Update 38

అంటీ : ఉంచడం కాదు అందరికీ మీరే వడ్డించాలి .
లవ్ టు లవ్ టు అంటీ ....... అంతకంటే అదృష్టమా ........
కృష్ణగాడు : రేయ్ మామా ..... నన్ను వదిలెయ్యి ఆకలి దంచేస్తోంది అంటూ వెళ్లి చెల్లెమ్మ ప్రక్కన కూర్చున్నాడు .
చెల్లెమ్మ తియ్యనికోపంతో వాడి భుజంపై కొరికేసి లవ్ యు అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .

దేవకన్య - దివ్యక్క ...... వడ్డించడానికి లేచారు .
నో నో నో దివ్యక్కా - మహీ ...... మాకూ అదృష్టమివ్వండి కూర్చోండి కూర్చోండి .
దేవకన్య : బిరియానీ వడ్డించడానికి కాదు లేచింది నిన్ను వడ్డించడానికి అంటూ చేతిపై గిల్లేసింది .
స్స్స్ ....... టేబుల్ పై అన్ని లెగ్ పీసస్ ఉన్నాయికదా కోప్పడే బదులు తీసుకుని తినొచ్చుకదా మహీ .........
దేవకన్య : అన్ని ఉండగా నేను తింటున్నదే లాక్కోవాలా మహేష్ ...... అంటూ మళ్లీ గిల్లేసింది .
స్స్స్ స్స్స్ ....... దేవకన్య గారి కోపం తగ్గి ఆ తేనెలూరే పెదాలపై అందమైన నవ్వులు పరిమలించడానికి ఏమిచెయ్యాలో ఆర్డర్ వెయ్యండి -
దేవకన్య : అందరివైపు చూసి తియ్యదనంతో నవ్వుకుని , ప్రాణానికి ప్రాణం అన్నట్లు లెగ్ పీస్ కు లెగ్ పీస్ .......
అందరూ : yes yes అంతే అంతే .......
అర్థం కాలేదు మహీ ........
చెల్లెమ్మ : అన్నయ్యా ....... మీ మనసులో ఉన్నదే - మీకళ్ళు చూస్తుంటేనే మీకర్థమైపోయిందని తెలిసిపోతోంది .
మహీ ........
దేవకన్య : అంతేమరి , నేను తింటున్నది లాక్కునివెళ్ళావు కాబట్టి దేవుడు తింటుండగా నేనూ లాక్కుని .......
లాక్కుని ....... ? .
దేవకన్య : లాక్కుని నువ్వెలా తిన్నావో నేనూ అలానే తింటాను .
ఏమిటీ ........ అంటూ స్వీట్ షాక్ లో వెనక్కు పడేంతలో ....... కృష్ణగాడు వచ్చి పట్టుకున్నాడు .
కృష్ణగాడు : కృష్ణా ...... చూశావా ? .
చెల్లెమ్మ : లవ్ యు మై హీరో ....... అంటూ వచ్చి వాడి చేతిని చుట్టేసింది . అన్నయ్యా ....... కమాన్ do it అంటూ కన్నుకొట్టింది .
చెల్లెమ్మా ....... నాకు ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు .
చెల్లెమ్మ : అన్నయ్యా ........
Ok ok అంటూ భయంతో వణుకుతూనే జ్యుసీ లెగ్ పీస్ అందుకుని తినీ తిన్నట్లు కొద్దిగా తిన్నాను .
దేవకన్య : ఊహూ ...... సగం తినాలి .
ధైర్యం చేసి మ్మ్మ్ ..... అంటూ సగం తిన్నాను .
దేవకన్య : నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , డబల్ స్వీట్ షాక్ లో ఉన్న నా చేతిలోనుండి లెగ్ పీస్ లాక్కుని ఇలానే కదా అంటూ ఇష్టంతో తినడం చూసి ఎంత ఆనందం వేసిందో మాటల్లో వర్ణించలేను . హలో సర్ ....... మూవీకి టైం అవుతుంది తొందరగా వడ్డించండి .

యాహూ యాహూ ....... అంటూ చెల్లెమ్మ బుగ్గలు అందుకుని నుదుటిపై ముద్దుపెట్టి , ఏకంగా డైనింగ్ టేబుల్ మీదకు ఎక్కి బిరియానీ పాత్ర చుట్టూ రౌండ్స్ వేస్తూ డాన్స్ చేసాను - చివరగా టేబుల్ పై మోకాళ్లపై కూర్చుని పాత్రలో రైస్ ఒకప్రక్కకు చేర్చి పీసస్ , మసాలా పైకి తెచ్చి మొదట పిల్లలకు వడ్డించి ఒక్కొక్కరికే అందరికీ వడ్డించాను .
మేము ...... మీకు వడ్డిస్తాము అంటూ చెల్లెమ్మ - దేవకన్య - దివ్యక్క - విద్యు లేచారు ........
అవసరం లేదు నేను ....... నా దేవకన్య ప్లేట్ లో ........
దేవకన్య : వాట్ ....... ? .
లేదు లేదు వడ్డించండి వడ్డించండి ........
( దేవకన్య లోలోపలే ఎంజాయ్ చేస్తూ వడ్డించింది - ఆ రోజు కూడా త్వరలో వస్తుంది మహేష్ ....... ) చూస్తుంటేనే నోరూరిపోతోంది మహేష్ - ఉమ్మా అంటూ నా హృదయం పై ముద్దుపెట్టి అందించి కూర్చుంది .
ఆఅహ్హ్ ....... దేవకన్య వడ్డించిన బిరియానీ - దేవకన్య అందించిన ముద్దు అని తలుచుకుంటూ దేవత ఎదురుగా సోఫాలో కూర్చున్నాను .

అంతే అందరూ మ్మ్మ్ మ్మ్మ్ ..... బిర్యానీ సూపర్ అమృతం అంటూ లేచివచ్చిమరీ నా బుగ్గలపై ముద్దులుపెట్టివెళ్లి తినడం చూసి చాలా చాలా ఆనందం వేసింది . దేవకన్య అయితే ఏకంగా ప్లేట్ తీసుకునివచ్చి ప్రక్కనే సోఫాలో కూర్చుంది - నిజంగా చెబుతున్నాము బిరియానీ అదిరిపోయింది - ఈ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది మహేష్ .......
ప్చ్ ....... పొగడ్త మాత్రమేనా ....... ? .
దేవకన్య : నీ ప్రాణమైన వాళ్లకోసం ఇంత ఇష్టంతో అమృతం లాంటి బిరియానీ చేసావు - ముద్దుపెట్టడంలో తప్పేలేదు అంటూ చేతిని అందుకుని ముద్దుపెట్టింది .
( స్వీట్ షాక్ లో ఉన్న నా చేతి మెతుకులను అందుకుని తిని ఆనందించింది ) . నా భుజంపై గిల్లేసి తిను అంటూ నవ్వుతూనే ఉండటం చూసి మురిసిపోతూ తిన్నాను - అందరూ సూపర్ సూపర్ అంటూనే మళ్లీ మళ్లీ వడ్డించుకుని మొత్తం ఖాళీ చేసేసారు .

