Update 15

నెక్స్ట్ డే ఉదయం మెలకువవచ్చేసరికి 11 గంటలు అయ్యింది . వొళ్ళువిరుస్తూ లేచివెళ్లి బాల్కనీ కర్టైన్స్ రెండువైపులకూ జరిపాను . రూమ్ మొత్తం వెలుగుతుతోపాటు సూర్యరశ్మి నాపై పడటంతో క్షణంలో అక్టీవ్ అయిపోయాను . ఆశ్చర్యం ........ ఎదురుగా సముద్రపు బ్యూటిఫుల్ వ్యూ - wow ....... sea side హోటల్ అన్నమాట రాత్రి తెలియకుండానే చెక్ ఇన్ అయ్యాను అని బాల్కనీలోకి వెళ్లి వీక్షించాను . వైజాగ్ ....... wow రియల్లీ బ్యూటిఫుల్ - అన్నీ exams రిజల్ట్స్ కు 10 డేస్ పైనే సమయం ఉంది ఆ తరువాత జాయిన్ అవ్వడానికి one ఆర్ two మంత్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి వైజాగ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ హ్యాపీగా చుట్టేయ్యాలి .
లొకేషన్స్ అంటే గుర్తుకువచ్చింది హాస్పిటల్ కు వెళ్ళాలి కదా అని - తనకు ఎలా ఉందో , సిస్టర్స్ ఎలా ఉన్నారోనని కంగారుపడుతూ లోపలికివెళ్లి చకచకా ఫ్రెష్ అయ్యి హాస్పిటల్ చేరుకుని నేరుగా ICU చేరుకున్నాను .

బయట సిస్టర్స్ కనిపించకపోవడంతో మిర్రర్ లో లోపలికి తొంగిచూసాను . అంతలోనే డోర్ తెరుచుకుని నర్స్ బయటకువచ్చారు - నన్ను చూడగానే భయంతో వణకడం చూసి నవ్వు వచ్చేసింది .
Sorry నర్స్ ....... నిన్న ఏదో కంగారు - కోపంలో అలా ప్రవర్తించాను . బేసిక్ గా లేడీస్ అంటే నాకు అపారమైన గౌరవం .
నర్స్ : నిన్న చూసాను సర్ - you are great i respects you సర్ ...... - ఇందులో మీ తప్పూ లేదు , నా తప్పూ లేదు ...... - ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ .......
Ok ok అర్థమైంది , ఎనీవే sorry నర్స్ ....... , ఇంతకూ ....... తనకు ఎలా ఉంది .
నర్స్ : పెదాలపై చిరునవ్వులతో perfectly alright సర్ - మీరు వెళ్లిన కొద్దిసేపటికే స్పృహలోకివచ్చి అమ్మా అమ్మా ...... అంటూ కలవరించారు - ఫ్రెండ్స్ అందరూ చేరి జాగ్రత్తగా చూసుకున్నారు - రాత్రంతా అమ్మా అమ్మా ....... అని కలవరిస్తూనే ఉండటంతో , డాక్టర్స్ చెక్ చేసి సంతోషంగా వెళ్లొచ్చు ..... గాయాలు - కుట్లు కొన్నిరోజుల్లో మానిపోతాయి నార్మల్ అయిపోతారు - రెండుమూడురోజులకొకసారి ఇక్కడే కాకుండా చిన్న క్లీనిక్స్ లో డ్రెస్సింగ్ చేసుకుంటే చాలా అని టాబ్లెట్స్ రాసి భరోసా ఇవ్వడంతో ఉదయం 8 గంటలకే డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయారు .
గుడ్ న్యూస్ చెప్పారు నర్స్ - ఎలా వెళ్లారు అంబులెన్స్ లో వెళ్ళారా ...... ? .
నర్స్ : నో సర్ ....... , అంబులెన్స్ స్మెల్ పడదని క్యాబ్స్ లో వెళ్లిపోయారు .
థాంక్స్ నర్స్ ....... , కలవకపోయానన్న చిరు బాధ ఉన్నా తను సేఫ్ అని తెలిసి ఆనందం వేసింది - కనీసం అడ్రస్ అయినా తెలిసేది అని చిరు నిరాశతో వెనుతిరిగాను .

హోటల్ కు చేరుకుని సమయం దాటిపోవడంతో లైట్ టిఫిన్ చేసి పైన రూమ్ కు చేరుకున్నాను . బాల్కనీ నుండి sea view చూస్తూ వైజాగ్ టూరిస్ట్ places గూగుల్లో సెర్చ్ చేసాను .
Wow wow బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ ........ more బీచస్ - అరకు హిల్స్ - కేవ్స్ - వాటర్ ఫాల్స్ - పార్క్స్ - పాపులర్ టెంపుల్స్ - వైల్డ్ లైఫ్ sanctuary - హిస్టారిక్ మహల్స్ - షాపింగ్ మాల్స్ .......... అన్నీ ఒక్కదగ్గరే ఉన్న బ్యూటిఫుల్ సిటీని ఇన్ని సంవత్సరాలలో ఎలా మిస్ అయ్యాను . రోజుకొకటి చెప్పన గూగుల్ చూయిస్తున్న all టూరిస్ట్ places చుట్టేసి వైజాగ్ కు లోకల్ బాయ్ ను అయిపోవాలి ఫిక్స్ అని నవ్వుకున్నాను .
ఫస్ట్ ప్లేస్ ఏమిటి - ఇంకేమిటి రా ....... బీచస్ అంటూ కావాల్సినవి బ్యాక్ ప్యాక్ లో తీసుకుని షార్ట్స్ లో ఉత్సాహంగా బయలుదేరాను - wait వన్ మినిట్ అంటూ sea view దగ్గరకు చేరుకుని exact గా ఇలాంటి వ్యూ ఉన్న ఇంద్రభవనం లాంటి బిల్డింగ్ తీసుకోవాలి అని మొదటగా రియల్ ఎస్టేట్ ఆఫీస్ కు వెళ్ళాను .
హోమ్ కావాలని చెప్పగానే నేరుగా ఆఫీస్ రూమ్ కు తీసుకెళ్లారు . ముగ్గురు వ్యక్తులు పార్ట్నర్స్ గా పరిచయం చేసుకుని కూల్ డ్రింక్ తెప్పించారు . బాబూ ...... ఎక్కడ - ఎలా - ఎంత ప్రైస్ లో హోమ్ కావాలి అని అడిగారు . అపార్ట్మెంట్స్ - హోమ్స్ - బిల్డింగ్స్ ....... లిస్ట్ చూయించారు .
వైజాగ్ లో మీదే నెంబర్ వన్ అని విన్నాను - ఇవన్నీ కాదు నానుండి ఒకే ఒక విన్నపం బీచ్ వ్యూ ఉండాలి - కొత్త బిల్డింగ్ అయి ఉండాలి - త్రీ ఫ్లోర్స్ కు తగ్గకూడదు - ఇండిపెండెంట్ గా ఉండాలి - ప్రశాంతమైన వాతావరణం లో సిటీకి దగ్గరలోనే ఉండాలి ....... ఎలా ఉండాలో మీకిప్పటికే అర్థమైపోయి ఉంటుంది . నాకు బిల్డింగ్ నచ్చితే ప్రైస్ గురించి పట్టించుకోను - అడ్వాన్స్ ఎంత అని కార్డ్ స్వైప్ చేసి ట్రాన్స్ఫర్ చేసాను . మీరు ఎంత త్వరగా చూయిస్తే అంత ఎక్కువ కమిషన్ ఇస్తాను . బిల్డింగ్ నచ్చితే ఆరోజే రిజిస్ట్రేషన్ సింగిల్ పేమెంట్ .........
బాబూ ...... అన్నవాళ్ళు సర్ సర్ సర్ అంటూ లేచిచేతులుకలిపి ఈ క్షణం నుండీ అదేపనిలో ఉంటాము .
గుడ్ గుడ్ ....... this is my నెంబర్ అంటూ టేబుల్ పై రాయబోతే .......
సర్ సర్ సర్ ....... అంటూ కొత్త ఫైల్ ఇచ్చారు .
MAHESH - ********** నెంబర్ రాసిచ్చాను .
మహేష్ సర్ అంటూ ముగ్గురూ పరిచయం చేసుకుని ఆఫీస్ కార్డ్ ఇచ్చారు .
అందుకుని వారం తరువాత కాల్ చేస్తాను .
ముగ్గురూ : సర్ అంత సమయం తీసుకోము 2 డేస్ లో కాల్ చేస్తాము .
చెప్పానుకదా ఇంద్రభవనంలా ఉండాలని , సో ....... వారం రోజులు సమయం తీసుకుని నన్ను ఇంప్రెస్ చెయ్యండి - నన్ను మాత్రం డిసప్పాయింట్ చెయ్యకండి .
ముగ్గురూ : నో నో నో నెవర్ సర్ ...... మీరే చూస్తారుకదా .
Ok అయితే వన్ వీక్ తరువాత కలుద్దాము అని ముగ్గురికీ షేక్ హ్యాండ్ ఇచ్చి టూరిస్ట్ places విజిట్ మొదలుపెట్టాను .

