Update 40

కొద్దిదూరం వెళ్లిందో లేదో బస్సు ఆగింది - డోర్ తెరుచుకుంది . చెల్లీ - మహీ - విద్యు ....... అంటూ దివ్యక్క బస్సు ఎక్కింది , బావగారు ...... కారులో వెనుకే ఫాలో అయ్యారు .
నా ప్రక్కన కూర్చున్న మహి - కృష్ణగాడిని చుట్టేసి కూర్చున్న చెల్లెమ్మ లేచివెళ్లి కౌగిలింతల తరువాత రైట్ రైట్ అనడంతో బస్సు కదిలింది . దివ్యక్కకు విషయం తెలపడంతో చర్చించడానికి అందరూ బస్సు వెనుకకువెళ్లారు .
నేను వెనక్కు వెళ్లబోతే స్టాప్ స్టాప్ స్టాప్ అక్కడే ఆగిపోండి అంటూ చేతులు చూయించడంతో ....... ప్చ్ అంటూ నిరాశతో కూర్చున్నాను .
అందరూ నవ్వుకుని గుసగుసలాడుతున్నారు .
దారిలో ఐస్ క్రీమ్ షాప్ ముందు బస్సును ఆపించి , కృష్ణగాడితోపాటువెళ్లి రెండు కోన్ ఐస్ క్రీమ్ బాక్సస్ తీసుకొచ్చి , గుసగుసలాడుకుంటున్న అందరి మధ్యలో ఉంచాను .
ఐస్ క్రీమ్స్ ...... లవ్ యు థాంక్యూ ....... తీసుకొచ్చారుకదా ఇంకా ఇక్కడే ఉన్నారే అంటూ వెళ్ళండి వెళ్ళండి - ఓహ్ ...... ఐస్ క్రీమ్ కావాలా అంటూ ఒక్కొక్కటి అందించి తోసేశారు .
దీనంగా వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే ముందుకువెళ్లి కూర్చున్నాము . 15 నిమిషాలలో ఇంటికి చేరుకున్నాము .

కాలేజ్ బ్యాగ్స్ అందుకుని చిరునవ్వులు చిందిస్తూ మా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి , ఏమీచెప్పకుండా కిందకుదిగి లోపలికి వెళ్లిపోతున్నారు .
ఆశ్చర్యంగా బస్సు డోర్ దగ్గరకువెళ్లి , సిస్టర్స్ - దివ్యక్కా - చెల్లెమ్మా - మహీ .......
అందరూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు , వెళ్లి రెడీ అవ్వండి - మేము పైకివెళ్లి రెడీ అయ్యివస్తాము ఎక్కడికి అన్నది మీరే చెప్పాలి అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి చిరునవ్వులు చిందిస్తూ లోపలికివెళ్లారు .
ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ....... అంటూ బావగారితోపాటు లోపలికివెళ్లి మా మా గదులలో రెడీ అయ్యి పదే పదే పైకిచూస్తూ హాల్ లోని సోఫాలలో వేచిచూస్తూ కూర్చున్నాను .

బావగారూ ...... టీ or కాఫీ ? చిటికెలో పెట్టి తీసుకొస్తాను .
పెద్దమ్మ : రెండింటితోపాటు స్నాక్స్ కూడా రెడీ మహేష్ ...... అంటూ తీసుకొచ్చారు .
పెద్దమ్మా .......
పెద్దమ్మ : నేర్చుకున్నావు కదా మహేష్ ...... , అవసరమైనప్పుడు నువ్వే చేద్దువుకానీ అందుకో కాలేజ్ లోనే అలసిపోయి ఉంటారు , నేనువెళ్లి తల్లులకు ఇచ్చేసివస్తాను .
థాంక్యూ పెద్దమ్మా ...... అంటూ అందుకున్నాము .
పెద్దమ్మ ...... ఫ్లాస్క్ - కప్స్ తో పైకివెళ్లివచ్చి , మహేష్ - కృష్ణా - కిషోర్ ....... తల్లులు సూపర్ , మళ్లీ వెళ్ళాలి అలంకరించడానికి అనిచెప్పి మరిన్ని స్నాక్స్ అందుకుని పైకివెళ్లి మరింత ఉత్సుకతను పెంచారు .

మేము రెడీ అయ్యివచ్చి కూర్చున్న గంటసేపటి తరువాత అందమైన నవ్వులు వినిపించడంతో కూర్చునే పైకిచూసాము . Wow wow అంటూ ముగ్గురమూ లేచి అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాము -
పట్టు లంగావోణీ మరియు నగలతో అందంగా అలంకరించుకుని దివినుండి దిగివచ్చిన దేవకన్యల్లా ....... సెకండ్ ఫ్లోర్ నుండి కిందవరకూ స్టెప్స్ దిగివచ్చి ఎలా ఉన్నాము అంటూ కళ్ళెగరేశారు .
మోస్ట్ బ్యూటిఫుల్ - మోస్ట్ బ్యూటిఫుల్ - మోస్ట్ బ్యూటిఫుల్ ....... అంటూ ముగ్గురమూ ఒకేసారి ఓకేమాటను అని ఒకరినొకరం చూసుకుని నవ్వుకున్నాము , అచ్చ తెలుగు అమ్మాయిల్లా - బాపూ బొమ్మల్లా ........ వర్ణించడానికి మాటలు లేనంత ముచ్చటగా ఉన్నారు - మహివైపు చూసి మన్మధ బాణాలు గుచ్చుకున్నట్లుగా తియ్యనైన బాధను వ్యక్తపరిచాను .
స్వీట్ వార్నింగ్ ఇచ్చి పులకించిపోతున్నట్లు అనిపించింది .
థాంక్యూ థాంక్యూ లవ్ యు లవ్ యు అంటూ మరింత అందంగా సిగ్గుపడుతుంటే చూసి ముగ్గురమూ ...... మా మా హృదయాలపై చేతులను వేసుకుని సోఫాలోకి వాలిపోయాము .
నవ్వులు ఆగడం లేదు . పెద్దమ్మా పెద్దమ్మా ...... మా దిష్టినే తగిలేలా ఉంది - అందరికీ దిష్టి చుక్కలు పెట్టారా ? .
పెద్దమ్మ : sorry మహేష్ ....... , తల్లులను ఇలా చూసిన ఆనందంలో మరిచేపోయాను ఒక్కనిమిషం అంటూ కాటుక డబ్బా తీసుకొచ్చారు .
పెద్దమ్మా ...... కాస్త పెద్దవిగా ఉంచండి .
పెద్దమ్మ : సంతోషంగా మహేష్ అంటూ కురులపై - అరిపాదాలపై ఉంచి , చాలా చాలా బాగున్నారు తల్లులూ ...... , ఇలా మీ మీ తల్లిదండ్రులు చూస్తే సంతోషంతో పొంగిపోతారు .

మహేష్ - మహేష్ సర్ - అన్నయ్య కొనిచ్చిన నగలు వేసుకునే అదృష్టం ఈరోజుకు కలిగినందుకు చాలా చాలా ఆనందం వేస్తోంది లవ్ యు అన్నయ్యా - థాంక్యూ మహేష్ - మహేష్ సర్ ........
డబ్బుంటే ఎవ్వరైనా కొనిస్తారు , కానీ ...... మీ వలన నగలకు - పట్టు వస్త్రాలకే అందం వచ్చింది , ఎంత ఆనందం వేస్తోందో మాటల్లో చెప్పలేను , అమ్మ అయితే సో సో sooooo హ్యాపీ ......., ఇక్కడ లేరు కానీ లేకపోయుంటే మీ బుగ్గలు ముద్దులతో నిండిపోయేవి .
లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ అమ్మా అమ్మా ....... అంటూ అందరూ దగ్గరికివచ్చి నా హృదయంపై ముద్దులవర్షం కురిపించారు .
అమ్మకోసం వన్ గ్రూప్ ఫోటో ప్లీజ్ ప్లీజ్ .......
ఒక్కటేమిటి ఎన్నైనా తీసుకోండి - అమ్మకోసమే కాదు మీకోసం కూడా తీసుకోండి .
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , ఈ అలంకరణలో పెద్దమ్మ హ్యాండ్ కూడా ఉందికాబట్టి మధ్యలో నిలబడండి అనిచెప్పి ముగ్గురమూ మా మా మొబైల్స్ తో రెడీ అయ్యాము .
అందరూ ఒకరినొకరు హత్తుకుని - భుజాలపై - భుజాలచుట్టూ చేతులువేసుకుని రకరకాల పొజిషన్స్ ఇవ్వడంతో పిక్స్ తీసి గ్రూప్ లో ఉంచాను . సిస్టర్స్ - చెల్లెమ్మా - మహీ ....... మీ మీ పేరెంట్స్ కు పంపించుకోండి , దివ్యక్కా ...... మీరు మళ్లీ మా ముగ్గురికీ పంపించండి .
దివ్యక్క : లవ్ యు అన్నయ్యా ...... అంటూ వచ్చి నా గుండెలపైకి చేరారు .
లవ్ యు soooo మచ్ దివ్యక్కా ...... అమ్మ అచ్చు మీ అందరిలానే ఉంటారేమో అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . దివ్యక్కా ...... బావగారు ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నారు అంటూ బావగారి కౌగిలిలోకి చేర్చాను .
దివ్యక్క : సిగ్గుపడుతూనే చేరి , కిషోర్ ...... పెదాలపై మాత్రం ముద్దుపెట్టొద్దు ఎందుకన్నది కొద్దిసేపట్లో తెలుస్తుంది .
బావగారు : అలాగే అంటూ సంతోషంతో చేతిని అందుకుని ముద్దుపెట్టారు .
చెల్లెమ్మ ...... కృష్ణగాడి కౌగిలిలోకి చేరింది .

