Update 28

సిస్టర్స్ : తృప్తిగా తిన్నాము అంటూ దేవకన్య - దివ్యక్క వాళ్ళతోపాటు సోఫాలలోకి చేరారు . మహేష్ సర్ ....... ఫుల్లీ ఫుల్లీ ఫుల్లీ satisfied ........ జీవితాంతం గుర్తుంచుకుంటాము అంటూ దేవకన్య బుగ్గలపై ముద్దులుపెట్టి సంతోషంతో చెప్పారు .
అప్పుడే అయిపోలేదు సిస్టర్స్ ...... , ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే ...... , ముందు ఆ ముందు ఆపై ముందు ...... నా ఫ్యామిలీ మెంబెర్స్ కు enjoyment ను ఎలా అందిస్తానో సర్ప్రైజస్ రూపంలో ఎంజాయ్ చెయ్యండి .
దేవకన్య : లోలోపల పులకించిపోతూనే ...... , ప్రస్తుతానికి మమ్మల్ని అయితే మా హాస్టల్ కు చేర్చండి చాలు - ఎంతలోపు తీసుకెళతారు హీరో ........
11 లోపు మిమ్మల్ని సేఫ్ గా హాస్టల్ కు చేర్చుతాను మహీ .......
దేవకన్య : సేఫ్టీ గురించి నేను ఆడిగానా మహేష్ ...... ? .
సిస్టర్ : మహేష్ సర్ ప్రక్కన ఉంటే భయం అన్నది దరిచేరదు - ఎక్కడికైనా వెళతాము .
థాంక్యూ సిస్టర్స్ - లవ్ యు లవ్ యు మహీ ........
దేవకన్య : లవ్ యు లు మొదలెట్టేశారా ...... ? . పిల్లలు నిద్రపోతున్నారు సౌండ్స్ చెయ్యకూడదు - మాకూ నిద్రవస్తోంది కాసేపు మాట్లాడకుండా , కదలకుండా ఉండండి అంటూ నా హృదయం పై లవ్ యు అంటీ అంటూ చేతితో ముద్దుపెట్టి , నా భుజం పై తలవాల్చి కళ్ళుమూసుకున్నారు .
సిస్టర్ : డార్లింగ్ మహీ ...... , తలవాల్చడంతోపాటు చేతిని చుట్టేయ్యి , ఇక అంతే వైజాగ్ వరకూ స్వీట్ షాక్ లోనే ఉండిపోతారు అని నవ్వుకున్నారు .
కళ్ళుమూసుకుని హాయిగా నిద్రపోతున్న నా దేవకన్యనే కనులారా తిలకిస్తూ హృదయమంతా నింపుకుంటూ జలదరిస్తూనే ఉన్నాను .
దేవకన్య : ప్చ్ ..... కాస్త కదలకుండా కూర్చుంటారా లేదా ..... అంటూ చేతిని చుట్టేశారు .
వల్ల కావడంలేదు మహీ ...... , sorry .......
సిస్టర్స్ : అంతలా చుట్టేస్తే ఎలా తట్టుకుంటారు చెప్పు పాపం - నువ్వే అడ్జస్ట్ చేసుకోవే ........
దేవకన్య : Ok ok ...... వెచ్చగా ఉంది అంటూ మరింత గట్టిగా చుట్టేశారు .

నా దేవకన్యను ప్రాణం కంటే ఎక్కువగా చూస్తూ ఈ ప్రయాణం జీవితాంతం ఇలాగే కొనసాగాలని , వైజాగ్ రానేకూడదు అని అలా ప్రార్థించానో లేదో ........
మరికాసేపట్లో వైజాగ్ లో ల్యాండ్ అవ్వబోతున్నాము అని అనౌన్స్మెంట్ ........
What ...... ? అని షాక్ లో టైం చూస్తే 11 గంటలు నిమిషంలో 3 గంటలు గడిచిపోయాయా ...... ? ప్చ్ ......
సిస్టర్స్ : వచ్చేసామా అంటూ వొళ్ళువిరుస్తూ ...... , ఇష్ట సఖి దేవకన్యనే ఇలా చుట్టేస్తే నిమిషంలో ఏమిటి ? , క్షణంలో యుగాలే గడిచిపోతాయేమో ....... అంటూ నవ్వుకున్నారు - ష్ ష్ ష్ ...... ల్యాండ్ అయ్యేంతవరకూ మహేష్ సర్ ను ఎంజాయ్ చెయ్యనిద్దాము .
5 నిమిషాలలో ల్యాండ్ అయిన కుదుపుకు దేవకన్యకు మెలకువవచ్చింది . ఆఅహ్హ్హ్ ....... స్వర్గం లాంటి నిద్ర .......
సిస్టర్ : ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న ప్రేమికుడిని వెచ్చగా హత్తుకుని పడుకున్నావు కదా అలానే ఉంటుంది లేవే ........
దేవకన్య : కళ్ళుతెరిచి అంటే నేను హత్తుకున్నది నిన్ను కాదా డార్లింగ్ అంటూ నా భుజం పై కొట్టి తియ్యనైన కోపంతో సిస్టర్ గుండెలపైకి చేరారు .
సిస్టర్ : డార్లింగ్ ...... కదలకు మహేష్ అంటూ మరింత గట్టిగా కౌగిలించుకున్నావు కదా డార్లింగ్ , నీకు తెలియదా ....... ? .
దేవకన్య : నిద్రమత్తులో తెలియనేలేదు డార్లింగ్ - ఏదో మంత్రం వేసి మాయచేసి హత్తుకునేలా చేసి ఉంటారు అంటూ మళ్లీ కొట్టారు .
ప్చ్ ...... నిద్రమత్తులోనా .... ? , నేనింకా ప్రేమతో అనుకుని మీతోపాటు స్వర్గలోకాలకు వెళ్ళిపోయాను .
సిస్టర్ : అవును మహీ డార్లింగ్ ....... , నువ్వు హత్తుకోగానే మూడు గంటలు వారిని వారే మరిచిపోయినట్లు నిమిషంలో వచ్చేసామా అంటూ ఆశ్చర్యపోతున్నారు .
దేవకన్య : నవ్వుకున్నారు .

