Update 35

లవ్ యు కాదు కాదు లవ్ యు అంటీ అంటూ హత్తుకుని , నా వేలు ఉండగానే కప్పులో వేలు దూర్చి కాఫీ అందుకున్నారు . సరిగ్గా అదేసమయానికి సముద్రంలోనుండి వెలుగులు ప్రసరిస్తూ అందమైన సూర్యోదయాన్ని కన్నార్పకుండా ఆస్వాదించి , బ్యూటిఫుల్ ........ లవ్ యు soooooo మచ్ అంటీ అంటూ ఏకంగా పెదాలతో హృదయంపై ముద్దుపెట్టింది .
ఆఅహ్హ్ ....... అంటూ దేవకన్య భుజంపై వాలబోయి , అమ్మో ...... అంటూ కంట్రోల్ చేసుకున్నాను .
దేవకన్య : డార్లింగ్స్ ........ కాఫీ ఇంత స్వీట్ గా ఉంటే షుగర్ తక్కువయ్యింది అంటారేమిటి ? , మహేష్ ....... కాఫీ సూపర్ ఫస్ట్ టైం మేము కూడా చెయ్యనంత పర్ఫెక్ట్ కాఫీ అంటూ మరొక సిప్ తాగి నాకు అందించింది .
సిస్టర్స్ : అంతేలే దేవుడు టేస్ట్ చేసి అందించిన కాఫీ దేవకన్యకు అమృతంలానే ఉంటుంది .
యాహూ ....... అంటూ సంతోషంతో కేకలువేస్తున్నాను .
దేవకన్య : లేదు లేదు లేదు ......
కాఫీ సిప్ చేసి , అవును సిస్టర్స్ ....... మీ డార్లింగ్ టేస్ట్ చేసిన తరువాత ప్రపంచంలోనే the బెస్ట్ కాఫీ లా మారిపోయింది .
సిస్టర్స్ : సరిపోయింది , ఎంతైనా మీ ప్రియాతిప్రియమైన దేవకన్య తేనెలూరే పెదాలు స్పృశించిన కాఫీ కదా ........
ఆఅహ్హ్ ....... ఇక నావల్ల కాదు అంటూ దేవకన్య భుజంపై తలవాల్చి , ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మహీ ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం ........
సరే అన్నట్లు నా హృదయంపై మరొక ముద్దు . మళ్ళీనా అంటూ ఆ మాధుర్యానికి కళ్ళు మూతలుపడ్డాయి .
దేవకన్య : నీ ఇష్టమైనంతసేపు ఇలానే ఉండిపో దేవుడు ఎవరు కాదన్నారు అంటూ నా నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టింది .
సడెన్ గా కళ్ళుతెరిచి , అంతా నా ఊహ ....... దేవకన్య , నా నుదుటిపై ముద్దుపెట్టడం ఏమిటి ప్చ్ ........
దేవకన్య : నవ్వుకుంది , దేవుడా ...... ఆకలివేస్తోంది - తమరు వదిలితే వెళ్లి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చెయ్యాలికదా ........
అవునవును టిఫిన్ వండాలి - థాంక్యూ లవ్ యు sooooo మచ్ మహీ ........
దేవకన్య : ఎందుకు ? , ok ok భుజంపై వాలనిచ్చినందుకా ........ ( దానికి నేనే బోలెడన్ని లవ్ యు లు చెప్పాలి మహేష్ - నా మనసులో నా దేవుడికి ఎన్ని ముద్దులు పెట్టానో పెడుతున్నానో ) లవ్ యు టూ అంటీ అంటూ హృదయంపై ముద్దుపెట్టి కాఫీ కప్స్ అన్నింటినీ కలెక్ట్ చేసి ట్రే లలోకి తీసుకున్నారు .
మహీ ...... నేనెలాగో కిందకువెళుతున్నాను కదా వంట గదిలో ఉంచుతాను అని అందుకుని , దేవకన్య - సిస్టర్స్ ను గదివరకూ వదిలి కిందకువెళ్లి కప్స్ వంట గదిలో ఉంచి , పరుగున నా గదిలోకివెళ్లి స్నానం చేసి డ్రెస్ వేసుకుని అంతే వేగంతో వంట గదిలోకి చేరాను .

అప్పటికే వంట స్టార్ట్ చేసిన పెద్దమ్మను చూసి , గురువుగారికి నమస్కారం ...... ఈరోజు ఏ టిఫిన్ నేర్పించబోతున్నారు గురువుగారూ ....... , గురువుగారూ ...... మీకోసం ఫ్లాస్క్ లో ఉంచిన కాఫీ టేస్ట్ చేశారా ...... ? .
ఎప్పుడో బాబూ ...... చాలా బాగుంది అంటూ పెద్దమ్మ సంతోషంతో నవ్వుకుని , తల్లులు ....... ఇడ్లీ వడ చేద్దాము అన్నారు బాబూ ......... , పిండి నిన్ననే రెడీ చేసాను - ఇప్పుడు కేవలం ఇలా ఇడ్లీ ప్లేట్లలోకి పిండి వేసి ఇలా ఇడ్లీ పాత్రలో ఒకదానిపై ఒక ప్లేట్ ఉంచడం - వడల కోసం రెడీ చేసిన పిండితో ఇలా సలసలా కాగుతున్న నూనెలోకి వెయ్యడం .
గురువుగారూ గురువుగారూ ....... నేను నేను ప్లీజ్ ప్లీజ్ ......
పెద్దమ్మ : తల్లులకోసం నేర్చుకోవాల్సిందే అన్నమాట , సరే అంటూ ఇడ్లీ ప్లేట్ అందించి వారూ అందుకుని నేర్పించారు .
ఈజీ అన్నమాట థాంక్యూ గురువుగారూ ....... అంటూ మిగతా ప్లేట్స్ అన్నింటినీ నేనే వేసి పాత్రలో ఉంచి క్లోజ్ చేసాను . యాహూ ....... నాకు ఇడ్లీ చెయ్యడం వచ్చు ..........

