Update 63
మహేష్ సర్ జ్యూస్ అంటూ గ్లాస్ అందించింది నర్స్ .......
I am fine నర్స్ , నర్స్ ...... ఫ్రెష్ క్లాత్ మరియు గోరువెచ్చని నీళ్లు తీసుకొస్తారా ? .
నర్స్ : బ్లడ్ తుడవడానికే కదా ...... నేను తుడుస్తాను , ఈ జ్యూస్ తాగితే తీసుకొస్తాను - మీరు తాగలేదని తెలిస్తే మేడం కోప్పడతారు .
గ్లాస్ అందుకుని గటగటా త్రాగేసాను .
నర్స్ : నాచేతిలోని గ్లాస్ అందుకుంది , గోరువెచ్చని నీరు తీసుకొచ్చిన తరువాత మరొక గ్లాస్ జ్యూస్ తాగాలి మహేష్ సర్ అనిచెప్పి అటాచ్ బాత్రూం నుండి పాత్రలో తీసుకొచ్చి తెల్లని గుడ్డతో అమ్మ బుగ్గపై రక్తాన్ని తుడవబోయింది .
నర్స్ నెమ్మది నెమ్మది .......
నర్స్ : డాక్టర్ గారికే జాగ్రత్తలు చెప్పారు - మీరే నెమ్మదిగా తుడవండి అంటూ నావైపుకు తీసుకొచ్చి అందించారు - నెమ్మదిగా ఎలాకావాలో అలా అంటూ స్మైల్ ఇచ్చారు .
నవ్వుకుని నేనా అన్నాను .
నర్స్ : అవును మీరే ...... , ఎలానో నాకూ చూయించండి - నెక్స్ట్ టైం వేరొకరికి అలానే చేస్తాను .
అమ్మా ...... మీ అనుమతి లేకుండా టచ్ చెయ్యబోతున్నాను మన్నించండి .
నర్స్ : మరి ప్రాణంలా బయట నుండి ఇక్కడివరకూ గుండెలపై వాల్చుకుని ఎత్తుకునివచ్చినప్పుడు ......
అదీ అమ్మకు ఏమౌతుందోనని కంగారులో ........
నర్స్ : కంగారులో మరియు ప్రాణం కంటే ఎక్కువ అన్నట్లు ఇలాఇలా గుండెలపై హత్తుకుని కళ్ళల్లో కన్నీళ్ళతో తీసుకొచ్చారు - చూసారా చూసారా ...... ఇష్టమే అన్నట్లు మీ అమ్మగారి పెదాలపై సంతోషం .......
అంటే అమ్మ స్పృహలోకి వచ్చినట్లేనా ......
నర్స్ : ఇంకా లేదు మహేష్ సర్ - స్పృహలో లేకపోయినా చుట్టూ జరిగే సంఘటనలకు మనసు ఇలా రియాక్ట్ అవుతుంది .
అమ్మా ...... మీకు సంతోషమైతే ok అంటూ పెదాలపై చిరునవ్వుతో అతిసున్నితంగా ముఖంపై - మెడపై - చేతులపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసాను .
నర్స్ : ఆశ్చర్యంతో చూసి , మరీ ఇంత సున్నితంగానా ...... , మహేష్ సర్ ..... ఎవరో ఏమో తెలియనివారిపై ఎందుకింత ఇష్టం .......
ఎందుకో నాకూ తెలియడం లేదు , నా హృదయానికీ - మనసుకే తెలియాలి , అమ్మకు అపాయం తప్పింది అధిచాలు ......
నర్స్ : ఇంత ప్రాణంలా చూసుకునే మీరు ఉండగా ఏమౌతుంది చెప్పండి .
అమ్మ తరుపున వారికి ఎలా తెలియజేయాలో అర్థం కావడం లేదు .
ఆ ఆ ........ బయట జిప్సీ లో అమ్మ బ్యాగ్ ఉంది అంటూ లేచి అమ్మ దగ్గరా ఉండాలి - బయటకువెళ్లి బ్యాగు తీసుకురావాలి అన్నట్లు సతమతమవుతున్న నిన్నుచూసి , మహేష్ సర్ ...... నేను నేను తీసుకొస్తాను ఈ జ్యూస్ కూడా తాగితే ..... గుడ్ i am సేఫ్ - మీరు మీ ప్రాణమైన అమ్మదగ్గరే ఉండండి అంటూ నవ్వుకుంటూ కదిలింది .
సిస్టర్ ...... నా బ్యాగుకూడా ఉంటుంది చూడండి అంటూ కూర్చున్నాను . అమ్మా ..... మొబైల్ ను ఎందుకు వదలడం లేదు అంటూ అటువైపు ఎడమచేతిలో ఉన్న కీప్యాడ్ మొబైల్ అందుకోవడానికి మరొకసారి ట్రై చేసినా నిరాశే ఎదురయ్యింది - sorry అమ్మా ...... ఎందుకో మీరు ఇష్టపడటం లేదు ఇక మిమ్మల్ని ఇబ్బందిపెట్టను అంటూ అమ్మ చేతిని అందుకుని ధైర్యం చెప్పాలనుకుని తాకడానికి సందిగ్ధానికి లోనయ్యాను - వణుకుతున్న చేతులను కాస్త వెనక్కు తీసుకున్నాను .
అంతలో అమ్మ చెయ్యే నా చేతిని అందుకుంది .
అమ్మా అమ్మా ...... స్పృహలోకివచ్చారా అమ్మా అమ్మా ....... లేదు అంటూ చిరునిరాశతో కూర్చున్నాను , నర్స్ చెప్పినది నిజమే స్పృహలో లేకపోయినా చుట్టూ జరుగుతున్న సంఘటనలు తెలుస్తూనే ఉంటాయి అంటూ అమ్మచేతిని అతిసున్నితంగా నా చేతులలోకి తీసుకున్నాను , అమ్మా ...... ఎందుకో తెలియదు మీకోసం నా ప్రాణాలైనా అర్పించడానికి - మీకోసం ఏమైనా చెయ్యడానికి రెడీగా ఉన్నాను - మీరే నా సర్వస్వం అనిపిస్తోంది - తప్పుగా మాట్లాడితే మన్నించండి - మీరు పూర్తిగా కోలుకున్న క్షణం ఎంత ఆనందం కలగబోతోందో మాటల్లో వర్ణించలేను - మీరు పూర్తిగా కోలుకునేంతవరకూ ప్రక్కనే ఉండి ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను - ఈ మాటలు మీతో చెబుతుంటే కలుగుతున్న ఆనందాన్ని కూడా వర్ణించలేను అంటూ ధైర్యం చెబుతున్నాను .
అమ్మ పెదాలపై చిరునవ్వు .......
అమ్మా ....... మీ చిరునవ్వుని చూసిన ప్రతీసారీ హృదయం పులకించిపోతోందటే నమ్మండి అంటూ మురిసిపోతున్నాను .
అంతలో మహేష్ సర్ మహేష్ సర్ అంటూ 15 నిమిషాలతరువాత వచ్చింది నర్స్ - మహేష్ సర్ ....... వారి బ్యాగుతోపాటు మీ బ్యాగుకూడా లేదు , వెంటనే వెళ్లి బయటి కెమెరా సీసీ ఫుటేజీలో చూస్తే మీరు ...... వీరిని ఎత్తుకుని లోపలికి వచ్చిన కొద్దిసేపటికే ఎవరో దొంగలు చాకచక్యంగా రెండు బ్యాగులనూ ఎత్తుకుపోయిన విజువల్స్ చూసి షాక్ అయ్యి వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్లకు కాల్ చేసి వచ్చేసరికి ఇంత ఆలస్యం అయ్యింది .
అంటే ఆ అవకాశం కూడా పోయినట్లే అన్నమాట .......
ఈసారైతే అమ్మ పెదాలపై గర్వపు నవ్వు .......
నర్స్ : మహేష్ సర్ ...... వాళ్ళ వాళ్లకు తెలియకూడదని ఆశపడుతున్నట్లున్నారు .
అమ్మా ...... ఇదే మీ మనసులోని కోరిక అయితే అలాగే కానివ్వండి , చెప్పానుకదా మీరు పూర్తిగా కోలుకునేంతవరకూ ప్రాణంలా చూసుకుంటాను , ఇక మీరేమీ ఆలోచించకుండా హాయిగా రెస్ట్ తీసుకోండి అంటూ చేతిని స్పృశిస్తున్నాను .
అమ్మ మనసుకు చేరినట్లు సంతోషంతో నా చేతులలో చిన్నగా కదిలించడం తెలిసి , సంతోషంతో కేకలువెయ్యబోయి వెంటనే నోటిని మూసేసుకుని కంట్రోల్ చేసుకున్నాను , అమ్మా sorry sorry నావల్లనే మీ బ్యాగు పోయింది - సెక్యూరిటీ ఆఫీసర్లను కలిసి ఎలాగైనా వెనక్కు తెప్పిస్తాను అని మాటిచ్చాను .
