Update 09

పెళ్లి సంబరం మరియు నేటి నుండి ఇక జీవితాంతం అక్కయ్యతోపాటే ఉంటూ అత్తయ్యగారిని సేవించుకునే అదృష్టం తన సొంతమవబోతోందన్న ఆనందంలో ఇందు ఈరోజు తన పుట్టినరోజు అన్న సంగతే మరిచిపోయి సంతోషంతో పెళ్లి స్నానం - గంగమ్మ పూజ ........ శుభకార్యాలన్నింటినీ జరిపించుకుని , పంతులు గారు పెళ్లికూతురిని పిలుచుకునిరండి అని వినగానే , అంతులేని ఆనందంతో అక్కయ్యను - అమ్మను కౌగిలించుకుని అందమైన సిగ్గుతో పట్టుచీర మరియు వొళ్ళంతా నగలతో పెళ్లికూతురిలా పెళ్లి మండపం మీదకు చేరింది .
పెళ్ళికొడుకు ప్రక్కనే నా బంగారు కోడలు అంటూ దిష్టి తీసి మురిసిపోతున్న అత్తయ్యగారి పాదాలను స్పృశించి ఆశీర్వాదo తీసుకుని తన స్థానంలో చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది .
పంతులుగారు ........ మంత్రాలు చదువుతున్నారు .

జానకి తన అమ్మతోపాటు వెనుకే నిలబడి ఇందూ సంతోషాలను పంచుకుంటున్నారు .
ప్రక్కనే ఉన్న నాన్నగారు ...... ఈ జీవితానికి ఈ ఆనందాలు చాలు అని ఆనందబాస్పాలతో మురిసిపోతున్నారు .
ఎదురుగా జానకి పెళ్ళికంటే ఎక్కువ జనసందోహపు సంతోషాలు ........ - బంధువులంతా పెళ్లి మాత్రమే కాకుండా ఏదో సంతోషపు క్షణం కోసం ఎదురుచూస్తున్నట్లు వాళ్ళ ఉత్సాహం వాళ్ళ కళ్ళల్లోనే తెలుస్తోంది .
వీటన్నింటినీ చూసి ఇందూ ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి . అత్తయ్యగారూ ........ ఈ సంతోషం మీవల్లనే అంటూ చేతిని అందుకుని ముద్దుపెట్టి పరవశించిపోతోంది . పెళ్ళికొడుకువైపుకు తిరిగి థాంక్స్ మురళీ గారూ అని సిగ్గుపడింది .
మురళి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు .

సాంప్రదాయాం ప్రకారం తంతు జరిపించి అందరికీ అక్షింతలు పంచేలా చూసి చివరికి తాళి అందుకుని మురళికి అందించి భాజా భజంత్రీలు అని కేకవేశారు పంతులుగారు .
మురళి కంగారుపడుతున్నట్లు తన తల్లివైపు చూసి వణుకుతున్న చేతులతో తాళి అందుకున్నాడు - ఇందూ మాత్రం ప్రతీ క్షణాన్నీ ఆస్వాదిస్తూ ఆ మాత్రం కంగారు ఉంటుందిలే అని తాళిని చూసి సిగ్గుపడుతూ తలదించుకుంది .
జానకి అంతే సంతోషంతో లవ్ యు చెల్లీ అంటూ పెళ్లికూతురి బుగ్గపై ముద్దుపెట్టి జడను ఎత్తిపట్టుకుంది .
మురళి వణుకుతున్న చేతులతోనే లేచి తాళి కట్టేంతలో .........

ఆపండి అని పెద్దగా వాయిస్ వినిపించడంతో , అప్పటివరకూ ముఖంలో ఎటువంటి ఫీల్ చూయించని మురళి పెదాలపై చిరునవ్వు విరిసింది . అత్తయ్యగారు అమ్మ అక్కయ్య నాన్నగారు శివతోపాటు పెళ్లికి విచ్చేసిన వారందరూ ....... కేకవేసిన వైపుకు చూసారు .
అత్తయ్యగారిలో కోపం - అమ్మ , అక్కయ్య లో కంగారు కనిపిస్తోంది . కేక వేసిన వాడితోపాటు సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా రావడంతో ఇందూకు ఏమిజరుగుతుందో అర్థం కావడం లేదు .

శివ : సర్పంచి గారూ ....... ఎందుకు ఆపమంటున్నారు , పెళ్లికి అమ్మ ..... మిమ్మల్ని పిలవద్దు అని చెప్పినా పిలవడం నా తప్పే , ముహూర్త సమయానికి అడ్డుపడటం సబబు కాదు .
అత్తయ్యగారు : శివా ....... నీలా బుద్ధిగా చెబితే వినే మనిషికాదు ఈ సర్పంచ్ , ఇక్కడ నుండి వెళతారా లేక ........
సర్పంచ్ : లేక ఏమిచేస్తారు నాగాంబ గారూ ......... , మీకు భయపడే రోజులు ఎప్పుడో పోయాయి - ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు .
ఇందు : అక్కయ్యా ....... అంటూ గుండెలపైకి చేరింది .
అత్తయ్యగారు : అధిచూసి కళ్ళల్లో అగ్నిగోళాలతో ....... , నువ్వెవరు చెప్పడానికి ......
సర్పంచ్ : ఈ లంక గ్రామం సర్పంచిగా ఒక మైనర్ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లిచేస్తుంటే చూస్తూ ఊరుకోలేను , చెప్పండి సెక్యూరిటీ ఆఫీసర్లూ ........
సెక్యూరిటీ అధికారి : మేడం ....... పెళ్లికూతురు మైనర్ అని కంప్లైంట్ వచ్చింది . మైనర్ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లిచేయ్యడం చాలా పెద్ద తప్పు - ఆ విషయాన్ని కంఫర్మ్ చేసుకోవడానికే వచ్చాము .

అత్తయ్యగారు : పెళ్లికూతురికి ఇష్టం లేదని ఎవరు కంప్లైంట్ చేశారు .
ఇందు లేచివెళ్లి అత్తయ్యగారి గుండెలపైకి చేరింది .
అత్తయ్యగారు : చూశారుగా ఇన్స్పెక్టర్ గారూ ....... , పెళ్లికూతురు ...... నా కోడలు - నేనంటే ప్రాణం - ఏ పెళ్లిలోనైనా చూసారా పెళ్లికి ముందే పెళ్లికూతురు ...... ప్రక్కనే తల్లి ఉన్నా సరే అత్తయ్యగారి దగ్గరకు చేరడం .
సెక్యూరిటీ అధికారి : sorry మేడం ........ , పెళ్లికూతురికి పెళ్లి ఇష్టం లేదని ఏ కంప్లైంట్ రాలేదు - ఈ దృశ్యం చూశాక ఎవ్వరూ ప్రశ్న కూడా వెయ్యరు - కానీ కానీ ........ పెళ్లికూతురు మైనర్ అని సర్పంచ్ గారు కంప్లైంట్ ఇచ్చారు . నిన్న ....... పెళ్లికూతురి కాలేజ్ కు వెళ్లి విచారించిన తరువాతనే ఇక్కడకు వచ్చాము అని మార్క్స్ కార్డ్స్ చూయించారు - పెళ్లికూతురికి 18 ఏళ్ళు నిండలేదు కాబట్టి ఈ పెళ్లి జరగడానికి వీలులేదు - పెద్దమనసుతో మీరే పెళ్లిని ఇంతటితో ఆపేస్తే వచ్చిన దారినే వెళ్లిపోతాము లేకపోతే పెళ్లి పెద్దలందరినీ అరెస్ట్ చెయ్యాల్సివస్తుంది .

