Update 02
రాహుకాలం 9:30 కు వెళ్లిపోగానే గుడిసె ముందు వారుసగా మూడు కార్లు వచ్చి ఆగాయి . చివరి కారులోనుండి మొదటగా మధ్యవర్తి దిగగానే జానకి తండ్రి అతడిని చేరుకున్నాడు .
మధ్యవర్తి : నారాయణ గారూ అమ్మాయి రెడీ కదా అని కాస్త భయపడుతూనే అడిగాడు .
తండ్రి : మీరు చెప్పినట్లుగానే ........
మధ్యవర్తి : హమ్మయ్యా ........ అని గుండెలపై చేతినివేసుకున్నారు . రండి రండి మీకాబోయే వియ్యంకురాలు అక్కడ అని ముందు కారు దగ్గరకు తీసుకెళ్లారు - కాస్త జాగ్రత్త ఆమెకు అన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలి .
తండ్రి : అలాగే అని తన శ్రీమతితోపాటు వెళ్లి కారులోనుండి దిగిన వారిని సతీసమేతంగా లోపలికి ఆహ్వానించారు .
మధ్యవర్తి : మేడం ........ వీరే అమ్మాయి తల్లిదండ్రులు నారాయణ - జయమ్మ . నారాయణా ........ వీరు పెళ్ళికొడుకు తల్లి నాగాంబ గారు తమ ఊరికే గొప్ప .........
వియ్యంకురాలు : చేతితో అలా సైగ చెయ్యగానే మధ్యవర్తి సైలెంట్ అయిపోయాడు. ఒసేయ్ చారు ....... చూశావా పెళ్ళిచూపులకే పెళ్లిలా ఇంటిని అలంకరించి మనల్ని సాధారంగా ఆహ్వానించడానికి సతీసమేతంగా వచ్చారు . అన్నయ్య గారూ - వదిన చాలా సంతోషం ఎలా ఉన్నారు అని పలకరించగానే ......
తల్లిదండ్రులిద్దరికీ చాలా ఆనందం వేసి లోపలికి ఆహ్వానించారు .
చారు గారు : చెప్పానుకదే నువ్వు అదృష్టవంతురాలివని , లోపల నీకాబోయే కోడలిని చూస్తే నీకే అర్థమైపోతుంది పదా .........
వియ్యంకురాలు : శివ , నాన్నా ...... మురళి కారులోనే ఉండిపోతారా ? .
చారు : శివకు కూడా మొదటి పెళ్లిచూపులు కదే - ఆ మాత్రం సిగ్గుపడకపోతే ఎలా చెప్పు అని నవ్వుకున్నారు .
మధ్యవర్తి : మేడం ........ మీరు లోపలికివెళ్లండి నేను బాబును పిలుచుకునివస్తాను .
నారాయణ : మేడం ....... లోపలికి రండి .
వియ్యంకురాలు : మేడం ఏమిటి అన్నయ్యా , చెల్లెమ్మా అని ఆప్యాయంగా పిలవండి .
చారు : మేడం గారు పూరిగుడిసెను కాకుండా అలంకరణ - మంచితనానికే ఫ్లాట్ అయిపోయారన్నమాట , కోడలిని చూడకముందే బంధాలు కలిపేస్తున్నారు .
వియ్యంకురాలు సంతోషంతో లోపలికి అడుగులువేశారు .
నారాయణ : మేడo ....... చెల్లెమ్మా తప్పుగా అనుకోకండి కాస్త వొంగి లోపలికి రండి తలకు తగులుతుంది .
వియ్యంకురాలు : అలాంటిదేమీ లేదు , మీ మంచితనం గురించి తెలుసుకునే వచ్చాము - గుడిసెలో ఉంటున్నా మీరు మంచితనంలో మాకంటే ఎత్తులోనే ఉన్నారు అని లోపలికివచ్చి కూర్చుని ఆహా ....... ఎంత చల్లగా ఉంది , చారూ ...... ఈ చల్లదనంతో పోలిస్తే AC ఏపాటిది అని చుట్టూ చూస్తున్నారు .
అంతలో మధ్యవర్తి ఇద్దరిని లోపలికి పిలుచుకునివచ్చారు .
వియ్యంకురాలు : మా పెద్దబ్బాయి శివ పెళ్ళికొడుకు మా వందల ఎకరాల్లో బంగారం లాంటి పంటలను పడిస్తున్న రైతు - చిన్నబ్బాయి మురళి బెంగళూరులో " గొప్ప " సాఫ్ట్వేర్ ఇంజనీర్ ..........
నారాయణ : చాలా సంతోషం బాబు రండి లోపలికి రండి అని ఆహ్వానించి కుర్చీలలో కూర్చోబెట్టారు .
వియ్యంకురాలు : మీరు అనుకోవచ్చు ఇంత ఆస్తి ఉండి పెద్దబ్బాయిని కూడా చదివించవచ్చు కదా అని , నా కోరికా అదే కానీ మా పెద్దబ్బాయికి చదువు వంటబట్టనేలేదు - కాలేజ్ కు వెల్లమంటే వాళ్ళ నాన్నగారి వెంట పొలానికి వెళ్ళేవాడు - కొన్నేళ్ల క్రితం ఆయన స్వర్గస్థులవ్వడంతో ఇక ఆ బాధ్యతలన్నీ వాడే చూసుకుంటున్నాడు , చదువులో జీరో కానీ వ్యవసాయం లో నెంబర్ వన్ - నా చిన్నకొడుకు అలా కాదు చదువులో నెంబర్ వన్ ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ పూర్తిచేయ్యగానే బెంగళూరులో నెలకు ఆరెంకలు సంపాధిస్తున్నాడు , అందుకే నాకు నాపెద్దబ్బాయి కంటే చిన్నవాడు అంటేనే ఎక్కువ ఇష్టం - ప్రాణం .
చిన్నబ్బాయి మురళి : అమ్మా ....... అన్నయ్య లేకపోతే నేను ఇంజనీరింగ్ పూర్తిచేసేవాన్ని కాదు - ఆ ఆరెంకలు సంపాదించేవాన్నే కాదు - నా హీరో నా అన్నయ్య అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను .
పెద్దబ్బాయి శివ : తమ్ముడూ ........ అమ్మ మాటకు ఎదురు చెప్పొద్దు అని చెప్పానుకదా .........
మురళి : మరి పెళ్ళిచూపుల్లో కూడా మాఅన్నయ్యను తక్కువచేస్తే నేను ఊరుకోను . మమ్మీ ......... please .
చారు : సరిపోయారు ఇద్దరూ ........ , ఒకరంటే ఒకరికి ప్రాణం - ఇద్దరికీ అమ్మ అంటే అంతులేని ప్రాణం . చూడండి అన్నయ్యగారూ ........ మీ అల్లుడిని చూస్తున్నారుకదా అమాయకుడే కానీ ఒక్కసారి పంచె కట్టి పొలంలోకి దిగాడంటే బంగారం పండించేంత బలవంతుడు .
మురళి : థాంక్యూ అంటీ ......... , మా అన్నయ్య అల్వేస్ గ్రేట్ .
వియ్యంకురాలు : లోలోపలే మురిసిపోతున్నారు . నువ్వు ఎంతైనా చెప్పు నాన్నా ......... నాకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం - నీవల్లనే ......... మన ఊరిలో మనకు కాస్తయినా ........
మురళి : మమ్మీ ........ పెళ్లిచూపులు నాకు కాదు అన్నయ్యకు మరిచిపోయారా ? .
చారు : ఇది రోజూ ఉండేదే కానీ అన్నయ్యగారూ ........ పెళ్లిచూపులు కానివ్వండి .
ఇరుగుపొరుగు ముత్తైదువులు ....... జయమ్మను ఆపి వడివడిగా స్వీట్స్ - స్నాక్స్ - పూలను తీసుకువచ్చి ఉంచారు .
వియ్యంకురాలు : వీరంతా ........
జయమ్మ : ఇరుగుపొరుగువారు వదినగారూ , బంధువులకంటే ఎక్కువ - ఏ ఇంట్లో ఫంక్షన్ జరిగినా ఇలా కలిసిపోతాము - పూలతో అలంకరణ మొత్తం వీరు చేసినదే .........
ముత్తైదువులు : జానకి - ఇందు అంటే ఇష్టం కాబట్టి చేసాము అని సంతోషంతో చెప్పారు .
వియ్యంకురాలు : సొంత బంధువులే చెయ్యరు - పెళ్ళిచూపులకే ఇంతమంది వచ్చారంటే మేము సరైన వారితోనే బంధుత్వం కలుపుకోబోతున్నాము చాలా చాలా సంతోషం . జానకి ....... మేము చూడబోయే అమ్మాయి - మరి ఇందు ఎవరు? .
చారు : ఇంకా అడగలేదే అని చూస్తున్నానే నాగాంబ , కాస్త తొందరగా అమ్మాయిని చూయించండి నా స్నేహితురాలు - శివ ........ ఆగలేకపోతున్నారు . జానకితోపాటు ఇందు కూడా వస్తుంది చూడు .
శివ : అంటీ ........ అలాంటిదేమీ లేదు .
చారు : అయితే ఈరోజంతా చూడకుండా ఉండగలవా , ఇప్పుడు వెళ్ళిపోయి రేపు వద్దామా ....... ? .
శివ : నో అంటీ నో ..........
అందరూ నవ్వేశారు .
నారాయణ సైగచెయ్యడంతో జయమ్మతోపాటు ముత్తైదువులంతా గదిలోకివెళ్లారు. అప్పటికే ఇందు ....... పెళ్ళికొడుకుని గదిలోనుండి తొంగి తొంగి చూసినట్లు ,
అక్కయ్యా అక్కయ్యా ........ అమాయకుడు అంటున్నారుకానీ హీరోలా ఉన్నారు బావగారు నాకైతే నూటికి 200 % నచ్చేశారు - స్వీటీ నీకు అని ఎక్కడ కౌగిలించుకుంటే చీరకు మడతలు పడతాయేమోనని తాకకుండా చేతులను చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది.