ఇరువైపులా చూసి ఆనందించి , మహీ ....... ఎన్ని సంవత్సరాలైనా - యుగాలైనా ఎదురుచూస్తాను అంటూ హృదయంపై ముద్దుపెట్టుకున్నాను .
( మహి ...... విద్యుసిస్టర్ వైపు సైగచేసింది )
విద్యు సిస్టర్ : మహేష్ సర్ ...... మాకు తెలుసు మహినే స్వయంగా వచ్చి మీ కౌగిలిలోకి చేరాలని అంతవరకూ ఇలాంటి చిలిపి చిలిపి మాధుర్యాలు కూడా ఉండాల్సిందే అంటూ మహిని లాక్కునివచ్చి నా కౌగిలిలోకి చేర్చారు .
అనూహ్యంగా దేవకన్య - నా దేవకన్యనే నన్ను చుట్టేసి నా హృదయంపై పెదాలను తాకించింది .
నిజమా కలా అన్నట్లు తియ్యదనంతో జలదరిస్తూ దేవకన్యనే అంతులేని ప్రేమతో చూస్తున్నాను .
దేవకన్య : అంత మురిసిపోవాల్సిన అవసరం లేదు - ఇంతమంది పెదాలపై చిరునవ్వులు చిందించిన మా దేవుడి కాదు కాదు మా అంటీ పెదాలపై చిరునవ్వులు పరిమళింపచెయ్యడం మా ధర్మం అంటూ మళ్లీ హృదయంపై పెదాలు తాకించారు .
చాలు దేవకన్యా చాలు అంటూ దేవకన్య పెదాలపై చేతితో ముద్దుపెట్టాను .
దేవకన్య : ( ఇంకా చేతితోనేనా అన్నట్లు ) చుట్టేసిన నడుముపై గిల్లేసారు అధిరిపడటంతో నవ్వుకుని దివ్యా - చెల్లీ ....... అంటూ ముగ్గురూ చేతులుపట్టుకుని సిస్టర్స్ దగ్గరికి చేరుకున్నారు . ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళుతున్నాము .
దేవకన్యల్లా రెఢీ అయ్యారు అంటే దుర్గమ్మ దర్శనం కోసమే .......
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... సోమవారం కూడా కదా వెళదామా ..... ? .
చంద్రకు కాల్ చేసి బస్సును నేరుగా కాంపౌండ్ లోపలికే తీసుకురమ్మన్నాను .
అంతలోపు సిస్టర్స్ - చెల్లెమ్మ - దివ్యక్క - మహి ...... బట్టలలో పూజ వస్తువులను తీసుకురావడంతో పెద్దమ్మతోపాటు బయటకురాగానే కారులో హాసిని - విక్రమ్ రావడంతో అందరమూ బస్సులో దుర్గమ్మ గుడికి బయలుదేరాము .

మహీ డార్లింగ్ ....... బస్సు ఎక్కగానే మహేష్ సర్ ప్రక్కన కూర్చోవాలని తెలియదా - ప్రతీసారీ చెప్పాలంటే ఎలా అంటూ ప్రేమతో మొట్టికాయవేసిమరీ కూర్చోబెట్టారు .
నవ్వుకుని , హాసినీ ...... పరికిణీ - నగలలో ముచ్చటగా ఉన్నారు . మీకెలా తెలిసింది గుడికి వెళుతున్నామని , మీ అక్కయ్యలకంటే అందంగా రెఢీఅయ్యారు .
హాసిని : మమ్మీకి ......... ఆక్కయ్యలు కాల్ చేసి చెప్పారు - మమ్మీ వెంటనే ఇలా రెడీ చేసి పంపించారు .
థాంక్స్ వార్డెన్ ...... , మీ అక్కయ్యలకు మీరంటే చాలా ఇష్టం అంటూ ఒడిలో కూర్చోబెట్టుకుని గట్టిగా కౌగిలించుకున్నాను - ప్రక్కనే కూర్చున్న మీ అక్కయ్యను ఇలా ఎప్పుడు కౌగిలించుకుంటానో - ఎంత అందంగా సాంప్రదాయబద్ధంగా దేవకన్యలా .........
దేవకన్య : ష్ ష్ ష్ చాలు చాలు చాలు గుడికి వెళుతున్నాముకదా కాసేపు ఆ ఆలోచనలు పక్కన పెట్టు మహేష్ అంటూ నా నోటిని మూసేసి , చెల్లీ ....... నా దగ్గరకు వచ్చెయ్యి అంటూ ఒడిలో కూర్చోబెట్టుకుని , మీ అన్నయ్య చెప్పినట్లు మాకంటే అందంగా రెడీ చేసింది వార్డెన్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
నువ్వు మాత్రం ముద్దులుపెట్టవచ్చు - ఎంతైనా దుర్గమ్మ తల్లి పంపించిన దేవకన్యవు కదా .......
దేవకన్య : పొగిడావా ..... లేక .......
పొగిడాను మహీ ...... , దుర్గమ్మ దర్శనానికి వెళుతున్న దేవకన్య కోపాన్ని తట్టుకోగలనా ........
తియ్యదనంతో నవ్వేసింది దేవకన్య .......
ఆఅహ్హ్ ...... ఈ నవ్వులను చూస్తూ జీవితాంతం హాయిగా బ్రతికేయ్యొచ్చు .
దేవకన్య : ఆపమన్నానుకదా ....... ఇంటికివెళ్లాక నీఇష్టం .
ఎక్కడ ..... ఇంటికి వెళ్లగానే నైట్ డ్రెస్సులోకి మారిపోతారు అందుకేకదా .......
దేవకన్య : సరే మా దేవుడికోసం ఇంటికివెళ్లాకకూడా ఇలానే ఉంటాను - ఇలానే భోజనం చేస్తాను - ఇలానే చదువుకుంటాము - ఇలానే నీ ఎదురుగా పడుకుంటాను ok నా .........
Ok నా అని ఇంత చిన్నగా చెబుతావు ఏంటి మహీ ...... యాహూ యాహూ అంతా దుర్గమ్మ అనుగ్రహం - అమ్మా దుర్గమ్మ తల్లీ థాంక్యూ థాంక్యూ సో మచ్ - గుడిలో అడుగుపెట్టగానే 101 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటాము .
చెల్లెమ్మ : బేబీ విన్నావుకదా .......
కృష్ణగాడు : విన్నాను డియర్ ఏంజెల్ ...... బస్సు ఆగగానే మీ అన్నయ్య ముందు 101 టెంకాయలు ఉంచుతాను .
అందరూ సంతోషంతో నవ్వుతున్నారు .
చెల్లెమ్మ : లవ్ యు ...... ముద్దులు మాత్రం ఆక్కయ్యలు చెప్పినట్లు దర్శనం చేసుకుని ఇంటికి చేరిన తరువాతనే ........

అంతలోనే గుడిముందు బస్సు ఆగింది - వరుసబెట్టి మెసేజస్ రావడంతో చూసి , సిస్టర్స్ - చెల్లెమ్మా - మహీ ...... దివ్యక్కతోపాటు మీరందరూ కూడా మళ్లీ నాకు ఫోటోలు పంపించారు ఏమిటి ? .
మీరుకూడా ....... మా ఫ్యామిలీనే కదా మహేష్ సర్ - అన్నయ్యా - మహేష్ ........
కళ్లల్లో ఆనందబాస్పాలు ఆగడం లేదు .
ఎమోషనల్ అయ్యారా అన్నయ్యా - మహేష్ సర్ ....... అంటూ అందరూలేచి నన్ను చుట్టేశారు .
దేవకన్య : సో సో స్వీట్ అంటూ నా హృదయంపై ముద్దుపెట్టింది - హలో హీరోగారూ ....... తొందరగా దిగి 101 టెంకాయల మొక్కు తీర్చుకుంటే అమ్మ దర్శనానికి వెళ్లొచ్చు .
కృష్ణగాడితోపాటు బావగారు కిందకుదిగి గుడిబయట ఉన్న పూలకొట్టులో 101 టెంకాయలు తీసుకున్నారు .

