Update 16
ఇంకో తొమ్మిది నెలలు గడిచాయి. అక్షిత ఆచూకి తెలియలేదు. ఇంట్లో కొత్తగా చిన్నా కొడుకు వచ్చేసరికి ఎవ్వరికి టైం తెలియడం లేదు. అందరూ సంతోషంగా ఉన్నారు ఒక్క చిన్నా తప్ప. చిన్నాకి చిన్నా కొడుక్కి ఓ పెద్ద యుద్ధమే జరుగుతుంది, వాడు పిల్లాడే వీడు పిల్లాడే.. వాడు ఏడుస్తున్నాడు వీడు ఏడవలేక నవ్వుతున్నాడు.
చిన్నా : ఏం చేస్తున్నావ్
శృతి : వీడికి పాలు పడుతున్నా
పక్కనే శృతి వాళ్ళ అమ్మ, భారతి ఇద్దరు ఉండేసరికి సరేలే అని వెళ్ళిపోయాడు. కాసేపాగాక మళ్ళీ వచ్చాడు.
చిన్నా : ఏం చేస్తున్నావ్
శృతి : పడుకున్నాడు
శృతి వాళ్ళ అమ్మ, భారతీ ఇద్దరు పక్కనే ఉన్నారు. కాసేపాగి మళ్ళీ వచ్చాడు. ఎక్కడికో రెడీ అవుతుంది శృతి.
చిన్నా : ఎక్కడికి ?
శృతి : అంగన్ వాడి దెగ్గరికి వెళ్లి పేరు ఇచ్చి వస్తా
చిన్నా : అవసరమా అవన్నీ
శృతి : అవసరమే.. ఇంజక్షన్ చేయించాలంట.. రెడీ అయ్యి బిడ్డతొ వెళ్ళిపోయారు అంతా
పక్కింట్లో చూస్తే రేఖ లేదు, ఫోన్ చేసాడు.
రేఖ : చెప్పరా
చిన్నా : ఇంట్లో లేవు
రేఖ : జూన్ మొదలయింది నాన్నా కూల్లో బుక్స్, అట్టలు, స్టిక్కర్లు అని దూల తీరుస్తుంది ఇది
చిన్నా : ఒక్కదానివే వెళ్ళావా
రేఖ : ఇందాక నువ్వు లేవు
చిన్నా : ఫోన్ చెయ్యచ్చుగా
రేఖ : ఇప్పుడేమైందిలే.. నేను చూసుకుంటా.. శృతి అంగన్ వాడికి వెళ్లిందా
చిన్నా : వెళ్ళింది.. ఒక్క నిమిషం.. మధు అమ్మ ఫోన్ చేస్తుంది అని పెట్టేసి.. చెప్పవే అన్నాడు
మధుమతి : లావణ్యని ఎవరో ఎత్తుకుపోయారు
చిన్నా : ఎవరు.. ఎందుకు
మధుమతి : ఎవరో సాహితీ అనే అమ్మాయి ఫోన్ చేసి పిలిస్తే బైటికి వెళ్ళింది. అంతే మళ్ళీ రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అంకుల్ వెతికిస్తున్నాడు.. నాకు భయంగా ఉంది.. నువ్వు రావా
చిన్నా : వస్తున్నా
xxxxxxxx
శృతి తన అమ్మతొ అత్తయ్య భారతితొ అంగన్ వాడి దెగ్గరికి నడుచుకుంటూ వెళుతుంది.
శృతి : కారులో వెళ్ళేవాళ్ళం కదా
శృతి అమ్మ : నడక మంచిది, వాడికి గాలి తగలాలి
భారతి : ఎందుకే వాడికి రోజూ అక్షిత ఫోటోలు చూపిస్తున్నావ్ ?
శృతి : వాడి అత్త ఎలా ఉంటదో వాడికి తెలియద్దా, ఇప్పుడు చూడు.. కన్నా.. అక్షితా.. అనగానే నవ్వాడు బాబు
భారతి : అబ్బో..
శృతి అమ్మ : నవ్వుతున్నాడే వాడు.. వాడిని ఆడిస్తూ నవ్వుతూ వెళుతున్నారు.
