Update 22

దేవకన్య దగ్గరకు వెళుతూనే మొబైల్ తీసి మేనేజర్ గారికి కాల్ చేసాను .
మేనేజర్ : సర్ , మహేష్ సర్ ...... ఎలా ఉన్నారు ? .
చాలా చాలా హ్యాపీగా మేనేజర్ గారూ ...... , మేనేజర్ గారూ ...... ఒక సహాయం చెయ్యాలి వెంటనే వెంటనే ........
మేనేజర్ : సర్ సర్ సర్ ...... , కొన్నిరోజులు ముందు మీరు తీసుకున్న డెసిషన్ తో మన కంపెనీలోని ప్రతీఒక్కరూ మీకోసం ప్రాణాలర్పించేందుకు రెడీగా ఉన్నారు - ఇంకెప్పుడూ సహాయం అనిమాత్రం అనకండి . ఆర్డర్ వెయ్యండి - మాకు తెలుసు మీరు ...... మమ్మల్ని వర్కర్స్ లా చూడటం లేదని please please సర్ ఆర్డర్ వెయ్యండి - కోప్పడండి .......
హ హ హ అలాగే మేనేజర్ గారూ ...... ఆర్డర్ వేస్తున్నాను , సాయంత్రం 5 గంటలలోపు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఒక బిగ్గెస్ట్ డబల్ ఫ్లోర్స్ ప్రైవేట్ ఫ్లైట్ టేకాఫ్ కు రెడీగా ఉండాలి - ఫ్లైట్ లోపల ఎలా ఉండాలంటే ఒక ఫ్లోర్లో లగ్జరీగా కూర్చునేలా మరొక ఫ్లోర్లో దాదాపు 50 మంది ఒకేసారి డిన్నర్ చేసేలా సింగల్ లార్జెస్ట్ డైనింగ్ టేబుల్ ప్రక్కనే Dj లైట్స్ తో డాన్స్ ఫ్లోర్ ....... 50 మంది ఒకేసారి పార్టీ చేసుకునేలా ఉండాలి - పార్టీ అంటున్నామని ఆల్కహాల్ సెట్ చేసేరు దాని జోలికి మాత్రం పోవద్దు - ఫ్లైట్ లో ఒక్క మందు బాటిల్ కూడా ఉండకూడదు - నేనెక్కడికి తీసుకెళ్లమంటే అక్కడకు తీసుకెళ్లే పైలెట్స్ - ఎయిర్ హోస్టెస్సెస్ ...... ఇంకా ఇంకా ......
మేనేజర్ : సర్ సర్ సర్ ....... మీరు ఏమికోరుకుంటున్నారో నాకు అర్థమైపోయింది , మన కంపెనీకి తెలియని ప్లేన్ కంపెనీస్ అంటూ లేవు , మోస్ట్ లగ్జరీయోస్ ఫ్లైట్ ను సెట్ చేసే బాధ్యత నాది , నేషనల్ - ఇంటర్నేషనల్ ...... అన్నీ ఎయిర్పోర్ట్స్ నుండి లాండింగ్ పర్మిషన్ తీసుకుంటాను , సాయంత్రం 5 లోపు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో రెడీగా ఉంటుంది , కాల్ చేసినా చాలు కానీ మాకిష్టమైన చైర్మన్ గారికోసం ఇప్పుడే ఎయిర్పోర్ట్ కు వెళుతున్నాను సర్ .......
మేనేజర్ గారూ ..... ప్రస్తుతానికి నేషనల్ పర్మిట్ చాలు - థాంక్ ........
మేనేజర్ : నో నో నో సర్ please please ఇది నా విధి బై సర్ ........
నవ్వుకుని పరుగుతీసాను . రేయ్ ...... 5 గంటలకు ఫ్లైట్ రెడీ అంటూ ప్రక్కనచూస్తే , వాడు అక్కడే బుంగమూతిపెట్టుకుని నిలుచున్నాడు . రేయ్ రేయ్ మామా ఏమైందిరా .......
కృష్ణ : నీ చెల్లి మరి .......
రేయ్ రేయ్ ఇంత సెట్ చేసాము , నా చెల్లిని వదిలి వెళతామా చెప్పు , ప్లాన్ చేద్దాములే ........
కృష్ణ : లవ్ యు రా మామా అంటూ వెనుక వీపుపైకి జంప్ చేసాడు .
వాడిని ఎత్తుకునే మెయిన్ బిల్డింగ్ వరకూ వచ్చి వెళ్లు వెళ్లు చెల్లి దగ్గరకువెల్లు , 10 నిమిషాలు అని ప్రామిస్ చేసి 20 నిమిషాలు అయ్యింది , నేనూ అయిపోయాను అంటూ డబల్ వేగంతో సీనియర్ క్లాస్ చేరుకున్నాను .

ఆశ్చర్యం ....... దేవకన్య - సిస్టర్స్ హ్యాపీ అవుతారని అనుకుంటే సీనియర్ బాయ్స్ వాళ్ళకంటే ఉత్సాహంగా లెక్చరర్ ఉన్నప్పటికీ hi మహేష్ hi మహేష్ ...... అంటూ చేతులూపడం చూసి దేవకన్య - సిస్టర్స్ ...... షాక్ లో ఉండిపోయారు .
పెదాలపై చిరునవ్వులతో may i come in సర్ .......
లెక్చరర్ : మహేష్ ...... ? , క్లాస్ కు రాగానే నీకోసమే చూసాను come in come in అంటూ బోర్డ్ పై డ్రా చేస్తున్నారు .
థాంక్యూ సర్ ....... , hi hi సీనియర్స్ అంటూ హైఫై చేస్తూ వెళ్లి వెనుక కూర్చున్నాను.

దేవకన్య అందమైన కోపంతో చూసి బోర్డువైపుకు తిరిగారు - సిస్టర్స్ అందరూ చిరుకోపాలతో నావైపు చూస్తున్నారు , విద్యుల్లేఖ సిస్టర్ మరొక సిస్టర్ ఇద్దరూ వచ్చి నాకిరువైపులా కూర్చున్నారు అలకచెందినట్లు ........
సిస్టర్స్ : క్లాస్ కు మాకోసం రాలేదన్నమాట ...... , వెళ్ళండి మహేష్ సర్ వెళ్లి మీ సీనియర్స్ దగ్గరే కూర్చోండి .
ఈ తియ్యనైన కోపాలు అందుకా మహిగారూ - సిస్టర్స్ ....... , నేనింకా ఆలస్యం అయినందుకు అనుకున్నాను .
అదికూడా కారణమే అన్నట్లు దేవకన్య - సిస్టర్స్ ...... నావైపు కోపంతో చూసారు .
లవ్ యు లవ్ యు ....... ఆహా ...... sorry sorry మహిగారూ - సిస్టర్స్ అంటూ చెవులుపట్టుకున్నాను .
మొదట దేవకన్య - ఆ వెంటనే సిస్టర్స్ అందరూ నవ్వేశారు .
ఉమ్మా ఉమ్మా ....... అంటూ దేవకన్యకు వదలబోయి , దేవకన్య చూసిన చూపుకు సీనియర్స్ వైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
సిస్టర్స్ : మాకు తెలుసులే ....... , మీకు ...... మాకంటే , వాళ్లంటేనే ఇష్టమైపోయారు .........
అయితే కోపంతో కొట్టొచ్చుకదా సిస్టర్స్ అండ్ ....... అంటూ నా హృదయం పరవసించేలా ముసిముసినవ్వులు నవ్వుతున్న దేవకన్యవైపు చూస్తున్నాను .
లెక్చరర్ : సైలెన్స్ ........
ష్ ష్ ష్ ...... దేవకన్యను డిస్టర్బ్ చెయ్యకూడదు అని నోటికి తాళం వేసాను .
దేవకన్య : సూపర్ అంటూ సైగచేసి అటువైపుకు తిరిగారు .

క్లాస్ పూర్తయ్యేంతవరకూ డిస్టర్బ్ చెయ్యలేదు . నెక్స్ట్ క్లాస్ ఫ్రీ కావడంతో సీనియర్స్ అందరూ లేచి బయటకువెళుతూ మహేష్ మహేష్ క్యాంటీన్ అని పిలిచారు .
నో నో నో యు క్యారి ఆన్ , మే బీ నెక్స్ట్ టైం ........
సీనియర్స్ : Ok ok understood , అయితే మనం బార్లో కలుద్దాము - నిన్న డ్రింక్ టచ్ చెయ్యలేదు ఈరోజు వరదలై పారాలి అని వెళ్లిపోయారు .

