Update 36

తృప్తిగా లంచ్ చేసి బిరియానీ సూపర్ అంటూ దివ్యక్క - చెల్లెమ్మ - పిల్లలు ....... పెదాలతో బుగ్గలపై , సిస్టర్స్ ...... చేతులతో బుగ్గలపై , నా దేవకన్య ...... చేతితో నా హృదయంపై ముద్దుపెట్టి సోఫాలలోకి చేరారు . సాయంత్రం వరకూ కదిలే పరిస్థితులలో కూడా లేము అంతగా తిన్నాము .
అన్నీ ముద్దులూ ....... మీ దేవుడికేనా ? అంటూ బుంగమూతి పెట్టుకున్నారు అంటీ ........
లవ్ యు లవ్ యు అమ్మా - అంటీ ...... , దివ్య - మహి డార్లింగ్ చెప్పినట్లు " అంటీ - మహేష్ సర్ " కాంబినేషన్ " మటన్ బిరియానీ - కైమా " మరింత టేస్ట్ అంటూ అంటీకి ముద్దులుపెట్టి , ఇక కదలడం మావల్లకాదు .......

రవిగారు : ఈ పాన్స్ తినండి రిలాక్స్ అయిపోవచ్చు అంటూ టీపాయ్ పైఉంచారు .
చెల్లెమ్మ : డాడీ ...... గోల్డ్ ప్లేటెడ్ కిళ్లీలే కదా , అవంటేనే అక్కయ్యలకు ఇష్టం .
రవిగారు : థాంక్ గాడ్ ...... టైం అవుతుంది అన్నా పట్టుబట్టిమరీ అలాంటి కిళ్ళీలనే తెప్పించాను .
చెల్లెమ్మ : లవ్ యు డాడీ ...... అని ముద్దుపెట్టి , అందరికి నేరుగా నోటికి అందించి ఆనందించింది .
లవ్ యు చెల్లీ లవ్ యు చెల్లీ ........

అమ్మగారూ ....... ఇక మీరు విశ్రాంతి తీసుకోండి - క్లీనింగ్ సంగతి మేము చూసుకుంటాము అన్నారు పనివాళ్ళు .
అంటీ : మరికొద్ది గంటల్లో మళ్లీ చికెన్ బిరియానీ - చికెన్ ఫ్రై - కబాబ్ ....... చెయ్యాలి రెడీ చెయ్యండి .
అలాగే అమ్మగారూ ........
అంటీ ...... చికెన్ బిరియానీ ప్రిపరేషన్ మాత్రం నాది కేవలం నాదే గుర్తుపెట్టుకోండి .
యాహూ ....... అంటూ నెమ్మదిగా కేకలువేశారు అందరూ , అన్నయ్యా - మహేష్ సర్ ..... గట్టిగా కేకలు కూడా వెయ్యలేకపోతున్నాము , దేవుడా ...... త్వరగా జీర్ణం అయ్యి బాగా ఆకలివేసేలా చూడు అంటూ ప్రార్థించారు .
కృష్ణగాడు : ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన మటన్ బిరియానీనే అద్భుతంగా ఉంది ఇక బిరియానీ అంటే చికెన్ బిరియానీ కాబట్టి , మటన్ బిరియానీ అనుభవంతో చేసే చికెన్ బిరియానీ మరింత అద్భుతమనే .........
అంతేనంటావారా మామా ....... అంటూ సిగ్గుపడ్డాను .
దేవకన్య : దేవుడు సిగ్గుపడుతుంటే బహు ముచ్చటగా ఉంది అంటూ అందరూ సంతోషంతో నవ్వుతున్నారు .

తల్లులూ తల్లులూ ........ మీకొక విషయం చెప్పడమే మరిచిపోయాను . మీవలన ఎట్టకేలకు తాజ్ మహల్ కు తీసుకెళుతున్నారు మీ అంకుల్ .......
దివ్యక్క - దేవకన్య : Wow wow సూపర్ అమ్మా ....... , మొత్తానికి బెడ్ పై అలక మంచి ఫలితాన్నే ఇచ్చింది .
అంటీ : మరి ఈ మగాళ్లు ...... మన కంట్రోల్ లోకి వచ్చేది ఆ సమయంలో మాత్రమే కదా , కాలేజ్ ఏజ్ లోనే నా తల్లులు సెవెన్ వండర్స్ లో అత్యంత అద్భుతమైన తాజ్ మహల్ చూసేశారు - కాలేజ్ లో చదివే వయసున్న కూతురు ఉన్నా కూడా ఇప్పటికీ తాజ్ మహల్ చూడనేలేదు - అందుకే చివరి అస్త్రం ప్రయోగించాను అంటూ సిగ్గుపడ్డారు .
సెవెన్ వండర్స్ ....... wow wow wow ....... అంటీ , అద్భుతమైన ఐడియా తట్టేలా చేశారు థాంక్యూ సో మచ్ - ముందుగా సెవెన్ వండర్స్ లో నెంబర్ వన్ చూడబోతున్నందుకు All the best అండ్ హ్యాపీ ........
అంటీ : థాంక్యూ ....... నీకే చెప్పాలి లేకపోతే వర్క్ వర్క్ అంటూ పక్కూరికి కూడా తీసుకెళ్లేవారు కాదు .
రవిగారూ ....... this is not గుడ్ , ఇంత సంపాదన దేనికోసం ........
రవిగారు : మా బంగారుతల్లికోసం - ఇకనుండీ ఆ టెన్షన్ లేదు మహేష్ ....... , మా తల్లి మా దగ్గర నుండి మాకంటే ప్రాణంలా చూసుకునే అన్నయ్య ఇంటికే వెళుతోంది - ప్రేమతో చూసుకునే అల్లుడు దొరికాడు - తల్లిని ఇంత హ్యాపీగా ఎప్పుడూ చూడలేదు - మేము చాలా చాలా చాలా హ్యాపీ , ఇక నుండీ మీ అంటీ కోరికలన్నీ తీరుస్తాను - శ్రీమతిగారూ ...... ఇద్దరమే వీకెండ్ కొక టూర్ ప్లాన్ చేద్దాము .
నైట్ బెడ్ పై కూడానా అంకుల్ అంటూ అంటీని ఆటపట్టించి నవ్వుకున్నారు .
చెల్లెమ్మ నవ్వుకుని , డాడీ ...... మీరిద్దరేనా మరి నేను ? .
రవిగారు : మీ అన్నయ్యను వదిలి ........
చెల్లెమ్మ : నో నో నో అంటూ కృష్ణ - నా మధ్యలో చేరి చేతులను చుట్టేసింది .
రవిగారు : అందుకే మీ మమ్మీ - నేను మాత్రమే ....... , చిన్న పని ఉంది చూసుకుని వచ్చేస్తాను - మీరు హ్యాపీగా ఎంజాయ్ చెయ్యండి - బంగారూ ...... ఫ్రిడ్జ్ లోని కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ తీసుకురా .....
చెల్లెమ్మ : Ok ok All the best డాడీ ......
అంటీ : మహేష్ ....... డబల్ థాంక్స్ .......
ఎంజాయ్ అంటీ ...... , చెల్లెమ్మా ....... అర్జెంట్ గా కాల్ చెయ్యాలి .
చెల్లెమ్మ : How many మినిట్స్ ? .
Two మినిట్స్ thats all ........
దేవకన్య : Time starts now 1 2 3 ..... 5 సెకెన్స్ కంప్లీటెడ్ ......
చెల్లెమ్మ : అవునవును ....... 10 సెకెన్స్ .......

