Update 16
నిమిషానికే అలారం చప్పుడు వినిపించిందా అన్నంత ఘాడమైన నిద్రపోయానని వొళ్ళు విరుచుకుంటూ లేచి నవ్వుకున్నాను . లేచి sea view కు ఫ్లైయింగ్ కిస్ వదిలి బాత్రూం కు వెళ్లి ఫ్రెష్ అయ్యాను .
కొత్త డ్రెస్ వేసుకుని కావాల్సిన ఐటమ్స్ బ్యాక్ ప్యాక్ లో తీసుకుని నేరుగా కృష్ణ వెళ్లి ఇంటిముందు ఆపి హార్న్ కొట్టాను .
మొబైల్ తీసి ఆర్కిటెక్ట్ కు - పెయింటర్ కు - బ్రదర్స్ కు గ్రూప్ కాల్ చేసాను . బయటకు వెళుతున్నానని ఏదైనా అవసరం అయితే కాల్ చెయ్యమని చెప్పాను . ఇద్దరూ బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ చెప్పారు - ఈరోజుతో వర్క్ మొత్తం ఫినిష్ అయిపోతుందని .
Wow గ్రేట్ ........
బ్రదర్స్ : మహేష్ మరొక గుడ్ న్యూస్ రేపు మంచిరోజని రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని ఓనర్ గారు కాల్ చేశారు .
What a great coincidence ....... this is big big big biggest గుడ్ న్యూస్ i am ready బ్రదర్స్ ....... రేపుకాలుద్దాము .
బ్రదర్స్ : రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళాక నీకు కాల్ చేస్తాము , బై ఎంజాయ్ ద ఔటింగ్ ......
Sure థాంక్యూ .........
కృష్ణ : మహేష్ .......
కృష్ణ వైపు కోపంతో చూసాను .
కృష్ణ : నవ్వుకున్నాడు , sorry sorry రేయ్ ....... లోపలికి రావా - నీకోసం అక్కయ్య టిఫిన్ రెడీ చేశారు అని ప్రేమతో పిలిచాడు .
అలా అలా పిలిస్తేనే పలుకుతాను లేకపోతే లేదు అంతే , రేయ్ రేయ్ ....... అక్కయ్య - బెస్ట్ ఫ్రెండ్ ను కలిశాను కదా , ఇంతటి అదృష్టాన్ని కలిగించిన అమ్మ దుర్గమ్మ దర్శనం చేసుకునేంతవరకూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను అని మొక్కు - క్యారెజీ చేసెయ్యి ఎక్కడైనా ప్రశాంతమైన వాతావరణంలో పొలాలమధ్యన తిందాము .
కృష్ణ సన్తహోశంతో నవ్వుతున్నాడు .
ఎందుకురా నవ్వుతున్నావు జోక్ ఏమైనా చెప్పనా ? .
కృష్ణ : ఇవే మాటలు లోపల అక్కయ్య ద్వారా కూడా విన్నానురా కొద్దిసేపటి ముందు అందుకే సంతోషం వేసింది - ఒక్కరోజుకే అక్కాతమ్ముళ్ళు ....... ఇంత క్లోజ్ అయ్యారంటే కొన్నిరోజులకు నన్ను ప్రక్కకు తోసేస్తారేమో .........
అదిమాత్రం నిజమేరా ....... , పుట్టినప్పటి నుండీ అక్కయ్య ప్రేమను పొందావు కదరా - ఇకనుండీ అక్కయ్య మొత్తం ఆప్యాయత నాకే చెందాలి - please please అడ్డు రావద్దురా ........
కృష్ణ : సరే సరే ........
గుమ్మం దగ్గర నవ్వులు వినిపించడంతో చూస్తే అక్కయ్య - మారుక్షణంలో ఆనందబాస్పాలతో చూస్తున్నారు .
గుడ్ మార్నింగ్ అక్కయ్యా ....... అంటూ దగ్గరికివెళ్ళాను .
అక్కయ్య : గుడ్ మార్నింగ్ తమ్ముడూ ....... , నేను రెడీ - క్యారెజీ కూడా రెడీ ......
అక్కయ్యా ........ మీరు కూడా , నాకోసం గుడికి వెళదామనుకున్నారా ? Soooooo happy అంటూ చేతులలోని క్యారెజీ అందుకుని రండి వెళదాము అని క్యారెజీ వెనుక ఉంచాను .
కృష్ణ : రేయ్ ....... అదొక్కటే కాదు అంటూ మరొక రెండు పెద్ద పెద్ద క్యారెజీలు తీసుకువచ్చాడు . నేను ఆశ్చర్యపోవడం చూసి ....... , నువ్వు బయటకు వెళదాము అని అక్కయ్యకు ok ok మీ అక్కయ్యకు చెప్పగానే , సంతోషం పట్టలేక నీకోసం బ్రేక్ఫాస్ట్ - లంచ్ ప్రిపేర్ చేశారు .........
లవ్ ....... థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అక్కా అంటూ మురిసిపోయాను . రండి కూర్చోండి ఫిస్ట్ గుడికి వెళదాము .
కృష్ణ : నేను ముందుసీట్లో అని ముందుకువచ్చాడు .
రేయ్ వెనక్కువెళ్లి - వెనక్కు వెళ్లు ....... అక్కయ్యా కూర్చోండి అని సీట్ శుభ్రం చేసాను .
లవ్ ........ థాంక్యూ తమ్ముడూ అంటూ ముసిముసినవ్వులతో కూర్చున్నారు .
కృష్ణ : కొద్దిరోజుల తరువాతకదా ....... , ఇప్పుడే తోసేసారన్నమాట అని నవ్వుకుంటూ వెళ్లి కూర్చున్నాడు .
అక్కయ్య : నవ్వుకుని , తమ్ముడూ ....... పూజాసామాగ్రి లోపలే ఉండిపోయింది తీసుకొస్తాను .
అక్కయ్యా ....... నేనున్నాను కదా రేయ్ కీస్ ఇవ్వు ........
ఆక్కయ్య : తమ్ముడూ ....... నా ప్రక్కనే ఉండు , వెళ్ళడానికి మరొకడు ఉన్నారుకదా అని నా చేతిని పట్టుకున్నారు .
యాహూ ........ ఇదే ఇదే ఇలాంటి ప్రేమనే నేను ఆశపడుతున్నది అంటూ నవ్వుతూ కృష్ణవైపు చూసాను .
ఒకవైపు తియ్యనికోపం మరొకవైపు సంతోషంతో లోపలికివెళ్లి పూజ వస్తువులు గల బుట్టను తీసుకొచ్చి అక్కయ్యకు ఇచ్చి వెనుక కూర్చున్నాడు .
అక్కయ్యా ....... సీట్ బెల్ట్ పెట్టుకోండి అని అందించాను . ఇక్కడ ఇక్కడ ఇలా అంటూ సెట్ చేసి కంఫర్ట్ కదా అని అక్కయ్య చిరునవ్వులను చూసి సంతోషంతో డ్రైవింగ్ సీట్లోకి చేరి బయలుదేరాను - అక్కయ్యా ...... ఏ టెంపుల్ ? .
అక్కయ్య : తమ్ముడూ ...... నువ్వే చెప్పావుకదా అమ్మవారి గుడికి అని - అమ్మానాన్నలు చనిపోయిన తరువాత అమ్మవారే మాకు అన్నీ .......
నాకు కూడా అంతే మన ముగ్గురికీ కూడా అన్నమాట , అక్కయ్యా ...... గుడికి దారి మీరే చూయించాలి - అక్కయ్య డైరెక్షన్ లో 15 నిమిషాలలో కనకదుర్గమ్మ గుడికి చేరుకున్నాము .
