Update 32

సీనియర్ గర్ల్స్ : ప్చ్ ....... మనం కూడా ఉదయమే కాకుండా చీకటిపడ్డాక హాస్టల్ కు వచ్చి ఉంటే ఇలానే సెలెబ్రేట్ చేసుకునేవాళ్ళము . ఒక శక్తి అలానే చేద్దామని చాలా ట్రై చేసినట్లు అనిపించింది కానీ మనమే హాస్పిటల్లో డాక్టర్స్ నే భయపెట్టి రచ్చ చేసాము .
దేవకన్య : ( ఆ శక్తి ఎవరోకాదు నా దేవుడే ) చిరునవ్వులు చిందిస్తూ నావైపుకు ఆరాధనతో చూస్తున్నారు .
నో నో నో మహీ ..... , వాళ్ళను ఎంజాయ్ చెయ్యమని దూరంగా వచ్చేసాను అంటూ డిస్టన్స్ చూయించాను .
దేవకన్య : విద్యు సిస్టర్ చేతిని చుట్టేసి ముత్యాలు రాల్చున్నట్లు అందంగా నవ్వుతున్నారు .

సీనియర్ గర్ల్స్ : మహీ - విద్యు ...... మన హాస్టల్ దగ్గరికి వెళదాము పదండి , మీకోసం అక్కడ చాలామంది ఎదురుచూస్తున్నారు . ప్చ్ ...... నైట్ వచ్చి ఉంటే బాగుండేది ఫైర్ వర్క్స్ తో ఈ బాయ్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు అని ఫీల్ అవుతున్నారు .
దేవకన్య : సీనియర్ గర్ల్స్ మధ్యలోనుండి మా దగ్గరికివచ్చి ఏదో చెప్పడానికి ట్రై చేసి , నో నో నో నథింగ్ అంటూ నిరాశపడుతూ దివ్యక్క చేతిని చుట్టేసి గర్ల్స్ హాస్టల్ కు తీసుకెళ్లారు .

మహి అక్కయ్యా - విద్యుల్లేఖ అక్కయ్యా ....... అంటూ హాస్టల్ గర్ల్స్ అందరూ బయటే ఉన్నట్లు సిస్టర్స్ ను చుట్టుముట్టి అమాంతం పైకెత్తి ఆనందిస్తున్నారు . మహి అక్కయ్య - కృష్ణవేణి ఎక్కడ అంటూ చుట్టూ చూసి అదిగో అక్కడ అంటూ మిగిలినవాళ్ళంతా వచ్చి థాంక్యూ థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అన్నయ్యా అన్నయ్యా ....... అని చెప్పి దివ్యక్కను చుట్టేసిన దేవకన్యను - కృష్ణగాడిని చుట్టేసిన చెల్లెమ్మను అమాంతం ఎత్తుకుని మహి - కృష్ణవేణి అంటూ సంతోషంతో కేకలువేస్తూ సిస్టర్స్ దగ్గరికి తీసుకెళ్లి సంబరాలు చేసుకుంటున్నారు . సీనియర్ గర్ల్స్ కూడా జతకలిశారు
దేవకన్య - సిస్టర్స్ కు ఎందుకో అర్థం కానట్లు ఆశ్చర్యంతో మావైపు చూసారు .
దివ్యక్కతోపాటు నేనూ సంతోషపు ఆశ్చర్యపోతుండటం చూసి , అన్నయ్యా ...... మీకే తెలియని సర్ప్రైజ్ .........
దేవకన్య - సిస్టర్స్ : ఫ్రెండ్స్ - సిస్టర్స్ ...... మమ్మల్నే ఎందుకు ? అని ఆ కేకలమధ్యనే కాస్త గట్టిగా అడిగారు .
ఇందుకు అంటూ అందరూ తమ తమ మొబైల్స్ లో వీడియోను ప్లే చేసి పైకెత్తి చూయించారు .
( వీడియోలో నా దేవకన్య : చూడు హీరో ....... నా హాస్టల్ ఫ్రెండ్స్ - సిస్టర్స్ ను వదిలి సెల్ఫిష్ గా నేను స్వర్గం లాంటి మీ ఇంట్లోకి అడుగుపెట్టలేను - వాళ్ళతోపాటే నేనూ ....... , హాస్టల్ ....... 5 స్టార్ హోటల్ లా మారి నా హాస్టల్ మేట్స్ పెదాలపై చిరునవ్వులు పరిమళిస్తే తప్ప నేను - నాడార్లింగ్స్ ....... మీరు కోరినట్లుగా మీ ఇంటికి రామంటే రాము ఇది ఫిక్స్ )
హాస్టల్ గర్ల్స్ : ఇందుకు అక్కయ్యా - మహీ ...... అంటూ దేవకన్యను - సిస్టర్స్ ను కిందకుదించి , థాంక్యూ థాంక్యూ థాంక్యూ మహీ అక్కయ్యా ....... అంటూ అందరినీ సంతోషంతో కౌగిలించుకున్నారు . ఈ వీడియో తీసినది ఎవరోకాదు మన వార్డెన్ ....... విషయం అంతా చెప్పి అందరికీ పంపించారు , మహి అక్కయ్యా ...... ఒక హాస్టల్ లో కలిసి ఉంటున్నాము అని ఒకే ఒక్కకారణంతో మా అందరి గురించీ ఆలోచించారు - మేమైతే అలాంటి అదృష్టం లభించినప్పుడు ఇంతకు ముందు ఉన్న హాస్టల్ నుండి వెంటనే వెళ్లిపోయేవాళ్ళము - మీరు ...... మాకోసం అంటూ ఉద్వేగానికి లోనౌతూ మళ్లీ నా దేవకన్యను - చెల్లెమ్మను - సిస్టర్స్ ను అమాంతం పైకెత్తి సంతోషాలను పంచుకున్నారు .
కృష్ణగాడు : రేయ్ మామా ...... నొక్కనా ......
దివ్యక్క : ఇంకెందుకు ఆలస్యం నొక్కు తమ్ముడూ అంటూ వాడి నుండి అందుకుని రిమోట్ ప్రెస్ చేశారు .
అంతే సుయ్ సుయ్ సుయ్ మంటూ వన్ బై వన్ ....... ఫైర్ క్రాకర్స్ ఆకాశంలోకివెళ్లి స్పార్కిల్స్ లా విద్యుత్ కాంతులు వెదజల్లి అందరిలో మరింత సంతోషాన్ని పరిమలింపచేసాయి అన్నట్లు , హాస్టల్ గర్ల్స్ అందరూ మా హాస్టల్ లో కూడా బాయ్స్ యాహూ యాహూ ఫైర్ వర్క్స్ అంటూ క్యాంపస్ మొత్తం వినిపించేలా కేకలువేస్తూ నా దేవకన్య - చెల్లెమ్మ - సిస్టర్స్ చేతులను చుట్టేసి కనులారా కొన్ని నిమిషాలపాటు ఆ అద్భుతాన్ని వీక్షించి తరించారు .
మహీ మహీ ...... థాంక్యూ థాంక్యూ వే , బాయ్స్ హాస్టల్ సెలెబ్రేషన్స్ చూసి బాధపడ్డాము అంతకు డబల్ సెలెబ్రేషన్స్ ....... ఆస్వాదించేలా చేశారు అంటూ సంతోషంతో హత్తుకున్నారు .
దేవకన్య : ఫ్రెండ్స్ - సిస్టర్స్ ...... ఈ సెలెబ్రేషన్స్ సర్ప్రైజ్ తో నాకేమీ సంబంధం లేదు.
హాస్టల్ గర్ల్స్ : నీకోసం - నీవలన మేము ఇలా ఆస్వాదించాలని మీ హీరోగారు చేశారని మాకు తెలుసులే అంటూ ముద్దులతో ముంచెత్తారు . థాంక్యూ థాంక్యూ అన్నయ్యా - మహేష్ ........
లవ్ యు ఫ్రెండ్స్ - సిస్టర్స్ అంటూ కేవలం దేవకన్యవైపు మాత్రమే ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
దేవకన్య : అంతమంది థాంక్యూ చెబితే నాకు మాత్రమే ....... అని కళ్ళతోనే సైగలుచేస్తున్నారు .
ఎందుకంటే ఇక్కడ అమ్మతోపాటు ఉన్నది నువ్వు మాత్రమే ఏంజెల్ అంటూ మళ్లీ ఫ్లైయింగ్ కిస్ వదిలాను తియ్యనైననవ్వుతో .......
దేవకన్య : చాలు చాలు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు .
ఆఅహ్హ్హ్ ....... అంటూ దివ్యక్క భుజంపై వాలాను .
దివ్యక్క : అన్నయ్యా ...... జాగ్రత్త కిషోర్ హెల్ప్ , కానివ్వండి కానివ్వండి అంటూ నవ్వుతున్నారు .