అమ్మో అంటూ పైకిలేచాను .
దేవకన్య : మొబైల్ లేకుండానే కాల్ చెయ్యడానికి వెళుతున్నారా ? .
అవునుకదా ఇంట్లోనే వదిలివచ్చాను .
చెల్లెమ్మ : మహి అక్కయ్య తీసుకొచ్చింది అన్నయ్యా .......
మహీ .......
దేవకన్య : కోపం - దుఃఖం - అంతులేని బాధతో వెళ్లిపోయావుకదా .......
Sorry లవ్ యు లవ్ యు లవ్ యు మహీ అంటూ లెంపలేసుకుని గుంజీలు తీస్తున్నాను .
దేవకన్య : ఏమాత్రం మొహమాటం - సిగ్గుపడకుండా గుంజీలు తియ్యడానికి రెడీగా ఉంటావు అని లేచి ఆపి మొబైల్ అందించారు .
లవ్ యు మహీ ...... అంటూ మహి బుగ్గపై చేతితో ముద్దుపెట్టబోయి డేంజర్ డేంజర్ అంటూ నా హృదయంపై ముద్దుపెట్టాను .
చెల్లెమ్మ : ప్చ్ ...... పో అన్నయ్యా , ధైర్యం చేసి ముద్దుపెట్టాల్సింది - అక్కయ్య కొడితే స్వీట్ పనిష్మెంట్ సంగతి విద్యు అక్కయ్య చూసుకునేది .
అవునుకదా అంటూ మొట్టికాయవేసుకున్నాను - లవ్ యు మహీ అంటూ దేవకన్య బుగ్గపై చేతితో ముద్దుపెట్టి బయటకు తుర్రుమన్నాను .
చెల్లెమ్మ : అందరితోపాటు నవ్వుకుని , అన్నయ్యా ....... వన్ మినిట్ ఓవర్ ......
Give మీ వన్ మోర్ మినిట్ చెల్లీ .......
చెల్లెమ్మ : Ok .......
దేవకన్య : ఆఅహ్హ్ ....... అంటూ బుగ్గను స్పృశించుకుంటూ మైమరచి విద్యు సిస్టర్ ఒడిలోకి చేరిపోయింది సిగ్గుపడుతూ ...... , ముద్దుపెట్టడానికే భయపడిపోతున్నాడు - మళ్లీ దేవుడు ......
చెల్లెమ్మ : ఒక్కసారి " లవ్ యు టూ " అని అన్నయ్యకు చెప్పండి తరువాత ఇక చాలు బాబోయ్ అంటారు - బుగ్గపై మాత్రమే కాదు వొళ్ళంతా ముద్దులే ముద్దులు అంటూ చెవిలో గుసగుసలాడింది .
దేవకన్య : పో చెల్లీ ...... అంటూ సిగ్గుపడుతోంది .

అదేసమయానికి బయటకువెళ్లి , లోకల్ మేనేజర్ గారికి కాల్ చేసాను .
లోకల్ మేనేజర్ : సర్ ......
రమేష్ గారూ ...... ఒక లిస్ట్ పంపిస్తాను , ఏమిచేస్తారో - ఎలా చేస్తారో - ఎవరిని ఏ ఏ ఆఫీసర్స్ మినిస్టర్స్ ను కలుస్తారో తెలియదు - ఎంత ఖర్చు అవుతుందో నెవర్ మైండ్ ....... ట్యూస్డే బుధవారం సాయంత్రం కాలేజ్ వదిలే సమయానికి లిస్ట్ ఉన్నవాళ్ళందరికీ " పాస్పోర్ట్స్ విత్ వీసా " వీసా ఎలా ఉండాలంటే ప్రపంచంలో ఏ కంట్రీ లోనైనా అడుగుపెట్టేలా అనుమతి ఉండాలి . కొద్దిసేపట్లో ఒక లిస్ట్ - నైట్ లోపు మరొక లిస్ట్ పంపుతాను .
రమేష్ గారు : మేము చూసుకుంటాము సర్ ....... , ట్యూస్డే డెడ్లైన్ .......
థాంక్యూ రమేష్ గారూ ..... అని కట్ చేసి పరుగున లోపలికివచ్చి సోఫాలోకి చేరాను .
చెల్లెమ్మ : అన్నయ్యా ....... వన్ మినిట్ లేట్ .......
దేవకన్య : నో నో నో చెల్లీ ...... , గుంజీలు తియ్యడానికి రెడీ అయిపోతాడు - ఇంతకుముందు తీసినందుకే డార్లింగ్స్ ....... స్వీట్ పనిష్మెంటే కిందకు చేర్చారు .
ఒకటి available గా ఉందా సూపర్ సూపర్ - థాంక్యూ సిస్టర్స్ ....... , దేవకన్య కోపంతో చూస్తుండటం చూసి తలదించుకుని ఎంజాయ్ చేస్తున్నాను . చెల్లెమ్మను ఓర కంటి సైగలతో పిలిచి పాస్పోర్ట్ సంగతి కనుక్కున్నాను - చెల్లికి ముందే ఉందని తెలుసుకున్నాను . పిల్లలూ - సిస్టర్స్ - మహీ ....... మీ మీ ఆధార్ కార్డ్స్ నాకు సెండ్ చెయ్యగలరా ? .
ఎందుకు - ఏమిటి అని అడగకుండా సెండ్ చేసి వాళ్ళ ముచ్చట్లలో వాళ్లుపడిపోయారు .
లవ్ యు లవ్ యు సిస్టర్స్ - మహీ ........
చెల్లెమ్మ : మరి దివ్యక్కది .......
దివ్యక్కది - బావగారిది - నీ ప్రియుడిది ఇక్కడ నా హృదయంలో ఉందికదా .......
దివ్యక్క : లవ్ యు అన్నయ్యా .......
చెల్లెమ్మ : అన్నయ్యా ....... ఏదో పెద్దగానే సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లున్నారే ......
ష్ ష్ ష్ ....... చెల్లీ ......
చెల్లెమ్మ : Ok ok ok .......
చెల్లీ ....... ముఖ్యన్గా వీడికి మాత్రం చెప్పకు - ఏదీ దాగదు అంటూ వీపు విమానం మ్రోగించాను .
అమ్మా ....... అంటూ రుద్దుకుంటున్నాడు - ఎందుకురా ...... ? .
ఊరికే ....... అలా ఉంటాయిలే అని .......
చెల్లెమ్మ : నవ్వుకుని , కృష్ణగాడి బుగ్గపై ముద్దుపెట్టింది .
వాట్సాప్ లో వచ్చిన పిల్లలు - వార్డెన్ - సిస్టర్స్ - మహి ఆధార్ కార్డ్స్ తోపాటు దివ్యక్క - బావగారు - కృష్ణ ...... ఆధార్ కార్డ్స్ జతచేసి రమేష్ గారికి పంపించాను .
ప్రాసెస్ స్టార్ట్స్ మహేష్ సర్ అంటూ రిప్లై వచ్చింది .
చెల్లెమ్మ : ప్రాసెస్ స్టార్ట్స్ ........ యాహూ అంటూ నన్ను గట్టిగా చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది .
చెల్లీ ....... ఎందుకంత సంతోషపు కేకలు .......
చెల్లెమ్మ : నథింగ్ నథింగ్ అక్కయ్యలూ ........ సర్ప్రైజ్ అంటూ అందరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వర్షం కురిపించింది .

