Update 13

AMMA KOSAM

హైద్రాబాద్ ....... జూబ్లీహిల్స్ ....... చుట్టూ తరుచూ కనిపించే హీరోలు - రాజకీయనాయకులు - బిజినెస్ మెన్స్ బిగ్గెస్ట్ బిల్డింగ్స్ మధ్యన ఇంద్రభవనం .
బాబూ మహేష్ ....... సమయం 8 గంటలు అవుతోంది కాలేజ్ కు ఆలస్యం అవుతుంది అని " ఆయా " మాటలు వినిపించడంతో , సడెన్ గా లేచాను .
కాలేజ్ కు కాదు ఆయా ....... చివరి exam కు ఆలస్యం అవుతుంది - రాత్రి సిలబస్ రివిజన్ చేసేసరికి అర్ధరాత్రి దాటిపోయింది అందుకే అలారం సౌండ్ కు కూడా మెలకువ రాలేదు - 30 మినిట్స్ లో డైనింగ్ టేబుల్ లో ఉంటాను .
ఆయా : రూమ్ బయట నుండే , బాబూ ....... నీకిష్టమైన టిఫిన్ చేసాను .
అయితే 20 నిమిషాలలో ఉంటాను ఆయా ........
ఆయా : నాకు తెలుసులే అని నవ్వుకుంటూ వెళ్లిపోయారు .

Yes ఈరోజు ఐఐటీ ఎంట్రన్స్ - అప్పటికే ఎంసెట్ , AIEEE , సెంట్రల్ ఎంట్రన్స్ లు బాగా రాసినా ఐఐటీ క్యాంపస్ లో అడుగుపెట్టాలని అక్కడే మేనేజ్మెంట్ స్టడీస్ చేయాలన్నది dad కోరికతో పాటు నా కోరిక కూడా , బెడ్ పై చుట్టూ ఇంటర్ సబ్జెక్ట్స్ బుక్స్ - ఐఐటీ బుక్స్ తోనే పడుకుండిపోయాను . అన్నింటినీ జాగ్రత్తగా సర్ది టేబుల్ పై ఉంచి బాత్రూమ్లోకి చేరాను .

ఈరోజు ఐఐటీ ఎంట్రన్స్ తోపాటు నాకు నా జీవితానికి సంబంధించిన సమాధానం కూడా దొరుకుతుంది అని dad మాటిచ్చారు .
" ఈ ఇంద్రభవనం లాంటి బిగ్గెస్ట్ బిల్డింగ్ లో నాకు ఊహతెలిసిన తరువాత కాలేజ్ లో అడుగుపెట్టిన రోజున ....... నాతోపాటు చేరిన తోటిపిల్లలు అందరూ తమ తమ అమ్మ నాన్నలతో వచ్చినట్లు కౌగిలింతలు - ముద్దులు - నవ్వులు - తియ్యనైన ఏడుపులతో రావడం చూసి ఫస్ట్ టైం అమ్మ గుర్తుకువచ్చింది .
అప్పటివరకూ అమ్మ - అమ్మ ప్రేమ లేకుండానే పెరిగాను . Dad కూడా ఎప్పుడూ బిజినెస్ ట్రిప్స్ అంటూ నెలమొత్తం అమెరికాలోనే ఉండేవారు - నెలలో ఎప్పుడో ఒకసారి వచ్చి నా కురులను స్పృశించి ఆయా ...... అల్లరి చెయ్యడం లేదుకదా అని అడిగి మళ్లీ వెళ్లిపోయేవారు .
వీపుపై బుజ్జి కాలేజ్ బ్యాగు వేసుకుని కళ్ళల్లో చెమ్మతో గేట్ దగ్గర నిలబడి ఆయా వైపుకు చూసాను .
ఆయాకు నా కన్నీళ్ల కారణం అర్థమయినట్లు పరుగునవచ్చి కౌగిలించుకున్నారు .

ఆయా ........ ఇక్కడున్న పిల్లలందరికీ అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నారు , మరి నాకెందుకు అమ్మ లేదు .
ఆయా ....... కళ్ళల్లో కన్నీళ్ళతో , ఏమిచెప్పాలో తెలియనట్లు వెంటనే డాడీకి కాల్ చేసి విషయం చెప్పారు .
డాడీ : ఆయా ....... వెంటనే ఇంటికి తీసుకెళ్లు వారం రోజుల్లో నేను వస్తాను , అంతవరకూ అమ్మను మరిపించేలా ఇష్టమైనవన్నీ ఇవ్వు - వండర్ లా బీచ్ ...... లకు తీసుకెళ్లు . నిజం మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పకు - చెబితే ఏమిజరుగుతుందో తెలుసుకదా ........
ఆయా : నా కుటుంబం బ్రతుకుతోంది మీవల్లనే , నిజం చెబితే మళ్లీ మేము రోడ్డుపైకి చేరతాము అని తెలుసు అయ్యగారూ ...... , ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను .
డాడీ : గుడ్ ఇంటికి తీసుకెళ్లు - అమ్మ గుర్తుకురాకుండా దారిలో బొమ్మలు , చాక్లెట్ లు , ఐస్ క్రీమ్స్ ....... అన్నీఅన్నీ కోనివ్వు .

