Update 14

హైద్రాబాద్ చేరుకుని ఎయిర్పోర్ట్ పార్క్ చేసిన కారులో నిరాశ - బాధ - కళ్ళల్లో చెమ్మతో ఇంటికి చేరుకున్నాను . సెక్యూరిటీ మెయిన్ గేట్ తెరవగానే కారులోనుండే ఇంటిని చూస్తుంటే డాడీ మోసం - కన్నింగ్ పదే పదే గుర్తుకురావడంతో ఇంట్లోకి అడుగుపెట్టాలనికూడా అనిపించలేదు - అతడిని గుర్తుచేసే ఇంటిలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని సెక్యురిటీ మరియు అంటీని పిలిచి పర్సులో - కారులో ఉన్న డబ్బునంతా ఇచ్చేసి ఇంటికి వెళ్లిపోమని చెప్పాను .
పెద్దమొత్తంలో డబ్బుని చూసి సంతోషంతో దండాలు పెట్టారు . ఇంటిని లాక్ చేసివచ్చి తాళాలు అందించి వెళ్లిపోయారు .
ఇంటికి గుడ్ బై చెప్పి హైద్రాబాద్ లో పలుచోట్ల మా బిల్డింగ్స్ ఉన్నప్పటికీ అక్కడకూడా ఉండటం ఇష్టం లేక అటు నుండి ఆటే హోటల్ కు చేరుకున్నాను . మేనేజర్ కు కాల్ చేసి ప్రాపర్టీస్ , కంపెనీ మరియు నాకు సంక్రమించిన మొత్తం మొత్తం ఇక్కడ ఉన్న ఆస్థులన్నింటినీ అమ్మేయాలనుకుంటున్నాను , వారంలో డీల్ పూర్తయిపోవాలి నేను నష్టపోయిన పర్లేదు .........
మేనేజర్ : సర్ ...... అదీ అని చెప్పబోయి , yes సర్ మీఇష్టం అని బాధతో బదులిచ్చారు .
ఫ్రెష్ అయ్యి షాపింగ్ కు వెళ్ళాను . అతడిని గుర్తుచేసే వస్తువు ఒక్కటీ ఉండకూడదని డ్రెస్సెస్ - వాచ్ - చైన్ - పర్స్ - మొబైల్ - నెంబర్ ........ అన్నింటినీ వదిలేసి వాటి స్థానంలో కొత్తవి తీసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాను .

మూడురోజులపాటు అమ్మ గురించే ఆలోచిస్తూ తలుచుకుంటూ - అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో ఫీల్ అవుతూ ఆనందిస్తూ - బాధపడుతూ హోటల్లోనే స్టే చేసాను .

మరుసటిరోజు మేనేజర్ నుండి కాల్ వచ్చింది . కంపెనీ మరియు మొత్తం ప్రాపర్టీస్ అన్నిటినీ ఒక్కరే కొనడానికి ముందుకువచ్చారని , వాటి విలువ కంటే ఎక్కువే ఇవ్వడానికి రెడీగా ఉన్నారని , ప్రస్తుతానికి మన మెయిన్ ఆఫీస్ దగ్గర ఉన్నారని వస్తే సింగిల్ సిట్టింగ్ లో సెటిల్ చేసుకోవచ్చని బాధకాలగలిసిన వాయిస్ తో చెప్పారు .
గుడ్ న్యూస్ మేనేజర్ ........ వెంటనే అక్కడ ఉంటాను అని కారులో మెయిన్ ఆఫీస్ చేరుకున్నాను . బయ్యర్ - మేనేజర్ తోపాటు లాయర్లు మరియు చుట్టూ కంపెనీ ఆఫీసర్స్ - వర్కర్స్ ఉన్నారు . ప్రతీ ఒక్కరి ముఖంలో బాధ - కంగారు ప్రస్ఫూటంగా కనిపిస్తోంది .

కారు దిగగానే ఫారిన్ బయ్యర్ ఉత్సాహంతో నాదగ్గరికే వచ్చి చేతులు కలిపారు . అమెరికాలో మీ కంపెనీలను కొన్నది మేమేనని - ఇప్పుడు ఇండియా లో ఉన్న మీ కంపెనీలను కూడా కొనేసి అమెరికాలోలానే ఇక్కడకూడా మా అమెరికన్ జెండా పాతేస్తాము అని గర్వంతో చెప్పాడు . నువ్వు కోరిన అమౌంట్ కంటే రెండింతలు పే చెయ్యడానికి రెడీగా ఉన్నాము - నువ్వు ok అంటే మీ లాయర్స్ మా లాయర్స్ సమక్షంలో ఇప్పుడే ఇక్కడే సింగిల్ పేమెంట్ తో డీల్ పూర్తి చెయ్యవచ్చు .
( వాడి మాటలు విన్న మేనేజర్ - ఆఫీసర్స్ - వర్కర్స్ కళ్ళల్లో చెమ్మచేరినట్లు తెలుస్తోంది ).
గుడ్ న్యూస్ ....... డీల్ మొత్తం మా మేనేజర్ - లాయర్స్ చూసుకుంటారు గో ఎహెడ్ అని అనుమతి ఇచ్చాను .

