Update 05

9 గంటలు అవ్వగానే అక్కాచెల్లెళ్లలో ఒకవైపు సంతోషం మరొకవైపు తియ్యని బాధతో ఒకరినొకరు మరింత గట్టిగా హత్తుకున్నారు .
శివ : ఇందూ ........ ఇందులో నా తప్పేమీ లేదు తెలుసుకదా అన్నట్లు sorry చెప్పివెళ్లి లగేజీ తీసుకెళ్లి కారులో కూర్చున్నాడు .
అక్కాచెల్లెళ్ళు నవ్వుకుని ఒకరిచేతిని మరొకరు వదలకుండా వెళ్లి శివ కారులో వెనుక కూర్చున్నారు నాన్నగారు ముందు కూర్చున్నారు . మరొక కారులో అమ్మాఅత్తయ్యావాళ్ళు కూర్చున్నారు .

అక్కాచెల్లెళ్ళూ ....... పోనివ్వమంటారా ? .
ఇద్దరూ నవ్వుకుని yes అన్నారు .
శివ కారుని స్టార్ట్ చెయ్యగానే నలుగురు ఇందు ఫ్రెండ్స్ స్టాప్ స్టాప్ అంటూ పరుగునవచ్చారు . ఒసేయ్ ఇందూ - అక్కయ్యా ....... వస్తామని చెప్పాముకదా అని వెనుక స్థలం లేకపోయినా ఒకరిపై మరొకరు కూర్చోవడం చూసి నవ్వుకున్నారు .
ఫ్రెండ్స్ : హనీమూన్ వెళ్లే అదృష్టం ఇప్పుడే మాకు లేకపోయినా , మాకిష్టమైన అక్కయ్యను హనీమూన్ కు పంపి ఆనందిస్తాము అని చిలిపిమాటలతో జానకిని ఆటపట్టిస్తూ గిలిగింతలుపెడుతూ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు .

శివ - నాన్నగారు ....... లగేజీతోపాటు లోపలికివెళ్లారు .
ఫ్రెండ్స్ : హమ్మయ్యా ...... అక్కయ్యను వదిలి ఉండబోతున్నావుకదా ఎక్కడ బాధపడతావోనని అనుకున్నాము - అక్కయ్యను సంతోషంగా పంపిద్దాము అని కిందకుదిగారు .
ఇందు : సరే ఫ్రెండ్స్ ........ , అక్కయ్యా ....... హనీమూన్ మొత్తం కేవలం బావగారి గురించి మాత్రమే ఆలోచించండి - జీవితాంతం గుర్తుండిపోయేలా మధురానుభూతులను పొందాలి అని బుగ్గపై ముద్దుపెట్టి ఒకరినొకరు వదలకుండా లోపలికి నడిచారు . అక్కాచెల్లెళ్లను ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యడం లేదు . అందరూ ఒక దగ్గర కూర్చున్నారు .

చారు అంటీ : ఒసేయ్ ........ నాగాంబ నువ్వు ఎందుకు ఇంత ఖుషీగా ఉన్నావో నాకు తెలుసులే , పెద్ద కొడుకు పెద్ద కోడలు హనీమూన్ కు వెళితే నువ్వు చిన్నకోడలితో ఉండవచ్చు అనేకదా ........
నాగాంబ : అంతేకదా ....... , నా చిన్నకోడలు బాగా చదువుకునేలా వంట చేస్తాను - రాత్రిళ్ళు నిద్రపోకుండా టీ కాఫీ అందిస్తాను - నా చేతులతో తినిపిస్తాను ........
చారు అంటీ : చాలమ్మా చాలు ........ నీ కోడలు నీ ఇష్టం ఎంజాయ్ , ఇదే ఊరిలో మేమూ ఉంటున్నాము అని మరిచిపోకపోతే చాలు అని నవ్వుకున్నారు .

బయలుదేరే సమయానికి 30 నిమిషాలముందు అనౌన్స్మెంట్ జరగడంతో అక్కాచెల్లెళ్ళు అనౌన్స్మెంట్ వైపు కోపంతో చూడటం చూసి అందరూ నవ్వుకున్నారు .
శివ : శ్రీమతీ
అక్కాచెల్లెళ్ళు కూడా నవ్వుకున్నారు . అక్కయ్యా ....... హ్యాపీ జర్నీ హనీమూన్ ఫుల్ గా ఎంజాయ్ చెయ్యండి అని ముద్దు ఇచ్చి ముద్దు అందుకుని అత్తయ్యగారిదగ్గరికి పంపించింది .
జానకి : అత్తయ్యగారి - అమ్మ పాదాలకు నమస్కరించి వెళ్ళొస్తాము అనిచెప్పింది .
అత్తయ్యగారు : జాగ్రత్త తల్లీ ........ నీ భర్త అమాయకుడు , నువ్వే అన్నీ చూసుకోవాలి అని ATM అందించారు - జానకీ ....... మొత్తం డబ్బులు ఖాళీ అయిపోవాలి - వీకెండ్ ఉదయం ఇక్కడ ఉండాలి సరేనా ....... అప్డేటెడ్ టికెట్స్ అని అందించారు .
జానకి : సిగ్గుపడుతున్న శివ వైపు చూసి నవ్వుకుంది . అత్తయ్యగారూ ....... ఈరెండురోజుల్లో జ్ఞానం సంపాదించారట ఇక ఏమాత్రం అమాయకుడు కాదు అని గుసగుసలాడుకున్నారు .
అంతలో ఫైనల్ అనౌన్స్మెంట్ జరగడంతో వెళ్ళొస్తాము అనిచెప్పి చెల్లిని కౌగిలించుకుని లోపలికి నడిచారు .
ఇందూ - ఫ్రెండ్స్ : అక్కయ్యా ....... ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నారు all the best అని సంతోషంతో చెప్పారు . ఫ్లైట్ బయలుదేరేంతవరకూ ఉండి అత్తయ్యగారు - చారు అంటీ డ్రైవింగ్ లో ఇంటికి చేరుకున్నారు .