అదేసమయానికి లారీ వచ్చి హాస్టల్ ముందు ఆగింది - అందులోనుండి రెండు బిగ్గెస్ట్ బాటమ్ ఫ్రీజర్ రిఫ్రిజిరేటర్స్ కొంతమంది కష్టపడి జాగ్రత్తగా కిందకుదించి , రవి సర్ ఎక్కడ ఉంచాలి అని అడిగారు .
రవిగారు ...... నావైపు చూడటం - నేను ...... వార్డెన్ వైపు చూసాను .
వార్డెన్ : చిరునవ్వుతో హాస్టల్ లోపలికివెళ్లి మెస్ కు వెళ్లే దారిలో ఫిక్స్ చేసేలా చూయించారు .
లారీ వెనక్కు వెళ్లగానే ఐస్ క్రీమ్ వెహికల్ వచ్చి ఆగింది . ఆ వెహికల్ వైపు స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యం - ఆశతో చూస్తున్నారు .
దివ్యక్క : చూసి ఆనందించి , అన్నయ్యా ....... నాకూ నోరూరుతోంది .
రేయ్ మామా ....... ముందు అందరికీ వాళ్లకు ఇష్టమైన ఐస్ క్రీమ్స్ అందించి తరువాత రిఫ్రిజిరేటర్ లో లోడ్ చెయ్యమను .
నిమిషాలలో అందరి రెండు రెండు చేతులలో ఏకంగా రెండు రెండు ఐస్ క్రీమ్స్ చేరాయి . సంతోషంతో రెండుచేతులూ పైకెత్తి థాంక్యూ థాంక్యూ మహేష్ - అన్నయ్యా ....... అంటూ చూయించి ఆనందిస్తున్నారు .

దేవకన్య - చెల్లెమ్మ - సిస్టర్స్ ...... చేతులలో రెండు రెండు ఐస్ క్రీమ్స్ తోపాటువచ్చి , చెల్లెమ్మ ...... దివ్యక్కకు - దేవకన్య ...... నాకు అందించారు .
ఫర్ మీ ...... ? అంటూ అమితమైన ఆనందంతో ప్రాణంలా దేవకన్య చేతిని ఏమాత్రం టచ్ చెయ్యకుండా అందుకున్నాను .
దేవకన్య : ప్చ్ ....... అంటూ చిరుకోపంతో కొట్టారు .
మహీ టచ్ చెయ్యనేలేదు కదా ....... అంటూ కోన్ ఐస్ క్రీమ్ టేస్ట్ చేసాను మ్మ్మ్ ...... అమృతం అంటూ ........
విద్యు సిస్టర్ : టచ్ చెయ్యలేదనే కొట్టింది మహేష్ సర్ అంటూ గుసగుసలాడారు .
వా.........ట్ అంటూ ధీర్ఘం తీస్తూ వెనక్కు పడిపోబోతే .......
మహేష్ ....... జాగ్రత్త అంటూ క్విక్ రియాక్షన్ తో దేవకన్య తన రెండు చేతులతో నా నడుమును పట్టుకున్నారు - ఆ ప్రాసెస్ లో దేవకన్య చేతిలోని ఐస్ క్రీమ్ కిందకు చేజారింది . దేవకన్య కోపంతో చూస్తూ ఎంతసేపు పట్టుకోవాలి చేతులు నొప్పివేస్తున్నాయి అంటూ ముద్దుముద్దుగా కోప్పడుతున్నారు .
ముచ్చటేసి మరికొంతసేపు అలాగే ఉండిపోవాలని ఉన్నా , దేవకన్య సున్నితమైన చేతులు నొప్పివేస్తాయని లేచి నిలబడ్డాను - తియ్యనైన జలదరింపులతో లవ్ యు మహీ ...... అంటూ ఐస్ క్రీమ్ తింటూ నువ్వూ తిను అన్నాను .
దేవకన్య : కిందపడిన ఐస్ క్రీమ్ వైపు దీనంగా చూస్తున్నారు .
అయిపోయాను sorry లవ్ యు లవ్ యు మహీ అంటూ భయంతో గజగజావాణికిపోతున్నాను .
దివ్యక్క - చెల్లెమ్మ - సిస్టర్స్ ....... అందరూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
మహీ ...... ఒకటికాదు పది తీసుకొస్తాను .
దేవకన్య : పడింది నీవల్లనే కదా ...... , నీ ఐస్ క్రీమ్ ఇవ్వు అంటూ ఏకంగా నా చేతిలోనిది లాక్కుని నేను టేస్ట్ చేసిన ఐస్ క్రీమ్ టేస్ట్ చేసి మ్మ్మ్ ...మ్మ్మ్..... సూపర్ అంటూ నావైపు అందరివైపు సైగచేస్తూనే మళ్లీ కొరికారు .
ఆఅహ్హ్హ్ ....... నేను టేస్ట్ చేసిన ఐస్ క్రీమ్ నా దేవకన్య తింటున్నారు అంటూ హృదయంపై రెండు చేతులూ వేసుకుని the best ఫీల్ తో వెనక్కు దారిప్రక్కనే ఉన్న పూలమొక్కలపైకి వాలాను .
మహేష్ - అన్నయ్యా - మహేష్ సర్ ....... హమ్మయ్యా థాంక్యూ ప్లాంట్స్ - ఇదే అలవాటు అయిపోయింది అంటూ అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .
చెల్లెమ్మ : కృష్ణ కృష్ణా ఎక్కడున్నావు ? , స్టోన్ బెంచ్ పై కూర్చుని కుమ్మేస్తున్నావా ..... ? , నీకు చెప్పిన పని ఏమిటి ? - అన్నయ్య వెనుకే ఉండమని చెప్పానుకదా ..... అంటూ వాడిచేతిలోని ఐస్ క్రీమ్ అందుకుని తిని సిగ్గుపడుతోంది .
కృష్ణగాడు : కూల్ కూల్ ఏంజెల్ ...... , నీ ప్రియమైన మహి అక్కయ్య ప్రేమ వలన నీ ప్రాణమైన అన్నయ్యకు ఏమీకాదు - చూశావుకదా మొదట మీ మహి అక్కయ్య పడిపోకుండా పట్టుకున్నారు , ఇప్పుడు ఏకంగా పంచభూతాలే పడిపోకుండా చూసుకున్నాయి . దేవకన్య ప్రేమలో ఉన్న మన దేవుడికి ఏమీకాదులే కూర్చో అంటూ చెల్లెమ్మ తిన్న ఐస్ క్రీమ్ అందుకుని తిన్నాడు .
సిస్టర్స్ : Wow ...... ఏమిచెప్పావు కృష్ణా , అచ్చు నువ్వు చెప్పినట్లుగానే జరిగింది .
దేవకన్య : పరవశించిపోయి , ఫీల్ అయినది ఇక చాలు లేవండి అంటూ చేతిని అందుకుని లేపబోయి వీలుకాక నడుమును చుట్టేసి లేపారు - ఏమి తింటావు ఇంత బరువున్నావు ? .
నా దేవకన్య అందాన్ని .........
దేవకన్య : నిన్నూ అంటూ కుడివైపు ఛాతీపై దెబ్బలవర్షం కురిపించి , అంటీ ...... ప్రతీసారీ ఇలానే డ్రీమ్స్ లోకివెళ్లిపోతాడు - పూలమొక్కలు ఉన్నాయి కాబట్టి పర్లేదు అదే ....... నో నో నో ........ జాగ్రత్త మహేష్ ......
సరే అంటూ కేరింగ్ కనిపిస్తున్న నా దేవకన్య కళ్ళల్లోకే చూస్తున్నాను .

మహీ మహీ అక్కయ్యా అక్కయ్యా ....... డిస్టర్బ్ చేస్తున్నందుకు sorry ...... మెస్ లో డిన్నర్ రెడీ రండి వెళదాము అంటూ హాస్టల్ గర్ల్స్ ఆహ్వానించారు .
ఇద్దరమూ తేరుకుని కంగారుపడుతూ ఒకరినొకరు వదిలి సిగ్గుపడుతున్నాము .
హాస్టల్ గర్ల్స్ నవ్వుకుని , అన్నయ్యా - మహేష్ ....... మీతోపాటు కలిసి భోజనం చెయ్యాలని అందరూ ఆశపడుతున్నారు .
నో నో నో ...... గర్ల్స్ హాస్టల్ లోకి ఎంటర్ అయితే మీ వార్డెన్ అమ్మవారి అవతారం ఎత్తేస్తారు - రూల్స్ are రూల్స్ ....... - నావలన భవిష్యత్తులో ఏ ఒక్కరూ ఇబ్బందిపడకూడదు .
వార్డెన్ : మహేష్ ........
నో వార్డెన్ ...... మనం సంతోషంలో ఇప్పుడు ఇలా చేసామే అనుకోండి , మీడియాకు ఎలాగైనా తెలిసితీరుతుంది , వాళ్ళు ముందూ వెనుకా ఆలోచించకుండా ఏదేదో రాసేస్తారు - టెలిక్యాస్ట్ చేసేస్తారు , మీ గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే నేను కామ్ గా ఉండలేను - అసలు మనం వాళ్లకు అలాంటి అవకాశమే ఇవ్వకూడదు . మేము వచ్చినదే హాస్టల్ ఫుడ్ తినడానికి - నా దేవకన్య , సిస్టర్స్ , వార్డెన్ మేడం .... ఎలాగో ఫుడ్ ఇక్కడికే తీసుకొస్తారు సంతోషంగా తింటాము - ఏమంటావు మహీ ........
దేవకన్య : ఉమ్మా అంటీ లవ్ యు అంటూ హృదయంపై ముద్దుపెట్టారు .
మహీ - సిస్టర్స్ ...... 4 గంటలకు తిన్నాము ఆకలైతే వెయ్యడం లేదు కానీ పూర్తిగా మారిన హాస్టల్ ఫుడ్ టేస్ట్ చెయ్యాలని ఉంది - అందరికంటే ముందు నేనే తినాలని ఉంది .
సిస్టర్స్ : ఫుడ్ క్వాలిటీ టెస్ట్ చెయ్యడం కోసమే కదా మహేష్ సర్ ....... మీరు సూపర్ అంతే ......
హాస్టల్ గర్ల్స్ : థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అన్నయ్యా - మహేష్ ....... , మధ్యాహ్నం లంచ్ చేసాము కదా సూపర్ ....... , మీ వల్లనే అంతా కాదు కాదు మా మహి వల్లనే లవ్ యు వే మహీ అంటూ చుట్టూ కౌగిలించుకున్నారు .
దేవకన్య : నా వల్లనా ..... ? , చేసిందంతా మన హీరోగారు అయితేనూ .......
హాస్టల్ సిస్టర్స్ : మన హీరో కాదు నీ హీరో అంటూ నా గుండెలపైకి తోసారు .
పెదాలపై అంతులేని ఆనందంతో నాకు తెలియకుండానే నా దేవకన్యను హత్తుకోబోయాను .
దేవకన్య : హలో ఏంటి .......
పడిపోకుండా .........
దేవకన్య : పడిపోతున్నానా ....... ? .
ఊహూ ....... అంటూ జలదరిస్తున్నాను .
కృష్ణగాడు : I am at పొజిషన్ .......
చెల్లెమ్మ : ఉమ్మా ..... మై హీరో .......
దేవకన్య : మరి ......
చేతులను వెనుక ఉంచుకున్నాను .
దేవకన్య : నవ్వుకున్నారు - స్పర్శకే ఇలా అయిపోతే ఎలా హీరో - ఫుడ్ తీసుకొస్తాను అంతవరకూ జాగ్రత్త అంటూ నా హృదయం పై ముద్దుపెట్టి , దివ్యక్క - చెల్లెమ్మను పిలుచుకుని వెళ్లారు .
ఆఅహ్హ్ ....... అంటూ కృష్ణగాడి వీపుపైకి చేరాను .
కృష్ణగాడు : నీ ఇష్టం రా ఎంతసేపు ఫీల్ అవుతావో ఫీల్ అవ్వు .......
హాస్టల్ మెయిన్ డోర్ దగ్గర ఆగి చిలిపినవ్వులతో లోపలికివెళ్లారు .