అంతలో ఫ్లైట్ రన్ వే పై ఆగడంతో , సిస్టర్స్ లేచి లగేజీ అందుకోబోయారు .
సిస్టర్స్ ...... ఎక్కడివి అక్కడే ఉండనివ్వండి - అలసిపోయారుకదా హాస్టల్ కు వెళ్లి రెస్ట్ తీసుకోండి - రేపు ఉదయం 7 గంటలకల్లా ...... అన్నింటినీ మీదగ్గరికి చేర్చే బాధ్యత నాది .
సిస్టర్స్ : థాంక్యూ థాంక్యూ మహేష్ సర్ ....... , అంటే ఉదయం వరకూ ఫ్లైట్ ఇక్కడే ఉంటుందా ....... ? .
రేపటి వరకే ఏమిటి ? , వీకెండ్ మళ్లీ వెళదాము అని ఆర్డర్ వెయ్యండి అప్పటివరకూ ఇక్కడే ఉంటుంది .
సిస్టర్స్ : ఆనందించారు .
దేవకన్య : మహేష్ ...... అందరమూ ఒకే బస్సులోనే కదా ......
రేయ్ మామా ...... ? .
కృష్ణగాడు : బస్సే బస్సే ....... , బయట రెడీగా ఉంటుంది .
హమ్మయ్యా ...... బ్రతికిపోయాను .
దేవకన్య : అవునవును బ్రతికిపోయారు అంటూ నవ్వుతూనే అందరితోపాటు కిందకుదిగి , ఇంత చలినా అంటూ నా చేతిని కాదు ఏకంగా నా నడుమును చుట్టేసి వణుకుతూనే నడిచారు .
పిల్లలిద్దరూ ...... వెనుక మొబైల్ బాక్స్ ను చెరొకచేతితో పట్టుకుని ఫాలో అయ్యారు .
ముద్దుపెట్టి ఉండొచ్చు కదా మహేష్ సర్ ...... అన్న సిస్టర్ మాటలు గుర్తుకువచ్చి , ము ము ము ....... అంటూ పెదాలను దేవత నుదుటిపైకి తీసుకెళ్ళాను .
దేవకన్య : ఎంతసేపు మహేష్ అన్నట్లు తిట్టినట్లు అనిపించింది తప్ప పెట్టబోతున్న ముద్దుకు కోప్పడినట్లు అనిపించింది - అయినాకూడా భయమేసి ఆగిపోయాను .
దేవకన్య : నిరాశ చెందినట్లు ...... , ప్చ్ ..... అంటూ ఏకంగా భుజం పై కొరికేశారు .
స్స్స్ .......
దేవకన్య : కోపం వచ్చింది కొరికితే కొరికించుకోవాలి ........
దేనికి కోపం వచ్చింది మహీ ......
దేవకన్య : తెలియదా ...... , నేనైతే చెప్పను - sorry చెప్పు .
Sorry లవ్ యు లవ్ యు మహీ .......
దేవకన్య : మధ్యలో లవ్ యు లు ఏంటి ? .
మనమధ్యన sorry లు ......
దేవకన్య : అయితే ok , అయినా మన మధ్యన ఏముంది ? .
అదీ అదీ .......
దేవకన్య : Ok ok ...... అంటూ నా నడుముపై గిల్లేసి బస్సు ఎక్కి సిస్టర్ చేతిని చుట్టేసి కూర్చున్నారు .
బావగారు - దివ్యక్క ...... నిన్న ఎయిర్పోర్ట్ లో వదిన రోవర్ లో ఫాలో అయ్యారు .
రోడ్లు నిర్మానుష్యన్గా ఉండటం వలన 20 నిమిషాలలో క్యాంపస్ చేరుకున్నాము . వార్డెన్ ను చూసి సెక్యురిటీ మెయిన్ గేట్స్ తెరవడంతో రెండు నిమిషాలలో హాస్టల్ చేరుకున్నాము .

పిల్లలిద్దరూ గుడ్ నైట్ అన్నయ్యా గుడ్ నైట్ అన్నయ్యా అనిచెప్పి ఫైనల్ సర్ప్రైజ్ ప్లాన్ ప్రకారం ఐఫోన్స్ బాక్స్ ను తీసుకుని హాస్టల్ లోపలికివెళ్లిపోయారు .
11:30 PM అందరూ పూర్తిగా అలసిపోయినట్లు నిద్రమత్తులో మహేష్ సర్ .......
సిస్టర్స్ సిస్టర్స్ ...... రేపు ఎన్ని కావాలంటే అన్ని థాంక్స్ లు చెప్పవచ్చు కాబట్టి లోపలికివెళ్లి హాయిగా పడుకోండి గుడ్ నైట్ - గుడ్ నైట్ మహీ ......
గుడ్ నైట్ గుడ్ నైట్ మహేష్ సర్ ....... అంటూ సిస్టర్స్ లోపలికివెళ్లారు .
దేవకన్య ...... నిద్రమత్తులో ఉన్న విద్యు సిస్టర్ చేతిని చుట్టేసి నావైపే ఆరాధనతో చూస్తున్నారు .
మహీ ...... నన్ను కొడితేనే కానీ నిద్రపట్టదా అలా చూస్తున్నారు .
దేవకన్యతోపాటు నిద్రమత్తులో ఉన్న సిస్టర్ నవ్వుతున్నారు . కొడితేనే కాదు మహేష్ ....... మా అంటీకి ప్రేమతో ముద్దులుపెడితేనేకానీ నిద్రపట్టదు - లవ్ యు అంటీ గుడ్ నైట్ అంటీ అంటూ నా హృదయంపై ముద్దులుపెట్టి , జాగ్రత్తగా వెళ్ళండి మహేష్ అంటూ దివ్యక్క - చెల్లెమ్మను కౌగిలించుకుని గుడ్ నైట్ చెప్పారు .
చెల్లెమ్మ : అక్కయ్యలూ ...... ఈరాత్రికి నేనూ మీతోనే పడుకుంటాను .
దేవకన్య : లవ్ టు లవ్ టు చెల్లీ .......
దివ్యక్క : నాకుకూడా మీతోనే పడుకోవాలని ఉంది కానీ ..... , అన్నయ్య - తమ్ముడు ...... ఉదయమే వెళ్లి మన షాపింగ్ తీసుకురావాలంటే సూర్యోదయం లోపు లేచి టిఫిన్ చెయ్యాలి .
దేవకన్య - చెల్లెమ్మ : అవునవును ........
దివ్యక్క : గుడ్ నైట్ మహీ - చెల్లీ .......
గుడ్ నైట్ అనిచెప్పి వెనుతిరిగిచూస్తూనే లోపలికివెళ్లారు - వార్డెన్ .... గుడ్నైట్ చెప్పి లోపలికివెళ్లి మెయిన్ గేట్ లాక్ చేసేంతవరకూ అక్కడే ఉండి బస్సు - రోవర్లో బయలుదేరాము .