బయ్యర్ తోపాటు వచ్చినవాళ్ళు సంతోషంతో షేక్ హ్యాండ్స్ - హగ్స్ లతో ఎంజాయ్ చేస్తున్నారు - చుట్టూ ఉన్న వర్కర్స్ అందరిలో కన్నీళ్లు ........
డీల్ అంతా పూర్తయిపోయింది - ఒక్క సంతకం చేస్తే tax పోగా మొత్తం అమౌంట్ నా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుందని బాధతో తడబడుతూ పిలిచారు మేనేజర్ ..........
పెదాలపై చిరునవ్వులతో వెళ్లి బయ్యర్ ఎదురుగా కూర్చుని పెన్ అందుకుని సంతకం చెయ్యబోతూ ఒకసారి మేనేజర్ - ఆఫీసర్స్ - వర్కర్స్ వైపు చూసి చలించిపోయాను . అంతలోనే " మా జెండా పాతేస్తాము " అన్న అమెరికన్ బయ్యర్ మాటలు గుర్తుకురావడంతో పెన్ ప్రక్కన ఉంచేసి , వన్ మినిట్ నికోలస్ ........ కంపెనీ కొన్నాక రన్ చేస్తారా లేక మూసేసి వేరే బిజినెస్ .......
బయ్యర్ నికోలస్ : నో నో నో అమెరికాలో నీ కంపెనీ తీసుకున్న వారంలోనే టాప్ 25 బిలియనీర్ల స్థానంలోకి చేరాను , టాప్ 5 లో చేరడమే నా లక్ష్యం - చుట్టూ చూసి ఈ కంపెనీ వలన త్వరలోనే తీరబోతోంది అని మురిసిపోతున్నాడు - అక్కడ డాలర్లు ఇక్కడ ఇండియన్ కరెన్సీ ను రాసులుగా కురిపించే ట్రెండింగ్ కంపెనీని ఎలా మూసివేస్తాననుకున్నావు .
గుడ్ అంటూ పెన్ అందుకుని మళ్లీ ఆగాను . What about workers ? వారినేమైనా ........
నికోలస్ : నో నో నో వీళ్ళు ఉంటేనే కదా ప్రాడక్ట్స్ తయారయ్యేది , ఒక్కరిని ఒక్కరినీ తొలగించడం జరగదు - ఇప్పటివరకూ హ్యాపీగా ఆడుతూపాడుతూ పనిచేసినట్లున్నారు అందుకే దున్నపోతుల్లా తయారయ్యారు - వన్స్ కంపెనీ నా చేతుల్లోకి వచ్చిందంటే చుట్టూ ఉన్న వీళ్లంతా బానిసలుగా మారిపోతారు - నేను ఆర్డర్ వేసిన సమయం పాటు పనిచేయాలి అప్పుడు ఒక్కొక్కడి నుండి మూడింతలు నాలుగింతలు ప్రాడక్ట్స్ మార్కెట్లోకి పంపించవచ్చు . నేను జాబ్స్ నుండి పీకేసేదల్లా మేనేజర్స్ - ఆఫీసర్స్ ను మాత్రమే , వారి స్థానంలో అమెరికన్స్ ను నియమిస్తాను - ఈ వర్కర్స్ కాదు కాదు బానిసలతో తో ఎలా పని చేయించుకోవాలో వాళ్లకు బాగా తెలుసు - వన్ ఇయర్ వన్ ఇయర్ లోనే నన్ను టాప్ 5 బిలియనీర్లలో ఒకడిని చెయ్యడానికి ఈ బానిసలు రాత్రీపగలూ పనిచెయ్యాల్సిందే ........
( ఆఫీసర్స్ - వర్కర్స్ లో మరింత భయం కనిపిస్తోంది - ఇప్పటివరకూ వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో అర్థమైంది ).
నికోలస్ స్టాప్ ఇట్ or else మరొక్కసారి మావాళ్లను బానిసలు అన్నావో నేనేమి చేస్తానో నాకే తెలియదు - డీల్ క్యాన్సిల్ గెట్ ఔట్ ఆఫ్ మై కంపెనీ అండ్ ఇండియా ....... , ఇండియా is developing country - దానికోసం ప్రతీ ఇండియన్ ఇలానే కష్టపడతాడు , దానిని అలుసుగా తీసుకుని బానిసలు అంటే మా ఒక్కొక్కొడిలో సుభాష్ చంద్రబోస్ ను చూస్తావు అని డాక్యుమెంట్స్ ను చింపేసి విసిరేసాను .
Yes సర్ అంటూ చుట్టూ ఉన్నవాళ్ళంతా పిడికిళ్ళు బిగించారు .

