Update 64
అమ్మ సంతోషంతో దిష్టి తియ్యడం చూసి తెగ ఆనందం వేసింది .
అమ్మ : మహేష్ ఇంత త్వరగా ఇంత దగ్గరవుతాము అనుకోలేదు - అమ్మ పిలుపులో ఉండే గొప్పతనం అదేనేమో ........
నేనైతే రక్తపు మడుగులో ఉన్న మిమ్మల్ని చూడగానే ..... ఇక్కడ తెలిసిపోయింది .
అమ్మ : నా చీరపై - నీ షర్ట్ పై మరియు రోడ్డుపై అంత రక్తం పోయింది , మరి రక్తం ఎవరు ఇచ్చినట్లు మహేష్ ........
అదీ అదీ .......
నర్స్ : ఆ విషయాలన్నీ మీ అమ్మకు ఎప్పుడో తెలుసు మహేష్ సర్ , కన్నీళ్ళతో గుండెలపై వాల్చుకుని ప్రాణంలా హాస్పిటల్ కు తీసుకురావడం - ప్రమాదం అని తెలిసికూడా రెండు ప్యాకేట్స్ రక్తం ఇవ్వడం దగ్గర నుండి మనం రాత్రంతా మాట్లాడుకున్న మాటలు - మీరు చేతిని వదలకుండా నిద్రపోకుండా ప్రాణంలా చూసుకోవడం అన్నీ తెలుసు ....... , ఈ విషయం తెలుసా ....... మీరు పడుకోగానే మేడం లేచి మీకు ప్రేమతో జోకొట్టి నిద్రపుచ్చారు , నేను - డాక్టర్స్ చూసాము ...... , పైగా ఏమీ ఎరుగనట్లు మిమ్మల్ని ఆటపట్టించారు .......
ఆఅహ్హ్ ....... అంటూ గుండెలపై చేతినివేసుకుని పరవశించిపోతున్నాను - అందుకే అంత హాయిగా అలా నిద్రపోయాను - అమ్మా ...... గుర్తుచేసుకుంటే నవ్వు వస్తోంది ........
నర్స్ : అవునవును ఎన్ని sorry లు చెప్పారో తెలుసా అంటూ నవ్వుకున్నారు .
అమ్మ : sorry మహేష్ ....... అంటూ చూయించారు .
నో నో నో అమ్మా ...... , నాకు ఇష్టమే ....... , మా అమ్మతో ఎలా ఉండాలని ఆశపడ్డానో ఆ కోరిక తీర్చారు లవ్ ....... థాంక్యూ థాంక్యూ సో మచ్ అమ్మా అంటూ ఆనందబాస్పాలతో yes yes అంటూ గదిమొత్తం రౌండ్స్ వేస్తున్నాను .
అమ్మ : అమ్మతో ఆశపడ్డాను అంటే అమ్మ ........
కన్నీటి చెమ్మను తుడుచుకుని , అమ్మా ...... ఈ సంతోష సమయంలో అవన్నీ ఎందుకు , బాత్రూం శుభ్రంగా ఉంది నర్స్ సహాయంతో మీరు ఫ్రెష్ అయితే నేనువెళ్లి టిఫిన్ తీసుకొస్తాను - టాబ్లెట్స్ వేసుకోవాలికదా .....
నర్స్ : నో నో నో ఈరోజంతా ఉంటారనుకుని అమ్మకు చెప్పేసాను మనందరికీ రెడీ చేయమని .......
సిస్టర్ ...... అమ్మకు ఎందుకు ఇబ్బంది .
అమ్మ అన్నారు - నన్ను ...... సిస్టర్ అని ఆప్యాయంగా పిలిచారు ఈమాత్రం చేయకపోతే ఎలా ? - అక్కడ రెడీ అయిపోతోంది , ఒక్కనిమిషం ఆగండి ఇప్పుడే ఇప్పుడే వచ్చేస్తాను అంటూ బయటకు పరుగులుతీశారు .
అమ్మ : చేతిని వదలకు అని డాక్టర్స్ చెప్పారుకదా - ఎంతసేపయ్యిందో తెలుసా అంటూ రాసినది చూయించి చేతిని చాపారు .
లవ్ ...... sorry sorry sorry అమ్మా అంటూ సంతోషంగా వెళ్లి చేతిని సున్నితంగా అందుకుని ప్రక్కనే కుర్చీలో కూర్చున్నాను - అమ్మా ...... ఇంకా నొప్పివేస్తోందా అంటూ ప్రాణంలా అడిగాను .
అమ్మ : నువ్వు పంచిన సంతోషంలో ఎప్పుడో హుష్ కాకి అయిపోయింది - లేచి పరిగెత్తమంటావా ? .