శృతి : అక్షిత పోలికలు దిగిపోయాయి కదా అత్తయ్యా
భారతీ : కళ్ళు మాత్రం దానివే, సూటిగా చూస్తాడు వీడు కూడా
శృతి : ఏరా.. అత్త పోలికలోడా.. అది వచ్చాక మన దెగ్గరికి రాడేమో
శృతి అమ్మ : ఎక్కువగా అలవాటు చెయ్యకు, పసి పిల్లలు కదా అలా ఎక్కువగా ఫోటోలు చూపిస్తే మర్చిపోలేరు.
భారతి : పేరు ఏం అనుకుంటున్నారు
శృతి : ఏమో.. వీడయ్యకే తెలియాలి. దూరం నుంచి చూస్తున్నాడు కానీ దెగ్గరికెళ్లి ఆదుకోవట్లేదు చిన్నా అప్పటి వరకు కన్నా నే వీడి పేరు
శృతి అమ్మ బలవంతంగా కన్నాని లాక్కుని ఇంజక్షన్ చేయించి తీసుకొచ్చింది. వాడు అస్సలు ఏడవలేదు.
శృతి అమ్మ : చూడు వాడికి చీమ కుట్టినట్టు కూడా లేదు నువ్వేమో గోల గోల
శృతి : ఏమోనే భయమేసింది. ఇక పదండి పోదాం.
ఇంటికి వచ్చేసరికి రేఖ కూడా వచ్చేసింది. బాబుని ఉయ్యాల్లో పండేస్తే అమ్ములు ఆడిస్తుంది. రేఖ ఇంట్లోకి రాగానే చిన్నా గురించి అడిగింది.
శృతి : బైట ఏంటి ఆఫీసర్లు ఉన్నారు, ఈ చిన్నా ఫోన్ ఎత్తట్లేదు, ఎక్కడికెళ్లాడు చెప్పా పెట్టకుండా
రేఖ : మన లావణ్య కనిపించట్లేదట దయా ఫోన్ చేసాడు. కిడ్నాప్ అంటున్నారు. సెక్యూరిటీ లేకుండా ఎక్కడికి వెళ్లొద్దని చెప్పాడు.
భారతి : ఎప్పుడు మనకే జరుగుతాయేంటి, అస్సలు ప్రశాంతంగా ఉండనివ్వరా మనల్ని
వాళ్లంతా మాట్లాడుకుంటుంటే శృతి మళ్ళీ ఫోన్ చేసింది చిన్నాకి, ఈ సారి ఎత్తాడు.
చిన్నా : చెప్పు
శృతి : ఏమైంది ?
చిన్నా : మస్తాన్ గాడి పని అనుకుంటున్నారు
శృతి : వాళ్లంతా జైల్లో ఉన్నారుగా !
చిన్నా : జైల్లో ఉంటే..
శృతి : దాన్ని కాపాడు
చిన్నా : ట్రై చేస్తాను
శృతి : ఎంత వద్దన్నా నిన్ను క్రైమ్ కి ఎంత దూరం లాక్కొచ్చినా ప్రమాదం నీకు దెగ్గర అవుతూనే ఉంది. నీ మీద ఆధారపడి ఇద్దరం ఉన్నామని మర్చిపోకు. తొందరపడకు.. అలోచించి అడుగులు వెయ్యి
చిన్నా : హా..
శృతి : ఇందాక కన్నా గాడు అక్క అనడం విన్నాను.. తొందరలోనే అక్షితని అడిగేస్తాడు. జాగ్రత్త చిన్నా
చిన్నా : భయపడకు.. జాగ్రత్తగా ఉంటాను. ఉమ్మా
శృతి : లవ్ యు.. ఫోను పెట్టేసి గుండెకి హత్తుకుంది
బాబు ఏడుస్తుంటే పాలు పట్టడానికి వెళ్ళింది.
xxxxx
"హలో నేను మంగమ్మని మాట్లాడుతున్నాను. లక్ష్మక్కా ?"
