Update 24
దేవకన్య - సిస్టర్ ...... ఇరువైపుల నుండీ కోపంతో చూస్తున్నా నవ్వుతున్నట్లే అనిపిస్తోంది .
డార్లింగ్స్ డార్లింగ్స్ ....... పైకెగురుతోంది చూడండి .
అవునా అంటూ అందరూ విండోస్ నుండి చూస్తున్నారు - దేవకన్య కూడా ఎంజాయ్ చేస్తున్నారు .
హమ్మయ్యా ........
దేవకన్య : టేకాఫ్ అయ్యాక వదలములే అంటూ మళ్లీ గిల్లేసి నవ్వుకున్నారు .
కొంతమంది భయపడి ప్రక్కనున్న సిస్టర్స్ చేతిని చుట్టేసి కళ్ళుమూసుకున్నారు .
విద్యుల్లేఖ సిస్టర్ చూసి నవ్వుకుని , ఏదో ఐడియా వచ్చినట్లు దేవకన్యవైపు కన్నుకొట్టడం ఆలస్యం అప్పటివరకూ దైర్యంగా టేకాఫ్ ఎంజాయ్ చేస్తున్న దేవకన్య ఒక్కసారిగా భయంతో నా చేతిని చుట్టేయడమే కాకుండా గుండెలపై తలవాల్చారు.
ఇక నా హృదయం దగ్గర నుండీ మొదలుకుని వొళ్ళంతా పరిస్థితి ఎలా ఉందంటే ఆఅహ్హ్ ....... తియ్యనైన జలదరింపులు ఆగడం లేదు - నా దేవకన్య కురుల సువాసనకు ప్లేన్ తోపాటు నా మనసు కూడా గాలిలో తేలిపోతోంది - కదలకుండా దేవకన్య వెచ్చదనాన్ని మనసారా ఆస్వాదిస్తూ పులకించిపోతున్నాను .
నిమిషంలో ప్లేన్ టేకాఫ్ అయ్యి ఆకాశంలో సాఫీగా వెళుతోంది . సిస్టర్స్ అందరూ సంతోషంతో చప్పట్లుకొడుతూ కేకలువేస్తున్నారు .
విద్యుల్లేఖ సిస్టర్ : ష్ ష్ ష్ ...... డార్లింగ్స్ .
దేవకన్య ....... నా గుండెలపైనుండి వారి ప్లేస్ లో కూర్చుని , భయపడుతుంటే చేతులను పట్టుకోకుండా ఏకంగా కౌగిలించుకున్నారు కదూ .......
నేనా ...... ? .
దేవకన్య : ఆవును మీరే ....... ఒప్పుకోండి లేకపోతే అంటూ కొట్టబోయి , sorry లవ్ యు లవ్ యు అంటీ ....... అంటూ నా గుండెలపై చేతితో ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ...... ఏంటి నిజమేనా ? నేను చూస్తున్నది అంటూ షాక్ లో ఉండిపోయాను.
విద్యుల్లేఖ సిస్టర్ : నిజమే మహేష్ సర్ కావాలంటే గిల్లుతాను నొప్పివేస్తుంది .
స్స్స్ ....... నిజమే నిజమే ...... దేవకన్య నా దేవకన్య నా హృదయం పై ముద్దు - యాహూ ....... అంటూ కేకలువేస్తూనే సీట్ బెల్ట్ తీసేసి లేచి డాన్స్ చేస్తున్నాను .
దేవకన్య : హలో హలో ముద్దుపెట్టింది మీకు కాదు హీరోగారూ ...... అంటీ గారికి - తమరు చెప్పినది నిజమే అక్కడ అంటీ ఉన్నమాట వాస్తవం - తమరు కౌగిలించుకున్నా కొట్టకపోవడానికి కారణం అక్కడ ఉన్నంతసేపూ ....... అమ్మ ఒడిలో ఉన్నంత హాయిగా ఉంది ఒక ముద్దుకాదు ఎన్ని ముద్దులుపెట్టమన్నా పెడతాను - లవ్ యు లవ్ యు లవ్ యు సో సో sooooo మచ్ అంటీ అంటూ మళ్లీ నా హృదయం పై ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ....... అంటూ హృదయం పై చేతులను వేసుకుని ఇద్దరిమధ్యలోకి చేరిపోయాను .
అంతలో దివ్యక్క భద్రకాళీలా వచ్చి నా ముందు సుతిమెత్తని ఫ్లోర్ పై మోకాళ్లపై కూర్చున్నారు .
దివ్యక్కా ...... sorry లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులవర్షం కురిపిస్తున్నాను .
కోపం చల్లారడం లేదు అన్నట్లు తలను అడ్డంగా ఊపుతూనే ఉన్నారు .
అంతలో దేవకన్య - సిస్టర్స్ అందరూ చుట్టూ చేరి ఒక్కొక్కరూ ఒక్కొక్క భద్రకాళీ అవతారంలో కోరుక్కుతినేలా చూస్తున్నారు . దివ్యక్క - బావగారు ........ ? .
Sorry sorry సిస్టర్స్ప్- లవ్ యు మహిగారూ ...... అంటూ చిలిపినవ్వులు నవ్వుకున్నాను . Ok ok అలా మీ చూపులతోనే భయపెట్టకండి - నా రెండవ ప్రాణమైన మా అక్కయ్య ఎవరోకాదు మా లవ్లీ దివ్యక్క అంటూ రెండుచేతులతో ఒకేసారి బుగ్గలపై ముద్దులుపెట్టాను .
దివ్యక్క : అన్నయ్యా ...... మిమ్మల్నీ అంటూ ముద్దులుపెడుతున్న చేతులపై కొడుతూనే ముద్దులుపెడుతున్నారు .
లవ్ యు లవ్ యు దివ్యక్కా ....... , నోరుజారినా మంచే జరిగింది - లేకపోతే రెండురోజులపాటు నా ప్రాణమైన అక్కయ్యను ప్రాణంలా దివ్యక్కా అని పిలవకుండా ఉండటం నావల్ల కానే కాదు - అమ్మ ఆగ్రహానికి కూడా ........