ఆయా : నన్ను కారులోకి తీసుకెళ్లి డ్రైవర్ ను పోనివ్వమని చెప్పారు . బాబూ ....... వారంలో డాడీ వస్తున్నారు . అంతవరకూ నో కాలేజ్ ...... ఇప్పుడు మనం వండర్ లాకు వెళుతున్నాము .
పిల్లాడిని కాబట్టి వెంటనే అమ్మను మరిచిపోయి సంతోషించాను . ఆ వారం రోజులూ ....... వైజాగ్ లోని ఆడుకునే places అన్నింటినీ చుట్టేసాము - ఇష్టమైనవన్నీ ముందు ఉంచారు .
వారం రోజులైనా డాడీ రాకపోవడంతో , ఆయా ...... బుజ్జాయినైన నన్ను బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ బాల్కనీలోకి తీసుకెళ్లి చుట్టూ ఉన్న హీరోలను - ఆ రోజుకు ఆ హీరో మూవీని మల్టీప్లెక్స్ లోకానీ వీలుకాకపోతే ఇంటిలోని మినీ థియేటర్ లో చూయించారు .
అలా నెలరోజులు గడిచిపోయింది . ఒకరోజు సాయంత్రం డాడీ కారు సౌండ్ వినిపించగానే పరుగునవెళ్లి అడిగిన మొదటి ప్రశ్న " డాడీ ...... మమ్మీ ఎక్కడ ? " అని ........
డాడీ ముఖంలో సంతోషం ఆవిరైపోయింది . నన్ను కనీసం ఎత్తుకోకుండా బుజ్జిచేతిని పట్టుకుని లోపలికితీసుకెళ్లారు - నన్ను గదిలోకి వెళ్లి ఆడుకోమని పంపించు , ఆయా ....... మరిపించమని చెప్పానుకదా - ఇందుకోసమే నేను నెలరోజుల తరువాత వచ్చినది అంటూ కోప్పడ్డారు .
ఆయా : ఈ నెలరోజులూ ....... ఒక్కరోజు కూడా అడగలేదు అయ్యగారూ - బహుశా మీరు రాగానే గుర్తుకొచ్చినట్లుంది .
డాడీ : నేను మరిపించేలా ఏదో ఒకటి చెబుతాను , నువ్వుకూడా అవునని చెప్పాలి అంటూ ఇద్దరూ పైకివచ్చారు .

బొమ్మలతో ఆడుకుంటున్న నాదగ్గరికి డాడీ వెనుకే ఆయా వచ్చారు .
డాడీ : మహేష్ ....... నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకో , మనమిద్దరం అనాధలం ..... నీకూ అమ్మ లేదు - నాకూ అమ్మ లేదు , నాకు నువ్వు - నీకు నేను మాత్రమే .......
ఆయా : అయ్యగారూ ........
డాడీ : ష్ ష్ ....... , మహేష్ ....... ఈ విషయాలు ఇప్పుడే చెబితే నీకు
అర్థం కాదు , సమయం వచ్చినప్పుడు వివరంగా చెబుతాను - అంతవరకూ నువ్వు రోజూ ఆయాతోపాటు కాలేజ్ కు వెళ్లి బాగా చదువుకుని నాకంటే పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలి - బుద్ధిగా కాలేజ్ కు వెళ్లి చదువుకుంటాను అని మాటివ్వు .......
అలాగే డాడీ అంటూ చేతిలో ప్రామిస్ చేసాను .
డాడీ : ఆయా ....... మహేష్ గదిమొత్తం బొమ్మలతో నిండిపోవాలి .
నా పెదాలపై చిరునవ్వులు చిగురించడం చూసి , హమ్మయ్యా ....... అనుకున్నారు . ఆయా వైపు కోపంతో చూస్తూ బయటకువెళ్లి కాస్త గట్టిగానే కోప్పడినట్లు కేకలు వినిపించాయి .

నాకు ఊహ తెలిసినప్పటి నుండీ చూస్తున్నాను డాడీ ఇంటిలో ఉండటం అరుదు , ఆ రాత్రుళ్ళు కూడా ప్రతీ రాత్రీ ఒకరు - ఒక్కొక్కసారి ఇద్దరు అంటీలు ...... డాడీ గదిలోకివెళ్లి ఉదయానికి కానీ వెళ్లేవారు కాదు . ఆయా అయితే ఆ రాత్రుళ్ళు థర్డ్ ఫ్లోర్ వైపు పోనిచ్చేవారు కాదు .

మళ్లీ 5th క్లాస్ లో అనుకుంటాను అమ్మ గుర్తుకురావడంతో డాడీ దగ్గరికి ఏడుస్తూ వెళ్ళాను .
డాడీ ........ నా చేతిని అందుకుని కారులో అనాధాశ్రమానికి తీసుకెళ్లి కారులోనుండే చూయించారు . మహేష్ ....... మీ అమ్మ , నిన్ను కని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది - అనాధనైన నా జీవితానికి మరొకరు కావాలని , కూర్చుని తిన్నా తరగని ఆస్తికి వారసులు కావాలని నిన్ను దత్తత తీసుకున్నాను - ఇదీ మన కథ ఇక ఎప్పుడూ అమ్మ గురించి అడగకు " నాకు నువ్వు - నీకు నేను " అంతే ....... అంటూ ఇంటికి తీసుకెళ్లి అమెరికా వెళ్లిపోయారు .

