిక : అవును
చిన్నా : నీ ల్యాండ్ నీకు ఇప్పించి నిన్ను సెటిల్ చేస్తా, ఆ డబ్బు నీ కొడుకు పెద్దయ్యాక మాత్రమే వాడికి అందేలా ఏర్పాటు చేస్తా, నాకెంతిస్తావ్
శ్రామిక : దాన్ని అమ్మితే తప్ప నేనేమి ఇవ్వలేను
చిన్నా : పది శాతం ఇవ్వు
శ్రామిక : పదిహేను శాతం తీసుకో కానీ నా అన్న మీద చెయ్యి పడకూడదు, వాడంటే నాకు ఇష్టం
చిన్నా : అలాగే.. కాయితాలు మీ అన్న దెగ్గరే ఉన్నాయా
శ్రామిక : అవును
చిన్నా : ఎవరు మీ అన్న, ఎక్కడుంటాడు
తన కొంగు లోనుంచి చిట్టి తీసి ఇచ్చింది. పేరు రాజా, ఇంటి పేరు, ఇంటి అడ్రెస్స్ చూసి శ్రామికని చిట్టీని మార్చి మార్చి చూసాడు.
చిన్నా : ఈ ఆస్తి నీదేనా
శ్రామిక : నాదే
చిన్నా : నీకెలా వచ్చింది ?
శ్రామిక : అది మా నాన్నది, మా నాన్న ఒప్పందం ప్రకారం అన్నయ్యని చదివాలని, నేను చదువుకోకుండా ఇల్లు చూసుకోవాలని చెప్పారు. అన్నయ్య ఉద్యోగానికి, చదువుకి డబ్బులు ఏర్పాటు చేశారు. నాకు ఈ ఆస్తి రాసిచ్చారు. కళ్ళు తుడుచుకుంది.
చిన్నా : మరి
శ్రామిక : నాన్న జబ్బుతొ పోయాక అన్నయ్య నాకు తెలీకుండా నాతొ సంతకం పెట్టించుకుని రాయించుకున్నాడు.
చిన్నా : మరి మీ అమ్మ ?
శ్రామిక : ఆమెకి కళ్ళు కనిపించవు, ఇంకా ఊళ్ళోనే ఒక్కటే బతుకుతుంది. ఆమెకి ఫించను వస్తుంది.
చిన్నా మాట్లాడుతుంటే ఇంకో గొంతు వినిపించింది. అది సంపత్ గాడిది. "వీడు కూడా వచ్చేసాడు"
సంపత్ : రేయి సుల్తాన్ నువ్వెంట్రా ఇక్కడా ?
సుల్తాన్ : నువ్వెందుకు వచ్చావ్
సంపత్ : ఈ నా కొడుకు అలవాటు అయిపోయాడురా, చాలా రోజులు లేట్ చేశా
సుల్తాన్ : నేనూ అంతే
చిన్నా శ్రామిక వైపు చూసి "నీకు రావాల్సింది ఇప్పిస్తాను, నువ్వు చెప్పేవన్నీ నిజాలేనా ?"
శ్రామిక : నా బిడ్డ తోడయ్యా, ఇవి మా నాన్న నాకు రాసిచ్చినప్పుటి కాయితాలు. కవర్లో నుంచి తీసిచ్చింది
చిన్నా : ఓహ్.. లింకు డాకుమెంట్స్ నీ దెగ్గరే ఉన్నాయా.. ఇవి చాలులే..
శ్రామిక : నా మొగుడు కనిపించడం లేదు, నాదేమొ ఈ పరిస్థితి
చిన్నా : నువ్వు వాడిని ఎలా చేసుకున్నావ్ ?
శ్రామిక : మా నాన్న గారు పోయాక, అన్నయ్య ఇంటిని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మ నాకు సంబంధాలు చూస్తున్న సమయంలో తెలిసింది అన్నయ్య మమ్మల్ని మోసం చేసి ల్యాండ్ రాయించేసుకున్నాడని. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుని ఇల్లు కూడా కట్టేసుకున్నాడు. దాని వల్ల నేను ఈయన్ని చేసుకోవాల్సి వచ్చింది. ఆయన మా దూరపు బంధువు.
చిన్నా : ఎంత శ్రామిక నీ పేరు అయితే మాత్రం మరీ ఇన్ని కష్టాలా.. ఎవరు నీకా పేరు పెట్టింది ? నీ మొగుడు ఎక్కడికి పోయాడో. ఉండు నీదొక ఫోటో తీసుకుంటా అని ఫోటో తీసి అక్షితకి పంపాడు.