సిస్టర్స్ - చెల్లెమ్మా - దివ్యక్క - మహీ - అంటీ ...... ఏంటి అలా కూర్చుండిపోతున్నారు కమాన్ కమాన్ 15 మినిట్స్ లో హాస్టల్ మేట్స్ ఇక్కడకు వచ్చేస్తున్నారు .
దేవకన్య : తప్పంతా నీదే మహేష్ .......
అవును అవును అంటూ అందరూ జతకలిశారు .
నాదా ...... నేనేమీ చేసాను మహీ ? .
దేవకన్య : మొత్తం నీదే కాదు సగభాగం అమ్మదికూడా ...... , ఇంత టేస్టీ గా ఎవరు వండమన్నారు ? , మధ్యాహ్నం ఫుల్ ఇప్పుడు డబల్ ఫుల్ ...... కదలడం కూడా మావల్లకాదు .
శభాష్ రా మహేష్ అంటూ పొగుడుకుని హృదయంపై ముద్దులవర్షం కురిపించి మురిసిపోయాను . అయినా తప్పదు తప్పదు మహీ - సిస్టర్స్ ...... లేవండి లేవండి , మూవీ ఐడియా మనదే కదా ........ ఆశతో వస్తున్న వారిని నిరాశపరచడం .......
అవునవును అంటూ పెదాలపై చిరునవ్వులతో లేచి , నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టివెళ్లి తొందరగానే రెడీ అయ్యివచ్చారు - అంతలోపు మేమూ రెడీ అయ్యి అందరితోకలిసి బయటకు వచ్చామోలేదో బస్సెస్ వచ్చి ఆగాయి .

బస్సెస్ లోనుండే చూసి అన్నయ్యా - మహేష్ - అక్కయ్యలూ - ఫ్రెండ్స్ ....... అంటూ కేకలువేస్తున్నారు .
దేవకన్య : విద్యు సిస్టర్ తోపాటు పరుగునవెళ్లి నో నో నో ...... కిందకుమాత్రం దిగకండి - మీరు దిగబోయేది మాకోసమైతే కాదు మీ అన్నయ్య - మహేష్ కోసమని మాకు తెలుసు , మీరందరూ దిగి మీరు ..... మీ అన్నయ్యకు - మీ అన్నయ్య ...... మీపై ప్రేమ కురిపించడానికి కనీసం గంట అయినా కావాలి , అంతలోపు అక్కడ మూవీ స్టార్ట్ అయిపోతుంది . మీ అన్నయ్య ...... మీ బస్సులోకే వస్తారు అప్పుడు మీ ఇష్టం అంటూ మధ్య బస్సు ఎక్కారు .
మహి అక్కయ్యా ...... అన్నయ్యను మన బస్సులోకే పిలుచుకునివస్తాను లేకపోతే ముందూ వెనుకా వాళ్ళు లాక్కుని వెళ్ళిపోతారు అంటూ మహి - విద్యు బుగ్గలపై ముద్దులుపెట్టి , అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ ఇద్దరు చెల్లెళ్లు పరుగునవచ్చి రెండు చేతులనూ చుట్టేశారు - యాహూ ...... మేమే ఫస్ట్ వెళ్ళండి వెళ్ళండి అంటూ ముందూ వెనుకా బస్సెస్ నుండి వచ్చిన హాస్టల్ సిస్టర్స్ ను పంపించేశారు - హమ్మయ్యా ...... సెకెండ్స్ లో మా అన్నయ్య మిస్ అయిపోయేవారు .
దివ్యక్క : అన్నయ్యా ...... ఇంతమంది చెల్లెళ్లు - ఫ్రెండ్స్ ...... ప్రేమను పొందడం అంటే మామూలు విషయం కాదు , దేవుడికే సాధ్యం .
చెల్లెమ్మ : అన్నయ్య దేవుడే కదా దివ్యక్కా ......
హాస్టల్ సిస్టర్స్ : అవును అన్నయ్య దేవుడే .......
చెల్లెళ్ళూ ....... ఇప్పుడు మీరుకూడానా ? , సరిపోయింది . కానీ మీ ప్రేమకు అమ్మ చాలా చాలా హ్యాపీ - ఇక్కడ ఎంత హాయిగా ఉందో వర్ణించలేను . చెల్లెమ్మా - దివ్యక్కా ....... మీమీ హీరోలతో ముందూ వెనుకా బస్సెస్ లో ఎక్కి హాస్టల్ సిస్టర్స్ తోపాటు తోడుగా రండి . ఇంతకూ అంటీ - అంకుల్ ఎక్కడ ? .
దివ్యక్క : కారులో రొమాన్స్ చేస్తూ వేస్తారేమో అన్నయ్యా - మనం పిలుస్తామేమోనని ఎప్పుడో కారులో కూర్చున్నారు .
చెల్లెమ్మ సిగ్గుపడుతూ కృష్ణగాడిని చుట్టేసి వెనుక బస్సుల్లోకి చేరింది - దివ్యక్క ..... బావగారితోపాటు ముందు బస్సు ఎక్కింది .
చెల్లెళ్ళూ - పిల్లలూ ....... ఇక మిగిలినది మనమే పదండి అంటూ మధ్య బస్సు ఎక్కాము .
అన్నయ్యా అన్నయ్యా ....... అంటూ కూర్చున్నవాళ్ళంతా లేచివస్తున్నారు .
దేవకన్య : సరిపోయింది , డ్రైవర్ అన్నా ....... పోనివ్వండి పోనివ్వండి , చూశావా విద్యు ...... మనల్ని hi hi అక్కయ్యా అంటూ సీట్స్ లోనుండే పలకరించారు వాళ్ళ అన్నయ్య - ఫ్రెండ్ రాగానే ఎగబడి వచ్చేస్తున్నారు .
( విద్యు సిస్టర్ : అధిచూసి మొదట మురిసిపోయేది నువ్వే కదా డార్లింగ్ అంటూ ప్రేమతో చుట్టేశారు .
దేవకన్య : దేవుడే భువిపై వెలిసినట్లుందే విద్యు ....... ఎంత ఆనందిస్తున్నానో మాటల్లో చెప్పలేను ) .
సిస్టర్స్ - ఫ్రెండ్స్ ....... బస్సు కదులుతోందికదా కూర్చోండి కూర్చోండి , నాన్ వెజ్ ఎంజాయ్ చేశారా ...... ? .