జానకి : అందమైన సిగ్గులతో ........ , నా చెల్లికి నచ్చితే మీ బావగారిని చూడకుండానే ok చేసేస్తా ..........
స్వీటీ : జానకి బుగ్గపై ముద్దుపెట్టింది .
ముత్తైదువులు : అలా ఏమీ కుదరదు జానకీ ........ , నీ చెల్లి చెప్పినట్లు హీరోలానే ఉన్నాడు - గడసరి అయినా మంచి అత్తయ్య ......... , మా జానకి అదృష్టవంతురాలులే ......... ఇదిగో పెదాలపై చిరునవ్వులతో వెళ్లి అందరికీ కాఫీ అందివ్వు - ఇందు తోడుగా వెళ్లు .
జానకి : అమ్మా ..........
జయమ్మ : ఆనందబాస్పాలతో బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి పంపించారు .
జానకి : ట్రే అందుకుని చెల్లీ ........ ప్రక్కనే ఉండు కంగారు వేస్తోంది .
ఇందు : కంగారుపడకుండా పెళ్లిచూపులు ఎంజాయ్ చెయ్యి అక్కయ్యా ........ , నేను నీ వెనుకే ఉంటానుకదా స్వీటీ కూడా , నీ హీరోగారిని చూడగానే మమ్మల్ని మరిచిపోతావులే అని నవ్వించి వెనుకే నడిచింది .
చిన్న హాల్లోకి అడుగుపెట్టగానే , ఒసేయ్ జానకి - అక్కయ్యా అక్కయ్యా - ఒసేయ్ ఇందు ....... చెప్పనేలేదు జానకికి - మాకిష్టమైన అక్కయ్యకు పెళ్ళిచూపులని అని ఏకంగా కాలేజ్ బ్యాగ్స్ తో లోపలికి చాలామంది అమ్మాయిలు తోసుకుంటూ వచ్చేసి , wow ........ జానకి - అక్కయ్యా బ్యూటిఫుల్ ........ పెళ్ళివారు ఉండటం చూసి sorry sorry అంటూ హాల్ మొత్తం ఆక్రమించేశారు .
నారాయణ : వీరంతా మా అమ్మాయిల స్నేహితులు చెల్లెమ్మా ........
ఇందు : ష్ ష్ ........ అంటూ అందరివైపు సంతోషంతో సైగచేసింది . ( ఒసేయ్ ...... మాకు చెప్పనేలేదు , విషయం తెలియగానే కాలేజ్ బంక్ కొట్టి వచ్చేసాము ఉండు నీ పని చెబుతాము ) , ఇందు నవ్వుకుని అక్కయ్యా ........ ముందు అత్తయ్యగారికి ఇవ్వు .
వియ్యంకురాలు : ఇందు పిలిచిన అత్తయ్య ......... అన్న పిలుపుకే పులకించిపోతున్నారు .
జానకి : తలదించుకునే చిరునవ్వుతో అందించి ప్రక్కనున్న ఆమె దగ్గరికి చేరుకుని , ఆశ్చర్యంతో అంటీ అంటీ ....... ( నిన్న షాపింగ్ లో సహాయం చేసినవారు ) .
చారు అంటీ : మనం తరువాత మాట్లాడుదాము , పెళ్ళికొడుకు నా ఫ్రెండ్ కొడుకే - మీ ఆనందం చూస్తుంటే నచ్చినట్లు ఉన్నాడు వెళ్ళండి వెళ్ళండి అందరికీ కాఫీ ఇచ్చి , నీ హీరోని చూసి ok చేసేయ్ మరి అని పంపించింది .
జానకి : అలాగే అంటీ అని ప్రక్కనే ఉన్న మురళి కు అందించి ఆ తరువాత వణుకుతున్న చేతులతో please అంటూ కాఫీ అందించింది .
శివ కూడా తలదించుకునే వణుకుతూ అందుకున్నాడు .
చారు అంటీ : ఇద్దరూ సిగ్గుపడితే ఎలా ఒకరినొకరు చూసుకోవాలి కదా ....... సిగ్గుపడుతూనే ఒకరినొకరు చూసుకుని పెదాలపై చిరునవ్వులతో కదలకుండా ఉండిపోయారు .
వారి పరిస్థితిని గమనించిన అందరూ లోలోపలే ముసిముసినవ్వులు నవ్వుకుంటూ డిస్టర్బ్ చెయ్యడం లేదు .
చారు అంటీ : ఒసేయ్ నాగాంబ ........ నీ కాబోయే కోడలు అక్కడ , నువ్వెంటి ఇందు వైపే చూస్తున్నావు .
వియ్యంకురాలు : ఒసేయ్ ........ ఇంట్లోకి అడుగుపెట్టగానే - ఇప్పుడు తనను చూడగానే నా పెద్ద కోడలిగా జానకిని ఫిక్స్ చేసేసాను ఇక ఇక .........
చారు అంటీ : నీ మనసులో ఏముందో నాకు తెలుసులే కానీ ........ ముందు ఈ తతంగం కానివ్వు నెమ్మదిగా అక్కడికీ వెళదాము . బాబు శివ ....... ఎంతసేపు అలానే చూస్తావు కాఫీ కూడా చల్లారిపోతోంది - ఇంతకీ అమ్మాయి నచ్చినట్లా లేదా ......... ? .
శివ : అమ్మకు - తమ్ముడికి నచ్చితే నాకు ok .
మురళి : నేనెప్పుడో వదినగా ఫిక్స్ అయిపోయాను అన్నయ్యా .......... , చెబుతున్నాను కదా మమ్మీకి కూడా ....... ఏంటి మమ్మీ .......
వియ్యంకురాలు : నేను ఎలాంటి కోడలు కావాలని ఆశపడ్డానో ....... కోడలిని కాదు కూతురిని కోరుకున్నానో జానకి అలానే ఉంది . నాకు ఆ దేవుడు కూతురిని ఇవ్వలేదు అని బాధపడేదాన్ని తల్లీ జానకీ ఇప్పటికి నా కోరిక తీరబోతోంది .
జానకి : అత్తయ్యగారూ ......... అంటూ సంతోషంతో పాదాలను స్పృశించింది .
వియ్యంకురాలు : నో నో నో అక్కడ కాదు జానకీ ఇక్కడ అంటూ లేపి కౌగిలించుకుంది .
ఇందు కళ్ళల్లో ఆనందబాస్పాలతో అత్తయ్యగారూ ........ అంటూ పాదాలను స్పృశించబోతే ఆపి ఇద్దరినీ కౌగిలించుకుంది .
వియ్యంకురాలు : తల్లీ జానకీ ........ నీకంటే అందమైన ఈ సౌందర్యారాసి గురించి - ఈ అందమైన చిలుకా చెప్పవా .........
జానకి : అత్తయ్యగారూ ......... ఇంటర్ సెకండ్ ఇయర్ govt గర్ల్స్ కాలేజ్ లో చదువుతోంది - 10th , ఫస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంక్ సాధించింది - చెల్లిని బాగా చదివించాలని మా ఆశ - చిలుక పేరు స్వీటీ నిన్ననే మాలో జాయిన్ అయ్యింది .
వియ్యంకురాలు : కంగ్రాట్స్ ఇందు ........ , అవును జానకీ ....... కాలేజ్ ఇక్కడికి చాలా దూరం కదా ? .
ఇందు : రోజూ అక్కయ్యే సైకిల్లో వదిలి సాయంత్రం మళ్లీ ఇంటికి పిలుచుకునివస్తుంది .
వియ్యంకురాలు : బయట సైకిల్ చూసానులే ......... , జానకీ ....... మా అబ్బాయి నీకు నచ్చాడా ? .
జానకి : చెల్లికి నచ్చితే నాకు ........
ఇందు : ఇంట్లోకి వచ్చినప్పుడే చూడగానే నచ్చేశారు అక్కయ్యా - అత్తయ్య గారూ ..........
శివ : థాంక్యూ sooooo మచ్ అని సంతోషంతో చెప్పి సిగ్గుపడ్డాడు .
చారు : నాకు నిన్ననే తెలుసు రెండు కుటుంబాలు అదృష్టవంతులు అని , కూతుర్లను ...... ok ok కూతురిని పొందబోతున్న అత్తయ్య - అమ్మ లాంటి అత్తయ్యను పొందబోతున్న కోడలు ........
వియ్యంకురాలు : అందరితోపాటు నవ్వుకుని , చాలా సంతోషం జానకీ - ఇందు ......... , అన్నయ్యా - వదినా ......... మాకు మాత్రమే కాదు మాకైతే మీ ఇల్లు , అమ్మాయిలు ....... అమ్మాయి అమ్మాయి , మీకున్న మంచి పేరు బాగా నచ్చాయి . మీకూ నచ్చాలి వీలుచూసుకుని తొందరగా మా ఇంటికీ వచ్చి చూసి ఒప్పితే ఆ వెంటనే ముహూర్తాలు పెట్టుకోవచ్చు - మధ్యవర్తిని ఎంత త్వరగా వీలయితే అంత తొందరగా ........ అని ఆర్డర్ వేశారు .
తండ్రి : మీరెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాము చెల్లెమ్మా ........ , కానీ అదీ అదీ .........
వియ్యంకురాలు : కట్నం గురించి ఏమాత్రం టెన్షన్ పడకండి - దేవుడిచ్చిన తరతరాలుగా వచ్చిన ఆస్తినే ఎలా ఖర్చు చెయ్యాలో తెలియటం లేదు - నా ఇద్దరు బిడ్డలు ప్రతీ సంవత్సరం ఆస్తులను రెట్టింపు చేస్తూనే ఉన్నారు . పెళ్లి ఖర్చులన్నీ మావే ........ ఊరుమొత్తాన్ని ఆహ్వానించినా సంతోషమే .........
చుట్టూ ఉన్న స్టూడెంట్స్ అందరూ సంతోషం కేరింతలతో ఆనందిస్తున్నారు - ముత్తైదువులు ....... మా బంగారు తల్లులు అని మురిసిపోతున్నారు . స్వీటీ ఇందు భుజం పై రెక్కలు ఆడిస్తూ సంతోషం వ్యక్తం చేస్తోంది .