అక్షిత ఫోన్ చేసింది.
అక్షిత : ఎవరిదో ఫోటో పెట్టావ్
చిన్నా : ఒకసారి ఆ ఫోటో మీ అమ్మకి చూపించు
అక్షిత : మా అమ్మా ! నవ్వింది
చిన్నా : అవును మీ అమ్మే.. పెట్టేసాడు. రేయి సంపత్.
సంపత్ : హా
చిన్నా శ్రామిక వైపు చూసి : కాసేపు పడుకో, నీ సమస్య తీరే వరకు ఇక్కడే ఉండు
శ్రామిక : మా ఆయన..
చిన్నా : ఆయన్ని కూడా నేనే వెతికిస్తా, ఆయన ఫోటో ఉంటే దాని వెనక పేరు రాసివ్వు అంటే ఇచ్చి వెళ్ళిపోయింది.
సంపత్ : ఎవరు ?
చిన్నా : చుట్టాలు
సంపత్ : పిలిచావ్
చిన్నా : వెళ్లి ఈ ఓనర్ గాడితో మాట్లాడి ఈ ఇల్లు కొనేసి వాడిని బైటికి తరిమెయి
సంపత్ : సరే
చిన్నా : డబ్బులు ?
సంపత్ : ఉన్నాయి అని వెళ్ళిపోయాడు
అక్షిత ఫోన్ చేసింది.
చిన్నా : చెప్పు
అక్షిత : నాన్న చెల్లెలు ఈమె.. మన మేనత్త. అంతే ఇంకేం చెప్పలేదు. ఫోటో గురించి అడిగితే నేనేం చెప్పలేదు
చిన్నా : మీరుంటున్న ఇల్లు మీది కాదమ్మా త్వరగా కాళీ చెయ్యండి
అక్షిత : నన్ను దూర్చకు, నాదేం పోయింది వచ్చి నీ దెగ్గరుంటా
చిన్నా ఫోన్ పెట్టేసి శ్రామిక దెగ్గరికి వెళ్ళాడు.
చిన్నా : నీకు మీ అన్నకి వయసు తేడా చాలా ఉందనుకుంటా
శ్రామిక : ఎనిమిదేళ్ళు తేడా
శ్రామిక ఇచ్చిన ఫోటో చూసి వెనక్కి తిప్పాడు. పేరు సూరి..
చిన్నా : ఎక్కడికైనా వెళ్తానని చెప్పాడా
శ్రామిక : ఎవరో రాజేష్ అనే అతన్ని కలిస్తే మా అన్నయ్య నుంచి ల్యాండ్ తీసుకోవడానికి సాయం చేస్తానని చెప్పాడట, పనుంది రమ్మంటే వెళ్ళాడు.
చిన్నా : వాళ్ళు ఎక్కడుంటారో
శ్రామిక ఏమి చెప్పలేదు.
సంపత్ : దామోదర్ గాడి బామ్మర్ది పేరు కూడా రాజేషే.. వాడు ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తాడు.
చిన్నా : అబ్బో.. మొత్తం ఇక్కడిక్కడే తిరుగుతుందిగా
చిన్నా వెంటనే ఫోటో దామోదర్ కి పంపించాడు. పావుగంట తరువాత ఫోన్ వచ్చింది.
దామోదర్ : వాడే సూరి.. ఏమైనా తెలిసిందా
చిన్నా : అర్ధం కాలా
దామోదర్ : ఆ రోజు రాత్రి నీ పిల్లతో తోడు ఉంది వీడే.. వాడు కనిపించడం లేదు. వాడి ఫోన్ మాత్రం ఇక్కడే ఉంది.
చిన్నా : ఆ రోజు ఎక్కడ దాచారు ?
దామోదర్ : నాకో కెమికల్ ఫ్యాక్టరీ ఉంది అక్కడే
చిన్నా ఫోన్ పెట్టేసాడు. పిచ్చి లేచింది. తల గీరుకుంటూ దయాకర్ కి ఫోన్ చేసాడు.
దయాకర్ : చెప్పరా
చిన్నా : ఉన్నావా ఇంట్లో
దయాకర్ : రెడీ అవుతున్నా
చిన్నా : వస్తున్నా పనుంది. ఫోన్ పెట్టేసాడు.
దయాకర్ : చిన్నా గాడు వస్తున్నాడు
రేఖ : హా వాడికి కూడా టిఫిన్ వండేస్తా.. లోపలికెళ్లి బులుగు రంగు చీర తీసి మంచం మీద పెట్టి బాత్రూంలో గీజర్ ఆన్ చేసింది.