Update 44

అక్కడ హైద్రాబాద్ లో సుమారు 3 గంటలపాటు గోల్కొండ ఫోర్ట్ వీక్షించి తృప్తిగా 5 గంటలకు ప్యాలస్ చేరుకున్నారు అమ్మావాళ్ళు - పిల్లలు .......
మిస్సెస్ మేనేజర్ : స్టూడెంట్స్ ....... one hour టైం ఫ్రెష్ అయ్యి ఫోన్స్ ద్వారా రూమ్స్ కే మీకిష్టమైన స్నాక్స్ - ఐస్ క్రీమ్స్ ....... మీ ఇష్టం ఆర్డర్ చేసి తినేసి కిందకువచ్చేయ్యాలి . ఈరోజుకు చివరగా మీ మేడం అమ్మ కోరిక ప్రకారం బిర్లా టెంపుల్ దర్శిద్దాము - రాత్రిపూట విద్యుత్ వెలుగులలో అందంగా ఉంటుంది టెంపుల్ ........
స్టూడెంట్స్ : Ok మేడమ్స్ అంటూ వారి వారి గదులలోకి వెళ్లారు .
స్టూడెంట్స్ అందరూ వెళ్ళాక అమ్మావాళ్ళు మాట్లాడుకుంటూ వెనుకే వెళ్లారు .
మిస్సెస్ మేనేజర్ : హెడ్ మాస్టర్ మేడం ...... ఈ టూర్ ప్లాన్ స్కెచ్ ఎవరిదో తెలుసుకోవచ్చా ? .
హెడ్ మిస్ట్రెస్ : ఇంకెవరిది మీ ముఖ్యమైన మేడం గారిదే అంటూ అమ్మవైపు చూయించారు .
మిస్సెస్ మేనేజర్ : సూపర్ అంటే సూపర్ , మేడం గారూ ...... హైద్రాబాద్ కొట్టిన పిండిలా అనిపిస్తోంది మీకు - హైద్రాబాద్ లో పుట్టి పెరిగినట్లుగా మీ ప్రవర్తనను గమనించాను - హైద్రాబాద్ పూర్తిగా తెలిసినట్లుగా ముందుకు దూసుకుపోతున్నారు - హైద్రాబాద్ లో చాన్నాళ్లుగా ఉంటున్న మేమే ఇంత పర్ఫెక్ట్ గా టూర్ ప్లాన్ చెయ్యలేమేమో లేకపోతే ఓకేరోజే ఇంతమంది స్టూడెంట్స్ తో ఇన్ని ప్లేసస్ చూసాము అంటే అంతలా మీకు హైద్రాబాద్ అనుభవం ఉన్నట్లు తెలుస్తోంది .
అమ్మ : ఆ అవును ...... లేదు లేదు లేదు అలాంటిదేమీ లేదు , అంతా గూగుల్ మహిమ .......
మిస్సెస్ మేనేజర్ : అవునవును ఈ కాలంలో గూగుల్ లో దొరకనిది ఏముంది చెప్పండి - కానీ ఒక విషయం అర్థం కావడం లేదు మీరు ప్లాన్ చేసిన ప్లేసస్ అన్నీ సిటీకి ఒకవైపున మాత్రమే ఉన్నాయి , మీరు ok అంటే హైటెక్ సిటీ వైపు ........
అమ్మ : నో నో నో ....... వద్దు అంటూ కళ్ళల్లో బాధ - వసుంధరా ...... అటువైపు కూడా వెళ్లాలంటే మీరు వెళ్ళండి ఆరోజంతా నేను ఇక్కడే ఉంటాను అనిచెప్పి గదిలోకి వెళ్లిపోయారు .
మిస్సెస్ మేనేజర్ : మేడం గారూ ...... అంటూ వెనుకేవచ్చి , మీరు బాధపడితే మహేష్ సర్ బాధపడతారు , మీ సంతోషమే మా సంతోషం - అటువైపు చూడకపోయినా ప్రాబ్లమ్ లేదు ఇక దాని గురించి మాట్లాడనే మాట్లాడను క్షమించండి .
అమ్మ : నో నో నో నేనే ఎమోషనల్ అయ్యాను - sorry sorry ......
మిస్సెస్ మేనేజర్ : మిమ్మల్ని దేవతలా ట్రీట్ చెయ్యమన్నారు మహేష్ సర్ - మీరు క్షమించమని అడగనేరాదు - ఇక ఈ విషయాన్ని ఇక్కడితో మరిచిపోండి - ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తీసుకోండి భక్తితో టెంపుల్ కు వెళదాము - ప్లీజ్ ప్లీజ్ మాకోసం ఒకసారి ఓకేఒక్కసారి నవ్వండి , అప్పుడుకానీ నా మనసు కుదుటపడదు .
అమ్మ : Sorry మేడం అంటూ నవ్వేశారు .
మిస్సెస్ మేనేజర్ : అదిగో మళ్లీ sorry చెబుతున్నారు - ఇప్పుడు మీరు ..... మాకు చైర్మన్ తో సమానం .
అమ్మ : నో నో నో ........
హెడ్ మిస్ట్రెస్ : గుడ్ ఈవ్నింగ్ చైర్మన్ గారూ .......
అమ్మ : గుడ్ ఈవ్నింగ్ హెడ్ మిస్ట్రెస్ గారూ.......
మిస్సెస్ మేనేజర్ : హమ్మయ్యా ...... నవ్వేశారు , హ్యాపీగా వెళ్లి రెడీ అవుతాను అంటూ కౌగిలించుకుని వెళ్లారు .

