Update 42

హైద్రాబాద్ లో ప్రయాణం వలన మరియు రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వలన అమ్మా వాళ్ళు - పిల్లలు అందరూ ఆలస్యంగా లేచి రెడీ అయ్యేటప్పటికి 9 గంటలు అయ్యింది . అంతలోపు పిల్లలున్న అన్నీ రూమ్స్ కు మిల్క్ - బూస్ట్ - హార్లిక్స్ - బ్రెడ్ - బిస్కట్స్ మరియు అమ్మా - మేడమ్స్ రూమ్స్ కు టీ - కాఫీ - బిస్కట్స్ చేరాయి .
పిల్లలు తింటూనే వాళ్ళ వాళ్ళ ఇంటికి కాల్స్ చేసి ప్యాలస్ గురించి వివరించి ఆనందిస్తున్నారు .
పిల్లలు రెడీ అయ్యారని తెలియగానే అమ్మా - మేడమ్స్ ...... మిస్సెస్ మేనేజర్ కు తెలిపారు .
మిస్సెస్ మేనేజర్ : అమ్మావాళ్లకు గుడ్ మార్నింగ్ చెప్పి కిందకు పిలుచుకునివెళ్లారు - రెసెప్షన్ దగ్గరికివెళ్లి అన్నీ రూమ్స్ కు ఒకేసారి కనెక్ట్ చెయ్యమని చెప్పారు . ప్రతీ రూంలోని ఫోన్స్ రింగ్ అవ్వడంతో పిల్లలు రిసీవ్ చేసుకున్నారు .
రిసెప్షనిస్ట్ : మేడం ...... అన్నీ రూమ్స్ కు కనెక్ట్ అయ్యాయి - వింటున్నారు మాట్లాడండి .
మిస్సెస్ మేనేజర్ : స్టూడెంట్స్ ...... నేను మీ మేడం అమ్మ మేనేజర్ - మీ టూర్ ప్లానర్ మాట్లాడుతున్నాను . Its బ్రేక్ఫాస్ట్ టైం ...... మీకు రెండు ఛాయిస్ ఉన్నాయి ఒకటి కిందకువచ్చి ప్యాలస్ రెస్టారెంట్ లో ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేసి అందరూ కలిసి టిఫిన్ చెయ్యడం - రెండు ఇష్టమైనవన్నీ ఇలా ఫోనులో ఆర్డర్ చేసి మీ మీ రూమ్ లలోనే తినడం ....... మీ ఇష్టం .
అందరమూ కలిసి ప్యాలస్ రెస్టారెంట్ లోనే - అదికూడా మేడం అమ్మతోపాటు కలిసి తింటాము .
మిస్సెస్ మేనేజర్ : మీ డెసిషన్ ఇదేనని నాకు తెలుసులే - ప్రతీ స్టూడెంట్ రిప్లై మేడం అమ్మ మేడం అమ్మతోపాటు తింటాము - అయితే కిందకు వచ్చెయ్యండి మరి - ఇటునుండి ఇటే వెళతాము కాబట్టి సాయంత్రం వరకూ మీకు అవసరమైనవాటిని తోడుగా తీసుకుని వచ్చెయ్యండి - బోలెడన్ని సూపర్ ప్లేసస్ చూడబోతున్నాము .
పిల్లల సంతోషపు కేకలతో ప్యాలస్ దద్దరిల్లిపోయింది .

ఫోన్ కట్ చెయ్యడం ఆలస్యం స్టూడెంట్స్ అందరూ బుజ్జి బుజ్జి బ్యాక్ ప్యాక్స్ తో కిందకువచ్చి గుడ్ మార్నింగ్ మేడం అమ్మ గుడ్ మార్నింగ్ మేడమ్స్ ....... అంటూ చుట్టూ చేరారు .
అమ్మ : అందరూ బూస్ట్ - హార్లిక్స్ తాగారుకదా ...... ? .
Yes yes yes .......
అమ్మ : గుడ్ .......

రిసెప్షనిస్ట్ : మేడం ....... ఇంతమంది పిల్లలకు రెస్టారెంట్ సరిపోదు .
మిస్సెస్ మేనేజర్ : ఛైర్స్ లో మాత్రమే కాదు మా గూడ్ స్టూడెంట్స్ టేబుల్స్ పైకి ఎక్కికూడా తినేస్తారు - ఒకేసారి అందరూ కలిసి తినాలని కోరిక - స్టూడెంట్స్ ఏమంటారు ? .
Yes yes yes ........
మిస్సెస్ మేనేజర్ : డ్యామేజ్ అయితే బిల్ వెయ్యండి అనిచెప్పి , మేడమ్స్ - పిల్లలూ ...... అంటూ రెస్టారెంట్ కు పిలుచుకునివెళ్లారు . పిల్లలూ ...... మీఇష్టం నో లిమిటెడ్ ఎన్నైనా ఆర్డర్ చెయ్యండి గో గో .......
స్టూడెంట్స్ : మేడం అమ్మా - మేడమ్స్ ...... మీకోసం అంటూ మధ్యలోని టేబుల్ వదిలి రెస్టారెంట్ మొత్తం ఆక్రమించేశారు .
అమ్మ - మేడమ్స్ : థాంక్యూ అంటూ బుజ్జాయిలను ఎత్తి తమ టేబుల్ పై కూర్చోబెట్టి ఆర్డర్ అంటూ మెనూ అందించారు .
సర్వర్స్ ....... అన్నీ టేబుల్స్ కు మెనూ కార్డ్స్ అందించారు - స్టూడెంట్స్ అందుకుని అమ్మ మేడమ్స్ వైపు చూసారు .
మిస్సెస్ మేనేజర్ : మేడం గారూ ...... మీరు ok అంటేనే అన్నమాట , నో లిమిట్ అంటూ ok అనండి మరి .......
అమ్మ - మేడమ్స్ ...... సైగలు చెయ్యడం ఆలస్యం , థాంక్యూ మేడమ్ అమ్మా - మేడమ్స్ అంటూ ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేసేసి లగ్జరీయోస్ గా రాగానే ఇష్టంతో తినడం చూసి ఆనందిస్తూ థాంక్యూ థాంక్యూ మహేష్ అంటూ తలుచుకున్నారు .
అమ్మ - మేడమ్స్ కూడా ఆర్డర్ ఇచ్చి తిని బస్సుల దగ్గరికి చేరారు .

