Update 08

ఇందూ ఇందూ ........ అంటూ ఇరుగుపొరుగు అంటీ వాళ్ళు - పిన్నమ్మలు - ఫ్రెండ్స్ అమ్మలు సంతోషంతో లోపలికివచ్చారు .
అమ్మ : రండి అక్కయ్యలూ - చెల్లెళ్ళూ ....... పైన ఉంది వెళ్ళండి , జానకికి జరిపించినట్లుగానే ఇందూ శుభకార్యాలన్నింటినీ మీరే జరిపించారు .
బంధువులు : సంతోషంగా చెల్లీ ........ , అప్పుడు గుడిసె సరిపోక వెంటనే వెళ్లిపోయాము - ఇప్పుడు విశాలమైన బిల్డింగ్ పెళ్ళయ్యేంతవరకూ ఇక్కడే ఉంటాము .
అమ్మ : చాలా సంతోషం వెళ్ళండి వెళ్లి మీ జానకీ మీ ఇందూని ఎలా రెడీ చేసిందో చూడండి .
బంధువులు : అవునా అంటూ పైకి పరుగుపెట్టారు . తల్లీ ఇందూ ఇందూ ....... అంటూ లోపలికివచ్చి అమ్మో ....... మా ఇందు ఇప్పుడే పెళ్లికూతురయ్యింది అని ఎగబడుతున్నారు .

ఇందు : పిన్నులూ ....... అంటూ లేవబోతే , ఒసేయ్ చీర మడతలు పడతాయి కూర్చో అని ఆపారు - ఒసేయ్ అమ్మలూ ....... ఏంటి మా ఫ్రెండ్ ను నలిపేస్తారా , ఇక్కడి నుండే చూడండి అని అడుగుల దూరంలోనే ఆపేశారు .
బంధువులు : ఇందూ ఇందూ ........
ఇందు : నవ్వుకుని , అక్కయ్య సెక్యూరిటీగా ఉంచి వెళ్ళింది పిన్నులూ ........ , ఫ్రెండ్స్ ఒకే ఒక్కసారి వదలండి కౌగిలించుకుంటాను .
ఫ్రెండ్స్ : కుదరనే కుదరదు , కావాలంటే ఇక్కడ నుండే కౌగికించుకుని ఆప్యాయంగా ఫ్లైయింగ్ ముద్దులుపెట్టుకోవచ్చు ........
బంధువులు : మీ ఫ్రెండ్ ను తాకము ప్రక్కన కూర్చుంటాము అంతే ........
ఫ్రెండ్స్ : అలా అయితే ok , చేతులు పడ్డాయో ........
బంధువులు : ఇందూ ....... అంటే మనకంటే ఇష్టమా వీళ్లకు అని తోసేసి వెళ్లి చుట్టూ కూర్చున్నారు . దేవకన్యలా ఉన్నావు తల్లీ రెడీ చేసినది ఎవరు దేవకన్యే కదా ........ మా దిష్టి నే తగిలేలా ఉంది కాటుక పెట్టారా లేదా ? అని చేతులతో ధిస్థితీసి ఆనందిస్తున్నారు .
ఫ్రెండ్స్ : అక్కయ్య ఎప్పుడో పెట్టారు . ఇంత ఆలస్యంగా వచ్చి బిల్డప్ ఇస్తున్నారు - ఇందూని రెడీ చెయ్యాలి అన్న బాధ్యత ఉండక్కర్లే ........ ఇలా అయితే మా పెళ్ళిచూపులలో మేమే రెడీ అవ్వాల్సి వస్తుంది .
బంధువులు : sorry ఇందూ ....... పిల్లలను కాలేజీకు రెడీ చేసి పంపేసరికి ఈ సమయం అయ్యింది .
ఇందు : తెలుసు అంటీ ........ , మీ బదులు మీ కోతులు నా ప్రక్కనే ఉన్నారుకదా చాలు .........
ఫ్రెండ్స్ : ఒసేయ్ నిన్నూ ........ పెళ్లిచూపులు కానివ్వు , నీ అందాన్నంతా కొరుక్కుని తినేస్తాము .
ఇందు : పిన్నమ్మలూ - అంటీ ........ అంటూ వాళ్ళ కౌగిలిలో దాక్కుంది .
బంధువులు : సంతోషించి , జానకి పెళ్లిలానే అంగరంగవైభవంగా జరగాలి మేము చూసి తరించాలి అని నుదుటిపై ముద్దులుపెట్టబోతే ఆపేశారు ఫ్రెండ్స్ .
ఫ్రెండ్స్ : ఒసేయ్ అమ్మలూ ........ ప్రక్కనే ఉన్న మేమే ఇంకా ముద్దులుపెట్టలేదు - టింగ్ రంగా అంటూ ఇప్పుడు వచ్చి అప్పుడే ....... అమ్మా నోవే , పెళ్లిచూపులు విజయవంతం అయిన తరువాత ముందు మేము ఆ తరువాతనే మీరు .
బంధువులు : మిమ్మల్నీ అంటూ ప్రేమతో మొట్టికాయలు వేసి నవ్వుకుంటున్నారు .

అంతలో నా బుజ్జికోడలా ఇందూ వచ్చేసాము అని పిలుపు వినిపించడంతో , అత్తయ్యగారూ ........ అంటూ లేచి పరుగుతీసింది .
ఫ్రెండ్స్ : చేతులు అడ్డుపెట్టి కూల్ కూల్ వే , అంటీ పిలిస్తే నిద్రలోనూ వెళ్లిపోయేలా ఉన్నావు . సాంప్రదాయం ప్రకారం అమ్మ వచ్చి పిలుచుకుని వెళుతుంది కాసేపు ఆగవే మా బంగారం కదూ మా బుజ్జికదూ ........
ఇందు : ప్చ్ ........ అక్కయ్య రాదా ? .
బంధువులు : మీ అక్కయ్య కొద్దిసేపు పెళ్ళికొడుకు తరుపున కదా ........ , మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు మేము వెళ్లి పెళ్ళికొడుకుని చూస్తాము .
ఫ్రెండ్స్ : మేము కూడా అంటూ ఇందూని సోఫాలో కూర్చోబెట్టి బాల్కనీ దగ్గరకు వెళ్లివచ్చారు.
ఫ్రెండ్స్ : wow సూపర్ గా ఉన్నాడే ఇందూ ఉమ్మా ఉమ్మా ........ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . అక్కయ్యకు అగ్రికల్చర్ హీరో - చెల్లికి సాఫ్ట్వేర్ హీరో అని సంతోషంతో గిలిగింతలు పెట్టబోయి కంట్రోల్ చేసుకున్నారు - ఒసేయ్ ఇందూ ........ గుర్తుపెట్టుకో పెళ్ళిచూపుల తరువాత వడ్డీతోసహా చెల్లిస్తాము .
బంధువులు : బంగారు తల్లికి ఈడూ జోడు ........ అని సంతోషాన్ని పంచుకున్నారు.