వైజాగ్ లో మొదటి విజిట్ రామకృష్ణ బీచ్ ....... , 15 నిమిషాలలో బీచ్ రోడ్ చేరుకుని జిప్సీ పార్క్ చేసి పెదాలపై చిరునవ్వులతో ఇసుకలోకి అడుగుపెట్టాను . ప్రతీ సంవత్సరం అమెరికన్ బీచ్ లలో ఎంజాయ్ చెయ్యడమే తప్ప ఇండియన్ బీచ్ లో అడుగుపెట్టినది మాత్రం ఫస్ట్ టైం - ఆ ఫీల్ తృప్తిగా ఆస్వాదించాలని అక్కడే షూస్ వదిలి ఇసుకపై బేర్ ఫుట్ నడుస్తూ సముద్రంలోకి అడుగుపెట్టాను .
నాకు రెండువైపులా ....... కొంతమంది కుటుంబం మొత్తం వచ్చినట్లు బుజ్జాయిల దగ్గర మొదలుకుని వయసుమళ్లిన వాళ్ళ వరకూ నీళ్లు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తుండటం - నేను మాత్రం ఒంటరిగా ....... అమ్మ గుర్తుకువచ్చి కళ్ళల్లో చెమ్మ చేరింది . కన్నీళ్లను తుడుచుకుని బీచ్ వెంబడి నడుస్తూ , బీచ్ లో అమ్ముతున్న స్నాక్స్ - పుల్ల ఐస్ క్రీమ్స్ టేస్ట్ చేస్తూ వారి ఆనందాలను వీక్షించాను .
అందరూ హుషారుగా కొండ ఎక్కడం చూసి నేనూ వెళ్లి కైలాసగిరి చేరుకుని మరింత అద్భుతమైన వ్యూ ఎంజాయ్ చేసాను - వచ్చినవారు కిందకు వెళ్లిపోయినా నేను మాత్రం సాయంత్రం వరకూ అక్కడే స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించి కిందకుదిగాను .

స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు చేరుకుని మనసుకు ఉల్లాసాన్ని పంచిన బీచ్ కు లవ్ యు చెప్పి షూస్ చేతిలో పట్టుకుని నెక్స్ట్ బీచ్ గూగుల్ చేసి దగ్గరలోని మరొక బీచ్ చేరుకున్నాను .
చీకటిలో - విద్యుత్ కాంతులలో బీచ్ మరింత అందంగా కనిపిస్తోంది . సడెన్ గా బీచ్ - బీచ్ మాత్రమే కాదు నా వెనకున్న సిటీ మొత్తం చిమ్మ చీకటిగా మారిపోయింది . కరెంట్ పోయింది అని మొబైల్ తీసి టార్చ్ వేసేంతలో చంద్రుడి వెన్నెలలో సముద్రపు అందం మరింత పెరగడంతో మనసారా ఆస్వాదించాను . నాకోసమే కరెంట్ పోయినట్లుంది అంటూ సంతోషంతో కేకలువేశాను .
కొన్ని నిమిషాల తరువాత కరెంట్ వచ్చినా రాత్రి 9 గంటలవరకూ అక్కడే ఇసుకలో కూర్చుని హోటల్ కు చేరుకుని డిన్నర్ చేసి రూమ్ చేరుకుని బెడ్ పై వాలిపోయాను. నా కళ్ళల్లో - మనసులో - హృదయంలో నింపుకున్న అమ్మ ఊహారూపాన్ని చూస్తూ , అమ్మ ఒడిలో పడుకున్నట్లు ఫీల్ అవుతూ పెదాలపై చిరునవ్వులతో హాయిగా పడుకున్నాను .

నెక్స్ట్ డే మాత్రం తెల్లవారుఘామునే లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ - లంచ్ - డిన్నర్ ...... బీచస్ దగ్గరే చెయ్యాలని రిషికొండ బీచ్ చేరుకున్నాను . టిఫిన్ చేసి బీచ్ లో అడుగుపెట్టినవాడిని చుట్టూ ప్రకృతికి దాసోహం చెందినట్లు బయటకువచ్చినది మళ్లీ సాయంత్రానికే ........
సంతృప్తిగా ఆ ప్రకృతి అందాల నుండి బయటపడి సిటీ సెంటర్ చేరుకున్నాను - వైజాగ్ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేసి ఫస్ట్ షో మూవీ చూసి హోటల్ చేరుకుని బెడ్ పైకి చేరాను .
అమ్మ గురించి తెలిసిన క్షణం నుండీ ప్రతీరోజూ ....... నేను అత్యంత సంతోషం పొందేది పడుకునే ముందే - ప్రశాంతంగా అమ్మ గురించి ఆలోచిస్తూ హాయిగా నిద్రపోవచ్చు కాబట్టి .........

మరుసటి రోజు భీమిలి బీచ్ తో మొదలుపెట్టి రోజులు మరిచిపోయి ఒక్కొక్కరోజు ఒక్కొక్క బీచ్ ఎంజాయ్ చేస్తూ - evenings ...... షాపింగ్ మూవీస్ - రాత్రిళ్ళు అమ్మను గుర్తుచేసుకుంటూ ఎంత ఎంజాయ్ చేశానో ప్రతీ క్షణం కళ్ళముందు మెదులుతూనే ఉంది .

ఆ తరువాతి రోజు ఉదయం హాస్పిటల్ కు చేరుకుని నర్స్ ను కలిసి చెకప్ కు ఏమైనా మళ్లీ వచ్చారా అని అడిగాను .
నర్స్ : నాకు తెలిసైతే లేదు సర్ ....... , అయినా మీకోసం ఒకసారి రిసెప్షన్ లో చూస్తాను అని పిలుచుకునివెళ్లారు . వీక్లీ ఎంట్రీ బుక్ మొత్తం చూసి నో అన్నారు .
నర్స్ కు థాంక్యూ చెప్పేసి నిరాశతో బయటకువచ్చాను . వారికి ఇప్పుడు ఎలా ఉందో ...... , పూర్తిగా కోలుకుని ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను . నెక్స్ట్ ఏ ప్లేస్ వెళ్ళాలి అని జిప్సీ లో కూర్చుని గూగుల్ చేస్తున్నాను .

అంతలో రియల్ ఎస్టేట్ నుండి కాల్ రావడంతో అట్లాస్ట్ అంటూ లిఫ్ట్ చేసి మాట్లాడాను .
సర్ ....... మీ ఇష్టాలకు తగ్గ బిల్డింగ్ దొరికింది అని గుడ్ న్యూస్ చెప్పారు .
బ్రదర్స్ ....... వన్ వీక్ అని మామూలుగా చెప్పాను - సరిగ్గా వారం తరువాతనే కాల్ చేశారు .
Not like that సర్ ....... బీచ్ సైడ్ హోమ్స్ - అపార్ట్మెంట్స్ చాలానే ఉన్నాయి కానీ మీరు స్పెషల్ గా ఉండాలని చెప్పారు కాబట్టి రెండు మూడుసార్లు చెక్ చేసుకుని పర్ఫెక్ట్ అని తెలిసాకే కాల్ చేసాము .
I like that బ్రదర్స్ .......
సర్ ...... ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? - హోమ్ దగ్గరికి రాగలరా ? - చిన్న సమస్య ఉంది . .
లవ్ టు లవ్ టు బ్రదర్స్ ....... , మీ కాల్ కోసమే వారం రోజులుగా ఎదురుచూస్తున్నాను - సిటీలోనే ఉన్నాను ఎక్కడికి రమ్మంటారు ? - మళ్లీ ఈ సమస్య ఏమిటి ? .
సూపర్ సర్ , లొకేషన్ షేర్ చేస్తాము , సమస్య ఏమిటో చూస్తే తెలుస్తుంది అని పంపించారు .
బ్రదర్స్ 20 మినిట్స్ లో అక్కడ ఉంటాను .
Wait చేస్తాము సర్ ..........