హెడ్ మిస్ట్రెస్ : చైర్మన్ గారూ ....... నువ్వు ఔనన్నా కాదన్నా నీ మేనేజర్ చెప్పినది నిజమే ఏదో దాస్తున్నావు , నాకు చెప్పాల్సిన అవసరం లేదులే , నువ్వు హ్యాపీ అయితే నేనూ హ్యాపీ ....... ముందు నువ్వు ఫ్రెష్ అవుతావా - నేను వెళ్లనా ? .
అమ్మ : థాంక్యూ మై ఫ్రెండ్ - ముందు తమరే వెళ్ళండి హెడ్ మిస్ట్రెస్ గారూ .......
హెడ్ మిస్ట్రెస్ : చైర్మన్ గారి ఆజ్ఞ శిరసావహిస్తాను - చైర్మన్ గారూ ...... నిన్నటి నుండి నీలో కొత్త ఫ్రెండ్ ను చూస్తున్నాను - ఎప్పుడూ బాధపడుతూ ఉండే నువ్వు ఇలా హుషారుగా ఆర్డర్స్ వేస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది - ఈ డ్రాస్టిక్ చేంజ్ ఎవరివల్లనో నాకు తెలుసులే ...... పాపం మహిని ఒక్కసారైనా తలుచుకోవే , ఉదయం నుండీ కాదు కాదు నిన్నటి నుండీ చూస్తున్నాను కొత్తగా వచ్చిన నీ బిడ్డనే తలుచుకుని తెగ ఆనందిస్తున్నావు - ఊరికి వెళ్ళాక మహి తల్లికి కంప్లైంట్ చేస్తానులే అని కౌగిలించుకుని బుగ్గపై ముద్దుపెట్టిమరీ బాత్రూమ్లోకి వెళ్లారు .
అమ్మ : అమ్మ - అమ్మ అన్న మధురాతిమధురమైన పిలుపులతో ఒక్కరోజులోనే మనసు - హృదయమంతా నిండిపోయిన అంతులేని బాధను పోగొట్టి ఇలా మార్చేశాడు , ఈ నవ్వులన్నీ మహేష్ వల్లనే - తప్పులేదు నా మహి తల్లికూడా అర్థం చేసుకుంటుంది అంటూ బెడ్ పై ఉంచిన మొబైల్ అందుకుని కాల్ లాగ్స్ చూసి నిరాశ చెందారు - మహేష్ చెయ్యకపోతేనేమి నేనెచేస్తాను , అమ్మా ...... ఎప్పుడైనా చెయ్యండి అన్నాడుకదా అంటూ పెదాలపై తియ్యదనం - కాల్ చేస్తే ఔట్ ఆఫ్ కవరేజ్ మళ్లీ మళ్లీ చేసినా అదే వినిపించడంతో ప్చ్ ప్చ్ ...... - తల్లికి చేస్తాను అయినా సేమ్ - తల్లులకు చేస్తాను అయినా సేమ్ ........ ఏమయ్యుంటుంది అంటూ నిరాశతో బెడ్ పై కూర్చున్నారు - మళ్లీ మళ్లీ చేసినా ....... ఔట్ ఆఫ్ ఔట్ ఆఫ్ వస్తోంది .
ఏంటి చైర్మన్ గారూ ....... ఎన్నిసార్లు కాల్స్ చేస్తూనే ఉన్నారు ? ఎవరికి ? చెప్పొద్దు చెప్పొద్దు ....... తెలుసులే ...... అంటూ హెడ్ మిస్ట్రెస్ ఫ్రెష్ అయ్యివచ్చారు .
అమ్మ : అవును కానీ తగలడం లేదు .
హెడ్ మిస్ట్రెస్ : బిజీగా ఉన్నాడేమో ...... , అంతలోపు ఫ్రెష్ అవ్వు - ఈలోపు నేను స్నాక్స్ ఆర్డర్ చేస్తాను అంటూ మొబైల్ అందుకోబోతే .......
అమ్మ : ఊహూ ......
హెడ్ మిస్ట్రెస్ : సరే సరే missed కాల్స్ చూసి చేస్తేనూ అంటావు అంతేకదా - వెళ్లమ్మా వెళ్లు బాత్రూమ్లోకి కూడా తీసుకెళ్లు .
అమ్మ : ముసిముసినవ్వులతో బాత్రూమ్లోకివెళ్లారు .
హెడ్ మిస్ట్రెస్ : థాంక్యూ థాంక్యూ soooo మచ్ మహేష్ సర్ - నా ఫ్రెండ్ ను ఇంత సంతోషంతో చూస్తున్నాను అంటే కేవలం మీవల్లనే , ముందు స్నాక్స్ అంటూ ఫోన్ దగ్గరికివెళ్లి స్టూడెంట్స్ రూమ్స్ కు సర్వ్ అయిపోయాయని తెలుసుకుని ఆనందించి ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేసేసారు .

అమ్మ ఫ్రెష్ అయ్యివచ్చి , అమ్మో ....... ఏంటి హెడ్ మిస్ట్రెస్ గారూ ఇన్ని ఆర్డర్ చేశారు ? .
హెడ్ మిస్ట్రెస్ : నేను ఆర్డర్చేసినవాటితోపాటు చైర్మన్ గారికోసం ప్రత్యేకంగా అంటూ మేనేజర్ కూడా పంపించారు మరి - తమరు సో స్పెషల్ మరి ........
అమ్మ : సిగ్గుపడి , థాంక్యూ మహేష్ అంటూ మళ్లీ కాల్ చేసినా నిరాశే ఎదురయ్యింది .
హెడ్ మిస్ట్రెస్ : నీకొడుకుకే కే కాదు నీ తల్లిని కూడా అప్పుడప్పుడైనా గుర్తుచేసుకుని కాల్ చెయ్యొచ్చు .......
అమ్మ : చేసాను అంటూ నవ్వుతూ చెప్పారు - మై ఫ్రెండ్ ...... నువ్వు మహేష్ ను నీ కొడుకు అన్న ప్రతీసారీ కన్నప్రేగు కదులుతోంది తెలుసా ...... - ఎంత ఆనందం కలుగుతోందో మాటల్లో వర్ణించలేను .
హెడ్ మిస్ట్రెస్ : నీ ఆనందబాస్పాలు చూస్తేనే తెలిసిపోతోంది ఇకనుండీ అలానే పిలుస్తానులే , నీ కొడుకు - బిడ్డలు ....... ఎక్కడికైనా బయటకు వెళ్లి ఉంటారు అందుకే తగలడం లేదేమో , చూసుకుని కాల్ చేస్తారులే , నాకు తెలిసి తల్లితో మాట్లాడకుండా నీ కొడుకు ఉండలేడులే .......
అమ్మ : థాంక్యూ మై ఫ్రెండ్ అంటూ పులకించిపోతున్నారు .
హెడ్ మిస్ట్రెస్ : తగ్గొద్దు తగ్గొద్దు చైర్మన్ గారూ ...... , ఇంత ఆనందం చూస్తాననుకోలేదు , అదే ఆనందంతో వచ్చి స్నాక్స్ ఎంజాయ్ చెయ్యి .......
అమ్మ : నీ మాటలతో ........
హెడ్ మిస్ట్రెస్ : కడుపు నిండిపోయింది అనిమాత్రం అనకు - ఈ అమ్మ తినలేదని బాధపడేది నీ కొడుకే .......
అమ్మ : అయితే తింటాను .
హెడ్ మిస్ట్రెస్ : నీ కీ ఏంటో తెలిసిపోయిందిలే అంటూ సంతోషంతో నవ్వుకుని స్నాక్స్ ఎంజాయ్ చేశారు .
స్టూడెంట్స్ అందరితోపాటు టెంపుల్ కు వెళ్లి మనసు మరింత ప్రశాంతం చేసుకుని ప్యాలస్ చేరుకున్నారు - ఒకేసారి రెస్టారెంట్ లో డిన్నర్ చేసి గదులలోకి చేరారు .

హెడ్ మిస్ట్రెస్ గారూ ....... ఇంకా ఔట్ ఆఫ్ అనే వస్తోంది అంటూ మళ్లీ మళ్లీ ట్రై చేస్తూనే ఉన్నారు అమ్మ .
హెడ్ మిస్ట్రెస్ : డియర్ చైర్మన్ గారూ ....... నాకు తెలిసి సిటీ బయట ఏదైనా ఫంక్షన్ కు వెళ్లి ఉంటారు - బహుశా టవర్ ఉండకపోవచ్చు - సిగ్నల్ రాగానే నువ్వు ప్రేమతో చేసిన missed కాల్స్ అలర్ట్ కాగానే మరుక్షణంలో కాల్ చేస్తాడు నీ కొడుకు - బాగా అలసిపోయాముకదా హాయిగా నిద్రపో గుడ్ నైట్ - మొబైల్ నీతోనే ఉంచుకో .......
అమ్మ : అంతవరకూ ఆగాలన్నమాట అంటూ నన్నే తలుచుకుంటూ నిద్రపోయారు .
********************

ఇక్కడ ఫ్లైట్ లో సముద్రాన్ని - మేఘాలను పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న దేవకన్యను ప్రక్కనే హత్తుకుని మురిసిపోతున్నాను .
దేవకన్య : ప్చ్ ...... చీకటిపడిపోయింది అంటూ పిల్లలతోపాటు నిరాశ చెంది సోఫాలలో సెటిల్ అయ్యింది . బ్రదర్ ...... ఇంకెన్ని గంటలు ఇలా ప్రయాణం - సముద్రంపై వేల కిలోమీటర్లు వెళుతూనే ఉన్నాము - ఎక్కడిదాకా మన ప్రయాణం ?.
పిల్లలూ ........
పిల్లలు : The బిగ్గెస్ట్ సర్ప్రైజ్ మహి అక్కయ్యా .......
దేవకన్య : చెల్లెళ్ళూ ప్లీజ్ ప్లీజ్ నా చెవిలో చెప్పండి ఎవ్వరికీ చెప్పను .
పిల్లలు : సర్ప్రైజ్ సస్పెన్స్ లా సడెన్ గా ఉంటేనే మా మహి అక్కయ్య అంతులేని ఆనందం చూడగలం కాబట్టి చెప్పనే చెప్పము .
దేవకన్య : మీ అన్నయ్యకు ...... మాకంటే మీరంటేనే ఎక్కువ ఇష్టం . మీకు చెప్పారు - మాకు చెప్పలేదు .

