Update 10
ఉదయం 6 గంటలు - 7 గంటలు - 8 గంటలు - 9 గంటలు అయినా మురళి ఇందూవైపు కనీసం కన్నెత్తైనా చూడకుండా వర్క్ చేస్తూనే ఉండటం , ఇందు కూడా తూగుతూనే ఆశతో ఎదురుచూడటం ........
9:10 సమయంలో తలుపు తట్టిన చప్పుడుకు అక్కయ్యా ...... అంటూ ఇందు డోర్ వైపు చూడటం - మురళి లాప్టాప్ ప్రక్కన ఉంచి పరుగునవచ్చి ఇందూకు దూరంగా బెడ్ చివరన కూర్చోవడం చూసి ఆశ్చర్యం అయోమయం కలిగింది .
చెల్లీ ....... అంటూ అక్కయ్య పిలుపు వినిపించగానే , ఇందూ కళ్ళల్లో చెమ్మ చేరింది - అక్కయ్యా .........
జానకి : ముసిముసినవ్వులతో చెల్లీ ........ డిస్టర్బ్ చెయ్యలేదుకదా బెడ్ కాఫీ తీసుకొచ్చాను .
ఇందు : దుఃఖం నిండిన వాయిస్ తో తల దించుకుని కంగారుపడుతున్న మురళి వైపు చూసి లే లేదు అక్కయ్యా ....... వస్తున్నాను అని నిద్రపోకపోవడంతో ఎర్రగా మారిన కళ్ళతోనే పైకిలేచింది .
ఒక్క నిమిషం ఇందూ గారూ అంటూ మురళి కూడా లేచాడు - బెడ్ పై గల పూలను చిందరవందర చేసాడు , సోఫా దగ్గరికి వెళ్లి ఏదో బాటిల్ తీసుకొచ్చి బెడ్ పై పరిచిన దుప్పటికి సరిగ్గా మధ్యలో ఎరుపు రంగు చల్లాడు .
అచ్చు రక్తపు మరకలా ఉండటం చూసి ఏమి జరుగుతోందో తెలియక కదలకుండా చూస్తూ ఆశ్చర్యపోతోంది ఇందు ........
మురళి : ఇందూ గారూ ........ మనం మాట్లాడకున్నట్లుగానే సంవత్సరం పాటు నా గోల్ రీచ్ అయ్యేంతవరకూ శోభనం జరుగకూడదు కదా ....... - కానీ మమ్మీనే ఇదంతా ఆర్రేంజ్ చేసింది - ఇప్పుడు శోభనం జరగలేదని తెలిస్తే మమ్మీ బాధపడు .........
ఇందు : లేదు లేదు అత్తయ్యగారు బాధపడితే నేను - అక్కయ్య తట్టుకోలేము .
మురళి : కదా అని నవ్వుతున్నాడు . మీ అత్తయ్యగారు బాధపడకూడదు అనే ఇలా చేసాను , మీకు అర్ధమయ్యే ఉంటుంది సో ..... మీరు కూడా ఆ బొట్టు - పూలు - చీర నలిగేలా .......... మీరే .......
ఇందూ కళ్ళల్లోనుండి చెమ్మ ...... , మురళీ గారు చెప్పినది కరెక్టే కానీ కనీసం తనే స్వయంగా చెయ్యవచ్చుకదా - శోభనం జరగకపోయినా భర్త స్పర్శ తగిలింది అని సంతోషించేదానిని అని చెమ్మ కాస్తా కన్నీళ్లుగా మారాయి .
హమ్మయ్యా ....... అని బెడ్ పై రాత్రంతా శోభనం లో అలసిపోయినట్లుగా వాలిన మురళికి అటువైపుకు తిరిగి కన్నీళ్ళతో బాధపడుతూనే శోభనం జరగకపోయినా జరిగినట్లుగా బొట్టు - పూలు - చీరను నలుపుకుని డోర్ దగ్గరకు చేరుకుంది .
అక్కయ్యా ...... sorry sorry ఓపెన్ చేస్తున్నాను .
జానకి : పర్లేదు చెల్లీ , ఎంత ఆలస్యమైతే అంత సంతోషం మాకు అని అక్కయ్యతోపాటు ఎవరో ఉన్నట్లు ముసిముసినవ్వులు వినిపించాయి .
ఇందూ కన్నీళ్లు ఆగడం లేదు . వెంటనే కన్నీళ్లను తుడుచుకుని బాధనంతటినీ లోపలే దాచేసుకుని పైకిమాత్రం సిగ్గుపడుతూ - చిరునవ్వులు చిందిస్తూ శోభనం జరిగిన పెళ్లికూతురిలా తలుపు తెరిచింది .
అక్కయ్యతోపాటు అత్తయ్యగారు - అమ్మ - చారు అంటీ ఉన్నారు . ఇందూని మరియు లోపల బెడ్ పై పడుకున్న మురళిని చూడగానే అందరి సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి .
అక్కయ్యా ....... అంటూ బాధతో గుండెలపైకి చేరింది ఇందూ ........
చెల్లి గురించి పూర్తిగా తెలిసిన జానకికి విషయం అర్థమైపోయింది - చెల్లీ ....... అంటూ బాధపడుతూనే కౌగిలించుకుని ఓదార్చింది .
అత్తయ్యగారు బాధపడకూడదని ఇద్దరూ పైకి మాత్రం నవ్వుతున్నారు .
నా బుజ్జికోడలు బంగారం ఆ సిగ్గుని చూస్తుంటేనే తెలియడం లేదూ ......... అని అత్తయ్యగారు బుగ్గలను స్పృశించి మురిసిపోతున్నారు .
చారు అంటీ : నీ మాటలే నిజమయ్యాయే నాగాంబ ........ , శోభనపు మల్లెపూల మత్తులో కంట్రోల్ చేసుకోవడం ఏ మగాడి వల్లా కాదు అని నవ్వుకున్నారు .
జానకి : చెల్లీ ....... వెళ్లి ఫ్రెష్ అవ్వు నా గదిలో టిఫిన్ తినిపిస్తాను అని కళ్ళల్లో చెమ్మతోనే నుదుటిపై ముద్దుపెట్టి అమ్మ చేతిలోని కాఫీ ని అందించింది .
ఇందూకు అర్థమైనట్లు తల ఊపి లోపలికివెళ్లి తలుపు వేసుకుంది .
చారు అంటీ : తన శ్రీవారి నిద్రకు డిస్టర్బ్ కాకుండా డోర్ వేసుకుంది ఎంత ప్రేమ , ఇక మనం ఎందుకు పదండి పదండి నాగాంబ గ్రాండ్ సక్సెస్ అని చిలిపినవ్వులతో కిందకువెళ్లారు .
ఇందూ బెడ్ దగ్గరికివెళ్లి మురళి గారూ కాఫీ ........
రాత్రంతా వర్క్ చెయ్యడం వల్లనేమో బెడ్ పైన వాలగానే నిద్రపట్టేసినట్లుంది అని కాఫీ ను ప్రక్కనే ఉన్న టేబుల్ పై ఉంచింది . పెళ్ళై ఫస్ట్ నైట్ జరగని దూరదృష్టవంతురాలిని ప్రపంచంలో నేనే మొదటి దానిని అనుకుని ఫీల్ అవుతూనే కప్ బోర్డ్ నుండి బట్టలు తీసుకుని బాత్రూమ్లోకివెళ్లి స్నానం చేసివచ్చింది .