అత్తయ్యగారు : ఏమిచెయ్యాలో తోచక కంగారుపడుతూ శివా - జానకీ - చారూ ........
పొలీస్ : మేడం ........ ఇప్పుడు మేముచేసేది తప్పుగా అనిపించినా తరువాత మీకే తెలుస్తుంది . ఈరోజుకు పెళ్లికూతురు వయస్సు 17 సంవత్సరాలే ........ ఈ వయసులో పెళ్లిచేయ్యడం చట్టరీత్యా నేరం .
జానకి : అత్తయ్యగారూ ....... కంగారుపడకండి అని నీళ్లు అందించి కొత్తపట్టుచీర కొంగుతోనే అత్తయ్యగారి చెమటను - చెల్లి కన్నీళ్లను తుడిచింది - అత్తయ్యగారూ అప్పుడే మరిచిపోయారా ....... ? .
అత్తయ్యగారు : ఏంటి కోడలా ......? .
జానకి : కళ్లారా చూసి తరించండి అత్తయ్యగారూ ........ , ఫ్రెండ్స్ - సిస్టర్స్ - రిలేటివ్స్ ......... తాళికట్టిన తరువాత నా ప్రాణమైన చెల్లికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాము కదా కానీ పరిస్థితుల ప్రభావం వలన పెళ్లికి ముందే are you ready ? .
Yes yes అంటూ పెళ్లి ప్రాంతం దద్దరిల్లిపోయింది .
జానకి : థాంక్యూ ....... , కౌంట్ డౌన్ 3 2 1 ........
Happy birthday ఇందూ - many more returns of the day ఇందూ - పుట్టిన రోజు శుభాకాంక్షలు ఇందూ ......... అంటూ దోసిల్లలోని పూలరేకులు - స్పార్కిల్స్ వెదజల్లారు .
జానకి : నా ముద్దుల చెల్లి 18 వ ఏట అడుగుపెట్టబోతున్న శుభ సందర్భాన పుట్టినరోజు శుభాకాంక్షలు అని బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
అమ్మ నాన్న : పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లీ .........
లవ్ యు అక్కయ్యా - అమ్మా ....... అని అక్కయ్యను కౌగిలించుకుంది . అక్కయ్యా....... మరిచేపోయాను అని పెళ్లికి వచ్చినవారందరూ పూలు వెదజల్లుతూ విష్ చెయ్యడం చూసి పులకించిపోతోంది .
అత్తయ్యగారు - చారు అంటీ నవ్వుకుని చిరునవ్వులు చిందిస్తూ , బుజ్జికోడలా happy birthday అని విష్ చేశారు .
ఇందు : లవ్ యు sooooo మచ్ అత్తయ్యగారూ - చారు అంటీ ....... అంటూ గుండెలపైకి చేరింది .
Happy birthday ఇందూ ........ అంటూ పొలంలో పనిచేసే పనివాళ్ళ సహాయంతో పెళ్ళిమండపం సగభాగం పట్టేలాంటి బిగ్గెస్ట్ కేక్ ను తీసుకొచ్చాడు శివ ..........
Wow బిగ్ బిగ్గెస్ట్ అంటూ అందరూ షాక్ అవుతున్నారు .
ఇందూ ....... ఆశ్చర్యపోయి థాంక్స్ బావగారూ అని ఎంజాయ్ చేస్తోంది . అక్కయ్యా .........
జానకి : మన అత్తయ్యగారు చెల్లీ .......
ఇందు : లవ్ యు sooooooo మచ్ అత్తయ్యగారూ ........

సెక్యూరిటీ అధికారి : మరొకసారి మార్క్స్ కార్డ్ లోని తేదీ - నెల - సంవత్సరం చూసి , extremely sooooo sorry మేడం ఈరోజుతో పెళ్లికూతురు మేజర్ ....... పెళ్లి ఆపే శక్తి ఎవ్వరికీ లేదు క్యారి ఆన్ అనిచెప్పి వెనుతిరిగారు .
అత్తయ్యగారు : ఇన్స్పెక్టర్ గారూ ....... పెళ్లికి వచ్చిన వారందరూ అతిథులే , మీరు కూడా ఆశీర్వదించి వెళితే మరింత సంతోషం .
సెక్యూరిటీ ఆఫీసర్లు : ok ok అంటూ సంతోషంగా ఖాళీగా ఉన్నచోట కూర్చున్నారు .

అత్తయ్యగారు : కోడళ్ళూ ........ మన ఇంటి గౌరవం కాపాడారు అని గర్వపడుతూ ఇద్దరినీ ప్రాణంలా కౌగిలించుకున్నారు .నా కోడళ్ల గురించి నాకు తెలియదా బంగారం ....... అంటూ నుదుటిపై ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు . ఏదో గుర్తుకువచ్చినట్లు కోపంతో రగిలిపోతూ సర్పంచ్ గోవర్ధన్ ........ మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు ఎప్పటికీ చెయ్యకూడదు , చేసావు చేస్తూనే ఉన్నావు ........ , మా ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేవాడివి వొంగి వొంగి పాదాలదగ్గర ఉండేవాడివి - నువ్వు నక్క అని తెలియక మన గ్రామానికి రావాల్సిన డబ్బును కలెక్టర్ ఆఫీస్ నుండి తెచ్చిన ప్రతీసారీ నీ దగ్గరే ఉంచాడు . మా ఆయనకు తెలియకుండా సగం సగం నొక్కేసి ఈ స్థాయికి చేరుకున్నావు . నువ్వు అనుభవిస్తున్న డబ్బు అంతా ఈ గ్రామం అభివృద్ధి చెందాల్సిన డబ్బు - ఆ డబ్బుతో నువ్వు మాత్రమే అభివృద్ధి చెందావు - ఊరందరినీ అమాయకులను చేసి వడ్డీలు ఇచ్చి భయపెడుతూ నీ చుట్టూ తిప్పుకుంటున్నావు , అలాంటి నువ్వు ఈ నాగాంబ ఇంట్లో జరిగే పెళ్ళినే ఆపడానికి వచ్చావా ఎంత ధైర్యం నీకు . ఏంటి సర్పంచ్ జారుకుంటున్నావు నీ భండారం మొత్తం బయటపడుతుందనా ...... ? . అయినా మా ఇంటి కోడలి పర్సనల్ డేటా నీకెలా వచ్చింది - ఆ విషయం మీద రేపే నీ మీద కంప్లైంట్ ఇవ్వబోతున్నాను , నిన్ను ఊరికే వదలను .........
చారు అంటీ : నాగాంబ ........ ఇందూ విషయం ఎలా తెలిసిందో కనుక్కో ........

అత్తయ్యగారు : ఇన్స్పెక్టర్ గారూ ......... ఏ ప్రూఫ్స్ తో ఈ సర్పంచ్ మీ దగ్గరకు వచ్చాడు .
సెక్యూరిటీ అధికారి : పెళ్లి ఆపడానికి వచ్చిన మమ్మల్ని కూడా గౌరవంతో అతిథులను చేసిన మీ పెద్ద మనసుకు అపద్దo చెప్పలేను - కాల్ వచ్చిందని మాదగ్గరికి వచ్చారు .
అత్తయ్యగారు : నాన్నా శివా ....... అడిగితే చెప్పడు కానీ సర్పంచ్ మొబైల్ తీసుకో ........
శివ : అలాగే అమ్మా .......
సర్పంచ్ : నా చుట్టూ కూడా నా మనుషులు ఉన్నారు .
అత్తయ్యగారు : నాకు అడ్డువచ్చే మొనగాడు ఎవడు వెళ్లు శివా .........
శివ ........ సర్పంచ్ దగ్గరికి వెళుతున్నాడు .
మురళి : అన్నయ్యా ........ వదిలెయ్యండి మనకు ముహూర్తం ముఖ్యం , ఇప్పటికే చాలా సమయం అయ్యింది - మంచి ముహూర్తం అని పంతులుగారు చెప్పారుకదా ........
అత్తయ్యగారు : వదిలెయ్యి శివా , వాడు ఎక్కడికీ పోతాడు , పెళ్లి తరువాత చూసుకుందాము .
అంతే సర్పంచ్ తుర్రుమనడం చూసి పెళ్లికి వచ్చినవారందరూ నవ్వుకున్నారు .

