Update 55

దేవకన్య : అమ్మలూ అమ్మలూ దివ్యా ...... పదండి త్వరగా కేక్ కట్ చేద్దాము . కెవ్వున కేకవేసి స్స్స్ స్స్స్ ...... అమ్మా ఎందుకు అంత గట్టిగా గిల్లావు .
అమ్మ : ఇంకా కొరికెయ్యాల్సింది ...... , నా మహేష్ ను బిడ్డను ఇంకెంత కాలం దూరం చేస్తావే రాక్షసీ .......
అందరితోపాటు దేవకన్య కూడా నవ్వుతోంది .
దేవకన్య : మీ బిడ్డేమో దేవుడు - నేనేమో రాక్షసిని అయ్యానా ...... ? .
అమ్మ : అనేసాను కదా ఇంకా అడుగుతావేంటి అంటూ మళ్లీ గిల్లేసినట్లు మరొక కేక వినిపించింది .
ఆనందం - నవ్వులు ఆగడం లేదు .
దేవకన్య : స్స్స్ స్స్స్ ..... అమ్మా అమ్మా లవ్ యు లవ్ యు , ఆ సమయంలో మా అమ్మపైననే అసూయ కలిగేలా చేసాడు నీబిడ్డ , అయినా మా పుట్టినరోజు కంటే అద్భుతమైన సందర్భం రాబోతోందన్నమాట .......
అమ్మ : ఇలాంటి మాటలకేమీ తక్కువలేదు , మమ్మల్ని దూరం చేస్తున్న తియ్యనైన పాపం మాత్రం నీదే .......
దేవకన్య : విన్నావా బ్రదర్ ......
అమ్మ : మహేష్ లైన్లోనే ఉన్నాడా చెప్పొచ్చుకదా అంటూ మళ్లీ గిల్లేసి మొబైల్ లాక్కుని , తల్లులూ ....... పైకివచ్చెయ్యండి అంటూ లోపలికి పరుగులుతీశారు . మహేష్ .......
ఆ క్షణం కలిగిన ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి .

దేవకన్య : స్స్స్ స్స్స్ ...... ఎర్రగా కందిపోయింది . అయినా పైకెందుకు అమ్మా ......
అంటీ - వసుంధర అంటీ : తల్లులూ ...... ఎందుకో మీకే తెలుస్తుంది రండి అంటూ చేతులను అందుకుని అందరినీ పైకిపిలుచుకునివెళ్లారు .
మిస్సెస్ మేనేజర్ గారు వడివడిగా పైకివెళ్లి , 3 2 1 సర్ప్రైజ్ .......
అంతే ఇంటిపైన వెలుగులతో నిండిపోయింది - అందరిపై పూలవర్షం - ఆకాశంలో తారాజువ్వలు ...... సెలెబ్రేషన్ డెకరేషన్ ను చూసి అందరూ wow బ్యూటిఫుల్ అంటూ దేవకన్య - చెల్లెమ్మలను హత్తుకుని టాప్ మొత్తం చూసి ఆనందిస్తున్నారు . Happy Birthday కృష్ణా - మహీ ...... అంటూ ఊరుమొత్తం వినిపించేలా కేకలువేస్తున్నారు .

చెల్లెమ్మతోపాటు దేవకన్య ఆనందించి , దివ్యా - విద్యు ...... మహేష్ లేకపోవడం ...
విద్యు సిస్టర్ : మహీ డార్లింగ్ ...... హాయిగా నిద్రపోతున్న నిన్ను ఇక్కడిదాకా ఎలా తీసుకొచ్చాడో తెలుసా ...... , రెండుచేతులతో గుండెలపైకి ఎత్తుకుని నుదుటిపై ప్రాణంలా ముద్దులుపెడుతూ కారులోకి చేరి ఒడిలో కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేస్తూ ఊరు ఎంట్రన్స్ వరకూ వచ్చారు .
దేవకన్య : అమితమైన ఆనందంతో అవునా ...... ఇంకా చెప్పు చెప్పవే , అందుకేనా ఇక్కడికి వచ్చేన్తవరకూ స్పృహలోకి రానేలేదు .
విద్యు సిస్టర్ : ఊరిచివరన ఆగి , అంతే ప్రాణంలా బస్సులోకి ఎత్తుకునివచ్చి అమ్మకోసం అంటూ మమ్మల్ని కన్విన్స్ చేసి నిన్ను వదిలి వెళ్లలేనట్లు ఆగి ఆగి ముద్దులుకురిపిస్తూనే సంతోషం - చిరు బాధతోనే వెళ్ళిపోయాడు .
దేవకన్య : లవ్ యు లవ్ యు బ్రదర్ ......

విద్యు సిస్టర్ : అమ్మలూ ...... రండి సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేద్దాము .
అమ్మ : నా మహేష్ తో మాట్లాడటమే నాకు సెలెబ్రేషన్ , ఆగండి మాట్లాడుతున్నాను కదా .......
అందరూ నవ్వుకున్నారు .
దేవకన్య అందమైనకోపంతో వడివడిగా వెళ్లి , మొబైల్ లాక్కుని స్పీకర్ ఆన్ చేసి అమ్మా - బ్రదర్ ...... సెలెబ్రేషన్ తరువాత ఎంతసేపైనా మాట్లాడుకోండి మాకిక్కడ నిద్రవస్తోంది అంటూ కేక్స్ దగ్గరికి అమ్మను లాక్కునివెళ్లింది .
అమ్మ : తల్లీ మొబైల్ .......
దేవకన్య : ప్రపంచంలో మీరిద్దరే తల్లీబిడ్డలు ...... నువ్వే ఉంచుకో అంటూ అందించింది .
అమ్మ : అంతేమరి ...... , నాన్నా మహేష్ ...... ఇక్కడంతా డిస్టర్బ్ గా ఉంది వీళ్ళ కేక్ కట్టింగ్ తరువాత మాట్లాడుకుందాము - లైన్లోనే ఉండు .......
లవ్ టు లవ్ టు ...... లవ్ యు అమ్మా , మహీ - చెల్లీ ...... ఎంజాయ్ .