చెల్లెమ్మ చెప్పినట్లు స్మాల్ సర్ప్రైజ్ - లవ్ యు చెల్లీ అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
చెల్లెమ్మ : అన్నయ్యా ........ , ఇంత బిగ్గెస్ట్ నే స్మాల్ సర్ప్రైజ్ అంటున్నారు అంటే ఇక మీడియం - లార్జ్ సర్ప్రైజస్ అంటే ఎలా ఉంటాయో ......... - అక్కయ్యలూ ....... అత్యద్భుతాలే - లవ్ యు లవ్ యు sooooo మచ్ అన్నయ్యా ....... అంటూ కృష్ణగాడిని హత్తుకుని ఆనందం పట్టలేక ముద్దులుపెడుతోంది .
లవ్ యు లు నాకు - ముద్దులు మాత్రం వాడికి ..........
చెల్లెమ్మ తియ్యదనంతో నవ్వుకుని లేచివెళ్లి దేవకన్య ఒడిలో కూర్చుంది - చూశావా అక్కయ్యా ....... ముద్దులకోసం నీ దేవుడు ఎంతలా ఆరాటపడుతున్నారో ...... తొందరగా మీ మనసులో దాచుకున్న ప్రేమను ప్రాణంలా కాదు కాదు ప్రాణం కంటే ఎక్కువగా వ్యక్తపరిచి ముద్దులలో ముంచెయ్యొచ్చు కదా .......
దేవకన్య : ( ఆ క్షణం కోసమే ఆశతో ఎదురుచూస్తున్నాను చెల్లీ - నా తొలిముద్దు మొదలుకుని చివరి శ్వాస విడిచేంతవరకూ ముద్దులన్నీ ...... మీ అన్నయ్యకే కదా అంటూ చెవిలో గుసగుసలాడింది ) .
చెల్లెమ్మ : యాహూ యాహూ ....... లవ్ యు లవ్ యు సో సో sooooo మచ్ అక్కయ్యా ........ , ( అక్కయ్యా ....... మీకు ముద్దులుకూడా అన్నయ్యనే పెట్టాలా లేక మేము కూడా పెట్టొచ్చా ? ) .
దేవకన్య : చెల్లీ ....... అంటూ ప్రేమతో హత్తుకుని ముద్దులు కురిపించింది .
చెల్లెమ్మ : లవ్ యు అక్కయ్యా ...... అంటూ దేవకన్య బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .

ఏదో సూపర్ గుడ్ న్యూస్ అయ్యే ఉంటుందని చెల్లెమ్మతోపాటు యాహూ యాహూ ....... అంటూ సంతోషంతో కేకలువేసి లవ్ యు టూ అమ్మా హృదయంపై ముద్దులు కురిపిస్తూ లేచి డాన్స్ చేస్తున్నాను .
అన్నయ్యా ....... అంటూ దేవకన్య బుగ్గపై మరొకముద్దుపెట్టి చెల్లెమ్మ లేచివచ్చి నాతోపాటు డాన్స్ చేస్తోంది .
నేనుకూడా అంటూ కృష్ణగాడు లేచి నా బుగ్గపై చేతితో - చెల్లెమ్మ బుగ్గపై పెదాలతో ముద్దులుపెట్టి మాస్ స్టెప్పులు వేస్తున్నాడు .
సిస్టర్స్ : మహేష్ సర్ ...... ఫుల్ గా తిన్నాము లేకపోయుంటే మేమూ జతకలిసేవాళ్ళము ప్చ్ ప్చ్ ....... అంటూ చప్పట్లు కొడుతున్నారు .
అందరితోపాటు దేవకన్య నవ్వుకుని , మహేష్ ...... ఎందుకు డాన్స్ & సంతోషం .........
లవ్ acceptence గురించి చెల్లి చెవిలో చెప్పారుకదా ....... - అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి డాన్స్ చెయ్యడానికి ........
దేవకన్య : లవ్ acceptence ఏమిటి మహేష్ ....... ? - మేము గుసగుసలాడుకున్నది నైట్ డిన్నర్ తరువాత అందరమూ కలిసి అదే మీ హాస్టల్ ఫ్రెండ్స్ - సిస్టర్స్ తో కలిసి ఏదైనా మూవీకి వెళదాము అని ...... చెల్లీ అంతేకదా ? ( లవ్ యు లవ్ యు ప్లీజ్ ప్లీజ్ ........ ) .
చెల్లెమ్మ : దేవకన్య బుగ్గపై ముద్దుపెట్టివచ్చి , అన్నయ్యా ...... దేవకన్యతో దేవుడు మూవీ చూడబోతున్నారు అన్న ఆనందంలో అక్కయ్యకు ముద్దులు ఆగలేదు , అన్నయ్యా ........ ఇలా కిక్కు లేకుండా దేవుడు - దేవకన్య లవ్ acceptence ..... నోవే ....... , అక్కయ్యను మరింత ప్రేమిస్తూ టీజ్ చేస్తూ ఎంజాయ్ చెయ్యండి .
దేవకన్య : లోలోపల పులకించిపోతూనే ........ , అంతేలే చెల్లీ ....... నువ్వు , మీ అన్నయ్య పార్టీ - నీకు ...... మీ అన్నయ్య అంటేనే ప్రాణం అంటూ విద్యు సిస్టర్ చేతిని చుట్టేసి బుంగమూతిపెట్టుకున్నారు .
చెల్లెమ్మా ........ అలకలో మీ అక్కయ్య మరింత అందంగా ఉంటుంది . రోజుకొకసారైనా అలక చెందేలా ........
దేవకన్య : మహేష్ ....... అంటూ లేచివచ్చి ఛాతీపై దెబ్బల వర్షం కురిపించి , చూసారా అంటీ ....... ఎలాంటి కోరికలు ఉన్నాయో ........ రోజుకొకసారైనా నన్ను ఏడిపించి ఆనందిస్తాడట అంటూ నవ్వుని లోలోపలే దాచేస్తూ హృదయంపై ముద్దులుపెట్టింది .
ఆ కోరిక మీ అంటీదే మహీ ...... , నా దేవకన్య గురించిన ఏ చిన్న విషయమైనా అమ్మే నిర్ణయం తీసుకుంటారు తెలుసా ....... ? .
దేవకన్య : నో నో నో మా అంటీ ఎప్పటికీ అలా కోరుకోరు - ఇది అక్షరాలా తమరి చిలిపి కోరికనే అని నాకు తెలుసు ........
నమ్మవు కదా కావాలంటే మీ అంటీనే అడుగు అంటూ దేవకన్య చేతిని ...... నా హృదయంపై ఉంచుకోబోయి sorry sorry ....... అంటూ ఆగిపోయాను .
అంతే కోపంతో నా చేతిపై గిల్లేసింది దేవకన్య .......
Sorry చెప్పానుకదా మహీ ........
చెల్లెమ్మ : అలా అర్థమయ్యిందా అన్నయ్యా ....... ? , అక్కయ్య గిళ్లడంలో తప్పే లేదు అంటూ చిరుకోపం ప్రదర్శించింది .
దేవకన్య : వదిలేయ్ చెల్లీ ....... , ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం - నిజాయితీగా ఉండటం - కోరిక ముందే కోరికలు తీర్చడం - అంతులేని ఆనందాలను పంచడం - సర్ప్రైజస్ ఇవ్వడంతోపాటు కాస్త ధైర్యం కూడా ఉండాలి అంటూ నా నడుముపై గిల్లేసి కోపంతో చూస్తూ వెళ్లి కూర్చుంది .
చెల్లెమ్మా ....... నాకేమీ అర్థం కాలేదు .
చెల్లెమ్మ : దేవుడి గురించి దేవకన్య మనసులో ఏ స్థానమో మా అందరికీ అర్థమయ్యింది అన్నయ్యా ........ , మా అన్నయ్యలా నిజాయితీగా ప్రేమించే వ్యక్తి ప్రపంచంలోనే ఉండరు - ప్రౌడ్ ఆఫ్ యు అన్నయ్యా ...... అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
ప్రాణం - కోరికలు - ఆనందం - నిజాయితీ - సర్ప్రైజ్ లతోపాటు దైర్యం ....... అంటూ ఆలోచిస్తూ దేవకన్యనే చూస్తూ కూర్చున్నాను . చెల్లీ ...... దేవకన్య మాటల్లోని అంతరార్థం ఏమిటో అర్థం అయినట్లే ఉందికానీ అర్థం కావడంలేదు .
దేవకన్య : హలో సర్ ...... ఎక్కువ ఆలోచించకుండా ముందు డిన్నర్ కు బిరియానీ సంగతి చూడండి .
ఆ ఆ అవునవును బిరియానీ సంగతి చూడాలి - ఆ తరువాత దేవకన్య కోరిక ప్రకారం మూవీ ప్లాన్ చెయ్యాలి . చెల్లీ - మహీ - సిస్టర్స్ ...... ఏ మూవీ ? .
అఖండ - పుష్ప - శ్యామ్ సింగరోయ్ - RRR ....... అంటూ వాదులాడుకుంటున్నారు . వాదులాడుకోవడమే కాదు మాటల తూటాలు - దెబ్బలు కూడానూ .......
అంటీ : ఇలా అయితే మూవీకి వెళ్లినట్లే ....... , బాబూ మహేష్ ....... అఖండ మూవీతో బాలయ్య క్రేజ్ అమాంతం పెరిగిపోయింది . ఒక హీరో మూవీకి వెళితే మరొకరు అలక చెందుతారు .
అయితే ఇప్పుడెలా అంటీ ...... ? , పెద్దవారు మీరే ఒక మూవీ సెలెక్ట్ చెయ్యండి .
అంటీ : నా సలహా అయితే స్పైడర్ మ్యాన్ ....... - ఏ ఒక్కరూ .......
లవ్ యు లవ్ యు లవ్ యు అమ్మా - అంటీ ........ స్పైడర్ మ్యాన్ ఫిక్స్ .
సూపర్ అంటీ ........ , ఒక్క మాటతో అందరి పెదాలపై చిరునవ్వులు పూయించారు .
అంటీ : థాంక్యూ థాంక్యూ ........
చెల్లీ - మహీ - సిస్టర్స్ ........ మీ హాస్టల్ మేట్స్ కు ఇష్టమో లేదో తెలుసుకోండి .
దేవకన్య : వాళ్ళ దేవుడు మూవీ ప్లాన్ చేశారని తెలిస్తే చాలు ఇప్పుడే రెడీ అయిపోరూ ........
అంతా అమ్మ - దేవకన్య అనుగ్రహం అంటూ దేవకన్యకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదలబోయి ఆగి హృదయంపై ముద్దుపెట్టాను .
దేవకన్య కళ్ళల్లో నిరాశను చూసి , అన్నయ్యా ....... మళ్ళీనా ? - ముద్దుపెట్టేయ్యండి కొడితే మీకు ఇష్టమేకదా .......
అవునుకదా అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
దేవత నవ్వుకుని , మహేష్ అంటూ వార్నింగ్ ఇచ్చింది .
దెబ్బలు అన్నావుకదా చెల్లీ ....... ప్చ్ ప్చ్ ......
చెల్లెమ్మ : sorry లవ్ యు లవ్ యు అన్నయ్యా ......
దేవకన్య : దెబ్బలు కావాలా దెబ్బలు కావాలా ....... అంటూ లేచివచ్చి ఛాతీపై కొట్టి , లవ్ యు అంటీ అంటూ ముద్దులుపెట్టి , నాకు మరొకవైపు కూర్చుంది .
చెల్లెమ్మా చెల్లె......మ్మా ...... దేవకన్య నాప్రక్కన అంటూ మెలికలుతిరిగిపోతున్నాను .
దేవకన్య : మురిసిపోయింది చాలు కానీ ముందు మీ హాస్టల్ ఫ్రెండ్స్ - సిస్టర్స్ కు మూవీ ప్లాన్ చెప్పండి .
మహీ - చెల్లెమ్మా ....... మీరు మీ హాస్టల్ మేట్స్ కు తెలపండి , నేను థియేటర్ బుక్ చేసి కొన్ని కాల్స్ చెయ్యాలి కాస్త సమయం పడుతుంది - అంటీ ....... ఆ వెంటనే బిరియానీ ప్రిపరేషన్ .......
అంటీ : Ok మహేష్ .......
దేవకన్య : ఆ కాల్స్ ఏవో ఇక్కడే చేసుకోవచ్చుకదా ........ - చెల్లీ చెప్పు .......
ఆఅహ్హ్ ........ లవ్ యు మహీ , ఇంపార్టెంట్ కాల్స్ అదికూడా మీకు తెలియకుండా చెయ్యాలి .
దేవకన్య : సీక్రెట్స్ కూడా ఉన్నాయన్నమాట .......
నో నో నో నెవర్ ఎవర్ ....... , సీక్రెట్స్ కాదు దేవకన్యా ...... ఓన్లీ సర్ప్రైజస్ , ఫ్యూ మినిట్స్ అంతే ....... , వద్దు అంటే వద్దు ...... , నా దేవకన్యతో ఇలా ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉంది కదా మమ్మీ .......
దేవకన్య తియ్యదనంతో నవ్వుకుని , అంటీ హ్యాపీ అయితే మేమూ హ్యాపీ ...... , సరే సరే తొందరగా మాట్లాడి వచ్చెయ్యండి .
లవ్ యు లవ్ యు అంటూ చెల్లెమ్మతోపాటు దేవకన్య చేతిపై ముద్దులుపెట్టి , sorry లవ్ యు అంటూ తుర్రుమన్నాను .
( దేవకన్య : పెదాలపై తియ్యదనంతో చెల్లీ ....... అంటూ సంతోషంతో చుట్టేసి వెనక్కుతిరిగి నావైపే చూస్తోంది ) .