మేనేజర్ - ఆఫీసర్స్ ....... మరొక్క క్షణం కూడా మన కంపెనీ ఆవరణలో వీళ్ళను చూడకూడదు .
Yes సర్ - yes మహేష్ అంటూ అంతులేని సంతోషాలతో పర్ఫెక్ట్ ఇండియన్ ఎదురుపడితే ఇలానే ఉంటుంది అని వారిని మెయిన్ గేట్ బయటకు వదిలివచ్చి , సర్ సర్ మహేష్ ....... అంటూ నినాదాలతో అమాంతం పైకెత్తి సంబరాలు చేసుకున్నారు . వర్కర్స్ అయితే కళ్ళల్లో ఆనందబాస్పాలతో దండాలు పెడుతున్నారు .
కిందకుదిగి అన్నయ్యలూ ....... కోపంలో తీసుకున్న నా నిర్ణయం తప్పు అని మీ అందరినీ చూసిన తరువాతనే తెలిసింది - మిమ్మల్నందరినీ బాధపెట్టినందుకు నన్నే క్షమించండి అని కౌగిలించుకున్నాను .
అంతే వారి సంతోషాలు ఎల్లలు దాటినట్లు నినాదాలతో దద్దరిల్లిపోయింది . Ok ok సంతోషం అన్నయ్యలూ ....... ఇక వెళ్లి మీ మీహోదాలో హ్యాపీగా వర్క్ చేసుకోండి . మేనేజర్ ........ నేను చేసిన తప్పుకు గానూ ఆఫీసర్స్ వర్కర్స్ అందరికీ 3 మంత్స్ బోనస్ ఇవ్వండి .
అంతే సంతోషాలతో మళ్లీ చుట్టుముట్టి చైర్మన్ చైర్మన్ ....... అంటూ నినాదాలతో హోరెత్తించి ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లారు .

మేనేజర్ - చీఫ్ ఆఫీసర్స్ దగ్గరకువెళ్లి నాకొక సహాయం చేస్తారా అని అడిగాను .
మేనేజర్ : ఈ నవ్వులు మళ్లీ మా పెదాలపై చేరాయంటే మీవల్లనే మహేష్ sorry చైర్మన్ గారూ ....... మీకోసం మా ప్రాణాలైనా ఇస్తాము ఆర్డర్ వెయ్యండి .
నవ్వుకున్నాను - మేనేజర్ కాల్ మీ మహేష్ - ఇంత పెద్ద కంపెనీ బాధ్యతలు చేపట్టాలంటే నాకు " వయసు - నాలెడ్జ్ " అవసరం అందుకుగానూ కొన్ని సంవత్సరాలు హయ్యర్ స్టడీస్ కు వేరే చోటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను - ఇక్కడ నేను ఫ్రీ గా ఉండలేకపోతున్నాను - అప్పటివరకూ కంపెనీ బాధ్యతలు మీరే చూసుకోవాలి .
మేనేజర్ : మాపై నమ్మకం ఉంచి ఇంతపెద్ద బాధ్యతలు అప్పగించారు . నిజాయితీ నిబద్ధతగా మరింత ముందుకు తీసుకెళతాము . డైలీ - వీక్లీ - మంత్లీ ....... రిపోర్ట్స్ పంపించి , మీరు ఆర్డర్ వెయ్యగానే మీ ముందు ఉంటాము అని సెల్యూట్ చేశారు .
స్టాప్ ఇట్ మేనేజర్ - ఆఫీసర్స్ ....... అంటూ చేతులను కిందకుదించి చేతులు కలిపాను . ఆరోజంతా ఆఫీస్ - కంపెనీ మొత్తం చుట్టేసి వర్కర్స్ తో సరదాగా గడిపి పర్యవేక్షించాను . సైన్ ఔట్ చేసి మేనేజర్ కు బాధ్యతలు అప్పగించి రేపు ఉదయమే నా ప్రయాణం అన్నాను .
మేనేజర్ : అడగడం సబబు కాదు ఎక్కడికి వెళుతున్నారు అని చిన్నగా అడిగాడు .
నాకే తెలియదు మేనేజర్ ........ , అమ్మవారు ఎటువైపు కనికరించి దారి చూయిస్తారో అటువైపు ( ఎందుకంటే తల్లీ కొడుకులను కలిపే బాధ్యత వారిదే కాబట్టి అంటూ కళ్ళుమూసుకుని ప్రార్థించాను ) - వెళ్ళాక చెబుతాను గుడ్ నైట్ చెప్పేసి హోటల్ చేరుకుని ఫ్రెష్ అయ్యి అక్కడే రెస్టారెంట్ లో డిన్నర్ చేసాను . అలసిపోయినట్లుగా అనిపించి బెడ్ పైకి చేరి టీవీ ఆన్ చేసి ఛానెల్స్ మారుస్తున్నాను .
బ్యూటిఫుల్ బీచ్ అక్కడక్కడా కొండలు సిటీ మొత్తం పచ్చదనం ....... cleanest సిటీస్ లో టాప్ 10 ప్లేస్ ........
ఏది ఏది అంటూ ఉత్సాహంతో టీవీ చూస్తున్నాను . బ్యూటిఫుల్ సిటీ అండ్ cleanest - వైజాగ్ అని సిటీ గొప్పతనాన్ని వివరిస్తుండటం చూసి ముగ్ధుడినైపోయాను . Yes yes వైజాగ్ ఫిక్స్ - అమ్మవారికి థాంక్యూ చెప్పి వైజాగ్ అందాలను చూస్తూ చూస్తూనే అమ్మను కలవరిస్తూ నిద్రలోకిజారుకున్నాను .