దివ్యక్క : అన్నయ్యా ....... అంటూ అరచేతులపై ముద్దులుపెడుతూ ఆనందబాస్పాలతో నా మోకాళ్లపై తలవాల్చి మురిసిపోతున్నారు - అన్నయ్యా ..... అని పిలవకుండా గంటపాటు ఉండలేకపోయాను , ఇక రెండురోజులూ నేనుకూడా ఉండేదానిని కాదులే ....... - మా అన్నయ్య ఏమిచేసినా అది మంచికే లవ్ యు లవ్ యు లవ్ యు అన్నయ్యా .........
మా మంచి దివ్యక్క అంటూ వొంగి బుగ్గపై ముద్దుపెట్టాను .
దేవకన్య - సిస్టర్స్ : ఎంత మోసం ఎంత మోసం ....... దివ్యగారూ ...... ? మమ్మల్ని ఎలా మోసం చెయ్యాలనిపించింది అంటూనే నవ్వుతున్నారు .
దివ్యక్క కూడా నవ్వేసి , అంతా చేసింది అన్నయ్యే ...... మహీ - విద్యు .......
అవాక్కై నోరుతెరిచి చూస్తున్నాను .
దివ్యక్క చూసి నవ్వుకుని , అవును మహీ ....... ఇలా నటించమని బ్రతిమిలాడింది అన్నయ్యే అంటూ తొడపై గిల్లారు .
స్స్స్ .......
మహేష్ సర్ మహేష్ సర్ ....... , మహీ డార్లింగ్ మా పవర్స్ అన్నింటినీ నీకే ఇచ్చేస్తున్నాము - కొడతావో , గిల్లుతావో , రక్కేస్తావో , కొరుక్కుని తినేస్తావో నీ ఇష్టం .........
దేవకన్య : మహేష్ గారూ ....... అంటూ గుండెలపై కొట్టబోయి , అమ్మో ....... అంటీ ఉమ్మా ఉమ్మా ...... అంటూ భుజంపై కొట్టి బుగ్గను గిల్లేసి దివ్యక్క చేతిని అందుకుని చివరాఖరు సోఫాలో కూర్చున్నారు .
దేవకన్య : దివ్యగారూ దివ్యగారూ ....... అంటూ కంగారుపడుతూ అడిగారు .
దివ్యక్క : మా ఇంటి దేవకన్యా ...... కూల్ కూల్ అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి , ఇదిగో ఈ విషయం తెలుసుకుందామనే మా వదినమ్మకు ...... తన హీరో అంటే ఎంత ప్రాణమో తెలుసుకోవాలనే నేనే అన్నయ్యను బెదిరించి ఇలా ప్లాన్ చేసాను , నీ చిలిపి అల్లరి అంతా సేఫ్ గా నేనూ ఎంజాయ్ చేస్తున్నాను - పాపం అన్నయ్యకు ఏమీ తెలియదు బంగారం - వారు ప్రాణాలుపోసి రక్షించిన దేవకన్యనే ఈ అందమైన సౌందర్యారాశి అనికూడా తెలియదు - తెలిసినరోజు ఆ ఆనందం వర్ణనాతీతం ........
దేవకన్య : అవును దివ్యగారూ ...... , మా దివ్యగారే ...... నా దేవుడి ప్రాణమైన దివ్యక్క అన్నమాట అంటూ ప్రాణంలా కౌగిలించుకుని ఆనందించారు .
దివ్యక్క : మహీ - మా అందమైన వదినా ...... ఇకనుండి కూడా నీ చిలిపి అల్లరిని క్యాంటీన్యూ చెయ్యొచ్చు - నేను చూసి ఎంజాయ్ చేస్తాను .
దేవకన్య : థాంక్యూ ....... నో నో నో లవ్ యు లవ్ యు దివ్యగారూ ...... అంటూ చిరునవ్వులు చిందిస్తున్నారు .
లేచివెళ్లి హమ్మయ్యా ....... మూడవ ప్రపంచయుద్ధం మొదలవుతుందేమో అనుకున్నాను అంటూ ప్రశాంతంగా ఎదురు సోఫాలో కూర్చున్నాను .
దేవకన్య : పూర్తిగా అయితే ఆగలేదు హీరోగారూ .......
అంటే ........
దేవకన్య : అవును అంటూ సిస్టర్ తోపాటు చెరొకవైపు సోఫాలో కూర్చున్నారు .
దివ్యక్కా ........
దివ్యక్క : ప్లాన్ అంతా పాడుచేసినందుకు పనిష్మెంట్ అనుభవించాల్సినదే అన్నయ్యా ........
చెల్లెమ్మా ........ సేవ్ మీ .......
చెల్లెమ్మ : నా వోట్ ఎప్పటికీ నా ప్రాణమైన అన్నయ్యకే అన్నయ్యా ...... కానీ మహి అక్కయ్య - దివ్య అక్కయ్య ....... ఇద్దరి మెజారిటీ మరియు మీసిస్టర్స్ అటువైపే కాబట్టి నేనుకూడా తలొగ్గాల్సిందే ........
దేవకన్య - దివ్యక్క : లవ్ యు లవ్ యు చెల్లీ ...... అంటూ దివ్యక్క ప్రక్కన కూర్చోబెట్టుకుని నవ్వుతున్నారు .
దేవకన్య : హీరోగారూ ...... ఇక మిమ్మల్ని రక్షించేవారు ఎవ్వరూ లేరు . బుజ్జి కృష్ణ అన్నయ్య - కిషోర్ అన్నయ్య కూడా మావైపే కదా ......
ఇద్దరూ : ఆ ఆ అవునవును .......
రేయ్ ద్రోహీ .......