దేవకన్య చూస్తున్నది నన్నేనా ...... ? , దేవకన్యవైపే సైగలతో అడిగాను .
దేవకన్య : చూసింది చాలు - ముందు కాల్స్ ఫినిష్ చెయ్యి అంటూ నవ్వుతూ చెల్లెమ్మను మరింత గట్టిగా హత్తుకుంది .
Yes yes అంటూ ఎంజాయ్ చేస్తూ మెయిన్ డోర్ బయటఉన్న స్టెప్స్ పై కూర్చున్నాను .

అన్నయ్యా అన్నయ్యా ...... sorry లవ్ యు లవ్ యు అంటూ దేవకన్యతోపాటు ఏకంగా చైర్ తీసుకొచ్చి , దేవుడు నేలపై కూర్చోవచ్చునా ...... ? , అక్కయ్య చూశారుకాబట్టి సరిపోయింది అంటూ లేపిమరీ కూర్చోబెట్టి హమ్మయ్యా అనుకున్నారు - లవ్ యు అక్కయ్యా .......
దేవకన్య : మహేష్ ....... కాల్స్ చెయ్యిమరి .
దేవకన్య దూరం వెలితేనేకదా ....... , చెల్లెమ్మ ప్రక్కన ఉన్నా పర్లేదు దేవకన్య ప్రక్కనే ఉంటే కాల్స్ కలవవు - చెల్లెమ్మా ...... తీసుకెళ్లు .......
దేవకన్య : కలవవా కలవవా ....... చూడండి అంటీ అంటూ చిరుకోపంతో కొడుతోంది .
చెల్లెమ్మ : అక్కయ్యా అక్కయ్యా ....... కొట్టాల్సినది మీరుకాదు నేను .
కరెక్ట్ చెల్లీ ....... కానీ ఇక్కడ రివర్స్ జరుగుతోంది - దేవకన్య దెబ్బలు అంటే ఇష్టమేలే ....... ఉమ్మా ఉమ్మా అంటూ కొట్టినచోట ముద్దులుపెట్టుకుంటున్నాను .
దేవకన్య : Why చెల్లీ .......
చెల్లెమ్మ : మిమ్మల్ని మాత్రమే వెల్లమన్నారు అంటే మీకు మాత్రమే సర్ప్రైజ్ అని అర్థం కదా అక్కయ్యా ...... , పో అన్నయ్యా అంటూ బుంగమూతిపెట్టుకుని లోపలికివెళ్లింది .
దేవకన్య : అవునుకదా ...... sorry sorry ( లవ్ యు లవ్ యు సో మచ్ మహేష్ ) లవ్ యు అంటీ అంటూ హృదయంపై ముద్దుపెట్టి , చెల్లీ చెల్లీ అంటూ పరుగుణలోపలికివెళ్లింది .
లవ్ యు చెల్లీ - లవ్ యు అన్నయ్యా అంటూ ఇద్దరమూ కళ్ళు కొట్టుకున్నాము , లేకపోతే దేవకన్య వదిలి లోపలికి వెళ్లేదే కాదు అంటూ నవ్వుకున్నాను .