నో నో నో అంటూ గుండెలపై చేతినివేసుకున్నాను .
అమ్మ గట్టిగా నవ్వడం అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను .
అమ్మ ...... నా ముఖం ముందు చేతిని ఊపి ఏంటి అని సైగచేసారు ......
ఎందుకో తెలియదు అమ్మా ...... , జీవితాంతం మీఆనందాలను చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది , sorry sorry అమ్మా మనసులో ఉన్నది చెప్పేసాను అంతే , మీ ప్రాణమైన వారిని దూరం చెయ్యాలని కాదు .
( నా మనసులో ఉన్నదే చెప్పావు మహేష్ ) అన్నట్లు సంతోషంతో చిరునవ్వు నవ్వారు .
వచ్చేసా ....... , కొత్త బ్రష్ - పేస్ట్ - కొత్త సోప్ - కొత్త టవల్ - కొత్త సారీ - కొత్త లంగా ....... జాకెట్ మాత్రం సరిపోయేది లేదు మేడం .
ప్చ్ ...... అంతా నావల్లనే , sorry అమ్మా .......
అమ్మ : నో నో నో ...... , బ్యాగు పోవడంతో మోస్ట్ హ్యాపీఎస్ట్ అమ్మను నేనే అని చెప్పానుకదా , కొద్దిగా కూడా ఫీల్ అవ్వకు మహేష్ , పైగా నీకే బోలెడన్ని థాంక్స్ లు చెప్పుకోవాలి , ఇలా చైన్ స్నాచింగ్ జరగకపోయుంటే ప్రాణంలా చూసుకునే నిన్ను కలిసేదానినా చెప్పు , అంతా ఆ తల్లి దుర్గమ్మ ఆడించే ఆట ...... , ALL IS WELL ........
థాంక్యూ అమ్మా దుర్గమ్మా ...... , ఇలా కలవాలని కోరుకోలేదు కానీ అమ్మను కలవడంతో మోస్ట్ మోస్ట్ హ్యాపీఎస్ట్ పెర్సన్ ను నేనే అంటూ భక్తితో మొక్కుకున్నాను , అమ్మా ...... మీరు ఫ్రెష్ అవ్వండి అంతలోపు ఖచ్చితంగా చేయవలసిన ఒక పని ఉంది పూర్తిచేసుకుని వచ్చేస్తాను .
అమ్మ : ప్చ్ ప్చ్ .......
ఆఅహ్హ్ ...... yes yes yes ఇదేకదా నాకు కావాల్సినది - అమ్మా ..... తప్పకుండా వెళ్ళాలి లేకపోతే వెళ్ళేవాడినా చెప్పండి - మీరు ఫ్రెష్ అయ్యేలోపు మీ ముందు ఉండకపోతే క్షణానికొక దెబ్బ వెయ్యండి ........
అమ్మ : సరే అయితే తొందరగా వచ్చెయ్యి జాగ్రత్త ......
లవ్ ...... థాంక్యూ అమ్మా ......
నర్స్ : టిఫిన్ తేవడానికైతే కాదుకదా ......
కాదు కాదు సిస్టర్ .......
స్స్స్ .......
డోర్ వరకూ వెళ్లినవాడిని అమ్మా అమ్మా ..... అంటూ కంగారుపడుతూ వెనక్కువచ్చాను .
నర్స్ : వీల్ చైర్ లేదుకదా కాస్త మేడం ను బాత్రూం లోపలకు వదిలితే .......
అమ్మా .......
అమ్మ : ఊ ఊ .......
అమితమైన సంతోషంతో అమ్మను జాగ్రత్తగా ఎత్తుకుని బాత్రూమ్లోకివెళ్లి నెమ్మదిగా కిందకుదించాను - అమ్మా ...... నొప్పి ? .
అమ్మ : కాసేపేకదా ...... , నువ్వుమాత్రం తొందరగా వచ్చెయ్యి .......
సిస్టర్ ....... అమ్మ జాగ్రత్త అనిచెప్పి అమ్మను వదల్లేక వదల్లేక వదిలి రూమ్ బయటకువచ్చి పరుగులుతీసాను .
జిప్సీ ఎక్కి స్టార్ట్ చేసి వేగంగా ఇంటికి చేరుకున్నాను , దివ్యక్క దేవకన్య చెల్లెమ్మ మొదలుకుని సిస్టర్స్ వరకూ షాపింగ్ చేసిన ప్రతీసారీ అమ్మలకోసం షాపింగ్ చేసి భద్రంగా ఉంచిన కింద గదిలోకివెళ్ళాను .
