Update 18

ఇద్దరమూ వేరు వేరు గదులలో ఫ్రెష్ అయ్యి కొత్త డ్రెస్ - షూస్ - స్పెడ్స్ పెట్టుకుని జిగేలుమనేలా రెడీ అయ్యి ఒకేసారి బయటకువచ్చి చూసుకుని నవ్వుకున్నాము . కిందకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరాము . టేబుల్ పై ఉన్న హాట్ బాక్సస్ ఓపెన్ చేసి మ్మ్మ్ ...... ఆఅహ్హ్ లవ్ యు sooooo మచ్ దివ్యక్కా ........
కృష్ణ : అక్కయ్య చేతిలో మ్యాజిక్ ఉంది చూస్తుంటేనే నోరూరిపోతోంది అని ఆతృత పట్టలేక నాకు వడ్డించి వడ్డించుకుని కుమ్మేస్తున్నాడు .
నవ్వుకుని , టేస్ట్ చెయ్యగానే ఇక ఆగలేక వాడితో పోటీపడుతూ తృప్తిగా తిన్నాను .

రేయ్ అక్కయ్య కాలేజ్ కు వెళదామా ....... ? .
కృష్ణ : ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నానురా అంటూ సిగ్గుపడుతూ స్పెడ్స్ పెట్టుకున్నాడు .
మొబైల్ అందుకోబోయి వాడి కీప్యాడ్ మొబైల్ చూసాను . వాడికి అందించి బయటకువచ్చి డోర్స్ లాక్ చేసుకుని జిప్సీ లో బయలుదేరాము .
కృష్ణ : మహేష్ ....... అక్కయ్య కాలేజ్ ఇటువైపు .
చిన్న పని ఉంది చూసుకుని వెళదాము అని మొబైల్ షోరూం ముందు ఆపాను . లోపలికి తీసుకెళ్లి ఐఫోన్ టు వన్ ప్లస్ ఏ మొబైల్ కావాలో తీసుకోరా ....... ఏది తీసుకున్నా అదే హైయెస్ట్ ప్రైస్ అయి ఉండాలి గుర్తుపెట్టుకో అని డిస్ప్లే దగ్గరకు వదిలాను . సేల్స్ బాయ్ దగ్గరకువెళ్లి ఐఫోన్ - 13 రెండు డిఫరెంట్ కలర్స్ ఒకే గిఫ్ట్ లా ప్యాక్ చెయ్యమనిచెప్పి షాప్ లో కూర్చున్నాను .
మోహమాటపడుతూనే నావైపు నా కోపాన్ని చూస్తూ చూస్తూ వన్ ప్లస్ లో లేటెస్ట్ మొబైల్ ను ఇష్టంతో సెలెక్ట్ చేసుకున్నాడు .
గుడ్ రా అంటూ లేచివెళ్లి ఓపెన్ చేయించి అక్కడికక్కడే సిమ్ మార్పించాను . మూడింటికీ పే చేసి బయటకువచ్చాను .

జిప్సీ ఎక్కబోతూ ఏంట్రా అలా చూస్తున్నావు , కొంపదీసి కన్నీళ్ళతో కౌగిలించుకోవాలనుకుంటున్నావా ఏమిటి ....... , నో నో నో అక్కడే ఆగిపో కీప్యాడ్ మొబైల్ జేబులో పెట్టుకుని లవ్ చెయ్యడానికి రెడీ అయిపోయినందుకు కుమ్మేసేవాడిని - ఇప్పుడే చెబుతున్నాను గుర్తుపెట్టుకో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా , ఏ కోరిక కలిగినా ఇదిగో నా ప్యాంటు వెనుక జేబులోని పర్సులో ఈ కార్డ్ ఉంటుంది - అడగకుండానే తీసుకోవడం గీకడమే , ఎంత గీకినా తరగనంత ఉంది ok నా ....... లేకపోతే బ్యాక్ అకౌంట్ ఉంటే ఇవ్వు ట్రాన్స్ఫర్ చేసేస్తాను . అంతకంటే ముందు నువ్వు ఒక్కసారైనా రేయ్ అంటూ పర్సు తీసి కార్డ్ గీకాలి ........
కృష్ణ : రేయ్ ....... అంటూ కౌగిలించుకోబోతే ........
నో నో నో నువ్వేమైనా ఫిగర్ వా రా అంటూ చుట్టూ తిరిగి జిప్సీ లో కూర్చున్నాను .
కృష్ణ : పోరా ....... అంటూ గుర్రున చూస్తూ ప్రక్కన కూర్చున్నాడు .
నవ్వుకుని నేరుగా అక్కయ్య కాలేజ్ చేరుకున్నాము .

సెక్యూరిటీ కాలేజ్ లోపలికి ఆలో చెయ్యకపోవడంతో ........ బావగారికి కాల్ చేయబోతే , మహేష్ మహేష్ ...... కొత్త మొబైల్ నుండి ఫస్ట్ కాల్ అక్కయ్యకు చేస్తాను అని కృష్ణగాడు చేసాడు .
రెండు నిమిషాలలో బావగారు - అక్కయ్య వచ్చారు . వచ్చి రాగానే అన్నయ్యా...... అంటూ ఉద్వేగంతో నా గుండెలపైకి చేరారు .
అక్కయ్యా ...... what happened ? , చూసి రెండు గంటలే కదా అయ్యింది .
బావగారు : నిన్ను చూడకుండా నిమిషం కూడా ఉండలేదు బావా ఇక , క్లాస్ కు వెళ్లగానే ఎవరైతే డబ్బు కడితేనే కానీ కాలేజ్ లో అడుగుపెట్టొద్దు అన్నవారే స్వయంగా ప్రిన్సిపాల్ మేడం వచ్చి దివ్యకు sorry చెప్పారు - దివ్యా ...... ఇకనుండీ ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా నేరుగా నా దగ్గరకే వచ్చెయ్యి , స్టేట్ - సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఆఫీసస్ నుండి కాల్స్ చేయించకు అని ........
( wow థాంక్యూ మేనేజర్ గారూ )
దివ్యక్కా ...... మీరు హ్యాపీ కదా ? .
దివ్యక్క : చాలా చాలా అన్నయ్యా - క్లాస్ మొత్తం షాక్ అయిపోయారు తెలుసా..... , ఇప్పుడు సెక్యూరిటీ మిమ్మల్ని ఆపారని తెలిస్తే మా ప్రిన్సిపాల్ గారు గజగజ వణికిపోయినా ఆశ్చర్యం లేదు .
నవ్వుకున్నాము , సెక్యూరిటీ బుక్ లో సంతకం చేసి లోపలికి పిలుచుకునివెళ్లారు బావగారు .