హోమ్ స్వీట్ హోమ్ ....... నచ్చితే వెంటనే హోటల్ నుండి మారిపోవడమే - వారం రోజులయ్యింది ప్రశాంతమైన ప్రైవేసి లభించి అని ఆనందిస్తూ పంపిన లొకేషన్ చేరుకున్నాను .
మెయిన్ గేట్ బయటే ఆగి ఐడెంటికల్ గా ఉన్న రెండు బిల్డింగ్స్ ను కన్నార్పకుండా చూస్తూ దిగాను - one two three four five ....... ఫైవ్ ఫ్లోర్స్ - ట్విన్ బిల్డింగ్స్ ను అనుసంధానిస్తూ సెకండ్ మరియు ఫోర్త్ ఫ్లోర్స్ లో బ్రిడ్జస్ - అద్భుతమైన ఆర్కిటెక్చర్ ........
సర్ సర్ సర్ ....... అంటూ ముగ్గురు పార్ట్నర్స్ నాదగ్గరికి వచ్చి hi చెప్పి షేక్ హ్యాండ్స్ ఇచ్చారు . మహేష్ సర్ ...... పెయింటింగ్ తప్ప ఆల్మోస్ట్ పూర్తయిపోయింది - మీరు కోరిన requirments లో ఒకటి " న్యూ బిల్డింగ్ " అయి ఉండాలి here it is ......
బ్రదర్స్ ...... కాల్ మీ మహేష్ , నాట్ సర్ .......
Yes సర్ ........ yes మహేష్ ....... అంటూ నవ్వుకున్నారు . అయితే మీ మరొక requirment మినిమం త్రీ ఫ్లోర్స్ ........ satisfied అనుకుంటాము .
Yes ....... చుట్టూ చూసి తెరిచి ఉన్న గేట్ లోపలికివెళ్లాము . మెయిన్ గేట్ నుండి బిల్డింగ్స్ వరకూ క్రికెట్ పిచ్ రెండింతల దూరం ఉంది సూపర్ - బిగ్గెస్ట్ కాంపౌండ్ ..... ప్రశాంతమైన వాతావరణం - మొక్కలే కాదు ఏకంగా పార్క్ లా మార్చుకోవచ్చు ..... గుడ్ బ్రదర్స్ ........
బ్రదర్స్ ముగ్గురూ ఆనందిస్తూనే నాతో ఏదో చెప్పడానికి సంసయిస్తున్నారు అనిపించి డైరెక్ట్ గా సమస్య ఏమిటి అని అడిగాను .

సర్ అదీ అదీ ....... అమ్మితే రెండు బిల్డింగ్స్ అమ్ముతాను లేకపోతే లేదు అంటున్నారు సర్ - అదిగో వారే ఓనర్ ....... , ఇష్టపడి కట్టుకున్నారు కానీ కొడుకుకు ఫారిన్ లో జాబ్ రావడంతో టోటల్ ప్రాపర్టీస్ అమ్మి అక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు .
అది ప్రాబ్లమ్ ఎలా అవుతుంది బ్రదర్స్ .........
సర్ ..... మహేష్ అదీ మీరు ఒక్క బిల్డింగ్ కదా ఆడిగినది .........
ఇంత అద్భుతమైన ఔటర్ ఆర్కిటెక్చర్ గల ట్విన్ బిల్డింగ్స్ అదికూడా బ్రిడ్జస్ తో అనుసంధించడం నాకైతే చాలా బాగా నచ్చాయి . నా ఫస్ట్ requirement ఒక్కటీ నచ్చితే మొత్తం ప్రాపర్టీను నెక్స్ట్ మినిట్ లో ok చేసేస్తాను .
ముగ్గురి పెదాలపై చిరునవ్వులు - మహేష్ ....... ఈ బిల్డింగ్స్ ను సెలెక్ట్ చేసినదే sea view వలన - pleaae come in అంటూ లోపలికి పిలుచుకునివెళ్లారు .

పెయింటింగ్ లేకపోయినా అద్భుతంగా ఉండటం చూసి wow అన్నాను .
ముగ్గురూ మా పంట పండింది అని మురిసిపోయి , మహేష్ లిఫ్ట్ ఇటువైపు ........
లిఫ్ట్ కూడా రెడీ అయ్యిందా ? .
పెయింటింగ్ వర్క్ తప్ప ఆల్మోస్ట్ రెడీ మహేష్ ........ లిఫ్ట్ బటన్ నొక్కారు .
నో నో నో స్టెప్స్ ద్వారా బిల్డింగ్ చూస్తూ వెళదాము అని ఫోర్త్ ఫ్లోర్ వరకూ పెదాలపై చిరునవ్వులు పెరుగుతూనే వెళ్లి బ్రిడ్జ్ వైపు నడిచాను . బిల్డింగ్ నుండి బయటకు అడుగుపెట్టగానే అలల చప్పుడు - అలల వల్ల గాలికి అటువైపు తిరిగాను . ఆకాశం - సముద్రం మొత్తం నీలం ....... wow , హోటల్ వ్యూ కంటే బ్యూటిఫుల్ వ్యూ చూస్తూ మంద్రముగ్ధున్ని అయిపోయాను - యాహూ ........ హుర్రే ...... అంటూ ఆకాశం సముద్రం ఏకమయ్యేంతవరకూ వినిపించేలా సంతోషంతో కేకలువేస్తున్నాను .
మహేష్ ........ ఈ ప్రాపర్టీ మరీ ప్రత్యేకత ఏమిటంటే ప్రైవేట్ బీచ్ అంటూ కిందకు చూయించారు .
Wow wow wow ....... నిజమే ప్రాపర్టీ కాంపౌండ్ సముద్రపు నీటివరకూ వేసి ఉంది - అక్కడ ఒక మినీ డాక్ నిర్మించుకోవచ్చు అని ఆనందం పట్టలేక ముగ్గురినీ ఒకేసారి కౌగిలించుకున్నాను . గో గో గో బ్రదర్స్ ....... తొందరగా వెళ్లి డీల్ సెట్ చెయ్యండి , నాకు మరికొద్దిసేపు ఇక్కడే ఉండాలని ఉంది అంటూ బ్రిడ్జ్ మధ్యలోకివెళ్లి చేతులను విశాలంగా చాపి అలల గాలులను ఎంజాయ్ చేస్తున్నాను.
Give us మినిట్స్ మహేష్ అంటూ ముగ్గురూ సంతోషంతో హైఫై లు కొట్టుకుని కిందకువెళ్లారు .

మరింత పైనుండి వీక్షించాలనిపించి టాప్ ఫ్లోర్ చేరుకుని 180 డిగ్రీస్ లో సముద్రపు అందాలను తిలకించి పులకించిపోతున్నాను . నాకు సముద్రం అంటే ఇష్టమని వైజాగ్ సముద్రాన్ని చూసేంతవరకూ తెలియనేలేదు . కొన్ని కోట్ల జీవరాసులను తల్లిలా తనలో ఉంచుకుని కాపాడుకుంటోందనేనేమో , నేచర్ ఆఫ్ అల్ గాడెస్సస్ also అమ్మనే కదా - సెల్యూట్ మదర్స్ , నాకు జన్మనిచ్చి ఇంతటి అద్భుతమైన అందాలను వీక్షించేలా చేసినందుకు లవ్ యు లవ్ యు లవ్ యు సో సో సో soooooooo మచ్ అమ్మా - నాకు వెంటనే చూడాలని ఉంది - ఈ కోట్లజీవరాసులు సముద్రపు ఒడిలో అమ్మ ప్రేమను పొందుతున్నట్లు , నాకూ ...... మీ ఒడిలో హాయిగా ........ అంటూ చెమ్మను తుడుచుకున్నాను .

మొబైల్ మ్రోగడంతో చూస్తే బ్రదర్ ........ ,
మహేష్ ....... డీల్ సెట్ , కిందకు వస్తారా లేక పైకే రమ్మంటారా ? .
బ్రదర్స్ ....... పైకి వచ్చెయ్యండి , సముద్రం సాక్షిగా మార్చుకుందాము .
Ok మహేష్ అంటూ ఓవర్ తోపాటు పైకివచ్చారు .

పెద్దాయన దగ్గరికివెళ్లి , సర్ సర్ సర్ ....... బ్యూటిఫుల్ బిల్డింగ్స్ కట్టించారు - ఈ ఆర్కిటెక్చర్ కు ఫిదా అయిపోయానంటే నమ్మండి - నేను మాత్రం మహా అదృష్టవంతుడిని ........
పెద్దాయన : అవును బాబూ ....... మా ఫ్యామిలీ అంతా ఇష్టపడి కట్టించుకున్నాము కానీ నా ఇద్దరు పిల్లలకు లండన్ లో జాబ్స్ రావడంతో ఫ్యామిలీ మొత్తం వెళ్ళాల్సిరావడంతో ఇలా ......... - అమ్మే వాళ్ళకే కాదు కొనేవాళ్ళు కూడా ఇలా సంతోషంగా ఉంటేనే అందరికీ మంచిది - నేను కూడా చాలా హ్యాపీ ...... ఈ ప్రాపార్టీని ఎలా చూసుకోబోతున్నారో నీ సంతోషంలోనే కనిపిస్తోంది అని చేతులు కలిపారు .
ఫ్యామిలీ మొత్తం wow ...... ఉమ్మడి కుటుంబం అన్నమాట లవ్లీ సర్ - అందరికీ మీ అంతటి అదృష్టం ఉండదు అని ఫీల్ అయ్యాను . ( ఆ అదృష్టం లేకపోయినా ఉమ్మడి కుటుంబం ప్రేమతో కట్టించిన ఇంటిలో ఉండబోతున్నానన్న చిరు సంతోషం ) డీల్ గురించి మిగతా విషయాలు మాట్లాడుకున్నాము .