వియ్యంకురాలు : ఇంతమంది ప్రేమలను పొందిన మీరు అందరికంటే ఐశ్వర్యవంతులు - ఒసేయ్ చారూ ........ మేము మాత్రమే అదృష్టవంతులం - జానకీ ఇందు ......... మన ఇంట్లో మళ్లీ కలుద్దాము , అన్నయ్యగారూ - వదినా వెళ్ళొస్తాము .
తండ్రి : చెల్లెమ్మా ......... మా తోటలో మీ కోడలు పండించిన ఆర్గానిక్ పళ్ళు - కూరగాయలు అని అందించారు .
వియ్యంకురాలు : సంతోషం అన్నయ్యగారూ ........ , మా ఊరిలో మీ అల్లుడు పండించినవి చూడటానికి తొందరగానే రావాలి మరి , మురళి ........
మురళి : పళ్ళు - కూరగాయలు అందుకుని థాంక్స్ మావయ్యగారూ అని సంతోషంతో చెప్పాడు .
అందరూ సంతోషంతో బయటకువచ్చి వెళ్ళొస్తాము అనిచెప్పి బయలుదేరారు . శివ ........ ప్రేమతో కొంటె చూపులు చూసాడు జానకి వైపు .
చారు : ఒసేయ్ నాగాంబ నిన్న షాపింగ్ మాల్ లో నీ కోడళ్లను ........ అంటూ జరిగినది మొత్తం వివరించింది .
వియ్యంకురాలు : నా కోడళ్ల కళ్ళల్లోనే కన్నీళ్లు తెప్పిస్తాడా అని కోపంతో ఊగిపోయారు . వాడికి ఎలా బుద్ధిచెప్పాలో నాకు బాగా తెలుసు అని తన ఫ్రెండ్ ఇంటికి బయలుదేరారు .
చారు అంటీ : కోడళ్లు ........ ? Ok ok ....... , శివకు సుగుణాల సౌందర్యారాసి దొరికింది అనుకుంటే - మురళికి ఏకంగా దివినుండి దిగివచ్చిన దేవకన్య అని మురిసిపోయారు . ఒసేయ్ ........ ఇంకా చదువుకోవాలని ఆశపడుతోంది కదే .
వియ్యంకురాలు : ఇంటర్ తరువాత నా చిన్న కోడలు ఏమి చదువాలని ఆశపడుతుందో , ఖర్చు మొత్తం నేనే పెట్టి చదివిస్తాను - నా కోడలు ఎంత రాణిస్తే అంత గౌరవం కాదూ నాకు అని గర్వపడుతూ చెప్పారు .
చారు అంటీ : మరి అంతవరకూ మురళి ఆగుతాడంటావా .... ?
వియ్యంకురాలు : ఆగాల్సిందే , నా మాటంటే వేదం వాడికి - అయినా వాడే చెప్పాడు మమ్మీ బెంగళూరులో సొంతంగా కంపెనీ మొదలుపెట్టేంతవరకూ పెళ్లి టాపిక్ తీసుకురావద్దని , 4 -5 years పడుతుందని చెప్పాడులే .........
చారు అంటీ : అలా అదృష్టం కలిసొస్తోందిలేవే నీకు అని ఆనందించారు .
వియ్యంకురాలు : అప్పటివరకూ ఇంటి తాళాలు నాదగ్గరే ఉంటాయి .
చారు అంటీ : ధగా ....... ధగా ....... మోసం .
వియ్యంకురాలు : నాకు చిన్నోడు అంటేనే ఎక్కువ ఇష్టం కాబట్టి , సర్వస్వం నా చిన్న కోడలికే బాధ్యతలు అప్పగిస్తాను అలా అని జానకిని ఏమాత్రం తక్కువ చేసి చూడను .
చారు అంటీ : నాకు తెలియదేమిటే అలా చెబుతున్నావు కోడళ్లను కూతుర్లలా చూసుకోవూ .......... , ఇక లంక గ్రామంలో బంగ్లాలో ఉన్న నిన్ను బెంగళూరు - మైసూరు - హైద్రాబాద్ ......... ఇలా సిటీలన్నీ తిప్పి చూయించిన మురళి అంటే ఎంత ప్రాణమో నాకు తెలుసులే ....... , నీవలన నేనూ ఎంజాయ్ చేసానుకదా థాంక్స్ మురళీ ............
మధ్యవర్తి : నారాయణ గారితో తరువాతి కార్యక్రమాల గురించి మాట్లాడారు .
అక్కయ్యా - ఒసేయ్ ........ అంటూ స్టూడెంట్స్ అందరూ జానకిని సంతోషంతో పైకెత్తి బావగారు సూపర్ - హీరోలా ఉన్నారు అని ఆనందాన్ని పంచుకున్నారు .
జయమ్మ గారు అందరికీ స్వీట్స్ - స్నాక్స్ - పళ్ళు అందించి జానకిని అంతులేని ఆనందంతో కౌగిలించుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
ఇందు అయితే ఇద్దరినీ చుట్టేసి ఆనందం పట్టలేక తన అక్కయ్య బుగ్గను కొరికేసింది . నేను తక్కువ తిన్నానా అన్నట్లు స్వీటీ కూడా అందమైన ముక్కుతో కొరకడం చూసి అందరి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి.
ఫ్రెండ్స్ : ఒసేయ్ జానకీ - అక్కయ్యా - ఒసేయ్ ఇందు ........ చివరి పీరియడ్ కు అటెండ్ అవుతాము వస్తావా ....... ? .
ఇందు : ఈ ఆనందాలను వదిలి ఎక్కడికీ రాను వెళ్ళండి అని తోసేసింది ఎక్కడ బలవంతంగా లాక్కెళ్లిపోతారోనని ........
ముత్తైదువులు : జయమ్మ ....... కాలేజ్ కు వెళ్లిన పిల్లలకోసం అందించిన స్వీట్స్ - పళ్ళు అందుకుని నిశ్చితార్థపు డేట్ కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తుంటాము అని ఇంటికివెళ్లారు .
మధ్యవర్తి నారాయణ చేతిని కలిపి వెళ్లిపోయారు .
అక్కాచెల్లెళ్ళు : నాన్నగారూ ....... అంటూ గుండెలపైకి చేరిపోయారు .
తండ్రి : తల్లులూ ........ ఎంత ఆనందం వేస్తోందో మాటల్లో చెప్పలేను - అత్యంత సంతోషమైన రోజు - నా చిట్టి తల్లి చెప్పినట్లు మన మంచితనమే మనల్ని శిఖరాలకు చేర్చింది అని ఇద్దరి నుదుటిపై ఆనందబాస్పాలతో ముద్దుపెట్టి మురిసిపోయారు . తల్లులూ - శ్రీమతిగారూ ........ చెప్పండి వారి ఇంటికి ఎప్పుడు వెళదాము .
ఇందు : ఆక్కయ్య సిగ్గుని చూసి , ok ok అక్కయ్యా ........ నాన్నగారూ రేపే వీలవుతుందా ....... ? .
తండ్రి : రేపే అయితే స్వయంగా మీ అక్కయ్య అత్తయ్యగారే ...... మనల్ని సాధారంగా తీసుకువెళ్లాడానికి ఇష్టపడుతున్నారని మధ్యవర్తి చెప్పాడు .
ఇందు : వెంటనే ok చెప్పేయ్యండి నాన్నగారూ ....... అని సిగ్గుపడుతున్న అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టింది .
స్వీటీ : రేపే రేపే రేపే ......... అని ముద్దుపలుకులు పలుకుతోంది .
తండ్రి : శ్రీమతిగారూ మీరేమంటారు ........ ok అయితే , తల్లుల ఇష్టమే మన ఇష్టం అని కీ ప్యాడ్ మొబైల్ తీసి మధ్యవర్తికి కాల్ చేసి విషయం చెప్పి పెదాలపై చిరునవ్వు చిందించారు .
ఇందు : లవ్ యు నాన్నగారూ ....... అని అక్కయ్యకు గిలిగింతలు పెడుతూ లోపలికివెళ్లారు .
తల్లిదండ్రులిద్దరి ఆనందాలకు అవధులులేకుండా పోయాయి . అమ్మా దుర్గమ్మా ........ నా తల్లులు ఇలానే ఎల్లప్పుడూ చిరునవ్వులు చిందిస్తూనే ఉండాలి అని ప్రార్థించారు .
తండ్రి : శ్రీమతిగారూ ...... నేను తోట దగ్గరికి వెళుతున్నాను .
జానకి : నాన్నగారూ ........ చాలా పని ఉంది అనుకుంటాను నేనూ వస్తాను .
ఇందు : అక్కయ్యా ........ నేను కూడా ,
జానకి : అమ్మో ........ ఇంకేమైనా ఉందా , నా ముద్దుల చెల్లి కష్టపడటం నేను చూడలేను - హాయిగా ఇంట్లోనే ........
ఇందు : పెళ్లి అయ్యేంతవరకూ నా అక్కయ్యను వదిలి ఒక్క క్షణం కూడా విడిగా ఉండలేను - కాలేజ్ వరకూ ok , తోటలో చదువుకుంటాను అని కాలేజ్ బ్యాగ్ అందుకుంది .
జానకి : తియ్యదనంతో నవ్వుకుని బ్యాగు అందుకుంది .
అమ్మ : భోజనం వండి అక్కడికే తీసుకొచ్చేస్తాను అయితే వెళ్ళండి .........
అక్కాచెల్లెళ్ళు : మా అమ్మ బంగారం అని చెరొక బుగ్గపై ముద్దులుపెట్టి చీరల నుండి డ్రెస్ లలోకి మారి తమ నాన్నగారితోపాటు నడుచుకుంటూ తోటకు చేరుకున్నారు .
జానకి : చల్లని చెట్టు నీడలో చెల్లి చదువుకోవడానికి ఏర్పాట్లుచేసి , తోటలో పండిన అన్నిరకాల పండ్లను చెల్లి ముందు ఉంచింది ఆకలివేస్తే తినమని ........
ఇందు : లవ్ యు అక్కయ్యా ........