బావగారు : మహేష్ - కృష్ణా ....... మీరు వచ్చారని తెలియగానే క్లాస్ మధ్యలోనే బయటకు వచ్చేసింది మీ అక్కయ్య .
దివ్యక్క : అన్నయ్య కోసం లాబ్ లో ఉన్నా వచ్చేస్తాను .
లవ్ యు అక్కయ్యా ...... , కానీ ఇంకొక్కసారి అలా చెయ్యకండి ప్రామిస్ .....
దివ్యక్క : అన్నయ్యా ........
ప్రామిస్ చేశారు అంతే , ఈ అన్నయ్య - తమ్ముళ్ల కంటే క్లాస్సెస్ - ల్యాబ్స్ ముఖ్యం . టిఫిన్ చేశారు కదా గుడ్ , సరే సరే ....... ముందు మేము ఇక్కడకు వచ్చిన సంగతి చూడండి , wow ....... క్యాంపస్ మొత్తం అమ్మాయిల నవ్వులే వినిపిస్తున్నాయి .
దివ్యక్క : ప్చ్ ...... sorry అన్నయ్యా - తమ్ముడూ ....... ఇంతకుముందు చాలామంది అమ్మాయిలు బ్యూటిఫుల్ గా కనిపించేవారు , కానీ మా అన్నయ్య handsomeness మంచితనం గొప్పతనానికి సరితూగే దేవకన్య ఒక్కరుకూడా నాకు తారసపడలేదు .
బావగారు : అవును బావలూ ...... ఫస్ట్ పీరియడ్ మొత్తం ప్రతీ క్లాస్ - లాబ్స్ - లైబ్రరీ - క్యాంటీన్ ....... అన్నీ అన్నీ తిరిగి నిరాశతో క్లాస్ కు వెళ్ళాము . అన్నయ్య - తమ్ముడి కోరిక తీర్చలేకపోతున్నాము కిషోర్ అంటూ ఫీల్ అవుతూనే ఉంది . ఒక్క పీరియడ్ టైం లో ఎలా తెలిసింది అని అడిగాను .
మా అన్నయ్య మనసు నాకు తెలియదా ........ ? .
బావగారు : అవును అచ్చు ఇలానే బదులిచ్చారు మేడం గారు .
మాకేమి కావాలో మా అక్కయ్యకు తెలుసు , మా దేవకన్యలు ఎక్కడ ఉన్నారో ఏమిటో ........ , మా దివ్యక్క expectation కు సరిపోయే అమ్మాయిలు ఇక్కడ లేరని తెలిసిపోయింది కాబట్టి ఇక మీ క్లాస్సెస్ డిస్టర్బ్ చెయ్యము , చాలా పనులున్నాయి వెళతాము దివ్యక్కా ...... వన్ మినిట్ వన్ మినిట్ అంటూ జిప్సీ లో ఉంచిన గిఫ్ట్ తీసి ఇచ్చాను .
దివ్యక్క : గిఫ్ట్ wow లవ్ యు లవ్ యు అన్నయ్యా ........
కృష్ణ : ఓపెన్ చెయ్యి అక్కా .......
దివ్యక్క చిరునవ్వులు చిందిస్తూ ఓపెన్ చేశారు . ఐఫోన్స్ .......
కృష్ణ : లేటెస్ట్ అక్కయ్యా , 13 సీరీస్ ...... ఒకటి మీకు ఒకటి బావగారికి .
ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని సంతోషం పట్టలేక బావా - అన్నయ్యా ....... అంటూ చెరొకవైపు కౌగిలించుకోబోతే .........
నో నో నో ....... సెంటిమెంట్ ఓన్లీ అట్ హోమ్ , evening కలుద్దాము అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి బయటకువచ్చాము .

ఎక్కడికి తీసుకెళ్లమంటారు సర్ ........
కృష్ణ : నా ప్రియమైన సర్ ...... నాకొక పని అప్పజెప్పారు , వారి అక్కయ్యకు ఎటువంటి శ్రమ కలగనివ్వనట్లు ఇంటి నిండా పనివాళ్ళు ఉండాలని .......
ఉమ్మా ....... లవ్ యు రా , ఇంటి పనులను ఇష్టంతో చేసేవాళ్ళు కావాలి - మంచివాళ్ళు అయి ఉండాలి , ఎక్కడ ఉంటారు .
కృష్ణ : మేము ఉండే వీధిలో అలాంటి అంటీవాళ్ళు తెలిసినవాళ్ళు ఉన్నారు మహేష్ - పనులకోసం రోజంతా వెతుకుతూ నిరాశతో వెనుతిరిగివచ్చి కష్టంగా రోజులు గడుపుతున్నారు - వారికి పని ఇస్తే ....... , ఇంటిపనులు - తోట పనులు ....... చక్కగా చేస్తారు . మా ఇంటి ప్రక్కన అంటీ హస్బెండ్ అంకుల్ ఉన్నారు సెక్యూరిటీగా చేస్తానని మా కాల్ సెంటర్ లో చూడమని రోజూ అడుగుతారు .
ఒక్కరు కాదు కనీసం ఇద్దరు సెక్యూరిటీ అయినా ఉండాలి .
కృష్ణ : నేనున్నాను కదరా ...... ఎలానో ఖాలేనే ......
చంపేస్తాను ఇంకొకసారి అలా మాట్లాడావంటే , నువ్వు ...... నా ప్రాణమిత్రుడివి say sorry say sorry అంటూ ఎప్పటికీ గుర్తుండేలా గుద్దు గుద్దాను .
కృష్ణ : లవ్ యు రా అంటూ సైడ్ నుండి చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టాడు .
నవ్వుకుని ఆ వీధి స్టార్టింగ్ లోనే జిప్సీ ఆపాను .
కృష్ణ : ఏంటి మహేష్ ఇక్కడే ఆపావు , దిగుతున్నావు .
దివ్యక్క - నా ప్రియ మిత్రుడి కంట కన్నీరు పెట్టించిన వీధిలోకి జన్మలో అడుగుపెట్టను నువ్వు వెళ్లు అని కీస్ అందించాను .
కృష్ణ : దీనంగా చూసి , ఒక్కమాటకూడా మాట్లాడకుండా జిప్సీ దిగి వీధిలోపలికి వెళ్లిపోతున్నాడు .
అప్పుడు అర్థమయ్యింది డ్రైవింగ్ రాదు కదా అని ...... , రేయ్ ...... దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్ లో ఉంటాను ఆటోలో వచ్చెయ్యి అని కేకవేసి వెళ్ళాను .

ఇద్దరికీ డ్రెస్సెస్ షాపింగ్ చేస్తుండగా గంట తరువాత వచ్చాడు . మహేష్ ...... రేపు సూర్యోదయం లోపు పనిలోకివచ్చేస్తారు . ఒక పెద్దమ్మ ఇంటిలో పరిస్థితులు బాగోలేవు వారిని మనదగ్గరే ఉండమని చెప్పేసాను , చాలా చాలా మంచివారు చిన్నప్పుడు మమ్మల్ని కూడా వాళ్ళ పిల్లలతో సమానంగా చూసుకునేవాళ్ళు - ఇప్పుడు వాళ్ళ కోడళ్లు ........
అర్థమయ్యింది అర్థమయ్యింది , అప్పట్లో అత్తయ్యల వలన కోడళ్లు కష్టాలు పడేవాళ్ళు - ఇప్పుడు కోడళ్ల వలన అత్తయ్యలు పడుతున్నారు . అక్కయ్యను చూసుకున్నవారు అయితే మరింత మంచిదికదా , వారికి ఎటువంటి పనీ అప్పజెప్పకు దివ్యక్కకు తోడుగా ఉంటే చాలు ...... , నాకు చెప్పకుండా చాలా నిర్ణయాలే తీసుకున్నావు .
కృష్ణ : మహేష్ ....... అదీ ......
వెరీ వెరీ గుడ్ అంటున్నానురా ...... , ఇలానే కంటిన్యూ చెయ్యి . మనకోసం షాపింగ్ చేసాను అని చూయించి బిల్ పే చేసి బయటకువచ్చాము .
కృష్ణ : నావైపే సంతోషంతో చూస్తూ ....... , నెక్స్ట్ ఎక్కడకు మహేష్ .......
మా సర్ కు డ్రైవింగ్ నేర్పించాలి ఖాళీగా ఉన్న ఏదైనా బీచ్ కు వెళదాము - నాకు బీచ్ అంటే చాలా ఇష్టం .
కృష్ణ : యాహూ ....... నాకు కూడా .......
ఒకరి భుజం చుట్టూ ఒకరం చేతులువేసుకుని బయటకువచ్చాము . ముందు లంచ్ చేద్దాము - అక్కయ్యకు కాల్ చేసి లంచ్ తీసుకురానా అని అడిగాను .
దివ్యక్క : అన్నయ్యా ....... ఫ్రెండ్స్ అందరమూ కలిసి క్యాంటీన్ లో తినాలని వెళుతున్నాము . మీరు కానివ్వండి .
లవ్ యు దివ్యక్కా ....... , వీలైతే ఒకవేళ వీలైతే బీచ్ వ్యూ రెస్టారెంట్ కు వచ్చెయ్యండి అనిచెప్పాను . ప్చ్ ...... అక్కయ్య క్యాంటీన్ లోనే తింటారట అక్కడ ఫుడ్ బాగుంటుందా రా ........
కృష్ణ : బాగుంటుందా అంటే క్యాంటీన్ ఫుడ్ లా ఉంటుంది .
అవునా అంటూ ఫీల్ అవుతూ నెమ్మదిగా పోనిచ్చాను .