లోపలికివెళ్లి అమ్మవారి ముందు షాష్టాంగ నమస్కారం చేసి , థాంక్యూ థాంక్యూ అమ్మా ....... అక్కయ్యను - బెస్ట్ ఫ్రెండ్ ను ఇచ్చారు అలాగే ...... మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదనుకోండి మీకు తెలుసు ...... - నా ప్రక్కనే కృష్ణగాడూ పడ్డాడు .
అక్కయ్య సంతోషించి పూజారిగారూ ...... తమ్ముళ్లు మహేష్ - కృష్ణ పేర్లపై పూజ జరిపించండి .
లేదు లేదు లేదు అంటూ ఇద్దరమూ లేచి అక్కయ్య పేరుపై పూజ జరిపించండి .
పూజారి గారు : సంతోషం , ముగ్గురి పేర్లపై పూజ జరిపిస్తాను అని లోపలికివెళ్లి హారతి - ప్రసాదంతో వచ్చారు .
అక్కయ్య స్వయంగా మాకు తాకించి బొట్టుపెట్టి తానూ పెట్టుకున్నారు .
అక్కయ్య చేతులమీదుగా హారతి పళ్ళెంలో 2000 నోటు - హుండీలో 2000 నోటు వేయించి , గుడి ఆవరణలో కూర్చున్నాము . అక్కయ్యా ...... ఆకలేస్తోంది కొబ్బరి ముక్క ........
అక్కయ్య పగలగొట్టబోతే .......
అమ్మో అమ్మో ....... మా అక్కయ్య సుకుమారమైన చేతితో ఇంకేమైనా ఉందా అని సగం కొబ్బరి చిప్ప అందుకుని ముక్కలుముక్కలు చేసి మొదట అక్కయ్యకు ఇచ్చి తర్వాత తిన్నాము . కొద్దిసేపు భక్తితో కూర్చుని అక్కయ్యా ....... ఇక వెళదామా ? , ప్రకృతి మనల్ని ఆహ్వానిస్తోంది .
అక్కయ్య : తమ్ముడి ఇష్టమే నా ఇష్టం .......
నో నో నో అక్కయ్య ఇష్టమే ఈ తమ్ముళ్ల ఇష్టం - ఏరా ఏమంటావు ? .
కృష్ణ : కళ్ళల్లో కన్నీళ్లను తుడుచుకున్నాడు .
రేయ్ ఏమైందిరా ........
కృష్ణ : అక్కయ్యను సంతోషంగా నవ్వడం చూసి చాలా కాలం అంటూ ఉద్వేగంతో కౌగిలించుకున్నాడు - నీవల్లనే నీవల్లనే రా థాంక్యూ sooooo మచ్ .
రేయ్ ....... ఇది స్టార్టింగ్ మాత్రమే , లెట్స్ గో సంతోషాలలో విహరిద్దాము అని పూజ బుట్టి అందుకుని ఇద్దరమూ పైకిలేచి ముందుకునడిచాము .
తమ్ముళ్లూ ....... అంటూ అక్కయ్య తియ్యనైన కోపంతో చూస్తూ రెండుచేతులను మావైపుకు చాపారు .
లవ్ ...... sorry sorry అక్కయ్యా ....... అంటూ చిరునవ్వులు చిందిస్తూ వెనుకకువెళ్లి , అక్కయ్య చేతులను అందుకుని అమ్మవారివైపు తిరిగి మరొకసారి మొక్కుకుని బయటకువచ్చి జిప్సీ ఎక్కాము .
జిప్సీ ఓపెన్ టాప్ కావడంతో 9 గంటలకే ఎండ మండిపోతున్నట్లు అక్కయ్య ఇబ్బందిపడటం చూసి మొదట నీళ్లు అందించి నేరుగా కార్స్ షోరూం చేరుకున్నాను .
కిందకుదిగి అక్కయ్యదగ్గరికివెళ్లి , అక్కయ్యా - రేయ్ కృష్ణా ........ రండి అని లోపలికిపిలుచుకునివెళ్ళాను .
Welcome సర్ అంటూ ఆహ్వానించారు .
చుట్టూ ....... రకరకాల స్టైలిష్ కార్స్ ను సంతోషంతో చూస్తున్నారు . ఆనందించి అక్కయ్యా ....... మీకు నచ్చిన కార్ సెలెక్ట్ చెయ్యండి అని ఒక రౌండ్ వేశాము .
కృష్ణ : wow " రేంజ్ రోవర్ " ......
అదేసమయానికి అక్కయ్యకూడా బ్లూ రేంజ్ రోవర్ వైపు ఒకింత ఆశ్చర్యపోతూనే చూయించారు .
అక్కయ్యకు - బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరికీ ఒకే కార్ నచ్చింది అంటే అంతకంటే ఆనందం ఏముంది అని సేల్స్ మ్యాన్ నుండి కీస్ అందుకుని అన్లాక్ చేసి - ఫ్రంట్ డోర్ తెరిచి అక్కయ్యను కూర్చోమని చెప్పాను .
అక్కయ్య : కంగారుపడుతూ చుట్టూ చూస్తున్నారు .
అక్కయ్యా ...... ఈక్షణం నుండీ ఈ బ్యూటీ మనది , సంతోషంగా కూర్చోండి అని చేతిని అందుకుని సైగచెయ్యడంతో పెదాలపై చిరునవ్వుతో కూర్చున్నారు .
విండో ఓపెన్ చేసి డోర్ క్లోజ్ చేసాను - అక్కయ్యా ....... ఓకేఒక్కనిమిషం ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను - రేయ్ ...... ఇక్కడేఉండు అని పే చెయ్యడానికి వెళ్ళాను .
ఓనర్ : 5 మినిట్స్ లో ok చేశారు థాంక్యూ సర్ ...... , name please .......
అవునూ ఇంతకూ అక్కయ్య పేరు ఏమిటి ? , ఎస్క్యూస్ మీ ...... రేయ్ కృష్ణా అని పిలిచాను - రాగానే రేయ్ ...... అక్కయ్య పేరు ? .
కృష్ణ : పేరు తెలియకుండానే ఒకరంటే ఒకరికి ప్రాణం ప్చ్ .......
నవ్వుకుని , అక్కయ్య పేరు చెప్పరా .......
కృష్ణ : దివ్య .......
దివ్యక్క దివ్యమైన పేరు - దివ్య అని ఓనర్ కు చెప్పాను .
దివ్యక్క పేరుపై బిల్ వేసి ఇచ్చాడు . కార్డ్ ద్వారా పే చేసి బిల్ అందుకుని కృష్ణగాడి జేబులో ఉంచాను - వన్ డే నా జిప్సీ ఇక్కడే ఉంచవచ్చా ? .
ఓనర్ : నిర్మొహమాటంగా సర్ .....
థాంక్యూ అంటూ కృష్ణగాడివైపు తిరిగాను .
కృష్ణ : మహేష్ ....... ? అంటూ బిల్ అందుకున్నాడు .
ఇంకా అర్థం కాలేదా ....... , ఒకవైపు సమయం గడిచిపోతోంది - మరొకవైపు ఆకలివేస్తోంది రారా వెళదాము అని లాక్కుని అక్కయ్యదగ్గరకు చేరుకుని కారు ఎక్కాము .
కృష్ణ : wow లగ్జరీయస్ కార్ ....... loved it my ఫ్రెండ్ .
సేల్స్ మ్యాన్స్ సెల్యూట్ చేసి మిర్రర్ డోర్స్ పూర్తిగా తెరవడంతో బయటకువచ్చాను.