అత్తయ్యావాళ్ళు లోపలికి అడుగుపెట్టగానే , మురళి ....... అమ్మానాన్నలను చూసి మమ్మీ - వదినా ....... అంటూ ఆశ్చర్యపోయాడు .
అత్తయ్యగారు : ఇంకా అర్థం కాలేదా నాన్నా ........ , అతిలోకసుందరి లాంటి అమ్మాయి ఎవరో కాదు మీ అందమైన వదిన ప్రాణమైన చెల్లినే అని నవ్వుకున్నారు - మీ అన్నయ్య పెళ్ళిచూపులలోనే ఫిక్స్ అయిపోయాను నా ప్రాణమైన మురళికి కాబోయే దేవకన్య ఇందూనే అని - మీ అన్నయ్య కంటే నువ్వంటే ఎంత ఎక్కువ ప్రాణమో , నీకంటే నా కోడళ్లు అంతకంటే ఎక్కువ ప్రాణం .
జానకి : మాలోకూడా చెల్లి అంటే మరింత ప్రాణం మరిదిగారూ ....... , ఎక్కువ చెబుతున్నాను అనుకోవద్దు నా చెల్లి నాకంటే అందంగా ఉంటుంది .
అత్తయ్యగారు : అనుకున్నా అదే నిజం కోడలా ........ , నా బుజ్జికోడలు దివి నుండి దిగివచ్చిన దేవకన్య .........
అత్తాకోడళ్లు ........ ఇందూ గురించి ఉన్నదే పొగుడుతున్నా , మురళిలో ఎటువంటి ఫీలింగ్స్ కనిపించడం లేదు .
నాన్నగారు ......... సంతోషంతో చెల్లెమ్మలూ - అల్లుడుగారూ - చిన్నల్లుడు గారూ - తల్లీ జానకీ ....... అంటూ అందరినీ సాదరంగా ఆహ్వానించి సోఫాలలో కూర్చోబెట్టి మర్యాదలు చేశారు .
అత్తయ్యగారి కోరిక మేరకు జానకి తీసుకొచ్చిన పళ్ళు పూలు పసుపు కుంకుమను అమ్మకు అందించింది .
వదినగారూ ........ నా పెద్ద కోడలిని చూసిన సమయానికే నా చిన్నకోడలి పెళ్లిచూపులు జరగాలని ఆశపడుతున్నాము .

మీ ఇష్టమే మా ఇష్టం వదినగారూ ఇక 10 నిమిషాలే ఉంది అని అమ్మ సంతోషంతో పైకివచ్చి తల్లీ ....... కిందకు రెడీ కదా ? .
ఇందు : ఎప్పుడెప్పుడా అన్నట్లు , రెడీ అమ్మా ....... అని ఉత్సాహంగా బదులిచ్చింది . అమ్మా ....... నాన్నగారికి నీకు నచ్చారా ? .
అమ్మ : అంతే ఆనందంతో చాలా చాలా తల్లీ , నువ్వే చూస్తావుకదా అని కిందకు పిలుచుకునివచ్చింది .

అత్తయ్యగారు : చూసిన క్షణమే అంతులేని ఆనందంతో లేచివెల్లిమరీ బుగ్గలను అందుకుని దేవకన్యలా ఉన్నావు ఇందూ ....... , జానకీ ....... బ్యూటిఫుల్ సారీ సర్ప్రైజ్ అదిరిపోయింది అని నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టింది . నాన్నా మురళీ ........ నా చిన్నకోడలిని చూసుకో ఇంకా తలదించుకుని సిగ్గుపడతావేంటి ? - నా బుజ్జికోడలు కూడా సిగ్గుపడుతోంది అంటే మురళి నచ్చినట్లే అన్నమాట అని నుదుటిపై మరొకముద్దుపెట్టింది .
ఇందు : ఎప్పుడో అత్తయ్యగారూ ........ అమ్మకు - ఫ్రెండ్స్ కు - బంధువులకు కూడా అని చెవిలో గుసగుసలాడింది .
అత్తయ్యగారు : చాలా చాలా సంతోషం తల్లీ ....... కనీసం ఒకసారైనా పెళ్ళికొడుకుని చూడొచ్చు కదా .......
ఇందు : అవసరం లేదు అత్తయ్యగారూ ........
అత్తయ్యగారు : నా బంగారం .........
చారు అంటీ : మురిసిపోయింది చాలు నాగాంబ వచ్చి కూర్చో , ఓర చూపులతో నీ చిన్నకొడుకు దేవకన్యను చూసుకోవాలి కదా - అడ్డుగా నిలబడ్డావు . ఇందూ ...... బ్యూటిఫుల్ అంటూ చేతితో సైగచేశారు .
అత్తయ్యగారు : sorry sorry అంటూ వెళ్లి కూర్చున్నారు .