రెస్టారెంట్ చేరుకునేసరికి దివ్యక్క - బావగారు స్వాగతం పలకడం చూసి ఆశ్చర్యం వేసింది . దివ్యక్కా - బావగారూ - అన్నయ్యా ...... అంటూ కలిసి లోపలికివెళ్లాము .
కృష్ణ : అక్కయ్యా ...... క్యాంటీన్ లో ఫుడ్ బాగుంటుందో లేదోనని తెగ బాధపడుతూ 5 నిమిషాల దారికి 20 నిమిషాలు చేసాడు .
బావగారు : అందుకేనా మేమే ముందు వచ్చాము .
దివ్యక్క : లవ్ యు అన్నయ్యా ....... , రేపటి నుండి నేనే స్వయంగా లంచ్ కూడా చేస్తాను .
నో నో నో దివ్యక్కా ...... , కాలేజ్ ఫస్ట్ - రేపటి నుండి అన్నింటినీ పనివాళ్లను సెట్ చేసేసాడు నా ప్రియమిత్రుడు . లంచ్ నేరుగా కాలేజ్ కు వచ్చేస్తుంది .
దివ్యక్క : లవ్ యు sooooo మచ్ అన్నయ్యా ........
టేబుల్ లో కూర్చుని ఇష్టమైనవి ఆర్డర్ చేసుకుని తిని బయటకువచ్చాము .

బావగారు : బావా ...... రేంజ్ రోవర్ డ్రైవ్ చెయ్యాలన్న కోరిక డ్రీమ్ లానే మిగిలిపోతుందనుకున్నాను , థాంక్యూ .......
బావగారూ ...... కాలేజ్ ఫ్రీ సమయంలో రొమాన్స్ చేస్తూనే మీ డార్లింగ్ గారికి డ్రైవింగ్ నేర్పించండి - కాలేజ్ గ్రౌండ్ పెద్దది కూడానూ ....... , ఎందుకంటే నెక్స్ట్ మా పని అదే ........
కృష్ణ : అవునవును .......
బావగారు : బావా ...... ఏమి ఐడియా ఇచ్చావు , ఇక చూసుకో ....... రోజుల్లోనే నేర్పించేస్తాను .
ఏమిటి నేర్పిస్తారు బావగారూ రొమాన్స్ or .........
బావగారు : డ్రైవింగ్ విత్ రొమాన్స్ బావా అంటూ దివ్యక్క వైపు కన్నుకొట్టారు .
దివ్యక్క సిగ్గుపడుతూ బై అన్నయ్యా అంటూ చిలిపినవ్వులతో కారులోకివెళ్లి కూర్చున్నారు .
బావగారు : బావా ....... నువ్వు కేక ఉమ్మా ఉమ్మా ఉమ్మా ....... ఏ ఒక్క ఫ్రీ క్షణాన్ని కూడా మిస్ చేసుకునేది లేదు బై బై evening కలుద్దాము అని హుషారుగా వెళ్లిపోయారు .

ప్రక్కన చూస్తే కృష్ణగాడు అంత ఎండలోనూ తలపైకెత్తి కదలకుండా చూస్తున్నాడు .
రేయ్ రేయ్ ........
ఆఅహ్హ్హ్ హ్హ్హ్ ....... అంటూ జలదరిస్తూ తేరుకున్నాడు . రొమాన్స్ చేస్తూ డ్రైవింగ్ ........ నాకెప్పుడు ఇలాంటి అవకాశం లభిస్తుందో what a feeling మహేష్ అని మళ్ళీ డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయాడు .
అవును నిజమే ........ , రేయ్ రేయ్ ....... డ్రైవింగ్ రాదు కానీ ఎక్కడ ఉందో తెలియని మా చెల్లితో డ్రీమ్ లోకి వెళ్లిపోయావన్నమాట - ఆ డ్రీమ్ నెరవేరాలంటే ముందు డ్రైవింగ్ నేర్పిస్తాను రారా అంటూ లాక్కునివెళ్లి జిప్సీ లో కూర్చోబెట్టాను .
ప్రక్కనే ఉన్న బీచ్ చేరేంతవరకూ what a feeling - what a feeling ........ అంటూ కలవరిస్తూనే ఉండటం చూసి నవ్వుకున్నాను .
కృష్ణ : మహేష్ మహేష్ ....... తొందరగా తొందరగా నేర్పించు నేర్పించు అని ఫీల్ అవుతూనే నన్ను సైడ్ నుండి చుట్టేసి కదిలిస్తున్నాడు .
సరే సరే రా ........ డ్రీమ్స్ నుండి బయటకువస్తే ఎలా డ్రైవ్ చెయ్యాలో - వెహికల్ భాగాల గురించి చెబుతాను తరువాత ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు డ్రైవింగ్ ఎలాచెయ్యాలో చూయిస్తాను . నన్ను ఫాలో అయిపోవడమే .........
అలా సాయంత్రం వరకూ బీచ్ లో కూల్ డ్రింక్స్ - టీ - పుల్ల ఐస్ క్రీమ్స్ - స్నాక్స్ ...... తింటూ వాడు ఆరోజుకు సంతృప్తి చెందేలా నేర్పించాను . గుడ్ రా ...... కాలేజ్ వదిలే సమయం అయ్యింది దివ్యక్కకు మాటిచ్చాము కదా వెళదాము .

సరిగ్గా వదిలే సమయానికి కాలేజ్ చేరుకున్నాము .
దివ్యక్క : బావగారితోపాటు బయటకువచ్చి ఒక హగ్ ఇచ్చి ఇక వెళ్లు కిషోర్ అని తోసేసి పరుగునవచ్చి జిప్సీ లో కూర్చున్నారు .
దివ్యక్కా ....... మరి బావగారు .
దివ్యక్క : కాలేజ్ టైమింగ్స్ తరువాత మీ బావగారు ఎవరో నాకు తెలియదు . అన్నయ్య - నేను - తమ్ముడు అంతే ....... పదండి పదండి వెళదాము .
దివ్యక్కా ....... కాలేజ్ లో బిజీబిజీగా గడిపి ఉంటారు , బావగారితోపాటు రిలాక్స్ గా డ్రింక్స్ - ఐస్ క్రీమ్ తాగి వెళదాము .
దివ్యక్క : అవసరం లేదు అవసరం లేదు , మీ బావగారికి రొమాన్స్ విత్ డ్రైవింగ్ సలహా ఇచ్చారుకదా ఐస్ క్రీమ్ - డ్రింక్స్ తోపాటు టీ కాఫీ లు కూడా తాగేశారు . అయ్యో చెప్పేశానా అంటూ ముఖాన్ని మూసుకుని సిగ్గుపడుతున్నారు .
బావగారు కూడా సిగ్గుపడుతున్నారు .
కృష్ణ : మహేష్ ....... రేయ్ రేయ్ ఒకసారి చూడరా ...... అక్కయ్య - బావగారి ఆనందం . ఒక్కరోజులో డ్రైవింగ్ నేర్పించలేవా ...... ? .
కంట్రోల్ రా కంట్రోల్ ........ వారంలో నేర్పిస్తానులే , నేర్పించినా ఉపయోగం ఏమిటి రా .......
కృష్ణ : డ్రైవింగ్ నేర్చుకున్న వెంటనే నెక్స్ట్ అదే పనిరా ....... , సిటీలోని కాలేజస్ అన్నీ తిరగడమే ........
దివ్యక్క : రేయ్ నిన్నూ అంటూ నవ్వుకున్నారు .
బావగారికి బై చెప్పి ఇంటికి చేరుకున్నాము .
ఇంటికి చేరుకున్న క్షణం నుండీ డిన్నర్ చేసి పడుకునేంతవరకూ ప్లే స్టోర్ లో ఉన్న డ్రైవింగ్ గేమ్స్ అన్నీ ఆడుతూనే ఉన్నాడు - ఆడుతూ ఆడుతూనే నిద్రపోవడం చూసి నవ్వుకుని నిద్రపోయాము .

నెక్స్ట్ డే లేచేసరికి కృష్ణగాడు పనిలోకి పెట్టినవాళ్ళంతా వాళ్ళ వాళ్ళ పనులలో బిజీ అయిపోయారు . దివ్యక్క టిఫిన్ వండి డైనింగ్ టేబుల్ పై ఉంచి రెడీ అయ్యి బావగారితోపాటు వెళ్లిపోయారు .
నేనూ రెడీ అయ్యి వాడి బాధ చూడలేక దగ్గరలోని గ్రౌండ్ కు తీసుకెళ్లి గ్యాప్ లేకుండా నేర్పించాను . లంచ్ సమయానికి సెక్యూరిటీ ద్వారా మొదట అక్కయ్యకు పంపించి - మేమూ గ్రౌండ్ కే తెప్పించుకుని తిన్నాము . మళ్లీ సాయంత్రం వరకూ డ్రైవింగ్ లెర్నింగ్ చేయించి కాలేజ్ కు వెళ్లి అక్కయ్యను పిక్ చేసుకుని ఇంటికి చేరుకున్నాము .