ఇడ్లీ కూడా నేర్చేసుకున్నావా ...... ? , మొత్తానికి రేపటి నుండి .......
Yes yes yes మహీ ....... రేపటి నుండి మీరెవరూ వంట గదిలో అడుగుపెట్టడానికి వీలులేదు - ఇది మీ మేనేజర్ గా ఆర్డర్ ....... , మీరు కేవలం కాలేజ్ - స్టడీస్ గురించి మాత్రమే ఆలోచించాలి .
దివ్యక్క : అన్నయ్యకు ...... నేను సహాయం చేస్తాను .
మా దివ్యక్కను - చెల్లెమ్మను ఈరోజు నుండే వంట గది నుండి డీబార్ చేస్తున్నాను - డాక్టర్ అయ్యేంతవరకూ వంట గదిలో అడుగుపెట్టడానికి వీలులేదు .
దివ్యక్క - చెల్లెమ్మ : అన్నయ్యా అన్నయ్యా ........ అంటూ ఇద్దరూ వచ్చి నా చేతులను చెరొకవైపు చుట్టేశారు .
ఇది నా మాట నా మాటే శాసనం దివ్యక్కా - చెల్లీ ....... మీరు కష్టపడితే ఈ అన్నయ్య తట్టుకోగలడా చెప్పు . పెద్దమ్మ ఒక్కరినే కష్టపెడతాను అని అనుకోవద్దు - చీఫ్ కుక్ పెద్దమ్మకు మరియు వారి శిష్యులైన నాకు - కృష్ణగాడికి తోడుగా ఉండటం కోసం నిన్న స్టార్ హోటల్లో నలుగురు లేడీ చెఫ్స్ ను సెట్ చేసాను - వాళ్ళు ఏ క్షణమైనా రావచ్చు .
దేవకన్య : లేడీ చెఫ్స్ ...... ? , అందుకేనా నిన్న కుకింగ్ సెక్షన్ లోకి అంత ఆతృతతో వెళ్ళింది .
సిస్టర్స్ : మహేష్ సర్ అయిపోయారు .......
దివ్యక్క - చెల్లెమ్మ ...... నవ్వుకుని , వంట గదిలో చివరిసారి కదా అంటూ పెద్దమ్మ దగ్గరికి వెళ్లారు .
నో నో నో మహీ .......
దేవకన్య : సరిగ్గా మేము లోపలికి వచ్చేసమయానికి మేల్ కుక్ దగ్గరికి చేరుకున్నారు .
లేదు లేదు మహీ ...... , ఇక్కడ ఉన్నది అమ్మ - దేవకన్య .......
దేవకన్య : పెదాలపై చిరునవ్వులతో నా హృదయంపై ముద్దుపెట్టి , దివ్యా ...... మాకు కూడా వంట గదిలో చివరి క్షణాలు అంటూ వడలు వేయడానికి వెళ్ళింది .

దివ్యక్క - చెల్లెమ్మ - దేవకన్య : పెద్దమ్మా ....... మీ శిష్యుడు ఒక్కరోజులోనే నూడిల్స్ చెయ్యడం - కాఫీ పెట్టడం నేర్చుకున్నారు .
పెద్దమ్మ : అవునవును తల్లులూ ...... , నాకోసం కూడా కాఫీ ఉంచాడు - బాగుంది కదా .......
సిస్టర్స్ : సూపర్ పెద్దమ్మా ...... , ఎంతైనానేర్పిస్తున్నది మా పెద్దమ్మ కదా ...... అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు .
దివ్యక్కా - చెల్లెమ్మా - మహీ ....... నేను నేనుకూడా వడలు వేస్తాను ప్లీజ్ ప్లీజ్ ...... నేర్పించండి .
ముగ్గురూ వడ పిండిని చేతుల్లోకి తీసుకుని , ఇలా ఇలా అంటూ మధ్యలో రంధ్రం ఉంచి వేడి నూనెలోకి జాగ్రత్తగా వదలాలి .
అంతేనా అంటూ పిండి అందుకుని ముగ్గురూ చూయించినట్లు చేసి నూనెలోకి వెయ్యబోతే .......
అన్నయ్యా - మహేష్ ....... జాగ్రత్త , నూనె మాత్రం తాకకూడదు అంటూ కంగారుపడుతూ చూస్తున్నారు .
Ok ok లవ్ యు లవ్ యు అంటూ చెప్పినట్లుగానే నూనెలోకివేశాను .
సూపర్ సూపర్ అన్నయ్యా అన్నయ్యా మహేష్ అంటూ దివ్యక్క చెల్లెమ్మలతోపాటు దేవకన్య కూడా హత్తుకుంది . ఆ ప్రాసెస్ లో చేతులకు అంటిన వడ పిండి మొత్తం నా షర్ట్ కు అంటుకోవడం చూసి అందరూ నవ్వుకున్నారు .
ముగ్గురూ : sorry లవ్ యు లవ్ యు అంటూ తుడవబోయి చేతులకు అంటినదంతా పూసి మరింత నవ్వుకున్నారు .
లవ్ యు దివ్యక్కా - చెల్లెమ్మా , లవ్ యు soooo మచ్ మహీ ....... , ఎవరైనా ఫోటోలు తియ్యొచ్చుకదా స్వీట్ మెమోరీలా .......
సిస్టర్స్ : అయ్యో ....... sorry లవ్ యు లవ్ యు మహేష్ సర్ అంటూ పరుగునవెళ్లి మొబైల్స్ తీసుకొచ్చి ఫోటోలు తియ్యడమే కాదు నేనేమో సెలెబ్రిటీ అన్నట్లు ప్రతీ ఒక్కరూ మరియు గ్రూప్ గా సెల్ఫీలు తీసుకున్నారు .

రేయ్ మామా ....... ఎవరో నలుగురు లేడీస్ వచ్చారు అంటూ నన్ను చూసి నవ్వుకుని , నేను నేను నేనుకూడా అంటూ సెల్ఫీ తీసుకున్నాడు . సూపర్ రా మామా ఇలానే కంటిన్యూ అయిపో .......
అవునా అవునా అంటూ వాడిని కౌగిలించుకుని మొత్తం పూసేసి ఇప్పుడు ఇద్దరమూ తీసుకుందామురా సెల్ఫీ ....... , దివ్యక్కా - చెల్లెమ్మా - సిస్టర్స్ - మహీ ..... వంట గదిలో మీ ఆఖరి క్షణాలు సంతోషంతో గడిచాయని భావిస్తున్నాను , ఇక మీరందరూ దయచేయ్యండి .........
అందరూ : అంతేనా ........
నా మాటే ........
అందరూ : దేవుడి మాటే శాసనం అంటూ తియ్యనైనకోపాలతో బుగ్గలపై - నడుముపై గిల్లేసి ముసిముసినవ్వులతో బయటకువెళ్లారు .

వెనుకే వెళ్లి లేడీ చెఫ్స్ ను ఆహ్వానించి ఒకరినొకరిని పరిచయం చేసి , చెఫ్స్ ...... నా ప్రాణమైన వాళ్లందరికీ ఆకలివేస్తోంది కాబట్టి మనం మనం వంట గదిలో .......
దేవకన్య : వంట గదిలో ....... ? .
వంట గదిలో వాటా చేస్తూ నాకు నేర్పించాలి కమాన్ కమాన్ అంటూ లోపలికి పిలుచుకునివెళ్లి పెద్దమ్మను పరిచయం చేశాను . గురువుగారూ ...... చట్నీ - సాంబార్ వండటం నేర్పించండి .
పెద్దమ్మ : చెఫ్స్ కు సాంబార్ అప్పజెప్పి , ఆరోజుకు చట్నీ చెయ్యడం నేర్పించారు .