అత్తయ్యగారు : బుజ్జికోడలూ ....... హ్యాపీ కదా .......
ఇందు : లవ్ యు అత్తయ్యగారూ ........
అత్తయ్యగారు : కేక్ ....... , పంతులుగారూ ........ ముహూర్త సమయం ఇంకా ఎంత ఉంది ? .
పంతులు గారు : అర గంటకు పైననే ఉంది నాగాంబ గారూ ........
అత్తయ్యగారు : సంతోషం , మొదట నా చిన్నికోడలు మేజర్ అయినట్లు పుట్టినరోజు వేడుక జరిగిన తరువాతనే పెళ్లి , జానకీ - వదిన గారూ - చారూ ...... ఏమంటారు .
జానకి : మా అత్తయ్యగారు ఏమిచేసినా లోక కళ్యాణం కోసమే .......
అత్తయ్యగారు : సంతోషించి , బుజ్జికోడలా కేక్ కట్ చెయ్యి అని చెప్పారు .
ఇందు : అలాగే అత్తయ్యగారూ అని అత్తయ్య - అక్కయ్య చేతులను పట్టుకుని కేక్ ముందుకు చేరుకుంది . అందరి విషెస్ - పూలవర్షంలో కేక్ కట్ చేసి అక్కయ్య కోరిక మేరకు అత్తయ్యగారికి తినిపించింది .
అత్తయ్యగారు : ప్రతీ సంవత్సరం మీ అక్కయ్యకే కదా ........
అక్కాచెల్లెళ్ళు : మా ఇద్దరి దేవతకు మొదట తినిపిస్తే మరింత ఆనందం అత్తయ్యగారూ .........
అత్తయ్యగారు : కోడళ్ళూ ....... అంటూ పొంగిపోతూ తిని , అక్కాచెల్లెలిద్దరికీ తినిపించి విషెస్ చెప్పారు .
ఇందు : లవ్ యు అత్తయ్యగారూ ........ , అత్తయ్య గారి కోరిక మేరకు అక్కయ్యకు తినిపించి తిని అమితమైన ఆనందంతో కౌగిలించుకున్నారు . ఆ తరువాత అమ్మానాన్నలకు - చారు అంటీకి తినిపించి , మురళికి - శివకు చేతికి అందించింది.
ప్రక్కనే ఉన్న ఫ్రెండ్స్ కేక్ వైపు చూయించి మొత్తం పూసేస్తాము అని సైగలు చేశారు .
ఇందు : అత్తయ్యగారూ ........ అంటూ గుసగుసలాడి వెనుక దాక్కుంది .
అత్తయ్యగారు ........ ఇందూ ఫ్రెండ్స్ దగ్గరికివెళ్లి , పెళ్ళై ఇంటికి చేరిన తరువాత ఇలాంటి కేక్ తెప్పిస్తాను మీ ఇష్టం .
ఫ్రెండ్స్ : థాంక్స్ థాంక్యూ sooooo మచ్ అంటీ అని కేరింతలు వేస్తున్నారు . అక్కయ్య పిలవడంతో వచ్చి ఇందూకు తినిపించి కేక్ ను స్మాల్ స్మాల్ పీసస్ గా కట్ చేసి పెళ్లికి వచ్చినవారికి పంచారు శివ సహాయంతో ..........

పంతులు గారు : నాగాంబ గారూ ........ 10 నిమిషాలు మాత్రమే .......
అత్తయ్యగారు : కొడుకు - కోడలిని పెళ్లిపీటలపై కూర్చునేలా చేశారు .
చుట్టూ ప్రాణమైన వాళ్ళు - బంధువులు , ఎదురుగా అతిథుల సమక్షంలో పెళ్లి అంగరంగవైభవంగా జరిగింది .
భోజనాల తరువాత రిసెప్షన్ జరుగుతోంది . ఇందూ ప్రక్కనే నిలబడి బంధువులను స్టేజీమీదకు ఆహ్వానిస్తున్న అక్కయ్య వడివడిగా కిందకువెళ్లి వాంతి చేసుకుంది .
అక్కయ్యా - కోడలూ - తల్లీ ....... అంటూ ఇందూతోపాటు అందరూ కంగారుపడుతూ వెళ్లి చెవులు మూశారు - నీళ్లు అందించారు - అక్కయ్యా అక్కయ్యా ....... ఏమైంది ఇప్పుడు ok కదా అని సోఫాలో కూర్చోబెట్టారు - శివ మరింత కంగారుపడుతూ అమ్మా ....... RMP ను పిలుచుకునివచ్చేదా ? .
అత్తయ్యగారు : తొందరగా వెళ్లు నాన్నా ........

ఆగండర్రా ....... పెళ్ళై మూడు నెలలు పైనే అయ్యింది కదా అవి ఆ వాంతులే అయ్యుంటాయి - అమ్మాయి కూడా సిగ్గుపడుతోంది ఒసేయ్ నాగాంబ ఎందుకు కంగారు - మరీ కోడళ్లు అంటే ఇంత ప్రేమ అయితే ఇలాఏ ఉంటుంది అని చేతిని - పొత్తి కడుపును తాకి ఆ సంతోషమే అమ్మాయీ ...... నువ్వు తల్లివి కాబోతున్నావు - ఒసేయ్ నాగాంబ నువ్వు నానమ్మ కాబోతున్నావు , ఎంత అదృష్టవంతురాలివే నాగాంబ నువ్వు పెళ్లి ఆగకుండా ఇంటి పరువును కాపాడిన చిన్నకోడలు - ఆ సంతోషం మరిచేంతలో చిన్నకోడలిని ఇంటికి తీసుకొచ్చే పెళ్లిలోనే ఇంటికి వారసుడో వారసురాలో ఇస్తున్న పెద్ద కోడలు - సంతోషమంతా నీ ఇంటిలోనే ఉంచుకున్నావుకదే కోడళ్ల రూపంలో ..........
అత్తయ్యగారు : ఎంత గొప్ప శుభవార్త చెప్పావు పెద్దమ్మా అంటూ మెడలోని హారాన్ని ఇవ్వడమే కాకుండా కౌగిలించుకుని మురిసిపోతున్నారు - నాన్నా శివా .......... పెద్దమ్మ ఇంటికి అవసరమైన సరుకులన్నింటినీ పంపించు ........
పెద్దమ్మ : చాలా సంతోషమే నాగాంబ , ఈ ఆనందం ఎల్లప్పుడూ ఉండాలి అని దీవించి వెళ్లారు .

