Update 19

రేయ్ రేయ్ అంటూ భుజం కదపడంతో తేరుకున్నాడు .
కృష్ణ : రేయ్ రేయ్ ....... ప్రపోజ్ చెయ్యడానికి ప్రిన్సిపాల్ పర్మిషన్ ఎందుకు రా .......
మామూలుగా చేసే ప్రపోజల్ కు అవసరం లేదురా కానీ అంటూ నిమిషం పాటు వివరించాను మనం ఎలా చెయ్యబోతున్నామో .........
చెప్పేంతవరకూ వాడి కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నట్లు వెలిగిపోయాయి . రేయ్ ....... అంటూ అమాంతం నామీదకు జంప్ చేసి బుగ్గలపై ముద్దులవర్షం కురిపించాడు .
చాలు చాలురా ........ , మనకు ఎక్కువ సమయం లేదు , బ్రేక్ సమయం లోపు మన లవ్స్ ముందు ఉండాలి పదా ........
కృష్ణ : మన ప్రపోజస్ చూసి , ఇందుకా పర్మిషన్ అడిగింది అని ప్రిన్సిపాల్ గారు షాక్ అయిపోతారేమోరా ........
ష్ ష్ ....... అంటూ ఆఫీస్ బిల్డింగ్ బయటకువచ్చిచూస్తే ఫ్రెషర్స్ - సీనియర్స్ ...... ఒక్కరుకూడా లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాను - నా దేవకన్య మహి కూడా కనిపించలేదు .
కృష్ణ : ర్యాగింగ్ గురించి కంప్లైంట్ చెయ్యడానికి వెళ్ళావని సీనియర్స్ అందరూ పరుగో పరుగు - ఫ్రెషర్స్ అంతా ఫ్రెషర్స్ గ్యాదరింగ్ కోసం క్యాంపస్ ఆడిటోరియం కు వెళ్లి ఉంటారు . ప్లాన్ ఏమిటి రా ....... , ఇంతకీ నీ హృదయంలో సరిగమలు పలికించిన మా చెల్లి ఎవరురా ఎలా ఉంటుంది .
ఆఅహ్హ్ ....... మా చెల్లి కృష్ణవేణిని చూడగానే ఇక్కడ నీకు ఎలా అనిపించిందో అలానే అనిపించిందిరా ....... మీ చెల్లి పేరు మహి - సీనియర్ రా అంటూ పరుగున ఇంతకుముందు కూర్చున్న స్టోన్ బెంచ్ దగ్గరికివెళ్లి ఎదురుగా మోకాళ్లపై కూర్చుని దేవకన్యనే చూస్తున్నట్లు మురిసిపోతున్నాను .
కృష్ణ : సీనియర్ ? , ప్రేమకు జూనియర్ - సీనియర్ అంటూ తేడా ఉండదు . " మహేష్ - మహి " , " కృష్ణ - కృష్ణవేణి " ....... ఇదేరా జీవితం అంటే ఎవరిని ఎప్పుడు కలపాలో పైవాడు ఎప్పుడో ముడివేసి ఉంటాడు .
అవునురా మామా ........
కృష్ణ : మామ ? .
నా దేవకన్య ...... మీ చెల్లి అయితే , నువ్వు .......
కృష్ణ : రేయ్ మామా ....... అంటూ ఇద్దరమూ కౌగిలించుకున్నాము . రేయ్ ...... అప్పుడే 15 నిమిషాలు అయ్యింది మన ప్లాన్ ఏమిటి ? .
మన బిల్డింగ్ ఓపెనింగ్ రోజున అద్భుతంగా డెకరేట్ చేసిన ఈవెంట్ ఆర్గనైజర్ కు కాల్ చేస్తాను . హలో బ్రదర్ ....... అంటూ ప్రపోజల్స్ గురించి ఫ్లవర్స్ తో ఎక్కడ ఆర్రేంజ్ చెయ్యాలో - ఇంకా ఏమేమి చెయ్యాలో వివరించాను .
ఆర్గనైజర్ : మహేష్ ...... సమయం తక్కువగా ఉంది , ఆ చివరిది సెట్ చెయ్యడం కష్టం - మిగిలినవన్నీ నేనే స్వయంగా డెకరేట్ చేయిస్తాను - ఇప్పుడే బయలుదేరుతున్నాము . అడ్రస్ ఇస్తాను డైరెక్ట్ గా వెళ్లి కలిస్తే ........
డన్ , రేయ్ మామా ....... క్యాబ్ ఆపు . బ్రదర్ ...... కాలేజ్ సెక్యూరిటీకి మీ గురించి చెబుతాను మిమ్మల్ని ఎవ్వరూ ఇబ్బందిపెట్టరు , అవసరమైతే నాకు కాల్ చెయ్యండి - సెక్యూరిటీ దగ్గరకువెళ్లి ప్రిన్సిపాల్ పర్మిషన్ లెటర్ చూయించి వచ్చేవాళ్లను ఆపకండి అనిచెప్పాను .
సెక్యురిటి : ప్రిన్సిపాల్ గారు అనుమతిస్తే మేమెందుకు ఆపుతాము .
థాంక్స్ చెప్పి సెక్యురిటి జేబులో నోటు ఉంచాను .
సెల్యూట్ చెయ్యడంతో , నవ్వుకుని కృష్ణగాడు ఆపిన క్యాబ్ లో హెలికాఫ్టర్ చార్టర్ సర్వీస్ చేరుకున్నాము . చైర్మన్ గారిని కలిసి ప్రపోజల్ - టైం గురించి వివరించాను .
చైర్మన్ : Three హెలికాఫ్టర్స్ - two డిఫరెంట్ places - ఓన్లీ two hours ....... మే బీ కాస్ట్స్ మోర్ .......
ఎంత అవుతుందో అంత గీక్కోండి అని కార్డ్ టేబుల్ పై ఉంచాను .
చైర్మన్ : ప్రాబ్లమ్ solved , అడ్వాన్స్ అంటూ కార్డ్ స్వైప్ చేసుకుని పని పూర్తయిన తరువాత ఫుల్ పేమెంట్ అంటూ మా ముందే గంటలో మొత్తం రెడీ చేయించి , The best Love ప్రపోజల్స్ ever అంటూ చేతులుకలిపి బటన్స్ గురించి వివరించి రిమోట్ ఇచ్చారు - మీరు ప్రపోజల్ ప్లేస్ కు వెళ్లి ఈ రిమోట్ లోని కో ఆర్డినేట్స్ చెబితే పర్ఫెక్ట్ టైమింగ్ లో ....... ఇక చెప్పాల్సిన అవసరం లేదులే , All the best యంగ్ మ్యాన్స్ ........
థాంక్స్ ....... , లెట్స్ గో రా అంటూ హైఫై లు కొట్టుకున్నాము . రేయ్ ....... మీ చెల్లిని చూడకుండా గంట కూడా ఉండలేకపోతున్నాను స్వీట్ పెయిన్ రా ఇక్కడ ........
కృష్ణ : కదా ....... , నాకు కూడారా ....... , వెంటనే వెళ్లి చూడకపోతే నావల్లకాదు నా వల్లకాదు .
పదరా మరి అంటూ క్యాబ్ లో బయలుదేరాము . బావగారికి కాల్ చేసి మీ కాలేజ్ పార్క్ లో సర్ప్రైజ్ ఉంది ఒక్కరే వెళ్ళమని చెప్పి , వెళ్ళాక విషయం వివరించాను .
బావగారు : what ? , మా సిస్టర్స్ ........ కంగ్రాట్స్ బావలూ కంగ్రాట్స్ ....... , అక్కడ మీరు - ఇక్కడ నేను ........ మా సిస్టర్స్ - మీ అక్కయ్య ....... సంతోషాలే సంతోషాలు .