ఫ్రెండ్స్ స్వీట్స్ తీసుకెళ్లి అందరి ముందూ ఉంచారు . పిన్నమ్మ అందించిన టీ ట్రే అందుకుని అత్తయ్యగారి దగ్గర నుండి అందరికీ అందించి చివరకు మురళి దగ్గరకు చేరి పూరేకుల లాంటి చేతివేళ్ళతో ప్రత్యేకంగా ఇచ్చింది .
చూసి అందరూ ....... wow అంటూ ఆటపట్టించారు .
ఇందూని చూడనైనా చూడటం లేదు మురళి - టీ అందుకోబోయి దేవకన్య చేతివేళ్లు స్పృశించినా ఎలాంటి చలనం లేదు మామూలుగా అయితే ఇందూ చిరు స్పర్శకే కరెంట్ షాక్ తగలాలి .
చారు అంటీ : ఇందూ ....... ఎదురుగా సోఫాలో కూర్చో ......
అత్తయ్యగారు : సిగ్గు కదా .......
ఇందు : మా దేవత ముందు నాకు సిగ్గు ఎందుకు అత్తయ్యగారూ ........ అని అందమైన నవ్వులతో కూర్చుంది .
చారు అంటీ : ఇందూ ........ ఇప్పుడే మీ అత్తయ్యగారు ఎవరెస్టు అంచుకు వెళ్ళిపోయింది - దేవత అంటే ఇక పట్టలేము .......
అత్తయ్యగారు : మా అత్తాకోడళ్ళం మా ఇష్టం నీకెందుకే అంది .
చారు అంటీ : సరి సరి ....... , మురళీ ....... బాగా చూసుకున్నావా నీకు ok అయితే లగ్గాలు పెట్టించడమే .........
అత్తయ్యగారు : వన్ వే పెళ్ళిచూపులే చారూ ........ , పెళ్లిచూపులు నా బుజ్జికోడలికి కాదు నా చిన్నకొడుకుకి - ఇందూకు నచ్చితే చాలు ........
ఇందు : థాంక్స్ అత్తయ్యగారూ ........

మురళి : మమ్మీ ....... అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలి అని తలదించుకునే చెప్పాడు .
అత్తయ్యగారు : మురళీ ........
నాన్నగారు : పర్లేదు చెల్లెమ్మా ....... , ఒకరినొకరు అర్థం చేసుకుంటే మరింత మంచిది - తల్లీ ....... ఇందూ పైకి తీసుకెళ్లు .
అత్తయ్యగారు : నాన్నా ....... ఇది బెంగళూరు కాదని గుర్తుపెట్టుకో , ఇందూ ...... ఇబ్బంది అనిపిస్తే ఒక కేకవెయ్యి వచ్చేస్తాను .
ఇందు : అలాగే అత్తయ్యగారూ అని లేచి ఒకసారి కౌగిలించుకుని , రండి అంటూ సిగ్గుపడుతూ బిల్డింగ్ టాప్ మీదకు పిలుచుకునివెళ్లింది .

నిమిషాలు గడుస్తున్నా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది .
ఇందు : నాతో ఏదో ఒంటరిగా మాట్లాడాలన్నారు , ఇక్కడకు వచ్చి సైలెంట్ అయిపోయారు , కనీసం నావైపు కన్నెత్తైనా చూడటం లేదు . నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా ...... ? , నా పేరు ఇందు ఇంటర్ ........
మురళి : మీ గురించి మొత్తం తెలుసు ఇందూ గారూ ........ , నిన్నటి నుండీ పెళ్ళిచూపులకు వచ్చేన్తవరకూ మీ గురించే చెబుతూ తెగ మురిసిపోతోంది మమ్మీ ..........
ఇందు : థాంక్స్ అత్తయ్యగారూ ....... , అత్తయ్యగారికి మేమంటే చాలా చాలా ఇష్టం - ఇందూ గారు ఏమిటి జస్ట్ ఇందు అని పిలవండి , మీ కాదు నీ ........ కనీసం ఒక్కసారైనా నన్ను చూస్తే నాకూ హ్యాపీ .........

మురళి : ప్చ్ ....... స్ట్రెయిట్ పాయింట్ కు వచ్చేస్తాను . ఇందూ గారూ ....... ఇందూ ఇందూ ...... నాకు చాలా గోల్స్ ఉన్నాయి దానికి చాలా చాలా సమయం పడుతుంది - అంతవరకూ అంతవరకూ .......
ఇందు : మీ గోల్స్ నాకు ఇష్టమే , ఎన్నిరోజులయినా సరే ఆశతో ఇష్టంతో ఎదురుచూస్తాను .
మురళి : రోజులు కాదు ఇందూ గారూ ....... సంవత్సరాలుపడుతుంది .
ఇందు : సంవత్సరాలు ........ వేచి చూస్తాను . కానీ ఒక కోరిక తీర్చండి నెక్స్ట్ మంత్ తొలి ముహూర్తాన నా మెడలో తాళికట్టి అత్తయ్యగారి దగ్గరకు చేర్చండి - మీ గోల్ రీచ్ అయ్యేంతవరకూ మీ స్పర్శ కోసం ఎదురుచూస్తూ ఉంటాను .
మురళి : ప్చ్ ........ మీరు చాలా చాలా అందంగా ఉన్నారని అందరూ చెప్పారు .
ఇందు : అదేవిషయం మీరూ ఒకసారి చూసి చెబితే నా అంత అదృష్టవంతురాలు మరొకరు ఉండరు .
మురళి : మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు . నా గోల్ రీచ్ అవ్వడానికి జీవిత సమయం అయినా పట్టవచ్చు .........
ఇందు : సంతో ........
మురళి : నన్ను పూర్తిచేయనివ్వండి . అంతవరకూ ఇంతటి దేవకన్యను వేచి చూసేలా చెయ్యడం నాకిష్టం లేదు - నాకంటే మంచివాడు మీ జీవితంలోకి వస్తాడు. మమ్మీకి ....... చెప్పే ధైర్యం నాకు లేదు , మమ్మీ కూడా బాధపడుతుంది - మీరు వెళ్లి పెళ్ళికొడుకు నచ్చలేదు అని చెబితే అందరికీ మంచిది .
ఇందూ కళ్ళల్లో చెమ్మతో ...... అత్తయ్యగారు మీకు అమ్మ - నాకు అంతకంటే ఎక్కువ , నేను అలా చెప్పగానే బాధ కన్నీళ్లు ...... ఇంకా ఏమైనా జరగవచ్చు అంత ప్రాణం నేనంటే ......... , ఎవరినైనా ప్రేమించారా ? .
మురళి : నో నో నో , మమ్మీకి అలాంటివి ఏమాత్రం ఇష్టం లేదు .
ఇందు : మరి ....... ఎవరో ఒకరిని పెళ్లిచేసుకోవాలికదా నన్ను చేసుకోండి . ( అక్కయ్యకు - అత్తయ్యగారికి దూరంగా ఉండలేను దానికంటే ప్రాణాలొదలడం సులభం అని మనసులో అనుకుంది ) .
మురళి : అయినా మమ్మీ అనుకుంటున్న మంచివాడిని కాదు నేను . సిగరెట్ - మందు - జూదం ....... ఇలా అన్నీ అలవాట్లూ ఉన్నాయి . మమ్మీ దగ్గర మంచివాడిలా నటిస్తున్నాను .
ఇందు : మిమ్మల్ని మార్చుకోగలనన్న నమ్మకం నాకు ఉంది .
మురళి : ప్చ్ ........ నిజం చెప్పేస్తున్నాను . నాకు బయటకు చెప్పుకోలేని సమస్య ఒకటుంది .
ఇందు : కొద్దిసేపు మౌనం తరువాటిగా " ఏక్ మినీ కథ " నా .......
మురళి : నో నో నో ....... , దారిలోకి వచ్చేటట్లు ఉంది అవునవును ఇంచుమించు అలాంటిదే .........
ఇందు : నాకు సమస్యే లేదు , ఆ మూవీలో హీరోయిన్ లా ప్రేమున్నచోట అలాంటివి ప్రాబ్లమే కాదు ఇంతేనా అని కన్నీళ్లు తుడుచుకుంది - అంటే నా సుఖం గురించి ఆలోచిస్తున్నారు అంటే ఎంత మంచివాళ్ళు , నేనంటే ఇష్టమే అన్నమాట థాంక్యూ థాంక్యూ soooooo మచ్ .
మురళి : అదీ అదీ ........