హాస్టల్ సిస్టర్స్ : మా అన్నయ్య బెస్ట్ చెఫ్స్ ను నియమించారు - వార్డెన్ దగ్గరుండి చేయిస్తున్నారు - బిరియానీ ఫ్రై కబాబ్ ...... సో సో సో టేస్టీ .......
హాస్టల్ లో కూడానా అంటూ దేవకన్య - విద్యు సిస్టర్ వైపు చూసి సంతోషించాము . ప్చ్ ........
హాస్టల్ సిస్టర్స్ : మా అన్నయ్య టేస్ట్ చెయ్యాలని ఆశపడతారని తెలిసే కబాబ్స్ తీసుకొచ్చాము అంటూ హాట్ బాక్స్ ఓపెన్ చేశారు - అన్నయ్యా ...... మూడు బస్సులలో హాట్ బాక్సస్ ఉన్నాయి - మా అన్నయ్యకు అందించే అదృష్టం మాకు కలిగింది అంటూ మురిసిపోతున్నారు .
థాంక్యూ థాంక్యూ soooo మచ్ చెల్లెళ్ళూ - ఫ్రెండ్స్ ....... అంటూ లెగ్ పీస్ అందుకోగానే దేవకన్యే గుర్తుకువచ్చి దేవకన్య - సిస్టర్స్ వైపు చూసాను . చురచురలాడుతూ నావైపు చూస్తున్నారు - నవ్వుకుని , చెల్లెళ్ళూ - ఫ్రెండ్స్ ...... ముందు మీ ఆక్కయ్యలు - ఫ్రెండ్స్ కు అందివ్వండి లేకపోతే చాలా చాలా డేంజర్ నాకు ........
చెల్లెళ్లు : అర్థమైంది అర్థమైంది మహేష్ - అన్నయ్యా ...... , మహి - విద్యు అక్కయ్య వాళ్ళు అంటే మీకెంత ప్రాణమో మాకు తెలుసుకదా అంటూ హాట్ బాక్సస్ దేవకన్య ముందుకు చేరాయి .
విద్యు సిస్టర్ : ఫుల్ గా తిన్నా కబాబ్స్ చూస్తే నోరూరిపోతోంది అని అందుకునేంతలో ........
చేతిపై దెబ్బవేసింది దేవకన్య ....... , డార్లింగ్ ...... రెండు సంవత్సరాలుగా ఫ్రెండ్స్ మనం - మనకంటే నిన్న మొన్న వచ్చిన హీరోగారి ముందు ఫస్ట్ ఉంచారు - మనకే ఫస్ట్ అందిస్తారు అని హీరోగారు స్వయంగా వండిన బిరియానీ అందరికీ అందిద్దాము అని తీసుకొచ్చి తప్పుచేసాము .
హాస్టల్ సిస్టర్స్ : ఏంటి అక్కయ్యా ...... అన్నయ్య చేతి బిరియానీనా ప్లీజ్ ప్లీజ్ అక్కయ్యా అంటూనే దేవకన్య చేతిలోని బిరియానీ బాక్స్ ను లాక్కుని అందరూ ప్రసాదంలా స్వీకరించి మ్మ్మ్ మ్మ్మ్ ...... the బెస్ట్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తుండటం చూసి ........
దేవకన్య మొదట షాక్ చెందినా ....... ఇంత ప్రేమనా అని నవ్వులు ఆపడం లేదు - హీరోగారూ ...... చేతిలో ఎంతసేపని పెట్టుకుంటారు తినండి తినండి ఈ బాక్స్ మొత్తo మేమూ కుమ్మేస్తాము అంటూ ఒక్కసారిగా సిస్టర్స్ చేతులన్నీ హాట్ బాక్స్ లో చేరేసరికి ఖాళీ అయిపోయింది .
అమ్మో ....... ఈపీస్ ను ముందుగానే తీసుకోవడం మంచిది అయ్యింది - హాసినీ విక్రమ్ ...... మీకు దొరికాయా లేదా ? .
పిల్లలు : లేదు అన్నయ్యా ....... , ఇంట్లోనేమో కదలనంతలా ఫుల్ గా తినేసాము అనిచెప్పి కబాబ్ కనిపించగానే ఎలా కుమ్మేస్తున్నారో చూడండి .
అవునవును నిజమే పిల్లలూ ....... కమాన్ టేస్ట్ ఇట్ అంటూ నా చేతిలోని లెగ్ పీస్ అందించాను .
పిల్లలు : నో నో నో అన్నయ్యా .......
తీసుకోండి తీసుకోండి పిల్లలూ ....... , మీరు తీసుకుంటేనే కదా మీ అక్కయ్య తింటున్న లెగ్ పీస్ షేర్ చేసుకోగలను .
పిల్లలు : Ok ok ok ....... , మీరు అడిగితే అక్కయ్య బెట్టు చేస్తుంది అన్నయ్యా ...... , ఇద్దరూ దేవకన్య దగ్గరికివెళ్లి ఒకేసారి దేవకన్య బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవకన్య : Why this స్వీట్ కిస్సెస్ ....... అంటూ తియ్యదనంతో నవ్వుతూ అడిగింది .
పిల్లలు : ఇందుకు అంటూ దేవకన్య తింటున్న లెగ్ పీస్ ను లాక్కుని అన్నయ్యా అన్నయ్యా అంటూ పరుగునవచ్చి అందించారు .
లవ్ టు లవ్ టు అంటూ అందుకుని , లెగ్ పీస్ ...... ఎంత అదృష్టం చేసుకున్నావో తెలుసా ? - దివినుండి దిగివచ్చిన దేవకన్య టేస్ట్ చేసిందే నిన్ను ........ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... ఎన్ని ముద్దులుపెట్టినా తక్కువేనే ......
హాస్టల్ సిస్టర్స్ : ఇప్పుడు దేవుడు టేస్ట్ చేయబోతున్నారు - ఇంకెంత అదృష్టం చేసుకుందో అని నవ్వుతున్నారు .
దేవకన్య భద్రకాళీలా చూస్తున్నా భయపడకుండా దేవకన్యవైపే చూస్తూ లెగ్ పీస్ కొరికాను - మ్మ్మ్ మ్మ్మ్ ...... డబల్ జూసీ అంటూ మొత్తం తినేసాను .
విద్యు సిస్టర్ : డబల్ జూసీ నా అంటే మా డార్లింగ్ .........
దేవకన్య : స్టాప్ స్టాప్ వే అంటూ ప్రేమతో కొడుతోంది .
బస్సు అంతా నవ్వులతో నిండిపోయింది .