ఇందు : అక్కయ్యా ........ అంటూ కౌగిలించుకోబోయి వద్దు వద్దు , ముందు బావగారు అని పిలుచుకునివెళ్లి శివ గుండెలపైకి చేర్చింది .
శివ : థాంక్స్ ఇందూ ....... , ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు soooooo మచ్ శ్రీమతీ - ఎంత ఆనందం కలుగుతోందో మాటల్లో చెప్పలేను తెలుసా - పైకెత్తి చుట్టూ తిప్పాలని ఉంది కానీ నాకు సిగ్గు అని నుదుటిపై ముద్దుపెట్టాడు . ఇందూ ........ ఇక మీ ఇష్టం .
ఇందు : బావగారూ ....... మేము ఎత్తుతాము కదా అని ఫ్రెండ్స్ ను పిలిచి జాగ్రత్తగా పైకెత్తి సంతోషాలను పంచుకుంది . కిందకుదించి లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ........ , ఈ శుభవార్త విన్నాక నాకే మా అక్కయ్య బుగ్గలను కొరికెయ్యాలన్నంత సంతోషం వేస్తోంది ఇక బావగారి పరిస్థితి ఏమిటో అని నవ్వుకుని ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... అంటూ ముద్దులతో ముంచెత్తింది . చూసి అమ్మ - చారు అంటీతోపాటు ఉప్పొంగిపోతున్న అత్తయ్యగారి దగ్గరకు తీసుకెళ్లింది.
జానకి : అత్తయ్యగారూ ....... అంటూ పాదాలను స్పృశించబోతే .......
అత్తయ్యగారు ఆపి ఆనందబాస్పాలతో కౌగిలించుకుని లవ్ యు తల్లీ అని నుదుటిపై ముద్దుపెట్టి , బుజ్జికోడలా అంటూ పిలిచి పెద్దమ్మ చెప్పినట్లు మన ఇంటిని ఆనందాలతో నింపేశారు నా బంగారు కోడళ్లు అని ఇద్దరినీ తనివితీరా కౌగిలిలోకి తీసుకుని మురిసిపోతున్నారు .
జానకి : చెల్లి మన ఇంటికి వచ్చే రోజు మరొకరిని కూడా తీసుకొచ్చింది అత్తయ్యగారూ .......
అత్తయ్యగారు : ఈ రోజును నా ఊపిరి ఉన్నంతవరకూ మరిచిపోను కోడళ్ళూ , లవ్ యు ........ , నాన్నా శివా ........ చాలా చాలా సంతోషం , రేపే సిటీకి వెళ్లి డాక్టర్ ను కలవాలి ఏమి తినాలి ఎలా ఉండాలి అన్నీ తెలుసుకో , ఇక నా కోడలు ఎటువంటి పనీ చెయ్యకూడదు ........
ఇందు : నేను వచ్చేసాను కదా అత్తయ్యగారూ ........ , అన్నీ పనులూ నేనే చేస్తాను.
అత్తయ్యగారు : ఇంకేమైనా ఉందా ....... , నా బుజ్జికోడలితో సున్నితమైన చేతులతో పనులు చేయిస్తానా ........ ఇంటి నిండా పనిమనుషులను పెట్టనూ ....., కోడళ్ళూ ........ అమ్మానాన్నలు ఆశతో ఎదురుచూస్తున్నారు వెళ్ళండి - నాన్నా శివా ..... కేక్ ఆర్డర్ చేశావా ? రెండు తెప్పించు .
అత్తయ్యగారి బుగ్గలపై ముద్దులుపెట్టి అమ్మా అంటూ వెళ్లి తల్లి గుండెలపైకి చేరారు అక్కాచెల్లెళ్ళు .
చాలా సంతోషం తల్లులూ ....... ఒకదానితరువాత మరొక ఆనందం అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు .
మురళి : కంగ్రాట్స్ వదినా ........
ఇందు : అక్కయ్య ఆనందం చూసి థాంక్స్ మురళీ గారూ అంటూ మురళి గుండెలపైకి చేరబోతే ........ ,
మమ్మీ ........ బాగా అలసిపోయాను ఇక ఇంటికి వెళతాను అని ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు మురళి .
ఇందు : ok అనుకుని అక్కయ్య దగ్గరికి చేరింది .
బంధువులు - ఊరి ముత్తైదువులంతా అత్తయ్యగారికి అభినందనలు తెలపడం చూసి శిఖరం చేరినట్లు కోడళ్ల వైపు చూసి మురిసిపోతున్నారు . కోడళ్ళూ ....... వెళదాము , ఇంటికివెళ్లి రెండుమూడుసార్లైనా దిష్టి తీయాలి , నా కోడళ్ల ఫ్రెండ్స్ ...... మీవాళ్ళతోపాటు ఇప్పుడే వెళ్లిపోకండి మీకోసం ఒక బస్ ఉంచుతాములే , ఉంటారుకదా ........
ఫ్రెండ్స్ : మా ఫ్రెండ్స్ తో సంబరాలు చేసుకుని గానీ ఊరికి వెళ్ళము అంటీ , మీరిచ్చిన మాట ........
అత్తయ్యగారు : ఆ ఆ ........ , కోడళ్ళూ ....... మీ అమ్మానాన్నలతోపాటు రండి .
అక్కాచెల్లెళ్ళు : ఊహూ ....... ఇకనుండీ మాకు అన్నీ మీరేనని అమ్మ చెప్పింది అని అత్తయ్యగారిని చేరారు .
అత్తయ్యగారు : లవ్ యు వదినగారూ ....... , మనమంతా ఒక కారులో వెళదాము.
ఇందు : అత్తయ్యగారూ ....... బావగారిని ఒకసారి చూడండి పాపం .
అత్తయ్యగారు : ok ok , వెళ్లు జానకీ ...... ఆలస్యమైనా పర్లేదు నెమ్మదిగా రండి - నాన్నా జాగ్రత్త .
శివ : అలాగే అమ్మా , థాంక్స్ ఇందూ అంటూ జానకిని కౌగిలిలోకి తీసుకుని ముద్దుపెట్టి కారులోకి చేరి వెనుకే నెమ్మదిగా వచ్చారు .

గుమ్మం దగ్గరే అమ్మ - చారు అంటీ - నమ్మకమైన పనిమనిషి ముగ్గురూ ఒకరితరువాతమరొకరు ఇద్దరు కోడళ్లకూ దిష్టి తీసి అత్తయ్యగారి దగ్గరకు చేర్చారు.
అత్తయ్యగారు : కోడళ్ళూ ........ పైన పెద్దగదిలో - ప్రక్కనే ఉన్న గదులలో మీ ఫ్రెండ్స్ తోపాటు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి సంబరానికి పిలుస్తాను .
అలాగే అత్తయ్యగారూ అని ఫ్రెండ్స్ తోపాటు పైకివెళ్ళారు .
ఇందు : ఫ్రెండ్స్ - అక్కయ్యలూ ....... ముందు మీరు ఫ్రెష్ అవ్వండి అని అక్కయ్యను సోఫాలో కూర్చోబెట్టి బుగ్గలపై ముద్దులుపెట్టి ఎదురుగా మోకాళ్లపై కూర్చుంది .
జానకి : అందమైన నవ్వులతో చెల్లీ ........
ఇందు : ష్ ష్ అక్కయ్యా ........ , మన బిడ్డను పలకరించనివ్వు అని చీరను ప్రక్కకు జరిపి , నా పెళ్లిరోజునే ఈ అమ్మను విష్ చెయ్యడానికి వచ్చావుకదూ ...... , మా అత్తయ్యగారికి మాకు మరిన్ని సంతోషాలు పంచావు తెలుసా ...... లవ్ యు లవ్ యు sooooo మచ్ అని కడుపుపై ప్రాణమైన ముద్దుపెట్టి , బుగ్గను తాకించి హత్తుకుంది .
జానకి : తియ్యదనంతో నవ్వుకుని చెల్లి బుగ్గపై ముద్దుపెట్టి చెల్లిపై వాలింది .
ఫ్రెండ్స్ : బ్యూటిఫుల్ - లవ్లీ ........ అంటూ ఫోటోలు తీసి ఆనందించారు .
ఇందు : డోంట్ డిస్టర్బ్ , మా బుజ్జాయితో మాట్లాడుతున్నాను .
ఫ్రెండ్స్ : sorry sorry అంటూ పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యి పైన ఉన్న గదులలో ఫ్రెష్ అవ్వడానికి వెళ్లారు .