లవ్ యు బ్రదర్ - అన్నయ్యా ...... అంటూ ఇద్దరూ ..... వాళ్ళ అమ్మలను మరియు దివ్యక్క విద్యు సిస్టర్ ల చేతులను అందుకుని అందరినీ కేక్ దగ్గరికి పిలుచుకునివెళ్లారు .
అన్నయ్యా ...... లవ్ యు సో మచ్ ఫర్ లవ్లీ ఆర్రేంజిమెంట్స్ , బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ...... , కేక్స్ పై కూడా " HAPPY BIRTHDAY మహి - కృష్ణ FROM అమ్మ " అమ్మలిద్దరూ ఎంత ఆనందిస్తున్నారో మాటల్లో చెప్పలేను .
కేక్స్ తప్ప అన్నీ ఏర్పాట్లుచేసినది అమ్మావాళ్ళు - వసుంధర అంటీ - మిస్సెస్ మేనేజర్ ...... వాళ్లకు థాంక్స్ చెప్పాలి .
అమ్మ : ఈ ఏర్పాట్లన్నీ ఇష్టంతో చేసినది నువ్వు - కృష్ణ - దివ్య - కృష్ణవేణి వస్తారని , మహి తల్లి వలన అంటూ మళ్లీ గిల్లేసారు .
దేవకన్య : స్స్స్ స్స్స్ ...... , మొదట కేక్ కోసి అమ్మకు ప్రైవసీ ఇవ్వాలి లేకపోతే నన్ను గిల్లుతూనే ఉంటారు . చెల్లీ రెడీ 3 2 1 .......

Happy birthday కృష్ణా - Happy birthday మహి సాంగ్ విషెస్ మరియు పూలవర్షం - తారాజువ్వాల అద్భుతమైన వెలుగులకింద కేక్స్ కట్ చేసి అమ్మ - అంటీకు - దివ్యక్కకు - సిస్టర్స్ కు తినిపించారు వాళ్ళ ద్వారా తిని సంతోషాలను పంచుకున్నారు , క్రీమ్ పూసుకున్నారు .
దేవకన్య : అమ్మా ..... గిఫ్ట్ మహేష్ గిఫ్ట్ అన్నారుకదా .......
అమ్మ : గుండెలపై పడుకోబెట్టుకుని ఇక్కడకువస్తూ అమ్మా ...... నా గిఫ్ట్ గా మహికి అపురూపమైన కానుక ఇవ్వండి అన్నాడు . Happy birthday సిస్టర్ అంటూ దేవకన్య పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టారు - తల్లీ ...... ఇది నా ముద్దు కాదు మన దేవుడి ముద్దు ....... , తల్లీ ...... మీ ప్రేమ నాకిష్టమే - దేవుడి ప్రేమను పొందడం నీ అదృష్టం అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు .
దేవకన్య : కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు అమ్మా అంటూ గుండెలపైకి చేరింది .
చుట్టూ ....... అందరూ ఆనందంతో పూలరేకులను అందుకుని ఇద్దరిపై జల్లారు .
మహీ డార్లింగ్ మహీ డార్లింగ్ అంటూ పోటీపడుతూ బుగ్గలపై ముద్దులుపెట్టి , ఇవి మా ముద్దులు కాదు అన్నయ్య - మహేష్ సర్ ముద్దులు అంటూ నవ్వించారు , దేవకన్య బుగ్గలపై క్రీమ్ ను టేస్ట్ చేశారు . మహేష్ సర్ ..... మీ దేవకన్య టేస్టీ ......
అందరితోపాటు ఆనందించాను . మహి - చెల్లెమ్మలతోపాటు అందరి సంతోషాలను అమ్మ ద్వారా విని ఆనందించాను .

గంట గంటన్నారపాటు సెలెబ్రేషన్స్ ఎంజాయ్ చేసి సంతోషంతో అలసిపోయి పైననే ఏర్పాటుచేసిన బెడ్స్ పై వాలిపోయారు .
అమ్మా ...... మీ గుండెలపై నిద్రపోవాలని ఉంది అంటూ దివ్యక్క ...... అమ్మను చుట్టేసి పడుకుంది .
అమ్మ : తల్లీ ...... అంతకంటే అదృష్టమా , మహేష్ ..... మనం రేపు మాట్లాడుదాము , తల్లిని జోకొడుతూ నిద్రపుచ్చాలి .
లవ్ యు సో మచ్ అమ్మా ...... , అన్నగా ఎంత ప్రాణంలా చూసుకున్నా అమ్మ ప్రేమ అమ్మ ప్రేమనే , ఆ అదృష్టం కోసం ఆశతో ఎదురుచూస్తున్నాను .
అమ్మ : అంతా మహి తల్లివల్లనే అంటూ దేవకన్య చేతిని అందుకుని కొరికేశారు .
దేవకన్య : కెవ్వున కేకవేసి , రుద్దుకుంటూనే మహేష్ ..... పదేపదే గుర్తుచేసి ఇలా కొట్టిస్తున్నావు కదూ , అక్కడికి వచ్చాక నీ సంగతి చెబుతాను .
మళ్లీ అమ్మ గిల్లేసారు .
దేవకన్య : లేదు లేదులే అమ్మా ...... , మీ మహేష్ ను ఏమీ చెయ్యనులే ......
నవ్వులు ఆగడం లేదు .
గుడ్ నైట్ అమ్మా - దివ్యక్కా ...... , వన్స్ అగైన్ Happy birthday చెల్లెమ్మా - మహీ ..... , తెల్లవారాక ఇంకా చాలా సర్ప్రైజస్ రాబోతున్నాయి హాయిగా రెస్ట్ తీసుకోండి బై బై - అమ్మను డిస్టర్బ్ చెయ్యకండి .
దేవకన్య : అమ్మ అమ్మ అమ్మ ...... బై బై బై అని కట్ చేసి , లవ్ యు లవ్ యు లవ్ యు ....... లవ్ యు సో మచ్ అంటూ బోలెడన్ని ముద్దులు మెసేజ్ చేసింది .
లవ్ యు టూ మహీ ....... సంతోషంగా వేచిచూస్తాను ఉమ్మా ....... అంటూ మెసేజ్ చేసి దేవకన్య - అమ్మను తలుచుకుంటూనే నిద్రపోయాను .

అమ్మ - అంటీ - పెద్దమ్మ ...... 5 గంటలకే లేచి దివ్యక్క - చెల్లెమ్మ - దేవకన్యల నుదుటిపై ముద్దులుపెట్టి కిందకువచ్చి , స్నానం - పూజ పూర్తిచేసి టిఫిన్ - స్వీట్స్ రెడీ చేస్తున్నారు .
సూర్యోదయం దగ్గర నుండి లేచినవాళ్ళు లేచినట్లుగా కిందకువచ్చి తలంటు స్నానాలుచేసి , బెడ్ పై ఉన్న అమ్మ - అంటీ వాళ్ళు షాపింగ్ చేసిన లంగావోణీ - నగలతో దివినుండి దిగివచ్చిన దేవకన్యల్లా రెడీ అయ్యారు .
డార్లింగ్ - డార్లింగ్ - చెల్లీ ...... అంటూ ఒకరినొకరు సంతోషంతో చూసుకుని , దేవకన్య - చెల్లెమ్మను శుభాకాంక్షలు తెలిపి , అమ్మలూ అమ్మలూ ....... అంటూ అందరూ వంట గదిలోకివచ్చారు , అమ్మలూ - పెద్దమ్మా ....... పట్టుచీరలలో దేవతల్లా ఉన్నారు అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అమ్మావాళ్ళు : Wow బ్యూటిఫుల్ ...... మీరు దేవకన్యల్లా ఉన్నారు . కృష్ణ తల్లీ - మహి తల్లీ ....... పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ నుదుటిపై ముద్దులుపెట్టారు .
దేవకన్యలు : అమ్మలూ ...... అందరికీ లంగావోణీల సెలక్షన్ సూపర్ .......
అంటీ ( కృష్ణ అమ్మ ) : మహి - చెల్లెమ్మ పుట్టినరోజు నాడు దివ్యక్క - సిస్టర్స్ కూడా దేవకన్యల్లా ఉండాలి అంటీ అంటూ మీ అమ్మకు తోడుగా నన్ను రెండురోజుల ముందుగానే ఇక్కడకు చేర్చాడు మహేష్ ...... , రోజంతా షాపింగ్ చేసి ప్రేమతో సెలెక్ట్ చేసాము , ఈ థాంక్స్ లన్నీ మహేష్ కే చెందాలి .