దేవకన్యకు ఫ్లైయింగ్ కిస్ వదిలి , వార్డెన్ ....... హాస్టల్ లో ఇలాంటి టేస్టీ ఫుడ్ అంటే సూపర్ , క్రెడిట్ మొత్తం మీకే ........
వార్డెన్ : క్రెడిట్ నాకే అంటే చుట్టూ నీ సిస్టర్స్ అందరూ కూడా కొట్టేలా ఉన్నారు - ఎవరివల్లనో మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .
అన్నయ్య అన్నయ్య అన్నయ్య మహేష్ మహేష్ ....... అంటూ బస్సు మొత్తం హోరెత్తిపోయింది - మధ్య బస్సులోని నినాదాలు విని విషయం తెలియకపోయినా ముందూ వెనుక బస్సుల్లోని సిస్టర్స్ అందరూ కూడా నినాదాలు చెయ్యడం విని దేవకన్య సూపర్ అంటూ సంతోషంతో సైగలుచెయ్యడం చూసి , ఆఅహ్హ్ ...... అంటూ హృదయంపై చేతినివేసుకుని సీట్లో కూర్చున్నాను . అంతలోనే బస్సెస్ కూడా థియేటర్ ముందు ఆగాయి .

అలారం చప్పుడుకు కళ్ళుతెరిచాను - ఆశ్చర్యం మరియు షాక్ - నా చేతులు ...... దేవకన్య బుగ్గలపై , నా పెదాలు ....... దేవకన్య నుదుటిపై , దేవకన్య చెయ్యి ...... నా పై ........ - ఇక తెలిసినదే కదా దేవకన్య కళ్ళు అగ్నిగోళాలుగా నన్నే చూస్తున్నాయి - Wow ....... డ్రీమ్ ఎంత బాగుంది .
డ్రీమ్ కాదు మహేష్ సర్ ...... అంటూ సంతోషంతో నవ్వుకుంటున్నారు .
అంతే సడెన్ గా లేచి కూర్చుని చేతులుకట్టుకుని తలదించుకున్నాను .
ఇప్పుడేమంటారు అంటీ ....... రాత్రి దూరంగానే బుద్ధిమంతుడిలా పడుకున్నాడు - ఉదయం లేచేసరికి ఇలా .......
సిస్టర్స్ : జాగ్రత్త మహి డార్లింగ్ ఆవేశం ప్రదర్శిస్తే తరువాత పనిష్మెంట్స్ ఉంటాయి .
దేవకన్య : నా ప్రియమైన డార్లింగ్స్ అందరినీ నీవైపుకు తిప్పేసుకున్నావు లేకపోతే ఉండేది తమరికి ........
విద్యు సిస్టర్ : మహీ డార్లింగ్ ...... నీ లవర్ ఎక్కడికీ వెళ్ళడు - Its time to సన్ రైజ్ ........
దేవకన్య : కమింగ్ కమింగ్ ...... , లవ్లీ గుడ్ మార్నింగ్ అంటీ అంటూ నా హృదయంపై ముద్దుపెట్టి , సిస్టర్స్ తోపాటు చిరునవ్వులు చిందిస్తూ వడివడిగా వెళ్లిపోయారు .

హమ్మయ్యా థాంక్ సన్ రైజ్ ....... , రాత్రి డిస్టన్స్ లోనే పడుకున్నాను కదా రోజూలానే బెడ్స్ ఒక్కటిగా ఎలా కలిసాయి అంటూ బుర్ర గోక్కున్నాను , తరువాత ఆలోచిద్దాము ముందు దేవకన్యను కూల్ చెయ్యాలి ఎలా ...... ? - ఐడియా అంటూ కిందకు పరుగుతీసాను , మెయిన్ డోర్ తెరిచి మిల్క్ ప్యాకెట్స్ అందుకుని వంట గదిలోకివెళ్లి కాఫీ - టీ - బూస్ట్ రెడీ చేసాను , మూడు ఫ్లాస్క్ లలోకి పోసుకుని కప్స్ - ట్రే అందుకున్నాను , అప్పుడే లేచి వంట గదిలోకి వస్తున్న పెద్దమ్మకు గుడ్ మార్నింగ్ & థాంక్స్ చెప్పి పైకి బ్రిడ్జి దగ్గరికివెళ్ళాను , అప్పటికే చేరిన చెల్లెమ్మ - దివ్యక్క బుగ్గలపై గుడ్ మార్నింగ్ కిస్సెస్ పెట్టి దేవకన్య ముందు నిలబడ్డాను .
లవ్ యు లవ్ యు అన్నయ్యా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ చెల్లెమ్మ - దివ్యక్క ...... మూడింటినీ అందుకుని కప్స్ లోకి పోసి అందరికీ అందించారు .
సిస్టర్స్ : మహీ డార్లింగ్ పనిష్మెంట్ .......
దేవకన్య : నో నో నో మీ మహేష్ సర్ ను కొట్టలేదు కదా .......
సిస్టర్స్ : అంతకుముందే కొరికావు కదా కొరికావు కదా .......
దేవకన్య : చూసేసారన్నమాట ........
సిస్టర్స్ : ఏమిచెయ్యాలో తెలుసుకదా ........
దేవకన్య : తెలుసు తెలుసు మీ మహేష్ సర్ ను హత్తుకుని టీ షేర్ చేసుకుంటూ సన్ రైజ్ ఎంజాయ్ చెయ్యాలి .
లవ్ యు మహీ - అక్కయ్యా ...... అంటూ దివ్యక్క - చెల్లెమ్మ , దేవకన్య బుగ్గలపై ముద్దులుపెట్టి వాళ్ళ హీరోల దగ్గరికివెళ్లారు .
సిస్టర్స్ : కానివ్వు మరి మహి డార్లింగ్ ....... , నవ్వుతూ .......
యాహూ యాహూ ....... లవ్ యు సన్ రైజ్ - లవ్ యు sea ....... అని కేకలువేస్తూనే దేవకన్యవైపు ప్రేమతో చూస్తున్నాను .
అందమైన నవ్వులతో ఒకచేతితో నన్ను చుట్టేసి , టీ సిప్ చేసి మ్మ్మ్ ..... టేస్టీ టీ అంటూ అందించింది .
ఆఅహ్హ్ ....... అంటూ తియ్యదనంతో జలదరిస్తూ థాంక్యూ & గుడ్ మార్నింగ్ మహీ అంటూ అందుకుని సిప్ చేసాను - మ్మ్మ్ ...... డబల్ టేస్టీ ప్రౌడ్ ఆఫ్ యు రా మహేష్ ....... టీ బాగా చేసావు - ప్రియమైన ప్రాణమైన అందరికోసం కదా ..... ఎలాచేసినా సూపర్ అయిపోతుంది .
దేవకన్య : కప్ అందుకుంటూనే ...... Wow బ్యూటిఫుల్ ...... , మహేష్ ....... ఎందుకో తెలియదు రోజురోజుకూ మరింత బ్యూటిఫుల్ గా అనిపిస్తోంది - లవ్ యు మ ...... లవ్ యు అంటీ అంటూ నా హృదయంపై ముద్దుపెట్టి , జలదరిస్తున్న నన్ను గట్టిగా పట్టుకుని పూర్తిగా సూర్యుడు ఉదయించేంతవరకూ కనులారా తిలకించి , సంతోషం పట్టనట్లు గట్టిగా కౌగిలించుకుని వదిలి డార్లింగ్స్ డార్లింగ్స్ అంటూ హైఫై ఎంజాయ్ చేస్తున్నారు .