నిజమేకదా డియర్ సిస్టర్ ....... , ఫస్ట్ అమ్మలు - నెక్స్ట్ దివ్యక్క చెల్లెమ్మ పిల్లలు ఆ తరువాత నా దేవకన్య ....... , నా దేవకన్యకు కూడా అమ్మా చెల్లెల్లే ప్రాణం .......
దేవకన్య : లవ్ ....... థాంక్యూ డియర్ బ్రదర్ అంటూ చేతిని చుట్టేసి ఆనందిస్తోంది .
బ్రదర్ నుండి డియర్ బ్రదర్ ....... ఆఅహ్హ్ అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను .
దేవకన్య : డియర్ సిస్టర్ అని పిలిచావు కాబట్టి నేనూ పిలిచాను అంతే అంత ఫీల్ అవ్వకు అంటూ నా చేతిని తీసేసి , లవ్ యు అమ్మలూ అంటూ హృదయంపై రెండు ముద్దులుపెట్టింది .
మేముకూడా అంటూ పిల్లలందరూ వచ్చి లవ్ యు అమ్మలూ లవ్ యు అమ్మలూ అంటూ చేతులతో ముద్దులుపెట్టారు .
Wow పిల్లలూ ...... అమ్మ సో సో హ్యాపీ ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలాను . అమ్మలు అంటే గుర్తుకువచ్చింది వెంటనే మొబైల్ అందుకుని కాల్ చెయ్యబోయి సముద్రంపై ఆకాశంలో వెళుతున్నది గుర్తుకువచ్చి ప్చ్ ప్చ్ .... అంటూ ఆగిపోయాను .

దేవకన్య : డియర్ బ్రదర్ ...... ఏమైంది ? .
అమ్మ ...... ఏమీలేదు ఏమీలేదు , నిద్రపోయాను కదా ఫ్రెష్ అయ్యివస్తాను అంటూ రూంలోకివెళ్ళాను - రేయ్ ...... ఫ్లైట్ ల్యాండ్ అయ్యేంతవరకూ అమ్మతో మాట్లాడలేవు అని ఎలా మరిచిపోయావురా అంటూ నాపై నేనే కోప్పడ్డాను - ఫేస్ వాష్ చేసుకుని ఫీల్ అవుతూనే బయటకువచ్చాను .
నా కళ్లల్లో మార్పు కనిపించినట్లు దేవకన్య ...... రూమ్ బయటే వేచిచూస్తోంది - మహేష్ ..... ఏమైంది అంతా ok కదా ......
పెదాలపై చిరునవ్వులతో నథింగ్ నథింగ్ ...... పిల్లలకు ఆకలివేస్తోందేమో డిన్నర్ ప్యాకేజస్ ఓవెన్ లో పెడదాము .
అన్నయ్యా ...... వస్తున్నాము అంటూ దివ్యక్క - చెల్లెమ్మ - సిస్టర్స్ ...... వెళ్లి 15 నిమిషాలలో ఓవెన్ నుండి వేడివేడిగా తీసుకొచ్చి లాంగెస్ట్ డైనింగ్ టేబుల్ పై చేర్చి మొదట పిల్లలకు - అందరికీ వడ్డించారు .

దేవకన్య : నావైపే చూస్తూ నాతోపాటే తినడం లేదు - మహేష్ ...... ఏమైంది తినడం లేదు .......
ఆకలిగా లేదు మహీ - మీరు తినండి .
దేవకన్య : Something happenned ఏమైంది ? - నీ కళ్ళను ఎప్పుడూ అలా చూడలేదు .
అందరూ తినడం ఆపేసి మావైపుకు చూస్తున్నారు .
ఏమైంది ఏమీకాలేదు - ఆకలిగా లేదు అంతే .......
దేవకన్య : ఏదో దాస్తున్నావు - అయితే నాకూ ఆకలిగా లేదు నేనూ తినను .
అన్నయ్య - అక్కయ్యకు ఆకలిగా లేదంటే మాకూ ఆకలిగా లేదు అంటూ పిల్లలు చేతులు కట్టుకుని కూర్చున్నారు .
మేముకూడా అంటూ దివ్యక్క - చెల్లెమ్మ - సిస్టర్స్ ........
రేయ్ మామా ఏమైందిరా ....... , సిస్టర్ ...... ప్రేమించడం లేదనే కదా ......
దేవకన్య : మహేష్ ...... నిజమా ? .
నో నో నో జీవితాంతం ప్రేమించయినా నా ప్రేమను గెలిపించుకుంటాను అని తలదించుకునే బదులిచ్చాను .
దేవకన్య : అది నాకుకూడా తెలుసుకానీ ...... , మరెందుకో ఆ ఆ అమ్మల గురించి అమ్మ ...... అంటూనే ఇలా బాధపడటం మొదలైంది - ఏదీ నావైపుకు చూడు ..... చూడమంటున్నాను కదా అంటూ తల ఎత్తింది .

నాకళ్ళల్లో బాధ అందరికీ కనిపించినట్లు మహేష్ - అన్నయ్యా - మహేష్ సర్ ....... అంటూ అందరూ కంగారుపడుతూ చుట్టూ చేరారు .
కూల్ కూల్ కూల్ ...... ఏమీకాలేదు - దివ్యక్కా చెల్లెమ్మా సిస్టర్స్ పిల్లలూ మై డియరెస్ట్ సిస్టర్ ...... మీరిలా కంగారుపడితే అమ్మలు కంగారుపడతారు .
అందరూ : మేము కంగారుపడకూడదు అంటే మీ బాధకు కారణం ఏమిటో చెప్పండి - దీనితో లవ్ యు టూ అని చెప్పించమంటారా ? .
నో నో నో సిస్టర్స్ ...... మాది స్వచ్ఛమైన ప్రేమ , మహీ - దేవకన్యా - సిస్టర్ .......
దేవకన్య : అవన్నీ తరువాత ముందు ఈ బాధకు కారణం ఏమిటో చెప్పు అంటూ కళ్ళల్లో చెమ్మ ........
అమ్మో అమ్మో ...... డియర్ సిస్టర్ , నీ - మీ కళ్ళల్లో చెమ్మను చూసినా అమ్మలు .....
దేవకన్య : మేము - అమ్మలు బాధపడకుండా ఉండాలంటే మకిష్టమైన ఈ కళ్ళల్లో బాధకు కారణం చెప్పు మరి .
బాధనే కానీ తియ్యనైన బాధ మహీ ....... , ఏమిటంటే ఏమిటంటే ఈ దేవకన్యల పెదాలపై అందమైన నవ్వులు పరిమలింపజేసే క్రమంలో దేవత గురించి మరిచిపోయాను .
దేవకన్య - అందరూ : దేవతనా ...... ? ఎవరు ? .
" నా దేవతలు ...... అమ్మలు " , పిల్లల సర్ప్రైజ్ వలన మీ సంతోషాల మైకంలో పడి అమ్మకు ఇలా వెళుతున్నామన్న విషయమే చెప్పలేదు , పాపం అమ్మ ...... నా కాల్ కోసం వేచిచూసి చూసి - కాల్స్ చేస్తూనే ఉంటారు .
దేవకన్య కళ్ళల్లో కన్నీళ్ల స్థానంలో ఆనందబాస్పాలు - నా వైపే ఆరాధనతో చూస్తోంది .
ఇదిగో ఇప్పుడే కాల్స్ చేస్తాము అంటూ మొబైల్స్ అందుకుని నో టవర్ అంటూ సిగ్గుపడుతున్నారు .
సిస్టర్ ...... ఇదీవిషయం - అమ్మతో మాట్లాడకుండా ఎలా తినగలను చెప్పు - అమ్మకూడా ...... నాలానే తినకుండా ....... నో నో నో వాకీ టాకీ ఎక్కడ ఫ్లైట్ ను వెనక్కు తిప్పించాలి - ముందుకువెలితే ఉదయం దాకా wait చెయ్యాలి .

