Update 31

జ్యూస్ తాగి కృష్ణ సర్ బయట ఉంటాము అని డ్రైవర్స్ అన్నలు వెళ్లారు .

దేవకన్య : దివ్యా దివ్యా ...... ఫస్ట్ మీ అన్నయ్య రూమ్ చూడాలి తీసుకెళ్లు .......
దివ్యక్క : నీ దేవుడి రూమ్ - ఇకనుండీ నీ రూమ్ ...... , ఫస్ట్ ఫ్లోర్ రైట్ సైడ్ మిడిల్ రూమ్ - లిఫ్ట్ లో వెళదామా లేక స్టెప్స్ లో వెళదామా ....... ? .
దేవకన్య : లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి wait చేసేంత ఓపిక ఏమాత్రం లేదు అంటూ దివ్యక్క చేతిని అందుకుని స్టెప్స్ పై పరుగులుతీశారు .
చెల్లెమ్మ - సిస్టర్స్ : అక్కయ్యలూ - డార్లింగ్స్ మేమూ వస్తాము అంటూ వెనుకే పరుగులుతీశారు .
అంటీ సంతోషించి , పెద్దమ్మకు వంటలో సహాయం చేయడానికి వంట గదిలోకివెళ్లారు .

దివ్యక్క : ఇదే మీ రూమ్ మహీ ...... కానివ్వు . లోపల చూసి ఎంత పులకించిపోతావో మొబైల్లో రికార్డ్ చేస్తాను - నువ్వు ...... నీ దేవుడి లవ్ accept చేసిన క్షణం చూయిస్తాను .
దేవకన్య : లవ్ యు దివ్యా అంటూ పెదాలపై చిరునవ్వులతో ఓపెన్ చేసి లోపలికివెళ్లి చుట్టూ చూస్తూ సంతోషంతో పరవశించిపోతున్నారు . చుట్టూ గోడలపై
" అమ్మ " అక్షరాలతోపాటు చిరునవ్వులు చిందిస్తున్న - చిరుకోపంతో ఉన్న - తియ్యనైన కోపంతో ఉన్న - సిగ్గుపడుతున్న - స్వీట్ వార్నింగ్ ఇస్తున్న - చదువుకుంటున్న ....... అన్నీ అన్నీ ఫోటోలు గోడ పరిమాణంలో ఉండటం ఆనందబాస్పాలతో అలాచూస్తుండిపోయారు . ప్రతీ ఫోటో ముందు లవ్లీ క్యూటెస్ట్ టెడ్డి బేర్స్ ఉండటం చూసి లవ్ యు లవ్ యు అంటూ వెళ్లి అన్నింటినీ పట్టుకోవడానికి వీలుకాకపోయినా అందుకుని గుండెలపై హత్తుకుని ఉమ్మా ఉమ్మా ఉమ్మా మహేష్ ..... మై గాడ్ అంటూ ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
చెల్లెమ్మ - సిస్టర్స్ లోపలికివచ్చి Wow బ్యూటిఫుల్ అంటూ అంతులేని ఆనందంలో మునిగిపోయిన దేవకన్య బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దివ్యక్క : చెల్లీ కృష్ణా ...... ప్రక్కగదిలోకి వెళ్లు నువ్వుకూడా ...... అని మాట పూర్తికాకముందే .......
చెల్లెమ్మ ....... ప్రక్కనే ఉన్న కృష్ణగాడి గదిలోకివెళ్లి , సంతోషం పట్టలేక కేకలువేస్తూనే లవ్ యు లవ్ యు కృష్ణా అంటూ బిల్డింగ్ మొత్తం వినిపించేలా ప్రపోజ్ చేసింది .
కింద ఉన్న కృష్ణగాడు విని సిగ్గుపడుతున్నాడు .

విద్యు సిస్టర్ : ఎంతసేపు పులకించిపోతావో అంతసేపు తనివితీరా ఎంజాయ్ చెయ్యి డార్లింగ్ ........ , ఇదిగో నీ లగేజీ ...... ఇక్కడే ఉండిపోతావా ఉండిపో , వెంటనే స్నానం చెయ్యకపోతే వొళ్ళంతా ....... అప్పుడే తిమ్మిరివేస్తోంది - పదండి డార్లింగ్స్ ........
దివ్యక్క : అవునవును మహీ ...... ఇక్కడే ఉండిపో , సిస్టర్స్ ....... ఈ ఫ్లోర్లో ఎదురుగా త్రీ రూమ్స్ - పైన బోలెడన్ని రూమ్స్ ఉన్నాయి మీ ఇష్టం .......
సిస్టర్స్ : లవ్ యు దివ్యా ....... వెంటనే ఫ్రెష్ అవ్వాలి అంటూ అందరూ సెకండ్ ఫ్లోర్ రూమ్స్ లోకి చేరారు .

దేవకన్య : తేరుకుని , టెడ్డీ బేర్స్ ను బెడ్ పై ఉంచి , హ్యాంగర్ కు తగిలించిన నా షర్ట్ ను అందుకుని మనసారా హృదయానికి హత్తుకుని ఆఅహ్హ్హ్ ...... లవ్ యు మై గాడు - మహేష్ ....... మన బాత్రూమ్లోకివెళ్లి , బట్టలన్నీ విప్పి మన షవర్ కింద నిలబడి , మన షాంపూ - సబ్బుతో స్నానం చేసి , మన టవల్ చుట్టుకుంటాను అంటూ షర్ట్ కు ముద్దుపెట్టి హ్యాంగర్ కు తగిలించి సిగ్గుపడుతూ బాత్రూమ్లోకివెళ్లి , మనసులో అనుకున్నట్లుగానే షవర్ కిందకు చేరి సబ్బు అందుకుని వాసన పీల్చి మైమరచి తలంటు స్నానం చేసి టవల్ చుట్టుకుని బయటకువచ్చారు . ఇన్ని ఫోటోలు ఉన్నాయి ఒక్కటైనా నా దేవుడిది లేదు - నా దేవుడి అమ్మ ఉన్నారుకదా అని ముద్దుపెట్టి అందమైన నవ్వులతో డ్రెస్ వేసుకున్నారు .

బయట దివ్యక్క వెళ్లడం చూసి , దివ్యా ...... ఎక్కడికి ? .
దివ్యక్క : వంటలో పెద్దమ్మకు సహాయం చేయడానికి .......
దేవకన్య : నేనుకూడా వస్తాను అంటూ బెడ్ దగ్గరికివచ్చి ఒక టెడ్డీ బేర్ అందుకుని ముద్దులుపెడుతూ , ఒకరినొకరు చేతులు పెనవేసి చిరునవ్వులు చిందిస్తూ వంట గదిలోకివెళ్లి , అమ్మా అమ్మా ...... అంటూ అంటీ బుగ్గలపై ముద్దులుపెట్టి , ఇక మేము చూసుకుంటాము మీరు పైకివెళ్లి ఫ్రెష్ అవ్వండి కావాలంటే మా డ్రెస్ వేసుకోండి మీరింకా యంగ్ గానే ఉన్నారు అంటూ దివ్యక్క తన గదిని చూయించి పంపారు . పెద్దమ్మా ....... ఇన్ని వంటలే ........
పెద్దమ్మ : వచ్చినవారంతా మహేష్ కు ప్రాణమైనవారు - ఇష్టంతో వండుతున్నాను తల్లులూ .......
దివ్యక్క - దేవకన్య : థాంక్యూ పెద్దమ్మా ....... , ఇకనుండీ ఏమిచెయ్యాలో ఆర్డర్ వెయ్యండి మేమూ హెల్ప్ చేస్తాము .
కొద్దిసేపటి తరువాత చెల్లెమ్మ - ఆ తరువాత సిస్టర్స్ కూడా హెల్ప్ చెయ్యడంతో లంచ్ సమయానికి నోరూరించే వెజ్ వంటలు బోలెడన్ని రెడీ అయిపోయాయి - అన్నింటినీ డైనింగ్ టేబుల్ మీదకు షిఫ్ట్ చేసేసారు - ప్లేస్ సరిపోకపోవడంతో నవ్వుకుని ప్రక్కన నేలపై ఉంచారు .