అక్కయ్యకు ఎండ తగలకపోవడంతో నవ్వుతూ నావైపు చూసారు .
అక్కయ్యా ....... ఇప్పుడు మరింత హాయిగా ఉంటుంది అని విండోస్ క్లోజ్ చేసి AC ఆన్ చేసాను . క్షణాలలో లోపల కూల్ గా మారిపోయింది .
అక్కయ్య : నాకోసం అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో అడిగారు .
మరి మా అక్కయ్యనే ఇబ్బందిపెడతాడా సూర్యుడు ఎంత ధైర్యం - ఆయన లెక్కలు ఆయనకు ఉంటే మా సొల్యూషన్స్ మాదగ్గర ఉన్నాయి ఏరా కృష్ణా .......
అక్కయ్య : బాస్పాలను తుడుచుకుని లవ్ ....... థాంక్యూ తమ్ముడూ అని ఆనందానుభూతికి లోనౌతున్నారు .
అక్కయ్య నవ్వారు ....... యాహూ అంటూ కేకలువేస్తూ డ్రైవ్ చేసాను .
వెంటనే అమ్మో అమ్మో , మా అక్కయ్య ....... ఈ తమ్ముడికోసం వండిన టిఫిన్ - లంచ్ ....... జిప్సీలోనే ఉన్నాయి అని సైడ్ కు తీసుకెళ్లి ఆపి దిగబోయాను .
తమ్ముడూ ....... అంటూ నా చెయ్యిపట్టుకుని ఆపారు అక్కయ్య - తమ్ముడూ ...... నాతోనే ఉండాలని చెప్పానుకదా , వాటిని తీసుకురావడానికి ఖాళీగా కూర్చున్న పనివాడు ఉన్నాడు కదా ......
ముసిముసినవ్వులు నవ్వుకుని కారులో చుట్టూచూస్తూ పనువాడా ? ఎవరు అక్కయ్యా ........ ? .
కృష్ణ : ఆ పనివాడిని నేనేరా అంటూ తియ్యనైన కోపంతో మావైపు చూస్తూ కిందకుదిగి క్యారెజీలతోపాటు బ్యాక్ ప్యాక్ తీసుకొచ్చి వెనుక ఉంచివచ్చి బుంగమూతిపెట్టుకుని కూర్చున్నాడు .
ఇద్దరమూ నవ్వుకున్నాము . రేయ్ ....... బ్యాక్ ప్యాక్ లో చాక్లెట్ ఉంది అక్కయ్యకు ఇవ్వరా .......
కృష్ణగాడు తీసి ఇచ్చాడు .
అక్కయ్య : ఊహూ ....... అని చేతులుకట్టుకుని కూర్చున్నారు .
కృష్ణ : సరే సరే అక్కయ్యా ...... , రేయ్ నువ్వే ఇవ్వు అని నాకు ఇచ్చాడు .
లవ్ ........ థాంక్యూ అక్కయ్యా ....... ఇదే ఇదే ప్రేమనే నాకు కావాల్సినది అంటూ మురిసిపోతూ అందించాను .
అక్కయ్య : లవ్ ........ థాంక్యూ తమ్ముడూ ఉమ్మా అంటూ చాక్లెట్ కు ముద్దుపెట్టి నవ్వుకున్నారు . ఓపెన్ చేసి మాఇద్దరికీ ఇచ్చారు .
సిటీ దాటాక హైవే ప్రక్కన ఉన్న బంకు లోపలికిపోనిచ్చి ఫుల్ చెయ్యమన్నాను .
అది పెట్రోల్ బంక్ కమ్ సూపర్ మార్కెట్ కావడంతో కృష్ణ కిందకుదిగి సూపర్ మార్కెట్ లోపలికివెళ్లి రెండుచేతులనిండా స్నాక్స్ తీసుకొచ్చి వాడి సీట్ ప్రక్కనే ఉంచాడు .
బంకు వ్యక్తి రెండు బిల్లులు ఇచ్చాడు .
నేను పర్స్ తీసేంతలో కృష్ణ ....... అక్కయ్య హ్యాండ్ బ్యాగ్ అందుకుని పే చేసాడు - రేయ్ రేయ్ రేయ్ ........
రైట్ రైట్ అంటూ కూర్చుని ఆకలికి తట్టుకోనట్లు స్నాక్స్ తింటున్నాడు వాడు .
రేయ్ ........
కృష్ణ : ఏంటి నీకు కూడా కావాలా ? .
అధికాదురా బిల్ ........
అక్కయ్య : లవ్ యు కృష్ణా ....... , తమ్ముడూ మహేష్ పోనివ్వు ...... ఇప్పుడు మనమంతా ఒక్కటి కదా .........
ఆ మాటకు కళ్ళల్లో ఆనందబాస్పాలతో ఇద్దరి చేతులను నా గుండెలపై హత్తుకుని పోనిచ్చాను - రేయ్ ....... కుమ్ముతున్నావు అక్కయ్యకు ఇవ్వు .
అక్కయ్య : వద్దు తమ్ముడూ ........ టిఫిన్ తిన్నాక , కొద్దిసేపటికే తమ్ముడూ ....... చలి చలి ......
నవ్వుకుని , AC ఆఫ్ చేసి విండోస్ తెరిచాను .
స్వచ్ఛమైన ప్రకృతి గాలిని పీల్చి పచ్చని పొలాలను ఎంజాయ్ చేస్తున్నారు .
కృష్ణ : మహేష్ ...... 10 గంటలురా , ఆకలివేస్తోంది .
నాకు కూడా ...... , ఒక మంచి ప్లేస్ చూడుమరి తిందాము . అక్కయ్యా ...... మీకూ ఆకలివేస్తోందా ? .
అక్కయ్య : నా తమ్ముళ్ల ఆకలి తీరితే నాఆకలి తీరినట్లే ....... , బ్యూటిఫుల్ ప్లేస్ .....
టచ్ చేసావు అక్కయ్యా ....... అంటూ అటువైపు చూసి wow అంటూ రోడ్ నుండి పొలం వైపుకు టర్న్ చేసాను .
పచ్చని పొలాలమధ్యన ఆపి కిందకుదిగి పరుగునవెళ్లి అక్కయ్య డోర్ తెరిచాను .
అక్కయ్య : సంతోషంతో లవ్ ....... థాంక్యూ తమ్ముడూ అంటూ కిందకుదిగారు .
అక్కయ్యా ....... ఒక్కనిమిషం అంటూ పొలం పనులు చేసుకుంటున్న పెద్దయ్య దగ్గరికివెళ్ళాను - పెద్దయ్యా ........ ఈ పొలాలు మీవేనా అని అడిగాను .
పెద్దయ్య : అవును బాబూ ....... ఎవరు నువ్వు ఏమి కావాలి ? .
పెద్దయ్యా ....... ఎటుచూసినా పచ్చదనం మనసుకు ఉల్లాసాన్నిస్తోంది - మీరు అనుమతిస్తే ఇక్కడ కూర్చుని టిఫిన్ చెయ్యాలని ఆశపడుతున్నాము .
పెద్దయ్య : దానికే అడగాలా బాబూ ....... ఆ చెట్టుకిందకు వెళ్ళండి చల్లగా ఉంటుంది .
థాంక్యూ పెద్దయ్యా ....... , పెద్దయ్యా ...... మీరుకూడా వచ్చి తింటే మేము మరింత సంతోషిస్తాము .
పెద్దయ్య : నాకళ్ళల్లోకి ఒకసారి చూసి , సరే బాబూ ...... మీరు వెళ్ళండి శుభ్రం చేసుకునివస్తాను అనిచెప్పారు .