కాలేజ్ చేరుకోగానే ఆర్గనైజర్ కలిసి ఉన్న సమయంలో మావరకు వీలైనంత చేసాము అని లోపలికి పిలుచుకునివెళ్లారు .
మెయిన్ గేట్ కు ఇరువైపులా అంటే ర్యాగింగ్ చేసిన చోట కృష్ణగాడికోసం - దేవకన్యను మొదట చూసిన పూలమొక్కల మధ్యన లైవ్లీ రంగురంగుల గులాబీపూలతో తోరణం , హార్ట్ ఆకారాలలో వందల్లో బాలూన్స్ - పచ్చని గడ్డిపై హార్ట్ సింబల్స్ లా పార్క్ మొత్తం డెకరేట్ చేసి ఉండటం - మెయిన్ బిల్డింగ్ నుండి ప్రపోజల్ ప్లేస్ వరకూ పూలదారులు ....... wow wow వీలైనంత కాదు బ్రదర్ ....... నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా ఏర్పాట్లుచేశారు థాంక్యూ థాంక్యూ soooo మచ్ ..........
కృష్ణ : రేయ్ మామా ....... బ్యూటిఫుల్ రా , ఇప్పుడే ఇలా ఉంది ఇక హెలికాఫ్టర్స్ వస్తే , జీవితాంతం గుర్తుండిపోయేలా అద్భుతాలను చూస్తారు - చూస్తాము అంటూ సంతోషం పట్టలేక కౌగిలించుకున్నాడు .

అంతలో బ్రేక్ టైం అన్నట్లు సీనియర్స్ - ఫ్రెషర్స్ ....... బయటకువచ్చి క్యాంటీన్ - పార్క్ వైపు వెళుతూ ఫ్లవర్స్ డెకరేషన్ చూసి సంతోషంతో ఆశ్చర్యపోయారు . నిమిషంలో స్టూడెంట్స్ మొత్తం అక్కడకు చేరుకుని ఎవరికోసం ఎవరికోసం అని ఎక్సైట్ అవుతున్నారు .
మొబైల్ తీసి చార్టర్ సర్వీస్ కు కాల్ చేసి now అన్నాను .
అంతే మరు నిమిషంలో రెండు హెలికాఫ్టర్లు " I LOVE YOU కృష్ణవేణి from కృష్ణ " - " I LOVE YOU మహి from మహేష్ " ఫ్లాగ్స్ వ్రేలాడదీసుకుని క్యాంపస్ చుట్టూ రౌండ్స్ వేస్తున్నాయి .
స్టూడెంట్స్ అందరూ wow - lovely - beautiful ....... అంటూ ఆకాశం వైపు సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు .
క్యాంపస్ మొత్తం " కృష్ణవేణి - మహి , కృష్ణవేణి - మహి ....... " పిలుపులతో మారుమ్రోగిపోవడంతో ......... స్టాఫ్ - ప్రిన్సిపాల్ చివరగా మా మా దేవకన్యలు బయటకువచ్చారు .
రిమోట్ బటన్ ప్రెస్ చెయ్యగానే రౌండ్ వేస్తున్న హెలికాఫ్టర్స్ నుండి దేవకన్యల చుట్టూ పూలవర్షం కురిసింది .
యాహూ - యాహూ ........ I LOVE YOU మై హార్ట్ కృష్ణవేణి - I LOVE YOU మై హార్ట్ మహి అంటూ క్యాంపస్ మొత్తం వినిపించేలా కేకలువేసి please please అంటూ ఆహ్వానించాము .
Yes yes yes ....... అంటూ సంతోషమైన చప్పట్లతో వెళ్ళాలి వెళ్ళాలి ...... కృష్ణవేణి - మహి , కృష్ణవేణి - మహి అంటూ హోరెత్తించారు .

ఇద్దరు దేవకన్యలూ ........ హెలికాఫ్టర్స్ - ఫ్లాగ్స్ - పూలవర్షం - ఫ్లవర్స్ డెకరేషన్ చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ తప్పదన్నట్లు మావైపు అడుగులువేశారు .
కృష్ణవేణి - మహి ....... ఫ్లవర్స్ దారి ఫ్లవర్స్ దారి మీకోసమే అంటూ పూలదారిలో మాదగ్గరికి పంపించారు .
పూలతో అందంగా అలంకరించిన తోటను చూసి పులకించిపోతూ రోజ్ ఫ్లవర్స్ డెకరేషన్ కింద ఉన్న మాదగ్గరికి రాగానే పెదాలపై చిరునవ్వులతో , మోకాళ్లపై కూర్చుని దివి నుండి దిగివచ్చిన దేవకన్యా ....... ఏదో మీ అందం చూసి చెప్పడం లేదు , మిమ్మల్ని చూడగానే ఎక్కడ ఉన్నారో తెలియని - నా హృదయమంతటినీ ఆక్రమించిన నా ప్రాణం కంటే ఎక్కువైన మా అమ్మ , ఆ స్థానాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఆరాటపడుతోందని నా హృదయం - మనసు తెలియజెయ్యడంతో ....... అమ్మ ప్రేమను కలిపి - అమ్మ ప్రేమతో సమానంగా ఫీల్ అవుతూ చెబుతున్నాను I LOVE YOU మహి ....... ఆఅహ్హ్ ..... చూసారా అమ్మ హ్యాపీ అంటూ ఒకచేతితో హృదయం పై చేతినివేసుకుని మరొక చేతితో రోజ్ ఫ్లవర్ అందించాను .
మాపై పూలవర్షం - హార్ట్ బాలూన్స్ అన్నీ ఆకాశంలోకి అందంగా ఎగిరాయి . చుట్టూ స్టూడెంట్స్ అందరూ ....... " కృష్ణ - కృష్ణవేణి " , " మహి - మహేష్ " అంటూ సంతోషంతో చప్పట్లుకొడుతూ కేకలతో హోరెత్తిస్తున్నారు .

కృష్ణగాడి వైపు ప్రేమతో చూసి కృష్ణవేణి పూలవర్షంలో సంతోషాలతో తడిచి పువ్వు అందుకుని గుండెలపై హత్తుకుని చిరునవ్వులతో తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది . ఫ్రెండ్స్ అందరూ చుట్టుముట్టి గిలిగింతలు పెట్టడం చూసి యాహూ ........ సక్సెస్ లవ్ యు కృష్ణవేణి - లవ్ యు రా మామా ....... అంటూ కేకలువేస్తున్నాడు .

వాడి ఆనందాన్ని చూసి సంతోషించాను . మహీ ...... వాడు నా ప్రాణ స్నేహితుడు , వాడి లవ్ సక్సెస్ ........ , నేను జూనియర్ - మీరు సీనియర్ అని ఏమాత్రం ఆలోచించకండి అమ్మకు మీరు ప్రాణం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మీరే ఇక నా సర్వస్వం అయిపోయారు .
దేవకన్య తియ్యదనంతో నవ్వుకున్నారు .
యాహూ ........ అదే ఆనందంలో ఈ పువ్వుని అందుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే , మిమ్మల్ని అమ్మతో సమానంగా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను .
మహి : మీ అమ్మ అంటే అంత ఇష్టమా ...... హీరో నీకు .
ఇష్టం - ప్రేమ - ప్రాణం - ప్రాణం కంటే ఎక్కువ ........
మహి : బ్యూటిఫుల్ ....... , ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారు ? .
నాకు ఊహ తెలియకముందే మా నాన్న అతడిని అలా పిలవడం కూడా ఇష్టం లేదు - అతడు చేసే పనులు నచ్చక తప్పనిసరి పరిస్థితులలో దూరంగా వెళ్లిపోయారు - అప్పటి పరిస్థితులు ఏమో తెలియవు కానీ నన్ను వదిలి వెళ్ళేటప్పుడు అమ్మ బాధ ....... అంటూ కన్నీళ్ళతో చెప్పాను .
దేవకన్య కళ్ళల్లో కన్నీళ్లు ........
అప్పటి నుండీ నా హృదయంలో అమ్మను చూసుకుంటూ అమ్మకోసం ఎదురుచూస్తున్నాను .
మహి : How స్వీట్ ఆఫ్ యు ........ హీరో అంటూ కన్నీళ్లను తుడుచుకుని నా చేతిలోని గులాబీ పువ్వుని అందుకున్నారు . నేను సంతోషంతో కేకేయ్యబోతే ఆపి , హీరో ....... నాకు కూడా అమ్మ - బుక్స్ తప్ప ఈ ప్రేమపై ఇంట్రెస్ట్ లేదు - నీ చేతిలోని పువ్వుని తీసుకున్నానంటే నువ్వు చెప్పినట్లుగా అమ్మ ప్రేమను మాత్రమే తీసుకున్నట్లు అంటూ అందమైన నవ్వులతో వెనుతిరిగారు . రెండు అడుగులువేసి ఆగి the best ప్రపోజల్ హీరో - I am impressed ....... ఇంతకీ నీ పేరు చెప్పనేలేదు .
చుట్టూ " మహి - మహేష్ " అని కేకలు మరియు హెలికాఫ్టర్ ఫ్లాగ్ లో మహేష్ అని ఉండటం వైపు చూయించాను .
దేవకన్య అందమైన నవ్వు నవ్వుకుని , విన్నాను - చూసాను హీరో ....... నువ్వెలాగైతే ఎస్క్యూస్ మీ మేడం అంటూ నా పేరు నా నుండి విన్నావో అలానే నన్ను దేవకన్యను చేసిన హీరో గారి నుండే వినాలని .........
మహేష్ .......
మహి : మహేష్ ....... స్వీటెస్ట్ name , మళ్లీ చెబుతున్నాను నాకు లవ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు - అమ్మకోసం అంటూ పువ్వుని గుండెలపై హత్తుకుని చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయారు .
ఈ మాత్రం చాలు మేడం .......
మీరు అంత తొందరగా లవ్ accept చేస్తే కిక్కు ఉండదు - నేను రోజూ ప్రపోజ్ చేస్తాను ........ మీరు కోప్పడాలి , తిట్టాలి అవసరమైతే కొట్టాలి , చుట్టూ తిప్పించుకుని ఎంజాయ్ చెయ్యాలి ....... - నా సర్వశక్తులూ , శాయశక్తులా ట్రై చేసుకుంటాను please please ....... ఇంకా చాలా ఉన్నాయి లవ్ యు మహీ అంటూ విజిల్ వెయ్యగానే ఫైనల్ గా ఫైనల్ ఫ్లవర్స్ రెయిన్ కురిసింది అందరిపై ....... - చివరగా రౌండ్స్ వేసి హెలికాఫ్టర్స్ వెళ్ళిపోయాయి .