15 నిమిషాల తరువాత చేతులలో ప్లేట్స్ తో నా దేవకన్య - సిస్టర్స్ - దివ్యక్క - చెల్లెమ్మ - పిల్లలు ...... చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చారు . ఆ వెనుకే హాస్టల్ గర్ల్స్ అందరూ చేతులలో ప్లేట్స్ తో దేవకన్యను ఫాలో అవుతున్నారు .
చూసి ఆశ్చర్యపోతున్న నాదగ్గరికివచ్చి , హీరో ....... నువ్వు మెస్ దగ్గరకి రాలేదని - నీతో కలిసి భోజనం చెయ్యాలని అందరూ బయటకే వచ్చేసారు అంటూ నా హృదయం పై ముద్దుపెట్టారు అమితమైన ఆనందంతో ........
ఫ్రెండ్స్ - సిస్టర్స్ ....... sorry ......
హాస్టల్ గర్ల్స్ : నో నో నో మహేష్ - అన్నయ్యా ....... , మీవలన ప్రకృతిలో నేలపై కూర్చుని తినే అదృష్టం లభించింది రండి గ్రౌండ్ లో మీతోపాటు తింటాము .
గ్రౌండ్ లో చీకటిగా ఉంది సిస్టర్స్ .......
అంతే అందరూ ఎడమచేతితో తమ తమ మొబైల్స్ టార్చ్ లు ఆన్ చేశారు - చంద్రుడి వెన్నెలకూడా ఉంది అన్నయ్యా ....... - మేము ..... మీతో కలిసి తినాలని ఫిక్స్ అయిపోయాము - మీకు ఇష్టం లేదంటే చెప్ప .......
నో నో నో చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ....... , మొబైల్ తీసి చంద్ర అన్నకు కాల్ చేసి బస్సును గ్రౌండ్ లోకి తీసుకొచ్చి హెడ్ లైట్స్ ఆన్ చెయ్యమన్నాను .
దేవకన్య : ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... అంటూ హృదయంపై సంతోషంతో ముద్దులుపెట్టారు .

నిమిషంలో బస్సు గ్రౌండ్ లోకివచ్చింది . అవసరమైనంత వెలుగు పడటంతో యాహూ యాహూ ...... అంటూ సంతోషంతో కేకలువేశారు హాస్టల్ గర్ల్స్ .......
రేయ్ మామా ...... అన్నను కూడా పిలుచుకునిరా ......
సిస్టర్ : డ్రైవర్ అన్నకు కూడా తీసుకొచ్చాము అంటూ కృష్ణకు అందించారు .
దేవకన్య : హీరో కూర్చో ....... , తమరికి పీఠం ఏమైనా వెయ్యాలా ఏమిటి ?.
నో నో నో మీకోరిక ప్రకారం నేలపై అంటూ కూర్చున్నాను . నా ఎదురుగా దేవకన్య చుట్టూ దివ్యక్క - బావగారు , చెల్లెమ్మ - కృష్ణ , పిల్లలు - వార్డెన్ ...... ఆ చుట్టూ హాస్టల్ గర్ల్స్ కూర్చున్నారు .
దేవకన్య : హీరో అంటూ ప్లేట్ ను నా ముందు ఉంచారు .
రెండు రకాల స్వీట్స్ - మూడు రకాల పచ్చళ్ళు - రెండు రోటీలు - రెండు రకాల కూరలు - రైస్ - దాల్ - రసం - పాపడ్ - రైతా ....... wow " మినీ తాలీ " లా ఉంది మహీ ...... సూపర్ , మహీ ...... మరి నీ ప్లేట్ ఎక్కడ ? .
దేవకన్య తియ్యనికోపంతో చూస్తున్నారు .
ఏంటి మహీ అలా చూస్తున్నావు - ఆ చూపులకు అర్థం దెబ్బలని నాకు తెలుసు ........
సిస్టర్స్ - హాస్టల్ గర్ల్స్ నవ్వుతున్నారు . మహేష్ సర్ ..... ఇద్దరూ ఒకే ప్లేట్ లో తినాలని అందరూ కోరిక కోరారు .
వా ........ వ్ wow ....... థాంక్యూ థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సిస్టర్స్ థాంక్యూ థాంక్యూ ....... ఉమ్మా ఉమ్మా ఉమ్మా ....... అంటూ చుట్టూ అందరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను . అమ్మా అమ్మా ....... నాకోరికల్లో ఒకకోరిక తీరబోతోంది హాస్టల్ ఫ్రెండ్స్ వలన అంటూ పట్టరాని ఆనందంతో ఎంజాయ్ చేస్తున్నాను , ఫ్రెండ్స్ - సిస్టర్స్ ...... నా లిస్ట్ లోని ఒక కోరికను తీర్చబోతున్నందుకు గానూ ....... హాస్టల్ కు మరొక వరం ఇవ్వబోతున్నాను ,బాగా ఆలోచించుకుని రేపు కోరిక కోరండి , ఎంత ఖర్చు అయినా హ్యాపీ .......
యాహూ అంటూ కేకలు ఆకాశాన్ని తాకాయి .
దేవకన్య : చూసి మురిసిపోతూ వెనకున్న విద్యు సిస్టర్ కు చేతిని వెనక్కు తీసుకెళ్లి హైఫై కొట్టి , చాలు చాలు మహేష్ చాలు ..... తమరు తింటేనే కానీ మీ అభిమానులు ఎవ్వరూ తినేలా లేరు కానివ్వండి .
Ok ok ok ఎంత సంతోషం కలుగుతోందో మాటల్లో చెప్పలేను అంటూ రోటీని కూరలో అద్దుకుని తిని మ్మ్మ్ ....... టేస్టీ , మహీ ..... తిను బాగుంది .
దేవకన్య : తినకపోతే మా హాస్టల్ మేట్స్ అంతా కొట్టేలా ఉన్నారు తప్పుతుందా అని నేను విరిచిన రోటీని విరుచుకుని నేను టేస్ట్ చేసిన కూరతోనే తిని మ్మ్మ్ ...... హాస్టల్ ఫుడ్ ఇంత టేస్టీ ....... ఉమ్మా ఉమ్మా లవ్ యు అంటీ , మీ - మా హీరో బంగారం ........
హాస్టల్ గర్ల్స్ : ఇక మేము తింటాము థాంక్యూ for వండర్ఫుల్ ఫుడ్ మహేష్ - అన్నయ్యా ....... అంటూ తిని అందరూ ఒకేసారి మ్మ్మ్ మ్మ్మ్ ...... అని ఫీల్ అవ్వడం చూసి ఆనందించాము .

నాతోపాటు దేవకన్య పోటీపడి తినడంతో రెండు రోటీలు ఫినిష్ అయిపోయాయి . వార్డెన్ ...... రోటీలు సూపర్ గా ఉన్నాయి మరొక రెండు ....... - లిమిటెడ్ అయితే వద్దు అందరికీ సరిపోవాలి కదా .......
హాస్టల్ గర్ల్స్ : నేను తీసుకొస్తాను నేను తీసుకొస్తాను అంటూ దేవకన్యతోపాటు అందరూ లేచారు . నిన్నటివరకూ లిమిటెడ్ అన్నయ్యా ...... మధ్యాహ్నం తెలిసింది ఇకనుండీ ఆన్ లిమిటెడ్ అని ........
వార్డెన్ : మహీ - స్టూడెంట్స్ ...... కూర్చోండి , మెస్ పాత్రలన్నీ ఇక్కడికే తెప్పించాను - వాళ్లే వడ్డిస్తారు .
మెస్ సర్వర్ : సర్ ...... ఎన్ని ? .
మహీ .......
దేవకన్య : నీ ఇష్టం అంటూ సిగ్గుపడ్డారు .
Two ఎనఫ్ , రైస్ - పచ్చళ్ళు కూడా టేస్ట్ చెయ్యాలి - ఒక్కొక్కటే రుచి చూసి వార్డెన్ ....... దాల్ పచ్చళ్ళు రసం కూడా సూపర్ ........
సిస్టర్ : మరి పాపడ్ మహేష్ సర్ .......
పాపడ్ లేనిదే డిన్నర్ పూర్తికానట్లే .......
అందరూ సంతోషంతో కేకలువేశారు .

