Update 03
అత్తయ్యగారు : నాన్నా శివా ........ సాయంత్రం ముహూర్తం ఫిక్స్ చేసే సమయానికి తమ్ముడు వస్తున్నాడా ? - అంటే మీ మావయ్యావాళ్లకు మనం , మన ఇల్లు నచ్చిన తరువాతనేలే ........
తండ్రి : చెల్లెమ్మా ........ పదే పదే ఆ మాట మాపై వెయ్యకండి - ఇంద్ర భవనం ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా - నా తల్లి చేసుకున్న అదృష్టం అని విధేయతతో నమస్కరించారు .
అత్తయ్యగారు : అన్నయ్యగారూ ........ మన ఇంద్రభవనం మొత్తం చూసి ఆ మాట చెప్పండి అప్పుడు సంతోషిస్తాను .
శివ : అమ్మా ........ ఉదయమే తమ్ముడికి కాల్ చేసాను . అన్నయ్యా ....... sooo sorry ముఖ్యమైన పని ఉంది పెళ్లికి మాత్రం మీరు కోరినన్ని రోజులు ఉంటాను అని ప్రామిస్ చేసాడు .
అత్తయ్యగారు : తల్లీ ఇందు ........ బెంగళూరులో సొంతంగా కంపెనీ మొదలెట్టాలని డ్రీమ్ , దానికోసం కొన్ని నెలల నుండి కష్టపడుతున్నాడు .
చారు అంటీ : నాగాంబ గారూ ....... ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఇందుకే చెప్పడానికి ఏమైనా కారణం ఉందా ? అని ముసిముసినవ్వులతో అడిగారు .
అత్తయ్యగారు : వియ్యంకులకు వారి చిన్న అల్లుడు రాకపోవడానికి కారణం తెలపాలి కదా ........ అని భుజంపై గిల్లేసారు .
చారు అంటీ : స్స్స్ ....... తెలపాలి తెలపాలి . పనిమనిషిని పిలిచి అక్కడ మునసబు ఇంటిదగ్గర జనాలు గుంపులుగా చేరడానికి కారణం ఏమిటి అని అడిగారు .
పనిమనిషి : ఈరోజు కృష్ణాష్టమి కదండి అమ్మగారూ ....... , కృష్ణుడి గుడిలో సాయంత్రం జరగాల్సిన పూజలు - సంబరాలు - ఉట్టి కొట్టడం - రాత్రికి నాటకాలు ......... ఇలా అన్నీ మాట్లాడుకుంటున్నారు .
చారు అంటీ : భలే భలే , కృష్ణాష్టమి అనే మరిచిపోయాను - ఇంత మంచిరోజు మన ఇంట్లోకి కొత్త కోడళ్లు అడుగుపెట్టారు , ఒసేయ్ నాగాంబ అదృష్టం అంటే నీదేనే .........
అత్తయ్యగారు : సంతోషంతో పొంగిపోతున్నారు .
అక్కాచెల్లెళ్ళు : అమ్మా ........ కృష్ణాష్టమి అని సంతోషంతో గుండెలపైకి చేరారు .
అమ్మ : వదినగారూ ........ మీ కోడళ్లు ఇరుగుపొరుగువారితో కలిసి కృష్ణాష్టమిని అంగరంగవైభవంగా జరుపుకునేవారు - ఉట్టిని కూడా జరుపుకునేవారు .
అత్తయ్యగారు : అయితే ఈ కృష్ణాష్టమిని మన ఇంటిలో ఆర్భాటంగా జరుపుకుందాము శివా ....... ఆ ఏర్పాట్లు చూడు .
శివ : అలాగే అమ్మా అని తోట నుండి పూలు పళ్ళు కావాల్సినవన్నింటినీ తీసుకురమ్మని పనివాళ్లకు చెప్పాడు .
చారు అంటీ : సాయంత్రం వరకూ ఇంటిలో , సాయంత్రం గుడిలో ఆ వెంటనే పెళ్లి ముహూర్తం అనౌన్స్మెంట్ , రాత్రికి నాటకాలు .......... సంబరాలే సంబరాలు.......
పనిమనిషి : సంబరాలంటే పెద్దయ్యగారు ఉన్నప్పుడు అమ్మగారూ ........ , ఊరంతా వీధులన్నీ పూలు - లైట్స్ - తోరణాలతో స్వాగతం పలికేవి . ఈ మునసబు ఉన్నాడు పంచాయితీ డబ్బులన్నీ నొక్కేసి ఏదో అలా అలా జరిపేస్తున్నాడు .
అత్తయ్యగారు బాధపడుతూ వెళ్లి సోఫాలో కూర్చున్నారు .
జానకీ - ఇందు వెళ్లి మోకాళ్లపై కూర్చుని అత్తయ్యగారి చేతులు అందుకున్నారు . అత్తయ్యగారూ ......... ఊరి గురించి మాకు తెలియదు ఇంట్లో కృష్ణాష్టమి సంబరాలు ఘనంగా జరుపుకుందాము - అంతా మేము చూసుకుంటాము .
అత్తయ్యగారు : కన్నీళ్లను తుడుచుకుని , నా కోడళ్లు బంగారం అని సంతోషంతో నుదుటిపై ముద్దులుపెట్టి , నాయనా శివా ....... కోడళ్లు ఆడిగినవన్నీ క్షణాల్లో వారి ముందు ఉండాలి .
శివ : అలాగే అమ్మా ......... అని జానకి వైపు చిరునవ్వు వదిలాడు థాంక్స్ అని .
చారు అంటీ కోడలు : చెల్లెళ్ళూ ........ నా హెల్ప్ కూడా తీసుకోండి - ఏమి చెయ్యాలో ఆర్డర్ వెయ్యండి .
థాంక్స్ అక్కయ్యగారూ ........ అత్తయ్యగారు చూస్తుండగానే పూలు - మామిడి ఆకులు - పసుపు కుంకుమలతో ఇంట్లో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చేసారు . పూజగదిని శుభ్రం చేసి దేవుళ్ళ ఫోటోలకు బొట్లు పెట్టి పూలు - దీపాలతో వెలిగిపోయేలా మందిరంలా మార్చేశారు .
అత్తయ్యగారు సంతోషంతో చారు ....... అని భక్తితో మొక్కుకున్నారు .
అక్కాచెల్లెళ్ళు బయట మెట్ల దగ్గర నుండి పూజ మందిరం వరకూ బుజ్జి కృష్ణయ్య అడుగులు అలంకరించారు . వంట గదిలో స్వయంగా ప్రసాదం వండి కృష్ణుడికి నైవేధ్యంగా సమర్పించారు - పూజ చేసి అందరికీ హారతిని ప్రసాదాన్ని అందించారు. తల్లి - అత్తయ్యగారి పాదాల ఆశీర్వాదం తీసుకున్నారు .
అత్తయ్యగారు : కోడళ్ళూ ........ అంటూ కౌగిలించుకుని చుట్టూ చూసి , కోడళ్ళూ ......... ఇంట్లో అడుగుపెట్టినప్పుడే కళ వచ్చింది - ఇప్పుడు ఏకంగా పండుగనే తీసుకొచ్చారు అని నుదుటిపై ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు .
పనిమనిషి : జానకి చిన్నమ్మగారూ ........ అమ్మగారు ఇంతలా సంతోషించి ఎన్ని ఏళ్ళు అయ్యిందో చాలా సంతోషం చాలా సంతోషం వేస్తోంది . అమ్మగారూ ....... భోజన సమయం అయ్యింది .
అత్తయ్యగారు : కోడళ్ళూ ....... చాలా కష్టపడ్డారు ఆకలివేస్తూ ఉంటుంది తిందామా ....... ? .
అక్కాచెల్లెళ్ళు : ముందు మీకు చారు అంటీ వాళ్లకు వడ్డించి .........
చారు అంటీ : అమ్మమ్మా ........ పెళ్లి అయ్యేంతవరకూ మీరు గెస్ట్స్ కిందనే లెక్క - అతిథులను గౌరవించుకోవడం ధర్మం , ముందు మీరు తరువాతనే మేము .
అత్తయ్యగారు : కరెక్ట్ గా చెప్పావు చారు ........
అక్కాచెల్లెళ్ళు : ముందు పెద్దవారు తరువాతనే మేము .
అత్తయ్యగారు : ఇలా కాదు కానీ అందరమూ కలిసే తిందాము అని జానకీ - ఇందు చేతులను అందుకుని నేలపై కూర్చుని తిన్నారు . కోడళ్ళూ ....... ఇంటిని చూశారుకదా సాయంత్రం కృష్ణుడి గుడికి వెళ్లేంతవరకూ మన తోట - పొలాలు చూద్దాము అని వీధులను చూయిస్తూ కార్లలో తోటకు చేరుకున్నారు .