ఎంతసేపటికీ కదలకపోవడంతో అన్నయ్యా అన్నయ్యా మహేష్ సర్ అంటూ భుజాలు కదిల్చారు .
యాహూ యాహూ ....... థాంక్యూ థాంక్యూ మహీ for స్వీటెస్ట్ హగ్ ...... ఆఅహ్హ్ ఎంత హాయిగా ఉందో చెల్లెమ్మా - దివ్యక్కా అంటూ ఇద్దరినీ ఒకేసారి హత్తుకుని నుదుటిపై ముద్దులుపెట్టాను .
దేవకన్య : హలో హలో .......
తెలుసు తెలుసు మహీ ...... లవ్లీ సన్ రైజ్ - టీ తీసుకొచ్చినందుకు అంటారు అంతేకదా , అపద్దo చెబితే మీ అందమేమైనా కరిగిపోతుందా ....... ? .
అందరితోపాటు దేవకన్య నవ్వులు ఆగడం లేదు .
ఆఅహ్హ్ ....... చాలు చాలు ఉదయం ఉదయమే సో మచ్ హ్యాపీనెస్ ...... , ఇలాగే వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చెయ్యండి అంతలోపు న్యూ చెఫ్స్ - పెద్దమ్మతో కలిసి టిఫిన్ రెడీ చేసేస్తాను .
దేవకన్యతోపాటు అందరూ : నో నో నో మహేష్ - అన్నయ్యా ....... నిన్న ఏదో సరదాగా అలా జరిగిపోయింది , దేవుడిని ఒక్కరినే కష్టపెట్టబోము .......
సిస్టర్స్ - చెల్లెమ్మా - దివ్యక్కా - మహీ ...... ఈరోజు నుండీ స్ట్రిక్ట్ గా హాస్టల్ టైం టేబుల్ ఫాలో అవ్వాల్సిందే దివ్యక్కా మీరుకూడా ...... , ఉదయం లేవగానే స్టడీస్ - సన్ రైజ్ - బాత్ - టిఫిన్ - కాలేజ్ - లంచ్ - కాలేజ్ - సాయంత్రం రిఫ్రెష్మెంట్స్ or అలా సరదాగా బయటకు - డిన్నర్ - స్టడీస్ & స్లీప్ ........ వీకెండ్స్ ఎంజాయ్మెంట్ , ఈ విషయంలో ఎవ్వరు ఏమిచెప్పినా విననంటే వినను - వార్డెన్ లా స్ట్రిక్ట్ గా ఉంటాను.
చెల్లెమ్మ : మరి మీరెప్పుడు చదువుకుంటారు అన్నయ్యా .......
చెల్లెమ్మ - దివ్యక్క - దేవకన్య - వీడు - బావగారు ఉండగా మరియు ఫుల్ ప్రాఫిట్స్ తో నడుస్తున్న మన " MIMD " కంపెనీ ఇక నేను చదువుకోవాలా చెప్పు చెల్లీ ......
నిన్ను - సిస్టర్స్ - వీడిని - దేవకన్యను ...... పెద్ద పెద్ద పొజిషన్స్ లో చూడాలి , దివ్యక్క - బావగారిని బెస్ట్ డాక్టర్స్ గా చూడాలి అంతే ఇదే నా కోరిక ...... అంటూ చెల్లెమ్మ - దివ్యక్కను చెరొకవైపు హత్తుకుని నుదుటిపై ముద్దులుపెట్టాను .
సిస్టర్స్ ....... నో ఎమోషన్ , ఎమోషన్ తో హత్తుకుని నన్ను ఆకాశానికి ఎత్తకండి .
అలానే చేస్తాము థాంక్యూ థాంక్యూ మహేష్ సర్ అంటూ ముగ్గురినీ చుట్టేశారు .
దేవకన్య : టచ్ చేసావు మహేష్ అంటూ హృదయంపై చేతినివేసుకుంది .
మహీ ...... నువ్వుకూడా కౌగిలించుకోవచ్చుకదా .......
దేవకన్య : కౌగిలించుకివడానికి ప్లేస్ ఎక్కడ ఉంది నువ్వే చెప్పు ....... అంటూ సంతోషంతో నవ్వుతోంది .
చాలు ఆ మాట చాలు ...... యాహూ యాహూ ...... , Ok ok సిస్టర్స్ ...... మీ మీ రూమ్ కు వెళ్లి ఫ్రెష్ అయ్యి కాలేజ్ బ్యాగ్స్ తో కిందకువచ్చెయ్యండి అని పంపించాను .
దేవకన్య : టచ్ చేసావు మహేష్ అటూనే హత్తుకుని వదిలి , డార్లింగ్స్ డార్లింగ్స్ అంటూ వెళ్ళింది .
ఆఅహ్హ్ ...... అంటూ హృదయంపై చేతినివేసుకుని వెనక్కు పడేంతలో కృష్ణ - బావగారు పట్టుకున్నారు . లవ్ యు రా మామా - బావా ...... అంటూ అమాంతం పైకెత్తి కిందకు దించారు .
లవ్ యు ...... టైం తక్కువగా ఉంది గాట్ టు గో అంటూ కిందకువెళ్లాను , అప్పటికే హాస్టల్ మెనూ ప్రకారం టిఫిన్ ప్రిపేర్ చేసేస్తున్నారు పెద్దమ్మ - లేడీ చెఫ్స్ ....... , పెద్దమ్మా పెద్దమ్మా .......
పెద్దమ్మ : ఇప్పుడే బాబూ అంటూ నవ్వుకుని , అప్పటివరకూ ఏమిచేసారో వివరించి , చట్నీ - సాంబార్ చేస్తూనే నేర్పించి ఇడ్లీలు నాతోనే వేయించారు . బాబూ మహేష్ ....... 15 నిమిషాలు పెడితే ఆవిరికి ఇడ్లీలు అయిపోతాయి .
చాలా ఈజీ థాంక్యూ థాంక్యూ పెద్దమ్మా - చెఫ్స్ ......
పెద్దమ్మ : బాబూ ....... నేర్చుకున్నావు కదా ఇకవెళ్లి రెడీ అవ్వు కాలేజ్ టైం అవుతోంది .
అలాగే పెద్దమ్మా ....... , అంతలోనే ఒక్కొక్కరుగా రెడీ అయ్యి బ్యాగ్స్ తోపాటు కిందకువస్తున్నారు - సిస్టర్స్ ...... మీరు కానివ్వండి వచ్చి జాయిన్ అవుతాను .
దేవకన్య : తమరు వచ్చాకనే , what do you say డార్లింగ్స్ .......
సిస్టర్స్ : అంతే .......
చెల్లెమ్మ - దివ్యక్క : అంతేకదా మరి .......
15 మినిట్స్ - 15 మినిట్స్ లో వచ్చేస్తాను అని పరుగున రూంలోకివెళ్లి అర గంటలో ఫ్రెష్ అయ్యివచ్చి అందరితోపాటు జాయిన్ అయ్యాను .
చెల్లెమ్మ : మొత్తం ప్రిపరేషన్ మీదేనా అన్నయ్యా ...... ? .
లేదు చెల్లీ ...... ఇడ్లీ పిండిని నిన్ననే రెడీ చేసేసారు పెద్దమ్మ , జస్ట్ ఫిల్ చేసాను అంతే ........
పెద్దమ్మ - చెఫ్స్ వడ్డించడంతో తినేసి బస్సులో కాలేజ్ చేరుకున్నాము .

మేము బస్సు దిగడం క్యాంపస్ బెల్ మ్రోగడం ఓకేసారిజరిగాయి , హమ్మయ్యా ....... సరైన సమయానికే వచ్చాము .
దేవకన్య : మేమెప్పుడూ అర గంట ముందుగావచ్చి పార్క్ లో సరదాగా గడిపేవాళ్ళము - నీవలన .......
విద్యు సిస్టర్ : ఏంటి డార్లింగ్ ...... మళ్లీ చెప్పమ్మా ...... ? .
దేవకన్య : అదేలే డార్లింగ్ , మీరు ఎంజాయ్ చేసేవాళ్ళు - నేను చదువుకునేదానిని , ఏదోఒకటి చూసేవాళ్ళము కదా ........ , మీ మహేష్ సర్ ను ఒక్కమాట అంటే చాలు రోషం వచ్చేస్తుంది మీకు .......
నవ్వుకుని , దేవకన్య కోపం చూసి Sorry sorry మహీ ........ , ఈ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకో రేపటినుండి ముందుగానే వచ్చేలా టైం టేబుల్ మారుస్తాను .
దేవకన్య : టైం టేబుల్ బాగా సెట్ చేసుకున్నావు అంటూ పెదాలపై చిరునవ్వులు - దివ్యా ...... మాతోపాటు వచ్చేసారు .
దివ్యక్క : అలవాటులో మా మహి - సిస్టర్స్ తోపాటు వచ్చేసాము . అడుగులు మీవైపే పడుతున్నాయిమరి , మనమంతా ఓకేకాలేజ్ అయ్యుంటే బాగుండేది ప్చ్ ........
దివ్యా - దివ్యక్కా ........ అంటూ అందరూ ప్రాణంలా దివ్యక్కను చుట్టేశారు . లవ్ యు లవ్ యు లవ్ యు ....... లే వినిపిస్తున్నాయి .
దివ్యక్క : లంచ్ టైం కు ఇక్కడికే వచ్చేస్తాను .
దేవకన్య - చెల్లెమ్మ : లవ్ టు లవ్ టు అంటూ ఇద్దరూ ఒకేసారి దివ్యక్క బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దివ్యక్క : అన్నయ్యా ...... నా డార్లింగ్స్ జాగ్రత్త - మిమ్మల్ని అమ్మను చూడకుండా 3 - 4 hours ఉండాలి ప్చ్ ప్చ్ ...... గోయింగ్ టు మిస్ యు అమ్మా అంటూ నా హృదయంపై ముద్దుపెట్టి , బావగారి కారులో బయలుదేరారు .
మిస్ యు టూ దివ్యా - అక్కయ్యా - డార్లింగ్ .......