అదేసమయానికి రౌండ్స్ వెళ్లిన డాక్టర్ గారు లోపలికివచ్చి , స్ట్రేంజర్స్ ఇద్దరూ బాగా కలిసిపోయినట్లున్నారు , నేను తాకించబోతే వెనక్కు అడుగువేసిన మహేష్ ఇప్పుడేమో చేతిని వదలకుండా పట్టేసుకున్నాడు .
నర్స్ : ఆయనేమీ తాకలేదు మేడం ....... , స్పృహలో లేకపోయినా వీరే చేతిని అందుకున్నారు , ఇక మహేష్ సర్ ఏమో ...... వీరి మనసుతో తెగ మాట్లాడేస్తున్నారు , వీరేమో తెగ ఆనందపడిపోతున్నారు .......
స్పృహలో లేకపోయినా రెస్పాండ్ అవుతున్నారంటే , వీరిద్దరి మధ్యన వీరికే తెలియని స్ట్రాంగ్ బాండింగ్ ఏదైనా ఉండాలి , బ్లడ్ కూడా మ్యాచ్ అయ్యింది , ఈమె నొప్పికి మహేష్ విలవిలలాడిపోతున్నాడు , ఈమె బంధువులేవరో తెలిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి ........ , ఈమె అయితే మొబైల్ ను వదలనేలేదే .......
నర్స్ : అవును మేడం ...... , మహేష్ సర్ మళ్లీ ట్రై చేసినా ఉపయోగం లేదు , బ్యాగ్స్ ఉన్నాయని బయటకు పంపిస్తే అక్కడ ఏకంగా దొంగతనం జరిగింది అంటూ అమ్మకు విషయం తెలిసి హ్యాపీ చెందడం వరకూ వివరించింది .
డాక్టర్ గారు : బ్యాగు పోయిందని తెలిసి ఆనందించారా ...... ? ఇంట్రెస్టింగ్ అంటూ నవ్వుకుంటున్నారు , నవ్వుతూనే వెళ్లి బ్లడ్ పూర్తవ్వడంతో తీసేసారు .
అమ్మ నరం నుండి నీడిల్ తీసేటప్పుడు చుక్క రక్తం రావడం చూసి స్స్స్ ..... జాగ్రత్త డాక్టర్ గారూ అంటూ లేచాను .
డాక్టర్ : sorry sorry మహేష్ ....... అంటూ మొట్టికాయవేసుకుని కాటన్ ను ఉంచారు . Sorry చెప్పానుకదా ...... కూర్చో అంటూ కూర్చోబెట్టి , అమ్మను చెక్ చేశారు ....... ఫాస్ట్ గా రికవరీ అవుతున్నారు మహేష్ అంటూ గుడ్ న్యూస్ చెప్పారు , ఇదిగో ఈ ప్రశ్నకు కూడా సమాధానం దొరకాలి ...... , నో నో నో మహేష్ చేతిని వదలకు హార్ట్ బీట్ మారిపోతోంది - wow నువ్వు పెట్టుకోగానే నార్మల్ కు వచ్చేస్తోంది - వైద్యశాస్త్రంలో అద్భుతం అనే చెప్పాలి - ఫైనల్ గా ఒకటి నువ్వు ఎంతసేపు అలా పట్టుకుంటే అంత ఫాస్ట్ గా కోలుకుంటారు .......
అవునన్నట్లు అమ్మ పెదాలపై చిరునవ్వు - see నేను చెప్పానుకదా ఇక నీఇష్టం .........
అమ్మకు ఇష్టమైతే చేతిని వదలను గాక వదలను అంటూ అమితమైన ఆనందంతో పట్టుకున్నాను - డాక్టర్ గారు చెప్పినట్లు మాఇద్దరి మధ్యన తెలియని బాండింగ్ ఉందని నేనూ నమ్ముతున్నాను .
డాక్టర్ : మురిసిపోయింది చాలుకానీ జ్యూస్ తాగావా లేదా ? .
మీరు ఆర్డర్ వేసినట్లు రెండు గ్లాసులు తాగేంతవరకూ వదల్లేదు మేడం - నాకేమీ వద్దు i am ఆల్రైట్ అమ్మ కోలుకోవాలి అన్నారు .
గుడ్ నర్స్ ...... , జ్యూస్ త్రాగడం వలన అమ్మను సంతోషపెడుతున్నావు లేకపోతే ఈపాటికి ఆ బెడ్ పై స్పృహకోల్పోయేవాడివి - మళ్లీ నేనేవచ్చి గ్లూకోజ్ ఎక్కించాల్సివచ్చేది .
థాంక్యూ డాక్టర్ గారూ ...... , అలా జరిగిఉంటే తరువాత చాలా బాధపడేవాడిని , మీరు చెప్పినట్లే చేస్తాను .
డాక్టర్ : అయితే ఇప్పుడు ఈ పండు తిను అంటూ యాపిల్ అందించారు .
అలాగే డాక్టర్ గారూ అంటూ ఒకచేతితో అమ్మచేతిని సున్నితంగా పట్టుకుని మరొకచేతితో తింటున్నాను .
అమ్మకూడా హ్యాపీ అయినట్లు వేళ్ళతో నా చేతిని స్పృశిస్తున్నారు .
డాక్టర్ : నర్స్ నువ్వు చెబితే సగమే నమ్మాను - ఇప్పుడు కళ్లారా చూసాను , మహేష్ ....... నా డ్యూటీ టైం అయిపోయింది రేపు ఉదయమే కలుద్దాము .
డాక్టర్ గారూ అంటూ కంగారుపడ్డాను .
డాక్టర్ : She's రికవరింగ్ ఫాస్ట్ - కంగారుపడాల్సిన అవసరమే లేదు , నెక్స్ట్ షిఫ్ట్ డాక్టర్ మేడం కు కాల్ చేసి చెప్పాను - నాకంటే పెద్ద డాక్టర్ నా ఫ్రెండే , పిల్లలు ...... నాకోసం ఎదురుచూస్తుంటారు .
Sorry డాక్టర్ గారూ ......
డాక్టర్ : నో నో నో its ఆల్రైట్ కూర్చో - అవసరమైతే నర్స్ తో కాల్ చేయించు , నువ్వుకూడా కాసేపు రెస్ట్ తీసుకో , నర్స్ ...... ఈ బెడ్ మహేష్ కోసం ఖాళీగా ఉంచమని నా ఫ్రెండ్ కు చెప్పు .......
నర్స్ : అలాగే మేడం .......
డాక్టర్ : అమ్మ దగ్గరికివెళ్లి , ఇంత ప్రాణంలా చూసుకునే స్ట్రేంజర్ దొరకడం మీ అదృష్టం , గెట్ వెల్ సూన్ అంటూ భుజంపై స్పృశించి , ఉదయం కలుద్దాము మహేష్ అనిచెప్పి వెళ్లిపోయారు .
థాంక్యూ డాక్టర్ గారూ ....... , సిస్టర్ ...... మీరు ? .
నర్స్ : నో నో నో మీరు కంగారుపడాల్సిన అవసరమేలేదు , మా ఫ్యామిలీ ఇక్కడే హాస్పిటల్ టాప్ లో ఉన్న పెంట్ హౌస్ లో ఉంటాము , డిన్నర్ సమయానికి 9 గంటలకు వెళ్లి తినేసి వచ్చేస్తాను , నేను - అమ్మ మాత్రమే ఉంటాము .
ఇంతకూ టైం ఎంత అయ్యిందోనని మొబైల్ తీస్తే స్విచ్ ఆఫ్ అయిఉంది - అంటే అప్పుడు కాల్ కట్ చెయ్యబోయి ఏకంగా స్విచ్ ఆఫ్ చేసేశానన్నమాట ....... అయిపోయాను అంటూ స్విచ్ ఆన్ చేసాను , టైం 8:30 అయ్యింది , అలా స్విచ్ ఆన్ అయ్యిందో లేదో వందల్లో మెసేజ్ అలర్ట్స్ ....... ఇంకెవరి నుండి నా దేవకన్య నుండే ....... , అంతలోనే దేవకన్య నుండి కాల్ .......
వెంటనే సైలెంట్ లో ఉంచేసి అమ్మకు sorry చెప్పాను .