తోట వరకూ ఒక కారులో జానకి - శివ మాట్లాడుకుంటూ వచ్చి సిగ్గుపడుతూ అందరితోపాటు కలిశారు .
జానకి : చెల్లీ ....... మీ బావగారు చాలా చాలా మంచివారు .
ఇందు : మా అక్కయ్య మంచితనానికి మంచి బావ గారు అని అంతులేని ఆనందాలతో కౌగిలించుకున్నారు .
చారు అంటీ : పెళ్ళికొడుకు - పెళ్లికూతురు కూడా మాట్లాడేసుకున్నారు హ్యాపీగా ఇక ముహూర్తమే మిగిలింది .
కనుచూపుమేరవరకూ పొలం - 20 ఎకరాలకుపైనే తోటను నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయారు అక్కాచెల్లెళ్ళు వారి అమ్మానాన్నలు . అత్తయ్యగారూ ........ అక్కడ ఒక ఎకరంలో అన్నిరకాల పళ్ళు కూరగాయలు పూల చెట్లు - ఇక్కడ ఒక్కొక్క ఎకరంలో ఒక్కొక్క రకం ........ ఇన్నిరకాల పూలను చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలని ఉంది .
అత్తయ్యగారు : నా కోడళ్లకు తోట కూడా నచ్చింది . మీ ఇష్టం కోడళ్ళూ ........ ఇక్కడ కూడా ఒక బిల్డింగ్ కట్టిద్దాము మీరు ఇక్కడే ఉండచ్చు .
జానకి : మా అత్తయ్యగారు ఎక్కడ ఉంటే మేమూ అక్కడే ........
అత్తయ్యగారు : విన్నావా చారూ ..........
చారు అంటీ : విన్నానులేవే , నా కోడలి లానే నీకు కూడా మంచి కోడలు వచ్చింది అని సంతోషించారు .
అత్తయ్యగారు : శివా ........ తోటలోని అన్నిరకాల పళ్ళు - పూలు నా కోడళ్ల ముందు ఉండాలి .
శివ : సరే అమ్మా అని ఉత్సాహంతో వెళ్లి పనివాళ్ళతో ట్రాక్టర్ నిండుగా తీసుకొచ్చాడు .
అక్కాచెల్లెళ్లు : అత్తయ్యగారూ అంటూ షాక్ చెంది కౌగిలిలోకి చేరిపోయారు .
అత్తయ్యగారు : అన్నీ మీకోసమే ........
అక్కాచెల్లెళ్ళు : ఇప్పటికే ఫుల్ గా తిన్నాము ఒక్కటి తినగలము అంతే అని ఒక్కొక్క గులాబీ పువ్వు అందుకున్నారు .
అత్తయ్యగారూ : శివా ........ అమృతంలా తియ్యనైన పళ్ళు తీసుకునిరా ......... , శివ నుండి ఒక పండుని అందుకుని ఇందు కు అందించారు - శివా ....... నీ కాబోయే భార్యకు నువ్వే ఇవ్వరా ........
పెదాలపై చిరునవ్వు అంతులేని సిగ్గులతో జానకి గారూ ........ అంటూ అందించాడు .
చారు అంటీ ఆటపట్టించడంతో వెళ్లి అత్తయ్యగారి వెనుక దాచుకున్నాడు .
అత్తయ్యగారు : నవ్వుకుని , రేయ్ శివా ....... ఈపళ్ళు అన్నింటినీ నీ కాబోవు శ్రీమతి ఇంటికి చేర్చు .
శివ : అలాగే అమ్మా .......
అక్కాచెల్లెళ్ళు : ఒకరినొకరు చూసుకుని , అత్తయ్యగారూ ........ తప్పైతే క్షమించండి - ఈ పళ్ళు అన్నింటినీ సాయంత్రం గుడి దగ్గర మా అత్తయ్యగారి తరుపున భక్తులకు - ఆకలిగా ఉన్నవారికి పంచితే .......... అని తలలు దించుకున్నారు .
అత్తయ్యగారు : కొన్నిక్షణాల మౌనం తరువాత , ఈ అత్తయ్య గర్వపడేలా ఐడియా ఇచ్చి తప్పు చేసినవాళ్ళల్లా తలలు దించుకుంటారు ఏంటి కోడళ్ళూ ......... , నా బంగారం అంటూ దిష్టి తీశారు - నాయనా శివా ......... నాకోడళ్లు అడుగుపెట్టిన శుభసందర్భాన తోటలో పండిన పళ్ళు అన్నింటినీ గుడిదగ్గర .........
శివ : అర్థమైంది అమ్మా ....... , తన తల్లి ఇంత సంతోషించడం చూసి కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని , థాంక్స్ జానకీ అని షేక్ హ్యాండ్ ఇచ్చి జలదరించడం చూసి అందరూ ఎంజాయ్ చేశారు .
సాయంత్రం వరకూ తోటలోనే సరదాగా గడిపి ఇంటికి చేరుకుని ఫ్రెష్ అయ్యి పూజా సామాగ్రితో గుడికి చేరుకున్నారు .
ఊరిలోని ఆడాళ్లందరి చూపులు జానకి - ఇందుల పైననే , నాగాంబకు అందమైన కోడళ్లు దొరికారు అని గుసగుసలాడుకోవడం విని , అత్తయ్యగారి ఆనందాలకు అవధులులేకుండాపోయాయి .
గుడిలోకివెళ్లి కృష్ణుడిని దర్శించుకున్నారు . రెండు ట్రాక్టర్ల లో తీసుకొచ్చిన పళ్ళను భక్తులకు పంచిపెట్టారు .
ఇలా మన అయ్యగారు ఉన్నప్పుడు పంచేవారు మళ్లీ ఇప్పుడు శివ పంచుతూన్నాడు - అయినా సాయపడటం వాళ్ళ రక్తంలోనే ఉందిలే ........
శివ : థాంక్స్ జానకి ........ అని పొంగిపోయి , తోట నుండి మరిన్ని పళ్ళు తెప్పించి భక్తులకు భక్తితో అందేలా చూసాడు .
శివ : అమ్మా .........
అత్తయ్యగారు : విన్నాను - చూసాను శివా ........ , నా కోడళ్ల వల్లనే అని ముద్దులుపెట్టి మురిసిపోయారు . గుడి ఆవరణలో ఊరిలోని అమ్మాయిలంతా గుంపుగా చేరి కేకలువేస్తూ కేరింతలతో ఉట్టి కొడుతుండటం చూసి అత్తయ్యగారు అక్కడికి పిలుచుకునివెళ్లారు .
ఉట్టికొట్టడానికి పరుగునవస్తున్న అమ్మాయిలపై రంగులు కొడుతూ దగ్గరికి రాగానే ఉట్టిని పైకిలాగి ఆటపట్టిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు . ఒకరితరువాతమరొకరు ఊరి మరియు చుట్టుప్రక్కల గ్రామాల నుండి వచ్చిన పెళ్లి కావాల్సిన అమ్మాయిలందరూ ప్రయత్నించి విఫలం చెందారు .
నిన్నటి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ఉట్టి కొట్టకుండానే పండుగ ముగిసేలా ఉందని అందరూ బాధపడుతున్నారు . అందుకే కదా ....... వర్షాలు సరిగ్గా పడక అంతంత చేతికొచ్చిన పంట కూడా లాభాలు అందించలేదు అని గుసగుసలాడుకుంటున్నారు .
ఉట్టి లాగుతున్న అమ్మాయిలు : ఇంకెవరైనా ఉన్నారా ? లేకపోతే పూజ చేసి ఉట్టిని కిందకు దించడం .........
ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ప్రయత్నించినా వీలుపడలేదు .
అత్తయ్యగారు : ఆపండి , కోడళ్ళూ .........
ఆ మాట కోసమే ఉత్సాహంతో ఎదురుచూస్తున్నట్లు అత్తయ్యగారూ అని పాదాల ఆశీర్వాదం ( అమ్మ పాదాలకు కూడా ) తీసుకుని ఉట్టి కర్రలను అందుకున్నారు .
అమ్మాయిలందరూ : నాగాంబ గారి కాబోయే కోడలు అని గుసగుసలాడుకుని రంగులతో రెడీ అయిపోయారు .
జానకి : చెల్లీ ....... అని బుగ్గపై ముద్దుపెట్టి పంపించింది .
ఇందు : లవ్ యు అక్కయ్యా , ఎలాగైనా అత్తయ్యగారి పెదాలపై చిరునవ్వు చిగురింపచెయ్యాలి అని అత్తయ్యగారివైపు చూసి ఉట్టివైపు పరుగుతీసింది రెండువైపుల నుండీ విసురుతున్న రంగులను దాటుకుంటూ ........ , తన జంప్ కంటే మరింతపైకి ఉట్టిని లాగడంతో కొట్టలేకపోయింది .