రేయ్ మామా - రేయ్ మామా ....... అంటూ ఇద్దరూ రెండువైపులా ఒకరివైపు మరొకరము పరుగులుతీసి సంతోషాలతో ఎగిరి ఛాతీలను గుద్దుకుని భుజాలపై చేతులను వేసుకుని మా మా దేవకన్యలవైపు చూస్తున్నాము .
బ్రేక్ టైం అయిపోయినట్లు బెల్ మ్రోగడంతో ప్రిన్సిపాల్ గారు కాజీహా కోపంతో go to your క్లాస్సెస్ - go to your క్లాస్సెస్ అంటూ చెప్పడంతో అందరితోపాటు మా మా దేవకన్యలూ వెనుతిరిగి చూస్తూ చూస్తూ మెయిన్ బిల్డింగ్ లోపలికి వెళ్లిపోయారు .
( అక్కడ మెడికల్ కాలేజ్ లో బావగారు ..... ఇదేవిధంగా దివ్యక్కకు సర్ప్రైజ్ ప్రపోజ్ చెయ్యడంతో , అక్కయ్య ఆనందాలకు అవధులు లేనట్లు పువ్వు అందుకోవడమే కాకుండా బావగారిని కౌగిలించుకుని ఏకంగా ముద్దుపెట్టారు ) .

ప్రిన్సిపాల్ గారు కన్నింగ్ గా చూస్తూ మాదగ్గరికివచ్చి ఇందుకేనా ....... లెటర్ ప్యాడ్ పై లిఖితపూర్వకంగా అనుమతి తీసుకున్నారు .
Sorry సర్ ...... , మీ అనుమతి లేకుండా ఇంత రచ్చ చెయ్యడం ఇష్టం లేదు .
ప్రిన్సిపాల్ : గుడ్ , ఆ రెస్పెక్ట్ అయినా ఇచ్చారు , come to my ఆఫీస్ .......
సర్ సర్ ...... ఇప్పటికే ఫ్రెషర్స్ గ్యాదరింగ్ మిస్ అయ్యాము - ఇప్పుడు క్లాస్సెస్ మిస్ అవ్వడం ఇష్టం లేదు సర్ .........
ప్రిన్సిపాల్ : మావైపు చూసి , మీ గురించి మొత్తం తెలిసిపోయింది ఇక మళ్లీ మోసపోను , ఇప్పుడు నిజం చెప్పండి ....... , మీరు మీ క్లాస్ కు వెళ్లరని నాకు తెలుసు ......
Sorry సర్ ....... , మీరు ఊహించింది నిజమే ....... , గుండెలపై చేతులను వేసుకుని 20 ఏళ్ళు ఎదురుచూసాము సర్ - మరొక్క క్షణం కూడా చూడకుండా ఉండలేము సర్ ........
ప్రిన్సిపాల్ : తెలుసు యంగ్ మ్యాన్స్ ...... , పనిష్మెంట్ ఇవ్వడానికి కాదులే , ఇంత తక్కువ సమయంలో ఇంత గొప్ప అద్భుతాన్ని ఎలా సెట్ చేశారో తెలుసుకుందామని అంతే , ఎవరైనా అడిగితే తెలియదు అంటే మీ ప్రిన్సిపాల్ ముఖం ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి .
అయితే ok సర్ ....... ఓన్లీ 15 మినిట్స్ అంతే అని ఆఫీస్ రూమ్ కు వెళ్ళాము .