రేయ్ మహేష్ ....... హైద్రాబాద్ లో ఇక ఏమాత్రం ఉండకూడదు లేరా అని మనసు పరితపించడంతో సడెన్ గా లేచి కూర్చున్నాను . సమయం చూస్తే 7 గంటలు , వైజాగ్ కు నెక్స్ట్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసాను - లేచి ఫ్రెష్ అయ్యి షాపింగ్ లగేజీని ప్యాక్ చేసుకుని కిందకువచ్చి చెకౌట్ అయ్యి కారులో లగేజీ ఉంచాను . ఆకలివేస్తున్నా ....... హైద్రాబాద్ లో తినడం ఇష్టం లేక ఎయిర్పోర్ట్ కు బయలుదేరాను .
దారిలో ఒక షోరూం బయట స్టైలిష్ అండ్ బ్యూటిఫుల్ జిప్సీ కనిపించడం - మనసుకు హత్తుకోవడంతో మరొక ఆలోచన లేకుండా కొనాలని ఫిక్స్ అయిపోయాను - అందులోనూ ఈ కారు పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తుండటంతో వదిలించుకోవాలని షోరూం దగ్గర ఆగాను .
కారుని ఎక్స్చేంజ్ చేసి ఎక్కువ అయిన అమౌంట్ పే చేసి అక్కడికక్కడే డెలివరీ తీసుకున్నాను . లగేజీ వెనుక చేర్చి జిప్సీ లో కూర్చోగానే లాంగ్ డ్రైవ్ వెళ్లాలని ఆశ కలగడంతో గంట ముందు బుక్ చేసిన ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి బై రోడ్ ప్రయాణం మొదలుపెట్టాను .

గంటలో సిటీ బయటకువచ్చి హైవే ప్రక్కన ఉన్న బంకులో ట్యాంక్ ఫుల్ చేయించి ఓపెన్ టాప్ లో హుషారుగా ప్రయాణం సాగించాను . వాతావరణం కూడా చల్లగా ఉండి అనుకూలించడంతో జాలీ జాలీగా దూసుకుపోతున్నాను .
11 గంటల సమయంలో కడుపులో ఎలుకలు తిరుగుతున్నట్లు అనిపించడంతో నెక్స్ట్ వచ్చిన టౌన్ లోని చిన్న హోటల్లో వేడివేడిగా టిఫిన్ చేసాను . స్టార్ హోటల్లో కంటే ఇలాంటి చిన్న చిన్న హోటల్స్ లో ఫుడ్ టేస్ట్ బాగుంది అని డబల్ అమౌంట్ పే చేసానుఎందుకంటే ఇదే టిఫిన్ అక్కడ చేసి ఉంటే ఇంతకు పదింతలు బిల్ వేసేవాడు - టేస్ట్ కూడా ఇందులో సగం ఉండేది అని మనసులో అనుకుని కూల్ డ్రింక్ - వాటర్ బాటిల్ తీసుకుని ప్రయాణం మొదలుపెట్టాను .