విద్యు సిస్టర్ : మహీ డార్లింగ్ ...... ఈ తియ్యనైన బాధతో అమ్మపై ప్రేమలో ఎవరెస్టు చేరారు మహేష్ సర్ - అమ్మ గురించి ఆలోచించకుండా కుమ్మేస్తున్నాము మనం .....
బుజ్జిచెల్లి : అన్నయ్యా ...... వాకీ టాకీ అంటూ అందించింది .
దేవకన్య : అమ్మ గురించి బాగా తెలిసినదానిని చెబుతున్నాను , నేను - దివ్య - కావ్య - సిస్టర్స్ ...... తిన్నా అమ్మ తింటారో లేదో తెలియదు కానీ , విద్యు డార్లింగ్ చెప్పినట్లు ఈ క్షణంతో అమ్మ ప్రాణం కంటే ఎక్కువైన నువ్వు తింటే అమ్మ నీ దేవత ఖచ్చితంగా తింటారు ఇది ప్రకృతి ధర్మం - అమ్మ మనసుకు ఎలాగైనా తెలుస్తుంది తింటుంది అంటూ నా ప్లేట్ అందుకుని తినిపించబోయింది .
దివ్యక్కా - చెల్లెమ్మా - సిస్టర్స్ ........ ? .
అందరూ : ఖచ్చితంగా ఖచ్చితంగా అన్నయ్యా - మహేష్ సర్ ......
అయితే వెంటనే తినిపించు సిస్టర్ ........
దేవకన్య : ఆనందబాస్పాలను తుడుచుకుని ముద్ద కలిపింది .
సిస్టర్ ...... నా ప్లేట్ లో ఈగ పడటం చూసాను .
మహీ - డార్లింగ్ ........
దేవకన్య : సరే సరే అర్థమైంది అర్థమైంది అంటూ తను తిన్న ప్లేటు అందుకుని తినిపించింది .
మ్మ్మ్ మ్మ్మ్ ....... అమృతం , లవ్ ...... థాంక్యూ థాంక్యూ డియర్ సిస్టర్ , అమ్మా ..... నేను - మీ తల్లులందరూ తింటున్నారు కాబట్టి మీరూ తినాలి , దుర్గమ్మ తల్లీ ....... మీ తోటి దేవత తినేలా మీరే చూసుకోవాలి .
మీరే చూసుకోవాలి అంటూ పిల్లలతోపాటు అందరూ ప్రార్థించి తింటున్నారు .
లవ్ యు లవ్ యు పిల్లలూ - మీ అక్కయ్యతోపాటు మీరూ తినిపించొచ్చుకదా..... ,
లవ్ టు లవ్ టు అన్నయ్యా ...... అంటూ బుజ్జి బుజ్జి ముద్దలతో చుట్టూ చేరారు .

మ్మ్మ్ మ్మ్మ్ ...... మీ అక్కయ్య ముద్దులు కంటే అదే అదే ముద్దల కంటే టేస్టీ , డియర్ సిస్టర్ ...... నువ్వూ తిను ......
అందరూ నవ్వుకున్నారు .
దేవకన్య : పైకిమాత్రం మహి అక్కయ్య అంటేనే ప్రాణం అని ముద్దలన్నీ నీకే తినిపిస్తున్నారు - వీళ్లకు నువ్వంటేనే ప్రాణం .......
పిల్లలు : ఇద్దరూ ప్రాణమే , సగం అన్నయ్యకు - సగం అక్కయ్యకు అంటూ తినిపించారు .
సిస్టర్ ....... మనం తింటే అమ్మ తింటుందని నమ్మించి అమ్మలా తినిపిస్తున్నావు - ల్యాండ్ అయ్యాక ఫస్ట్ కాల్ అమ్మకే చేస్తాను - ఏమైనా ......
దేవకన్య : మనం తింటే కాదు నువ్వు తింటే ఖచ్చితంగా అమ్మ తింటుంది నాకుతెలిసి ఈపాటికే అమ్మకు తెలిసిపోయి ఉంటుంది తింటూ ఉండచ్చు కూడా .......
అయితే ఫుల్ గా తినిపించు సిస్టర్ ......
దేవకన్య : లవ్ టు బ్రదర్ ......
కూర్చుని తినిపించు సిస్టర్ .......
దేవకన్య : పర్లేదు బ్రదర్ - ఎంత ఆనందం కలిగించావో మాటల్లో వర్ణించలేను ( ముఖమంతా ముద్దులవర్షం కురిపించాలన్న కోరికను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా ) మా దేవుడు బంగారం - మా దిష్టి నే తగిలేలా ఉంది - ఇలానే ఇష్టంతో తినిపిస్తాను - నేను చదువుకునేటప్పుడు అమ్మ ఇలానే తినిపించేవారు .
Wow wow - ముద్దులతో దిష్టి తీస్తే పోతుంది అంటూ గుసగుసలాడాను .
దేవకన్య : ఏంటీ .......
అదే అదే నా హృదయంలో ఉన్న దేవతలకు మన అమ్మలకు ......
దేవకన్య : తిన్నాక అమ్మలు ఇక చాలు తల్లీ అనేలా ముద్దులుపెడతాను .
యాహూ యాహూ ........
దేవకన్య : ష్ ష్ ష్ నీ సంతోషానికి ఫ్లైట్ దద్దరిల్లిపోయేలా ఉంది - పిల్లలున్నారు భయపడతారు అంటూ సున్నితంగా మొట్టికాయవేసింది .
పిల్లలు : మా అన్నయ్యలు ఉండగా మాకేమీ భయంలేదు ఎంజాయ్ అన్నయ్యా ....
లవ్ యు పిల్లలూ ఉమ్మా ఉమ్మా ....... , ఇక చాలు ఫుల్ గా తినిపించావు సిస్టర్ .
దేవకన్య : తాగడానికి నీళ్లు , తుడుచుకోవడానికి చున్నీ అందించింది .
అమ్మా - దేవతా ....... అన్నీ మీవల్లనే , ప్రేమతో తినిపించి ఇప్పుడు ఇలా ఉమ్మా ఉమ్మా ఉమ్మా .......
దేవకన్య : నవ్వుకుని , బ్రదర్ ...... ఫ్లైట్లో ఈగలు ఉంటాయా అసలు అంటూ నా బుగ్గను గిల్లేసి ప్లేట్స్ వాష్ చెయ్యడానికి తీసుకెళ్లింది .
వెనుకే అందరూ వెళ్లారు .