వాళ్ళు వెళ్ళాక సిస్టర్స్ వైపు చూస్తే తెలిసింది వెళుతూ వెళుతూ అణుబాంబు పేల్చేసి వెళ్లారని ........
దేవకన్య - సిస్టర్స్ ....... అప్పటికే మూడోకన్ను తెరిచేసి ఉండటం చూసి సైలెంట్ గా బెంచ్ పైకి లేచి లెంపలేసుకుంటూ గుంజీలు తీస్తున్నాను . మహిగారూ - సిస్టర్ ...... నెవర్ ఎవర్ అంటూ తలను అడ్డంగా ఊపుతున్నాను .
సిస్టర్స్ నవ్వుకుని , మహేష్ సర్ మహేష్ సర్ ...... స్టాప్ స్టాప్ కూర్చోండి , నిన్న మీరు తాగలేదని మరొక స్ట్రాంగ్ ప్రూఫ్ వచ్చేసింది , ఇకపై తాగరని మాకు తెలుసు అంటూ మధ్యలో కూర్చోబెట్టుకున్నారు .
దేవకన్య అటువైపుకు తిరిగి కొప్పుడుతున్నారో - నవ్వుతున్నారో అర్థం కాక సిస్టర్స్ ను అడిగాను .
సిస్టర్స్ : రెండూనూ మహేష్ సర్ ....... , ఒకవేళ మమ్మల్ని వదిలి క్యాంటీన్ కు కానీ వెళ్లి ఉంటే .......
నో నో నో ...... , నా హార్ట్ ఇక్కడ ఉండగా నేనెలా వెళతాను ......
సిస్టర్స్ : wow ...... how రొమాంటిక్ , విన్నారా మహి డార్లింగ్ గారూ .......
( దేవకన్య తియ్యనైన జలదరింపుకు లోనై అంతులేని ఆనందంతో పులకించిపోతున్నారు ) బయటకు మాత్రం నావైపుకు తిరిగి వేలితో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు .
లవ్ యు ........
మళ్లీ స్వీట్ వార్నింగ్ ........
తియ్యదనంతో స్వీట్ వార్నింగ్ ఇచ్చినందుకు థాంక్యూ మహిగారూ .......
దేవకన్య : స్వీట్ కాదు , హాట్ వార్నింగ్ .......
అయినా కూడా సో సో soooo థాంక్యూ ....... , కృష్ణగాడు గుర్తుకురావడంతో ..... మహిగారూ మహిగారూ ...... ఫ్రీ క్లాస్ కదా నాతోపాటు బయటకువస్తారా ...... ? .
దేవకన్య : దెబ్బలుపడతాయి .......
నేనెప్పుడో రెడీ మీదే ఆలస్యం అంటూ గుండెలపై చేతిని వేసుకున్నాను .
దేవకన్య : లోలోపల ఎంజాయ్ చేస్తూనే వాట్ ...... ? అన్నారు .
నో నో నో తప్పుగా అనుకోకండి , మీరు అంటే మీరంతా అని అర్థం , మీరంతా ఒక్కటే అని నా అభిప్రాయం ........
సిస్టర్స్ : థాంక్యూ మహేష్ సర్ ...... , ఈ క్లాస్ మాత్రమే కాదు నెక్స్ట్ క్లాస్ కూడా ఫ్రీనే , మేమైతే రెడీ ........
Please మహిగారూ ........
తియ్యనైన కోపంతో లేచి నిలబడ్డారు .
లవ్ యు లవ్ యు సో సో sooooo మచ్ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వర్షం కురిపించాను . దేవకన్య ...... నావైపు చూడగానే సైలెంట్ అయిపోయి చేతులుకట్టుకుని తలదించుకున్నాను .
సిస్టర్స్ అందరూ నవ్వుకుంటున్నారు .
తియ్యదనంతో నవ్వుకుని , మహిగారూ - సిస్టర్స్ ....... బయటకు వచ్చెయ్యండి క్యాబ్స్ రెడీ చేస్తాను అని పరుగున మెయిన్ గేట్ చేరి ఐదారు క్యాబ్స్ ఆపాను .

మహిగారూ - సిస్టర్స్ ....... please అంటూ క్యాబ్స్ డోర్స్ తెరిచాను . అందరూ ఎక్కి కూర్చున్నారు . ఖాళీగా ఉన్న చివరి క్యాబ్ లో కూర్చోబోతుంటే .......
మహేష్ సర్ మా క్యాబ్ లో ఒకరికి ప్లేస్ ఉంది అంటూ విద్యు సిస్టర్ పిలిచారు .
కమింగ్ సిస్టర్ అంటూ మొదట ఉన్న క్యాబ్ దగ్గరికివెళ్ళిచూస్తే క్యాబ్ లో దేవకన్య కూడా ఉండటం చూసి లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను .
వెనుక ప్లేస్ ఉన్నప్పటికీ - కూర్చోవాలని ఉన్నప్పటికీ , దేవకన్య ఆగ్రహాన్ని తట్టుకోలేనని డ్రైవర్ ప్రక్క సీట్లో కూర్చున్న సిస్టర్ ను వెనుక కూర్చోమన్నాను .
సిస్టర్ : నో నో నో మహేష్ సర్ ...... , నాకెప్పుడూ ముందుసీట్లో కూర్చోవడమే ఇష్టం , మా ఫ్యామిలీ కూడా ఇంతే నేనుంటే ముందు సీట్లో ఎవ్వరూ కూర్చోరు , నేనంటే అంత భయం .......
అయితే నాకు కూడా భయమే సిస్టర్ .......
దేవకన్య - విద్యు సిస్టర్ నవ్వుకున్నారు . మహేష్ సర్ ...... మిమ్మల్ని పిలిచినది వెనుక కూర్చోవడానికే ......
అలాగే సిస్టర్ అంటూ మధ్యలో సిస్టర్ - దేవతకు మరొకవైపు కూర్చుని , ఎక్కడకు వెళ్ళాలో చెప్పి దేవకన్యనే చూస్తూ ఆనందిస్తున్నాను .
దేవకన్య : కొరుక్కుని తినేస్తారా హీరోగారూ అలా చూస్తున్నారు - చాలు చాలు ......
అంతకంటే అదృష్టమా మహిగారూ ....... అంటూ గుండెలపై చేతి వేసుకున్నాను .
దేవకన్య : what ? .
ఏమీ లేదు ఏమీ లేదు అంటూ నవ్వుకున్నాను .
దేవకన్య : అయినా అలానే చూస్తున్నారు - అవునూ ...... నన్ను చూడగానే చేతిని ఛాతీపై వేసుకుంటారు .......
నో నో నో మహిగారూ ...... , నేను వేసుకోను - నా దేవకన్యను చూడగానే ఆటోమేటిక్ గా చెయ్యి ఛాతీపైకి కాదు హృదయం చెంతకు చేరిపోతుంది . ఎందుకంటే అక్కడ ఉన్నది ఇద్దరే కదా ........
సిస్టర్ : ఆ ఇద్దరూ ఎవరు మహేష్ సర్ అంటూ ముసిముసినవ్వులతో అడిగారు .
దేవకన్య : తెలిసే అడుగుతున్నావు కదూ అంటూ సిస్టర్ బుగ్గను గిల్లేసారు .
స్స్స్ ...... ప్రతీసారీ నన్నే గిల్లేస్తుంది , నేను హార్ట్ అయ్యాను దీనిప్రక్కన కూర్చోను అంటూ లేచి , మహేష్ సర్ మధ్యలోకి రండి .......
సిస్టర్ ...... ? అంటూ దేవతవైపు భయపడుతూ చూస్తున్నాను .
సిస్టర్ : దానికి భయపడుతున్నారా ...... , అవసరం లేదు మధ్యలోకి రండి అంటూ అవలీలగా నన్ను లాగేసి విండో ప్రక్కన కూర్చున్నారు .