దేవకన్య - చెల్లెమ్మ - సిస్టర్ ....... ఒకరిచేతులలో మరొకరు పెనవేసి తమ రూమ్ కు వెళ్లారు .
అందరూ సంతోషపు ఆశ్చర్యాలతో కన్నార్పకుండా బెడ్స్ వైపు చూస్తుండటం చూసి , డార్లింగ్స్ ...... నిద్రపోకుండా ఇలా నిలబడి ఉన్నారేమిటి ? .
అక్కయ్యలూ అక్కయ్యలూ ....... అంటూ బుజ్జి బుజ్జి రెండుచేతులలో ఐఫోన్స్ పట్టుకుని సర్ప్రైజ్ గిఫ్ట్స్ అంటూ చూయిస్తున్నారు . అన్నయ్య ఈరోజుకు ఇస్తున్న ఫైనల్ గిఫ్ట్స్ అంటూ ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్క ఐఫోన్ అందించారు - కలర్ కోసం ఎవ్వరూ జుట్లుపట్టుకుని పోట్లాడకూడదని గర్ల్స్ కు ఇష్టమైన పింక్ కలర్ నే సెలెక్ట్ చేశారు . కమాన్ కమాన్ ...... ఓపెన్ ఓపెన్ ...... , ఇది మమ్మీకు అంటూ దేవకన్య - చెల్లెమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి పరుగున వార్డెన్ దగ్గరికివెళ్లారు .
సిస్టర్స్ : ఐఫోన్ 13 ...... యాహూ యాహూ ...... అంటూ నిద్రపోతున్న స్టూడెంట్స్ నిద్ర డిస్టర్బ్ కాకుండా సౌండ్ లేకుండా కేకలువేసి దేవకన్య - చెల్లెమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి ఓపెన్ చేసి గుండెలపై హత్తుకున్నారు థాంక్యూ థాంక్యూ ....... మహేష్ సర్ అంటూ .......

బస్సు క్యాంపస్ బయటకు రాగానే సిస్టర్ నుండి కాల్ వచ్చింది . థాంక్యూ థాంక్యూ మహేష్ సర్ ...... , ఫ్లైట్ లో అన్ని గిఫ్ట్స్ ఉన్నాయి అయినా ఐఫోన్ ఇవ్వడం .......
ఉదయం తాజ్ మహల్ ముందు సెల్ఫీలు తీసుకుంటుంటే , మన మొబైల్స్ ను చూసి ఇద్దరుముగ్గురు నవ్వడం చూసాను - ఇక ఎప్పటికీ అలా జరగనేరాదు ...... you are my ఫ్యామిలీ - ఐఫోన్ 14 15 16 ....... రాగానే మీచేతుల్లో ఉంటాయి - నా ఫ్యామిలీని చూసి అసూయ చెందాలి కానీ నవ్వకూడదు లవ్ యు గుడ్ నైట్ .......
సిస్టర్స్ : థాంక్యూ థాంక్యూ మహేష్ సర్ - కళ్ళల్లో ఆనందబాస్పాలు వచ్చేసాయి - గుడ్ నైట్ .......
సిస్టర్ సిస్టర్ సిస్టర్ ...... , నా దేవకన్యకు ఐఫోన్ నచ్చిందా ...... ? .
దేవకన్య : మోస్ట్ loved it మహేష్ ....... , నా డార్లింగ్స్ పెదాలపై చిరునవ్వులు - కళ్ళల్లో ఆనందబాస్పాలకు కారణమైన మీకు ........
ఆ నాకు .......
దేవకన్య : మీకు ....... , థౌజండ్ థాంక్స్ .......
ప్చ్ ....... , థౌజండ్ థాంక్స్ లకు బదులు ఒక్క లవ్ యు చెప్పి ఉంటే ...... నేను హ్యాపీ - అమ్మా హ్యాపీ .......
దేవకన్య : ( చెబుతాను చెబుతాను మహేష్ ...... , అంటీ ఫిదా అయిపోయేలా చెబుతాను లవ్ యు ) .
మహీ ....... వినిపించడం లేదు .
దేవకన్య : ఎందుకంటే నేనేమీ మాట్లాడలేదు కాబట్టి , అర్ధరాత్రి కాబోతోంది మమ్మల్ని నిద్రపోనిస్తారా లేక గిఫ్ట్స్ లతోనే తెల్లవారనిస్తారా ....... ? .
Sorry లవ్ యు లవ్ యు మహీ ...... , లవ్లీ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అంటూ తియ్యదనంతో నవ్వుతూ కట్ చేసి యాహూ ...... లవ్ యు లవ్ యు అమ్మా ...... అంటూ హృదయంపై ముద్దులవర్షం కురిపిస్తున్నాను .
కృష్ణగాడు అదేమీ పట్టించుకోకుండా బస్సు మూలలో కూర్చుని చెల్లితో మాట్లాడుతూ సిగ్గుపడుతున్నాడు వాడిలోకంలో వాడు ఉన్నాడు . సరిగ్గా 12 గంటలకు ఇంటికి చేరుకున్నాము - సెక్యూరిటీ సెల్యూట్ చేసి మెయిన్ గేట్ తెరవడంతో బావగారు ..... నేరుగా రోవర్ ను లోపలికితీసుకెళ్లారు , బస్సు ..... మెయిన్ గేట్ దగ్గరే ఆగింది .

రేయ్ మామా ...... ఇంటికి చేరుకున్నామురా ...... , నీరూమ్ కు వెళ్లి ఎంతసేపైనా మాట్లాడు - చెల్లెమ్మను నిద్రపోనివ్వు ........
చూడు అన్నయ్యా ...... నిద్రపోనివ్వడం లేదు అంటూ మొబైల్లో గట్టిగా వినిపించింది .
కృష్ణగాడు : నా ఏంజెల్ తో మాట్లాడటానికి 20 ఏళ్ళు wait చేసానురా .......
చెల్లెమ్మ : సరే సరే సరే లవ్ యు లవ్ యు ఉమ్మా ఉమ్మా ......
కృష్ణగాడు : లవ్ యు ఏంజెల్ ....... , రేయ్ మామా ....... బస్సుకు అమౌంట్ ఇచ్చి వచ్చెయ్యి అంటూ దర్జాగా మాట్లాడుకుంటూ లోపలికివెళ్లాడు .
అంతేలేరా నీది లవ్ సక్సెస్ ..... వన్ సైడ్ లవ్ అంటే అందరికీ లోకువే - ఒక్కసారి నా దేవకన్య లవ్ accept చెయ్యనివ్వు ........ లవ్ మాయలో ఉన్నాడు వీడికి చెప్పినా వినిపించదు .
దివ్యక్క ..... వాడి వీపు విమానం మోత మోగించి , బావగారితోపాటు నవ్వుతూ వచ్చి చేతిని చుట్టేశారు .