ఆరోజు నుండీ కాలేజ్లో - బయట మరియు మూవీస్ లలో అమ్మ ప్రేమను ఫీల్ అవుతూ పెరిగాను . అమ్మా ....... నన్నెందుకు అనాధాశ్రమంలో వదిలి వెళ్లిపోయావు - ఇప్పుడు ఎక్కడ ఉన్నావు - మళ్లీ నాకోసం రావాలనిపించలేదా - నాపై కొద్దిగా కూడా ప్రేమ లేదా అని బాధపడుతూ నా ఫ్రెండ్స్ ను .... రోజూ వాళ్ళ వాళ్ళ అమ్మలు వాళ్లపై కురిపించే ప్రేమ - ఆప్యాయతల గురించి అడుగుతూ , నేనే ...... మాఅమ్మతో ఆ ప్రేమను పొందినట్లుఫీల్ అవుతూ మురిసిపోయేవాడిని - నన్ను నేను అద్దం లో చూసుకుని అమ్మ రూపాన్ని మనసులో ముద్రించుకున్నాను , చూడాలనిపించినప్పుడల్లా కళ్ళుమూసుకుని అమ్మ చిరునవ్వులు చూసి అమ్మ నాదగ్గరే ఉన్నట్లు ఆనందానుభూతిని పొందేవాడిని - ఆరోజు నుండీ అమ్మ లేదు అన్న భావనే కలగలేదు .
అమ్మను తలుచుకునే నిద్ర లేచేవాడిని - అమ్మ స్వయంగా గోరుముద్దలు తినిపిస్తుందా అన్నట్లు ఫీల్ అవుతూ తినేవాడిని - అమ్మ ...... స్వయంగా నాతోపాటు కాలేజ్ వరకూ వచ్చి కౌగిలింత , ముద్దులతో సాగనంపేలా - రాత్రికి మళ్లీ అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోయేలా ఫీల్ అవుతూ అమ్మా అమ్మా ....... అని తలుచుకుంటూ రోజులు సంతోషంతో గడిపేవాడిని .

వీకెండ్స్ మరియు సెలవులు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్ళేవాడిని - తల్లీకొడుకులు ఆప్యాయతలను చూసి ఆనందించేవాడిని - ప్రతీ MOTHER'S DAY కు ఫ్రెండ్స్ అమ్మలకు గిఫ్ట్స్ తీసుకువెళ్లి వాళ్ళతో సంతోషాలను పంచుకునేవాడిని .
ఫ్రెండ్స్ : రేయ్ నీవల్ల , నువ్వు కురిపించే ప్రేమ వలన చూసి నేర్చుకోండి అని మాఇంట్లో రోజూ తిట్లే రా , అమ్మ అంటే ఎందుకురా అంత ఇష్టం నీకు ......
మా అమ్మ ఎక్కడున్నారో తెలియదురా అందుకే అమ్మ అంటే ప్రాణం నాకు , అమ్మ ప్రేమ ఎక్కడ ఉన్నా దూసుకెళ్లిపోతాను .

అలా రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి . 10th స్టేట్ ర్యాంక్ - ఇంటర్ ఫస్ట్ ఇయర్ టాప్ స్కోర్ - ఇంటర్ సెకండ్ ఇయర్ ఫైనల్ exams మరియు ఎంసెట్ AIEEE ...... EXAMS బాగా రాసినందువలన స్వీట్స్ తీసుకుని ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాను .
ఫ్రెండ్స్ : రేయ్ వచ్చేసావా ఇంకా రాలేదు అనుకున్నాము వెళ్లు వెళ్లి ఇవ్వు - నీకు ..... మాకంటే మా అమ్మావాళ్ళు అంటేనే ఇష్టం .
అంటీ వాళ్ళు నవ్వుకుని ఫైనల్ ఎంట్రన్స్ ఐఐటీ కు అల్ ద బెస్ట్ చెప్పారు .
ఫ్రెండ్స్ : రేయ్ ...... నువ్వు వచ్చి ప్రేమతో గిఫ్ట్స్ ఇచ్చేసి వెళతావు - ఇక ఆక్షణం నుండీ మా పేరెంట్స్ మాకు రౌండ్స్ వేస్తారు ఎప్పుడైనా ఇంత ప్రేమను చూయించారా అని ....... , ఇది ఈరోజుతో ఆగాలంటే మీ అమ్మను ...... నువ్వు చేరాలి ఎలా ఎలా ....... ? .
ఫ్రెండ్ : మహేష్ ....... నిన్ను అనాధాశ్రమంలో వదిలి వెళ్ళిపోయింది అని మీ నాన్న చెప్పాడు కదా , అక్కడికి వెళితే నిన్ను దత్తత ఎప్పుడు తీసుకున్నారో తెలుస్తుంది - నీ అదృష్టం ఉంటే మీ అమ్మ గురించి కూడా తెలియవచ్చు .
సంతోషం పట్టలేక థాంక్యూ థాంక్యూ sooooo మచ్ రా , ఇప్పటివరకూ నాకు ఈ ఐడియా నే తట్టలేదు అని కౌగిలించుకుని కారులో వేగంగా అనాధాశ్రమం బయలుదేరాను - దారిలో నాలాంటి అనాథ పిల్లలకు కారు నిండా స్వీట్స్ తీసుకునివెళ్ళాను . అనాధాశ్రమం చేరుకుని పిల్లలకు పంచమని స్వీట్స్ అందించి ఓల్డ్ ఏజ్ లో ఉన్న వార్డెన్ దగ్గరికి వెళ్లి ఆతృతతో దత్తత - అమ్మ గురించి అడిగాను .