అమ్మ : దివ్యక్క బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోతున్నారు .
దివ్యక్క : అమ్మా ...... అన్నయ్యను పొగిడితే మీరు పులకించిపోతున్నారు , లవ్ యు అంటూ ముద్దుపెట్టారు .
అమ్మ : మరి మీ అందరికంటే నాకు నా బిడ్డ అంటేనే ఎక్కువ ఇష్టం ....... , ఏదీ ఏదీ ...... మహి తల్లి ఎక్కడ ఎక్కడ ? .
కొడతారని తెలిసిపోయి ఇక్కడ దాక్కుంది అమ్మా అంటూ పట్టించారు సిస్టర్స్ ......
దేవకన్య : అమ్మా అమ్మా ...... ఏదో ఆ సమయంలో మా మంచి అమ్మపై అసూయతో అన్నాను లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ వెళ్లి దివ్యక్క వెనుక దాక్కుంది .
అందరూ నవ్వుకున్నారు .
అమ్మ : నేనే ప్రపంచం అయిన నా బంగారుతల్లి నాపైననే అసూయపడేలా చేసాడంటే , నేనంటే ...... మహేష్ కు అంత ఇష్టం అన్నమాట .
దివ్యక్క - చెల్లెమ్మ - సిస్టర్స్ : అంతకుమించి అమ్మా ....... , మీరు గుర్తుకువచ్చిన ప్రతీసారీ ఎంత సంతోషంతో మాట్లాడతారో ఎంత పులకించిపోతారో .......
దేవకన్య : చాలు చాలు అమ్మకు అర్థమైపోయిందిలే ......
విద్యు సిస్టర్ : ఇదిగో ఇలా ఇలానే అమ్మా ....... అంటూ అమ్మతోపాటు నవ్వుకున్నారు .
అమ్మ : నవ్వుతూనే ....... , తల్లులూ ...... వంటకు రెడీ చేసేసుకున్నాము - అందరమూ రెడీ అయ్యాము కాబట్టి గుడికి వెళ్ళొద్దాము .

ఇంటికి దగ్గరలోని అమ్మ వారం వారం వెళ్లే అమ్మవారి గుడికివెళ్లి , దేవకన్య - చెల్లెమ్మలతోపాటు అందరి పేర్లపై పూజ జరిపించి , తీర్థప్రసాదాలు స్వీకరించి , అమ్మవారి సన్నిధిలో కాసేపు గడిపి ఇంటికి చేరుకున్నారు .
అమ్మ - అంటీకి సహాయంగా దేవకన్యలంతా కలవడంతో టిఫిన్స్ - స్వీట్స్ రెడీ అయ్యాయి .
దివ్యక్క - చెల్లెమ్మ : అమ్మా అమ్మా ...... మీరు స్వయంగా చేసిన స్వీట్స్ అంటే అన్నయ్య ఎంత ఆనందిస్తారో .......
అమ్మ : సగం నా మహేష్ కే మరి .......
అంటే సగంలో మనం అడ్జస్ట్ అవ్వాలన్నమాట - చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి అమ్మా ....... ప్చ్ ప్చ్ ......
అమ్మ - అంటీ నవ్వుకున్నారు . మా బంగారుతల్లులూ ...... ఎల్లప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి అంటూ స్వీట్స్ తో ఆరంభించి టిఫిన్ చేశారు .

విద్యు సిస్టర్ : 9 గంటలు అవుతోంది , అమ్మా ...... మీరు - మహేష్ సర్ కలిసి నెక్స్ట్ ఏమి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు ? .
అమ్మ : సర్ప్రైజ్ - మీరు రెడీ కదా వెళదాము అంటూ బయటకువచ్చారు . తల్లులూ ....... మీరు బస్సులో ఫాలో అవ్వండి మేము మన కారులో వస్తాను .
కారు కారు మన కారు అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు .
అమ్మ : నా మహేష్ ఇచ్చిన womens డే గిఫ్ట్ , నాకు - మీ వసుంధర అంటీకు ..... అదిగో అక్కడ ఉంది .
Wow wow బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ....... మేమింకా ఎవరిదో అనుకున్నాము , అమ్మా అమ్మా నేను డ్రైవ్ చేస్తాను నేను డ్రైవ్ చేస్తాను అంటూ దివ్యక్క - చెల్లెమ్మ - దేవకన్య పోటీపడుతున్నారు .
మేము వెనుక కూర్చుంటాము అంటూ సిస్టర్స్ ......
అమ్మ : అమ్మ మారుమాట్లాడకుండా కృష్ణగాడు - బావగారి సహాయంతో కవర్ తో కప్పేసి , అంటీ - పెద్దమ్మతో సైలెంట్ గా బస్సు ఎక్కి కూర్చున్నారు .
దివ్యక్క - చెల్లెమ్మ - దేవకన్య - సిస్టర్స్ ...... అందరూ కోపాలతో ఒకరినొకరు కొట్టుకుని , బుద్ధిగా బస్సు ఎక్కి కూర్చున్నారు . దివ్యక్క - దేవకన్య ..... అమ్మకు ఇరువైపులా , చెల్లెమ్మ ...... అంటీ గుండెలపై .......
అమ్మావాళ్ళ నవ్వు ఆగడం లేదు .
విద్యు సిస్టర్ : అమ్మా ..... ఎక్కడికి పోనివ్వమంటారు ? .
అమ్మ : కాలేజ్ కు తల్లీ .......
విద్యు సిస్టర్ ఇద్దరు సిస్టర్స్ తోపాటువెళ్లి చంద్రకు డైరెక్షన్స్ చూయిస్తున్నారు .

కృష్ణగాడు - బావగారు ...... వెనుక కూర్చుని ఏంజెల్ - ఏంజెల్ అంటూ చెల్లెమ్మ - దివ్యక్కకు మెసేజ్ చేశారు .
ఇద్దరూ చూసి నవ్వుకుని , వైజాగ్ బయలుదేరేంతవరకూ మీరు అక్కడే - మేము ఇక్కడే ...... లవ్ యు లవ్ యు అంటూ స్మైలీలు పంపించారు .