మెయిన్ గేట్ బయట వరుసగా " MIM " లోగో గల కార్స్ మరియు ఒక హెవీ ట్రక్ నిలబడి ఉన్నాయి .
నన్ను చూడగానే మేనేజర్ గారు - ఆఫీసర్స్ నవ్వి సెల్యూట్ చేస్తూ వచ్చారు .
సెక్యూరిటీ సెల్యూట్ చేసి గేట్ తెరవడంతో నేరుగా మెయిన్ గేట్ దగ్గరకువెళ్లి ఆపి అక్కయ్యను లోపలికి పంపించాను . కృష్ణగాడితోపాటు మెయిన్ గేట్ దగ్గరకువెళ్లి మేనేజర్ గారూ ...... ఎలా ఉన్నారు ? వచ్చి ఎంతసేపయ్యింది ? చాలాసేపు అయినట్లుంది అని చేతులు కలిపాను .
మేనేజర్ : లేదు లేదు , మీకోసం ఎంతసేపైనా సంతోషంగా వేచిచూస్తాము సర్ .......
మేనేజర్ గారూ ...... జస్ట్ కాల్ మీ మహేష్ , లోపలికైనా వెళ్లి కూర్చోవాల్సింది .
మేనేజర్ : పర్లేదు సర్ ...... మహేష్ మహేష్ .
మేనేజర్ గారూ ....... వీడు కృష్ణ మై బెస్ట్ ఫ్రెండ్ - పార్ట్నర్ everything ...... , నేను ...... మీకెలానో వీడూ అంతే - కృష్ణా ...... మన చీఫ్ మేనేజర్ గారు మరియు ఆఫీసర్స్ ........
మేనేజర్ - ఆఫీసర్స్ : హలో సర్ ...... అని విష్ చేశారు .
కృష్ణ : hi hi మేనేజర్ గారూ ...... , కృష్ణ అని పిలవండి చాలు అని షాక్ లో వణుకుతున్నాడు .

నవ్వుకుని , మేనేజర్ గారూ - ఆఫీసర్స్ ....... లోపలికి రండి .
మేనేజర్ : తీసుకున్నారా ...... మహేష్ .
అవును మేనేజర్ గారూ .......
మేనేజర్ : చాలా బావుంది మహేష్ ........
థాంక్స్ , లోపలికి పిలుచుకునివెళ్లి టీ - స్నాక్స్ తెప్పించాను . దివ్యక్కను పరిచయం చేసాను . ప్రస్తుతానికి వీల్లే నాకు సర్వస్వం ........
మేనేజర్ : మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆనందం వేస్తోంది సర్ - బాధతో హైద్రాబాద్ వీడటం చూసి కంగారుపడ్డాము .
ఈ సంతోషం వీరిద్దరి వల్లనే మేనేజర్ గారూ ....... అంటూ చెరొకవైపు కూర్చోబెట్టుకున్నాను .
దివ్యక్క : లవ్ యు అన్నయ్యా ...... అంటూ ఆనందబాస్పాలతో నా చేతిని చుట్టేశారు .
మేనేజర్ : మేడం - కృష్ణా ....... మహేష్ కు ఇలానే తోడుగా ఉండాలి . మహేష్ ...... ఇంతకూ మేము వచ్చిన సంగతి చెప్పనేలేదు కదూ అంటూ ఆఫీసర్స్ వైపు సైగచేశాడు .

ఆఫీసర్స్ ...... బయటకు సైగచెయ్యడంతో , కొంతమంది పెద్ద పెద్ద బాక్స్ లను తీసుకొచ్చి మా ముందు ఉంచి వెళ్లిపోయారు .
మేనేజర్ : మహేష్ ...... మీరు " MIM " కంపెనీ బాధ్యలు తీసుకుని నిన్నటితో నెలరోజులు అయ్యింది . మీరు ఆర్డర్ వేసినట్లుగా నా దగ్గర నుండి మొదలుకుని చివరి వర్కర్ వరకూ 3 మంత్స్ బోనస్ ఇవ్వగా మిగిలిన లాభం అంటూ బాక్సస్ అన్నింటినీ ఓపెన్ చేశారు .
బాక్సస్ మొత్తం 2 వేల రూపాయల నోట్ల కట్టలు ఉండటం చూసి దివ్యక్క ...... నాచేతిని మరింత గట్టిగా పట్టుకున్నారు - కృష్ణగాడు పనివాళ్ళు అయితే అక్కడికక్కడే స్పృహకోల్పోవడం చూసి నవ్వుకున్నాము .
మేనేజర్ గారూ ...... ఇంత లాభమా ? , నా ...... అతడు ఎప్పుడూ చెప్పనేలేదు ? .
మేనేజర్ : ఇంతకు ముందువరకూ వర్కర్స్ నెలజీతం కోసం పనిచేసేవారు , మొదటిరోజునే మీ గురించి తెలిసాక మీరు బాధ్యతలు చేపట్టాక కంపెనీనే సర్వస్వం అని రెండింతలు మూడింతలు ఇష్టంతో పనిచేస్తున్నారు సర్ - మీ మంచితనం వలన మన ఆర్డర్స్ ఎన్నోరెట్లు పెరిగాయి . ఇక్కడ సంతకం పెడితే మేము బయలుదేరతాము .
Wait wait wait మేనేజర్ గారూ ....... , నేను కంపెనీ చైర్మన్ గా సంతకం చేసానే కానీ , నెలలో ఒక్కరోజైనా బాధ్యతగా ప్రవర్తించనేలేదు - ఈ లాభం మీరందరూ కష్టపడి చేకూర్చినది కాబట్టి మీకే చెందాలి .
మేనేజర్ - ఆఫీసర్స్ : సర్ ....... అంటూ ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు .
మేనేజర్ గారూ వినండి , నా స్టడీస్ పూర్తయ్యి నేను చైర్మన్ స్థానంలో కూర్చుని మీతో సమానంగా కష్టపడేంతవరకూ వచ్చిన లాభమంతా మీ - వర్కర్స్ అవసరాలకే వాడుకోండి .
మేనేజర్ : షాక్ అయ్యి , సర్ ...... ఇంత డబ్బు .......
మీతోపాటు వర్కర్స్ అందరికీ కొత్త ఇల్లు - అపార్ట్మెంట్స్ కట్టించండి , హాస్పిటల్ - కాలేజ్ ....... ఇలా అవసరాలన్నీ తీర్చుకోండి - వర్కర్స్ పిల్లల పై చదువులకు సహాయం చేయండి , అర్హత కలిగినవారికి ఉద్యోగాలు ఇవ్వండి - ఇంకా మిగిలితే బ్యాచ్ బ్యాచ్ లుగా వర్కర్స్ ఫ్యామిలీలను విహారాయాత్రలకు పంపించండి . మీపై నాకు పూర్తి నమ్మకం ఉంది మేనేజర్ గారూ ....... మొత్తం డబ్బుని తీసుకెళ్లండి - వర్కర్స్ అంటే జీవితాంతం పావర్టీ లోనే ఉండటం కాదని ఋజువుచేయ్యండి - వారి పెదాలపై చిరునవ్వులు పూయించండి .
అంతే మేనేజర్ - ఆఫీసర్స్ ........ అందరూ లేచి రెండుచేతులతో నమస్కరించారు .
మేనేజర్ గారూ ....... మీరంతా పెద్దవారు , కష్టపడకుండా కోట్లు వచ్చినా నేను ఆశించను - please తీసుకెళ్లండి మేనేజర్ గారూ .......
మేనేజర్ - ఆఫీసర్స్ : మహేష్ - సర్ సర్ ...... ఈరోజుతో మా మరియు వర్కర్స్ పాలిట దేవుడు అయ్యారు అంటూ సెల్యూట్ చేసి డబ్బుతోపాటు వెళ్లారు .
మేనేజర్ గారూ వన్ మినిట్ వన్ మినిట్ నెక్స్ట్ మీరు నన్ను కలిసే సమయానికి మన కంపెనీ పేరు " MIM " నుండి దివ్యక్క పేరుతో కలిపి " MIMD " రిజిస్టర్ చేయించాలి .
మేనేజర్ గారు : yes సర్ ........
నా చేతిని చుట్టేసిన దివ్యక్క కళ్ళల్లో ఆనందపు చెమ్మ........
మేనేజర్ గారూ ....... " MIM " మీనింగ్ - ఫుల్ ఫార్మ్ నాకు ఇప్పటివరకూ తెలియదు మీకేమైనా తెలుసా ...... ? .
మేనేజర్ : నేను కొత్తగా కంపెనీ లో జాయిన్ అయినప్పుడు మీ ...... అడిగాను మహేష్ - తెలుసుకోవాల్సిన అవసరం లేదు , ఇంకెప్పుడూ అడగొద్దు అని కోపంతో చెప్పడంతో మళ్లీ తెలుసుకోవాలని ప్రయత్నించలేదు .
సరే మేనేజర్ గారూ ....... " MIMD " గా రిజిస్టర్ చేయించి గుడ్ న్యూస్ చెప్పండి .
మేనేజర్ : అతిత్వరలో మహేష్ ........ వెళ్లిపోయారు .