ఇందూ ఇందూ ........ ఎంతసేపు మాట్లాడుకుంటారు అని పైకి వచ్చారు అత్తయ్యగారు - అక్కయ్య - చారు అంటీ .
ఇందు : అత్తయ్యగారూ - అక్కయ్యా ....... అంటూ పరుగునవెళ్లి సంతోషంతో ఇద్దరినీ కౌగిలించుకుంది . అత్తయ్యగారూ ........ ఆయన చాలా చాలా మంచివారు - అనుక్షణం ఈ నెలరోజులూ నా గురించే ఆలోచిస్తున్నారు - కానీ ఒకే ఒక కోరిక కోరారు మీరుకూడా మన్నించాలి ముందు ప్రామిస్ చెయ్యండి . Ok రాబోతున్న తొలి ముహూర్తాన పెళ్లి చేసుకుంటారు , కాపురం మాత్రం కొన్ని సంవత్సరాలు అంటే గోల్ రీచ్ ఆయన తరువాత .........
అత్తయ్యగారు : ఇందూ ....... అలా ఎలా ? .
ఇందు : అత్తయ్యగారూ ........ మాటిచ్చారు .
అత్తయ్యగారు : నిన్నూ ........ , నాన్నా మురళీ ........ కొన్ని సంవత్సరాలు కాదు - నా బుజ్జికోడలికి ప్రామిస్ చేసాను కాబట్టి నీ గోల్ రీచ్ అవ్వడం కోసం ఒకే ఒక సంవత్సరం గడువు ఇస్తున్నాను - నిన్ను ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యము పెళ్లిరోజు ఏదైతే ఉందో సంవత్సరం తరువాత తొలి ఏడాది పెళ్లిరోజున శోభనం ........
మురళి : మమ్మీ మమ్మీ ........
అత్తయ్యగారు : నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది ఫిక్స్ ........ , నా బుజ్జికోడలికి నచ్చితే చాలు - చెప్పు ఇందూ ........
ఇందు : మీ మాటే నాకు వేదం అత్తయ్యగారూ ........
అత్తయ్యగారు : నా కోడళ్లు బంగారం అని ఇద్దరి నుదుటిపై ముద్దులుపెట్టి , ఇక చారు చెప్పినట్లు నిశ్చితార్థం - లగ్గం గురించి మాట్లాడుకుందాము అని సంతోషంతో కిందకు నడిచారు .
చారు అంటీ : ఒసేయ్ నాగాంబ సంవత్సరం తరువాత శోభనం ఏమిటే ........
అత్తయ్యగారు : అలా చెప్పాను అంతే , తాళికట్టగానే శోభనం గదిలోకి పంపితే మల్లెపూల మత్తుకే ఇద్దరూ ఏకమైపోతారు ఆ మాత్రం తెలియదే నీకు .
ఇందు : సిగ్గుపడుతూ ....... అక్కయ్య చేతిని అందుకుని వెళ్లి అమ్మ కౌగిలిలోకి చేరిపోయారు .
చారు అంటీ : అయితే ok , నాగాంబ ....... నీ తెలివే తెలివి .