15 నిమిషాలలో కాలేజ్ చేరుకున్నారు .
అమ్మ ...... దివ్యక్క - దేవకన్య చేతులను అందుకుని కిందకుదిగారు .
దేవకన్య : అమ్మా ...... కాలేజ్ టైం అవుతోంది పిల్లలు ఒక్కరూ కనిపించడం లేదు .
దేవకన్య : అవునమ్మా .......
అమ్మ : ఈ సంతోషంలో ఈరోజు ఆదివారం అనికూడా మరిచిపోయారన్నమాట .....
కదా కదా అంటూ అమ్మ భుజాలపై సిగ్గుపడ్డారు .
అమ్మ : కానీ తల్లులూ ...... అంటూ మెయిన్ గేట్ తెరిచారు .

మహి అక్కయ్యా మహి అక్కయ్యా ...... అంటూ వందలలో పిల్లలు చేతులలో పూలు - గిఫ్ట్స్ తో పరుగునవచ్చి అందరినీ చుట్టేసారు . మహీ అక్కయ్యా ...... మీసిస్టర్ కృష్ణ అక్కయ్య ఎక్కడ ? .
ఇక్కడ అంటూ ముందుకు వచ్చింది చెల్లి .......
పిల్లలు : Happy birthday మహి అక్కయ్యా - Happy birthday కృష్ణ అక్కయ్యా ....... అంటూ పూలు అందించి విష్ చేశారు . Hi దివ్యక్కా - hi విద్యు అక్కయ్యా ...... అంటూ సిస్టర్స్ అందరికీ ఫ్లవర్స్ అందించారు .
దేవకన్యలు : థాంక్యూ థాంక్యూ పిల్లలూ ......
దేవకన్య : అమితమైన ఆనందంతో , పిల్లలూ ...... దివ్యక్క - కృష్ణక్క గురించి ఎలా తెలుసు ? .
పిల్లలు : మేడం అమ్మ - హెడ్ మిస్ట్రెస్ చెప్పారు .
దేవకన్య : లవ్ యు అంటూ చేతులతో ముద్దులుపెట్టారు . పిల్లలూ ..... పూలుమాత్రమే ఇచ్చారు గిఫ్ట్స్ మాకోసం కాదా ..... ? .
పిల్లలు : అయ్యో మహీ అక్కయ్యా ....... , గిఫ్ట్స్ ఎప్పుడైనా కేక్ కటింగ్ తరువాత ఇచ్చేది , ఈ మాత్రం కూడా తెలియదు మీకు .......
దేవకన్య : కేక్ కూడా ఉందా ...... ? .
పిల్లలు : పే ...... ద్ద కేక్ అక్కయ్యా .......
దేవకన్య : పదండి మరి కోసేద్దాము .
పిల్లలు : మా టూర్ లో మాకోసం అన్నీ ఏర్పాట్లూ చేసిన - జాగ్రత్తగా చూసుకున్న మా మహేష్ అన్నయ్యను కలిసిన తరువాత , ఇంతకూ అన్నయ్య ఎక్కడ అక్కయ్యా .......

అమ్మ : ఇప్పుడు చెప్పు బంగారూ అంటూ అమ్మ ప్రేమతో మొట్టికాయవేసింది .
సిస్టర్స్ అందరూ నవ్వుకుంటున్నారు .
దేవకన్య : స్స్స్ ...... దివ్యక్కా - చెల్లీ ....... అంటూ దీనంగా చూస్తోంది .
దివ్యక్క - చెల్లెమ్మ ...... మోకాళ్లపై కూర్చుని , పిల్లలూ ...... మీ అన్నయ్య ఒక ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నారు - త్వరలో తప్పకుండా వచ్చి కలుస్తారు .
విద్యు సిస్టర్ : పిల్లలూ ...... దివ్యక్క - కృష్ణ అక్కయ్య - మహి అక్కయ్య అంటే మీ మహేష్ అన్నయ్యకు రెండవ ప్రాణం , వాళ్లకు థాంక్స్ చెబితే మీ మహేష్ అన్నయ్యకు చెప్పినట్లే ........
పిల్లలు : మరి అన్నయ్య మొదటి ప్రాణం ఎవరు అక్కయ్యలూ ........
విద్యు సిస్టర్ : ఇంకెవరు అదిగో ముచ్చటగా సిగ్గుపడుతున్నారే మీ మేడం అమ్మ వారే ...... , అమ్మ అని ప్రాణం కంటే ఎక్కువగా పలకరించి మురిసిపోతారు .
పిల్లలు : అయితే అమ్మకే థాంక్స్ చెబుతాము అంటూ అమ్మచుట్టూ చేరి మేడం అమ్మా మేడం అమ్మా ...... మీరంటే అన్నయ్యకు అంత ఇష్టమా , మేము థాంక్స్ చెప్పామని అన్నయ్యకు చెప్పండి థాంక్స్ థాంక్స్ థాంక్స్ ........
దేవకన్య - దివ్యక్క - చెల్లెమ్మలు ...... చేతులుకలిపి అమ్మవైపు తియ్యనైనకోపంతో చూస్తుండటం చూసి అందరూ నవ్వుకుంటున్నారు .
అమ్మ : స్టూడెంట్స్ ....... మీ అన్నయ్య దగ్గర ఉండే అదృష్టం మీతోపాటు నాకూ లభించలేదు ఒకరివలన ......
దేవకన్య : అమ్మా ...... అంటూ దివ్యక్క - చెల్లెమ్మలతోపాటు వెళ్లి అమ్మను హత్తుకుంది .
అమ్మ : మీ అన్నయ్య ప్రేమను దగ్గరుండి పొదుతున్నది వీరే , వీరికి థాంక్స్ చెబితే డైరెక్ట్ గా వెళ్లి మీ మహేష్ అన్నయ్యకు తెలియజేస్తారు .
పిల్లలు : థాంక్యూ థాంక్యూ అక్కయ్యలూ .......
ముగ్గురు : Ok ....... , ఇక కేక్ దగ్గరికి తీసుకెళ్తే బాగుంటుంది .
పిల్లలు : అమ్మపైననే ఈర్ష్య అసూయ చెందుతోంది మహి అక్కయ్య అంటూ గుసగుసలాడుకోవడం విని అందరి నవ్వులు ఆగడం లేదు .
వింటున్న నేనూ ఎంజాయ్ చేస్తున్నాను .
విద్యు సిస్టర్ : మహేష్ సర్ ...... అమ్మ ఆనందించడం దాటి పారవశ్యంలోకి వెళ్లిపోయారు - చూడటానికి రెండు కళ్లూ చాలడం లేదు , అమ్మను చూసి మీ దేవకన్య - దివ్యక్క ఆనందాలకు అవధులే లేవు .
కనులముందు చూస్తున్నట్లుగా ఉంది థాంక్యూ సిస్టర్ ........