విద్యు సిస్టర్ ద్వారా దేవకన్య మరియు సిస్టర్స్ అందరి హోమ్ నంబర్స్ ను ఇంట్లోకి చేరినరోజున తీసుకోవడం ఇప్పుడు హెల్ప్ అవుతోంది . మొదటగా దేవకన్య హోమ్ నెంబర్ కు కాల్ చేసాను .
" హాలో " అంటూ అమ్మ దేవకన్య అమ్మ వాయిస్ వినిపించగానే కొన్ని క్షణాలపాటు హృదయం - మనసు పరవశించిపోసాగింది , నన్ను నేను మరిచిపోయి మాటలు రావడం లేదు . " హలో హలో ....... కాల్ చేసి మాట్లాడటం లేదేంటి హలో హలో - రాంగ్ నెంబర్ ఏమో పాపం కట్ చేసేద్దాము " .
ఆమ్ ....... అంటీ అంటీ sorry sorry నేను మహేష్ ను ...... దేవక ... మహి ఫ్రెండ్ ....... ఫ్యూ డేస్ బ్యాక్ మనం మాట్లాడాము - మరిచిపోయి ఉంటారు .
" మహేష్ ....... నువ్వా మరి మాట్లాడవేమి బాబూ ...... , నిన్ను మరిచిపోవడమా ...... ? , నీతో మాట్లాడినది కొద్దిసేపైనా ఎందుకో తెలియదు రోజూ అంతెందుకు నువ్వు కాల్ చేసిన క్షణం ముందువరకూ ఆ మాటలు గుర్తుకొస్తూనే ఉన్నాయి తెలుసా....... " .
అవునా అంటీ నాకుకూడా సేమ్ టు సేమ్ అలానే .........
" బాబూ మహేష్ ...... నాకు చిరుకోపం - బాధకూడా కలుగుతోంది " .
అంటీ అంటీ ఏమైంది ఏమైంది ? - మీరు బాధపడితే ఎందుకో తెలియదు నా హృదయం తట్టుకోలేకపోతోంది .
" ఆత్మీయమైన నవ్వులు ....... నీ వల్లనే బాబూ " .
నావల్లనా ....... ? , అయితే నాకు శిక్షపడాల్సినదే అంటూ లేచి గుంజీలు తీస్తున్నాను .

నన్నుచూసి దేవకన్య - చెల్లెమ్మ - దివ్యక్క - సిస్టర్స్ ....... అందరూ ఏమైంది ఏమైంది ఎవరికోసం అంటూ సైగలుచేస్తూ నవ్వుతున్నారు .
" బాబూ మహేష్ బాబూ మహేష్ ....... ఏంటి తల్లులు ప్రక్కనే ఉన్నట్లు నవ్వులు వినిపిస్తున్నాయి " .
మా అంటీని బాధపెట్టినందుకుగానూ లెంపలేసుకుని గుంజీలు తీస్తున్నాను ...... - అందుకే దేవక ..... మహి - విద్యు సిస్టర్స్ నవ్వుతున్నారు .
" నో నో నో మహేష్ బాబు ఆపు ఆపు అని ఆతృతతో చెప్పారు " .
మీరు చెప్పారు కాబట్టి లేకపోతే ఈరోజంతా గుంజీలు తీస్తూనే ఉండేవాడిని ......
" బాబూ మహేష్ ....... " .
చెప్పానుకదా అంటీ మీరు బాధపడితే ఎందుకో తెలియదు ఈ హృదయం తట్టుకోలేకపోతోంది , అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు నేను చూడలేదు అమ్ .... అంటీ - మీతో మాట్లాడిన క్షణం నుండీ అమ్మ తరువాతి స్థానం మీకే ఇచ్చేసాను - తప్పుగా మాట్లాడితే క్షమించండి అంటూ ఉద్వేగంతో మాట్లాడాను .
" బాబూ మహేష్ ....... నీ మాటల ఉద్వేగం నా మనసుకు తెలుస్తోంది , నా కోపం - బాధకు కారణం నీ మాటల్లోనే ఉంది , తెలుసుకోకుండానే శిక్షను అనుభవించేస్తావా చెప్పు " .
అమ్మను బాధపెట్టి ఇంకా కారణం తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటీ ......
" అదిగో మళ్లీ ....... అంటీ అంటున్నావు - ఆరోజునే " అమ్మ " అని పిలవమని చెప్పానుకదా ...... - అంటీ అని పిలవగానే ఎందుకో తెలియదు నువ్వుచెప్పినట్లుగానే ఈ తల్లి హృదయం కూడా తట్టుకోలేకపోయింది - నీ ఫ్రెండ్ మహి ...... అంటీ అని నన్ను పిలిస్తే ఎంత బాధ కలుగుతుందో అత బాధ , మరొక్కసారి అంటీ అని పిలిస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చేలా ఉన్నాయి - అప్పుడు నిజంగానే నేనే గుంజీలు తీయించేదానిని అంటూ నవ్వుతున్నారు " .
ఆఅహ్హ్ ....... అమ్మా , ఈ మాటలతో ఎంత ఆనందం - హాయి కలిగిందో మాటల్లో చెప్పలేను థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అమ్మా .......
" మరొక్కసారి పిలవచ్చుకదా ....... "
ఒక్కసారి ఏమిటి అమ్మా ........ , నిజం చెబుతున్నాను అమ్మా తెలుగుబాషలో నాకు నచ్చిన అత్యంత ప్రియమైన ప్రాణమైన అమృతమైన పదం " అమ్మ " - అమ్మ పిలుపుకోసం ఊహతెలిసినప్పటి నుండీ ఎదురుచూస్తున్నాను అమ్మా ........ అమ్మా అమ్మా అమ్మా .......
" మహేష్ ....... నేనూ నిజం చెబుతున్నాను నువ్వు అమ్మ అని పిలుస్తున్న ప్రతీ పిలుపుకు కన్న ప్రేగు కదులుతోంది - ఆనందబాస్పాలు ఆగడం లేదు - ఎంత ఆనందం కలుగుతోందో మాటల్లో వర్ణించలేకపోతున్నాను - థాంక్స్ నువ్వుకాదు ఈ తల్లి చెప్పాలి థాంక్యూ థాంక్యూ sooooo మచ్ " .
థాంక్యూ అమ్మా అమ్మా అంటూ ఇద్దరమూ సంతోషంతో నవ్వుకుంటున్నాము .