నెమ్మదిగా లేచి అలా కూర్చో బాబు అనిచెప్పి ఎదురుగా ఉన్న ర్యాక్స్ లో ఫైల్స్ సెర్చ్ చేస్తున్నారు - బాబూ ...... దత్తత జరిగిన సంవత్సరం చెప్పు .
నా ఏజ్ 18 ఇయర్స్ వార్డెన్ - దత్తత జరిగిన సంవత్సర పర్టీకులర్ గా తెలియదు . 2002 - 2005 మధ్యలో ఉండొచ్చు వార్డెన్ .
వార్డెన్ : అప్పటికి నేనే వార్డెన్ - అనాధాశ్రమం ప్రతీ అంశాన్నీ రికార్డ్స్ రూపంలోనే ఉంచాను - ఇక్కడో ఎక్కడో ఖచ్చితంగా ఉంది .
వార్డెన్ ....... నేను సహాయం చేస్తాను అని ర్యాక్స్ దగ్గరికి వెళ్లి ఫైల్స్ చూసాను . ఇయర్ వైస్ పర్ఫెక్ట్ ఆర్డర్లో ఉండటం చూసి , నా గురించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది అన్న ఆనందంతో ఆ three ఇయర్స్ మాత్రమే కాకుండా అంతకుముందు మరియు ఆ తరువాత ఇయర్స్ పూర్తిగా చెక్ చేసినా ప్రయోజనం లేకపోయింది . వార్డెన్ ....... వేరే ఫైల్స్ ఏమైనా ఉన్నాయా ? .
వార్డెన్ : బాబూ ....... నువ్వు చెప్పిన సంవత్సరాలలో నాకు తెలిసి ఎటువంటి దత్తత స్వీకారోత్సవం జరుగలేదు - అదీ కాకుండా ఏ తల్లీ ....... తన బిడ్డను అనాధాశ్రమంలో వదిలి వెల్లనేలేదు .
వార్డెన్ ....... తప్పుగా అనుకోకండి , ఈ విషయాలన్నీ మా నాన్నగారు స్వయంగా చెప్పారు - మీ వయసు వలన ఏమైనా మరిచిపోయి ఉండవచ్చు .
వార్డెన్ : చెప్పానుకదా బాబూ ...... ఇలాంటివేవో ఉంటాయనే , అనాథ పిల్లల గురించి ప్రతీ చిన్న విషయాన్నీ వదలకుండా రికార్డ్ చేస్తూ వస్తున్నాను - కావాలంటే ఒక ఫైల్ తీసుకుని చూడు .
ఫైల్ చూసి చిన్న చిన్న విషయాలు కూడా ఉండటం చూసి నిజమే అనుకున్నాను - చిన్న చిన్న విషయాలే రికార్డ్ చేసినవారు దత్తత గురించి రికార్డ్ చెయ్యకుండా ఉంటారా అని sorry చెప్పి ఇక అమ్మ గురించి తెలిసే చివరి అవకాశం కూడా చేజారిపోయింది అని బాధతో కూర్చున్నాను .

వార్డెన్ : బాబూ ....... నీ బాధను అర్థం చేసుకోగలను . దత్తత తీసుకున్న మీ father ను ఒకసారి పిలుచుకునివస్తే - చూస్తే ...... ఏమైనా .......
వెంటనే మొబైల్ తీసి డాడీని చూయించి వీరే వార్డెన్ ........
వార్డెన్ : నాకు తెలిసి మీ father ను చూడటం ఇదే తొలిసారి .......
వార్డెన్ అలా అనకండి , ఆయన్నే స్వయంగా పిలుచుకునివస్తే గుర్తుకురావచ్చు - నా అదృష్టం వలన ఎలాగో మా డాడీ ఊరిలోనే ఉన్నారు - నిమిషాలలో తీసుకువస్తాను అని బయటకు పరుగుతీసి ఇంటికి చేరుకున్నాను .

నేరుగా డాడీ రూంలోకివెళ్లి ఫైల్ చూస్తున్న డాడీ చేతిని అందుకుని అర్జెంట్ గా వెళ్ళాలి రండి అని లాగాను .
సడెన్ గా లాగడంతో డాడీ చేతిలోని ఫైల్ కిందకుపడింది . డాక్యుమెంట్స్ అనుకుంటే బ్రూస్లీ మూవీలో పోసాని చేతిలోనుండి జారిపడిన ఫైల్ లోలా అమ్మాయిల ఫోటోలు ఉండటం చూసాను .
డాడీ అలర్ట్ అయ్యి కంగారుపడుతూ అందుకుని లాకార్లో ఉంచి లాక్ చేసేసారు - ముఖంపై చెమటతో ఆ ఫోటోలు ఆ ఫోటోలు ........ న్యూ సెక్రటరీ కోసం మహేష్ ....
Ok dad ఇప్పుడవన్నీ అనవసరం , వెంటనే ఒకచోటకు వెళ్ళాలి రండి అంటూ లాక్కుంటూ హాల్లోకి వచ్చాను .

Dad : మహేష్ స్టాప్ మహేష్ స్టాప్ ....... ఎక్కడికి ఎక్కడికి ....... ఇంత అర్జెంట్ .
అనాధాశ్రమానికి dad .......
Dad : what అంటూ ఆగి మరింత కంగారుపడుతున్నారు , ఆనాధాశ్రమానికా ... ? ఎందుకు ఎందుకు ? .
Sorry dad నా జీవితంలో మీరు ఉన్నా , మీతో గడిపిన క్షణాలను వేళ్ళతో లెక్కపెట్టవచ్చు - కనీసం నన్ను కన్న తల్లి ఎవరో తెలుసుకుని అమ్మ ప్రేమనైనా పొందుతాను . అనాధాశ్రమానికి వెళ్లే వచ్చాను అసలు నా గురించిన ఇన్ఫర్మేషన్ ఒక్కటి కూడా లేదు అని అనాధాశ్రమం లో జరిగినది వివరించాను - కనీసం మిమ్మల్ని చూసైనా ఏదైనా సమాచారం తెలుస్తుందేమో ....... , నాపై ఏమాత్రం ప్రేమ ఉన్నా ...... నాతోపాటు రండి - అమ్మ గురించి తెలిసిందని మిమ్మల్ని వదిలివెళ్లే మనస్తత్వం కాదు నాది , సో .........