మధ్యాహ్నం 3 గంటల సమయంలో విజయవాడ బోర్డ్ చూసి ఆశ్చర్యపోయాను - డ్రైవ్ చేస్తూనే మొబైల్ లో సెర్చ్ చేస్తే వైజాగ్ కు విజయవాడ ద్వారా రూట్ ........
అమ్మా దుర్గమ్మా ....... నాకు వైజాగ్ పై మనసుకలిగేలా చేసి మీ దర్శనం చేసుకునే వెళ్లేలా చేశారా ...... అంతకంటే అదృష్టమా అంటూ కనకదుర్గమ్మ దివ్య దర్శనం చేసుకుని , అమ్మను కలిసేలా చూడమని మళ్లీ మళ్లీ మొక్కుకుని అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించాను - కొద్దిసేపు అమ్మవారి సన్నిధిలో విశ్రాంతి తీసుకుని ప్రయాణం సాగించాను .
అమ్మవారి దర్శనం చేసుకోవడం - అన్న ప్రసాదం స్వీకరించాక ప్రయాణం ఎలా ఉంది అంటే అమ్మ ఒడిలో హాయిగా సేదతీరుతూ వెళుతున్నట్లుగా ఉంది .
నెక్స్ట్ స్టాప్ రాజమండ్రి లో టీ తాగి , ఇక నెక్స్ట్ స్టాప్ వైజాగ్ అని తెలిసి పెదాలపై చిరునవ్వులు చిగురించాయి- వెళ్ళగానే ఫస్ట్ బ్యూటిఫుల్ బీచ్ చూడాలి అని మరింత ఉత్సాహంగా పోనిచ్చాను - ఉదయం నుండీ డ్రైవ్ చేస్తున్నా ఎక్కడా అలసట అనేదే తెలియలేదు ( ఎలా తెలుస్తుంది అమ్మవారి దర్శనం చేసుకున్నాక అని నాలో నేనే ఆనందించాను ) , నాకిష్టమైన మనసు గెలిచిన జిప్సీ కూడా ఎక్కడా ట్రబుల్ ఇవ్వకపోవడంతో మేరే జాన్ అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలాను . - చీకటి పడటంతో హెడ్ లైట్స్ వెలుగులో జాగ్రత్తగా పోనిచ్చాను .

రాత్రి 8 గంటలకు అనకాపల్లి రావడంతో మరికిద్దిసేపట్లో వైజాగ్ అందాలను అదికూడా తొలిసారే విద్యుత్ కాంతులలో చూడబోతున్నాను అని 20 నిముషాలు ఉరికెత్తించాను .
WELCOME TO VIZAG బోర్డ్ చూసి అట్లాస్ట్ అంటూ స్టీరింగ్ పై చేతులను వదిలి పైకెత్తి హుషారుగా యాహూ అంటూ కేకలువేస్తూ కొత్త జీవితం - కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టానన్న సంతోషంలో కొద్దిదూరం ముందుకువెళ్ళాను .
నేను చూస్తుండగానే స్కూటీలో ఒక అమ్మాయి - ఆ వెనుకే కొంతమంది అమ్మాయిలు ఏకంగా నా జిప్సీ కంటే వేగంతో నాకంటే ఉత్సాహంతో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటూ కేకలువేస్తూ చీకటిని సైతం లెక్కచేయకుండా దూసుకుపోతున్నారు .

అమ్మాయిలూ - సిస్టర్స్ ....... కాస్త నెమ్మది చీకటిగా ఉంది , సేఫ్ గా వారి వారి గమ్యస్థానాలకు చేరాలని ప్రార్థించాను .
5 నిమిషాల ప్రయాణం తరువాత దూరంగా ఆ అమ్మాయిలే అనుకుంటాను సర్ సర్ హెల్ప్ హెల్ప్ ..... అంటూ వెహికల్స్ ను ఆపుతున్నారు . రాత్రి కావడంతో ఎవ్వరూ ఆపకుండా వెళుతుండటం చూసి వేగంగా వెళ్లి ఆపాను .
ప్రతీ మూవీలో హీరోయిన్ ప్రక్కన కనిపించే విద్యుల్లేక రామన్ లాంటి లాపుపాటి అమ్మాయి కంగారుపడుతూ పరుగునవచ్చి , సర్ ...... మా ఫ్రెండ్ డివైడర్ ను ఢీకొని పడిపోయింది రక్తం కారుతోంది అని ఏడుస్తూ చెబుతోంది - వెనుక ఉన్న అమ్మాయిలు ...... తల నుండి - చేతుల నుండి రక్తం కారుతున్న అమ్మాయిని చేతులలో ఎత్తుకున్నారు - చీకటిలో ఏమీ కనిపించడం లేదు .
రక్తం కారుతుండటం చూసి చలించిపోయి కిందకుదిగి ఆ అమ్మాయిని ఎత్తుకుని , ఇంకా మాట్లాడుతున్నారే వెనుక కూర్చోండి అనిచెప్పాను .
లావుపాటి అమ్మాయిలతోపాటు ఇద్దరు అమ్మాయిలు కూర్చోవడంతో వారికి అందించాను . వేగంగా వెళతాను జాగ్రత్తగా పట్టుకోండి అనిచెప్పి పోనిచ్చాను - మిగతా అమ్మాయిలు స్కూటీలలో ఫాలో అయ్యారు .
లావుపాటి సిస్టర్ : ఫ్రెండ్స్ ....... మీరు నెమ్మదిగా రండి మేము చూసుకుంటాములే , హాస్పిటల్ కు చేరుకుని కాల్ చేస్తాను అని కేరింగ్ గా చెప్పడంతో నెమ్మదించారు .