డ్రైవర్ కిందకుదిగడంతో అమౌంట్ అడిగి పర్సు ఓపెన్ చేసాను - ఎంప్టీ ....... , బావగారూ .......
బావగారు : మేడం గారు ...... మన పర్సులన్నీ అగ్ర ఫోర్ట్ దగ్గరే ఖాళీ చేసేశారుకదా ........
అవునవును అని నవ్వుకున్నాము . లోపల ఉంది తీసుకొస్తాను .
దివ్యక్క : అన్నయ్యా ...... ఉండండి తీసుకొస్తాను అని బుగ్గపై ముద్దుపెట్టి ముసిముసినవ్వులతో లోపలికివెళ్లి తీసుకొచ్చి ఇచ్చారు .
డ్రైవర్ : కౌంట్ చేసుకుని సర్ రెండింతలు ఉంది అని వెనక్కు ఇవ్వబోయాడు .
ఈ సమయంలో మాకోసం ఇంటికి పోకుండా wait చేశారు - ఉంచుకోండి బ్రదర్ .....
డ్రైవర్ : థాంక్యూ థాంక్యూ సర్ ....... అంటూ సంతోషంతో బస్సు ఎక్కాడు .

దివ్యక్కా ...... బావగారి గుండెలపై హాయిగా .......
దివ్యక్క : పో అన్నయ్యా అంటూ సిగ్గుపడ్డారు .
ఒకేసారి నా మొబైల్ - దివ్యక్క మొబైల్ రింగ్ అవ్వడంతో నవ్వుకుని చూసి , wow ....... దేవకన్య నుండి ......
దివ్యక్క : విద్యు నుండి అన్నయ్యా .......
పట్టరాని ఆనందంతో పెదాలపై చిరునవ్వులతో ఎత్తాము .
మహేష్ మహేష్ ...... అంటూ దేవకన్య ఏడుపు ....... , అంతే వొళ్ళంతా గగుర్పాటుకు లోనయ్యి చెమటలు పట్టేసాయి - మొబైల్ కిందపడిపోయింది .
దివ్యక్క : అన్నయ్యా ....... విద్యు కూడా ఏడుస్తూ కంగారుపడుతోంది అన్నయ్యా ........
వెంటనే కిందపడిన మొబైల్ అందుకుని , మహీ .......
దేవకన్య : మహేష్ మహేష్ ....... హాస్టల్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ వొమిట్ చేసుకుంటున్నారు - కడుపులో నొప్పి అంటున్నారు ఏడుస్తున్నారు నడవలేకపోతున్నారు కొంతమంది స్పృహకోల్పోతున్నారు - అంబులెన్స్ కు కాల్ చేసాము - ఏమిచెయ్యాలో కాళ్ళూ చేతులూ ఆడటం లేదు - వార్డెన్ చాలా భయపడుతున్నారు .
మహీ మహీ ...... కంగారుపడకు , ఇదిగో వెంటనే వచ్చేస్తాము లైన్లోనే ఉండు - డ్రైవర్ డ్రైవర్ ..... అంటూ పరుగుపెట్టి కదులుతున్న బస్సును ఆపాము .
కృష్ణగాడికి ...... చెల్లెమ్మ చెప్పినట్లు ఏకంగా రోవర్ ను తీసుకొచ్చాడు .
డోర్ తీసి దివ్యక్క కూర్చునేలా చేసి , రేయ్ ...... నువ్వు వెళ్లు అని పంపించి , బస్సు ఎక్కి హెల్ప్ అడిగాను .
డ్రైవర్ : సర్ ...... మీకోసం ఎక్కడికైనా వస్తాను .
ఇంతకుముందు వెళ్లిన కాలేజ్ హాస్టల్ దగ్గరకే వెళ్ళండి .
డ్రైవర్ : అలాగే సర్ ......

దేవకన్య : మహేష్ మహేష్ ...... ప్రతీ రూములోని సిస్టర్స్ అందరి పరిస్థితీ ఒకేలా ఉంది , నొప్పి ఎక్కువ అవుతోంది అంటున్నారు - రావడానికి ఎంతసేపు - కనీసం పాతిక అంబులెన్స్ లు అయినా కావాలి - ఇప్పుడు చేస్తుంటే అంబులెన్స్ లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి అంటూ కంగారుపడుతున్నారు ఏడుస్తున్నారు .
10 మినిట్స్ 10 మినిట్స్ మహీ ...... , డ్రైవర్ బ్రదర్ ...... మీకు తెలిసిన వెహికల్స్ ఏమైనా ఉన్నాయా ..... - బస్సు కార్స్ ...... ఏవైనా సరే .....
డ్రైవర్ : ఉన్నాయి సర్ .......
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ బ్రదర్ ...... ఎన్ని ఉంటే అన్నీ వెహికల్స్ ను హాస్టల్ దగ్గరికి రప్పించండి - అమౌంట్ ఎంతైనా ఇస్తాము అనిచెప్పండి .
డ్రైవర్ : సర్ ...... మా వంతు సహాయం చేస్తాము అని వేగంగా పోనిస్తూనే కాల్స్ చేస్తున్నారు .
క్యాంపస్ కు దగ్గరలో ఉన్న హాస్పిటల్ దగ్గర బస్సు ఆపించి , బావగారూ ...... సిటీలోని అన్నీ హాస్పిటల్స్ నుండి అందుబాటులో ఉన్న డాక్టర్స్ అందరినీ ఇక్కడికి చేర్చేలా అన్ని ప్రయత్నాలూ చెయ్యండి - బెడ్స్ రెడీ చెయ్యండి - పరిస్థితి తెలిసింది కదా మెడిసిన్ రెడీగా ఉంచేలా చూడండి .
బావగారు : నేను చూసుకుంటాను మహేష్ అంటూ కిందకుదిగి రైట్ రైట్ అంటూ ప్రైవేట్ హాస్పిటల్ లోపలికి పరుగులుతీశారు .
మహీ హలో మహీ ....... నిమిషంలో మళ్లీ కాల్ చేస్తాను అని కట్ చేసి , బాయ్స్ హాస్టల్లోని బ్రదర్స్ కు కాల్ చేసి విషయం చెప్పాను .
బ్రదర్ : రేయ్ రేయ్ ...... లేవండి లేవండి గర్ల్స్ హాస్టల్లో ప్రాబ్లమ్ మనవాళ్ళందరినీ లేపండి - వచ్చేస్తున్నాము మహేష్ ........
వెంటనే మహికి కాల్ చేసి క్యాంపస్ లోకి ఎంటర్ అవుతున్నాము - బాయ్స్ హాస్టల్ నుండి కూడా వస్తున్నారు - క్యాంపస్ కు దగ్గరలోని హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లూ చూస్తున్నారు బావగారు .
మహి : కృష్ణ - దివ్యక్క వచ్చారు . కృష్ణా కృష్ణా ........