మిస్సెస్ మేనేజర్ : స్టూడెంట్స్ ....... మీ మేడమ్స్ ప్లాన్ ప్రకారం ఫస్ట్ ప్లేస్ టు విజిట్ .........
స్టూడెంట్స్ : చార్మినార్ చార్మినార్ ........
మిస్సెస్ మేనేజర్ : Yes yes అక్కడికే వెళుతున్నాము - జాగ్రత్తగా డిసిప్లిన్ గా ఎక్కండి మనం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు ఎందుకంటే ఆ నిమిషం సమయంలో ఏమైనా చూడొచ్చు .
Yes మేడం అంటూ స్టూడెంట్స్ అందరూ బస్సెస్ ఎక్కారు - వెనుకే ఇద్దరిద్దరు టీచర్స్ ఒక్కొక్క బస్సులో ఎక్కడంతో పిల్లల సంతోషపు కేకలతో బస్సులు బయలుదేరాయి .
స్టూడెంట్స్ ...... సంతోషాలను వీక్షిస్తూ , వసుంధరా ...... ఈ ఆనందాలకు కారణమైన దేవుడికి కాల్ చేస్తాను అంటూ మొబైల్ అందుకున్నారు అమ్మ .
*************

ఏంజెల్ ఏంజెల్ ...... నేను కేకలువేసినది మిమ్మల్ని చూసి కాదు అని కృష్ణగాడు మొరపెట్టుకుంటున్నా వినకుండా లేదు లేదు నన్ను చూసే - నువ్వు ...... మీ అత్తయ్యనే సపోర్ట్ చేస్తున్నావు అంటూ కొడుతోంది - గిల్లేస్తోంది చెల్లెమ్మ .
ఏంజెల్ ....... నీకు అలా అర్థమయ్యిందా అంటూ అందరితోపాటు నవ్వేశాడు కృష్ణగాడు .
చెల్లెమ్మ : అదిగో మళ్లీ నవ్వుతున్నావు - నాకంటే నీకు ...... మీ అత్తయ్య అంటేనే ఇష్టం అంటూ మళ్లీ ఒక రౌండ్ వేస్తోంది . ఇంత కొడుతున్నా ఎందుకు నవ్వావో చెప్పడం లేదు నువ్వు .......
రేయ్ మామా ....... చెప్పావో అయిపోయావు అంతే అంటూ కళ్ళతోనే సైగలుచేసాను .
దేవకన్య కంటపడింది - అంటే ఇదంతా తమరి నిర్వాకం అన్నమాట అంటూ నడుముపై గిల్లేసింది .
స్స్స్ ...... అంటూ కేక వెయ్యబోయి , ఒకచేతితో నోటిని లాక్ చేసేసి మరొకచేతితో రుద్దుకుంటున్నాను .
కృష్ణగాడు : లేదు లేదు ........
చెల్లెమ్మ : అంటే చెప్పవన్నమాట అంటూ వెంట్రుకలను లాగేస్తోంది .
కృష్ణగాడు : చెప్పకపోతే ఇలా చెబితే ఇంకోలా ....... , చెప్పి ఆ దెబ్బలు తినడం కంటే నా ఏంజెల్ స్వీటెస్ట్ దెబ్బలు తినడం బెటర్ .......
చెల్లెమ్మ : అవునా అవునా .......
దేవకన్య : చెల్లెమ్మా చెల్లెమ్మా ....... అంటూ లేచివెళ్లి ప్రక్కన కూర్చుని నడుముచుట్టేసి , కూల్ కూల్ అంటూ బుగ్గపై ముద్దులుపెడుతోంది .
అంతే చెల్లెమ్మ పెదాలపై చిరునవ్వులు .......
కృష్ణగాడు : హమ్మయ్యా ...... , లవ్ యు సిస్టర్ ..... అంటూ చెల్లెమ్మ మరొక బుగ్గపై ముద్దుపెట్టాడు . ఏంజెల్ ....... మా అత్తయ్యగారి కంటే నువ్వంటేనే ప్రాణం - నా సపోర్ట్ ఎప్పుడూ నీకే ........
చెల్లెమ్మ : లవ్ యు బేబీ అంటూ నా దేవకన్య బుగ్గపై ముద్దుపెట్టింది .
దేవకన్య : ఈ ముద్దు మా బుజ్జి అన్నయ్య కోసమే కదా - ఇక మీ మధ్యన నేనెందుకు అంటూ లేచివచ్చి నా ప్రక్కన కూర్చుంది .

లవ్ యు సిస్టర్ ...... , విషయం బయటకు రాలేదు - దెబ్బలుపడటం లేదు , నాకుకూడా ........ నా దేవకన్య బుగ్గపై ....... అంతలో మొబైల్ రింగ్ అయ్యింది .
దేవకన్య : ముద్దుపెట్టాలని ఉందా ...... ? , ముందు మొబైల్ సంగతి చూడండి బ్రదర్ తెగ మ్రోగుతోంది .
Ok సిస్టర్ అంటూ ప్యాంటు జేబులోనుండి తీసాను . పెదాలపై అంతులేని ఆనందం ........
దేవకన్య : అమ్మ ..... అంటూ మొబైల్ లాక్కుంది . టూర్ కు బయలుదేరిన దగ్గర నుండి ప్రాణమైన నాకు ఒక్కకాల్ కూడా చెయ్యలేదు - ఇక్కడేమో నాకు తెలిసి మూడు సార్లు కాల్ చేసింది అమ్మ . డార్లింగ్స్ ...... మీకేమైనా చేశారా ? .
సిస్టర్స్ : ప్చ్ ప్చ్ ప్చ్ ....... , మహీ డార్లింగ్ ...... కాల్స్ ను బట్టి అమ్మకు ఎవరంటే ఎక్కువ ప్రాణమో తెలిసిందా ...... ? .
సిస్టర్ సిస్టర్ ....... తరువాత కోప్పడవచ్చు ముందు కాల్ కాల్ .......
దేవకన్య : హుమ్మ్ ...... అంటూ కాల్ ఎత్తి స్పీకర్లో ఉంచింది .