హమ్మయ్యా ...... అన్నయ్య నవ్వుతున్నారు అక్కయ్యలూ ....... అంటూ ఆనందిస్తున్నారు .
అమ్మా ...... నేను గుంజీలు తియ్యడం చూసి దేవక ..... మహి - విద్యు సిస్టర్స్ - అక్కయ్య - చెల్లి ....... తెగకంగారుపడిపోతున్నారు .
" తప్పు నాదేకదా ...... అయితే అందరికీ నా తరుపున sorry చెప్పు " .
ప్రేమించినా - కోప్పడినా - శిక్షించినా ....... అమ్మ అమ్మే , అమ్మ ..... sorry చెప్పే సందర్భం రాదు రారాదు , అమ్మ అంటే ఆ పరాశక్తి కంటే గొప్ప .......
" థాంక్యూ మహేష్ ....... , నీ ఫ్రెండ్ మహికూడా ఇలానే నన్ను ఆకాశానికి ఎత్తేస్తుంది దేవతల కంటే దైవం అని " .
ఎంతైనా నాది - నా దేవకన్య మనసు ఒక్కటే కదా అంటూ చిరునవ్వులు చిందిస్తున్న దేవకన్యవైపు ప్రాణంలా చూస్తున్నాను .
" దేవకన్యనా ...... ? , ఎవరు మహేష్ ...... ? " .
అమ్మ అడిగితే చెప్పనా ...... ? , కానీ ఇప్పుడుకాదు అమ్మా ...... , అమ్మా అమ్మా .... ఇంతకూ కాల్ చేసిన విషయం అంటూ సర్ప్రైజ్ ట్రిప్ గురించి వివరించాను .
కొద్దిసేపు మౌనం ........
అమ్మా అమ్మా ....... మీకు ఇష్టం లేదా ? Sorry sorry అమ్మా అయితే వ .......
" మహేష్ మహేష్ ....... సంతోషంలో ఏమి మాట్లాడాలో మాటలు రావడం లేదు - తల్లులను ఎంత ప్రాణంలా చూసుకుంటున్నావో విద్యు తల్లి రోజూ చెబుతూనే ఉంది - నా బంగారుతల్లి మహిని నా కష్టం వలన వైజాగ్ దాటించలేకపోయాను అలాంటిది ఆగ్రా తీసుకెళ్ళావు ఇప్పుడు ఏకంగా ....... నా తల్లి ఏజన్మలో ఏ అదృష్టం చేసుకుందో ఏమో దేవుడిలాంటి ........ "
అమ్మా అమ్మా అమ్మా ...... రోజూ మహి - విద్యు సిస్టర్స్ కూడా దేవుడు దేవుడు అని ఆకాశానికి ఎత్తేస్తున్నారు - ఇప్పుడు మీరుకూడానా ....... ? .
" అవునా ...... నిజమే చెప్పారు అయితే అంటూ సంతోషంతో నవ్వుకున్నారు - బాబూ మహేష్ ....... ఇందుకోసం నా తల్లుల సంతోషం కోసం ఇంతగా పరితపిస్తున్నావో నాకు తెలియదు కానీ పిల్లల సంతోషాలను ఆ ఏ తల్లి కాదంటుంది చెప్పు - నేనైతే సంతోషంగా అనుమతి ఇచ్చేస్తున్నాను - దేవుడే తోడుగా ఉండబోతున్నాడు ఏమాత్రం ఆలోచించకుండా హ్యాపీగా ఉంటాను " .
లవ్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో sooooo మచ్ అమ్మా యాహూ యాహూ అంటూ సంతోషం పట్టలేక చిందులువేస్తున్నాను .
అన్నయ్యా అన్నయ్యా ...... ఏమిటీ సంతోషం అంటూ నా చేతిని చుట్టేసి నాతోపాటు చిందులువేస్తోంది చెల్లెమ్మ .......
చెల్లెమ్మా ....... ప్రక్కనే దేవకన్య ఉంటే చెప్పను అనిచెప్పానుకదా .......
దేవకన్య కొప్పడేంతలో ........ సర్ప్రైజ్ సర్ప్రైజ్ అక్కయ్యా , పదండి వెళదాము - దూరం నుండే మన దేవుడి ఆనందాలను ఎంజాయ్ చేద్దాము అంది చెల్లెమ్మ .......
దేవకన్య : Ok చెల్లీ అంటూ తియ్యనైనకోపంతో నా నడుముపై గిల్లేసి చేతులలో పెనవేసి వెళ్లిపోయారు .
అయితే మాకైనా చెప్పండి మహేష్ సర్ అంటూ సిస్టర్స్ వచ్చారు .
సిస్టర్స్ ....... Can't can't ప్లీజ్ ప్లీజ్ సర్ప్రైజ్ ........
దేవకన్య : బ్రతికిపోయావు మహేష్ ....... , నాకు చెప్పకుండా నీ సిస్టర్స్ కు చెప్పి ఉంటే కత్తితో పొడిచేసేదాన్ని .......
అమ్మో అమ్మో ........ కాస్త జాగ్రత్తగా ఉండాలి .
సిస్టర్స్ : నవ్వుకుంటూ దేవకన్య - చెల్లెమ్మతోపాటు వెళ్లిపోయారు .

విన్నారా అమ్మా ....... ? .
" ఆశ్చర్యం మహేష్ ....... , మహి ఇలా మాట్లాడటం నేనెప్పుడూ చూడనేలేదు , కొద్దిసేపు షాక్ లో ఉండిపోయాను తెలుసా ...... , విద్యు తల్లి చెబితే నమ్మనేలేదు , ఈ మార్పుకు కారణం ఎవరో కొద్దికొద్దిగా అర్థమౌతోంది ....... " .
Sorry అమ్మా .......
" నో నో నో ....... నాతల్లిని ఇలా చూడాలనే ఆశపడ్డాను - నా బాధను చూసి తను అలా ....... - సో సో సో హ్యాపీ థాంక్యూ థాంక్యూ sooooo మచ్ " .
బాధ ...... అమ్మకు బాధ ఉందా ..... ? , తెలుసుకోబోయి అడిగితే బాగోదు అని ఆగిపోయాను .
" బాబూ మహేష్ ...... నాకు చాలా అసూయ - ఈర్ష్య కలుగుతోంది " .
ఎందుకు - ఏమైంది అమ్మా ....... ? .
" నువ్వు - నీ ఫ్రెండ్స్ మరియు సిస్టర్స్ మాత్రమేనన్నమాట , నన్ను ఆహ్వానించనేలేదుకదా ........ " .
అమ్మ - అంతకంటే అదృష్టమా అమ్మా ........ , మా అమ్మ వస్తుంది అంటే అంతకంటే ........
" కూల్ కూల్ కూల్ మహేష్ ....... , నీ మాటల్లోని సంతోషం చాలు , నేను కాలేజ్ పిల్లలతోపాటు మినీ టూర్ వెళుతున్నాను , మీతోపాటు వచ్చే అదృష్టం నోచుకోలేదు , పిల్లల టూర్ మంత్స్ బ్యాక్ ఫిక్స్ అయ్యింది ప్చ్ ప్చ్ ....... " .
అమ్మా పిల్లలు ఏమిటి ? .
" నేను కాలేజ్ టీచర్ కదా మహేష్ ....... - కాలేజ్ పిల్లలతోపాటు ఎడ్యుకేషన్ టూర్ లో భాగంగా హైద్రాబాద్ వెళుతున్నాను - నెక్స్ట్ వీక్ మొత్తం ...... " .
Wow సూపర్ అమ్మా ....... , మీరు టూర్ వెళ్ళిరండి - మా ట్రిప్ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తాను .
" నో నో నో మహేష్ ....... ఈ ఎడ్యుకేషన్ టూర్ తరువాత 3 మంత్స్ కాలేజ్ ఆక్టివిటీస్ - exams తో బిజీ బిజీ ....... అయినా తల్లుల సంతోషాన్ని ఒక వారం పాటు పోస్ట్ ఫోన్ చెయ్యడానికి ఈ తల్లి మనసు ఒప్పుకోవడం లేదు ప్లీజ్ ప్లీజ్ మహేష్ - నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు - జస్ట్ ఊరికే అడిగాను అంతే - నా తల్లులూ మరియు నువ్వు ఎంజాయ్ చేస్తే ఈ తల్లికి అంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పు ....... , అయినా మహి - విద్యు వాళ్ళ దేవుడివి నువ్వు - ఇలా ప్రతీదానికీ నా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు , నీతోపాటు ఉంటే నా తల్లి ఎంత సంతోషంతో ఉంటుందో నాకు అర్థమైపోయింది , సో ఎంజాయ్ the ట్రిప్ ....... "
అమ్మా ........
" మహేష్ కు నేనంటే ఎంత ఇష్టమో తెలుసుకోవడానికి అలా అడిగాను అంతే అంతే - కాల్ కట్ చెయ్యడం బెటర్ లేకపోతే మరింత ఫీల్ అవుతావు - బాబూ మహేష్ ..... i am so so sooooo happy థాంక్యూ థాంక్యూ soooo మచ్ అంటూ సంతోషంతో నవ్వుతూ ఇక ఉంటాను అనిచెప్పి కట్ చేశారు " .
లవ్ యు అమ్మా ....... ఆఅహ్హ్ మీతో మాట్లాడుతున్నంతసేపూ మమ్మీ సో సో sooooo happy అంటూ హృదయంపై చేతినివేసుకుని తెగ ఆనందిస్తున్నాను .