లచ్చు : చెప్పవే
మంగమ్మ : ఇందాక ఒకమ్మి ఓ బిడ్డని తీసుకొచ్చింది, బిడ్డ అరచేతిలో మచ్చ ఉంది
లచ్చు : నిజంగానా.. ఎక్కడ ఉంటారో తెలుసుకున్నావా, చెప్పవే
మంగమ్మ : ఫాలో అయ్యాను. ఇంటి ముందు ఆఫీసర్లు ఉన్నారు. పెద్దవాళ్లే అనుకుంటా
లచ్చు : అవన్నీ నీకు అనవసరం
మంగమ్మ : బిడ్డ ఇల్లు చూపిస్తా.. నాకు ఎంత ఇస్తావ్
లచ్చు : లక్ష ఇస్తానని చెప్పా కదా
మంగమ్మ : ఆ బిడ్డ మీకు దొరికితే నాతో మీకిక పని ఉండదు
లచ్చు : రెండు లక్షలు ఇస్తా
మంగమ్మ : అకౌంట్ నెంబర్ పంపిస్తున్నా
xxxxx
దామోదర్ : ఏమైనా చేస్తారేమో.. చంపేస్తారా.. చిన్నా ఇంకా రాలేదా ?
దయాకర్ : అన్నా.. భయపడకండి, ఫోన్ చేశాను. అప్పుడే బైలుదేరానన్నాడు.
మధుమతి : వాడికి నేను ఎప్పుడో ఫోన్ చేసి చెప్పాను, ఇంకా ఎందుకు రాలేదు ?
అందరు ఆలోచిస్తుంటే అక్కడికి సుల్తాన్, సంపత్ వచ్చారు. హాల్లో మెయిన్ టీవీకి సిస్టం కనెక్ట్ చేసి, మానిటర్స్ అన్నీ సెటప్ చేసాడు. పావుగంటకి టీవీ మీద చిన్నా కనిపించాడు. వాడు బండి మీద ఉన్నాడు.
సుల్తాన్ : చిన్నా వినిపిస్తుందా
చిన్నా : వినిపిస్తుంది
దామోదర్ : ఏం జరుగుతుంది సుల్తాన్.. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు
సుల్తాన్ : లావణ్య గారిని తీసుకెళ్తున్నప్పుడు సీసీలో రికార్డు అయిన వీడియో చూసాం. కారు నెంబర్ ఫేక్ అని తేలింది. మధ్యాహ్నం నుంచి అన్నీ చెకపోస్ట్ ల సీసీ కెమెరాలని హాక్ చేసి వెతికితే ఇందాక కాంకోల్ ప్లాజా దాటినట్టు కనిపించింది.
దయాకర్ : హాక్ చేశారా ! మనం చిన్నాని ఎలా చూడగలుగుతున్నాం ?
సుల్తాన్ : నేనే తయారు చేశాను. చిన్న బగ్.. ఆ డ్రోన్ చిన్నా పైన ఉండి మనకి చుట్టూ చూపిస్తుంది
దయాకర్ : సౌండ్ రాదా
సుల్తాన్ : చాలా ఎత్తులో ఉండి జూమ్ చేస్తుంది, ఎక్కువ రాదు
దయాకర్ : నేను మా వాళ్ళని అలెర్ట్ చేస్తాను.
దామోదర్ : వద్దు.. నేను ముంబై మినిస్టర్ తొ మాట్లాడతాను. చిన్నా ఎంత దూరం వెళ్తాడో వెళ్ళనీ, వాళ్లకి మనం వెంబడిస్తున్నామని తెలిస్తే వాళ్ళ ప్లాన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది
దయాకర్ : కానీ
దామోదర్ : నాకు మీ ఆఫీసర్ల మీద నమ్మకం లేదు దయాకర్
దయాకర్ : ఒక్కడినే పంపుతున్నాం, వాడికి ఏమైనా జరిగితే.. ఒకప్పుడు వేరే కానీ ఇప్పుడు..
సంపత్ : ఏమి జరగదు అన్నా.. అక్క కూడా వెళ్తుంది
దయాకర్ : ఎవరు ?
సంపత్ : గంట ముందు అక్షిత అక్క ఫోన్ ఆన్ అయినట్టు నోటిఫికేషన్ వచ్చింది, వెంటనే ఎమర్జెన్సీ అని మెసెజ్ పెట్టాను. కమింగ్ అని మెసెజ్ పెట్టింది. ఇందాకే ఫోన్ చేశాను. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పాను. అక్క కూడా వెళ్తానంది.