చెల్లెమ్మ : అదిగో క్లాస్ బెల్ కూడా మ్రోగింది - అన్నయ్యా ...... అక్కయ్యతోపాటే కదా .... ? .
ఆఅహ్హ్ ...... ఆటే చెల్లెమ్మా ...... , మీ అక్కయ్యను చూడకుండా ఒక్కటంటే ఒక్కనిమిషం కూడా ఉండగలనా చెప్పు ....... , క్లాస్సెస్ వద్దు కాలేజ్ వద్దు దేవకన్యనే కావాలి .
దేవకన్య : ( అంతులేని ఆనందంతో పరవశించిపోతోంది ) మరి exams వస్తే ......
వస్తే టాపిక్స్ explain చెయ్యడానికి నీ బుజ్జిఅన్నయ్య - చెల్లెమ్మ - సిస్టర్స్ - దేవకన్య ఉండనే ఉన్నారుకదా ....... , ఒకరోజు ముందు బుద్ధిమంతుడిలా అంతమంది గురువుల ముందు స్టూడెంట్ లా కూర్చుని శ్రద్ధగా విని రాసేస్తాను . 10th ఇంటర్ లోలా స్టేట్ ర్యాంక్ లు టాప్ ర్యాంక్ లు అవసరమేలేదు జస్ట్ పాస్ అయితే చాలు .
దేవకన్య : అయితే నేనుకూ .......
నో నో నో ....... మీరు కూడా నాలా అయితే నన్ను ఎవరు పోసిస్తారు మహీ ...... ? .
దేవకన్య : అబ్బో ....... , మురిసిపోతూనే విద్యు సిస్టర్ చేతిని చుట్టేసి బిల్డింగ్ వైపు నడిచారు .
చెల్లెమ్మ : కృష్ణా ...... రా అంటూ అందరికంటే ముందుగా లోపలికి లాక్కునివెళ్లింది .

దేవకన్య - సిస్టర్స్ వెనుకే కుక్కలా వాళ్ళ క్లాస్ దగ్గరికి చేరుకున్నాను . సీనియర్ బాయ్స్ అందరూ క్లాస్ బయటే మాట్లాడుకుంటూ నన్ను చూసి hi hi మహేష్ మహేష్ అంటూ పలకరించి హైఫై కొట్టారు .
బ్రదర్స్ క్లాస్ టైం అయ్యిందికదా - ఏంటి ఇంకా బయటే ఉన్నారు ? .
సీనియర్స్ : ప్రొఫెసర్ 15 మినిట్స్ ఆలస్యంగా వస్తారని ప్యూన్ చెప్పివెళ్లాడు .

దేవకన్య - సిస్టర్స్ ....... లోపలికివెళ్లి సంతోషంతో కేకలువేస్తున్నారు .
ఏమిటబ్బా అంత సంతోషం అని లోపలికివెళ్ళిచూస్తే చెల్లెమ్మ - కృష్ణగాడు , చెల్లెమ్మ - దేవకన్య సిస్టర్స్ కౌగిలించుకుని ఆనందిస్తున్నారు .
చెల్లెమ్మ : అన్నయ్యా ........
అందరి ఆనందాలను చూస్తూ దగ్గరికివెళ్ళాను .
అన్నయ్యా అంటూ ఒకచేతితో నన్ను మరొకచేతితో దేవకన్యను చుట్టేసి ముద్దులుపెట్టింది .
లవ్ యు చెల్లీ ....... , రేయ్ మామా క్లాస్ లేదా ..... ? .
కృష్ణగాడు : నీ ముద్దుల చెల్లెమ్మకు లవర్ తోపాటు అన్నయ్య - ఆక్కయ్యలు కూడా కావాలట , క్లాస్ కు కూడా వెళ్లకుండా నేరుగా ఇక్కడికే లాక్కునివచ్చేసింది .
చెల్లెమ్మ : మా అన్నయ్య ఉండగా నాకు కూడా ర్యాంక్స్ అవసరం లేదు - ఫ్రెండ్ ఉండగా మీ ఫ్రెండ్ కు కూడా రాంక్స్ అవసరం లేదు . మీరేమి చెప్పినా వినను అన్నయ్యా ...... మీరు , మీ దేవకన్యను చూడకుండా ఎలా ఉండలేరో - నేను ..... నా బేబీ ని మాఅన్నయ్యను అక్కయ్యలను చూడకుండా ఉండలేను . పాపం దివ్యక్క మనల్ని వదిలి వెళ్లారు అంటే కేవలం మీకోసం - మీ కోరిక తీర్చడం కోసం .......
చెల్లెమ్మా .......
చెల్లెమ్మ : చెల్లెమ్మా లేదు ఏమీలేదు - ఇన్నేళ్లు అన్నయ్యకోసం ఎంత బాధపడ్డాను - ఇక ఒక్కక్షణం కూడా ...... అదిగో ప్రొఫెసర్ వచ్చారు .
అందరూలోపలికివచ్చి ప్రొఫెసర్ కు గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చున్నారు . చెల్లితోపాటు కూర్చోక తప్పలేదు - చెల్లి సంతోషాలను చూసి లవ్ యు చెల్లీ అంటూ నుదుటిపైప్రాణమైన ముద్దుపెట్టాను .
దేవకన్య : చెల్లీ ....... దేవుడు ఒప్పుకున్నట్లే అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
చెల్లెమ్మ : సౌండ్ చెయ్యకుండా సంతోషించి , అక్కయ్యా ...... మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బెచెయ్యను కేవలం ముద్దులుమాత్రమే పెడతాను - మీరు కాంసెంట్రేషన్ మొత్తం క్లాస్ పై ఉంచండి అంటూ దేవకన్య బుగ్గపైముద్దుపెట్టింది .
దేవకన్య : లవ్ యు చెల్లీ ......
నేనుకూడా మీ అక్కయ్యను డిస్టర్బ్ చెయ్యను - బోర్డ్ వైపే చూస్తాను .
దేవకన్య : ప్చ్ ......
చెల్లెమ్మ : నో నో నో అన్నయ్యా ...... , అక్కయ్య బోర్డ్ వైపు - మీరు అక్కయ్యవైపు , అయినా అక్కయ్యను చూడకుండా ఉండలేరులే , నేను ...... మీ మధ్యలోనుండి ప్రక్కకు .......
నో నో చెల్లీ - చెల్లీ ...... అంటూ ఇద్దరమూ పట్టుకున్నాము .
చెల్లెమ్మ : లవ్ యు అక్కయ్యా - లవ్ యు అన్నయ్యా ...... అంటూ సౌండ్ వచ్చేలా మా బుగ్గలపై ముద్దులుపెట్టింది .
సీనియర్స్ అందరితోపాటు ప్రొఫెసర్ కూడా వెనక్కుతిరిగిచూస్తున్నారు .
మేము కళ్ళతో సైగలుచేసుకుని అందరితోపాటు మేమూ వెనక్కుచూసాము .
ఏవో సౌండ్స్ అనుకుని ప్రొఫెసర్ క్లాస్ క్యాంటీన్యూ చేశారు .
దేవకన్య - చెల్లెమ్మతోపాటు నవ్వుకుని , టేబుల్ పై మోచేతిని ఉంచి దేవకన్యవైపుకు తిరిగి దేవకన్యనే చూస్తున్నాను .
చెల్లెమ్మ : ఎంజాయ్ అన్నయ్యా ...... అంటూ చేతితో బుగ్గపై ముద్దుపెట్టింది .