స్టూడెంట్స్ సంతోషపు కేకలతో అక్కడి బస్సెస్ మాత్రమే కాదు మా బస్సు కూడా దద్దరిల్లిపోతోంది .
దేవకన్య : అమ్మా అమ్మా .......
అమ్మ : మహి తల్లీ ...... మొబైల్ నీదగ్గర నీ దగ్గర ఉందా ? , గుడ్ మార్నింగ్ బంగారూ - పిల్లల కేకలకు వినిపించడం లేదు - ఈ సంతోషపు కేకలన్నీ మహేష్ వల్లనే - నా మీ అంటీ సంతోషం కూడా వినపడుతోందిగా - పిల్లలతోపాటు నా తరుపున బోలెడన్ని థాంక్స్ లు చెప్పు - చార్మినార్ చూడటానికి వెళుతున్నాము - నేను మళ్ళీ కాల్ చేస్తాను మహేష్ కు అనిచెప్పు - లవ్ యు బంగారూ బై .......
విద్యు సిస్టర్ : మహి డార్లింగ్ ....... అమ్మ మళ్లీ మహేష్ కే కాల్ చేస్తారట విన్నావా ?.
దేవకన్య : ( సిస్టర్ వైపుకు తిరిగి విన్నాను డార్లింగ్ అంటూ ఆనందబాస్పాలతో చెప్పి ) నావైపుకు తిరిగేసరికి భద్రకాళీ అవతారంలో ...... కొన్నిరోజుల్లోనే ఎలా బ్రదర్ .......
విద్యు డార్లింగ్ : దేవుడు కదా డార్లింగ్ అంటూ నవ్వుకున్నారు .
దేవుడు దెయ్యం తరువాత ముందు అమ్మ చెప్పమన్న థాంక్స్ లు చెబితే , ఎలా చెబుతావు సిస్టర్ ...... ముద్దులతోనా లేక దెబ్బలతోనా ? .
సిస్టర్స్ : మేముకూడా వెయిటింగ్ .......
దేవకన్య : నీకెందుకు చెబుతాను - మా అమ్మకు చెబుతాను అంటూ ముద్దులతోనే థాంక్స్ లు చెప్పింది .
ముద్దుముద్దుకూ ....... అంతులేని ఆనందం .

బ్రదర్ బ్రదర్ ....... కాలేజ్ వచ్చేసింది అంటూ ఎంత పిలిచినా ముద్దుల మైకంలో ఉండిపోవడంతో , దేవకన్య నవ్వుకుని లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ మై లవ్లీ హీరో బ్రదర్ గాడ్ అంటూ పెదాలపై ముద్దుపెట్టింది .
అంతే తేరుకుని కిస్ కిస్ అంటూ ముద్దుపెట్టినచోట స్పృశించుకుంటూ దేవకన్యవైపు చూసాను ( దివ్యక్క - చెల్లెమ్మ - సిస్టర్స్ ...... విజిల్స్ - చప్పట్లతో హోరెత్తిస్తున్నారు ) సిస్టర్ ...... హృదయంపై కాకుండా బుగ్గపై పెదాలతో ముద్దుపెట్టావుకాదూ .......? .
దేవకన్య : నేనా ...... ? ఆశ దోస అప్పడం అంతేలేదు ఆశకు హద్దులు ఉండాలి .
మరి సిస్టర్స్ అందరూ మనవైపే చూస్తూ కేకలు - విజిల్స్ వేస్తున్నారు .
దేవకన్య ...... ( చిలిపినవ్వులు నవ్వుకుని ) డార్లింగ్స్ ...... నేను , మీ దేవుడికి ముద్దుపెట్టానని అందుకే మీరు కేకలువేస్తున్నారని తెగ మురిసిపోతున్నాడు నిజమేనా ........
దివ్యక్క - చెల్లెమ్మ - సిస్టర్స్ ...... అందరూ తలలను నిలువు - అడ్డంగా ఊపుతున్నారు .
దివ్యక్కా - చెల్లెమ్మా - సిస్టర్స్ ....... ముద్దుపెట్టినట్లా లేనట్లా ...... ? అంటూ బుగ్గపై స్పృశించుకుంటున్నాను ఆశతో .......

దివ్యక్క : ముసిముసినవ్వులతో వచ్చి , అన్నయ్యా ....... మాకు ఆలస్యం అవుతుంది వెళతాను అంటూ దేవకన్యతోపాటు ఇద్దరినీ ఒకేసారి కౌగిలించుకుని వదిలి కిందకువెళ్లి బావగారి కారులో వెళ్ళిపోయింది .
సిస్టర్స్ - చెల్లెమ్మా .........
అంతలో క్లాస్ బెల్ మ్రోగడంతో ఆశతోనే నా దేవకన్య వెనుకే క్లాస్ కు చేరుకున్నాను - క్లాసులో బాయ్స్ & గర్ల్స్ సగం కంటే తక్కువగా ఉన్నారు - ఆశ్చర్యపోతూనే వెనుక దేవకన్య ప్రక్కన కూర్చున్నాను - లవ్ యు మహీ ...... నీ ప్లేస్ లో కాకుండా వెనుక కూర్చున్నందుకు ......
దేవకన్య : ఎలాగో నీ పరమ భక్తురాళ్లయిన సిస్టర్స్ పనిష్మెంట్ అంటూ పంపిస్తారు కదా .........
చిలిపిదనంతో నవ్వుకుని , అవునూ ...... ఏంటి క్లాసులో సగం మంది కూడా లేరు .
దేవకన్య : తమరి వలన హ్యాపీగా వాళ్ళ వాళ్ళ ఊళ్లకు వెళ్లిపోయారు - మధ్యాహ్నం లోపు వీరంతా కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు - వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కోసం వెయిటింగ్ - చివరగా మనం మరియు లోకల్ ఫ్రెండ్స్ మాత్రమే మిగులుతాము - రేపటి నుండి లోకల్ ఫ్రెండ్స్ కూడా రారు - వన్ వీక్ బోర్ ......ప్చ్ అంటూ నాచేతిని చుట్టేసి భుజంపై తలవాల్చి ఫీల్ అవుతోంది
ఆఅహ్హ్ ....... అంటూ ఆనందపు నిట్టూర్పు .
దేవకన్య : కదలకు బ్రదర్ ఫీల్ అవుతున్నాను కదా - వన్ వీక్ కాలేజ్ లేకుండా ఎలా టైంపాస్ చెయ్యాలో ఏమో .......
చెల్లెమ్మ - సిస్టర్స్ : అవునవును ........