ఫ్రెండ్స్ : ఇందూ ........ ఫస్ట్ పీరియడ్ మాత్రమే మిస్ అవుతాము కాలేజ్ కు వెళదామే ........
ఇందు : ష్ ష్ ష్ ........ మీరు కావాలంటే వెళ్ళండి అత్తయ్యగారికి ఏలోటూ లేకుండా చూసుకుంటానని అక్కయ్యకు మాటిచ్చాను . నేను ఇంట్లోనే చదువుకుంటాను అని నెమ్మదిగా బదులిచ్చింది .
ఫ్రెండ్స్ : అధికాదే ok ok నెమ్మదిగా అధికాదే మెయిన్ టాపిక్స్ టీచ్ చేస్తారని లెక్టరర్స్ చెప్పారుకదా .......
ఇందు : టెక్స్ట్ బుక్స్ ఉన్నాయికదా నేను చదివి అర్థం చేసుకుంటానులేండే , మీకు కాలేజ్ కు వెళ్లాలని ఆశగా ఉంటే మీరు వెళ్ళండి అని తోసేస్తోంది .

అత్తయ్యగారు : ఇందూ ....... ఏంటి నీ ఫ్రెండ్స్ ను అలా తోసేస్తున్నావు .
ఇందు : అదీ అదీ ........ ఆ బుక్స్ కూడా తీసుకోకుండా వచ్చేసారు అత్తయ్యగారూ వెంటనే తీసుకురండి చదువుకుందాము అని పంపిస్తున్నాను , చెప్పండే .......
ఫ్రెండ్స్ : అంతే అంతే అంటీ ........
అత్తయ్యగారు : నా బుజ్జికోడలికి తగ్గ ఫ్రెండ్స్ ........ , నేను అంతా విన్నానులే ...... , ఇందూ ........ మీ అమ్మ చారు అంటీ ఉన్నారుకదా మేము ఎంజాయ్ చేస్తాములే , మీరు కాలేజ్ కు వెళ్ళిరండి - మీరు వచ్చేలోపు బిరియానీ రెడీ చేస్తాము .......
ఫ్రెండ్స్ : wow బిరియానీ అయితే లంచ్ ఇక్కడే అని పెదాలు తడుముకుని ఇందు బుగ్గలపై ముద్దులుపెట్టారు .
ఇందు : మీ మాటే నాకు వేదం అత్తయ్యగారూ ....... , అమ్మా ....... అత్తయ్యగారికి ఏ పనీ చెప్పొద్దు అని గుసగుసలాడి పైకివెళ్లి కాలేజ్ బ్యాగుతోపాటు వచ్చారు . హాల్లో ఎవ్వరూ లేరు వంట గదిలో అమ్మ టీ చేస్తోంది - అమ్మా ........ కాలేజ్ కు అంటూ బుగ్గపై ముద్దుపెట్టి అత్తయ్యగారు ఎక్కడ ఎక్కడ అంటూ కింద గదులన్నీ చూసి నిరాశతో బయటకువచ్చింది .
చారు అంటీ : అత్తయ్యగారితోపాటు కారులో కూర్చున్నారు . ఏంటి ఇందూ ...... మీ అత్తయ్యగారికోసం రూమ్స్ అన్నీ వెతికివచ్చావా కమాన్ కమాన్ ఎక్కండి ...... , మీ అత్తయ్యగారే స్వయంగా కాలేజ్ లో వదులుతుంది .
ఫ్రెండ్స్ : కారులో కాలేజ్ ........ సంతోషంతో ఇందు బుగ్గలపై ముద్దులవర్షం కురిపించి పరుగునవెళ్లి వెనుక కూర్చున్నారు .
ఇందు : ఆనందిస్తూనే వెళ్లి అత్తయ్యగారూ ......... సైకిల్లో వెళ్ళేవాళ్ళము కదా మీకెందుకు ఇబ్బంది .
చారు అంటీ : సైకిల్లో ........ ఇంకేమైనా ఉందా , ఇకనుండీ ఎక్కడికి వెళ్లినా స్కూటీ - కారులోనే ........ ఈ మూడు నెలల్లో మేము డ్రైవింగ్ కూడా నేర్పించేస్తాము కదా ........
అత్తయ్యగారు : నా బుజ్జికోడలిని సైకిల్ తొక్కి కష్టపడనిస్థానా ....... అధిచూసి నేను తట్టుకోగలనా , ఇందూ ........ సెకండ్ పీరియడ్ మిస్ కాకూడదు కదా ఎక్కు ........ , ఒసేయ్ ....... చారూ వెనక్కు వెళ్లి కూర్చోవచ్చు కదా .......
చారు అంటీ : సరే నాగాంబ గారూ ........ అని చిరునవ్వులు చిందిస్తూనే కిందకుదిగి ఇందు కోసం డోర్ తెరిచే ఉంచారు .
ఇందు : అంటీ .........
చారు అంటీ : మీ అత్తయ్యగారు ఈ క్షణం కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు ఇందూ ........ , నా కోడలు కొత్తగా వచ్చినప్పుడు ఇలానే చేసానులే - ఇప్పటికి పగ తీర్చుకుంది రాక్షసి అంటూ వెనుకవెళ్లి కూర్చుంది .
అత్తయ్యగారు : నవ్వుకున్నారు . ఇందూ ........ నా పగను తీర్చుకునేలా చేసినందుకు థాంక్స్ కూర్చో కూర్చో అని సీట్ బెల్ట్ స్వయంగా పెట్టి మురిసిపోతున్నారు . కాలేజ్ కు వెళ్లేంతవరకూ మురిసిపోతూనే ఉండటం చూసి .......
చారు అంటీ : ఇక చాలు లేవే మరిచిపోయాను అనుకున్నాను , గుర్తుపెట్టుకున్నావన్నమాట .......
అత్తయ్యగారు : ఎలా మరిచిపోతానే , నా కోడళ్ల వలన నాకోరికలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోతున్నాయి అని చేతితో బుగ్గపై ముద్దుపెట్టి కాలేజ్ ముందు ఆపారు . ఇందూ .......... లంచ్ బ్రేక్ ఎప్పుడు ? .
ఫ్రెండ్స్ : 1 o clock అంటీ అని హుషారుగా బదులిచ్చారు .
అత్తయ్యగారు : అయితే 12:30 కల్లా ఇక్కడ ఉంటాము .
ఇందు : అత్తయ్యగారూ ........ బస్ లో వచ్చేస్తాము .
అత్తయ్యగారు : నాకు ఇష్టం ఇందూ ....... నా కోడళ్ల కోసం ఏమిచేసినా చాలా ఆనందం కలుగుతోంది , వద్దు అనిచెప్పు రాను .
ఇందు : మీరు హ్యాపీ అయితే నేను - అక్కయ్య మరింత హ్యాపీ అత్తయ్యగారూ ........ , లంచ్ బెల్ కొట్టగానే కారులోకి చేరిపోతాము అని కిందకుదిగి చారు అంటీ జాగ్రత్త అని చెప్పారు .
చారు అంటీ : మీ అత్తయ్యేమీ బుజ్జిపాపాయి కాదులే ఇందూ .........
ఇందు : సంతోషంతో నవ్వుకుని , అత్తయ్యగారికి చెప్పి కాలేజ్ లోపలికివెళ్లారు .