మొబైల్ తీసి గూగుల్ మ్యాప్ లో నియరెస్ట్ హాస్పిటల్స్ అని సెర్చ్ చేసి అటువైపు పోనిచ్చాను .
సిస్టర్స్ ....... కాస్త నెమ్మదిగా వెళ్లొచ్చు కదా , వేగంగా వెళ్లడం చూసాను .
లావుపాటి సిస్టర్ : తను ఫస్ట్ టైం స్కూటీ డ్రైవ్ చెయ్యడంతో , కాస్త ఉత్సాహంగా వెళ్లడం వలన ఇలా జరిగింది .
ఫస్ట్ టైం అంటే ఆ ఉత్సాహం ఉంటుందిలే సిస్టర్ ....... , నేనుకూడా ఫస్ట్ టైం బైకు మరియు కార్ డ్రైవ్ చేసినప్పుడు ఇలానే హుషారు వచ్చేసింది , ఇంతకంటే వేగంగా డ్రైవ్ చేసాను - నా అదృష్టం ఏమిటంటే ఏ ఇన్సిడెంట్స్ జరగలేదు ఉదయం కావడం వల్లనేమో ........
లావుపాటి సిస్టర్ : చీకటిలో ఇవ్వడం మా తప్పుకూడా ...... , తనంటే మా అందరికీ చాలా చాలా ఇష్టం , అందుకే అడుగగానే కాదనలేకపోయాను .
స్పృహలోనే ఉన్నారు కదా కొద్దిసేపట్లో హాస్పిటల్ లో ఉంటాము అని 10 నిమిషాలలో సిటీ చేరుకుని గూగుల్ లో ఉన్న ఫస్ట్ హాస్పిటల్ కు చేరుకున్నాము .
మరొక సిస్టర్ : ఈ హాస్పిటల్ వద్దు costly హాస్పిటల్ బిల్ తడిచి మోపెడవుతుంది.
లావుపాటి సిస్టర్ : ఏమి మాట్లాడుతున్నావే ఎంతైనా పర్లేదు , మన జ్యూవెలరీ ఇచ్చయినా మన ఫ్రెండ్ ను కాపాడుకోవాలి .

వారి మాటలు పట్టించుకోకుండా రక్తపు మడుగులో ఉన్న అమ్మాయిని జాగ్రత్తగా అందుకుని పరుగున లోపలికివెళ్లి డాక్టర్ డాక్టర్ అంటూ ICU కు చేరుకుని బెడ్ పై పడుకోబెట్టాను .
నర్స్ : సర్ .......ప్రైవేసి అనిచెప్పడంతో బయటకువచ్చాను .
ముగ్గురు సిస్టర్స్ కంగారుపడుతూ - కళ్ళల్లో కన్నీళ్ళతో వడివడిగా వచ్చి డోర్ కు ఉన్న చిన్నపాటి మిర్రర్ లో లోపలకు చూస్తున్నారు .

నిమిషానికి నర్స్ బయటకువచ్చి పేషెంట్ తాలూకా ఎవరు అని అడిగి , సిస్టర్స్ దగ్గరికివెళ్లి లాక్ష రూపాయలు కౌంటర్ లో పే చెయ్యండి అనిచెప్పారు .
లక్షనా అంటూ ఒకరినొకరు చూసుకుని చైన్స్ తియ్యబోయారు ముగ్గురు ఫ్రెండ్స్ .
సిస్టర్స్ అంటూ ఆపి లక్ష కాదు రెండు లక్షలు పే చేస్తాము వీరి ఫ్రెండ్ కు ఏమీకాకుండా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి - తనకేమైనా అయితే .......
నర్స్ : డబ్బు కడితే ఈ హాస్పిటల్లో పోయిన ప్రాణాలు కూడా బ్రతికించేంత the best ఇంటర్నేషనల్ డాక్టర్స్ ఉన్నారు .
సిస్టర్ ....... మీరు చెప్పినది నిజమే , ఇలాంటి హాస్పిటల్స్ కూడా ఉన్నాయని ఇప్పుడే తెలిసింది - మీరు ఇక్కడే ఉండండి పే చేసివస్తాను అని కౌంటర్ కు వెళ్లి కార్డ్ ద్వారా 2 lakhs పే చేసివచ్చి చూయిస్తేనేకానీ ట్రీట్మెంట్ మొదలుపెట్టకపోవడం చూసి , చెంప చెల్లుమనిపించబోయి సెంటీమీటర్ ముందు ఆపేసాను - నర్సు కాబట్టి కంట్రోల్ చేసుకున్నాను - లోపల తనకు గానీ ఏమైనా అయ్యిందో ....... అంటూ వార్నింగ్ ఇచ్చాను .
నర్స్ వణుకుతూ లోపలికి వెళ్ళింది .
సిస్టర్స్ : సర్ అంటూ రెండు చేతులూ జోడించారు .
సిస్టర్స్ సిస్టర్స్ స్టాప్ స్టాప్ ....... నేను మీకంటే చిన్నవాడిని , my name is మహేష్ సో జస్ట్ కాల్ మీ మహేష్ ........