నా బుగ్గలపై - హృదయంపై చేతులతో ముద్దులుపెట్టి , wait wait అన్నయ్యలూ ........ టెంకాయలు పట్టుకునే అదృష్టం మాకూ ప్రసాధించండి అంటూ ఒక్కొక్కరూ రెండుచేతుల నిండా పట్టుకుని నవ్వుకుంటున్నారు . చెల్లీ - తమ్ముడు కూడా ఏకంగా 4 -5 టెంకాయల వరకూ పెట్టుకోవడం చూసి ఆనందించాను .
కిందకుదిగి wait wait అంటూ మొబైల్ తీసి పిక్స్ మరియు నేనూ జతకలిసి సెల్ఫీలు తీసుకున్నాను .
మేమంతా 100 టెంకాయలు పట్టుకోగా మిగిలినది ఈ ఒక్కటే పట్టుకోండి మహేష్ అంటూ అందించింది దేవకన్య ........
అందుకుని భక్తితో గోపురానికి మొక్కుకుని అందరితోపాటు లోపలికివెళ్లి , పూజారిగారి అనుమతి తీసుకుని దుర్గమ్మ తల్లికి ఎదురుగా గుడి ఆవరణలో చేరాము .
పిల్లలూ - దివ్యక్కా - చెల్లెమ్మా - సిస్టర్స్ - మహీ - బావగారూ - రేయ్ మామా - పెద్దమ్మా ...... కానివ్వండి మరి .
మొక్కు తమరిది కదా మొదట టెంకాయతో మీరు మొదలెట్టండి తరువాత మేము పూర్తి చేస్తాము .
అలాగే దేవకన్యలూ ....... , అమ్మా దుర్గమ్మ తల్లీ ...... ఎక్కడ ఉన్నా అమ్మ మరియు నాతోపాటు ఉన్న దేవకన్యలు - పిల్లలు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలి అలాగే అలాగే వంటలన్నీ నేర్చుకోవాలి అంటూ భక్తితో టెంకాయ కొట్టాను .
నవ్వులు ఆగడం లేదు - స్వచ్ఛమైన కోరికలు కోరుకున్న అన్నయ్య - మహేష్ సర్ - మహేష్ కోరికలు తీరాలి , అమ్మ దగ్గరికి చేరాలి అంటూ 100 టెంకాయలు కొన్ని క్షణాలలో పగలగొట్టేసి సంతోషంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు .
అటునుండి దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తితో అమ్మవారి సన్నిధిలో ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చుని బయటకువచ్చాము .
అన్నయ్యా - మహేష్ ....... గుడినుండి ఎక్కడికైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసారేమో అలాంటివి ఉంటే క్యాన్సిల్ చేసేయ్యండి ఎందుకంటే దర్శనం చేసుకుని నేరుగా ఇంటికివెళ్లాలి .
దేవకన్యలు ఎలా అంటే అలా అంటూ ప్రశాంతమైన మనసుతో ఇంటికి చేరుకున్నాము .

బస్సుదిగి హాసిని చేతిని అందుకుని లోపలికివెళుతూ ....... మాటిచ్చావు గుర్తుందికదా మహీ అంటూ దీనంగా అడిగాను .
దేవకన్య : గుర్తుంది గుర్తుంది మహాప్రభూ ...... , ఇక నీ ఇష్టం ఎలాగైనా చూసుకుని ఆనందించు ....... అంటూ నా హృదయంపై ముద్దుపెట్టింది , మాట విన్నందుకు గానూ లోపలివరకూ అంటూ నా చేతిని చుట్టేసింది .
షాక్ లో నోటిని అలా తెరిచి ఉండిపోయాను - దేవకన్య నవ్వులకు తేరుకుని , లవ్ యు లవ్ యు soooo మచ్ మహీ అంటూ పట్టరాని ఆనందంతో దేవకన్యతోపాటు లోపలికి నడిచాను .

పెద్దమ్మ : బాబూ మహేష్ ...... చెఫ్స్ వచ్చారు - ఏమి వండమంటారు ? .
సిస్టర్స్ - దేవకన్యవైపు చూసాను .
సిస్టర్స్ - దేవకన్య : హాస్టల్ మెనూ ప్రకారం ...... , రోటీలు - కూర్మా - రైస్ - సాంబార్ - రసం - ఆవకాయ - అప్పడం - పెరుగు .......
కూరలు మరిచిపోయారు సిస్టర్స్ ......
సిస్టర్స్ : ఏవైనా రెండు కూరలు - పెద్దమ్మా ...... మేమూ హెల్ప్ చేస్తాము .
నో నో నో ...... మీరు పైకివెళ్లి చదువుకోండి , అమ్మా ...... హెల్ప్ చేస్తారట హెల్ప్ - ఇక నేనెందుకు ఉన్నది , వెళ్ళండి వెళ్ళండి అంటూ తోసేసాను , రాను రాను భయం లేకుండా పోతోంది .
అందరూ నవ్వుకుంటూ పైకివెళ్లి బుక్స్ తోపాటు కిందకువచ్చి హాల్లోనే చదువుకుంటున్నారు - దివ్యక్కతోపాటు బావగారు కూడా ...... - కృష్ణగాడు చెల్లెమ్మ ....... మా క్లాస్మేట్స్ కు కాల్ చేసి ఈరోజు జరిగిన టాపిక్స్ నోట్స్ వాట్సాప్ లో తెలుసుకుని డిస్కస్ చేసుకుంటున్నారు .
గుడ్ గుడ్ గుడ్ వెరీ గుడ్ ...... మీరు ఇలానే చదువుకోండి మేము వంటలు అధరగొట్టేస్తాము - స్పెషల్ ఏమైనా కావాలంటే మాకు ఆర్డర్ ఇవ్వండి లేదా ఆన్లైన్ ఆర్డర్ పెట్టండి అనిచెప్పి పెద్దమ్మతోపాటు వంట గదిలోకివెళ్ళాను .

వంటలో చకచకా సహాయం చెయ్యడం - కూరలలో ఉప్పు కారం పర్ఫెక్ట్ గా వేస్తుండటం చూసి పెద్దమ్మ - లేడీ చెఫ్స్ ....... అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు .
నవ్వుకుని , అంతా అంటీ - మీ కదా పెద్దమ్మా ...... థాంక్యూ ....... , అనిచెప్పి 5 నిమిషాలకొకసారి పట్టుచీరలో నిజంగా దేవకన్యలా చదువుకుంటున్న నా మహిని డోర్ చాటునుండి తొంగి తొంగి చూస్తూ ఆనందిస్తున్నాను .
పెద్దమ్మ : దివ్య - కృష్ణ - మహి - విద్యు ........ లపై ఎంత ప్రేమ ఉంటే ఇంత త్వరగా ఇంత బాగా చెయ్యడం నేర్చుకున్నావు - ఇందులో మాకు థాంక్స్ చెప్పాల్సిన అవసరమే లేదు .
నో నో నో అలా అనకండి , విద్య నేర్పించిన గురువులను తుదిశ్వాస వదిలేంతవరకూ మరిచిపోకూడదు . నా వంట గురువులు మీరే అంటూ తొంగి చూసాను - సోఫాలో నా దేవకన్య కనిపించకపోవడంతో అటూ ఇటూ చూస్తున్నాను.

వెనకనుండి హలో ........ , ముసిముసినవ్వులు వినిపించాయి .
అయిపోయాను అంటూ వెనక్కుతిరిగిచూస్తే పట్టుచీరలో సత్యభామలా చేతులుకట్టుకుని రుసరుసలాడుతూ చూస్తున్న నా దేవకన్య ప్రక్కనే చిరునవ్వులు చిందిస్తున్న విద్యు సిస్టర్ ......
దేవకన్య : హలో చీఫ్ చెఫ్ గారూ ...... ఏంటి తెగ డిస్టర్బ్ చేసేస్తున్నారు ......
నేనా ...... అంటూ అమాయకంగా చేతులుకట్టుకుని దేవకన్యనే ప్రాణంలా చూస్తున్నాను .
దేవకన్య : చూడవే డార్లింగ్ ...... , ఎంత యాక్టింగ్ చేసేస్తున్నాడో ఆస్కార్ అవార్డ్ కూడా తక్కువే .......
విద్యు సిస్టర్ : లేదంటున్నారు కదే .......
దేవకన్య : నిన్నూ నిన్నూ అంటూ కొట్టబోయి ఆగి , మహేష్ ...... ఆకలేస్తోంది తొందరగా అంటూ నా హృదయంపై ముద్దుపెట్టింది .
Sorry లవ్ యు లవ్ యు మహీ ....... , పెద్దమ్మా ...... ఇంకెంత సమయం - ok .... విన్నారుకదా 20 మినిట్స్ .......
దేవకన్య : పెదాలపై తియ్యదనంతో విద్యు సిస్టర్ చేతిని చుట్టేసి వెళ్లబోయి మళ్లీ వెనక్కువచ్చింది . మహేష్ ....... మేముకూడా హెల్ప్ చెయ్యమా ..... ? .
పెద్దమ్మా ....... ఆ పప్పుగుత్తి ఇటు ఇవ్వండి .
దేవకన్య : లేదు లేదు లేదు బుద్ధిగా చదువుకుంటాము అనివెళ్లి కూర్చుని నవ్వుకుంటున్నారు . .
ఆయ్ ....... మంచిగా ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదు అంటూ నవ్వుకున్నాను.
నా దేవకన్య అందమైన నవ్వులను నిమిషానికొకసారి 20 సార్లకుపైగా తొంగి తొంగి చూస్తూ ....... , పెద్దమ్మ ...... వంట పూర్తయ్యింది అనగానే బయటకువచ్చి బావగారూ - దివ్యక్కా - చెల్లెమ్మా - సిస్టర్స్ - మై డియర్ లవ్లీ మహీ ....... గో అండ్ క్లీన్ your హ్యాండ్స్ అని కేకలువేస్తూ పెద్దమ్మ - చెఫ్స్ సహాయంతో డైనింగ్ టేబుల్ పై సెట్ చేసేసాము .