కేవలం అమ్మ ప్రేమకోసం పువ్వు తీసుకుంటున్నాను అనిచెప్పి దేవకన్య ........ తన ఫ్రెండ్స్ దగ్గరికి చేరుకోగానే ........
మహి మహి ....... మా లవ్లీ డార్లింగ్ లవ్ accept చేసేసావు కదా - ప్రేమిస్తున్నానని చెప్పేశావు కదా అని ఫ్రెండ్స్ అందరూ సంతోషాలతో చుట్టుముట్టారు .
దేవకన్య : నో నో నో ఓన్లీ అమ్మ ప్రేమ అంటూ జరిగినదంతా వివరించి , పువ్వుని ఒక ఫ్రెండ్ కు ఇచ్చేసి లోపలికి పదండి అంటూ అడుగువేసిందో లేదో ........
ఫ్రెండ్స్ : ఒసేయ్ ఒసేయ్ ఒసేయ్ నిన్నూ ....... అంటూ ఒకరు సున్నితంగా మొట్టికాయ వేశారు - ఒకరు బుగ్గ గిల్లారు - మిగతావాళ్ళు చేతులపై గిల్లేసారు . దేవుడే స్వయంగా నీ దగ్గరికివచ్చి దేవకన్య అంటూ అదృష్టాన్ని అనుగ్రహిస్తే కాదంటున్నావు అంటూ కళ్ళల్లో చెమ్మతో చెప్పారు .
దేవకన్య : ఏంటి ఫ్రెండ్స్ మీ కళ్ళల్లో కన్నీళ్లు ...... , నాకు ప్రేమపై నమ్మకం లేదని మీకు తెలుసుకదా ....... , ఏంటీ దేవుడు అన్నారు - దేవుడా ........ ఏంటే నువ్వు మాట్లాడేది విదేళ్లేఖా ? .
ఫ్రెండ్ విద్యుల్లేఖ : అవునే దేవకన్యా ...... , నువ్వు రెండు నెలలుగా దేవుడు దేవుడు అంటూ థాంక్స్ కూడా చెప్పలేకపోయానే అని ఎవరికోసమైతే ఎదురుచూస్తున్నావో ఆ దేవుడు ఎవరో కాదే మహేష్ గారే .......
దేవకన్య : ఏమిటే మీరు చెప్పేది , మహేష్ మహేష్ ....... అంటూ కన్నీళ్ళతో కృష్ణగాడితో చిరునవ్వులు చిందిస్తున్న నావైపు ప్రాణంలా చూస్తున్నారు .
విద్యుల్లేఖ : అవునే దివి నుండి మహేష్ కోసమే కాదు కాదు దేవుడి కోసమే వచ్చిన దేవకన్యా ........ , నువ్వు వేగంగా వెళ్లి డివైడర్ ను గుద్దుకుని పడిపోగానే మేము ఏడుస్తూ వెహికల్స్ ను ఆపబోతే ఒక్కరూ పట్టించుకోకపోయినా దేవుడిలా మాదగ్గరికే వచ్చిన నీ దేవుడు మహేష్ గారు - రక్తం లో ఉన్న నిన్ను చూసి మాతో సమానంగా చలించిపోయిన నీ దేవుడు మహేష్ గారు - నిన్ను ఎత్తుకోవడానికి మేము కష్టపడుతుంటే మే ఐ అంటూ అనుమతి తీసుకుని మరీ నిన్ను ఎత్తుకున్న నీ దేవుడే మహేష్ గారు - ఆ ఆ నీ తల వాలుతుంటే జాగ్రత్తగా గుండెలపై వాల్చుకోవడంతో షర్ట్ మొత్తం రక్తం అయినా పట్టించుకోలేదే నీ దేవుడు - అమౌంట్ పే చూసేంతవరకూ నీకు ట్రీట్మెంట్ మొదలుపెట్టకపోవడంతో కోపంతో నర్స్ ను కొట్టబోయారు , నీకు ఏమైనా అయి ఉంటే డాక్టర్స్ ను హాస్పిటల్ ను ఊరికే వదిలేవారు కాదు నీ దేవుడు , మేము చూసామే మహేష్ సర్ కళ్ళల్లో ....... , నీకు ఏమీ కాకూడదు అని డబల్ అమౌంట్ పే చేసేసారు ఏమాత్రం ఆలోచించకుండా ....... - హాస్పిటల్లో తన దేవకన్య బ్లడ్ లేకపోవడంతో వేరే హాస్పిటల్ నుండి వచ్చేలోపు ప్రాణాలకు ప్రమాదం అని తెలియగానే ఎంత కావాలంటే అంత బ్లడ్ తీసుకోమని ఇచ్చి నిన్ను కాపాడిన నీ దేవుడు మహేష్ గారు - అలసిపోయిన నీరసంగా ఉన్నా వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు , మేమే బలవంతపెట్టి పంపించాము - మాకోసం డిన్నర్ తీసుకొచ్చారు , మందులకోసం పర్సులోని డబ్బంతా ఇచ్చేసారు . నీ దేవుడి బ్లడ్ కాబట్టే గంటల్లోనే స్పృహలోకి వచ్చావు - వారం లోనే పర్ఫెక్ట్ అయిపోయావు .
మరొక ఫ్రెండ్ : ఇదంతా మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదే విద్యుల్లేఖ ....... , మహికి మొత్తం తెలుసు - చూడు మహేష్ సర్ లవ్ ను accept చెయ్యనందకు ఎంత బాధపడుతోందో తన కన్నీళ్లే చెబుతున్నాయి - అంతా నీవల్లనేనే విద్యుల్లేఖ ...... మహేష్ సర్ ఇచ్చిన నెంబర్ పోగొట్టావు .
విద్యుల్లేఖ : sorry ఫ్రెండ్స్ ....... , ఇది స్పృహలోకి వచ్చిందన్న ఆనందంలో నెంబర్ చేజార్చుకున్నాను . ఇది అదృష్టవంతురాలే ........ దివి నుండి దిగివచ్చిన దేవకన్య కదా ...... దేవుడే వచ్చారు .
దేవకన్య : నవ్వుకుని , sorry మహేష్ గారూ ...... , ఒసేయ్ ...... నా పువ్వు ఎక్కడ అంటూ ఫ్రెండ్ చేతిలోనుండి లాక్కుని గుండెలపై హత్తుకుని ప్రిన్సిపాల్ గారితో మాట్లాడుతున్న నావైపు ప్రాణంలా చూస్తున్నారు . ఫ్రెండ్స్ ....... నా దేవుడు నన్ను గుర్తుపట్టినట్లు లేదు .
విద్యుల్లేఖ : ఆ రోజు నిన్ను చూస్తేనే కదే ....... , నిన్ను రక్షించడం తప్ప నీ అందం గురించి పట్టించుకోని దేవుడు ....... ఆరోజులా గుండెలపై చేరు తెలిసిపోతుంది , పదా ఇప్పుడే వెళదాము ........
దేవకన్య : వద్దే ........ , చివరగా నా దేవుడు ఏమన్నాడో విన్నారుకదా .......
అందరూ ఏమన్నారబ్బా ....... అని ఆలోచనలో పడ్డారు ( మీరు అంత తొందరగా లవ్ accept చేస్తే కిక్కు ఉండదు - నేను రోజూ ప్రపోజ్ చేస్తాను ........ మీరు కోప్పడాలి , తిట్టాలి అవసరమైతే కొట్టాలి , చుట్టూ తిప్పించుకుని నో అంటూ ఎంజాయ్ చెయ్యాలి ....... - నా సర్వశక్తులూ , శాయశక్తులా ట్రై చేసుకుంటాను please please ....... ) wow wow ...... లవ్ యు లవ్ యు డార్లింగ్ ఎంజాయ్ ఎంజాయ్ ........
దేవకన్య : నా దేవుడి ఇష్టమే నా ఇష్టం - మీరూ చెప్పకండి . ఫ్రెండ్స్ ....... నా బుజ్జిహీరో వెళ్లిపోతున్నాడు .
విద్యుల్లేఖ : బుజ్జిహీరోనా ...... , ok ok జూనియర్ కదా...... , నిన్ను చూడకుండా ఉండలేడు , మనం క్లాస్ కు వెళ్ళేలోపు తన క్లాస్ కు వెళ్లకుండా మన క్లాస్ కే వచ్చేస్తాడు చూడు ok నా .......
దేవకన్య : వచ్చేస్తాడు కదా అంటూ నేను టర్న్ అయ్యేంతవరకూ తొంగి తొంగి చూసి , ఫ్రెండ్స్ ....... అక్కడకు వెళ్లాలని ఉంది అంటూ ఫ్లవర్స్ డెకరేషన్ వైపు అందమైన సిగ్గుతో చూయించారు .

విద్యుల్లేఖ : నీ దేవుడు ....... వారి ప్రియమైన దేవకన్య అంటే నీ కోసం చేసిన డెకరేషన్ , ఎన్నిసార్లైనా చూడవచ్చు , నువ్వు మాత్రమే చూశావు మాకు చూడాలని ఉండదా పదవే అంటూ పార్క్ లోకి పూలదారిలో వెళ్లి , పూలవర్షం వలన ఆ చోటంతా పూలతో నిండిపోవడం - గులాబీ పూల బ్యూటిఫుల్ అలంకరణ చూసి , ఈ దేవకన్య కోసం ఏకంగా స్వర్గాన్నే భువిపైకి తీసుకొచ్చారు అంటూ దేవకన్యపై చుట్టూ పూలవర్షం కురిపించి , చిరునవ్వులు చిందిస్తున్న దేవకన్యను హత్తుకున్నారు .
దేవకన్య : లవ్ యు మహేష్ ....... , ఈ పూలన్నింటినీ ...... ప్చ్ .... వీలుకాదు కదా , నువ్వు ఇచ్చిన ఈ పువ్వుని నా జీవితాంతం నాతోనే ఉంచుకుంటాను అని ప్రేమతో ముద్దుపెట్టి పరవశించిపోతున్నారు . తనివితీరినట్లు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ...... ఈ విషయం మహేష్ కు తెలియకూడదు , వచ్చేలోపు క్లాస్ కు వెళదాము .
ఫ్రెండ్స్ : నీ ఇష్టమే మా ఇష్టం అంటూ క్లాస్ కు చేరుకున్నారు . దారి వెంబడి కొంతమంది సంతోషంతో పలకరించారు -మరికొంతమంది అయితే అసూయ చెందడం చూసి ఫ్రెండ్స్ అందరూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
దేవకన్య అయితే ప్రతీ అభినందనకు లవ్ యు మహేష్ - లవ్ యు బుజ్జిహీరో - లవ్ యు మై గాడ్ అంటూ మనసులో తలుచుకుని మురిసిపోతున్నారు .
ఫ్రీ పీరియడ్ అవ్వడంతో మహి క్లాస్లోకి అడుగుపెట్టగానే మిగతా క్లాస్మేట్స్ అందరూ కేకలతో గోలగొలచేసి చుట్టుముట్టి ఆనందాలను పంచుకున్నారు . చెల్లి కృష్ణవేణి కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి సంతోషానుభూతికి లోనయ్యింది .
*********

ఇక్కడ ప్రిన్సిపాల్ గారు మొత్తం తెలుసుకుని , జాయినింగ్ రోజునే ఏమేమి చేయొచ్చో - చెయ్యకూడదో చేసి అందరి దృష్టిలో పడి రచ్చ రచ్చ చేశారు బట్ రొమాంటిక్ ....... నేనూ చాలా ఎంజాయ్ చేసాను . లవ్ తోపాటు స్టడీస్ కూడా ...... , మీ ఫైల్స్ చూసాను very impressed ...... అన్నింటికీ All the best వెళ్ళండి .
థాంక్యూ సర్ ....... , ఆఫీస్ రూమ్ బయటివరకూ నెమ్మదిగా వచ్చి ఆఫీస్ బిల్డింగ్ నుండి మెయిన్ బిల్డింగ్ కు పరుగుపెట్టాము . ఇద్దరమూ హైఫై కొట్టుకుని వాడు .... ఫ్రెషర్స్ క్లాస్ - నేను .... థర్డ్ ఇయర్ క్లాస్ వెతుకుతూ వెళ్ళాము .
హీరో ....... నువ్వు ఎవరికోసం వెతుకుతున్నావో తెలుసులే , ఫస్ట్ ఫ్లోర్ రైట్ సైడ్ సెకండ్ రూమ్ ........
థాంక్యూ సిస్టర్ ......
స్టాప్ హీరో ....... సిస్టర్ ? , అవునులే ....... అంతటి అందమైన అక్కయ్య లవ్ గా ఉంటే మిగతావాళ్ళంతా సిస్టర్సే కదా ...... , ok ok .......
థాంక్యూ సిస్టర్ ....... , పరుగున పైకివెళ్లి రైట్ సైడ్ సెకండ్ రూమ్ కు చేరాను .