ఫస్ట్ పీరియడ్ లెక్చరర్ బయటకురాగానే గుట్టుచప్పుడుకాకుండా క్లాస్ లోకి ఎంటర్ అయ్యారు .
విండోస్ ప్రక్కన కూర్చున్నవాళ్ళంతా కొత్తగా చూస్తున్నారు .
ఇందు : ఫ్రెండ్స్ ఏంటి అలా చూస్తున్నారు .
క్లాస్మేట్స్ : కారులో అంటూ విండోస్ నుండి మెయిన్ గేట్ వైపు చూయించారు .
ఫ్రెండ్స్ : చూసారా హమ్మయ్యా ....... చూడలేదని ఫీల్ అయ్యాము . ఆ కారు ఎవరిదోకాదు ఇందూది మామూలు కారు కాదు " రేంజ్ రోవర్ " - ఇకనుండీ రోజూ కారులోనే వస్తాము కారులోనే ఇంటికి వెళతాము .
క్లాస్మేట్స్ అందరూ షాక్ లో నోరెళ్ళబెట్టిచూస్తుండిపోయారు .
ఇందు : ష్ ష్ ........
ఫ్రెండ్స్ : నువ్వు ఆగవే , బోడి డొక్కు స్కూటీలలో వస్తూ భలే బిల్డప్ ఇచ్చేవాళ్ళు అని ఆటిట్యూడ్ చూయిస్తూ వెళ్లి విండో ప్రక్కన తమ places లో కూర్చున్నారు . అందరూ ........ సిగ్గులతో తలలు దించుకోవడం చూసి , ఇందూ ఇందూ ....... ఇలాంటి అవకాశం వస్తుందని కలలోకూడా ఊహించలేదు థాంక్స్ థాంక్స్ వే అంటూ ఇరువైపులా హత్తుకునిమరీ ముద్దులుపెట్టి ఎంజాయ్ చేస్తున్నారు .
అంతలో లెక్చరర్ రావడంతో సైలెంట్ అయ్యారు .

ఇందూ కూడా లోలోపలే మురిసిపోతూ థాంక్స్ అత్తయ్యగారూ అని తలుచుకుని థర్డ్ పీరియడ్ మరియు ఫోర్త్ పీరియడ్ ఏకాగ్రతతో వింటోంది .
ఫోర్త్ పీరియడ్ మధ్యలో ఒసేయ్ ఇందూ ........ అంటీవాళ్ళు వచ్చినట్లున్నారు అని ఇందూ చెవిలో గుసగుసలాడింది విండోప్రక్కన కూర్చున్న ఫ్రెండ్ .......
ఇందు : బయటకుచూసి పెదాలపై చిరునవ్వులతో కాలేజ్ బ్యాగులోని ఐఫోన్ లో టైం చూస్తే సరిగ్గా 12:30 .
ఫ్రెండ్ : మీ అత్తయ్యగారికి నువ్వంటే ఇంత ఇష్టమని తెలియదే ........ నువ్వు చాలా అదృష్టవంతురాలివి .
ఇందు : సంతోషించి , ఒసేయ్ నా బ్యాగ్ తీసుకురండి అనిచెప్పి పైకిలేచింది . మేడం రెస్ట్ రూమ్ .......
మేడం : వెళ్లు ఇందూ .........
ఇందు : థాంక్యూ sooooo మచ్ మేడం అని ఫ్రెండ్స్ వైపు కన్నుకొట్టి క్లాస్ బయటివరకూ నెమ్మదిగా వచ్చి పరుగున వెళ్లి అత్తయ్యగారి కౌగిలిలోకి చేరిపోయింది .
విండోస్ నుండి నలుగురు ఫ్రెండ్స్ చూసి ఒకేసారి లేచి మేడం పర్సనల్ ప్రాబ్లమ్ అన్నారు .
మేడం : నలుగురికీ ఒకేసారి ఎలా ....... సరే వెళ్ళండి .
ముసిముసినవ్వులు నవ్వుకుని బ్యాగ్స్ తీసుకున్నారు .
మేడం : బ్యాగ్స్ ఎందుకు ? .
Sorry మేడం అని అక్కడే వదిలేశారు .
మేడం : ok ok ప్యాడ్స్ బ్యాగులో ఉన్నాయా ....... తీసుకెళ్లండి .
ఫ్రెండ్స్ : థాంక్స్ మేడం అంటూ బ్యాగ్స్ అందుకుని ఒకటే పరుగు నేరుగా కారులోకి చేరిపోయారు .
ఇందు : బ్యాగ్స్ తోపాటు ఎలా వచ్చారే ? .
నువ్వుమాత్రమేనా మేమూ అపద్ధము చెప్పగలం అని ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు . అంటీ అంటీ తొందరగా వెళదాము విండోస్ నుండి మేడం చూశారంటే ఇక అంతే .......