అమ్మాయిలంతా నిరాశ చెందారు - కొంతమంది నవ్వుకున్నారు .
ఇందు : అక్కయ్యా ......... కమాన్ అని ఫ్లైయింగ్ కిస్ వదిలింది .
జానకి : అత్తయ్యగారివైపు సంతోషంతో చూసి పరుగునవెళ్లి ఇందు కంటే పైకి ఎగిరినా వీలు కాకపోయింది .
మళ్లీ నిరాశే అందరిలో ..........
అక్కాచెల్లెళ్ళు హైఫై కొట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరూ ఒకేసారి పరుగున రావడం చూసి ఉన్న రంగులన్నీ జల్లుతూ ఉట్టిని మరింత పైకి లాగారు . ఇద్దరూ ఒకరిచేతినిమరొకరు పట్టుకుని అంతెత్తుకూ ఎగిరి ఉట్టిని పగలగొట్టేశారు .
అంతే అమ్మాయిలంతా సంతోషంతో నాగాంబ గారు నాగాంబ గారు ........ అని కేకలువేస్తూ వెళ్లి జానకి - ఇందు లను అమాంతం ఎత్తేసి తిప్పుతూ సంబరాలు చేసుకున్నారు . ఆ సంతోషాలను చూసి చప్పట్లుకొడుతూ ఏదైనా ఆ కుటుంబానికే చెల్లు అని మాట్లాడుకోవడం విని అత్తయ్యగారు సంతోషంతో ఆకాశానికి చేరుకున్నారు .
చారు - వదినగారూ ........ నా కోడళ్లు సాధించారు అని ఇద్దరినీ కౌగిలించుకున్నారు అత్తయ్యగారు .
అంతలోనే వర్షం పడటంతో ఊరిజనం వర్షంలోనే సంబరాలు జరుపుకున్నారు . ఆడాళ్ళంతా అత్తయ్యగారిని చుట్టుముట్టి అక్కడ శివ గురించి , ఇక్కడ నీ కోడళ్ల గురించి , ఇక ఊరంతా మీ కుటుంబం మంచితనం గురించే మాట్లాడుకుంటున్నారు తెలుసా ........ , చక్కని కోడలు మా దిష్టి నే తగిలేలా ఉంది అని సంతోషాలను పంచుకునివెళ్లారు .
అక్కాచెల్లెళ్ళు : అత్తయ్యగారూ - అత్తయ్యగారూ ........ క్షమించండి , మీరు ప్రేమతో ఇచ్చిన చీరలు రంగులు మరియు వర్షంలో తడిచిపోయాయి అని తలదించుకున్నారు .
అత్తయ్యగారు : అమాంతం ఇద్దరినీ కౌగిలించుకున్నారు . అడుగుపెట్టిన రోజునే మన కుటుంబ గౌరవాన్ని శిఖరానికి తీసుకెళ్లి ఇలా తప్పుచేసినవాళ్ళల్లా నిలుచున్నారు ఏంటి కోడళ్ళూ ......... అని నుదుటిపై ముద్దుపెట్టారు . తడిస్తే తడవనియ్యండి నా కోడళ్ల కోసం ఇలాంటివి వంద చీరలు కొంటాను - అమ్మో ...... వర్షం నా కోడళ్లకు జలుబువేస్తుంది , నాయనా శివా .........
శివ : క్షణంలో కార్లు తీసుకొస్తానమ్మా అని డ్రైవర్స్ తోపాటువెళ్లి తీసుకొచ్చాడు .
మరొకసారి మొక్కుకుని ఇంటికి చేరుకున్నారు .
అత్తయ్యగారు : చారూ ....... మీరు మీ గదిలోకి వెళ్ళండి . వదినగారూ ....... మీరు నా గదిలోకిరండి కొత్తచీరలను ఇస్తాను - కోడళ్ళూ ....... పైన కుడివైపున మీ గది , నా కోడళ్ల కోసం చీరలు డ్రెస్ లు సెలెక్ట్ చేసి ఉంచాను ఎంజాయ్ - శివా ....... మీ మావయ్యగారిని నీ రూంలోకి తీసుకెళ్లు ........ , గంటలో రావుగారు వస్తారు పెళ్లి ముహూర్తం పెట్టడానికి ఆలోపు రెడీ అయ్యి వచ్చెయ్యండి అని స్వీట్ ఆర్డర్ వేసి డిస్పర్స్ అయిపోయారు .
నాగాంబ గారు చెప్పినట్లుగానే గంటలోపే అందరూ హాల్ లోకివచ్చారు . అప్పటికే పంతులుగారు వచ్చి ఉండటంతో నమస్కరించి వారు కోరినవన్నీ వారి ముందు ఏర్పాటుచేశారు .
పంతులు గారు : శుభం , నాగాంబ గారూ ........ వరుడు - వధువు తోపాటు కుటుంబం ఇక్కడ కూర్చోండి - జాతకాలు ఇవ్వండి అని అడిగారు .
శివ ........ నాగాంబ గారితోపాటు - జానకి ......... చెల్లి అమ్మానాన్నలతోపాటు కూర్చున్నారు . జాతకాలు అందించారు .
పంతులు గారు జాతకాలు అందుకుని చూసి పెదాలపై చిరునవ్వులతో పంచాంగం అందుకుని గాల్లో లెక్కలివేసి , శుబస్రశీఘ్రం - నాగాంబ గారూ ....... జాతకాలు భలే కలిసాయి - ఒకరికోసం ఒకరు పుట్టినట్లు .........
అందరూ సంతోషించారు - శివ అయితే జానకి వైపు ప్రేమచూపులు వదిలి సిగ్గుపడ్డాడు .
ఇందు : అక్కయ్యా ........ అంటూ సైడ్ నుండి చుట్టేసి బుగ్గపై సంతోషంతో ముద్దుపెట్టి గిలిగింతలు పెట్టింది . అమ్మానాన్నలు సంతోషించారు .
పంతులు గారు : నాగాంబ గారూ ......... వారంలో అంటే మళ్లీ ఇదేరోజున దివ్యమైన ముహూర్తం ఉంది .
చారు అంటీ : వారంలోనా ......... , పంతులు గారూ ........ నాగాంబ గురించి మీకు తెలుసుకదా పెళ్లి ఘనంగా జరిపించాలని కలలు కంటోంది - వారంలో అంటే కష్టమే .........
పంతులు గారు : క్షమించండి , ఈ దివ్యమైన ముహూర్తం వధులుకుంటే మళ్లీ 3 నెలల వరకూ శుభ ముహూర్తాలే లేవు - మీరు ఎలా అంటే అలా .........
నాగాంబ : నా కోడలిని చూడకుండా 3 నెలలు ఉండటం వల్ల కానిది .
చారు అంటీ : నీవల్ల కాదేమో , శివ అయితే ఏకంగా బాధపడుతున్నట్లున్నాడు .
జానకి : తియ్యదనంతో నవ్వి , సిగ్గుపడుతోంది .
నాగాంబ : అన్నయ్యగారూ ......... నా కోడలు లక్ష్మీ దేవిలా ఈ ఇంట్లో తిరగాలని ఆశపడుతున్నాను ,3 నెలలు ఆగలేను - మీరేమంటారు .
నారాయణ : శ్రీమతితో - బిడ్డలతో గుసగుసలాడి పెదాలపై చిరునవ్వులతో చెల్లెమ్మా ........ మీ ఇష్టమే మా ఇష్టం . వారంలో అంటే కష్టమే అయినా సంతోషంతో మీరు కోరుకున్నట్లుగానే పెళ్లి జరిపిద్దాము .
నాగాంబ : చాలా చాలా సంతోషం అన్నయ్యగారూ ......... , పంతులు గారూ ఈ ముహూర్తాన్నే ఫిక్స్ చెయ్యండి .
పంతులుగారు : శుభం ........ , ఈ ముహూర్తం దేవుళ్ళు నిర్ణయించింది - ఈ ముహూర్తంలో పెళ్లిచేసుకున్నవారు సకల సంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతానంతో వర్ధిల్లుతారు అని పెళ్ళిపత్రిక రాసి తాంబూలాలు మార్పించి పెద్దమొత్తంలో సంభావన తీసుకుని సంతోషంగా వెళ్లారు .
కౌగిలించుకుని చిరునవ్వులు చిందిస్తున్న అక్కాచెల్లెళ్ల దగ్గరికివెళ్లి , నా బంగారాలు అంటూ దిష్టి తీశారు నాగాంబ గారు .