తింటూనే ...... మహేష్ సర్ ముఖ్యమైన విషయం చెప్పడమే మరిచిపోయాము . హాస్టల్ ...... సూపర్ స్టార్ హాస్టల్ గా మారడానికి కారణమైన మీ దేవకన్య పేరును ........
దేవకన్య : ష్ ష్ ష్ ...... డార్లింగ్స్ ......
సిస్టర్స్ : మెస్ కు మీ దేవకన్య పేరుని పెట్టారు ......
రియల్లీ ....... , ఫ్రెండ్స్ - సిస్టర్స్ ...... రెండవ వరం కూడా .......
థాంక్యూ థాంక్యూ మహేష్ - అన్నయ్యా ........
దేవకన్య : సిగ్గుపడుతూనే మహేష్ ...... నేను నో అన్నాను అయినా ......
అది వారి అభిమానం మహీ - అభిమానాన్ని ఎవ్వరూ ఆపలేరు . Wow wow ..... హాస్టల్ ఉన్నంతకాలం నా దేవకన్య గొప్పతనం గురించి చర్చిస్తూనే ఉంటారు - what మా ....... విన్నావా మహీ , అమ్మకూడా సో సో sooooo హ్యాపీ .......
దేవకన్య : కళ్ళల్లో బాస్పాలతో ....... , గొప్పతనం మీది చేసిందంతా మీరు .......
సిస్టర్స్ : డార్లింగ్ ....... నీ పేరు ఉంటే మహేష్ సర్ పేరు ఉన్నట్లే కదా .......
లవ్ యు లవ్ యు సిస్టర్ ....... , మహీ ...... ఎంత ఆనందం కలుగుతోందో మాటల్లో వర్ణించలేను - హాస్టల్ గర్ల్స్ అందరికీ థాంక్స్ .......
హాస్టల్ గర్ల్స్ : థాంక్యూ థాంక్యూ ...... అందరూ మనఃస్ఫూర్తిగా ఒప్పుకున్నారు మహేష్ - అన్నయ్యా ...... యునానిమస్ .......
ఆఅహ్హ్హ్ ...... ఎంతైనా దేవకన్య కదా .......
దేవకన్య : ప్లీజ్ ప్లీజ్ మహేష్ ఇంకా చాలు చాలు తినండి .
నువ్వు తిను మహీ అంటూ పులకించిపోతూ తృప్తిగా తిన్నాము .

మహీ - సిస్టర్స్ ....... నాకు తెలుసు ఈ లైఫ్ ను మిస్ అవుతున్నారని , హాస్టల్లో లేము అన్న లోటు తీరేంతవరకూ లోపలికివెళ్లి ఎంజాయ్ చెయ్యండి - అంతవరకూ సంతోషంతో wait చేస్తాము .
దేవకన్య - సిస్టర్స్ : నిజమే మహేష్ - మహేష్ సర్ ...... , మాకు ఇక్కడా ఉండాలని ఉంది మరియు ఇంతమంది పెదాలపై చిరునవ్వులు పూయించిన దేవుడి దగ్గరా ఉండాలని ఉంది - లవ్ యు .......
లవ్ యు .......
దేవకన్య : అంటీ అంటీ లవ్ యు sooooo మచ్ అంటీ అంటూ నా హృదయంపై ముద్దుపెట్టారు .
లవ్ యు మా ...... , మా విన్నారా నా దేవకన్య ...... నన్ను దేవుడు అన్నారు .
దేవకన్య : డార్లింగ్స్ ఇక మైమరిచిపోతాడు రండి అంతలోపు మనం హాస్టల్ లోపలికి వెళ్లివద్దాము , దివ్యా - చెల్లీ ..... రండి , బుజ్జిఅన్నయ్యా ...... నీ ప్రాణమిత్రుడిని చూసుకో .......
కృష్ణగాడు : లవ్ టు సిస్టర్ అంటూ నవ్వుకున్నాడు - రేయ్ మామా ...... బస్సులో టీవీ చూస్తూ ఎంతసేపైనా కూర్చుందాము రారా అంటూ దేవకన్యనే ప్రాణంలా చూస్తున్న నన్ను కష్టమైనా ఎత్తుకున్నాడు .
అందరితోపాటు దేవకన్య అందంగా నవ్వుతున్నారు .
ఆఅహ్హ్ ...... రేయ్ మామా , నన్ను నన్ను దేవుడు అన్నదిరా నా దేవకన్య .......
కృష్ణగాడు : సంతోషమే కదరా .......
అవునవును .......
కృష్ణగాడు : చంద్ర అన్న - బావగారి సహాయంతో ఎత్తుకునివెళ్లి బస్సులోని సోఫాలో పడేసాడు . అమ్మో ....... దున్నపోతులా ఉన్నాడు బావగారూ ....... , అన్నా ...... ఏమంటావు .
చంద్ర : అలా ఏమీ లేదులే కృష్ణ సర్ .......
కృష్ణగాడు : మీ మహేష్ సర్ ...... నీకు కూడా దేవుడు కదా అలానే అంటావు - నీకే కాదు అన్నా ...... మాకు కూడా దేవుడే ...... , చంద్రన్నా ...... టీవీ కండిషన్ లో ఉందా ..... ? .
చంద్ర : బస్ కొని వన్ ఇయర్ కూడా కాలేదు సర్ అంటూ ఆన్ చేసి రిమోట్ అందించాడు .
కృష్ణగాడు : ఇక అయితే మమ్మల్ని వదిలి ట్రిప్స్ కు వెళ్లను అంటావు .......
చంద్ర : ఇంకా అంటే ఇంటికి కూడా వెళ్లను సర్ .......
కృష్ణగాడు : ష్ ష్ ష్ నెమ్మది , మీ మహేష్ సర్ ...... డ్రీమ్స్ లో ఉన్నారు కాబట్టి సరిపోయింది , నీ మాటలు విని ఉంటే ఇక అంతే మెసేజ్ ఓరియెంటెడ్ స్పీచ్ ఇచ్చేవాడు , ఎవ్వరికైనా అది రాజైనా - నిరు పేదైనా వారికి కుటుంబమే ఫస్ట్ అని నమ్మే వ్యక్తి మీ సర్ - సర్ ముందు ఇంకెప్పుడూ ఇలా అనకు - నిన్ను పంపించినా పంపించేస్తాడు .
చంద్ర : అయితే ఇంకెప్పుడూ అలా మాట్లాడను సర్ ....... , పని ఇచ్చారు మిమ్మల్ని వదిలి అదే అదే డ్యూటీ టైం లో వదిలి వెళ్లను సర్ ......
కృష్ణగాడు : అయితే మీ సర్ కు నచ్చేలా బస్సులో కొన్ని మార్పులు చెయ్యాలి .
చంద్ర : ఎలానో చెప్పండి కృష్ణ సర్ ......
కృష్ణగాడు : మొబైల్ తీసి ఆగ్రాలో జర్నీ చేసిన బస్సు లోపల తీసుకున్న ఫోటోను అన్నకు పంపించాడు , సీట్స్ స్థానంలో సోఫాలు , ఫ్రిడ్జ్ - AC - మ్యూజిక్ సిస్టం - మినీ వంట గది ఫిక్స్ చెయ్యాలి , వెనుక రెస్ట్ తీసుకోవడానికి బెడ్ - అటు చివరన బాత్రూం .......
చంద్ర : ఎలా మార్చాలో అర్థమైపోయింది సర్ లగ్జరీగా ఉండాలన్నమాట నాకు వదిలెయ్యండి , ఎక్కడ మారుస్తారో కూడా తెలుసు , రేపే తీసుకెళతాను - సర్ చేత శభాష్ అనిపించుకుంటాను .
కృష్ణగాడు : అన్నా ..... మీ అకౌంట్ నెంబర్ చెప్పండి .
చంద్ర : సర్ పని పూర్తయ్యాక మీరే .......
కృష్ణగాడు : పర్లేదు అన్నా అంటూ 10 lakhs ట్రాన్స్ఫర్ చేసాడు - ఎంత ఖర్చైనా పర్లేదు అమౌంట్ చెప్పు పంపిస్తాను .
నమ్మి ఇంత డబ్బును ఇచ్చారు అని కళ్ళల్లో కన్నీళ్ళతో దండం పెట్టారు .
కృష్ణగాడు : ఆపి రేపు ఎల్లుండి హాలిడేస్ ...... , సోమవారానికి రెడీ అయిపోతే బెటర్ .......
చంద్ర : అయిపోయేలా దగ్గరుండి చేయిస్తాను సర్ .......
కృష్ణగాడు : అన్నా ...... మీ సర్ ను సర్ అని పిలువు , నన్ను కృష్ణా ...... అని పిలిస్తే చాలు .
నన్ను కూడా చంద్రా ...... అంటూ బావగారు ......
నన్ను కూడా అన్నా ...... , కాల్ మీ మహేష్ .......
చంద్ర : నో నో నో సర్ సర్ సర్ నావల్ల కాదు , మీరు టీవీ ఎంజాయ్ చెయ్యండి అని కిందకుదిగారు .