కృష్ణగాడు : ఒప్పుకోకపోతే అక్కయ్య ఫుడ్ పెట్టదు - నీ చెల్లి ******* ఇవ్వదు అటూ సిగ్గుపడ్డాడు .
బావగారు : నేనూ అందుకే ఒప్పుకోవాల్సివచ్చింది బావా .......
అందరూ నవ్వేస్తున్నారు .
దేవకన్య : మహేష్ గారూ ఇప్పుడు చెప్పండి ఇంత ప్లాన్ వేసినందుకు మీకు ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి - నాకైతే రక్కేసి కొరికెయ్యాలన్నంత కోపం వస్తోంది .
నా దేవకన్యకు ....... ఆహారం అవ్వడం అదృష్టమే కదా ....... , అవును సిస్టర్స్ ...... నా దేవకన్యకు ప్రపోజ్ చేసినరోజు మీరే చెప్పారుకదా - అందమైన అమాయకురాలు - చదువు అమ్మ తప్ప ఏమీ తెలియదు అని .........
సిస్టర్స్ నిమిషం పాటు ఆపకుండా నవ్వుతూనే ఉన్నారు - Ok ok ok అంటూ నవ్వుతూనే కంట్రోల్ చేసుకుని ఎయిర్ హోస్టెస్సెస్ నుండి నీళ్ళు అందుకుని తాగారు - మహేష్ సర్ మహేష్ సర్ ....... అంటూ మళ్లీ నవ్వేశారు - మీరు ప్రపోజ్ చేసిన క్షణం వరకూ నోటిలో వేలుపెట్టినా కొరకనంత అమాయకురాలిగా ఉండేది మహేష్ సర్ - మీరు ప్రపోజ్ చేశారు ఇదిగో ఇలా మారిపోయింది అని తియ్యదనంతో నవ్వుతున్న దేవకన్య బుగ్గపై ముద్దులుపెట్టారు . ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది కదా మహేష్ సర్ ....... ok - డార్లింగ్ మహీ ...... ఇక కొరికి రక్తం తాగేసెయ్యి .
దేవకన్య : నవ్వుతూనే నా చేతిని అందుకున్నారు .
మహిగారూ - సిస్టర్స్ ........ ఫ్లైట్ పై ఫ్లోర్ చూస్తానన్నారు - మీకోసం సర్ప్రైజస్ ఎదురుచూస్తున్నాయి .
దివ్యక్క - చెల్లెమ్మ - సిస్టర్స్ : అవునుకదా అంటూ పైకిలేచారు .
దేవకన్య : మహేష్ గారూ ...... మీ సంగతి తరువాత చూస్తాము - అంటీ ...... పైకి వెళదాము రండి అంటూ నా హృదయం పై ముద్దుపెట్టి లేచి దివ్యక్క - చెల్లెమ్మ చేతిని చుట్టేశారు . విద్యు డార్లింగ్ లైట్స్ .......
సిస్టర్ : మహేష్ సర్ ...... చీకటిపడుతోంది , ఇక పైనేంత చీకటిగా ఉందో .......
హమ్మయ్యా ఇప్పటికి బ్రతికిపోయాను - వన్ సెకండ్ సిస్టర్ అంటూ వాకీ టాకీలో ఆర్డర్ వెయ్యబోయి , నో నో నో ...... అంటూ సిస్టర్ కు అందించాను .
సిస్టర్ : థాంక్యూ మహేష్ సర్ అంటూ బటన్ ప్రెస్ చేసి లైట్స్ అన్నారు అంతే ఫ్లైట్ మొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది . Wow ....... సూపర్ - మహేష్ సర్ రండి ........
దేవకన్య ....... ? .
సిస్టర్ : అంటీకి ముద్దుపెట్టి ఆహ్వానించింది - అంటీని పిలిస్తే మిమ్మల్ని పిలిచినట్లు కాదా ....... ? .
యాహూ ....... లవ్ యు లవ్ యు మా అంటూ హృదయానికి ముద్దులుపెడుతూ వెనుకే వెళ్ళాను .
దివ్యక్కా - దేవకన్య - చెల్లెమ్మ ........ స్టెప్స్ దగ్గరికి చేరుకుని తొలి స్టెప్ ఎక్కగానే అక్కడ మొదలుకుని పైవరకూ లైట్ వెలుగుతూ వెళ్లాయి . పెదాలపై చిరునవ్వులతో పైకి వెళ్లారు .
రేయ్ ...... అంటూ కృష్ణగాడి గొంతు పట్టేసి కొట్టేంతలో ......
అన్నయ్యా - హీరోగారూ - అన్నయ్యా ...... డోర్ ఎవరు తీస్తారు అని ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
నేను నేను నేనున్నాను కదా డియర్స్ అంటూ బావగారు - కృష్ణగాడితోపాటు పైకివెళ్లి చెరొక డోర్ తెరిచి లోపలికి దారిని చూయించాము .
దివ్యక్క : ఉమ్మా ...... అంటూ బావగారికి ,
చెల్లెమ్మ : ఉమ్మా ...... అంటూ కృష్ణగాడి బుగ్గపై చేతితో స్పృశించి లోపలికివెళ్లారు .
నా దేవకన్యకూడా ఉమ్మా ...... అంటూ బుగ్గను స్పృశించబోయి బుగ్గపై గిల్లేసి , ఉమ్మా ఉమ్మా అంటీ అంటూ నా హృదయంపై ముద్దులుపెట్టి , డోర్స్ తెరిచినందుకు ల ...... థాంక్యూ మహేష్ గారూ అంటూ బుగ్గపై సున్నితంగా స్పృశించి దివ్యక్క దగ్గరికివెళ్లారు .
ఆఅహ్హ్హ్ ........
సిస్టర్స్ : ఫీల్ తో పడిపోండి మహేష్ సర్ , జాగ్రత్తగా పట్టుకోవడానికి మేంఉన్నాము కదా .......
థాంక్యూ సిస్టర్స్ ........