బ్రదర్స్ : మహేష్ ........ పెద్దాయనాకు భక్తి ఎక్కువ అందుకే మంచిరోజు చూసి రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము అంటున్నారు . ప్రస్తుతానికి సగం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే చాలు ........
మంచిదే కదా , అంతలోపు పెయింటింగ్ మరియు ఇంటీరియర్ మరియు కాంపౌండ్ మొత్తం పార్క్ లా నాకు నచ్చినట్లుగా మార్చుకోవాలి అని పెద్దాయన అకౌంట్ కు **క్రోర్స్ ట్రాన్స్ఫర్ చేసాను .
పెద్దాయన : చూసుకుని ఆనందించారు . మమ్మల్ని ఇబ్బందిపెట్టకుండా చూసిన రోజునే డీల్ సెట్ అవుతుందని అనుకోలేదు థాంక్స్ బాబూ ........
నాకు కాదు రియల్ ఎస్టేట్ పార్ట్నర్స్ కు చెప్పండి , క్రెడిట్ మొత్తం వాళ్లదే - అయినా ఇంతటి అద్భుతమైన ప్రాపార్టీని నేనైతే వదులుకోను . నా తరుపున మీకు పెద్ద థాంక్స్ ........
పెద్దాయన : సంతోషించి , ఈ విషయాన్ని లండన్ లో ఉన్న మా అబ్బాయిలకు చెప్పాలి - వారు ప్రతిపాదించిన అమౌంట్ కే డీల్ జరిగిందని తెలిస్తే చాలా సంతోషిస్తారు . మంచిరోజు చూసి కాల్ చేస్తాను ఆరోజు రిజిస్ట్రేషన్ చేసుకుని హ్యాపీగా లండన్ వెళ్లిపోతాను - ఆ రోజు కలుద్దాము బాబూ అనిచెప్పి చేతులు కలిపారు .
మంచిది పెద్దయ్యా ....... అని అందరమూ కిందకువచ్చి పంపించాము .

యాహూ ........ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ బ్రదర్స్ , బ్రదర్స్ ...... మీ కమిషన్ అమౌంట్ కూడా చెబితే ఇచ్చేస్తాను .
బ్రదర్స్ : మహేష్ ....... రిజిస్ట్రేషన్ రోజునే తీసుకోవడం ధర్మం .
అలా అయితే పెద్దాయన్లా సగం అమౌంట్ తీసుకోండి ఆరోజున మిగతా సగం తీసుకోండి , అవసరాలు ఉంటాయి కదా .......
బ్రదర్ : అవును మహేష్ ....... మా కెరీర్ లో ఇంత తక్కువ సమయంలో కుదిరిన బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ డీల్ ఇదే పెద్ద పార్టీ చేసుకోవాలి .
బ్రదర్స్ ...... పార్టీ ఎప్పుడో చెప్పండి - ద బెస్ట్ ప్రాపర్టీ సెట్ చేసినందుకు కానూ నేనే పే చేస్తాను - అకౌంట్ నెంబర్ చెప్పండి అని కమిషన్ అమౌంట్ లో సగం ట్రాన్స్ఫర్ చేసాను .
బ్రదర్స్ : థాంక్యూ మహేష్ .........

బిల్డింగ్స్ వైపుకు తిరిగి బ్రదర్స్ ....... నాకు వెంటనే బెస్ట్ ఆర్కిటెక్ట్ మరియు పెయింటర్ కావాలి - రిజిస్ట్రేషన్ రోజు లోపు బిల్డింగ్స్ మొత్తం రెడీ అయిపోవాలి - వీలు కుదిరితే ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్లిపోదాము .
బ్రదర్స్ : అందరూ రియల్ ఎస్టేట్ తో లింక్ అవాలాల్సినదే మహేష్ ....... , వాళ్ళ దగ్గరికి వెళితే ఎలాగో బిల్డింగ్ చూడాలని ఇక్కడికే రావాల్సి ఉంటుంది కాబట్టి టైం ఇస్తే కొద్దిసేపు wait చేస్తే ఇక్కడికే పిలిపిస్తాము .
టైం ఇస్తే ఏమిటి బ్రదర్స్ ....... , ఈ బిల్డింగ్స్ - sea view చూస్తూ జీవితాంతం ఉండిపోమన్నా ఇక్కడే ఉండిపోతాను - ఎంత ఆలస్యమైనా పర్లేదు అనిచెప్పి వెనుక బీచ్ దగ్గరికి వెళ్ళాను - నేను ఊహించుకున్నదానికంటే అందంగా ఉండటం చూసి నా పెదాలపై చిరునవ్వులు ఆగడం లేదు .

త్వరగానే ఆర్కిటెక్ట్ - చీఫ్ పెయింటర్ ను పిలుచుకునివచ్చారు బ్రదర్స్ . వాళ్ళతోపాటు బిల్డింగ్స్ చుట్టేసాను .
ఆర్కిటెక్ట్ : ఎవరో కానీ నాకంటే అద్భుతంగా డిజైన్ చేశారు . ఇంటీరియర్ నాకు దొరకడం అదృష్టం - అతనిలా కాకపోయినా మీరు పూర్తిగా satisfy అయ్యేలా నావంతు కృషి చేస్తాను .
తోటి ఆర్కిటెక్ట్ గొప్పతనాన్ని బయటకు వ్యక్తపరిచినప్పుడే మీ టాలెంట్ తెలిసింది - I హోప్ మీరు ...... వారికంటే అద్భుతంగా మలుస్తారని నమ్ముతున్నాను . బ్రదర్స్ ....... ఆర్కిటెక్ట్ బాగా నచ్చారు .
ఆర్కిటెక్ట్ : థాంక్యూ సర్ ........
మహేష్ .........
ఆర్కిటెక్ట్ : మహేష్ ....... , మిమ్మల్ని 1% కూడా డిసప్పాయింట్ చెయ్యను - రేపే డిజైన్స్ ఇస్తాను .
రెండు మూడు కాదు ఒక్కటే ఇవ్వండి - అర్థమైంది అనుకుంటాను .
ఆర్కిటెక్ట్ : sure మహేష్ ....... , the best ....... అని చేతులుకలిపి ఇన్సైడ్ మొత్తం అణువణువునా చూసి డీటెయిల్స్ రాసుకుంటున్నారు .

పెయింటర్ గారూ ...... మీరేమంటారు ? .
పెయింటర్ : ఆర్కిటెక్ట్ సర్ చెప్పినట్లు ఇంతటి సూపర్ బిల్డింగ్స్ కు పెయింట్ వేసే బాధ్యత నాలు ఇస్తున్నందుకు చాలా చాలా సంతోషం సర్ ....... , మీరు కలర్స్ సెలెక్ట్ చేస్తే బయట రెడీ కాబట్టి ఇప్పుడంటే ఇప్పుడే పెయింట్ వర్క్ మొదలెట్టేస్తాను సర్ .........
ఈ ఉత్సాహమే కావాలి నాకు - అన్నా ...... సెలెక్ట్ చెయ్యడానికి ఒకరోజైనా సమయం కావాలి కదా ........
పెయింటర్ : sorry సర్ .......
నో నో నో , రేపు ఉదయానికి ఇచ్చేస్తాను - మీరు 10 గంటలకల్లా వర్కర్స్ తో వచ్చెయ్యండి అని అడ్వాన్స్ ఇచ్చి పంపించాను .

ఆర్కిటెక్ట్ పిలవడంతో వెళ్లి , ఇంటీరియర్ ఎలా ఉండాలో వారు బ్రీఫ్ గా explain చెయ్యడం - నాకు నచ్చినట్లుగా మార్పులు చేర్పులు చేస్తూ సమయమే తెలియలేదు . బయటకు వచ్చేసరికి సాయంత్రం అయ్యింది .
ఆర్కిటెక్ట్ : రేపే వర్క్ స్టార్ట్ చేస్తాను మహేష్ .......
కంప్లీట్ as quickly as possible సర్ ....... , ఎంత ఖర్చయినా పర్లేదు - ఎంతమందినైనా పెట్టుకోండి , నా నుండి ఇదొక్కటే రిక్వెస్ట్ అని కోరినంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాను .
ఆర్కిటెక్ట్ : పార్ట్నర్స్ రిజిస్ట్రేషన్ గురించి చెప్పారు - ఆ సమయానికి ఒక్కరోజు ముందే పూర్తిచేస్తాను ఐ ప్రామిస్ యు that అని చేతులు కలిపి బయలుదేరారు .