మురళి : తన అమ్మను బాధపెడితే ఏమిజరుగుతుందో తెలిసి లోలోపలే బాధపడుతూ కొద్దిసేపు అక్కడే ఉండిపోయాడు . మొబైల్ తీసి కిందకు వెళుతున్న తన మమ్మీకి కాల్ చేసాడు - మమ్మీ ........ ఇందు ఇంకా ఇంటర్ , మా ఇద్దరిమధ్య గ్యాప్ 8 ఇయర్స్ పైననే .........
అత్తయ్యగారు : నాన్నా ........ నువ్వు ఈ విషయం అడుగుతావని నాకు ముందే తెలుసు , మీ అన్నయ్య ఫేవరేట్ హీరో jr ఎన్టీఆర్ ఎంత ఏజ్ గ్యాప్ అమ్మాయిని చేసుకున్నాడో ఒకసారి సెర్చ్ చేసి నువ్వే తెలుసుకో - ఇంకా చెప్పమంటే చాలా చెబుతాను - అది మనసులో పెట్టుకోకుండా కిందకు వచ్చెయ్యి . అన్నయ్యగారూ ....... పిల్లలకు ఒకరికొకరు నచ్చారు కాబట్టి ముహూర్తాలు పెట్టేసుకుందాము .
నాన్నగారు : మీ ఇష్టం చెల్లెమ్మా ....... అంతకంటే అదృష్టమా అని సంతోషంతో భార్య పిల్లల దగ్గరికివెళ్లి ఇందూ నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోతున్నారు .
అత్తయ్యగారు : అందరికీ ok కాబట్టి , శివా ....... మీ పెళ్లి ముహూర్తం పెట్టిన మన ఊరి పంతులుగారినే తీసుకురావాలి - ఆస్వాధిస్తున్నావు కదా ఆయన పెట్టిన ముహూర్తపు సంతోషాలను .
శివ : అవునమ్మా ........ ఇప్పుడే పిలిపిస్తాను అని ఊరిలో ఉన్న డ్రైవర్ కు కాల్ చేసాడు . అమ్మా ....... లంచ్ సమయానికి ఇక్కడ ఉంటారు .
అత్తయ్యగారు : సంతోషం ........ , ఆయన వచ్చేలోపు జానకితోపాటువెళ్లి అవసరమైనవి తీసుకురావాలి .
శివ : అలాగే అమ్మా ...... , పంతులు గారికే కాల్ చేసి తెలుసుకుని తీసుకువస్తాను .

మురళి : మమ్మీ ........ పెళ్లిచూపులు అయిపోయాయికదా , ఇక నా అవసరం లేదనుకుంటాను - నీకు సీరియస్ అనగానే బెంగళూరులో ఎక్కడ పనులు అక్కడే వదిలేసి వచ్చాను - ఇప్పుడు వెళ్లి కాల్ చేసినప్పుడు వచ్చేస్తాను .
అక్కాచెల్లెళ్ళు : అత్తయ్యగారికి సీరియస్ .......? అంటూ ఇద్దరూ కళ్ళల్లో చెమ్మతో వెళ్లి చేతులను అందుకున్నారు .
శివ వెళ్లి మురళి మరొక మాట మాట్లాడకుండా ఆపేశాడు .
చారు అంటీ : సీరియస్ కాదు తల్లులూ ........ సీరీస్ సీరీస్ వరుసబెట్టి నెలరోజులు సీరీస్ గా కాల్స్ చెయ్యడంతో వచ్చాడు కదా అదే చెబుతున్నాడు - మీ అత్తయ్యగారికి ఏమవుతుంది గుండ్రాయిలా ఉంది .
అత్తయ్యగారు : రెండు నెలలుగా మీతోపాటే ఉన్నాను , మీరు పంచిన ఆనందాలకు చిన్న జ్వరమైనా వచ్చిందా ? .
మురళికి డౌట్ వచ్చింది .........
శివ : చాకచక్యం ప్రదర్శించి , అమ్మా ...... నిన్న లేవు కదా అని మురళి వైపు సైగచేశాడు .
అక్కాచెల్లెళ్ళు : అవును నిన్నంతా మమ్మల్ని కలవనేలేదు . ఊరిలో ఉండి మమ్మల్ని చూడకుండా మీరు ఒకరోజంతా ఎలా ఉండగలిగారు .
మురళి : కన్విన్స్ అయినట్లు sorry అన్నయ్యా అనిచెప్పాడు . వదినా ...... నేను సీరియస్ అనలేదే , మమ్మీ ....... నేను బెంగళూరు వెళ్లనా ? .
అత్తయ్యగారు : మురళీ ఒక్కనిమిషం . కోడళ్ళూ ....... నా ఒళ్ళు కొద్ది వేడిగానైనా ఉందా చెప్పండి అని చేతులను అందుకుని నుదుటిపై - మెడపై స్పృశించుకున్నారు.
అక్కాచెల్లెళ్ళు : రెండుమూడుసార్లు టచ్ చేసి లేదు అన్నారు పెదాలపై చిరునవ్వులతో ........
అత్తయ్యగారు : హమ్మయ్యా ........ నా ప్రియమైన కోడళ్లు నవ్వారు అని కన్నీళ్లు తుడిచి , సెలెబ్రేషన్ మూడ్ లోకి తెప్పించారు . ఆ మురళీ ....... పెళ్లి జరిగేంతవరకూ మన ఊరు వదిలి ఎక్కడకూ వెళ్ళడానికి వీలు లేదు .
మురళి : మమ్మీ ....... వర్క్ .
అత్తయ్యగారు : ప్రపంచం మొత్తం అదేదో ఇంటి నుండే పని .........
ఇందు : " work from home " అత్తయ్యగారూ .......
అత్తయ్యగారు : ఆ ఆ ...... థాంక్స్ బుజ్జికోడలా " work from home " చేస్తున్నారని రోజూ న్యూస్ లో చూస్తున్నాను - అవసరమైన కంప్యూటర్స్ ఇక్కడే తీసుకుని ఇంట్లోనే పనిచెయ్యి - నిన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యరు .
మురళి : మమ్మీ .......
అత్తయ్యగారు : ఇది ఫిక్స్ , నాన్నా మురళీ ....... మీ అన్నయ్య పెళ్లి వారంలో హడావిడిగా పెళ్ళికొడుకుకు జరిపించే ఏ సంబరాలూ లేకుండానే జరిగింది - ఆ సంతోషాలన్నీ నా చిన్నకొడుకు ద్వారా పొందాలని ఈ తల్లి కోరిక ........ - మీ అన్నయ్య పెళ్లి కంటే ఘనంగా జరిపిస్తాను - ఇప్పుడు నువ్వు ఫీల్ అయినా ఈ సంతోషాలను తనివితీరా ఎంజాయ్ చేస్తావని మాటిస్తున్నాను - ఈ నెలరోజులూ ........ లీవ్ పెట్టినా మరింత సంతోషం - శివా ...... ఇంకా ఇక్కడే ఉన్నావు ? .
శివ : sorry అమ్మా ...... అని పంతులు గారికి కాల్ చేసి జానకిని లాక్కుని బయటకువెళ్లడం చూసి అందరూ నవ్వుకున్నారు .