చెల్లెమ్మ : అక్కయ్యలూ ....... ఆ డ్యూటీ నా హీరోకు అప్పగించానుకదా మీరు లోపలికివచ్చి సర్ప్రైజస్ ఆస్వాదించండి - అన్నయ్యా ...... మేము ఒక్కొక్క ముద్దే పెడితే మీ దేవకన్య మాత్రం రెండు ముద్దులు - ఒక గిల్లింత - ఒక స్పర్శ ....... ఎంజాయ్ ఎంజాయ్ ........
కదా ఇప్పుడు ఫీల్ అవుతాను అని హృదయం పై చేతినివేసుకుని , రేయ్ పట్టుకోరా అనిచెప్పి వాడిపైకి పడ్డాను .
చెల్లెమ్మ - సిస్టర్స్ ....... నవ్వుకుంటూ వెళ్లారు .
Wow wow ....... బిగ్గెస్ట్ ప్లేన్ లో లాంగెస్ట్ లగ్జరీయోస్ డైనింగ్ టేబుల్ .......
అన్నయ్యా - మహేష్ సర్ ....... మాకోసమే కదా సూపర్ .......
డైనింగ్ టేబుల్ తరువాత కూర్చోవడానికి సోఫాలు ఆ తరువాత ఫ్లోర్ .......
సిస్టర్ దగ్గరకువెళ్లి చేతిలో ఉన్న వాకీ లో DJ అన్నాను అంతే , మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి ఫ్లోర్ మీద మాత్రం DJ లైట్స్ తోపాటు ఊపిచ్చే మ్యూజిక్ ప్లే అయ్యింది.
యే యే యే ...... అంటూ సంతోషంతో ఒకరినొకరు కౌగిలించుకుని ఫ్లోర్ మీదకువెళ్లి డాన్స్ - గెంతులేస్తున్నారు , వార్డెన్ - పిల్లలను కూడా లాక్కునివెళ్లారు .
విజిల్ వేసి సోఫాలో కూర్చుని నా దేవకన్య లవ్లీ డాన్స్ ను ఎంజాయ్ చెయ్యసాగాను - నాతోపాటు
ఎయిర్ హోస్టెస్సెస్ వచ్చి కూల్ డ్రింక్స్ - జ్యూస్ సర్వ్ చేశారు .
అందరూ ఒకరిపై మరొకరు చల్లుకుంటూ - తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు . సిస్టర్ వచ్చి మహేష్ సర్ ....... ఇంతటి safest ప్రైవేట్ డాన్స్ ఫ్లోర్ ను మాకోసం ఏర్పాటుచేసినందుకు థాంక్యూ థాంక్యూ ....... - మీ దేవకన్య కూడా అందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నది అంటే కారణం కూడా అదే ........
మీ సంతోషమే మా సంతోషం సిస్టర్స్ ....... , దేవకన్య ఇబ్బందిపడితే ఆర్డర్ వెయ్యమనండి సంతోషంగా కిందకువెళ్లిపోతాను .
అంతటి సౌండ్ లోనూ నా మాటలు వినిపించినట్లు , దేవకన్య కోపంతో వచ్చి నేను చెప్పానా ఇబ్బందిపడుతున్నానని - నీకు చూడటం ఇష్టం లేకపోతే కళ్ళుమూసుకో మా అంటీ చూస్తారు అంటూ నా హృదయం పై మళ్లీ ముద్దుపెట్టి , నా చేతిపై గిల్లేసి సిస్టర్ తోపాటు వెళ్లారు .
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ....... నాకు చూడటం ఇష్టం లేకపోవడమా ? , జీవితాంతం చూస్తూ ఉండమన్నా చూసేస్తాను అని హృదయం పై ముద్దులుపెట్టి , దేవకన్యకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతున్నాను .
దేవకన్య : ఏయ్ అంటూ వేలితో స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో లోలోపలే ఎంజాయ్ చేస్తూ చేతులుకట్టుకున్నాను .
కృష్ణగాడు నా ప్రక్కన సీట్లోనే కూర్చుని డాన్స్ చేస్తూ ....... , ఏంజెల్ ....... నీతోపాటు డాన్స్ చెయ్యాలని ఉంది అంటూ ఆశతో అడుగుతున్నాడు .
చెల్లెమ్మ : నో నో నో ....... అంటూ సైగలతో బదులిచ్చి నవ్వుతోంది - ఫ్లైయింగ్ కిస్ కూడా వదిలింది .
కృష్ణ : ఆఅహ్హ్ ....... ప్లీజ్ ప్లీజ్ ఏంజెల్ అంటూ బ్రతిమాలడంతో ...... , చెల్లెమ్మ వచ్చి నో అన్నాను కదా అంటూ బుగ్గపై ప్రేమతో కొట్టింది . ఇది కేవలం మీరు ....... మాకోసం ఆర్రేంజ్ చేసినది కాబట్టి మేము మాత్రమే ....... - అన్నయ్యలు చూడు చూసి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో - అక్కడికి వచ్చావో ఈవ్ టీజింగ్ అని అందరమూ .......
కృష్ణ : లేదు లేదు రాను రాను .
చెల్లెమ్మ : గుడ్ బాయ్ అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి బీట్ కు తగ్గట్లు డాన్స్ చేస్తూ దేవకన్య దగ్గరికి చేరుకుంది .
కృష్ణ : రేయ్ మామా ....... కలిసి ఎప్పుడు అంటూ దీనంగా అడిగాడు .
త్వరలోనే అదికూడా ప్లాన్ చూద్దాములేరా , ప్రస్తుతానికి కనులారా ఎంజాయ్ చెయ్యి , అక్కడ నీ సిస్టర్ నా దేవకన్య డాన్స్ చేస్తోందిరా ఆఅహ్హ్ ..... నన్ను డిస్టర్బ్ చేశావో .........