లంచ్ సమయానికి అమ్మ భోజనం తీసుకురావడంతో అందరూ కలిసి కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ తిన్నారు .
4 గంటలలోపు పండిన పళ్ళు - కూరగాయలు - పూలను మార్కెట్ కు తరలించి , ఈరోజు కలిగిన ఆనందంలో పనులన్నీ తొందరగానే పూర్తయ్యాయి అని చదువుకుంటున్న ఇందు దగ్గరికి చేరుకున్నారు .
నా టాపిక్స్ కూడా నాన్నగారూ అని ఇందు లేచివెళ్లి కుండలోనుండి చల్లని నీటిని తీసుకొచ్చి అందించింది . తన అక్కయ్య - అమ్మ నుదుటిపై పట్టిన చెమటను చున్నీతో తుడిచి పెద్ద ఆకు అందుకుని చల్లని గాలి తగిలేలా విసురుతోంది .
అమ్మ - అక్కయ్య : ఆఅహ్హ్హ్ ........ చల్లని గాలిలో హాయిగా తేలిపోతున్నట్లు ఉంది తల్లీ - చెల్లీ ........ లవ్ యు sooooo మచ్ .
తన అక్కయ్య అమ్మ ఒడిలో తల వాల్చడం చూసి , నేను కూడా అంటూ మరొకవైపున అమ్మ ఒడిలో గువ్వపిల్లలా వొదిగిపోయింది .
అమ్మ : ఇద్దరి నుదుటిపై ముద్దులుపెట్టి , ప్రేమతో మాట్లాడుతూ చిరునవ్వులు చిందిస్తున్నారు . నా తల్లి నాకంటే ప్రేమతో చూసుకునే అత్తయ్య దగ్గరికి చేరుతున్నందుకు చాలా ఆనందం వేస్తోంది .
ఇందు : అవునమ్మా ........ మా అమ్మ కౌగిలిలో ఎలా అయితే తియ్యదనం ఉందో , అత్తయ్యగారి కౌగిలిలో కూడా అలాంటి మాధుర్యమే కలిగింది - అక్కయ్య అదృష్టవంతురాలు అని అక్కయ్య బుగ్గపై చేతితో ముద్దుపెట్టింది . అయినా నీకెలా తెలిసిందమ్మా ....... , మేము ....... అత్తయ్యగారి కౌగిలిలో చేరాము కాబట్టి మాకు తెలిసింది .
అమ్మ : సంతోషంతో నవ్వారు . ఆ కౌగిలిలో నా బంగారు తల్లుల ఆనందం చూడగానే ఈ కన్నప్రేగుకు తెలిసిపోయిందిలే ......... , తల్లీ జానకీ ........ అత్తయ్యలా కాకుండా అమ్మలా సేవించుకోవాలి , మెట్టినిల్లు గౌరవం పెంచాలి .
పుట్టినిల్లు గౌరవం శిఖరాలను తాకేలా చేసిన నా కోడళ్లు ....... కోడలు , మెట్టినిల్లు గౌరవాన్ని ఆకాశానికి తీసుకెళతారేమో ......... అని సంతోషమైన మాటలు వినిపించడంతో ,
అత్తయ్యగారూ - వదిన గారూ - చెల్లెమ్మా - అంటీ ........ అంటూ అందరూ లేచి కాళ్ళూ చేతులూ ఆడనట్లు సంతోషిస్తున్నారు .
చారు అంటీ : ఇంటి దగ్గరికివెళ్లాము తాళం వేసి ఉండటంతో తోట ఎక్కడో తెలుసుకుని ఇక్కడకు వచ్చాము - మేమేమీ ఇబ్బందిపెట్టలేదు కదా ........
తండ్రి : ఎంతమాట , మీరు రావడం మా అదృష్టం ........ అని కంగారుపడుతూనే చెక్క మంచం తీసుకొచ్చి శుభ్రం చేసిమరీ కూర్చోమని చెప్పారు .
నాగాంబ : ప్చ్ ప్చ్ ........ నా కోడళ్ల ఆనందాన్ని డిస్టర్బ్ చేసాను . ఇందూ ....... నిన్ను చిన్నకోడలూ అని పిలవవచ్చు కదా ....... ? .
ఇందు : సంతోషంతో అత్తయ్యగారూ ....... అని నమస్కరించింది .
నాగాంబ మురిసిపోవడం చూసి , జానకీ - ఇందు ....... మీరు మీ అమ్మ మాట్లాడుకున్న మాటలకు మీ అత్తయ్యగారి పాదాలు నేలపై నిలబడటం లేదు తెలుసా అంత ఎంజాయ్ చేస్తున్నారు అని ముసిముసినవ్వులతో ఇద్దరి చెవిలో గుసగుసలాడారు చారు అంటీ ..........
నాగాంబ గారు : వదినగారూ - కోడళ్ళూ ....... తోటను ఎంత శుభ్రంగా చాలా అందంగా , ఎంతసేపైనా ఉండిపోవాలనిపిస్తోంది - కోడళ్ళూ ....... వచ్చి నాప్రక్కనే కూర్చోండి అని చేతులను అందుకున్నారు .
అమ్మ : సంతోషించి , వదినగారూ , చారు గారూ ........ పళ్ళు ఏమైనా తింటారా ? .
నాగాంబ : ఇష్టంగా వదినగారూ ........ కానీ ఇంటి నుండి వచ్చే ముందే ఇది టీ - స్నాక్స్ తో కడుపు నింపేసింది , ఇక వస్తూనే ఉంటాము కదా ......... , ఇప్పుడు వచ్చిన విషయం ఏమిటంటే - రేపే మీరు ఇల్లు చూడటానికి వస్తున్నారని చాలా సంతోషించాను , అమ్మా దుర్గమ్మా ........ నా కోడళ్లకు - వదిన గారికి - అన్నయ్య గారికి అందరికీ అందరికీ ముఖ్యన్గా నా బుజ్జి కోడలికి మా ఇల్లు నచ్చేలా చూడు అని ప్రార్థించారు . కోడళ్ళూ ........ తొలిసారిగా మన ఊరిలో అడుగుపెట్టబోతున్నారు కదా దేవకన్యల్లా ........ తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను దానికోసం షాపింగ్ కు తీసుకెళ్లాలని వచ్చాను - మీకు ఇష్టమైతే ........
తండ్రి : చెల్లెమ్మా ........ మీ కోరిక ప్రకారమే తీసుకెళ్లండి అని సంతోషంతో బదులిచ్చారు .
నాగాంబ : అన్నయ్యగారూ , వదిన గారూ ......... మీరు కూడా వస్తే ఆనందిస్తాను .
తండ్రి : వస్తాము చెల్లెమ్మా ........
నాగాంబ : కోడళ్ళూ ....... వెళదామా ? .
ఇందు : ఒక్క నిమిషం అత్తయ్యగారూ ....... అని వినయంగా లేచి చెట్టుకింద పరుపుపై ఉన్న బుక్స్ ను బ్యాగులో పెడుతోంది .
నాగాంబ : ఒసేయ్ చారూ ........ నా చిన్న కోడలికి చదువు తప్ప వేరే ధ్యాసే లేనట్లుంది అని గర్వపడుతూ చెప్పారు .
చారు అంటీ : చూస్తుంటే అలా కనిపించడం లేదు నాకు - మొదట అక్కయ్య సంతోషం ఆ తరువాతనే చదువు ....... నిజం చెప్పు ఇందూ .......
ఇందు : మీరు చెప్పినది నిజమే అంటీ ........ , అమ్మ చెప్పినట్లు అమ్మలా చూసుకునే అత్తయ్యగారు ..... అక్కయ్యకు అని కళ్ళల్లో బాస్పాలతో - ఇక ఏ కోరికా లేదు నాకు .
అక్కయ్య : కూడా అదే ఫీల్ తో అత్తయ్యగారి చేతిని గట్టిగా పట్టుకుంది .
అక్కాచెల్లెళ్ల ప్రేమ అర్థమైనట్లు సంతోషంతో ఇద్దరి చేతులను అందుకున్నారు - ఇంటికివెళ్లి రెడీ అయ్యి వెళదాము అని రెండు కార్లలో బయలుదేరారు .
అక్కాచెల్లెళ్ళు ....... కారులో తమ అత్తయ్యగారికి ఇరువైపులా కూర్చుని ఆనందంతో పొంగిపోతున్నారు .
ఇందు : అత్తయ్యగారూ ........ కారులో ప్రయాణించడం ఫస్ట్ టైం మీ వలన ఈ కోరిక తీరింది థాంక్యూ sooooo మచ్ .
చారు అంటీ : వెనక్కు తిరిగి ఇకనుండీ ....... మీ జీవితమే మారబోతోంది ఇందు - కోరికలన్నీ తీరబోతున్నాయి . నేను - మీ అత్తయ్యగారిని ...... మా మురళి తొలిసారి ఫ్లైట్ లో తీసుకెళ్లినప్పుడు ఎలా ఆనందించామో ...... , ఆ ఆనందం ఇప్పుడు మీలో చూస్తుంటే ఇప్పుడు సిగ్గేస్తోంది .
ఇంటికి చేరుకుని అత్తయ్య గారు - చారు అంటీని లోపలకు ఆహ్వానించి కూర్చోబెట్టి టీ - స్నాక్స్ అందించారు . నిమిషాల్లో రెడీ అయ్యి బయలుదేరారు .
అక్కయ్య ........ అత్తయ్యగారిని ఏదో అడగాలని సంశయం చెందుతుండటం , అడగడానికి ఆశపడటం తెలిసి ఇందు లోలోపలే నవ్వుకుంది . అత్తయ్యగారూ ...... ఒకటి అడగవచ్చా ? .
అత్తయ్య గారు : నిర్మొహమాటంగా బుజ్జికోడలా ....... ? ,
ఇందు : అత్తయ్యగారూ అత్తయ్యగారూ ........ బావగారు రాలేదా ? .
అత్తయ్యగారు : సంతోషించి , సిగ్గుపడుతున్న జానకివైపు తిరిగి , sorry జానకి ......... నిన్న ఇద్దరినీ ఒంటరిగా మాట్లాడించలేకపోయాము - చారూ ...... నువ్వైనా గుర్తుచేయ్యాల్సింది .