దేవకన్య పెదాలపై చిరునవ్వులు ఆగడం లేదు .
చెల్లెమ్మా ...... చూశావా ? , ఎప్పుడూ కోప్పడే మీ అక్కయ్య ఇప్పుడుమాత్రo నవ్వుతోంది .
దేవకన్య : ఇక్కడ దెబ్బలువేస్తే క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అందుకే కంట్రోల్ చేసుకుంటున్నాను అనిచెప్పు చెల్లీ ........
అయితే క్లాస్సెస్ మొత్తం హ్యాపీగా దేవకన్య దర్శనం చేసుకోవచ్చు అన్నమాట ......
దేవకన్య : ఇప్పుడెవరైనా అడ్డు చెప్పారా ..... ? , అడ్డుచెబితే మాత్రం ఆపుతావా ..... ? , మాట్లాడకుండా చూసుకో ........
సైలెంట్ సైలెంట్ అంటూ నోటికి తాళం వేసి దేవకన్యవైపే చూస్తున్నాను .

వెనుక నుండి కృష్ణగాడు ...... చెల్లెమ్మ వీపుపై గోకుతున్నాడు వెనుకకురమ్మని ......
చెల్లెమ్మ : లవ్ టు లవ్ టు అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి , ప్రొఫెసర్ బోర్డ్ వైపుకు తిరుగగానే పైకిలేచి వెనక్కుచెరి కృష్ణగాడి చేతిని చుట్టేసింది , sorry లవ్ యు రా ..... ఇక నీ ఇష్టం ఏమైనా చేసుకో , ముందు అన్నయ్య అక్కయ్యలూ - ప్రక్కనే నా బేబీ ....... లవ్ యు రా అంటూ చేతిపై ముద్దుపెట్టింది .
కృష్ణగాడు : లవ్ యు టూ ఏంజెల్ ........

దేవకన్య : సీరియస్ క్లాస్ లో ప్రొఫెసర్ టీచ్ చూస్తుండగానే బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ ముందూవెనుక రొమాన్స్ చేసేస్తున్నారు .
రొమాన్స్ - అంతటి అదృష్టం ఎక్కడ మహీ ....... , రొమాన్స్ అంటే ఏమిటో ఒకసారి వెనుకకు చూడు ......
దేవకన్య ఓర కంటితో చూసి సిగ్గుతో నవ్వుకుని , నా చెంపపై సున్నితంగా గిల్లేసింది.
Yes yes this is called రొమాన్స్ - కమాన్ కమాన్ మహీ ....... కొట్టు గిళ్లు రక్కి కొరికేయ్యి .......
దేవకన్య తియ్యదనంతో నవ్వుతూనే పాయింట్స్ నోట్ చేసుకుంటోంది .
ముందు కూర్చున్న సిస్టర్స్ ....... వెనక్కు తిరిగితిరిగిచూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఆనందిస్తున్నారు .

అలా అలా చూస్తుండగానే రెండు పీరియడ్స్ పూర్తయ్యాయి - ఇంటర్వెల్ బెల్ వినిపించడం లెక్చరర్ బయటకువెల్లగానే .......
మహేష్ అయిపోయావు అంటూ బుక్ తో దెబ్బల వర్షం కురిపించింది దేవకన్య ......
చెల్లెమ్మ - కృష్ణగాడు ...... కమాన్ కమాన్ అంటూ ప్రోత్సహిస్తున్నారు .
మహీ డార్లింగ్ ....... దేవుడినే కొడతావా అంటూ సిస్టర్స్ ...... బుక్స్ తో వెనక్కు వచ్చేసరికి సైలెంట్ అయిపోయి చదువుతున్నట్లు నటిస్తోంది .
ఉమ్మా ...... లవ్ యు మహీ అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను .
దేవకన్య : నవ్వుతూనే కోపంతో చూస్తూ ....... , కొద్దిగానైనా బోర్ కొట్టదా - రెండు గంటలపాటు కన్నార్పకుండా చూస్తూనే ఉన్నావు .
రెండు గంటలు కాదు మహీ ...... , నా - అమ్మ ప్రియాతిప్రియమైన దేవకన్యను 2 కాదు కాదు 20 సంవత్సరాలు చూస్తూ ఉండమన్నా చూస్తూనే ఉంటాను .
( దేవకన్య పరవశించిపోయి ) విద్యు సిస్టర్ ను ప్రక్కనే కూర్చోబెట్టుకుంది .
విద్యు సిస్టర్ : దేవకన్య బుగ్గపై ముద్దుపెట్టి , మహి డార్లింగ్ ...... దేవుడిని ఎన్నిసార్లు కొట్టావో కౌంట్ చెయ్యలేదు .
దేవకన్య : చెబితే అన్ని పనిష్మెంట్స్ ఇస్తారా ...... ? .
విద్యు సిస్టర్ : అంతేకదా .......
యాహూ యాహూ ....... అంటూ రెండుచేతులనూ పైకెత్తి కేకలువేశాను .
దేవకన్య : అయిపోయాను అంటూ భుజంపై గిల్లేసింది .
స్స్స్ ...... సిస్టర్స్ ......
సిస్టర్స్ : పనిష్మెంట్స్ +1 ......
దేవకన్య తియ్యనైనకోపంతో మళ్లీ కొట్టబోయి వద్దులే మరొక పనిష్మెంట్ అంటూ ఆగిపోయింది .
అందరూ నవ్వుకున్నారు .

చెల్లెమ్మ : నవ్వుకుని , రేయ్ కృష్ణా ....... CRUNCHY KITKAT తినాలని ఉందిరా ........ ఇప్పుడే ఇక్కడే , నాతోపాటు క్లాస్ అంతటికీ ........
కృష్ణగాడు ....... చెల్లెమ్మ నుదుటిపై ముద్దుపెట్టి లెచేంతలో ....... , దేవకన్య బుగ్గపై చేతితో ముద్దుపెట్టి బయటకు పరుగుతీసాను .