మురళి ఇంకా నిద్రపోతూనే ఉండటం చూసి చల్లబడింది కాఫీ కప్ అందుకుని ఫస్ట్ ఫ్లోర్ లోని అక్కయ్య గదికి చేరుకుంది .
చెల్లి రాక కోసమే కళ్ళల్లో చెమ్మతో ఎదురుచూస్తున్న జానకి ఒక్కనిమిషం చెల్లీ ...... బెడ్ పై పడుకున్న శివను ప్రేమతో లేపి , శ్రీవారూ ...... ప్రక్కగధిలో ........
శివ తను తండ్రి కాబోతున్నానన్న సంతోషంలో రాత్రంతా శృంగార సాగరంలో విహరించినట్లు మత్తుకళ్ళతో లేచి ఇందూని చూసి , అలాగే అలాగే శ్రీమతిగారూ ......... లేపినందుకు కూడా థాంక్స్ పొలంలో మందులు కట్టించాలని ఏర్పాట్లుచేసాను - ప్రక్క గదిలోనే రెడీ అయ్యి కింద తిని వెళతాను - మీ ప్రియమైన అక్కాచెల్లెళ్లను ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యను అని దుప్పటిని చుట్టుకునే బయటకువెళ్లాడు .
జానకి : చెల్లీ ....... అంటూ వెనుకకు తిరగడం ఆలస్యం , నిద్ర మైకం కమ్మేసినట్లు గుండెలపైకి చేరిపోయింది ఇందు ........
చెల్లీ చెల్లీ ....... జాగ్రత్త .......
ఇందు : అక్కయ్యా ........ రాత్రంతా రాత్ర ........
జానకి : పైన నా చెల్లిని కౌగిలించుకోగానే అర్థమైపోయింది చెల్లీ ........ అంటూ నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్లి బెడ్ పై పడుకోబెట్టినది .
ఇందు : అక్క .....య్యా ....... నీ ఒడిలో ........
జానకి : నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , బెడ్ పై కూర్చుని నెమ్మదిగా చెల్లి తలను ఒడిలో పడుకోబెట్టుకుని జోకొడుతోంది . చెల్లీ ....... టిఫిన్ తిని ఎంతసేపైనా పడుకోరా ........
ఇందు : ఆకలిగా లేదు అక్కయ్యా ........ అని కడుపులో పెరుగుతున్న బుజ్జితల్లికి ముద్దుపెట్టింది , అత్తయ్యగారికి ఫస్ట్ టైం అపద్ధం చెప్పాను అక్కయ్యా - వారి కోరికను కూడా తీర్చలేను - శోభనం గురించి బాధలేదు అక్కయ్యా ........ అత్తయ్యగారికి ఇలా చెప్పాల్సివస్తుందని , విషయం తెలిస్తే మురళి గారిపై కోపం కంటే బాధ ఎక్కువ అని కన్నీళ్లను తుడుచుకుంటోంది .
జానకి : కళ్ళల్లో చెమ్మతో ....... , ఊరుకో చెల్లీ ....... ఎవరివలన అపద్ధం చెప్పాల్సివచ్చిందో అత్తయ్యగారు ఎప్పటికైనా అర్థం చేసుకుంటారు - నా చెల్లికి తోడుగా నేనూ ఉంటాను కదా ..........
ఇందు : లవ్ యు అక్కయ్యా ........ అని చేతిని అందుకుని గుండెలపై హత్తుకుంది - అక్కయ్యా ........ అత్తయ్యగారు అమ్మ నువ్వు తిన్నారా ? .
జానకి : నిన్ను చూసిన ఆనందంలో కడుపునిండా తిన్నారు చెల్లీ ........ నువ్వు తినకుండా నేను తినగలనా ...... ? .
ఇందు : అక్కయ్యా ....... చెప్పాను కదా నీకోసం కాకపోయినా మన బుజ్జితల్లికోసం కడుపునిండా తినాలని అంటూ చేతిపై ప్రేమతో కొరికింది - sorry లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ........ నా వల్లనే ఇదంతా ఇదే లాస్ట్ టైం , ఉండు క్షణంలో వేడివేడిగా తీసుకొస్తాను లని లేవబోయింది .
జానకి : చెల్లీ ....... నిద్రమబ్బులో నిన్ను పంపగలనా , మొదటే మెట్లు దిగాలి ఒక్క నిమిషం దిండుపై పడుకో ఇద్దరికి వడ్డించుకునివస్తాను .
ఇందు : మనిద్దరికేనా అని తియ్యనికోపంతో చూస్తోంది .
జానకి : లవ్ యు లవ్ యు లవ్ యు ముగ్గురికి ముగ్గురికి అని సంతోషంతో నవ్వుకుంది బుజ్జితల్లివైపు చూస్తూ .........
ఇందు : బుజ్జితల్లీ ........ మీ అమ్మ మరిచిపోయినా ఈ అమ్మ మరిచిపోదులే అని ప్రాణంలా ముద్దుపెట్టింది .
జానకి : కడుపులో ఉండగానే వెచ్చగా చూసుకోవడానికి ఒక అమ్మ - ప్రాణంలా చూసుకునే బుజ్జి అమ్మ ........ అదృష్టవంతురాలు , చెల్లీ ....... వెళ్ళిరానా ? .
ఇందు : ఊహూ ....... నా బుజ్జితల్లిని వెచ్చగా చూసుకునే అమ్మను మెట్లపై నడిపిస్తానా - నా బుజ్జితల్లి ఎప్పుడూ నా ప్రక్కనే ఉండాలి అని పొత్తికడుపు వైపుకు తిరిగి చేతులతో ప్రాణంలా చుట్టేసి పెదాలను తాకించి మురిసిపోతోంది .
జానకి : చెల్లీ ....... గిలిగింతలు అని నుదుటిపై ముద్దుపెట్టి , మరి టిఫిన్ ఎవరు తీసుకొస్తారు చెల్లీ ........
ఇందు : మన బుజ్జితల్లిని ఎలా అయితే ప్రాణంలా చూసుకుంటున్నామో - మనల్ని ఇంతవరకూ ప్రాణంలా పెంచి స్వర్గం లాంటి ఈ ఇంటికి చేర్చిన అమ్మ ఉందిగా అని నవ్వుకున్నారు .
జానకి : అమ్మ ఉందిగా అని మొబైల్ అందుకుని కాల్ చేసి చెప్పింది .
అమ్మ : వేడి వేడి పూరీలు వేసుకొస్తాను తల్లులూ ....... 10 నిమిషాలు ......
అక్కాచెల్లెళ్ళు : లవ్ యు లవ్ యు అమ్మా - మమ్మీ ........ అని సంతోషంగా నవ్వుకున్నారు . అక్కయ్యా ....... నిన్న చెప్పాను మళ్లీ ఇప్పుడు చెబుతున్నాను ఆరోగ్యం విషయంలో మాత్రం నేను ప్రక్కన ఉన్నా లేకున్నా సమయానికి .......
జానకి : అలాగే బుజ్జి డాక్టర్ గారూ .......