బ్రదర్స్ ఇక మిగిలినది మనమే , పార్టీ ఎప్పుడో చెప్పనేలేదు - మోహమాటపడుతున్నట్లున్నారు ఇప్పుడే వెళదాము అని వారు తీసుకెళ్లిన బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్ళాను . పార్టీ ఇచ్చానే కానీ ఆల్కహాల్ చుక్క కూడా ముట్టుకోకుండా బిల్ పే చేసి రేపు కలుద్దామని గుడ్ నైట్ చెప్పేసి హోటల్ చేరుకుని బెడ్ పైకి చేరాను .
నా హృదయంలో ముద్రించుకున్న అమ్మ రూపం నాముందుకువచ్చి , నా కొడుకు బంగారం అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టడంతో , సడెన్ గా లేచి కూర్చుని చుట్టూ చూసి లవ్ యు అమ్మా ....... నుదుటిపై స్పృశించుకుని మురిసిపోయాను .
అమ్మా ....... మీరు బాధపడేలా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కు దగ్గరవ్వను అంటూ నుదుటిపై తాకించుకున్న చేతిపై ముద్దుపెట్టి పెదాలపై చిరునవ్వులతో కళ్ళుమూసుకున్నాను - అమ్మా ...... ఈరోజు చాలా సంతోషమైన రోజు మీకోసం అందమైన ఇంటిని తీసుకున్నాను - ఇంటిని మొత్తం మీకు నచ్చేలానే మారుస్తాను - కాంపౌండ్ మొత్తం పూల మొక్కలు , పచ్చదనంతో నింపేస్తాను . ఏనాటికైనా ఆ పూలమధ్యన మీరు నడుస్తారని నా నమ్మకం - కనక దుర్గమ్మ అమ్మవారు కూడా అదే పనిలోనే ఉండి ఉంటారు లేకపోతే నేను మళ్ళీ వారి దర్శనం చేసుకోను కదా , . అమ్మా దుర్గమ్మా ....... మీ ప్రియమైన భక్తుడిని మన్నించు అంటూ ముసిముసినవ్వులతో అమ్మనే తలుచుకుంటూ హాయిగా నిద్రపోయాను .

రేయ్ ........ కలర్స్ సెలెక్ట్ చెయ్యకుండా నిద్రపోయావురా లేరా లే ........
అంతే సడెన్ గా లేచి కూర్చున్నాను - సమయం చూస్తే ఉదయం 4 గంటలు - ఈసమయం చాలు లవ్ యు మై హార్ట్ అంటూ చేతితో ముద్దుపెట్టుకుని లాప్టాప్ అందుకున్నాను - లైట్స్ ఆన్ చేసాను .
మొబైల్లో తీసిన బిల్డింగ్ ఫోటోలను లాప్టాప్ లోకి ట్రాన్స్ఫర్ చేసి కలర్స్ సెట్ చేస్తూ నచ్చినవి రికార్డ్ చేసాను .
చివరగా సెలెక్ట్ చేసిన కలర్స్ అన్నీ అప్లై చేసి పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ నాకు నేనే ఇచ్చుకుని శభాష్ చెప్పుకున్నాను . మాక్సిమం స్కై బ్లూ కలర్ ప్రిఫర్ చెయ్యడం మరింత సంతోషాలను పంచింది - స్కై బ్లూ ఎందుకో ఈపాటికి అర్థమై ఉంటుంది ...........

డియర్ sea ....... నిన్ను చూసి గంటలు గడిచిపోయింది కదా అని లేచివెళ్లి కర్టైన్స్ చెరొకవైపుకు జరిపాను - సూర్యరశ్మి కాస్త ఘాడంగానే తాకింది . 6 గంటలకే ఇంత ఎండనా అని మొబైల్లో చూసుకుంటే 9 గంటలు అవుతోంది - అంటే కలర్స్ సెలక్షన్ లో 5 గంటలు గడిచిపోయింది అన్నమాట - కొన్ని క్షణాలపాటు వ్యూ వీక్షించి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కానిచ్చి నా ఇంటిదగ్గరికి చేరుకున్నాను - నా ఇల్లు అని ఎంత సంతోషం గర్వపడుతూ చెప్పవచ్చు అని మురిసిపోయాను .
అప్పటికే పార్ట్నర్స్ - ఆర్కిటెక్ట్ - చీఫ్ పెయింటర్ తోపాటు బోలెడంతమంది వర్కర్స్ ........ నాకోసం ఎదురుచూస్తుండటం చూసి ఆశ్చర్యం వేసింది .
బ్రదర్స్ : Hi hi hi మహేష్ ........
Hi బ్రదర్స్ ....... రియల్లీ shocked ? .
బ్రదర్స్ : మరి రాత్రి గ్రాండ్ పార్టీ ఇచ్చావు , ఈ మాత్రం కూడా చెయ్యకపోతే ఎలా ? , కీస్ ఓపెన్ చేసావంటే ఎవరి పని వారు చేస్తారు .
యా యా యా ...... అంటూ మెయిన్ గేట్ ఓపెన్ చేసాను . ఆర్కిటెక్ట్ ...... తమ వర్కర్స్ మరియు ఐటమ్స్ తో లోపలికివెళ్లారు .
పెయింటర్ ను కలిసి మొదట లాప్టాప్ లో ప్రెసెంటిషన్ ఆ వెంటనే ప్రింటౌట్స్ ఇచ్చాను .
పెయింటర్ : లైవ్లీ న్యాచురల్ కలర్స్ సర్ ........ , తమ్ముళ్లూ ....... లోపలికివెళ్లి రెడీ చేసుకోండి కొద్దిసేపట్లో పెయింట్ వచ్చేస్తుంది అని కాల్ చేసి నంబర్స్ ఆర్డర్ చేశారు .
ఇంటీరియర్ మరియు పెయింట్ వర్క్ వారం రోజులు నిరాటంకంగా గడుస్తోంది .

వైజాగ్ వచ్చిన 15 రోజుల తరువాత వన్ వీక్ గ్యాప్ లో నేను రాసిన స్టేట్ - సెంట్రల్ exam రిజల్ట్స్ వచ్చాయి - మాక్సిమం అన్నింటిలో టాప్ 100 లోపే రాంక్స్ సాధించాను - కోరుకున్న కాలేజస్ లో సులభంగా సీట్ లభిస్తుంది .
నాముందు మరొక సవాల్ ఎదురయ్యింది . ఏ రంగం వైపు వెళ్ళాలి ........ ఆలోచించాల్సిన అవసరం లేదు ఫ్యూచర్ బిజినెస్ కాబట్టి అటువైపుగా అడుగులువెయ్యాలి .
ఏ ఎంట్రన్స్ ద్వారా స్టడీస్ పూర్తిచేయాలి except IIT ఎందుకంటే ఐఐటీ లో చదవడం అన్నది అతడి కోరిక కాబట్టి ........
ఎంట్రన్స్ సెలెక్ట్ చేసుకున్నా ఆ క్యాంపస్ వైజాగ్ లోనే ఉండాలి కాబట్టి ముందుగా వైజాగ్ సెంట్రల్ కాలేజస్ గురించి తెలుసుకుని చివరగా IIM - VIZAG లో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకుని అప్లై చేసాను .
వన్ వీక్ లోపు సర్టిఫికెట్స్ ను క్యాంపస్ లో సబ్మిట్ చెయ్యమని నెక్స్ట్ డే మెయిల్ రావడంతో ఆ మరుసటిరోజు మెయిల్ నుండి ప్రింటౌట్స్ తీసుకుని ఫైల్ లో ఉంచుకుని ఇంటిదగ్గరకు వెళ్లి కావాల్సినవి చేకూర్చి 11 గంటల సమయంలో కాలేజ్ కు బయలుదేరాను .