రెండు నిమిషాలలో హాస్టల్ చేరుకున్నాను . కృష్ణగాడు ...... బాయ్స్ హాస్టల్ బ్రదర్స్ సహాయంతో కొంతమందిని కారులో కూర్చోబెడుతున్నాడు . పరుగునవెళ్లి రేయ్ మామా ....... మెయిన్ రోడ్డు ప్రక్కన ఉన్న ********** హాస్పిటల్ కు తీసుకెళ్లు .
మహి - సిస్టర్స్ ...... కంగారుపడుతూ వచ్చి లోపలికి పిలుచుకునివెళ్లారు . వార్డెన్ చాలా చాలా భయపడుతున్నారు , పిల్లలు ఏడుస్తున్నారు - స్టూడెంట్స్ పరిస్థితి చూస్తుంటే నాకే కంగారు పుడుతోంది .
వార్డెన్ : మహేష్ మహేష్ ........
వార్డెన్ ...... ఏమీ కాదు , హాస్పిటల్ కు తీసుకువెళదాము . నడవగలిగే వాళ్ళను నడిపించుకుంటూ - స్పృహ కోల్పోయినవారిని ఎత్తుకునివెళ్లి బస్సులోకి చేర్చాము - బస్సు ఫుల్ అయ్యే సమయానికి డ్రైవర్ కాల్ చేసిన వెహికల్స్ వరుసగా వచ్చాయి .
మహి - దివ్యక్క - సిస్టర్స్ - వార్డెన్ - బాయ్స్ సహాయంతో నిమిషాలలో హాస్టల్ స్టూడెంట్స్ అందరినీ వచ్చిన వెహికల్స్ లో హాస్పిటల్ కు పంపించాము - స్టూడెంట్స్ కు ధైర్యం చెబుతూ మహీ - దివ్యక్కా వాళ్ళు కూడా వెళ్లారు . హాస్పిటల్ దగ్గర కృష్ణగాడు - బావగారు ....... బెడ్స్ పైకి చేరుస్తున్నారు .
చివరి బస్సులో పిల్లలు - బాయ్స్ హాస్టల్ బ్రదర్స్ హాస్పిటల్ కు చేరుకుని పరుగున లోపలికివెళ్లాము .

హాస్పిటల్లోని అన్నీ వార్డ్ లలో పదిహేను మందికి పైగా డాక్టర్స్ తోపాటు బయట నుండి ఇంకా వస్తూరాగానే విషయం తెలుసుకుని ట్రీట్మెంట్ చేస్తున్నారు .
బావగారు : మహేష్ ....... ఫుడ్ పాయిజన్ అయిఉండొచ్చు అంటున్నారు అదే వంటలోకి గోడమీదనుండి ఏమైనా పురుగులు పడి ఉండొచ్చు అంటున్నారు - కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు - ట్రీట్మెంట్ చేస్తూ అందరికీ గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు - కావాల్సిన మందులన్నీ సమకూర్చాను .
కొద్దిసేపటికి డాక్టర్స్ వచ్చి బావగారు చెప్పినదే కంగారుపడాల్సిన అవసరం లేదు - హాస్టల్ ఫుడ్ తిన్నారని చెప్పారుకదా - వంట పాత్రలలోకి ఏమైనా పడి ఉండొచ్చు అది చూసుకోకుండా అందరికీ వడ్డించడం వలన ఇలా జరిగింది - వొమిట్స్ ద్వారా తిన్నదంతా బయటకువచ్చేసింది - కాస్త కడుపులో నొప్పిగా ఉంటుంది - ఉదయానికల్లా పర్ఫెక్ట్ అయిపోతారు - ఉదయం మాంచి విటమిన్స్ ప్రోటీన్స్ ఫుడ్ బాగా తింటే చాలు నార్మల్ అయిపోతారు .
డాక్టర్స్ ...... అందరూ ok కదా .......
డాక్టర్స్ : వెరీ వెరీ మైల్డ్ ఫుడ్ పాయిజన్ అంతే చెప్పాముకదా కంగారుపడాల్సిన అవసరమే లేదని - ఉదయం డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోవచ్చు - అనవసరంగా వీళ్ళ పేరెంట్స్ కు కాల్ చేసి కంగారుపెట్టకండి - వాళ్ళు మీకంటే ఎక్కువ భయపడిపోతారు .
దివ్యక్కా - మహీ - చెల్లెమ్మా - సిస్టర్స్ - వార్డెన్ ....... విన్నారుకదా , రిలాక్స్ .......
అన్నయ్యా - అన్నయ్యా - మహేష్ సర్ ...... అంటూ అందరూ నా గుండెలపైకి చేరారు .
బావగారూ ....... ఈ అభినందనలన్నీ మీకే చెందాలి - నిమిషాలలో పాతికమంది డాక్టర్స్ ను రప్పించారు . డాక్టర్స్ ....... థాంక్యూ థాంక్యూ థాంక్యూ sooooo మచ్ .
డాక్టర్స్ : స్టూడెంట్స్ రాకముందే మమ్మల్ని రప్పించిన వారికి ఈ థాంక్స్ లు చెప్పండి - సీరియస్ కాదు కాబట్టి ok , సీరియస్ పరిస్థితి ఉండి ఇలా మమ్మల్ని ముందే సమకూర్చితే ఎన్నో ప్రాణాలను బ్రతికించవచ్చు .
బావగారు : ఎవరోకాదు డాక్టర్ మా బావనే ........
డాక్టర్స్ : వెరీ గుడ్ ...... your name .......
దేవకన్య - సిస్టర్స్ : మహేష్ మహేష్ - మహేష్ సర్ అంటూ కన్నీళ్లను తుడుచుకుని కాస్త కూల్ అయినట్లు చెప్పారు .
డాక్టర్స్ : Well done మహేష్ ........
అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు .
డాక్టర్స్ : నర్సులకు జాగ్రత్తగా చూసుకోమని , అవసరమైతే ఇంఫార్న్ చెయ్యమని చెప్పాము - ఉదయం ఒకసారివచ్చి చెక్ చేస్తాము .
కృష్ణగాడు : డాక్టర్స్ ....... హాస్టల్ వంట గదిని శుభ్రం చేస్తే ok కదా ......
డాక్టర్స్ : ఈ పరిస్థితికి వంట గది మాత్రమే కారణం కాదు మిస్టర్ ....... , హాస్టల్ వాటర్ - వెంటిలేషన్ - ఈగలు దోమలు - స్మెల్ ........ ఇలా చాలానే కారణం - ఇండియన్ హాస్టల్స్ అంటేనే ఈ లోపాలు సాధారణం ........
దేవకన్య - సిస్టర్స్ : మా వార్డెన్ ....... ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదు అని బాధపడుతూ చెప్పారు .