గంట ముందు వెళ్లిన నేను , హాస్టల్ కోసం ఫర్నిచర్ షాప్ లో సెలెక్ట్ చేసి పంపిస్తున్న బావగారి దగ్గరకువెళ్ళాను . బావగారు - రవిగారూ ....... ఇక నేను చూసుకుంటాను మీరు ఇంటికివెళ్లి ఫ్రెష్ అవ్వండి అనిచెప్పాను .
బావగారు : ఇక ఫర్నీచరే లాస్ట్ బావా ...... , పూర్తిచేసి కలిసే వెళదాము - సాయంత్రం లోపు బాయ్స్ హాస్టల్ కూడా రెడీ అయిపోతుంది .
బావగారూ ...... మీకోసం దివ్యక్క - రవిగారూ ...... మీకోసం చెల్లెమ్మ అంటీ ఎదురుచూస్తున్నారు .
బావగారు : నువ్వుచెప్పిన పనికదా వాళ్ళు అర్థం చేసుకుంటారు .
రవిగారు : అవునవును ........
లవ్ యు బావగారూ అంటూ కౌగిలించుకుని , రవిగారికి థాంక్స్ చెప్పాను .
రవిగారు : ఇక ముగ్గురం కలిసాము కదా మరింత త్వరగా పూర్తయిపోతుంది .
హాస్టల్ కోసం ఏమేమి ఫర్నిచర్ కావాలో సెలెక్ట్ చేసి పనివాళ్ళతో పంపిస్తున్నాము .
********

అదేసమయానికి ఇక్కడ వంట పూర్తయి వంటలను డైనింగ్ టేబుల్ పైకి చేర్చారు . ఇప్పటివరకూ ముగ్గురు , మా బావ వచ్చినప్పుడు నలుగురు మాత్రమే తినేవాళ్ళం కాబట్టి ఈ డైనింగ్ టేబుల్ సరిపోయేది - అన్నయ్యకు ...... అందరూ కలిసితినడం ఇష్టం , ఇప్పుడు అలా కుదరదు ఏమిచేద్దాము మహీ - చెల్లీ - విద్యు ........ అంటూ ఫీల్ అవుతున్నారు దివ్యక్క .
దేవకన్య : మీ అన్నయ్యగారు ఏదో ప్లాన్ చేసే ఉంటారు కాల్ చేసి లంచ్ కు పిలువు దివ్యా ........
అవునవును అక్కయ్యా ...... ఆకలి దంచేస్తోంది తొందరగా తొందరగా పిలవండి అంటూ ఆతృతతో చెప్పాడు .
అందరితోపాటు చెల్లెమ్మ నవ్వుకుని , కృష్ణగాడి చేతిని చుట్టేసి , అన్నయ్యలు వచ్చేన్తవరకూ నో లంచ్ - హీరో ...... ఆకలివేస్తే అంతవరకూ నన్ను తిను .
ఆహా ....... అంటూ అందరూ ఆటపట్టించారు - చెల్లీ ...... అమ్మ ఉంది చూసుకుని మాట్లాడు .
కృష్ణ : లవ్ యు ఏంజెల్ .......
దివ్యక్క : అందరితోపాటు తియ్యదనంతో నవ్వుకుని , మహీ ....... నువ్వు , మీ హీరోకు కాల్ చెయ్యి - నేను ...... నా హీరోకు కాల్ చేస్తాను .
దేవకన్య : పెదాలపై అందమైన నవ్వులతో ఐఫోన్ నుండి ఏకంగా వీడియో కాల్ చేశారు .

ఇక్కడ ఇద్దరమూ పెదాలపై చిరునవ్వులతో ఎత్తాము . మహేష్ - కిషోర్ ....... వంటలన్నీ రెడీ మీరు వచ్చేస్తే అందరం కలిసి తిందాము .
నేను - బావగారు : చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి .
దివ్యక్క : మహి దగ్గరకు చేరి , అన్నయ్యా ...... పెద్దమ్మ - అంటీ - మీ దేవకన్య - చెల్లెమ్మ - సిస్టర్స్ అందరమూ కలిసి వండాము .
Wow wow wow ....... , అయితే వెంటనే కుమ్మాల్సిందే ....... , ప్చ్ ...... కానీ రావడానికి గంట అయినా పడుతుంది దివ్యక్కా ....... , వర్క్ ఫైనల్ లో ఉంది వదిలి రావడం కుదరదు - మీరు కానివ్వండి , ఇదిగో బావగారిని పంపిస్తాను - రేయ్ మామా ...... నువ్వు ఆగలేవు సిగ్గుపడకుండా తిను .
బావగారు : బావోయ్ ...... నిన్ను వదిలి ఇంటికి వెళితే మీ అక్కయ్య వాయించేస్తుంది కాబట్టి గంట తరువాత కలిసే వెళదాము .
అందరూ నవ్వుకున్నారు .
రవిగారూ ....... మీరైనా వెళ్ళండి .
రవిగారు : చూస్తున్నారా ....... వెనుక మీ అంటీ ఎంత కోపంగా మారిపోయిందో , మిమ్మల్ని గనుక వదిలి వెళితే పప్పుగిత్తి తిరగేసి కొట్టినా కొడతారు , నేను వెళ్లను బాబోయ్ .........
అక్కడ నవ్వులే నవ్వులు .........
నవ్వుకుని , దివ్యక్కా - మహీ - చెల్లెమ్మా - సిస్టర్స్ ....... మేము రావడానికి ఆలస్యం అవుతుంది - ఇప్పటికే 2 గంటలు అవుతోంది మీరు తృప్తిగా భోజనం చేసి హాయిగా రెస్ట్ తీసుకోండి ఎందుకంటే సాయంత్రం బాయ్స్ హాస్టల్ ఓపెన్ చేసి మీ హాస్టల్ మేట్స్ ను కలవాలికదా ....... వీడియో కాల్ చేసినందుకు లవ్ యు మహీ ...... అంటూ సిగ్గుపడుతూ కట్ చేసాను .
**********

అక్కడ
దివ్యక్క : మన హీరోలు రావడానికి ఇంకా గంట సమయం పడుతుందట , what do you say సిస్టర్స్ .........
సిస్టర్స్ : మాకైతే ఆకలిగా లేదు , మహేష్ సర్ వచ్చేన్తవరకూ wait చేస్తాము .
దివ్యక్క - దేవకన్య : లవ్ యు లవ్ యు అంటూ అందరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . అంతవరకూ టీవీలో షో చూద్దాము .
కృష్ణగాడు : ప్చ్ ...... అయిపోయాను .
చెల్లెమ్మ : మా బంగారం కదూ మా హీరో కదూ ....... అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టింది .
అందరితోపాటు దేవకన్య నవ్వుకుని , ఒక బౌల్ లో పాయసం తీసుకునివెళ్లి , చెల్లీ ....... నా బుజ్జి అన్నయ్యకు తినిపించు అని అందించింది .
కృష్ణ : లవ్ యు లవ్ యు సిస్టర్ ........
చెల్లెమ్మ : అన్నయ్యకోసం ఇంతమంది ప్రేమతో wait చేస్తున్నారు అంటూ బుగ్గను గిల్లేసింది .
కృష్ణగాడు : నాగురించి మీ అన్నయ్యకు బాగా తెలుసులే ఏంజెల్ ....... , ఓన్లీ పాయసం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ......
చెల్లెమ్మ : ఇలారా అంటూ బయటకు తీసుకెళ్లి , గార్డెన్ లో తినిపించింది .
**********