నేను - కృష్ణగాడు మాత్రం నవ్వుకుంటున్నాము .
అంతే ఈసారి చెల్లెమ్మతోపాటు దేవకన్య కూడా చూసేసింది . మేము వన్ వీక్ ఎలా గడపాలో తెలియక ఫీల్ అవుతుంటే మీరు నవ్వుతూ మరింత కవ్విస్తున్నారా ..... ? అంటూ దెబ్బల వర్షం కురుస్తోంది .
మహి సిస్టర్ - చెల్లెమ్మా ....... మేము అందుకు నవ్వలేదు .
ఇద్దరూ : మరి ఎందుకు నవ్వారు చెప్పండి .
చెబితే మా బాస్ ఇంతకంటే గట్టిగా కొడతాడు అంటూ ఇద్దరమూ మళ్లీ నవ్వుకున్నాము .
ఇద్దరూ : ఆశ్చర్యపోయి , మీ బాస్ ఏంటి ? ఎవరు ? .
ఇంకెవరు మేమే ........
ఇద్దరూ : మిమ్మల్నీ ...... పుష్ప డైలాగ్ పుష్ప డైలాగ్ అంటూ మళ్లీ రౌండ్ వేసేంతలో ప్రొఫెసర్ రావడంతో విష్ చేస్తూ లేచి నిలబడ్డాము .
హమ్మయ్యా ....... గంటసేపు సేఫ్ రా మామా అంటూ నవ్వుకున్నాము .
ఇద్దరూ : అక్కయ్యా - చెల్లీ ...... ఏదో దాస్తున్నారు , క్లాస్ అవ్వనీ చెబుదాము .

ప్రొఫెసర్ : గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ have a seat అంటూ క్లాస్ స్టార్ట్ చేశారు .
దేవకన్య తియ్యనైనకోపం చూస్తుంటే ముచ్చటేసి ఉమ్మా ఉమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నాను - దేవకన్యకు మరింతకోపం వచ్చేస్తోంది . Sorry లవ్ యు లవ్ యు సిస్టర్ అంటూ లెంపలేసుకుని చెవులుపట్టుకున్నా నవ్వు మాత్రం ఆగడంలేదు - దేవకన్య క్షణక్షణానికీ భద్రకాళీలా మారిపోతోంది - ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కూల్ కూల్ ...... క్లాస్ క్లాస్ ఇక డిస్టర్బ్ చెయ్యను శ్రద్ధగా విను సిస్టర్ అంటూ డెస్క్ పై చేతినివేసి దేవకన్యవైపే ప్రేమతో చూస్తున్నాను .
ముడుచుకున్న దేవకన్య పెదాలపై అందమైన నవ్వు - నా హృదయంపై రెండు ముద్దులుపెట్టి , క్లాస్ ను కాంసెంట్రేషన్ తో వింటోంది .
Thats గుడ్ అంటూ చేతితో దేవకన్య బుగ్గపై ముద్దుపెట్టబోయి నో నో నో డిస్టర్బ్ చేయకూడదు డిస్టర్బ్ చేయకూడదు అంటూ మరొకచేతితో బలవంతంగా లాగేసుకున్నాను .
దేవకన్య పెదాలపై తియ్యదనం ........

మొబైల్ కు వరుసబెట్టి మెసేజస్ రావడంతో వెంటనే మొబైల్ తీసి సైలెంట్ లో పెట్టాను - హమ్మయ్యా ...... క్లాస్ డిస్టర్బ్ కాలేదు అంటూ ఊపిరి పీల్చుకున్నాను .
దేవకన్య : ఎవరు అంటూ కళ్ళతో సైగచేసింది .
ప్చ్ ....... అంటూ దేవకన్య తలను బోర్డ్ వైపుకు తిప్పాను .
దేవకన్య : క్లాస్ వింటూనే నవ్వుతోంది .
ఎవరబ్బా అంటూ మొబైల్ చూస్తే బుజ్జిచెల్లెళ్ళు - బుజ్జి తమ్ముళ్లు ( సిస్టర్స్ చెల్లెళ్లు - తమ్ముళ్లు - అక్క అన్నయ్య కూతుర్లు ) ...... hi hi hi అన్నయ్యా అన్నయ్యా గుడ్ మార్నింగ్ అంటూ వాట్సాప్ చేశారు , పెదాలపై చిరునవ్వులతో అందరి నెంబర్స్ సేవ్ చేసుకుని గ్రూప్ create చేసి hi hi బుజ్జిచెల్లీ - బుజ్జితమ్ముడూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ రిప్లై ఇచ్చాను .
" " స్మైలీ ఎమోజీలు " - అన్నయ్యా అన్నయ్యా ...... ఇప్పుడే బయలుదేరాము - సగం దూరం వచ్చేసాము - నేను కారులో - నేను ట్రైన్లో - నేను ఫ్లైట్ లో అంటూ రిప్లైఇచ్చారు " .
హ్యాపీ హ్యాపీ జర్నీ - మీకోసం ఎదురుచూస్తున్నాను - వైజాగ్ రాగానే నేనే స్వయంగా రిసీవ్ చేసుకుంటాను .
" నో నో నో అన్నయ్యా అన్నయ్యా ....... అందరినీ రిసీవ్ చేసుకోవడం కష్టం - ఇంటిదగ్గరికి వచ్చేస్తాము కదా " .
లవ్ యు లవ్ యు ....... కానీ నా చిట్టి చెల్లెళ్లు - తమ్ముళ్లను మాత్రం నేనే రిసీవ్ చేసుకుంటాను . చిట్టి చెల్లెళ్ళూ - తమ్ముళ్లూ ...... మీకు
తోడుగా వస్తున్న అంకుల్ ను అడిగి వైజాగ్ చేరే సమయం పెట్టండి .
" టైమింగ్స్ పెట్టారు " .
వచ్చేస్తాను చిట్టి చెల్లెళ్ళూ - తమ్ముళ్లూ........

ఎవరితో ఆపకుండా చాటింగ్ చేస్తూనే ఉన్నావు అంటూ మొబైల్ వైపు తొంగి చూసింది మహి ......
వెంటనే లాక్ చేసేసి దూరం జరిగాను .
దేవకన్య కోపంతో చూస్తూ నాకు అతిదగ్గరగా జరిగి మొబైల్ లాక్కోబోయింది .
అందనంత ఎత్తుకు చేతిని పైకెత్తాను ప్లీజ్ ప్లీజ్ అంటూ ......
దేవకన్య : మరింత కోపంతో మొబైల్ అడిగింది .
ఊహూ ....... ప్లీజ్ ప్లీజ్ మా మంచి సిస్టర్ కదూ అంటూ చిన్ పట్టుకుని బ్రతిమాలను .
దేవకన్య : ఊహూ ...... ఇవ్వాల్సిందే , స్మార్ట్ ఫోన్ లేదుకాబట్టి అమ్మతో అయితే కాదు మరియు ఎవరితో చాట్ చేస్తున్నావో నాకు తెలిసితీరాలి .
చూయిస్తే మా బాస్ కొడతాడు మహీ .......
దేవకన్య ఒక్కసారిగా నవ్వేసింది .
హమ్మయ్యా అంటూ దేవకన్య బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , టేబుల్ చివరకు జరిగాను - మహికూడా నాతోపాటు జరిగి అతుక్కుని కూర్చుంది - నవ్వుకుని , చేతిని దూరంగా జరిపి బుజ్జిచెల్లెళ్ళూ - తమ్ముళ్లూ ...... బ్రేక్ఫాస్ట్ చేశారా ? .
" తిని బయలుదేరాము అన్నయ్యా అన్నయ్యా ....... , మరి మీరు - ఆక్కయ్యలు ? "
తిన్నాము బుజ్జిచెల్లెళ్ళూ ...... - క్లాసులో ఉన్నాము .
" క్లాసులోనా అయితే డిస్టర్బ్ చేస్తున్నామన్నమాట " .
మా బుజ్జిచెల్లెళ్ళ కంటే క్లాస్ ఇంపార్టెంట్ కాదు కంటిన్యూ కంటిన్యూ .......
" థాంక్యూ అన్నయ్యా అన్నయ్యా ....... " .