చారు అంటీ : sorry జానకీ ...... నాకు కూడా గుర్తుకురాలేదు . ఇప్పుడు మాట్లాదిద్దామంటే శివ ....... తన కాబోయే భార్యను అంగరంగవైభవంగా రిసీవ్ చేసుకోవడానికి ఏర్పాట్లుచేయడానికి ఊరికి వెళ్ళాడు - ఇందూ ........ మురళి అయితే ఆఫీస్ లో అర్జెంట్ మీటింగ్ ఉందని , వదిన వాళ్లకు ఏలోటూ రాకుండా చూసుకోండని ఆర్డర్ వేసి బెంగళూరు వెళ్ళిపోయాడు - ఎప్పుడు వచ్చినా ఒక్కరోజు కూడా ఉండడు , అలా వచ్చి ఇలా తుర్రుమంటాడు .
రెండు లగ్జరీ కార్లు షాప్ ముందు ఆగడం చూసి మంచి భేరం వచ్చింది నేనే స్వయంగా రిసీవ్ చేసుకుంటాను అని నిన్న దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి డోర్ దగ్గరకు చేరాడు .
ఇందు : అత్తయ్యగారూ ........ ఈ షాప్ కా ? , ఇక్కడ చీరలు బాగానే ఉంటాయి కానీ లోపల ఒక వ్యక్తి ప్రవర్తన దురుసుగా ఉంటుంది - మీపై కూడా అలా ప్రవర్తిస్తే తట్టుకోలేము - నిన్న అంటీ వలన .........
అత్తయ్యగారు : మీ అంటీ అంతా చెప్పింది . వాడి కొవ్వు తగ్గించడం కోసమే ఇక్కడకువచ్చినది లేకపోతే నా సుకుమారమైన కోడళ్ల కళ్ళల్లోనే కన్నీళ్లు తెప్పిస్తాడా రండి అని కిందకుదిగారు .
వెనుక కారులోనుండి దిగిన ఇందు అమ్మానాన్నలు అలానే కంగారుపడుతున్నట్లు తలలు దించుకున్నారు .
అత్తయ్యగారు : కోడళ్ళూ .......... ఎంట్రన్స్ దగ్గరే మీ పెదాలపై చిరునవ్వులు చిగురించేలా చెయ్యకపోతే నేను మీ అత్తయ్యనే కాదు - అన్నయ్యా , వదినగారూ ........ ముందు మీరు అని ఇన్సిస్ట్ చేయడంతో మోహమాటపడుతూనే మెయిన్ డోర్ చేరుకున్నారు .
లోపల నుండి ఆ వ్యక్తే స్వయంగా మిర్రర్ డోర్ తెరిచి welcome సర్ అని సెల్యూట్ చేసి గౌరవంతో ఆహ్వానించాడు .
ఇందు అమ్మానాన్నలు సగర్వంగా తలలు ఎత్తడం - వాడు చూసి కంగుతినడం ఒకేసారి జరిగాయి , రేంజ్ రోవర్లలో అని షాక్ చెందినట్లు కళ్ళల్లోకి చూసే ధైర్యం చాలక తలదించుకుని వణుకుతున్నాడు .
వాడిని అలా చూడగానే ఇందు తల్లిదండ్రుల పెదాలపై చిరునవ్వులు - ఏదో తెలియని మహదానందమైన ఫీల్ తో వెనక్కుతిరిగి అక్కాచెల్లెళ్ళవైపు చూసారు .
ఆ చూపులలోని సంతోషాలకు అక్కాచెల్లెళ్ల ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి - అత్తయ్యగారూ అత్తయ్యగారూ ......... థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ అని చేతులను చుట్టేసి మురిసిపోతున్నారు .
అత్తయ్యగారు : కోడళ్ళూ ........ are you satisfied లేకపోతే చెప్పండి ........
అక్కాచెల్లెళ్ళు : Its more than enough అత్తయ్యగారూ ......... , చెప్పినట్లుగానే ఒక్కమాటకూడా మాట్లాడకుండానే అతడి తప్పు ఏమిటో తెలియజేసారు - అతడి మౌనం చాలు అని లోలోపలే ఎంజాయ్ చేస్తున్నారు .
అత్తయ్యగారు : నాకైతే satisfaction లేదు - మీరు కార్చిన కన్నీళ్లకు సరిపోలేదు కోడళ్ళూ ........ , అన్నయ్య గారూ - వదినా ....... అక్కడే ఆగిపోయారే - సంతోషంలో అడుగులుపడుతున్నట్లు లేదు అని వెనుకే లోపలికి అడుగుపెట్టి వాడి ముందు ఆగారు . ఇప్పటికిప్పుడు నిన్ను ఏమైనా చెయ్యగలను నా కోడళ్లు చాలు అన్నారు కాబట్టి వదిలేస్తున్నాను - డబ్బుకు కాదు మనుషులకు విలువ ఇవ్వడం నేర్చుకోవాలి , సంస్కారం తెలుసుకోవాలి .
ఆ వ్యక్తి : sorry మేడం .........
అత్తయ్యగారు : నాకు కాదు నా కోడళ్లకు - వారి తల్లిదండ్రులకు చెప్పండి .
అంతలో ఓనర్ వచ్చి మేడం ........ విషయం తెలుసుకున్నాను , మా పార్టనర్ తరుపున నేను క్షమాపణలు తెలుపుకుంటున్నాను .
అత్తయ్యగారు : కోడళ్ళూ ........
అక్కాచెల్లెళ్ళిద్దరూ ......... వారి అమ్మానాన్నల సంతోషం చూసి మురిసిపోతుండటం చూసి , Ok ....... its alright మళ్లీ ఇలా జరగకుండా చూసుకోండి అని చారు అంటీ చిరు వార్నింగ్ ఇచ్చారు .
ఓనర్ : Sure మేడం please welcome , గర్ల్స్ ......... షాప్ మొత్తం చూయించండి అని చెప్పారు . పార్ట్నర్ భుజం చుట్టూ చేతినివేసి రేయ్ ........ కష్టమర్స్ మనకు దేవుళ్ళతో సమానం , ఇంకొక్కసారి ఇలా జరిగితే నీ ప్లేస్ లో మరొకరు ఉంటారు అని వార్నింగ్ ఇచ్చి లోపలికివెళ్లారు .
ఆ వ్యక్తి : నారాయణ గారి దగ్గరకువెళ్లి , నిన్న మీతో దురుసుగా ప్రవర్తించినందుకు నన్ను మన్నించండి - ఇంకెప్పుడూ ఎవరితోనూ ఇలా ప్రవర్తించను అని చేతులుకట్టుకుని తలదించుకున్నాడు .
ఇద్దరూ ......... నాగాంబ దగ్గరకువెళ్లి చెల్లెమ్మా ........ నీవల్లనే అని నమస్కరించబోతే ,
నాగాంబ గారు ఆపి , అన్నయ్యగారూ ........ మీకోసం కాదులేండి నా కోడళ్లు - వదినగారికోసం ఇదంతా చేసాను అనిచెప్పడంతో అందరూ నవ్వుకున్నారు .
చారు అంటీ : ఒక్కమాటతో ఉద్వేగాలను సంతోషాలుగా మార్చేశావు నాగాంబ ........ , రండి ఇదే సంతోషంతో చీరలను సెలెక్ట్ చేద్దాము అని పిలుచుకునివెళ్లారు . The great నాగాంబ గారూ ........ ఏ రేంజ్ 50 వేల చీరలా లేక లక్ష నా ? .
నాగాంబ : నా కోడళ్లకు - వదినగారికి మన నుండి తొలికానుక ఎలా ఉండాలో .......
చారు అంటీ : అర్థమైంది అర్థమైంది , సేల్స్ గర్ల్స్ వైపు తిరిగి మీ షాప్ లో ఉన్న ఖరీదైన చీరలను చూయించండి .
సేల్స్ గర్ల్స్ : yes మేడం అంటూ లోపలికివెళ్లి మిర్రర్ బాక్సస్ లో ఉంచిన బంగారు జరీతో నేసిన పట్టుచీరలను ఐదారుమంది తీసుకొచ్చారు .
తీసుకొస్తుండగానే చూసి wow yes yes yes అంటూ సంతోషంతో ఒకరినొకరు చూసుకున్నారు నాగాంబ - చారు అంటీ ...........
సేల్స్ గర్ల్ : మేడమ్స్ ........ ఇవి రెడ్ అండ్ గోల్డ్ - ప్రైస్ వచ్చేసి 12500/- ........
అత్తయ్యగారు : ఉదయం రెడ్ కలర్ సారీలో జానకీ దేవకన్యలా ఉంది . కోడలూ ఇందు - చారు - వదినగారూ ........ రెడ్ కలర్లో డిజైన్ సెలెక్ట్ చెయ్యండి .
అక్కాచెల్లెళ్ళు : ఒక అద్భుతాన్ని చూసినట్లు అలా కన్నార్పకుండా చూస్తున్నారు .
అత్తయ్యగారు : కోడళ్ళూ కోడళ్ళూ ........ అని భుజాలు కదిపారు .
జానకి : తేరుకుని , నో నో నో అత్తయ్యగారూ ....... అంత ఖరీదైన చీర వద్దు అని తలదించుకున్నారు .
అత్తయ్యగారు : మా కోడళ్లు బంగారం - అయినా మీ అభిప్రాయం ఎవరు అడిగారు - నా అందమైన కోడళ్లకు నేను ప్రేమతో ఇస్తున్న కానుకలు - మిమ్మల్ని సెలెక్ట్ చెయ్యమని మాత్రమే చెప్పాను అని స్వీట్ ఆర్డర్ వేశారు .