9 గంటలకల్లా ఇడ్లీ - వడ - చట్నీ - సాంబార్ ....... రెడీ అవ్వడంతో , కృష్ణ - బావగారి సహాయంతో అన్నింటినీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీదకు చేర్చాము .
బావగారూ ...... మీకు కూడా ఇదే లాస్ట్ టైం - మేమిద్దరం చూసుకుంటాము కదా ....
బావగారు : మీ అక్కయ్య ....... ? .
మీరిద్దరూ చేతులలో స్టేతస్కోప్ పట్టుకోవాలి - అధిచూసి మేము మురిసిపోవాలి ఇది ఫిక్స్ ........
లవ్ యు అన్నయ్యా ...... అంటూ దివ్యక్క వచ్చి నా గుండెలపైకి చేరారు .
దివ్యక్కా ....... ఆకలేస్తోంది అన్నారుకదా ముందు టిఫిన్ తిందాము తరువాత మా ప్రియమైన దివ్యక్క ముద్దులు ఆస్వాధిస్తాను .
దివ్యక్క : లవ్ యు అన్నయ్యా ........

లేడీ చెఫ్స్ : మహేష్ సర్ ...... డ్యూటీకి సమయం అయ్యింది మళ్లీ 12 గంటలకు వస్తాము .
థాంక్యూ చెఫ్స్ ....... , ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు మా అందరితో కలిసి టిఫిన్ చేసి వెళ్ళండి .
ప్లీజ్ ప్లీజ్ అంటూ అందరూ పిలుచుకునివచ్చి డైనింగ్ టేబుల్ లో కూర్చోబెట్టి కూర్చున్నారు .

అంతలో తల్లులూ ...... అంటూ చెల్లెమ్మ పేరెంట్స్ వచ్చారు .
అంటీ : శ్రీవారూ ...... సరిగ్గా టిఫిన్ చేసే సమయానికే వచ్చాము - నా తల్లులు ..... సూపర్ గా వండుతారు .
మమ్మీ - డాడీ ...... అంటీ అంటూ అందరూ లేచివెళ్లి పిలుచుకునివచ్చారు .
రవిగారూ ....... అంటూ లోపలికి పిలుచుకునివచ్చి , డైనింగ్ టేబుల్ లో కూర్చోబెట్టాను .
చెల్లెమ్మ : మమ్మీ - డాడీ ...... టిఫిన్ ప్రిపేర్ చేసినది ఆక్కయ్యలు కాదు అన్నయ్య అంటూ నిన్నటి నుండీ జరిగినది మొత్తం వివరించారు .
అంటీ : సూపర్ సూపర్ అంటూనే ఇక ఒక్క క్షణం కూడా ఉండలేను అని ప్లేట్ అందుకుని , హాట్ బాక్సస్ నుండి ఇడ్లీ - వడ వడ్డించుకుని వాటిపైకి చట్నీ సాంబార్ వేసుకుని నిలబడే తినేస్తున్నారు . మ్మ్మ్ ....... సాఫ్ట్ & టేస్టీ ......
రవిగారు : శ్రీమతిగారూ ....... అంటూ లొట్టలేస్తున్నారు .
అంటీ : మీ గారాలపట్టి ఉందికదా దానినే అడగండి వడ్డిస్తుంది అంటూ చైర్లో కూర్చుని మ్మ్మ్ మ్మ్మ్ ........
చెల్లెమ్మ : మమ్మీ ....... మాకూ నోరూరిపోతోంది , డాడీకి వడ్డించి మేమూ తింటాము అంటూ రవిగారికి - చెఫ్స్ కు - పెద్దమ్మకు - అన్నయ్యలూ అంటూ మాకు వడ్డించి , అందరూ వడ్డించుకున్నారు .
అందరి నోటి నుండి మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్మ్ ........
నాకోసం అలా పొగుడుతున్నారు నాకు తెలుసులే అంటూ తిని మ్మ్మ్ ...... సూపర్ , గురువుగారూ ....... థాంక్యూ థాంక్యూ sooooo మచ్ .
అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .

రవి గారు : ఇంటిలో టిఫిన్ చెయ్యకుండా రావడం మంచిదే అయ్యింది - మహేష్ సూపర్ ....... అంటూ వెళ్లి సోఫాలో కూర్చున్నారు.
అంటీ : సూపర్ సూపర్ ...... , మహేష్ ను చూసైనా నేర్చుకోండి - ఎప్పుడైనా నాకోసం ఒక కాఫీ పెట్టించారా ? .
రవిగారు : అయిపోయాను అంటూ నోటికి తాళం వేసేశారు .
అంటీ : నవ్వుకున్నారు , మహేష్ - కృష్ణా - కిషోర్ & తల్లులూ ....... మేము వచ్చిన విషయం ఏమిటంటే ఈరోజు లంచ్ మరియు డిన్నర్ మన ఇంట్లోనే , ఇది రిక్వెస్ట్ కాదు ఆర్డర్ , లంచ్ కు మటన్ బిరియానీ - కైమా ...... మటన్ ఐటమ్స్ , రాత్రికి చికెన్ బిరియానీ - చికెన్ ఫ్రై - కబాబ్స్ ....... చికెన్ ఐటమ్స్ , కాబట్టి ఎంత త్వరగా ఇంటికి వస్తే అంత మంచిది - ఇప్పుడే వచ్చినా సంతోషమే .......
అందరూ : యాహూ ...... లవ్ యు లవ్ యు అమ్మా - అంటీ అంటూ సంతోషంతో చుట్టేశారు . అన్నయ్యా - మహేష్ సర్ - మహేష్ అంటూ కళ్ళతోనే నా అనుమతి తీసుకున్నారు . డబల్ యాహూ ....... మా దేవుడు ఒప్పుకున్నారు , అమ్మా - అంటీ ఇంటికి అంటే రెడీ అవ్వాలికదా ..... మీరు వెళ్ళండి వెనుకే వచ్చేస్తాము .
అంటీ : చాలా సంతోషం ...... , శ్రీవారూ ...... ఏంటి సోఫాలో దర్జాగా కూర్చున్నారు - చికెన్ మటన్ తీసుకురావాల్సినది తమరే .......
రవిగారు : కమింగ్ శ్రీమతిగారూ ....... , మహేష్ - అల్లుడూ - కిషోర్ ...... వెళ్ళొస్తాము అనిచెప్పి వెళ్లిపోయారు .