బావగారు : నన్ను కూడా బావా ...... అంటూ దివ్యక్కను ప్రేమ - ప్రాణం - కామంతో చూస్తున్నారు .
కృష్ణ : అమ్మో ....... మరొక్కమాట మాట్లాడితే ఇద్దరూ కుమ్మేసేలా ఉన్నారు - ఏమిచేస్తాం ప్రస్తుతానికి కళ్ళు మాత్రమే అన్నమాట .......
నవ్వుకున్నాము .
కొద్దిసేపటికే ....... రెండు నిమిషాలలో హైద్రాబాద్ లో ల్యాండ్ అవ్వబోతున్నాము అని అనౌన్స్మెంట్ ........
హైద్రాబాద్ అంటూ అందరూ ఆశ్చర్యపోయి నిలబడిపోయారు - వాకీ లో సిస్టర్ లైట్స్ అంటూ ఆర్డర్వెయ్యగానే DJ స్టాప్ అయ్యి లైట్స్ వెలిగాయి . అందరూ పెదాలపై చిరునవ్వులతో మావైపుకు తిరిగి హైద్రాబాద్ బిరియానీ అంటూ కేకలువేస్తున్నారు - లొట్టలేస్తున్నారు .
అందరూ గుసగుసలాడుకుని వెంటనే సిస్టర్ పరుగునవచ్చి సోఫాలో నా ప్రక్కనే కూర్చుంది . మహేష్ సర్ ....... మీరు పార్టీని ఆకాశంలో ఇస్తానన్నారు కదా .......
అలానే ప్లాన్ చేసాను సిస్టర్ ....... , కానీ మీరేకదా మీ ప్రతిఒక్కరి లిస్ట్ లో మొదటగా హైద్రాబాద్ బిరియానీ హైద్రాబాద్ బిరియానీ అంటూ అండర్ లైన్ చేసిమరీ ఇచ్చారు , అందుకే హైద్రాబాద్ తీసుకొచ్చాను .
సిస్టర్స్ తోపాటు దేవకన్య దివ్యక్క చెల్లెమ్మ కూడా ప్చ్ ప్చ్ ప్చ్ ....... అంటూ నిరాశతో వచ్చి సోఫాలలో కూర్చున్నారు .
అంతలో అనౌన్స్మెంట్ ఫాస్టెన్ your సీట్ బెల్ట్స్ - లాండింగ్ ఇన్ 10 9 8 ....... అని వినిపించగానే , అందరూ కంగారుకంగారుపడుతూ సీట్ బెల్ట్స్ పెట్టుకున్నారు - నేనూ పెట్టుకున్నాను .
సిస్టర్ కన్ను కొట్టగానే ....... టేకాఫ్ సమయంలోలానే అమ్మో భయమేస్తోంది అంటూ దేవకన్య నా చేతిని చుట్టేసి గుండెలపైకి చేరారు .
ఆఅహ్హ్హ్ ........ అంటూ సోఫా వెనక్కు వాలిపోయాను - నిమిషంలో ల్యాండ్ అయ్యి ఫ్లైట్ ఆగేంతవరకూ నన్ను నేను మరిచిపోయి ముసిముసినవ్వులు నవ్వుతున్న దేవకన్య వైపే కన్నార్పకుండా చూస్తున్నాను .
సిస్టర్ : ఒసేయ్ ఒసేయ్ ....... ల్యాండ్ అయ్యి నిమిషాలవుతోంది .
దేవకన్య : ప్చ్ ..... అంటూ నిరాశతో వదిలి కూర్చున్నారు - హీరోగారూ ...... మళ్లీ కౌగిలించుకున్నారా అంటూ భుజం పై కొడుతున్నారు .
మీరేకదా .......
దేవకన్య : తియ్యనైన నవ్వులతో , ఏదో భయమేసి పట్టుకున్నాను , అంతదానికే ఇంత గట్టిగా పట్టేసుకుంటారా ...... ? .
నేనా ...... ? , నాకు అంత ధైర్యం కూడానా ...... ? , దివ్యక్కా చెల్లెమ్మా సిస్టర్స్ ...... అసలు టచ్ అయినా చేశానా మీరైనా చెప్పండి .
అందరూ నవ్వుకుని , టచ్ చెయ్యడం ఏమిటి అన్నయ్యా - మహేష్ సర్ ....... ఊపిరి ఆడనంతలా పట్టేసుకుంటేనూ ........ - మీ దేవకన్య స్పృశించగానే స్వర్గం లోకి వెళ్ళిపోయి ఏమిచేస్తున్నారో కూడా మీకు తెలియడం లేదన్నమాట ........
దేవకన్య : నవ్వుని ఆపుకుంటున్నట్లు , అన్నయ్యలూ ....... మీరుకూడా చూశారుకదా చెప్పండి .
కృష్ణగాడు - బావగారు : అవునవును చూసాము గట్టిగా కౌగిలించుకున్నాడు .
అంతే దేవకన్య గట్టిగా గిల్లేసారు చేతిపై .......
స్స్స్ స్స్స్ ....... అంటూ రుద్దుకోవటం చూసి అందరూ నవ్వుతున్నారు . మహిగారూ ....... పట్టుకున్నప్పుడే ఇలా గిల్లేసి ఉంటే .........
దేవకన్య : గిళ్లడం కాదు కొరికేసేదానినే కానీ ఇక్కడ ఉన్నారే మా అంటీ ఉమ్మా ఉమ్మా ....... ఆ కమ్మదనానికి అక్కడే జీవితాంతం ఉండిపోవాలనిపించేసింది అందుకే ఆగిపోయాను - మరికొద్దిసేపు ఉండేదానిని ఒసేయ్ ఒసేయ్ ...... అంటూ నా డార్లింగ్ పిలిచేసింది .
సిస్టర్ : లవ్ యు లవ్ యు డార్లింగ్ ....... అంటూ లెంపలేసుకుని గుంజీలు తీసింది.