అంతలోనే ఏకంగా నర్సులిద్దరు బయటకువచ్చి అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్నారు - భయపడిపోతున్నట్లుగా వణుకుపోతున్నారు .
సిస్టర్స్ కళ్ళల్లో కన్నీళ్లను చూసి , నర్స్ నర్స్ ....... ఏమైంది అంత కంగారుపడుతున్నారు అని కాస్త కంగారుపడుతూనే అడిగాను .
నర్స్ : సర్ అదీ అదీ ....... పేషెంట్ బ్లడ్ చాలా లాస్ అయ్యింది - ఆ గ్రూప్ **** బ్లడ్ హాస్పిటల్లో లేదు - వేరే హాస్పిటల్ నుండి తెప్పించే సమయం లేదు - అర్జెంట్ గా కావాలి .
సిస్టర్స్ : నాది అధికాదు నాది అధికాదు - మన ఫ్రెండ్స్ లో ఎవరిదైనా ....... అని కాల్ చేసేంతలో .......
థాంక్ గాడ్ నాదీ అదే బ్లడ్ ....... ఎంత కావాలో అంత తీసుకోండి అని ICU వైపుకు అడుగులువేశాను .
నర్స్ : సర్ సర్ ...... లోపల బెడ్స్ అన్నీ ఫుల్ .
అయితే ఇక్కడే తీసుకోండి అని వెయిటింగ్ చైర్లో కూర్చున్నాను .
నర్స్ : వణుకుతున్న చేతితో సూది పొడవబోయారు .
హలో హలో హలో ........ - జీవితంలో ఫస్ట్ టైం అందులోనూ ఇంజక్షన్ అంటేనే మహా భయం నాకు .
Sorry సర్ అంటూ మరొక నర్స్ అందుకుని సులువుగా నరంలోకి ఎక్కించడంతో బ్లడ్ వచ్చింది .
అంతలో మిగతా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఎలా ఉంది ఇప్పుడెలా ఉంది అని కంగారుపడుతూ అడుగుతున్నారు .
లావుపాటి సిస్టర్ : మహేష్ గారు తెలుసుకదా సమయానికి హాస్పిటల్ కు తీసుకువచ్చారు - అమౌంట్ పే చేశారు ఇప్పుడు బ్లడ్ అవసరమైతే ఇస్తున్నారు .

నిమిషాలలో బ్లడ్ ప్యాకెట్ నిండటంతో , నర్సు తీసుకుని పరుగున లోపలికివెళ్లింది .
గంట తరువాత డాక్టర్ బయటకు వచ్చి సేఫ్ - మేజర్ ఇంజురీస్ లైక్ బోన్ ఫ్రాక్చర్ - స్కల్ ఫ్రాక్చర్ కాలేదు , మైనర్ ఇంజురీస్ లైక్ పైపైన స్క్రాచస్ మాత్రమే ....... కొద్దిసేపటి తరువాత చూడొచ్చు - రేపు డిశ్చార్జ్ చేస్తాము అనిచెప్పాక గానీ సిస్టర్స్ పెదాలపై చిరునవ్వులు రాలేదు - థాంక్ గాడ్ అని చైర్లో కూర్చున్నాను .
సిస్టర్స్ : మహేష్ గారూ మహేష్ గారూ ....... మీ వల్లనే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ .......
కూల్ కూల్ కూల్ సిస్టర్స్ ...... మీలాంటి ఫ్రెండ్స్ ఉండటం తన అదృష్టం .
సిస్టర్స్ : లేదు సర్ ....... తన వలన మేము అదృష్టవంతులము - ఎందుకో తనను చూస్తే మీకే తెలుస్తుంది .
Ok ok ...... తన పేరెంట్స్ కు విషయం తెలపండి .
లావుపాటి సిస్టర్ : నో మహేష్ సర్ ....... , మా ఫ్రెండ్ మామ్ చాలా చాలా సెన్సిటివ్ - ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేరు - మేంఉన్నాము కదా జాగ్రత్తగా చూసుకుంటాము - తన ఇంటి నుండే హాస్టల్ కు వెళుతూ ఇలా జరిగింది - సమయానికి మీరు దేవుడిలా వచ్చారు అని మళ్ళీ చేతులు జోడించారు .
సిస్టర్స్ సిస్టర్స్ ....... చెప్పానుకదా అని ఆపాను . మీ ప్రియాతిప్రియమైన ఫ్రెండ్ సేఫ్ కదా రిలాక్స్ గా కాసేపు కూర్చోండి అనిచెప్పాను .