అత్తయ్యగారు : నాకోసం బంక్ కొట్టారన్నమాట అని మురిసిపోతూ ఇందు నుదుటిపై ముద్దుపెట్టింది .
చారు అంటీ : ఇందూ - అమ్మాయిలూ ....... ముగ్గురమూ కలిసి బిరియానీ - ఫ్రై - కబాబ్ రెడీ చేసాము .
ఫ్రెండ్స్ : wow ........ అంటీ అంటీ తొందరగా తొందరగా ఇంటికి వెళదాము please please .......
అత్తయ్యగారు : ఇందూ కూర్చో అనిచెప్పి దారిలో ఐస్ క్రీమ్ షాప్ ముందు ఆపి లోపలికి తీసుకెళ్లారు . ఇందూ - అమ్మాయిలూ ........ మీఇష్టం ఏది నచ్చితే ఎన్ని నచ్చితే అన్ని తీసుకోండి , బిరియానీ తిన్న తరువాత చల్లగా తినవచ్చు - చాక్లెట్ లు కూడా ఉన్నాయి తీసుకోండి రాత్రి చదువుకుంటూ తినవచ్చు .
థాంక్స్ అంటీ అంటూ ఇందూతోపాటువెళ్లి చిన్న చిన్నవి తీసుకున్నారు .

చారు అంటీ : నాగాంబ గారూ ....... నీ కోడలు చిన్నవి తీసుకుంది .
అత్తయ్యగారు : మెనూ కార్డ్ అందుకుని వేలల్లో ఉన్నవాటిలో సెలెక్ట్ చెయ్యమన్నారు .
అందరూ కలిసి ఒకటి సెలెక్ట్ చేశారు .
అత్తయ్యగారు : ఒక్కొక్కరూ ఒక్కొక్కటి ఇష్టమైతే రెండు మూడు .........
సంతోషంతో ఒకరినొకరు చూసుకుని ఇందూ బుగ్గలపై ముద్దులుపెట్టి ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి ప్రస్తుతానికి చాలు అత్తయ్యగారూ ........
అత్తయ్యగారు : సరే అయితే నా బుజ్జికోడలు సెలెక్ట్ చేసినది నాకు - మా వదినగారికి ఒక్కొక్కటి - ఇందూ ....... మీ నాన్నగారికి నువ్వే సెలెక్ట్ చెయ్యి .
చారు అంటీ : నాకు కూడా అదే ........
చాక్లెట్ లు కూడా తీసుకుని మొత్తం పే చేసి బయలుదేరారు .
ఇందు : అక్కయ్యా వాళ్ళు బెంగళూరు చేరుకుని ఉంటారు అని కాల్ చేసి మాట్లాడుతూ ఇంటికి చేరుకుని ఫ్రిడ్జ్ లో ఉంచారు .

చారు అంటీ : ఇందూ అమ్మాయిలూ ....... తొందరగా వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తే కుమ్మేద్దాము .
ఫ్రెండ్స్ : అవసరం లేదు అంటీ ........
అందరితోపాటు ఇందు నవ్వుకుని , ఒసేయ్ అవసరం లేదే బిరియానీనే అమ్మ భలేగా చేస్తుంది ఇప్పుడు అంటీవాళ్ళు కూడా కలిసి వండారు ఒక్క క్షణం కూడా ఆగలేము అంటున్న వాళ్ళను పైన రూంలోకి లాక్కునివెళ్లింది .

ఫ్రెష్ అయ్యి పరుగునవచ్చి డైనింగ్ టేబుల్ లో కూర్చున్నారు . అమ్మతోపాటు ఇందు అందరికీ వడ్డించి అత్తయ్యగారి కోరిక మేరకు వడ్డించుకుని కూర్చుని కలిసి తిన్నారు .
ఇందు : అత్తయ్యగారూ అంటీ ....... సూపర్ .
ఫ్రెండ్స్ : సూపర్ ఏమిటే sooooooo టేస్టీ .......
అత్తయ్యగారు : మొత్తం చేసింది మీ అమ్మనే ఇందూ ....... వంట గదిలోకి రానివ్వలేదనుకో , పైపైన హెల్ప్ చేసాము అంతే .......
అమ్మ : ఇందూ ...... ముగ్గురమూ కలిసే చేసాము అని సంతోషంగా మాట్లాడుతూ తిన్నారు .
సూపర్ బిరియానీ అంటూ సోఫాలో కూర్చుని ఐస్ క్రీమ్స్ కూడా లాగించేశారు . కాలేజ్ టైం అవ్వడంతో అత్తయ్యగారు తీసుకెళ్లి మళ్లీ సాయంత్రం తీసుకొచ్చారు . ఆ పాటికే స్నాక్స్ రెడీగా ఉన్నాయి .
ఫ్రెండ్స్ : ఒసేయ్ ఇందూ ఇలా అయితే ఇక ఇంటికి వెల్లనే వెళ్ళము .
ఇందు నవ్వుకుని ఫ్రెండ్స్ ఇంటికి కాల్ చేసి అంటీ ....... exams అయ్యేంతవరకూ వీళ్ళు ఇక్కడే ఉండటానికి అనుమతి ఇవ్వండి గ్రూప్ స్టడీస్ చెయ్యాలి .
అంటీవాళ్ళు : చాలా సంతోషం తల్లీ , మాకు కావాల్సినది కూడా అదే , కనీసం నీతోపాటు ఉంటే పాస్ అయినా అవుతారు .
మొబైల్ స్పీకర్లో ఉండటంతో అందరూ నవ్వుకున్నారు .
ఫ్రెండ్స్ : థాంక్స్ వే ......... exams అయ్యేంతవరకూ ఇక్కడే వెళ్లి లగేజీ తెచ్చేసుకుంటాము .
ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తిని చదువులో మునిగిపోయారు .
అత్తయ్యగారు ఒకరోజు ఇక్కడ మరొకరోజు చారు అంటీ ఇంటిలో ఉంటూ వచ్చారు వారం రోజులపాటు .