జానకి : చెల్లీ ....... నీ ముద్దుకు - ప్రేమకు - ప్రియమైన ముద్దు మాటలకు మధురమైన కదలికలు ....... అని పులకించిపోతున్నారు .
ఇందు : అవునా అక్కయ్యా ....... , నేనంటే ఇష్టమే అన్నమాట అని ప్చ్ ప్చ్ ప్చ్ ..... ముద్దులు కురిపించింది .
జానకి : మళ్లీ మళ్లీ yes yes చెల్లీ ........ అంటూ ఆనందబాస్పాలతో కౌగిలించుకున్నారు .
అంతలో అమ్మ లోపలికివచ్చి ఇద్దరికీ పాలు అందించి ఆ ఆనందాలను చూసి నుదుటిపై ముద్దులుపెట్టి ప్రక్కనే కూర్చున్నారు .
అక్కాచెల్లెళ్ళు : ఫ్రెండ్స్ ....... తాగండి .
ఫ్రెండ్స్ : పెళ్లిచేసుకుని ఒకరు - పెళ్ళిపనులలో మరొకరు బాగా అలసిపోయారు మీరు తాగండి మేము కిందకువెళ్లి తాగుతాము .
అమ్మ : నా తల్లులు చూస్తుండగానే అమ్మతనాన్ని పొందుతున్నారు అని అమితమైన ఆనందంతో జానకి కడుపుని స్పృశించి , తల్లులూ ....... కింద స్నాక్స్ తోపాటు రెడీ చేశారు రండి వెళదాము అని రెడీ అయినవాళ్లను పిలుచుకునివెళ్లారు .
ఫ్రెండ్స్ : ఒసేయ్ ....... మేమంతా రెడీ మిగిలినది మీరే .......
అక్కాచెల్లెళ్ళు ఒకరికొకరు పాలు తాగించుకున్నారు .
ఇందు : ఈ క్షణo నుండీ అత్తయ్యగారు కాకుండా ఇద్దరిని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవాలి - విటమిన్ ప్రోటీన్ ఫుడ్ తినిపించాలి - ఇక్కడ వెచ్చగా పెరుగుతున్న బుజ్జాయితో రోజూ మాట్లాడాలి అని కడుపుపై ముద్దుపెట్టింది .
జానకి : లవ్ యు sooooo మచ్ చెల్లీ ....... , ఏ అక్కకూ లేని అదృష్టం అని సంతోషంతో చెల్లి నుదుటిపై ముద్దుపెట్టింది .
అత్తయ్యగారి - అమ్మ ఆనందం చూడాలి అని వేరువేరుగదులలో ఒకేసారి ఫ్రెష్ అయ్యి కొత్త చీరలలోకి మారి కిందకువచ్చి సోఫాలలో అత్తయ్యగారితోపాటు స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్న ఫ్రెండ్స్ దగ్గరకు చేరారు .
అటూ ఇటూ తిరుగుతున్న శివను చూసి నవ్వుకుని , బావగారూ ........ మా చేతనైనంత చేసాము కదా , నైట్ వరకూ ఆగండి రాత్రంతా మా అక్కయ్య ...... మీ గుండెలపైనుండి ప్రక్కకు వెల్లదు .
సిగ్గుపడుతూ తుర్రుమన్నాడు .

ఫ్రెండ్స్ : ఒసేయ్ ఇందూ ....... నువ్వూ సిగ్గుపడే సమయం ఆసన్నమయ్యిందిలే , అవును అంటీ శోభనం ఎప్పుడు ? అని అడిగారు . ఆ మాటకు అత్తయ్యగారివైపు ఆశ - అయోమయంతో చూస్తున్న ఇందూని గిలిగింతలుపెడుతూ ఆటపట్టించారు .
ఇందూ పెదాలపై చిరునవ్వులకు బదులు కళ్ళల్లో చెమ్మ చేరడం చూసి , బుజ్జికోడలా ....... అంటూ రెండుచేతులతో ఆహ్వానించి ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు అత్తయ్యగారు . నేనున్నాను కదా ...... - పెళ్లికి ఒప్పించడం కోసం నీ భర్త కండిషన్స్ కు ఒప్పుకున్నట్లు నటించాను , తాళి కట్టి ఈ ఇంటికి కోడలిగా తీసుకొచ్చాడుకదా పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం చూసి శోభనం ఏర్పాట్లుచేయిస్తాను - ఒకవేళ ఈరోజే మంచి ముహూర్తం ఉంటే నీకు ok కదా పెళ్లిలో అలసిపోలేదు కదా .........
ఇందు : సిగ్గుపడుతోంది ........
జానకి : మీ ఇష్టమే తన ఇష్టం అని చెబుతోంది అత్తయ్యగారూ ........
చారు అంటీ : ఇలాంటి అత్తాకోడళ్లను ఇప్పటివరకూ చూడలేదమ్మా ........ , కోడలి అవసరాలను ముందే తెలుసుకుని తీర్చే అత్తయ్య - అత్తయ్య మాటే వేదంగా ఆచరించే కోడళ్లు .........
అత్తయ్యగారు : నవ్వుకుని , నా బుజ్జికోడలికి ఈరోజే శోభనం ఇష్టమన్నమాట అని కురులపై ముద్దుపెట్టారు .
ఇందు : అక్కయ్య శోభనం కూడా పెళ్లిరోజునే కదా అత్తయ్యగారూ ........
అత్తయ్యగారు : ok ok మరిచిపోయాను కోడళ్ళూ ....... , డబల్ ఫిక్స్ ..... ఈరోజే శోభనం జరగాల్సిందే , పంతులుగారిని ఇప్పుడే కబురుపెడతాను - ఒసేయ్ చారూ ........ ఆ ఏర్పాట్లేవో నువ్వే దగ్గరుండి చూసుకోవాలి .
చారు అంటీ : నీ పెద్ద కోడలికీ నేనే , ఇప్పుడు నీ చిన్న కోడలికీ నేనేనా ....... ? .
అత్తయ్యగారు : నీ మంచి మనసు ప్రతిఫలం చూస్తున్నావు కదే ...... , అందుకు అని జానకి కడుపును స్పృశించింది .
చారు అంటీ : లక్కీ హ్యాండ్ అంటావా ? , అయితే ok ........ అని గర్వపడుతున్నారు .
అక్కాచెల్లెళ్ళు : థాంక్యూ soooooo మచ్ అంటీ .......
అత్తయ్యగారు : అందుకేనే చారూ ........ , నాన్నా శివా ....... అని కేక వేసేంతలో ..........
అమ్మా ........ మీరు చెప్పినట్లుగానే ఏర్పాట్లుచేసాను , బయటకువెళ్లి చూడండి అంతలోపు తమ్ముడిని పిలుచుకునివస్తాను అని కింద ఉన్న గదిలోకివెళ్లాడు .

అత్తయ్యగారు : కోడళ్ళూ - అమ్మాయిలూ ........ రండి అని అందరూ బయటకువచ్చి సర్ప్రైజ్ చెందారు .
కాంపౌండ్ పూలమొక్కలు మధ్యలో చుట్టూ సెలెబ్రేషన్ డెకరేషన్ చేసి రెండు ప్రక్కప్రక్కనే ఉంచిన కేక్స్ ........ ఒకటి పెళ్లి శుభాకాంక్షలు - birthday శుభాకాంక్షలు తెలుపుతోంది మరొకటి ప్రేగ్నన్సీ శుభాకాంక్షలు తెలుపుతోంది .
అక్కాచెల్లెళ్ళు ఆనందం పట్టలేక లవ్ యు soooooo మచ్ అత్తయ్యగారూ అని ప్రేమతో రెండువైపులా హత్తుకున్నారు .
రండి కోడళ్ళూ ....... అని చేతులుపట్టుకుని కేక్స్ దగ్గరికి పిలుచుకునివెళ్లారు అత్తయ్యగారు .
ఫ్రెండ్స్ : థాంక్యూ అంటీ ....... మాటిచ్చినట్లుగానే క్రీమ్ ఎక్కువఉన్న కేక్స్ తెప్పించారు .
ఇందు : అత్తయ్యగారూ ........
అత్తయ్యగారు : ఏమీచెయ్యలేనట్లు చేతులెత్తెయ్యడం చూసి అందరూ నవ్వుకున్నారు - ఎంజాయ్ బుజ్జికోడలా .........
అక్కయ్య చేతిని అందుకుని తప్పించుకోబోతున్న ఇందూని పట్టుకుని అక్కయ్యతోపాటు కేక్స్ ముందుకు చేర్చారు ఫ్రెండ్స్ ........

శివ వచ్చి అమ్మా ....... తమ్ముడు బాగా అలసిపోయినట్లున్నాడు లేపుతుంటే లేవడం లేదు .
ఇందూ తలదించుకోవడం చూసి , రాత్రికి శోభనం కదా మేల్కొని ఉండాల్సివస్తుందని నిద్రపోయిఉంటాడు ఇందూ ........ అని చారు అంటీతోపాటు ఫ్రెండ్స్ అందరూ ఆటపట్టించారు .
ఇందూ పెదాలపై చిలిపినవ్వులు - సిగ్గు పరిమళించడం చూసి నా బంగారు కోడలు అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు అత్తయ్యగారు . వదినగారూ దూరంగా ఉన్నారే అన్నయ్యగారూ మీరుకూడా రండి అని పిలిచి కోడళ్ళూ ....... కానివ్వండి .