దేవకన్య డ్రెస్సును కూడా తాకకుండా కూర్చున్నాను .
విద్యు సిస్టర్ : మహేష్ సర్ ...... నా ఆకారం చూసారు కదూ , ఈ కాస్త ప్లేస్ నాకు సరిపోతుందా అంటూ నన్ను ...... దేవకన్య వైపుకు తోసేశారు .
భుజం దగ్గరనుండి మోకాళ్ళవరకూ అతుక్కుపోవడంతో ....... , వొళ్ళంతా తియ్యని కరెంట్ షాక్కొట్టినట్లు కంటిన్యూ గా జలదరిస్తూ నన్ను నేను మరిచిపోయాను .
( నా దేవకన్య పరిస్థితి అయితే నా కంటే మధురంగా ఉండటంతో కొద్దిసేపు నిశ్శబ్దం - వేడి శ్వాసానిశ్వాసలు ....... )
ముందుగా దేవకన్య తేరుకుని చున్నీతో నుదుటిపై చెమటను తుడుచుకుని , ఇష్టం లేకపోయినా కవ్వించాలన్నట్లు హీరోగారూ ....... డిస్టన్స్ .
సిస్టర్ వైపు జరిగాను .
సిస్టర్ : మహీ డార్లింగ్ ..... మాకు వద్దా ప్రైవసీ అంటూ కాస్త బలంగా తోసారు .
దేవకన్య మీదకు పూర్తిగా ఒరిగి లవ్ ...... sorry sorry మహిగారూ అంటూ కదలకుండా కూర్చున్నాను .
దేవకన్య : Its alright ....... నా డార్లింగ్ ఎప్పుడూ ఇంతే , దెబ్బ తగల్లేదు కదూ ......
లేదు లేదు మహిగారూ ...... , దేవకన్య కోప్పడలేదన్న సంతోషంలో యాహూ ..... అమ్మాదుర్గమ్మా థాంక్యూ థాంక్యూ అంటూ ప్రార్ధిస్తున్నాను .
నా కేకకు డ్రైవర్ ఉలిక్కిపడి సడెన్ బ్రేక్ వేసాడు .
నవ్వుకుని , sorry చెప్పి పోనివ్వమన్నాను . సడెన్ గా బ్రేక్ వెయ్యడంతో ముందుకు పడిపోకుండా దేవకన్య నా చేతిని పడుకున్నారని తెలిసి ఇక నా ఆనందాలకు అవధులు లేకుండాపోయాయు .
దేవకన్య : హలో హలో హీరోగారూ ...... ఈ సంతోషం దేనికోసం .......
కళ్ళతో పట్టుకుని ఉండటం చూయించాను .
దేవకన్య : వెంటనే తీసేసుకుని నా చేతినే పట్టుకుంటారా అని చేతిపై గిల్లేసి కోపంతో చూస్తున్నారు .
నేను పట్టుకున్నానా ........ ? .
దేవకన్య : అవును మీరే పట్టుకున్నారు , ఒప్పుకోండి లేకపోతే నాకు మరింత కోపం వచ్చేస్తుంది - ( ఈ కోపం పట్టుకున్నందుకు కాదు , మరికొంతసేపు అలాగే పట్టుకొనివ్వక పోనివ్వకుండా ఆపినందుకు ) .
సిస్టర్ నవ్వుకుని ఎంజాయ్ మహేష్ సర్ అంటూ చెవిలో గుసగుసలాడి అటువైపుకు తిరిగారు .
దేవకన్య : ఒప్పుకోండి లేకపోతే మళ్లీ గిల్లేస్తాను .......
Please మహిగారూ చేతిపైననా లేక బుగ్గిమీదనా ? .......
దేవకన్య : చేతిపై కాస్త గట్టిగానే గిల్లేసారు - గిల్లేస్తూనే ఉన్నారు .
కెవ్వుమని కేకవేశాను . Ok ok నేనే పట్టుకున్నాను నేనే పట్టుకున్నాను అని చెప్పడంతో వదిలి , గుడ్ అంటూ నవ్వుకుంటున్నారు . నా చేతిపై కందిపోయి ఉండటం చూసి మహేష్ ...... అంటూ హృదయం పులకించేలా ప్రాణంలా పిలిచి కళ్ళల్లో చెమ్మతో సున్నితంగా రుద్దుతున్నారు . ల ....... sorry sorry మహేష్ సర్ ........ కోపంలో .......
యాహూ ....... , మహిగారూ ....... నాకు ఇక్కడికిక్కడే డాన్స్ చెయ్యాలని ఉంది - అలా సున్నితంగా స్పృశిస్తే నొప్పి పోదు .......
దేవకన్య : మరెలా ........
ము ము ముద్దుపెడితే ........
అంతే దేవకన్య మూడోకన్ను తెరిచి భుజం పై దెబ్బలువేస్తున్నారు .
ఏమి అదృష్టం టచ్ - గిల్లారు ...... ఇప్పుడు కొడుతున్నారు రేపు ముద్దు మరియు కొరికేస్తారేమో .......
దేవకన్య : మహేష్ సర్ మిమ్మల్నీ ....... , డార్లింగ్ విద్యు ఇంతకూ ఎక్కడికి వెళుతున్నామో కనుక్కో హీరోగారిని అంటూ నవ్వుని ఆపుకుంటున్నట్లు తెలుస్తోంది .
సిస్టర్ : మహేష్ సర్ ...... ఇలా అడగకూడదు , ఎందుకంటే మీరంటే మాకు నమ్మకం , మీతో ఎక్కడికైనా వస్తాము .
మహిగారూ - సిస్టర్స్ ...... ఎక్కడికంటే , చెల్లి కృష్ణవేణి ఇంటికి అంటూ విషయం చెప్పాను - మీరే ఎలాగైనా ఒప్పించాలి లేకపోతే వాడు బాధపడతాడు - వాడు బాధపడితే ఇక్కడ హృదయంలో ఉన్న అమ్మ - నా దేవకన్య కూడా బాధపడతారు - ఫైనల్ గా నేనూ బాధపడతాను .
దేవకన్య : కృష్ణ అన్నయ్య కోసం మేము రెడీ ...... అవునూ ఇంతకూ సాయంత్రo ఎక్కడికి వెళుతున్నాము .
సిస్టర్ : నీకు సర్ప్రైజ్ డార్లింగ్ .
కదా ....... నా దేవకన్యకు పార్టీ గురించి తెలియదు - సర్ప్రైజ్ ..... థాంక్యూ సిస్టర్ అంటూ హైఫై కొట్టుకున్నాము .
నా దేవకన్య ok అన్నారు అంటే అమ్మతోపాటు బాధపడేవారన్నది నిజమే అన్నమాట ......
దేవకన్య : నో నో నో ...... , నాకేమీ అర్థం కాలేదు .
త్వరలోనే అర్థమౌతుందిలే మహిగారూ లవ్ ....... థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అంటూ గుండెలపై చేతినివేసుకుని మళ్లీ కన్నార్పకుండా చూస్తున్నాను .
దేవకన్య : మళ్లీ స్టార్ట్ చేశారా ...... ? , బోర్ కొట్టదా ...... ? .
నా జీవితాంతం - నా చివరి ఊపిరి ఆగిపోయేంతవరకూ చూస్తూ ఉండమన్నా సంతోషంతో చూస్తూనే ఉంటాను - ఈ జీవితానికి మిగిలి ఉన్న రెండే రెండు కోర్కెలలో రెండవది .........
దేవకన్య : విన్నావా డార్లింగ్ ........ , నేను సెకండ్ ఇంపార్టెన్స్ అని ఒప్పుకున్నారు హీరోగారూ .
సిస్టర్ : మొదటిది ఏంటో నీకు తెలియదా డార్లింగ్ ? .
దేవకన్య : " అమ్మ " , ok ok .......
దేవకన్య మాటలకు లేట్ గా బల్బ్ వెలిగినట్లు , మహిగారూ మహిగారూ ..... దేవకన్య : నవ్వుకుని , కృష్ణవేణి ఇంటికి వచ్చేసినట్లున్నాము కారు పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది అని మాట మార్చేశారు .