హనీమూన్ కు వెళ్లిన కపుల్ ........ ఐదురోజులపాటు బెంగళూరు - మైసూర్ - కూర్గ్ - ఊటీ - కొడైకెనాల్ చుట్టేసి శృంగార సాగరంలో విహరించి శనివారం తెల్లవారుఘామునే వైజాగ్ లో ల్యాండ్ అయ్యారు .
అప్పటికే ఇందు తన ఫ్రెండ్స్ తోపాటు ఎయిర్పోర్ట్ చేరుకుని ఉండటం చూసి , చెల్లీ ........ అంటూ శివ చేతిని వదిలేసి పరుగునవచ్చి కౌగిలించుకుంది .
సంతోషపు పలకరింతలు ముద్దుల తరువాత , అక్కయ్యా అక్కయ్యా ....... మీ ముఖంలో వెలుగు వచ్చింది అంటే హనీమూన్ బాగా ఎంజాయ్ చేసారన్నమాట అని గిలిగింతలతో ఆటపట్టించారు .
జానకి : పోండి చెల్లెళ్ళూ ....... సిగ్గేస్తోంది అని ఇందు గుండెల్లో తలదాచుకుంది .
శివ : అమ్మ మాటప్రకారం సూర్యోదయానికి ముందే అక్కాచెల్లెళ్లను ఏకం చేసాను . ఇందూ ...... ఎలా ఉన్నారు .
ఇందు : అత్తయ్యగారు ప్రేమతో చూసుకుంటున్నారు . బావగారూ ......ప్రయాణం బాగా జరిగిందా ? .
శివ : మీ అక్కయ్య వెచ్చని కౌగిలిలో ప్రయాణం కూడా స్వర్గమే ........
ఫ్రెండ్స్ : wow ....... అక్కయ్యా అక్కయ్యా ....... , అక్కయ్యా ....... ఈ ఐదురోజులూ ఇంటికి వెళ్లకుండా ఇంట్లోనే కలిసి చదువుకుంటున్నాము .
జానకి : సంతోషం చెల్లెళ్ళూ , చెల్లీ ....... అత్తయ్యగారు ఎలా ఉన్నారు ? .
ఇందు : ఈ ఐదు రోజులూ ........ నవ్వుతూనే ఉన్నారంటే నమ్మండి - రండి మీరే చూద్దురుగానీ ......
శివ : థాంక్స్ ఇందూ ........

డ్రైవర్ తో పొలాల గురించి మాట్లాడుతూ ఇంటికి చేరుకున్నారు . బయటే ఎదురుచూస్తున్న అత్తయ్యగారి ఆశీర్వాదం తీసుకుని లోపలికివచ్చారు . ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసిన తరువాత అమ్మా ....... ఒకసారి పంటను చూసొస్తాను - జానకీ ........ రాత్రివరకూ చెల్లితో ఎంజాయ్ చెయ్యి అనిచెప్పి శివ లంకకు బయలుదేరాడు .
ఆ రెండు రోజులూ ........ ఫ్రెండ్స్ ను చదువుకోమని పైన గదిలో వదిలేసి అక్కయ్యతోనే సంతోషంగా గడిపింది ఇందు - అత్తయ్యను సేవించుకుంటూ అత్తయ్యగారి ప్రేమలో తడిచారు . సోమవారం ఉదయం ఎయిర్పోర్ట్ లో వదిలి ఇంటికి చేరుకున్నారు .
ఇక exams కు మిగిలిన మూడు రోజులూ ప్రిపరేషన్ హాలిడేస్ వలన ఇంట్లోనే చదువుకున్నారు .
బుజ్జికోడలు స్ట్రెస్ కు లోనవ్వకూడదని రోజూ సాయంత్రం గుళ్లకు , బీచ్ కు , పార్క్స్ కు తీసుకెళ్లారు అత్తయ్యగారు .
ఇందు : అత్తయ్యగారూ ........ చాలా రిలీఫ్ కలుగుతోంది , మరింత ఏకాగ్రతతో చదువుకోగలుగుతున్నాము .
చారు అంటీ : కోడళ్ల కోసం సైకాలజీ ప్రొఫెసర్ అయిపోయారు నాగాంబ గారు అని నవ్వుకున్నారు .

ఫోర్త్ డే exams స్టార్ట్ అయ్యాయి . అత్తయ్యగారే స్వయంగా exam హాల్ కు తీసుకెళ్లారు . All the best ఇందూ - అమ్మాయిలూ ....... టాప్ రాంక్స్ రావాలి .
ఫ్రెండ్స్ : అది కేవలం మీ కాబోవు చిన్న కోడలికి చెప్పండి అంటీ ....... , మా ఇంట్లో మేము పాస్ అయితే చాలు అనుకుంటున్నారు - ఇందు వలన ఇందూతో ఈ 10 రోజులు చదువుకోవడం వలన ఈసారిమాత్రం ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ వస్తుంది .
అత్తయ్యగారు : చాలా సంతోషం ఇందూ ........ , నీ ఫ్రెండ్స్ ఇళ్లల్లో కూడా సంతోషాలను నింపబోతున్నావు అని నుదుటిపై ముద్దుపెట్టారు .
ఇందు : మా అత్తయ్యగారి ముద్దుతో exam మరింత ఉత్సాహంతో రాస్తాను ఆశీర్వదించండి అని పాదాలను స్పృశించి అత్తయ్యగారూ ....... మీరు ఇంటికివెళ్లండి exam రాసి మేము బస్ కానీ ఆటోలోకానీ వస్తాము అనిచెప్పి లోపలికివెళ్లారు .

క్వశ్చన్ పేపర్ అందుకుని చూడగానే పెదాలపై చిరునవ్వు . సమయం లోపు పూర్తిచేసి అంతే సంతోషంతో వాళ్ళ వాళ్ళ రూమ్స్ నుండి వచ్చిన ఫ్రెండ్స్ తోపాటు బయటకువచ్చిచూస్తే ఎదురుగా అత్తయ్యగారు .
ఇందు : అత్తయ్యగారూ ........ అంటూ కౌగిలిలోకి చేరిపోయింది .
అత్తయ్యగారు : ఇందూ ........ మీ అందరి సంతోషం చూస్తుంటే exam బాగా రాసారన్నమాట .
ఇందు : అత్తయ్యగారూ ....... 12:30 కు exam అయిపోతుందని మీకు ముందే తెలుసన్నమాట .........
చారు అంటీ : అసలు ఇంటికి వెలితేనే కదా ఇందూ ....... మీరు లోపలికి వెళ్లిన క్షణం నుండీ ఇక్కడే ఉన్నాము .
ఇందు : కళ్ళల్లో ఆనందబాస్పాలతో థాంక్యూ sooooooo మచ్ అత్తయ్యగారూ ......... , మేమంటే ఇంత ఇష్టమా అని గట్టిగా కౌగిలించుకుంది .
చారు అంటీ : ఇద్దరూ ....... ఇద్దరిలో నువ్వంటేనే ఎక్కువ ఇష్టం ఇందూ ....... , ఎంతైనా ప్రాణమైన చిన్నకొడుకుకు కాబోవు దేవకన్యవు కదా ....... , మురళి అంటే కూడా ఇంత ప్రాణం మీ అత్తయ్యగారికి ........
సంతోషంతో ఇంటికి చేరుకున్నారు .