9 గంటలకు హాస్టల్ గర్ల్స్ అందరూ బస్సువరకూ వచ్చి నా దేవకన్య - సిస్టర్ ను వదిలారు .
హాస్టల్ గర్ల్స్ : అక్కయ్యలూ ...... మళ్ళీ ఎప్పుడు వస్తారు .
దేవకన్య : మీ అన్నయ్య ఎప్పుడు కనికరిస్తే అప్పుడు .......
హాస్టల్ గర్ల్స్ : అన్నయ్యా .......
సిస్టర్స్ ...... మీరెప్పుడు కోరుకుంటే అప్పుడు - మీ అక్కయ్య ఆర్డర్స్ పాటించే సేవకుడిని నేను ......
దేవకన్య - సిస్టర్ ...... నవ్వుకుని , వెళ్ళొస్తాము ఫ్రెండ్స్ - సిస్టర్స్ అంటూ కౌగిలించుకుని బస్సు ఎక్కారు . దేవకన్య ...... నా ప్రక్కనే వచ్చి కూర్చున్నారు .
దేవకన్య : చూసింది చాలు , మీ సిస్టర్స్ కు మీరిచ్చిన వరం ఎప్పుడు తీరుస్తారో చెప్పండి .
ఒకటి కాదు మహీ రెండు - కోరుతున్నారా నేనెప్పుడో రెడీ ......
హాస్టల్ గర్ల్స్ : ఇప్పుడే కాదులే అన్నయ్యా ...... , అవసరం వచ్చినప్పుడు కోరుతాము , ఇప్పటికైతే క్లీన్ & సేఫ్టీ హాస్టల్ ను - క్వాలిటీ & టేస్టీ ఫుడ్ ముఖ్యన్గా ఐస్ క్రీమ్స్ ....... కొంతమంది అయితే అక్కడే కూర్చుని తింటూనే ఉన్నారు అంటూ నవ్వుతూ చెప్పారు .
సిస్టర్స్ ...... రోజుకు మూడుసార్లు లోడ్ చెయ్యడానికి వస్తారు కాబట్టి అంతలోపు ఫినిష్ చేసేయ్యాలి .
అందరి పెదాలపై చిరునవ్వులు ......
దేవకన్య : మీ అన్నా చెల్లెళ్ళ ముచ్చట్లు అయిపోతే బయలుదేరుదాము - మాకు నిద్రవస్తోంది - అన్నయ్యా ...... అని ఆప్యాయంగా పిలిస్తే చాలు రోజంతా చెల్లెళ్లతోనే ఉండిపోతారు .
హాస్టల్ గర్ల్స్ : నవ్వుకుని , అన్నయ్యా ...... గుడ్ నైట్ గుడ్నైట్ , నిన్న రాత్రి నుండీ మీరిద్దరూ నిద్రపోలేదని తెలుసు - వెళ్ళి హాయిగా నిద్రపోండి బై బై .......
గుడ్ నైట్ సిస్టర్స్ - వార్డెన్ అందరూ జాగ్రత్త అనిచెప్పి బయలుదేరాము .

భయంకరంగా నిద్రవస్తోంది ఆవ్ ...... అంటూ ఆవలిస్తూ నా చేతిని చుట్టేసి కళ్ళుమూసుకుని భుజం పై తలవాల్చారు నా దేవకన్య ........
తియ్యని కరెంట్ షాక్ వొళ్ళంతా సర్రున పాకినట్లు ఉలిక్కిపడ్డాను .
దేవకన్య : కదలకు విద్యు డార్లింగ్ ....... అంటూ మరింత గట్టిగా చుట్టేసారు .
అంతే సడెన్ గా వెక్కిళ్ళు వచ్చేసాయి .
దేవకన్య : ఫుల్ గా తిన్నావుకదా అందుకే వెక్కిళ్ళు వస్తున్నాయి , మహేష్ చెప్పినట్లు ముద్దుపెడితే వెక్కిళ్ళు మాయమైపోతాయి ఉమ్మా ...... అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి మళ్లీ భుజంపై తల వాల్చారు .
ఆఅహ్హ్హ్ ..... హ్హ్ ..... డబల్ షాక్ లో డబల్ వెక్కిళ్ళు పట్టేసాయి . వొళ్ళంతా జలదరింపులు ఆగడం లేదు .
దేవకన్య : ఏంటి డార్లింగ్ ఒక ముద్దుతో ఆగలేదా ..... , ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... అంటూ ముద్దులవర్షం కురిపించారు బుగ్గపై ........
అంతే వెక్కిళ్ళు ఆగిపోయాయి - నా ఆనందానికి హద్దూ పద్దూ లేకుండా పోయింది .
సిస్టర్స్ - దివ్యక్క - చెల్లెమ్మ అందరూ అందరూ అవాక్కై నోరుతెరిచి చూస్తున్నారు .
విద్యు సిస్టర్ : ష్ ష్ ష్ ...... మహేష్ సర్ ఎంజాయ్ అంటూ నా దేవకన్యకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
దేవకన్య : see వెక్కిళ్ళు ఆగిపోయాయి , ఎంతైనా మీ మహేష్ సర్ హీరో - దేవుడు ...... ఉమ్మా ఉమ్మా ......
ఆఅహ్హ్ ...... అంటూ గాలిలో తేలిపోతున్నాను .

మళ్లీ మెలకువ వచ్చినది చెంపపై మృదువైన చేతితో సున్నితమైన దెబ్బ పడ్డప్పుడే ........
కళ్ళుతెరిచిచూసి అప్పుడే ఇంటికి చేరుకున్నామా ...... అంటూ నా భుజంపై చూస్తే దేవకన్య లేదు - ప్రక్కన నిలబడి భద్రకాళీ అవతారంలో కోపంతో చూస్తున్నారు .
విషయం మొత్తం అర్థమై లేచి నిలబడి లెంపలు వేసుకుని గుంజీలు తీస్తున్నాను .
దేవకన్య : దీనికేమీ తక్కువలేదు ...... అంటూ ఆపి సీట్లో కూర్చోబెట్టారు .
నా తప్పేమీ లేదు మహీ ....... నువ్వే .......
దేవకన్య : నేనేలే ఎవరు ఎవరు కాదన్నారు కానీ విద్యు డార్లింగ్ విద్యు డార్లింగ్ అంటూ ప్రేమతో ముద్దులుపెడుతున్నపుడైనా చెప్పొచ్చుకదా ........
Sorry లవ్ యు లవ్ యు అంటూ మళ్ళీలేచి గుంజీలు తీస్తున్నాను .
దేవకన్య : ఆరే మళ్లీ గుంజీలు తీస్తున్నారు , వద్దు అన్నానుకదా అంటూ సీట్లో కూర్చోబెట్టారు .
భయంతో గజగజావాణికిపోతున్నాను .
దేవకన్య : భయం మాత్రం భలే నటిస్తారు .
సిస్టర్స్ : ఆపు ఆపు డార్లింగ్ ...... తప్పంతా నువ్వు చేసి పాపం నీ దేవుడిపై నిందలు వేస్తున్నావు - భయపెడుతున్నావు , ఆవ్ ...... అంటూ నీ దేవుడి భుజంపై ఆవలిస్తూ పడుకున్నది నీవు .......
దేవకన్య : లేచి వెళ్లొచ్చు కదా ......
విద్యు సిస్టర్ : ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న ప్రేయసి పడుకోగానే ఏ ప్రియుడైనా నిద్ర డిస్టర్బ్ చేస్తాడా చెప్పు - పాపం నీ స్పర్శ వేడి తాకి షాక్ లో వెక్కిళ్ళు కూడా వచ్చేసాయి పాపం .......
దేవకన్య : విద్యు డార్లింగ్ అంటూ ముద్దులు పెట్టినప్పుడైనా నేను అని చెప్పొచ్చుకదా ........
విద్యు సిస్టర్ : ఎలా చెబుతారు పాపం డబల్ వెక్కిళ్ళు వేస్తేనూ - అందులోనూ దేవకన్య ముద్దులు ....... నేరుగా స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటారు పాపం ......
అవునవును సిస్టర్స్ ...... నన్ను నేనే మరిచిపోయాను . ఒకటా రెండా ఏకంగా పన్నెండు ముద్దులు .......
దేవకన్య : పన్నెండు ముద్దులా ....... అంటూ నా కుడివైపు ఛాతీపై దెబ్బలవర్షం కురిపిస్తున్నారు .
నా నవ్వు ఆగడం లేదు .......
విద్యు సిస్టర్ : స్టాప్ స్టాప్ డార్లింగ్ ...... , రాజ్యాంగం ప్రకారం తప్పు నీదే అని నిర్ణయించాము కాబట్టి , ఇంటిలోపలికి వెళ్లేంతవరకూ sorry - గుడ్ నైట్స్ చెబుతూనే రావాలి .
దేవకన్య : రాజ్యాంగం ....... ? .
సిస్టర్స్ తోపాటు దివ్యక్క - చెల్లెమ్మ నవ్వుకున్నారు .
సిస్టర్స్ : అవును రాజ్యాంగం ప్రకారమే ...... అదికూడా నవ్వుతూ నీ దేవుడి చేతిని చుట్టేసి నడుస్తూ చెప్పాలి .
దేవకన్య : నా ప్రియమైన డార్లింగ్స్ ఆర్డర్ తప్పుతుందా .......
యాహూ ....... , సిస్టర్స్ ...... sorry ప్లేస్ లో లవ్ యు .......
దేవకన్య : నో నో నో .......
విద్యు సిస్టర్ : ప్రస్తుతానికి ఇలా సర్దుకొంది మహేష్ సర్ ....... , రాజ్యాంగం లో ఇలాంటి రూల్ లేదని మీ దేవకన్యకు తెలిస్తే మొదటికే మోసం వస్తుంది .
దేవకన్య : లోలోపలే నవ్వుకుని , ఏంటి గుసగుసలాడుతున్నారు ....... , హీరో ..... లెగు మరి ........