థాంక్యూ పెద్దయ్యా ....... తొందరగా వచ్చెయ్యండి అనిచెప్పి పరుగునవెళ్లి టిఫిన్ క్యారెజీ - వాటర్ బాటిల్స్ తీసుకుని ముగ్గురమూ చెట్టుకిందకు చేరాము . కూర్చోవడానికి పచ్చని గడ్డి స్వాగతం పలకడం చూసి ముగ్గురమూ ఒకరినొకరు చూసుకుని ఆనందించి కూర్చున్నాము .
అక్కయ్య : తమ్ముడూ ....... నాకు ఈ మినరల్ వాటర్ కాదు , పొలానికి వదిలిన నీటిని తాగాలని ఉంది .
Wow wow లవ్లీ లవ్లీ క్షణంలో తీసుకొస్తాను ........
అక్కయ్య : నా చేతిని అందుకుని ప్రక్కనే కూర్చోబెట్టుకున్నారు .
కృష్ణ : అర్థమైంది అర్థమైంది మేడం గారూ - చెప్పాల్సిన అవసరం లేదు ఖాళీగా ఉన్న పనివాడిని నేనే అంటూ మినరల్ బాటిల్స్ నీటిని పొలంలో చల్లుతూ వెళ్లి పంపు నీళ్లు తీసుకొచ్చాడు - పెద్దయ్యను పిలుచుకునివచ్చాడు .
వాడు లేచిన క్షణం నుండీ తిరిగివచ్చేవరకూ నవ్వుతూనే ఉన్నాము . బాటిల్ అందుకుని మూత తెరిచి అక్కయ్యకు అందించాను .
అక్కయ్య తాగి ఆఅహ్హ్హ్ ....... అందుకేనేమో పంట ఇంతబాగా పండింది , తమ్ముడూ ....... అంటూ అందించారు .
తాగి అవును అక్కయ్యా స్వచ్ఛమైన నీరు టేస్టీ ....... , రేయ్ నువ్వూ తాగరా .......
అక్కయ్య క్యారెజీ ఓపెన్ చేసి మొదట పెద్దయ్యకు అందించారు .
పెద్దయ్య : తల్లీ .......
తీసుకోండి పెద్దయ్యా ....... , మీరు పండించిన పంటనే కదా మేము ప్రతీరోజూ తింటున్నాము - ఈ చిరు తృప్తినైనా మేము పొందనివ్వండి .
పెద్దయ్య : అలాగే బాబూ అని సంతోషంతో అందుకున్నారు .
పచ్చని పొలాలను - వీస్తున్న గాలులను ఆస్వాదిస్తూ పూరీలు తిన్నాము . అక్కయ్య నీళ్లదగ్గరికివెళ్లి క్యారెజీ శుభ్రం చేసేంతలో , మేము తిన్నచోటునంతా శుభ్రం చేసాము - పెద్దయ్యా ...... తప్పుగా అనుకోకండి మా తరుపున మీ మనవళ్లకు బొమ్మలుకానీ - స్వీట్స్ కానీ ...... అక్కయ్య పెదాలపై చిరునవ్వులను చూసి రెండూ తీసుకెళ్లండి అని పెద్దనోట్లు అక్కయ్య చేతుల ద్వారా ఇప్పించాను .
పెద్దయ్య దండాలు పెట్టబోతే ఆపి పచ్చని పొలం మధ్యన సెల్ఫీలు తీసుకుని సంతోషంతో బయలుదేరాము .
రెండు గంటల ప్రయాణం తరువాత బొర్రా కేవ్స్ చేరుకున్నాము .
కృష్ణ : wow బొర్రా కేవ్స్ ....... థాంక్యూ థాంక్యూ రా మహేష్ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ కిందకుదిగాడు .
రేయ్ రేయ్ రేయ్ ఆగు ఆగు నీకు కాదు అక్కయ్యకు ఇష్టమైతేనే వెళతాము లేకపోతే ఇటునుంచి ఇటే మరొక ప్లేస్ కు ........
అక్కయ్య : బుజ్జాయిలుగా ఉన్నప్పుడు అమ్మానాన్నలతో వచ్చిన మధురమైన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి తమ్ముడూ ...... లవ్ ...... థాంక్యూ ........
అమ్మానాన్నలతో వచ్చారా ? , wow ...... , రేయ్ అక్కయ్యకు ఇష్టమే అంటూ దిగి అటువైపుకు వెళ్లి డోర్ తెరిచేంతలో కృష్ణగాడు తెరిచాడు .
వాడి వెనుక గిల్లేసాను - కెవ్వుమని అరిచాడు .
అక్కయ్య నవ్వుకుని కిందకు దిగకుండా చేతులుకట్టుకుని కూర్చున్నారు .
వాడికి అర్థమై సర్ ....... తమరే అంట అని డోర్ క్లోజ్ చేసాడు కృష్ణ .
యాహూ ....... అంటూ వాడిని ప్రక్కకు లాగేసి డోర్ తెరిచి అక్కయ్యా .......
అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ కిందకుదిగి మాఇద్దరి చేతులను అందుకుని ముద్దులుపెట్టి నడిపించారు .
ఇద్దరమూ సంతోషంతో హైఫై కొట్టుకుని ఎంట్రన్స్ చేరుకున్నాము . టికెట్స్ తీసుకోవడానికి వెళ్లబోతే నా చేతిని మరింత గట్టిగా పట్టుకుని వాడిని వదిలారు .
కృష్ణ : మిమ్మల్నీ ...... అంటూ చిరునవ్వులు చిందిస్తూనే వెళ్లి టికెట్స్ తీసుకొచ్చాడు .
అక్కయ్య ....... మాఇద్దరి చేతులను అందుకుని ఇలాగే అమ్మానాన్నలు మా బుజ్జి బుజ్జి చేతులను పట్టుకుని ...... అంటూ ఉద్వేగానికి లోనౌతున్నారు .
అక్కయ్యా ....... అమ్మానాన్నల ప్రేమను మేమే కాదు ఎవ్వరూ పంచలేరు - కానీ మీకంట కన్నీటి చుక్క రాకుండా చూసుకునే తమ్ముళ్లు ఉన్నాము .
అక్కయ్య : వాడి చేతిని పట్టుకున్న చేతినివదిలి కన్నీళ్లను తుడుచుకున్నారు . పెదాలపై చిరునవ్వులతో నాచేతిపై ముద్దుపెట్టారు .
అక్కయ్యా ....... చిన్నప్పుడు అమ్మానాన్నల చేతులను పట్టుకుని ఎలాంటి అనుభూతిని పొందారో అదే అనుభూతిని ఇప్పుడు నేను పొందుతున్నాను - బొర్రా కేవ్స్ ఫస్ట్ టైం మొత్తం మీరే తిప్పి చూయించాలి ........
అక్కయ్య : అమ్మానాన్నలతో నిన్ననే వెళ్లినట్లు ఉంది తమ్ముడూ ....... , అమ్మానాన్నలు చెప్పిన సంగతులన్నీ చెబుతాను అని ముందుముందుకు లాక్కునివెళ్లి గుహలోపలికి తీసుకెళ్లి ఇంచు ఇంచూ చూయించారు సుమారు రెండు గంటలపాటు .
అక్కయ్యా ....... నిజం చెప్పండి అమ్మానాన్నలతో కాకుండా చాలాసార్లు వచ్చారుకదా ? .
కృష్ణ : లేదురా ....... , కానీ నాకే ఆశ్చర్యం - షాక్ కలుగుతోంది అంటే నమ్ము .......