ఒకరోజు గ్యాప్ తరువాత సెకండ్ exam , ఆ రోజు తెల్లవారుఘామున ఐదురోజుల గోవా హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేసి వైజాగ్ చేరుకున్నారు కపుల్స్ ......... - టిఫిన్ చేసిన తరువాత శివ ...... పొలం పనుల ప్రోగ్రెస్ చెక్ చెయ్యడానికి తన గ్రామానికి , ఇందూ వాళ్ళు exam సెంటర్ కు చేరుకున్నారు తోడుగా అత్తయ్యగారితోపాటు అక్కయ్య కూడా రావడంతో మరింత ఉత్సాహంతో exam సమయం కంటే ముందుగానే పూర్తిచేసివచ్చి అక్కయ్య కౌగిలిలోకి చేరిపోయింది ఇందు - ఫ్రెండ్స్ ........ exam సమయానికి పూర్తిచేసి బయటకువచ్చి అనుకున్నామే ఇందూ ....... ఎప్పుడో పూర్తిచేసి అక్కయ్య - అంటీ దగ్గరికి చేరిపోయి ఉంటారని .........
ఇంటికి చేరుకుని కలిసి లంచ్ చేసి అక్కయ్య దగ్గరే చిరునవ్వులు చిందిస్తోంది , సాయంత్రం వరకూ బుక్ ముట్టుకుంటే ఒట్టు ........
జానకి : చెల్లీ ........ నెక్స్ట్ exam మాథ్స్ కదూ ........
ఇందు : అవును అక్కయ్యా .........
జానకి : అయితే ok ప్రాక్టీస్ అవసరమే లేకుండా రాసేస్తుంది నా చెల్లి అని బుగ్గపై ముద్దుపెట్టింది . అత్తయ్యగారు కంగారుపడటం చూసి అత్తయ్యగారూ ........ మాథ్స్ చెల్లికి ఫేవరేట్ సబ్జెక్ట్ అర్ధరాత్రి లేపి exam పెట్టినా 100% మార్క్స్ వచ్చేస్తాయి .
అత్తయ్యగారు : అలాగాయితే ok ఎంజాయ్ ........
శివ రావడంతో నెక్స్ట్ డే సండే ఏకంగా మూవీకి వెళ్లారు . ఫ్రెండ్స్ ను మాత్రం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చెయ్యమని లిస్ట్ ఇచ్చింది ఇందు .

సోమవారం ఉదయం టిఫిన్ చేసి అక్కయ్య - బావగారిని ఫైనల్ హనీమూన్ ట్రిప్ షిమ్లా - ఢిల్లీ కు వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ లో వదిలి మంగళవారం నుండి రోజువిడిచి రోజు మాథ్స్ 2A , మాథ్స్ 2B సులభంగా రాసేసి ఆరోజు మధ్యాహ్నం నుండీ ఫిజిక్స్ ప్రిపేర్ అవుతూనే అక్కయ్య రాకకోసం ఎదురుచూస్తోంది . శుక్రవారం ఒక్కరోజు ఒక యుగంలా గడిచింది .
శనివారం exam కూడా ఉందికాబట్టి తెల్లవారుఘామునే రెడీ అయ్యి ఫ్యామిలీ మొత్తం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు .
ఉదయం 8 గంటలకు ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్ ఢిల్లీలో ఆలస్యంగా బయలుదేరడం వలన 9 గంటలు అయినా రీచ్ అవ్వలేదు .
అమ్మ : తల్లీ ....... exam కు గంట మాత్రమే సమయం ఉంది .
ఇందు : అత్తయ్యగారి దగ్గరకువెళ్లి అత్తయ్యగారూ ........ అక్కయ్యను చూడకుండా exam కు వెళ్లడం నాకు ఇష్టం లేదు - వెళ్లినా exam సరిగ్గా రాయలేను . మీరు చెప్పండి మీరు వెల్లమంటే వెళతాను మీరు - అక్కయ్య కన్నా నాకు exam ముఖ్యం కాదు అని తలదించుకుంది .
అత్తయ్యగారికి ఏమిచెప్పాలో అర్థం కావడం లేదు ....... అంతలో 9:30 కు ఫ్లైట్ ల్యాండ్ అవుతుందని అనౌన్స్మెంట్ జరిగింది . అమ్మాయిలూ ....... మీరు కారులో వెళ్లిపోండి చారూ ....... తీసుకెళ్లు - జానకి రాగానే మేము క్యాబ్ లో వచ్చేస్తాము - అన్నయ్యగారూ ........ క్యాబ్స్ రెడీగా ఉండేలా సెట్ చెయ్యండి .
అలాగే చెల్లెమ్మా ....... అని బయటకువెళ్లారు .
ఇందు : థాంక్స్ అత్తయ్యగారూ అని కౌగిలించుకుంది . ఒసేయ్ ....... అత్తయ్యగారు చెప్పారుకదా మీరు వెళ్ళండి .
ఫ్రెండ్స్ : ఇందూ ....... ఒక్క నిమిషం ఆలస్యమైనా సెంటర్ లోపలికి పంపరు .......
ఇందు : పంపితే exam రాస్తాను లేకపోతే మా అత్తయ్యగారు - అక్కయ్యతో హ్యాపీగా ఇంటికివెళతాను - అత్తయ్యగారూ ...... తప్పుగా మాట్లాడానా ? .
అత్తయ్యగారు : నన్ను అనుమతి అడిగి శిఖరానికి చేర్చావు . నువ్వు ఎలా అంటే అలా బుజ్జికోడలా అటూ మురిసిపోతూ నుదుటిపై ముద్దుపెట్టారు - అమ్మా దుర్గమ్మా ....... సమయానికి ఫ్లైట్ ల్యాండ్ అయ్యేలా చూడు అని ప్రార్థించారు .