ఇక్కడ అరగంటలో మాపని పూర్తయ్యింది . బావగారూ ....... మన ఫ్యామిలీ పెరిగింది - అందరమూ కలిసి తినాలంటే ఇప్పుడున్న డైనింగ్ టేబుల్ ఏమాత్రం సరిపోదు కాబట్టి ఫ్లైట్ లో లా లాంగెస్ట్ డైనింగ్ టేబుల్ సెలెక్ట్ చెయ్యండి .
బావగారు : సూపర్ బావా ....... అంటూ మొత్తం చూసినా అంత లాంగెస్ట్ డైనింగ్ టేబుల్ లేకపోవడంతో నిరాశ చెందారు .
రవిగారు : మన ఆర్కిటెక్ట్ సహాయం తీసుకుందాము అని కాల్ చేశారు . మొబైల్ ను షాప్ ఓనర్ కు ఇవ్వమన్నట్లు ఇచ్చారు .
ఓనర్ మాట్లాడి , సర్ ....... మీకు సరిపోయినన్ని ఇష్టమైన డైనింగ్ టేబుల్స్ సెలెక్ట్ చెయ్యండి అర గంటలో మీరు కోరినట్లుగా రెడీ చేసి నేరుగా ఇంటికే డెలివరీ చేస్తాము .
గుడ్ ఐడియా ....... అంటూ ఒక్కొక్కరము ఒక్కొక్క డైనింగ్ టేబుల్ సెలెక్ట్ చేసి బయటకువచ్చాము .

బావగారూ ...... అంకుల్ తోపాటు మీరు ఇంటికివెళ్లండి , నిన్న మిగిలిపోయిన పనిని పూర్తిచేసుకునివచ్చేస్తాను .
బావగారు : ఫ్లైట్ లోని షాపింగ్ కదా ....... పద బావా నేనూ వస్తాను అంకుల్ మీరు , మా ఇంటికివెళ్లండి - బావా ....... చెప్పానుకదా ఎంత ఆలస్యమైనా నువ్వులేకుండా వెళితే ఫుడ్ కూడా ఉండదు .
రవిగారు : నాదీ అదే పరిస్థితి , ముగ్గురమూ వెళదాము పదండి అని నవ్వుకుంటూ లగేజీ వెహికల్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్ చేరుకున్నాము .
పైలట్ రాథోడ్ గారికి కాల్ చెయ్యడంతో పర్మిషన్ ఇప్పించడంతో ....... , సెక్యురిటి చెకప్ తరువాత వెహికల్ తోపాటు నేరుగా రన్ వే దగ్గరికివెళ్లి , పనివాళ్ళ సహాయంతో 15 నిమిషాలలో షాపింగ్ అంతటినీ వెహికల్లోకి ట్రాన్స్ఫర్ చేసి , ఒకరోజంతా wait చేయించినందుకు sorry చెప్పాను .
రాథోడ్ : నో నో నో ....... I am your పైలట్ మహేష్ , dont worry ....... బై బై అనిచెప్పి ఫ్లైట్ ఎక్కారు . మేము ఇంటికి - ఫ్లైట్ హైద్రాబాద్ కు ........

ఇంటికి చేరుకునేసరికి ఫర్నిచర్ షాప్ వెహికల్ నుండి మూడు పొడవైన డైనింగ్ టేబుల్స్ - లగ్జరీ ఛైర్స్ ను లోపలికి చేరవేస్తున్నారు . డెలివరీ బాయ్స్ కు డ్రైవర్ అన్న కూడా సహాయం చేస్తున్నాడు - అతడి బస్సు కూడా బయటే ఉంది - ఫర్నిచర్ షాప్ ఆర్కిటెక్ట్ లోపలికివెళ్లి హాల్లో మూడింటినీ లాంగెస్ట్ డైనింగ్ టేబుల్ లా సెట్ చేస్తున్నారు .
డెలివరీ లిస్ట్ లో సంతకం చేసి , బాయ్స్ తృప్తికోసం కాస్త అమౌంట్ ఇచ్చాను . థాంక్యూ థాంక్యూ సర్ అంతో సంతోషంతో వెళ్లారు .
అన్నా ....... వాళ్ళు ఉన్నారుకదా , మీరెందుకు హెల్ప్ చేశారు - మీ వాళ్ళు ముగ్గురూ వెళ్లారుకదా మీరూ వెళ్ళండి .
డ్రైవర్ : ఇక ఇక్కడే మహేష్ సర్ ....... వాళ్లూ ఇదే చెప్పారు , రేయ్ నువ్వు ఉంటావా మమ్మల్ని ఉండమంటావా అని - మీరు ఔనన్నా కాదన్నా సాలరీ ఇచ్చినా ఇవ్వకపోయినా ....... ఇకనుండీ మీ డ్రైవర్ ను - సర్ ..... నేను ఉండగా మరొక వెహికల్ ఎందుకు బుక్ చేశారు - ఒక్క కాల్ చేసి ఉంటే వచ్చేసేవాడిని ఇది మంచిపధ్ధతి కాదు మహేష్ సర్ ...... - అప్పుడే చెప్పాము కదా ఇకనుండీ మీ భక్తులం అని , ఏపని ఉన్నా మాకే చెప్పాలి ప్రామిస్ అంతే .......
సాలరీ లేకుండా ఎలా అన్నా .......
డ్రైవర్ : పర్లేదు సర్ - నా కుటుంబం ఇప్పుడున్న డబ్బుతో ఒంటి పూట తిని మిమ్మల్ని సేవించుకుంటాము - ఈ మాటలు చెప్పినది స్వయానా నా ఆలి .
బావగారు : బావా .......
టచ్ చేశారు అన్నా ....... , బావగారూ ....... సాలరీ ఫిక్స్ చెయ్యండి .
బావగారు : నెలకు పాతికవేలు , ఇదిగోండి పది వేలు అడ్వాన్స్ అంటూ షాక్ లో వద్దు వద్దు అన్నా జేబులో ఉంచారు .

అంతలో డైనింగ్ టేబుల్ కూడా ఫిట్టింగ్ పూర్తయినట్లు ఆర్కిటెక్ట్ వారి వెహికల్లో వెళ్లిపోయారు .
కృష్ణగాడు : రేయ్ ...... ఇక అన్నీ పూర్తయినట్లే కదా ......
వెహికల్లోని షాపింగ్ ను లోపలికి చేరిస్తే .........
కృష్ణగాడు : త్వరగా చేరుద్దాము - లోపల మీకోసమే ఒక్కరుకూడా తినకుండా wait చేస్తున్నారు .
ఈ విషయం ఇప్పుడారా చెప్పేది , కమాన్ కమాన్ ....... కిందకు దించండి .
కృష్ణగాడు : నేను - అన్న లోపలికి చేరుస్తాములే కానీ అంతలోపు మీరు వెళ్లి స్నానం చెయ్యండి - మావయ్యగారూ ....... అత్తయ్యగారు , మీ డ్రెస్సుకూడా తెప్పించారు - నా రూంలో ఉంచాను వెళ్లి అక్కడే ఫ్రెష్ అవ్వండి .
మావయ్యా గారు - అత్తయ్యగారు ....... అబ్బో అబ్బో ...... అంటూ కృష్ణగాడికి గిలిగింతలుపెట్టి , రవి గారిని పిలుచుకుని లోపలికివెళ్లాము .