దేవకన్య : మళ్లీ మొదలెట్టారా ? అంటూ దూరంగా ఉన్న మొబైల్ అందుకోవడానికి తెగ ట్రై చేస్తోంది .
ష్ ష్ మహీ ...... క్లాస్ క్లాస్ ? .
దేవకన్య : క్లాస్ అయ్యాక నీ సంగతి చెబుతాను - మొబైల్ ఎలా ఇవ్వవో చూస్తాను . మొబైల్ తీసి చెల్లెమ్మా - డార్లింగ్స్ ....... మీ దేవుడు ఎవరితోనో తెగ చాట్ చేస్తున్నాడు , చాట్ చేస్తున్నంతసేపూ పెదాలపై నవ్వులే నవ్వులు .......
గ్రూప్ మెసేజ్ కాబట్టి నాకూ వచ్చింది .
" అమ్మతో అయి ఉంటుందిలే ...... " .
దేవకన్య : అమ్మతో స్మార్ట్ ఫోన్ లేదు కదా డార్లింగ్స్ ......
" అవునుకదా ..... మరైతే ఎవరితో , అయినా మహేష్ సర్ ఏమిచేసినా లోకాకళ్యాణం కోసమే " .
దేవకన్య : మిమ్మల్ని అడిగాను చూడండీ నాకు బుద్ధిలేదు - గొప్ప భక్తురాళ్లు ......
దేవకన్య వైపు చూస్తూ నవ్వుకున్నాను .
దేవకన్య : క్లాస్ అవ్వనీ .......

బుజ్జిచెల్లెళ్ళూ ...... మీతో చాట్ చేస్తున్నాను కదా ఎవరో అమ్మాయితో చాట్ చేస్తున్నానని మీ మహి అక్కయ్య అసూయ చెందుతోంది - కొట్టడానికి ఆయుధాలను రెడీ చేస్తోంది .
" అక్కయ్య ప్రక్కనే ఉన్నారా ? - మీదగ్గరికి రావడానికి తొలి ప్రాధాన్యం మా మహి అక్కయ్యను కలవబోతున్నామనే ......
Wow లవ్ టు లవ్ టు - ఇదిగో అంటూ రుసరుసలాడుతూ క్లాస్ వింటున్న దేవకన్య ఫోటోను తీసి పంపించాను .
" అమ్మో ...... మీపై చాలా కోపంతోనే ఉన్నట్లున్నారు " .
మీ అక్కయ్య దెబ్బలు అంటే మీ అన్నయ్యకు చాలా చాలా ఇష్టం .
స్మైలీ లు పంపించారు .
క్లాస్ పూర్తయ్యేలా ఉంది - మీ అక్కయ్యతో తియ్యనైన దెబ్బలుతిని మళ్లీ చాట్ చేద్దాము .
" హ హ హ ...... "

We'll కంటిన్యూ నెక్స్ట్ వీక్ - ఎంజాయ్ ద హాలిడేస్ అనిచెప్పి ప్రొఫెసర్ వెళ్లిపోయారు .
థాంక్యూ సర్ .......
ప్రొఫెసర్ ...... బయటకు అడుగుపెట్టడం ఆలస్యం మొబైల్ మొబైల్ అంటూ నన్ను చుట్టేసిమరీ జేబులన్నీ వెతికి గాట్ ఇట్ యాహూ ..... అంటూ సంతోషంతో కేకలువేస్తోంది దేవకన్య - బ్రదర్ ...... కనీసం అడ్డుపడలేదు .
విద్యు సిస్టర్ : మీదపడిమరీ నలిపేస్తూ మొబైల్ కోసం వెతుకులాటలో ఏ ఏ మాధుర్యం పంచావో ఏమిటో పాపం మహేష్ సర్ జలదరిస్తూ ఉండిపోయారు అంటూ చిలిపిదనంతో నవ్వుకుంటున్నారు .
దేవకన్య : బ్యాడ్ బ్రదర్ అంటూ సిగ్గుపడుతూ భుజంపై కొడుతోంది .
సిస్టర్స్ : చేసిందంతా నువ్వు చేసి శిక్ష మాత్రం మహేష్ సర్ కు వేస్తున్నావు , మినిమం 2 -3 పనిష్మెంట్స్ .......
దేవకన్య : డార్లింగ్స్ ....... ? .
సిస్టర్స్ : ఫిక్స్ అంతే .......
దేవకన్య : పనిష్మెంట్స్ సంగతి తరువాత చూద్దాములే ..... , ముందు చాటింగ్ సంగతి తేలుద్దాము అంటూ ప్యాటర్న్ " M " డ్రా చేస్తే రాంగ్ ప్యాటర్న్ ...... మళ్లీ చేస్తే మళ్లీ రాంగ్ - ఇంతలోనే ప్యాటర్న్ మార్చేశావన్నమాట ఏదీ ఫింగర్ ప్రింట్ అంటూ వేలిని అందుకుని ట్రై చేసినా నో use - ఇదికూడా మార్చేశావన్నమాట అంటూ చేతిపై గిల్లేసింది .
స్స్స్ ....... అంటూ స్పృహలోకొచ్చి , దేవకన్య ముచ్చటేసే కోపాన్ని చూసి నవ్వుకుంటున్నాను .
విద్యు సిస్టర్ : ఎలాగో లాక్కుంటావని తెలిసే ముందే చేంజ్ చేసేసినట్లున్నారు డార్లింగ్ ...... - అయినా మహేష్ సర్ ఏమిచేసినా .......
దేవకన్య : లోకాకళ్యాణం కోసమే అంటారు అంతేకదా ....... , బ్రదర్ ...... ప్యాటర్న్ ? .
ఓపెన్ చేస్తే మా బాస్ ......
దేవకన్య : ష్ ష్ ...... ఓపెన్ ......
మా మంచి సిస్టర్ కదా ......
దేవకన్య : కానే కాదు బ్రదర్ .......
అమ్మా దుర్గమ్మ తల్లీ ...... మీరే కాపాడాలి .
అంతలో ప్రొఫెసర్ రావడంతో అందరూ లేచి నిలబడ్డారు - ఈ గ్యాప్ లో కొంతమంది హాస్టల్ సిస్టర్స్ మాయమైపోయారు - ఇక మిగిలింది కొద్దిమందిమి మాత్రమే ......
ప్రొఫెసర్ కూడా అదేచెప్పి క్లాస్ స్టార్ట్ చేశారు .