అంతలో లోపలనుండి మరికొంతమంది డాక్టర్స్ వచ్చి డాక్టర్స్ ...... 90% స్టూడెంట్స్ స్పృహలోకివచ్చారు .
డాక్టర్స్ : మహేష్ ..... విన్నారుకదా , మీరు లోపలికివెళ్లి మాట్లాడవచ్చు , మాకు మా హాస్పిటల్స్ లో డ్యూటీ ఉంది .
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ డాక్టర్స్ .......
డాక్టర్స్ : Its our duty అనిచెప్పి వెళ్లిపోయారు .
దివ్యక్క - మహి అందరూ లోపలికి పరుగునవెళ్లి కళ్ళల్లో చెమ్మ - సంతోషంతో చుట్టూ అందరినీ పలకరించి సేఫ్ అని ధైర్యం చెబుతున్నారు .

బాయ్స్ హాస్టల్ బ్రదర్స్ వచ్చి మహేష్ ...... అందరూ సేఫ్ హ్యాపీ - నీ వల్లనే .......
మన అందరి వలన బ్రదర్స్ ........
బాయ్స్ : ఇక మేము హాస్టల్ కు వెళతాము .
జాగ్రత్త బ్రదర్స్ బస్సులో వెళ్ళండి .
బాయ్స్ : పర్లేదు నడుచుకుంటూ వెళ్లిపోతాము , ఉదయం కలుద్దాము అనిచెప్పి బయటకువెళ్లారు .
బావగారికి సైగచెయ్యడంతో బయటకువెళ్లి , బస్సులో వెళ్లేలా చేసివచ్చారు .

అంతలో చెల్లెమ్మ పేరెంట్స్ రవిగారు - అంటీ వచ్చారు . అంటీ ...... చెల్లెమ్మ దగ్గరికివెళ్లారు .
రవిగారూ ....... చెల్లెమ్మ కాల్ చేసిందా ? .
రవిగారు : మా అల్లుడు కాల్ చేసాడు మహేష్ .......
అబ్బో అబ్బో ...... అన్నాము నేను - బావగారు .
కృష్ణగాడు సిగ్గుపడుతున్నాడు .
రవిగారు : మహేష్ ...... ఇప్పుడెలా ఉన్నారు .
సేఫ్ రవిగారూ .......
రవిగారు : థాంక్ గాడ్ .......
రవిగారూ ....... ఇప్పటికిప్పుడు కాదనకుండా ఒక ముఖ్యమైన పని పూర్తి చేయించాలి .
రవిగారు : నీకు నీకు కాదనగలనా ...... ? , ఆర్డర్ వెయ్యి మహేష్ .......
రవిగారూ ...... ఆర్డర్ వెయ్యమన్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఇంపాజిబుల్ అని తెలిసికూడా రిక్వెస్ట్ అడుగుతున్నాను - మీ ఆర్కిటెక్ట్ ఫ్రెండ్స్ ఘాడమైన నిద్రలోఉన్నా లేపి వందల్లో వర్కర్స్ ను రెడీ చేస్తారో లేక వేలల్లో రెడీ చేస్తారో నాకనవసరం , సూర్యోదయానికల్లా ....... అత్యాశే అవుతుంది ఎంత సమయంలో వీలైతే అంత సమయంలో మొదట లేడీస్ హాస్టల్ ఆ తరువాత బాయ్స్ హాస్టల్ ..... 5 స్టార్ హోటల్లా మారిపోవాలి - ఇంటి నుండి వస్తున్న సిటీ స్టూడెంట్స్ కూడా 5 స్టార్ హోటల్లా మారిపోయిన హాస్టల్లో ఉండాలి అని కోరుకునేలా మారిపోవాలి - ఎంత ఖర్చయినా పర్లేదు కానీ త్వరగా పూర్తయిపోవాలి ప్లీజ్ ప్లీజ్ రవిగారూ ...... ఇది ఆర్డర్ కాదు - 5 స్టార్ హోటల్లా మారిపోయిన తరువాత వైజాగ్ లోని టాప్ చెఫ్స్ ను నేను సెట్ చేస్తాను .
రవిగారు : ఇంత మంచిపనిలో నేనూ భాగస్వామ్యం అవ్వడమే అదృష్టం , ఇదిగో ఫస్ట్ కాల్ చేసేస్తున్నాను .
థాంక్యూ రవిగారూ ...... , రేయ్ ...... మీ మావయ్యగారితోపాటు వెళ్లి నువ్వే దగ్గరుండి చూసుకో , గుర్తుపెట్టుకో మన సిస్టర్స్ డిశ్చార్జ్ అయ్యేలోపు పని పూర్తయిపోవాలి అని కార్డ్ ఇచ్చాను .
కృష్ణగాడు : రేయ్ మామా ....... ఈ మాటతో దేవుడైపోయావు - ప్రౌడ్ ఆఫ్ యు రా మామా ...... అంటూ కౌగిలించుకున్నాడు .
బావగారు : ఇంత తక్కువ సమయంలో ఒక్కరితో అవ్వదు , నేనూ హెల్ప్ చేస్తాను పదా బావా అంటూ వెళ్లారు .
లవ్ యు లవ్ యు బావగారూ .......
బావగారు : సెక్యూరిటీ ఆఫీసర్ల అనుమతి తీసుకుని క్లోజ్ అయిన షాప్స్ తెరిపించి అవసరమైనవాటిని కొని స్టార్ హాస్టల్ గా మార్పించేస్తాము అని వెళ్లారు .
అన్నీ వార్డులలో సిస్టర్స్ ..... బెడ్స్ పైన కూర్చుని మహి - సిస్టర్స్ - వార్డెన్ తో నవ్వుతూ మాట్లాడుతుండటం చూసి ఆనందించి బయట వెయిటింగ్ ఛైర్స్ లో కూర్చున్నాను .