8 గంటలకల్లా నా దేవకన్య ముందు ఉండాల్సింది - నేనేమో ఇంకా ఇక్కడే అమ్మదగ్గర ఉన్నాను , దేవకన్యనా - ఈ అమ్మనా అని ఆలోచిస్తే , అమ్మదగ్గరే అని మనసు బదులిచ్చింది , ఇలా హాస్పిటల్లో ఉన్నానని చెబితే దేవకన్యతోపాటు అందరూ కంగారుపడిపోతారు ఉన్నఫలంగా ఇక్కడికి వచ్చేస్తారు , లేదు లేదు లేదు అలాజరగడానికి వీల్లేదు - అంటే దేవకన్యకు అపద్ధం చెప్పాలి , అమ్మకోసం ప్రియాతిప్రియమైన దేవకన్య దగ్గర అపద్ధం చెప్పినా తప్పనిపించడం లేదు - లవ్ యు రా మహీ అంటూ అమ్మ చేతిని వదలకుండా వీల్స్ చైర్ ను చేతిని చాపేంత దూరం తీసుకెళ్ళాను .
ఈ గ్యాప్ లోనే మూడుసార్లు చేసింది మహి ......
పెద్దగా ఊపిరిపీల్చుకుని కాల్ లిఫ్ట్ చేసాను , మహీ మహీ మహీ లవ్ యు లవ్ యు లవ్ యు ....... అంటూ చిన్నగా మాట్లాడుతున్నాను .
" థాంక్ గాడ్ , దేవుడా ఏమైపోయారు మళ్లీ కాల్ చేస్తానని కట్ చెయ్యడమే కాకుండా స్విచ్ ఆఫ్ అయిపోయింది , మేమంతా ఎంత కంగారుపడ్డామో తెలుసా , డార్లింగ్స్ డార్లింగ్స్ ....... మీమహేష్ సర్ మాట్లాడుతున్నారు అంటూ సంతోషిస్తోంది "
లవ్ యు లవ్ యు లవ్ యు మహీ ...... , స్విచ్ ఆఫ్ కాలేదు ఇంటర్నేషనల్ కాల్ మాట్లాడుతున్నానా మీకు స్విచ్ ఆఫ్ అని వచ్చి ఉంటుంది , అదేంటో ఆ కాల్ లో మాట్లాడుతుంటే వేరే ఏ కాల్స్ అలర్ట్స్ రాలేదు , ఇదిగో ఇప్పుడే వాళ్ళతో మాట్లాడటం పూర్తయ్యి అలా కట్ చేసానోలేదో ....... నా ముద్దుల దేవకన్య నుండే కాక అమ్మ నుండి - దివ్యక్క నుండి - చెల్లెమ్మ నుండి - అక్కడున్న మేనేజర్ నుండి బోలెడన్ని కాల్స్ వచ్చాయని మీదమీద అలర్ట్స్ వచ్చాయి , నీకు కాల్ చూసేలోపు నువ్వే చేసేసావు లవ్ యు లవ్ యు ......
" లవ్ యు లు తరువాత ముందు అహ్మదాబాద్ లో ల్యాండ్ అయ్యావో లేదో చెప్పు ....... హలో హలో ...... "
లవ్ యు డియర్ సిస్టర్ ......
" అంటే లేదన్నమాట అంటూ కోపం - బాధ రెండూ నా బుగ్గను తాకుతున్నాయి "
విద్యు సిస్టర్స్ - సిస్టర్స్ ...... మీ ప్రియమైన డార్లింగ్ ను నా ముద్దులతో కూల్ చెయ్యండి .
" అది కుదరని పని మహేష్ సర్ అయినా ట్రై చేస్తాము అంటూ రెండువైపులా హత్తుకున్నారు "
" మహి : బ్రదర్ ....... ఏమైంది ? "
లవ్ యు డియర్ సిస్టర్ ....... , ఎయిర్పోర్ట్ కు చేరుకుని ఫ్లైట్ లో అడుగుపెట్టే సమయానికి మన కొత్త అమెరికా బ్రాంచ్ మరియు హైద్రాబాద్ మేనేజర్ నుండి కాన్ఫరెన్స్ కాల్ వచ్చింది అక్కడ అమెరికా సబ్ బ్రాంచ్ లో పెద్ద ప్రాబ్లమ్ వెంటనే అమెరికా రావాలని , లేదు లేదు 15 డేస్ ప్లస్ చెల్లెమ్మ రిలేటివ్స్ మ్యారేజ్ 5 డేస్ దాకా కుదరదని చెప్పేసాను , అయినా వినరే ఒప్పించడానికి ఎయిర్పోర్ట్ లోనే ఆగిపోయి దాదాపు రెండు గంటలసేపు మాట్లాడినా ఉపయోగం లేదు , చివరికి వెళ్లాల్సిన పరిస్థితి - హైద్రాబాద్ మేనేజర్ టికెట్ కూడా బుక్ చేసేసారు .
" What ...... ఎన్నిరోజులు పట్టొచ్చు ? - నేనూ వస్తాను ......"
ఇలావెళ్లి అలా వచ్చెయ్యనూ ....... , నువ్వు వచ్చేస్తే నీ డార్లింగ్స్ అందరూ మరియు చెల్లెమ్మవాళ్ళూ ...... వచ్చేస్తారు , నార్మల్ టూర్ అయ్యుంటే నేనే పిలిపించేవాడిని - ఎడ్యుకేషన్ టూర్ కదా ....... ప్లీజ్ ప్లీజ్ సిస్టర్ నా దేవకన్యవు కదూ ......
" కొద్దిసేపు మౌనం ....... "
మహీ మహీ ....... ఏదో ఒకటి మాట్లాడరా , నువ్వు వెళ్లొద్దు ఇక్కడికే రా అని ఆర్డర్ వెయ్యి అక్కడ ఏమైనా కానీ వచ్చేస్తాను ......
" లేదు లేదు లేదు ....... , ఎంతో కష్టపడి అమెరికాలో బ్రాంచ్ ను నిలబెట్టారు - వెళ్లకపోతే ఏమి జరుగుతుందో ఏమో , వెంటనే వచ్చేయ్యాలి "
ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అటునుండి అటు నీదగ్గరికే వచ్చేస్తానుకదా అంటూ మరొక అపద్దo చెప్పాను - ఇదిగో ఫ్లైట్ ఫైనల్ అనౌన్స్మెంట్ ........
" హ్యాపీ జర్నీ - వెళ్లగానే కాల్ చెయ్యాలి "
పని బిజీలో చేయకపోతే కోప్పడకు మహీ ...... , నా మనసు ఎప్పుడూ నీగురించే ఆలోచిస్తుంది ఉమ్మా ఉమ్మా ఉమ్మా ఉమ్మా ....... ఉమ్మా ఉమ్మా - ఆ మాటకు ICU AC లో కూడా చిరు చెమట పట్టింది - అంటే ఈ అమ్మను కలిశాక నా ప్రియమైన దేవకన్యతో అపద్దాల సంఖ్య పెరుగుతూనే ఉంది - వీరంటే అంత ఇష్టమా అంటూ నేనే ఆశ్చర్యపోయాను .
" అయినా ట్రై చెయ్యి దేవుడా లవ్ యు సో మచ్ ...... , ఒక డౌట్ కంపెనీ చైర్మన్స్ మేము కదా మాకు ఒక్క కాల్ కూడా రాలేదే ...... "
దొరికిపోయాను - ఆ ఆ అదీ అదీ ఆ ...... నువ్వేమో .... అహ్మదాబాద్ లో - దివ్యక్కేమో ...... ఫ్రాన్స్ లో , ఇక చెల్లెమ్మ ఏమో shimla లో ఉన్నారని మిమ్మల్ని ఇబ్బందిపెట్టకూడదని మేనేజర్ గారు నాకు కాల్ చేశారు - బ్రీఫ్ రిపోర్ట్ ను మీ ముందు ఉంచుతానుగా చైర్మన్స్ ......
" మహి నవ్వులు "
హమ్మయ్యా ..... ఇప్పుడు హాయిగా ఉంది - లవ్ యు సో మచ్ డియర్ సిస్టర్ ......
" అక్కడ మరింత చలిగా ఉంటుంది - నీకేమో కోల్డ్ వేసింది జాగ్రత్త బ్రదర్ ...... "
ఈ విషయం మేనేజర్ గారికి తెలిసి మాతోపాటు ఒక డాక్టర్ కు కూడా టికెట్ బుక్ చేశారు - అక్కడ ఉన్నన్ని రోజులు మాతోనే ఉంటారు , మహీ ...... ఫైనల్ ఫైనల్ అనౌన్స్మెంట్ ......
" అయితే ok హ్యాపీగా వెళ్ళిరా - మాగురించి ఏమీ ఆలోచించకు హ్యాపీ జర్నీ ..... ఉమ్మా ఉమ్మా "
లవ్ యు డియర్ సిస్టర్ ఉమ్మా అంటూ కట్ చేసి , హృదయంపై చేతినివేసుకుని sorry చెప్పాను - తప్పలేదు మహీ .......