పిల్లలు : అమ్మా - అక్కయ్యలూ ....... రండి అంటూ కాలేజ్ ఆడిటోరియం లోకి తీసుకెళ్లారు .
మధ్యలో బిగ్గెస్ట్ కేక్ ఉండటం చూసి wow ఎంత పెద్దది ........
హెడ్ మిస్ట్రెస్ : మహీ - కృష్ణా ...... పిల్లలే చిన్న చిన్న అమౌంట్ కలుపుకుని ఇంత పెద్ద కేక్ రెడీ చేశారు . నువ్వంటే అంత ఇష్టం పిల్లలకు .......
దేవకన్య : లవ్ యు లవ్ యు పిల్లలూ ...... అంటూ మురిసిపోయింది .
పిల్లలు : మహి అక్కయ్యా ...... మురిసిపోయింది చాలు కేక్ కట్ చేస్తే తినిపించి మేమూ తింటాము .
అందరితోపాటు దేవకన్య నవ్వుకుని , Ok ok ok చెల్లీ ...... అంటూ బుజ్జాయిలను ఎత్తుకుని వాళ్ళతో కేక్ కట్ చేయించారు .
పిల్లలంతా బర్త్డే సాంగ్ పాడుతూ గెంతులేస్తున్నారు .
పిల్లలకు తినిపించి , వారిచేత తిని ఆనందిస్తున్నారు . అందరూ తినిపించుకున్నారు , పిల్లలకు పెద్దమొత్తంలో అందించారు .
దేవకన్య : విద్యు సిస్టర్ నుండి మొబైల్ అందుకుని లవ్ యు లు చెబుతూనే ఉంది .
మహీ ....... అమ్మ హ్యాపీ కదా .....
దేవకన్య : డబల్ హ్యాపీ బ్రదర్ , అమ్మ అమ్మ అమ్మ అంటూ తియ్యనైనకోపం ......
లవ్ యు ఏంజెల్ అంటూ నవ్వుకున్నాను .

పిల్లలు : అక్కయ్యలూ ...... ఇప్పుడు అందుకోండి గిఫ్ట్స్ , Happy birthday మహి అక్కయ్యా - Happy birthday కృష్ణ అక్కయ్యా ....... అంటూ అందించారు .
లవ్ యు సో మచ్ లవ్ యు సో మచ్ పిల్లలూ ........
అమ్మ : మహి తల్లీ - కృష్ణ తల్లీ అంటూ చెవులలో గుసగుసలాడారు .
అమితమైన ఆనందంతో లవ్ యు లవ్ యు అమ్మా అమ్మా , లవ్ యు సో మచ్ బ్రదర్ - అన్నయ్యా అంటూ చెరొకబుగ్గపై ముద్దులుపెట్టారు - పిల్లలూ ...... ఈ అక్కయ్యలకు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చినందుకు మీకోసం కూడా బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇవ్వాలికదా అందరూ కళ్ళు మూసుకోండి అంటూ జాగ్రత్తగా ప్రక్కనే ఉన్న కాలేజ్ చిన్న గ్రౌండ్ లోకి తీసుకెళ్లారు . Wow wow అంటూ దేవకన్యలంతా ఆనందించి రెడీ 3 2 1 ...... open your eyes పిల్లలూ ....... అన్నారు .
పిల్లలు : అక్కయ్యలూ ...... టెడ్డి బేర్స్ అంటూ గెంతులేస్తున్నారు .
దేవకన్యలు : పిల్లలూ ...... మీకిష్టమైన టెడ్డి బేర్ ను తీసుకోండి , రెండు కావాలంటే రెండు తీసుకోండి మూడు కావాలంటే మూడు తీసుకోండి , మీ ఇంట్లో అక్కాచెల్లెళ్లకు కూడా తీసుకోండి గో గో గో .......
పిల్లలు : ఆనందాలకు అవధులులేనట్లు యాహూ యాహూ అంటూ సంతోషంతో చిందులువేసి , అక్కయ్యలూ వొంగండి అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి , పరుగునవెళ్లి వాళ్ళ వాళ్ళ సైజ్ లకు తగ్గట్లు ఒక్కొక్కటి తీసుకున్నారు .
ఇంకా రెండు ట్రక్స్ అన్ని ఉండటం చూసి , పిల్లలూ ...... అవికూడా మీకోసమే అంటూ అమ్మ చెప్పారు .
పిల్లలు : లవ్ యు అక్కయ్యలూ ....... అంటూ సైజ్ కొకటి సెలెక్ట్ చేసుకొని ఆనందిస్తున్నారు . పరుగునవచ్చి అమ్మతో మొదలుకుని సిస్టర్స్ వరకూ హత్తుకున్నారు .

దేవకన్య : ఎక్కడచూసినా ఆనందాలు పరిమళిస్తుండటం చూసి , లవ్ యు లవ్ యు లవ్ యు సో సో soooo మచ్ బ్రదర్ ....... , ఈ పుట్టినరోజును ఇంత స్పెషల్ గా జరుపుకుంటామని కలలోకూడా ఊహించలేదు , నిన్ను వెంటనే కలవాలి వచ్చేస్తాము .
అప్పుడేనా ...... ఇంకా చాలా లవ్లీ సర్ప్రైజస్ ఉన్నాయి డియరెస్ట్ సిస్టర్ ...... అమ్మ .....
దేవకన్య : ఆ ఆ అమ్మ ఫుల్ హ్యాపీ ....... , ఇదిగో అమ్మకే ఇస్తాను మాట్లాడు - సాయంత్రం వరకూ దేవుడి దర్శనం లేనట్లేనా ...... ? .
Its worth దేవకన్యా ....... , నా అందమైన దేవకన్యను కలవాలని తను ఇచ్చే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ వినాలని నాకు లేదా చెప్పు ........
దేవకన్య : నీకెలా తెలుసు .......
అదీ అదీ ...... ఆ ఆ అమ్మతో మాట్లాడు అన్నావుకదా ......
దేవకన్య : అమ్మ అమ్మ అమ్మ .......
కాలేజ్ ప్లేగ్రౌండ్ లో బుజ్జాయిలతోపాటు కాసేపు సరదాగా ఆడుకున్నారు - పిల్లలకోసం స్పెషల్ గా కాలేజ్ లోనే చేయించిన బోలెడన్ని వెజ్ వంటకాలతో లంచ్ చేశారు - నాకు కాల్ చేసి మాట్లాడి మళ్లీ ఆడుకోబోతే .......
అమ్మ : తల్లులూ ...... మీ హ్యాపీనెస్ ను డిస్టర్బ్ చేస్తున్నాను లవ్ యు , పిల్లలకు రెపటినుండీ exams సో .......
Ok ok అమ్మా ...... , పిల్లలూ ...... ఇష్టంతో చదువుకుని exams బాగా రాయాలి . అంటీ ...... పిల్లలు టెడ్డి బీర్స్ ను ఎత్తుకుని ఇంటికివెళ్లడం కష్టం .
హెడ్ మిస్ట్రెస్ : అయితే కాలేజ్ బస్సెస్ లో పంపిద్దాము అంటూ డ్రైవర్స్ కు కాల్ చెయ్యడంతో 15 నిమిషాలలో వచ్చి బస్సెస్ ను గ్రౌండ్ లోకి తీసుకొచ్చారు .
పిల్లలను ...... వారివారి టెడ్డి బేర్స్ లతో బస్సెస్ ఎక్కించారు .
పిల్లలు : వన్స్ అగైన్ Happy birthday కృష్ణ అక్కయ్యా - మహి అక్కయ్యలూ - బై అక్కయ్యలూ అంటూ టాటా చెబుతూ వెళ్లిపోయారు .
లవ్ యు లవ్ యు .......