ఉమ్మా ఉమ్మా అంటూ హృదయంపై ముద్దుపెడుతూ లేచి నిలబడి చేతిని అందించాను .
దేవకన్య : సిస్టర్స్ తప్పదా ......
సిస్టర్స్ : తప్పదు - స్మైల్ స్మైల్ .......
దేవకన్య : నిజంగానే ఇష్టం అన్నట్లు అందమైన చిరునవ్వులతో మహేష్ sorry అంటూ చేతిని చుట్టేశారు .
ఆఅహ్హ్ ....... లవ్ యు లవ్ యు మహీ , మహీ ...... sorry వద్దు ఇలా లోపలికివెళదాము చాలు - థాంక్యూ sooooo మచ్ సిస్టర్స్ .......
దేవకన్య : థాంక్యూ హీరో ...... అంటూ ఇంటివైపుకు అడుగులువేశారు .
దేవకన్యవైపు ప్రాణంలా చూస్తూ దేవకన్య స్పర్శకు జలదరిస్తూ దేవకన్యతోపాటు అడుగులువేస్తున్నాను .
దేవకన్య : ముందు చూసి నడు మహేష్ ....... పడిపోతావు .
నడిపిస్తున్నది ఎవరు నా దేవకన్య ........
దేవకన్య : ఇంట్లోకి వచ్చేసాము - వదిలితే గుడ్ నైట్ చెప్పివెళ్లి ఇకనైనా హ్యాపీగా వెళ్లి పడుకుంటాము - ఎలాగో తెల్లవారుఘామున తమరి సర్ప్రైజ్ ఉండనే ఉంది .
నేను పట్టుకోలేదు మహీ ........
దేవకన్య : Ok అంటూ వదిలి సిగ్గుపడుతున్నారు . గుడ్ నైట్ మహేష్ - గుడ్ నైట్ అంటీ అంటూ హృదయంపై ముద్దుపెట్టారు , మీ గదిలో ఉన్నానా ఫోటోలకు దిష్టి పెట్టకుండా కాస్త త్వరగా నిద్రపోండి . గుడ్ నైట్ దివ్యా - చెల్లీ ...... ఫుల్లీ టైర్డ్ అంటూ విద్యు సిస్టర్ చేతిని చుట్టేశారు .
గుడ్ నైట్ మహీ - హాయిగా నిద్రపో - అమ్మ జోకొడుతున్నట్లు తలుచుకో మరింత హాయిగా నిద్రపడుతుంది . గుడ్ నైట్ సిస్టర్స్ .......
సిస్టర్స్ : గుడ్నైట్ మహేష్ సర్ ...... , రేపటి నుండి ఇంత త్వరగా పడుకోము ఫుల్ గా ఎంజాయ్ చేసి పడుకుందాము .
లవ్ టు లవ్ టు సిస్టర్స్ .......
గుడ్ నైట్ అన్నయ్యా - గుడ్ నైట్ మై హీరో అంటూ చెల్లెమ్మ కూడా దేవకన్యతోపాటు స్టెప్స్ ద్వారా పైకివెళ్ళారు .
కృష్ణగాడు : ప్చ్ ...... అంటూ చెల్లెమ్మవైపు ఆశతో చూస్తున్నాడు .
ఎంత విరహం ఉంటే అంత ప్రేమరా ...... , గుడ్ నైట్ - గుడ్ నైట్ దివ్యక్కా - బావగారూ అనిచెప్పి నా గదిలోకివెళ్లి దేవకన్య ఫోటోలను చూస్తూ పడుకున్నాను . గంటైనా నిద్రపట్టకపోవడంతో ....... , విద్యు సిస్టర్ కు మెసేజ్ చేసాను - " డిస్టర్బ్ చేస్తున్నందుకు extremely sorry sorry - సిస్టర్ నిద్రపట్టడం లేదు , నా దేవకన్యను చూస్తూ పడుకోవాలని అమ్మకూడా ...... " .
వెంటనే రిప్లై - " అయితే పైకి వచ్చెయ్యండి మహేష్ సర్ "
" థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సిస్టర్ " అని మెసేజ్ చేసి పరుగున పైకివెళ్ళాను .

అప్పటికే సిస్టర్స్ అందరూ కలిసి ఒక రూంలో ఉన్న బెడ్ ను కష్టపడుతూ తమ రూంలోకి తీసుకెళుతున్నారు .
వెంటనే వెళ్లి హెల్ప్ చేసాను .
సిస్టర్స్ : ష్ ష్ ష్ ...... అంటూ హాయిగా నిద్రపోతున్న దేవకన్య బెడ్ ప్రక్కనే ఆనుకునేలా వేశారు . మహేష్ సర్ ....... దగ్గరగా ఎంతసేపు కావాలంటే అంతసేపు చూస్తూ హాయిగాపడుకోండి .
ఇంత ప్రక్కనేనా ఇక అంతే ఉదయం దెబ్బలే దెబ్బలు ....... నో నో నో కాస్త గ్యాప్ అంటూ 2 - 3 అడుగుల దూరం వేసుకుని బెడ్ పైకి చేరాను .
సిస్టర్స్ : ఆగ్రాలో కష్టంగా సోఫాలో నిద్రపోవడం చూసాము - ఇప్పుడు బెడ్ పై హాయిగా నిద్రపోండి .
థాంక్యూ soooo మచ్ సిస్టర్స్ ....... , గుడ్ నైట్ ......
సిస్టర్స్ : గుడ్నైట్ ...... లవ్లీ గా మీ దేవకన్య స్వీట్ డ్రీమ్స్ అంటూ సంతోషంతో నవ్వుకుంటూ వెళుతూ ఆగి , ఉదయం సర్ప్రైజ్ ఉంది కదా .......
డబల్ కంఫర్మ్ సిస్టర్స్ ...... చెప్పానుకదా బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ....... అలా చూస్తూ ఉండిపోతారు .
సిస్టర్స్ : Wow ........

గుడ్ నైట్ సిస్టర్స్ అంటూ బెడ్ పైకి చేరి అందం - అమాయకత్వంతో అలసిపోయి హాయిగా నిద్రపోతున్న నా దేవకన్యనే ప్రేమ - ప్రాణంలా చూస్తూ ...... అమ్మా ఇప్పుడు హ్యాపీ కదా గోల గోల చేశారు - నాకంటే మీకు ...... మన దేవకన్య అంటేనే ప్రాణం కదూ .......
సిస్టర్స్ ....... తియ్యదనంతో నవ్వుతున్నారు .
సిస్టర్స్ ....... మీవరకూ వినిపిస్తోందా అంటూ నోటికి తాళం వేసేసాను - sorry లవ్ యు లవ్ యు డిస్టర్బ్ చేస్తున్నాను .
సిస్టర్స్ : నో నో నో మహేష్ సర్ , ఎంజాయ్ చేస్తున్నాము కంటిన్యూ కంటిన్యూ ......
నో నో నో ....... మీ డార్లింగ్ కు మెలకువ వచ్చిందంటే ..... అప్పుడు ఉంటుంది రియల్ ఎంజాయ్ నాకు ........
సిస్టర్స్ ...... చిలిపినవ్వులు నవ్వుకుని మళ్లీ గుడ్నైట్ చెప్పారు .
ఆఅహ్హ్ ...... అమ్మా ఏమిటీ ...... , నాన్నా ...... నీ గోల నీది - నేను మాత్రం మన దేవకన్యను మనసుతో జోపుచ్చుతాను .
లవ్ టు లవ్ టు అమ్మా ...... లవ్ యు sooooo మచ్ అంటూ హృదయం పై ముద్దుపెట్టాను . రెండు రోజులుగా నిద్రపోకపోవడంతో భయంకరంగా ఆవలింతలు రావడంతో నా దేవకన్యను చూస్తూ చూస్తూనే కళ్ళు మూతలుపడ్డాయి .
**********