కృష్ణగాడు : మీ అన్నయ్య ప్రేమను ఓవర్ టేక్ చెయ్యడం నావల్లకాదు అంటూ కూర్చుని చెల్లెమ్మ చేతిని అందుకుని ముద్దులు కురిపిస్తున్నాడు .
చెల్లెమ్మ : అన్నయ్యతోపాటైనా వెళ్ళొచ్చుకదా బేబీ ........
కృష్ణగాడు : నిన్ను - మీ అక్కయ్యలను ఒంటరిగా వదిలివెళితే అక్కడ నా వీపు విమానం మ్రోగిపోద్ది ....... , మీతోపాటు ఒక్కరిమైనా ఉండాలన్నది రూల్ ......
చెల్లెమ్మ : లవ్ యు రా - లవ్ యు సో మచ్ అన్నయ్యా ....... , అక్కయ్యలూ ...... మనమంటే ఎంత ప్రాణమో కదా .......
సిస్టర్స్ తోపాటు దేవకన్య ఆనందాలకు అవధులు లేవు .

క్యాంపస్ క్యాంటీన్ కు చేరుకుని , స్నాక్స్ తింటున్న హాస్టల్ సిస్టర్స్ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి వాళ్ళ పెదాలపై నవ్వులను ఎంజాయ్ చేస్తూ వెళ్లి క్యాంటీన్ లో ఉన్న kitkat చాక్లెట్ బాక్సస్ అడిగాను - ప్లీజ్ ప్లీజ్ బ్రదర్ ...... ఔట్ ఆఫ్ స్టాక్ అనిమాత్రం చెప్పకు ........
బ్రదర్ : మహేష్ కదా ...... , Hi మహేష్ ......
Hi బ్రదర్ ....... , kitkat ......
బ్రదర్ : నిన్న సండే కదా ...... , స్టాక్ ఫుల్ చేసేసాము.
థాంక్యూ థాంక్యూ బ్రదర్ , బ్రదర్ ...... మొత్తం మొత్తం kitkat బాక్సస్ ఇచ్చెయ్యి ఫాస్ట్ ఫాస్ట్ ప్లీజ్ ........
పెద్ద బాక్స్ ను నాముందు ఉంచి అమౌంట్ చెప్పాడు . కార్డ్ ద్వారా స్వైప్ చేసేసి మరొకసారి థాంక్యూ చెప్పి , పెద్దబాక్స్ లో ఒక బాక్స్ మాత్రమే తీసుకుని , పెద్ద బాక్స్ ను హాస్టల్ సిస్టర్స్ కు అందించాను , చెల్లి కోరిక అందరికీ చేరాలి అనిచెప్పి చిన్న బాక్స్ చాక్లెట్ లతోపాటు దేవకన్య క్లాస్ కు చేరుకున్నాను , అంతలోనే క్లాస్ బెల్ మ్రోగింది , sorry లవ్ యు లవ్ యు చెల్లెమ్మా ....... ఆలస్యం అయ్యింది .
దేవకన్య - సిస్టర్స్ : నెక్స్ట్ క్లాస్ లీజర్ మహేష్ - మహేష్ సర్ ........
ఆయ్ జింకి చక జింగి చక .... చక చక ఉమ్మా ఉమ్మా మహీ - సిస్టర్స్ అంటూ హుషారుగా పాడుతూ వెళ్లి చెల్లెమ్మకు బాక్స్ అందించి , దేవకన్య ప్రక్కన కూర్చున్నాను .
అందరితోపాటు చెల్లెమ్మ నవ్వుతూనే , లవ్ యు అన్నయ్యా అంటూ నా బుగ్గపై - కృష్ణగాడి పెదాలపై ముద్దులుపెట్టింది . లేచి సీనియర్ అమ్మాయిలకు - సిస్టర్స్ కు చివరన దేవకన్యకు తనకు ...... బాక్స్ ఖాళీ అయిపోయింది - అన్నయ్యా ...... కౌంట్ సరిగ్గా సరిపోయింది .

సీనియర్ బ్రదర్స్ : మహేష్ మహేష్ ....... మాకులేవా చాక్లెట్స్ ? .
లీజర్ పీరియడ్ అయినా క్లాసులో ఉన్నారంటే గ్రేట్ బ్రదర్స్ ...... , అయినా మనకు చాక్లెట్స్ ఎందుకు బ్రదర్స్ .......
బ్రదర్స్ : అయితే మందు పార్టీ అన్నమాట ....... యాహూ యాహూ అంటూ హైఫైలు కొట్టుకుంటున్నారు .
నో నో నో బ్రదర్స్ ...... , నా ఉద్దేశ్యం అధికాదు అధికాదు అంటూనే దేవకన్యవైపు చూసి భయంతో వణుకుతూ చేతులుకట్టుకుని తలదించుకున్నాను .
కృష్ణగాడు : అయిపోయావురా మామా ....... , మహి సిస్టర్ .......ఇప్పుడు ఎలాగైనా కొట్టొచ్చు - మీ డార్లింగ్స్ ఏమాత్రం అడ్డుచెప్పరు , అవునుకదా విద్యు సిస్టర్ .......
విద్యు సిస్టర్ : అవునవును ........ , sorry మహేష్ సర్ - ఈ విషయంలో మేమేమీ చేయలేము .

లేచివెళ్లి బ్రదర్స్ బ్రదర్స్ ....... అలాంటి పార్టీలు ఇక ఉండవు - మీరు ఎంజాయ్ చేసినదే ఫస్ట్ & లాస్ట్ - what am i going to say was మనకు చాక్లెట్స్ ఎందుకు క్యాంటీన్ కు వెళ్లి మీకిష్టమైనవి తినమని - లాస్ట్ లో ఒక్క కాల్ చేస్తే వచ్చి సంతోషంగా బిల్ కట్టేస్తాను .
బ్రదర్స్ : పార్టీలు లేవా ..... ప్చ్ ప్చ్ , సరే క్యాంటీన్ పార్టీతో అడ్జస్ట్ అవుతాము , రేయ్ ఇంకా కూర్చున్నారేంటి పదండి అంటూ వెళ్లారు .
హమ్మయ్యా అంటూ సైలెంట్ గా వచ్చి దేవకన్య ప్రక్కన కూర్చున్నాను .
దేవకన్య : Sooooo స్వీట్ అంటూ నా బుగ్గపై - హృదయంపై ముద్దులుపెట్టి , kitkat షేర్ చేసుకుంది .
యాహూ ...... లవ్ యు లవ్ యు మహీ kitkat ప్రసాదం అంటూ స్వీకరించి తిన్నాను .
విద్యు సిస్టర్ : మహీ డార్లింగ్ ...... మహేష్ సర్ ను ఒక్క దెబ్బ అయినా కొడతావానుకున్నాము - ఫిక్స్ అయిపోయాము తెలుసా ...... ? .
దేవకన్య : పనిష్మెంట్స్ పెరగడానికా డార్లింగ్స్ ...... , ముందు మిమ్మల్ని మిమ్మల్ని కొట్టాలి .........
Wait wait మహీ ...... , ఇప్పుడు ok అంటూ వీడియో రికార్డ్ చేస్తున్నాను - దివ్యక్క పంపించాలికదా ........ , నవ్వుతూ రికార్డ్ చేసి దివ్యక్క పంపించాను .
Next page: Update 39
Previous page: Update 37