లేడీ చెఫ్స్ : మహేష్ సర్ We'll take leave .......
దివ్యక్క - మహి : సిస్టర్స్ ...... డిన్నర్ చేసి వెళ్ళండి .
చెఫ్స్ : థాంక్యూ సిస్టర్స్ ...... , పిల్లలు tuitions నుండి వచ్చేసి ఉంటారు వెళ్ళాలి - అయినా ఈ ఇంటిలో మాకు మొహమాటం ఏమిటి .
దివ్యక్క - మహి : గుడ్ గుడ్ అని ఆనందించి , ఒక్క నిమిషం అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికివెళ్లి చాక్లెట్ - ఐస్ క్రీమ్స్ ను అందించారు పిల్లలకోసం ......
చెఫ్స్ : థాంక్యూ అంటూ సంతోషంతో కౌగిలించుకుని వెళ్లారు .
లవ్ యు దివ్యక్కా - చెల్లెమ్మా - మహీ ..... అంటూ మహిని కౌగిలించుకోబోయి అమ్మో డేంజర్ అంటూ దివ్యక్క - చెల్లెమ్మను కౌగిలించుకున్నాను . స్స్స్ ...... అంటూ నడుముపై రుద్దుకుంటూ ..... కౌగిలించుకోలేదు కదా మహీ అంటూ దీనంగా చూస్తున్నాను .
చెల్లెమ్మ : అందుకేనేమో అన్నయ్యా .......
అవునా మహీ ....... అంటూ అంతులేని ఆశతో చూస్తున్నాను .
దేవకన్య మళ్లీ గిల్లేసి ఆకలేస్తోంది అంటూ దివ్యక్క - చెల్లెమ్మ చేతులను పెనవేసి ముసిముసినవ్వులతో వెళ్లి డైనింగ్ టేబుల్ లో కూర్చున్నారు .
దివ్యక్క - చెల్లెమ్మ : మా దేవకన్య ప్రక్కన దేవుడు అంటూ దేవకన్య బుగ్గలపై ఒకేసారి ముద్దులుపెట్టివెళ్లి , పెద్దమ్మను కూర్చోబెట్టి , వాళ్ళ వాళ్ళ హీరోల ప్రక్కన కూర్చున్నారు .
దేవకన్య : డార్లింగ్స్ - విద్యు డార్లింగ్ ....... మీరైనా వచ్చి కూర్చొండే .......
మా మహేష్ సర్ ఆనందమే మా సంతోషం ఆ మాత్రం తెలియదా అన్నట్లు నవ్వుకుంటూ ప్రక్కన ప్లేస్ వదిలి లాంగెస్ట్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు .
దేవకన్య : కోపంతో నావైపు చూస్తూ ....... , నవ్వుకుంది చాలు చాలు హీరోగారూ ...... వచ్చి కూర్చోండి - అందరికీ ఆకలేస్తోంది .
లవ్ యు లవ్ యు సిస్టర్స్ అంటూ డైనింగ్ టేబుల్ చుట్టూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి దేవకన్య ప్రక్కనే కూర్చుని , ఫ్లైయింగ్ కిస్ వధలబోయి నో నో నో అంటూ బుద్ధిగా కూర్చుని మురిసిపోతున్నాను .

వడ్డించడానికి పెద్దమ్మ లేవబోతే ఆపి దివ్యక్క - మహి - విద్యు సిస్టర్ వడ్డించారు.
లవ్ యు ...... , అందరివైపు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాను .
టేస్ట్ చేసి అందరూ మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్మ్ ...... సూపర్ సూపర్ అంటూ పెద్దమ్మతోపాటు నన్నుకూడా తెగ పొగిడేస్తున్నారు .
చూడండీ ...... బేసిక్ గా నాకు పొగడ్తలంటే ఇష్టం లేదని మీఅందరికీ తెలుసు - పొగిడితేనే మీకు ఆనందం అయితే తప్పదుకదా ...... లవ్ యు లవ్ యు ......
అందరూ సంతోషంగా తింటూ ...... , అన్నయ్యా - మహేష్ - మహేష్ సర్ ....... మీరూ తినండి .
ఏంటో ....... మీ పొగడ్తలతోనే కడుపు నిండిపోయినట్లుంది .
దేవకన్య : చాలు చాలు ముందు తినండి - మా అంటీ కోసం , మీరు తింటేనేకదా మాఅంటీ ఆకలి తీరేది అంటూ చేతితో ముద్దుపెట్టబోయి మెతుకులు ఉండటం చూసుకుని , వొంగి ఏకంగా పెదాలపై ముద్దుపెట్టింది .
ఆఅహ్హ్హ్ ........
చెల్లెమ్మ : బేబీ వెళ్లు అంటూ కృష్ణగాడిని తోసేసింది .
అందరూ నవ్వుకున్నారు .
దేవకన్య : బుజ్జి అన్నయ్యా ...... పర్లేదు కూర్చోండి నేను చూసుకుంటానులే అంటూ నవ్వుకుని , హలో మీ ఓవర్ యాక్టింగ్ ఆపి తినండి అంటూ నెత్తితో నెత్తిని తాకించారు .
యాక్టింగ్ కాదు మహీ ....... , ఫిల్ ఫీల్ ....... the best ఫీలింగ్ ఎవర్ అంటూ హృదయంపై ముద్దులవర్షం కురిపించి , మొబైల్ మొబైల్ అంటూ జేబులలో చూసుకుని ఎక్కడ పెట్టానబ్బా అంటూ లేచాను .
దేవకన్య : అయినా ఇప్పుడు మొబైల్ ఎందుకు ముందు కూర్చుని తిను .......
ఒక్క నిమిషం ఓకేఒక్కనిమిషం అర్జెంట్ గా కాల్ చెయ్యాలి - ఒకరు తిన్నారోలేదో తెలుసుకోవాలి - వారు తిన్నారని తెలిస్తేనే తినగలను అనిపిస్తోంది .
విద్యు సిస్టర్ : అంత ముఖ్యమైనవారు ఎవరు మహేష్ సర్ ? .
దివ్యక్క - చెల్లెమ్మ : అవును అన్నయ్యా ...... మీ - మా దేవకన్య కంటే అతిముఖ్యమైనవారు ఎవరు ? .
ఒక్క నిమిషం ఓకేఒక్కనిమిషం మహీ ...... , ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ .......
దేవకన్య : మాకంటే ముఖ్యమైనవారు ఎవరు అన్నట్లు ఏకంగా మూడోకన్ను తెరిచి చూసి , చూసారా దివ్య - చెల్లీ - డార్లింగ్స్ ...... , మీరేమో నేనే - మనమే ...... మీదేవుడి ప్రాణం అంటారు , చూసారా ...... దేవుడి నిజ స్వరూపం .
ప్లీజ్ ప్లీజ్ మహీ ...... , ఒక్కనిమిషం ఓకేఒక్కనిమిషం ఇలావెళ్లి కాల్ చేసి అలా వచ్చేస్తాను , కాల్ చేయకపోతే మనసు కుదుటపడేలా లేదు ప్లీజ్ ప్లీజ్ చూసారా కంగారులో చెమటకూడా పట్టేస్తోంది .
అంతే దేవకన్య - దివ్యక్క - చెల్లెమ్మ - విద్యు సిస్టర్ ...... అందరూ లేచివచ్చి కొంగులతో తుడిచారు .
దేవకన్య : కాల్ ఎంత ముఖ్యమో తెలుస్తోంది వెళ్ళండి వెళ్ళండి అంటూ కోపంతో గిల్లేసింది .
స్స్స్ స్స్ ..... లవ్ యు లవ్ యు మహీ ఉమ్మా ఉమ్మా ....... , ఇంతకీ మొబైల్ ఎక్కడ పెట్టానబ్బా ....... ? .
పెద్దమ్మ : బాబూ మహేష్ ....... వంట గదిలో .......
Yes yes థాంక్యూ పెద్దమ్మా అంటూ మహి బుగ్గపై చేతితో ముద్దుపెట్టి పరుగుతీసాను .