దేవకన్య నవ్వుకుని , డార్లింగ్ ....... ఆకాశంలో పార్టీ ? .
సిస్టర్స్ : అవునవును ఆకాశంలో పార్టీ అని మాటిచ్చారు కదా మహేష్ సర్ ........
మెసేజ్ రావడంతో చూసి పైకిలేచాను - అది పూర్తిగా మీ మిస్టేక్ అంటూ కిందకువచ్చాను .
మహేష్ సర్ మహేష్ సర్ అన్నయ్యా అన్నయ్యా అంటూ అందరూ వెనుకే వచ్చారు.
ఇద్దరు ఎయిర్ హోస్టెస్సెస్ కలిసి బిగ్గెస్ట్ ప్లేన్ డోర్ ను ఓపెన్ చేస్తుండటం చూసి , ప్చ్ ప్చ్ ...... మాకు ఫ్లైట్ లోనే పైన లాంగెస్ట్ డైనింగ్ టేబుల్ లో పార్టీ ఎంజాయ్ చెయ్యాలని ఉంది అంటూ గుసగుసలాడుతూ ఫీల్ అవుతున్నారు .
డోర్ ఓపెన్ కాగానే మేనేజర్ గారు లోపలికివచ్చి సర్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చారు . మీరు మళ్లీ హైద్రాబాద్ వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది .
మేనేజర్ గారూ ...... ఇప్పట్లో అయితే హైద్రాబాద్ లో కాలుపెట్టడం ఏమాత్రం ఇష్టం లేదు - అసలు ఇక్కడకు రావడం కూడా ఇష్టంలేదు కానీ నా ప్రియమైన వాళ్ళ కోరికతీర్చడం కోసం ఏమైనా చేస్తాను కాబట్టి సంతోషంతో వచ్చాను - అన్నీ రెడీ కదా ........
మేనేజర్ గారు : మీకోసం హైద్రాబాద్ లోని ఫేమస్ బిరియానీ ప్లేసస్ అన్నింటిలో చీఫ్ కుక్స్ తో ఫ్రెష్ గా వండించి స్వయంగా తీసుకొచ్చాను . కాల్ చేసి ప్రతాప్ పంపించు అన్నారు .
ఒక వ్యక్తి బిరియానీ ప్రింటెడ్ టీషిర్ట్ తో వచ్చి We are from పారడైజ్ సర్ ....... వెనుకే బిగ్ బిగ్ హాట్ బాక్సస్ ఇద్దరిద్దరు మోసుకుంటూ కొంతమంది లోపలికివచ్చారు .
మేనేజర్ గారు : మహేష్ సర్ పైన డైనింగ్ దగ్గరకే కదా , ok అంటూ పైకిపిలుచుకునివెళ్లారు .
మరొక వ్యక్తి లోపలికి వచ్చి we are from పాతబస్తీ మదీనా హోటల్స్ సర్ .......
వెనుకే హాట్ బాక్సస్ తో పైకివెళ్ళారు .
నెక్స్ట్ మరొక వ్యక్తి లోపలికివచ్చి we are from ........
సిస్టర్స్ - దివ్యక్క - చెల్లెమ్మ - దేవకన్య - పిల్లలు : హోటల్ బావర్చీ ...... అని చిరునవ్వులు చిందిస్తూ చెప్పారు .
Yes మేడమ్స్ ........
సిస్టర్స్ ...... మీకెలా తెలుసు ? .
అందరూ : హోటల్ యూనిఫార్మ్ ........
Ok ok .......
నెక్స్ట్ మరొకరు ఆ తరువాత మరొకరు ....... హైద్రాబాద్ లోని ఫేమస్ హోటల్స్ అన్నింటి నుండీ లిస్ట్ ఐటమ్స్ అన్నీ వేడివేడిగా హాట్ బాక్సస్ లో పైకిచేరాయి .
అందరితోపాటు మేనేజర్ గారు కిందకువచ్చి , మహేష్ సర్ ...... ఈ లేడీ సర్వర్స్ మీతోపాటు ఉంటారు - వడ్డిస్తారో , ఎంజాయ్ ద పార్టీ సర్ .......
మేనేజర్ గారూ ....... మాతోపాటు రావచ్చుకదా ......
మేనేజర్ గారు : This is enough సర్ , థాంక్యూ థాంక్యూ soooo మచ్ అండ్ హ్యాపీ జర్నీ ....... మీ డెస్టినేషన్ ప్లేసస్ అన్నింటిదగ్గరా అన్నీ ఏర్పాట్లూ చేసేసాను అనిచెప్పి వెళ్లిపోయారు .
థాంక్యూ మేనేజర్ గారూ ...... - ఎయిర్ హోస్టెస్సెస్ హ్యాచ్ ద డోర్ .......
దివ్యక్క - చెల్లెమ్మ ఆ వెనుకే సిస్టర్స్ వచ్చి నా గుండెలపైకి చేరారు . లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ అన్నయ్యా - మహేష్ సర్ .......
ఏంటి మహిగారూ ....... హ్యాపీనా ..... ? .
దేవకన్య పెదాలపై తియ్యనైన నవ్వులతో పరుగునవచ్చి దివ్యక్క చేతిని చుట్టేసి సిగ్గుపడుతున్నారు .
సిస్టర్స్ ....... మిమ్మల్ని నిరుత్సాహపడనిస్తానా చెప్పండి - ఈ పార్టీ మీకోసం ......
సిస్టర్స్ : థాంక్యూ మహేష్ సర్ .......
దేవకన్య : సూపర్ అంటూ చేతివేళ్ళతో సైగచేసి ఆనందిస్తున్నారు .
దివ్యక్క : అన్నయ్యా ...... డాన్స్ చేసి చేసి అలసిపోయాము , ఫ్రెష్ అవ్వాలి .
ఫ్లైట్ చివరన కిందా పైన ఉన్నవన్నీ లగ్జరీ రూమ్స్ సకల సౌకర్యాలు ఉన్నాయి మీ ఇష్టం ఎక్కడికైనా వెళ్లి ఫ్రెష్ అవ్వండి .