విద్యు సిస్టర్ : అమ్మా ..... నెక్స్ట్ సర్ప్రైజ్ ఎక్కడ ? .
అమ్మ : కాలేజ్ సర్ప్రైజ్ తో నా ప్రయాణం ముగిసింది తల్లులూ .......
నెక్స్ట్ సర్ప్రైజ్ నేను చెబుతాను డార్లింగ్స్ ....... , విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం - ఈరోజే పుట్టిన మన డార్లింగ్స్ పేరున పూజ జరిపించడం ....... అంటూ దేవకన్య - చెల్లి బుగ్గలపై ముద్దులుపెట్టి దివ్యక్క చెప్పారు . అమ్మలూ - అంటీ ...... మీరుకూడా మాతోపాటు రావాలి .
దేవకన్య : విజయవాడ వెళ్లాలంటే వైజాగ్ మీదుగానే వెళ్ళాలి అంటూ సంతోషం పట్టలేక అమ్మ గుండెలపైకి చేరింది .
అమ్మ : తల్లులూ ...... మన్నించండి , రేపటి నుండీ exams చాలా పనులున్నాయి - exams రేపటి నుండే కానీ మరొక బలమైన కారణం కూడా ఉంది - మహికి ఊహతెలిసినప్పటినుండీ ఒక మొక్కు తీర్చుకోకుండా ఉండిపోయింది - ఆ మొక్కు విజయవాడ కనకదుర్గమ్మ సందర్శనతోనే మొదలౌతుంది అక్కడితో ఆగదు శక్తిపీఠాలన్నీ దర్శించుకోవాలి - అమ్మలగన్న అమ్మ ఆ అదృష్టాన్ని ఎప్పుడు కరుణించేనో ...... కాబట్టి మీరు సంతోషంగా దర్శించుకునిరండి , నా బంగారుతల్లులు దర్శించుకుంటే ఈ అమ్మ దర్శించుకున్నట్లే ....... అంటూ దేవకన్యతోపాటు దివ్యక్కను కౌగిలిలోకి తీసుకుని నుదుటిపై ముద్దుపెట్టారు .
సిస్టర్స్ : అమ్మా ...... మహేష్ సర్ ....... కూడా వస్తారు అని చెప్పబోయి దివ్యక్క - దేవకన్య నో అంటూ సైగచెయ్యడంతో ఆగిపోయారు .
దివ్యక్క : మా అమ్మ మొక్కు అతిత్వరలో తీరాలని కూడా దుర్గమ్మను ప్రార్ధిస్తాము అమ్మా .......
అమ్మ : ఆనందబాస్పాలతో నా తల్లులు బంగారం అంటూ ప్రాణంలా హత్తుకున్నారు - తల్లులూ ...... నేను హ్యాపీ అని మహేష్ కు చెప్పండి - కోప్పడ్డానని కూడా చెప్పండి అంటూ నవ్వుకున్నారు .
దేవకన్య : మీ సంతోషమే కాదమ్మా ...... మీకోపం - దెబ్బలు కూడా ప్రాణం అమ్మా మీ మహేష్ కు అంటూ దివ్యక్కవైపు కన్నుకొట్టి , అమ్మ బుగ్గలపై ఒకేసారి గట్టిగా ముద్దులుపెట్టారు - అమ్మా అమ్మా ..... ఈముద్దులు మావి కాదు మీ మహేష్ వి ....
అమ్మ : అవునా అందుకే అంత మధురంగా ఉన్నాయి అంటూ అమితమైన ఆనందంతో ముద్దులుకురిపించారు . సరే సరే నావలన ఆలస్యం కాకూడదు రండి అంటూ పిల్లల గిఫ్ట్స్ తో బస్సు ఎక్కారు .
ఇంటికి చేరుకుని అమ్మకు జాగ్రత్తలు చెప్పి , మహేష్ ముద్దులు అంటూ అందరూ అమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి విండోస్ నుండి చూస్తూనే బయలుదేరారు .

దేవకన్య : యాహూ యాహూ ...... దేవుడి చెంతకు చేరబోతున్నాము .
దివ్యక్క ఊహూ ఊహూ అంటూ తల ఊపుతున్నారు .
దేవకన్య : దివ్యా దివ్యా ..... వైజాగ్ మీదుగానే కదా ......
దివ్యక్క : అమ్మను కలిసేంతవరకూ కానీ - నీ ప్రేమను పొందేంతవరకూ కానీ దుర్గమ్మ దర్శనం చేసుకోను అని మేము ..... అన్నయ్యను కలిసిన సమయంలో అమ్మను దర్శించుకుని వచ్చిన తరువాత నిర్ణయించుకున్నారు .
దేవకన్య : దివ్యా ...... అంటూ గుండెలపైకి చేరింది - అంతా నావల్లనే ......
దివ్యక్క : అవును నీవల్లనే ...... , నీవల్లనే అమ్మను కలవకపోయినా రోజూ మాట్లాడుతూ అమ్మ ప్రేమను పొందుతున్నారు , నీవల్లనే ...... మన దేవుడు అంత సంతోషంతో ఉన్నారు , ఇంకెన్నిరోజులు ...... అమ్మదగ్గరికి చేరుతారు కదా ......
దేవకన్య : లవ్ accept చెయ్యబోతున్నాను కదా .......
సిస్టర్స్ : ఇంకా చెయ్యలేదు కదా ......
దేవకన్య : అవును ఇంకా చెయ్యలేదు .
దివ్యక్క : మహీ డార్లింగ్ ...... ఏదీజరిగినా అంతా మంచికే , దుర్గమ్మను దర్శించుకోబోతున్నాము కదా అన్నీ కోరికలూ తీరాలని భక్తితో ప్రార్థిద్దాము అంటూ మహి నుదుటిపై ముద్దుపెట్టింది .
దేవకన్య : లవ్ యు దివ్యా ...... , అయినా మనల్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు - ఎలా ఉన్నాడో ఏమిచేస్తున్నాడో ......
దివ్యక్క : మా అందమైన దేవకన్య - చెల్లి కోసం బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఆర్రేంజ్ చేయడంలో బిజీగా ఉన్నారు . నన్ను అడగకు అదేంటో నిజంగా నాకు కూడా తెలియదు - నేనుకూడా ఈగర్ గా వేచిచూస్తున్నాను అంటూ నవ్వుకున్నారు .