ఫ్రిడ్జ్ పై ఉంచిన మొబైల్ అందుకుని , కాలేజ్ హెడ్ మిస్ట్రెస్ కు కాల్ చేసాను - రింగ్ అవ్వడంతో పెదాలపై చిరునవ్వు విరిసింది .
హెడ్ మిస్ట్రెస్ : hi hi హలో మహేష్ సర్ ....... అంటూ సంతోషం - ఆతృత - ఉత్సాహంగా రిప్లై ఇచ్చారు .
మేడం గారూ ...... వాయిస్ క్లియర్ గా వినిపిస్తోంది .
హెడ్ మిస్ట్రెస్ : అవును మహేష్ సర్ ..... డిన్నర్ కోసం ఒక పొలంలో హాల్ట్ అయ్యాము , ఇక హైద్రాబాద్ 200km మాత్రమే - నువ్వు ఆర్రేంజ్ చేసిన వంట వాళ్ళు , రీప్లేస్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ...... wow సూపర్ పిల్లలతోపాటు మేముకూడా ..... అంటూ నవ్వుకున్నారు .
గుడ్ గుడ్ గుడ్ మేడం - జర్నీలో ఏ ప్రాబ్లమ్ లేదుకదా .......
హెడ్ మిస్ట్రెస్ : ప్రాబ్లమా ....... ? , మోస్ట్ లగ్జరీ ప్రయాణం మహేష్ సర్ - పిల్లలతోపాటు టీచర్స్ అందరూ సో సో హ్యాపీ - థాంక్యూ థాంక్యూ సో సో soooo మచ్ మహేష్ సర్ ......
ఇప్పటికే చాలాసార్లు చెప్పినట్లున్నారు .
హెడ్ మిస్ట్రెస్ : ఎన్నిసార్లు చెప్పినా తనివితీరని మోస్ట్ మెమొరబుల్ జర్నీ అనుభూతిని కలిగిస్తున్నారు మహేష్ సర్ మళ్లీ థాంక్యూ థాంక్యూ సో మచ్ .......
మీరు అంటే టీచర్స్ అందరూ మరియు పిల్లలు హ్యాపీ అయితే I am the హ్యాపీఎస్ట్ పర్సన్ ........ , మేడం ....... టీచర్స్ అంటే అందరూ తింటున్నారా ? .
హెడ్ మిస్ట్రెస్ : నువ్వు ఎవరికోసం అడుగుతున్నావో నాకు అర్థమయ్యింది మహేష్ సర్ ....... , నా ఫ్రెండ్ అయితే ఎందుకో ఏమో పిల్లలంతా తినేలా చూస్తోంది కానీ వడ్డిoపు కార్యక్రమం స్టార్ట్ అయ్యి 15 నిమిషాలు అవుతున్నా తినడం లేదు - ఇంతకూ నువ్వు భోజనం చేశావా ? .
లేదు మేడం గారూ ....... , మీరు తిన్నారోలేదో తెలుసుకుందామని చేసాను .
హెడ్ మిస్ట్రెస్ : సో స్వీట్ ఆఫ్ యు మహేష్ సర్ - మాకోసం కాదులే ఎవరికోసం చేశావో తెలుస్తూనే ఉంది - బహుశా ...... నా ఫ్రెండ్ కూడా మీ కాల్ కోసమే ఎదురుచూస్తోందేమో - నువ్వు భోజనం చేసావోలేదో తెలుసుకుని తిన్న తరువాతనే తినాలని చూస్తోందేమో - నీకు కాల్ చెయ్యాలని ఉన్నా ఎందుకో సంసయిస్తున్నారేమో ........
అలా అయ్యుండదు లేండి మేడం గారూ ........
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ సర్ ....... , తనను సంవత్సరాలుగా దగ్గరుండి చూస్తున్నాను , తన ఫీలింగ్స్ తెలుసుకోలేనా , అందులోనూ నేను సైకాలజీ లో Phd చేసాను , ఇప్పుడు నమ్ముతారా ....... ? .
ఇంత క్లారిటీగా చెప్పిన తరువాతకూడా నమ్మకుండా ఉండగలనా ........
హెడ్ మిస్ట్రెస్ : నమ్మకపోయుంటే నా కళ్లల్లో నీళ్లు వచ్చేసేవి మహేష్ సర్ అంటూ నవ్వుకున్నారు . మహేష్ సర్ ....... అందరూ తింటున్నా తను మాత్రం తినడం లేదు - అదిగో క్షణానికొకసారి మొబైల్ వైపు చూసుకుంటోంది పాపం ........
అవునా ....... , ప్చ్ ...... sorry sorry అమ్మా .......
హెడ్ మిస్ట్రెస్ : ఇంత తక్కువ సమయంలో చెంతకు చేరిన ప్రాణమైన బిడ్డకోసం - బిడ్డ తినడం కోసం ఆ మాత్రం wait చెయ్యడంలో తప్పేలేదు - ఇక మీ తల్లీ బిడ్డ ఇష్టం కాల్స్ చేసి మాట్లాడుకుని తింటారో లేక తనేమో ...... నువ్వు కాల్ చేస్తావని - నువ్వేమో ....... మీ అమ్మకు కాల్ చెయ్యకుండా నాకు కాల్ చేసి మాట్లాడుతుండటం , నన్నైతే కాసేపు డిస్టర్బ్ చెయ్యకండి చికెన్ బిరియానీ - కబాబ్ ....... అందరూ కుమ్మేస్తున్నారు , నీ కాల్ వలన వెనుక బడిపోయాను - డిన్నర్ తరువాత కాల్ చెయ్యి ఎంతసేపైనా మాట్లాడుతాను బై బై ....... మీ అమ్మకు కాల్ చేస్తావుకదా అని కట్ చేసేసారు .

అమ్మ నాకోసం తినకుండా నా కాల్ కోసం ఎదురుచూస్తున్నారా ...... ? , హృదయం - మనసు ఎంత పులకించిపోతోందో మాటల్లో వర్ణించలేను ఉమ్మా ఉమ్మా ...... - ఆ అమ్మకోసం ఈ అమ్మ ఇంత పరవశించిపోతోంది అంటే మరింత హ్యాపీగా ఉంది ఇదిగో ఇప్పుడే ఇప్పుడే కాల్ చేస్తాను అమ్మా అంటూ హృదయంపై ముద్దులుపెట్టుకుని అమ్మ మొబైల్ కు వీడియో కాల్ చేసాను - వీడియో కాల్ ఫెసిలిటీ లేదని వాయిస్ రావడంతో వాయిస్ కాల్ చేసాను .
వంటగది బయట గుసగుసలు వినిపించాయి .
ఎవరు అనేంతలో .......
అదేసమయానికి నా కాల్ కోసం మొబైల్ వైపు చూసినట్లు , ఒక్క రింగు కూడా పూర్తికాకముందే లిఫ్ట్ చేసి హలో హలో మహేష్ మహేష్ .......
అమ్మా అమ్మా ....... కూల్ కూల్ , sorry sorry కాల్ చెయ్యడం ఆలస్యం అయ్యినందుకు .......
మహేష్ సర్ కాల్ చేశాడా ...... ? , హ్యాపీ కదా ఇప్పటికైనా భోజనం చెయ్యండి మేడం ఇదిగో బిరియానీ అంటూ హెడ్ మిస్ట్రెస్ మాటలు వినిపించాయి .
అమ్మ : ఇటివ్వు ఇటివ్వు ...... , హ్యాపీ హ్యాపీ ......
అమ్మా ...... ముందు భోజనం చెయ్యండి - నేను తరువాత కాల్ చేస్తాను .
అమ్మ : భోజనం చేస్తూనే మాట్లాడగలను .
హెడ్ మిస్ట్రెస్ : అధికాదే ...... , నీ మహేష్ కూడా భోజనం చెయ్యాలికదా ...... , నువ్వు తింటేనే తినాలని తెలుసుకోవడానికి నాకు కాల్ చేసాడు ఇప్పుడే .......
అయితే ok ok మహేష్ ....... , భోజనం తరువాత .......
తింటూ మాట్లాడొచ్చు కదా అమ్మా ....... , మీతో మాట్లాడుతున్నంతసేపూ అమ్మ సో సో sooooo హ్యాపీ ........
అమ్మ : సరే అంతకంటే సంతోషమా చెప్పు , ఇంతకీ నీ చేతిలో ప్లేట్ ఉందా ? .
ఉంది ఉంది అమ్మా ...... తింటున్నాను కూడా .......
అమ్మ : ఈ అమ్మకే అపద్దo చెబుతున్నావు - తింటుంటే ఇదిగో మా హెడ్ మిస్ట్రెస్ ఫ్రెండ్ లా నోటి నుండి సౌండ్స్ వచ్చేవి .......
Sorry sorry అమ్మా ....... , వీడియో కాల్ కాకపోయినా కనిపెట్టేశారు - అవును అమ్మా ఇంతకూ మీ మొబైల్ కు వీడియో కాల్ లేదని చెబుతోంది .
అమ్మ : ఎందుకంటే ఇది కీప్యాడ్ మొబైల్ కాబట్టి మహేష్ .......
కీప్యాడ్ ....... ? అయితే హైద్రాబాద్ చేరగానే మా అమ్మ చేతిలోకి లేటెస్ట్ ఐఫోన్ .........
హెడ్ మిస్ట్రెస్ : లేటెస్ట్ కాదుకదా అప్డేటెడ్ వర్షన్ గిఫ్ట్ ఇచ్చినా వాడదు మహేష్ సర్ ........
అమ్మ : sorry sorry మహేష్ ....... , ఇది మహి ఇచ్చిన గిఫ్ట్ - ఈ మొబైల్ రింగ్ అయినప్పుడల్లా గుర్తుకొచ్చి పెదాలపై తియ్యదనం వచ్చేస్తుంది - ఉదయం 11 గంటల సమయంలో నువ్వు కాల్ చేసినప్పుడు అయితే నిజం చెబుతున్నాను మహి తల్లి కంటే ఎక్కువ ఆనందం కలిగింది .
Wow ......., థాంక్యూ థాంక్యూ సో మచ్ అమ్మా ...... , హ్యాపీనెస్ టచింగ్ స్కై అమ్మా ....... , అయితే మొబైల్ చేంజ్ చెయ్యనే వద్దు .
అమ్మ : తియ్యదనంతో నవ్వుతున్నారు . మహేష్ ...... నువ్వు తినేంతవరకూ నేను తినను .
హెడ్ మిస్ట్రెస్ : నువ్వు తినేంతవరకూ కూడా నీ బిడ్డ తనడే .......
అమ్మ : అయితే ఇప్పుడెలా ..... , మహేష్ ..... ఇద్దరమూ ఒకేసారి తింటూ మాట్లాడుకుందాము .
లవ్ టు అమ్మా ....... డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళుతున్నాను .