డాడీ ఫేస్ ఫీలింగ్స్ పూర్తిగా మారిపోయాయి - నా చేతుని వదిలించుకుని నేను ఎక్కడికీ రాను , నువ్వు కూడా ఈ సంగతి మరిచిపోతేమంచిది మళ్లీ వారి గదిలోకి వెళ్లిపోతున్నారు .
డాడీ డాడీ ....... అంటూ కళ్ళల్లో చెమ్మతో ప్రాధేయపడుతున్నాను .
ఆయా : అయ్యగారూ ...... బాబు పెద్దవాడయ్యాడు , జరిగినది తెలుసుకునే సమయం వచ్చిందనుకుంటాను - బాబు అర్థం చేసుకుంటాడు .
Dad : ఆయా ....... అంటూ కోపంతో ఊగిపోయారు - గదిలోకి వెళ్ళమని ఆర్డర్ వేశారు .
ఆయా : మరొక్క మాట మాట్లాడకుండా నావైపు చూస్తూ వెళ్లిపోయారు .

ఆయా మాటలకు - dad కోపానికి ....... కొన్నిక్షణాలపాటు షాక్ లో ఉండిపోయాను. డాడీ ..... వారి గదిలోకి వెళ్లిపోవడం చూసి dad dad అంటూ వెళ్లి నాతో ఏదో దాస్తున్నారు - అనాధాశ్రమానికి రమ్మన్నా రావడం లేదు - ఏ విషయమైనా తెలుసుకుని ఆలోచించి వ్యక్తపరిచే నిర్ణయం తీసుకునే పరిజ్ఞానానికి చేరుకున్నాను - ఏదైనా ఆ విషయం ఏదైనా అది ఖచ్చితంగా అమ్మ గురించే అయి ఉంటుంది please dad please చెప్పండి చెప్పండి అని ప్రాధేయపడ్డాను .
ఇక లాభం లేదు అనుకున్నారో ఏమో ....... , మహేష్ ....... వారంలో ఐఐటీ exam ఉందికదా వెళ్లి ప్రిపేర్ అవ్వు - ఇప్పుడు చెబితే నువ్వు డిస్టర్బ్ అవ్వవచ్చు - ఐఐటీ ఎంట్రన్స్ కాగానే నువ్వు తెలుసుకోవాలన్న దానితోపాటు చాలా తెలుసుకుంటావు , నీ భవిష్యత్తు ఆ రోజు నిర్ణయించబడుతుంది , మన జీవితాలు మలుపు తీసుకోనున్నాయి - ఆ క్షణం వరకూ నన్ను కానీ , ఆయాను కానీ ఏవిషయం అడగను అని మాట ఇవ్వాలి అని ప్రామిస్ చేయించుకునేవరకూ వదలనే లేదు .
అలాగే dad ఇన్ని సంవత్సరాలు ఆగాను వారం రోజులు ఆగలేనా అని ప్రామిస్ చేసి ప్రిపేర్ అవ్వడానికి నా గదిలోకివెళ్ళాను .

నా 18 ఇయర్స్ జీవితంలో డాడీ ...... ఇంటిలో maximam మూడురోజులు ఉన్నది చూడలేదు - అలాంటిది వారం రోజులు ఉండటం నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది - వారం రోజుల్లో అమ్మ గురించి తెలుస్తుంది అన్న ఆశతో మరింత బాగా ప్రిపేర్ అయ్యాను కానీ రోజులు మాత్రం యుగాలుగా గడుస్తున్నాయి . అమ్మ గురించే ఆలోచిస్తూ క్షణమోక యుగంలా గడిపాను - ఆయా అయితే నావైపు కన్నెత్తి కూడా చూడటం లేదు , డాడీ కోపాగ్నికి లోనవుతున్నట్లు కేకలు నా గదివరకూ అప్పుడప్పుడూ వినిపిస్తూనే ఉన్నాయి - ఎలాగోలా వారం రోజులు గడిచిపోయాయి " .

స్నానం చేసి రెడీ అయ్యి ప్రింటర్ నుండి హాల్ టికెట్ ప్రింట్ తీసుకుని కిందకువచ్చాను .
ఆయా ....... ఏమాత్రం మాట్లాడకుండా తలదించుకుని టిఫిన్ వడ్డించారు .
ఏమిటి ఆయా ...... ఒకేసారి ఇన్ని టిఫిన్స్ చేశారు ? ఇడ్లీ - వడ - పూరీ - దోస .... లాంటి వెజ్ లతోపాటు చికెన్ ఫ్రై - మటన్ కైమా లాంటి నాన్ వెజ్ కూడా వడ్డించారు .
ఆయా : కళ్ళల్లో చెమ్మతో , మళ్లీ ఈ అవకాశం లభిస్తుందో లేదో బాబూ .......
ఆయా .......
ఆయా: కన్నీళ్లను తుడుచుకుని , ఏమీ లేదు ఏమీ లేదు తిను బాబూ ....... exam కు ఆలస్యం అవుతుంది అని నాకిష్టమైనవన్నీ వడ్డించారు .
చాలు చాలు ఆయా ....... ఇన్ని తింటే exam హాల్లో నిద్రపోతాను అని మ్మ్మ్ మ్మ్మ్ ..... టేస్టీ అంటూ తింటూ , డాడీ ఎక్కడ అని అడిగాను .
ఆయా : తెల్లవారిన దగ్గర నుండీ కాల్స్ లో బిజీబిజీగా ఉన్నారు - exam తరువాత కలుస్తానని చెప్పమని చెప్పి బయటకు వెళ్లిపోయారు బాబూ .......