గంటలో శివా వాళ్ళు రావడం - రెండు గంటలలో పంతులు గారు రావడం ....... పెళ్ళికొడుకు , పెళ్లికూతురిని ఎదురెదురుగా కూర్చోబెట్టి పంతులుగారు జాతకాలు చూసి మళ్లీ మళ్లీ చూసి ఊహూ ఊహూ ....... అంటూ బుక్ మళ్లీ మళ్లీ తిరగేసినా ప్రయోజనం లేనట్లు నిరాశతో , బాబూ శివా ....... ఒకసారి బయటకువెళదాము అని కాంపౌండ్ లోకి పిలుచుకునివెళ్లారు .
నిమిషానికే శివ కంగారుపడుతూ వచ్చి అత్తయ్యగారిని పిలుచుకునివెళ్లాడు .
పంతులుగారు : నాగాంబ గారూ ........ పెళ్లికూతురి జాతకం దివ్యంగా ఉంది మహాజ్జాతకురాలు , సిరులు కురుస్తాయి , మీ కుటుంబ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళుతుంది .
అత్తయ్యగారి ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి - చాలా చాలా సంతోషమైన మాట చెప్పారు పంతులు గారూ ........
పంతులుగారు : కానీ ....... మీ చిన్నబ్బాయి జాతకంలో ఊహకందనివి సాక్షాత్కరిస్తున్నాయి . అబ్బాయి వలన అమ్మాయి చాలా కష్టాలను ఎదుర్కోవలసివస్తుంది - ఇలాంటి విభిన్నమైన జాతకాన్ని నేనెప్పుడూ చూడనేలేదు - మీ మంచి కోరి చెబుతున్నాను ఈ ఇద్దరికీ పెళ్లి జరిపించడం మంచిదికాదు - అమ్మాయి మహాజ్జాతకురాలు కాబట్టి చెబుతున్నాను పాపం .........
శివ : ప్రాణాపాయం ఏమైనా .........
పంతులుగారు : అలాంటిదేమీ జరుగదు ఊహించని కష్టాలు అనుభవిస్తుంది అంతే .........
అత్తయ్యగారు : పంతులుగారూ ........ నా చిన్నకోడలు నా ఇంటిలో అడుగుపెట్టకపోతే నేను జీవించినా ప్రాణం లేనట్లే ఉంటుంది . మీరే ఎలాగైనా శాంతి పూజలు - హోమాలు జరిపించి ఈ లోపాలను పోగొట్టాలి - ఎంత ఖర్చు అయినా పర్లేదు మాపై దయ చూపండి - నా కోడలిని నా ప్రాణంలా చూసుకుంటాను .
పంతులు గారు : మీ గురించి తెలియదా నాగాంబ గారూ ........ , ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది పరిస్థితి , మనం ఏమిచేసినా అందరూ సంతోషంగా ఉండాలి . నా వంతు కృషి చేస్తాను - తొందరగా లోపవినాశ హోమం జరిపించాలి .
అత్తయ్యగారు : మీరెప్పుడు అంటే అప్పుడు పంతులుగారూ ....... నా చిన్నకోడలిని పిలుచుకునివస్తాము , కానీ మూడవ కంటికి తెలియరాదు .
పంతులుగారు : అబ్బాయి ఒక్కరే ఉంటే చాలు నాగాంబ గారూ ....... , శాంతి హోమం ఊరికి మంచి జరుగుతుంది అని మన ఊరి గుడిలో జరిపిస్తాను .
అత్తయ్యగారు : మీ మేలు మరిచిపోము పంతులుగారూ ........ అని పెద్దమొత్తంలో సంభావన అందించి లోపలికి ఆహ్వానించారు .

పంతులు గారి వెనుకే అత్తయ్యగారు - శివ లోపలికివచ్చారు .
నాన్నగారు : కంగారుపడుతూ చెల్లెమ్మా - అల్లుడుగారూ ....... అంతా ok కదా ? .
శివ : అదీ మావయ్యగారూ .........
అత్తయ్యగారు : అంతా ok అన్నయ్యగారూ ....... , ముహూర్తపు date గురించి చర్చించాము అంతే ....... అంతేకదా పంతులుగారూ చెప్పండి .
పంతులుగారు : ఆ ఆ అంతే అంతే , ఈ శూన్య మాసం వెళ్లిపోయిన రెండవరోజు దివ్యమైన ముహూర్తం ఉంది అని తాంబూలాలు మార్పించి ఊరికి బయలుదేరారు.

నాన్నగారు : సంతోషం చెల్లెమ్మా , సరిగ్గా నెలరోజులు ఉంది .
అత్తయ్యగారు : అవును అన్నయ్యగారూ ........ రేపటి నుండే పెళ్ళిపనులు మొదలెట్టాలి .
అమ్మ - బంధువులు సంతోషంగా మాట్లాడుకుంటున్నారు .
మురళి : అంతా అయిపోయింది ఇక ఏమీ చేయలేము - ఇక ఆ కాలమే సమాధానం చెప్పాలి . నిస్పృహతో మమ్మీ ....... work from home కోసం లాప్టాప్ ఇంకా చాలా తీసుకోవాలి వెళతాను .
నాన్నగారు : చిన్నల్లుడూ భోజనం చేసి వెళ్లు ........
మురళి : ఆకలిగా లేదండీ , ఆకలివేస్తే బయట తింటాను ఈరోజు ముఖ్యమైన పని ఉంది - అటు నుండే అటు గ్రామానికి బయలుదేరుతాను .
ఇందు : అక్కయ్యా - అత్తయ్యగారూ ....... ఇకనుండీ మనం ఒకటి అని కౌగిలించుకుంది .
ఫ్రెండ్స్ : ఇందూ ఇందూ ....... అంటూ సంతోషంతో గిలిగింతలుపెడుతూ పైన గదిలోకి చేరుకున్నారు .
భోజనాలు చేసి జానకిని ఇందూతోనే ఉండమని చెప్పి చారు అంటీ ఇంటికి చేరుకున్నారు .