అక్కయ్యా ....... నేను కూడా మరొక 10 - 15 మరిచిపోనంతలా వివరించారు లవ్ ....... థాంక్యూ అక్కయ్యా .......
కిష్ణ : హమ్మయ్యా ....... exit కు వచ్చేసాము ఆకలి దంచేస్తోంది .
అక్కయ్యతోపాటు నవ్వుకుని బయటకువచ్చి , అక్కడే లంచ్ చేసి బయలుదేరాము .
చూస్తూ చూస్తుండగానే సెగలు కక్కుతున్న సూర్యుడు మేఘాల చాటుకు వెళ్లిపోవడం - ఉన్నట్లుండి వాతావరణం AC లా మారిపోవడంతోపాటు చిన్నగా చినుకులు పడటం చూస్తూ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అక్కయ్య - చలికి వణకడం చూసి రేయ్ ....... బ్యాగులో నీ స్వేటర్ ఉంది అక్కయ్యకు ఇవ్వు అని విండోస్ కూడా క్లోజ్ చేసాను .
అక్కయ్య వేసుకుని ఆఅహ్హ్హ్ ఇప్పుడు వెచ్చగా ఉంది తమ్ముడూ ........
వెళుతున్నకొద్దీ పొగమంచు పెరగడంతో headlights వెలుగులో నెమ్మదిగా పోనిచ్చాను . నెక్స్ట్ విజిట్ ప్లేస్ లంబసింగి చేరుకునేసరికి సాయంత్రం అయ్యింది . వాలీ ప్రక్కనే కారు ఆపాను .
అక్కయ్య : తమ్ముళ్లూ ....... బ్యూటిఫుల్ , ఇక్కడకు రావడం ఫస్ట్ టైం ...... ఊటీ - కోడైకెనాల్ లా ఉంది . ప్రక్కనే ఇంతటి అందాలను పెట్టుకుని డాడీ ...... అక్కడివరకూ పిలుచుకునివెళ్లారు - మా తమ్ముడి వలన ఈ అదృష్టం కలిగింది థాంక్యూ తమ్ముడూ ........
కృష్ణ : ఆంధ్రా కాశ్మీ.....ర్ అంటారు అక్క.....య్యా ....... అంటూ పొగమంచుకు వణుకుతూ చెప్పాడు .
ఒక్క క్షణం రా అంటూ వెంటనే వెళ్లి బ్యాగులోనుండి శాలువా అందుకున్నాను .
కృష్ణ : నువ్వురా ఫ్రెండ్ అంటే ........
వాడికి ఇవ్వకుండా అక్కయ్యకు కప్పాను .
కృష్ణ : రుసరుసలాడుతూ చూసి , అక్కయ్యకు తమ్ముడు - తమ్ముడికి అక్కయ్య అంటూ ఆఅహ్హ్హ్ ఆఅహ్హ్హ్ ...... అంటూ వణుకుతూనే ముందుకు నడిచాడు .
ఇద్దరమూ నవ్వుకున్నాము , వెచ్చగా హాయిగా ఉంది తమ్ముడూ .......
చినుకులు పడుతుండటంతో అక్కయ్యకు క్యాప్ కూడా ఉంచి ప్రకృతి అందాలను వీక్షిస్తూ వాడి వెనుకే నడిచాము . చుట్టూ ఎటుచూసినా పచ్చదనం - పచ్చదనాన్ని దట్టంగా కమ్మేస్తున్న పొగమంచు కనులకు వీనులవిందుగా దర్శనమిస్తూ ఉల్లాసాన్ని పంచుతోంది .
పర్యాటకులు పెద్దమొత్తంలోనే ఉన్నారు . వాళ్ళు వెళుతున్నవైపుకు పైకి నడిచాము . దూరంనుండి కేరింతలు వినిపిస్తున్నాయి వెళ్ళిచూస్తే అందమైన జలపాతం .
ముగ్గురమూ ఒకరినొకరు చూసుకుని అక్కయ్య వేసుకున్న స్వేటర్ - శాలువా తడవకుండా ఉంచి చలి వేస్తుందని తెలిసినా మరుక్షణంలో నీళ్ళల్లోకి దిగిపోయాము . నీళ్లు ఫ్రీజ్ అయ్యేంతలా ఉన్నా ఉఫ్ఫ్ ఉఫ్ఫ్...... అంటూనే చీకటిపడేంతవరకూ నీళ్ళల్లోనుండి బయటకు రానంతలా ఎంజాయ్ చేస్తున్నాము .
అంతలో ఒక పెద్దాయన వచ్చి చీకటిపడుతోంది - ఇక్కడకు క్రూరమృగాలు వస్తాయి దాహం తీర్చుకోవడానికి అనిచెప్పడం ఆలస్యం పర్యాటకులంతా ఒడ్డుకు చేరి వెళ్లిపోతున్నారు .
అక్కయ్య : ప్చ్ ...... నాకు వెళ్లాలని లేదు తమ్ముళ్లూ .......
కృష్ణ : అమ్మో ...... క్రూర మృగాలంట నాకు భయం అంటూ మాఇద్దరి చేతులను పట్టుకుని లాక్కునివెళ్లిపోతున్నాడు .
రేయ్ రేయ్ ఒక్కనిమిషం అంటూ స్వేటర్ శాలువా అందుకుని అక్కయ్యకు కప్పి దట్టమైన పొగమంచులో కారులోకి చేరిపోయి నవ్వుకున్నాము .
అక్కయ్యా ....... బాధపడకండి , మీరు ఊ ఆనండి నెక్స్ట్ వీకెండ్ కాదు కాదు రేపే వద్దాము అని నెమ్మదిగా డ్రైవ్ చేసాను .
సమయం 8 గంటలు అవ్వడం సిటీ చేరుకునేసరికి 10 గంటలు పడుతుందని నెక్స్ట్ వచ్చిన డాబా దగ్గర ఆపి పార్సిల్స్ కారు దగ్గరకే తీసుకొచ్చి వేడివేడిగా డిన్నర్ చేసి సిటీలోకి ఎంటర్ అయ్యి ఇంటికిచేరుకునేసరికి 11 గంటలు అయ్యింది - అక్కయ్య సీట్లోనే నిద్రపోతుండటం చూసి ష్ ష్ ....... రేయ్ లోపలికి పిలుచుకునివెళ్లి పడుకోబెట్టు అని డోర్ తెరిచాను .
అక్కయ్య చేతిని అందుకుని నడిపించుకుంటూ లోపలికి వెళ్ళాడు . చిరునవ్వులు చిందిస్తూ వచ్చి థాంక్యూ soooo మచ్ రా అంటూ కౌగిలించుకున్నాడు - లవ్ యు లవ్ యు తమ్ముడూ ...... అంటూ పెదాలపై చిరునవ్వులతో కలవరిస్తూనే నిద్రపోతున్నారు అక్కయ్య - అక్కయ్యను ఇంత హ్యాపీగా చూస్తాననుకోలేదు నీవల్లనే థాంక్యూ థాంక్యూ sooooo మచ్ .
తమరికి ఈరోజుకూడా కాల్ సెంటర్ లో ........
కృష్ణ : సండే హాలిడే ........
గుడ్ , ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెళ్లి పడుకో అక్కయ్యా గుడ్ నైట్ ......
కృష్ణ : రేయ్ ...... ఇక్కడే పడుకోవచ్చుకదా .......
లవ్ టు , మే బీ నెక్స్ట్ టైం గుడ్ నైట్ రా ........ హోటల్ కు చేరుకుని ఎంత సంతోషంగా గడిపామో అమ్మకు వివరిస్తూ వివరిస్తూనే హాయిగా నిద్రపోయాను .