మధ్యాహ్నం 3 గంటలకు వైజాగ్ చేరుకున్నారు .
దేవకన్య : దివ్యక్కా ...... ఒకసారి ఇంటికి వెళ్లి వెళదాము .
దివ్యక్క : అన్నయ్య లైన్లోనే ఉన్నారుకదా మాట్లాడు మహీ ......
దేవకన్య : బ్రదర్ ...... వెంటనే నిన్ను చూడాలని ఉంది .
లవ్ టు లవ్ టు సిస్టర్ ...... , మొదట అమ్మ - తరువాత దుర్గమ్మ - ఆ తరువాత నీ నీ .......
దేవకన్య : దేవుడు ....... , నాకు కోపం వస్తోంది బ్రదర్ ....... , ప్చ్ ప్చ్ ...... నాకోపం కూడా ఇష్టమే .....
దివ్యక్కా ...... నా ముద్దుగా ......
దివ్యక్క : ఒక్కటేమిటి అన్నయ్యా అంటూ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... అంటూ దేవకన్య పెదాలపై అందమైన చిరునవ్వులు పరిమళించేంతవరకూ ముద్దులుపెట్టారు - అన్నయ్యా ...... వదినమ్మ నవ్వితోంది .
దేవకన్య : పో దివ్యా ...... అంటూ సిగ్గుతో గుండెలపైకి చేరింది .
అమ్మలగన్న అమ్మ దర్శనానికి హ్యాపీగా వెళ్ళాలి - దర్శనం చేసుకుని రాగానే నీ ప్రియాతిప్రియమైన దెబ్బలకోసం ఆశతో ఎదురుచూస్తుంటాను సిస్టర్ .......
మరింత సంతోషంతో నవ్వుతూ లవ్ యు చెప్పింది . మాట్లాడుతూనే ఎయిర్పోర్ట్ చేరుకున్నారు , అదేవిషయం చెప్పింది .
హమ్మయ్యా ...... ఫ్లైట్ లో మొబైల్స్ ఆఫ్ చేయమంటారు కాబట్టి , ఈ గంటసేపు అమ్మతో మాట్లాడుకోవచ్చు .......
దేవకన్య : ప్రక్కన లేనుకానీ ఉండి ఉంటేనా .......
అందరూ నవ్వుకుంటున్నారు .
ప్చ్ ....... ఉదయం నుండీ చాలా దెబ్బలు మిస్ అయ్యాను .
దేవకన్య : నవ్వుకుని , మీ అమ్మతోనే మాట్లాడుకో ...... విజయవాడలో ల్యాండ్ అవ్వగానే కాల్ చేస్తాను - ఎత్తలేదనుకో ........
అంత ధైర్యం ఉందా సిస్టర్ నాకు .......
దేవకన్య : ఉదయం నుండీ కోపం తెప్పిస్తున్నారు ఆవెంటనే నవ్విస్తున్నారు ......
" రు " నా ఎవరెవరు ? .
ఇంకెవరు తల్లీకొడుకులు ........
ఆఅహ్హ్ ...... మహీ టచ్ చేసావు , లవ్ యు లవ్ యు సో మచ్ - నీకోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తాను అదే అదే దెబ్బలు తినడం కోసం .....
లవ్ యు ....... ఫ్లైట్ లోపలికి వెళుతున్నాము బై .......