చారు అంటీ : జానకీ ........ ఇప్పుడేమి చూసారు పెళ్లి ముహూర్తం ఫిక్స్ అవ్వనీ ఫ్లైట్ లో తీసుకెళ్లి షాప్ మొత్తం కొనిపించేస్తుంది మీ అత్తయ్య
అక్కాచెల్లెళ్ళతోపాటు జయమ్మ కూడా మాట్లాడబోతే నాగాంబ గారు ముగ్గురినీ ఆపి , జస్ట్ సెలెక్ట్ అని గడ్డం పట్టుకుని బ్రతిమాలడంతో నవ్వుకుని బ్యూటిఫుల్ రెడ్ కలర్ సారీ సెలెక్ట్ చేశారు .
అత్తయ్యగారు : జానకీ ........ రేపు ఉదయం ఈ చీరనే కట్టుకుని మన ఊరిలో అడుగుపెట్టాలి అని అందించారు . జానకీ ........ నీ ముద్దుల చెల్లికి ఇంతకంటే ఖరీదైన చీరను గిఫ్ట్ ఇద్దాము అని ఆశపడుతున్నాను .
చారు అంటీ : కాబోయే కోడలి కంటే తన చెల్లికి మరింత ఖరీదైన చీర ఎందుకే నాగాంబ .......... , ధగా ....... ధగా ........ మోసం మోసం అని లోలోపలే నవ్వుకుంటోంది .
అత్తయ్యగారు కూడా కన్నింగ్ గా లోలోపలే నవ్వుకుని , నువ్వు చెప్పు జానకీ ........
జానకి కళ్ళల్లో ఆనందబాస్పాలు ఆగడం లేదు .
చారు అంటీ : హమ్మయ్యా ......... జానకికి ఏమాత్రం ఇష్టం లేదు - అయినా కోడలి కంటే వేరే ఎవరికైనా costliest చీర కొనిస్తారు అంటే బాధవేస్తుంది మరి .......
నాగాంబ : నువ్వు ఊరుకోవే ....... , అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు ఆనందబాస్పాలు - కదా జానకీ ...........
జానకి : అత్తయ్యగారూ ........ అంటూ సంతోషంతో కౌగిలిలోకి చేరిపోయింది . నా చీరను కూడా వెనక్కు ఇచ్చేసి చెల్లికి తీసుకోండి - అంతకంటే ఆనందం మరొకటి లేదు .
అత్తయ్యగారు : నాకు నువ్వు ఎంతో ఇందు కూడా అంతే జానకీ ...........
చారు అంటీ : జానకి కంటే ఎక్కువని నాకు తెలుసులేవే అని చెవిలో గుసగుసలాడింది .
నాగాంబ నవ్వుకుని , జానకీ ........ ఇందుకు ఇష్టమైన కలర్ ఏమిటి , దేవకన్య లాంటి నా చిన్న కోడలికి నేనే స్వయంగా సెలెక్ట్ చేస్తాను - గర్ల్స్ ........ ఈ చీర కంటే costly చీరలను చూయించండి .
ఇందు : అత్తయ్యగారూ ......... అక్కయ్యకు తీసుకున్నారు కదా చాలు - కాదంటున్నందుకు మన్నించండి .
చారు అంటీ : ఇందూ ......... మీ అత్తయ్య గురించి ఇంకా పూర్తిగా తెలిసినట్లు లేదు మీకు - తను అనుకున్నది జరిగితీరాలి లేకపోతే ....... అమ్మో వద్దులే ష్ ష్ ..........
అత్తయ్యగారు : ఇందు ఇప్పుడు వద్దని చెప్పు ........
ఇందు నోటికి తాళం వెయ్యడం చూసి అందరూ నవ్వుకున్నారు . జానకి అయితే పట్టరాని ఆనందంతో ఇందు బుగ్గపై ముద్దుపెట్టేసింది .
అక్కాచెల్లెళ్ళు : ఒకరినొకరు చూసుకుని , మీరు సెలెక్ట్ చేసిన ఏ కలరైనా అత్యంత ఇష్టం అత్తయ్యగారూ .........
అత్తయ్యగారు : Thats good అలా దారిలోకి రండి , ఇంకెప్పుడూ నామాటకు ఎదురుచెప్పకండి - నా కోడళ్లు బంగారం బంగారం లానే ఉండాలి అని సంతోషించారు . ఉదయం పింక్ సారీలో అక్కయ్య కంటే చెల్లి సౌందర్యంగా ఉందికాబట్టి అని పింక్ - గోల్డ్ తో నేసిన అందమైన చీరను సెలెక్ట్ చేసి బహూకరించారు .
మోహమాటపడుతూనే అందుకుని థాంక్స్ అత్తయ్యగారూ అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో పులకించిపోతోంది ఇందు - ఇందు కంటే జానకి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి .
చారు అంటీ : చీర ప్రైస్ చెప్పన్నేలేదు గర్ల్స్ .........
సేల్స్ గర్ల్ : షాప్ లో ఉన్న చీరలన్నింటిలోకీ బెస్ట్ ప్రైస్ విత్ బెస్ట్ డిజైన్ చీర మేడం కాస్ట్స్ 2 lakhs ...........
చారు అంటీ : షాక్ లో ఉన్న అక్కాచెల్లెళ్ల నోళ్ళను మూసి , కాబోయే కోడలి చీర కంటే 75 వేలు ఎక్కువ గల చీర అన్నమాట , ఇంత costly చీరను కొనిస్తున్నావు అంటే మనసులో ఏదో ఉంది అని ముసిముసినవ్వులతో అడిగింది .
అత్తయ్యగారు : చారు అంటీ చేతిని గిల్లేసి , కోడళ్ళూ ......... చీరలు నచ్చాయి కదా ? , ఇప్పుడు మా వదినగారికి - దీనికి అని తల్లిదండ్రులిద్దరూ వద్దంటున్నా సెలెక్ట్ చేసి కౌంటర్ లో పే చేసి , ప్రక్కనే ఉన్న షాప్ లో నారాయణ గారికి బట్టలు తీసుకుని చారు ఇంటికి చేరుకున్నారు .
చారు అంటీ : జానకీ - ఇందు ....... డిన్నర్ మా ఇంట్లోనే , మీకోసం ....... నా కోడలు బిరియానీ చేసింది అని లోపలికి పిలుచుకునివెళ్లి పరిచయం చేసారు .
చారు అంటీ కోడలు : అంటీ ........ మా శివ అన్నయ్యకు దివినుండి దిగివచ్చిన దేవకన్యనే సెలెక్ట్ చేశారు hi జానకీ ......... , ఇక మీ చిన్న కోడలు ......... అదే అదే ఇందు అందాన్ని వర్ణించడానికి మాటలు కవిత్వం కూడా సరిపోదేమో అంత బ్యూటిఫుల్ ........ నా దిష్టి నే తగిలేలా ఉంది . జానకీ ఇందు అమ్మా ........ రండి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేద్దాము అని తన గదిలోకి పిలుచుకునివెళ్లారు .
డిన్నర్ చేసి రేపు అందరమూ కలిసి బయలుదేరుదాము .
అక్కాచెల్లెళ్ళు : అత్తయ్యగారూ - చారు అంటీ ........ మీరు రెస్ట్ తీసుకోండి మేము వెళతాము .
అత్తయ్యగారు : ఇంటివరకూ కూడా నా కోడళ్ళని చూసుకోవాలని ఆశపడ్డాను .
చారు అంటీ : పెళ్లయ్యాక నీ కళ్ళ ముందే చూసుకుందువులేవే అని ఆపి నవ్వుకున్నారు . జానకీ ........ ఇదిగో చీరలు , తెల్లవారుఘామునే ప్రయాణం .
ఇందు : రెడీగా ఉంటాము అంటీ ....... , అత్తయ్య గారూ ........ గుడ్ నైట్ .
అత్తయ్యగారు : నా చిన్నకోడలు విష్ చేసిందే , రాత్రంతా హాయిగా నిద్రపోతాను అని మురిసిపోయారు - గుడ్ నైట్ కోడళ్ళూ ....... , డ్రైవర్ ........ జాగ్రత్తగా తీసుకెళ్లు అని మరీ మరీ చెప్పి పంపించారు .
జానకి : చెల్లి చీరను గుండెలపై హత్తుకుని ఇంటికి చేరుకునేంతవరకూ నిమిషానికోకసారి చెల్లి నుదుటిపై - బుగ్గపై ముద్దుపెట్టి పరవశించిపోతోంది . చెల్లీ ........ నా చీర కంటే అత్తయ్యగారు నీచీరను సెలెక్ట్ చేస్తుంటే కలిగిన ఆనందమే వేరు .
ఇందు : నాకు తెలియదా అక్కయ్యా .........
జయమ్మ : ఇద్దరి ఆనందాలను చూసి , ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో అని ఆనందబాస్పాలతో పొంగిపోతున్నారు .
ఇంటికి చేరుకుని అమ్మా - అక్కయ్యా ........ తెల్లవారకముందే రెడీ అయిపోవాలి గుడ్ నైట్ గుడ్ నైట్ అని అక్కయ్యను వెనుక నుండి హత్తుకుని హాయిగా పడుకుంది ఇందు .
రాత్రి అనుకున్నట్లుగానే సూర్యోదయం లోపల నలుగురూ రెడీ అయిపోయారు .
7 గంటల సమయంలో గుడిసె ముందుకు కార్లు వచ్చి ఆగాను . అందులోనుండి స్వయానా నాగాంబ గారు దిగి హుషారుగా లోపలికివచ్చారు .
అక్కాచెల్లెళ్ళు : అత్తయ్యగారూ అత్తయ్యగారూ .........
అత్తయ్యగారు : wow బ్యూటిఫుల్ పర్ఫెక్ట్ ......... , నా కోడళ్లను ఇలాకానీ చూస్తే ఊరివాళ్ళంతా అసూయ చెందుతారు - శపథం చేసినట్లుగానే నాగాంబ దివినుండి దేవకన్యలతోనే అడుగుపెట్టింది అని ఊరంతా మీ గురించే మాట్లాడుకోవడం ...... చాలు ఈ జీవితానికి ఈ అదృష్టం చాలు అని మురిసిపోతున్నారు . వదిన గారూ .......... నా దిష్టి నే తగిలేలా ఉంది కాటుక పెట్టారా ? .