ఒకేసారి చాలా మొబైల్స్ రింగ్ అయ్యాయి - చూస్తే అందరి మొబైల్స్ .......
దేవకన్య - సిస్టర్స్ : మొబైల్స్ అందుకుని హాస్టల్ నుండి మహేష్ - మహేష్ సర్ ......
చెల్లెమ్మ : నో నో నో ఎవ్వరూ ఎత్తకండి , ఎందుకు చేశారో నాకు తెలుసు - హాస్టల్లో లంచ్ వచ్చేసి బిరియానీ ....... , అమ్మకు మాటిచ్చేసాము కాబట్టి మహి అక్కయ్యా - విద్యు అక్కయ్యా ...... మీరే హ్యాండిల్ చెయ్యాలి ప్లీజ్ ప్లీజ్ ...... , అన్నయ్యా ...... అంటూ నా చేతిని చుట్టేసి బుగ్గపై చేతితో ముద్దులవర్షం కురుస్తోంది .
అంతే కరిగిపోయి , మహీ - సిస్టర్స్ ....... ప్లీజ్ .......
దేవకన్య - సిస్టర్స్ : చెల్లి ముద్దులకు ...... అంటూ నవ్వుకుని , కాల్స్ ఎత్తి విషయం చెప్పారు - చెల్లెళ్ళూ ....... రేపు టిఫిన్ , లంచ్ కూడా మీతోనే చేస్తారట .
యాహూ యాహూ ....... అంటూ సంతోషపు కేకలు వినిపించాయి .
చెల్లెమ్మ : లవ్ యు అన్నయ్యా ...... అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి వెళ్లి ఫ్రెండ్స్ - అక్కయ్యలూ ....... థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అంటూ మొబైల్లోనే బోలెడన్ని ముద్దులుపెట్టింది .
హాస్టల్ సిస్టర్స్ : అక్కయ్యలూ ....... నెక్స్ట్ వీకెండ్ ఇళ్లకు వెళతామని ప్రిన్సిపాల్ గారిని రిక్వెస్ట్ చేసాము - ప్రిన్సిపాల్ గారు ఏకంగా వీకెండ్ two డేస్ తోపాటు thursday మరియు friday కూడా లీవ్ ఇచ్చారు - స్టూడెంట్స్ ...... ఫుడ్ పాయిజన్ అయినప్పుడు పేరెంట్స్ కు చెప్పి క్యాంపస్ కు బ్యాడ్ నేమ్ తీసుకురాలేదు సో హ్యాపీగా ఫోర్ డేస్ ఎంజాయ్ చేసిరండి అనిచెప్పారు .
దేవకన్య - సిస్టర్స్ : సూపర్ సూపర్ చెల్లెళ్ళూ ...... ఫోర్ డేస్ హాలిడేస్ ...... , మహేష్ - మహేష్ సర్ ....... మీ హాస్టల్ ఫ్రెండ్స్ - సిస్టర్స్ అందరూ బుధవారం కాలేజ్ వదలగానే ఇంటికి వెళ్లబోతున్నారు .
పేరెంట్స్ దగ్గరికి అంటే చాలా సంతోషం మహీ - సిస్టర్స్ .......
చెల్లెమ్మ : అక్కయ్యలూ ....... మీరూ వెళతారా ? .

అంతే ఒక్కసారిగా నా పెదాలపై చిరునవ్వు మాయం అయ్యింది . దివ్యక్కా - చెల్లెమ్మా ...... బయటకు వెళుతున్నాను .
దేవకన్య : ఎక్కడికని అడగకూడదు - కనీసం షర్ట్ చేంజ్ చేసుకుని వెళ్లు .......
తలదించుకుని పరుగున పైకివెళ్లి , పిండి అంటిన షర్ట్ చేంజ్ చేసుకుని అంతే పరుగున కిందకువచ్చి , ప్రక్కప్రక్కనే ఉన్న దివ్యక్క - చెల్లెమ్మ - విద్యు సిస్టర్ ముగ్గురినీ ఒకేసారి చుట్టేసి వదిలి , దేవకన్య వైపు ప్రాణంలా చూస్తూనే మారు మాట్లాడకుండా జిప్సీ లో ఒంటరిగా బయలుదేరాను . రేయ్ మామా రేయ్ మామా ....... అంటున్న కృష్ణగాడు పిలుస్తున్నా ఆపకుండా వెళ్ళిపోయాను .
నా మొబైల్ కు కాల్ చేస్తే ఇంట్లోనే ఉన్నట్లు చెల్లెమ్మ బయటకు తీసుకొచ్చి చూయించింది .

కళ్ళల్లో చెమ్మతో అలా సిటీ బయటవరకూ వెళ్ళిపోయాను . నాలుగురోజులు దేవకన్య - సిస్టర్స్ ను చూడకుండా ఉండగలనా ...... నాలుగురోజులే కదా అని మనసు కుదుటపరుచుకుని వెనక్కువచ్చాను . చికెన్ మార్కెట్ బయట రవిగారు కనిపించడంతో కలిశాను .
రవిగారు : డ్రైవర్ ద్వారా మటన్ ఇంటికి పంపించాను మహేష్ ..... , ఇదిగో నేను చికెన్ తీసుకున్నాను క్యాబ్ కోసం wait చేస్తున్నాను .
అంటే వంట మొదలైపోయిందన్నమాట ........
రవిగారు : ఎప్పుడో ........
అయ్యో ...... త్వరగా త్వరగా ఎక్కండి రవిగారూ అంటూ చికెన్ కవర్స్ ను వెనుక ఉంచేసి వేగంగా పోనిచ్చాను .
రవిగారు : మహేష్ మహేష్ నెమ్మది నాకు భయం వేస్తోంది .
కళ్ళు మూసుకోండి రవిగారూ ....... , అక్కడ అంటీ వంట మొదలుపెట్టేసి ఉంటారు ప్చ్ ....... , 15 నిమిషాలలో ఇంటిదగ్గర ఆపి రవిగారూ ...... లోపలికి తీసుకొచ్చెయ్యండి అంటూ జిప్సీ నుండి జంప్ చేసి లోపలికి నేరుగా వంట గదిలోకి వెళ్ళాను .