సిస్టర్స్ : మేము ఇక్కడే ఫ్రెష్ అవుతాము అని వారి వారి లగేజీ తీసుకుని కింద ఉన్న రూమ్స్ కు వెళ్లారు .
అయితే మేము పైన రెడీ అవుతాము - అన్నయ్యా అన్నయ్యా ...... మేముకూడా అంటూ పిల్లలిద్దరూ మాతోపాటువచ్చారు . లేడీ సర్వర్స్ దగ్గరకువెళ్లి సిస్టర్స్ ...... మేడమ్స్ వచ్చేలోపు పైన డైనింగ్ టేబుల్పై .........
చీఫ్ సర్వర్ : మేము చూసుకుంటాము సర్ .........
థాంక్యూ అనిచెప్పి వాళ్ళతోపాటు పైకివెళ్లి DJ ఫ్లోర్ వెనక ఉన్న రూమ్స్ లలోకివెళ్లి ఫ్రెష్ అయ్యివచ్చాము - ఫ్లైట్ ఆకాశంలో సాఫీగా వెళుతోంది .
నాన్ వెజ్ ఘుమఘుమలకు మాకు తెలియకుండానే పెదాలపై చిరునవ్వు - డైనింగ్ టేబుల్ పై arrangements చూసి wow అనేంతలో కృష్ణగాడు సంతోషం పట్టలేక రేయ్ మామా ....... సూపర్ అంతే అంటూ వెనుక నుండి నామీదకు జంప్ చేసాడు .
అన్నయ్యలూ ....... డైనింగ్ టేబుల్ ఎక్కడ కనిపించడం లేదు అని పిల్లలు ఆనందిస్తున్నారు .
బావగారు : అవునవును ఐటమ్స్ తోనే నిండిపోయాయి ఆఅహ్హ్ ...... నోరూరిపోతోంది .
పిల్లలు : అన్నయ్యలూ ...... ఇక ఆగడం మావాళ్ళ అయితే కాదు ఆక్కయ్యలను పిలుచుకునివస్తాము .
ఆగలేము అని వెళ్లిపోతున్నారే అంటూ ఒక చేతికి లెగ్ పీస్ మరొక చేతికి కోన్ ఐస్ క్రీమ్ అందించాము .
థాంక్స్ అన్నయ్యా ...... అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి లెగ్ పీస్ ఆ వెంటనే ఐస్ క్రీమ్ తింటూ కిందకు పరుగుతీశారు .
రెండు నిమిషాలకు అందరూ వచ్చినట్లు స్టెప్స్ దగ్గరనే wow మసాలా వాసన అదిరిపోతోంది అది ఖచ్చితంగా హైద్రాబాద్ ధమ్ బిరియానీనే - కాదు కాదు చికెన్ ఫ్రై - కాదు కాదు బటర్ చికెన్ , చిల్లీ చికెన్ అని వాదులాడుకుంటూ డోర్ తెరుచుకుని లోపలికివచ్చి డైనింగ్ టేబుల్ పై మధ్యలో ఒక చివర నుండి మరొక చివరవరకూ బిరియానీ పోసి దానిపై లిస్ట్ లోని అన్నిరకాల ఐటమ్స్ వరుసగా చక్కగా ఉంచి ఉండటం ప్రక్కన సలాడ్స్ - పచ్చడిలు - చట్నీలు - డ్రింక్స్ - ఐస్ క్రీమ్స్ - జ్యూసస్ ....... అలా కన్నార్పకుండా చూస్తుండిపోయారు .
దివ్యక్క : అన్నయ్యా ...... కొద్దిసేపటి ముందు ఇక్కడ బిగ్గెస్ట్ డైనింగ్ టేబుల్ ఉండేది కదా .......
పిల్లలతోపాటు నవ్వేసాము .
దివ్యక్క : డియర్ మహీ - ఫ్రెండ్స్ - పిల్లలూ ....... కమాన్ కమాన్ వేడి చల్లారకముందే కుమ్మేయ్యాలి అనడం ఆలస్యం .
సిస్టర్స్ తేరుకుని అలర్ట్ అయిపోయి పరుగున నా దగ్గరికి వచ్చి థాంక్యూ థాంక్యూ మహేష్ సర్ అంటూ చేతితో నా బుగ్గలపై ముద్దులుపెట్టి డైనింగ్ టేబుల్ చుట్టూ చేరారు - వార్డెన్ పిల్లలను కూర్చోబెట్టుకున్నారు .
నా దేవకన్య కూడా .........
అంతలో దేవకన్యనే ...... నా కళ్ళల్లోకి ప్రాణంలా చూస్తున్నట్లు వచ్చి , మా అందరి పెదాలపై ఇంతటి ఆనందాలను పంచిన హీరోగారికి ల ...... థాంక్యూ అంటూ బుగ్గపై ముద్దుపెట్టబోయి ఆగి చేతితో నా హృదయంపై ముద్దుపెట్టి పరుగునవెళ్లి విద్యు సిస్టర్ ప్రక్కన కూర్చోబోయారు .
సిస్టర్ : డార్లింగ్ ఇది రిజర్వ్డ్ .......
దేవకన్య : లవ్ యు డార్లింగ్ అంటూ సంతోషంతో కౌగిలించుకుని , ఒక లగ్జరీ చైర్ వదిలి కూర్చున్నారు .
లవ్ యు అన్నయ్యా - లవ్ యు అన్నయ్యా ...... అంటూ దివ్యక్క - చెల్లెమ్మ వారి హీరోల చేతులను చుట్టేసివెళ్లి నా దేవకన్యకు ఎదురుగా కూర్చున్నారు .