మరుక్షణమే నాదేవకన్య సడెన్ గా లేచి కూర్చుంది . ఉమ్మా ఉమ్మా ....... లవ్ యు లవ్ యు మహేష్ - లవ్ యు sooooo మచ్ అంటీ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి డిస్టన్స్ చూసి కోపంతో బెడ్ దిగి జరపడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు కానీ కాట్ బరువుగా ఉండటం వలన సాధ్యపడటం లేదు - అయినాకూడా దేవకన్య విరమించడం లేదు .
వెనుక చిన్నగా ముసిముసినవ్వులు వినిపించడంతో చూసి భయపడి , వెంటనే డార్లింగ్స్ అంటూ విద్యు సిస్టర్ గుండెలపైకిచేరి సిగ్గుపడుతోంది .
విద్యు సిస్టర్ : అంటే మా దేవకన్య నిద్రపోలేదన్నమాట .......
దేవకన్య : ఎలా నిద్రపడుతుంది చెప్పండే ....... , మన దేవుడు బయటపడి ఇక్కడికే వచ్చేసారు - నేను బయటపడలేదు అంతే తేడా ........ , మహేష్ ను చూడకుండా రాత్రంతా ........ అమ్మో చాలా చాలా కష్టం . డార్లింగ్స్ ........
సిస్టర్స్ : దేవకన్య మనసులో ఏముందో అర్థమైందిలే ....... , ఇక ఈ రాత్రికూడా మా డార్లింగ్ నిద్రపోయే సూచనలైతే కనిపించడం లేదు ...... ఎంజాయ్ ఎంజాయ్ మా డార్లింగ్ సంతోషమే కదా మాకు కావాల్సినది అంటూ బుగ్గపై ముద్దుపెట్టి , దేవకన్యతోపాటు కాట్ చుట్టూ చేరుకున్నారు . డార్లింగ్ మేంఉన్నాము కదా నువ్వు ప్రక్కకురా అంటూ నెమ్మదిగా అతినెమ్మదిగా ఏమాత్రం సౌండ్ రానీకుండా ఒక అడుగు జరిపి చాలా డార్లింగ్ ? .......
దేవకన్య : మ్మ్మ్ ...... అంటూ బుంగమూతిపెట్టుకుంది .
సిస్టర్స్ : నవ్వుకుని , లవ్ యు లవ్ యు మాకు తెలుసులే అంటూ నా కాట్ కు ఏకమయ్యేలా ఆనించి హ్యాపీనా అన్నారు .
ఉమ్మా ఉమ్మా ఉమ్మా డార్లింగ్స్ అంటూ నలుగురినీ అమాంతం చుట్టేసి ముద్దులుపెట్టి , గుడ్ నైట్ గుడ్ నైట్ డార్లింగ్స్ ........
సిస్టర్స్ : పని అయిపోయిందికదా వెళతాములే మరొక్క క్షణం ఉంటే తోసేసేలా ఉన్నావు గుడ్ నైట్ ....... నీకు గుడ్ నైట్ కాదులే అంటూ నవ్వుకున్నారు - డార్లింగ్ ........ తనివితీరా ఎంతసేపు కావాలంటే అంతసేపు నీదేవుడిని చూసుకుని కాసేపైనా నిద్రపో లేకపోతే ఉదయం తన దేవకన్య కళ్ళు ఎర్రగా ఉండటం చూసి దేవుడు బాధపడతాడు .
దేవకన్య : నో నో నో అలా జరుగకూడదు అని సిస్టర్స్ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి పంపించేసి , అందమైన నవ్వులతో ఆనుకుని ఉన్న సింగిల్ బెడ్ పైకి చేరింది . అయినా ఇంత గ్యాప్ ఉందే దగ్గరగా మరింత దగ్గరగా ఇంకా దగ్గరగా ఇంకా ఇంకా దగ్గరగా అంటూ ఒకరి శ్వాసలను మరొకరము పీల్చేలా అతిదగ్గరగా జరిగి చిలిపినవ్వులు నవ్వుకుంది . కేవలం స్పృశించలేదు అంతే అంత దగ్గరగా ........ , మై గాడ్ ....... ఈ కొద్ది గ్యాప్ కూడా త్వరలోనే అతిత్వరలోనే లేకుండా చెయ్యాలి సరేనా ఉమ్మా ఉమ్మా అంటూ నా బుగ్గపై చేతితో ప్రియమైన ముద్దులుపెడుతున్నారు .
విద్యుసిస్టర్ : చూడండి డార్లింగ్స్ ...... , ఆ గ్యాప్ కు కారణం మన డార్లింగ్ కదా పాపం నింద మాత్రం మహేష్ సర్ మీద తోసేసింది .
దేవకన్య : తియ్యదనంతో నవ్వుకుంది . Sorry లవ్ యు లవ్ యు లవ్ యు మై గాడ్ ....... , మీ అంతులేని ప్రేమను కొంటేతనంతో ఆస్వాదించాలని అలా చేసాను - ఎంత ఎంజాయ్ చేస్తున్నానో మా అంటీకి బాగా తెలుసు అంటూ నా హృదయం పై అరచేతితో ప్రాణంలా స్పృశించారు .
ఆఅహ్హ్ ....... అంటూ నా హృదయం పై ఉన్న దేవకన్య చేతిపై నాకు తెలియకుండా రెండుచేతులను వేసాను . ఆఅహ్హ్ ...... అమ్మా - మహీ , అమ్మా - మహీ ...... అంటూ కలవరిస్తున్నాను .
సిస్టర్స్ : డార్లింగ్ ........ ? .
దేవకన్య : తియ్యదనంతో లేదు లేదు డార్లింగ్స్ ....... , నిద్రలోనే కలవరిస్తున్నారు ష్ ష్ .........
విద్యు సిస్టర్ : Ok ok ప్లీజ్ ప్లీజ్ డార్లింగ్ ఆ చేతిని మాత్రం తియ్యకు - నిద్రలోనూ మీ ఇద్దరినే కలవరిస్తున్నారు అంటే ఇంతటి స్వచ్ఛమైన ప్రేమ ...... మా డార్లింగ్ సొంతమైనందుకు ఎంత ఆనందం కలుగుతోంది మాటల్లో చెప్పలేను .
దేవకన్య : ప్రాణం పోయినా తియ్యను డార్లింగ్స్ ....... , అయినా తియ్యనిస్తేగా ప్రాణంలా పట్టేసుకున్నాడు .
సిస్టర్స్ : సంతోషంతో నవ్వుకున్నారు . Sorry లవ్ యు లవ్ యు డార్లింగ్ ఇక డిస్టర్బ్ చెయ్యము , ముద్దే పెడతావో లేక రేప్ చేసేస్తావో నీ ఇష్టం ...... గుడ్ నైట్ ........
దేవకన్య : ఆ సమయం వచ్చినప్పుడు నేనే రేప్ చేసేస్తాను డార్లింగ్స్ అంటూ చిలిపినవ్వులతో నా హృదయంపై ఉన్న చేతితో ప్రాణంలా జోకొడుతూ - ఎంత ఆలసిపోయారు మా అందరికోసం హాయిగా నిద్రపోండి అంటూ కురులపై గాలి ఊదుతూ నిద్రపుచ్చారు - కలవరించడం ఆపొచ్చుకదా అంటూ మరొక చేతితో పెదాలపై అడ్డుపెట్టారు ...... గుడ్ - చేతిని తీసేయ్యగానే అమ్మ - దేవకన్య , అమ్మ - దేవకన్య ....... , మహి స్థానంలో దేవకన్య వచ్చిందా ....... మిమ్మల్నీ అని తియ్యదనంతో కోప్పడుతూనే రాత్రంతా ఇలానే కలవరిస్తారా కానివ్వండి కానివ్వండి అంటూ పులకించిపోతూ నుదుటిపై చేతితో ముద్దుపెట్టింది - పెదాలతోనే పెట్టొచ్చు కానీ నా దేవుడికి ఇచ్చే ప్రతీ ముద్దూ sooooo స్పెషల్ ఉండాలి అందుకే అంటూ తియ్యనైన నవ్వులతో ఎంజాయ్ చేస్తూనే జోకొడుతూ జోకొడుతూ ఎప్పుడో తెల్లవారుఘామున నిద్రపోయింది .
*************

మహేష్ సర్ మహేష్ సర్ .......
సిస్టర్స్ ...... అంటూ పెదాలపై చిరునవ్వులతో కళ్ళుతెరిచాను . నా కళ్లెదురుగా అత్యంత దగ్గరగా కోపపు కళ్ళతో కొరుక్కుతినేలా చూస్తున్న నా దేవకన్య ........ , ఆశ్చర్యపోయినా తియ్యనైన నవ్వులతో మహీ hi hi అనిచెప్పాను . చుట్టూ ఉన్న సిస్టర్స్ కు hi hi చెప్పాను .
నా దేవకన్య కళ్ళతోనే నా హృదయంపై సైగచేశారు .
చూస్తే నా హృదయంపై దేవకన్య చేతిని గట్టిగా పట్టేసుకున్నాను . Sorry sorry అంటూ భయంతో వణుకుతూ వదిలి సడెన్ గా లేచికూర్చుని చేతులుకట్టుకుని బుద్ధిమంతుడిలా తలదించుకున్నాను .
దేవకన్య : ( తియ్యదనంతో ముసిముసినవ్వులు లోలోపలే నవ్వుకుని ) చూసారా డార్లింగ్స్ ....... , చేసిందంతా చేసి బుద్ధిమంతుడిలా ఎలా నటిస్తున్నాడో మీ దేవుడు ........
దేవకన్య చెంపపై తియ్యనైన దెబ్బ .......
దేవకన్య : స్స్స్ స్స్స్ ...... అంటూ రుద్దుకుంటూనే మన దేవుడు మన దేవుడు .......
తలదించుకునే నవ్వుకున్నాను .
దేవకన్య : నవ్వుకుంటున్నారు కదూ .......
నేనా ...... మహీ ? .
దేవకన్య : భలే నటిస్తున్నారు - మీరుకాక మేమా ...... ? , అయినా ఇక్కడికి ఎలా వచ్చారు ? ఎవరు పర్మిషన్ ఇచ్చారు ? .
మిమ్మల్ని చూడకుండా అమ్మ ఉండలేకపోయారు - మహీ మహీ అంటూ ఒకటే గోల ........ అందుకే .......
దేవకన్య : అంటీ నెపంతో నువ్వు వచ్చేసావన్నమాట - లవ్ యు అంటీ ఉమ్మా ఉమ్మా ...... - అయినా లోపలికి ఎవరు ....... ok ok మీరంటే ప్రాణమిచ్చే సిస్టర్స్ ఉన్నారుకదూ అమాయకంగా ఎలా అడుగుతున్నానో చూడు .......
సిస్టర్స్ : లవ్ యు లవ్ యు డార్లింగ్ ........