ఇందు : ఎవ్వరి దిష్టి తగలకుండా మా మంచి అతయ్యగారితోనే కాటుక పెట్టించుకోవాలని ఆశ అత్తయ్యగారూ ........ అని చిరునవ్వులు చిందిస్తున్న అక్కయ్యతోపాటు అత్తయ్యగారి ముందుకు చేరారు .
అత్తయ్యగారు : చాలా సంతోషం కోడళ్ళూ ........ అని కాటుక అందుకుని కురులపై మరియు వద్దు అంటున్న అరి పాదాలపై పెట్టారు .
అంతలో జయమ్మ టీ తీసుకునివచ్చి అందించింది .
అత్తయ్యగారు : వదినగారూ ........ టీ మాత్రమేనా టిఫిన్ లేదా ? .
అమ్మ : ఎంతమాట వదినగారూ ......... , ఆ అదృష్టం ఎవరు కాదనుకుంటారు నిమిషాలలో వండిస్తాను అని ఉత్సాహంతో వంట గదివైపు వెళ్లబోతే .........
అత్తయ్యగారు చేతిని అందుకుని ఆపారు . ఇందుకే నేనే స్వయంగా వచ్చింది నిన్ననే చెప్పానుకదా టిఫిన్ లు చారు ఇంటిలోనే చేసి వెళదామని - ఈరోజుకు మీరు మా ప్రీతిపాత్రమైన గెస్ట్స్ - బంధువులు ....... కాదు కాదు అంతకుమించి , ఏమంటారు ఏమంటారు ...... ఆ నా వాళ్ళు - మిమ్మల్ని ఈరోజు కష్టపడనిస్థానా ...........
అమ్మ : పర్లేదు వదినగారూ ........ ఇష్టంతో వండిస్తాను . మాకోసం ఇక్కడిదాకా వచ్చారు .
అత్తయ్యగారు : నో అంటే నో ......... , నేను వచ్చినది ఈ విషయం చెప్పడానికే కాదు - అందరికంటే ముందుగా నా కోడళ్లను ఇలా నేనే ముందుగా చూడాలని వచ్చాను - కోడళ్ళూ ......... అందుకే రెడీ అయ్యి వస్తానన్న మీ అంటీ చారును కూడా వదిలేసి వచ్చేసాను , మళ్లీ చెబుతున్నాను సూపర్ గా ఉన్నారు - ఈ దేవకన్యలేనా నా కోడళ్లుగా అదే అదే కోడలిగా రాబోతున్నారు అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను తెలుసా .........
అత్తయ్యగారూ - అత్తయ్యగారూ ........ సిగ్గేస్తోంది అంటూ ఇందు తన అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి ఇద్దరూ అత్తయ్యగారి కౌగిలిలోకి చేరిపోయారు .
అత్తయ్యగారు : దేవకన్యలకు సిగ్గు మరింత అందం కోడళ్ళూ ........ , అంతా రెడీ కదా వెళదామా ? .
అక్కాచెల్లెళ్ళు : మీ ఇష్టం అత్తయ్యగారూ ..........
అత్తయ్యగారు : బంగారం లాంటి కోడళ్లు అని మురిసిపోతూనే టీ తాగి ఇద్దరి చేతులను అందుకున్నారు . అన్నయ్యగారూ - వదినా ...... వెళదాము అని ఇంటికి తాళం వేసి ఇరుగుపొరుగువారికి సంతోషంతో విషయం చెప్పి కార్లలో చారు అంటీ ఇంటికి చేరుకున్నారు .
చారు అంటీ : మొబైల్ తీసుకొచ్చేలోపు వెళ్లిపో......యా .......వు ........ , wow జానకీ ఇందు ......... sooooo బ్యూటిఫుల్ అని అత్తయ్యగారిని ప్రక్కకుతోసేసి వెళ్లి కౌగిలించుకోబోయి వద్దులే చీరలు అంటూ ఆగి లోపలికి రండి లోపలికి రండి చూడండి అందరూ ఈర్ష్య అసూయలతో ఎలా చూస్తున్నారో అని చేతులు అందుకుని ఒసేయ్ నాగాంబ నీ సంగతి తరువాత చూస్తాను అని లోపలికిపిలుచుకునివెళ్లారు .
అత్తయ్యగారు : నవ్వుకుని , వదినగారూ - అన్నయ్యా ........ రండి అని లోపలికివెళ్లారు .
చారు అంటీ కోడలు : ప్చ్ ప్చ్ ........ ఉదయం 4 గంటలకే లేచిమరీ ఇప్పటివరకూ రెడీ అయ్యాను - ఇప్పుడు తెలిసింది సంవత్సరం పాటు రెడీ అయినా అక్కాచెల్లెళ్ల కాలి గోటికి కూడా సరిపోనని ..........
అక్కాచెల్లెళ్ళు : అక్కయ్యా అక్కయ్యా ........ నిజం చెబుతున్నాము మాకంటే మీరే బ్యూటిఫుల్ గా ఉన్నారు .
చారు అంటీ కోడలు : ష్ ష్ ష్ ....... ఈ మాట వింటే మీ అత్తయ్యగారు నాపై కోప్పడతారేమో .........
అత్తయ్యగారు : కొప్పడటం కాదు దెబ్బలు కూడా పడతాయి .
చారు అంటీ కోడలు : విన్నారా చెల్లెళ్ళూ ........ అని నవ్వుకున్నారు . మనఃస్ఫూర్తిగా చెబుతున్నాను అంటీ ........ మీ కోడళ్లు అదే అదే కోడలు మరియు ఇందు విశ్వ సుందరులు దిష్టి చుక్కలు పెట్టారా లేదా ? .
చారు అంటీ : కోడలూ ......... మీ అంటీ ఎప్పుడో దిష్టి చుక్కలు పెట్టేసి ఉంటారు .
ఇందు : వద్దన్నా పాదాలకు కూడా ఉంచారు అంటీ .........
చారు అంటీ : ఇప్పుడే ఇలా అంటే ఇక పెళ్ళైన తరువాత మమ్మల్ని తాకనిస్తుందో లేదో ......... , కంటికి రెప్పలా చూసుకున్నా చూసుకుంటుంది .
ఇందు : ఆనందబాస్పాలతో థాంక్యూ అత్తయ్యగారూ ....... అని పాదాలను తాకపోతే ఆపి కౌగిలిలోకి తీసుకుని పులకించిపోతున్నారు .
జానకి : ( చెల్లికి నేనంటే ప్రాణం అని లోలోపలే పొంగిపోతోంది ) .
చారు అంటీ : మీ అత్తాకోడళ్ల ప్రేమలు తరువాత తీరికగా పంచుకోవచ్చు - టిఫిన్ చేసి బయలుదేరాలి లేకపోతే రాహుకాలం వచ్చేస్తుంది .
అత్తయ్యగారు : లేదు లేదు , నా కోడళ్లను శుభ గడియలలోనే తీసుకెళ్లాలి జానకీ - ఇందు - అన్నయ్యగారూ రండి అని అందరూ కలిసి టిఫిన్ చేశారు .
కావాల్సినవన్నింటినీ తీసుకుని మూడు కార్లలో అత్తయ్యగారు - చారు అంటీ ఫ్యామిలీ - జానకి ఫామిలీ ........ బయలుదేరారు .
చారు అంటీ : జానకీ - ఇందు ........ మీ అత్తయ్యగారి ఊరికి , ఇంకా మీ అత్తయ్యగారిది ఏంటి మీ ఊరికి రెండు గంటల ప్రయాణం - సిటీ , మనలా టౌన్ అనుకుంటున్నారేమో మీలా బ్యూటిఫుల్ లంకగ్రామం , లంక గ్రామాలన్నింటిలోకీ పెద్దది - ఒక్కసారి వెళ్లారంటే అక్కడ నుండి రాబుద్ధి కాదనుకోండి - గోదావరి నది పెద్ద కాలువ రెండు పాయలుగా విడిపోయి కొన్ని కిలోమీటర్ల తరువాత మళ్ళీ ఒకటిగా కలిసి మధ్యలో మీ గ్రామాన్ని ఏర్పరిచింది , ఎక్కడ చూసినా పంటలు తోటలతో పచ్చదనమే ......... , ఆ అందమైన లంక గ్రామంలో రెండే రెండు బిగ్గెస్ట్ బిల్డింగ్స్ ఒకటి మీది మరొకటి వద్దులే మీ అత్తయ్యగారికి కోపం వచ్చేస్తుంది , ఇక మిగిలినవన్నీ గుడిసెలు - పెంకుటిల్లులు ప్రతీ ఇంటిముందూ పచ్చదనమే .......
ఇందు : తన అక్కయ్య చేతిపై ముద్దుపెట్టి , అంటీ ........ మీరు చెబుతుంటేనే వెంటనే చూడాలనిపిస్తోంది . సిటీ - టౌన్స్ లలో ఆప్యాయతల కన్నా కుళ్లు కుతంత్రాలు ఎక్కువ , గ్రామాలలో ప్రేమలు స్వఛ్చమైనవి వారి ప్రేమల మధ్యకు అక్కయ్య చేరబోతోంది అంటే చాలా చాలా సంతోషం వేస్తోంది .
చారు అంటీ : ( నువ్వు కూడా దేవకన్యా ) కొద్దిసేపట్లో అక్కడికే వెళుతున్నాము కదా అని మాట్లాడుకుంటూనే చిరునవ్వులు చిందిస్తూ ప్రయాణం సాగించారు .
అత్తయ్యగారు : కోడళ్ళూ ........ వచ్చేసాము , 30 నిమిషాల్లో ఊరిలో ఉంటాము . డ్రైవర్ ......... బ్రిడ్జి పై నెమ్మదిగా పోనివ్వు .
డ్రైవర్ : అలాగే అమ్మగారూ ........
చారు అంటీ : ఒసేయ్ ........ డ్రైవర్ కు తెలుసులేవే , బ్రిడ్జ్ పై వెళ్లిన ప్రతీసారీ చెబుతావు .