అత్తయ్యగారూ అంటూ కౌగిలిలోకి చేరిపోయారు .
నాగాంబ గారు : అన్నయ్యగారూ ....... వారం రోజులూ ఇక్కడే ఉండి పెళ్లి జరిపించాలి . ఇక్కడి నుండే అన్నీ ఏర్పాట్లూ పూర్తిచేద్దాము .
నారాయణ : సంతోషం చెల్లెమ్మా .........
నాగాంబ : శివా ........ సమయం తక్కువ ఉన్నా ఏలోటూ రాకూడదు పెళ్లి అంగరంగవైభవంగా జరగాలి రేపే షాపింగ్ కు వెళుతున్నాము - తమ్ముడికి కాల్ చేసి ఇవ్వు .
శివ : జానకి వైపు చూస్తూ సిగ్గుపడుతూనే , అమ్మా అంటూ కాల్ చేసి అందించాడు.
నాగాంబ : నాన్నా ....... అంటూ విషయం చెప్పారు .
మురళి : గుడ్ గ్రేట్ న్యూస్ మమ్మీ ......... , షాపింగ్ కు అందరూ బెంగళూరు వచ్చెయ్యండి - ఇక్కడ జ్యూవెలరీ ........ , మైసూర్ కంచి లలో పట్టుచీరలు తీసుకుందాము - తిరుగుప్రయాణంలో మీతోపాటే వచ్చేసి పెళ్ళిపనులన్నీ నేనే చూసుకుంటాను - రేపు ఉదయానికి టికెట్స్ బుక్ చేస్తాను , ఒక్క నిమిషం అమ్మా ......... అని లాప్ అందుకున్నాడు - మమ్మీ ........ ఉదయం 6 గంటలకు విజయవాడ లో ఫ్లైట్ అంతలోపు అక్కడికి చేరుకోవాలి , ఎంతమందికి బుక్ చెయ్యాలి .
నాగాంబ : లవ్ యు నాన్నా ........ , మీ వదినవాళ్ళు నలుగురు , చారు అంటీవాళ్ళు నలుగురు , మనం .........
మురళి : బుక్ చేసేసాను మమ్మీ ........ , హ్యాపీ జర్నీ మమ్మీ , అన్నయ్యకు టికెట్స్ సెండ్ చేస్తాను - రేపటి నుండి పెళ్లి అయ్యేంతవరకూ లీవ్ పెట్టేస్తున్నాను , ఎయిర్పోర్ట్ కు నేనే స్వయంగా వస్తాను బై మమ్మీ ........
నాగాంబ : లవ్ యు నాన్నా......... , చారూ ........
చారు అంటీ : అర్థమయ్యింది లేవే , రేపే బెంగళూరు ప్రయాణం ఎన్ని గంటలకు ? .
నాగాంబ : తెల్లవారుఘామునే .........
చారు అంటీ : మొత్తానికి కోడళ్లను చూసిన ఒక్కరోజులోనే ఫ్లైట్ లో తీసుకెళ్లబోతున్నావు . జానకీ - ఇందు ........ సంతోషమే కదా .
అక్కాచెల్లెళ్ళు : అత్తయ్యగారి కౌగిలిలో పరవశించిపోతున్నారు .
నాగాంబ : అన్నయ్యగారూ ........ పెందలాడే ప్రయాణం భోజనం చేసి త్వరగా పడుకోండి - కోడళ్ళూ ....... మీరుకూడా .
అక్కాచెల్లెళ్ళు : అలాగే అత్తయ్యగారూ ........ , అత్తయ్యగారూ ....... స్వీటీ ? .
నాగాంబ గారు : నాకొడళ్లతోపాటే స్వీటీ కూడా హ్యాండ్ బ్యాగులో సేఫ్ గా తీసుకెళదాము ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కళ్లుగప్పి అని నవ్వుకున్నారు .
అక్కాచెల్లెళ్ళు : స్వీటీ ఆనందం చూసి , థాంక్స్ అత్తయ్యగారూ ........ భోజనం చేసి ఎవరిగదిలోకి వాళ్ళు వెళ్లిపోయారు .
ఉదయం 3 గంటలకే లేచి రెడీ అయ్యి కావాల్సినవి తీసుకుని కార్లలో బయలుదేరి ఫ్లైట్ సమయానికి విజయవాడ ఎయిర్పోర్ట్ చేరుకుని , స్వీటీ వలన కంగారు - తొలిసారి ఫ్లైట్ ఎక్కబోతున్నామన్న ఉత్సాహంతో సెక్యూరిటీ దాటుకుని ఫ్లైట్ లోకి చేరారు .
ఇందు : అక్కయ్యా ....... చూస్తున్నావుగా అమ్మానాన్నల సంతోషం లవ్ యు అంటూ చేతిని చుట్టేసి ప్రక్కప్రక్కనే కూర్చుని విండో నుండి చూస్తూ ఎంజాయ్ చేస్తోంది . బావగారూ ........ అక్కయ్య ప్రక్కన సీట్ ఖాలేనే కదా కూర్చోండి - నేను ఉంటే ఇబ్బందిపడతారంటే చెప్పండి మా అత్తయ్యగారిదగ్గరకు వెళ్లిపోతాను .
శివ : లేదు లేదు ఇందు , మీ అక్కాచెల్లెళ్లను విడగొట్టానన్న పాపం నాకు వద్దు . మీరు ఎప్పుడూ ఇలానే ఉండాలి - నాకూ అదే ఆనందం అని జానకి ప్రక్కన సిగ్గుపడుతూనే కూర్చున్నాడు .
జానకి : థాంక్స్ శివ గారూ అని చేతిలో చేతిని వేసింది . ఆ స్పర్శకే శివ షాక్ కొట్టినట్లు వణకడం చూసి , అంటే నా కాబోయే శ్రీవారు ఇప్పటివరకూ ఏ అమ్మాయి చేతినికూడా తాకలేదన్నమాట , లవ్ యు శివ గారూ ........
శివ : లవ్ యు జానకి గారూ .........
ఇందు : బావగారూ ఇంకా గారూ ఏంటి ప్రేమతో జానకీ , శ్రీమతీ , ఏమే , ఒసేయ్ అని పిలవచ్చుకదా , నేనున్నానని మోహమాటపడకండి మిమ్మల్ని నేను చూడటం లేదులే అని ముసిముసినవ్వులతో బెంగళూరు చేరేంతవరకూ అక్కయ్య మరొకచేతిని చేతిని వదలకుండా పట్టుకుని విండో నుండి మేఘాలను చూస్తూ ఆనందిస్తోంది .
బెంగళూరులో ల్యాండ్ అయ్యి పెద్ద ఎయిర్పోర్ట్ ను ఆశ్చర్యం - సంతోషంతో బయటకురాగానే మురళి రిసీవ్ చేసుకున్నాడు .
మురళి : అన్నయ్యా ....... congratulations , వదినా ....... మీకు కూడా , అందరికీ బెంగళూరుకు స్వాగతం . మమ్మీ ....... ముందు ఏ షాపింగ్ ? .
నాగాంబ : ఇందు ఇష్టమే నా ఇష్టం . కోడలూ ........
ఇందు : అత్తయ్యగారూ ......... అంటూ సంతోషంతో కౌగిలిలోకి చేరిపోయింది .
నాగాంబ : చెప్పు బుజ్జి కోడలా ? Please please ........
ఇందు : ఆనందిస్తున్న అక్కయ్యవైపు చూసి , అత్తయ్యగారూ ....... చీరలు .
మురళి : నేనూ అదే అనుకున్నాను మమ్మీ ........ , ఈ జర్నీ మూడ్ లోనే మైసూర్ - కంచికి వెళ్లిపోదాము . 5 మినిట్స్ మమ్మీ , అన్నయ్యా ........ వదినను వదిలి 5 నిమిషాలు వస్తే వెహికల్ బుక్ చేద్దాము .
అందరూ నవ్వుకున్నారు .
శివ : వస్తున్నా తమ్ముడూ ........ అని జానకి చేతిపై ముద్దుపెట్టి వెళ్ళాడు . నిమిషాల్లోనే లగ్జరీ బస్ లో వచ్చి మమ్మీ ....... AC - టీవీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళవచ్చు .
నాగాంబ : ఇందూ ........ మురళి ఎప్పుడూ ఇంతే అని బస్ ఎక్కారు .
ఇందు : అత్తయ్యగారూ ........ ఎయిర్ బస్ లానే ఉంది - సూపర్ .
నాగాంబ : థాంక్స్ చెప్పాలనుకుంటే నా చిన్న కొడుకు మురళికి చెప్పు కోడలా ........