దేవకన్య ...... మొబైల్ ను గట్టిగా పట్టుకుని , క్లాస్ వింటోంది .
సిస్ సిస్ ...... మొబైల్ అంటూ గుసగుసలాడాను .
దేవకన్య : నో ......, అంతలో మెసేజ్ వచ్చినట్లు చేతిలో వైబ్రేట్ అవ్వడంతో మళ్లీ ప్యాటర్న్ ట్రై చేసి లాభం లేక బ్రతిమాలుతున్న నా చేతికి అందించింది చిరుకోపంతో .......
లవ్ యు లవ్ యు soooo మచ్ సిస్టర్ ...... , ఇంతకుముందు MAHI " M " ఇప్పుడు సిస్టర్ " S " అంటూ దేవకన్య చూస్తుండగానే డ్రా చేసి అన్లాక్ చేసాను .
దేవకన్య : ప్చ్ ...... అనుకున్నాను అన్నట్లు నవ్వుకుంది .
ఉమ్మా ..... అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలి డెస్క్ చివరకు జరిగి కూర్చున్నాను .
హుమ్మ్ ...... అంటూ చూసి నాదగ్గరకు జరిగి చేతిని చుట్టేసింది - చూడనులే ...... నా బ్రదర్ ఏమిచేసినా లోకాకళ్యాణం కోసమేకదా అంటూ ఏకాగ్రతతో క్లాస్ వింటోంది మహి .......
లవ్ యు soooooo మచ్ సిస్టర్ అంటూ వాట్సాప్ ఓపెన్ చేసాను .

" అన్నయ్యా ...... దెబ్బలు పడ్డాయా మరి " .
దేవకన్యవైపు చూస్తే శ్రద్ధగా క్లాస్ వింటోంది - ఉమ్మా ...... , ఒక రౌండ్ కాదు బుజ్జిచెల్లెళ్ళూ ...... ఏకంగా మూడు రౌండ్స్ - కనికరమే చూయించలేదు అంటూ కన్నీళ్ల ఎమోజీలు పెట్టాను .
" అంత ఎంజాయ్ చేసారన్నమాట ఎంజాయ్ ఎంజాయ్ అంటూ స్మైలీల వర్షం కురుస్తోంది " .
Yes yes ..... దారిలో ఎక్కడైనా అంకుల్ కు ఐస్ క్రీమ్స్ - చాక్లెట్ - కూల్ డ్రింక్స్ తెమ్మని ఆర్డర్ వెయ్యండి , ఏమాత్రం మోహమాటపడకండి , వాళ్ళు ఉన్నదే మీకోసం సరేనా .......
" లవ్ యు లవ్ యు అన్నయ్యా అన్నయ్యా ....... ఆకలివేస్తే అడుగుతాము " .
ఆకలివేస్తే కాదు బుజ్జిచెల్లెళ్ళూ ....... ఎండగా ఉందికదా చల్లచల్లగా ఐస్ క్రీమ్స్ తింటూ జర్నీ ఎంజాయ్ చేస్తూ రండి .
" అలాగే అన్నయ్యా ...... " .
ఆ పీరియడ్ అంతా చాట్ చేస్తూనే ఉన్నాను .

సెకండ్ పీరియడ్ పూర్తయ్యి ప్రొఫెసర్ బయటకువెల్లగానే ..... నా చేతిలోని మొబైల్ దేవకన్య చేతిలోకి చేరింది . సిస్టర్ " S " yes yes ...... రాంగ్ ప్యాటర్న్ - ఇంతలోనే మార్చేసావా అంటూ దెబ్బ - ఏమి ఉంటుందో నాకు తెలుసులే MAHI MAHESH " M " ...... రాంగ్ ప్యాటర్న్ మళ్లీ దెబ్బ వేసి తీసుకో అంటూ చిరుకోపంతో అందించింది .
AMMA " A " ........
దేవకన్య : అయ్యో ...... మొబైల్ లాక్కోబోతే .......
Sorry లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు సిస్టర్ - తప్పలేదు ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో - నా దేవకన్య గురించి నాకు తెలుసు sorry లవ్ యు లవ్ యు అంటూ గుంజీలు తీస్తున్నాను .

సీనియర్ బాయ్స్ : మహేష్ మహేష్ ...... 1 2 3 ...... కౌంట్ చేస్తున్నారు , ఫ్రెండ్స్ ..... హీరో లాంటి మహేష్ కూడా లవర్ ముందు తగ్గాల్సిందేరా - ఇదే సాక్ష్యం అంటూ క్లాప్స్ కొడుతున్నారు .
దేవకన్య : స్టాప్ స్టాప్ అంటూ ఆపి కూర్చోబెట్టుకుని నవ్వుతోంది .
మిగతా హాస్టల్ సిస్టర్స్ కూడా మాకు బై చెప్పి వెళ్లిపోయారు - సీనియర్ బాయ్స్ ..... 15 మినిట్స్ బ్రేక్ టైం కాబట్టి బయటకువెళ్లారు .