అంటీ : మహేష్ ....... ? .
పోండి అంటీ ...... మటన్ బిరియానీ నేర్చుకుందామని ఆశపడ్డాను - అంతలోనే మీరు మొదలెట్టేశారు .
అంటీ : సో స్వీట్ ....... , బిరియానీ ఇంకా మొదలెట్టనేలేదుగా .......
మరి .......
అంటీ : కైమా ఉంటలు రెడీ చేస్తున్నాను .
యాహూ ........ థాంక్యూ థాంక్యూ అంటీ ........ , ఫస్ట్ నుండీ మొత్తం నేర్పించాలి - బిరియానీ కోసం ఏమేమి చెయ్యాలో చెప్పండి నేను రెడీ చేస్తాను .
అంటీ : actually వద్దు అనాలి కానీ నీ ఉద్దేశ్యం బలమైంది కాబట్టి ok .......
థాంక్యూ సో మచ్ అంటీ ...... , అంటీ ...... పనివాళ్ళు ఉన్నా వాళ్ళను బయట ఉంచేసి ఒక్కరే వండుతున్నారు .
అంటీ: నా ప్రియమైన - ప్రాణమైన వాళ్లకోసం ....... నా చేతులతో స్వయంగా వండిపెట్టాలని , ఎలాగో ఈయన గారు సహాయం చెయ్యరు .
రవిగారు : సైలెంట్ గా వచ్చి చికెన్ ను ఫ్రిడ్జ్ లో ఉంచి అంతే సైలెంట్ గా బయటకు వెళ్లిపోయారు .
చూశావా మహేష్ అంటూ నవ్వుకున్నాము .
అంటీ ...... మీ శ్రీవారి హెల్ప్ కూడా నేనే చేస్తాను - కానీ కాస్త నెమ్మదిగా నాకు బిరియానీ వండటం నేర్పించాలి .
అంటీ : లంచ్ సమయానికి మటన్ బిరియానీ - కైమా ....... , డిన్నర్ సమయానికి చికెన్ బిరియానీ - చికెన్ ఫ్రై - కబాబ్ ...... నేర్పించే బాధ్యత నాది మహేష్ ......
నో నో నో ఒకేరోజు అన్ని నావల్ల కాదు అంటీ ....... మీరైతే నేర్చుకుంటారు కానీ మా మగాళ్ల వల్ల కష్టం , లంచ్ సమయానికి మటన్ బిరియానీ - డిన్నర్ సమయానికి చికెన్ బిరియానీ నేర్పించండి చాలు .
అంటీ : ok ok ok అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
నవ్వుకోండి నవ్వుకోండి అంటీ ....... వంట గదిలో - ఇంటిని చక్కదిద్దడంలో దేవతలదే ఆధిపత్యం అని నేను సగర్వాంగా చెప్పగలను , మీరు లేని ఇల్లు ఇల్లే కాదు అంటూ సెల్యూట్ చేసాను .
అంటీ : థాంక్యూ మహేష్ అంటూ సంతోషంతో నా చేతిని కిందకుదించి , లెట్స్ ప్రిపేర్ మటన్ బిరియానీ అన్నారు .
Yes yes yes ...... చెప్పండి చెప్పండి అంటీ ఏమి చెయ్యాలి - మీరు కైమా సంగతి చూసుకోండి .

అమ్మగారూ అమ్మగారూ ........ మమ్మల్ని సహాయం చెయ్యనివ్వండి .
అంటీ : లేదు లేదు లేదు ....... , వంట గదిలోకి అడుగుకూడా పెట్టడానికి వీలులేదు . నా ప్రాణమైన వాళ్ళు వస్తున్నారు - నేను మాత్రమే వండాలి .
మీ అమ్మగారు కష్టపడుతున్నారని బాధపడుతున్నారా ...... ? గుడ్ గుడ్ ...... నేనుకూడా ఉన్నానుకదా పావు వంతు పనైనా తగ్గిస్తాను .
థాంక్యూ సర్ ........
మాఅంటీ అంటే చాలా ఇష్టం అన్నమాట , అంటీ ...... ఈ ఉల్లిపాయలన్నీ కట్ చెయ్యమంటారా ? .
అంటీ : నో నో నో ....... కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి , వాటిని నేను కట్ చేస్తాను - నువ్వు ఈ బాసుమతి రైస్ ను కడుగు ........
అంటీ ...... మీరు కట్ చేస్తే రావా కన్నీళ్లు - సో నేను ఇవే కట్ చేస్తాను .
అంటీ : వద్దు మహేష్ ....... , నీ చెల్లికి తెలిసిందంటే ఇక అంతే .......
నేనూ చెప్పను - మీరూ చెప్పకండి అంటీ ....... , మొత్తం కావాలికదా యూట్యూబ్ లో చూసాను బిరియానీకి చాలా ఉల్లిపాయలు కావాలి అంటూ కట్ చెయ్యడం మొదలెట్టాను .
అంటీ : వినవుకదా ....... , కట్ చేసేటప్పుడు జాగ్రత్త ......
నిన్న హోటల్లో కట్ చేసిన అనుభవం ఉందిలే అంటీ అంటూ ఉత్సాహంగా మాట్లాడుతూ మటన్ బిరియానీకి కావాల్సినవన్నీ రెడీ చేసాను .
అంటీ : 5 మినిట్స్ మహేష్ అంటూ రెడీ చేసుకున్న కైమా ఉంటాలన్నింటినీ గ్యాస్ పై ఉంచిన పాత్రలోకి వదిలి కలిపి మూత ఉంచేసి , ఇక బిరియానీ మొదలుపెడదాము అంటూ పెద్ద పాత్రను మరొక స్టవ్ పై ఉంచారు - ప్రాసెస్ నేర్పిస్తూ ఉల్లిపాయలు మసాలాలు వేస్తూ చివరికి మటన్ వేసి పెద్ద మంట పెట్టారు - మరొక పాత్రలో బాసుమతి రైస్ సగం వరకూ ఉడికించాలి అంటూ స్టవ్ పై ఉంచారు . రెండూ సగం సగం ఉడికాక మటన్ పై రైస్ పరిచి కొన్ని నిమిషాలపాటు చిన్న మంట పెడితే మటన్ బిరియానీ రెడీ ........
పెద్దమ్మ తరువాత నా రెండవ గురువు మీరే అంటీ ....... , ఒక్కసారికే మైండ్ లోకి చేరిపోయింది - డిన్నర్ చికెన్ బిరియానీ మాత్రం నేనొక్కడినే వండుతాను .
అంటీ : లవ్ టు మహేష్ అంటూ నవ్వుకున్నారు . అవునూ ....... గంటలో వంటలన్నీ రెడీ అయిపోతాయి తల్లులు ఇంకా రాలేదు ఏమిటి ? .
అయ్యో ....... ఆ సంగతే మరిచిపోయాను - అంటీ అంటీ ....... ఇంట్లో అందరినీ కంగారుపెట్టి బయటకువచ్చేసాను అంటూ జరిగినది వివరించాను . నాలుగురోజులు చూడకుండా ....... ఆ ఊహే తట్టుకోలేకపోయాను అంటీ - మొబైల్ మొబైల్ ...... మొబైల్ కూడా ఇంట్లోనే వదిలివచ్చేసాను - ఎంత కంగారుపడుతున్నారో అంటూ లెంపలేసుకున్నాను .
అంటీ : చాలు చాలు చాలు మహేష్ ...... అంటూ ఆపి , నేను చూసుకుంటాను కదా అంటూ వెంటనే బయటకువెళ్లి చెల్లెమ్మకు కాల్ చేశారు - తల్లులూ ....... ఇంకా రాలేదు ఏంటి ? , ఇక్కడ మటన్ బిరియానీ - కైమా రెడీ .......
చెల్లెమ్మ : మమ్మీ ...... అన్నయ్య మొబైల్ ఇక్కడే ఉంచేసి వెళ్లిపోయారని మేము కంగారుపడుతుంటే మటన్ - కైమా అంటూ కాల్ చేశావా , ముందు ఫోన్ పెట్టేయ్ ....... - మహి అక్కయ్య దివ్యక్క విద్యు అక్కయ్య నేను .......
స్పీకర్లో వింటూ మళ్లీ లెంపలేసుకున్నాను .
అంటీనవ్వుకుని , తల్లీ తల్లులూ ...... మీ అన్నయ్య - దేవుడు ఇక్కడ ఉన్నాడే - మటన్ బిరియానీ వండుతున్నాడు .
చెల్లెమ్మ : అన్నయ్య అక్కడే ఉన్నారా ...... ? , అక్కయ్యలూ ....... మనం ఇక్కడ కంగారుపడుతుంటే అక్కడ అన్నయ్య మటన్ బిరియానీ నేర్చుకుంటున్నారట , అన్నయ్య ప్రక్కనే ఉన్నారా ...... ? అన్నయ్యా .......
చెల్లెమ్మా - దివ్యక్కా ...... sorry లవ్ యు లవ్ యు .......
దివ్యక్క : మాకు కాదు అన్నయ్యా ....... , మీ దేవకన్యకు చెప్పండి - ఇదిగో బయలుదేరుతున్నాము - అక్కడికి వచ్చేన్తవరకూ sorry లవ్ యు లు చెబుతూనే ఉండండి మహీ .......
( కన్నీళ్లను తుడుచుకుని అందుకుంది ) మహేష్ ....... అంటూ పెదాలపై చిరునవ్వులతో హృదయంపై చేతిని వేసుకుంది .
Sorry లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు .........
చెల్లెమ్మ : ఆపకు అన్నయ్యా ....... మేము , మీ దగ్గరకు వచ్చేన్తవరకూ మహి అక్కయ్యకు చెబుతూనే ఉండాలి అదే మీకు స్వీట్ పనిష్మెంట్ .......
లవ్ టు లవ్ టు చెల్లీ ....... , లవ్ యు మహీ లవ్ యు లవ్ యు లవ్ యు ......... అంటీ వెనకాలే వంట గదిలోకివెళ్లి ఆపకుండా లవ్ యు లు చెబుతూనే ఉన్నాను .