లవ్ యుమై డియరెస్ట్ ఏంజెల్ సిస్టర్ ఉమ్మా ..... అంటూ మెసేజ్ పెట్టి , అమ్మకు కాల్ చేసాను .
అమ్మ : నాకోసమే మొబైల్ వైపు చూస్తున్నట్లు ఒక్కరింగు లోపలే ఎత్తి లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ మహేష్ .......
అమ్మా అమ్మా ....... ఉదయం ఎప్పుడో నా గురించి మాట్లాడుతూ ప్రేమతో ఒక పిలుపు పిలిచారు అలా .......
అమ్మ : " నాన్నా మహేష్ " .......
ఆఅహ్హ్ ...... లవ్ యు లవ్ యు సో మచ్ అమ్మా .......
అమ్మ : సంతోషంతో నవ్వుకుని , లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ నాన్నా ...... హ్యాపీనా ఉమ్మా ఉమ్మా , ఈరోజును ఎంత మెమొరబుల్ గా మార్చావో తెలుసా జీవితాంతం గుర్తుంచుకునేలా .......
అమ్మా ...... నా పుట్టినరోజును కూడా కేవలం కేవలం మా అమ్మతోనే జరుపుకోవాలన్న ఒకేఒక స్వార్థంతో ఇలా చేసాను , ఊహతెలిసినప్పటి నుండీ అమ్మ లేకుండానే పెరిగాను - అమ్మతోనే కలిసి పుట్టినరోజు జరుపుకోవాలనుకున్నాను - ఆరోజంతా మా అమ్మతోనే కేవలం మా అమ్మతోనే అమ్మ ప్రేమలోనే తడిసి ముద్దవ్వాలని ఆశపడుతున్నానమ్మా ....... నా కోరిక తీరుతుందా అమ్మ ....... అంటూ ప్రాణంలా తడబడుతూ మాట్లాడాను .
అమ్మ : ఆఅహ్హ్ ...... కన్నప్రేగును కదిలించావు నాన్నా ...... , ఒక అమ్మకు అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పు , నాకు ...... నా తల్లుల కంటే నా మహేష్ అంటేనే ప్రాణం , ఆరోజంతా నా బిడ్డతోనే గడుపుతాను డాట్ .......
ఇద్దరమూ నవ్వుకున్నాము . లవ్ యు లవ్ యు అమ్మా ...... నా పుట్టినరోజు రేపే ఉండి ఉంటే బాగుండేది .
అమ్మ : నాకైతే ఈరోజే ఉండి ఉంటే బాగుండేది అనిపిస్తోంది .
లవ్ యు అమ్మా .......
ఈరోజు - ఈరోజు వద్దు అంటూ ఇద్దరమూ ఒకేసారి అన్నాము . "అప్పుడే - అప్పుడే " " సగం రోజు - సగం రోజు " " గడిచిపోయింది - గడిచిపోయింది " అంటూ నవ్వుకున్నాము .
" నా ప్రియమైన నాన్నతో - మా ప్రాణమైన అమ్మతో " " రోజంతా - రోజంతా " ఒక్క క్షణం కూడా మిస్ అవ్వకుండా గడపాలి అంటూ ప్రేమతో మాట్లాడుకున్నాము .
అమ్మ : తథాస్తు నాన్నా .......
దేవతలను మించిన అమ్మ వరం ప్రసాదించారు ఇంతకంటే ఆనందం మరొకటి లేనేలేదు లవ్ యు అమ్మా ........
అమ్మ : దేవతలను మించిన ఈ అమ్మకు ...... దేవుడు , మా మహేష్ ...... , దేవుడితో ఒకరోజంతా గడపడం - అలసిపోయాక జోకొడుతూ నిద్రపుచ్చడం ఈ అమ్మ అదృష్టం .
అమ్మా ...... రాత్రికి కూడా నాతోనే ఉంటారా ? .
అమ్మ : నా బిడ్డను కలిసిన తరువాత ఇక ఎక్కడికీ వెళ్ళేది లేదు - జీవితాంతం నా బిడ్డతోనే - వెళ్లమన్నా వెళ్లను - నా బిడ్డను ప్రేమగా చూసుకుంటూ , ప్రేమతో వండి పెడుతూ , ఒడిలో పడుకోబెట్టుకుని నిద్రపుచ్చుతూ ......... నాన్నా ఏమీమాట్లాడటం లేదు ? .
అమ్మా ....... అంటూ అంతదూరం లో ఉన్న అమ్మ జలదరింపుకు లోనయ్యేలా తియ్యనైన ఉద్వేగంతో పిలిచాను .
అమ్మ : నాన్నా మహేష్ ...... ఆ ఒక్కపిలుపుతో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో అర్థమయ్యింది - ఈ అమ్మ ఫీలింగ్ కూడా అదే నాన్నా ......
లవ్ యు అమ్మా ...... ఈ సంతోషంలో ప్రపంచం మొత్తం వినిపించేలా కేకవేయ్యాలని ఉందమ్మా ....... , మా అమ్మను దేవతలా చూసుకుంటాను - నేను ఉండగా మా అమ్మను వంట గదిలో అడుగుపెట్టనిస్థానా .......
అమ్మ : ఇందుకేనా నా బిడ్డ వంట నేర్చుకున్నది .......
ఖచ్చితంగా ఖచ్చితంగా అందుకే అమ్మా ....... , మహి - దివ్యక్క వాళ్లకోసమైతే కానే కాదు ....... అంటూ నవ్వుకున్నాను .
అమ్మ : వంట విషయంలో అమ్మను సంతోషపెట్టిన మా ముద్దుల కన్నయ్యవు నువ్వే నాన్నా ........
ముద్దుల కన్నయ్య ...... మరొక ముద్దుపేరు ఆఅహ్హ్ లవ్ యు లవ్ యు అమ్మా .....
అమ్మ : నచ్చిందా కన్నయ్యా .......
మా అమ్మ ఎలాపిలిచినా అమృతమే ........ , అమృతంలాంటి వంటలను మా అమ్మకు మాత్రమే వండిపెడతాను .
అమ్మ : లవ్ యు కన్నయ్యా ....... , కన్నయ్యా ...... ఈ మాటలు కనుక మహి - దివ్య - కృష్ణ - విద్యు తల్లులు వింటే చాలా డేంజర్ ........
వెక్కిళ్ళు వచ్చేసాయి .......
అమ్మ : అంటే భయపెడుతున్నావు అన్నమాట ...... కొడతారు కదూ .......
కొట్టడం అంటే గుర్తుకువచ్చింది , అమ్మా ....... ఈ బిడ్డపై ప్రేమతోపాటు దెబ్బలు కొట్టాలి - కోపం కూడా ప్రదర్శించాలి .
అమ్మ : నో నో నో అది జరగనే జరగదు .......
పో అమ్మా ....... అమ్మ కోపం - దెబ్బలు లేకుండానే పెరిగాను ప్లీజ్ ప్లీజ్ అమ్మా ......
అమ్మ : టచ్ చేసావు కన్నయ్యా ...... లవ్ యు , దెబ్బలు - కోపం కూడా ప్రేమలో భాగమే కదా .......
యాహూ యాహూ ...... మా అమ్మ మాటలతో కలుగుతున్న ఆనందం .
అమ్మ : నువ్వుకాదు , నా కన్నయ్య హృదయంలోని అమ్మ హ్యాపీనా ..... ? .
మీరే వినండి అమ్మా అంటూ స్పీకర్ ఆన్ చేసి మొబైల్ ను హృదయంపై ఉంచుకున్నాను .
మిక్కిలి ఆనందంలో హృదయ స్పందన వేగం విన్నట్లు అమ్మ నవ్వులు వినిపిస్తున్నాయి . అమ్మే ..... అమ్మను పంపించినట్లు పులకించిపోతోంది అమ్మా హృదయం .......
అమ్మ : నువ్వు చెప్పక్కర్లేదు కన్నయ్యా తెలిసిపోతోంది - ఎందుకంటే నా హృదయవేగం కూడా exact గా కొట్టుకుంటోంది అంటూ ఆనందంతో చెప్పారు . కన్నయ్యా కన్నయ్యా ....... ఇంతకూ నా ముద్దుల కన్నయ్యా పుట్టినరోజు ఎప్పుడో చెప్పనేలేదు ........ నో నో నో చెప్పొద్దూ చెప్పొద్ధు ...... ఆరోజు దగ్గరపడేకొద్దీ ఈ అమ్మకు తెలిసిపోతోందిలే ......
ఆఅహ్హ్హ్ ...... మళ్లీ టచ్ చేసారమ్మా లవ్ యు లవ్ యు - అయితే మా అమ్మ పుట్టినరోజును కూడా అలానే తెలుసుకుంటాను .
అమ్మ : లవ్ యు కన్నయ్యా ......

అమ్మా అమ్మా ........
అమ్మ : కంగారుపడుతున్నావు అంటే మహి కాల్ చేస్తోందన్నమాట ......
ఫ్లైట్ విజయవాడలో ల్యాండ్ అవ్వగానే కాల్ చేస్తాను అమ్మ కాల్ కట్ చేసి ఎత్తాలి అని వార్నింగ్ ఇచ్చింది అమ్మా .......
అమ్మ : లేకపోతే దెబ్బలే అన్నమాట అంటూ నవ్వుకున్నారు .
ప్చ్ ....... మా అమ్మతో మాట్లాడుతుంటే సమయమే తెలియలేదు .
అమ్మ : లవ్ యు కన్నయ్యా ....... , సరే నాకాల్ కట్ చేసి తల్లితో మాట్లాడు ......
లవ్ యు అమ్మా జాగ్రత్త తరువాతకాల్ చేస్తాను .​
Next page: Update 56
Previous page: Update 54