ఇందు : బుజ్జితల్లీ ....... ఇలా గట్టిగా చెబితేనేగానీ మీ అమ్మ మాట వినదు . బుజ్జితల్లీ ........ తెల్లవారుఘామునే లేచే మీ డాడీ , నువ్వు కడుపున పడ్డావాని తెలియగానే మీ అమ్మను స్వర్గానికి తీసుకెళ్లినట్లున్నారు రాత్రి కదూ ........ - అక్కయ్యా ....... అవునని బదులిస్తోంది మన బుజ్జితల్లి .......
జానకి : పో చెల్లీ ....... నాకు సిగ్గేస్తోంది అని రెండుచేతులతో ముఖాన్ని కప్పేసుకుంది .
ఇందు : బుజ్జితల్లీ ....... మీ అమ్మ సిగ్గుపడుతోంది అని ముద్దులతో మాట్లాడుకుంటూ , అక్కయ్యా ....... అంటూ ముఖం పై చేతులను తీసింది - నిజమే అక్కయ్య కళ్ళల్లో చెమ్మ ........ - అక్కయ్యా ....... నా గురించే కదా లవ్ యు అక్కయ్యా ........ - మురళి గారు మాటపై నిలబడేవారిలా ఉన్నారు సంవత్సరం పాటు తప్పదు - నేనెప్పుడో సముదాయించుకున్నాను నువ్వు బాధపడకు బుజ్జితల్లికి మంచిదికాదు అని కన్నీళ్లను తుడిచి బుజ్జితల్లికి ముద్దుపెట్టింది .
జానకి : జన్మజన్మలూ ........ మనం ఇలా అక్కాచెల్లెళ్లుగానే పుట్టాలి చెల్లీ అని బుగ్గపై ముద్దుపెట్టింది .
ఇందు: నో నో నో అక్కయ్యా ........ ప్రతీసారీ అమ్మకు పుట్టిన అక్కాచెల్లెళ్లుగానే కాదు , ఒక సారి అత్తయ్యగారు - అమ్మ - నేను ....... నా ప్రాణమైన అక్కయ్య కడుపున మరొక జన్మలో అత్తయ్యగారు - నా అక్కయ్య - అమ్మ ....... నా కడుపున ...........
జానకి : బ్యూటిఫుల్ లవ్లీ చెల్లీ ........ , అమ్మా దుర్గమ్మా ....... చెల్లి కోరిక తీరేలా చూడు .
అంతలో చారు అంటీ చిరుకోపంతో వడివడిగా లోపలికివచ్చి మీ అత్తయ్యగారు మాత్రమేనా అని సుతిమెత్తగా ఇందూ బుగ్గను గిల్లేసి బుంగమూతితో బెడ్ చివరన కూర్చున్నారు .
అత్తయ్యగారు - అమ్మ చేతులలో వంట పాత్రలు పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ వచ్చి , నా కోడళ్లు బంగారం - నేనంటే ప్రాణం అంటూ అమితమైన ఆనందాలతో ఇద్దరి నుదుటిపై ముద్దులుపెట్టారు .
ఇందు : అత్తయ్యగారూ ....... అంటూ లేచి కూర్చుంది .
అత్తయ్యగారు : బుజ్జికొడలూ ....... అక్కయ్య ఒడిలో నా బుజ్జిమనవరాలికి ముద్దులుపెడుతూ హాయిగా పడుకో ........ మేము తినిపిస్తాము కదా అని వడ్డించుకుని అమ్మతోపాటు ఇద్దరూ తినిపించారు .
ఇందు : అంటీ ....... మీరు తినిపించారా ...... ? .
చారు అంటీ : మీకు మీ అత్తయ్యగారు ఒక్కరు చాలుకదా ........
అత్తయ్యగారు : అవును నిజమేనే , నీ కొడుకుకు పెళ్లి అయ్యినప్పుడు కోడలితో నువ్వు చేసినవన్నీ గుర్తులేదా ........ , నేను ప్రతీకారం తీర్చుకోకపోయినా నా కోడళ్లు నా కోరికను తీర్చారు - గుర్తుందా అప్పుడు నేనూ ఇలానే బుంగమూతిపెట్టుకుని శపథం చేసాను .
చారు అంటీ : ఏవీ మరిచిపోలేదన్నమాట అని ప్లేట్ అందుకుని ముసిముసినవ్వులతో గుర్తుచేసుకుని నవ్వుతున్నారు .
అత్తయ్యగారు : మరిచిపోతే మనం ఆడవాళ్ళం ఎలా అవుతామే , ఈర్ష్య అసూయలు పుట్టినవే మనకోసం అని నవ్వుకున్నారు .
మమ్మీ మమ్మీ అంటూ తలుపు తట్టిన సౌండ్ వినిపించడంతో చూస్తే మురళి .......
అత్తయ్యగారు : తెరుచుకున్న తలుపును తడుతూ అక్కడే ఆగిపోయావేంటి నాన్నా ........ , ఇక్కడ ఉన్నది నీ పెళ్ళాం - వదిన - అమ్మ - అత్తయ్యగారు - అంటీ నే కదా ........ , అయినా భుజం పై బ్యాగు ఏమిటి అని ప్లేట్ ను అంటీకి అందించి మురళి దగ్గరకు వెళ్ళింది .
మురళి : పెళ్లి - శోభనం అయిపోయింది కదమ్మా ....... , ఆఫీస్ లో చాలా పని ఉంది - మా మేనేజర్ గారు కూడా రమ్మని కాల్స్ చేస్తున్నారు - బెంగళూరు వెళదామని నిర్ణయించుకున్నాను .
అత్తయ్యగారు : పెళ్ళైన రెండవరోజే ఇలా నన్ను - నా బుజ్జికోడలిని విడగొట్టడం ఏమైనా బాగుందా ....... ?
అక్కయ్య - చారు అంటీ చేతులను గట్టిగా పట్టేసుకుంది వెళ్లడం ఇష్టం లేదు అన్నట్లు ........
మురళి : నో నో నో మమ్మీ ....... నేను మాత్రమే వెళుతున్నాను .
అత్తయ్యగారు : పెళ్లికి కూడా సెలవులు ఇవ్వకుండా రమ్మని పిలుస్తున్న ఆ మేనేజర్ ఎవరో చెప్పు వాడి సంగతి చూస్తాను - అయినా అర్జెంట్ అర్జెంట్ అంటూ ఇబ్బందిపెట్టే జాబ్ మనకెందుకు నాన్నా ....... దర్జాగా కూర్చుని తిన్నా తరగనంత ఆస్తిని ఎంజాయ్ చేస్తూ - నా బుజ్జికోడలిని సంతోషపెడుతూ ఇక్కడే ఉండిపోవచ్చు కదా - కావాలంటే వైజాగ్ లో నీకిష్టమైన కంపెనీ , ఆఫీస్ మొదలుపెట్టు , ఆస్తిమొత్తం ఇవ్వమన్నా ఇచ్చేస్తాడు మీ అన్నయ్య ......... , జానకీ ok కదా ........
జానకి : అంతకంటే సంతోషం ఏముంటుంది అత్తయ్యగారూ ......... , ఎక్కడో దూరంగా ఒకరి కింద పనిచేసే బదులు ఇక్కడ కంపెనీ ప్రారంభించి యువతకు ఉపాధి కలిగిస్తే చాలా చాలా బాగుంటుంది .
అక్కయ్యను చుట్టేసింది ఇందూ సతోషంతో .......
అత్తయ్యగారు : ఎంత మంచిమాట చెప్పావు జానకీ , అందుకే నా కోడళ్లు అల్వేస్ బెస్ట్ - నాన్నా ....... మీ వదిన సలహా గురించి ఒకసారి ఆలోచించు .