ఇంటిబయట బస్ ఆగిన సౌండ్ వినిపించగానే ....... , వంట గదిలోనుండి లవ్ యు లవ్ యు చెబుతూనే పరుగున మెయిన్ డోర్ దగ్గరికి చేరుకున్నాను .
దేవకన్య - దివ్యక్క - చెల్లెమ్మ - సిస్టర్స్ ....... లోపలికి రాగానే అందరికీ sorry అందరికీ లవ్ యు లవ్ యు అంటూ లెంపలేసుకుని గుంజీలు తీస్తున్నాను .
అన్నయ్యా - అన్నయ్యా - మహేష్ సర్ ఆంటూ దేవకన్య తప్ప అందరూ నన్ను ఆపి గుండెలపైకి చేరారు .
కృష్ణగాడు - బావగారు ...... చిరుకోపంతో చూస్తూ లోపలికివెళ్లి రవిగారితోపాటు సోఫాలో కూర్చున్నారు .
మహీ - సిస్టర్స్ ....... sorry లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ .......
దేవకన్య ముందుకువచ్చి వేలితో నా పెదాలను ఆపి , ఎంత బాధపడ్డావో ...... అంటూ నా హృదయంపై ముద్దుపెట్టి , దివ్యక్క గుండెలపైకి చేరింది .
సిస్టర్స్ : మహేష్ సర్ ....... , చెల్లి ....... " మీరూ వెళతారా అక్కయ్యలూ " అని అడిగింది ok - మా సమాధానం వినకుండా కన్నీళ్ళతో అలా వెళ్లిపోవాలా ? .
Sorry లవ్ యు లవ్ యు సిస్టర్స్ ....... , కన్నీళ్లు నావి కావు అమ్మవి ...... అందుకే నేనూ కంట్రోల్ చేసుకోలేకపోయాను - నా ఫ్యామిలీని నాలుగు రోజులు చూడకుండా ........ చూసారా ఆ మాటకు కళ్ళల్లో చెమ్మ చేరింది .
సిస్టర్స్ : అలా మిమ్మల్ని చూసి , మాపై అంతటి ప్రేమను కురిపించడం చూసి ఎంత ఆనందం కలిగిందో మాటల్లో చెప్పలేము మహేష్ సర్ .......
చెల్లెమ్మ : అవును అన్నయ్యా ...... , స్టడీస్ కంప్లీట్ అయ్యేంతవరకూ ఇదే మా ఇల్లు - మా ఫ్యామిలీ ...... ఎక్కడికీ వెళ్ళము అన్నారు అన్నయ్యా ఆక్కయ్యలు . ఇంత ప్రేమను వదిలి వెళ్లనే వెళ్ళము అన్నారు .
దేవకన్య వైపు చూసాను .
చెల్లెమ్మ : తన డార్లింగ్స్ ఎలా అంటే మహి అక్కయ్య కూడా అలా అన్నయ్యా ......
లేదు లేదు లేదు sorry సిస్టర్స్ - మహీ ....... అప్పుడు అలా వినగానే ఏమాత్రం ఆలోచించక అలా రియాక్ట్ అయిపోయాను , కూల్ అయ్యాక తెలిసింది ఇంటికి వెళ్లాలని ఎవరికి ఉండదు - now i am హ్యాపీ సిస్టర్స్ ....... నాలుగు రోజులే కదా కళ్ళుమూసుకుని తెరిచేలోపు గడిచిపోతాయి .
సిస్టర్స్ : మేము వెళ్ళము అంటే బలవంతం చేస్తారు ఏమిటి ? , వెల్లమంటే వెళ్ళము ఇదే ఫైనల్ - అయినా ఇక్కడకు వచ్చినదే రెండు వారాల ముందు - అంతకుముందు రెండు నెలలు ఇంట్లో ఖాళీగా ఉండే సరికి ఇంట్లో పేరెంట్స్ వింతగా చూసారు - కొద్దిరోజుల్లోనే వెళితే ఫుడ్ కూడా సరిగ్గా పెట్టారు - ఎవరు బెంగ పెట్టుకున్నారని వచ్చారే అంటూ వాయించేస్తారు .
అవునవును , ప్లీజ్ ప్లీజ్ మహేష్ సర్ ....... మీకు కూడా ఇష్టం లేదంటే చెప్పండి కాంపౌండ్ లో ఉంటాము .
నాకైతే నవ్వు ఆగలేదు ........
అందరూ : అన్నయ్య - మహేష్ సర్ ...... నవ్వేశారు అంటూ ఏకంగా నన్నే పైకెత్తి చుట్టూ తిప్పారు .
దేవకన్య ఆనందాన్ని చూసి యాహూ యాహూ ....... , ఎదురుగా కృష్ణగాడు - బావగారిని చూసి సైలెంట్ అయిపోయి కిందకుదిగివెళ్లి లవ్ యు రా - బావగారూ ...... నువ్వూ నాతోపాటు వచ్చేస్తే తోడుగా ఎవరుంటారు చెప్పు ......
లవ్ యు రా - బావా అంటూ ఇద్దరూ కౌగిలించుకున్నారు .
చుట్టూ చప్పట్లు - విజిల్స్ - కేకలు ........