అమ్మా ...... కాలేజ్ జాయిన్ అవ్వడానికి వెళుతున్నాను - మీ దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని నాకు తెలుసు లవ్ యు soooooo మచ్ అమ్మా . బీచ్ రోడ్డులో హుషారుగా వెళుతూ ఫుట్ పాత్ పై ఒకతల్లి తన బుజ్జాయిని గుండెలపై ఎత్తుకుని ముద్దుచేస్తూ - బుజ్జాయి ముద్దులకు స్వీకరిస్తూ చిరునవ్వులు చిందిస్తూ నడిచి వెళుతుండటం చూసి మనసు పులకించిపోయి అటువైపే చూస్తూ తెలియకుండానే రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోయాను .
టర్నింగ్ ఉన్నా చూడకుండా ముందుకువెళ్లడంతో ....... , అటువైపు నుండి సైకిల్లో కరెక్ట్ గా వచ్చిన వ్యక్తిని ఢీకొట్టాను .
అమ్మా ....... అంటూ కేక వినిపించాక కానీ నాకు తెలియలేదు . వెంటనే స్టాప్ చేసి కంగారుపడుతూ కిందకుదిగి చూస్తే .......
నేను ఢీ కట్టేంతలో నా వయసున్న వ్యక్తి సైకిల్ నుండి ప్రక్కకు జంప్ చేసాడు - సైకిల్ మాత్రం జిప్సీ చక్రాల ముందు మడతలు పడిపోయింది .
బ్రదర్ బ్రదర్ ....... are you ok , really sorry sorry తప్పంతా నాదే అంటూ లేపబోయాను .
చుట్టూ ఉన్న జనం ఇదే సందు అనుకుని కేకలువేస్తూ నన్ను కొట్టడానికి మీదమీదకు వస్తున్నారు - తప్పు నాదే కాబట్టి ఏమీచెయ్యలేక సైలెంట్ గా ఉండిపోయాను .
అంతలో మోచేతులు - మోకాళ్ళు మరియు నుదుటిపై తగిలిన దెబ్బల నుండి కారుతున్న రక్తంతో వారి ఒక్క దెబ్బ నాపైపడకుండా అందరినీ తోసేశాడు - తప్పు నాదే , నేనే సైకిల్ పై విన్యాసాలు చేస్తూ రాంగ్ రూట్ లో వచ్చాను - దెబ్బలు తగిలినది నాకైతే మీరెందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు - ఒకరికి సహాయం చెయ్యడానికి రారు కానీ ఇలాంటివాటికి ఎగబడిపోతారు గుంపులో గోవింద లా ...... , నుజ్జునుజ్జు అయిన సైకిల్ ను రోడ్డు ప్రక్కన ఉంచేసి , ఫైల్ మాత్రం అందుకుని బ్రదర్ నువ్వు వెళ్లు అనిచెప్పి నడవటానికి కష్టమైనా వెళ్లిపోతున్నాడు .
( అసలు ఏమిజరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు . తల - చేతులు - కాళ్ళ నుండి రక్తం కారుతున్నా , తప్పు నాది అయినా ఎందుకు నన్ను రక్షిస్తున్నాడు అని - బ్రదర్ ........ ఇక్కడ టచ్ చేసావు ) బ్రదర్ బ్రదర్ ....... అంటూ పరుగునవెళ్లి let me help అంటూ చేతిని భుజం పై వేసుకుని జిప్సీ లో కూర్చోబెట్టి దగ్గరలోని క్లినిక్ కు తీసుకెళ్ళాను .

బ్రదర్ ........ ఇంతదానికి క్లినిక్ కు తీసుకొచ్చావా ? , పసుపు పెట్టుకుంటే నాయమైపోతాయి .
Please అంటూ భుజం పై చేతినివేసుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను . ట్రీట్మెంట్ మొదలుపెట్టారు .
బ్రదర్ ........ నిమిషంలో వస్తాను అని బయటకువచ్చి దగ్గరలోని బట్టల షాప్ లో డ్రెస్ తీసుకుని క్లినిక్ కు వచ్చాను .
అప్పటికే దెబ్బలు శుభ్రం చేసి కట్లు కడుతున్నారు డాక్టర్ . నొప్పివేయ్యకుండా ఇంజక్షన్ వేశారు . కుట్లు ఏమీ పడలేదు స్క్రాచస్ మాత్రమే రోజుల్లో నాయమైపోతాయి .
థాంక్స్ డాక్టర్ అంటూ ఫీజ్ ఇచ్చేసి బ్రదర్ కు డ్రెస్ ఇచ్చాను .
బ్రదర్ ....... నో నో నో ....... బ్రదర్ కాదనకు షర్ట్ - ప్యాంట్ బ్లడ్ అయ్యింది . ఇంట్లోవాళ్ళు చూస్తే కంగారుపడతారు .
నిజమే అక్కయ్య భయపడిపోతుంది అని గ్రీన్ కర్టైన్ వెనుకకువెళ్లి మార్చుకునివచ్చాడు .

తన ఫైల్ అందుకుని , భుజం పై చేతినివేసుకుని బయటకువచ్చి జిప్సీ లో కూర్చోబెట్టబోతుంటే , ఆటోలో వెళతానన్నాడు .
ఇది నా కర్తవ్యం నువ్వు చేసిన సహాయానికి ఎంత చేసినా రుణం తీరదు అంటూ వద్దు అంటున్నా కూర్చోబెట్టి , అటువైపుకు వచ్చి కూర్చున్నాను . బ్రదర్ ....... ఎక్కడికి వెళ్ళాలి ? .
చేతికున్న వాచ్ చూసుకుని లంచ్ కు ఇంకా సమయం ఉంది , బ్రదర్ ....... IIM క్యాంపస్ కు తీసుకెళ్లగలరా ? .
What ....... నేనూ అక్కడికే వెళుతున్నాను - ఆర్డర్ వెయ్యి బ్రదర్ అంటూ అతడి ఫైల్ అందుకుని చూసాను . 10th ర్యాంక్ wow wow .......
నువ్వూ అక్కడికేనా బ్రదర్ .......
అవును బ్రదర్ ....... , 25th ర్యాంక్ ....... , సైకిల్ మరిచిపోయాము అని వెనక్కువెళ్లి జిప్సీ లో ఉంచుకుని మాట్లాడుకుంటూ క్యాంపస్ మెయిన్ గేట్ చేరుకున్నాము .

కాలేజ్ హాలిడేస్ కాబట్టి మెయిన్ బిల్డింగ్ లాక్ చెయ్యడం జరిగింది వెరీఫికేషన్ వచ్చేసి మరింత ముందుకువెళ్లి కుడికి టర్న్ అయితే ఫస్ట్ బిల్డింగ్ లో అని సెక్యూరిటీ చెప్పడంతో అక్కడికే వెళ్ళాము . ఫస్ట్ డే కాబట్టి కొంతమందే ఉండటంతో గంటలో వెరీఫికేషన్ ఇద్దరికీ సీట్స్ దొరికాయి .
ఫస్ట్ టర్మ్ ఫీజ్ ను నేను కార్డ్ ద్వారా - అతడు ప్యాంటుకున్న ప్రతీ జేబు నుండీ కొద్దికొద్దిగా తీసి రెండు మూడుసార్లు కౌంట్ చేసి పే చేసి రిసిప్ట్ జాగ్రత్తగా దాచుకున్నాడు .
బ్రదర్ ........ ఇందుకేనా క్లినిక్ లో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఆలస్యం అయినది అని నవ్వుకున్నాము .
జాగ్రత్తగా బయటకు నడిపించుకుంటూ వచ్చి బ్రదర్ ...... లంచ్ సమయం అయ్యింది కాబట్టి ట్రీట్ నాదే అన్నాడు .
నో నో నో ........
నువ్వు నో అన్నా వదలనులే బ్రదర్ అంటూ కూర్చోబెట్టి , కలిసి ఇంతసేపైనా మన పేర్లు తెలుసుకోలేదు - ఫైల్ లో కూడా ర్యాంక్ చూసానే తప్ప పేరు చూడలేదు . నా పేరు మహేష్ ....... వైజాగ్ వచ్చి 15 డేస్ అయ్యింది - హోటల్లో ఉంటున్నాను .
Hi మహేష్ ....... , నా పేరు కృష్ణ పుట్టి పెరిగింది వైజాగ్ లోనే .......
Hi కృష్ణా ....... ఇక నుండీ మనం ఫ్రెండ్స్ , ముందు నీ నెంబర్ చెప్పు అని మొబైల్ బయటకు తీసాను .
కృష్ణ : నా మొబైల్ అందుకుని రింగ్ ఇచ్చాడు .
ఫ్రెండ్ అని సేవ్ చేసుకున్నాను - అమ్మా దుర్గమ్మా ....... వైజాగ్ లో మొదటగా స్నేహితుడిని ఇచ్చారన్నమాట థాంక్స్ . కృష్ణా ....... నా మేనేజర్ - లాయర్ తరువాత కాంటాక్ట్ లో సేవ్ చేసుకున్నది నిన్నే అని చూయించాను .
కృష్ణ : ఓన్లీ 3 కంటాక్ట్స్ ....... నువ్వు అనాధవా మహేష్ ? .
ఇంచుమించు అలానే కృష్ణా ....... , ఈరోజు నుండీ కాదులే నువ్వు ఉన్నావు కదా ......... - అవునూ ...... నువ్వు ఒక్క క్షణం లేట్ చేసినా అక్కడ నన్ను కుమ్మేసేవాళ్ళు అందరూ - నాదే తప్పు అయినా ఎందుకు రక్షించావు ? కృష్ణా ......
కృష్ణ : జీవితంలో ఇంతకుమించిన దెబ్బలకే తట్టుకున్నాను , ఇవి ఏపాటివి ....... , జరిగినదానిని ఎలాగో మార్చలేము - నా వలన మరొకరు బాధపడటం నాకు ఇష్టం లేదు - ఏది జరిగినా మన మంచికే ........
టచ్ చేసావు కృష్ణా ఇక్కడ టచ్ చేసావు ఫ్రెండ్ అనికాదు బెస్ట్ ఫ్రెండ్ అని సేవ్ చేసుకుంటాను అని మార్చి కౌగిలించుకున్నాను .
కృష్ణ : స్స్స్ .........
Sorry sorry ........
కృష్ణ : ఫ్రెండ్స్ మధ్యన sorry ఏమిటి ? .
మళ్లీ టచ్ చేసావు కృష్ణా ....... అంటూ పెదాలపై చిరునవ్వులతో , నేను ఉంటున్న హోటల్ చేరుకున్నాము . కృష్ణా ...... ఇక్కడే నేను ఉంటున్నది అంటూ లోపలికి పిలుచుకునివెళ్ళాను .
కృష్ణ : wow ........ స్టార్ హోటల్ , ఫస్ట్ టైం ....... అంటూ చుట్టూ చూసి ఆనందిస్తున్నాడు .
కృష్ణా ....... రూమ్ కు వెళ్లి ఫ్రెష్ అయ్యి రెస్టారెంట్ కు వెళదాము .
కృష్ణ : వాచ్ చూసి అక్కయ్య వచ్చే సమయం అయ్యింది , వచ్చేలోపు లంచ్ ప్రిపేర్ చెయ్యాలి .
నువ్వు లంచ్ ప్రిపేర్ చేస్తావా అని ఆశ్చర్యంగా అడిగాను .
కృష్ణ : బ్రేక్ఫాస్ట్ - డిన్నర్ అక్కయ్య , లంచ్ నేను ....... ఎందుకంటే అక్కయ్య మార్నింగ్ పార్ట్ టైం జాబ్ చేస్తారు - నేను నైట్ పార్ట్ టైం జాబ్ చేస్తాను .
ఎందుకు అని అడగబోయి మా మధ్యన అంత బాండింగ్ లేదని ఆగిపోయాను . కృష్ణా ఈ ఒక్కరోజుకు నువ్వు ..... నాతోపాటు లంచ్ చేసి అక్కయ్యకు పార్సిల్ తీసుకెళ్లు - అక్కయ్యకు కూడా ట్రీట్ ఇచ్చిన సంతృప్తి కలగనివ్వు .......
కృష్ణ : ok .......
థాంక్స్ కృష్ణా ...... అంటూ పైకి పిలుచుకునివెళ్ళాను . లగ్జరీ రూమ్ చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనౌతున్నాడు - ఇక బాల్కనీ నుండి వ్యూ చూసి నాలానే ఫిదా అయిపోయాడు .