ఇందు : తలదించుకునే థాంక్స్ మురళిగారూ అని చిన్నగా చెప్పింది .
ఆ చిరు మాటలకే అత్తయ్యగారు మురిసిపోతున్నారు .
చారు అంటీ : ఒసేయ్ ఒసేయ్ ఇది మరీ ఓవర్ గా లేదూ ........ , ఇద్దరిలో ప్రేమ పిట్టించడమే కాకుండా ఏకంగా పెళ్లికూడా చేసేలా ఉన్నావు అని గుసగుసలాడింది .
నాగాంబ : ఆలస్యం అమృతం విషం అన్నారుకాదే , నా చిన్నకోడలు ఒప్పుకోవాలేకానీ మురళి కాళ్ళూ చేతులూ కట్టేసైనా తాళి కట్టించెయ్యనూ ........
చారు అంటీ : చేతులు కట్టేస్తే పాపం తాళి ఎలా కడతాడే అని నవ్వుకుని బయలుదేరారు .
శివ ........ జానకి ప్రక్కన కూర్చుని , మావయ్యగారూ ......... విజయవాడలో తెలిసిన వెడ్డింగ్ కార్డ్స్ ఆఫీస్ ఉంది , మీరు పంచడానికి ఒక వెయ్యి .........
నారాయణ : అల్లుడుగారూ ......... అంతమంది లేరు ఒక 200 .......
శివ : మీ ఇంటిలో కూడా తొలి శుభకార్యం కదా మావయ్యగారూ తెలిసిన వారందరినీ ఆహ్వానించండి - వారు మన గ్రామానికి వచ్చేలా అవసరమైనన్ని బస్సెస్ తమ్ముడు ఏర్పాటుచేస్తాడు .
మురళి : డన్ అన్నయ్యా .........
శివ : మావయ్యగారూ ........ అయితే 500 మీకు 1000 మాకు అని నిర్ణయించి కాల్ చేసి పంతులుగారు రాసిన లగ్నపత్రికను వాట్సాప్ చేసాడు . ఆ వెంటనే వెడ్డింగ్ కార్డ్స్ డిజైన్స్ రావడంతో జానకి గారూ - ఇందు ........ సెలెక్ట్ చెయ్యండి అని మొబైల్ అందించాడు .
ఇందు : థాంక్స్ బావగారూ ........ , అక్కయ్య సెలక్షన్ కోరినందుకు ........
చారు అంటీ : ఇందూ ........ మీ అక్కయ్య అప్పుడే అమాయకమైన మా శివను కొంగును కట్టేసుకుందిలే అని నవ్వుకున్నారు .
మైసూర్ చేరుకునేవరకూ సెలక్షన్ లో పడిపోయి అందమైన కార్డ్ సెలెక్ట్ చేశారు .
శివ : బ్యూటిఫుల్ జానకి గారూ - ఇందు , మీరే వెళ్లి అమ్మకు చూయించండి .
అక్కాచెల్లెళ్ళు : సంతోషంగా వెళ్లి చూయించారు .
అత్తయ్యగారు : నా బంగారు కోడళ్ల సెలక్షన్ అంటే ఇక చూడాల్సిన అవసరం లేదు , ఎంత అందమైనదో చూస్తాను అంతే - చాలా చాలా బాగుంది .
శివ : మొబైల్ అందుకుని 1000 ఒక కలర్ - 500 మరొక కలర్ రేపటిలోపు ప్రింట్ చెయ్యమని selected కార్డ్ వాట్సాప్ చేసాడు .
మొదట మైసూర్ అటునుండి కంచికివెళ్లి అక్కాచెల్లెళ్లకు ఇష్టమైన చీరలు అందరికీ countless సెలెక్ట్ చేసి అర్ధరాత్రి బెంగళూరు చేరుకున్నారు . లగ్జరీ హోటల్లో రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మొత్తం రెండు మూడు బిగ్గెస్ట్ షాప్స్ లలో జ్యూవెలరీ తీసుకున్నారు . మురళితోపాటు విజయవాడ చేరుకుని వెడ్డింగ్ కార్డ్స్ తీసుకుని గ్రామానికి చేరుకున్నారు .
ఆ తరువాత రోజు ఉదయమే వెడ్డింగ్ కార్డ్స్ పంచడానికి బయలుదేరారు శివ తన గ్రామం లోని ప్రతీ ఇంటినీ మరియు చుట్టూ లంక గ్రామాలలోని బంధువులకు - మురళి వేరు వేరు ప్రాంతాలలో స్థిరపడిన బంధువులను ఆహ్వానించడానికి వెళ్ళాడు .
నాగాంబ : అన్నయ్యగారూ - వదినా ........ నా కోడళ్లను ప్రాణంలా చూసుకుంటాను మీరు హ్యాపీగా వెళ్లి అందరినీ ఆహ్వానించండి - ఇందూ ....... మీ బంధువులకోసం మురళి 10బస్సులను మాట్లాడేశాడు - మీ ఫ్రెండ్స్ బంధువులు ఇరుగుపొరుగువారు అందరినీ ఆహ్వానించండి - అన్నయ్యగారూ ........ మీకోసం లగ్జరీ కార్ , డ్రైవర్ ఎక్కడికి తీసుకెళ్లమంటే అక్కడికితీసుకెళతాడు .
తండ్రి : చాలా సంతోషం చెల్లెమ్మా .........
ఇందు : నాన్నగారూ ......... అక్కయ్య ఫ్రెండ్స్ అడ్రస్ లు తీసుకున్నారు కదా ? .
నాగాంబ : మరి నా చిన్న కోడలి ఫ్రెండ్స్ .........
ఇందు : ఇచ్చాను అత్తయ్యగారూ ...........
నాగాంబ : నా చిన్న కోడలు బంగారం . కంగారుపడకండి అన్నయ్యగారూ అని అక్కాచెల్లెళ్ల చేతులను అందుకున్నారు .
తండ్రి : ప్రాణంలా చూసుకునే వారి అత్తయ్యగారి చెంతన ఉండగా భయమెందుకు చెల్లెమ్మా ........ వెళ్ళొస్తాము అని సంతోషంగా బయలుదేరారు .
రెండు రోజులు వెడ్డింగ్ కార్డ్స్ పంచడంలో బిజీ చివరి రెండు రోజులు పొలంలో పెళ్ళిమండపం పెళ్లి ఏర్పాట్లలో అందరూ బిజీ బిజీ అయిపోయారు - మురళి అయితే ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకోనేలేదు . అనుకున్నట్లుగానే పెళ్లిరోజు వచ్చేసింది .
ఉదయమే రెండు కుటుంబాల బంధువులు ఫ్రెండ్స్ ........ వచ్చారు - సాధారంగా ఆహ్వానించారు .
ఇందు : బస్సెస్ నుండి తల్లిదండ్రులతోపాటు దిగిన తన మరియు తన అక్కయ్య ఫ్రెండ్స్ ను కౌగిలించుకుని తన అక్కయ్య దగ్గరికి తీసుకెళ్లింది .
ఫ్రెండ్స్ : జానకీ - అక్కయ్యా ........ పెళ్లి మండపం చూసి ఆశ్చర్యపోయాము అంటే నమ్మండి - పల్లెటూరు కదా ఏదో గుడిలో కానిచ్చేస్తారు అనుకున్నాము - సిటీ లో డెకరేషన్ కంటే అద్భుతం , అదృష్టవంతురాలివే .........
పంతులు గారు : వధూవరులను పిలవడంతో అమ్మానాన్నలతోపాటు పెళ్ళిమండపం చేరుకుని హోమం ముందు వధూవరులు కూర్చున్నారు .
తమ గ్రామంలో ఇప్పటివరకూ జరగనంత ఘనంగా - జనసందోహం చూసి ఎంతైనా ఆ కుటుంబంపై ప్రేమ ఇప్పటికీ తగ్గనేలేదు అని గర్వపడుతూ మాట్లాడుకోవడం తెలిసి నాగాంబ మురిసిపోతోంది .
అంతమంది సమక్షంలో శివ ...... జానకి మెడలో తాళికట్టి తనదానిని చేసుకున్నాడు .
ఇందు : నాన్నగారూ ........ ఇంతమంది జనం - అక్కయ్య ఆనందం చూసారా అని జానకి బుగ్గపై ముద్దుపెట్టి ప్రతీ క్షణాన్నీ ఎంజాయ్ చేస్తున్నారు .
పెళ్లికి తగ్గట్లే భోజనాలు కూడా అధిరిపోయాయని , ఇలాంటి పెళ్లి కనులారా తిలకించడం మన అదృష్టం అని సంతోషించి వధూవరులను దీవించారు .