దివ్యక్క : బావగారి బుగ్గపై ముద్దుపెట్టి , అన్నయ్యా ....... అంటూ వచ్చి నా చేతిని చుట్టేశారు . అన్నయ్యా అన్నయ్యా ....... మా అన్నయ్యకు అందరూ కలిసి తినడం ఇష్టం అని మాట్లాడుకున్నాము - ఇలా ప్లాన్ చేసి ఉంటారని నీ దేవకన్య కాన్ఫిడెంట్ గా చెప్పనే చెప్పారు - సూపర్ అన్నయ్యా ఉమ్మా ఉమ్మా .......
థాంక్స్ మహీ ....... , దివ్యక్కా - మహీ - చెల్లెమ్మా ....... మాకోసం , సిస్టర్స్ ను wait చేయించడం ఏమైనా బాగుందా ...... ? .
చెల్లెమ్మ : అసలు మీరు వచ్చేవరకూ wait చేద్దామని చెప్పినదే సిస్టర్స్ అన్నయ్యా ........ - అక్కయ్యలయితే ముద్దులుపెట్టిమరీ ....... సంతోషంతో wait చేస్తున్నాము.
థాంక్యూ సిస్టర్స్ ........
సిస్టర్స్ : ఒక్క ఫ్యామిలీ కదా మహేష్ సర్ ........
కృష్ణగాడు ....... షాపింగ్ లోపల పెట్టించడానికి వచ్చి , రేయ్ రేయ్ ...... ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి ఇప్పటికే ఆలస్యం అయ్యిందని అనుకుంటుంటేనూ అంటూ మెడను చుట్టేసాడు .
Ok ok వెళుతున్నానురా అంటూ పైకి పరుగుపెట్టాను .
అందరూ నవ్వుకున్నారు - అంకుల్ ...... కృష్ణ గదిలోకి , బావగారు ...... దివ్యక్క గదిలోకివెళ్లారు .

లోపల బెడ్ పై అన్నీ టెడ్డి బేర్స్ తోపాటు ఓపెన్ చేసిన లగేజీ ఉండటం - నా దేవకన్య లగేజీ అని తెలిసి సంతోషం పట్టలేక ఉమ్మా ఉమ్మా ఉమ్మా ....... అంటూ ముద్దులవర్షం కురిపించాను . డోర్ వైపు చూసి వణుకుతున్న చేతులతో దేవకన్య డ్రెస్ టచ్ చేసేంతలో ........
స్టాప్ స్టాప్ స్టాప్ మహేష్ ....... దేవకన్య .
అయిపోయాను అంటూ భయంతో వణుకుతూ వెనక్కు జరిగి తలదించుకుని చేతులుకట్టుకున్నాను .
దేవకన్య : సరైన సమయానికే వచ్చాము విద్యు డార్లింగ్ లేకపోతే నా డ్రెస్సులతో ఏమిచేసేవారో ఏమిటో ........
నో నో నో మహీ ...... జస్ట్ అమ్మకు హత్తుకునేవాడిని అంతే .......
దేవకన్య : తెలుసు తెలుసు అంటూ వచ్చి బ్యాగ్ క్లోజ్ చేశారు .
మహీ ....... లగేజీ నా రూంలో ....... అంటూ సంతోషంతో మెలికలుతిరిగిపోతున్నాను .
దేవకన్య : సిస్టర్ తోపాటు నవ్వుకుని , మెలికలు తిరిగింది చాలు హీరో ...... , మీ సిస్టర్స్ అందరూ అన్నీ రూమ్స్ లలోని బాత్రూమ్స్ ఆక్రమించడంతో ఈరూంలో స్నానం చేసాను .
స్నానం కూడా చేశారా అంటూ హృదయంపై చేతులువేసుకుని బెడ్ పైకి పడిపోయాను .
విద్యు సిస్టర్ : మీ టవల్ చుట్టుకునే - మీ షాంపూ సబ్బుతోనే స్నానం చేసింది మహేష్ సర్ .......
ఏమిటీ అంటూ చేతిపై గిల్లుకుని నిజమే అంటూ లేచి యాహూ యాహూ ...... అంటూ డాన్స్ లు చేస్తున్నాను .
దేవకన్య : అంత మురిసిపోకండి - నా టవల్ సోప్ షాంపూ ...... హాస్టల్ లోనే మరిచిపోయాను - తప్పలేక ....... , విద్యు డార్లింగ్ లగేజీ తీసుకో మన గదిలోకి వెళ్లిపోదాము .
ఇక్కడే ఉండొచ్చు కదా ....... ప్చ్ అంటూ చిన్నగా గుసగుసలాడుకున్నాను .
దేవకన్య : What మహేష్ .......
నో నో నో ఏమీలేదు ఏమీలేదు లగేజీ ...... నేను తీసుకొస్తాను .
దేవకన్య : పర్లేదు బరువుగా లేవులే , లిఫ్ట్ లో తీసుకెళతాము , ఈ లవ్లీ బ్యూటిఫుల్ టెడ్డీ బేర్స్ అన్నీ నాకోసమే కదా ...... - అయినా కలిసి నాలుగు రోజులే కదా అయ్యింది రోజుకొకటి అంటే నాలుగు ఉండాలి ఇన్ని ఉన్నాయేమిటి ? .
అవునవును మహీ ...... నీకోసమే , టెడ్డీ బేర్స్ షాప్ నే ఇక్కడికి మార్చేద్దాము అనుకున్నాను కానీ ప్లేస్ సరిపోలేదు .
దేవకన్య : పరవశించి , మార్చేస్తావు మార్చేస్తావు ఏమైనా చెయ్యగలవు అంటూ టెడ్డీ బేర్స్ ను హత్తుకున్నారు - చుట్టూ ఫోటోలను మరొకసారి చూసి , లవ్ యు అంటీ అంటూ నా హృదయంపై చేతితో ముద్దుపెట్టారు .
మహీ ...... మీకు కోపం రాలేదా ? - వీటిని ఇలానే ఉంచుకోనా ....... ? .
దేవకన్య : సూపర్ గా ఉన్నాయనే కదా అంటీకి ముద్దుపెట్టినది - భయపడి తీసేసావో ....... జాగ్రత్త అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తూనే కుడివైపున ఛాతీపై కొడుతున్నారు - ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాను ఉమ్మా ఉమ్మా ...... మహీ అంటూ చుట్టూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
యాహూ యాహూ ....... అంటూ కేకలువేశాను .
వీడింకా స్నానానికి వెళ్లలేదా అంటూ కింద నుండి కృష్ణగాడి మాటలు వినిపించాయి.
విద్యు సిస్టర్ : మహేష్ సర్ ....... కోపంతో వస్తున్నాడు కృష్ణ .
అంతే నా దేవకన్య చుట్టుకుని స్నానం చేసిన టవల్ ను అందుకుని బాత్రూమ్లోకి వెళ్లబోతే ....... ,
దేవకన్య : అమ్మా నా టవల్ అంటూ లాక్కున్నారు .
ప్చ్ ...... అని బాధపడుతూనే బాత్రూమ్లోకి చేరాను .
విద్యు సిస్టర్ నవ్వుకుని , కృష్ణా వెళ్లారు .......
కృష్ణగాడు : బ్రతికిపోయాడు అంటూ కిందకువెళ్లాడు .