క్షణక్షణానికీ ఉత్కంఠ ........ సరిగ్గా 9:30 కు ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం - అత్తయ్యగారు ....... బావగారికి కాల్ చేసి విషయం చెప్పగానే రెండు నిమిషాల్లో బయటకువచ్చి , అమ్మా ....... మీరు వెళ్ళండి నేను లగేజీ నెమ్మదిగా తీసుకొస్తాను అనిచెప్పారు .
అక్కయ్యా - చెల్లీ ....... అంటూ కౌగిలించుకుని sorry చెల్లీ ....... వాతావరణం అనుకూలించకపోవడంతో ఫ్లైట్ ఆలస్యం అయ్యింది .
అత్తయ్యగారు : కోడళ్ళూ ....... క్యాబ్ లో మాట్లాడుకుంటూ వెళదాము ఉన్నది 25 నిమిషాలే అని రెడీగా ఉన్న క్యాబ్ లో ముగ్గురూ ఎక్కి డ్రైవర్ ....... 10 గంటలకు exam ఎంత వేగంగా వెళితే అంత అమౌంట్ ఇస్తానని చెప్పారు .
డ్రైవర్ : గేర్ మార్చి వేగంగా పోనిస్తూనే , సమయం చూసుకుని డబ్బుకోసం కాదు మేడం నాకూ పదవ తరగతి అమ్మాయి ఉంది ఇంటర్ exams అవ్వగానే స్టార్ట్ అవుతాయి , ఆ బాధ ఏమిటో నాకు తెలుసు అని ట్రాఫిక్ లేని గల్లీలలో తీసుకెళ్లి 5 నిమిషాలు ముందుగానే చేర్చాడు ( సగం దారిలో చారు అంటీ ఎయిర్పోర్ట్ కు రావడం చూసి పలకరించడంతో వెనుకే ఫాలో అయ్యింది ) .
అక్కయ్య - అత్తయ్యగారు ....... all the best ముద్దులుపెట్టి పంపించారు .
ఇందు : లవ్ యు అక్కయ్యా - అత్తయ్యగారు ....... అని ఫ్రెండ్స్ రూమ్స్ గుండా వెళుతూ hi చెప్పి రూమ్ కు చేరుకుని exam ఫినిష్ చేశారు .
ఫ్రెండ్స్ : ఇందూ ........ నిన్ను చూస్తేనేగానీ మా టెన్షన్ తగ్గలేదు తెలుసా అని చిరునవ్వులు చిందిస్తూ అక్కయ్యను చేరుకుని ఇంటికి చేరుకున్నారు .

అక్కయ్య - అత్తయ్యగారి ప్రేమలలో తడుస్తూ నెక్స్ట్ tuesday చివరి exam కూడా కంప్లీట్ చేసి ఇంటికి చేరుకున్నారు.
ఇందు ....... అక్కయ్య - బావగారి చేతిని పట్టుకుని సోఫాలో కూర్చున్న అత్తయ్యగారు - చారు అంటీ దగ్గరికివెళ్లి ఇద్దరినీ సోఫాలో కూర్చోబెట్టి మోకాళ్లపై కూర్చుంది . అత్తయ్యగారూ ........ మీరు కోరినట్లుగానే exams బాగా రాశాను - మీరు కోరుకున్న ర్యాంక్ కూడా వచ్చేస్తుంది నాదీ ప్రామిస్ , మరి మరి మరి ........ అంటూ సిగ్గుపడుతోంది .
చారు అంటీ : మరి మరి ఏంటి ఇందూ ....... , అయినా మీ ప్రియమైన అత్తయ్యగారితో నువ్వు మొహమాటం పడటం ఏమీ బాగోలేదు . పట్టు చీరలు కావాలా - నగలు కావాలా ........ ఏమైనా ఆడిగేయ్ .......
ఇందు : లేదు లేదు అంటీ అవేమీ వద్దు ఇప్పటికే అత్తయ్యగారి గిఫ్ట్స్ బీరువాలో చాలా ఉన్నాయి . మరి మరి ........
అత్తయ్యగారు : అడుగు చిన్నకొడలా ........ నీకోసం ఏమైనా చేస్తాను .
ఇందు : అత్తయ్యగారూ మరీ మరీ ......... పెళ్లిచూపులు ఎప్పుడు అని సిగ్గుపడుతూ వెళ్లి అక్కయ్య కౌగిలిలో దాచుకుంది .

చారు అంటీ : అవునే నాగాంబ నీ కోడళ్ల ప్రేమలో మునిగిపోయి అసలు విషయమే మరిచిపోయాము .
అత్తయ్యగారు : కదా ...... , sorry sorry బుజ్జికోడలా ....... ఇప్పుడే నా చిన్న కొడుకుకి కాల్ చేస్తాను - వెంటనే రమ్మని చెప్పి ఆ తరువాతిరోజే పెళ్లిచూపులు జరిపిస్తాము .
శివ : అమ్మా ........ చేసాను మాట్లాడండి అని మొబైల్ అందించి సంతోషంతో జానకి కురులపై ముద్దుపెట్టాడు .
అత్తయ్యగారు అందుకుని నా చిన్నకోడలు ...... నా చిన్న కొడుకు వాయిస్ వినాలికదా అని స్పీకర్ on చేశారు .
మురళి : అన్నయ్యా ....... హనీమూన్ ఎలా జరిగింది వదిన హ్యాపీ కదా అని అడిగాడు .
అత్తయ్యగారు : నాన్నా ....... నేను .
మురళి : mom ....... ఎలా ఉన్నావు . రోజూ కాల్ చేసేదానివి పెళ్ళైన రోజు నుండీ ఒక్కసారికూడా చెయ్యనేలేదు .
చారు అంటీ : ప్రక్కనే ఉన్న మాతోనే సరిగ్గా మాట్లాడటం లేదు మురళీ ...... , కోడళ్ల మాయలో మీ మమ్మీ తనను తానే మరిచిపోయింది .
మురళి : కోడళ్లు ? ........ వదిన ఒక్కరే కదా .......
అత్తయ్యగారు : నాన్నా ........ నీకోసం దివి నుండి దిగివచ్చిన దేవతను సెలెక్ట్ చేసాను , రేపే పెళ్లిచూపులు నెక్స్ట్ ఫ్లైట్ కు వైజాగ్ వచ్చెయ్యి ........
అంతే ఫోన్ కట్ చేసేసాడు .