వచ్చేసామా అంటూ కిందకుదిగి , లోపలికివెళ్లబోతే సెక్యురిటీ అడ్డుకున్నాడు .
సిస్టర్ కు కోపం వచ్చేసి సెక్యూరిటీ ...... మేము మీ కృష్ణవేణి మేడం ఫ్రెండ్స్ వీరు అన్నయ్య , తనకు తెలిస్తే నువ్వు ఇక్కడ ఉండవు .
సెక్యురిటి : sorry మేడం - సర్ ...... , కృష్ణవేణి మేడం కాలేజ్ కు వెళ్లారు - పెద్ద మేడం పెద్ద సర్ మాత్రమే ఉన్నారు .
సిస్టర్ : మాకు కావాల్సినది కూడా వాళ్లే , గేట్ ఓపెన్ చెయ్యి .
ఒక చేతితో ...... నా చేతిని మరొకచేతితో దేవకన్య చేతిని పట్టుకుని డార్లింగ్స్ రండి అంటూ లోపలికి పిలుచుకునివెళ్లారు .
థాంక్యూ సిస్టర్ .......
సిస్టర్ : లేకపోతే మా మహేష్ సర్ నే అడ్డుకుంటాడా ? , నాకే కాదు అందరికీ చివరికి మీదేవకన్యకు కూడా కోపం వచ్చింది - చెప్పవే .......
అవునన్నట్లు తలఊపడం చూసి , మహిగారూ ...... మీకూ కోపం వచ్చిందా ...... ? .
దేవకన్య : డార్లింగ్ ...... హీరోగారి నోటిని మూసెయ్యి లేకపోతే వేసే కేకకు చుట్టుప్రక్కల ఉన్నవారంతా బెదిరిపోతారు అని నవ్వుకుంటూ వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాము .

ఎదురుగా హాల్లోని సోఫాలో కూర్చున్న మేడం వచ్చి అందరినీ చూసి , అమ్మాయిలూ ...... మీరంతా ? .
సిస్టర్ : కృష్ణవేణి సీనియర్స్ మేడం .......
మేడం : please please లోపలికి రండి . నా పేరు వసుంధర - కృష్ణవేణి అమ్మను ....... కూర్చోండి టీ కాఫీ .......
మీరు చెల్లి కృష్ణవేణి అమ్మ అంటే నమ్మకం కుదరడం లేదు అంటీ , చాలా యంగ్ గా ఉన్నారు - బ్యూటిఫుల్ ........
అంటీ : థాంక్యూ అంటూ సిగ్గుపడుతున్నారు .
దేవకన్య : మొదటి బంతినే గోల్ వేసేసావు డార్లింగ్ .......
సిస్టర్ : మరి మనమంటే అంతే ...... , అంటీ మమ్మల్ని పరిచయం చేసుకోలేదు కదూ ........
అంటీ : మీ అందరిలోకి కాదు కాదు నేను చూసిన అమ్మాయిలందరిలోకి బ్యూటిఫుల్ గర్ల్ మహి అంటూ దేవకన్యకు షేక్ హ్యాండ్ ఇచ్చారు - మహి ప్రక్కన ఎప్పుడూ ఉండే ఫ్రెండ్ విద్యుల్లేఖ అంటే నువ్వు ఇక అంటూ అందరి పేర్లు చెప్పేసారు .
అందరమూ షాక్ ........
దేవకన్య - సిస్టర్స్ : అంటీ ...... మీకెలా ...... తె ..... లు ..... సు ......
అంటీ : నవ్వుకున్నారు . విశ్వ సుందరి మహిని ప్రాణంలా చూస్తున్న ఈ హ్యాండ్సమ్ వచ్చేసి మహేష్ ....... , hi హలో మహేష్ how are you .
నేను మరింత షాక్ - అంటీ ....... ? .
అంటీ : ముందుగా మహేష్ కు - మీ అందరికీ థాంక్స్ ....... , నిన్న కాలేజ్ నుండి వచ్చినప్పటి నుండీ ఈరోజు కాలేజ్ కు వెళ్లేంతవరకూ ఆక్కయ్యలు - అన్నయ్య అంటూ నన్ను రాత్రంతా నిద్రపోనివ్వలేదు నా బంగారు తల్లి . కాలేజ్ నుండి ఎప్పుడూ లేనంత సంతోషంగా వచ్చి మమ్మీ మమ్మీ ...... అంటూ నన్ను అమాంతం పైకెత్తేసింది - నా బంగారుతల్లి అంత ఆనందంగా ఉండటం ఎప్పుడూ చూడలేదు - ఊహ తెలిసినప్పటి నుండీ ...... నాకు అన్నయ్యకానీ తమ్ముడుకానీ అక్కయ్యకానీ చెల్లి కానీ లేదని బాధపడుతుండేది - నిన్న వచ్చి మమ్మీ ....... అన్నయ్య మహేష్ , బోలెడంత మంది ఆక్కయ్యలు మహి - విద్యుల్లేఖ ...... , ఫ్రెండ్ కృష్ణ అంటూ ఆనందిస్తూనే ఉంది . బాబూ మహేష్ ...... మమ్మీ , నా ఫ్రెండ్స్ అందరికీ అన్నయ్య తమ్ముడు ఉన్నారు నాకెందుకు లేరు అని ప్రతీరోజూ బాధపడేది , నీవలన నాకోరిక తీరింది థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు .
నాకు కూడా చెల్లి అంటే చాలా ఇష్టం అంటీ - కృష్ణవేణి వలన ఆ అదృష్టం కూడా కలిగింది .
అంటీ : చాలా సంతోషం చాలా సంతోషం ...... , కూర్చోండి కూర్చోండి స్వయంగా నా చేతులతో టీ - స్నాక్స్ తీసుకొస్తాను .
దేవకన్య : పర్లేదు అమ్మా ......
అంటీ : అమ్మా ...... ఆనందబాస్పాలతో దేవకన్యను - సిస్టర్ ను కౌగిలించుకున్నారు - sorry sorry ......
సిస్టర్ : పర్లేదు అంటీ ...... , మన విశ్వ సుందరికి " అమ్మ " మాట వింటే చాలు పూనకాలు వచ్చేస్తాయి - అలానే హ్యాండ్సమ్ మహేష్ గారికి కూడానూ ......
అంటీ : చాలా సంతోషం ......
దేవకన్య : అమ్మా ....... మేము వచ్చిన కారణం .
అంటీ : ముందు టీ స్నాక్స్ అలానే లంచ్ టైం వరకూ ఉండి లంచ్ చేసుకుని వెళ్ళాలి .
దేవకన్య - సిస్టర్స్ : అమ్మా - అంటీ .......
అంటీ : ప్రామిస్ ప్రామిస్ అంతే ....... , అమ్మ మాట కాదంటారా చెప్పండి అంటూ లోపలికివెళ్లారు .
దేవకన్య : అమ్మా ...... నేనూ హెల్ప్ చేస్తాను అంటూ సిస్టర్ తోపాటు లోపలికివెళ్లారు .
దేవకన్య చేతి కాఫీ - స్నాక్స్ తినబోతున్నాను యాహూ ...... అంటూ కేకవెయ్యబోయి ఆగిపోయాను .
దేవకన్య విన్నట్లు తియ్యనైన కోపంతో వచ్చి , ఎక్కడున్నామో కూడా చూసుకోకుండా కేకలు వెయ్యడమేనా అంటూ చేతిపై సున్నితంగా గిల్లేసి నవ్వుకుంటూ వెళ్లారు .
ఆఅహ్హ్ ...... అంటూ గుండెలపై చేతినివేసుకుని సోఫాలోకి పడిపోయాను .
సిస్టర్స్ నవ్వుకుంటూ కూర్చున్నారు .