ప్లేట్స్ వాష్ చేసి డార్లింగ్స్ అంటూ సంతోషంతో కౌగిలించుకుంది దేవకన్య .......
సిస్టర్స్ : ఏంటే ఇంత సంతోషం ...... , ok ok అమ్మ సంతోషం కోసం ఎంత ఆరాటపడుతున్నారు అనేకదా .
దేవకన్య : అవునవును , మహేష్ వలన అమ్మ ఎంత ఆనందంగా ఉండబోతున్నారో తలుచుకుంటేనే మనసు పులకించిపోతోంది .
సిస్టర్స్ : అయితే ఇంకెందుకే ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుంది - వెళ్లి లవ్ యు టూ అని చెప్పెయ్యి .
దేవకన్య : ఆ ఒక్కమాటతో సంతోషపెట్టేది కాదే - విశ్వమంత స్వచ్ఛమైన ప్రేమను పంచుతున్నాడు - ఇంకెంత పంచడానికి దాచుకున్నాడో మొత్తం మొత్తం ఆస్వాదించాలని ఉంది .
సిస్టర్స్ : పాపమే .......

దివ్యక్క : ఏమీకాదు , మహీ ...... నేను - కృష్ణ ఆస్వాదించలేని అదృష్టం నీ ముందుంది , అన్నయ్య ప్రేమకు ఎల్లలులేవు - మొత్తం మొత్తం బయటకు రప్పించి అంతకుమించిన ప్రేమను బహుమతిగా ఇవ్వు , ఆ ప్రేమ మాధుర్యంలో అన్నయ్య ఉక్కిరిబిక్కిరి అయిపోవాలి , నీ చిలిపి ప్రేమలో అన్నయ్య ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాముకదా .......
సిస్టర్స్ : అవునవును ....... , దివ్య చెప్పినది కూడా నిజమే ........
దేవకన్య : లవ్ యు సో మచ్ దివ్యా - చెల్లీ అంటూ కౌగిలించుకుంది .
చెల్లెమ్మ : అయితే అన్నయ్యను మరింత కవ్వించు - ఆటపట్టించు అక్కయ్యా ......

అన్నయ్యను ఆటపట్టించడానికి ప్లాన్స్ వేస్తున్నారా ? - ఇప్పుడే వెళ్లి అన్నయ్యకు చెబుతాము .
చెల్లెళ్ళూ - తమ్ముళ్లూ ....... అంటున్నా .......
ఆగకుండా పరుగున నాదగ్గరికివచ్చారు . అన్నయ్యా అన్నయ్యా ........
అందరు : చెల్లెళ్ళూ - తమ్ముళ్లూ నో నో వద్దు వద్దు ....
పిల్లలు : అన్నయ్యా ...... ఆక్కయ్యలు ఏవేవో ప్లాన్స్ వేస్తున్నారు .
ఏ ప్లాన్స్ పిల్లలూ .......
పిల్లలు : సర్ప్రైజ్ సర్ప్రైజ్ ....... అంటూనే దేవకన్య - సిస్టర్స్ వైపు కన్నుకొట్టారు .
అందరూ ఊపిరిపీల్చుకుని లవ్ యు లవ్ యు అంటూ ముద్దులుపెట్టి కూర్చున్నారు .
బుజ్జిచెల్లెళ్ళూ - తమ్ముళ్లూ ....... ప్లీజ్ ప్లీజ్ అదేదో చెప్పొచ్చుకదా .......
పిల్లలు : మీ నుండి అక్కయ్యలకు ఒక స్వీట్ సర్ప్రైజ్ - అక్కయ్యలనుండి మీకు ఒక స్వీటెస్ట్ సర్ప్రైజ్ ........
మన స్వీట్ సర్ప్రైజ్ ఏమిటో ఫ్లైట్ లాండింగ్ సమయానికి తెలిసిపోతుంది కదా పిల్లలూ కాబట్టి ఆ స్వీటెస్ట్ సర్ప్రైజ్ ఏమిటో చెవిలో చెప్పేయ్యండి .
పిల్లలు : అదీ అదీ ...... ఆ స్వీటెస్ట్ సర్ప్రైజ్ ను మా అన్నయ్య ఆస్వాధిస్తేనే బాగుంటుంది ఉమ్మా ఉమ్మా ........

దేవకన్య - దివ్యక్క : మధ్యాహ్నం అనగా ఆకాశంలోకి ఎగిరాము ఇప్పుడు 10 గంటలు అవుతోంది ఇంకా సముద్రం మీద వెళుతూనే ఉన్నాము - ఎక్కడికి వెళుతున్నాము బ్రదర్ - అన్నయ్యా ....... , చెల్లికి తెలిసినా చెప్పడం లేదు .
పిల్లలూ ........
దేవకన్య : స్టాప్ స్టాప్ , తమరేమో పిల్లలూ అని కేకేయ్యడం - వీల్లేమో ...... సర్ప్రైజ్ అనడం వింటూనే ఉన్నాము , ల్యాండ్ అయినప్పుడు అవ్వనివ్వనీ ...... పిల్లలూ ..... ఇప్పటికే ఆలస్యం అయ్యింది - డియర్ బ్రదర్ ...... స్లీపింగ్ ఎక్కడ ? .
పిల్లలూ .......
పిల్లలు : అక్కయ్యా ...... పై ఫ్లోర్ మొత్తం లగ్జరీ బెడ్స్ , రూంకూడా ఉన్నాయి రండి రండి అంటూ చేతులు అందుకున్నారు .
దేవకన్య నా చేతిని అందుకుని లేచి పైకి పిలుచుకునివెళ్లింది .

Wow అందరూ కంఫర్టబుల్ గా పడుకోవచ్చు అంటూ పిల్లలతోపాటు జంప్ చేశారు సిస్టర్స్ ........
అయితే రూమ్స్ ఎవరికీ వద్దన్నమాట అంటూ కృష్ణగాడు ...... చెల్లెమ్మను - బావగారు ..... దివ్యక్కను ఎత్తుకుని ఒక్కొక్కగదిలోకి వెళ్లిపోయారు .
సిస్టర్స్ ....... పిల్లల కళ్ళను మూసి వెళ్ళేదాకా నవ్వుకున్నారు .
అన్నయ్యా - మహి అక్కయ్యా ...... మీకోసం బెడ్ రెడీ అంటూ అందరి మధ్యలోకి పిలిచారు పిల్లలు .......
లవ్ యు లవ్ యు పిల్లలూ ...... అంటూ పిల్లల్లానే జంప్ చేసాను .
ఒకే బెడ్ పైననా నోవే అంటూ దేవకన్య బెట్టుచెయ్యడం కోప్పడటం చూసి పిల్లలందరూ ఆస్కార్ యాక్టింగ్ అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
ఆస్కార్ యాక్టింగ్ ....... ? .
నథింగ్ నథింగ్ అన్నయ్యా .......
దేవకన్య సిగ్గులతో మెలికలుతిరిగిపోతోంది .
విద్యు సిస్టర్ : హలో డార్లింగ్ ఇది మన ఇల్లు కాదు ఫ్లైట్ ఎలాగో అడ్జస్ట్ చేసుకోవాలి - పనిష్మెంట్ ఇవ్వాలా లేక బుద్ధిగా ......
దేవకన్య : అవసరం లేదు అవసరం లేదు అంటూ బెడ్ పై నా ప్రక్కనే వాలిపోయింది.
లవ్ యు లవ్ యు soooo మచ్ పిల్లలూ ఉమ్మా ఉమ్మా .......
సిస్టర్స్ : మా లవ్ యు లు - ముద్దులన్నీ ...... ఇప్పుడు ఈ బుజ్జిదెయ్యాలకు వెళ్లిపోతున్నాయి .
అందరమూ నవ్వుకున్నాము .