ఫ్రెండ్స్ అందరూ గిఫ్ట్స్ ఇచ్చి ఫోటోలు తీసుకుని Happy married life చెప్పి సాయంత్రం వరకూ ఎంజాయ్ చేసి వెళ్లారు .
వధూవరులు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుని ఇంటికి చేరుకున్నారు .
నాగాంబ : చారు - వదినా ........ ఈరోజును జీవితంలో మరిచిపోలేను అని పరవశించిపోతున్నారు . పంతులు గారు చెప్పారు ఈ రాత్రికే కార్యం జరిపించాలని ........
చారు అంటీ : మురళీ ........ మీ అన్నయ్య శోభనం రాత్రికే , చీకటి పడింది అయినా సరే తోటలోని మల్లె పూలు - గులాబీ పూలతోపాటు అన్నిరకాల పూలు మరియు పళ్ళు పెద్దమొత్తంలో తీసుకురావాలి .
మురళి : ఇదిగో ఇప్పుడే వెళుతున్నాను అంటీ అని పనివాళ్ళతోపాటు వెళ్లి గంటలో తీసుకువచ్చాడు . మమ్మీ ......... పెళ్లి సంతోషంగా జరిగిందికదా , ఆఫీస్ లో ముఖ్యమైన వర్క్ నేను వెళ్లనా ? .
నాగాంబ : అన్నయ్య పెళ్లికి అన్నీ నువ్వై చూసుకున్నావు , ఇక మేము చూసుకుంటాములే జాగ్రత్తగా వెళ్లు , అన్నయ్య వదినలకు చెప్పి వెళ్లు .......
మురళి : అలాగే మమ్మీ అని ఆశీర్వాదం తీసుకుని , కింద గదిలో ఉన్న తన అన్నయ్య దగ్గరికివెళ్లాడు .
చారు అంటీ : వాళ్ళతోపాటు ఇందుకు కూడా చెప్పి వెళ్ళమనాల్సింది .
నాగాంబ : నిన్నూ ........ , సరే సరే సమయం లేదు పైనున్న శివ గదిని ముత్తైదువులతోపాటువెళ్లి శోభనం గదిలా రెడీ చెయ్యి ........
కార్యం సమయానికల్లా అందరూ భోజనాలు పూర్తిచేశారు . శివకు శోభనపు డ్రెస్ అందించి తన గదికి పంపించారు - జానకి ...... అత్తయ్యగారి , అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాక శోభనపు పెళ్లికూతురిలా తెల్లని చీర , కురులనిండా మల్లెపూలు , పాల గ్లాస్ తో రెడీ చేసి ఆటపట్టిస్తూ పైనున్న శోభనపు గదిదగ్గరకు తీసుకెళ్లారు .
జానకి : సిగ్గుపడుతూనే ఇందును కౌగిలించుకుంది .
ఇందు : ఎంజాయ్ అక్కయ్యా ........ అని నుదుటిపై ముద్దుపెట్టి , లోపలకు పంపించి డోర్ క్లోజ్ చేసేసుకున్నారు .
ఇందు : సిగ్గుపడుతూనే కిందకువచ్చి , అత్తయ్యగారి ప్రక్కన కూర్చుంది . అత్తయ్యగారూ ........ 10 రోజుల్లో సెకండ్ ఇయర్ ఫైనల్ exams - రేపు ఉదయం ఊరికి వెళతాము ఇంకా ఏమీ చదువుకోలేదు .
అత్తయ్యగారు : కనీసం నెలరోజులైనా ఈ అత్తయ్యతోపాటు ఉంటావని ఆశపడ్డాను ఇందూ .........
చారు అంటీ : నాగాంబ ....... కన్నీళ్లు వచ్చేస్తున్నాయే ,
అత్తయ్యగారు : లేదు లేదు లేదు , exams ముఖ్యం అని కన్నీటిని తుడుచుకున్నారు .
ఇందు : అత్తయ్యగారూ ........ మేమంటే ఇంత ప్రేమ అని తెలియదు , exams ఎప్పుడైనా రాసుకోవచ్చు నేను ఇక్కడే ఉంటాను .
అత్తయ్యగారు : నా బుజ్జి కోడలు exams రాయలేదంటే నాకెంత అవమానం - నా కోడలు ర్యాంక్ సాధించాలి , హ్యాపీగా వెళ్లి చదువుకుని exams రాయి , exams అయిన వెంటనే వచ్చేయ్యొచ్చు , వెళ్లు ఇందూ ....... ఈ వారమంతా పెళ్ళిపనులతోనే సరిపోయింది వెళ్లి హాయిగాపడుకో , వదినా ........ తీసుకెళ్లండి అని నుదుటిపై ముద్దుపెట్టి పంపించింది .
ఇందు : అత్తయ్యగారూ ....... మీరు కూడా హాయిగా నిద్రపోండి , నేనే స్వయంగా పరుపు రెడీ చేస్తాను అని వద్దంటున్నా వినకుండా వెళ్ళింది .
చారు అంటీ : భలే అత్తాకోడళ్లు అని సంతోషాన్ని పంచుకుంది .
**********
తరువాతిరోజు సూర్యోదయ సమయానికే రెడీ అయ్యి ఇందు ...... తన తల్లిదండ్రులతోపాటు లగేజీ తీసుకుని హాల్లోకివచ్చింది .
అత్తయ్యగారు : ఇందూ ......... నీకోసమే తెల్లవారుఘామునే రెడీ అయ్యి కూర్చున్నాను , వెళ్లేంతవరకూ నాదగ్గరే ఉండాలి .
ఇందు : అలాగే అత్తయ్యగారూ ....... అని సంతోషంగా వచ్చి కూర్చుంది .
చారు అంటీ : ఇందూ ........ , అక్కయ్యను చూడకుండా ఉండలేవు కదా ఇప్పుడు వదిలి ......
ఇందు : అంటీ ....... ఆ విషయం గుర్తుచేయకండి కన్నీళ్లు ఆగవు , నా కన్నీళ్లు చూస్తే అక్కయ్య బాధ వర్ణణాతీతం .
9 గంటల సమయంలో జానకి తలంటు పోసుకుని కొత్తచీరలో సిగ్గుపడుతూ కిందకువచ్చి అందరినీ చూసి మరింత సిగ్గుతో అత్తయ్యగారి పాదాలను స్పృశించి ఇందు చేతిని చుట్టేసి కూర్చుంది .
అత్తయ్యగారు : కోడలూ ....... ok కదా ....... నీ హీరో ఇంకా నిద్రపోతున్నాడా ? కాఫీ తీసుకెళ్లడానికి వచ్చావా ..... ?
జానకి : సిగ్గు పెరుగుతూనే ఉంది .
చారు అంటీ : ఇంతకంటే ఏమి చెబుతుంది అని నవ్వుకున్నారు - ఎంతైనా మన శివ పోటుగాడే అని జానకిని ఆటపట్టించారు .
ఇందు : బాధను లోలోపలే దాచేసుకుని , వెళ్లు అక్కయ్యా ........ బావగారిని బెడ్ కాఫీతో నిద్రలేపు అని బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
జానకి : అలాగే చెల్లీ ....... , వెంటనే వచ్చేస్తాను అని లేచి లగేజీ ప్యాక్ చేసి ఉండటం చూసి , ఎవరివి అని అడిగింది .
ఇందు మౌనంగా ఉండిపోయింది .
అమ్మ : తల్లీ ........ నీ చెల్లికి 10 రోజుల్లో exams ......
అంతే జానకి కళ్ళల్లో కన్నీళ్ళతో ఇందూ చేతిని గట్టిగా పట్టుకుని బాధపడుతోంది .
ఇందు : బాధను లోపలే ఉంచుకుని పైకిమాత్రం చిరునవ్వులతో , అక్కయ్యా ...... ప్రాణంలా చూసుకునే అత్తయ్యగారు - ప్రేమను పంచే బావగారు ఉండగా ఈ కన్నీళ్లు ....... అని తుడిచింది . Exams అవ్వగానే వచ్చేస్తాను కదా అని ముద్దులుపెట్టింది - వెళ్లు బావగారు కాఫీ కోసం ఎదురుచూస్తుంటారు - అందరమూ టిఫిన్ చేశాక బయలుదేరతాము అని లేపి మరీ పంపించింది .
జానకి కన్నీళ్లు అయితే గంగా ప్రవాహం అయ్యింది . పనిమనిషి అందించిన కాఫీ అందుకుని చెల్లి వైపు ప్రాణంలా చూస్తూనే పైకివెళ్లింది .
20 నిమిషాలలో భర్త గుండెలపై బాధపడుతూనే కిందకువచ్చి ఇందు ప్రక్కనే కూర్చుంది .