అత్తయ్యగారు - శివ - చారు అంటీ ........ ఒకరినొకరు కంగారుపడుతూ చూసుకున్నారు . చిన్నప్పటి నుండీ ఇంతే మురళికి ఇష్టం లేనిది చెబితే బాధపడుతూ ఇంటి నుండి పొలంలోకి వెళ్లిపోయేవాడు - ఇంటర్ తరువాత నుండీ బయట హాస్టల్ లో ఉండటం వలన ఇలానే కాల్ కట్ చేసేసేవాడు .
శివ : అక్కాచెల్లెళ్ళు ఫీల్ అయ్యేంతలో కవర్ చెయ్యాలని , జానకీ ....... తమ్ముడు ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నట్లున్నాడు డిస్టర్బ్ చేస్తే ఇలానే కట్ చేసేస్తాడు అంతే , అదీ కాక 3 - 4 years పెళ్లి టాపిక్ తేవద్దని అమ్మకు ఎప్పుడో చెప్పేసాడు .......
ఇందు : 3 సంవత్సరాలా ....... అని ఏకంగా కన్నీళ్ళతో అక్కయ్య - అత్తయ్యగారి చేతులను గట్టిగా పట్టేసుకుంది .
అత్తయ్యగారు : ఇందూ ........ అంతవరకూ నేనూ ఆగలేను అని మీకు తెలుసుకదా ........
శివ : అమ్మ తరువాత కాల్ చేసి రప్పిస్తుంది కదా , జానకీ ....... కన్నీళ్లను తుడుచు - బాగా ఆకలేస్తోంది తిందాము .
ఇందు : కన్నీళ్లను తుడుచుకుని అమ్మా ........ బావగారు ఆడిగేంతవరకూ వడ్డించవా ? అని అక్కయ్యతోపాటువెళ్లి డైనింగ్ టేబుల్ పై వడ్డించారు .

అత్తయ్యగారు : హమ్మయ్యా అనుకుని , చారు అంటీతోపాటు బయటకువెళ్లి మురళికి మళ్లీ కాల్ చేసి అతిలోకసుందరి నాన్నా ........ నా చిన్నకోడలిగా రావడానికి అన్నీ అర్హతలూ ఉన్నాయి - పెళ్లి చేసుకుంటే నీ అంత అదృష్టవంతుడు లేడు - నువ్వంటే చాలా ఇష్టం కూడా ........
మురళి : అమ్మా ........ పెళ్లి విషయం అయితే ఇప్పుడే కట్ చేసేస్తాను . చెప్పానుకదా ....... own కంపెనీ స్టార్ట్ చేసి అందనంత ఎత్తుకు చేరేంతవరకూ పెళ్లి చేసుకోను అని , కనీసం 5 - 6 సంవత్సరాలైనా పడుతుంది - please please ఎక్కువ బలవంతం చెయ్యకు మమ్మీ ....... నీపై గల ప్రేమకు ఒప్పేసుకున్నా ఒప్పేసుకుంటాను .
అత్తయ్యగారు : ఏంటీ ....... 5 - 6 ఏళ్ళు , ఏమాత్రం కుదరదు నేను నా చిన్నకోడలిగా తనను ఫిక్స్ అయిపోయాను - వీలు చూసుకుని వచ్చి పిల్లను చూసుకో , నువ్వే వెంటనే పెళ్లి చేసెయ్యి మమ్మీ అని బ్రతిమాలతావు .
మురళి : అది ఎప్పటికీ జరుగదు మమ్మీ ........ నాకు చాలా గోల్స్ ఉన్నాయి .
అత్తయ్యగారు : పెళ్ళైన తరువాత తీరికగా తీర్చుకో ఎవరు కాదన్నారు నాన్నా ....... , నీకు నీ భార్య కూడా సహాయం చేస్తుంది - బాగా చదువుకుంది కాలేజ్ లో టాపర్ కూడా .........
మురళి : please please మమ్మీ ........
అత్తయ్యగారు : please లేదు ఏమీ లేదు , వీలుచూసుకుని వెంటనే వచ్చేయ్యాలి నీకోసం ఎదురుచూస్తుంటాను అని కట్ చేశారు .
చారు అంటీ : ఆర్డర్ వేసి మంచిపనిచేశావు , లేకపోతే ఇంకా 5 - 6 ఇయర్స్ ఏంటి ఆపాటికి పెళ్లి వయసు అయిపోతుంది , పిల్లలు అలానే అంటారు బలవంతం చేసి అయినా మంచిదేదో మనమే చెయ్యాలి - గారాభం చేసి తప్పుచేశావు .
అత్తయ్యగారు : ఈ విషయంలో నా మాటనే వినాలి , కాళ్ళూ చేతులు కట్టేసైనా నా కోడలి మెడలో తాళి కట్టిస్తాను అని నవ్వుకుంటూ లోపలికివచ్చి కోడళ్ళూ ....... వీలుచూసుకుని వస్తున్నాడు - మేము రేపు ఉదయం ఊరికివెళ్లి .......
అంతే ఇందూ ముఖంలో మార్పు - అక్కయ్యను గట్టిగా పట్టేసుకుంది .
అత్తయ్యగారు : పూర్తిగా విను బుజ్జికోడలా ....... , ఊరికివెళ్లి మురళితోపాటు సాంప్రదాయబద్ధంగా పెళ్ళిచూపులకు వస్తాముకదా ........
ఇందూ ముఖం సిగ్గుతో వెలిగిపోయింది .
శివ : చెప్పానుకదా అమ్మ ఒప్పిస్తుంది అని , ఇక ఇప్పుడైనా అందరూ కలిసి సంతోషంగా భోజనం చేద్దాము .
తరువాతి రోజు ఉదయం చిరు ఉద్వేగాల మధ్యనే ఇందూని వదిలి లంకకు చేరుకున్నారు .
Next page: Update 06
Previous page: Update 04