తనివితీరా తిని వెళ్ళొస్తాను ఆయా అనిచెప్పి బయటకు నడిచాను .
ఆయా : బాబూ ...... అంటూ పిలిచి , కన్నీళ్లను తుడుచుకుంటూ వచ్చి చల్లగా ఉండు బాబూ అంటూ చేతితో కురులను స్పృశించి దీవించారు .
ఆయా ....... ఏమైంది మీకు , కొత్తగా ప్రవర్తిస్తున్నారు .
ఆయా : ఏమీలేదు బాబూ ...... ఆలస్యం అవుతోంది వెళ్లు వెళ్లు - exam బాగా రాయాలి .
థాంక్యూ ఆయా అని ఒకసారి కౌగిలించుకుని పరుగున కారులో చేరి సెంటర్ కు చేరుకున్నాను . అమ్మ గురించి తెలుసుకోబోతున్నానన్న ఉత్సాహంతో exam మరింత బాగా రాసి బయటకువచ్చాను .

డాడీ కమింగ్ అంటూ కారులో కూర్చుని లాకర్లో ఉన్న మొబైల్ on చెయ్యగానే , డాడీ నుండి మెసేజ్ వచ్చింది ఒక లొకేషన్ ను రమ్మని .......
Yes డాడీ అంటూ ట్రాఫిక్ లో ఆగి ఆగుతూ గంట తరువాత చేరుకున్నాను . చూస్తే అది రిజిస్టర్ ఆఫీస్ ........
మా చీఫ్ మేనేజర్ గారు ....... నాకోసమే ఎదురుచూస్తున్నట్లు , మహేష్ ..... లోపలికి వెళదాము అని పిలుచుకునివెళ్లారు - డాడీ ..... లోపల లాయర్లు - ఆఫీసర్ ముందు కూర్చుని ఉండటం చూసి dad అంటూ సంతోషంతో వెళ్ళాను .
Dad : మహేష్ ....... ఈ ఆస్తి డాక్యుమెంట్స్ మీద సంతకాలు చెయ్యి అని చూయించారు .
నాకు కావాల్సినది అమ్మ గురించి కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా చూయించిన చోట అల్లా సంతకాలు చేసి dad వైపు చూస్తున్నాను .
Dad : Congratulations మహేష్ ....... ఈ క్షణం నుండీ మన సగం ఆస్థులన్నీ నీ పేరున రాయబడ్డాయి . ఇక్కడ హైద్రాబాద్ లో ఉన్న మన ప్రాపర్టీస్ - offices మొత్తం నీ సొంతమయ్యాయి - హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ నీ బ్యాంక్ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి . జాగ్రత్తగా విను ఈ క్షణం నుండీ నీకూ - నాకు ఏ సంబంధం లేదు , ఇక జీవితంలో మనం కలుసుకోబోము , నా బిజినెస్ అంతా ఇక అమెరికాలోనే , ఇండియా లో అడుగుకూడా పెట్టను - నీ స్టడీస్ పూర్తయ్యి చైర్మన్ బాధ్యతలు తీసుకునేంతవరకూ మనకు నమ్మకస్థులైన మేనేజర్ మరియు లాయర్స్ బిజినెస్ చూసుకుంటారు , నీకు ఇష్టం లేకపోతే మార్చుకోవచ్చు , వీరినే ఎందుకు నియమించానంటే మన గురించి వీళ్లకు ఏదీ తెలియదు - నా ఫ్లైట్ సమయం అయ్యింది నేను వెళ్లిపోతున్నాను - ఇక మనం .........
Dad dad అంటూ వెనుకే బయటివరకూ వచ్చి ఆగకపోవడంతో అడ్డుగా నిలబడ్డాను - అమ్మ గురించి చెబుతానన్నారుగా అని అడిగాను .
Dad : చెప్పానుకదా నీకూ నాకూ ఇక సంబంధం లేదని , ఎప్పుడైతే అమ్మ గురించి ఆడిగావో ఆ క్షణమే నిన్ను వదిలి వెళ్ళాల్సింది - మన మధ్య ఏ బంధం లేనట్లు తెగతెంపులు చేసుకోవడానికి ఈ వారం సమయం తీసుకున్నాను - నాకు ..... అమెరికాలో ఇద్దరు భార్యలు మరియు మా పిల్లలు ఉన్నారు నా సర్వస్వం వారే , ఇక నా గురించి - మీ అమ్మ గురించి ఆలోచించడం మానేసి నీ జీవితం నువ్వు గడువు గుడ్ బై ........
డాడీ ....... నాకు ఇద్దరు అమ్మలు - బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా ? , చెప్పరే ...... నాకు సంతోషమే డాడీ - పదండి మీతోపాటు నేనూ వస్తాను .
Dad : నో నెవర్ ....... , వాళ్లనే కాదు నన్ను కూడా కలవడానికి వీలు లేదు - నిజం చెప్పాలంటే నువ్వంటే నాకు ఇష్టమే లేదు , చిన్నప్పుడే నిన్ను వదిలించుకునేవాడిని కానీ నీ వల్లనే ఈ ఆస్థులన్నీ వచ్చాయి , నువ్వు మరియు ...... పుట్టిన తరువాతనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను - నిన్ను దూరం చేసుకుంటే మళ్లీ రోడ్డుపైకి చేరతాను అని జాతకం చెప్పడంతో ఇప్పటివరకూ భరించాను . నా దారికి అడ్డురాకు అనిచెప్పి ప్రక్కకు లాగేసి కారులో వెళ్లిపోయారు .