దివినుండి దిగివచ్చిన దేవకన్యా మై డియర్ లవ్లీ సిస్టర్ ......కొద్దిసేపటి ముందు దేవతలిద్దరూ ఇకచాలు అనేలా .........
దేవకన్య : గుర్తుంది గుర్తుంది డియర్ బ్రదర్ అంటూ అతిదగ్గరగా చేరి , లవ్ యు అమ్మలూ దేవతలూ అంటూ పెదాలతో హృదయంపై అంతులేని ప్రేమతో తొలిముద్దు .......
ఆఅహ్హ్ ......
దేవకన్య : ఒకముద్దుకే స్వర్గానికి వెళ్ళిపోయాడు మీ మహేష్ సర్ - అన్నయ్య , మళ్లీ బోలెడన్ని కావాలని అత్యాశ ఒకటి .......
విద్యు సిస్టర్ : నీకోసమేనే డార్లింగ్ ...... , ఇప్పుడైతే ఎక్కడైనా ముద్దులుపెట్టుకోవచ్చు ఎంజాయ్ అంటూ లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేసేసారు .
దేవకన్య : లవ్ యు డార్లింగ్స్ ....... ప్చ్ ప్చ్ ప్చ్ .......
విద్యు సిస్టర్ : పిల్లలున్నారే సెన్సార్ కాస్త నెమ్మదిగా ........
దేవకన్య : Ok ok ok అంటూ అందమైన చిలిపినవ్వులు ...... , బ్రదర్ ....... అమ్మ అంటే ఎంత ప్రేమ మీకు , నిద్రలోకూడా దేవత - దేవకన్య అంటూ కలవరిస్తున్నారు లవ్ యు లవ్ యు ...... , నీ మైకంలో పడి అమ్మకు కాల్ కూడా చెయ్యలేకపోతున్నాను తప్పంతా నీదే దెబ్బలుపడాలి నీకు .......
ఏయ్ ఏయ్ .......
దేవకన్య : నీ పరమ భక్తులు - నీపై ఈగ వాలనివ్వరు ఉమ్మా ఉమ్మా ......గుడ్ నైట్ .

హాయిగా నిద్రపట్టింది తెల్లవారిందో లేదో అంటూ కళ్ళు తెరిచాను - ప్రతీరోజూలానే స్వీట్ షాక్ ...... నా కళ్ళకు అతిదగ్గరగా నా దేవకన్య , అదికూడా నా రెండుచేతులతో నా ప్రాణమైన దేవకన్య బుగ్గలను అందుకుని ఉండటం మరియు దేవత చెయ్యి నాపై ఉండటం ...... అప్పటివరకూ చిరునవ్వులు చిందిస్తున్నట్లు నేను కళ్ళు తెరవగానే భద్రకాళీలా చూస్తుండటం చూసి వెంటనే చేతులను వెనక్కు తీసుకుని , బుద్ధిమంతుడిలా గట్టిగా చేతులుకట్టుకుని కూర్చున్నాను .
దేవకన్య : చూసారా డార్లింగ్స్ ...... , నేను పడుకున్నాక చెయ్యాల్సినదంతా చేసేసి ఇప్పుడు మాత్రం ఏమీతెలియని బుద్ధిమంతుడిలా ఎలా నటిస్తున్నాడో .......
సిస్టర్స్ తోపాటు పిల్లలందరూ నవ్వుతున్నారు - పిల్లలంతా విండోస్ నుండి బయటకు చూస్తూ ఆనందిస్తున్నారు .
మహీ ...... నా చేతులు , నీ బుగ్గలపై ఎలా ......
దేవకన్య : ఎలా చేరాయో తెలియదు అంటారు అంతేకదా , చూసారా డార్లింగ్స్ - చెల్లెళ్ళూ ...... రోజూ రెడ్ హ్యాండెడ్ గా దొరికినా ఇంకా తన తప్పులేదన్నట్లు ఏమి యాక్టింగ్ చేస్తారో అంటూ ఛాతీపై దెబ్బల వర్షంతోపాటు హృదయంపై గుడ్ మార్నింగ్ అమ్మలూ అంటూ ముద్దులు ......
నిజంగా నాకు తెలియదు మహీ ........ అంటూ లోలోపలే నవ్వుకుంటున్నాను .
దేవకన్య : నవ్వుకుంటున్నావు కదూ ...... బ్రదర్ .
నేనా ...... ? లేదు లేదు మై డియరెస్ట్ సిస్టర్ అంటూ నవ్వేసి నోటిని మూసుకున్నాను .
దేవకన్య : నవ్వుతూనేలేదు లేదు అంటున్నాడు - మీరుకూడా చూశారుకదూ డార్లింగ్స్ - చెల్లెళ్ళూ ......
లేదు లేదు మై డియర్ లవ్లీ సిస్టర్ ..... ఉమ్మా అంటూ చేతితో బుగ్గపై ముద్దుపెట్టాను .
సిస్టర్స్ : నవ్వుకుని , లేదు లేదు మహేష్ సర్ అపద్ధం చెప్పరు .
లవ్ యు సిస్టర్స్ ........
దేవకన్య : మీరంతా మీ మహేష్ సర్ భక్తులు అయిపోయారే అంటూ అందరినీ కొడుతోంది .
ఆనందించి , మై డియర్ సిస్టర్ ...... నువ్వుకూడా నాపై చేతినివేశావుకదా - దానికేమంటారు ? .
సిస్టర్స్ : భలే పాయింట్ అడిగారు మహేష్ సర్ ...... , ఇప్పుడు బదులియ్యవే - పాపం బుద్ధిమంతుడిని కూర్చోబెట్టి భయపెడుతున్నావు .
దేవకన్య : మీరు నా డార్లింగ్స్ నా లేక అంటూ చుట్టూ అందరినీ కొడుతోంది - చెబుతానే చెబుతాను నా చేతిని కూడా తనే వేసుకున్నాడు .
నేనా ....... ? .
దేవకన్య : నువ్వే ఒప్పుకో అంటూ హృదయంపై - బుగ్గపై చేతితో ముద్దుపెట్టింది .
ఆఅహ్హ్ ...... అంటూ హృదయం పై చేతినివేసుకుని బెడ్ పై వాలిపోయాను .
దేవకన్య : బ్రదర్ నువ్వే కదా వేసుకున్నది .
ఆ ఆ అవును నేనే ...... ఆఅహ్హ్ దేవకన్య ముద్దుపెట్టింది యాహూ యాహూ అంటూ కేకలువేస్తూ లేచి డాన్స్ చేస్తున్నాను .
అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ చుట్టూ చేరి నాతోపాటు డాన్స్ చేశారు .
సిస్టర్స్ : ముద్దుపెట్టి ఒప్పించేశావు కదే అంటూ దేవకన్య బుగ్గలపై ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు .

దేవకన్య : హలో హలో బ్రదర్ ......డాన్స్ చేసింది చాలులేకానీ ఇంతకూ మమ్మల్ని కిడ్నప్ చేసి ఎక్కడికి తీసుకెళుతున్నావు . నిన్న సాయంత్రం అనగా ఆకాశంలోకి ఎగిరాము ఇప్పుడు ఉదయం 7 గంటలు ఇంకా సముద్రం మీదుగా వెళుతూనే ఉన్నాము - ఎక్కడికి వెళుతున్నామో చెప్పు అంటూ నా ఎదురుగా వచ్చి నిలబడింది .
పిల్లలవైపు సైగలుచేసాను .
పిల్లలంతా సర్ప్రైజ్ సర్ప్రైజ్ .......
Yes సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటూ దేవకన్య చేతులను అందుకున్నట్లు తాకకుండా డాన్స్ చేస్తున్నాను .
దేవకన్య : ఇంకా సర్ప్రైజేనా , ఇలాకాదు అంటూ నా హృదయంపై - బుగ్గపై చేతితో ముద్దులుపెట్టారు .
ఆఅహ్హ్ ...... అంటూ పడిపోబోతే ,
చెల్లెళ్ళూ ..... హెల్ప్ అంటూ పిల్లల సహాయంతో పట్టుకున్నారు .
పిల్లలు : అక్కయ్యా ...... బ్యూటిఫుల్ & లవ్లీ ఫోజ్ అలాగే అలాగే పట్టుకోండి అన్నయ్యను అంటూ మొబైల్స్ క్లిక్ మనిపించారు .
దేవకన్య : నవ్వుకుని , డియర్ బ్రదర్ ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళుతున్నామో .......
పిల్లలు : నో నో నో అన్నయ్యా నో నో .......
ముద్దులు ఫీల్ అవుతూనే ...... , ఎక్కడికంటే ఎక్కడికంటే ...... అమ్మో అమ్మకు కాల్ చెయ్యాలి - ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ఇంకా చాలా సమయం పడుతుంది ఇప్పుడెలా ఇప్పుడెలా ...... , ఆ పైలట్ హెల్ప్ తీసుకుందాము - సిస్టర్ ...... లవ్ యు పట్టుకున్నందుకు అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి పరుగున కాక్ పిట్ కు చేరుకున్నాను .
పిల్లలంతా యే యే యే గో అన్నయ్యా గో , sorry లవ్ యు లవ్ యు అక్కయ్యా ...... , సర్ప్రైజ్ సస్పెన్స్ గా ఉంటేనే మా అక్కయ్య మరింత ఎంజాయ్ చేస్తారు అంటూ హత్తుకున్నారు .
దేవకన్య : లవ్ యు చెల్లెళ్ళూ ...... , చెల్లెళ్ళూ - తమ్ముళ్లూ ...... ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ఇంకా చాలాసమయం పడుతుందని అన్నారుకదా మీ అన్నయ్య కాబట్టి ఫ్లైట్ లోనే ఫ్రెష్ అయితే టిఫిన్ వడ్డిస్తాము రండి రండి సగం మంది ఇక్కడ సగం మంది కింద - ఒసేయ్ డార్లింగ్స్ ...... అలా కూర్చుంటే ఎలా రండి .
సిస్టర్స్ : ఏమిచెయ్యమంటావే అందరికీ నువ్వే కావాలిమరి - వచ్చినప్పటి నుండీ ముద్దులుపెట్టకపోగా ఎలా ఉన్నావే అక్కయ్యా - అత్తయ్యా అనికూడా అడగలేదు .
దేవకన్య సంతోషంతో నవ్వుకుని , కిందకుపిలుచుకునివెళ్లారు .
ఉండవే మేమూ వస్తాము అంటూ సగం మంది సిస్టర్స్ కిందకువచ్చారు .

యాహూ ....... గాట్ ఇట్ , కాక్ పిట్ నుండి బయటకువచ్చి ఇక్కడే ఉన్నారా ...... యాహూ డింక చిక ఆయ్ డింక చిక అంటూ మాస్ స్టెప్పులు వేస్తూ దేవకన్య - సిస్టర్స్ వైపుకు వెళ్ళాను .
అన్నయ్యా అన్నయ్యా ...... ఎందుకంత ఆనందం అంటూ రూమ్స్ లలోకి వెళ్లే పిల్లలంతా వచ్చి డింక చిక డింక చిక అంటూ నాతో చిందులువేస్తున్నారు .
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ....... , బుజ్జిచెల్లెళ్ళూ ...... అమ్మతో మాట్లాడటానికి సాటిలైట్ ఫోన్ - ఇది ఇంటర్నేషనల్ ఫోన్ ఏ దేశం నుండైనా ఎక్కడ నుండైనా అంటే నేలపై & ఇలా ఆకాశం నుండైనా మాట్లాడొచ్చు - మనకోసం పైలట్ రాథోడ్ అంకుల్ ఇచ్చారు , ఇదిగో ముందు మీ ఇళ్లకు కాల్ చేసి మాట్లాడండి .
పిల్లలు : నో నో నో అన్నయ్యా ...... మీ అన్నయ్యతో ఉంటే మాకు కాల్స్ కూడా చేయనవసరం లేదు - మీరు చెయ్యరని కూడా తెలుసు - మేమసలు గుర్తుంటామో లేదో అన్నారు అమ్మానాన్నలు - అయినా మేము చెప్పే వచ్చాము కానీ మీరు అమ్మకు చెప్పకుండా వచ్చేసారు కాబట్టి ఫస్ట్ మీరే కాల్ చెయ్యాలి .
లవ్ యు బుజ్జిచెల్లెళ్ళూ ........ , అమ్మానాన్నలు అలా అన్నాసరే కాల్స్ చెయ్యాలి ఎందుకంటే ఎవ్వరికైనా అమ్మానాన్నలు - మీ అక్కయ్యనే ఫస్ట్ ఆ తరువాతనే ఈ అన్నయ్యలు .......
దేవకన్య : అమ్మ పురాణం మొదలెట్టేసాడు మన దేవుడు అమ్మ అమ్మ అమ్మ .......అమ్మే సర్వస్వం - చెల్లెళ్ళూ ..... ఇది ఇప్పట్లో ఆగదు - మీ అన్నయ్య ...... అమ్మతో మాట్లాడుతారులే కానీ మీరు వెళ్లి ఫ్రెష్ అవ్వండి లేకపోతే ఆలస్యం అవుతుంది అంటూ రూమ్స్ లలోకి వదిలి పరుగునవచ్చి తొందరగా తొందరగా కాల్ చెయ్యి బ్రదర్ ....... , నువ్విచ్చిన బ్యూటిఫుల్ సర్ప్రైజ్ వలన నేనుకూడా అమ్మకు కాల్ చెయ్యలేదు .
అవునా డియర్ సిస్టర్ అయితే ముందు నువ్వే మాట్లాడు అంటూ సాటిలైట్ ఫోన్ అందించాను .

దేవకన్య : బ్రదర్ నువ్వే ఇచ్చావు కాబట్టి సరిపోయింది లేకపోతే కొట్టి లాక్కునేదానిని అంటూ ఆతృతతో డయల్ చేసింది .
సిస్టర్ సిస్టర్ ..... స్పీకర్ స్పీకర్ ......
దేవకన్య : Ok ......
" హలో " అంటూ అమ్మ వాయిస్ వినిపించగానే , చెయ్యి ఆటోమేటిక్ గా హృదయంపైకి చేరింది .
దేవకన్య : హలో అమ్మా అమ్మా అమ్మా నేను నేను .......
అమ్మ : నువ్వా ...... ప్చ్ మహేష్ అనుకున్నాను - ప్రక్కనే ఉన్నా దూరంగా ఉన్నా ముందు మహేష్ కు ఇవ్వు బంగారూ ...... , మహేష్ తో మాట్లాడకుండా ఇక ఒక్క క్షణం కూడా ఉండలేను .
కొట్టి లాక్కుంటుందట పాపం అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు సిస్టర్స్ ......
దేవకన్య : అమ్మా ...... , ఇదిగో మీ మాటలకే తెగ ఫీల్ అవుతున్న నీ ప్రియమైన మహేష్ ప్రక్కనే ఉన్నాడు మాట్లాడు అంటూ నాకు మొబైల్ అందించి , డార్లింగ్స్ అయిపోయారు అంటూ లేచి పరిగెత్తించి మరీ కొడుతోంది .