దేవకన్య నవ్వుకుని , విద్యు డార్లింగ్ ...... ఈ గదిలోనే ఉండిపోవాలని ఉంది అని ఫీల్ అవుతూనే హ్యాంగర్ కు ఉన్న నా రెండు షర్ట్స్ అందుకుని చిలిపినవ్వులతో ముద్దులుపెడుతూ లిఫ్ట్ లో పైకివెళ్ళారు - మహీ డార్లింగ్ బాత్రూమ్లో నీ దేవుడు ...... నీ ఒంటికి రుద్దుకున్న సబ్బుతో .......
దేవకన్య : ష్ ష్ ష్ అంటూ నోటిని మూసేసి చిలిపినవ్వులతో తమ గదిలోకివెళ్లి లగేజీ ఉంచి , కప్ బోర్డ్ లో నా షర్ట్స్ ను తగిలించి , కప్ బోర్డ్ ఓపెన్ చెయ్యగానే నాదేవుడి పరిమళం తాకాలి అంటూ ముద్దులుపెట్టి కిందకువచ్చారు .
విద్యు సిస్టర్ చెప్పినట్లుగానే ....... సబ్బు అందుకుని , నా దేవత ఒంటి పరిమళాన్ని పీల్చి ముద్దుపెట్టాను . ఆ సబ్బును జాగ్రత్తగా లోపల ఉంచేసి కొత్త సబ్బుతో ఫ్రెష్ గా స్నానం చేసి హ్యాంగర్ పై షర్ట్స్ లేకపోవడం చూసి కప్ బోర్డ్ నుండి తీసి డ్రెస్ వేసుకుని గది బయటకువచ్చి నేను రెడీ అంటూ పైనుండి సర్రున కిందకు జారాను .

రేయ్ మామా వచ్చేసానురా .......
కృష్ణగాడు : కోపంతో గడియారం వైపు చూయించాడు - నాలుగు గంటలకా ....... అన్నట్లు .
అయినా పాయసం కుమ్మావట కదరా .......
కృష్ణగాడు : మా మహి సిస్టర్ ప్రేమతో ఇచ్చారు - లవ్ యు సిస్టర్ .......
దేవకన్య : లవ్ యు బుజ్జిఅన్నయ్యా ...... , ఓన్లీ two మినిట్స్ వంటలన్నీ వేడి చేసుకొస్తాము .
దివ్యక్క : ఆ విషయమే మరిచిపోయాము అంటూ అందరూ ఒక్కొక్క పాత్రను తీసుకునివెళ్లారు .

రవిగారూ - బావగారూ - అన్నా ...... కూర్చోండి .
డ్రైవర్ అన్న : చూడండి సర్ ఎంత వద్దన్నా , కృష్ణ సర్ వినలేదు , sorry సర్ ......
నో నో నో ....... అంటూ డైనింగ్ టేబుల్ లో కూర్చోబెట్టి , లవ్ యు రా మామా అంటూ వెనకనుండి హత్తుకుని ఎదురుగావచ్చి కూర్చున్నాను .
5 నిమిషాలలో లాంగెస్ట్ డైనింగ్ టేబుల్ పొడవునా వంటలు ఉంచి ఓపెన్ చేశారు .
ఉమ్మ్ ఆఅహ్హ్హ్ ....... ఘుమఘుమలు ఓ పట్టు పట్టాలి - పెద్దమ్మ అంటీ దివ్యక్క చెల్లెమ్మ మహీ సిస్టర్స్ కలిసి వండిన వంటలు - వడ్డిస్తారా వడ్డించుకోవాలా ? , ఆగలేకపోతున్నాము .
దివ్యక్క : ఒకరికొకరం వడ్డించుకుందాము అన్నయ్యా అంటూ పెద్దమ్మ - అంటీని కూర్చోబెట్టి అందరూ కూర్చున్నారు .
విద్యు సిస్టర్ : మహేష్ సర్ ...... ఇలా అందరూ ఒకేసారి ఒకే డైనింగ్ టేబుల్ పై సూపర్ - క్రెడిట్ మొత్తం మీకే ...... , మహి డార్లింగ్ నీకోసం నా ప్రక్కన చైర్ పట్టుకున్నాను రా .......
దేవకన్య : లవ్ యు డార్లింగ్ లవ్ యు , ఇదా సంగతి మీ మహేష్ సర్ ప్రక్కన అన్నమాట - see మహేష్ ....... వెక్కిళ్ళ కోసం పదే పదే నావైపు చూసావంటే అని స్వీట్ వార్నింగ్ తోపాటు భుజం పై గిల్లేసి ముసిముసినవ్వులతో ప్రక్కనే కూర్చున్నారు .
స్స్స్ .......
అందరూ నవ్వుకుని వడ్డించి వడ్డించుకుంటున్నారు . చెల్లెమ్మా ...... ముందు నీ హీరోకు వడ్డించు , ఆలస్యమయితే నన్ను కొట్టేలా ఉన్నాడు .
చెల్లెమ్మ వాడి నడుముపై గిల్లేసి వడ్డించారు .
అందరమూ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకుంటూ వడ్డించుకుని తృప్తిగా తిని సోఫాలలోకి చేరాము .