దేవకన్య : చెల్లీ ...... మీ అన్నయ్య మాట్లాడటం అయిపోయింది ఎందుకో తెగ మురిసిపోతున్నారు .
చెల్లెమ్మ : అవును అక్కయ్యా ...... మనతో ఉన్నప్పటికంటే ఎక్కువగా పరవశించిపోతున్నారు .
దేవకన్య : అవునవును చెల్లెమ్మ - దివ్యక్క - సిస్టర్స్ .......
చెల్లెమ్మ : దేవకన్య ....... కంటే ముఖ్యమైనవారు ఎవరబ్బా ...... అంటూ నవ్వుకున్నారు .
దేవకన్య : మాట్లాడటం అయ్యిందికదా మీ అన్నయ్యను పిలువు చెల్లీ .......
చెల్లెమ్మా ....... పూర్తయినది ఒక్క కాల్ మాత్రమేనని దేవకన్యకు చెప్పు .......
చెల్లెమ్మ : అన్ని కాల్స్ ఎవరికి అన్నయ్యా ..... , అడుగుతున్నది నేను కాదు మీ దేవకన్య , మాకంటే ముఖ్యమైన వారు ఎవరా అని ....... మీ దేవకన్య ఈర్ష్య - అసూయ చెందుతున్నారు .
ముఖ్యమైన వారే కాదు చెల్లెమ్మా ....... ప్రాణమైనవారు అని మీ అక్కయ్యకు చెప్పు ........
చెల్లెమ్మ : ఇక ఏమైనా ఉందా ...... ? దేవకన్య మూడో కన్ను తెరిచేస్తుంది .
నో నో నో అని నవ్వుకున్నాను - చెల్లెమ్మా ....... ఆ ప్రాణమైనవారు ఎవరన్నది బుధవారం సాయంత్రం మీరే చూస్తారుకదా ....... - అయినా నేను కాల్స్ లో మాట్లాడుతుంటే దేవకన్య అసూయపడుతోంది అంటే ......
దేవకన్య : హలో హలో ...... తెగ మెలికలు తిరిగిపోకండి - డిన్నర్ ఆలస్యం అవుతుందని అంతే ........
అంతేనా ....... ప్చ్ ప్చ్ .......
దేవకన్యతోపాటు చెల్లెమ్మ - దివ్యక్క - సిస్టర్స్ ....... నవ్వుకున్నారు .

నా ప్రిపరేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే సంతోషమే కదా - ఇదిగో ఫాస్ట్ ఫాస్ట్ గా కాల్స్ చేసేసి వచ్చేస్తాను అంటూ దేవకన్యకు ఫ్లైయింగ్ కిస్ వదిలాను . ( దేవకన్య కోపంతో చూడటంతో ) లవ్ యు చెల్లెమ్మా - లవ్ యు దివ్యక్కా - లవ్ యు సిస్టర్స్ అంటీ ........ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
( చెల్లెమ్మ : లవ్ యు అక్కయ్యా ...... మీరు కోపంతో చూడటం వలన మా అందరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ ఉమ్మా అంటూ దేవకన్యను చుట్టేసింది .
దేవకన్య : మీ అన్నయ్య వదిలిన ఫ్లైయింగ్ కిస్సెసే ఇంత స్వీట్ గా ఉంటే ఇక .......
చెల్లెమ్మ : మోస్ట్ ఎవర్ స్వీటెస్ట్ అక్కయ్యా ....... ఇప్పుడు రుచి చూడాలని ఉందా చెప్పండి ? .
దేవకన్య : Yes ....... )
చెల్లెమ్మ : అన్నయ్యా ........
చెల్లీ ........
దేవకన్య : ష్ ష్ ష్ చెల్లీ ....... నువ్వే చెప్పావుకదా ఆ సందర్భం అత్యద్భుతంగా ఉండాలని .......
చెల్లెమ్మ : అవునుకదా ........ , ఏమీలేదులే అన్నయ్యా , లవ్ యు , మీరు కాల్స్ చేసుకోండి .
లవ్ యు టూ చెల్లీ .......