10 నిమిషాలకు టీ - స్నాక్స్ తీసుకొచ్చారు . స్వయంగా దేవకన్య చేతులమీదుగా అందుకుని లవ్ యు చెప్పాను .
దేవకన్య : అమ్మ అంటూ బుగ్గపై అతి సున్నితంగా కొట్టారు .
ఆఅహ్హ్ ...... ఈరోజును ఎప్పటికీ మరచిపోలేను అంటూ పరవసించిపోతున్నాను .
అంటీ : నేనేమీ అనుకోనులే మహీ తల్లీ ...... , మహేష్ కళ్ళల్లో అంత ప్రేమను చూసాను .
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అంటీ ...... , మీ మహి తల్లికి ఎప్పుడు కనిపిస్తుందో ఏమిటో .......
దేవకన్య : కనిపిస్తుంది కనిపిస్తుంది , ముందు టీ జాగ్రత్తగా పట్టుకోండి తొడపై పడితే చుర్రుమంటుంది అని నవ్వుకున్నారు .
టీ తాగుతూ - స్నాక్స్ తిన్నాము . అమ్మా ...... మేము రావడానికి కారణం ఏమిటంటే ...... , అమ్మా ...... అంకుల్ ......
అంటీ : అంకుల్ ఇంట్లోనే ఉన్నారు మీరొచ్చారని తెలిస్తే ఆనందిస్తారు . శ్రీవారూ శ్రీవారూ ...... ఎప్పుడూ బిజినెస్ బిజినెస్ కిందకువచ్చి ఎవరొచ్చారో చూడండి .
కమింగ్ అంటూనే వచ్చి పైనుండే మహేష్ సర్ మహేష్ ...... అంటూ స్టెప్స్ పై పడిపోతారేమోనన్న వేగంతో వచ్చి కౌగిలించుకున్నారు రియల్ ఎస్టేట్ పార్ట్నర్ రవి గారు - I know i know నిన్న మహేష్ అన్నయ్య అని నా బంగారుతల్లి చెప్పినప్పుడు , హీరోలా ఉన్నారా అంటే అంతకంటే హ్యాండ్సమ్ అని చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది మీరే అయి ఉంటారని ....... శ్రీమతీ ...... మన మహేష్ , శ్రీమతి ...... టీ కాఫీ ఇచ్చావా ? .
స్నాక్స్ కూడా ఇచ్చారు రవిగారూ ....... , అంటీ సో స్వీట్ ......
అంటీ : థాంక్స్ మహేష్ ....... , మీగురించి మాట్లాడని రోజంటూ లేదు అంకుల్ .....
రవి గారు : మహేష్ లంచ్ కూడా చెయ్యాలి అంటూ చేతిని చుట్టేసిమరీ మరీ కూర్చోబెట్టుకున్నారు .
సిస్టర్ : అంకుల్ ....... మహేష్ సర్ అంటే అంత ఇష్టమా .......
అంకుల్ : చాలా చాలా అమ్మాయిలూ ....... , మా ఇంటికి రావడం అదృష్టం - మహేష్ గారే మా బంగారుతల్లి అన్నయ్య అయినందుకు ఇక ఎంత ఆనందమో మాటల్లో చెప్పలేను - శ్రీమతి గారూ ...... ఇంకా ఇక్కడే ఉన్నారే వెళ్లి భోజనం రెడీ చెయ్యండి - పనిమనుషులు కాదు నువ్వే స్వయంగా చెయ్యి కావాలంటే నేనుకూడా సహాయం చేస్తాను .
సిస్టర్ : అంకుల్ అంకుల్ క్లాస్సెస్ ఉన్నాయి లేకపోతే ఖచ్చితంగా లంచ్ చేసి వెళ్ళేవాళ్ళము . మహేష్ సర్ ....... ఇక మేము అవసరం లేదు మీరు అడిగితే కాదనరు కానివ్వండి మేము వెళతాము అని నవ్వుతున్నారు .
అవును రవి గారూ ....... క్లాస్సెస్ ఉన్నాయి , మరొకసారి వస్తాము కదా నా చెల్లి ఇల్లు , వస్తూనే ఉంటాము .
రవి గారు : ఆ మాట అన్నారు చాలా చాలా సంతోషం .
రవిగారూ ....... మీకు తెలుసు , చెల్లి - మేమంతా ఒకే కాలేజ్ ....... , వీరికి - చెల్లికి పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను నిన్న జరిగిన అపరాధం వలన , మీరు ఒప్పుకుంటే చెల్లిని తీసుకెళతాను . సేఫ్ గా తీసు .......
ఒప్పుకోవడం ఏమిటి , మా బంగారుతల్లి ఎవరు మాకు ఆప్తులైన మహేష్ గారి చెల్లెలు - ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు , ఎన్నిరోజులైనా తీసుకెళ్లవచ్చు .
దేవకన్య : సాయంత్రం మాత్రమే అంకుల్ .......
సిస్టర్ : డార్లింగ్ సాయంత్రం మరియు రేపు కూడానే ...... , రేపు పబ్లిక్ హాలిడే కదా ........
రవి గారు : నీ ఇష్టం మహేష్ ...... , తను నీ చెల్లెలు ...... ఈ మాత్రం దానికి నువ్వు వచ్చావా ..... ? , మెసేజ్ పెట్టినా సరిపోయేది . లేదు లేదులే ...... ఇంటికి వచ్చావు సంతోషం .
రవిగారూ ...... మీరు , నాపై ఉంచిన నమ్మకానికి మీతో నిజం చెప్పకుండా ఉండలేను - చెల్లిని ...... నా ఫ్రెండ్ లవ్ చేస్తున్నాడు , ఎంతగా అంటే ప్రాణం కంటే ఎక్కువగా , కన్నీరు పెట్టించకుండా చూసుకుంటాడు . అంత ప్రేమను చూయించినా చెల్లి మాత్రం మీపై ఉన్న ప్రేమకు - గౌరవానికి కట్టుబడి ఫ్రెండ్ లానే మూవ్ అవుతోంది .
రవి గారు : ఫ్రెండ్ అంటే కృష్ణనే కదా ......
అవును రవి గారూ ...... , మీకు తెలుసు ఎంత మంచివాడో - కాలేజ్ లో చేరిన స్టూడెంట్స్ లో టాప్ ర్యాంకర్ ....... నాతో సమానమైన ఆస్తి కలవాడు - మీకు ఇష్టమైతేనే కలుస్తాడు లేకపోతే ...... అంటూ కళ్ళల్లో చెమ్మతో చెప్పాను .
రవి గారు : అన్నయ్య తోడుగా - అన్నయ్య ప్రాణస్నేహితుడు ప్రేమగా మా బంగారుతల్లిని చూసుకోవడం కంటే మాకింకేమి కావాలి - ఎవరో తెలియని వాడి ఇంటికి పంపించే బదులు , ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే తన అన్నయ్య ఇంటికే పంపించడం కంటే సంతోషం ఏముంటుంది - శ్రీమతీ ఏమంటావు ......
అంటీ : దేవుడే మన ఇంటికే వచ్చి వరాలు ఇస్తే కాదనగలమా ........ ? - ప్రస్తుతం నేను పొందుతున్న సంతోషాన్ని ఏ తల్లీ పొంది ఉండదు .
రవి గారూ - అంటీ ....... థాంక్యూ థాంక్యూ sooooo మచ్ , ఇక మేము వెళ్ళొస్తాము .
రవి గారు : మరి లంచ్ .......
సిస్టర్ : బంధువులు అయిపోయారు కదా అంకుల్ ...... , లంచ్ ఎప్పుడైనా చెయ్యొచ్చు ....... వెళ్ళొస్తాము .
అంటీ - రవిగారు : సంతోషం అంటూ మెయిన్ గేట్ వరకూ వచ్చి వదిలారు .