నవ్వుకుని అమ్మా ...... అమ్మా అన్న పిలుపే ఆఅహ్హ్ ...... , అమ్మా ..... sorry sorry అమ్మా ....... దేవక ...... మహి - సిస్టర్స్ ఆనందంలో మీకు కాల్ చెయ్యడమే మరిచిపోయాను - అమ్మకు చెప్పకుండా చాలా దూరం వచ్చేసాము sorry sorry అమ్మా ......
అమ్మ : మహేష్ నిజం చెబుతున్నాను , అమ్మా అంటూ మహి పిలుపు కంటే నీ పిలుపే మరింత ఉల్లాసాన్ని పంచుతోంది .
విన్నావా బంగారూ అంటూ సిస్టర్స్ ఆటపట్టిస్తున్నారు .
దేవకన్య : లోలోపల ఆనందిస్తూనే ...... , అమ్మా అమ్మా అమ్మా ...... చిన్నప్పటి నుండీ నేనే కదా ......
అమ్మ : లవ్ యు తల్లీ ...... , ఇక నుండీ మహేష్ తరువాతనే నువ్వు ...... , లవ్ యు మహేష్ ...... , అమ్మా అన్న నీ మధురమైన పిలుపుకోసం నైట్ నుండి ఆశతో ఎదురుచూస్తున్నాను , ఎన్నిసార్లు కాల్ చేసినా తగల్లేదు తెలుసా ......
Sorry sorry అమ్మా ...... , నాకు బుద్ధేలేదు , డియర్ సిస్టర్ - సిస్టర్స్ ...... ప్లీజ్ ప్లీజ్ అందరూ వచ్చి ఒక్కొక్క దెబ్బ వేస్తారా ...... ? .
అమ్మో ఇంకేమైనా ఉందా దేవుడిని ఎవరైనా కొడతారా ...... ? , ఆ హక్కు కేవలం మీ దేవత అయిన అమ్మకు - మీ దేవకన్య అయిన డియరెస్ట్ సిస్టర్ కు మాత్రమే ఉంది .
అమ్మ : నో నో నో మహి తల్లీ - విద్యు తల్లీ ...... దేవుడిని కొట్టారో మీకూ దెబ్బలుపడతాయి , మహేష్ ...... ఈ అమ్మకు కాల్ చెయ్యకుండా వెళ్లినందుకు ఎంత ఫీల్ అయి ఉంటావో నాకు తెలుసులే - నిద్రకూడా సరిగ్గా పోయావోలేదో ......
ఫీల్ అయిన మాట వాస్తవమే కానీ - రాత్రి ...... దేవక .... మహి ..... లవ్ యు అమ్మలూ అంటూ నా హృదయంపై ముద్దుపెట్టగానే హాయిగా నిద్రపోయాను మళ్లీ లేచింది ఇందాకనే అమ్మా ....... అంటూ సిగ్గుపడ్డాను .
అమ్మ : బిడ్డ హాయిగా నిద్రపోతే ఆ తల్లికి అంతకంటే ఆనందం ఏముంటుందో చెప్పు ......
థాంక్యూ అమ్మా ....... , అమ్మా ...... మీకు చెప్పానుకదా ఇక దగ్గరలోనే ఉన్నాము .

దేవకన్య మొబైల్ లాక్కుని అమ్మా ఎక్కడికి ఎక్కడికి అనిచెప్పాడు .
అమ్మా ......
దేవకన్య : ష్ అంటూ నా పెదాలను మరొకచేతితో మూసేసింది .
అమ్మ : మహేష్ చేప్పలేదా ? .
దేవకన్య : లే ...... చెప్పాడు చెప్పాడు అమ్మా , మీకెమి చెప్పాడో అని .......
అమ్మ : నీకేమి చెప్పాడో అదే బంగారూ ......
అమ్మకు తెలిసిపోయిందిలేవే ఇక లాగకు తెగుద్ది అంటూ నవ్వుకుంటున్నారు సిస్టర్స్ ......
దేవకన్య : చెప్పలేదు అమ్మా ప్లీజ్ ప్లీజ్ చెప్పొచ్చు కదా ......
అమ్మ : మహేష్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడన్నమాట అయితే సర్ప్రైజ్ లానే ఉండాలి . ముందు మొబైల్ ను మహేష్ కు ఇవ్వు .......
అదేసమయానికి దేవత చేతిపై ముద్దుపెట్టాను .
దేవకన్య : నిన్నూ అంటూ సున్నితంగా బుగ్గపై గిల్లి , అమ్మా కొడుకులే మాట్లాడుకోండి అంటూ నోటికి తాళం వేసుకుని ఎదురుగా సోఫాలో కూర్చుంది .

అమ్మా ..... ఎక్కడ ఉన్నారు ? ఏ ప్లేస్ ఎంజాయ్ చేస్తున్నారు ? ఇంతకూ అక్కడ సమయం ఎంత ? , ఇక్కడ ఉదయం 7:30 అవుతోంది .
అమ్మ : 11AM మహేష్ ...... , హుస్సేన్ సాగర్ లో బోటింగ్ ఎంజాయ్ చేస్తున్నాము , బోటింగ్ చేస్తూనే నీతో మాట్లాడుతున్నాను .
Wow లవ్లీ అమ్మా ....... , అమ్మా ...... జాగ్రత్త - లైఫ్ జాకెట్ వేసుకున్నారు కదూ .....
అమ్మ : వేసుకున్నాను మహేష్ ...... - పిల్లలందరూ కూడా ...... , మీ మేనేజర్స్ ..... పర్ఫెక్ట్ గా చూసుకుంటున్నారు .
హ్యాపీ అమ్మా .......
దేవకన్య సంతోషంతో లేచివచ్చి నా ప్రక్కన కూర్చుని హృదయంపై ముద్దులుపెడుతోంది .
అమ్మా ....... డిస్టర్బ్ చేసినట్లున్నాను - మా అమ్మ మనఃస్ఫూర్తిగా ఎంజాయ్ చెయ్యాలి , మళ్లీ లంచ్ సమయానికి కాల్ చేస్తాను .
అమ్మ : చేస్తావుకదూ ........
దేవకన్య : అమ్మా ...... భోజనం చెయ్యకుండానైనా ఉంటాడేమోకానీ మీకు కాల్ చెయ్యకుండా అమ్మా అని పిలవకుండా ఉండడులే ....... , అమ్మా ..... నాతో కొంచెం మాట్లాడు .
అమ్మ : నో నో నో మహేష్ చెప్పాడుకదా ఎంజాయ్ చెయ్యమని తరువాత మాట్లాడుతానులే బై బై హ్యాపీ జర్నీ అంటూ కట్ చేసేసారు .
దేవకన్య : నావైపు రుసరుసలాడుతూ చూస్తుండటం చూసి నవ్వుకుని , లవ్ యు డియర్ సిస్టర్ అంటూ ఎదురుగా మోకాళ్లపై కూర్చున్నాను చేతులను చాపి ....... , నో నో నో సో సో హ్యాపీ అమ్మ ప్రతీమాటలో ఇంత సంతోషం ఎప్పుడూ చూడలేదు లవ్ ...... థాంక్యూ థాంక్యూ సో మచ్ అంటూ హృదయం పై ముద్దులుపెట్టి చేతిని చుట్టేసి ఆనందిస్తోంది .
ఇక నా పరిస్థితి వర్ణనాతీతం - దేవకన్యవైపే ప్రేమతో చూస్తూ జలదరిస్తున్నాను .
Next page: Update 45
Previous page: Update 43