సర్ - మహేష్ ....... అంటూ లాయర్లు - మేనేజర్ వచ్చి ప్రాపర్టీస్ మరియు offices గురించి వివరిస్తున్నారు .
అవేమీ పట్టించుకోకుండా ....... , ఇక అమ్మ విషయం తెలిసిన ఏకైక వ్యక్తి ఆయా అని గుర్తుకురాగానే ఇంటికి చేరుకున్నాను . ఆయా ఆయా ....... అంటూ కేకలువేస్తూ లోపలికి పరుగుతీసాను .
హాల్లో కానీ - వారి రూంలోకానీ కనిపించలేదు , ఆయా ఆయా ...... అంటూ వంట గదిలోకి వెళ్ళాను - అక్కడకూడా లేకపోగా ఎవరో అంటీ వంట చేస్తూ నమస్తే అయ్యగారూ ...... అని దండం పెట్టారు .
ఎవరు మీరు ? ఇక్కడ ఏమి చేస్తున్నారు ? మా ఆయా ఎక్కడ ? ........ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాను .
అంటీ : నన్ను ఈ పనిలో ఉంచిన వారా ...... ? , ఎప్పుడో వెళ్లిపోయారు అయ్యగారూ ........
వెళ్లిపోయారా ...... ? , ఎక్కడికి ఎందుకు ? , మిమ్మల్ని పనిలో పెట్టడం ఏమిటి ? .
అంటీ : నిన్న వారు వచ్చి బాగా డబ్బు ఇస్తారు , చిన్నయ్యగారిని ఏ లోటూ లేకుండా చూసుకోవాలి - వంటలు బాగా చెయ్యాలి , ఇంటిని చూసుకోవాలి అని ఏడుస్తూ చెప్పి ఉదయం తీసుకొచ్చి పనిలోపెట్టి ఇక రాను అనిచెప్పి వెళ్లిపోయారు అయ్యగారూ ........
ఇకరాను అని చెప్పారా ? , అంటే ఉదయం నన్ను ఆశీర్వదించడం - చల్లగా ఉండమని చెప్పినది - కంగారు కంగారు పడినది ఇందుకే అన్నమాట ....... , ఆయా ....... నాకు నిజం చెప్పకుండా వెళ్ళకండి అని మళ్ళీ కారులో ఆయా ఇంటికి చేరుకున్నాను .
ఇంటికి తాళం వేసి ఉండటం చూసి చుట్టుప్రక్కల వాళ్ళను అడిగితే తెలిసింది ఏమిటంటే , ఫ్యామిలీ అంతా లగేజీతోపాటు నిన్న - ఆయా ...... నన్ను ఎంట్రన్స్ కు పంపించి వారి దగ్గరకు వెళ్లిపోవడం .
ఒక్కసారిగా వొళ్ళంతా చెమటలతో గింగిరాలు తిరిగినట్లు అనిపించింది . ఐఐటీ ఎంట్రన్స్ తరువాత అమ్మ ప్రేమను పొందుతాను , నా జీవితమే మారిపోతుంది అనుకుంటే తలక్రిందులైంది అని కన్నీళ్లు ఆగడం లేదు . Dad చెప్పినట్లుగా మన జీవితాలు మారిపోబోతున్నాయి - భవిష్యత్తు నిర్ణయించబడుతుంది అంటే ఏమో అనుకున్నాను , నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయారన్నమాట , ఆయాను కూడా నా నుండి దూరం చెయ్యడం డాడీ వేసిన కన్నింగ్ ప్లాన్ అని బాధపడుతూ ఇంటికి చేరి సోఫాలో చేరాను .

అయ్యగారూ ....... అంటూ వాటర్ - కూల్ డ్రింక్ - టీ తీసుకొచ్చారు అంటీ ......
చల్లగా నీళ్లు తాగగానే ఏదో తోచడంతో డాడీ రూంలోకి పరుగున వెళ్ళిచూస్తే మొత్తం ఎంప్టీ ....... , అమ్మ గురించి చిన్న ఫోటో అయినా దొరుకుతుందేమోనని చూస్తే ఎక్కడ చూసినా నిరోధ్ ప్యాకెట్స్ మాత్రమే కనిపించాయి . ఇక ఒక్క క్షణం కూడానా గదిలో ఉండలేక నా గదిలోకి వచ్చేసాను .
అమ్మ గురించి ఆడిగినందుకే ఇలా వదిలి వెళ్లిపోయారు అంటే అమ్మ ఏమైనా తప్పు ......... నో నో నో అమ్మ అంటేనే పవిత్రం - స్వచ్చం , అమ్మా ....... ఒక్క క్షణం ఇలా ఆలోచించినందుకు కూడా నన్ను మన్నించకండి - ఈ పాపం మలినం తొలగిపోయేలా రేపే కనకదుర్గమ్మను దర్శించుకుంటాను , రేపు కాదు ఇప్పుడే అని ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్లోకి వెళ్ళాను .
రోజుకొక అమ్మాయితో - అమ్మాయిల ఫోటోలు ఫైల్స్ లో - నిరోధ్ లు రూంలో ఉంచుకున్న అతడిని డాడీ అని పిలవడానికి కూడా మనసొప్పడం లేదు . ఇంత కన్నింగ్ గా ఆలోచించే వాడిని ఏమని పిలవాలో కూడా అర్థం కావడం లేదు .