దేవకన్య - విద్యు సిస్టర్ బయటకువచ్చి ఇక్కడ ఉన్నారా ...... థాంక్యూ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ ( థాంక్యూస్ ప్లేసస్ లో లవ్ యు లు మై హీరో ) అందరూ నార్మల్ అయిపోయారు - నొప్పికూడా వెయ్యడం లేదట అంటూ సంతోషంతో నా ప్రక్కన కూర్చున్నారు - ఎంత కంగారుపడిపోయామో తెలుసా .... ?
రావడానికి ఇంకెంతసేపురా మహేష్ అని కోప్పడటంలోనే అర్థమైంది మహీ .......
దేవకన్య : మహేష్ మహేష్ .......
నా దేవకన్య అలా ఆర్డర్ - డిమాండ్ వేయడమే నాకిష్టం , తోటి స్టూడెంట్స్ అంటే నా దేవకన్యకు ఎంత ఇష్టమో కన్నీళ్లను చూడగానే తెలిసింది - ఆ పరిస్థితులలో నేనున్నా నా దేవకన్యపై కోప్పడేవాడిని .......
సిస్టర్ : డార్లింగ్ ...... దేవకన్య దేవకన్య అని రెండుసార్లు పిలిచాడే ......
అయిపోయాను అంటూ గుట్టుచప్పుడు కాకుండా లేచి దూరం వెళుతున్నాను .
దేవకన్య : స్టాప్ హీరో ...... , లోపల అంతమంది పెదాలపై చిరునవ్వులు చిందింపచేసినందుకు గానూ ...... , ఈ క్షణం నుండీ దేవకన్య అని పిలవడానికి పర్మిషన్ ఇచ్చేస్తున్నాము .
రియల్లీ రియల్లీ ....... యాహూ యాహూ .......
దేవకన్య : చాలు చాలు వచ్చి కూర్చోండి సర్ ....... అంటూ లేచిమరీ నా చేతిని అందుకుని కూర్చోబెట్టారు . అయినా లోపల హాస్టల్ మేట్స్ అందరూ నిన్ను చూడాలని ఆశపడుతుంటే ఒంటరిగా ఇక్కడ కూర్చున్నారు ఏమిటి ? రండి లోపలికి వెళదాము .
నో నో నో మహీ ...... , నా వలన ఒక్క క్షణం కూడా వాళ్ళు రెస్ట్ తీసుకోవడం వేస్ట్ కాకూడదు - ఉదయం వరకూ బాగా రెస్ట్ తీసుకోనిద్దాము - మనం ఉదయమైనా కలవచ్చు కాలేజ్ లోనైనా కలవచ్చు .
దివ్యక్క : డాక్టర్ - నర్సులానే చెప్పారు అన్నయ్యా ........ , రెస్ట్ అవసరం - మీరు బయటకు వెళ్ళాలి అంటూ ఇండైరెక్ట్ గా చెప్పారు అన్నయ్యా నర్సులు .......
అందరమూ సంతోషంతో నవ్వుకున్నాము దివ్యక్క - చెల్లెమ్మతోపాటు .......
దివ్యక్క : ప్రేమ - ఆప్యాయతలు పంచడంలో మా అన్నయ్య తరువాతనే ఎవ్వరైనా ఉమ్మా ఉమ్మా .......
లవ్ యు దివ్యక్కా .......

వార్డెన్ ...... పిల్లలిద్దరినీ లోపల ఖాళీగా ఉన్న బెడ్స్ పై పడుకోబెట్టాల్సింది . దివ్యక్కా - మహీ .......
వార్డెన్ : మహేష్ అంటూ కళ్ళల్లో కన్నీళ్ళతో పాదాలను తాకబోయారు .
వార్డెన్ అంటూ ఆపి లేచాను .
వార్డెన్ : మహి - విద్యు వాళ్ళు కాల్ చెయ్యగానే నువ్వు ఇంత త్వరగా రియాక్ట్ అవ్వడం వల్లనే ఏ ఆపదా జరుగలేదు . మన స్టూడెంట్స్ లో ఒక్కరికి ఏమైనా అయినా నేను జీవించినా .......
వార్డెన్ వార్డెన్ ...... అంతమాట అనకండి , మీ మంచితనం వల్లనే ఎవ్వరికీ ఏ అపాయం కలుగలేదు - మీరు రిలాక్స్ గా కూర్చోండి అంటూ నా ప్లేస్ లో కూర్చోబెట్టాను .
మహి - సిస్టర్స్ : వార్డెన్ ...... మీరున్నారన్న దైర్యంతోనే కదా ...... లోపల అందరూ మా పేరెంట్స్ కు కూడా తెలియనివ్వద్దు అన్నారు .
రియల్లీ ....... , అది చాలు వార్డెన్ ...... మీ గురించి చెప్పడానికి , ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు పాటిస్తే సరి ......
అందరూ వార్డెన్ ను ఓదార్చారు . దివ్యక్క - మహి లోపలికివెళ్లి ఖాళీ బెడ్ పై పిల్లలిద్దరినీ పడుకోబెట్టి వచ్చారు .

అదేసమయానికి ప్రిన్సిపాల్ గారు కంగారుపడుతూ రావడం చూసి అందరూ లేచి నిలబడ్డాము . వార్డెన్ గారూ ...... ఎలా ఉంది పరిస్థితి .
డాక్టర్స్ చెప్పినది వివరించడంతో థాంక్ గాడ్ గండం గట్టెక్కింది - ఇప్పటికి నామనసు కుదుటపడింది - మహేష్ ...... ప్రౌడ్ ఆఫ్ యు యంగ్ మ్యాన్ అంటూ ఏకంగా కౌగిలించుకుని అభినందించారు .
సర్ ...... నేనేమి చేసాను ? .
ప్రిన్సి : Thats why i like you మహేష్ ....... , వార్డెన్ గారు కాల్ చేసి మొత్తం చెప్పారు , అల్లరిలోనే కాదు సరైన సమయంలో ఇంతమంది సేఫ్టీ ...... సూపర్ - ఇక నుండీ నీకు .... నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది , క్యాంపస్ లో ఏమైనా చేసుకో , నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు .
దేవకన్య : నో నో నో సర్ ....... , మామూలుగానే పీక్స్ లో ఉంటుంది ఇక ఇలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే పట్టుకోవడం కష్టం ......
సిస్టర్స్ - చెల్లెమ్మతోపాటు వార్డెన్ కూడా నవ్వేశారు .
థాంక్యూ ప్రిన్సిపల్ సర్ ...... అంటూ నాదేవకన్య వైపు కన్నుకొట్టాను .
దేవకన్య : చూసారా చూసారా ........