కారు అక్కయ్యది కదా మరి నువ్వు వేసుకుని వచ్చావేంటి రా ........
లేచి sorry sorry my heart ఇప్పుడే తీసుకెళతాను అని చేతితో ముద్దుపెట్టి పెదాలపై చిరునవ్వులతో లేచాను , సమయం 7 గంటలు అయ్యింది - ఎలాగో రిజిస్ట్రేషన్ ఈరోజే కాబట్టి అక్కయ్య - వాడిని పిలుచుకునివెళతాను అని తలంటు స్నానం చేసి ఉత్సాహంతో బయలుదేరాను .
ఇంటికి చేరుకునేసరికి ఇంటిబయట జనాలు గుమికూడిఉన్నారు . ఏమైందని కంగారుపడుతూ కిందకుదిగి పరుగునవెళ్ళాను .
ఇంటి సమానులన్నీ బయట చెల్లాచెదురుగా పడి ఉన్నాయి . అక్కయ్య కన్నీళ్ళతో భయపడుతున్నట్లు కృష్ణగాడి చేతిని చుట్టేసి వణుకుతుండటం చూసి నాకు వొళ్ళంతా చెమటలు పట్టేసాయి - కొద్దిసేపు మైండ్ పనిచేయడం ఆగిపోయినట్లు స్తంభించిపోయింది .
కృష్ణ : మీకు డబ్బులే కదా కావాల్సింది ఒక్కరోజు సమయం ఇవ్వండి ఇచ్చేస్తాను - అన్నా ....... ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు - ఎప్పుడైనా ఆలస్యం చేసామా ....... ? .
లేదు లేదు నాకు ఇప్పుడే కావాలి లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోండి - రేయ్ ...... ఇంకా ఏమేమి ఉంటే అన్నింటినీ బయట పడేయ్యండి - నా రెంట్ డబ్బులు ఇవ్వడానికి లేవు కానీ విహారయాత్రకు వెళ్లారు విహారయాత్రకు ....... - అవసరమా మీకు విహారాయాత్రలు ....... అని ఏవేవో మాట్లాడారు .
కృష్ణ : అక్కయ్యను చుట్టేసి , అన్నా ....... మాట మంచిగా ఉండాలి .
ఓనర్ : అంత పౌరుషం ఉంటే నా డబ్బు ఇవ్వండి లేకపోతే ఖాళీ చేసి వెళ్లిపోండి .
కృష్ణ : ఒక్క అర గంట టైం ఇవ్వండి , అంటీ ....... అక్కయ్యను చూసుకోండి అని అప్పగించి , అక్కయ్యా ....... ఆఫీస్ కు వెళ్లి వెంటనే వచ్చేస్తాను జాగ్రత్త అనిచెప్పి పరుగుతీసాడు .
ఓనర్ : వాడు తీసుకొచ్చినప్పుడు చూద్దాము మీరు వస్తువులన్నీ బయట పడేయ్యండి .
కోపం తన్నుకువచ్చి ఆపండి అంటూ జనంలోనుండి ముందుకువెళ్ళాను .
తమ్ముడూ ....... అంటూ కన్నీళ్ళతో వచ్చి చేతిని చుట్టేసారు అక్కయ్య - ఎంత కంగారుపడుతున్నారో స్పర్శ ద్వారా తెలిసిపోతోంది .
అక్కయ్యా ....... నేనున్నాను కదా , హలో ...... ఎన్ని నెలల రెంట్ ఇవ్వాలి ? .
అక్కయ్య : వణుకుతూనే ఒక నెలనే తమ్ముడూ - ఎప్పుడూ ఆలస్యం చెయ్యలేదు .
ఇప్పుడుకూడా ఆలస్యం అయ్యేదికాదు రెంట్ కోసం దాచుకున్న డబ్బును నిన్న పే చేశారు కదూ ....... థాంక్యూ ...... లవ్ యు sooooo మచ్ అక్కయ్యా ........
ఓనర్ : ఇంకా చూస్తారేంట్రా బయట పడేయ్యండి .
అంతే కోపం పట్టలేక వాడి చెంప చెళ్లుమనిపించాను .
ఓనర్ : నన్నే కొడతావా ? , రేయ్ ....... వీడి కాళ్ళూ చేతులూ విరగ్గొట్టoడి .
చుట్టూ నలుగురు చేరారు .
అక్కయ్య : తమ్ముడూ ...... అంటూ మరింత భయపడిపోతున్నారు .
అక్కయ్యా ....... ఓకేఒక్కనిమిషం అంటూ ఒక్కొక్క దెబ్బతో హమ్మా - హబ్బా ...... అంటూ నేల తల్లిపై చేరి అటూ ఇటూ ప్రదక్షిణలు చేస్తున్నారు నొప్పి తట్టుకోలేక .....
అధిచూసి ఓనర్ పరిగెత్తబోతే పట్టుకుని , ఒక్క నెలకే ఎవడైనా ఇలా ప్రవర్తిస్తాడా అంటూ మరొక దెబ్బ వెయ్యబోతే ........
క్షమించండి క్షమించండి అంటూ కాళ్లపై పడ్డాడు . మీరు కొడితే ఏమవుతుందో కళ్లారా చూసికూడా దెబ్బలు తినే ధైర్యం నాకు లేదు - నేనైతే నెల కాదు సంవత్సరం అయినా ఆగేవాడిని - ఇలా చెయ్యమని వెంటనే మీ ఇంటి నుండి పంపించెయ్యమని వీళ్ళ అత్తయ్యగారే నలుగురు మనుషులను తోడుగా పంపించారు - మొత్తం వాళ్లే చూసుకుంటారు , మీ ఇంటిలోనే కాదు ఈ ఊరిలోనే ఎక్కడా ఇల్లు దొరకకుండా చేస్తాను అని డబ్బు ఇచ్చారు అందుకే ఇలా చేసాను - నన్ను వదిలెయ్యండి ఇక ఎప్పుడూ ఇలా చెయ్యను అని పరుగుతీసాడు .
అత్తయ్యనా ? .
అత్తయ్య ....... అంటూ కన్నీళ్ళతో బాధపడుతూ వచ్చి నా చేతిని చుట్టేశారు అక్కయ్య .
హలో అక్కడే ఆగు లేకపోతే వెంటపడి మరీ కొడతాను . ఆగి వణుకుతూ వెనక్కు తిరిగాడు - రెంట్ ఎంత ? .
ఓనర్ : లేదు లేదు లేదు , కిందపడినవాళ్లకు ఇచ్చారుకదా చాలు చాలు ......
చుట్టూ ఉన్నవాళ్ళంతా నవ్వుతున్నారు .
ఎంత ? అని కోపంతో అడిగాను .
ఓనర్ : 4 వేలు 4 వేలు ........
పర్సులోనుండి తీసి ఇచ్చాను .
ఓనర్ : భయపడుతూనే అందుకుని , వెంటనే అన్నింటినీ లోపల పెట్టించేస్తాను సర్ ........
అవసరం లేదు ముందు వీళ్ళను హాస్పిటల్ కు తీసుకెళ్లు - ట్రీట్మెంట్ ఖర్చు నువ్వే భరించాలి డబ్బు తీసుకున్నావుకదా ఆ డబ్బును .......
ఓనర్ : అలాగే అలాగే అంటూ ఆటోను ఆపి లేపి కూర్చోబెట్టుకుని వెళ్ళాడు .