ఇద్దరమూ ఒకరితరువాతమరొకరం ఫ్రెష్ అయ్యి కిందకువచ్చి కూర్చుని మెనూ కార్డ్ అందించాను . కృష్ణ కళ్ళు జిగేలుమనడం గమనించాను - ప్రక్కనే ప్రైస్ చూసి మెనూ క్లోజ్ చేసేసి కేవలం చికెన్ బిరియానీ మాత్రమే ఆర్డర్ ఇచ్చాడు .
కృష్ణా ........ ఫ్రెండ్ దగ్గర ఎందుకు మొహమాటం - నేను నిజంగా ఫ్రెండ్ అని నువ్వు అనుకుంటే నీకిష్టమైనవన్నీ ఆర్డర్ చెయ్యి please please ....... - అలాకాకపోతే నేను బాధపడతాను నీ ఇష్టం .
కృష్ణ : లేదు లేదు అని మోహమాటపడుతూనే ఒక్కొక్కటి చెబుతున్నాడు .
Yes yes కమాన్ కమాన్ అంటూ ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేసేలా ప్రోత్సాహం ఇచ్చాను . సూపర్ కృష్ణా ....... నేను ,నీ బెస్ట్ ఫ్రెండ్ నే అంటూ సంతోషించి నాకు మాత్రం కేవలం వెజిటబుల్ రైస్ ఆర్డర్ చేసాను .
కృష్ణ : ఇదేమీ బాలేదు ఫ్రెండ్ ........
తప్పుగా అనుకోవద్దు , 15 రోజులుగా హోటల్ ఫుడ్ మాత్రమే తింటున్నాను - ఇంటి ఫుడ్ కోసం అలమటిస్తున్న అభాగ్యుడిని అంటే నమ్ము - ఒక్కటి మాత్రం చెబుతున్నాను ఇంటి ఫుడ్ అమృతం , హోటల్ ఫుడ్ ....... నువ్వు తినబోతున్నావు కాబట్టి చెప్పకూడదు . నోరు పీక్కుపోతోంది అంటే నమ్ము ఫ్రెండ్ .........
అంతలో ఆర్డర్ రావడంతో కృష్ణ సంతోషంగా తినేలా చేసాను . అక్కయ్య ...... ఇప్పుడు చికెన్ తినదు అనిచెప్పడంతో స్పెషల్ వెజ్ ఐటమ్స్ అన్నింటినీ పార్సిల్ తీసుకుని తన ఇంటికి చేరుకున్నాము . కృష్ణ లోపలికి ఆహ్వానించడంతో కాదనలేకపోయాను . అంతలో ఆర్కిటెక్ట్ నుండి అర్జెంట్ అని కాల్ రావడంతో మళ్లీ కలుస్తాను నెంబర్స్ ఉన్నాయికదా అనిచెప్పి ఇంటికి చేరుకుని అవసరాలను తీర్చాను .

రాత్రి 8 గంటల సమయంలో కృష్ణ నుండి కాల్ వచ్చింది .
కృష్ణ : మహేష్ ....... ఎక్కడ ఉన్నావు ? హోటల్ రిసెప్షన్ లో ఉన్నాను - బయటకు వెళ్లారు అనిచెప్పారు .
అవును కృష్ణా ...... ప్రతీరోజూ స్టార్ హోటల్ ఫుడ్ ఏమిటని , స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేద్దామని బయటకువచ్చాను .
కృష్ణ : నో నో నో తినేశావా ఏమిటి ? .
లేదు ఇంకా వెళుతున్నాను .
కృష్ణ : ఎక్కడ ఉన్నావు ? , వస్తాను please please తినొద్దు ఫ్రెండ్ .
నేనే హోటల్ దగ్గరికి వస్తున్నాను అక్కడే ఉండు - హోటల్ వరకూ ఎందుకు రావటం ఈ పరిస్థితుల్లో ....... కాల్ చేసి ఉంటే నేనే నీదగ్గరికి వచ్చేవాడిని కదా ...... లాబీలో కూర్చో వచ్చేస్తాను అని 10 నిమిషాల్లో వచ్చాను . బయటే ఉండటం చూసి లాబీలో దర్జాగా కూర్చోమని చెప్పానుకదా పొల్యూషన్ చూడు ఎంత ఉంది - గాయాలు నాయమవ్వాలా వద్దా ? .
కృష్ణ : నవ్వుకుని జిప్సీ లో కూర్చుని ఇంటికి పోనివ్వమన్నాడు .
సరే ఫ్రెండ్ ఆర్డర్ అంటూ 20 నిమిషాల్లో ఇంటికి చేరుకున్నాము .