ఒక ప్రాణాన్ని కాపాడానన్న సంతృప్తితో చైర్లో వెనక్కు వాలిపోగానే టైర్డ్ గా అనిపించి కళ్ళుమూసుకోగానే నిద్రపట్టేసింది .
అలికిడికి మెలకువవచ్చింది .
సిస్టర్స్ : sorry sorry మహేష్ సర్ ......
నో నో నో డోంట్ ....... హైద్రాబాద్ నుండి డ్రైవ్ చేసుకుంటూ రావడం - ఇప్పుడు బ్లడ్ ఇవ్వడం వలన అలసట - నీరసం అందుకే .......
లావుపాటి సిస్టర్ : నిజమే మహేష్ సర్ ...... చాలా టైర్డ్ గా ఉన్నట్లు కనిపిస్తున్నారు - మేమంతా ఉన్నాము - హాస్టల్ నుండి మరికొంతమందికూడా వస్తున్నారు జాగ్రత్తగా చూసుకుంటాము మీరు ఇంటికివెళ్లి రెస్ట్ తీసుకోండి .
నో నో నో అలాంటిదేమీ లేదు - మీకు తోడుగా ఉంటాను .
లావుపాటి సిస్టర్ : మీ మంచితనానికి థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మహేష్ సర్ , నన్ను చూడండి ఎలా ఉన్నానో - నేనంటే ...... మా కాలేజ్ లో అందరికీ హడల్ , నన్ను చూస్తేనే భయపడిపోతారు - we are perfectly alright ....... మీరు హ్యాపీగా ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోండి ఉదయం ఎలాగో మీరు వస్తారని మాకు తెలుసు .

సిస్టర్ ను పైనుండి కిందవరకూ చూసి నిజమే ...... అని నవ్వుకున్నాను , సిస్టర్ ...... జాగ్రత్త అని మరీ మరీ చెప్పి బయటకువచ్చాను .
వైజాగ్ లో బెస్ట్ హోటల్ ఏంటో గూగుల్ చేసి బయలుదేరాను . దారిలో రెస్టారెంట్స్ కనిపించడంతో రెస్టారెంట్ నుండి సిస్టర్స్ అందరికీ ఫుడ్ పార్సిల్స్ మరియు ATM నుండి మనీ డ్రా చేసుకుని హాస్పిటల్ కు వెళ్లి ఇచ్చాను .
సిస్టర్స్ : మహేష్ సర్ ....... టచ్ చేశారు . డబ్బు అవసరం లేదు .
స్టూడెంట్స్ అంటున్నారు - హాస్టల్లో ఉంటున్నారు , హాస్టల్లో ఉన్న మా ఫ్రెండ్స్ గురించి నాకు తెలుసు - please తీసుకోండి మరేదైనా అవసరం అయితే ఈ నెంబర్ కు కాల్ చెయ్యండి నిమిషాల్లో మీ ముందుకు వచ్చేస్తాను అని పేపర్లో రాసిచ్చాను .
సిస్టర్ : ఇంత సహాయం ఎందుకు చేస్తున్నారు మహేష్ సర్ - మేమేవరో కూడా మీకు తెలియదు .
( ఈ ఒక్కొక్క పుణ్యం ....... నన్ను , మా అమ్మ దగ్గరికి చేరుస్తుందని ఒక నమ్మకం ) పెదాలపై చిరునవ్వుతో బయటకు నడిచాను . సిస్టర్ సిస్టర్ ...... అంటూ వెనక్కువెళ్లి , తన పర్మిషన్ లేకుండా ఎత్తుకున్నాను - స్పృహలోకివచ్చినతారువాత నా తరుపున sorry చెప్పండి .

లావుపాటి సిస్టర్ : మీరు చేసినదే కరెక్ట్ ....... , సరైన సమయంలో సరిగ్గా స్పందించారు - మేమైతే స్ట్రెచర్ వచ్చేన్తవరకూ వేచి చూసేవాళ్ళము - మరీ ఇంతమంచివారైతే కష్టం - అన్నింటికీ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ సర్ , మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోము .
నేనేమీ చెయ్యలేదు - మనిషిగా నేను చెయ్యాల్సినది చేసాను .
లావుపాటి సిస్టర్ : అలా అనకండి మహేష్ సర్ ....... మీరు రాకముందు నిమిషం పాటు కన్నీళ్ళతో try చేసినా ఒక్కరూ వెహికల్స్ ఆపలేదు - sorry sorry ....... మీ కళ్ళు మూతలుపడుతున్నాయి వెళ్లి రెస్ట్ తీసుకోండి , మహేష్ సర్ ....... జాగ్రత్తగా వెళ్ళండి .
థాంక్యూ ......... , స్టార్ హోటల్ కు చేరుకుని టాప్ ఫ్లోర్లో సూట్ రూమ్ బుక్ చేసుకునివెళ్లి బెడ్ పైకి వాలిపోగానే నిద్రపట్టేసింది - అమ్మా ....... ఒక ప్రాణం కాపాడాను ఎంత సంతోషంగా ఉందో తెలుసా ........ - ఈ సంతోషాన్ని మా అమ్మతో షేర్ చేసుకోవాలని ఆశగా ఉంది ఆశగా ఉంది ఆశ ........
Next page: Update 15
Previous page: Update 13