మహేష్ ....... 90% ఉడికిన మటన్ పై 75% ఉడికిన రైస్ వెయ్యాలికదా - నేనే .....
నో నో నో అంటీ నేను నేను అంటూ దివ్యక్క - చెల్లెమ్మ బుగ్గలపై - దేవకన్యకు ఫ్లైయింగ్ కిస్ వదిలి యాహూ యాహూ ....... అంటూ పరుగున వంట గదిలోకివెళ్ళాను .
అమ్మా - అంటీ అంటూ చెల్లెమ్మ - దివ్యక్క - సిస్టర్స్ - దేవకన్య ...... ఆఅహ్హ్ మసాలా ఘుమఘుమలు అంటూ వంట గదిలోకి రాబోతే ...... , స్టాప్ స్టాప్ స్టాప్ అక్కడే ఆగిపోండి అంటూ డోర్ కు బయటే ఆపేసాను .
దివ్యక్క - దేవకన్య : అన్నయ్యా - మహేష్ ...... మీరు చెప్పినది మన ఇంట్లో కదా .......
అంటీ ...... ఎంత మాట అన్నారు రిప్లై ఇవ్వండి .
అంటీ : ఈ ఈ ఈ ...... అంటూ కళ్ళు తిక్కుకుంటూ కుర్చీలో కూర్చున్నారు .
చెల్లికి కూడా అర్థమైనట్లు అక్కయ్యలూ ...... this is not good ఈ ఈ ఈ అంటూ యాక్టింగ్ చేస్తూ వచ్చి , మిక్స్ చేస్తున్న నా గుండెలపైకి చేరింది .
అందరూ ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు , అమ్మా - అంటీ - చెల్లీ ...... ఏమైంది ? , అన్నయ్యా - మహేష్ సర్ - మహేష్ ....... ఓకేఒక్కసారి వంట గదిలోకి అనుమతి ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ .......
ఈ ఒక్కసారికి గ్రాంటెడ్ ........
లవ్ యు లవ్ యు అంటూ లోపలికివచ్చి అమ్మా - అంటీ - చెల్లీ ....... sorry మీరు బాధపడేలా ఏమన్నాము ? .
బాధపడేలా కాదు ఏడ్చేలా ........
అన్నయ్యా - మహేష్ ....... మీరైనా చెప్పొచ్చుకదా ? అంటూ దివ్యక్క - దేవకన్య నా వీపుపై ఒక్కొక్క దెబ్బ వేశారు .
స్స్స్ స్స్స్ ........ok ok , అంటీ మన ఇంటికివచ్చి ఏమని ఆహ్వానించారు ? .
దివ్యక్క - దేవకన్య : తల్లులూ ...... ఈరోజు లంచ్ - డిన్నర్ మన ఇంట్లోనే అని , ఆ ఆ అర్థమైంది అర్థమైంది sorry లవ్ యు లవ్ యు అమ్మా - చెల్లీ ....... ఇదికూడా మా ఇల్లే - మా వంటగదే ....... , మీరు ఏడుస్తున్నట్లు యాక్టింగ్ చెయ్యడంలో తప్పే లేదు - మేము అలా అనకూడదు ఉమ్మా ఉమ్మా ఉమ్మా స్మైల్ స్మైల్ .......
అంటీ : లవ్ యు తల్లులూ అంటూ చిరునవ్వులు చిందిస్తూ లేచి కౌగిలించుకున్నారు .
దివ్యక్కా - చెల్లెమ్మా - సిస్టర్స్ - మహీ ....... వితిన్ మినిట్స్ లో మటన్ బిరియానీ రెడీ ......
అంటీ : తల్లులూ ....... మటన్ బిరియానీ ఫుల్ ప్రిపరేషన్ మీదేవుడిదే .......
అందరూ : యాహూ ....... అంటూ పాత్ర దగ్గరికి వచ్చి ఘాడంగా వాసన పీల్చి నా బుగ్గలపై - హృదయంపై ముద్దులుపెట్టి , వితిన్ మినిట్స్ అంటే exact గా ఎన్ని నిమిషాలు దేవుడా ....... ? .
ఆ విషయం గురించి మీ అమ్మ - అంటీనే అడగండి . నేనెక్కడకు వెళ్లానన్న కంగారులో ఫ్రెష్ కూడా అయినట్లు లేదు వెళ్ళండి ముందు వంటగదిలోనుండి గెట్ ఔట్ అంటూ అందరినీ తోసేసాను .
ప్చ్ ప్చ్ ప్చ్ ........
ప్చ్ లేదు ఏమీ లేదు .......
అంటీ : తల్లీ బంగారూ ....... అందరినీ పైకి తీసుకెళ్లు .
చెల్లెమ్మ : నేను తీసుకెళ్లడం ఏమిటి మమ్మీ ....... , ఇది అక్కయ్యల ఇల్లు వాళ్ళిష్టమైన గదిలోకి వెళ్లి ఫ్రెష్ అవ్వవచ్చు .
లవ్ యు లవ్ యు చెల్లీ ...... అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి , చిరునవ్వులు చిందిస్తూ పైకివెళ్లారు .
అంటీ : మహేష్ చూశావా ....... , మా శ్రీవారు ..... అల్లుడిని నీ ఫ్రెండ్ ను ఎంత ప్రేమతో రూంలోకి పిలుచుకువెళుతున్నారు - నువ్వూ వెళ్లి ఫ్రెష్ అవ్వు అంతలోపు డైనింగ్ టేబుల్ రెడీ చేస్తాము .
నో నో నో అంటీ ....... , బిరియానీ పూర్తవ్వాలి - ఇక్కడ నుండి కదలాలి .
అంటీ : సో స్వీట్ .......