మురళి : సూపర్ మమ్మీ ....... , కానీ ఇప్పటికే అక్కడ సగానికి పైనేపనులు పూర్తయ్యాయి - కొన్నిరోజులు కష్టపడితే చాలు , ఇక్కడయితే మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాలి - sorry వదినగారూ ........ , మమ్మీ ....... బెంగళూరులో జాబ్ అంటే నువ్వే కదా చాలా ఆనందించావు ఇప్పుడు మానెయ్యమంటున్నావు .
అత్తయ్యగారు : అప్పుడు వేరు ఇప్పుడు వేరు , అప్పుడు ప్రెస్టీజ్ ....... - ఇప్పుడు నా కోడళ్ల సంతోషం కంటే మరేమిటీ వద్దు - please please నాన్నా ........
మురళి : అర్థం చేసుకో మమ్మీ .........
చారు అంటీ : ఎక్కడికి వెళ్ళేది మురళీ ....... , మీ అన్నయ్య ...... మీ హనీమూన్ కోసం ఫారిన్ లొకేషన్స్ చూస్తుంటే నువ్వు ఏకంగా భార్యనే వదిలి బెంగళూరు వెళతాను అంటావేమిటి ? , కనీసం నెలరోజులైనా కలిసి ఉండాలి కదా .......
మురళి : అంటీ మీరు కూడానా ...... ?
అత్తయ్యగారు : నాన్నా ....... పెద్దలు చెప్పినట్లు వినాలి - నెలరోజులు ఉండాల్సిందే - హనీమూన్ కు ఎక్కడికి వెళ్లాలని ఆశపడుతున్నావో నువ్వే చెప్పు ........
మురళి : please please మమ్మీ ....... నేను ఇప్పుడుకానీ వెళ్లకపోతే , నేను కన్న కలలన్నీ మరొకరి సొంతం అవుతాయి - అలాకానీ జరిగితే తట్టుకోవడం నావల్ల కాదు - నేను జీరో అయిపోతాను మమ్మీ .........
అత్తయ్యగారు : నాన్నా ....... నువ్వెప్పుడూ మా హీరోనే , నువ్వు కోరుకున్నట్లుగానే వెలుదువులే కానీ మూడురాత్రుల తరువాతనే ........
మురళి : మమ్మీ ........
చారు అంటీ : సరిగ్గా చెప్పావు నాగాంబ , మురళీ ........ మూడు రాత్రులు కాకుండానే నాగాంబ తన కొడుకును డబ్బు సంపాదించడానికి పంపించింది అని అనుకోకుండా ఉండాలంటే అమ్మ చెప్పినట్లు చెయ్యి .
మురళి : అలాగే అంటీ ...... మూడు రాత్రులు పూర్తవగానే ఉదయమే వెళ్లిపోతాను.
ఇందు : మురళీ గారూ ....... టిఫిన్ వడ్డిస్తాను .
మురళి : నో నో నో ఇందూ గారూ ....... , వంటింట్లోకి వెళ్లి కడుపునిండా తిన్నాను మీరు ఎంజాయ్ చెయ్యండి - తోటలోకివెళ్లి work from home అయినా చేసుకుంటాను .
చారు అంటీ : ఎప్పుడూ ఇంతే ఇందూ ....... ఆకలికి ఆగలేడు , వంటింట్లోకి వెళ్లి తినేస్తాడు అని నవ్వుకున్నారు .
ఇందు : అలాగే మురళీ గారూ ...... , కొద్దిసేపటి తరువాత టీ - స్నాక్స్ అక్కడికే తీసుకొస్తాను .
మురళి : మీకెందుకు శ్రమ ........
అత్తయ్యగారు : ఇందూ ....... అక్కయ్య ఒడిలో హాయిగా రెస్ట్ తీసుకో , ఆకలివేస్తే కాల్ చేస్తాడులే , మేము కూడా డిస్టర్బ్ చెయ్యము అని నీళ్లు అందించి బెడ్ పైకి చేరి జోకొట్టారు .
ఇందు : అత్తయ్యగారూ ........
అత్తయ్యగారు : ష్ ష్ .......
అక్కయ్య - అత్తయ్యగారు ప్రాణంలా జోకొట్టడం - బుజ్జితల్లిని హత్తుకోవడంతో క్షణాలలో హాయిగా నిద్రపట్టేసింది ఇందూకు .
ఇందు సడెన్ గా కళ్ళుతెరిచి అక్కయ్యా అక్కయ్యా ........ సిటీకివెళ్లి డాక్టర్ ను కలవమని చెప్పారు కదా అత్తయ్యగారు .
జానకి : లవ్ యు చెల్లీ , వెళ్ళాల్సింది కానీ నువ్వు గట్టిగా చుట్టేసి పడుకున్నావుకదా ఎలా వెళ్లగలను చెప్పు ........
ఇందు : అయ్యో ...... sorry లవ్ యు లవ్ యు అక్కయ్యా , తప్పంతా నాదే అని లెంపలేసుకోబోతే ........
జానకి ఆపి , ప్రాణమైన కోడలివైన నిన్ను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక సిటీలోనే పెద్ద డాక్టర్ మేడం ను మన దగ్గరకే పిలిపించారు అత్తయ్యగారు .
చారు అంటీ : వచ్చి గంటపైనే అయ్యింది ఇందూ ........ , అయినా పడుకున్న నిన్ను వదిలి మీ అక్కయ్య సిటీకి వెళుతుందా చెప్పు ......
ఇందు : లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ...... , కానీ ...... చెప్పానుకదా ......
జానకి : మరిచిపోయాను చెల్లీ ....... ఇదిగో చెయ్యి కొరికేయ్యి అని అక్కాచెల్లెళ్ళు నవ్వుకున్నారు .
ఇందు : డాక్టర్ గారూ ....... తల్లీ - బుజ్జితల్లి perfectly ఆల్రైట్ కదా - ఆరోగ్యంగా , బలంగా మా బుజ్జితల్లి పెరుగుతోంది కదా ....... అని ప్రశ్నల వర్షం కురిపించింది అక్కయ్యపై ప్రేమతో .......
చారు అంటీ : ఇంకా చెకప్ చెయ్యనిదే ........
ఇందు : వచ్చి గంట అయ్యింది అన్నారు కదా అంటీ ........
చారు అంటీ : నువ్వు ....... మీ అక్కయ్యను - కడుపులో ఉన్న బుజ్జితల్లిని , నీ ప్రాణమైన బిగి కౌగిలినుండి వదిలితేనే కదా డాక్టర్ గారు చెకప్ చేయగలిగేది .
సిగ్గుపడుతూ లేచి అత్తయ్యగారి గుండెలపై దాక్కుంది ఇందు ........
స్వచ్ఛమైన అక్కాచెల్లెళ్ళ ప్రేమను చూస్తూ సమయమే తెలియలేదు ఇందూ ....... , గంట ఏమిటి మరొక గంట అయినా సంతోషంగా వేచిచూసేదాన్ని , చుట్టూ మీరంతా ఎంత ప్రేమతో చూసుకుంటున్నారో తెలుస్తోంది - ప్రెగ్నెన్సీ అమ్మాయి ఇంత సంతోషంగా ఉంటే డాక్టర్ అవసరమే లేదు అని లేచివచ్చి జానకిని పరీక్షిస్తూ పొత్తికడుపు దగ్గరకు చేరి , పాపాయీ ....... జాగ్రత్తగా చూసుకునే నీ పిన్నమ్మ .......