ప్రిన్సి : అన్నీ వార్డ్స్ లో హాయిగా రెస్ట్ తీసుకుంటున్న స్టూడెంట్స్ ను చూసి , మహేష్ - వార్డెన్ ....... ఇంటిదగ్గర మీ మేడం కంగారుపడుతుంటారు , కాల్ చేసి కాకుండా డైరెక్ట్ గా చెబితేనే మంచిది , ఉదయమే వచ్చేస్తాను . By the way ...... రేపు కాదు కాదు 12 దాటింది కదా ఈరోజు కాలేజ్ కు లీవ్ sanction చేసాను రేపు ఎల్లుండి ఎలాగో వీకెండ్ హాలిడేస్ ...... , ఫుల్ గా రికవరీ అయ్యి Monday కాలేజ్ కు వచ్చెయ్యండి .
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ .......
ప్రిన్సి : I am స్టూడెంట్స్ ప్రిన్సిపాల్ ...... , లోపల బెడ్స్ ఖాళీగా ఉన్నాయికదా రెస్ట్ తీసుకోండి అనిచెప్పి బయటకు నడిచారు .
దివ్యక్కా - మహీ ...... ఒక్క నిమిషం అంటూ బయటకువెళుతున్న సర్ దగ్గరకువెళ్ళాను . సర్ ...... నన్ను క్షమించాలి - మిమ్మల్ని ఒక్కమాటైనా అడగకుండా మీ పర్మిషన్ తీసుకోకుండా నా డబ్బుతో హాస్టల్ చేంజ్ ఓవర్ చేయిస్తున్నాను ఇలా మళ్లీ జరగకుండా అంటూ చేతులుకట్టుకుని తలదించుకున్నాను .
ప్రిన్సి : ప్రౌడ్ ఆఫ్ యు ప్రౌడ్ ఆఫ్ యు మహేష్ అంటూ మళ్లీ కౌగిలించుకున్నారు . ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించకుండా చదువుతున్న క్యాంపస్ కోసం ఇంత మంచిపని చేస్తూ తప్పుచేసినవాడిలా తలదించుకున్నావు ఏంటి మహేష్ - చెప్పానుకదా ఇకనుండీ నా అనుమతి కూడా అవసరం లేదు దూసుకుపో ఎవరు అడ్డువస్తారో నేనూ చూస్తాను .
థాంక్యూ సర్ ....... అంటూ గౌరవంతో కార్ డోర్ తెరిచాను .
ప్రిన్సి : డబ్బుతోపాటు వినయవిధేయతలు ...... , నీకు అపజయమే ఉండదు మహేష్ అంటూ భుజం తట్టి వెళ్లిపోయారు .

హాస్టల్ స్టూడెంట్స్ అందరినీ తమ తమ వెహికల్లో తీసుకొచ్చిన డ్రైవర్స్ అంతటి చలిలోనూ బయటనే ఎదురుచూస్తుండటం చూసి , వెంటనే వెళ్లి sorry చెప్పాను . కంగారులో మీ గురించే మరిచిపోయాను .
డ్రైవర్స్ : అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మీరు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు - మేము అర్థం చేసుకోగలం సర్ .......
థాంక్యూ థాంక్యూ ...... , అన్నలూ ...... క్యాష్ లేదు ఫోన్ పే - అమెజాన్ పే - G పే ....... నంబర్స్ ఇస్తే అమౌంట్ ........
డ్రైవర్స్ : సర్ సర్ సర్ ...... మేము అమౌంట్ కోసం కాదు - లోపల అందరి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని ఆగాము , ఇప్పుడు ఎలా ఉంది సర్ .......
మీరు సమయానికి తీసుకురావడం వలన అందరూ సేఫ్ అన్నలూ ....... రేపు ఉదయం డిశ్చార్జ్ చేసేస్తారు ., మీరు లేకపోయుంటే కష్టమైపోయేది థాంక్యూ థాంక్యూ అంటూ కౌగిలించుకున్నాను .
డ్రైవర్స్ : అందరూ రిలాక్స్ అయ్యారు - అందరిలో సంతోషం - ఈ మాట కోసమే ఎదురుచూస్తున్నాము సర్ - ఇక సంతోషంతో ఇంటికివెళతాము .
అన్నలూ అన్నలూ ....... మీ సహాయం మరువలేనిది , మీ నెంబర్ ఇవ్వండి ......
డ్రైవర్స్ : అవునవును రేపు అందరినీ హాస్టల్ కు తీసుకెళ్లి వదలాలి కదా నెంబర్ తీసుకోండి ********** .
అన్నలూ అంటూ సంతోషంతో కౌగిలించుకున్నాను .
డ్రైవర్స్ : కాల్ చెయ్యండి సర్ వచ్చేస్తాము - మీవలన ఇంతమందిని రక్షించినందుకు కలిగిన ఆనందంతో పోలిస్తే ఎంత డబ్బు సంపాదించినా వృధా ..... హ్యాపీగా వెళ్లి మళ్లీ వస్తాము . అంతే అందరూ కలిసి కాల్ చేసిన డ్రైవర్ అన్నను సంతోషంతో ఎత్తుకుని బయట వెహికల్స్ వరకూ వెళ్లారు .

పెదాలపై చిరునవ్వులతో లోపలికివచ్చి , దివ్యక్కా - చెల్లెమ్మా - మహీ - సిస్టర్స్ ...... లోపల బెడ్స్ ఖాళీగా ఉన్నాయికదా ........
దేవకన్య : స్టాప్ స్టాప్ ....... తమరు పడుకుంటారా చెప్పండి .
అవసరం పడొచ్చు ఒకరు మేల్కొనే ఉండాలికదా .......
అందరూ : అయితే మేముకూడా మేల్కొనే ఉంటాము .
ఫిక్స్ అయిపోయారన్నమాట , అంటీ ...... అంకుల్ ఒక ముఖ్యమైన పనిమీద వెళ్లారు , మిమ్మల్ని ఇంటివరకూ వదిలిరానా ...... ? .
అంటీ : ఆయనా లేకుండా - నీ చెల్లీ ...... లేకుండా ఒంటరిగా నాకు భయం , నేనూ ఇక్కడే ఉంటాను - ఎలాగో మిమ్మల్ని వదిలి నా తల్లి రాదని తెలుసు .......
చెల్లెమ్మ : రానంటే రాను అంటూ దేవకన్య - దివ్యక్క చేతులను చుట్టేసింది .
Next page: Update 29
Previous page: Update 27