20 నిమిషాలకు అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ - సోఫాలలో కూర్చుని , మమ్మీ - అంటీ రెడీనా రెడీనా అంటూ కేకలువేస్తూనే ఉన్నారు .
అంటీ పెదాలపై చిరునవ్వులు ఆగడం లేదు . అయిపోయింది తల్లులూ ....... Its more than ఎనఫ్ మహేష్ అంటూ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసారు . వెళ్లు వెళ్లి తొందరగా ఫ్రెష్ అయ్యిరా .......
మా అంటీ సహాయంతో సక్సెస్ఫుల్ గా మటన్ బిరియానీ నేర్చుకున్నాను - థాంక్యూ అంటీ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి చిరునవ్వులు చిందిస్తూ హుషారుగా బయటకువచ్చాను .
నా ఉత్సాహం చూసి అందరూ Wow wow అంటూ ఆనందిస్తున్నారు . చెల్లెమ్మ వచ్చి అన్నయ్యా ...... ఈ ఉత్సాహానికి కారణం మాకోసం బిరియానీ నేర్చుకోవడమేనా అంటూ గిలిగింతలు పెట్టారు .
చెల్లీ చెల్లీ చెల్లీ ....... , ఇంటి అల్లుడుగారూ ....... మాకు రూమ్ చూయిస్తే ఫ్రెష్ అవుతాము .
అందరూ నవ్వుకున్నారు .
కృష్ణగాడి వెనకాలే కింద ఉన్న రూంలో ఫ్రెష్ అయ్యివచ్చాను - అంటీ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చారు .
కృష్ణ - బావగారి సహాయంతో బిరియానీ - కైమా పెద్ద పెద్ద పాత్రలను డైనింగ్ టేబుల్ పైకి చేర్చాము . రేయ్ మామా ...... హాసిని - విక్రమ్ - వార్డెన్ - పెద్దమ్మ ఎక్కడ ? ఇలా వెళ్లి అలా పిలుచుకునివచ్చేస్తాను .
చెల్లెమ్మ : మా అన్నయ్య హాస్టల్ దగ్గరికి వెళితే హాస్టల్ అక్కయ్యలు వదులుతారా ? అందుకే హాసిని - విక్రమ్ ను పిలుచుకుని రమ్మని డ్రైవర్ అన్నయ్యను పంపించాము .
దివ్యక్క : పెద్దమ్మ ...... వారి మనవళ్లను చూడటం కోసం ఇంటికి వెళ్లారు అన్నయ్యా ....... , అక్కడే భోజనం చేస్తాను అన్నారు .

మాట్లాడుతుండగానే అన్నయ్యలూ - అక్కయ్యలూ ....... అంటూ పిల్లలు వచ్చారు . పిల్లలను కూర్చోబెట్టి , మహేష్ సర్ మహేష్ సర్ అంటూ దేవకన్య ప్రక్కన కూర్చునేలా చేశారు విద్యు సిస్టర్ ........
లవ్ యు సిస్టర్ ........
విద్యుసిస్టర్ : అల్వేస్ వెల్కమ్ మహేష్ సర్ .......
అంతలో అంటీ వచ్చి , చిరునవ్వులు చిందిస్తున్న మా అందరినీ చూసి ఆనందబాస్పాలతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు - నా తల్లులందరికీ మరియు ప్రియమైన వాళ్లకు నేనే స్వయంగా వడ్డిస్తాను .
అందరికీనా ...... ? , నేను కూడా మీతోపాటు అమ్మా ...... అంటూ దేవకన్య - దివ్యక్క లేచారు .
అయితే మేము కూడా అంటూ సిస్టర్స్ లేచారు .
అంటీ : మహేష్ ...... లేవకు నాకు తెలుసు నువ్వూ రెడీ అయిపోయావని , మీరందరూ వడ్డిస్తారు సరే ఎవరికి వడ్డిస్తారు కాబట్టి నేను నా చేతులతో వడ్డించి ఆనందిస్తాను ఇది ఫైనల్ అందరూ వెళ్లి కూర్చోండి కూర్చోండి అంటూ దేవకన్య - దివ్యక్క బుగ్గలపై ముద్దులుపెట్టారు . బంగారూ ...... అందరూ లేచారు వడ్డించడానికి నువ్వుతప్ప .......
చెల్లెమ్మ : పో మమ్మీ ...... , అన్నయ్య వండిన బిరియానీ ఫస్ట్ నేనే టేస్ట్ చెయ్యాలి .
పిల్లలు : నేనుకూడా నేనుకూడా .......
దివ్యక్క : నేను కూడా అంటూ పరుగునవెళ్లి కూర్చున్నారు .
సిస్టర్స్ : మేముకూడా .......
దేవకన్య : అందమైన నవ్వులతో వచ్చి , ఒక్కరోజుకే నీ వంటకు ఇంతమంది ఫ్యాన్స్ ........ గుడ్ గుడ్ గుడ్ మహేష్ అంతా మా అంటీ వల్లనే ఉమ్మా అంటూ హృదయంపై ముద్దుపెట్టి ప్రక్కనే కూర్చుంది .
అంతా పెద్దమ్మ - అంటీ కటాక్షం మహీ .........
రవిగారు : ఉదయం టిఫిన్ చేసిన తరువాత నేనుకూడా ఫ్యాన్ అయిపోయాను - శ్రీమతిగారు ముందు నాకే వడ్డించండి .

థాంక్యూ మహేష్ అంటూ మురిసిపోతూ మొదటగా పిల్లల దగ్గరికివెళ్లి బిరియానీ or కైమా .......
పిల్లలు : బిరియానీ .......
అంటీ : వడ్డించి , సిస్టర్స్ నూ అలానే అడిగారు .
ప్రతీ ఒక్కరూ బిరియానీ బిరియానీ అనడంతో ....... , అంటీ తియ్యనైనకోపంతో లేదు లేదు కైమా వడ్డించమని ఆడిగితేనే బిరియానీ వడ్డించేది అంతే అంటూ బిరియానీలోకి కైమా వడ్డించారు .
దివ్యక్క : అందరితోపాటు నవ్వుకుని , అన్నయ్య - అమ్మ కాంబినేషన్ డబల్ బ్లాక్ బస్టర్ అంటూ అంటీ బుగ్గపై ముద్దుపెట్టారు .
అవునవును అంటూ అందరూ తింటూ సూపర్ సైగలు చేస్తున్నారు .
లవ్ యు లవ్ యు ...... , చెబితే విన్నారుకాదు అంటూ అందరికీ మళ్లీ వడ్డించారు .
చెల్లెమ్మ : నోటితో సూపర్ అంటే సరిపోదు అంటూ లేచివచ్చి , సూపర్ టేస్ట్ అన్నయ్యా అంటూ ముద్దుపెట్టింది .
లవ్ యు చెల్లీ ........
దేవకన్య - దివ్యక్క : అమ్మా ...... మీరూ కూర్చోండి , ఒకరికొకరం వడ్డించుకుందాము అని కూర్చోబెట్టి , వడ్డించారు .
అంటీ : నాకు బిరియానీ మాత్రమే ....., మ్మ్మ్ ....... బిరియానీ సూపర్ .
అంతే అంటీ వైపు అందరూ రుసరుసలాడుతూ చూస్తున్నారు .
అంటీ అవేమీ పట్టించుకోకుండా ముసిముసినవ్వులతో లాగించేస్తున్నారు .
Next page: Update 36
Previous page: Update 34