దివ్యక్క : ఎందుకన్నయ్యా మేమంటే ఇంత ప్రాణం లవ్ యు లవ్ యు sooooooo మచ్ అంటూ గుండెలపై చేరారు . మా అన్నయ్య ...... మాకు ఎప్పుడో దేవుడయ్యాడు , అన్నయ్యా ...... అమ్మ ఎక్కడ ఉన్నా ఈ విషయం తెలిస్తే ఎంత ఆనందిస్తారో మాటల్లో చెప్పలేను అని నా హృదయం పై చేతినివేశారు .
కృష్ణ : అవునురా ........
నిజమా అమ్మా అంటూ నా గుండెలపై ఉన్న అక్కయ్య చేతిపై చేతినివేసి " అమ్మ " అక్షరాలవైపు చూసి ఆనందించాను .

కృష్ణ : నా బెస్ట్ ఫ్రెండ్ నిజంగా దేవుడే అంటూ అమాంతం పైకెత్తాడు .
దివ్యక్క : చప్పట్లతో అభినందిస్తూ , మా దేవుడిలాంటి అన్నయ్యకోసం స్పెషల్ పాయసం చేస్తాను అని గర్వపడుతూ వంట గదిలోకివెళ్లారు .
ఆ రోజు స్పెషల్ డిన్నర్ చేసాము .

తరువాతి రోజు దివ్యక్క కాలేజ్ కు వెళ్ళాక మేము డ్రైవింగ్ కు వెళ్ళాము . లెర్నింగ్ మధ్యలో ఇద్దరికీ క్షణాల గ్యాప్ లో మెసేజెస్ రావడంతో చూస్తే 15 డేస్ లో కాలేజ్ స్టార్ట్ అవ్వబోతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది .
యాహూ - యాహూ ...... రేయ్ - రేయ్ ...... మనకూ మళ్లీ కాలేజ్ డేస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి అని హైఫై కొట్టుకుని అక్కయ్యకు కాల్ చేసి చెప్పాము .
రేయ్ కృష్ణా ....... 15 డేస్ లోపు డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ కూడా సంపాదించాలి సరేనా ........
కృష్ణ : అంతా మా గురువుగారి చేతుల్లో ఉంది అని రెండుచేతులతో నమస్కరించాడు .

5 రోజుల్లో కృష్ణగాడు - 7 రోజుల్లో దివ్యక్క గ్రౌండ్ మొదలుకుని చిన్న చిన్న సందుల్లో - ట్రాఫిక్ లో - బిజీగా ఉన్న రోడ్లపై - హైవే లపై ఏమాత్రం కంగారు - భయం లేకుండా డ్రైవింగ్ చెయ్యడంతో ........
బావగారు ...... దివ్యక్కను - నేను ....... కృష్ణగాడిని పైకెత్తి సంతోషాలను పంచుకున్నాము . ఆరోజే లైసెన్స్ అప్లై చేసి మూడురోజుల్లో టెస్ట్ కూడా అలవోకగా పూర్తిచేసేశారు . టెంపరరీ డ్రైవింగ్ లైసెన్స్ చేతికి అందగానే అటునుండి ఆటే అందరమూ కార్స్ షోరూం కు వెళ్లి దివ్యక్కకు - కృష్ణగాడికి నచ్చిన కార్లను తీసుకుని కొత్త కార్లలో కృష్ణగాడు లవ్ లవ్ అంటూ సిటీలోని కాలేజస్ అన్నీ చుట్టేసాడు - నాకూ ఇష్టమే కాబట్టి ఉత్సాహంగా వెతికినా నిరాశే ఎదురైంది . దివ్యక్క - బావగారితో కలిసి వీకెండ్ మొత్తం లాంగ్ డ్రైవ్ కు వెళ్లి ఎంజాయ్ చేసి ఇంటికి చేరుకున్నాము .
బావగారు : బావలూ ....... మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది - రేపు మళ్లీ కాలేజ్ లైఫ్ లోకి అడుగుపెట్టబోతున్నారు - ఫ్రెండ్స్ వలన తెలిసినది ఏమిటంటే ఆ కాలేజ్ లోకూడా ర్యాగింగ్ ఉందట .
బావగారూ ....... ఫ్రెండ్లీ గా ఉంటే ఎంజాయ్ చేస్తాము - ఇబ్బందిగా ఉంటే ఏదైతే చెయ్యాలో అధిచేస్తాము , ఏరా .......
కృష్ణ : అంతే రా ...... మా దేవుడు ఎలా చెబితే అలా ...... నాకైతే భయంకరమైన నిద్రవస్తోంది గుడ్ నైట్ అంటూ హాల్ లోని సోఫాలోనే నిద్రపోయాడు .
బావగారూ ...... బాగా ఆలస్యం అయ్యింది మీరు కూడా ఇక్కడే పడుకోండి గుడ్ నైట్ దివ్యక్కా అంటూ మరొక సోఫాలో నిద్రపోయాను .
గుడ్ నైట్ అన్నయ్యా - తమ్ముడూ ...... అంటూ దిండ్లు ఉంచి దుప్పటి కప్పారు . పెద్ద సోఫాను బెడ్ లా మార్చి బావగారి గుండెలపై తలవాల్చి గుడ్ నైట్ కిస్ తో నిద్రపోయారు .

అన్నయ్యా - తమ్ముడూ ....... లేవండి లేవండి ఈరోజు నుండీ కాలేజ్ కు వెళ్ళాలి కదా అంటూ దివ్యక్క .......
నిద్రకళ్ళతోనే సమయం చూసి , గుడ్ మార్నింగ్ దివ్యక్కా ........ అంటూ మళ్లీ పూర్తిగా దుప్పటి కప్పుకున్నాను .
గుడ్ మార్నింగ్ అన్నయ్యా ...... అంటూ దివ్యక్క నవ్వుకున్నారు . అన్నయ్యా - తమ్ముడూ ........ లేవండి ఆలస్యం అవుతుంది .
పో దివ్యక్కా ఇంకా 6 గంటలే కదా అయ్యింది , 9:30 కు కాలేజ్ ........
దివ్యక్క : ఫ్రెషర్స్ గ్యాదరింగ్ ఉందని - 8 గంటలకే వెళ్లాలని మెసేజ్ వచ్చిందని చెప్పారుకదా ........
అవునుకదా అంటూ ఇద్దరమూ సడెన్ గా లేచి కూర్చున్నాము . మరిచిపోయాము థాంక్యూ థాంక్యూ దివ్యక్కా - అక్కయ్యా ....... అంటూ ఇద్దరమూ ఒకేసారి అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టాము .
దివ్యక్క : పెదాలపై చిరునవ్వులతో , వెళ్లి రెడీ అవ్వండి వచ్చేలోపు టిఫిన్ రెడీ చేసేస్తాను అని మా ఇద్దరి నుదుటిపై ముద్దులుపెట్టారు .
లవ్ యు దివ్యక్కా ....... , అవునూ బావగారు ఎక్కడ కనిపించడం లేదు .
దివ్యక్క : మీరు 8 లోపు వెళ్లాలికదా , అంతలోపు రెడీ అయ్యి వచ్చేస్తాను అని , మీకు చెప్పమనిచెప్పి ఇంటికి వెళ్లారు . నిన్న షాపింగ్ చేసిన డ్రెస్సెస్ మీ మీ రూమ్స్ లో బెడ్ పై ఉంచాను .
లవ్ యు దివ్యక్కా - అక్కయ్యా ....... అంటూ మరొక ముద్దుపెట్టి పైకివెళ్లి రెడీ అయ్యి దివ్యక్కా దివ్యక్కా అంటూ కేకలువేస్తూ కిందకువచ్చాము .