టైం చూస్తే 11AM - అర గంటలో తిరుపతి - విజయవాడ నుండి ఫ్లైట్ లో వస్తున్న చిట్టి చెల్లెళ్లు - బుజ్జిచెల్లెళ్ళు ..... ల్యాండ్ అయిపోతారు . మహి సిస్టర్ ...... నేను కూడా అర్జెంట్ గా వెళ్ళాలి .
దేవకన్య : ఎంతసేపు బ్రదర్ బ్రేక్ టైం పూర్తయ్యేలోపు ........
మధ్యాహ్నం - సాయంత్రం కూడా పట్టొచ్చు సిస్టర్ .......
చెల్లెమ్మ - సిస్టర్స్ : ఏమిటీ ....... ? .
దేవకన్య : నో నో నో అంటూ నా చేతిని గట్టిగా చుట్టేసింది .
ఆఅహ్హ్ ........ , అయినాసరే వెళ్ళాలి సిస్టర్స్ - చెల్లెమ్మా - సిస్టర్ ....... అంత ముఖ్యం .
దేవకన్య : అయితే మేమూ వచ్చేస్తాము పదా .......
చెల్లెమ్మ - సిస్టర్స్ : మా అన్నయ్య - మహేష్ సర్ లేకుండా ఎంతసేపు మేముండలేము .
నో నో నో ఉండాలి ఫస్ట్ ఇంపార్టెన్స్ క్లాస్ ఆ తరువాతే నేను - ప్లీజ్ ప్లీజ్ ..... సడెన్ గా మెసేజ్ వచ్చింది తప్పకుండా వెళ్ళాలి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ - ఇలా సడెన్ ప్రోగ్రామ్స్ ఇంకెప్పుడూ పెట్టుకోను - ప్లీజ్ ప్లీజ్ సిస్టర్ - చెల్లెమ్మా - సిస్టర్స్ .......
దేవకన్య : సరే , అంతలోపు పని పూర్తయితే వచ్చేయ్యాలి .
ఈ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకో మై డియర్ సిస్టర్ లవ్ యు లవ్ యు ...... అంటూ లేచాను - రేయ్ మామా .......
కృష్ణగాడు : వదిలి బాత్రూం కు కూడా వెళ్లను .
లవ్ యు రా మామా ........ , మహీ ...... నాగురించి wait చెయ్యకుండా హ్యాపీగా లంచ్ చేసేయ్యండి వెళ్ళొస్తాను - మళ్లీ వచ్చేన్తవరకూ గుర్తుండేలా ఏదైనా చిరుకానుక ఇస్తే బాగుంటుంది ok ok ఇవ్వకపోయినా సంతోషమే అంటూ డోర్ వైపుకు తిరిగాను .
బ్రదర్ అంటూ చేతిని అందుకుని తనవైపుకు తిప్పుకుని అమాంతం కౌగిలించుకుంది , జాగ్రత్త లవ్ యు లవ్ యు అమ్మలూ అంటూ హృదయంపై పెదాలతో ముద్దులు - బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , చాలా అంటూ విద్యు సిస్టర్ ప్రక్కన కూర్చుంది .
ఆఅహ్హ్హ్ ...... ఎక్సపెక్ట్ చెయ్యనేలేదు అంటూ హృదయంపై చేతినివేసుకుని వెనక్కు పడిపోయేంతలో కృష్ణగాడు పట్టుకుని ఆనందిస్తున్నాడు .
ఎంజాయ్ రా మామా .......
ఇలాంటి స్వీట్ నెస్ పంచితే ఇంకేమి వెళతాను - అమ్మో ....... 10 మినిట్స్ అయ్యింది వెళ్ళాలి అంటూ దేవకన్య బుగ్గపై చేతితో ముద్దుపెట్టి లవ్ యు sooooo మచ్ సిస్టర్ అంటూ కేకలువేస్తూ పరుగులుతీసాను - స్టెప్స్ దిగుతూనే చంద్రకు కాల్ చేసి 20 మినిట్స్ లో ఎయిర్పోర్ట్ లో ఉండాలి ....... - మెయిన్ గేట్ బయట బస్సు రెడీగా ఉండటంతో పరుగునవెళ్లి ఎక్కి రైట్ రైట్ అన్నాను - ట్రాఫిక్ ఉన్నప్పటికీ సమయానికి ఎయిర్పోర్ట్ చేర్చాడు .

విజయవాడ మీదుగా తిరుపతి ఫ్లైట్ ల్యాండ్ అయినట్లు అనౌన్స్మెంట్ జరుగుతుండటంతో లోపలికి పరుగునవెళ్ళాను . తిరుపతి - విజయవాడ చుట్టుప్రక్కల సిస్టర్స్ ....... చెల్లెళ్లు - మేనకోడళ్లు ఫ్లైట్ లోనే ఫ్రెండ్స్ అయినట్లు కలిసి అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా ....... అంటూ పరుగునవచ్చారు .
మోకాళ్లపై కూర్చుని వెల్కమ్ వెల్కమ్ టు బ్యూటిఫుల్ వైజాగ్ బ్యూటిఫుల్ ఏంజెల్స్ అంటూ అందరినీ ఒకేసారి కౌగిలిలోకి తీసుకున్నాను .
థాంక్యూ థాంక్యూ అన్నయ్యా అంటూ ముద్దులు కురిపించారు .
ఏంజెల్స్ - తమ్ముళ్లూ ....... నేనే , మీ అన్నయ్యను అని ఎలా కనుక్కున్నారు .
మా అన్నయ్యను చూడగానే తెలిసిపోయింది - ఆక్కయ్యలు ....... తాజ్ మహాల్ ఫోటోలు కూడా పంపించారు కదా ........
లవ్ యు లవ్ యు బుజ్జి ఏంజెల్స్ ....... అంటూ ముద్దులుపెట్టాను .
అన్నయ్యా అన్నయ్యా ....... మహి అక్కయ్యను సాయంత్రం వరకూ చూడలేమా?.
అయితే మీరు వచ్చినది నాకోసం - మీ అక్కయ్యలకోసం కాదన్నమాట , ఓన్లీ మీ మహి అక్కయ్య కోసమన్నమాట .......
బుజ్జి ఏంజెల్స్ : మీరు మరీ ఇలా డైరెక్టుగా అడిగితే అవును అనే చెప్పాలి - ఎందుకంటే మా అన్నయ్యతో అపద్దo చెప్పలేము .
మీ అందరికీ మహి అక్కయ్యనే కావాలన్నమాట అంటూ సంతోషంతో గిలిగింతలుపెట్టి నవ్విస్తూ చిట్టి చెల్లిని ఎత్తుకున్నాను - చెల్లెళ్ళూ ...... మీమనసులో ప్రాణంలా అనుకోండి ఏమైనా జరగొచ్చు , మనకు అదృష్టం ఉంటే మీ అక్కయ్యను మధ్యాహ్నమే చూడొచ్చు లేకపోతే కొద్దిసేపట్లోనే చూడవచ్చు ........
అలాగే అన్నయ్యా .......
బుజ్జి ఏంజెల్స్ ....... మీతోపాటు మీ మహి అక్కయ్యను కలవడం కోసం ట్రైన్స్ - కార్లలో ఈపాటికే మన ఇంటికి చేరుకున్న మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళదామా ...... ? .
బుజ్జి ఏంజెల్స్ : ఓహ్ yes అన్నయ్యా ........
బయటకు పిలుచుకునివచ్చి , బుజ్జి ఏంజెల్స్ ...... రోజూ ఇదే బస్సులోనే మీ అక్కయ్య - మహి అక్కయ్య ...... కాలేజ్ కు వెళ్ళేది .
అవునా అవునా అన్నయ్యా అంటూ బస్సు ఎక్కారు . చిట్టి చెల్లితోపాటు ఎక్కి ఈ ప్లేస్ లోనే మీ మహి అక్కయ్య కూర్చునేది అంటూ కూర్చోబెట్టాను .
బుజ్జి ఏంజెల్స్ : చిట్టి చెల్లినే లక్కీ అన్నమాట .......
వెనుకే లోకల్ మేనేజర్ ఆర్రేంజ్ చేసినవాళ్ళు ...... పిల్లల లగేజీని బస్సులో ఉంచి సెల్యూట్ చేసి వెళ్లిపోయారు .
పిల్లలను సేఫ్ గా తీసుకొచ్చినందుకు థాంక్యూ సో మచ్ బ్రదర్స్ .......