సిస్టర్స్ ....... ఫ్రెష్ అయ్యారు - లంచ్ చేశారు , ఇక హ్యాపీగా వెళ్లి హాయిగా రెస్ట్ తీసుకోండి మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యరు .
అంతే సిస్టర్స్ తోపాటు దివ్యక్క - చెల్లెమ్మ - మహి ....... కోపంతో కొరుక్కుతినేలా చూస్తున్నారు .
గుటకలు మింగి Why ? What happenned ? .......
దేవకన్య భద్రకాళీలా వచ్చి నా ప్రక్కనే కూర్చున్నారు . మహేష్ ...... నీకు కొద్దిగానైనా జాలి కనికరం ఉందా మాపైన .......
ఏదో పెద్ద తప్పే చేసాను అందరూ మూకుమ్మడి దాడి చేసేలా ఉన్నారు అని గజగజా వణికిపోతున్నాను .
దేవకన్యతోపాటు అందరూ నవ్వుకుని మళ్లీ కోపంతో చూస్తున్నారు , హాస్పిటల్ నుండి అందరితోపాటు హాస్టల్ కు చేరాక హాయిగా కుంభకర్ణుల్లా నిద్రపోదామని ఆశపడ్డాము అంతే the బిగ్గెస్ట్ సర్ప్రైజ్ స్టార్ హోటల్లా మార్చేసి సంతోషాన్ని పంచారు - Ok హ్యాపీగా స్టార్ హాస్టల్ రూమ్స్ లో నిద్రపోదామనుకుంటే అందరినీ ఈ ఇంద్రభావనానికి తీసుకొచ్చే ప్లాన్ చేసావు , ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి నిద్రపోదామనుకుంటే లంచ్ కోసం 4 గంటలవరకూ wait చేయించావు సరేలే ఇప్పుడైనా లంచ్ చేసి నిద్రపోదామంటే ........
ఎవరు ఎవరు అడ్డువచ్చారు - ఏమి అడ్డు చెప్పండి వాడిని - దానిని ........
దేవకన్య : స్టాప్ స్టాప్ స్టాప్ అంటూ అంతెత్తువరకూ పేర్చిన షాపింగ్ వైపు చూయించారు . ఈ షాపింగ్ అన్నింటినీ ఓపెన్ చేసేసరికే చీకటిపడిపోతుంది - సరే చీకటి పడ్డాకైనా నిద్రపోదామంటే ........
నో నో నో మహీ - సిస్టర్స్ ...... ప్రిన్సిపాల్ గారు బాయ్స్ హాస్టల్ ప్రారంభిస్తారు , అలాగే మిమ్మల్ని నైట్ డిన్నర్ కు మీ హాస్టల్ కు చేరుస్తానని వార్డెన్ మరియు మీ హాస్టల్ మేట్స్ కు మాటిచ్చాను .
దేవకన్య : కదా కదా కదా అంటూ దేవకన్యతోపాటు దివ్యక్క - చెల్లెమ్మ కూడా కొడుతున్నారు . హాస్టల్ నుండి వచ్చాకైనా నిద్రపోనిస్తారో లేదో .......
ఇందుకేనా ....... మరేమిటో అని గజగజావాణికిపోయాను - మహీ - సిస్టర్స్ ...... రాత్రికి ఏ సర్ప్రైజ్ లూ లేవు హాయిగా నిద్రపోవచ్చు కానీ .......
దేవకన్య : అంతే డార్లింగ్స్ ....... , రాత్రికూడా నిద్రపోనివ్వడు అంటూ భుజం పై గిల్లేసారు .
స్స్స్ ........ , రుద్దుకుంటూ రాత్రి కాదు మహీ ...... తెల్లవారుఘామున బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ........
సిస్టర్స్ : Wow ........ , ఏమిటో చెప్పొచ్చుకదా మహేష్ సర్ ...... - ఆ సమయానికి లేస్తామో లేదో .......
సర్ప్రైజ్ సిస్టర్స్ - నా ఫ్యామిలీ మెంబెర్స్ ను ప్రేమతో లేపడానికి నేనున్నాను కదా .........
దివ్యక్క : ఆ సర్ప్రైజ్ నీతోనే కలిసి మనసారా ఆస్వాదించాలని ఈ ఇంటికి వచ్చినప్పటి నుండీ ఆశతో ఎదురుచూస్తున్నారు మహీ ....... అన్నయ్య - అన్నయ్యా ....... రెండు నెలల తరువాత తీరబోతోంది sooooo హ్యాపీ అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టారు - చెల్లీ ....... నీ హీరోతో చూడటానికి రెడీగా ఉండు .
సిస్టర్స్ : దివ్యా ....... మరింత ఉత్సుకతను పెంచావు - ఎప్పుడు ఉదయం అవుతుందో ఏమో ........
దివ్యక్క : మీరు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను .
సిస్టర్స్ : Wow .......
దివ్యక్క : ఇప్పుడైతే నిద్రమానుకుని ఎవరి షాపింగ్ వాళ్ళు ఓపెన్ చేద్దాము అని హాల్లో కూర్చుని తెరిచి మురిసిపోతున్నారు .
మహీ - చెల్లెమ్మా - సిస్టర్స్ ....... గుర్తుందికదా రేపంతా షాపింగ్ .
దేవకన్య : మరిచిపోలేదా అంటూ తియ్యనైన కోపాలతో షాపింగ్ బాక్సస్ మావైపుకు విసిరి నవ్వుతున్నారు .

అంతలో అన్నయ్యా అన్నయ్యా ....... అంటూ హాసిని - విక్రమ్ లోపలికి పరుగునవచ్చి సోఫాలో చెరొకవైపు చేరారు .
దేవకన్య - సిస్టర్స్ : వార్డెన్ ....... రండి రండి .
వార్డెన్ : అన్నయ్యలూ - అక్కయ్యలూ ...... అంటూ ఏడవటంతో పిలుచుకునివచ్చాను .
Sorry హాసిని - విక్రమ్ ....... అని నాతోపాటు దేవకన్య - దివ్యక్క వాళ్ళు అందరూ చెప్పారు . హాసినీ - విక్రమ్ ...... మీకోసం ఒక కార్ విత్ డ్రైవర్ ను పెడతాను , ఆ కారులో కాలేజ్ కు వెళ్ళవచ్చు - మమ్మల్ని చూడాలనిపిస్తే డ్రైవర్ కు ఆర్డర్ వేస్తే చాలు పిలుచుకునివచ్చేస్తాడు , మమ్మీ ఫ్రీగా ఉంటే మమ్మీని కూడా పిలుచుకునిరావచ్చు ok నా .......
పిల్లలు : Ok ok ......
అందరూ : Ok ...... సూపర్ మహేష్ - మహేష్ సర్ .......
దేవకన్య వైపు చూస్తూ సిగ్గుపడ్డాను .
వార్డెన్ ....... నమస్కరించడం చూసి , వార్డెన్ ...... వీళ్ళకూడా మా ఫ్యామిలీ - ఇలా మీరు ప్రతీసారీ దండం పెట్టి పరాయివాడిని చెయ్యకండి .
వార్డెన్ : లేదు లేదు అంటూ ఆనందబాస్పాలను తుడుచుకున్నారు .
పిల్లలూ ....... వెళ్లి మీ షాపింగ్ ను తీసుకోండి లేకపోతే ఈ అమ్మాయిలకు ఎన్నైనా చాలవు - ఇన్ని ఉన్నా ...... రేపు మళ్లీ షాపింగ్ తీసుకెళ్లమని ఆర్డర్స్ వేస్తున్నారు .
మేమా అంటూ అందరూ తియ్యనైన కోపంతో కొట్టడానికి వచ్చారు .
Yes అవును మేము ఆర్డర్స్ వేస్తాము అని ఉంటే ఎంత ఆనందపడేవాన్ని మహీ - సిస్టర్స్ .......
కొట్టడానికి వచ్చినవాళ్ళు తియ్యనైన నవ్వులతో పిల్లలను పిలుచుకుని వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు .

నా దేవకన్య ....... ఆనందాలను - అందాలను కనులారా తిలకిస్తుంటే , హృదయంలో మన్మధబాణాలు గుచ్చుకుంటున్నట్లు ఆఅహ్హ్ ఆఅహ్హ్హ్ ...... మధురమైన సౌండ్స్ చేస్తూ గుండెలపై చేతినివేసి ప్రాణంలా చూస్తున్నాను .
నా చూపుల బాణాలు కూడా గుచ్చుకున్నట్లు , ఏంటి హీరో ....... అంటూ పెదాలపై తియ్యదనంతో నావైపుకు తిరిగి కళ్ళెగరేశారు దేవకన్య - ఏంటి హీరో ...... నొప్పివేస్తోందా ..... ? .
నా దేవకన్య అలా ప్రేమతో ఆడిగేసరికి ఆఅహ్హ్ ....... అంటూ మైమరిచిపోయాను - మళ్లీ ...... తెరుకున్నది , రవిగారు ....... మహేష్ మహేష్ అంటూ భుజం తట్టినప్పుడే .......
రవిగారు : మహేష్ ...... బాయ్స్ హాస్టల్ రెనోవేషన్ కూడా పూర్తయిపోయిందట , మన ఆర్కిటెక్ట్ కాల్ చేశారు .
సమయం చూస్తే 5:30 గంటలు ....... - ఈగ్యాప్ లో షాపింగ్ మొత్తం వారి వారి కప్ బోర్డ్స్ లోకి చేరిపోవడం చూసి ఆనందించాను - రేయ్ మామా ...... రెనోవేషన్ అమౌంట్ సంగతి ........
కృష్ణగాడు : నేను ట్రాన్స్ఫర్ చేసేస్తాను - మావయ్య గారూ ...... రండి .