తలస్నానం చేసి రెడీ అయ్యి లగేజీ తీసుకుని కిందకువచ్చాను . అంటీ ....... విజయవాడ వెళుతున్నాను - నేను వచ్చేటప్పటికి థర్డ్ ఫ్లోర్లో ఉన్న రూమ్స్ అన్నింటినీ మొత్తం శుభ్రం చేయించి లాక్ కాదు ఏకంగా సీల్ వేసేయ్యండి అని డబ్బు ఇచ్చి కారులో ఎయిర్పోర్ట్ కు బయలుదేరాను . నెక్స్ట్ ఉన్న ఫ్లైట్ కు టికెట్ బుక్ చేసుకుని గంటలో విజయవాడ చేరుకున్నాను .
సాయం సమయంలో అమ్మవారిని దర్శించుకుని అమ్మా క్షమించు అమ్మా క్షమించు అంటూ నదిలో వంద సార్లకు పైనే మునిగిలేచి మలినాన్ని తొలగించుకుని పవిత్రంగా మళ్లీ వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నాను - అమ్మా దుర్గమ్మా ....... నాకు జన్మనిచ్చిన అమ్మ ఎక్కడ ఉన్నారు ? , ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండేలా చూడు తల్లీ ....... అని మొక్కుకున్నాను . ఇలా మాట్లాడటం తప్పే కానీ తప్పడం లేదు " అమ్మను కలిసేంతవరకూ మళ్లీ మీ దర్శనం చేసుకోను " ఈ బిడ్డను మీరే మన్నించాలి - అమ్మను కలిసిన మరుక్షణం అమ్మతో కలిసి అష్టాదశ అమ్మవార్ల దర్శనం చేసుకుంటాము అని మొక్కుకున్నాను . ఆ రాత్రికి అమ్మ దర్శనం కోసం వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేసి భక్తితో రాత్రంతా జాగరణ చేసి ఉదయం నదీ స్నానమాచరించి మరొకసారి దర్శించుకుని ప్రార్థించి హైద్రాబాద్ చేరుకున్నాను .

అమ్మా అమ్మా ....... అంటూ కలవరిస్తూ నిద్రాహారాలు మానుకుని గదిలోనే ఉండిపోవడం వలన నీరసంతో జ్వరం వచ్చినట్లు అంటీ గమనించి డాక్టర్ ను పిలుచుకునివచ్చారు .
ఇంజక్షన్ వేసి గ్లూకోజ్ ఎక్కించి టాబ్లెట్స్ ఇచ్చి కడుపునిండా తినేలా చూడమని చెప్పి వెళ్లిపోయారు .
అంటీ : అయ్యగారూ ....... రెండు రోజులుగా అమ్మనే కలవరిస్తున్నారు - ఎక్కడ ఉన్నారో చెప్పండి నేనే స్వయంగా వెళ్లి తీసుకొస్తాను .
ఎక్కడ ఉన్నారో తెలియదు అంటీ ...... , చిన్నప్పటి నుండీ అమ్మ ప్రేమకు దూరమయ్యాను .
అంటీ : చిన్నప్పటి నుండినా ....... అంటూ ఆశ్చర్యపోయారు . అమ్మగారు ఎక్కడ ఉన్నారో ఎవరికైనా తెలిసి ఉంటుంది కదా అయ్యగారూ , వారిని అడిగితే తెలియవచ్చు .
( డాడీ నే ....... అతడినే అడగాలి ) అని జ్వరాన్ని సైతం లెక్కచేయకుండా సడెన్ గా లేచి గ్లోకోజ్ ను పీకేసి పాస్పోర్ట్ తీసుకుని టికెట్ బుక్ చేసుకుని న్యూయార్క్ చేరుకున్నాను .

ప్రతీ సంవత్సరం సెలవులకు వెళ్లడం వలన ఎయిర్పోర్ట్ నుండి నేరుగా మా ఆఫీస్ దగ్గరికి చేరుకున్నాను .
బిగ్గెస్ట్ షాక్ " MIM " బోర్డ్స్ స్థానంలో ****** లోగోస్ ఉండటం చూసి లోపలికి వెళ్లబోతే సెక్యూరిటీ ఆపేశారు . అక్కడి మేనేజర్ నన్ను గుర్తుపట్టడం వలన లోపలికి పంపమని సైగ చేశారు .
వెళ్లి డాడీ గురించి - మాకంపెనీ గురించి అడిగాను .
మేనేజర్ : ఏమైందో ఏమో తెలియదు మహేష్ ....... , 10 రోజుల ముందు వచ్చి సిరులను కురిపిస్తున్న మొత్తం కంపెనీని ఫాన్సీ ప్రైస్ కు సేల్ చేసి వెళ్లిపోయారు - ఇక మళ్లీ సర్ ను చూడనేలేదు .
అదేంటి మేనేజర్ గారూ ....... మూడు రోజుల ముందు ఇక్కడికే వచ్చారు కదా .....
మేనేజర్ : ఇక్కడికైతే రాలేదు - కంపెనీ అమ్మేశాక ఇక రావాల్సిన అవసరం కూడాలేదు .
షాక్ లమీద షాక్ ....... ఇంత కన్నింగ్ మైండ్ ....... చెప్పాడు కదా నువ్వు కలవాలనుకున్నా నేను కనిపించను అని మొత్తం అమ్ముకుని ప్రపంచ పటంలో ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారో అని బాధతో వెనుతిరిగాను .
Next page: Update 14
Previous page: Update 12