శివ : ఎవ్వరూ లేకపోవడం చూసి అమ్మా ....... మనం ఏమైనా తప్పు చేస్తున్నామా ? .
అత్తయ్యగారు : జాతకాలను పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు - ఇందూకు ఏ లోటూ లేకుండా చూసుకోవడానికి మనం ఉండనే ఉన్నాము కదా - ఒకరిని వదిలి ఒకరం ఉండలేము అందుకే ఇలా చెయ్యక తప్పలేదు - నువ్వు రేపే ఊరికివెళ్లి ఎంతవీలైతే అంతత్వరగా ఆ హోమం జరిపించు - నేను ....... నా కోడళ్ల దగ్గర ఇక్కడే ఉంటాను - ఆ హోమమేదో పూర్తవగానే రెండు కుటుంబాలూ వెళ్లి మన దైవమైన విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకుని పెళ్ళిపనులు మొదలుపెడదాము .
శివ : అలాగే అమ్మా , మీరు ఏమిచేసినా ఆలోచించే చేస్తారు .

తరువాతిరోజు శివ వెళ్లి తమ్ముడి పేరుపై లోపవినాశ హోమం జరిపించి వైజాగ్ రావడం - చివరి నిమిషంలో అందరికీ ఫ్లైట్ టికెట్స్ దొరకకపోవడంతో రెండు కుటుంబాలతోపాటు చారు అంటీ ఫ్యామిలీ మరియు ఇందూ ఫ్రెండ్స్ విజయవాడకు బస్ లో బయలుదేరి ఎలాంటి అడ్డంకులూ రాకూడదని దుర్గమ్మ దర్శనం చేసుకునివచ్చారు .
ఆ తరువాత రోజు లంక గ్రామంలో పంతులుగారి సమక్షంలో లగ్నపత్రిక రాయించడం సంబరంలా జరిగింది . ప్రింట్ చేయించి బంధువులకు తెలిసినవాళ్లకు ఊరందరికీ వెడ్డింగ్ కార్డ్స్ పంచుతూనే , పెళ్ళికొడుకు - పెళ్లికూతురుకు జరిపించే శుభకార్యాలన్నీ జరిపిస్తున్నారు . ఇద్దరివీ చూసి అత్తయ్యగారు తరిస్తున్నారు .

శూన్య మాసం వెళ్లిన మరుసటి రోజు వారీ వారి ఇళ్లముందు పెళ్ళిపందిరులు వేసి బంధువులంతా పసుపు కుంకుమ స్నానాలు జరిపించి పెళ్ళికొడుకు - పెళ్లికూతుళ్ళుగా తయారుచేశారు .
భోజనాలు పూర్తిచేసుకుని అత్తయ్యగారు పంపిన 10 లగ్జరీ బుస్సులలో పెళ్లికూతురితోపాటు బంధువులంతా లంక గ్రామం చేరుకున్నారు - అందరికోసం పొలంలో గుడారాల విడుదులు , పెళ్లికూతురికోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు .
దేవలోకం దిగివచ్చిందా అన్నట్లు పెళ్ళిమండపం రెడీ అయ్యింది .

సాయంత్రం ఆర్భాటమైన రిసెప్షన్ తరువాత జానకి ....... పెళ్లికూతురు అయిన తన ముద్దుల చెల్లిని ఫ్రెండ్స్ తోపాటు లగ్జరీయోస్ గదిలోకి తీసుకెళ్లింది . చెల్లీ ........ ఇప్పటికే 10 గంటలు అయ్యింది తొందరగా పడుకో , రేపు ఫ్రెష్ గా ఉండాలికదా ..... , రేపు తెల్లవారకముందే వచ్చేస్తాను .
ఇందు : అక్కయ్యా ....... నువ్వూ ఇక్కడే ఉండొచ్చుకదా ........
జానకి : నా ముద్దుల దేవకన్యలా మారిన చెల్లితోపాటే ఉండాలని నాకు లేదా చెప్పు , రేపు మా ఏంజెల్ పెళ్లి ఇంతవరకూ జరగనట్లు అంగరంగవైభవంగా జరగాలంటే ఇష్టంతో కష్టపడుతున్న మీ బావగారికి నా సహాయం కూడా కావాలి please please ........ , చాలాపనులున్నాయి చెల్లీ ....... పెళ్లి శోభనం తరువాత మనల్ని ఎవ్వరూ విడదియ్యనేలేరు .
ఇందు : ఇక జీవితాంతం అక్కయ్య - అత్తయ్యగారితోనే ఉండొచ్చు అని అక్కయ్యను ప్రాణంలా కౌగిలించుకుంది .

నేను నా కోడళ్లతోపాటు అని అమాంతం ఇద్దరినీ కౌగిలించుకున్నారు అత్తయ్యగారు .
అత్తయ్యగారూ ....... అంటూ ఇద్దరూ కౌగిలిలోకి చేరిపోయారు అక్కాచెల్లెళ్ళు .
అత్తయ్యగారు : కోడళ్ళూ ....... నాతోపాటు మీ అమ్మకూడా వచ్చింది చూడండి .
అమ్మ : ఇకనుండీ అత్తయ్య అయినా - అమ్మ అయినా మీరే కదా వదినా అని ఆనందబాస్పాలతో చెప్పింది .
అత్తయ్యగారు : అమ్మ మాటలకు పరవశించి , ప్రాణంలా చూసుకుంటాను వదినా అని ఇద్దరి నుదుటిపై ముద్దులుపెట్టింది . ఇందూ ....... ఈ రాత్రికి మీ అమ్మ ఒడిలో హాయిగా నిద్రపో ....... , జానకీ చాలా పనులున్నాయి దగ్గరుండి చేయించాలి .
ఇందు : అత్తయ్యగారూ ....... మీరుకూడా పనులు చెయ్యబోతున్నారా ? .
అత్తయ్యగారు : మా బుజ్జికోడలికోసం ఆ మాత్రం కూడా చెయ్యకపోతే ఎలా ........
ఇందు : అయితే మీరు చెయ్యాల్సినవన్నీ నేనే చేస్తాను అత్తయ్యగారూ ........
అత్తయ్యగారు : నా కోడళ్లు బంగారం , పెళ్లికూతురితో పెళ్ళిపనులు చేయిస్తారా చెప్పు ఎవరైనా అని ప్రేమతో మొట్టికాయవేసి నవ్వుకున్నారు . ఆలస్యం అయ్యింది గుడ్ నైట్ ఇందూ ....... ఆని ముద్దులుపెట్టి ఇంటికి చేరుకున్నారు .