బయట ష్ ష్ ష్ అంటూ పరిగెత్తినట్లు సౌండ్స్ వినిపించాయి .
బయటకువచ్చిచూస్తే నార్మల్ గా ఎవరి ఛైర్స్లో వాళ్ళు కూర్చున్నారు . మహీ - సిస్టర్స్ ....... నేను మాట్లాడుతున్నంతవరకూ వంట గది బయట మీరేమైనా ఉన్నారా ? సౌండ్స్ వినిపించాయి .
అందరూ ఒకేసారి ప్చ్ ప్చ్ ప్చ్ ...... లేదే అంటూ సమాధానమిచ్చి తలలుధించుకుని ముసిముసినవ్వులు వినిపించినట్లు అనిపిస్తోంది . అమ్మా అమ్మా ....... ఏమీలేదు ఇక్కడ మీ బంగారు - బాపూ తల్లులు ...... నన్ను స్పై చేసినట్లు అనిపించింది . అమ్మా ...... ఇదిగో ప్లేట్ నిండా వడ్డించారు మీ తల్లులు అంటూ తిని సౌండ్ వినిపించిందా ...... ? .
అమ్మ : ఆ ఆ ...... అంటూ నవ్వుకున్నారు - మరి నా సౌండ్ వినిపించిందా ? .
వినిపిస్తోంది అమ్మా ...... , బిరియానీ కుమ్మేయ్యండి .
అమ్మ : మరి నువ్వు ? .
రోటీ అంటూ మొదలెట్టి ఐదారు వంటల లిస్ట్ చెప్పాను .
అమ్మ : చాలా సంతోషం ...... మహేష్ .
అమ్మా ...... బిరియానీ ఎలా ఉంది .
అమ్మ : బిరియానీ - కబాబ్ ...... సో టేస్టీ , లో బడ్జెట్ టూర్ అన్నది మా హెడ్ మిస్ట్రెస్ ఫ్రెండ్ కానీ ఇంకా హైద్రాబాద్ చేరకముందే మొత్తం మారిపోయింది , మా హెడ్ మిస్ట్రెస్ కు థాంక్స్ చెప్పాల్సిందే .......
హెడ్ మిస్ట్రెస్ : మై ఫ్రెండ్ ...... నీకు తెలిసి నేనెప్పుడైనా ఇలా ఖర్చు చేశానా ? .
అమ్మ : అదేకదా నా డౌట్ - కాలేజ్ లో సకల సౌకర్యాలకు తప్ప పావలా ఖర్చు చెయ్యని పిసినారివి కదా ......
హెడ్ మిస్ట్రెస్ : మరి ఎవరికోసం ఎవరు ఈ ఏర్పాట్లు చేశారో ఆలోచించు .......
అమ్మ : ఆలోచించాల్సిన విషయమే .......
అమ్మా ...... తరువాత తీరికగా ఆలోచించవచ్చు - ముందు మీ ఫ్రెండ్ తోపాటు పోటీపడుతూ తినాలి , ఇంకా 4 - 5 hours జర్నీ చెయ్యాలి .
అమ్మ : Ok మహేష్ అంటూ నవ్వుతున్నారు . సంతోషంతో నవ్వుతూ దగ్గు వచ్చింది .
అమ్మా అమ్మా ...... నీళ్లు నీళ్లు తాగండి , మహీ - దివ్యక్కా - చెల్లెమ్మా ...... నీళ్లు నీళ్లు .......
హెడ్ మిస్ట్రెస్ : ఏమీకాలేదులే మహేష్ నీళ్లు తాగింది .
అందరూ అందించారు .
Sorry sorry ...... నాకు కాదు , అమ్మా ...... నెమ్మది .
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ సర్ ....... , సంతోషంతో ఆనందబాస్పాలు వచ్చేస్తున్నాయి - ప్రక్కన లేవుకానీ ఉండి ఉంటే మహిని కూడా ప్రక్కకు తోసేసి కౌగిలించుకునేదేమో .........
దేవకన్య : అంటీ .......
హెడ్ మిస్ట్రెస్ : ప్రక్కనే ఉన్నారా ...... ? , మాటలే వినిపోయించలేదు . ఇదిమాత్రం నిజం - మీ అమ్మ కళ్ళల్లో కనిపిస్తోంది నాకు .......
దేవకన్య : అమ్మా ...... అపద్దo అని చెప్పు .
హెడ్ మిస్ట్రెస్ : ఎలా చెబుతుందే అదే నిజం అయితేనూ ....... , మహీ తల్లీ ...... మీ అమ్మను నీకంటే ప్రాణంలా చూసుకునే దేవుడు వచ్చేశాడు .
నో నో నో మేడం గారూ ....... , మహికి ...... అమ్మ అంటే ఎంత ప్రాణమో చూసిన తరువాతనే కదా ........ ఆగిపోయాను .
హెడ్ మిస్ట్రెస్ : చూసిన తరువాతనే కదా ........ తరువాత తరువాత ఏంటి మహేష్ సర్ .......
అలా అన్నానా లేదే ....... , మేడం గారూ ...... మీ పేరేంటో చెప్పలేదు .
హెడ్ మిస్ట్రెస్ : మాట మారుస్తున్నావన్నమాట ok ok ...... , మా దేవుడిని ఇబ్బందిపెట్టడం నాకైతే ఇష్టం లేదు .
అమ్మ : దేవుడా ...... ? .
హెడ్ మిస్ట్రెస్ : అర్థం చేసుకో ....... , మహేష్ సర్ ....... నాపేరు వసుంధర ......
వసుంధర మేడం - స్వీట్ నేమ్ .......
వసుంధర మేడం : థాంక్యూ మహేష్ ........

మహీ ...... అమ్మ పేరు తెలుసుకోవచ్చా ? - అమ్మా .......
అమ్మ చెప్పేంతలో ...... దేవకన్య మొబైల్ లాక్కుంది - స్పీకర్ ఆఫ్ చేసేసింది .
మహీ మహీ ........
విద్యు సిస్టర్ : డార్లింగ్ ..... ఏమైందే ......
దేవకన్య : ( అమ్మ పేరు తెలుసుకదే స్వీటెస్ట్ నేమ్ - అమ్మ అమ్మ అంటూ ఇక నా పేరు మరిచిపోయినా మరిచిపోతాడు ) గుసగుసలాడింది .
విద్యు సిస్టర్ : అవునవును నిజమే నిజమే .......
దేవకన్య : అమ్మా ...... ఇంతసేపు మాట్లాడారు కదా ఇక చాలు తృప్తిగా భోజనం చెయ్యండి & హ్యాపీ జర్నీ అంటూ కట్ చేసేసింది .
మహీ మహీ ....... కట్ చేసేసావా ? .
దేవకన్య : అవును , మాట్లాడింది చాలు - తింటూ మాట్లాడకూడదు కదా అందుకే కట్ చేసాను , తినండి తినండి .......
Ok ok , మొబైల్ .......
దేవకన్య : భోజనం అయ్యేంతవరకూ ఇచ్చేది లేదు అంటూ వడ్డించింది . ఎనీవే ల ........ థాంక్యూ థాంక్యూ సో మచ్ అంటూ హృదయంపై ముద్దుల వర్షమే కురిసింది .
ఆఅహ్హ్ ఆఅహ్హ్ ...... అమ్మ సో సో sooooo హ్యాపీ .......
విద్యు సిస్టర్ : అయితే మీరు కూడా అన్నమాట .......
చెల్లెమ్మ : ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాలా అక్కయ్యలూ .......
అవునవును అన్నట్లు తల ఊపాను .
దేవకన్య : రుచికరమైన వంటలన్నీ ఎదురుగా ఉన్నప్పటికీ డిన్నర్ చెయ్యనిచ్చేలా లేవు మహేష్ ........
Sorry లవ్ యు లవ్ యు మహీ ........ , ఇదిగో డిన్నర్ పూర్తయ్యేంతవరకూ సైలెంట్ గా తింటాను .
దేవకన్య : నాకు డౌటే , మొదట అతిముఖ్యమైనవారికి కాల్ చెయ్యాలని 10 నిమిషాలు వేస్ట్ చేసావు .
ఆ 10 నిమిషాలూ ...... అమ్మతో మాట్లాడాను - వన్ ఆఫ్ ద బెస్ట్ మోమెంట్స్ ఆఫ్ మై లైఫ్ మహీ .......
దేవకన్య : ఇప్పుడేమో అందరినీ డిస్టర్బ్ చేస్తున్నావు .
ఇందులో నా తప్పేమీ లేదు .
దేవకన్య : మరి మా తప్పా ....... ? .
భయపడుతూనే అవునుమరి , ఒక ముద్దుపెడితేనే హృదయం - హృదయంలో ఉన్న అమ్మ ఆనందాలకు అవధులు ఉండవు ఏకంగా ముద్దుల వర్షం కురిపించి తప్పు నాదంటే ఎలా ...... ? , ఆ ఫీల్ ను ఆస్వాధిస్తేనే కానీ నీకు తెలియదు . కావాలంటే మీ అన్నయ్యలిద్దరినీ అడుగు .......
ఆఅహ్హ్ - ఆఅహ్హ్ ...... అంటూ బావగారు - కృష్ణగాడు ప్రాణంలా దివ్యక్క - చెల్లెమ్మలవైపు చూస్తూ లవ్ యు లు చెబుతూ తెగ మెలికలు తిరిగిపోతున్నారు . కంట్రోల్ చేసుకోలేక ఏకంగా పెదాలపై ముద్దులుపెట్టేశారు .
చూశావా మహీ ....... ఫీలింగ్ చెబితేనే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు ఇక నా పరిస్థితి అంటూ దేవకన్య పెదాలవైపు ఆశతో చూస్తూ పెదాలను తడుముకున్నాను.
నా ఇంటెన్షన్ అర్థమైపోయినట్లు మహేష్ నిన్నూ ...... అంటూ ఎడమచేతితో దెబ్బలవర్షమే కురిపించింది దేవకన్య ......
ప్చ్ ...... ఆ అదృష్టం ఎప్పుడో ఏమిటో , స్టిల్ I LOVE YOU SO SO MUCH మహీ ....... ఉమ్మా ఉమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
విద్యు సిస్టర్ : మహేష్ సర్ ...... మీరు ఊ అంటే ముద్దులివ్వడానికి క్యూ లో అందగత్తెలు నిలుస్తారు .
అదీ నిజమేలే అంటూ సిగ్గుపడ్డాను . కానీ సిస్టర్ ...... ఇక్కడ చోటు కేవలం కేవలం ........
దేవకన్య : అంటీ మరియు నేను అంటావు అంతేకదా అంటూ అటువైపుకు తిరిగి తెగ పులకించిపోతోంది .
మరొకరు కూడా జతకలిశారు మహీ ...... , ఈ సభాముఖంగా అందరికీ తెలియచేయుచున్నాను అంటూ హృదయంపై రెండు ముద్దులు - దేవకన్యబుగ్గపై చేతితో ఒక ముద్దుపెట్టాను .
దివ్యక్క : అనుకున్నాము అనుకున్నాము కొద్దిసేపటి ముందు ఫోనులో మాట్లాడినప్పుడే అనుకున్నాము . అమ్మ - దేవకన్యతోపాటు మరొకరు కూడా add అయిపోయారని , లవ్ యు అన్నయ్యా ........
దేవకన్య : దివ్యా ఎవరు ...... ? , బల్బ్ వెలిగినట్లు అయ్యో అంటూ మొట్టికాయ వేసుకుని నావైపు ఒకచూపు చూసింది ఆఅహ్హ్ ...... తియ్యనైన జలదరింపు ...... , సైలెంట్ అన్నాడు కానీ తిననివ్వకుండా నవ్విస్తూనే ఉన్నాడు .
తప్పైతే ........
చెల్లెమ్మ : రియల్లీ తప్పైతే అన్నయ్యది కాదు కదా అన్నయ్యా అంటూ అందరూ నవ్వుకున్నారు .
దేవకన్య : సంతోషిస్తూ ఉమ్మా ..... అంటీకి - ఉమ్మా ...... అమ్మకు , ఈ క్షణం నుండీ రెండు ముద్దులుపెట్టాలి .
యాహూ ....... లవ్ యు లవ్ యు అమ్మలూ - మీ వలన రెండు ముద్దులట , ఇక మాట్లాడను తినండి తినండి అంటూ మళ్లీ మాట్లాడుతూ - చిరునవ్వులు చిందిస్తూ భోజనం కానిచ్చాము .