ఆ వెంటనే హైద్రాబాద్ మేనేజర్ గారికి కాల్ చేసి ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను - ఏమిటి ఎందుకు అని అడగకండి మనిద్దరం అమెరికా వెళుతున్నాము అని చైర్మన్స్ కు చెప్పాను - నేను మళ్ళీ వదినగారికి కాల్ చేసి చెప్పేంతవరకూ మొబైల్ ను స్విచ్ ఆఫ్ లో ఉంచమని చెప్పాను .
మేనేజర్ : మహేష్ సర్ ...... చైర్మన్స్ తో అపద్ధం ......
తప్పడం లేదు మేనేజర్ గారూ - అంత ముఖ్యమైన పని ......
మేనేజర్ : అలాగే సర్ ...... , మరి చైర్మన్స్ మీతో మాట్లాడకుండా ఉండలేరు కదా ......
దానికీ ఒక ఉపాయం ఆలోచించాను - అమెరికా బ్రాంచ్ నుండి కనెక్టింగ్ కాల్ ద్వారా మాట్లాడుతాను .
మేనేజర్ : ఆ ఏర్పాటు చేస్తాను మహేష్ సర్ - వేరే నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ లో ఉండొచ్చు ........
థాంక్యూ మేనేజర్ గారూ ....... , నేనుకూడా - నర్స్ మీ నెంబర్ ఇవ్వగలరా ? .
నర్స్ : మొత్తానికి ఏదో జరుగుతోంది - ఏమి జరుగుతోందో అర్థం కావడం లేదు , మీపై నమ్మకం ఉందికాబట్టి ఇస్తాను .
మేనేజర్ గారికి నెంబర్ ఇచ్చి ఇద్దరమూ స్విచ్ ఆఫ్ చేసుకున్నాము .
ఇంకా ఎన్నెన్ని అపద్దాల ఆడాల్సివస్తుందో అంటూ అమ్మ దగ్గరికి చేరుకున్నాను , అమ్మా ....... మీకోసం ప్రాణమైనవాళ్ళతో అపద్దాలు చెప్పినా - వాళ్ళను చిరుబాధపెట్టినా తప్పు లేదనిపిస్తోంది , వీటి గురించి మీరు ఆలోచించకండి మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి .
నర్స్ : నవ్వుతోంది - మహేష్ సర్ ...... మీరువెళ్లి భోజనం చేసివస్తే నేనూ వెళ్లివస్తాను .
నేనైతే అమ్మను - అమ్మచేతిని వదిలి ఎక్కడికీ వెళ్లను అంటూ రెండుచేతులతో అమ్మచేతిని సున్నితంగా పట్టుకున్నాను .
నర్స్ : మరి భోజనం ? .
చేసేసానుకదా ...... , రెండు పెద్ద పెద్ద గ్లాసుల జ్యూస్ మరియు ఒక పెద్ద పండు తిన్నానుకదా కడుపు నిండిపోయింది , మీరు వెళ్లి మీ అమ్మగారితోకలిసి తినేసి కాస్త తొందరగానే వచ్చెయ్యండి ప్లీజ్ ప్లీజ్ .......
నర్స్ : సరే అయితే ఏదైనా అవసరం అయితే ఈ బటన్ ప్రెస్ చెయ్యండి డాక్టర్స్ వచ్చేస్తారు .
Wow థాంక్యూ సిస్టర్ ......
నర్స్ : డాక్టర్ మేడం చెప్పినట్లు మీరు చాలా చాలా లక్కీ , ఇలాగే హాయిగా రెస్ట్ తీసుకోండి మేడం భోజనం చేసి వచ్చేస్తాను అంటూ అమ్మచేతిలోని మొబైల్ ను మరొకసారి లాగడానికి ప్రయత్నించి ప్చ్ ...... అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయింది .
నవ్వుకుని , ఎందుకమ్మా ...... మీవాళ్లకు తెలియనివ్వడం లేదు - sorry sorry మిమ్మల్ని ఇబ్బందిపెట్టను లెంపలేసుకోవడానికి చేతులు ఖాళీగా లేవు .
అమ్మ పెదాలపై నవ్వు .......
అమ్మా ...... మీరు నవ్విన ప్రతీసారీ నా హృదయం పులకించిపోతోంది - ఎందుకో తెలుసా ఇక్కడ ఇద్దరు అమ్మలు ఉన్నారు - మిమ్మల్ని చూసిన క్షణమే మీరుకూడా నా హృదయంలో చేరిపోయారు అనుకోండి - మీ అనుమతి లేకుండా నా హృదయంలో చేర్చుకున్నందుకు సో sorry - నాకు తెలియకుండానే నా హృదయంలో స్థానం సంపాదించేశారు - మళ్లీ లెంపలేసుకోవాలి కానీ చేతులు ఖాళీగా లేవు అన్నీ గుర్తుంచుకొని తరువాత వేసుకుంటాను ప్రామిస్ .......
అమ్మ పెదాలపై నవ్వు - చేతివేళ్ళ కదలికలు .......
ఆఅహ్ ...... మాటల్లో చెప్పలేని ఆనందం అంటూ నాకే తెలియకుండా అమ్మ చేతిపై ముద్దుపెట్టబోయి వెంటనే తేరుకుని ఆగిపోయాను - sorry sorry sorry so so so soooo sorry అమ్మా ....... రేయ్ బ్యాడ్ బాయ్ దెబ్బలుపడతాయి నీకు అప్పుడు రెండుసార్లు దీనికి మరొక రెండుసార్లు ....... నాలుగుసార్లు చెంపదెబ్బలు గుర్తుపెట్టుకో , అమ్మా క్షమించండి ఇలా ఎక్కువ సంతోషం కలిగినప్పుడు నా ప్రాణమైనవాళ్లకు నాకు తెలియకుండానే ముద్దుపెట్టడం అలవాటు - మీదగ్గర జాగ్రత్తగా ఉంటాను ప్రామిస్ ........
అమ్మ పెదాలపై మళ్లీ చిరునవ్వు .......
ఆఅహ్హ్ ...... రేయ్ కంట్రోల్ కంట్రోల్ ......
మళ్లీ మళ్లీ చిరునవ్వులను చిందిస్తూనే ఉండటం చూసి తెగ ఆనందిస్తున్నాను .
అమ్మతో సమయమే తెలియలేదు - గంట సమయం క్షణం లా గడిచిపోయింది .
నర్స్ లోపలికివచ్చి ఏంటి మహేష్ సర్ చాలా ఆనందంలో ఉన్నారు .
సిస్టర్ ....... అమ్మ , నా ప్రతీ మాటకూ ప్రతిస్పందిస్తూ నవ్వుతున్నారు .
నర్స్ : చూస్తున్నానులే మహేష్ సర్ ...... , నా నర్స్ experiance లో ఇలాంటి సంతోషపు వింతను ఎన్నడూ చూసిందిలేదు , మీరు ..... మేడం చేతిని పట్టుకుని మాట్లాడటం - వీరేమో చిరునవ్వులు చిందిస్తూ ప్రతిస్పందించడం ...... ఎంజాయ్ ఎంజాయ్ ......
థాంక్స్ సిస్టర్ .......
నర్స్ : 10 గంటలు అవుతోందికదా ఏక్షణమైనా డాక్టర్ గారు రావచ్చు .....
వచ్చేసానే రాధిక అంటూ లోపలికివచ్చారు డాక్టర్ గారు .
డాక్టర్ గారూ అంటూ లేచి నిలబడ్డాను .
డాక్టర్ : నేనేమైనా కాలేజ్ టీచర్ నా - నువ్వేమైనా స్టూడెంట్ వా మహేష్ లేచి నిలబడ్డావు , కూర్చో కూర్చో ఆ చేతిని మాత్రం వదలద్దు .
డాక్టర్ గారూ ...... నా పేరు ? .
డాక్టర్ : అదే నా ఫ్రెండ్ ఇక్కడ జరిగిన మహాద్భుతాన్ని సంతోషిస్తూ చెప్పిందిలే ...... అంటూ అటువైపుకువచ్చి , అమ్మను చెక్ చేసి its really surprising , ఒసేయ్ ...... నువ్వు చెప్పినది కరెక్టే అన్నమాట ...... , మహేష్ ...... డాక్టర్స్ కూడా అవసరం లేదు - నువ్విచ్చిన బ్లడ్ తనంతట తాను చికిత్స చేసేస్తోంది , నాకుతెలిసి ఉదయానికల్లా వీరు పూర్తిగా కోలుకున్నా ఆశ్చర్యం లేదు .
నర్స్ : బ్లడ్ ఇవ్వడమే కాదు డాక్టర్ మేడం - ప్రక్కనే కూర్చుని నవ్విస్తూనే ఉన్నారు .