అక్కయ్య - అత్తయ్యగారు - అమ్మ - చారు అంటీ : పిన్నమ్మ కాదు డాక్టర్ గారూ ........ ఇద్దరూ అమ్మలే అని ఒకేసారి చెప్పి ఆనందించారు .
ఇందు : లవ్ యు అక్కయ్యా - లవ్ యు అత్తయ్యగారూ చారు అంటీ - లవ్ యు అమ్మా ........
డాక్టర్ గారు : wow ....... , sorry sorry పాపాయీ ....... కడుపులో ఒక అమ్మ - బయట ఉండి ఒక అమ్మ ప్రేమలలో హాయిగా పెరిగి భువిపైకి వచ్చెయ్యి all the best ........ , చెప్పానుకదా ఇందూ ...... ఇంతమంది ప్రేమలమధ్యన perfectly ఆల్రైట్ ....... మంచి ఫ్రెష్ పోషకాహారం తీసుకోవాలి - కాలుష్యం లేని స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణం పాపాయికి మరింత మంచిది , జానకీ ........ నెలకు ఒకసారి చెకప్ చేసుకోవాలి - మీకు వీలైనప్పుడు హాస్పిటల్ కు రావాలి .
ఇందు : ఖచ్చితంగా డాక్టర్ గారూ ....... నేను కూడా వస్తాను .
డాక్టర్ గారు : పాపాయికి ఇద్దరు అమ్మలూ అత్యవసరం ఇందూ ...... జానకి అంటే ఒక్కరే కాదు మీరిద్దరూ రావాలి మరి వెళ్ళొస్తాను .....
అత్తయ్యగారు వెనుకే వెళ్లి అమౌంట్ పే చేశారు .
ఇందు : లవ్ యు బుజ్జిపాపాయీ ....... అంటూ ముద్దుపెట్టింది సంతోషంతో .........
ఇందు : అత్తయ్యగారూ ....... మీ కుమారులిద్దరూ , పొలంలోనే ఉన్నారు కదా మనం కూడా అక్కడికే వెళ్లి భోజనం చేద్దామా ....... ? .
అత్తయ్యగారు : నా బుజ్జికోడలు మధురమైన కోరిక కోరడమూ - ఈ అత్తయ్యగారు కాదనడమూనా ......... , మీ అక్కాచెల్లెళ్ళు కదలకండి మేమే వెళ్లి క్యారెజీ రెడీ చేస్తాము .
చారు అంటీ : ఒసేయ్ నాగాంబ ....... నీ కోడళ్లను కాదు కాదు ప్రత్యేకంగా నీ బుజ్జికోడలిని వదిలి ఉండలేవని తెలుసు - ఎలాగో నీ చిన్న సుపుత్రుడు హనీమూన్ క్యాన్సిల్ చేసేసాడు కనీసం పొలంలోనైనా వాళ్ళను ఒంటరిగా సరదాగా గడపనివ్వు - వాళ్ళ మధ్యలో పానకంలో పుడకల్లా మనమెందుకే ........
అక్కాచెల్లెళ్ళు : చారు అంటీ ........
అత్తయ్యగారు : మీ చారూ అంటీ చెప్పినది అక్షరాలా సత్యం - నా కొడళ్లపై ప్రేమ ఎక్కువై ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను దూరం చేసేదాన్ని ....... - థాంక్స్ చారూ ....... పదా వెళ్లి సర్దుదాము అని అమ్మతోపాటు ముగ్గురూ వెళ్లారు .
అక్కాచెల్లెళ్ళు : సంతోషంగా నవ్వుకున్నారు . చెల్లీ ....... పొలంలో మీ బావగారిని తీసుకుని దూరం వెళతాను - ఆ సమయంలో అటువైపు ఎవ్వరినీ వెళ్ళనివ్వకుండా మేము చూసుకుంటాము - నీ సొగసైన పరువాలతో మరిది గారిని కవ్వించు - ఆడది కవ్విస్తే సెగలెక్కని మగాడు అదికూడా దివినుండి దిగివచ్చిన సౌందర్యారాశి అయిన నా ముద్దుల చెల్లి కవ్విస్తే లొంగకుండా ఉంటారా చెప్పు అని చిలిదనంతో నవ్వుకున్నారు - చెల్లీ ....... సిగ్గు మరిదిగారు పడాలి సరేనా , అత్తయ్యగారు కోరినట్లుగా నెలరోజులు ఏంటి జీవితాంతం నీ కొంగు పట్టుకుని తిరుగుతాడు .
ఇందు : బుజ్జితల్లి దగ్గర ముఖం దాచుకుని అలాగే అక్కయ్యా ....... అంటూ పొత్తికడుపుపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
జానకి : చెల్లీ ....... రాత్రి మీ బావగారు - ఇప్పుడు నువ్వు ముద్దులుపెట్టిన ప్రతీసారీ బుజ్జితల్లి స్పందన తెలుస్తోంది అని ఆనందబాస్పాలతో చెల్లి బుగ్గపై ముద్దుపెట్టి పులకించిపోతోంది .
ఇందు : నాకు తెలిసి మా బుజ్జితల్లిని ....... బావగారు రాత్రంతా ముద్దులలో ముంచెత్తి ఉంటారు .
జానకి అవునన్నట్లు తలఊపి సిగ్గుపడుతోంది .
ఇందు : అక్కయ్యా ......... అత్తయ్యగారు పిలిచేలోపు రెడీ అవుదాము అని బుజ్జితల్లికి ముద్దుపెట్టి పైకిలేచింది .
జానకి : మరిదిగారిని కవ్వించడానికి అనిచెప్పు చెల్లీ .......
ఇందు : పో అక్కయ్యా .......
జానకి : ఇలా సిగ్గుపడినా చాలు మరిదిగారు ఫ్లాట్ అవ్వాల్సిందే అని లేచి ఫ్రెష్ అయ్యారు . చెల్లిని కాస్త సెక్సీగా రెడీ చేసి ఉమ్మ్ ...... నాకే కొరుక్కుని తినేయ్యాలని ఉందిరా .......... అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి నవ్వుకున్నారు .
కోడళ్ళూ ....... అని అత్తయ్యగారి పిలుపు రావడంతో చిరునవ్వులు చిందిస్తూ కిందకువచ్చారు .
చారు అంటీ : wow ........ ఒసేయ్ నాగాంబ నీ కోడళ్లు దివినుండి దిగివచ్చిన దేవకన్యలేనే ........
అత్తయ్యగారు మురిసిపోతూనే ....... , ఇందూ ...... మురళి ఆకలికి ఏమాత్రం తట్టుకోలేడు వెళ్ళండి ఫుడ్ కారులో ఉంచాము అని దిష్టి చుక్కలు పెట్టారు అక్కాచెల్లెళ్లకు ........
అక్కాచెల్లెళ్ళు : లవ్ యు అత్తయ్యగారూ ...... అని చెరొకవైపు హత్తుకున్నారు . అత్తయ్యగారూ ....... మీరూ మాతోపాటు వస్తే మరింత బాగుంటుంది .