డిషష్ శుభ్రం చేసేసివచ్చి , దేవకన్య - చెల్లెమ్మ - మహి - సిస్టర్స్ ....... గుసగుసలాడుకుని , ముసిముసినవ్వులతో హౌస్ వార్డెన్ సర్ ....... తినగానే చదువుకోవాలా లేక కాసేపు గార్డెన్ లో సేదతీరవచ్చా అని అడిగారు . దేవకన్య ...... నా చేతికి మొబైల్ అందించింది .
నవ్వుకుని , క్యారి ఆన్ క్యారి ఆన్ ........
లవ్ యు అంటూ అందరూ సంతోషంతో బయటకువెళ్లారు .
అందరూ సరదాగా ఆనందిస్తుండటం చూస్తూ మొబైల్ తీసి లోకల్ మేనేజర్ కు కాల్ చేసాను .
మహేష్ సర్ .......
మేనేజర్ గారూ ....... రేపు మీకొక ముఖ్యమైన పని అప్పచెప్పబోతున్నానని చెప్పానుకదా ......
మేనేజర్ : Yes సర్ ...... i am రెడీ ......
I know మేనేజర్ గారూ ........ , పాస్పోర్ట్స్ - వీసా లకోసం మీకు ఎన్నైతే ఆధార్ కార్డ్స్ పంపించానో వాటిలో except మహి అందరి అడ్రస్ లకు వెళ్లి , నేను పంపించినట్లుగా నాకు కాల్స్ చేయించి రేపు మధ్యాహ్నం లోపు పిల్లలను అతి జాగ్రత్తగా వైజాగ్ తీసుకురావాలి . పిల్లలు ...... చాలా ముఖ్యమైనవారు కాబట్టి మీకు నమ్మకస్థులైన వారిని ఫ్లైట్ - ట్రైన్ - బస్ - కార్స్ ...... ఫెసిలిటీ తగ్గట్లుగా పిలుచుకుని వచ్చేలా పంపించాలి , ఎట్టి పరిస్థితుల్లో ...... రేపు మధ్యాహ్నానికి మన ఇంటిలో ఉండాలి .
మేనేజర్ : ఉదయం వెళితే ఆలస్యం అవ్వవచ్చు , నాతోపాటు అందరమూ ఆయా అడ్రస్ లకు ఇప్పుడే వెళ్లిపోతాము మహేష్ సర్ ......
థాంక్యూ మేనేజర్ గారూ ....... మీ కంఫర్ట్ - ఓకేఒక్కమాట పిల్లలు జాగ్రత్త .
మేనేజర్ : Yes సర్ ........

కొద్దిసేపు అనిచెప్పి 10 గంటలయినా గార్డెన్ లోనే ఎంజాయ్ చేస్తున్నారు . చినుకులు పడటంతో లోపలికి పరుగులుతీశారు కానీ లేకపోతే అర్ధరాత్రైనా కాంపౌండ్ గార్డెన్ లోనే సరదాగా గడిపేవారు .
మళ్లీ అందరూ గుసగుసలాడుకుంటున్నారు .
ఈసారి ఏమి ఆర్డర్స్వెయ్యబోతున్నారో అని చూస్తున్నాను .
మళ్లీ ముసిముసినవ్వులతో హౌస్ వార్డెన్ గారూ ....... , నిద్రొస్తోంది రేపు ఉదయమే లేచి చదువుకుంటాము ప్లీజ్ ప్లీజ్ .......
ఇలా అయితే కష్టం - రేపటి నుండి టైం టేబుల్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సిందే నో ఎస్క్యూసెస్ .......
Ok ok అంటూ పైకి పరుగులుతీశారు .

సడెన్ గా విద్యు సిస్టర్ ..... నా దేవకన్యను ఆపి , పనిష్మెంట్ అంటూ నావైపుకు చూయించి వెల్లమన్నారు .
What పనిష్మెంట్ సిస్టర్ అంటూ కన్ఫ్యూజ్ గా చూస్తున్నాను .
దేవకన్య : తప్పదా డార్లింగ్స్ ప్చ్ ప్చ్ ....... అంటూ నావైపు చిలిపికోపంతో చూస్తూవచ్చి , చేతిని చుట్టేసి పదండి హీరోగారూ ......
పెదాలపై తియ్యదనంతో ఉమ్మా ఉమ్మా ఉమ్మా ..... లవ్ యు సో మచ్ మహీ - లవ్ యు సిస్టర్ అంటూ దేవకన్య మధురాతిమధురమైన వెచ్చని స్పర్శను ఆస్వాదిస్తూ పైన గదికి చేరుకున్నాము .
దేవకన్య : గదిలోకి వచ్చేసాముకదా , ఇక నన్ను వదిలితే .......
చిలిపినవ్వులతో వదిలి మెలికలుతిరిగిపోతున్నాను .
సిస్టర్స్ అందరూ నవ్వుకుని , బెడ్స్ రెడీ చేసి - నైట్ డ్రెస్సెస్ తీసుకుని పైనున్న గదులలోకి వెళ్లారు . నా దేవకన్య మాత్రం తన బెడ్ తోపాటు నా బెడ్ రెడీ చేసి పడుకోండి అంటూ బెడ్ పైకి చేరింది .
మహీ ...... నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోవా ...... ? , ఇష్టం లేకపోయినా ఆడిగేసాను .
దేవకన్య : ఉదయం వరకూ పట్టుచీరలోనే ఉంటాను అని మా దేవుడికి మాటిచ్చాను పడుకో గుడ్ నైట్ .......
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ....... లవ్ యు లవ్ యు sooooo మచ్ మహీ ....... , గుడ్ నైట్ అంటూ దేవకన్యవైపుకు తిరిగి కన్నార్పకుండా చూస్తూ బెడ్ పై వాలిపోయాను .
సిస్టర్స్ ఒక్కొక్కరే నైట్ డ్రెస్ లో వచ్చి గుడ్ నైట్స్ చెప్పి పడుకున్నారు .
గుడ్ నైట్ గుడ్ నైట్ సిస్టర్స్ ........

Except నైట్ లాంప్ లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాక చిన్న వెలుగులో విద్యు సిస్టర్ చేతిని చుట్టూ వేసుకుని నావైపుకు తిరిగిపడుకున్న నా దేవకన్యవైపు చిరునవ్వులతో మరియు మొబైల్ వైపు కంగారుపడుతూ పదేపదే చూస్తున్నాను . అలా గంట గడిచింది , నా దేవకన్య కూడా నిద్రపోనట్లు తెలుస్తోంది .

( దేవకన్య : విద్యు డార్లింగ్ విద్యు డార్లింగ్ .......
విద్యు సిస్టర్ : మ్మ్మ్ మ్మ్మ్ ......
దేవకన్య : విద్యు డార్లింగ్ అప్పుడే నిద్రపట్టేసిందా అంటూ బుగ్గపై గిల్లేసింది )

స్స్స్ స్స్స్ ..... అంటూ విద్యు సిస్టర్ చేతిపై రుద్దుకుంటోంది .
సిస్టర్ సిస్టర్ ...... ఏమైంది ? .
విద్యు సిస్టర్ : స్స్స్ ..... మీ దేవకన్య .......
దేవకన్య : నథింగ్ నథింగ్ మహేష్ ...... దోమ కొరికినట్లు ఉంది .
దోమనా దోమనా ....... , నా దేవకన్య - సిస్టర్స్ గదిలో దోమలా ....... , ఇప్పుడే మస్కిటో బ్యాట్ తో .......
దేవకన్య : కూల్ కూల్ కూల్ మహేష్ ...... , మన గదిలోనే కాదు మన ఇంట్లోనే దోమలు లేవు , ఓకేఒకటి ఇక్కడనుండి వచ్చిందో ...... మీ విద్యు సిస్టర్ నలిపేసిందిలే ......
సిస్టర్ ...... నొప్పిగా ఉందా ? .
దేవకన్య : లవ్ యు డార్లింగ్ అంటూ ముద్దుపెట్టి , చేతిని చుట్టూ వేసుకుని పడుకుంది .