నా మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే బాయ్స్ హాస్టల్ బ్రదర్ - మహేష్ ...... థాంక్యూ థాంక్యూ sooooo మచ్ , మేము ఇలాంటి హాస్టల్ లో ఉంటామని కలలోకూడా ఊహించనేలేదు , హాస్టల్ ను పూలతో అందంగా అలంకరిస్తున్నాము ఎప్పుడు వస్తున్నారు .
బ్రదర్స్ ....... ప్రిన్సిపాల్ గారి ఇంటికి స్వయంగా వెళ్లి ఆహ్వానించండి - ప్రిన్సిపాల్ గారు రిబ్బన్ కట్ చెయ్యాలని చాలా ఉర్రూతలూగుతున్నారు .
బ్రదర్స్ : ఇప్పుడే కొంతమందివెళ్లి ఆహ్వానిస్తాము మహేష్ ...... , మీరుకూడా త్వరగా వచ్చెయ్యండి - సెలెబ్రేషన్స్ తారాస్థాయికి చేరుకోవాలి .
Sure బ్రదర్స్ అంటూ కట్ చేసాను . Its టైం అంటూ పైనున్న దివ్యక్క - చెల్లెమ్మ - దేవకన్య - సిస్టర్ కు గ్రూప్ మెసేజ్ పెట్టి రవిగారి దగ్గరకువెళ్ళాను . రవిగారూ ...... మరొక హెల్ప్ గర్ల్స్ - బాయ్స్ హాస్టల్స్ పై అరగంటసేపు నాన్ స్టాప్ గా తారాజువ్వల వెలుగులు వెలిగేలా సెట్ చెయ్యాలి అలానే రెండు హాస్టల్స్ కు ఒక్కొక్కటి చొప్పున హాస్టల్ స్టూడెంట్స్ కౌంట్ కు సరిపోయేలా ఐస్ క్రీమ్స్ - కూల్ డ్రింక్స్ ఉంచగల కెపాసిటీ బాటమ్ ఫ్రీజర్ రిఫ్రిజిరేటర్ లు ఐస్ క్రీమ్ షాప్స్ లో ఉంటాయే అలాంటివి మెస్ లో ఉంచాలి , ఉదయం - మధ్యాహ్నం - సాయంత్రం ...... రోజుకు మూడుసార్లు ఆ రిఫ్రిజిరేటర్ ఫుల్ చేస్తూ ఉండేలా ఐస్ క్రీమ్ షాప్ కు కాంట్రాక్టు ఇవ్వండి .
రవి గారు : ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా మా ముందే కాల్ చేసారు - ఫైర్ వర్క్స్ అంటూ హాస్టల్ అడ్రస్ చెప్పారు - మినిమమ్ థర్టీ మినిట్స్ ....... - మహేష్ డన్ , మరొకరికి కాల్ చేసి రిఫిజిరేటర్స్ గురించి చెప్పారు . మహేష్ ...... హెల్ప్ కాదు ఆర్డర్ వెయ్యి ....... - ఎందుకంటే నీ ఒక్కొక్క ఆర్డర్ వలన ఎంతోమందికి పని దొరుకుతోంది - ప్రౌడ్ ఆఫ్ యు మహేష్ .......
థాంక్యూ రవిగారూ .......

మేమూ పైకివెళ్లి రెడీ అయ్యివచ్చాము - మేము రెడీ అయ్యివచ్చిన గంటకు అందరూ ఆగ్రాలో షాపింగ్ చేసిన డ్రెస్సులలో బ్యూటిఫుల్ గా రేడీ అయ్యివచ్చారు . నా దేవకన్య నా దేవకన్య అంటూ అటూ ఇటూ చూస్తుండటం చూసి .......
మహేష్ సర్ మహేష్ సర్ ఇక్కడ ఇక్కడ అంటూ ముసిముసినవ్వులతో చెరొకవైపుకు జరిగారు సిస్టర్స్ . సిస్టర్స్ మధ్యలో రెడ్ డ్రెస్ వేసుకుని తియ్యనైన నవ్వులతో సిగ్గుపడుతూ స్టెప్స్ దిగారు .
గుటకలు మింగుతూ బ్యూటిఫుల్ అంటూ చేతివేళ్ళతో చూయించాను .
థాంక్యూ ....... అంటూ సలాం కొట్టడం చూసి , యాహూ ...... అంటూ జంప్ చేసాను .
సిస్టర్స్ ....... ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెళదాము అంటూ అందరమూ బయటకువచ్చాము .
కృష్ణగాడు : రేయ్ మామా ...... రెండు కార్లు - ఒక జిప్సీ మాత్రమేరా అందరమూ కూర్చోగలమా ....... ? .
సిస్టర్స్ - మహీ ...... సిటీ సెంటర్ కు వెళ్లేంతవరకూ ఒకరిపై మరొకరు కూర్చుని అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ........
దేవకన్య : అడ్జస్ట్ చేసుకోవడానికి మాకేమీ ఇబ్బంది లేదు - నీకు ఎన్నిసార్లు చెప్పాలి అందరమూ ఒకే వెహికల్లో అని , దెబ్బలు మరిచిపోయినట్లున్నావు అంటూ దివ్యక్కతోపాటు అందరూ బుంగమూతితో నిలబడ్డారు .
వెంటనే మొబైల్ తీసి ఫోటోలు తీసాను .
మేము బాధపడుతుంటే నువ్వు ఫోటోలు తీస్తున్నావా అంటూ అందరూ చుట్టూ చేరారు .
నో నో నో ....... చూడటానికి భలే ముచ్చట వేస్తేనూ మధురమైన జ్ఞాపకాల లిస్ట్ లో దాచుకోవాలని అంటూ ఫీల్ అవుతూ మొబైల్ ను హృదయం పై హత్తుకున్నాను .
దేవకన్యతోపాటు అందరూ నవ్వుకుని , నా హృదయంపై ముద్దులుపెట్టారు .
ఒక కార్ లో అందరమూ అంటే కష్టమే ........ , ఇప్పుడెలా .......

బావగారు : బావా ....... , డ్రైవర్ చంద్ర అన్న - బస్సు కూడా ఇక్కడే ఉంది , అన్నా ..... మీ సర్ పిలుస్తున్నారు .
పరిగెత్తుకుంటూ వచ్చి yes సర్ అంటూ సెల్యూట్ చేశారు .
చంద్రన్నా ....... ఈ క్షణం నువ్వే దేవుడిలా కనిపిస్తున్నావు అంటూ అమాంతం కౌగిలించుకున్నాను .
దేవకన్య : మహేష్ ....... ఇక చాలు , పాపం సంతోషంలో ఆ అన్న గుండె ఆగిపోయేలా ఉంది .
చంద్ర : అవును సర్ ...... , ఈ సంతోషాన్ని ఎప్పటికీ మరిచిపోను - ఏమి చెయ్యాలి ఆర్డర్ వెయ్యండి .
అన్నా ....... హాస్టల్ దగ్గరికివెళ్లాలి బస్సుని వెనకనుండి లోపలికి తీసుకురండి .
చంద్ర : yes సర్ అంటూ పరుగునవెళ్లి మెయిన్ గేట్ ద్వారా వెనక్కు తీసుకొచ్చారు .
మహీ - సిస్టర్స్ ...... హ్యాపీనా ? .
దేవకన్య : లవ్ యు ........ మ మ ...... అంటీ అంటూ నా హృదయం పై ముద్దుపెట్టి డార్లింగ్స్ రండి అంటూ పిల్లల చేతులను పట్టుకుని ఎక్కారు .
వెనుకే ఎక్కగానే విద్యు సిస్టర్ లాక్కునివెళ్లి దేవకన్య నా దేవకన్య ప్రక్కన కూర్చోబెట్టారు .
దేవకన్య : నీ మనసులో ఉన్నది మా డార్లింగ్స్ కు భలేగా తెలుస్తోంది సరిగ్గా కూర్చోండి బస్సు కదిలితే పడిపోయేలా ఉన్నారు అంటూ ఏకంగా నా చేతిని చుట్టేసి తనవైపుకు లాక్కున్నారు .