అత్తయ్యగారు : అలాచేస్తే మీ చారూ అంటీ కొట్టేలా ఉంది చూడు అని నవ్వుకున్నారు - కోడళ్ళూ ....... జాగ్రత్తగా వెళ్లి తనివితీరా ఎంజాయ్ చేసి రండి అని నుదుటిపై ముద్దులుపెట్టి కారువరకూ వదిలారు .
జానకి డ్రైవింగ్ సీట్లో చేరబోతే ....... , నో నో నో అక్కయ్యా ....... నేను ఉండగా అని చేతిని అందుకుని అటువైపుకు పిలుచుకునివెళ్లి డోర్ తెరిచిమరీ కూర్చోబెట్టి సీట్ బెల్ట్ కూడా పెట్టి బుగ్గపై ముద్దుపెట్టి పరుగున ఇటువైపు వచ్చి కూర్చుంది . కారు స్టార్ట్ చేసి ఈ ఆనందాలను చూసి ఇంతకన్నా ఏమికావాలి అని ఆనందబాస్పాలతో మురోసిపోతున్న అమ్మానాన్నలకు వెళ్ళొస్తాము అనిచెప్పి బయలుదేరారు .
జానకి : చెల్లీ ....... నువ్వు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోమని బుజ్జితల్లి నన్ను కొడుతోంది లోపల ........
ఇందు : అవునా ....... హి హి లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ అని సీట్ బెల్ట్ పెట్టుకుని ఎలా కవ్వించాలో మాట్లాడుకుంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ 5 నిమిషాలలో పొలం చేరుకున్నారు .
పొలంలో పనివాళ్ళతో పనిచేయిస్తున్న శివ ....... కారుని చూసి పరుగునవచ్చారు .
ఇందు : ఏంటి బావగారూ ........ అంత వేగంగా వచ్చారు మా అక్కయ్య కోసమా - బుజ్జితల్లి కోసమా ........
శివ : కేవలం రాత్రి మాత్రమే మీ అక్కయ్యకోసం - పగలంతా బుజ్జితల్లికోసం ........ అని జానకి చేతిని అందుకున్నారు .
జానకి తియ్యడంతో నవ్వుకుని సిగ్గుపడుతోంది - శ్రీవారూ ....... ఆకలివేస్తోందా ? ఆలస్యం అయ్యింది .
శివ : చాలా చాలా శ్రీమతీ ........ , ముందు డాక్టర్ గారు ఏమన్నారో చెప్పు .
జానకి : చెల్లి ప్రక్కన ఉంటే చాలు ఈ డాక్టర్ కూడా అవసరంలేదు అని చెప్పారు - సమయానికి మంచి ఆహారం తినమన్నారు - విలేజ్ వాతావరణం మంచిది అనిచెప్పారు .
ఇందు : డాక్టర్ గారు చెప్పినవన్నీ ప్రక్కనే ఉండి నేను చూసుకుంటాను బావగారూ ........ మీరు రోజూ ముద్దులుపెట్టండి చాలు నిన్న రాత్రిలా .......
శివ : సిగ్గుపడి థాంక్స్ చెప్పాడు . తమ్ముడు ....... మన తోటలో పనిచేసుకుంటున్నాడు - మీరు లోపలికివెళ్లండి నేను శుభ్రం చేసుకునివస్తాను అని బుజ్జితల్లిని స్పృశించి ముద్దుపెట్టాడు .
శివ కేకేయ్యడంతో తోట గేట్ తెరిచారు పనివాళ్ళు . నవ్వుకుని లోపలికి పోనిచ్చారు - నేరుగా మురళి కూర్చున్న దగ్గరికి చేరుకుని కిందకు దిగారు .
కారు సౌండ్ కు మురళి చూసి వదినా ....... అంటూ వచ్చాడు . భోజనానికి ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చారా ....... పదండి వెళదాము .
జానకి : మరిదిగారూ ........ మీకోసం ఇక్కడికే భోజనం తీసుకొచ్చాము .
మురళి : ఇక్కడనా ........
జానకి : ఇంతకంటే రొమాంటిక్ ప్లేస్ ........ బ్యూటిఫుల్ అంటూ కిందకు దిగారు .
ఇందు : మురళీ గారూ ........ ఉదయం నుండీ నీళ్లు తాగారో లేదో అని బాటిల్ అందించింది .
చిటికెన వేలు కూడా తాకకుండా అందుకున్నాడు మురళి .........
జానకి చూసి ఆశ్చర్యపోయింది .
అంతలో శివ వచ్చి చల్లగా ఉన్న చెట్టుకింద పరుపు పరిచి కారులోని ఫుడ్ తీసి దానిపై ఉంచాడు .
జానకి : శ్రీవారూ ....... మనమిద్దరం అదిగో అటు చివరన కూర్చుని తిందాము .
శివ : ఇక్కడ బాగుంది కదా శ్రీమతీ .........
జానకి : అర్థం చేసుకోండి శ్రీవారూ .........
శివ : ఇందూ వైపు చూసి , ok ok sorry శ్రీమతిగారూ అని సగం క్యారెజ్ ను తీసుకున్నాడు .
మురళికి అర్థమయ్యి అన్నయ్యా ....... అందరూ కలిసే తిందాము .
శివ : తమ్ముడూ ......... పెళ్ళైన కొత్తలో ఈ చిలిపి సరదాలు ఆస్వాదించాలి ఎంజాయ్ అనిచెప్పి కదిలాడు .
జానకి : మళ్లీ మా చెల్లి పిలుపు వచ్చేన్తవరకూ రానే రాము అని బుగ్గపై ముద్దుపెట్టి శ్రీవారూ ........ నెమ్మది అంటూ వెళ్ళింది . అన్నీ నేనే చెప్పాలి - నా ముద్దుల శ్రీవారు అమాయకులు అని చేతిని చుట్టేసింది .
లవ్ యు అక్కయ్యా ....... అని నవ్వుకుని , మురళీ గారూ ........ ఆకలి వేస్తోందా వడ్డించమంటారా ...... ? .
మురళి కంగారు కంగారుగా చేతులు శుభ్రం చేసుకుని వస్తాను అనివెళ్లి అర గంటకు గానీ రాలేదు .
ఇందు ....... చెట్టుకింద కూర్చుని వంటలన్నింటినీ వేరుచేసి వేచిచూస్తూ కూర్చుంది . మురళి రావడం చూసి పెదాలపై చిరునవ్వులతో వెళ్లి టవల్ అందించింది .
మురళి : అవసరం లేదు ఇందూ గారూ ........ కర్చీఫ్ తో తుడుచుకున్నాను .
ఇందు : సరేనండీ ....... , వడ్డిస్తాను కూర్చోండి అని కూర్చుని ప్లేట్లో వడ్డించి చూస్తే చివరన కూర్చున్నారు - నవ్వుకుని వెళ్లి అందించి ప్రక్కనే కూర్చోబోతే ........
ఇందూ గారూ ....... వెళ్లి మీరూ తినండి .
పర్లేదు మురళీ గారూ ........ మీరు తిన్నాక తింటాను .
వెళ్ళండి వెళ్లి తినండి అని చెప్పాడు .
అలాగేనండీ భర్తతో కలిసి తినడం కంటే భార్యకు సంతోషం ఏమిటి అని సంతోషంతో వెళ్లి వడ్డించుకునివచ్చి ప్రక్కనే కూర్చోగానే .........