ఫ్రీ క్లాస్ అవ్వడంతో ఉదయం ర్యాగింగ్ చేసిన సీనియర్స్ ....... కోపంతో నావైపు చూస్తున్నారు - అడ్డుగా నిలబడ్డారు . రేయ్ ...... ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ అంటూ ......
రేయ్ రేయ్ అంటూ అందరి మధ్యలోనుండి లావుపాటి సిస్టర్ వచ్చి , వెళ్ళండి వెళ్ళండి ...... మా మహేష్ సర్ .......
ఆశ్చర్యపోయాను - సిస్టర్ సిస్టర్ ...... తనకు ఆ సిస్ట .......
వెంటనే నా నోటిని చేతితో మూసేసారు . సిస్టర్ అని మాత్రం అనకు మహేష్ సర్ - మేము మాత్రమే సిస్టర్స్ ........
ఆ సి ....... ok ok వారికి ఎలా ఉంది ? - ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? - బాగున్నారు కదా ? - పూర్తిగా కోలుకున్నారు కదా ? - దెబ్బలు నయమైపోయాయి కదా ? - మీతోపాటు కాలేజ్ కు వచ్చారా ? - వారు ఆరోగ్యన్గా ఉండాలని దుర్గమ్మ తల్లిని కూడా దర్శించుకున్నాను . Please please తొందరగా చెప్పండి ........
లావుపాటి సిస్టర్ తోపాటు ఆరోజు ఉన్నవారంతా నవ్వుకుంటూ వచ్చారు - కూల్ కూల్ మహేష్ సర్ ...... గ్యాప్ ఇవ్వండి - మహేష్ సర్ ....... బ్లడ్ ఇచ్చినది ఎవరు దేవుడి లాంటి మీరు - మీరు వెళ్లిపోగానే స్పృహలోకి వచ్చింది , రోజుల్లోనే పూర్తిగా కోలుకుంది .
థాంక్ గాడ్ ....... , థాంక్యూ థాంక్యూ దుర్గమ్మా ....... , ఆ మరుసటిరోజు ఉదయమే వచ్చాను సిస్టర్స్ , ఆ పాటికే వెళ్లిపోయారని చెప్పారు .
సిస్టర్ : అది స్పృహలోకి రాగానే అమ్మా అమ్మా అంటూ ఒకటే కలవరించడంతో తెల్లవారేలోపు క్యాబ్ లో తన ఇంటికి తీసుకెళ్లాము . నెంబర్ ఎక్కడో చేజారిపోవడంతో కాల్ చెయ్యలేక చాలా బాధపడ్డాము .
పర్లేదు పర్లేదు సిస్టర్స్ వారు ఆరోగ్యన్గా ఉన్నారు అదిచాలు .
సిస్టర్ : హాస్పిటల్లో చేర్చి బ్లడ్ ఇచ్చి సేవ్ చేసినందుకు తను - తన బిడ్డను కాపాడినందుకు అమ్మ ........ మిమ్మల్ని దేవుడు అని మీరు సంతోషంగా ఉండాలని ప్రార్థించని రోజంటూ లేదు .
అదిమాత్రం నిజమైంది సిస్టర్స్ ....... ఆరోజు నుండీ మిస్ అయిన జీవితం మళ్లీ నన్ను చేరింది . ప్రాణ స్నేహితుడు - అక్కయ్య బావగారు - ఈరోజు నా దేవకన్య అంటూ గుండెలపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను . ఇన్ని సంతోషాలకు కారణమైన సిస్ .........
సిస్టర్ : మహేష్ సర్ ....... నెవర్ ఎవర్ ...... అంటూ అందరూ కోపంతో చూస్తున్నారు .
Sorry sorry ఇంతకుముందే చెప్పారుకదా , అయినా మిమ్మల్ని అంటే ఫీల్ అవ్వడం లేదు వారిని అంటే ఎందుకు ఫీల్ అవుతున్నారండీ .........
సిస్టర్ : ఎందుకో ఆ మాత్రం తెలియదా మహేష్ సర్ - బ్లడ్ ఇచ్చి మరీ బ్రతికించుకున్నారు .
ఆ మాత్రం తెలియదానా ....... what ? నో నో నో ....... సిస్టర్స్ ఇక్కడ అమ్మ - నా దేవకన్య మహి ఎప్పుడో పూర్తి స్థానాన్ని ఆక్రమించేశారు . వారికి చెప్పండి కొద్దిసేపటి ముందు బయట ఏమిజరిగిందో మీరంతా చూసే ఉంటారు .
( సిస్టర్స్ వెనుక దాక్కుని వింటున్న దేవకన్య నవ్వుకుని , లవ్ యు మై గాడ్ అంటూ పులకించిపోతున్నారు ) .
సిస్టర్స్ : చూసాము చూసాము . ఈ విషయం తెలిస్తే చాలా చాలా బాధపడుతుంది . నిన్నే దేవుడిగా ఆరాధిస్తోంది - కాపాడిన మీరే బాధపెడతారా ....... ? .
( వెనకనుండి నవ్వులు వినిపించాయి )
అర్థమయ్యేలా చెప్పండి please please ....... నా దేవకన్యనే నా సర్వస్వం - ఎక్కడ ఉన్నారో చెప్పండి నేనే చెబుతాను .
సిస్టర్స్ : తను తను ...... ఆ ఆ ఇక్కడ లేదుగా , కోలుకున్న తరువాత నా తల్లిని ఎక్కడికీ పంపించను అని కాలేజ్ మాన్పించి తన కళ్లెదుటే ఉంచుకున్నారు అమ్మ .
అమ్మ ప్రేమ అంటే అలానే ఉంటుందేమో ...... , మనకేమైనా అయితే తల్లడిల్లిపోతారు .
( ఎక్కడున్నా అమ్మను చేరతావు మహేష్ అంటూ కళ్ళల్లో చెమ్మతో ప్రార్థించారు దేవకన్య )
సిస్టర్స్ : ప్రాబ్లమ్ solved అనుకుంటున్నారేమో ....... , కొన్నిరోజుల తరువాత అమ్మను ఒప్పించి కాలేజ్ కు పిలుచుకునివస్తాము .
నో నో నో ...... నేనెలా అనలేదు సిస్టర్స్ , వారు కాలేజ్ కు వస్తే చాలా చాలా సంతోషిస్తాను - వీలైతే వారి దగ్గరికి తీసుకెళ్లగలరా ........
సిస్టర్ : తీసుకెళితే మిమ్మల్ని వదలదు , ok నా మహేష్ సర్ .......
నో నో నో ....... కలవాలనీ ఉంది - మీ మాటలకు భయమూ వేస్తోంది .
( దేవకన్య నవ్వుతూనే ఉన్నారు )