ఇందు : బావగారూ ....... మీరు ok అంటే ఊరికి వెళతాము .
శివ : exams అన్నావు కాబట్టి పంపిస్తున్నాను ఇందు ....... , జానకీ ....... నీ చెల్లికి ప్రేమతో తినిపించు అని పనిమనిషిని పిలిచారు .
అక్కాచెల్లెళ్ళు ఒకరికొకరు తినిపించుకున్నారు - అక్కయ్య కళ్ళల్లో కన్నీళ్లు , చెల్లి పెదాలపై బలవంతపు చిరునవ్వులు ........
జానకి : చెల్లీ ........ బాధవెయ్యడం లేదా ? .
ఇందు : బావగారు - అత్తయ్యగారి దగ్గర వదిలి వెళుతున్నందుకు చాలా సంతోషం వేస్తోంది . Exams అవ్వగానే కలుద్దాము కదా అని అక్కయ్యను ......
అమ్మానాన్నలు : సంతోషంగా ఉండు తల్లీ అని దీవించారు .
ఇందు తన అక్కయ్యను అత్తయ్యగారి గుండెలపైకి చేర్చి , అత్తయ్యగారి పాదాలకు నమస్కరించి కారులో కూర్చున్నారు - స్వీటీ ....... ఎవరిదగ్గర ఉండాలో తెలియక ఇద్దరివైపూ చూస్తోంది .
ఇందు : స్వీటీ ........ , ఇద్దరమూ లేకపోతే అక్కయ్య మరింత బాధపడుతుంది , నువ్వు తోడుగా ఉండు .
అత్తయ్యగారు : డ్రైవర్ ....... జాగ్రత్తగా తీసుకెళ్లు - బ్రిడ్జ్ పై ఎలా వెళ్ళాలో తెలుసుకదా , మరింత జాగ్రత్తగా వెళ్లు .
కారు కాంపౌండ్ దాటగానే అమ్మా ....... అంటూ అప్పటివరకూ కళ్ళ వెనుక దాచుకున్న కన్నీళ్లను ఒక్కసారిగా కారుస్తూ తల్లి గుండెలపైకి చేరింది .
జానకి బాధను చూసి అత్తయ్యగారు చలించిపోయారు .
చారు అంటీ : అత్తాకోడళ్ల కన్నీళ్లను ఒక్కమాటతో సంతోషంగా మార్చేస్తాను . జానకీ ........ స్ట్రెయిట్ పాయింట్ కు వచ్చేస్తాను - నీకు ఇష్టమైతే ........
అత్తయ్యగారు : చారూ ........
చారు అంటీ : ఇదే సరైన సమయం నాగాంబ , జానకీ ........ నీకు ఇష్టమైతే నీ ప్రాణమైన చెల్లి కూడా ఈ ఇంటి కోడలే అవుతుంది .
ఆశ్చర్యంగా చూస్తోంది జానకి ......
చారు అంటీ : మురళికి ....... ఇం....దు ......
జానకి : అత్తయ్యగారూ ........
అత్తయ్యగారు : జానకీ ....... నీకు ఇష్టమైతేనే ....... నా ఇందుని వేరే ఇంటికి పోనివ్వను - మురళి ఎలాంటివాడో నీకు తెలుసుకదా .......
జానకి : కన్నీళ్లను తుడుచుకుని అత్తయ్యగారూ ........ అంటూ సంతోషంతో కౌగిలించుకుంది .
అత్తయ్యగారు : అయితే నీకు ఇష్టమేనా జానకీ .........
జానకి : దేవతే స్వయంగా వరం ఇస్తాను అంటే అంతకంటే అదృష్టమా అత్తయ్యగారూ అని మైమరిచిపోతోంది .
శివ : అమ్మా ........ చాలా సంతోషమైన మాట అని ఆనందిస్తున్నాడు .
అత్తయ్యగారు : జానకీ ఇక నా మనసులో మాట చెప్పేస్తున్నాను . నాకు నీకంటే ఇందు నే ఎక్కువ ఇష్టం ఎందుకో నీకు తెలుసుకదా ......... , నా వారసురాలు ఇందు నే - ఈ తాళాల గుత్తి తనకే చెందుతుంది .
జానకి : పట్టరాని ఆనందంతో తెలుసు అత్తయ్యగారూ ........ , ఇప్పుడు తెలిసింది చెల్లి వల్లనే నేను ఈ ఇంటి కోడలిని అయ్యానన్నమాట . నా చెల్లిని నాకంటే ప్రాణంలా చూసుకునేవారు ఉన్నారంటే అంతకంటే ఆనందం ఏముంటుంది .
అత్తయ్యగారు : అయితే ఇందూ స్టడీస్ కంప్లీట్ కాగానే పెళ్లి ....... , జానకీ ...... అక్కడ ఊరిలో నా చిన్న కోడలికి కూడా ఒక అందమైన సర్ప్రైజ్ ప్లాన్ చేసాడు నీ శ్రీవారు ........
జానకి : wow , అంటే ఆ ఆనందాలను మనం చూడలేమా అత్తయ్యగారూ .......
అత్తయ్యగారు : నేనూ అదే ఫీల్ అవుతున్నాను .
అంతే శివ కారుని తీసుకొచ్చి జానకీ - అమ్మా ........ అని సంతోషంతో కేకవేశాడు .
చారు అంటీ : ఒసేయ్ ఆగవే నేనుకూడా వస్తాను అని అత్తయ్యగారితోపాటు కూర్చుంది .
జానకి తన శ్రీవారి చేతిని చుట్టేసి ఆ సర్ప్రైజ్ ఏమిటో చెప్పచ్చుకదా ...... ? .
శివ : ఏమిటో మీ అత్తయ్యగారినే అడుగు , నేను చెబితే కొట్టినా కొడుతుంది .
జానకి : అత్తయ్యగారూ .........
అత్తయ్యగారు : నా బంగారం కదూ ....... రెండు గంటలు ఓపికపడితే నువ్వే ఎంజాయ్ చేస్తావు .
చారు అంటీ : నాకు తెలియకుండా తల్లీకొడుకులు ఎప్పుడు ప్లాన్ చేసారబ్బా .......
అత్తయ్యగారు : ఇక్కడకు వచ్చినరోజేనే , నీకు చెబితే లోపల దాచుకోలేవు ఇలానే అని చెప్పలేదు .
చారు అంటీ : నేను చెప్పడం వల్లనే కదే ఇప్పుడు ఇంత సంతోషాలు .......
అత్తయ్యగారు : థాంక్స్ థాంక్స్ ....... ఇదిమాత్రం సర్ప్రైజ్ . శివా ....... నా ముద్దుల చిన్నకోడలి దగ్గరికి తీసుకెళ్లు ........
శివ : అలాగే అమ్మా ........ సీట్ బెల్ట్ పెట్టుకోండి అని పోనిచ్చాడు . ఇందు వాళ్ళను తీసుకెళుతున్న డ్రైవర్ కు కాల్ చేసి ఏమిచెయ్యాలో చెప్పాడు .
జానకి : స్వీటీ ....... నీకు నాకంటే చెల్లినే ప్రాణమని నాకు తెలుసులే , చెల్లిదగ్గరకు వెళుతున్నాము - చెల్లికి ఇష్టమైతే ఈ అక్కాచెల్లెళ్ళం మళ్లీ ఒక్కటిగా ఒకదగ్గర అత్తయ్యగారి నీడలో ఉండబోతున్నాము .
స్వీటీ : మీ మాటలు విన్నానులే అని జానకి బుగ్గపై కొరికి సంతోషంతో రెక్కలు ఆడిస్తోంది .
అత్తయ్యగారు : అమ్మా దుర్గమ్మ తల్లీ జీవితంలో ఇంకేమీ కోరుకోను నా చిన్న కోడలికి నా చిన్న కొడుకు నచ్చేలా చూడు తల్లీ అని కళ్ళుమూసుకుని ప్రార్థిస్తున్నారు .
జానకి ఆనందాలకు అవధులు లేవు , శ్రీవారూ ........ వేగం ఇంతేనా ...... ? .
అత్తయ్యగారు : అవును శివా ఇంతేనా అని నవ్వుకున్నారు .
శివ : మీరు బెదిరిపోతారని ఇలా ........ , ఇక చూసుకోండి అని వేగం పెంచాడు .
ముందు వెళుతున్న కారు వైజాగ్ చేరుకునేంతవరకూ ఇందు కన్నీళ్లు ఆగడం లేదు .
డ్రైవర్ ........ ఇందూ వాళ్ళ ఏరియా చేరుకున్నాడు .
నాన్న : డ్రైవర్ బాబూ ....... కుడివైపు కాదు ఎడమవైపుకు వెళ్ళాలి .