అంటీ కు - రవి గారికి బై చెప్పేసి సంతోషంతో బయలుదేరాము .
దేవకన్య : హీరో గారు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు , ఒక పనిమీద వచ్చి ఫ్రెండ్ - చెల్లి లైఫ్ సెటిల్ చేసేసారు . హీరో గారు కాలేజ్ లోనే హీరో అనుకున్నాము బయట కూడా హీరోనే ...... , చూస్తుంటే అంకుల్ మీ ఫ్యాన్ అనుకుంటాను .
ఇంచుమించు ....... , రెండు నెలల ముందు వైజాగ్ వచ్చినప్పుడు వారి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ద్వారానే లవ్లీ హోమ్ దొరికింది - ఆ ప్రసస్ లో చాలా క్లోజ్ అయ్యాము - అదృష్టం కొద్దీ చెల్లి ....... వాడు హ్యాపీ .......
దేవకన్య : మరి తమరు .......
గుండెలపై చేతినివేసుకుని అమ్మ - దేవకన్య ...... , అమ్మ ...... గుండెల్లో - దేవకన్య ....... గుండెల్లో మరియు నా ఎదురుగా ...... , ఇంతకంటే ఏమికావాలి I am the most happiest person on earth .......
దేవకన్య : ఇలాంటివి చెప్పమంటే చెబుతూనే ఉంటారు - మీ enjoyment ను ఎందుకు కాదనాలి కానివ్వండి కానివ్వండి ........
లవ్ ........
దేవకన్య : మళ్లీ స్వీట్ వార్నింగ్ .......
థాంక్యూ మహిగారూ ....... , మీ స్వీట్ వార్నింగ్ కోసమైనా లవ్ యు లు చెబుతూనే ఉంటాను . లంచ్ బ్రేక్ కు ఇంకా 45 మినిట్స్ టైం ఉంది మహిగారూ - సిస్టర్ ..... , డ్రైవర్ ...... బీచ్ రోడ్డుకు పోనివ్వండి . రైట్ టర్న్ తీసుకుని 5 నిమిషాలలో తీసుకెళ్లాడు . ఐస్ క్రీమ్ షాప్ ముందు ఆపించి సిస్టర్స్ - మహిగారూ ....... మిమ్మల్ని ఇంత ఎండలో పిలుచుకునివచ్చినందుకు ప్రాయశ్చిత్తంగా కూల్ కూల్ ఐస్ క్రీమ్ కొనిచ్చే అదృష్టాన్ని ప్రసాధించండి please please .......
సిస్టర్ : ఇప్పుడెందుకు మహేష్ సర్ , సాయంత్రం పార్టీలో ఎలాగో తింటాము కదా , పార్టీ కోసమని మేమంతా ఏమేమి తినాలో లిస్ట్ కూడా ప్రిపేర్ చేసాము అంటూ మొబైల్ పౌచ్ లోనుండి తీసి ఇచ్చారు .
Wow సూపర్ సూపర్ ....... నాకు సగం శ్రమ తగ్గించేశారు అని జేబులో పెట్టుకున్నాను - పార్టీలోకూడా తిందాము నా సంతృప్తికోసం నాకు తినాలని ఉంది చాలా వేడిగా ఉంది please please అంటూ షాప్ వైపు దీనంగా లొట్టలేస్తూ చూస్తున్నాను .
దేవకన్య - సిస్టర్స్ నవ్వుకున్నారు .
నవ్వితే ఒప్పుకున్నట్లే అని దిగి డ్రైవర్స్ కు wait చెయ్యమనిచెప్పి లోపలికివెళ్లాము.

సోఫాస్ - టేబుల్స్ లో కూర్చుని బాయ్స్ ద్వారా మెనూ కార్డ్స్ అందరికీ ఇప్పించి మీ ఇష్టం , నా దేవకన్య ఏది ఆర్డర్ చేస్తే సేమ్ టు సేమ్ నాకు కూడా ...... అని సిగ్గుపడుతూ చెప్పాను .
దేవకన్య : హీరోగారూ ...... మీకు సిగ్గు సూట్ అవదులే , మెలికలు తిరగకండి అని నవ్వుతూ వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకుని , మెనూలో ఉన్న అతి తక్కువ కాస్ట్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేశారు .
బాయ్స్ స్టాప్ స్టాప్ ....... సిస్టర్స్ ...... నేనంటే ఎంత ఇష్టమో ఐస్ క్రీమ్ కాస్ట్ లో నాకు తెలియాలి - మహిగారూ ....... నేనంటే ఎంత ప్రేమనో మీరు ఆర్డర్ చేసే ఐస్ క్రీమ్ ప్రైస్ లో నాకు తెలియాలి . నేనంటే ఇంతే ఇష్టం అయితే ok అవే ఆర్డర్ చెయ్యండి అని అలిగి సైలెంట్ గా కూర్చున్నాను .
అంతే మెనూ కార్డ్స్ అందుకుని మాక్సిమం ప్రైస్ గల ఐస్ క్రీమ్స్ ను రెండు రెండు ఆర్డర్ చేశారు సిస్టర్స్ ...... మహేష్ సర్ మీరంటే అంత ఇష్టం .
థాంక్యూ థాంక్యూ సిస్టర్స్ .......
నా దేవకన్య అయితే ఏకంగా అలాంటివి 5 ఆర్డర్ చేశారు .
సిస్టర్ : మహేష్ సర్ ....... ? 1 2 3 4 5 ....... ? .
యాహూ ....... అంటూ లేచి అక్కడికక్కడే మాస్ స్టెప్పులు వేస్తున్నాను .
దేవకన్య : హలో హలో హీరోగారూ ....... నాకిష్టం కాబట్టి ఇప్పటివరకూ టేస్ట్ చెయ్యలేదు - ఇలాంటి ఫ్రీ అవకాశం మళ్లీ లభించిందని ఆర్డర్ చేసాను .
మీరు అలా అనుకోండి - నేను ఇలా అనుకుంటాను లవ్ యు లవ్ యు sooooooo మచ్ .
దేవకన్య : మహేష్ సర్ ...... షాప్ లో పిల్లలున్నారు బెదురుతారు కూర్చోండి అంటూ షర్ట్ పట్టుకుని కూర్చోబెట్టారు .
సిస్టర్స్ చూశారుకదూ 1 2 3 4 5 ....... అంత ప్రేమ ......
( సిస్టర్ : దీనికే ఇలా అయిపోతే , లవ్ accept చేశాక నువ్వు చూయించే ప్రేమలో మునిగిపోతారేమోనే జాగ్రత్త .....
దేవకన్య : డార్లింగ్ నువ్వు ఊహించినదానికంటే ఎక్కువ , ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా ? , కారులో టచ్ అయిన ప్రతీసారీ కలిగిన మాధుర్యం అంతులేనిది .
సిస్టర్ : మహేష్ సర్ అదృష్టవంతులు .......
దేవకన్య : కాదు నేనే ...... , లోలోపల ఎన్ని ముద్దులుపెడుతున్నానో ......
సిస్టర్ : ఎంజాయ్ డార్లింగ్ ) కురులపై ముద్దుపెట్టారు .
బాయ్ ....... నాకు కూడా ఆ ఐదూ ........
దేవకన్య : మీకూ ఇవే ఇష్టమా హీరోగారూ ...... - నా ఒక్కరికే ఐదూ తినడం అవుతుందా చెప్పండి , కాబట్టి షేర్ చేసుకుందాము .
సిస్టర్ : మహేష్ సర్ చుట్టూ పిల్లలున్నారు please please అంటూ లేచి నా నోటిని మూసేసారు - కావాలంటే లోలోపలే ఎలాగైనా డాన్స్ చేసుకోండి .
దేవకన్య నవ్వుతూనే ఉండటం కన్నార్పకుండా చూస్తుండిపోయాను . నా దేవకన్యతో ఐస్ క్రీమ్ షేరింగ్ - అమ్మా దుర్గమ్మా ...... వరాలిస్తూనే ఉన్నారు - ఈరోజును జీవితంలో మరిచిపోను - సిస్టర్ ...... వీడియో తియ్యండి please అంటూ సైగలు చేసాను .
సిస్టర్ : Ok డన్ మహేష్ సర్ .......
దేవకన్య : Ok డన్ ఏమిటి డార్లింగ్ అంటూ చిరుకోపంతో అడిగారు .
నథింగ్ నథింగ్ ....... ఏమీలేదు మహిగారూ .......
సిస్టర్ : yes yes నథింగ్ నథింగ్ డార్లింగ్ , అదిగో మన ఆర్డర్స్ వచ్చాయి , wow చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి - డార్లింగ్స్ మనం కూడా అన్నింటినీ షేర్ చేసుకుందాము ok నా ......
సిస్టర్స్ : ok ok ........

దేవకన్య : హీరోగారూ ...... ట్రీట్ తమరిదే కదా ముందు మీరే స్టార్ట్ చెయ్యండి .
ట్రీట్ ఇచ్చినది దేవకన్య - సిస్టర్స్ కు కాబట్టి ముందు మీరే స్టార్ట్ చెయ్యాలి .
దేవకన్య : నో ముందు మీరే .......
లేదు మీరే ......
దేవకన్య : ముందు మీరే మీరే ...... అంటూ స్మైల్.
లేదు మీరే మీరే ...... స్మైల్ .
.
.