ఇందు : బావగారూ ....... ఈ సెలెబ్రేషన్ లో మీ కృషి చాలా ఉంది అక్కయ్యతోపాటు కేక్ కట్ చెయ్యండి .
చారు అంటీ : ఏ కృషినో తెలుసుకదా .......
శివ : తెలుసు అంటీ అని జానకి కడుపుపై ముద్దుపెట్టి సిగ్గుపడుతున్నాడు .
ఫ్రెండ్స్ : కంగ్రాట్స్ బావగారూ ....... అని ముసిముసినవ్వులతో అభినందనలు తెలిపారు .
అమ్మ - అత్తయ్యగారితోపాటు ఇందు , శివతోపాటు జానకి చిరునవ్వులు చిందిస్తూ కేక్స్ కట్ చేయబోతే .........
స్టాప్ స్టాప్ sorry sorry extremely sooooo sorry ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం అని చారు అంటీ ఆపారు . నాగాంబ గారూ తమరికి వారసుడు కావాలా వారసురాలు కావాలా ....... ? .

అత్తయ్యగారు : నా మనసులోని మధురాతి మధురమైన కోరికనే ఆడిగావు చారూ ........ , సింపుల్ అండ్ లవ్లీ ........ , నా ప్రియమైన పెద్దకోడలు ........ వారసురాళ్లను ఇవ్వాలి - నా ప్రాణమైన బుజ్జికోడలు ....... వారసులను ఇవ్వాలి . ఒకరు లేదా ఇద్దరు అనే నియమం లేదు కాబట్టి వారసులు - వారసురాళ్లతో ఇల్లు కళకళలాడుతూ ఉండేలా ఎంతమందిని ఇచ్చినా మిక్కిలి సంతోషమే ........
అక్కాచెల్లెళ్ళు : మీ ఆశీర్వాదం అత్తయ్యగారూ ....... లవ్ యు లవ్ యు .
చారు అంటీ : ఇందులోకూడా పక్షపాతం చూయిస్తున్నారు కదా నాగాంబ గారూ ......... , బుజ్జికోడలంటే మరీ ఇంత ప్రాణమా ? .
అత్తయ్యగారు : ష్ ష్ ....... ఊరుకోవే అని నవ్వుతూనే చారు అంటీ నోటిని మూశారు - చారూ గారూ ........ నాకు వారసులు వారసురాళ్లు ఇద్దరూ సమానమే అని నీకు తెలియదా ........ ? .
జానకి : మా అత్తయ్యగారు ....... చెల్లిని నాకంటే ప్రాణం అన్న ప్రతీసారీ చాలా చాలా ఆనందం వేస్తుంది అంటీ .......
చారు అంటీ : సరిపోయారు ముగ్గురికి ముగ్గురు , సెలెబ్రేషన్స్ ఆపి అందరి కోపానికి గురిఅవ్వడం ఇష్టం లేదు కమాన్ కమాన్ కట్ చెయ్యండి అని నవ్వుతూ చెప్పారు .

అక్కాచెల్లెళ్ళు : అత్తయ్యగారివైపు చూసి - అత్తయ్యగారి అనుమతి తీసుకుని , కట్ చేసి ఇద్దరూ అత్తయ్యగారికే తినిపించారు .
అందరిపై పూలవర్షం కురవడం చూసి wow లవ్ యు శ్రీవారూ ....... అంటూ ప్రేమతో కౌగిలించుకుంది .
నాన్నా శివా ........ సూపర్ అంటూ బుజ్జికోడలికి కేక్ తినిపించి నుదుటిపై ముద్దుపెట్టారు అత్తయ్యగారు .
ఇందు : లవ్ యు అత్తయ్యగా ........
మాట కూడా పూర్తి కాకముందే ఫ్రెండ్స్ చుట్టుముట్టి అక్కాచెల్లెళ్ల ముఖాలను క్రీమ్ తో పూసేశారు .
అక్కాచెల్లెళ్ళు : అత్తయ్యగారూ ........
అత్తయ్య గారు : ఎంజాయ్ కోడళ్ళూ ....... అని సెలెబ్రేషన్స్ నుండి దూరం వచ్చారు .
అక్కాచెలెళ్లు : ఫ్రెండ్స్ ....... అంటూ రెండు చేతులతో కేక్ అందుకుని దొరికిన వాళ్లకు దొరికినట్లుగా పూస్తున్నారు చిరునవ్వులు చిందిస్తూ .........
కాంపౌండ్ మొత్తం సంతోషపు కేరింతలతో కోలాహలంగా మారడం చూసి అత్తయ్యగారు - అమ్మ - చారు అంటీ వాళ్ళు ........ ఎంజాయ్ చేస్తున్నారు .
నిమిషాలలో అందరి ముఖాలూ క్రీమ్ మాస్క్ లా మారిపోయాయి - మొబైల్స్ తీసి సెల్ఫీలు తీసుకుని కౌగిలించుకున్నారు .

ఫ్రెండ్స్ : జానకీ - ఇందూ ....... అంటీ వాళ్లను వదిలెయ్యడం భావ్యం కాదు వెళ్ళండి మీరే పూయాలి అని క్రీమ్ చేతులకు పూసారు .
అక్కాచెల్లెళ్ళు వెళ్లి మొదట అత్తయ్యగారి తరువాత అమ్మ - చారు అంటీ బుగ్గలపై చెరొక చేతితో పూసారు .
ఇలాకాదు కోడళ్ళూ - తల్లులూ ........ అంటూ క్రీమ్ మొత్తం అందుకుని ముగ్గురూ ఒకరికొకరు పూసుకున్నారు అందరిలా .......
లవ్ యు అత్తయ్యగారూ - అమ్మా ....... అంటూ కౌగిలించుకుని సెల్ఫీలు తీసుకున్నారు .
ఇందు : అక్కయ్యా ......... ఇక మిగిలినది మీ శ్రీవారు - నాన్నగారు . వద్దు వద్దు అంటున్న ఇద్దరి ముఖాలను క్రీమ్ తో నింపేసి గుండెలపైకి చేరారు .
నాన్నగారు : తల్లులూ ....... శుభాకాంక్షలు - ఈ తండ్రికి ఇంతకంటే ఏమి కావాలి అని మురిసిపోతున్నారు .
జానకి : శ్రీవారూ ....... కోపం వచ్చిందా అని బుగ్గపై క్రీమ్ అందుకుని నోటిలోకి తీసుకుంది .
శివ : ఇన్ని సంతోషాలను పంచిన నా శ్రీమతిపైననా ....... , ఎప్పటికీ రాదు లవ్ యు జానకీ అని కురులపై ముద్దుపెట్టాడు .
జానకి : అదేదో పెదాలపై పెట్టొచ్చుకదా ........ , ఇంత అమాయకులైతే ఎలా చెప్పండి - మూడు నెలల్లో తల్లిని చేశారు .
శివ : నైట్ మన గదిలోకి వెళ్ళాక ఎక్కడ ముద్దులుపెట్టాలో నేర్పిస్తే నేర్చుకుంటాను .
జానకి : తొలి రాత్రీ ఇవే మాటలు - ఇప్పటికీ ఇవే మాటలు ....... , జీవితాంతం నేర్పిస్తూనే ఉండాలన్నమాట - అయినా నాకిష్టమే శ్రీవారూ ....... అని గుండెలపై ముద్దుపెట్టి నవ్వుతోంది .