డాక్టర్ గారు : మహేష్ ...... హాస్పిటల్ నుండి వెళ్లిపోయేవారు మా మందుల వలన కోలుకున్నారు అనుకుంటారు కానీ నిజానికి ఇలా బంధువులు సంతోషపెడితే అంతకంటే ముందుగానే కోలుకుంటారు అని తెలుసుకోనే తెలుసుకోరు , హాస్పిటల్స్ లోకూడా ఇదొక బిజినెస్ లా మారిపోయింది , keep it up ...... నేను రౌండ్స్ కు వెళ్ళొస్తాను , రాధికా ...... ఏంటా బాక్స్ నాకోసమేనా ? .
నర్స్ : మేడం ...... మహేష్ సర్ కోసం .
డాక్టర్ : నేను ఫుల్ గా తినే వచ్చానులే , వదిలి పోనన్నాడు అన్నమాట మహేష్ ,ఇవ్వు ఇవ్వు .......
నర్స్ : అలాగే మేడం ......
డాక్టర్ గారూ ...... అమ్మ ? .
డాక్టర్ : ఈ ఒక్క పూటకు గ్లూకోజ్ - రేపటి నుండి ఏమైనా తినొచ్చు ......
అయితే నేనుకూడా రేపటి నుండే తింటాను డాక్టర్ .......
అమ్మ గిల్లేసారు ......
స్స్స్ ........
డాక్టర్ గారు - నర్స్ ...... షాక్ లో ఉండిపోయారు . ఇప్పుడు పూర్తిగా నమ్ముతాను రాధికా ....... వైద్యశాస్త్రంలోనే అద్భుతం , మహేష్ ...... నువ్వు తినకపోతే లేచి కొట్టేలా ఉన్నారు ఇక నీఇష్టం అంటూ షాక్ లోనే బయటకువెళ్ళారు .
నర్స్ : నవ్వుకుని , మహేష్ సర్ ...... అమ్మచేతి వంట - అమ్మ సూపర్ గా చేస్తారు వెజిటబుల్ బిరియానీ తినండి అంటూ బాక్స్ ఓపెన్ చేసి అమ్మ ప్రక్కనే బెడ్ పై ఉంచింది .
స్మెల్స్ నైస్ సిస్టర్ ....... , అమ్మచేతివంట అన్నారు చూడండి అక్కడ టెంప్ట్ అయిపోవచ్చు ......
నర్స్ : అమ్మ అంటే మీకు ప్రాణం అనుకుంటాను మహేష్ సర్ ......
అమ్మ పిలుపుకోసమే జీవిస్తున్నాను సిస్టర్ .......
నర్స్ : సో నైస్ , అయితే మిమ్మల్ని పూర్తిగా నమ్మొచ్చు , మహేష్ సర్ ..... చాలా గట్టిగా గిల్లేసినట్లున్నారు ఎర్రగా మారిపోయింది అక్కడ .......
పెదాలపై చిరునవ్వుతో మొబైల్ ను స్విచ్ ఆన్ చేసి ఫోటో తీసుకుని వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసాను .
నర్స్ : గుర్తుగా అన్నమాట ...... అంటూ నవ్వుకుంది .
Yes సిస్టర్ అంటూ ఆకచేతితో అమ్మచేతిని పట్టుకుని స్పూన్ సహాయంతో తిన్నాను - మ్మ్మ్ ...... అమ్మచేతివంట అంటూ మొత్తం తినేసాను .
నర్స్ : సరిపోనట్లులేదు - క్షణాల్లో తీసుకొస్తాను మహేష్ సర్ ......
లేదు లేదు సరిపోయింది సిస్టర్ .......
నర్స్ : మీరు తింటుంటేనే తెలిసిపోతుంది - నిమిషంలో తీసుకొస్తాను అంటూ బాక్స్ తీసుకునివెళ్లి ఫుల్ గా తెచ్చింది .
థాంక్స్ సిస్టర్ కానీ ఇంత తినలేను .
నర్స్ : తినాల్సిందే , రెండు బాటిల్స్ బ్లడ్ ఇచ్చారు , ఎంత తింటే అంత మంచిది ..... , అదిగో మేడం కూడా స్మైల్ ఇచ్చారు .
అమ్మ ఆర్డర్ వేశారు అంటే తినేస్తాను అంటూ ఆనందించాను . మోతాదుకు మించి తిని నీళ్లు తాగి లేవబోయాను .
నర్స్ : నేను శుభ్రం చేస్తాను - మీరు చేతినివదిలితే ఏమిజరుగుతుందో ఏమో డాక్టర్ మేడం కూడా కోప్పడతారు - ఆ పాపం నాకైతే వద్దు అంటూ బాక్స్ అందుకుని సింక్ లో శుభ్రం చేశారు .
కొద్దిసేపటికి డాక్టర్ గారు వచ్చి , మహేష్ ...... 11 అవుతోంది , నేనుకూడా రెస్ట్ చాలా అవసరం , కావాలంటే ఆ బెడ్ ను వీరి బెడ్ ప్రక్కకు జరుపుతాము .
నో నో నో డాక్టర్ గారూ ...... , నాకు ఇలానే బాగుంది - అమ్మను చూస్తూనే ఉండాలని ఉంది , ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ గారూ కాదనకండి .
డాక్టర్ : సరికానీ ...... , నిద్రవస్తే మీ అమ్మ చేతిలో తలవాల్చి కుర్చీలోనే నిద్రపో ......
అలా అయితే డబల్ హ్యాపీ డాక్టర్ గారూ .......
డాక్టర్ : స్వీట్ ఆఫ్ యు , అమ్మకు ఎక్కించిన గ్లూకోజ్ పూర్తవ్వడంతో నీడిల్ ను తీసేయ్యబోయారు .
స్స్స్ ........
డాక్టర్ : చెప్పింది చెప్పింది ఈ విషయం కూడా చెప్పింది నా ఫ్రెండ్ అంటూ కాటన్ ఉంచి అతినెమ్మదిగా తీశారు - see నో బ్లడ్ హ్యాపీనా ........
థాంక్యూ డాక్టర్ గారూ అంటూ కూర్చున్నాను .
మరొక నర్స్ లోపలికివచ్చి , మేడం ...... చీఫ్ డాక్టర్ గారు పిలుస్తున్నారు .
డాక్టర్ : వస్తున్నాను , మహేష్ ...... పిల్లలకు కంటి ఆపరేషన్స్ ఉన్నాయి , నేను రాత్రంతా అక్కడే ఉంటాను , నర్స్ అవసరమైతే పిలు అనిచెప్పి వెళ్లారు .
పిల్లల ఆపరేషన్స్ సక్సెస్ అవ్వాలని మనఃస్ఫూర్తిగా కోరుకున్నాను .
నర్స్ కూడా నాతోపాటు ప్రార్థించింది .
ఆసమయానికి హాస్పిటల్ మొత్తం నిశ్శబ్దన్గా మారిపోయింది - సిస్టర్ ..... మీకు నిద్రవస్తోంది పడుకోండి , బ్లాంకెట్ ఏమైనా ఉందా ? - హాస్పిటల్ క్లోత్ కాకుండా .....
నర్స్ : ఒక్కనిమిషం వెళ్లివచ్చింది - వీకెండ్ లో షాపింగ్ వెళ్ళాము అంటూ కొత్త దుప్పటిని అమ్మ భుజాలవరకూ కప్పి , నా వెనకున్న బెడ్ పై పడుకుంది .
అమ్మ వేళ్ళ స్పర్శకు సంతోషించాను - అమ్మా ..... వెచ్చగా నిద్రపోండి అంటూ అమ్మచేతిని అందుకుని సున్నితంగా స్పృశిస్తూ ప్రాణంలా చూస్తూ కూర్చున్నాను .
సరిగ్గా అర్ధరాత్రి సమయాన , అమ్మా దుర్గమ్మా ...... మీ మొక్కు తీర్చుకుంటాను - నా కన్నయ్య ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి , ఏదో దోషం చేసాను అందుకేనా ఆదిలోనే ఆగిపోయాను , నన్ను క్షమించు తల్లీ ...... ఎన్ని అవరోధాలేదురైనా మొక్కు తీర్చుకుంటాను అంటూ కలవరిస్తూ నుదుటిపై చెమటతో అటూ ఇటూ కదులుతున్నారు .
అమ్మా అమ్మా ....... అంటూ కంగారుపడిపోయాను .
నర్స్ లేచిచూసి పరుగునవెళ్లి డాక్టర్ గారిని పిలుచుకునివచ్చింది .
అమ్మా అమ్మా ...... అంటూ అమ్మచేతిని హృదయంలో ఉన్న అమ్మల చెంతకు చేర్చుకుని , మరొకచేతితో నుదుటిపై చెమటను తుడిచి శాంతించేలా చేసాను , అమ్మా ...... మాట్లాడకండి గొంతులో నొప్పివేస్తుంది అంటూ కన్నీళ్ళతో నుదుటిపై ప్రాణంలా స్పృశిస్తున్నాను .