ముహూర్తం కోసం కావాల్సినవన్నీ అత్తాకోడళ్లు పెళ్ళిమండపం దగ్గరికి పంపించారు.
జానకి : సమయం చూసుకుని అత్తయ్యగారూ ........ మీకొక లవ్లీ సర్ప్రైజ్ నాతోపాటు వస్తారా ? .
అత్తయ్యగారు : ఎక్కడికైనా కోడలా ........
జానకి : విడిది దగ్గరకే వెళ్ళాలి అత్తయ్యగారూ అని కారులో చేరుకున్నారు . నేరుగా పెళ్లికూతురి గదిదగ్గరికి పిలుచుకునివెళ్లింది .
అమ్మ గదిబయట కంగారుపడుతూ అటూ ఇటూ నడుస్తోంది . తల్లీ జానకీ వచ్చేసావా ....... నువ్వు మొదటగా విష్ చెయ్యకపోతే ఇంకేమైనా ఉందా ? .
జానకి : అమ్మా ....... చెల్లి మేల్కొనే ఉందా ? .
అమ్మ : లేదు తల్లీ ....... ఈ పెళ్లి సంతోషంలో ఆ విషయమే మరిచిపోయినట్లుంది .
అత్తయ్యగారు : ఏ విషయం చెల్లెమ్మా - జానకీ ........

జానకి : అత్తయ్యగారూ ........ కొన్ని నిమిషాలలో మీ బుజ్జికోడలి పుట్టినరోజు .
అత్తయ్యగారు : ఏంటీ అంటూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు . పెళ్లిరోజున నా చిన్నకోడలి పుట్టినరోజు ఇది అతిపెద్ద సర్ప్రైజ్ ....... ఈ ఆనందంలో నాకు మాటలు రావడం లేదు - వెంటనే విష్ చెయ్యాలి .
జానకి : అత్తయ్యగారూ అత్తయ్యగారూ ........ తాళికట్టే సమయంలో పెళ్లికి వచ్చిన వారందరితో ఒక్కసారిగా సర్ప్రైజ్ విషెస్ అందిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
అత్తయ్యగారు : wow అధిరిపోతుంది , నాకూ అదేకావాలి అని జానకిని గట్టిగా కౌగిలించుకుంది . కోడలా ....... నా బుజ్జికోడలిని హాయిగా నిద్రపోనివ్వు .
జానకి : థాంక్స్ అత్తయ్యగారూ ........ , ప్రతీ సంవత్సరం 12 గంటలకు చెల్లికి ఫస్ట్ విష్ చేసేది నేనే - ఈ సారి ఆ అందమైన అవకాశాన్ని మా అత్తయ్యగారికి ........
అత్తయ్యగారు : లేదు లేదు ముందు నువ్వే
ముందు మీరే
ముందు నువ్వే .........
అమ్మ : అత్తాకోడళ్లు ఇద్దరూ ఒకేసారి విష్ చెయ్యండి .
లవ్ యు అమ్మా - థాంక్స్ వదినా ........ అంటూ ఇద్దరూ నవ్వుకుని , సౌండ్ చెయ్యకుండా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి 12 అవ్వగానే హాయిగా నిద్రపోతున్న ఇందుకు హ్యాపీ బర్త్డే చెల్లీ అంటూ బుగ్గపై - హ్యాపీ బర్త్డే బుజ్జికోడలా అంటూ నుదుటిపై ఒకేసారి ముద్దులుపెట్టి విష్ చేసి మురిసిపోతున్నారు .
ఇందు : నిద్రలోనే పెదాలపై తియ్యనైన నవ్వులతో మ్మ్మ్ ...... అంటూ అటువైపుకు తిరిగి ముడుచుకుని పడుకుంది .
అత్తాకోడళ్లు : ఉమ్మా ఉమ్మా ....... అంటూ సంతోషంతో నవ్వుకుని భుజం వరకూ దుప్పటికప్పి ఎలా వెళ్లారో అలా బయటకువచ్చారు .
అమ్మ : హమ్మయ్యా ........ ఇక నేను శుభాకాంక్షలు తెలుపవచ్చు అని మరింత నెమ్మదిగా లోపలికివెళ్లడం చూసి నవ్వుకున్నారు .
అత్తయ్యగారు : పెళ్లితో పాటు బర్త్డే సర్ప్రైజ్ కూడా ఆర్రేంజ్ చెయ్యాలన్నమాట రేపు కాదు కాదు ఈరోజు , నా కోడళ్ల వలన అన్నీ సంతోషాలే నాకు ఒకేరోజు రెండు సంబరాలు అని పరవశించిపోతూ ఇంటికిచేరుకుని నాన్నా శివా ....... ఏమిచేస్తావో నాకు తెలియదు ముహూర్తం సమయానికి గిన్నిస్ బుక్ లో చేరేంత బిగ్గెస్ట్ కేక్ మండపం మీదకు రావాలి - కేక్ పై పుట్టినరోజు శుభాకాంక్షలు from అమ్మ అక్కయ్య అత్తయ్యగారు ........ అని ఉండాలి .
శివ : ఇందూ birthday wow ........
జానకి : శ్రీవారూ ........ ముందు అత్తయ్యగారి పేరు ఉండాలి .
అత్తయ్యగారు : జానకి నుదుటిపై ముద్దుపెట్టి అంతులేని ఆనందంతో వెళ్లి పడుకున్నారు .
Next page: Update 09
Previous page: Update 07