దివ్యక్క : నేనూ రెడీ - టిఫిన్ కూడా రెడీ ....... మీ బావగారు కూడా నిమిషాల్లో ఇక్కడ ఉంటాను అన్నారు , అదిగో మాటల్లోనే వచ్చేశాడు .
అయితే అందరమూ కలిసే టిఫిన్ చేద్దాము అని డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నాము . పెద్దమ్మ - అంటీ వడ్డించడంతో కాలేజ్ enjoyment గురించి మాట్లాడుతూ , చిరినవ్వులు చిందిస్తూ తిన్నాము .
7:30 కల్లా కాలేజ్ కు రెడీ అయిపోయి అమ్మకు చెప్పి బయటకువచ్చాము .
దివ్యక్క : అన్నయ్యా - తమ్ముడూ ....... బుక్స్ ? .
కృష్ణ : ఫ్రెషర్స్ గ్యాదరింగ్ - న్యూ ఫ్రెండ్స్ - ర్యాగింగ్ తోనే సరిపోతుందేమో ఇక బుక్స్ ఎందుకు అక్కయ్యా ........
ర్యాగింగ్ కోసం ఉత్సాహాంగా ఎదురుచూస్తున్నావారా ........
కృష్ణ : అవునురా ........ , ఇప్పుడు మనం చేయించుకుంటేనే కదా నెక్స్ట్ ఇయర్ సీనియర్స్ అయ్యాక మనం చెయ్యగలము .
What a logic ....... అంటూ గొంతును చుట్టేసాను .
దివ్యక్క - బావగారు నవ్వుకున్నారు .
కృష్ణ : హమ్మా ...... ఉండరా అమ్మకు చెబుతాను .
నవ్వుకుని వదిలేసాను .
కృష్ణ : నాకు తెలుసురా అమ్మకు చెబుతానంటేనే నువ్వు వదిలేదని , ఇంతకూ ఏ వెహికల్లో వెళదాము . అక్కయ్య కారులోనా - మన కారులోనా లేక జిప్సీ లోనా ......
నో నో నో అంటూ మెయిన్ గేట్ దగ్గర ఉన్న యూనివర్సల్ వెహికల్ వైపు చూయించాను .
కృష్ణ : సైకిల్లోనా ....... , ok ok మొదటిరోజునే బిల్డప్ ఎందుకు అంటావు అంతేకదా పదమరీ ........ తొక్కాల్సినది నువ్వే .......
లోపలున్న అమ్మ అక్షరాలవైపు చూస్తూ దివ్యక్క - బావగారిని ఒకేసారి హత్తుకుని బై చెప్పి వాడికంటే ముందే హీరో సైకిల్ దగ్గరకుచేరి ముందు కూర్చున్నాను .
కృష్ణ : రేయ్ రేయ్ రేయ్ మోసం రా .........
తొక్కు బే తొక్కు తొక్కు , సర్ గారికి ర్యాగింగ్ అంటే ఇష్టం కదా ....... , అన్నయ్యా ...... సైకిల్ తీసుకెళుతున్నాము ok కదా ....... అవసరం పడితే జిప్సీ వాడుకోండి .
సెక్యూరిటీ అన్నయ్య : సర్ ఎంతమాట , సంతోషంగా తీసుకెళ్లండి .
థాంక్స్ అన్నా ....... తొక్కరా తొక్కు ఆలస్యం అవుతుంది . నాతోపాటు దివ్యక్క - బావగారు నవ్వుతుండటం చూసి బుంగమూతిపెట్టుకుని తొక్కాడు . రేయ్ రేయ్ ..... ఫస్ట్ డే రా నవ్వరా బాబూ .......
కృష్ణ : కదా ఇకచూడు అంటూ పెదాలపై చిరునవ్వులతో హుషారుగా తొక్కాడు .
సగం దూరం వెళ్ళాక వాడిని వెనుకకు చేర్చి నేను తొక్కుతూ 10 నిమిషాల ఆలస్యంగా కాలేజ్ చేరుకున్నాము .

మెయిన్ గేట్ చేరకముందే మూవ్ అవుతున్న సైకిల్ నుండే కృష్ణగాడు కిందకు జంప్ చేసి అలా వెళ్లిపోతున్నాడు .
రేయ్ ఎక్కడికి రా ...... అలా వెళుతున్నావు ? .
కృష్ణ : రేయ్ మహేష్ ....... నా గుండెల్లో గంట మ్రోగింది రా , నా దేవకన్య కనిపించింది అంటూ మైకం కమ్మినట్లు అలా అలా ఒక అందమైన అమ్మాయి దగ్గరకు చేరి కొరుక్కు తినేలా కన్నార్పకుండా జొళ్లు కారుస్తూ వెనుకే ఫాలో అవుతూ కాలేజ్ లోపలికి వెళ్ళాడు .
నవ్వుకుని , లోపలికి వెళ్ళాను . సెక్యూరిటీ మా మొబైల్స్ లో వచ్చిన జాయినింగ్ మెసేజెస్ చూసి లోపలికి పంపిస్తున్నారు .
సర్టిఫికెట్స్ వెరీఫికేషన్ కు వచ్చినప్పుడు నిర్మానుష్యన్గా ఉన్న కాలేజ్ న్యూ స్టూడెంట్స్ తో కళకళలాడుతోంది . న్యూ స్టూడెంట్స్ మాత్రమే కాదు ఫ్రెషర్స్ గ్యాదరింగ్ అని తెలుసుకుని సీనియర్స్ కూడా వచ్చేసి అప్పుడే ర్యాగింగ్ మొదలుపెట్టేసినట్లు అక్కడక్కడా ర్యాగింగ్ తాలూకు activities కనిపిస్తున్నాయి .

ఉత్సాహంగా అమ్మాయి వెనుక వెళ్లిన కృష్ణగాడు సీనియర్స్ దృష్టిలో పడినట్లు వాళ్ళ ముందు చేతులు కట్టుకుని బుద్ధిగా నిలబడి ఉండటం - ప్రక్కనే ఆ అమ్మాయి ఉండటం చూసి నవ్వుకున్నాను . ఇడియట్ ...... నన్ను చూసి సీనియర్స్ కు చెప్పినట్లు మరుక్షణమే విజిల్ వేసి పిలిచారు .
సైకిల్ ను పార్కింగ్ లో ఉంచి నిదానంగా నడుచుకుంటూ వెళ్ళాను . నీయబ్బా ...... అంటూ వెనుక గుద్దు గుద్దాను .
సీనియర్ : ఏంట్రా ...... సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా ...... , పిలవగానే పరుగున రావాలని తెలియదా ? .
Sorry బ్రదర్ ........
సీనియర్స్ : బ్రదర్స్ ....... కాల్ మీ సర్ ? .
బొక్కలే బ్రదర్ అనడమే ఎక్కువ అని ఇద్దరమూ ముసిముసినవ్వులు నవ్వుకున్నాము .
సీనియర్స్ : ఏంట్రా నవ్వుతున్నారు ? .
కృష్ణ : అదే అదే 8 గంటలకు ఫ్రెషర్స్ గ్యాదరింగ్ అన్నారుకదా .......
సీనియర్స్ : ఇదే రా ఫ్రెషర్స్ గ్యాదరింగ్ అంటే ....... , ok ok ఫ్రెషర్స్ గ్యాదరింగ్ ను 9 గంటలకు పోస్ట్ ఫోన్ చేశారు - అంతవరకూ మేము మీతో గ్యాదరింగ్ అవుతాము . రేయ్ మీ పేర్లు చెప్పండి .
కృష్ణ - మహేష్ - శంకర్ ....... అంటూ బాయ్స్ చెప్పాక , మీకు సెపరేట్ గా చెప్పాలా మేడమ్స్ ........
అమ్మాయిలు భయపడుతూ sorry సర్ అంటూ ఒక్కొక్కరే చెబుతున్నారు . ఆ అమ్మాయి వంతు రాగానే కృష్ణగాడి చెవులు నిగిరి తొంగి చూస్తున్నాడు .
ఆ అమ్మాయి " క్రి క్రిష్ ...... కృష్ణవేణి " అని బెదురుతూ చెప్పగానే .......
కృష్ణగాడు ....... గుండెలపై చేతినివేసుకుని నా మీదకు వాలిపోయాడు . రేయ్ మహేష్ ........ విన్నావా నీ చెల్లి పేరు ...... ఆఅహ్హ్ ....... నాకోసమే పుట్టిందిరా నేను ఫిక్స్ " కృష్ణ - కృష్ణవేణి " ........
సరే సరే ....... మన ముందు సీనియర్స్ ఉన్నారు కంట్రోల్ చేసుకోరా ........