దేవకన్య : చాలు చాలు ....... , సరే నా డార్లింగ్స్ లోపలికి అనుమతి ఇచ్చారు - ఎక్కడో దూరంగా పడుకోవాలికదా అదే అదే ఎదురుగా అంటీకి కనిపించేలా ....... , అంటీ ...... మీ తప్పేమీ లేదు ఉమ్మా అంటూ నా హృదయం పై మళ్లీ ముద్దుపెట్టింది - రెండు కాట్స్ ను అతుక్కుపోయేలా చెయ్యడమే కాకుండా నన్ను మీ బెడ్ పైకి గాలికూడా దూరనంత దగ్గరికి లాక్కునిమరీ చేతిని గట్టిగా పట్టేసుకున్నావు - నొప్పివేస్తోంది డార్లింగ్స్ .......
విద్యు సిస్టర్ ప్రక్కనే కూర్చుని సున్నితంగా దేవకన్య చేతిని అందుకుని ముద్దులుపెడుతున్నారు .
దేవకన్య : ఆ ఆ రాత్రంతా నాకు నిద్ర రానీకుండా కలవరింత ఒకటి అంటూ బుగ్గపై గిల్లారు .
స్స్స్ ...... Sorry sorry మహీ ...... , చేతినైతే నేనే పట్టుకుని ఉంటాను కానీ బెడ్స్ ను ఏకం చేసినట్లు - మిమ్మల్ని దగ్గరగా లాక్కున్నట్లు ...... నేనైతే చేసి ఉండను , అవునూ ఇంతకూ ఏమని కలవరించాను మహీ ........
సిస్టర్స్ : మేము అలారం చప్పుడుకు లేచి వచ్చేన్తవరకూ మీ దేవకన్య చేతిని ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని " అమ్మా - దేవకన్య " అని కలవరిస్తూనే ఉన్నారు మహేష్ సర్ .......
పెదాలపై చిరునవ్వులతో ఉమ్మా ఉమ్మా లవ్ యు అమ్మా - లవ్ యు దేవకన్యా అంటూ దేవకన్యవైపు చిలిపిగా చూసి వెంటనే తలదించుకున్నాను .
దేవకన్య : చాలు చాలు ....... , ముందు బెడ్స్ సంగతి తేలనివ్వండి ప్రియమైన దేవుడు గారూ .......
ప్రియమైన దేవుడు ....... ఆఅహ్హ్ ఎంత మధురంగా ఉంది - నేనైతే కలపలేదు మహీ ....... కావాలంటే సిస్టర్స్ ను అడగండి - అందరమూ కలిసే మీ బెడ్ కు కొన్ని అడుగులదూరంలో ఉంచాము . అదిగో చూడండి మీ - మీ డార్లింగ్స్ మధ్యన గ్యాప్ ఎక్కడైనా ఉంటుందా ? ఇక్కడ ఉంది .
దేవకన్య : ఇలా దొరికిపోయాను ఏంటి అంటూ విద్యు సిస్టర్ వైపుకు తిరిగి నాలుక కరుచుకున్నారు .
విద్యు సిస్టర్ : దొరికిపోయామే డార్లింగ్ ........
దేవకన్య : అంటే అంటే మిమ్మల్ని హత్తుకోవాలని నేనే ...... మీ బెడ్ తో కలిపాను అంటున్నారా ...... ? - చూసారా డార్లింగ్స్ ఎంత ప్లాన్ వేశారో అంటూ సిస్టర్స్ వైపుకు తిరిగి చిలిపిదనంతో నవ్వుతున్నారు .
విద్యు సిస్టర్ : ప్రేమలో పడ్డాక ఎన్ని కన్నింగ్ ఐడియాస్ ...... సేఫ్ అయిపోయావులే డార్లింగ్ అంటూ చుట్టేశారు .
నో నో నో అలా అనలేదు మహీ ...... , ప్చ్ ...... రాత్రి కాస్త దూరంలోనే వేసుకున్నాను కదా ...... , సిస్టర్స్ మీరైనా చెప్పండి .
( sorry sorry మహేష్ సర్ ...... మీ దేవకన్యకు సపోర్ట్ చెయ్యక తప్పడం లేదు ) కనులారా మీ దేవకన్యతోపాటు మేమంతా జరిగినది చూశాక - మేము చెప్పినా ఎవ్వరూ నమ్మలేరు మహేష్ సర్ ......
అవునవును నిజమే సిస్టర్స్ ....... , మహీ ...... నాకు తెలియకుండా నిద్రమత్తులో చేసి ఉండొచ్చు sorry sorry ...... మీరెటువంటి శిక్ష వేసినా రెడీ అంటూ చేతులను విశాలంగా చాపి తలదించుకున్నాను .
దేవకన్య : sorry లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ మై గాడ్ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ....... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , డార్లింగ్స్ ....... దెబ్బలుపడాల్సిందే ........
సిస్టర్స్ : బాగా ఆలోచించుకుని కొట్టు మహి డార్లింగ్ .......
దేవకన్య : ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ కుడివైపు ఛాతీపై దెబ్బలవర్షం కురిపించి , అంటీని చూసి ఆపేస్తున్నాను ఉమ్మా ఉమ్మా లవ్ యు sooooo మచ్ అంటీ ........

సిస్టర్స్ : శిక్షించడం అయ్యిందా డార్లింగ్ ...... , మీరేంటి మహేష్ సర్ అలారం చప్పుడుకు కూడా చలించకుండా అంత ఘాడంగా నిద్రపోయారు .
నా దేవకన్య అంత దగ్గరగా మరియు చేతిని అమ్మ - తను ఉన్న హృదయంపై ...... ఇక ఏముంది భూకంపం వచ్చినా అగ్నిపర్వతం బద్దలైనా ........ గడియారం వైపు చూసి , అమ్మో ...... 5:30 - సర్ప్రైజ్ సమయం దగ్గరపడింది
అంటూ సడెన్ గాపైకిలేచాను . చెల్లెమ్మ ....... ? .
విద్యు సిస్టర్ : అన్నయ్యా ...... అక్కయ్యలను పిలుచుకుని తొందరగా రండి అని కేకలువేసి , మీ ప్రాణమిత్రుడి చేతిని చుట్టేసి ఎప్పుడో వెళ్ళిపోయింది , మనమే ఆలస్యం ........
Sorry sorry sooo sorry సిస్టర్స్ - లవ్ యు మహీ ....... This will be the perfect time for బ్యూటిఫుల్ సర్ప్రైజ్ - shall we go సిస్టర్స్ - మహీ ........
దేవకన్య : తమరిదే దేవుడిదే ఆలస్యం .......
Sorry - లవ్ యు చెప్పాను కదా మహీ ...... , అసలు దేవకన్య చేతిని హృదయంపై హత్తుకుని కూడా మేల్కొన్నాను అంటే ఇది 8th వండర్ అనే చెప్పాలి .
మళ్లీ నా ఛాతీపై దెబ్బల వర్షం కురిపించి , హృదయంపై చేతితో తియ్యనైన ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్హ్ ....... అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను .
సిస్టర్స్ : మహేష్ సర్ మహేష్ సర్ అంటూ బెడ్ పైకి పడిపోకుండా పట్టుకుని , మీరు ఫీలింగ్ తో ఎక్కడికో వెళ్ళిపోతే అక్కడ సర్ప్రైజ్ ........
లవ్ యు లవ్ యు ....... , సిస్టర్స్ సిస్టర్స్ ....... పైన చాలా చలిగా ఉంటుంది అని ఎవరి దుప్పటి వారికి చుట్టి , మహీ ...... అంటూ దుప్పటి పట్టుకుని చేతులను వణికిస్తున్నాను .
దేవకన్య : నా డార్లింగ్స్ అందరికీ చుట్టావు కదా ok .......
లవ్ యు లవ్ యు మహీ అంటూ ఏమాత్రం స్పృశించకుండా వెనుక చుట్టి సిగ్గుపడుతున్నాను .
దేవకన్య : మరి నీకు మహేష్ ........
నా ప్రియాతిప్రియమైన దేవకన్య ముద్దుపెట్టింది కదా ...... బాడీలో వెయ్యి వోల్ట్ ల కరెంట్ జనించి వెచ్చగా ఉంది - ఎనఫ్ .......
దేవకన్య : నేను ముద్దుపెట్టింది అంటీకు .......
అంటీ - నువ్వు ఉన్నది ఇక్కడేకదా ఉమ్మా ఉమ్మా ........ , తరువాత ఎంతసేపైనా కోప్పడవచ్చు కొట్టొచ్చు గిల్లోచ్చు ....... it is టైం మహీ ప్లీజ్ అంటూ దారి చూయించాను .
దేవకన్య : లేదు లేదు ఇప్పుడే గిల్లుతాను అంటూ నడుముపై గిల్లేసి , చిలిపినవ్వులతో సిస్టర్స్ దగ్గరకు చేరి , సర్ప్రైజ్ పైన అన్నారుకదా అంటూ బయలుదేరారు .
స్స్స్ ....... పెదాలపై చిరునవ్వులతో వెనుకే వెళ్ళాను .

Next page: Update 33
Previous page: Update 31