వర్క్ ఉంది మొబైల్లో సిగ్నల్ తగలడం లేదు అని కాస్త దూరంలో ఎత్తున ఉన్న పెద్ద కొండ గుండ్రాయిపై కూర్చుని తింటున్నాడు .
ఇందూ కళ్ళల్లో కన్నీటి చుక్క ........ , బాధపడుతూనే భోజనం చేసింది .
తిని కిందకువచ్చిన మురళి చెయ్యి కడుక్కుని నీళ్లు తాగాడు . విలేజ్ లో అందులోనూ ఈ తోటలో నెట్ సిగ్నల్ వీక్ గా ఉంది పైన బాగా తగులుతోంది అక్కడికే వెళ్లి వర్క్ చేసుకుంటాను అని వెళ్లి సాయంత్రం వరకూ కిందకు దిగనేలేదు .
సాయంత్రం 6 గంటలకు జానకి - శివ చిరునవ్వులు చిందిస్తూ వచ్చారు . క్యారెజీలన్నింటినీ కారులో ఉంచి , శ్రీమతి గారూ ........ మీరు బయటకు రండి అంతలోపు పనివాళ్లకు డబ్బు పంచి పంపిస్తాను అని వెళ్ళాడు శివ ......
తలదించుకుని ఒంటరిగా కూర్చున్న ఇందూ దగ్గరికి చేరి కళ్ళను చూడగానే సగం - చుట్టూ చూసి దూరంగా కొండపై లాప్టాప్ వొత్తుకుంటున్న మురళిని చూసి పూర్తిగా అర్థమైనట్లు కళ్ళల్లో చెమ్మతో ప్రక్కనే కూర్చుని చెల్లీ ........ అని ప్రాణంలా చెయ్యి అందుకోగానే .........
అక్కయ్యా ........ అంటూ గుండెలపైకి చేరిపోయింది .
జానకి : చెల్లీ ........ ఏమిజరిగింది .
ఇందు : బాధపడుతూనే భోజనం కూడా అక్కడే చేసి అక్కడే ఉండిపోయారక్కా .........
జానకి : చెల్లీ ........ 4 గంటలపాటు ఒంటరిగా ఇక్కడే ఉన్నావా ? , ఒక్క కాల్ చెయ్యొచ్చుకదా బాధతో చెప్పింది .
ఇందు : నా ప్రాణమైన అక్కయ్య సంతోషాన్ని దూరం చేస్తానా ........ , నో నో నో అక్కయ్యా ........మీరు బాధపడకూడదు అని కన్నీళ్లను తుడిచి , sorry లవ్ యు లవ్ యు ఏమి జరిగింది ఏమీ జరగలేదు వర్క్ బిజీలో పట్టించుకోలేదు అంతే ...... రాత్రికి వలలో వేసుకుంటాను కదా - బాధపడకూడదు అని డాక్టర్ గారు చెప్పారుకదా అదికూడా నావల్ల నో నో నో ....... స్మైల్ స్మైల్ ....... అంటూ నవ్వించి పైకిలేచారు .
జానకి : మరిదిగారూ ........ పని పూర్తయితే ఇంటికి వెళదాము అని కాస్త కోపంతోనే అడిగింది .
మురళి : వదినగారూ ........ మరొక గంట అయినా పడుతుంది , మీరు వెళ్ళండి మరొక కారులో వచ్చేస్తాను .
జానకి : పని పని పని , పని తప్ప వేరే లోకం లేనట్లుంది మరిదిగారికి .......
ఇందు : నవ్వుకుని , మురళీ గారూ ...... జాగ్రత్త అనిచెప్పి కారులో బయటకువచ్చారు .
శివ : తమ్ముడు ...... ? .
జానకి : మీ తమ్ముడికి పని తప్ప వేరే ఏమీ తెలియనట్లుంది శ్రీవారూ ........
శివ : తమ్ముడు చిన్నప్పటి నుండీ అంతే పదండి వెళదాము అని వెనుక కూర్చున్నాడు .
జానకి : చెల్లీ ....... పోనివ్వు .
ఇందు : మా అక్కయ్య ....... మా బావగారి గుండెలపైకి చేరితేనేగానీ కారు కదలనంటోంది , వెళ్లు అక్కయ్యా వెళ్లు అని చేతిపై ముద్దుపెట్టింది .
జానకి : లవ్ యు sooooo మచ్ చెల్లీ ....... అని బుగ్గపై ముద్దుపెట్టి వెళ్లి శివ చేతిని చుట్టేసింది .
శివ : థాంక్స్ ఇందూ ........ , చదువుకున్న దేవత శ్రీమతిగా వచ్చింది కాబట్టి ఈ చిలిపి మాధుర్యాలను పొందుతున్నాను లేకపోయుంటే ఈ చిలిపి సంతోషాలు ఉన్నాయని కూడా నాకు తెలిసేది కాదు .
ఇందు : అందుకే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు బావగారూ ....... ఎంజాయ్ మా అక్కను ఇంత సంతోషంగా చూసుకునే బావగారు లభించడం మాఅదృష్టం అని ఇంటికి పోనిచ్చింది .
జానకి : శ్రీవారూ ....... మరి ఉదయం మీరు తీసుకొచ్చిన కారు సంగతి ఏమిటి ? .
శివ : ఇక్కడే ఉంటుందిలే ....... , దొంగలు ఎత్తుకునివెళ్లినా నాకేమీ బాధలేదు - నా శ్రీమతి కౌగిలిని వదిలి వెళ్లేదే లేదు అని చేతిపై ముద్దుపెట్టాడు .
ఇందు : అంత ప్రేమతో మాట్లాడి చేతిపైననా ముద్దుపెట్టేది ...... పోండి బావగారూ ........
జానకి : అన్నీ నేనే నేర్పించాలి చెల్లీ ....... అని నవ్వుకుంటూ ఇంటికి చేరుకున్నారు .
ఇందూను ...... అక్కయ్య గదిలోనే ఉండమనిచెప్పి చారు అంటీవాళ్ళు రెండవ రాత్రికోసం టాప్ ఫ్లోర్ గదిని మళ్లీ ఫ్రెష్ పూలతో శోభనపు గదిలా అలంకరించారు .
8 గంటలకు మురళి ఇంటికివచ్చాడు . అందరూ కలిసి భోజనం చేసి మురళిని శోభనపు గదిలోకి - ఇందూని ....... జానకి గదిలోకి తీసుకెళ్లి 10 గంటలకల్లా రెడీ చేసి పాల గ్లాస్ అందించి చిలిపిమాటలతో పైన గదిలోకి విడిచిపెట్టివచ్చారు .
అక్కయ్య చెప్పిన చిలిపి సెక్సీ టిప్స్ తలుచుకుంటూ సిగ్గుపడుతూనే లోపలికి అడుగుపెట్టిన ఇందూకు ఆదిలోనే నిరాశ ఎదురయ్యింది .
సోఫాలో గురకపెట్టి నిద్రపోతున్న మురళిని చూసి దుఃఖం తన్నుకొచ్చేసింది . చిరు ఆశతోనే సోఫా దగ్గరికివెళ్లి మురళీ గారూ మురళీ గారూ ........
కళ్ళుమూసుకునే చెప్పండి ఇందూ గారూ ........
ఇందు : నిద్రపోయేముందు పాలు తాగుతారు కదా తీసుకొచ్చాను .