సిస్టర్స్ : ఏంటి మహేష్ గారూ ....... మాటమాటకూ పదేపదే మా క్లాస్ వైపు చూస్తున్నారు .
ఇదే మహి క్లాస్ అని చెప్పారు - చూసి చాలాసేపయ్యింది - ఇక్కడ స్వీట్ పెయిన్ ..........
సిస్టర్స్ : లోపలికి వెల్లవే ........
సిస్టర్స్ ? .......
సిస్టర్స్ : అవునవును మహి క్లాస్ ఇదే , అయినా ఆ చదువుల పురుగుతో లవ్ ఏంటో మాకైతే అర్థం కావడం లేదు - అమ్మ ప్రేమ తప్ప ఇలాంటి ప్రేమల గురించి తెలియని మొద్దు . మీరు సేవ్ చేసిన మా ఫ్రెండ్ అందమూ లేదు ....... ఇప్పటికైనా సమయం మించిపోలేదు మీరు ఊ అంటే వెంటనే తన దగ్గరికి తీసుకెళ్లిపోతాను .
( చిరుకోపంతో అందరినీ గిల్లినట్లు మెలికలు తిరిగిపోతున్నారు )
నాకు కావాల్సినది కూడా అమ్మను ప్రేమించే దేవకన్యనే సిస్టర్స్ - అమ్మను ప్రేమించే అమ్మాయి భర్తను ఎంతగా ప్రేమిస్తుందో ....... ఆఅహ్హ్ - రేయ్ మహేష్ నువ్వు లక్కీ రా ........
సిస్టర్స్ : Wow ...... మహేష్ గారు మన మహి స్వచ్ఛమైన మనసును చూసారు .
మీ మహి ....... ? .
సిస్టర్స్ : మహి కూడా మా బెస్ట్ ఫ్రెండే ....... లోపల ఉంది .
Please please సిస్టర్స్ ....... ఇక్కడ పెయిన్ పెరుగుతూనే ఉంది అంటూ ఎగిరెగిరి చూస్తున్నాను .
సిస్టర్స్ : ఇక మీ ఇష్టం అంటూ లోపలికి దారి వదిలారు .

డోర్ దగ్గరికి ఆతృతతో చేరుకుని బుద్ధిగా చదువుకుంటున్న దేవకన్యను చూసి ఆఅహ్హ్ ...... ఇప్పుడు హ్యాపీనా హార్ట్ - గోల గోల చేసావు ...... - ఎంత శ్రద్ధగా చదువుకుంటున్నారో చూడు డిస్టర్బ్ చేయకూడదని కూడా తెలియదు . నా దేవకన్య బంగారం అంటూ దిష్టి తీసాను .
నా వెనకున్న సిస్టర్స్ అందరూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు . నన్ను దాటుకుని లోపలికివెళ్లి దేవతకు ఇరువైపులా చేరి ఆటపట్టిస్తున్నారు .
కోపంతో చూస్తున్న సీనియర్స్ ను పట్టించుకోకుండా దేవకన్యను చూస్తూనే లోపలికివెళ్లి సైలెంట్ గా వెనుక కూర్చున్నాను . సిస్టర్స్ సిస్టర్స్ ....... డోంట్ డిస్టర్బ్ డోంట్ డిస్టర్బ్ అంటూ చిన్నగా చెప్పి బ్రతిమాలుకున్నాను .

లావుపాటి సిస్టర్ ....... దేవకన్య బుగ్గను గిల్లేసి వెనుకకు వచ్చి నాప్రక్కన కూర్చున్నారు . మహేష్ సర్ ...... మీరు ఇంత ప్రేమిస్తున్నా కనీసం మీవైపు చూడటం లేదు , తనను వదిలెయ్యండి మనం మా మొదటి ఫ్రెండ్ దగ్గరికి వెళదాము .
సిస్టర్ ....... ముందు " సర్ - గారు - మీరు " అని రెస్పెక్ట్ ఇవ్వడం ఆపేయ్యండి please , మనిషిగా చిన్న హెల్ప్ చేసాను అంతే ...... - నేను ...... మీకంటే చిన్నవాడిని .
సిస్టర్ : సరైన సమయానికి రాకపోయుంటే ....... , ఊహించుకోవడానికే మా గుండె చప్పుడు ఆగిపోతుంది . మా జీవితాంతం మరిచిపోము . మిమ్మల్ని నీ అంటే ....... అమ్మో తప్పు తప్పు .
Please please సిస్టర్ .........
సిస్టర్ : మీరు ....... మీకంటే సీనియర్ ను ప్రాణంలా ప్రేమించవచ్చు కానీ మేము మా ప్రాణమైన ఫ్రెండ్ ను రక్షించిన దేవుడిని రెస్పెక్ట్ ఇస్తే తప్పు కనిపించిందా .......
అదీ అదీ ....... సరే మీ ఇష్టం సిస్టర్ అంటూ నవ్వుకున్నాను .
సిస్టర్ : అదీ అలా దారికి రండి , మహేష్ సర్ ...... మీరు ఇంత ప్రాణంలా చూస్తున్నా మీవైపు కన్నెత్తి కూడా చూడటం లేదు .
నో నో నో చదువుకుంటున్నారు . అమ్మ - చదువు ....... దేవకన్యకు ప్రాణం , ఆ తరువాతనే నేను - నాకు కూడా అదే ఇష్టం . నిజాయితీగా దేవకన్య మనసులో స్థానం సంపాధిస్తాను .
సిస్టర్ : ఒసేయ్ మహీ ...... విన్నావా ? .
( వినడమే కాదే బుక్ లో మొబైల్ పెట్టుకుని నేను చేసిన వీడియో కాల్ లో మహేష్ సర్ ను ప్రాణంలా చూస్తోంది అంటూ మరొక సిస్టర్ ...... లావుపాటి సిస్టర్ చెవిలో గుసగుసలాడింది ) .
ఏమైంది సిస్టర్ ........
లావుపాటి సిస్టర్ : మీరెంత చూసినా మీవైపు చూడదట ........
డిస్టర్బ్ చెయ్యకుండా వెల్లమంటున్నారా ? .
లావుపాటి సిస్టర్ : ప్రాణం పోయినా ఆ మాటను చెప్పదు మీ దేవకన్య .......
విన్నట్లు మరుక్షణమే నావైపు తిరిగిచూసి వెంటనే అటువైపుకు తిరిగి ప్రక్క కూర్చున్న సిస్టర్ చెవిలో గుసగుసలాడారు . ఆ సిస్టర్ వచ్చి లావుపాటి సిస్టర్ చేతిని గిల్లేసి వెంటనే బుగ్గపై ముద్దుపెట్టి వెళ్లారు .
లావుపాటి సిస్టర్ : స్స్స్ ....... , నెగటివ్ - పాజిటివ్ కోసం అన్నమాట లవ్ యు వే .........
సిస్టర్ నావైపు చూడరన్నారు - చూశారుగా ఎంత ప్రేమతో చూసారు .
లావుపాటి సిస్టర్ : నాకైతే ఆ చూపులో ప్రేమ కనిపించనేలేదు .

అంతలో చివరి క్లాస్ కోసం లెక్చరర్ వచ్చి క్లాస్ స్టార్ట్ చేశారు .
శ్రద్ధగా వింటున్న దేవతను చూస్తున్నా టీచింగ్ వినిపిస్తూనే ఉంది .
సగం క్లాస్ తరువాత సీనియర్స్ ఇద్దరు లేచి , సర్ ...... వాడు ఫ్రెషర్ థర్డ్ ఇయర్ క్లాస్ లో పనేమిటి అని కంప్లైంట్ చేశారు .
లెక్చరర్ : స్టూడెంట్స్ డిస్టర్బ్ అయితే చెయ్యడం లేదు కదా ...... , ఈ త్రీ ఇయర్ కోర్స్ లో స్టూడెంట్స్ కు ఇష్టమైన ఏ క్లాస్సెస్ అయినా వినొచ్చు - టీచ్ చేస్తున్నది బిజినెస్ మేనేజ్మెంట్ కదా ...... ఎవ్వరైనా అటెండ్ అవ్వవచ్చు .
సీనియర్స్ : సర్ ...... వాడు క్లాస్ వినడానికి రాలేదు , మా క్లాస్మేట్ కు సైట్ కొట్టడానికి వచ్చాడు , బ్రేక్ టైం లో మీరే చూసారు కదా .......
లెక్చరర్ : Thats not good , ఫ్రెషర్ ...... ఫస్ట్ స్టడీస్ ఆ తరువాతనే other ఆక్టివిటీస్ ....... please go outside .
సిస్టర్ బాధపడుతున్నారు - నా దేవకన్య నావైపు చూస్తున్నారు - కళ్ళల్లో చెమ్మ ...... , ఇది చాలు అంటూ లేచి సర్ ...... మీరు టీచ్ చేస్తున్న బిజినెస్ మేనేజ్మెంట్ explain చేయమంటే చేస్తాను .
లెక్చరర్ : what ? , ok dias is all yours అంటూ వచ్చి వెనుక కూర్చున్నారు .