అక్కయ్యను లోపలికి పిలుచుకునివెళ్లి , మనం ఇక్కడనుండి వెళ్లిపోతున్నాము మీ బట్టలు - ముఖ్యమైనవి మాత్రమే తీసుకోండి , వాడివి ఏమీ తీసుకోకండి ఇంత జరిగితే ఒక్క కాల్ చేయకపోగా ...... డబ్బు తీసుకొస్తానని కాల్ సెంటర్ ఆఫీస్ కు వెళతాడా ? అని అక్కయ్య అమ్మానాన్నల ఫోటో తీసుకున్నాను .
అక్కయ్య : తమ్ముడూ .......
రిక్వెస్ట్ కాదు ఆర్డర్ ...... , నాకు కోపం వస్తే ఏమిజరుగుతుందో చూశారుకదా ......
అంతే గదిలోకివెళ్లి బ్యాగు తీసుకొచ్చారు - బ్యాగు అందుకుని అమ్మానాన్నల ఫోటో లోపల ఉంచుకుని బయలుదేరాము . అక్కయ్యా ...... అప్పుడే పార్ట్ టైం జాబ్ కు రెడీ అయిపోయారన్నమాట - నిన్న ఎంజాయ్ చేశారు , తడిచారు చూస్తుంటే జలుబు చేసినట్లుంది ఒకరోజు లీవ్ పెట్టాల్సింది - ఇప్పుడిక ఒకరోజు లీవ్ కాదు జాబే మానేస్తున్నారు - మాట్లాడకండి చెప్పాను కదా రిక్వెస్ట్ లు కాదు ఆర్డర్స్ మాత్రమే అని - నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి లేకపోతే .........
అక్కయ్య గట్టిగా నవ్వేస్తున్నారు - తమ్ముడూ బాలయ్య లానే చెప్పావు .
హమ్మయ్యా ...... అక్కయ్య నవ్వేసింది - ఇక వాడికి ఉంది అని దగ్గరలోని హోటల్ కు తీసుకెళ్లి టిఫిన్ ఐటమ్స్ అన్నింటినీ ఆర్డర్ చేసాను .
అక్కయ్య : తమ్ముడూ ....... , నావల్ల కాదు .
అన్నీ జస్ట్ అలా టేస్ట్ చెయ్యి అక్కయ్యా ......... , మిగిలినది నేను తింటానుకదా ....
అంతలో అక్కయ్య మొబైల్ రింగ్ అయ్యింది . తమ్ముడూ ....... నీ ఫ్రెండ్ .
నో నో నో ...... వాడు శిక్ష అనుభవించాల్సిందే , మొబైల్ నాకు ఇచ్చి మీరు తృప్తిగా తినండి - ఇప్పటికీ నాకు కాల్ చెయ్యలేదు వాడు .
అక్కయ్య : మొబైల్ అందించి , తమ్ముడూ తమ్ముడూ ........ అదీ అదీ .....
అదీ లేదు ఇదీ లేదు మీరు తినండి - కట్ అయ్యిందికదా ఇప్పుడు నాకు చేస్తాడు చూడు - అలా చెబుతుండగానే కాల్ వచ్చింది - ఇప్పటికైనా చేసాడు sorry రా తప్పడం లేదు - అక్కయ్య ...... నాదగ్గర సేఫ్ గా ఉన్నారు - మరొకసారి ఇలా జరుగకూడదు అంటే ఇలా చేయాల్సిందే అని రెండు మొబైల్స్ టేబుల్స్ పై ఉంచి అక్కయ్య తిన్నది తింటున్నాను .
మళ్లీ మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే రియల్ ఎస్టేట్ పార్ట్నర్స్ ....... - ఈ కాల్ కోసమే ఎదురుచూస్తున్నాను అని చెవిదగ్గరపెట్టుకుని మాట్లాడాను .
బ్రదర్స్ : మహేష్ ....... 10 గంటలకు రిజిస్ట్రేషన్ , మేము అన్నీ ఏర్పాట్లూ చేస్తున్నాము - ఆ సమయానికి వచ్చి సంతకాలు చేస్తే చాలు ప్రాపర్టీ మీ సొంతం - ఇంతకూ ....... మహేష్ పేరు మీదనే కదా .......
నో నో నో బ్రదర్స్ ........ , ఒకటి MIM పేరుతో మరొకటి దివ్య పేరుతో .......
అక్కయ్య : ఏమిటి తమ్ముడూ అని కళ్ళతోనే అడిగారు .
కళ్ళతోనే సమాధానమిచ్చాను wait చెయ్యమని ....... , టిఫిన్ చేసి బిల్ పే చేసి సరిగ్గా 10 గంటలకు రిజిస్టర్ ఆఫీస్ కు చేరుకున్నాము . ఈ గ్యాప్ లో అక్కయ్యకు - నాకు విడివిడిగా వంద వంద కాల్స్ పైనే వచ్చాయి - ఈ శిక్ష చాలు అని రిసీవ్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు రమ్మని చెప్పి అక్కయ్యను లోపలికి పిలుచుకునివెళ్ళాను .
బ్రదర్స్ బయటకువచ్చి స్వయంగా లోపలికి పిలుచుకునివెళ్లి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోమన్నారు .
అక్కయ్యను కూర్చోమనిచెప్పి , డాక్యుమెంట్స్ అందుకుని నిమిషాలపాటు పూర్తిగా చెక్ చేసి ఒకటి " MIM " కంపెనీ - మరొకటి " దివ్య " పేరుపై రాసిఉండటం చూసి పెదాలపై చిరునవ్వులతో పర్ఫెక్ట్ అని బ్రదర్స్ కు అందించాను .
అమౌంట్ ట్రాన్స్ఫర్ చెయ్యమని అకౌంట్ నెంబర్ ఇచ్చారు .
బ్రదర్స్ మీ అకౌంట్ నెంబర్ - ఆర్కిటెక్ట్ మరియు పెయింటర్ నెంబర్లు కూడా ఇవ్వండి మీ బ్యాలన్స్ అమౌంట్ కూడా ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేయించేస్తాను .
అందుకుని నా బ్యాంక్ మేనేజర్ కు కాల్ చేసి విషయం చెప్పడంతో నిమిషాల్లో ట్రాన్స్ఫర్ అయిపోయాయి - వాళ్ళ వాళ్ళ మొబైల్స్ కు మెసేజెస్ రావడంతో అందరి పెదాలపై చిరునవ్వులు విరిసాయి .
రిజిస్టర్ ఆఫీసర్ సమక్షంలో ఓనర్ అమ్మినట్లు సంతకాలు చేయించి న దగ్గరికి తీసుకొచ్చారు బ్రదర్స్ .......
ఫస్ట్ మా అక్కయ్య అంటూ ఒకటి అందించాను .
అక్కయ్య : ఏమిటి అన్నయ్యా ...... డాక్యుమెంట్ - అమౌంట్ - ట్రాన్స్ఫర్ ...... అంటున్నారు నాకు ఏమీ అర్థం కావడం లేదు .
అక్కయ్యా ....... మీకు తెలియకుండా మీ ఆస్తులను నేను రాయించుకుంటున్నాను - సంతకం చెయ్యాలి ........ అని నవ్వుతూ చెప్పాను .
అంతే అక్కయ్య నవ్వుకుని , సంతోషంగా తమ్ముడూ ....... ముందూ వెనుకా ఆలోచించకుండా సంతకాలు చేశారు .
థాంక్యూ అక్కయ్యా ...... ఇక మీ ఆస్థులన్నీ నా సొంతం అని మరొక డాక్యుమెంట్ లో సంతకాలు చేసి ఇవ్వడంతో ప్రాపర్టీ రిజిస్టర్ అయ్యింది .