డాక్టర్ గారు - నర్స్ ...... వారు చెయ్యాల్సినది చేస్తున్నారు .
నా కన్నీటి చుక్క ...... అమ్మ నుదుటిపై పడగానే ఆశ్చర్యం ఒక్కసారిగా అమ్మ రిలాక్స్ అయ్యి ఒకవైపుకు తిరిగి నాచేతిని ప్రాణంలా వారి గుండెలపై హత్తుకుని , కన్నయ్యా కన్నయ్యా ...... అంటూ కలవరిస్తున్నారు .
అమ్మా అమ్మా ...... అని ప్రాణంలా పిలుస్తూ హాయిగా నిద్రపోయేలా చేసాము .
డాక్టర్ : కంగారుపడాల్సినదేమీ లేదు మహేష్ ....... , నాకుతెలిసి ఈసమయానికి రోజూ కన్నయ్య అంటూ వారి బిడ్డను కలవరిస్తూ ఉండాలి . హార్ట్ బీట్ - బీపీ అంతా నార్మల్ గానే ఉంది , నువ్వు అమ్మా అమ్మా ...... అంటూ ప్రాణంలా పిలిచిన ప్రతీసారీ సంతోషంగా ఫీల్ అవుతున్నట్లు హార్ట్ బీట్ ద్వారా తెలిసిపోతోంది , చేతిని అలానే ఉంచి ధైర్యాన్ని తెలియచెయ్యి ....... , ఇక కంగారుపడాల్సిన అవసరమేలేదు , ఆపరేషన్ మధ్యలో వచ్చాను ......
డాక్టర్ గారూ ...... ప్లీజ్ ప్లీజ్ వెళ్ళండి , రేపు సూర్యోదయాన్ని పిల్లలు ఆస్వాదించాలి .
డాక్టర్ : నువ్వు ప్రక్కనే ఉండగా వారికి ఏమీకాదు - నేను నమ్ముతున్నాను అనిచెప్పి వెళ్లారు .
ఆ తరువాత అమ్మ ఎటువంటి ఇబ్బందీ పడకుండా హాయిగా రెస్ట్ తీసుకున్నారు - తెల్లవారుఘామున ఎప్పుడో నాకు తెలియకుండానే కళ్ళు వాటంతట అవి మూసుకోవడంతో బెడ్ పై తలవాల్చాను .
అస్సలు నిద్రపోను రాత్రంతా అమ్మను చూస్తూ ఉండిపోతాను నిద్రపోవడం కంటే అమ్మను చూడటమే హాయి అన్నాడు హీరో - ఇప్పుడేంటి 7 గంటలు అవుతున్నా ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు అంటూ నవ్వులు వినిపించడంతో సడెన్ గా లేచి కూర్చున్నాను .
చూస్తే ఏకంగా ఇద్దరు డాక్టర్స్ ....... , అమ్మ మాత్రం ఇంకా నిద్రలోనే ఉన్నారు , నా చెయ్యి అయితే అర్ధరాత్రి సమయంలోకంటే మరింత గట్టిగా అమ్మ తన గుండెలపై హత్తుకున్నట్లు తెలిసి చాలా చాలా ఆనందం వేస్తోంది .
కొన్నిక్షణాలకే అమ్మకూడా స్పృహలోకొచ్చినట్లు నెమ్మదిగా కళ్ళుతెరిచి చుట్టూచూస్తూ లేచి కూర్చోడానికి ట్రై చేస్తున్నారు .
నేను సహాయం చెయ్యబోయి ఆగి , సిస్టర్ అంటూ పిలిచాను .
నర్స్ వచ్చి రిమోట్ అందుకుని అమ్మ ఆనుకుని కూర్చునేలా బెడ్ ను పైలెపి అడ్జస్ట్ చేశారు .
డాక్టర్స్ ఏమాత్రం చెక్ చెయ్యకుండా అలా చూస్తుండటం చూసి ఆశ్చర్యం వేసింది - డాక్టర్స్ డాక్టర్స్ .......
Ok ok అంటూ నవ్వుతూనే అమ్మకు ఇరువైపులా చేరి ఎలా ఉంది అని అడిగారు .
అమ్మ మాట్లాడేంతలో నో నో నో నొప్పివేస్తుంది మాట్లాడకండి .
డాక్టర్స్ : అయ్యో మరిచేపోయాము అంటూ మొట్టికాయలు వేసుకున్నారు - చూడండీ ఈ ఒక్కరోజు మాక్సిమం మాట్లాడకుండా ఉండటానికి ప్రయత్నించండి .
అమ్మ : ఇతనెవరు ? , నా చేతిని ఎందుకు పట్టుకున్నాడు ? , నా గుండెలపై ఎందుకు ఉంది ? అంటూ చేతిని వెనక్కు తీసేసుకున్నారు .
ఏమని బదులివ్వాలో తెలియక sorry sorry sorry అంటూ తలదించుకున్నాను .
నర్స్ : What ...... ? .
( ష్ ష్ ష్ ....... అంటూ సైగలు - నర్స్ ok అన్న గుసగుసలు వినిపించాయి ) చూస్తే నర్స్ - డాక్టర్స్ ...... తమ నవ్వులను ఆపుకుంటున్నట్లు తెలుస్తోంది - ఏమీ అర్థం కావడంలేదు .
డాక్టర్స్ : చెప్పు మహేష్ ఎందుకు పట్టుకున్నావో ? .
ఆ ఆ ...... అమ్ ......
అమ్మ : What ...... ? .
అంటీ అదీ అదీ .......
నర్స్ - డాక్టర్స్ : అంటీనా అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
అంటీ ...... అదీ అదీ , మిమ్మల్ని నేనే హాస్పిటల్ కు తీసుకొచ్చాను ......
అమ్మ : తీసు .......
అమ్ ...... అంటీ అంటీ మాట్లాడకండి అంటూ డాక్టర్స్ చేతిలోని ట్రీట్మెంట్ రిపోర్ట్ ప్యాడ్ - పెన్ ను అందించి రాయమన్నాను .
అమ్మ : కళ్ళల్లో కోపంతో అందుకుని , తీసుకొచ్చావు సరే , ICU బయట ఉండాలికానీ ప్రక్కనే అదికూడా నాచేతిని ఇలా ఎందుకు పట్టుకున్నావు అని వ్రాసారు .
బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అమ్ ...... అంటీ అంటీ అంటూ సంతోషిస్తున్నాను .
అమ్మచేతిలో ఉన్న నా చేతిని సున్నితంగా గిల్లేసారు .
అదీ అదీ అంటీ ...... , నేను ఇలా మీచేతిని పట్టుకోవడం వలన మీరు ఫాస్ట్ గా కోలుకుంటూ హాయిగా రెస్ట్ తీసుకున్నారు .
అమ్మ ప్యాడ్ అందుకుని , కాకమ్మ కథలు చెబుతున్నావా అంటూ రాశారు ( లోలోపలే నవ్వుకుంటున్నారు ) .
లేదు లేదు అమ్ ...... అంటీ , కావాలంటే డాక్టర్స్ - సిస్టర్స్ ను అడగండి .......
అమ్మ ...... ముగ్గురివైపూ చూసారు .
డాక్టర్స్ : డాక్టర్స్ అయ్యుండి అలా మేమెందుకు చెబుతాము చెప్పండి ( లోలోపలే నవ్వులు ) .
( సిస్టర్ అయితే నవ్వు ఆపుకోలేకపోయినట్లు అటువైపుకు తిరిగి నవ్వుతోంది )
డాక్టర్స్ మీరేకదా .......
డాక్టర్స్ : మేమా ...... ? .
అమ్మ కోపం చూసి సెంటర్ అయిపోయానని అర్థమయ్యి , sorry sorry sorry అంటీ అంటూ గుంజీలుతీస్తున్నాను .
డాక్టర్స్ - నర్స్ నవ్వులు ఆగడం లేదు .
అమ్మ : ప్యాడ్ అందుకుని , రోడ్డుపై ఆక్సిడెంట్ జరిగితే కొంతమంది హెల్ప్ హెల్ప్ అని ఆగిపోతారు , మరికొంతమంది అంబులెన్స్ అంబులెన్స్ అంటారు , ఇంకొంతమంది అంబులెన్స్ కు కాల్ చేస్తారు , ఇంకా మంచివారైతే అంబులెన్స్ లో హాస్పిటల్ వరకూ వచ్చి అడ్మిట్ చేసి వెళ్ళిపోతారు కానీ నీలా ప్రక్కనే కూర్చుని రాత్రంతా కూర్చోరు పెద్ద హీరోలా ....... కొంపదీసి బ్లడ్ కూడా ఇచ్చావా ఏమిటి ? .