సిస్టర్ - దేవకన్యా ...... ఎంజాయ్ అనిచెప్పి బోర్డ్ దగ్గరికి వెళ్ళాను . స్కెచ్ అందుకుని నాకు ఊహ తెలిసినప్పటి నుండీ కంపెనీ విషయాలు , నాన్నపై కోపంతో కంపెనీని అమ్మబోయి ఫారిన్ బిజినెస్ కంపెనీ పరం కాకుండా డీల్ చేసిన విధానం , మేనేజ్మెంట్ - వర్కర్స్ ...... ఫ్రెండ్లీ బాండ్ వలన కలిగే లాభాలు , దానివలన మార్కెటింగ్ గ్రోత్ ........ అర గంటపాటు లెక్చరర్ - సీనియర్స్ నోరెళ్ళబెట్టేలా explain చేసివెళ్లి సిస్టర్ ప్రక్కన కూర్చున్నాను .
మొదట లెక్చరర్ ...... ఆ వెంటనే సిస్టర్స్ మొదలుకుని సీనియర్ అమ్మాయిలందరూ లేచి చప్పట్లు కొడుతున్నారు - నా దేవకన్య అయితే షాకింగ్ ఫీలింగ్ తో పెద్ద పెద్ద కళ్ళువేసుకుని నోరుతెరిచిమరీ నావైపుకు తిరిగి చూస్తున్నారు.
నవ్వుకుని , మేడం ....... తాళియా అంటూ చుట్టూ చూయించాను .
దేవకన్య : సూపర్ ....... అంటూ రెండు చేతులతో దిష్టి తీసి చప్పట్లుకొట్టబోయి నో అంటూ పెదాలను కదిల్చి అటువైపుకు తిరిగారు .
యాహూ ....... అంటూ సౌండ్ చెయ్యకుండా సంతోషంతో చేతులుపైకెత్తాను .

లెక్చరర్ : మహేష్ కదా ....... , బ్రేక్ టైం లో విన్నాను - ఒక ఫ్రెషర్ ...... ఒక experiance బిజినెస్ మ్యాన్ లా కళ్ళకు కట్టినట్లు explain చెయ్యడం నా కెరీర్ లోనే చూడలేదు - హాట్సాఫ్ to you మహేష్ ...... ఇక నుండీ ఎప్పుడైనా నా క్లాస్ - నా క్లాసే కాదు ఏ లెక్చరర్ - ప్రొఫెసర్ క్లాస్ అయినా అటెండ్ అవ్వవచ్చు , ఆబ్జెక్ట్ చెయ్యకుండా నేను చూసుకుంటాను - కీప్ ఇట్ అప్ మహేష్ .......
సీనియర్ అబ్బాయిల ముఖాలు మాడిపోయాయి .
అంతలో లంచ్ బెల్ మ్రోగడంతో , మహేష్ ...... we'll meet tommorrow అంటూ చేతిని కలిపిమరీ ప్రౌడ్ గా వెళ్లారు . సీనియర్ అబ్బాయిలు మరింత కోపంతో చూసి బయటకువెళ్లారు .

మహేష్ సర్ ....... అంటూ మొదట లావుపాటి సిస్టర్ చేతిని అందుకుని అభినందించి తృప్తి చెందినట్లు ఒక్కొక్కడి నోటిని మూయించారు అంటూ సైడ్ నుండి చుట్టేశారు . అధిచూసి సిస్టర్స్ అందరూ వచ్చి సూపర్ - కేక - మైండ్ బ్లోయింగ్ మహేష్ సర్ అంటూ లావుపాటి సిస్టర్ ను ప్రక్కకు లాగేసి చేతులు అందుకునిమరీ అభినందిస్తున్నారు .
నా దేవకన్య అధిచూసి వాళ్ళ ఫ్రెండ్స్ వైపు చిరుకోపంతో చూసినట్లు నాకైతే అనిపించి చాలా చాలా ఆనందం వేసింది .
సిస్టర్స్ ....... నా దేవకన్య చప్పట్లు కొట్టలేదు ప్చ్ ...... అంటూ నవ్వుతున్నాను .
సిస్టర్స్ : ( అందరికంటే అదే ఎక్కువ చప్పట్లు కొడుతోంది లోలోపల మహేష్ సర్ ) తన కంటే టాలెంట్ - తెలివైనవారు కాలేజ్ లో అడుగుపెట్టారని కుళ్ళుకొంటోంది మహేష్ సర్ ......
( దేవకన్య గర్వపడుతూ లోలోపలే ఎంజాయ్ చేస్తున్నారు ) ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాంటిదేమీ లేదు అంటూ నాదగ్గరికివచ్చి మహేష్ సర్ ..... That was ఫెంటాస్టిక్ అంటూ అభినందనగా చేతిని అందించారు .
దేవకన్య నా దేవకన్య ...... అంటూ అంతులేని ఆనందంతో గుండెలపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .
లావుపాటి సిస్టర్ : మహేష్ సర్ ...... అది మనసు మార్చుకునేలోపు చెయ్యి అందుకుని ముద్దుపెట్టేయ్యండి .
ముద్దునా ........ అంటూ కూర్చున్నవాడిని వెనుకకు వాలిపోయాను .
దేవకన్య : Not ఇంట్రెస్ట్ ok అంటూ ముసిముసినవ్వులు నవ్వుతూ చేతిని వెనక్కు తీసుకోబోతే ........
నో నో నో మహి మేడం అంటూ పైకిలేచి చేతిని కలపబోయి మళ్లీ వెనక్కుతీసుకుని ఛాతీపై చేతులను శుభ్రం చేసుకుని , సిస్టర్ దగ్గర sanitiser అందుకుని మరీ శుభ్రం చేసుకుని సున్నితంగా అందుకుని , స్వీట్ షాక్ కొట్టినట్లు మెలికలు తిరిగిపోవడం చూసి ....... సిస్టర్స్ తోపాటు నా దేవకన్య ముసిముసినవ్వులు నవ్వుతున్నారు .
దేవకన్య : ఎంతసేపు పట్టుకుంటారు హీరోగారూ అంటూ చేతిపై గిల్లేసారు .
Yes yes దేవకన్య గిల్లారు అంటూ ఆనందిస్తున్నాను .
సిస్టర్స్ : ఒసేయ్ నిన్నూ ........
దేవకన్య : ( అధికాదే మరికొద్దిసేపు అలాగే పట్టుకుంటే నావల్ల కాక నేనే ముద్దుపెట్టేసేదాన్ని , టచ్ చెయ్యగానే ....... )
సిస్టర్ : ok ok అర్థమైంది , లవ్ యు వే అంటూ బుగ్గపై ముద్దుపెట్టారు .

దేవకన్య : విద్యు ....... మరొకసారి నా దేవుడి చేతిని స్పృశించాలని - కొంటెగా మళ్లీ గిల్లి ఆస్వాదించాలని ఆశగా ఉందే అంటూ చెవిలో గుసగుసలాడింది .
లావుపాటి సిస్టర్ : లవ్ యు వే అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది . వెంటనే కోపంతో ఒసేయ్ ....... మహేష్ గారిని గిల్లినందుకు మరొకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించు .......
యాహూ ...... అంటూ ఉర్రూతలూగుతూ నా దేవకన్య ముందు చేతిని చాపాను - థాంక్యూ థాంక్యూ సిస్టర్ ........
సిస్టర్ : ఊ ...... కానివ్వవే లేకపోతే మేము గిల్లేస్తాము నిన్ను .......
దేవకన్య : నో నో నో ok ok , హీరోగారూ ...... మీకు వీలైనప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు బిజినెస్ మేనేజ్మెంట్ గురించి డీటెయిల్ గా explain చేస్తారా - అందులో నేను కాస్త వీక్ అంటూ చేతిని అందించింది .
అమ్మా దుర్గమ్మా ....... నన్ను ఇలా కరుణించావా తల్లీ ....... , అమ్మకు ఇష్టమైన దేవకన్యను నా చెంతకు చేర్చినందుకు రేపే మీ దర్శనం చేసుకుంటాను అని ప్రార్థించి , సుకుమారంగా దేవత చేతిని అందుకుని పులకించిపోతున్నాను - మహి గారూ ....... నేనెప్పుడూ ఫ్రీ నే మీ ఇష్టం , రేయ్ మహేష్ అంటూ చిటికె వేసి explain చెయ్యి అంటూ ర్యాగింగ్ లా ఆర్డర్ వెయ్యండి - బుద్ధిగా నాకు తెలిసినదంతా explain చేస్తాను .
సిస్టర్స్ : Wow ....... how romantic అంటూ ఆనందిస్తున్నారు .
దేవకన్య : లోలోపలే ఎంజాయ్ చేస్తూనే , స్స్స్ ...... ఫ్రెండ్స్ చేతిని నలిపేస్తున్నాడు అంటూ మళ్లీ నాచేతిని గిల్లేసి తనివితీరినట్లు భుజంపై చిన్న దెబ్బవేసి కోపంతో చూస్తూ బయటకువెళ్లిపోయారు .
యాహూ ...... గిల్లడమే కాకుండా కొట్టారు అంటూ ఎంజాయ్ చేస్తున్నాను .
చుట్టూ సిస్టర్స్ కోపంతో చూస్తున్నారు .
నో నో నో సిస్టర్స్ ...... అతిసుకుమారంగా అందుకున్నాను తప్ప నలపలేదు , మహిగారు ........
సిస్టర్ : మహేష్ గారూ ...... ఏదీ ఒకసారి మీ చేతిని ఇవ్వండి అని పట్టుకుని , soooo సాఫ్ట్ .......
మరి మహిగారికి ఎందుకు అలా అనిపించింది . కోపంతో వెళ్లిపోతున్నారు , ఎంత దూరం వెళ్లారో .........
సిస్టర్ : అది మరింత సాఫ్ట్ మహేష్ గారూ ....... - కోపంతో కాదు నవ్వుకుంటూ వెళ్ళింది - అయినా మీరు ఫాలో అవ్వకుండా అది అడుగుకూడా వెయ్యదు .
ఏంటి సిస్టర్ .........
సిస్టర్ : అదే అదే మేము తోడుగా వెళ్లకపోతే అడుగుకూడా వెయ్యదు , మేమంటే అంత ఇష్టం దానికి రండి కావాలంటే చూయిస్తాను అంటూ క్లాస్రూం బయటకు వచ్చి చూస్తే ....... అక్కడే ఉన్నారు .