లవ్ యు మహీ ........ , అన్నా ...... సిటీ సెంటర్ కు పోనివ్వండి చిన్నపని ఉంది .
దేవకన్య : మనం వెళుతున్నది హాస్టల్ కు కాదా ...... ? .
చిన్నపని చూసుకుని వెళ్లిపోదాము - అక్కడ ఎంత సమయం పడుతుందన్నది మీపైననే ఆధారపడి ఉంది .
దేవకన్య : మా పైననా ........ ? అంటూ ఆశ్చర్యపోతున్నారు .
మొబైల్ తీసి , అన్నా ...... ఫోర్ వీలర్ షోరూం దగ్గర ఆపమని మెసేజ్ పెట్టాను . 15 నిమిషాలలో షోరూం ముందు ఆగింది .
మహీ - సిస్టర్స్ ...... లెట్స్ గో అంటూ లేచి నా దేవకన్యకు చేతిని అందించాను . ఆశ్చర్యంగా పెదాలపై చిరునవ్వులతో నా చేతిని అందుకున్నారు . Yes yes yes ........
దేవకన్య లేచి నా అరచేతిపై గిల్లేసి తియ్యనైన నవ్వులతో వెళ్లి విద్యు సిస్టర్ చేతిని చుట్టేశారు .
స్స్స్ ...... అంటూనే గిల్లిన చోట ముద్దుపెట్టి , కిందకుదిగాను .
దేవకన్య : మహేష్ ...... ఎక్కడికి ? .
నా దేవకన్య - సిస్టర్స్ ....... రోజూ కాలేజ్ కు వెళ్ళడానికి అంటూ లోపలున్న కార్స్ వైపు చూయించాను .
అధికాదు మహీ ...... అన్నకూ ఒక ఫ్యామిలీ ఉంది , వారిని ...... ఇబ్బంది పెట్టడం .
దేవకన్య : అర్థమైంది అర్థమైంది మహేష్ ....... , sorry sorry సో సో soooo స్వీట్ ఆఫ్ యు అంటూ హృదయంపై ముద్దుపెట్టారు .
ష్ ష్ ష్ ...... మహీ , అన్న విన్నారంటే .......
సిస్టర్ : ఇక అంతే కళ్ళల్లో నుండి కన్నీళ్లు కార్చేస్తారేమో మహేష్ సర్ .......

మహీ - సిస్టర్స్ ...... మొదట పిల్లలకు ఆ తరువాత మీకు నచ్చినన్ని కార్స్ సెలెక్ట్ చెయ్యండి , దివ్యక్కా - చెల్లెమ్మా ...... వెళ్లి హెల్ప్ చెయ్యండి .
దేవకన్య : దివ్యక్క చెవిలో గుసగుసలాడారు .
దివ్యక్క : అన్నయ్యా ..... మీరూ వస్తేనే ......
ఓ ఎస్ అంటూ లోపలికివెళ్లి కూర్చున్నాము . సెలక్షన్ మీదే ....... కానీ చీరలు నగలలా కాకుండా కాస్త త్వరగా సెలెక్ట్ చెయ్యండి మహీ - సిస్టర్స్ ..... ప్లీజ్ ప్లీజ్ , అక్కడ ప్రిన్సి వెయిటింగ్ .......
అందరూ ముసిముసినవ్వులు నవ్వుకుని వార్డెన్ వద్దంటున్నా ...... , పిల్లలకు నచ్చిన కార్ ను డెలివరీ కోసం పంపించి , త్రీ డిఫరెంట్ కలర్స్ రేంజ్ రోవర్స్ ను సెలెక్ట్ చేశారు .
అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి డెలివరీ అడ్రస్ ఇచ్చి బస్సులో బాయ్స్ హాస్టల్ కు చేరుకున్నాము .

రెనోవేషన్ సెలెబ్రేషన్ కోసం గర్ల్స్ హాస్టల్ మేట్స్ ను ఆహ్వానించినట్లు సీనియర్ గర్ల్స్ అక్కడే ఉన్నారు . దేవకన్య - సిస్టర్స్ ....... సంతోషంతో వెళ్లి ఫ్రెండ్స్ అంటూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు .
మహేష్ - కృష్ణా ...... అంటూ బ్రదర్స్ వచ్చి కౌగిలించుకున్నారు , 5 మినిట్స్ లో ప్రిన్సిపాల్ గారు వచ్చేస్తారు అంటూ హాస్టల్ లోపలికి పిలుచుకునివెళ్లారు . ఎలా ఉండేది ఎలా మారిపోయిందో మొత్తం చూయించి ఆనందంతో పొంగిపోతున్నారు - హాస్టల్ మొత్తం మహేష్ - కృష్ణ , మహేష్ - కృష్ణ అంటూ నినాదాలతో మారుమ్రోగిపోతోంది .
బ్రదర్స్ ....... మీరు హ్యాపీ thats enough అంటూ బయటకు వచ్చేసరికి ప్రిన్సిపాల్ గారు వచ్చారు . బ్రదర్స్ తోపాటు వెళ్లి ప్రిన్సిపాల్ గారిని ఆహ్వానించాము .
థాంక్యూ థాంక్యూ అంటూ ప్రిన్సిపాల్ గారు సంతోషంతో రిబ్బన్ కట్ చెయ్యడం ఆలస్యం మా చప్పట్లు - కేకలతోపాటు హాస్టల్ చుట్టూ తారాజువ్వలు కంటిన్యూ గా ఆకాశంలోకివెళ్లి స్పార్కిల్స్ వెదజల్లుతున్నాయి . సుమారు 15 - 20 మినిట్స్ అందరూ అలా ఆకాశం వైపు చూస్తూనే ఉన్నారు .
ప్రిన్సిపాల్ గారు ...... మేడం ఎదురుచూస్తున్నారని సంతోషంతో వెళ్లిపోయారు .
ఆగిన మరుక్షణం మహేష్ - కృష్ణ ....... నినాదాలతో క్యాంపస్ దద్దరిల్లిపోయింది . బ్రదర్స్ వచ్చి మహేష్ - కృష్ణా ....... అసలు సంబరం లోపల సెట్ చేసాము , అల్ బ్రాండ్స్ ........

పది పదిహేను అడుగుల దూరంలో ఉన్న దేవకన్య కు వినిపించినట్లు , సడెన్ గా కోపంతో నావైపు చూస్తున్నారు .
నో నో నో ....... , బ్రదర్స్ వదిలెయ్యండి మీరు కానివ్వండి అంటూ దండం పెట్టి బుద్ధిగా గుంపులోనుండి వచ్చేసాను .
దేవకన్య : వేలితో స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు .
లేదు లేదు లేదు .........
దివ్యక్క మూసిముసినవ్వులతో వచ్చి ఉమ్మా ఉమ్మా ....... మా అన్నయ్య వలన కిషోర్ కూడా బుద్ధిగా ఉంటాడు అంటూ ముద్దులుపెట్టి చేతిని చుట్టేశారు .
బావగారు : ప్చ్ ....... బావా .......
దివ్యక్క : ఊ ........
బావగారు : లేదు లేదు ఏంజెల్ కూల్ కూల్ .......
Next page: Update 32
Previous page: Update 30