( విద్యు సిస్టర్ : గిళ్ళుటకు కారణం డార్లింగ్ .......
దేవకన్య : రోజూ నన్నుచూస్తూ నిమిషాలలో హాయిగా నిద్రపోయే దేవుడు ఈరోజు అయితే గంట దాటినా నిద్రపోవడంలేదు పైగా నవైపుకంటే మొబైల్ వైపే ఎక్కువసేపు చూస్తున్నాడు .
విద్యు సిస్టర్ : నీ వైపు కాకుండా మొబైల్ వైపు ....... అలా జరగనే జరగదు - కళ్ళు మూతలుపడేంతవరకూ నిన్నుతప్ప వేరే .......
దేవకన్య : అదిగో అదిగో నువ్వే చూడవే .......
విద్యు సిస్టర్ : అవును నిజమేనే ....... , ఇదైతే షాకింగ్ ...... నీవైపు ఒక నిమిషం చూస్తే - మొబైల్ వైపు అంతకంటే ఎక్కువసేపే చూస్తున్నారు , నీకంటే ఏదో ముఖ్యమైనదే అయిఉంటుంది . దేనికోసం wait చేస్తూ మొబైల్ వైపు చూస్తున్నారో ఆ ముఖ్యమైనది తెలుసుకోవాలి .
దేవకన్య : అడగవే అడగవే .......
విద్యు సిస్టర్ : నేనా ...... ? , ok ok ....... మా డార్లింగ్ కోసం .
దేవకన్య : లవ్ యు వే ...... ) .

విద్యు సిస్టర్ : మహేష్ సర్ ...... ఏంటి నిద్ర రావడం లేదా ? .
ఘాడంగా వస్తోంది సిస్టర్ ......
సిస్టర్ : మరి నిద్రపోకుండా ...... , మీ దేవకన్యవైపైనా కాకుండా పదేపదే మొబైల్ వైపు చూస్తున్నారు .
దేవకన్య : నావైపు ఎందుకు చూడాలే అంటూ సిస్టర్ చేతిని కొరికేస్తోంది .
సిస్టర్ : స్స్స్ స్స్స్ .......
నవ్వుకుని , ష్ ష్ ...... సిస్టర్ - మహీ ...... హాయిగా నిద్రపోతున్నారు మీ డార్లింగ్స్ , నెమ్మదిగా .......
దేవకన్య : మరి మీరెందుకు నిద్రపోవడం లేదు ? .
అమ్మ - స్టూడెంట్స్ ...... సేఫ్ గా హైద్రాబాద్ చేరేంతవరకూ నాకు నిద్ర ఎలా పడుతుంది చెప్పండి .
అంతే దేవత కళ్ళల్లో చెమ్మతో లేచి కూర్చుంది . మహీ ...... ఏంటా కన్నీళ్లు ...... అంటూ లేచికూర్చున్నాను .
దేవకన్య : కన్నీళ్లను తుడుచుకుని , నిన్నూ అంటూ లేచివచ్చి నాప్రక్కనే కూర్చుంది . అయినా కన్నీళ్లకు - ఆనందబాస్పాలకు తేడా తెలియదా నీకు ...... అంటూ ఛాతీపై దెబ్బలవర్షం కురిసింది .
తెలుసు తెలుసు ఇదిగో ఇలా నా దేవకన్య ...... నా ప్రక్కన కూర్చుని ప్రేమతో ఇచ్చే దెబ్బలకోసం అలా .......
దేవకన్య : నిన్నూ ....... అంటూ కొట్టబోయి , ల ...... థాంక్యూ మహేష్ అంటూ హృదయంపై రెండు ముద్దులు - బుగ్గపై ఒకముద్దుపెట్టింది అమితమైన ఆనందంతో ........
యాహూ యాహూ ....... అని కేకలువేసేంతలో ....... , నా నోటిని చేతులతో మూసేసింది దేవకన్య .
Yes yes sorry ....... అంటూ సైలెంట్ గా ఎంజాయ్ చేస్తున్నాను .
దేవకన్య : Thats గుడ్ అంటూ మళ్లీ నా హృదయంపై చేతులతో రెండు ముద్దులు ........ , మహేష్ ...... అమ్మావాళ్ళు ఎక్కడిదాకా చేరుకుని ఉంటారు - ఇంకెంత సమయం పడుతుంది .
నాకు తెలిసి మరొక గంట అయినా పట్టొచ్చు .......
దేవకన్య : అర్ధరాత్రి అవుతుందా ? అంటూ కంగారుపడుతోంది .
నో నో నో ....... everything టేకెన్ కేర్ మహీ - యు డోంట్ వర్రీ ...... నీ ప్రియుడుకున్నాడుకదా ......
దేవకన్య : నిన్నూ .......
Ok ok ok నేనున్నానుకదా ...... , స్వయంగా మన కంపెనీ చీఫ్ మేనేజర్ ఫ్యామిలీ రిసీవ్ చేసుకుని , టూర్ మొత్తం తోడుగా ఉండి ప్లేసస్ అన్నీ చూయించి అంతే సేఫ్ గా వైజాగ్ చేరేలా చూస్తారు .
దేవకన్య : మళ్లీ ఆనందబాస్పాలతో ఏకంగా కౌగిలించుకోబోయి , నో నో నో అంటూ లేచివెళ్లి విద్యు సిస్టర్ ను కౌగిలించుకుని బుగ్గపై ముద్దులు కురిపిస్తోంది .
సిస్టర్ : మహేష్ సర్ ...... ఈ ముద్దులన్నీ మీవే ......
తెలుసు తెలుసు సిస్టర్ ...... , ఆ అదృష్టం కోసం ఎన్ని యుగాలైనా సంతోషంగా wait చేస్తాను .
సిస్టర్ : సూపర్ మహేష్ సర్ ........

పొగిడే బదులు అమ్మ పేరు - అమ్మ ఫోటో చూయించొచ్చుకదా మహీ - సిస్టర్ ......
సిస్టర్ : ఇదిగో ఇప్పుడే మొబైల్ లో చాలా సెల్ఫీలు - పిక్స్ ఉన్నాయి .
దేవకన్య : నో నో నో డార్లింగ్ ....... , అమ్మ పేరు - ఫోటోలు చూయిస్తే ఇక అంతే , కాల్ కోసమే ఇంతలా ఎదురుచూస్తున్నాడు ఇక అదేజరిగితే అమ్మనే తలుచుకుంటూ చూస్తూ 24/7 ఉండిపోతాడు , నావైపు కన్నెత్తైనా చూడడే ..... వద్దు వద్దు ప్లీజ్ .......
సిస్టర్ : ముందు స్వీట్ వెనుక స్వీట్ లా ఉంది నా పరిస్థితి . ఇప్పుడెలా ....... ? .
సిస్టర్ సిస్టర్ ...... మీకు - నాకు దేవకన్యనే ఫస్ట్ .
సిస్టర్ : థాంక్యూ మహేష్ సర్ .......
స్ట్రెయిట్ గా నా దేవకన్యనే అడుగుతాను . ప్లీజ్ ప్లీజ్ మహీ .......
దేవకన్య : నో అంటే నో ...... , మహేష్ ...... ఒక ప్రామిస్ చెయ్యి .
ప్రామిస్ .......
విద్యు సిస్టర్ : మహేష్ సర్ ...... ముందూ వెనుకా ఆలోచించండి .
నా దేవకన్య కోరడమూ నేను ఆలోచించడమూనా ..... ? , ప్రామిస్ .......
దేవకన్య : థాంక్యూ ....... , నేనే స్వయంగా అమ్మ పేరు - అమ్మ ఫోటో చూయించేంతవరకూ వేరే ఎవ్వరినీ అడగకూడదు ముఖ్యన్గా మీ భక్తురాలైన దీనిని ........
అంతేనా మహీ .......
దేవకన్య : దేవకన్య కోరడమూ ...... ఆలోచి ......
Ok ok అంటూ నవ్వుకున్నాను . ఎందుకు ఇలా ప్రామిస్ చేయించావో నాకైతే అర్థం కావడం లేదు .
సిస్టర్ : ఏమీలేదు మహేష్ సర్ ...... , దీనికంటే ఎక్కువ ఆరాధిస్తారేమోనని దీని భయం , అమ్మే ..... మీ దేవకన్య లోకం , అమ్మను ...... తనకంటే ఎక్కువగా ......
" అమ్మ " అన్న మధురమైన పిలుపే ప్రాణం మహీ ...... , అమ్మ అనే పిలుపుకోసం - అమ్మ సంతోషంగా ఉండటం కోసం ఏమైనా చేస్తాను ఎంతదూరం అయినా వెళతాను , అమ్మను ...... నీ తరువాత అంత ప్రేమతో చూసుకుంటాను , ఒక్కొక్కసారి ప్రామిస్ కూడా బ్రేక్ అవ్వవచ్చు .

దేవకన్య : నాకిచ్చిన ప్రామిస్ కూడా బ్రేక్ అయ్యేంత ప్రాణం అన్నమాట బ్రదర్ .......​
Next page: Update 41
Previous page: Update 39