ఇంటికి చేరుకునేసరికి పిల్లలందరూ కాంపౌండ్ లోనే ఎదురుచూస్తున్నట్లు అన్నయ్యా అన్నయ్యా ....... ఆంటూ చుట్టుముట్టారు .
లవ్ యు లవ్ యు లవ్ యు ....... ప్రయాణం హ్యాపీగా జరిగింది కదా ......
పిల్లలు : సూపర్ సూపర్ అన్నయ్యా ........
అయితే మిమ్మల్ని తీసుకొచ్చిన మన మేనేజర్ మరియు వారి ఫ్రెండ్స్ కు థాంక్స్ ....... , పిల్లల గురించి తెలిసే మొబైల్ వీడియో మోడ్ లో ఉంచి , పిల్లలూ ...... మీరయినా నాకోసం - మీ అక్కయ్యల కోసం వచ్చారా లేక .....
పిల్లలు : మహి అక్కయ్య కోసం మహి అక్కయ్య కోసం ....... అంటూ కేకలువేస్తూనే ఉన్నారు .
అయితే అందరూ అన్నమాట ....... ప్చ్ ప్చ్ ...... అందరికీ నాతోపాటు మహి అక్కయ్య దేవకన్య అంటేనే ఇష్టం అన్నమాట .
అవునన్నయ్యా అంటూ నవ్వుతున్నారు - అన్నయ్యా అన్నయ్యా ...... సాయంత్రం వరకూ మహి అక్కయ్యను చూడలేమా ? .
సేమ్ టు సేమ్ అందరి మనసులో ఒకే ఒక్కకోరిక ....... మీ బుజ్జి మనసుల్లో అనుకోండి అయిపోతుంది అయిపోతుంది అంటూ ఇద్దరు చిట్టి చెల్లెళ్లను హత్తుకుని ముద్దులుపెట్టాను . పిల్లలూ ...... అదిగో పెద్దమ్మ , మీరు ఏమి తినాలనుకుంటున్నారో చెబితే చకచకా రెడీ చేసి మీ ముందు ఉంచుతారు .
పిల్లలు : అన్నయ్యా ...... ప్రయాణంలో తింటూనే ఉన్నాము - అంకుల్ వాళ్ళు ..... ఐస్ క్రీమ్స్ చాక్లెట్ డ్రింక్స్ కేక్స్ స్నాక్స్ ....... కొనిస్తూనే తీసుకొచ్చారు - ఇప్పుడు మాకు మహి అక్కయ్య తప్ప ఏమీ వద్దు .
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........ ఉమ్మా మహి సిస్టర్ , చూశావా నీ బుజ్జి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను , నువ్వు తప్ప నేను - మీ డార్లింగ్స్ వద్దే వద్దట అంటూ వీడియోలో నా బాధను వ్యక్తపరిచాను .
పెద్దమ్మ : పిల్లలు బంగారం ....... , మహి తల్లిని చూడకుండా సాయంత్రం వరకూ ఎలా ఉంటారో పాపం ......
అయితే అంతవరకూ వీళ్ళ మైండ్ ను డైవర్ట్ చెయ్యాలి - పిల్లలూ ...... లోపలికివెళ్లి ఫ్రెష్ అయ్యి మీ మీఅక్కయ్యల లగేజీ సర్దేసి బయలుదేరుదాము .

Wow సూపర్ గా ఉంది అన్నయ్యా ఇల్లు .
లవ్ యు ........ , పిల్లలూ ...... మీకు మరింత బ్యూటీ చూయిస్తాను రండి అంటూ బిల్డింగ్స్ బ్రిడ్జి దగ్గరికి తీసుకెళ్ళాను - పెద్దమ్మా ...... వీడియో అడగకూడదు అంటూ మొబైల్ అందించాను .
సముద్రపు అందాలను చూసి అందరి పెదాలపై చిరునవ్వులు ఆగడంలేదు - సో బ్యూటిఫుల్ అన్నయ్యా ....... , అన్నయ్యా ...... మహి అక్కయ్య మీ దేవకన్య కూడా ఇలానేచూసేవారా ? .
మీ మహి అక్కయ్య దేవకన్యతోపాటు ...... మీ ఆక్కయ్యలు కూడా ఎంజాయ్ చేస్తారు - పాపం ఈ వీడియో మీ ఆక్కయ్యలు చూస్తే ఇక అంతే .......
పిల్లలతోపాటు పెద్దమ్మ నవ్వుకున్నారు .
పిల్లలు : అన్నయ్యా ...... మాకు బీచ్ దగ్గరకు వెళ్లాలని ఉంది - నీళ్ళల్లో ఎంజాయ్ చెయ్యాలని ఉంది .
పెద్దమ్మ : మీరు కోరాడమూ మీ అన్నయ్య కాదనడమూనా .......
పెద్దమ్మా ...... టవల్స్ రెడీ చెయ్యండి అంటూ మొబైల్ అందుకున్నాను - పిల్లలూ ...... కాలేజ్ స్టడీస్ వలన టైం లేక మీ ఆక్కయ్యలు కూడా ఇంకాబీచ్ దగ్గరికి వెల్లనేలేదు - తొలి అదృష్టం మా బుజ్జి ఏంజెల్స్ కే ........
యాహూ యాహూ ........
Next page: Update 43
Previous page: Update 41