ఊహూ ఊ అన్నట్లు తలను అడ్డంగా నిలువునా కదిలిస్తున్నాను .
నర్స్ : ఒకటికాదు .......
సిస్టర్ నో అంటూ సైగచేసాను .
అమ్మ : ఓహో ...... నువ్వు సైగచెయ్యడం - నర్స్ ఆగిపోవడం ...... బిల్డప్ సూపర్ అంటూ రాశారు .
లేదు లేదు అంటీ ........
అమ్మ : ఇంతవరకూ ఏమిజరిగిందో నాకనవసరం - నాకు ఇక ఒక్క క్షణం కూడా హాస్పిటల్లో ఉండాలని లేదు - చివరగా ఒక హెల్ప్ చేస్తావా ? .
ఆర్డర్ వెయ్యండి అమ్ ...... అంటీ ......
అమ్మ : నాకు హాస్పిటల్ పడదు - ఈ పరిస్థితుల్లో ఇంటికివెళ్లాలని లేదు - ఎక్కడైనా ఆశ్రమంలో వధులుతావా ? .
అమ్ ..... అంటీ ...... మీకు ఇష్టమైతే మన ఇంటికి తీసుకెళతాను - ఏలోటూ లేకుండా చూసుకుంటాను .
అమ్మ : అనుకున్నాను అనుకున్నాను , నీ ఇంటికి తీసుకెళ్లి మూడోకంటికి తెలియకుండా కిడ్నీలు తీసి అమ్ముకుందామని ప్లాన్ చేశావుకదూ .......
లేదు లేదు లేదు ....... , మీకు చిన్న గాయమైతేనే తట్టుకోలేను .
డాక్టర్స్ - నర్స్ నవ్వుకుని , మిమ్మల్ని ప్రాణంలా చూసుకోవడం మాత్రం నిజం ......
అమ్మ : మీరు చెబుతున్నారు కాబట్టి ok , అయినా నాకు కరాటి వచ్చులే అలాంటి ప్రయత్నాలు చేస్తే .......
ఆనందంగా దెబ్బలుతింటాను అమ్ ...... అంటీ ......
అమ్మ : డాక్టర్స్ ప్లీజ్ ప్లీజ్ I am perfectly alright , నన్ను వెంటనే వెంటనే డిశ్చార్జ్ చెయ్యండి .
అమ్ ....... అంటీ ఆ విషయం చెప్పాల్సినది డాక్టర్స్ , డాక్టర్స్ ...... ? .
( అమ్మ ఆనందబాస్పాలతో నావైపు చూసారు ) .
డాక్టర్స్ : చిరునవ్వులు చిందిస్తూ చెక్ చేసి perfectly alright - ఇంట్లో ఉండి మందులు వేసుకున్నా చాలు , అవసరమైతే ఒకసారి హాస్పిటల్ కు పిలుచుకునిరా మహేష్ .......
అమ్మ : థాంక్యూ డాక్టర్స్ అంటూ రాసి చూయించారు .
థాంక్యూ డాక్టర్స్ - చాలా చాలా హ్యాపీ అమ్ .... అంటీ మన ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్నందుకు .......
అమ్మ : మన ఇల్లు అంటున్నావేమిటి ? .
డాక్టర్స్ : నా ఇల్లు అంటే పొగరు అనుకోవాలి కానీ మన ఇల్లు అని ఇష్టంగా పిలుస్తున్నాడు - గుడ్ బాయ్ .......
అమ్మ : అందుకే డౌట్ డాక్టర్స్ ....... , ఇలాంటి ఇంతటి గుడ్ బాయ్ ఈ కలి కాలంలో ఎక్కడ ఉంటాడు చెప్పండి , ఒకవేళ రెండురోజుల్లో చెకప్ కు రాకపోతే సెక్యూరిటీ ఆఫీసర్లతో అక్కడికి వచ్చెయ్యండి డాక్టర్స్ .......
డాక్టర్స్ ఇదిగో అడ్రస్ అంటూ ప్యాడ్ పై రాశాను - మోస్ట్ బ్యూటిఫుల్ సీ వ్యూ ...... మీరూ వచ్చి ఆ అందాలను వీక్షించగలరు .
డాక్టర్స్ : Wow తప్పకుండా తప్పకుండా .......
అమ్మ : ఇక వెళ్లిపోవచ్చుకదా అంటూ సైగలుచేసి , నా చేతిని అందుకుని కిందకుదిగబోయారు .
అమ్ ...... అంటీ జాగ్రత్త జాగ్రత్త ......
అమ్మ : హలో ....... దెబ్బలుతగిలింది తలకు - మెడకు మాత్రమే , పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను తెలుసా అంటూ నిలబడబోయి అమ్మా ...... అంటూ కిందకుపడిపోతుంటే .......
జాగ్రత్తగా పట్టుకుని నిన్నలా రెండుచేతులతో ఎత్తుకుని బెడ్ పై వెనక్కు వాల్చి కూర్చోబెట్టాను .
నొప్పిగా ఉన్నట్లు తన రక్తపుమరకల నా చొక్కాను గట్టిగా పట్టేసుకుని స్స్స్ స్స్స్ ....... అంటున్నారు .
కంగారులో అమ్మా అమ్మా ఏమైంది ఏమైంది అంటూ కళ్ళల్లో చెమ్మతో అడిగాను - ఏమైంది అండీ అంటూ డాక్టర్స్ చెరొకవైపు చేరారు .
నొప్పివేస్తున్నట్లు మోకాలివైపు చూయించారు .
డాక్టర్స్ : అమ్మ చీరపైనుండే మోకాలివద్ద స్పృశించారు .
అమ్మ : స్స్స్ స్స్స్ అంటూ నా షర్ట్ ను మరింత గట్టిగా పట్టేసుకున్నారు .
చూడాలి అంటూ డాక్టర్స్ ..... అమ్మ చీరను పైకెత్తుతుంటే , అమ్మ ...... షర్ట్ ను వదలకపోవడంతో గట్టిగా కళ్ళుమూసుకుని వెనక్కు తలతిప్పాను .
డాక్టర్స్ : మేడం ...... మీరు కిందపడినప్పుడు మోకాలిపై దెబ్బతగిలింది , నిన్ననే మేము తెలుసుకుని ఉండాల్సింది క్షమించండి , బయట గాయమేమీ కాలేదు దెబ్బ లోపల ఎముకకు తగిలినట్లుంది , బాగా నొప్పివేస్తోందా ? .
అమ్మ స్స్స్ ..... అనగానే నాకళ్ళల్లో నీళ్లు తిరిగాయి .
డాక్టర్స్ : మహేష్ ...... స్కానింగ్ చేస్తేనేకానీ చెప్పలేము - స్కానింగ్ రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది , నర్స్ పైకివెళ్లి ఏర్పాటుచెయ్యి ....... , మహేష్ ...... వీల్ చైర్లో కూర్చోబెట్టు పిలుచుకునివెళదాము .
అమ్మ కంగారుపడుతున్నట్లు నా షర్ట్ ను మరింత గట్టిగా లాగేస్తున్నారు .
అమ్మా నేనున్నానుకదా - డాక్టర్స్ ...... వీల్ చైర్లో నొప్పివేస్తుందేమో ఇలానే ఎత్తుకుంటాను .
డాక్టర్స్ : వారికి ఎలా కంఫర్టబుల్ అయితే అలా అంటూ డోర్స్ తెరిచిపట్టుకున్నారు.
అమ్మా మీకేమీకాదు అంటూ జాగ్రత్తగా ఎత్తుకున్నాను - అమ్మా ...... నొప్పివేసిందా ? .
అమ్మ : ఊహూ ...... అంటూ మెడను చుట్టేసి సేఫ్ గా ఉన్నట్లు హృదయంపై తలవాల్చారు .
నొప్పివేస్తే చెప్పండి అంటూ బయటకు నడిచాను .
మహేష్ ఇటువైపు అంటూ లిఫ్ట్ దగ్గరికి - లిఫ్ట్ లో ఫస్ట్ ఫ్లోర్ కు - అక్కడి నుండి స్కానింగ్ రూమ్ కు తీసుకెళ్లారు డాక్టర్స్ ......
అమ్మను స్కానింగ్ బెడ్ పై అతినెమ్మదిగా పడుకోబెట్టి , అమ్మా ...... బయట ఉంటాను .
అమ్మ : ఊహూ ...... అంటూ షర్ట్ ను చిరిగిపోయేలా పట్టుకున్నారు .
డాక్టర్స్ : మహేష్ ...... మోకాలిపైననే స్కానింగ్ - నువ్వు ఉండవచ్చు .