సిస్టర్స్ : సరిపోయింది , ఇలానే ఐస్ క్రీమ్ కరిగిపోయేదాకా మీరే మీరే అంటూనే ఆనందించేలా ఉన్నారు కాబట్టి ఇద్దరూ ఒకేసారి కానివ్వండి ( డార్లింగ్ నీ హీరో టేస్ట్ చేశాక తినాలని నీ కోరికని నాకు తెలుసు , ఒకేసారి తినబోయి ఆగిపో ,
దేవకన్య : లవ్ యు డార్లింగ్ అంటూ గుసాగుసలాడుకుని నవ్వుకున్నారు ) .
ఇదేదో బాగుంది మహిగారూ ...... అంటూ ఇద్దరమూ ఒకే ఐస్ క్రీమ్ చెరొకవైపు స్పూన్ తో అందుకుని తిన్నాము .
దేవకన్య : నేటిదాకా తీసుకెళ్లి స్పూన్ కింద ఉంచేశారు - ముందు హీరోగారే తిన్నారు థాంక్యూ డార్లింగ్ అంటూ సిస్టర్ ను హత్తుకుని ఎంజాయ్ చేస్తున్నారు - ఇప్పుడు నేను తింటాను , అదికూడా మీరు తిన్నచోటనే తీసుకుని తింటాను అంటూ ఐస్ క్రీమ్ ను 180 డిగ్రీస్ తిప్పి మరొక స్పూన్ తో అందుకుని తిని మ్మ్మ్ ...... యమ్మీ ...... థాంక్స్ హీరో గారూ మీరు టేస్ట్ చెయ్యడం వల్ల మరింత టేస్టీ .....
నేను చూస్తున్నది నిజమేనా ...... , నా దేవకన్య నా దేవకన్య ...... నేను తిన్న చోట ఐస్ క్రీమ్ తిన్నారు అంటూ అంతులేని ఆనందంతో అలా చూస్తుండిపోయాను .
దేవకన్య : హీరోగారూ ...... అలా ఎంతసేపు చూస్తారు , నేనెక్కడికీ వెళ్లను కానీ ఐస్ క్రీమ్ కరిగిపోయేలా ఉంది తినండి .
Ok ok ...... మహిగారూ ...... ఆ పిల్లాడు చూడండి ఎంత ముద్దుగా తింటున్నారో ....... , దేవకన్య అటువైపుతిరుగగానే ఐస్ క్రీమ్ ను 180 డిగ్రీస్ తిప్పాను .
దేవకన్య : అక్కడ పిల్లాడే లేడు కదా మహేష్ సర్ ...... , ఐస్ క్రీమ్ చూసి ఇందుకా అంటూ నా చేతిని గిల్లేసి కూర్చున్నారు .
దేవకన్య తిప్పేలోపు తినేయ్యాలి స్స్స్ ..... అంటూనే స్పూన్ తో అందుకుని తిని , wow ....... అమృతం మ్మ్మ్ మ్మ్మ్ ...... మరి దివి నుండి దిగివచ్చిన దేవకన్య టేస్ట్ చేసిన ఐస్ క్రీమ్ మరి అంటూ కళ్ళు మూసుకుని ఫీల్ అవుతున్నాను .
దేవకన్య : చాలు చాలు హీరోగారూ ....... , నిజంగా అమృతంలా ఉందా అయితే నేనూ టేస్ట్ చేస్తాను అంటూ నేను చూస్తుండగానే 180 డిగ్రీస్ తిప్పి పెదాలపై చిరునవ్వులతో తిని yes yes మహేష్ సర్ ఫస్ట్ బైట్ కంటే టేస్టీ ...... అంటూ మరొక స్పూన్ తిని ఆస్వాధిస్తున్నారు .
స్వీటెస్ట్ షాక్ ...... యాహూ ...... అంటూ కేకవేసి కుర్చీలోనే డాన్స్ చేస్తున్నాను .
చుట్టూ ఉన్న ఫ్యామిలీస్ అంతా బెదిరిపోవడం చూసి , సిస్టర్స్ అందరూ అనుకున్నదే అయ్యింది sorry sorry అనిచెప్పి నవ్వుతున్నారు .
సిస్టర్స్ ...... sorry , నా దేవకన్య మీ డార్లింగ్ .......
సిస్టర్స్ : చూసాము చూసాము , ఈరోజు మీకు అదృష్టం పట్టుకుంది మహేష్ సర్ లేకపోతే మీరంటేనే రుసరుసలాడే మీ దేవకన్య మీరు తిన్న ఐస్ క్రీమ్ తినడం ఏమిటి - ఏదో మంత్రం వేసినట్లున్నారు ఎంజాయ్ ఎంజాయ్ ....... - అవును మహేష్ సర్ ...... పార్టీ ఆకాశంలో అనిచెప్పారు కదా ఎక్కడో అర్థం కాక మెంటల్ వచ్చేస్తోంది - కొండపైననా ...... వైజాగ్ కొండలపై అలాంటి అవకాశం ఎక్కడా లేదే చెప్పండి చెప్పండి please ......
సర్ప్రైజ్ సిస్టర్స్ అంటూ నవ్వుకున్నాను .
సిస్టర్స్ : మీ దేవకన్య గారికి ఒక్కటే అనుకున్నాము , మాకు కూడా ఒక సర్ప్రైజ్ అన్నమాట ........ ok ok .
ఒక్కటే కాదు సిస్టర్స్ బోలెడన్ని సర్ప్రైజస్ అంటూ నా దేవకన్యవైపు ప్రేమతో చూస్తున్నాను .
సగం ఐస్ క్రీమ్ తిన్న తరువాత మరొకటి అందుకున్నారు - దానిని కూడా అలానే వాదులాడుకుంటూ అటూ ఇటూ తిప్పుతూ తిన్నాము ఆ తరువాత మరొకటి .....
దేవకన్య : ఇక చాలు హీరోగారూ ...... మీరు కావాలంటే సగం సగం వదిలేసినవి తినండి - మీరు ఒప్పుకుంటే ఈ రెండు ఐస్ క్రీమ్స్ ను బయట ఉన్న స్ట్రీట్ చిల్డర్న్స్ కు ఇస్తాను .
లవ్ టు మహిగారూ అంటూ గుండెలపై చేతినివేసుకుని చెప్పాను . ఈ మంచితనానికే కదా మీ ప్రేమ బానిసను అయిపోయాను .
దేవకన్య : నవ్వుకుని , ఇలా మాట్లాడటం ఎక్కడ నేర్చుకున్నారు అంటూ బుగ్గపై స్మూత్ గా కొట్టి ఐస్ క్రీమ్స్ అందుకుని బయటకు నడిచారు .
నిన్న నా దేవకన్యను చూసిన క్షణం నుండి poet లా వచ్చేస్తున్నాయి మహిగారూ ....... అందుకుగానూ నా దేవకన్యకే బోలెడన్ని లవ్ యు లు చెప్పాలి ......
దేవకన్య : అదిగో మళ్లీ అంటూ వేలితో స్వీట్ వార్నింగ్ ఇచ్చి అందమైన నవ్వులతో బయటకువెళ్లి ఆశతో ఐస్ క్రీమ్ షాప్ వైపు చూస్తున్న పిల్లలకు అందించారు . అంతలో ఎదురుగా బీచ్ లో ఉన్న స్ట్రీట్ చిల్డర్న్స్ అందరూ మేడం మేడం అంటూ పరుగునవచ్చారు .
దేవకన్య : ప్చ్ ...... అంటూనే తనతో ఉన్న డబ్బును ఇవ్వబోతే , మేడం మేడం ఐస్ క్రీమ్ కావాలి అని నిరాశతో వెనుతిరగడం చూసి బాధపడటంచూసి .......
లేచి కౌంటర్ కు వెళ్లి ఫ్రిడ్జ్ లో ఉన్న రెండు కోన్ మరియు కప్ ఐస్ క్రీమ్ బాక్సస్ అందుకుని పరుగునవెళ్లి నా దేవకన్యకు అందించాను .
దేవకన్య : పెదాలపై చిరునవ్వులతో లవ్ ...... థాంక్యూ థాంక్యూ అంటూ నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , పిల్లలూ పిల్లలూ ....... అంటూ సంతోషంతో పిలిచి ఒక్కొక్కరికి రెండు రెండు ఇచ్చారు .
థాంక్యూ థాంక్యూ మేడం కాదు కాదు అక్కయ్యా అక్కయ్యా ...... సంతోషంతో తింటూ వెళ్లిపోయారు .
దేవకన్య ముద్దుకు ఆటోమేటిక్ గా గుండెలపైకి చేతులు చేరిపోయి సంతోషంలో వెనక్కు పడిపోయాను . పడిపోకుండా సిస్టర్స్ పట్టుకున్నారు - ఇలా జరుగుతుందని ఊహించే వెనుకే వచ్చినది మంచిది అయ్యింది అంటూ నవ్వుకున్నారు .