మురళి : నిన్న పూర్తిగా నేను తాగేసాను కదా , ఈరాత్రికి మీరు మొత్తం తాగేయ్యండి ఈక్వల్ అయిపోతుంది . నిన్న రాత్రి నుండీ తీరికలేకుండా వర్క్ చేసాను కదా టైర్డ్ గా ఉంది పడుకుంటాను - మీరు వెళ్లి పడుకోండి .
ఇందు : సరేనండీ ........ , సోఫాలో ఇబ్బందిగా ఉంటుంది వచ్చి బెడ్ పై పడుకోండి .
మురళి : నాకు బెంగళూరులో అలవాటే ఇందూ గారూ ....... - నైట్ మధ్యలో అర్జెంట్ వర్క్ అని మెయిల్స్ వస్తుంటాయి సో ఇక్కడే కంఫర్ట్ మీరు వెళ్లి పడుకోండి .
నిరాశతోనే వెళ్లి బెడ్ పై కూర్చుంది ఇందు ...... , నిన్నలా ఆశపడుతూనే మధ్యమధ్యలో మేల్కొంటూ గోడకు ఆనుకుని కూర్చునే నిద్రపోయింది .
ఉదయం 9 గంటలకు తలుపు తట్టిన సౌండ్ వినిపించగానే , మురళి కంగారుపడుతూ వచ్చి నిన్నలానే బెడ్ పై పూలు చిందరవందర చేసి ఇందూ వైపు please అంటూ చూస్తున్నాడు .
అత్తయ్యగారి సంతోషం కోసం తప్పదన్నట్లు బొట్టు - పూలు - చీర నలుపుకుని దీనంగా డోర్ తెరిచి పైపైనే సిగ్గు నటించింది .
అత్తయ్యా వాళ్ళు మా బంగారం అంటూ మురిసిపోయి కిందకువెళ్లడం - అక్కాచెల్లెళ్ళు నిన్నలానే విచారం వ్యక్తం చేయడం - అక్కయ్య సంతోషం కోసం ఇందు అన్నీ మరిచిపోయి ఆ రోజు రాత్రివరకూ అక్కయ్యను సంతోషపెట్టడం .
మూడవ రాత్రిని కూడా శోభనం గదిలా మార్చి , ఇందూని శోభనపు పెళ్లికూతురిలా మార్చి గదిలోకి విడిచిపెట్టారు .
మురళి ........ సోఫాలో కూర్చుని తన పనిలో తాను ఉండటం చూసి దగ్గరికి వెళ్లడం కూడా వృధా అనుకుని పట్టించుకోకుండా వెళ్లి పాల గ్లాస్ ను టేబుల్ పై ఉంచి బెడ్ పై కూర్చుంది .
నిమిషం తరువాత మురళి ........ లేచి రావడం చూసి , ఇందూ సిగ్గుపడుతూ లేచి నిలబడింది . ఇందూ గారూ ...... ఈ రాత్రికి పాలకోటా నాది అంటూ తాగుతూ వెనక్కు వెళ్లిపోతున్నాడు .
ఇందు : ఆశ్చర్యంతో నోరుతెరిచి అలా చూస్తూ ఉండిపోయింది .
మురళి వెనక్కుతిరిగి ఇందూ గారూ ........ అమ్మ బాధపడకూడదు అని నాతో సమానంగా మీరు పడుతున్న తపన నాకు బాగా నచ్చింది - సంవత్సరం పాటు ఇలానే కంటిన్యూ చేస్తారని నాకు మాటిస్తారా please ........
ఇందు : మురళి గారూ ......... ఇలా నటించడం ఎందుకు ? , మీరు కోరుకున్నట్లుగా మిమ్మల్ని సంతోషపెడతాను - సుఖపెడతాను , మీరు సిటీలో పెరిగినవాళ్ళు చెప్పుకోలేని ఏమైనా ఫాంటసీలు ఉంటే నాకు నిర్మొహమాటంగా చెప్పండి , మీకు నచ్చినట్లుగా నడుచుకుంటాను , నన్ను ఎలాగైనా వాడుకోండి - మీ పాద దాసీనై ఉంటాను - అత్తాయ్యగారిని రోజూ ఉదయమే మోసం చేయడం అంటే ప్రాణాలు పోయిన దానితో సమానం - గుడిసెలో ఉన్న మమ్మల్ని స్వర్గానికి తీసుకొచ్చి ప్రాణంలా చూసుకుంటున్నారు , అలా చేసినందుకు గానూ రుణం కోరలేదు ఒకే ఒక్క కోరిక కోరారు - ఇందూ ........ ఈ ఇంటికి వారసులను ఇవ్వమని , అంతటి ప్రియమైన కోరికను కూడా తీర్చలేకపోతే నా ప్రాణాలు ఉన్నా లేనట్లే అని రెండు రోజులుగా లోలోపలే బాధపడుతున్న మనసులోని మాటలను వ్యక్తపరచి ఉద్వేగానికి లోనౌతోంది - మీరు ..... భార్యను ఇందూ గారూ ఇందూ గారూ అని గౌరవిస్తూ పిలుస్తుంటే గుండెల్లో బాణాలు గుచ్చుకున్నట్లు , నన్ను దూరంగా ఉంచుతున్న బాధకలుగుతోంది - నేనేమైనా తప్పు చేసి ఉంటే చెప్పండి మార్చుకుంటాను , విలేజ్ అమ్మాయిలా పద్దతిగా ఉండటం మీకు ఇష్టం లేదా ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకోనా ......., మురళీ గారూ ...... ఒక్కసారి ఓకేఒక్కసారి ప్రేమతో నన్ను కౌగిలించుకోగలరా
నో నెవర్ ........ పెళ్లికి ముందు చెప్పాను - ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను ....... నాకు కొద్దిగా సమయం కావాలని , నన్ను మన్నించండి మీ ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం ఇవ్వలేను , please please ఇందూ గారూ ........ మాటిచ్చేశారు అంతే అని వెనక్కు వెళ్లిపోతున్నారు .
ఇందు : మళ్లీ గారూ అని పిలవడంతో కళ్ళల్లో చెమ్మతో ....... , మురళి గారూ ........ మాటివ్వడానికైనా అరచేతిని తాకకూడదా ? .
మురళి : అవసరం లేదు ఇందూ గారూ ....... , వర్క్ మధ్యలో ఉన్నాను ఇందూ గారు మీరు పడుకోండి గుడ్ నైట్ ....... అనిచెప్పి హెడ్ ఫోన్స్ చెవులకు పెట్టుకుని తన పనిలో మునిగిపోయాడు .
మురళి : ఆ చెప్పడం మరిచిపోయాను తెల్లవారుఘామునే - మీరు మేల్కొనకముందే నేను బెంగళూరుకు వెళ్లిపోతున్నాను - చెప్పేసాను గుడ్ నైట్ ..........
ఇందు : వెళ్లిపోతున్నాను కాను వెళ్ళొస్తాను అని చెప్పండి అని చెప్పేలోపు హెడ్ ఫోన్స్ పెట్టుకుని వీడియో కాల్ లో మునిగిపోవడం చూసి ధారగా కారుతున్న కన్నీళ్ళతో బెడ్ పై కూర్చుంది - అమ్మా దుర్గమ్మా ........ నేనేమైనా తప్పుచేశానా అని కన్నీళ్లు కారుస్తూనే బాధ నిండిన మనసుతో నిద్రపోయింది .