అత్తయ్యగారు : డ్రైవర్ ....... మరింత నెమ్మది , మరి కారులో ఉన్నది నా కోడళ్లు అని చేతులను గట్టిగా పట్టుకుని కంగారుపడుతున్నారు విండోస్ నుండి అటూ ఇటూ చూస్తూ .........
చారు అంటీ : జానకీ ........ , విషయం ఏమిటంటే ఇది పురాతనమైన పొడవాటి బ్రిడ్జ్ ...... చూడండి ఇక్కడి నుండి అక్కడిదాకా ఉంది , లంకగ్రామాలకు వెళ్ళడానికి ఉన్న ఏకైక బ్రిడ్జ్ - ఎప్పుడు కూలిపోతుందో తెలియక భయం భయంతో వెళతారు అందరూ - వర్షాకాలంలో నీళ్లు బ్రిడ్జ్ వరకూ చేరి వేగంగా ప్రయాణిస్తాయి , ఆ సమయంలో అయితే ఒక్కరూ బ్రిడ్జ్ దాటరు - govt కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదు .
అక్కాచెల్లెళ్ళు : అత్తయ్యగారూ అత్తయ్యగారూ ........ అని భయంతో గట్టిగా చేతులను చుట్టేసి బయటికి ఏమాత్రం చూడటం లేదు .
అత్తయ్యగారు : డ్రైవర్ మరింత నెమ్మది నెమ్మది ......... , హమ్మయ్యా ....... కోడళ్ళూ బ్రిడ్జ్ దాటేశాము వెనుక కార్లు కూడా ........
అక్కాచెల్లెళ్ళు : వెనక్కుచూసి సంతోషంతో ఏకంగా అత్తయ్యగారి బుగ్గలపై ముద్దులుపెట్టేసి తలదించుకున్నారు .
అత్తయ్యగారు : అంతులేని ఆనందంతో థాంక్యూ కోడళ్ళూ ........ అని ఇద్దరి చేతులపై - ఇందు నుదుటిపై ముద్దుపెట్టారు .
చారు అంటీ : ముద్దులలో కూడా పక్షపాతం ........ , కేవలం ఇందుకు మాత్రమే ముద్దుపెట్టావు , మోసమే .........
అత్తయ్యగారు : నవ్వుకుని మళ్లీ ఇందుకే ముద్దుపెట్టారు . జానకీ నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా ........ ? .
జానకి : లేదు లేదు అత్తయ్యగారూ ....... , ఆ ఆనందమైన దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలడం లేదు అని పరవశించిపోతోంది .
చారు అంటీ : అధికాదు జానకీ ........ ఎలా చెప్పాలో తెలియడం లేదు - నీకు తెలియకుండా గూడుపుఠానీ నడుపుతున్నారు మీ అత్తయ్యగారు .
అత్తయ్యగారు : నవ్వుకుని , చారు బుగ్గపై గిల్లేసారు . కోడళ్ళూ ........ మీ అంటీ అప్పుడప్పుడూ ఇలా అర్థం కానట్లు మాట్లాడుతుంటారు వదిలెయ్యండి , రెండువైపులా చూడండి పచ్చని పంటపొలాలూ - చిన్న చిన్న లంక గ్రామాలూ ........
అక్కాచెల్లెళ్ళు : wow బ్యూటిఫుల్ అత్తయ్యగారూ ..........
చారు అంటీ : ఇంత అందమైన గ్రామాలు - పొలాలు వరుసగా పెద్ద వర్షాలు వస్తే మొత్తం జలమయమైపోతాయి , ఆ కొన్నిరోజులు ఇక్కడి బాధలు వర్ణణాతీతం .
ఇందు : అత్తయ్యగారూ .........
చారు అంటీ : మనకు ఏమీ భయం లేదు ఇందూ ........ , అలా జరగకుండా స్వర్గంలో ఉన్న మీ మావయ్యగారు అప్పట్లోనే చాలా ఎత్తులో బిల్డింగ్ నిర్మించారు .
20 నిమిషాల ప్రయాణం తరువాత కోడళ్ళూ ......... ఇదిగో రెండువైపులా ఇక్క నుండి కనిపించేంత దూరం వరకూ మన పొలాలు - తోటలే , నీటికి లోటే లేదు రెండు పిల్ల కాలువలు మన పొలాల గుండా పెద్ద కాలువలోకు ప్రయాణిస్తాయి అని చూయించారు అత్తయ్యగారు . అదిగో మన గ్రామం .........
చారు అంటీ : అదిగో దూరంలో కనిపిస్తున్న రెండు బిల్డింగ్ లలో మనది ఏదో చెప్పుకోండి చూద్దాము .
అక్కాచెల్లెళ్ళిద్దరూ ......... విండోస్ నుండి చూసి రంగులతో వెలిగిపోతున్న రెండంతస్థుల బిల్డింగ్ వైపు వేళ్ళను చూయించారు - అత్తయ్యగారూ .......కరెక్ట్ గానే గెస్ చేసామా ....... ? .
చారు అంటీ : సంతోషంతో చప్పట్లుకొట్టి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . జానకీ ......... మీరు వస్తున్నారనే ఒక్కరోజులో అలా రంగులతో అందంగా మార్చేశాడు నీ హీరో .........
జానకి : సిగ్గుపడింది అందంగా .........
ఇందు : థాంక్యూ soooooo మచ్ బావగారూ ......... , ఆ రంగులలోనే తెలిసిపోతోంది మీకు , మా అక్కయ్య అంటే ఎంత ఇష్టమో ..........
అత్తయ్యగారు : సంతోషించి , డ్రైవర్ ........ అమ్మవారి గుడిముందు ఆపు - కోడళ్ళూ ......... తరతరాలుగా గ్రామాన్ని కాపాడుతున్న అమ్మవారు - తొలిసారి గ్రామంలోకి అడుగుపెడుతున్నారుకదా దర్శనం చేసుకుని వెళదాము .
అక్కాచెల్లెళ్ళు : అంతకంటే అదృష్టమా అత్తయ్యగారూ ........ అని కిందకుదిగి అందరూ గుడిలోపలికివెళ్లారు .
ఇందు : ( అమ్మా ........ ఎల్లప్పుడూ అక్కయ్యకు తోడుగా ఉండాలి ) అని ప్రార్థించి అమ్మవారి కుంకుమ పెట్టింది .
జానకి : చెల్లీ ........ ఏమి కోరుకున్నావో నాకు తెలుసులే , అమ్మా ........ మీ అనుగ్రహం మొదట చెల్లిపై - అత్తయ్యగారిపైననే ఉండాలి అని చెల్లికి కుంకుమ పెట్టింది .
అత్తయ్యగారు : నా కోడళ్లు సంతోషంగా ఉండాలి తల్లీ ....... అని ఇద్దరి పేర్లపై పూజ జరిపించారు . ప్రసాదం స్వీకరించి గ్రామంలోకి అడుగుపెట్టారు .
జనాలు చాలామంది రెండో బిల్డింగ్ దగ్గర బయట ఉండటం - ఒకడు కట్టపై కూర్చుని తీర్పు ఇస్తున్నట్లు శాసించడం చూసి డ్రైవర్ విండోస్ క్లోజ్ చెయ్యమని కోపంతో చెప్పారు అత్తయ్యగారు . కోడళ్ళూ ......... sorry sorry అటువైపు చూడకండి - డ్రైవర్ ........ వేగంగా వెళ్లు .
చారు అంటీ : జానకీ - ఇందు ......... మీ మావయ్యగారు బ్రతికున్నంతవరకూ ఊరిజనమంతా ప్రతీ సమస్యకూ - సహాయానికీ అలా మన ఇంటి ముందే ఉండేవారు - అంత గౌరవం ఇచ్చేవారు కూడా........ . వారు స్వర్గస్థులయ్యాక శివకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం - మురళి బెంగళూరుకు వెళ్లిపోవడం వలన టైం చూసి జనాలందరినీ తనవైపు తిప్పేసుకున్నాడు ఆ మునసబు - జనాలను వాడుకోవడం తప్ప సహాయం చెయ్యడం అతడికి తెలియదు - ఏమిచేస్తాం ........ ఇప్పుడవన్నీ ఎందుకు - నాగాంబ ........ హ్యాపీ మూడ్ లోకి వచ్చెయ్యి .
కారు విశాలమైన కాంపౌండ్ లోపలికివెళ్లి బిల్డింగ్ ముందు ఆగడంతో కోడళ్ళూ ........ ఇదే మన రాజభవనం - heartfully welcome ....... అనేంతలో ,
శివ హుషారుగా చిరునవ్వులు చిందిస్తూ వచ్చి కార్ డోర్ తెరిచాడు .
చారు అంటీ : ఒక్కసారైనా మాట్లాడకుండానే మా శివను కొంగున కట్టేసుకున్నావా జానకీ , అసలే మా శివ ఏమీ తెలియని అమాయకుడు .
శివ : నవ్వుకుని , అమ్మా - అంటీ ....... ప్రయాణం బాగా జరిగిందా ? , జానకి గారూ ........ please welcome - ఇందు నీకు కూడా .......
ఇందు : థాంక్యూ soooooo మచ్ బావగారూ ......... , మా అక్కయ్య కాదు కాదు మీ కాబోయే శ్రీమతికోసం ఒక్కరోజులో ఇంటిని కొత్తగా మార్చేసారట కదా , దానికి చాలా చాలా థాంక్స్ అని కిందకుదిగారు .
జానకి సిగ్గుపడుతూనే శివ తోపాటు లోపలికి అడుగుపెట్టింది .
అత్తయ్యగారు : నా అందమైన కోడళ్ల అడుగుతో ఇంటికే కళ వచ్చింది చారు ....... , అన్నయ్యగారూ - వదినా ........ లోపలికివచ్చి నచ్చింది అని చెబితే నా కంగారు కాస్త తగ్గుతుంది .
అమ్మానాన్నలు : రాజమందిరం లాంటి ఇల్లు , మా అభిప్రాయం అడగడం .........
అత్తయ్యగారు : అలా ఎప్పటికీ మాట్లాడకండి అన్నయ్యగారూ ........ , ఇంటిని మొత్తం చూసి నచ్చితే మోహమాటపడకుండా అభిప్రాయం తెలపండి .