కృష్ణ : కిందకుదిగి చిన్న ఇంటి లోపలికి పిలుచుకునివెళ్లాడు .
గుమ్మం దగ్గరే మసాలా ఘుమఘుమలు అధిరిపోతున్నాయి . పెదాలు తడుముకుని లొట్టలెయ్యడం చూసి కృష్ణ నవ్వుకుని , అక్కయ్యా అక్కయ్యా ...... ఎవరొచ్చారో చూడు .
చున్నీతో చేతులను తుడుచుకుంటూ వచ్చి , మహేష్ కదా ....... మధ్యాహ్నం పంపించిన ట్రీట్ కు థాంక్స్ మహేష్ . రేయ్ ....... ఏర్పాట్లు చెయ్యి .
తలదించుకుని అక్కయ్యా ....... నేను నేను .......
కృష్ణ : దుప్పటి పరిచి , మహేష్ ....... కూర్చో అని చేతిని పట్టుకుని కూర్చోబెట్టుకున్నాడు . ఇంటి ఫుడ్ తినాలని ఆశపడుతున్నావు కదా ........
అంతలో అక్కయ్య పాత్రలు తీసుకువచ్చి బిరియానీ వడ్డించారు - మహేష్ ...... టేస్ట్ ఎలా ఉందో చెప్పు అన్నారు .
అక్కయ్యా ....... కృష్ణ గాయాలకు కారణం నేనే ....... , చూసుకోకుండా జిప్సీ .......
అక్కయ్య : తెలుసు మహేష్ .......
అక్కయ్యా ....... కోపం రాలేదా ? .
అక్కయ్య : నా గురించి కృష్ణ చెప్పగానే అక్కయ్యా ....... అని ఆప్యాయంగా పిలిచావట కదా - ఇప్పుడుకూడా పిలిచిన పిలుపులో కూడా అమితమైన ప్రేమ ఉంది . తమ్ముడిపై అక్కయ్యకు కోపం వస్తుందా చెప్పు - ఆక్సిడెంట్ చేసినతారువాత ఎలా ట్రీట్ చేశావో చూస్తేనే తెలిసిపోతుంది నా మరొక తమ్ముడు ఎంతమంచివాడో ....... - అవన్నీతరువాత మాట్లాడుకుందాము ముందు తిను , తిని నేను బాగా చేశానో లేదో చెప్పు .......
అక్కయ్యా ....... అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలను తుడుచుకుని తిన్నాను . మ్మ్మ్ ....... అమృతం అక్కయ్యా ....... ఎన్నిరోజులయ్యింది ఇంటి ఫుడ్ తిని అంటూ గబగబా తినడం చూసి కృష్ణగాడు నవ్వుకుని నాతోసమానంగా తిన్నాడు .
అక్కయ్యా - ఫ్రెండ్ ....... థాంక్యూ థాంక్యూ sooooo మచ్ , మళ్లీ 15 రోజులు ఉండవచ్చు ఈ టేస్ట్ తలుచుకుంటూ - హోటల్ ఫుడ్ కానిస్తూ .........
అక్కయ్య : ఇకనుండీ మూడుపూటలా నా తమ్ముడు ఇక్కడికే వచ్చి నా చేతివంటనే తినాలి .
" తమ్ముడు " అన్న పిలుపుకు కళ్ళల్లో బాస్పాలు ఆగడం లేదు .
అక్కయ్య : తమ్ముడూ ....... కారంగా ఉందా అని నీళ్లు అందించారు .
లేదక్కా ....... , జీవితంలో తొలిసారి తమ్ముడు అని పిలిచినందుకు వస్తున్న ఆనందబాస్పాలు ........ మరొక్కసారి పిలవరా ? .
అక్కయ్య : ఒక్కసారి ఏమిటి తమ్ముడూ ....... ఇకనుండీ ఇలానే పిలుస్తాను తమ్ముడూ ....... మరికొంత వడ్డించినా ? , ఆర్డర్ వేస్తున్నాను మూడుపూటలా నేను వండిన వంటనే తినాలి .
కృష్ణ : మధ్యాహ్నం లంచ్ వండేది నేను కదా అక్కయ్యా .......
అక్కయ్య : అవునుకదా ....... , తమ్ముడూ ...... మీ ఫ్రెండ్ కూడా బాగానే వండుతాడు .
అక్కయ్యకు వండే అదృష్టం అన్నమాట , అయితే నేనుకూడా నేర్చుకుని అక్కయ్యకోసం వంట చేస్తాను - నేర్చుకున్నాక ప్రతీరోజూ నేనే వండుతాను - ఇకపై ఆ అదృష్టం మొత్తం నాకు మాత్రమే సొంతం కావాలి అని మళ్ళీ మళ్ళీ వడ్డించుకుని అమృతం అమృతం అంటూ డబల్ తిన్నాను . తరువాత అక్కయ్యకు వడ్డించాము .
కృష్ణ : మహేష్ ....... ఎంత త్వరగా మాలో కలిసిపోయావు .
మరి ఉదయం బెస్ట్ ఫ్రెండ్ - ఇప్పుడు తమ్ముడూ ....... అని ఆప్యాయంగా పిలిచే అక్కయ్య . అమ్మా దుర్గమ్మా ....... ఒక ఫ్యామిలీనే ఇచ్చావన్నమాట థాంక్యూ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని ఎంతసేపు సంతోషంగా మాట్లాడుకుంటూ కూర్చున్నామో మాకే తెలియదు . 10 గంటల సమయంలో గుడ్ నైట్ చెప్పి హోటల్ చేరుకున్నాను .
అమ్మా ....... ఈరోజు మరింత సంతోషమైన రోజు అక్కయ్య - ఫ్రెండ్ ........ మన జీవితంలోకి వచ్చారు తెలుసా అని జరిగినదంతా వివరిస్తూ ఏదో గుర్తుకు రావడంతో కృష్ణ కు కాల్ చేసాను -
కృష్ణా ....... రేపు సండే ఫ్రీ కదా అని అడిగాను .
కృష్ణ : వన్ మినిట్ వన్ మినిట్ ........
Ok ok .......
కృష్ణ : నిన్ను కాదు మహేష్ ...... ఇక్కడ కాల్ సెంటర్ కాల్ వాళ్లకు చెబుతున్నాను .
కృష్ణా ...... కాల్ సెంటర్ ఏమిటి ? .
కృష్ణ : చెప్పానుకదా పార్ట్ టైం జాబ్ అని , 10pm - 5am ....... అమెరికన్ కంపెనీ కాల్ సెంటర్ లో పనిచేస్తాను .
మరి అక్కయ్య ........
కృష్ణ : ఇంట్లో .......
ఒంటరిగానా ....... ? .
కృష్ణ : మాకు ఇలా అలవాటైపోయింది , లాక్ చేసుకుని పడుకుంటుంది - ఎవ్వరు తలుపు తట్టిన తెరవకుండా నాకు కాల్ చెయ్యమని చెప్పే వచ్చాను .
Ok బై చెప్పేసి రూమ్ లాక్ చేసేసి కిందకువచ్చి జిప్సీ లో వేగంగా కృష్ణ ఇంటికి చేరుకున్నాను . కాలనీ మొత్తం నిర్మానుష్యన్గా పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండటం చూస్తుంటే నాకే భయం వేస్తోంది - అక్కయ్య ఎలాఉన్నారో అని కంగారుపడుతూనే బయటే జిప్సీ లో కూర్చున్నాను . చలికి ముడుచుకుని కూర్చుని సీట్లో అలాగే నిద్రపోయాను - అలికిడి అయిన ప్రతీసారీ మేల్కొని చూసి అక్కయ్య సేఫ్ అనుకుని మళ్లీ తూగుతూ నిద్రపోయాను .
**********

మహేష్ మహేష్ ........ అన్న పిలుపుకు మేల్కొని చూస్తే కృష్ణ హమ్మయ్యా ...... వచ్చేసావా హోటల్ కు వెళ్లి ఇక హాయిగా పడుకోవచ్చు . నాపై స్వేటర్ కప్పి ఉండటం చూసి థాంక్స్ కృష్ణా వెచ్చగా ఉంది అని వణుకుతూ చెప్పాను .
కృష్ణ : నాకు కాల్ చేసిన తరువాత నుండి రాత్రంతా ఇక్కడే ఉన్నావు కదూ ......
అక్కయ్యరా ...... కృష్ణా మరి .
కృష్ణ : థాంక్యూ soooo మచ్ మహేష్ - రా అనే పిలువు మహేష్ బాగుంది అని కౌగిలించుకున్నాడు .
అలాగే , రేయ్ కృష్ణా ....... సండే కదా ఇద్దరూ ఫ్రీయే కదా ? .
కృష్ణ : అవును .......
8 గంటలకల్లా వచ్చేస్తాను అలాబయటకువెళదాము - నాకు తెలిసి సంతోషంగా బయటకువెళ్లి చాలా కాలమైంది అనుకుంటాను please please రా ...... నాకైతే రోజంతా అక్కయ్యతో ఉండి అక్కయ్య ఆప్యాయతను పొందాలని ఆశగా ఉంది .
కృష్ణ : కళ్ళల్లో కన్నీళ్ళతో అవును మహేష్ చాలా సంవత్సరాలే అయ్యింది - మహేష్ ........ నాకే కాదు నీకు కూడా అక్కయ్యనే , మీ అక్కయ్య నీ ఇష్టం ........
థాంక్యూ రా అంటూ కౌగిలించుకున్నాను - రేయ్ ...... రాత్రంతా చలిలో ఉన్నానని అక్కయ్యకు చెప్పకు బాధపడతారు .
కృష్ణ : తలను అడ్డు - నిలువు రెండు విధాలుగా ఊపాడు . మహేష్ ...... లోపల పడుకుని ఉండొచ్చు కదా .......
ఆ సమయంలో అక్కయ్యను డిస్టర్బ్ చెయ్యడమా ....... నెవర్ .......
కృష్ణ : అయితే ఇప్పుడువచ్చి పడుకో ........
నేను వణకడం చూస్తే రాత్రంతా చలిలో ఉన్నానని తెలిసిపోతుంది నోవే - రెండు గంటలు నిద్రపోయి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను బయలుదేరుదాము అక్కయ్యకు చెప్పు బై రా , చలికి చేతులు - వేళ్ళు వణుకుతున్నాయి డ్రైవింగ్ ...... ఏమీ లేదురా ఏమీ లేదు - రేయ్ నువ్వు కూడా రా అనే పిలవాలి గుర్తుపెట్టుకో అని స్వేటర్ వేసుకుని అదురుతున్న చేతులతోనే డ్రైవింగ్ చేస్తూ హోటల్ చేరుకుని 8 గంటలకు అలారం పెట్టుకుని రెండు దుప్పట్లు కప్పుకుని వెచ్చగా నిద్రపోయాను .​
Next page: Update 16
Previous page: Update 14