అందరి సంతోషాలను చూస్తూ పరవశించి , వాకీ లో ఫ్లైట్ ను ఆటో పైలట్ లో ఉంచి పైలెట్స్ ను కూడా డిన్నర్ కు ఆహ్వానించి వారితోపాటు చివర చైర్లో కూర్చోబోతే ....... , మహేష్ సర్ మహేష్ సర్ ...... మీకోసం స్పెషల్ గా అంటూ నాదగ్గరకువచ్చిమరీ చేతిని అందుకుని పిలుచుకునివెళ్లి దేవకన్య ప్రక్కన కూర్చోబెట్టి మరొకవైపున కూర్చుంది .
నా దేవకన్య ప్రక్కన థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సిస్టర్ ...... అని ఎంజాయ్ చేస్తున్నాను .
దేవకన్య : అంత మురిసిపోకండి హీరోగారూ ....... , పార్టీ ఇస్తున్నది తమరే కాబట్టి అదికూడా ఇంతటి లగ్జరీయోస్ పార్టీ కాబట్టి ఈ గౌరవం ఇస్తున్నాము - వడ్డించమంటారా ...... ? .
ఆఅహ్హ్ ........
దేవకన్య : ఏంటి గుండె నొప్పి వచ్చిందా మహేష్ సర్ ....... అంటూ నవ్వుతూ అడిగారు .
మీరే స్వయంగా వడ్డిస్తాను అన్నారు కదా , ఆ ఆనందానికి ఇక్కడ తియ్యగా ......
దేవకన్య : చాలు చాలు చాలు ఆకలేస్తోంది , మీ ఫీలింగ్స్ తరువాత తీరికగా విందాము .
చీఫ్ సర్వర్ : మహేష్ సర్ ....... ప్లేట్స్ or బనానా లీవ్స్ ? .
మా ప్రియాతిప్రియమైన వారి ఇష్టం ........
పిల్లలతోపాటు అందరూ ఒక్కమాటగా బనానా లీవ్స్ బనానా లీవ్స్ అంటూ కేకలువేశారు .
చీఫ్ సర్వర్ : yes మేడమ్స్ అంటూ ముందే శుభ్రం చేసిన బనానా లీవ్స్ అందరి ముందూ పరిచి సిస్టర్స్ కోరిన వాటిని సర్వ్ చేస్తున్నారు .
దివ్యక్క ...... బావగారికి - వార్డెన్ ...... పిల్లలకు ప్రేమతో వడ్డించడం చూసి , ఆశతో మహిగారూ ....... వడ్డిస్తాను అన్నారు ? .
దేవకన్య : అంతకంటే అదృష్టమా అని మనసులో అనుకుని ఆనందించి , బయటకుమాత్రం వడ్డించడానికే స్పెషల్ గా సిస్టర్స్ ను ఏర్పాటుచేశారు కదా .........
మీరే వడ్డిస్తాను అన్నారుకదా అందుకే ........
దేవకన్య : సరే సరే ఫీల్ అవ్వకండి , మాకోసం ఇంత గొప్పగా పార్టీ ఇస్తున్నారు , ఈ మాత్రం చెయ్యనా చెప్పండి అంటూ లేచిమరీ ఏమీ ఇష్టం అని అడిగారు .
నా దేవకన్యకు .......
దేవకన్య : what ...... ? .
అదే అదే మీకు ఏవిష్టమో అవే వడ్డించండి ప్లీజ్ ప్లీజ్ .......
దేవకన్య : ప్లీజ్ కాదు ఆర్డర్ వెయ్యండి మహేష్ సర్ - మీ చిరుకోరిక కూడా తీర్చకపోతే ....... మీ సిస్టర్స్ , నన్ను కొట్టేలా ఉన్నారు - చూడండి ఎలా చూస్తున్నారో .......
చూసి సిస్టర్స్ కు థాంక్స్ చెప్పాను .
దేవకన్య : వాళ్ళు నన్ను కొడితే మీకు ఆనందం కదూ ........
నో నో నో దేవ ....... మహిగారూ ....... నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదు .
దేవకన్య : సరే సరే ....... , తృప్తిగా తినండి అని వడ్డిస్తున్నారు .
పార్టీ మీకోసం కదా ముందు మీరు వడ్డించుకుని తరువాత నాకు వడ్డించండి.
దేవకన్య : ప్రాణమైన వారికి వడ్డించకుండా మేము మొదట వడ్డించుకుంటామా చెప్పండి అంటూ మొదట నాకు వడ్డించి తరువాత దేవకన్య వడ్డించుకున్నారు .
అధిచూసి చెల్లెమ్మ ....... కృష్ణగాడికి వడ్డించింది .
కృష్ణగాడు : మామా మామా ....... లవ్ యు రా ఉమ్మా ఉమ్మా ......
ప్రాణమైన వారికి ....... ? అంటూ పరవశించిపోతున్నాను .
దేవకన్య : ఎక్కువ మురిసిపోకండి , నేను అన్నది ఇక్కడ ఉన్న అంటీ గురించి లవ్ యు అంటీ ....... అంటూ నా హృదయం పై ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ .......
దేవకన్య : ఇలా ప్రతీసారీ ఫీల్ అవుతూనే ఉంటారా ...... ? , తమరు తింటేనే కానీ పిల్లలు కూడా తినకుండా లొట్టలేస్తున్నారు .
Sorry sorry ....... ఈ పార్టీ మీకోసం - మీరంతా తిన్నాకనే మేము ....... ప్లీజ్ ప్లీజ్ సిస్టర్స్ - వార్డెన్ - పిల్లలూ ....... are you happy ? .
చాలా చాలా అంటూ తినడం మొదలుపెట్టారు . మ్మ్మ్ ...... యమ్మీ ..... టేస్టీ ...... ఐటమ్స్ ఒక్కొక్కటీ సూపర్ ....... ఎంతైనా నాన్ వెజ్ అంటే హైద్రాబాద్ అంతే అంటూ స్వయంగా మరియు సర్వర్స్ ద్వారా వడ్డించుకుంటున్నారు .