డ్రైవర్ : ఒక స్మైల్ ఇచ్చాడు . నేరుగా తీసుకెళ్లి ఆ ఏరియా లోనే పెద్ద బిల్డింగ్ ముందు ఆపి కిందకుదిగి డోర్స్ ఓపెన్ చేసి , సర్ ....... దిగండి .
ఇందు ........ అక్కయ్య అక్కయ్య అని తలుచుకుంటూనే కన్నీళ్లను కారుస్తోంది.
నాన్నగారు మొదట దిగి సంతోషపు షాక్ తో శ్రీమతిగారూ - తల్లీ ఇందు ......... త్వరగా త్వరగా అని పిలిచారు .
అమ్మ : తల్లీ ........ జానకి సంతోషమే కదా నీకూ కావాల్సింది అని ఓదార్చి కిందకుదిగారు . తన శ్రీవారు మెయిన్ గేట్ ప్రక్కనే ఉన్న బోర్డ్ చూయించారు .
ఇందు : "ఇందు నిలయం " అని చదివి ఆశ్చర్యపోతున్నారు .
డ్రైవర్ : సర్ ........ ఈరోజు నుండీ ఇది మీ ఇల్లు అని తాళాలు అందించారు . వెళ్ళండి లోపలికి ....... కొద్దిసేపట్లో మరొక సర్ప్రైజ్ కూడా ........
నాన్న గారు ........ మెయిన్ గేట్ తాళం తెరవడంతో ముగ్గురూ లోపలికివెళ్లారు .
కాంపౌండ్ లో జానకి సైకిల్ తోపాటు న్యూ స్కూటీ మరియు కార్ ఉండటం చూసి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయారు . ముందుకువెళ్లి మెయిన్ డోర్ తెరిచి లోపలికివెళ్లారు , లోపల విలాసవంతమైన సకల సౌకర్యాలతో చక్కగా ఇంటిని తీర్చిదిద్దిఉండటం చూసి మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు .
ఎదురుగా టీపాయి పై గిఫ్ట్ బాక్స్ ఉండటం చూసి ఇందు సంతోషంతో వెళ్లి అందుకుంది .
" నా చిన్న కోడలికి ప్రియమైన కానుక "
ఇందూ : థాంక్స్ అత్తయ్యగారూ అని పెదాలపై చిరునవ్వులతో ఓపెన్ చేసి చూస్తే ఐఫోన్ ........ , ఇష్టంతో అందుకుని అమ్మా నాన్న గారూ ........ మొబైల్ అంటూ చూయించి మురిసిపోతోంది .
అంతలో బయటనుండి చెల్లీ చెల్లీ .......
ఇందు : అక్కయ్య ....... అంటూ పరుగున బయటకువచ్చిచూసి , ఒక్కసారిగా మళ్లీ కన్నీళ్లు వచ్చేసాయి .
జానకి కళ్ళల్లో కూడా సంతోషమైన కన్నీళ్ళతో చెల్లీ ....... అంటూ కౌగిలిలోకి ఆహ్వానించింది .
ఇందు : అక్కయ్యా ........ అంటూ పరుగునవెళ్లి గుండెలపైకి చేరిపోయి విడిపోనంతలా చుట్టేసింది . స్వీటీ ఇద్దరిచుట్టూ రౌండ్స్ వేస్తోంది .
జానకి : చెల్లీ ....... ఇల్లు నచ్చిందా ? , అత్తయ్యగారు నీకోసం కొన్నారు - సైకిల్లో వెళుతున్నామని తెలిసి నువ్వు కాలేజ్ కు వెళ్ళడానికి స్కూటీ కారునే ఏర్పాటుచేశారు . నువ్వంటే నాకంటే ఎక్కువ ఇష్టం అత్తయ్యగారికి ........ , నీకోసం అత్తయ్యగారే స్వయంగా వచ్చారు .
ఇందు : అత్తయ్యగారు వచ్చారా ...... ? . అత్తయ్య గారూ అత్తయ్యగారు అంటూ కారులోపల చూస్తోంది .
అత్తయ్యగారు : చిన్న కోడలా ఇక్కడ అంటూ మెయిన్ డోర్ దగ్గర అమ్మతోపాటు నవ్వుకుంటున్నారు .
ఇందు : అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి చేతిని అందుకుని బావగారూ రండి , అత్తయ్యగారూ ........ అంటూ పరుగునవెళ్లి పాదాలను స్పృశించింది .
అత్తయ్యగారు : తల్లీ ....... అంటూ కౌగిలిలోకి తీసుకుని , మీ అక్కాచెల్లెళ్ల ప్రేమలలో నేనెక్కడ గుర్తుంటాను - కారుదిగి ఇక్కడికి వచ్చేన్తవరకూ గమనించనేలేదు ........
ఇందు : sorry అత్తయ్యగారూ .........
అత్తయ్యగారు : ప్రయాణం మొత్తం ఏడ్చినట్లున్నావు కళ్ళు మొత్తం ఎర్రబడ్డాయి .
అమ్మ : ఒకరినొకరు విడిచి ఉండలేరు వదినగారూ ....... ఓదార్చడం నావల్ల కాలేదు కన్నీళ్ళతో బంగారం లాంటి పట్టుచీరను పూర్తిగా తడిపేసింది .
అత్తయ్యగారు : నవ్వుకుని , ఇందూ ....... మీ అక్కాచెల్లెళ్లను జీవితాంతం కలిసి ఉండేలా చేయడానికే స్వయంగా నేనే వచ్చాను .
ఇందు కళ్ళు వెలిగిపోతున్నాయి - జానకి ....... తన చెల్లి బుగ్గపై అందమైన నవ్వులతో ముద్దుపెట్టింది .
అత్తయ్యగారు : ఇందూ ....... నాకు నా పెద్ద కోడలి కంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం - నీకు , నీ తల్లిదండ్రులకు ఇష్టమైతే నిన్ను నా చిన్న కోడలిగా నా ఇంటికి తీసుకువెళ్లాలని నా ఆశ కోరిక అని తలదించుకున్నారు .
ఇందు : ఏమాత్రం ఆలోచించకుండా అత్తయ్యగారూ ........ నాకు ఇష్టమే , నేనేంటి ప్రాణమైన అత్తయ్యగారిని సేవించుకుంటూ అక్కయ్యతోపాటు ఉండటం కంటే అదృష్టం మరొకటి ఏమి ఉంటుంది . అత్తయ్యగారూ ........ రేపే కాదు కాదు ఈరోజే ముహూర్తం ఉందేమో చూడండి .
అత్తయ్యగారి ఆనందాలకు అవధులు లేనట్లు ఇందు నుదుటిపై ముద్దుపెట్టి , చిన్న కోడలా ........ నా మురళి అంటే ఇష్టమేనా నీకు - చూశావా వాడిని - నా పెద్ద కొడుకు కంటే సూపర్ గా ఉంటాడు .
ఇందు : ప్చ్ ....... లేదు అత్తయ్యగారు , చూడాల్సిన అవసరం కూడా లేదు . నేను మా అత్తయ్యగారి పాదాల దగ్గర సేవించుకునే అదృష్టం లభించే మార్గం ఏదైనా నాకు ఇష్టమే ......... , పెళ్లిలో ....... తారసపడినప్పుడు చూసినట్లు గుర్తు అంతే .....
అత్తయ్యగారి కళ్ళల్లో ఆనందబాస్పాలు ఆగడం లేదు . నా చిన్నకోడలు బంగారం అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోతున్నారు . మరి స్టడీస్ exams ........
ఇందు : Fuck the స్టడీస్ ........ sorry sorry అత్తయ్యగారూ ......... , నాకు నా అక్కయ్య - అత్తయ్యగారి సేవ కంటే చదువు ముఖ్యం కాదు వెంటనే వెంటనే పంతులుగారిని పిలిపించండి .
అత్తయ్యగారు ........ అమ్మ - జానకితోపాటు నవ్వుకుని , ఆ మాట అన్నావంటే నేనంటే ఎంత ఇష్టమో అర్థమైపోతోందిలే , చిన్న కోడలా ........ మూడు నెలల వరకూ ముహూర్తాలు లేవు అని పంతులు గారు చెప్పారు కదా ......
ఇందు : అత్తయ్యగారూ - అక్కయ్యా ......... అంటూ బుంగమూతిపెట్టుకుంది .
అత్తయ్యగారు : చిన్న కోడలా ....... అంతలోపు exams పూర్తిచేసెయ్యి - నా ముద్దుల కోడలిని పెద్ద కోడలిలానే అంతకంటే అంగరంగవైభవంగా సాంప్రదాయబద్ధంగా తీసుకెళతాము .