అమ్మా ...... ఇక్కడే ఉంటాను అంటూ కళ్ళుమూసుకుని అటువైపుకు తలతిప్పాను
నర్స్ అప్పటికే రెడీ చేసి ఉండటంతో 5 నిమిషాలలో స్కానింగ్ పూర్తవడం - Xray బయటకురావడంతో , డాక్టర్స్ చూసి హమ్మయ్యా అనుకున్నారు , మహేష్ మహేష్ ....... ఫ్రాక్చర్ ఏమీకాలేదు ప్రెజర్ తో కిందపడటం వలన బలంగా తగిలి నొప్పివేస్తోంది అంతే స్ప్రే వాడితే తిందరలోనే క్లియర్ అయిపోతుంది .
అమ్మ : రిలాక్స్ అయ్యి , అయితే డిశ్చార్జ్ ......
ష్ ష్ ష్ అమ్మా ......
డాక్టర్స్ : లేదు లేదు కనీసం సాయంత్రం వరకూ ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోవాలి .
ఉంటాము డాక్టర్స్ .......
అమ్మ : ప్చ్ ప్చ్ ......
అమ్మా ..... సాయంత్రం వరకే కదా ప్లీజ్ ప్లీజ్ ......
అమ్మ : సరేలే .......
డాక్టర్స్ : మేడం మీకు ICU లో ఉండటం ఇష్టం లేకపోతే స్పెషల్ రూంలో ఉండవచ్చు కానీ కాస్త costly ....... , మా డీన్ రూపాయీ వదలడు .......
అమ్మ : అవసరం లేదు వార్డ్ బెడ్ పై .......
అమ్మా ప్లీజ్ , ఆ స్పెషల్ రూమ్ ఎక్కడ డాక్టర్స్ ....... ? .
నర్స్ : ఈ ఫ్లోర్ లోనే - వార్డ్స్ ప్రక్కనే రండి మహేష్ సర్ .......
నర్స్ వెనుకువెళ్లి రూంలోని బెడ్ పై కూర్చునేలా బెడ్ సెట్ చేసాము - రూమ్ లగ్జరీగా ఉండటం చూసి గుడ్ అన్నాను .
డాక్టర్స్ : రాధికా ...... , ఈ టాబ్లెట్స్ వేసి మోకాలిపై సాఫ్ట్ మసాజ్ చెయ్యి అంటూ స్ప్రే తెప్పించారు .
థాంక్యూ డాక్టర్స్ ........
డాక్టర్స్ : sorry మహేష్ చూసుకోలేదు . ఇక నా షిఫ్ట్ అయిపోయింది అంటూ నైట్ డాక్టర్ ఇంటికి - ఉదయం వచ్చిన డాక్టర్ రౌండ్స్ కు బయలుదేరారు .
డాక్టర్స్ డాక్టర్స్ ....... నైట్ ఆపరేషన్స్ సక్సెస్ కదా ? .
మార్నింగ్ డాక్టర్ : తను ఇప్పటివరకూ చేసిన ఆపరేషన్స్ అన్నీ సక్సెస్ మహేష్ - నెంబర్ వన్ డాక్టర్ ఈ హాస్పిటల్లో ........
గుడ్ న్యూస్ చెప్పారు డాక్టర్స్ - పిల్లలంతా వారివారి పేరెంట్స్ ను చూస్తున్నారా ? .
డాక్టర్స్ : సాయంత్రం వరకూ ఆగాలి మహేష్ - అప్పుడు కట్లు విప్పుతాము .
అయితే వాళ్ళ సంతోషాలను చూసే వెళతాము - అమ్ ...... అంటీ ఏమంటారు ? .
అమ్మ : ప్యాడ్ - పెన్ అంటూ అందుకుని , ఇప్పటివరకూ మరియు రాత్ర ....... అమ్మా అని పిలిచావు అంటూ చేతిపై గిల్లేసారు .
డాక్టర్స్ - నర్స్ నవ్వుకున్నారు , అదీ అలా అడగండి .
స్స్స్ స్స్స్ ...... అంటూ రుద్దుకుంటూనే , మీరు కోప్పడతారేమోనని .......
అమ్మ : అమ్మ అని పిలిస్తే ఏ అమ్మ కోప్పడుతుంది చెప్పు - అంతకంటే అదృష్టమా .........
అలాగే అంటీ ......
అంతే మళ్లీ గిల్లేసారు .
స్స్స్ స్స్స్ ...... అమ్మ అమ్మ అలాగే అమ్మా - అమ్మా అనే పిలుస్తాను , అంతకంటే సంతోషం నాకు మరొకటి లేదు అంటూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను , అమ్మా ...... కోప్పడరంటే ఒక విషయం అడుగుతాను .
అమ్మ : ఊ .......
అమ్మా ....... ఆ డొక్కు మొబైల్ లో డైమండ్స్ ఏమైనా దాచారా ? అలా గట్టిగా పట్టేసుకున్నారు .
అమ్మ : నవ్వుకుని , ముందు బ్యాగు సంగతి చెప్పు ? అంటూ ముందే తెలిసినట్లు అడిగారు .
అమ్మా అదీ అదీ ......
నర్స్ : ఇంకెందుకు నసుగుతున్నారు మహేష్ సర్ - మేడం ...... మీ బ్యాగుతోపాటు మహేష్ సర్ బ్యాగుని కూడా దొంగలు ఎత్తుకుపోయినట్లు హాస్పిటల్ సీసీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది .
అమ్మ : హమ్మయ్యా బ్యాగు పోయింది ఇక నా ఐడెంటిటీ నేను చెబితేనేకానీ ఎవ్వరూ తెలుసుకోలేరు అంటూ రాసి ఆనందిస్తున్నారు .
అమ్మా ...... ఇంట్లోనుండి పారిపోయి వచ్చారా అన్నట్లు నలుగురమూ చూస్తున్నాము .
అమ్మ : నో నో నో ...... అలా చూడకండి అంటూ రాసి నవ్వుతున్నారు - నాకున్నది ఓకేఒక్కరు నా ప్రాణం , తను ఇప్పుడిప్పుడే తన ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది , నాకు ఇలా జరిగిందని నా మొబైల్ నుండి కాల్ చేసి ఉంటే ఈపాటికి ఆ సంతోషం నుండి ఇక్కడకు వచ్చేసి బాధపడేది అందుకు .......
డాక్టర్స్ : మరి మీకేమైనా జరిగి ఉంటే - మిమ్మల్ని ....... ? .
నన్ను చూసుకోవడానికి మహేష్ ఉన్నాడు కదా - మహేష్ ఉండగా నాకేమౌతుంది చెప్పండి ....... , మహేష్ ...... నాకు నయమయ్యేంతవరకూ చూసుకుంటావు కదూ ........ ప్లీజ్ ప్లీజ్ - నిన్ను ఏమాత్రం ఇబ్బందిపెట్టను , ఇంటిని శుభ్రన్గా ఉంచుతాను - రుచికరమైన వంట చేస్తాను .......
యాహూ యాహూ ...... అంటూ సంతోషంతో కేకలువేస్తూ డాన్స్ చేస్తున్నాను - అంతకంటే ఆనందమా అమ్మా అదృష్టంలా భావిస్తాను - ప్లీజ్ ప్లీజ్ కదమ్మా ...... రేయ్ మహేష్ అంటూ ఆర్డర్ వెయ్యండి - మిమ్మల్ని అమ్మలా చూసుకుంటాను - వంటలు కూడా నేనే చేస్తాను - కాలు కిందపెట్టనీకుండా చూసుకుంటాను ప్లీజ్ ప్లీజ్ మన ఇంటికి రా అమ్మా .......
అమ్మ ఆనందాలకు అవధులే లేవు - ఊ ఊ అన్నారు .
డాక్టర్స్ : వంటలు కూడానా ? .
బెట్ వేస్తున్నాను , మీకంటే బాగా వండుతాను .
డాక్టర్స్ : What ....... ? - ఓవర్ కాన్ఫిడెన్స్ .......
ఓన్లీ కాన్ఫిడెన్స్ డాక్టర్స్ ....... , నా గురువుల గురించి తెలిస్తే మీరు ఇలా మాట్లాడారు .
డాక్టర్స్ : ఎవరేమిటి ? .
మా పెద్దమ్మ మరియు అంటీ .......
డాక్టర్స్ : అయితే వెనకడుగు వెయ్యాల్సిందే ...... , ఎప్పుడు పార్టీకి పిలుస్తావో చూద్దాము .
అంతకంటే సంతోషమా డాక్టర్స్ ...... , అతిత్వరలో పిలుపు వస్తుంది .
వేచిచూస్తూ ఉంటాము మహేష్ ...... , అమ్మో ...... పిల్లలకు కాలేజ్ టైం అవుతోంది - రౌండ్స్ కు వెళ్ళాలి అంటూ డాక్టర్స్ వెళ్లిపోయారు .