ఓనర్ : చాలా సంతోషం బాబూ ...... , ఏ సమస్యా లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది - ఈ సాయంత్రమే నేను లండన్ వెళ్లిపోతున్నాను అని చేతులుకలిపి వెళ్లిపోయారు .
బ్రదర్స్ - ఆర్కిటెక్ట్ - పెయింటర్ ....... థాంక్యూ , మళ్లీ అవసరమైనప్పుడు కలుద్దాము అని చేతులుకలిపి , బ్రదర్స్ ఒక హెల్ప్ .......
బ్రదర్స్ : కోరినంత కమిషన్ ఇచ్చారు ఆర్డర్ వెయ్యి మహేష్ ......
బిల్డింగ్స్ ను అంటూ అక్కయ్య వినకుండా ప్రక్కకు తీసుకెళ్లి చెప్పాను .
బ్రదర్స్ : సాయంత్రం నువ్వే చూస్తావుకదా .......
థాంక్యూ బ్రదర్స్ ...... సాయంత్రం కలుద్దాము అని డాక్యుమెంట్స్ తో బయటకువచ్చాము .
కంగారుపడుతూ అటూ ఇటూ తిరుగుతున్న కృష్ణగాడిని చూసి , రేయ్ ......కేకవేశాను .
నా ప్రక్కనే అక్కయ్య ఉండటం చూసి , హమ్మయ్యా ...... అంటూ గుండెలపై చేతినివేసుకుని కూల్ అయ్యి పరుగునవచ్చి ఇద్దరినీ కౌగిలించుకున్నాడు కృష్ణ .....
ఎవర్రా నువ్వు నాకేమవుతావు - నీకు ...... నేనేమవుతాను అని కౌగిలించుకుని ఆనందిస్తున్నావు వదలరా వదులు .......
కృష్ణ : sorry sorry రా .......
అక్కయ్య కళ్ళల్లో ఏదైతే చూడకూడదు అనుకున్నానో ఆ కన్నీళ్లనే చూసేలా చేసావు ఒక్క కాల్ ఒకేఒక్క కాల్ .........
కృష్ణ : sorry sorry మహేష్ అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు .
ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక ఇప్పటివరకూ అక్కయ్య నవ్వుతూనే ఉన్నారు కాబట్టి క్షమిస్తున్నాను లేకపోతే సాయంత్రం వరకూ నిన్ను కలిసేవాళ్ళము కాదు - బాగా టెన్షన్ పడినట్లున్నావు చల్లగా ఐస్ క్రీమ్ తిందాము పదా అని బీచ్ రోడ్డులోని షాప్ కు తీసుకునివెళ్లి the best ఆర్డర్ ఇచ్చి ఒక టేబుల్ లో కూర్చున్నాము .
ఐస్ క్రీమ్ వచ్చాక తింటూ రేయ్ - అక్కయ్యా ....... ఇప్పుడు చెప్పండి మీ అత్తయ్యగారు ...... మిమ్మల్ని ఇంటి నుండి ఖాళీ చేయించడమే కాకుండా ఊరిలో ఎక్కడా రెంట్ దొరకకుండా చూడటం ఏమిటి ? .
ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు .........
Sorry sorry ...... మిమ్మల్ని బాధపెడుతున్నాను అంటే వద్దులే , మీరు బాధపడితే నేను చూడలేను .
కృష్ణ : నువ్వు మా సర్వస్వం రా ...... , అమ్మానాన్నలు ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవాళ్ళము - నాన్నగారు బిజినెస్ మ్యాన్ , పెద్ద బిల్డింగ్ , సమాజంలో గౌరవం - ఎప్పుడైతే మా పదహేనవ ఏట అమ్మానాన్నలు కార్ ఆక్సిడెంట్ లో స్వర్గస్థులయ్యారో పార్ట్నర్స్ ...... కంపెనీని తమ ఆధీనంలోకి తీసుకుని నష్టాలను మాత్రం నాన్న పేరుపై చేర్చి మాకు ఏమీ చెందకుండా చేసేసారు - మా అత్తయ్య ...... మా బిల్డింగ్ ను తన పేరున మార్చుకుని మమ్మల్ని అనాధాశ్రమంలో వదిలారు - మావయ్య మరియు మావయ్య కొడుకు బావగారి వలన అనాధాశ్రమం నుండి బయటపడి వారి ఆర్థిక సహాయంతో చదువుకున్నాము - చిన్నప్పుడే అక్కయ్యకు బావకు పెళ్లిచేయాలని నిర్ణయించుకున్నారు , ఇద్దరికీ ఒకరికొకరంటే ప్రాణం - బావగారి వల్లనే అక్కయ్య వారితోపాటు మెడిసిన్ చేస్తున్నారు - ఈ విషయం తెలిసిన అత్తయ్య 6 నెలలుగా అక్కయ్యను కలవకుండా ఒక బాడీ గార్డ్ ను పెట్టి కాలేజ్ కు పంపిస్తూ మిగతా సమయాలలో హౌస్ అరెస్ట్ చేసేసారు - బావగారు ...... వారితో ఉన్నా డబ్బును మావయ్యతో పంపించారు మెడిసిన్ ఫీజ్ కట్టమని - అక్కయ్య మాత్రం డాడీ కి నన్ను MBA చేస్తానని మాట తీసుకుందని మధ్యలోనే మెడిసిన్ వదిలి ఆ డబ్బును నా చదువుకు దాచి పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు .
అంటే బావగారు ఉన్నారన్నమాట ఎక్కడ అక్కయ్యా ....... మీ గుండెల్లోనే కదా ...... , ప్చ్ ..... ఈ విషయం ముందే తెలిసి ఉంటే నిన్న వన్ డే టూర్ కు పిలుచుకునివచ్చేవాడిని కదా .........
బావగారిని గుర్తుచేయ్యగానే అక్కయ్య పెదాలపై చిరునవ్వులు - అబ్బో ....... అంత ప్రేమను దాచుకున్నారన్నమాట గుడ్ గుడ్ వెరీ గుడ్ ........
కృష్ణ : బావగారికి కూడా అంతే ప్రేమ మహేష్ ....... , ఈ విషయం తెలిసే ఇప్పుడు సిటీలోనే ఉండకుండా ఇలా ప్లాన్ చేశారు .
రేయ్ కృష్ణా ....... మన అక్కయ్య డాక్టర్ రా యాహూ ....... ఎంత సంతోషమైన విషయం చెప్పావురా ....... ఆనందం పట్టలేనంటే నమ్ము - అందుకేనా నేను ఆక్సిడెంట్ చేసిన దెబ్బలు అంత తొందరగా నయమయ్యాయి .
కృష్ణ : అవును , కానీ ....... 6 మంత్స్ కాలేజ్ కు రాలేదని - ఫీజ్ కట్టలేదని అక్కయ్యను expel చేశారు అని బాధపడుతూ చెప్పారు .
అక్కయ్య కన్నీళ్లను తుడుచుకున్నా ...... మళ్లీ మళ్లీ కారుస్తూనే , నాన్నకు ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడిని అంటూ బాధపడుతూనే వచ్చి నా ప్రక్కన కూర్చుని చేతిని చుట్టేసారు .
అమ్మమ్మో ....... నో నో నో నేనున్నాను కదా , ఇక నేను చూసుకుంటాను - మనకు చాలా పనులున్నాయి హ్యాపీగా ఐస్ క్రీమ్ తినండి - తినరా ....... అయితే నాపై నమ్మకం లేదన్నమాట , మీరుతినకపోతే నేనూ తినను .