దామోదర్ : తనని కూడా చూడగలమా ?
సుల్తాన్ : లేదు సర్
xxxxx
శృతి ఫోన్ మొగుతుంటే ఎత్తింది
అక్షిత : శృతీ..
శృతి : అక్కీ.. చిన్నా ఒక్కడే పోయాడంట.. అది ఎలా ఉందో.. జైల్లో కూర్చుని చేయిస్తున్నారంటే వాళ్ళు ఎంత డేంజర్.. నాకు భయంగా ఉంది
అక్షిత : అవన్నీ వాడు చూసుకుంటాడులే.. నేనూ వెళ్తున్నా.. భయపడకు.. ఇంతకీ ఎవరు ఏడుస్తుంది ?
శృతి : ఇంకెవరు నా కొడుకు
అక్షిత : నీకు కొడుకు పుట్టాడా !
శృతి : హా మొత్తం నీ పోలికలేనే.. ఇదిగో విను.. రేయి కన్నా.. ఇదిగో నీ అత్త.. నీ అక్షిత
"యా.. యా.. య్యే.."
శృతి : మాట్లాడు..
అక్షిత : హలో
"అక్.. క్.. కా.. అక్క్..క్కా"
శృతి : నిన్నే పిలుస్తున్నాడు.
అక్షిత : వాడికి నేను తెలుసా !
శృతి : నీ ఫోటో చుడనిదే పాలు కూడా తాగడు, రోజు నీ ఫోటో ఒకటి నమిలి చించుతాడు. నీకు ఇవన్నీ ఎందుకు, నువ్వు మనుషుల్లో ఉండే రకం కాదు కదా
"అక్.. క్.. కా.. అక్క్..క్కా"
శృతి : ఒక్కసారి వాడిని చూసి ఎత్తుకుని మళ్ళీ వెళ్లిపోవే.. నేను ఆపను
అక్షిత : ముందు లావణ్యని తెద్దాం
శృతి : అది చాలా మంచిదే.. దానికి అస్సలే భయం. ఏం కాకుండా బయటపడితే తిరుపతి కాలినడకన వెళ్తాను
అక్షిత : జాగ్రత్త..
శృతి : మీరు జాగ్రత్త.. నువ్వు, చిన్నా, లావణ్య
హ్మ్ అని పెట్టేసింది. సంపత్ కి ఫోన్ చేసింది.
సంపత్ : హలో ఎవరు ?
అక్షిత : నేనేరా.. ఇప్పుడు ఎక్కడున్నారు ?
సంపత్ : చిన్నా హైదరాబాద్ ఇప్పుడే దాటేసాడు. ముంబై హైవేలో ఉన్నాడు
అక్షిత : వెళ్తున్నా
సంపత్ : ఎలా వెళ్తున్నావ్ ?
అక్షిత : కారులోనే.. ఎవరిది అని అడక్కు నాకు కూడా తెలీదు
సంపత్ : ఈ ఫోన్ ?
అక్షిత : నాకు మాత్రం ఏం తెలుసురా.. ఎవరిదో మరి ఇది
సంపత్ : అక్కా.. ఈ ప్రపంచంలో నీకు అతి పెద్ద ఫ్యాన్ లేదా భక్తుడు ఉన్నాడంటే అది నేనే
అక్షిత : హహ.. అప్డేట్ చేస్తూ ఉండు. పెట్టేసింది
సంపత్ : హంట్ బిగిన్స్
సుల్తాన్ నవ్వాడు
దయాకర్ : ఎంజాయి చేస్తారేంట్రా.. ఎత్తుకెళ్ళింది మన అమ్మాయిని
సుల్తాన్ : కాపాడ్డానికి వెళ్లిన వాళ్ళు కూడా మాములోళ్లు కాదు కదా భయ్యా
సంపత్ : అమ్మా.. మీరు కంగారుపడకండి, మమ్మల్ని నమ్మండి. ఓ కప్పు కాఫీ ఇస్తే.. ఒరేయి ఇవన్నీ వాడు వింటున్నాడా !
సుల్తాన్ : మ్యూట్ లో ఉందిలే