దేవకన్య ....... సంతోషంతో చెల్లెమ్మ బుగ్గపై ముద్దుపెట్టి కౌగిలించుకోవడం చూసి ఆనందించి , నెక్స్ట్ విద్యు సిస్టర్ ఇంటికి కాల్ చేసాను .
ఆశ్చర్యంగా hi మహేష్ ఎలా ఉన్నావు ? అంటూ మేల్ వాయిస్ వినిపించింది .
వాయిస్ గంభీరంగా ఉండటం - ఇంతకుముందు ఒకసారి మాట్లాడటం వలన అంకుల్ అని నిర్ణయానికి వచ్చి , ఫైన్ అంకుల్ ..... మీరెలా ఉన్నారు ? .
అంకుల్ : మా డుమ్మీ విద్యు ........ ఆప్యాయంగా చూసుకునే దేవుడి దగ్గర ఉండగా మేమిక్కడ ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నాము మహేష్ .......
థాంక్యూ అంకుల్ ....... , ఏంటి అంకుల్ " డుమ్మీ విద్యు " ? .
అంకుల్ : చిన్నప్పుడు విద్యు మరింత లావుగా ఉండేది మహేష్ ...... అందుకే ఆ ముద్దుపేరు .
లవ్లీ అంకుల్ ....... , కానీ మాకు మాత్రం స్వీట్ విద్యు సిస్టర్ & డార్లింగ్ ......
అంకుల్ : I know i know మహేష్ ....... , ఇంతకుముందు హాస్టల్ ఫుడ్ బాలేదు - రూమ్ బాలేదు అని రోజుకు రెండుమూడుసార్లు కాల్ చేసేది - ఎప్పుడైతే నీదగ్గరకు చేరిందో ఆ రోజునుండీ ఒక్క కాల్ కూడా లేదంటే నమ్ము - మమ్మల్ని మరిచిపోయేంత ప్రేమతో చూసుకుంటున్నావాని మీ అంటీ - పిల్లలు చాలా చాలా సంతోషంగా ఉన్నారు .
ఆ సంతోషంలో మీ అనుమతి తీసుకోకుండా ఒక నిర్ణయం తీసేసుకున్నాను అంకుల్ - sorry ...... అనిచెప్పి సర్ప్రైజ్ ట్రిప్ , నెక్స్ట్ వీక్ హాలిడేస్ గురించి వివరించాను .
అంకుల్ : వా ......... ట్ , ఫారిన్ ట్రిప్ ........ ? అంటూ కొన్నిక్షణాల మౌనం .......
అంకుల్ అంకుల్ ......... , sorry sorry అంకుల్ ప్లీజ్ ప్లీజ్ అంకుల్ నెక్స్ట్ టైం ఈ తప్పు చెయ్యను - మీ అనుమతి తీసుకున్న తరువాతనే ప్లాన్ చేస్తాను - ప్లీజ్ అంకుల్ ....... అప్పుడే పాస్పోర్ట్స్ రెడీ అయిపోతున్నాయి ....... - విద్యు సిస్టర్ లేకుండా ఒక్కరూ ట్రిప్ కు ఒప్పుకోరు - అంత ఇష్టం విద్యు సిస్టర్ అంటే అందరికీ ..........
అంకుల్ : మహేష్ మహేష్ ....... ప్లీజ్ ప్లీజ్ మా డుమ్మీ తల్లిని తీసుకెళ్లమని మేముకదా బ్రతిమాలాల్సినది - ఒక అన్నయ్యలా అద్భుతమైన ప్రపంచాన్ని చూయించడానికి తీసుకెళుతున్నావు , ఆ అదృష్టం మాది - మేము చేసినా ఏమిచేస్తాము పెళ్లిచేసి పక్కూరి అత్తారింటికి పంపిస్తాము - ప్లీజ్ ప్లీజ్ మహేష్ ....... మా డుమ్మీ విద్యుని తీసుకెళ్లు తీసుకెళతావని తెలుసు తెలుసు - ఈ సంతోషంలో మాటలు రావడంలేదు , నా బంగారుతల్లి ఫారిన్ టూర్ వెళుతోంది యాహూ ...... ఒసేయ్ శ్రీమతీ ...... నీ తల్లి ఎక్కడికి వెళుతోందో తెలుసా ? - తల్లీ నాన్నా ..... మీ ప్రాణమైన అక్కయ్య ఎక్కడికి వెళుతోందో తెలుసా ....... ? అంకుల్ సంతోషం ఇక్కడికి తెలుస్తోంది . మహేష్ ....... మా తల్లి అక్కడ ఉన్నంతవరకూ నీ సొంతం , మా అనుమతి తీసుకోవాల్సిన అవసరమే లేదు - నాతోపాటు విద్యు అమ్మ చెల్లీ తమ్ముడు చాలా చాలా సంతోషిస్తున్నారు .
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అంకుల్ ....... సో హ్యాపీ అంకుల్ ....... , అంకుల్ మరొక రిక్వెస్ట్ ....... డుమ్మీ విద్యు సిస్టర్ తోపాటు విద్యు సిస్టర్ ...... చెల్లి తమ్ముడిని కూడా తీసుకువెళ్లడానికి అనుమతి ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ........
అంకుల్ : వా ....... ట్ ? .
బాబూ మహేష్ ....... నేను విద్యు అమ్మను మాట్లాడుతున్నాను - ఏమిచెప్పావు ...... మీ అంకుల్ సంతోషపు షాక్ లో ఉండిపోయారు .
Hi అంటీ ...... ఎలా ఉన్నారు ? .
అంటీ : చాలా చాలా హ్యాపీ బాబూ ...... నీవల్లనే .......
థాంక్యూ అంటీ ....... , అంకుల్ మీరు ok అంటే పిల్లలిద్దరినీ కూడా మాతోపాటు పిలుచుకునివెళతాము అని అడిగాను .
అంటీ : ఏమిటీ .........
అన్నయ్యా అన్నయ్యా ....... మమ్మీ కూడా స్వీట్ షాక్ లోకి వెళ్ళిపోయింది అని పిల్లల వాయిస్ వినపడింది .
అయితే ఒప్పుకున్నట్లే అన్నమాట ....... , hi చెల్లీ - hi తమ్ముడూ ........
చెల్లి : ఏమిటి అన్నయ్యా .......
మీ డాడీ - మమ్మీ ....... స్వీట్ షాక్ లోనుండి తేరుకున్న తరువాత - వాళ్ళు ok అన్న తరువాత నేను ...... మీతో చెప్పగలను చెల్లీ ....... సో sorry .......
బాబూ మహేష్ ....... ఈ డబల్ ఆనందంలో మాటలు రావడం లేదు .......
Ok అని ఒక్కమాట ఆనండి చాలు .......
అంకుల్ : నీకు ఇబ్బంది లేకపోతే డబల్ ok మహేష్ ....... వరాల మీద వరాలు ఇస్తున్నావు ఇంతకంటే ఆనందం మరొకటి ఏమిటి ఉంటుంది .
థాంక్యూ థాంక్యూ అంకుల్ ....... , విద్యు సిస్టర్ వలన పొందిన ఆనందంతో ( దేవకన్య వలన నాతోపాటు హృదయంలో ఉన్న అమ్మ హ్యాపీ మరియు దేవకన్య అమ్మ ఆప్యాయత ) నేనే ...... తనకు ఋణపడిపోయాను అంకుల్ - అంటీ , ఇబ్బంది కాదు అదృష్టంలా భావిస్తున్నాను , మీరు ok అన్నారు నేనూ డబల్ హ్యాపీ ......... , అంకుల్ ...... చెల్లీ - తమ్ముడికి చెప్పండి .
అంకుల్ : ఆ సంతోషమైన విషయాన్ని నువ్వే చెప్పు మహేష్ ....... ఇదిగో స్పీకర్ ఆన్ చేసాను .
లవ్ టు అంకుల్ ....... చెల్లీ - తమ్ముడూ ....... మాతోపాటు అంటే మీ అక్కయ్యతోపాటు ఫారిన్ టూర్ కు వస్తారా ...... ? , ప్లీజ్ ప్లీజ్ నో అనిమాత్రం చెప్పకండి .......
పిల్లలు : అన్నయ్య - అక్కయ్యతోపాటు ఫారిన్ టూర్ wow .......
అంటీ : బాబూ మహేష్ ....... పిల్లలిద్దరూ కూడా స్వీట్ షాక్ లోకివెళ్లిపోయారు అంటూ నవ్వుతూ చెప్పారు .
సంతోషంతో నవ్వుకున్నాను , చెల్లీ - తమ్ముడూ ........ ట్యూస్డే నుండి సాటర్డే వరకూ కాలేజ్ కు లీవ్ పెట్టాలి , ఈ అన్నయ్య వలన 4 డేస్ క్లాస్సెస్ మిస్ అవ్వబోతున్నారు .
అంకుల్ : మిస్ అయితే అవ్వనీ మహేష్ ...... , వాళ్ళ పెద్దయ్యను కలవబోతున్నారు - కలిసి ఫారిన్ టూర్ కు వెళుతున్నారు మాకు అదే ఆనందం .........
అన్నయ్యా ....... టూర్ నుండి వచ్చాక కవర్ చేసేస్తాము అన్నయ్యా ......
Thats my సిస్టర్ - బ్రదర్ ...... , చెల్లీ - తమ్ముడూ ....... ఇది ఒక వీకెండ్ తో ఆగే ట్రిప్ కాదు ........ , అయినా మీ డాడీ పర్మిషన్ ఇచ్చేసారులే ........
చెల్లి : డాడీ ........
అంకుల్ : 6 వీకెండ్స్ బుజ్జితల్లీ ....... , మండే ఇంటికి రావడం 5 డేస్ కాలేజ్ కు వెళ్లడం మళ్లీ వీకెండ్ మీ అన్నయ్య దగ్గరికి వెళ్లడం - ఇలా 6 వీక్స్ - మాకైతే చాలా సంతోషం - ఇక నిర్ణయం మీదే - స్టడీస్ ఎక్సమ్స్ కంటే మీరు మీ అక్కయ్య - అన్నయ్యతోపాటు వెల్లడమే మాకు ఇష్టం ........
పిల్లలు : లవ్ యు డాడీ ....... , మేము వెళుతున్నది డుమ్మీ అక్కయ్య కోసమైతే కాదు అన్నయ్యతోపాటు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న మహి అక్కయ్యను కలవడం కోసం .........​
Next page: Update 37
Previous page: Update 35