చారు అంటీ : నాగాంబ - అక్కయ్యా ....... పై గదిని శోభనపు గదిలా మార్చాలి కదా , మరిచిపోయారా ........ ? .
అత్తయ్యగారు : శివా నాన్నా శివా ........ కోడలితోపాటు తోటకువెళ్లి , ఎంతమంది పనివాళ్ళను ఆర్రేంజ్ చేస్తావో నీ ఇష్టం గంటలో మన తోటలోని అన్నిరకాల పూలన్నీ తీసుకురావాలి .
జానకి : అలాగే అత్తయ్యగారూ అని సిగ్గుపడుతూ శివ చేతిని పట్టుకుని కారు దగ్గరికి వెళుతూ , నాన్నగారి గుండెలపై ఉన్న ఇందూ బుగ్గపై క్రీమ్ అందుకుని మ్మ్మ్ ....... మీ తమ్ముడికి పండగే అని నవ్వుకుంటూ బయలుదేరారు .

పంతులు గారు రావడం - కాస్త సంసయిస్తూనే రాత్రి 9 గంటలకు శోభనపు ముహూర్తం నిర్ణయించడం జరిగింది .
అత్తయ్యగారు పసిగట్టి వెళ్ళేటప్పుడు బయట కలిశారు .
పంతులు గారు : నాగాంబ గారూ ....... మీ దగ్గర దాచడం సబబు కాదు - మీ అబ్బాయి జాతకంలో ఏదో సమస్య ఉంది , అదేమిటో ఎంత ఆలిలోచించినా తోచడం లేదు .
అత్తయ్యగారు : కంగారుపడుతూ పూజలు - హోమాలు జరిపించాము కదా పంతులు గారూ .......
పంతులుగారు : అవన్నీ మన సంతృప్తి కోసమే కానీ జాతకాలను మార్చడం కుదరదు నాగాంబ గారూ ....... , ఈ ముహూర్తం ఎందుకు నిర్ణయించానంటే సంతానఫల శుభ ముహూర్తం - అందులోనూ మీ కోడలి జాతకం మహాజ్జాతకం దానివలన మీ అబ్బాయి జాతకం మారనూవచ్చు , అంతా మంచే జరగాలని ఆ దేవుళ్లను ప్రార్థిద్దాము అనిచెప్పి వెళ్లారు .

థాంక్స్ ఇందూ ....... అమ్మా దుర్గమ్మా చల్లగా చూడు తల్లీ అని మొక్కుకుని లోపలికివచ్చారు . పనివాళ్ళతో అందరికీ వంటలు చేయిస్తున్నారు . అత్తయ్యగారు ....... అమ్మ - చారు అంటీల సహాయంతో స్వయంగా ఐదారు రకాల స్వీట్స్ వండారు శోభనపు గదిలో ఉంచడం కోసం .
అత్తయ్యగారు ఆర్డర్ వేసినట్లుగానే ట్రాక్టర్ ఫుల్ గా బుట్టలు బుట్టల రకరకాల పూలను , ట్రాక్టర్ సగం మల్లెపూలు - గులాబీ పూలు ఉండటం చూసి ఇందూని ఆటపట్టించారు ఫ్రెండ్స్ ........
గిలిగింతల నుండి తప్పించుకుని అత్తయ్యగారూ అత్తయ్యగారూ ....... అంటూ వంట గదిలోకివెళ్లి వెనుక దాక్కుంది .
ఫ్రెండ్స్ : wow ......... అంటీ స్వీట్స్ ? , మీరే స్వయంగా వండారు అంటే స్పెషల్ ఉంటుంది - ఇందూ శోభనం కోసమే కదా ......... - అంటే మేము తినకూడదన్నమాట .
అత్తయ్యగారు : అవును అమ్మాయిలూ శోభనం కోసమే అని వెనకున్న ఇందూ బుగ్గను చేతితో స్పృశించి ముద్దుపెట్టారు .
ఇందు : అత్తయ్యగారూ ........ సిగ్గేస్తోంది అని ముందుకువచ్చి కౌగిలిలో దాక్కుంది.
అత్తయ్యగారు : మేమూ మొదటిరోజు ఇలా సిగ్గుపడినవాళ్ళమే బుజ్జికోడలా ...... , శోభనపు గదిలోకి అడుగుపెట్టిన తరువాత అమ్మ గుర్తు ఉండదు - ఈ అత్తయ్యగారూ గుర్తు ఉండదు .
భర్త కౌగిలి మాత్రమే అన్నమాట అని ఫ్రెండ్స్ అందరూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
అత్తయ్యగారు : అమ్మాయిలూ ....... శోభనం కోసం కొన్ని స్వీట్స్ ప్రక్కకు తీసాము , మిగిలినవన్నీ మీకోసమే అని ఒక స్వీట్ అందుకుని ఇందూ నోటికి అందించారు .
ఫ్రెండ్స్ : థాంక్స్ అంటీ అని ఒక్కొక్కరూ ఒక్కొక్కటి తీసుకుని తిని మ్మ్మ్ ...... సూపర్ అంటూ పాత్ర మొత్తం ఖాళీ చేసేసారు .
అత్తయ్యగారు : ఖాలీనా ....... , ఈ ఒక్కటైనా తీసుకుని మంచి పనిచేశాను అని నవ్వుకున్నారు . ఇందూ .......
ఇందు : అత్తయ్యగారూ ....... మీరు తినండి , మీరు తింటే నేను - అక్కయ్య తిన్నట్లే .........
చారు అంటీ : ఇందూ ....... ఇప్పటికే మీ అత్తయ్యగారు కొండెక్కి కూర్చున్నారు ఇక ఇంత ప్రేమ చూపిస్తే శిఖరం ఎక్కేస్తుందేమో ........
ఫ్రెండ్స్ : అధికాదు అంటీ ....... శోభనపు గదిలో తన హీరో తినిపిస్తే తినాలని ఆశపడుతోందేమో ........
అత్తయ్యగారు నవ్వుకుని , ఈ స్వీట్ నలుగురమూ తిందాము అని అమ్మకు - చారు అంటీకి పంచి ఇందూకు తినిపించింది .
మ్మ్మ్ మ్మ్మ్ ........ ఇందుకేనా క్షణాలలో స్వీట్స్ అన్నింటినీ ఖాళీ చేసేసారు అని ఫ్రెండ్స్ చేతులపై గిల్లేసింది . అత్తయ్యగారూ ...... మరి అక్కయ్యకు - బావగారికి ? .
అత్తయ్యగారు : అలా అయితే నీ శోభనపు స్వీట్స్ లో తీసి ఇవ్వాలి ఇవ్వనా ? .
ఇందు : అత్తయ్యగారూ .......
అత్తయ్యగారు : ok ok ఇవ్వనులే బుజ్జికోడలా ........ , నువ్వు , నీ హీరో మాత్రమే తినండి .
ఇందు : లేదు లేదు అత్తయ్యగారూ ....... అక్కయ్యకు ? .
అత్తయ్యగారు : నాకు తెలియదా బుజ్జికోడలా ....... , మీ అక్కయ్యకోసం ముందే తీసిపెట్టానులే - నా మనవరాలికి ...... నా చేతి స్వీట్ తినిపించకపోతే ఎలా చెప్పు అని నుదుటిపై ముద్దుపెట్టారు . శోభనపు ముహూర్తం 9 గంటలకే కాబట్టి భోజనాలు త్వరగా చేసేద్దాము . ఇంతకీ జానకి ఎక్కడ ? .
పనిమనిషి : పైన గదిని శుభ్రం చేస్తున్నారు అమ్మగారూ .......
అత్తయ్యగారు : మీరంతా ఏమిచేస్తున్నారు ? .
పనిమనిషి : నా చెల్లి శోభనపు గదిని నేనే శుభ్రం చెయ్యాలని మా అందరినీ పంపించేశారు అమ్మగారూ .......
ఇందు : అత్తయ్యగారూ ....... నేను వెళతాను అంటూ వడివడిగా చేరుకుంది . వెనుకే అందరూ వచ్చారు . అక్కయ్యా ....... అత్తయ్యగారు చెప్పారుకదా చిన్న పనికూడా చెయ్యకూడదు అని గది బయటకువచ్చారు .
అత్తయ్యగారు : జానకీ ........ మేంఉన్నాము కదా అని కిందకు పిలుచుకునివెళ్లారు.
చారు అంటీ ....... పనిమనుషులతోపాటు శోభనపు గదిలా మారుస్తున్నారు .