సీనియర్స్ : రేయ్ ..... నీ పేరేంటి అన్నావు .
కృష్ణగాడు చేతులు కట్టుకిని కృష్ణ అని బదులిచ్చాడు .
సీనియర్ : ఏంట్రా ఇక్కడేమైనా డాన్స్ ప్రోగ్రాం జరుగుతోందా మెలికలు తిరిగిపోతున్నావు . ముందుకు రారా ....... నీతో ఏమి చేయిద్దాము ....... వెనకున్న జూనియర్స్ లా కాకుండా రొమాంటిక్ ర్యాగింగ్ చేయిద్దాము . అదిగో అక్కడ వెళుతున్న మా క్లాస్మేట్ దగ్గరికివెళ్లి లవ్ ప్రపోజ్ చెయ్యి అన్నాడు .
కృష్ణ : నో సీనియర్స్ నెవర్ ........
సీనియర్స్ : ఎందుకురా ఏమైంది ? , తను మా క్లాసులో one of the top beauty రా ....... , ఈ అవకాశం కోసం మా క్లాస్ అబ్బాయిలంతా ఎగబడిపోతారు తెలుసా ? , అలాంటి అవకాశాన్ని నీకు ఇస్తున్నాను ర్యాగింగ్ రూపంలో .........
కృష్ణ : one of the కాదు సీనియర్స్ the best అయినాసరే , ఈ అమ్మాయికి కాకుండా వేరెవ్వరికీ ప్రపోజ్ చెయ్యను అంటూ అమ్మాయివైపు ప్రేమతో చూస్తున్నాడు .
ర్యాగింగ్ అని అప్పటికే భయంతో వణుకుతున్న ఆ అమ్మాయి షాక్ చెందినట్లు నోరుతెరిచి అలా చూస్తుండిపోయింది .
కృష్ణగాడు స్వీట్ స్మైల్ తో hi చెప్పాడు . అంతే వెంటనే మరింత బెదురుతో తలదించేసుకుంది ఆ అమ్మాయి .
కృష్ణ : yes ....... , సీనియర్స్ please please తరువాత మీరెలాంటి ర్యాగింగ్ చేసినా సంతోషంగా స్వీకరిస్తాను , లవ్ అట్ ఫస్ట్ సైట్ లో నా హృదయాన్ని కొల్లగొట్టిన ఈ అమ్మాయికి ప్రపోజ్ చెయ్యమని ఆర్డర్ వెయ్యండి అని బ్రతిమాలుకుంటున్నాడు . Please please సీనియర్స్ అంటూ ఆ అమ్మాయివైపే చూస్తున్నాడు .
వాడిని చూసి సీనియర్స్ అందరూ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ , కాలేజ్ లో అడుగుపెట్టి గంట కూడా కాలేదు అప్పుడే ఒక లవర్ రెడీ అయిపోయాడు - అయినా నువ్వు చెప్పినట్లు చేస్తే మేము సీనియర్స్ ఎందుకు అవుతాము రేయ్ నువ్వు ముందు 100 గుంజీలు తియ్యరా అని వెనక్కు తోసారు .
కృష్ణగాడు ........ తలదించుకుని బెదిరిపోతున్న - మధ్యమధ్యలో ఓర కంటితో కృష్ణగాడివైపే చూస్తున్న ఆ అమ్మాయి ఎదురుగా వెళ్లి సైట్ కొడుతూ గుంజీలు తీస్తున్నాడు .

నెక్స్ట్ ఎవరు రేయ్ నువ్వు రారా అంటూ నన్ను పిలిచాడు . వీడితో ఎవరికి ప్రపోజ్ చేయిద్దాము .
మరొక సీనియర్ : దూరంగా ఉన్న పార్క్ వైపు చూయించి , రేయ్ మన క్లాస్ చదువుల సరస్వతి ........
మొదటి సీనియర్ : తనే కరెక్ట్ రా అంటూ హైఫై కొట్టుకున్నారు . రేయ్ నీ పేరేంటి ఆ ఆ మహేష్ ....... తను మా క్లాస్ కాదు కాదు మిస్ కాలేజ్ కాదు కాదు మిస్ ఆంధ్ర మిస్ ఇండియా మిస్ వరల్డ్ ఫైనల్ గా మిస్ యూనివర్స్ అన్నా తప్పులేదు సో సో సో sooooooo బ్యూటిఫుల్ గర్ల్ ....... , అంతటి విశ్వ సుందరి అందానికి ఫిదా అవ్వని వాడంటూ లేదు ఈ రెండు సంవత్సరాలుగా కానీ బుక్స్ - లైబ్రరీ వైపు కాకుండా ఒక్కడివైపు కూడా కన్నెత్తి చూడని ఇంతకుముందు చెప్పాము కదా చదువుల సరస్వతి , కనిపిస్తోంది కదా మావాళ్ళంతా మా క్లాస్ అమ్మాయిలంతా ర్యాగింగ్ చేస్తుంటే తను మాత్రం పార్క్ లో సింగిల్ గా కూర్చుని చదువుతూ ఉంది - అందుకే two years గా కాలేజ్ టాపర్ ...... , ఏమిచేస్తావో ఎలా చేస్తావో తెలియదు కనీసం ఒక్క నిమిషం ఒక్క నిమిషమైనా తనను బుక్స్ నుండి వేరుచెయ్యాలి .
చదువుకునే వారిని డిస్టర్బ్ చెయ్యడం తప్పు కదా సీనియర్స్ ........
సీనియర్స్ : తప్పు చేయించడమే కదరా ర్యాగింగ్ అంటే అంటూ నవ్వుకున్నారు . అదిగో ఆ మొక్క నుండి పువ్వు పీక్కునివెళ్లి ప్రపోజ్ చెయ్యి వెళ్లు అంటూ తోసారు .