దేవకన్య : థాంక్యూ థాంక్యూ మహేష్ గారూ ...... అంటూ వెనక్కుతిరిగిచూసి , హార్ట్ పైకి చెయ్యి చేరిపోయిందా ...... ? , మీకు ముద్దుపెట్టినది మీపై ప్రేమతో కాదు అదిగో అంతమంది పిల్లల పెదాలపై చిరునవ్వులు పూయించినందుకు సో ఎక్కువ ఫీల్ అవ్వకుండా వెళ్లి బిల్ పే చేస్తే కాలేజ్ కు వెళదాము అనిచెప్పి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
లవ్ యు అనికూడా .......
దేవకన్య : లేదు లేదు లేదు ......
అన్నారు మహిగారూ ......
దేవకన్య : లేదు లేదు ఒప్పుకోండి లేకపోతే దెబ్బలు పడతాయి .
రెండుచేతులనూ విశాలంగా చాపాను .
దేవకన్య : చేతిపై గిల్లేసి నవ్వుకుంటూ వెళ్లి క్యాబ్ లో కూర్చున్నారు .
ఆఅహ్హ్ ...... అంటూ మళ్లీ గుండెలపైకి చేరాయి చేతులు .......
సిస్టర్ : గిల్లింది కదా అందాల రాక్షసి నొప్పివేయ్యడం లేదా మహేష్ సర్ .......
స్వీట్ పెయిన్ స్స్స్ ..... , మీరు కారులో కూర్చోండి బిల్ కట్టివస్తాను .
సిస్టర్ : డార్లింగ్స్ ...... మీరు క్యాబ్స్ లో కూర్చోండి వచ్చేస్తాము అంటూ నాతోపాటు లోపలికివచ్చారు .
కౌంటర్లో కార్డ్ ద్వారా స్వైప్ చేసాను . సిస్టర్ ..... బిల్ అందుకుని 20 వేలు అంటూ ఆశ్చర్యపోయారు . Sorry మహేష్ సర్ ........
సిస్టర్ నో నో నో అంటూ మొబైల్లో నా బ్యాంక్ బ్యాలన్స్ చూయించాను . వేలితో స్క్రీన్ పై 1 2 3 4 5 6 7 8 ....... కౌంట్ చేస్తూనే షాక్ తో నా భుజం పైకి వాలిపోయారు - మహేష్ సర్ ...... నా కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి .
నెల నెలా ఒక నెంబర్ పెరుగుతూనే ఉంది సిస్టర్ కాబట్టి ...... ఏమిచేస్తారో తెలియదు మీరే ఎలాగైనా నాతో ఈ మొత్తంలో సగం అయినా ఖర్చు చేయించాలి please please please ...........
సిస్టర్ : what ...... ? , అంటూ మరింత షాక్ తో కిందకు పడిపోబోతే పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాను . సిస్టర్ సిస్టర్ అంటూ కూల్ డ్రింక్ అందించాను . కూల్ డ్రింక్ తాగుతూనే బై చెప్పేసి బయటకు తుర్రుమంటూ వెళ్లి క్యాబ్ లోకి చేరారు .
నవ్వుకుంటూ వెళ్లి క్యాబ్ ఎక్కాను . సిస్టర్ ......ఏమయ్యింది ? .
దేవకన్య : అవును డార్లింగ్ ఏమయ్యింది అలా వణుకుతున్నావు , చూడకూడనిది ఏదో చూసినట్లు .......
సిస్టర్ : అ....వును డా....ర్లింగ్ చూసాను , మహేష్ సర్ ముందు ఆ మొబైల్ దాచేయ్యండి , సగం ఖర్చు చెయ్యాలట .......
నవ్వుతూనే సిస్టర్ చేతిని అందుకుని కూల్ చేసాను .
దేవకన్య : అంతలా భయపడేలా ఏమి చూయించారు మహేష్ గారూ .....
అదీ .......
సిస్టర్ : వద్దే ...... , నేను కాబట్టి తట్టుకున్నాను , నువ్వు చూస్తే - మహేష్ గారి మాటలు వింటే జ్వరం వచ్చినా వచ్చేస్తుంది . మహేష్ సర్ ...... ముందు కాలేజ్ కు తీసుకెళ్లండి - ఆ మొబైల్ జేబులో పెట్టుకోండి please please .......
నవ్వుతూనే డ్రైవర్ ..... కాలేజ్ కు తీసుకెళ్లండి అనిచెప్పడంతో పోనిచ్చాడు .
దేవకన్య : మహేష్ గారూ ......ఇంకా గట్టిగా పట్టుకోండి వణికిపోతోంది అంటూ నా మీదుగానే సిస్టర్ మరొకచేతిని అందుకుని ముద్దుపెట్టారు హమ్మయ్యా ...... , మహేష్ సర్ అన్నీ costly ఐస్ క్రీమ్స్ తిన్నాము - పిల్లలకు రెండు బాక్సస్ పంచాము బిల్ ఎంత అయ్యింది ? .
సిస్టర్ : వద్దే ....... , బిల్ చూసి sorry చెప్పకనే చూయించారు , మహేష్ సర్ నో నో నో ....... అంటూ జేబుకు అడ్డుగా చేతిని ఉంచారు .
నాకైతే నవ్వు ఆగడం లేదు - సిస్టర్ ప్రామిస్ చేశారు అందులో సగం అనేంతలో ...... మళ్లీ వణకడం చూసి అక్కడితో ఆపేసి నవ్వుకున్నాను .
దేవకన్య : మీ సిస్టర్ భయపడుతుంటే మీకు నవ్వు వస్తోందా అని భుజం పై కోపంతో కొరికేశారు .
స్స్స్ ....... యాహూ ....... నా దేవకన్య కొరికారు నా దేవకన్య ప్రేమతో కొరికారు ....... అంటూ ఎంజాయ్ చేస్తున్నాను .
దేవకన్య : హలో హలో కొరికింది ప్రేమతో కాదు కోపంతో ...... , ముందు మీరు ఇటువైపుకు రండి నా డార్లింగ్ ఎందుకో బెదిరిపోతోంది అంటూ లేవడంతో అటు చివరకు జరిగాను . దేవకన్య మధ్యలోకి చేరగానే మహి డార్లింగ్ అంటూ గుండెలపైకి చేరి 1 2 3 4 5 ....... కౌంట్ లెస్ వే చూడగానే భయం వేసేసింది .
దేవకన్య : 1 2 3 లు ఏంటి - కౌంట్ లెస్ ఏమిటి - నాకైతే ఏమీ అర్థం కావడం లేదు .
సిస్టర్ : తెలుసుకోవాలనుకోకే నువ్వుకూడా ఇలానే అయిపోతావు అని గట్టిగా చుట్టేశారు .
దేవకన్య : నవ్వుని ఆపండి మహేష్ గారూ లేకపోతే అంటూ చేతిపై గిల్లేసారు .
స్స్ స్స్ అంటూనే నోటికి తాళం వేసాను . సరిగ్గా లంచ్ బెల్ మ్రోగే సమయానికి కాలేజ్ చేరుకున్నాము .

సిస్టర్ అయితే నావైపు బెదురుతూ చూస్తూనే దేవకన్యను వదలకుండా దిగారు .
దేవకన్య : హీరోగారూ ...... కాసేపు దూరంగా ఉండండి .
నవ్వుకుని అటువైపు దిగాను . క్యాబ్స్ కు పే చేసేసి వెనుకే లోపలికివస్తూ రేంజ్ రోవర్ పార్క్ చేసి ఉండటం చూసాను . లోపలికి చూస్తే అక్కయ్య బావగారు ...... లవ్ బర్డ్స్ తో మాట్లాడుతున్నారు .
అక్కయ్యా ........
అక్కయ్యనా అంటూ సిస్టర్స్ - దేవకన్య నావైపుకు తిరిగారు .
కాఫు కాదు మీ దివ్యగారు వచ్చినట్లున్నారు అంటూ అటువైపుకు చూయించాను .

Next page: Update 23
Previous page: Update 21