అత్తయ్యగారు వెళ్లి మురళిని పిలుచుకునివచ్చి ఇందూ ప్రక్కన కూర్చోబెట్టి వడ్డించారు - భోజనాలు పూర్తయ్యాయి . నాన్నా మురళీ ....... ఫ్రెష్ అయ్యి పైన ఉన్న గదిలోకివెల్లు నీకే అర్థమౌతుంది .
మురళి : అలాగే అమ్మా చాలా పని ఉంది ఏ డిస్టర్బ్ లేకుండా పనిచేసుకుంటాను .
అత్తయ్యగారు : పనీ పనీ పని ....... పైకి వెళితే ఆ ధ్యాసే రాదులే వెళ్లు వెళ్లు అని చిరుకోపంతో పంపించారు . జానకీ ....... నా బుజ్జికోడలిని .......
జానకి : నాకు వదిలెయ్యండి అత్తయ్యగారూ ....... నా గదిలోనే శోభనపు చీరను ఉంచాను .
అమ్మాయిలు : అంటీ ...... ఇక మేము వెళతాము .
ఇందు : కొన్నిరోజులు ఉండొచ్చు కదే ........
ఫ్రెండ్స్ : అంటీ చెప్పినట్లు ఒక్కసారి ఆ గదిలోకి అడుగుపెట్టాక మేము గుర్తుకే రాము , ఇక మెమెందుకు ఇక్కడ ....... , ఎంజాయ్ చెయ్యవే ....... వైజాగ్ వచ్చినప్పుడు కలుద్దాము బై బై అనిచెప్పి బస్ లో బయలుదేరారు .
జానకి : చెల్లీ ....... సమయం దగ్గరపడుతోంది .
ఇందు : పో అక్కయ్యా ...... అని సిగ్గుపడుతూనే అక్కయ్యతోపాటు సంతోషంగా వెళ్లి తలంటు స్నానం చేసి శోభనపు చీరలో రెడీ అయ్యింది .
జానకి ...... నగలతో మరింత అందంగా అలంకరించింది .

శోభనపు అలంకరణ - కురులలో సువాసనలు వెదజల్లుతున్న మల్లెపూలతో గదిలోనుండి బయటకువచ్చిన ఇందూని ........ అత్తయ్యగారు - అమ్మ చూసి మా ధిష్ఠినే తగిలేలా ఉంది ఇందూ - తల్లీ ....... అంటూ సంతోషంతో నుదుటిపై ముద్దులుపెట్టారు - జానకీ ........ సూపర్ .......
ఇందు : అందమైన నవ్వులతో అత్తయ్యగారూ - అమ్మా ....... అంటూ ఆశీర్వాదం తీసుకుంది .
అత్తయ్యగారు : జానకీ - ఒసేయ్ చారూ ........ సమయం దగ్గరపడుతోంది నా బుజ్జికోడలిని తీసుకెళ్లి శోభనపు గదిలోకి వదిలిరండి అని పాల గ్లాస్ అందించారు - బుజ్జికోడలా ....... ఈ పాలతో వెళ్లి మూడు నెలల్లో మీ అక్కయ్యలా పాలిచ్చే తల్లి అర్హతను పొందాలి అని ముసిముసినవ్వులతోనే కిందకువెళ్లారు .
ఇందు : అక్కయ్యా ....... అంటూ అందమైన సిగ్గుతో గుండెలపైకి చేరింది .
జానకి : నా బంగారు చెల్లి అంటూ ముద్దుపెట్టి వెళదామా అంటూ సంతోషంగా పైకి తీసుకెళ్లి పాల గ్లాస్ అందించి , సిగ్గుపడుతూనే ఎంజాయ్ చెయ్యి చెల్లీ అంటూ శోభనపు గదిలోకి వదిలి తలుపులు వేసుకున్నారు .

శోభనపు గదిలోకి అడుగుపెట్టగానే మల్లెపూల సువాసనలకు ఇందూకు మరింత సిగ్గు ముంచుకొచ్చింది . పెదాలపై తియ్యనైన నవ్వులతో వణుకుతున్న చేతులతో పాల గ్లాస్ ను జాగ్రత్తగా పట్టుకుంది - తల దించుకుని కాలి బొటనవేలితో నేలపై సున్నాలు చుడుతోంది .
నిమిషాలు గడుస్తున్నా ........ తన భర్త అడుగులు కనిపించకపోవడంతో సిగ్గుపడుతూనే కొద్దిగా తలపైకెత్తి బెడ్ వైపు చూసింది - బెడ్ పై మురళి లేకపోవడంతో ఓర కంటితో విశాలమైన గది చుట్టూ చూసింది .
ఒక చివరన సోఫాలో కూర్చుని లాప్టాప్ చూస్తున్నాడు మురళి ........ , ఆలస్యమయ్యిందని అలిగినట్లున్నారు కాబోలు అంటూ ముసిముసినవ్వులతో సిగ్గుపడుతూనే వెళ్లి మురళీ గారూ అంటూ పాల గ్లాస్ అందించింది .
థాంక్స్ ...... నిద్రపోయేముందు పాలు తాగడం అలవాటైపోయింది , మమ్మీ పంపించింది కదా అని ఒకచేతితో కీప్యాడ్ పై టైప్ చేస్తూనే తలకూడా ఎత్తకుండా పాల గ్లాస్ అందుకుని చుక్క మిగల్చకుండా మొత్తం తాగేసాడు .
ఆహా మురళీగారూ ....... అనేంతలో గ్లాస్ ఎంప్టీ అయిపోవడం చూసి సైలెంట్ అయిపోయింది ........

మురళి : what ఇందూ గారూ ........
ఇందు : మీరు సగం - నేను సగం తాగాలని అత్తయ్యగారు - అక్కయ్య చెప్పారు .
మురళి : sorry ముందే చెప్పొచ్చుకదా , నాకే అనుకుని మొత్తం తాగేసాను . మీరు వెళ్లి పడుకోండి ఆఫీస్ పని పూర్తిచేసి సోఫాలోనే పడుకుంటాను వెళ్ళండి ........
ఇందు : రెండు అడుగులు బెడ్ వైపు వేసి వెనక్కుతిరిగి అదీ ........ కలిసి .......
మురళి : పెళ్లి హడావిడిలో వారం రోజులు లాప్టాప్ కూడా ఓపెన్ చెయ్యనియ్యలేదు మమ్మీ .......ఆఫీస్ నుండి అర్జెంట్ అని మెయిల్స్ మీద మెయిల్స్ రాత్రంతా వర్క్ చేయాల్సిందే మీరు వెళ్లి పడుకోండి వెళ్ళండి అనిచెప్పడంతో నిరాశతోనే వెళ్లి బెడ్ పై కూర్చుని బెడ్ పై సెక్సీగా అలంకరించిన పూలలో సున్నాలు చుడుతూ భర్త స్పర్శ కోసం ఆశతో ఎదురుచూస్తోంది ప్రతీ శోభనపు పెళ్లికూతురిలానే ........
నిమిషాలు గంటలు గడుస్తున్నా మురళి నుండి మాత్రం ఎటువంటి రియాక్షన్ లేకపోవడం చూసి మరింత నిరాశ చెందింది .
మురళి చెప్పినట్లుగానే పెళ్లి సంబరంలో ఇందూ కూడా అలసిపోయినా కూడా ఏ క్షణమైనా తన భర్త మనసు మార్చుకుని రావచ్చునేమో అనుకుని నిద్ర ముంచుకొస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ తెల్లవారేంతవరకూ ఆశతో ఎదురుచూస్తూనే ఉంది ఇందు .
చెప్పినట్లుగానే మురళి కూడా సూర్యోదయం అయినా కూడా లాప్టాప్ ముందు వర్క్ చేస్తూనే ఉన్నాడు .
Next page: Update 10
Previous page: Update 08