తప్పని పరిస్థితుల్లో భయపడుతున్నట్లుగా నటిస్తూనే సీనియర్ ....... పేరు ? .
సీనియర్స్ : అదికూడా నువ్వే తెలుసుకోవాలిరా వెళ్లు వెళ్లు వెళ్లి డిస్టర్బ్ చెయ్యి ........ - రేయ్ ...... మేడం అని రెస్పెక్ట్ ఇవ్వాలి రోయ్ .......
నేనే తెలుసుకోవాలా అంటూ పూల మొక్క నుండి రెడ్ కలర్ పువ్వు తీసుకుని నేరుగా కాలేజ్ పార్క్ లోని అందమైన పూలమొక్కల మధ్యలో స్టోన్ బెంచ్ పై కూర్చుని , ఎదురుగా జరుగుతున్న ర్యాగింగ్ కు ఏమాత్రం పట్టించుకోకుండా శ్రద్ధగా చదువుకుంటున్న సీనియర్ దగ్గరికి చేరుకున్నాను .
ఇప్పటివరకూ దివ్యక్కతో తప్ప ఏ అమ్మాయితో మాట్లాడినది లేదు అందుకేనేమో వణుకు వచ్చేస్తోంది . సీనియర్ ముందుకువెళ్లి నిలబడి " ఎస్క్యూస్ మీ మే....డం " ......... మీ పే.....రు ర్యా.....గింగ్ అని తడబడుతూ అడిగాను .
మొదట మధురమైన నవ్వు - ఆ వెంటనే అవునా అంటూ బుక్ వైపు నుండి తల ఎత్తిచూసి స్వీటెస్ట్ వాయిస్ తో " మహి " అంటూ ముత్యాలు రాలుతున్నాయా అన్నంత అందంగా నవ్వుతున్నారు .
తనను చూడగానే ఎందుకో తెలియదు నా హృదయంలో అమ్మ ఎంతైతే స్థానం ఆక్రమించారో అంతకు సమానమైన స్థానం ఇవ్వాలనిపించింది - జీవితాంతం అమ్మతోపాటు తనను చూస్తూనే ఉండిపోవాలనిపించింది - నాకు తెలియకుండానే " దివినుండి దిగివచ్చిన దేవకన్య " అంటూ చేతులోని పువ్వుతోనే గుండెలపైకి చేరిపోయాయి - కళ్ళల్లో ఆనందపు బాస్పాలు , మనసంతా జివ్వున లాగేస్తోంది , వొళ్ళంతా తియ్యనైన జలదరింపులు ........ ఆఅహ్హ్ ...... దివ్యక్క చెప్పిన అమ్మకు ఇష్టమైన దేవత ఇలానే ...... ఇలానే కాదు తనే " మహినే " ........, " మహీ " పెదాలపై పలుకగానే హృదయం - మనసు పారవశ్యాన్ని పొందుతున్నంత మాధుర్యం కలిగింది , అంటే మహి అంటే అమ్మకు నచ్చినట్లే కదా ...... లవ్ యు లవ్ యు soooo మచ్ అమ్మా , మీకు నచ్చితే ఇక ఫిక్స్ అయిపోయినట్లే మహినే నా దేవకన్య అని కన్నార్పకుండా ప్రాణంలా కాదు కాదు ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నాను .
నా చూపులకు దేవకన్య ఆశ్చర్యపోయి , " Are you ఫ్రెషర్ " ......
నా దేవకన్య తియ్యని పలుకులకే నా హృదయం పారవశ్యం పొందుతున్నట్లు జలదరించి అవునన్నట్లు గంగిరెద్దులా తలఊపాను .
" ర్యాగింగా .... ? "
అవునన్నట్లు ఆశతో చూస్తూ మళ్లీ తలఊపాను .
మళ్లీ ముత్యాలు రాల్చేలా నవ్వడం చూసి ఆఅహ్హ్ ....... అంటూ వెనుక పూలమొక్కపైకి వాలాను .
దేవకన్య నవ్వుకుని జాగ్రత్త ........ , " ఇంతకీ మా క్లాస్మేట్స్ ఏమి చెయ్యమన్నారు ...... ok ok చేతిలో పువ్వు చూస్తే అర్థమైపోతోంది ప్రపోజ్ చెయ్యమన్నారా ? , అయితే తొందరగా చేసి వెళ్లు లేకపోతే మరింతగా ర్యాగింగ్ చేస్తారు - మా క్లాస్మేట్స్ గురించి నాకు బాగా తెలుసు " .
దేవకన్య స్వరం నుండి వచ్చిన ఒక్కొక్క పలుకు చిలుక పలుకులా నా హృదయంలో స్వరాలు పలికినట్లు - మన్మథుడు ...... ఆపకుండా మన్మధబాణాలు వదులుతున్నట్లు తియ్యని గాయాలు చేస్తున్నాయి .
" హలో హ్యాండ్సమ్ ........ ఎందుకు ఆలస్యం , నేనే చెప్పమన్నాను కదా - చెప్పేసి వెళ్ళిపోతే నీ సమయం - నా స్టడీస్ సమయం ఆదా అవుతుంది . పువ్వు ఇచ్చి చెప్పు అంటూ చేతిని చాపారు " .
అంతకంటే అదృష్టమా దేవకన్యా ........ అంటూ నిజంగానే ఫీల్ అవుతూ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చెయ్యబోయి ఆగిపోయాను . నా కోసం దివి నుండి దిగివచ్చిన - చూడగానే అమ్మ ....... తన స్థానం మొత్తాన్ని ఇవ్వాలని ఆశపడుతున్న దేవకన్యకు నా దేవకన్యకు ఇంత సింపుల్ గా ప్రపోజ్ చెయ్యడమా అంటూ ఒకసారి దేవకన్యను కనులారా నింపుకుని వెనక్కు పరుగుతీసాను - సీనియర్స్ దగ్గరకు చేరాను .

సీనియర్స్ : రేయ్ మహేష్ ....... ప్రపోజ్ చేశావా ? - డిస్టర్బ్ చేశావా ? .
బ్రదర్స్ ....... ప్రిన్సిపాల్ రూమ్ ఎక్కడ ? , త్వరగా చెప్పండి బ్రదర్ ప్రిన్సిపాల్ రూమ్ ఎక్కడ ? .
సీనియర్స్ : కొంపదీసి మహికి కోపం వచ్చి కొట్టిందా ..... ? , ర్యాగింగ్ గురించి ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ చెయ్యబోతున్నాడా అని గుసగుసలాడుతున్నారు భయపడుతూ ........
వెనుక ర్యాగింగ్ కు బలైన ఫ్రెషర్స్ వచ్చి , ఫ్రెండ్ ...... ఆఫీస్ బిల్డింగ్ కార్నర్ లో ఉంది .
రేయ్ ....... వీడు ర్యాగింగ్ గురించి కంప్లైంట్ చెయ్యబోతున్నాడురా అంటూ సీనియర్స్ అంతా భయంతో దిక్కులకొకరు పరిగెత్తారు .

నవ్వుకుని , ఆఫీస్ బిల్డింగ్ వైపు పరుగులుతీసి నేరుగా ప్రిన్సిపాల్ ఆఫీస్ రూమ్ చేరుకుని , లోపలికి పర్మిషన్ అడిగాను . రేయ్ రేయ్ మహేష్ మహేష్ అంటూ కేకలువేస్తూనే కృష్ణగాడు వెనుకే వచ్చి బయటే ఆగిపోయాడు విషయం ఏమిటా అని ......
ప్రిన్సిపాల్ : yes come in .
థాంక్యూ సర్ ...... , My name is మహేష్ - ఫ్రెషర్ సర్ ........
ప్రిన్సిపాల్ : Welcome మహేష్ ....... , Is there any trouble with సీనియర్స్ .......
నో నో నో not at all సర్ ........ , ఇప్పటివరకూ ఇలా ఎవ్వరూ అనుమతి తీసుకుని ఉండరు - పర్మిషన్ ఇస్తారా సర్ .........
ప్రిన్సిపాల్ : ఇంటరెస్టింగ్ ....... , first tell me మహేష్ ......
సర్ సర్ ....... క్యాంపస్ లో ఎంటర్ అవ్వగానే నేను - నా ఫ్రెండ్ కృష్ణ ..... అమ్మాయిలను చూసి లవ్ అట్ ఫస్ట్ సైట్ లో పీకల్లోతు లవ్ లో పడిపోయాము సర్ - ఆ అమ్మాయిలకు ప్రపోజ్ చెయ్యకపోతే లైఫ్ ....... , ok సర్ పాయింట్ కు వచ్చేస్తున్నాను క్యాంపస్ లో ఆ అమ్మాయికి ప్రపోజ్ చెయ్యబోతున్నాను నా ఫ్రెండ్ కూడా ......, మీరు పర్మిషన్ ఇవ్వాలి సర్ ........
ప్రిన్సిపాల్ : what ? అంటూ నోరెళ్ళబెట్టి చూస్తున్నారు . అయినా నేను పర్మిషన్ ఇవ్వకపోతే మీరేమైనా ఆగుతారా ...... ? , నువ్వు చెప్పినట్లు ఇలా ప్రిన్సిపాల్ పర్మిషన్ అడగడం నా సర్వీస్ లోనే ఫస్ట్ టైం యంగ్ మ్యాన్ ........ - నేను అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రపోజ్ చేస్తావు చేస్తారు కాబట్టి ok ......
నోటితో కాదు సర్ మీ లెటర్ ప్యాడ్ పై రాసివ్వండి .
ప్రిన్సిపాల్ : చిన్న ప్రపోజ్ కు నా లెటర్ ప్యాడ్ పై ok ok , new జనరేషన్ అంటూ " పర్మిషన్ గ్రాంటెడ్ " అంటూ సంతకం చేసి ఇచ్చారు .
థాంక్యూ సర్ అంటూ సంతోషంతో బయటకువచ్చాను . కృష్ణగాడు షాక్ లో కదలకుండా నిలబడిపోయాడు .
Next page: Update 19
Previous page: Update 17