దేవకన్య : అప్పటివరకూ నవ్వుతున్నట్లు అనిపించింది - నన్ను చూడగానే సడెన్ మార్పు కూడా కనిపించనట్లు అనిపించింది . ఫ్రెండ్స్ ...... ఎంతసేపు wait చెయ్యాలి ఆకలేస్తోంది రండి అంటూ సిస్టర్స్ చేతులను అందుకుని చిరునవ్వులు చిందిస్తూ - మధ్యమధ్యలో వెనక్కుతిరిగి రుసరుసలాడుతూ చూస్తూ బయటకువచ్చి బిల్డింగ్స్ వెనుకకు నడిచారు .
వెనుకకు తిరిగిన సిస్టర్ వైపు ఎక్కడికి అని అడిగాను .
సిస్టర్ : హాస్టల్ క్యాంపస్ లోనే అక్కడికి .......
అయితే నేనూ అక్కడికే సిస్టర్స్ .......

అంతలో అన్నయ్యా - బావా ....... పిలుపులు వినిపించడంతో చూస్తే దివ్యక్క - బావ , సెక్యూరిటీ ఆపినట్లు మెయిన్ గేట్ దగ్గరనుండి పిలుస్తున్నారు .
పరుగునవెళ్లి సెక్యూరిటీ లాగ్ లో ఎంటర్ చేసి లోపలికి పిలుచుకునివచ్చాను .
దివ్యక్క ....... అమాంతం కౌగిలించుకుని లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా ....... గ్రేటెస్ట్ ప్రపోజల్ ఎంత ఆనందం కలిగిందో మాటల్లో వర్ణించలేను అంటూనే పార్క్ వైపు కోపంతో చూస్తున్నారు . అటువైపు చూస్తే కృష్ణగాడు - అప్పుడే చెల్లెమ్మ కృష్ణవేణితో లంచ్ షేర్ చేసుకునేదాకా వెళ్లిపోవడం చూసి సంతోషించాను .
దివ్యక్క : అన్నయ్యా ...... మేము వచ్చి 10 నిమిషాలు పైనే అయ్యింది . సెక్యూరిటీ ఆపడంతో తమ్ముడూ తమ్ముడూ బావా బావా ....... అంటూ ఎంత కేకవేసినా వినపడితేనే కదా ........
లవ్ అట్ ఫస్ట్ సైట్ దివ్యక్కా , పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లున్నాడు ఇడియట్ అంటూ నవ్వుకున్నాను . రేయ్ రేయ్ ....... అని నేను కేకలువేసినా వినిపించనంత చెల్లి మాయలో పడిపోయాడు .
దివ్యక్క : వాడి సంగతి ఇంటికివచ్చాక చెబుతానులే అన్నయ్యా - ముందు మా అన్నయ్య మనసు గెలిచిన దేవకన్యను చూడాలి .
బావగారు : బావా ...... మీ అక్కయ్య వచ్చినది మీకోసం కాదు మీ మీ దేవకన్యలను చూడటానికి - మీ లవ్ విషయం తెలియగానే క్లాస్ లు వద్దు ఏమీ వద్దు వెళదాము వెళదాము అంటూ ఒకటే అల్లరి - ముఖ్యమైన ల్యాబ్ ఉండటంతో పూర్తవగానే పిలుచుకునివచ్చాను .
దివ్యక్క : అన్నయ్యా అన్నయ్యా ...... మీ దేవకన్య ఎక్కడ ఎక్కడ ? .
కృష్ణగాడి .........
దివ్యక్క : మమ్మల్ని కనీసం పట్టించుకోని వాడి గురించి వదిలెయ్యి , ముందు మీ దేవకన్యను చూయించండి .
సిగ్గుపడుతూ అదిగో అల్లంత దూరంలో వెళుతోంది అమ్మకు నచ్చిన నా దేవకన్య మహి ..........
దివ్యక్క : నో నో నో వాళ్ళల్లో ఎవరో చెప్పకు , చూడగానే మహి ఎవరో నాకు తెలిసిపోతుంది - మా అన్నయ్య మనసు నాకు తెలియదా అంటూ వడివడిగా వాళ్ళ దగ్గరికి వెళ్లారు .
నవ్వుకుని , బావగారితోపాటు వెనుకే వెళ్ళాను .
సరిగ్గా హాస్టల్ ముందు వారిని చేరుకుని అందరినీ చూసి మహీ ...... wow బ్యూటిఫుల్ ఏంజెల్ అంటూ మధ్యలో ఉన్న దేవకన్యను అమాంతం కౌగిలించుకుని , చూసారా అన్నయ్యా అంటూ చేతితో సైగచేసింది .
లవ్ యు దివ్యక్కా అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
దేవకన్యతోపాటు అందరూ ఆశ్చర్యపోయి మీరు ...... ? .
దివ్యక్క : మీ కొత్త ఫ్రెండ్ ను hi hi hi ....... నా పేరు దివ్య మెడికల్ కాలేజ్ లో చదువుకుంటున్నాను , హాస్టల్ లో జాయిన్ అవుదామని వచ్చాను - మిమ్మల్ని చూడగానే కనెక్ట్ అయిపోయాను .
దేవకన్య - సిస్టర్స్ : హలో hi hi దివ్యా .......
దివ్యక్క : అంటే మనం ఫ్రెండ్స్ అయిపోయినట్లే కదా ...... , మహీ మహీ మహీ ...... ఇంత అందంగా పుట్టడం తప్పు తెలుసా , చూస్తుంటే నాకే కొరుక్కుని తినేయాలనిపిస్తుంది ఇక మగాళ్లు ఊరికే ఉంటారా ...... ? , అవునూ ...... ఇందాకటి నుండి చూస్తున్నాను వాళ్లిద్దరూ మిమ్మల్నే ఫాలో అవుతున్నారు - ఇడియట్స్ అనుకుంటాను .
దేవకన్య : అవును నా ప్రియమైన ప్రాణమైన ఇడియట్ ........
దివ్యక్క : what what మహీ .......
దేవకన్య : సిగ్గుపడుతూ సిస్టర్స్ గుండెల్లో తలదాచుకుంది .
సిస్టర్ : ఇడియట్ కాదు దివ్యా ....... , మా దేవుడు - మహిని ప్రాణంలా ప్రేమిస్తున్నారు , ఇద్దరూ ఎలా కలిశారో తెలుసా అంటూ ఆక్సిడెంట్ దగ్గర నుండి ప్రపోజ్ వరకూ వివరిస్తూ లోపలికివెళ్లిపోయారు .
Next page: Update 20
Previous page: Update 18