సారీస్ అంటూ మొదటి వార్డ్రోబ్ ఓపెన్ చేస్తే దాని నిండా నగలు - రెండవ వార్డ్రోబ్ ఓపెన్ చేస్తే మేకప్ ఐటమ్స్ , సారీస్ ఎక్కడబ్బా అంటూ పెద్దవైన థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వార్డ్రోబ్స్ ఓపన్ చేస్తే వందల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ ....... , అందులోనుండి 10 పట్టుచీరలు - 10 కాటన్ చీరలు - 10 ఫాన్సీ సారీస్ - 10 లైట్ గా ఉంటే లైనెన్ సారీస్ - 10 బెనారస్ సారీస్ ...... ఇలా రకానికి 10 చొప్పున మరియు ఒక పెద్ద కట్ట డబ్బు తీసుకుని జిప్సీలో కాకుండా దివ్యక్క రోవర్లో ఉంచుకుని , నేరుగా నా దేవకన్యలు షాపింగ్ చేసిన ప్రతీసారీ స్టిచస్ కు ఇచ్చే షాప్ కు చేరుకున్నాను .
మహేష్ సర్ ...... మేడమ్స్ రాలేదా అంటూ పలకరించారు ఓనర్ సిస్టర్ ......
సిస్టర్ ...... పెద్ద హెల్ప్ చెయ్యాలి , సమయమేమో తక్కువ - రెడీ చెయ్యాల్సినవేమో ఎక్కువ , ఎంతమందితో రెడీ చేయిస్తారో తెలియదు అదిగో బయట కారులో ఉన్న సారీస్ మొత్తానికి జాకెట్స్ మరియు మరియు ......
ఓనర్ : లంగాలు అంతేకదా ఎందుకు సిగ్గుపడతారో .
అవునవును ఎంతమంది ఉంటే అంతమందినీ రప్పించండి రేపు సూర్యోదయం లోపు రెడీ అయిపోవాలి ఇదిగోండి అడ్వాన్స్ - టైం లోపు పూర్తిచేస్తే మీరు అడిగిన అమౌంట్ ఇస్తాను ప్లీజ్ ప్లీజ్ సిస్టర్ .......
ఓనర్ : ఆర్డర్ వెయ్యండి సర్ ...... , మేడమ్స్ అంటే మాకు చాలా ఇష్టం , మొదట మీవి పూర్తయ్యాకనే వేరే వాటిని మొదలెడతాము , గర్ల్స్ ...... వెళ్లి కారులో ఉన్న సారీస్ అన్నింటినీ తీసుకురండి ........ , మహేష్ సర్ చాలా సారీస్ ఉన్నాయి - ఎంతమందికి ? .
ఒక్కరికే సిస్టర్ .......
ఓనర్ : ఒక్కరికేనా ...... ? , వారెవరో అదృష్టవంతులు .......
సంతోషంతో నవ్వుకున్నాను .
ఓనర్ : మహేష్ సర్ ....... , sample జాకెట్ తీసుకొచ్చారా ? .
లేదు సిస్టర్ ......
ఓనర్ : మరి సైజస్ ఎలా ? .
కదా ...... , సిస్టర్ నాతోపాటు వస్తారా ? - వారిని చూయిస్తే తెలుసుకోగలరా ..... ఎందుకంటే ఒక చిన్న తప్పు జరిగింది , వారికి తెలియకుండా ఇలా .......
ఓనర్ : సర్ప్రైజ్ అని చెప్పండి , పదండి ట్రై చేద్దాము నా experiance అంతా ఉపయోగిస్తాను .
అక్కడ మాత్రం మీరు ..... ఫలానా అని తెలియకూడదు - వారు హాస్పిటల్లో ఉన్నారు అని వివరించాను .
ఓనర్ : తెలియనే తెలియదు పదండి .......
థాంక్యూ సిస్టర్ - అమ్మో ...... సమయం పరుగులుతీస్తోంది అంటూ కారులో హాస్పిటల్ చేరుకుని వడివడిగా రూమ్ దగ్గరికి చేరుకున్నాను , భయంతో లోపలికి తొంగిచూస్తే ఇంకా బాత్రూమ్లోనే ఉండటంతో హమ్మయ్యా అనుకున్నాను .
అంతలో లోపలనుండి మేడం మేడం జాగ్రత్త అంతే కూర్చోండి ok కదా అంటూ సిస్టర్ మాటలు వినిపించాయి .
అమ్మ బెడ్ పై కూర్చున్నారు అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను .
ప్యాడ్ - పెన్ ఇదిగోండి అంటూ నర్స్ మాటలు , ok ..... మహేష్ ఇంకా రాలేదుకదా ...... , సెకన్స్ కౌంట్ చెయ్యి ...... అని చదివింది నర్స్ .
నవ్వుకున్నాను - సిస్టర్ ...... బెడ్ పైకూర్చుని ఉంటారు వారే ......
ఓనర్ : ఇక నాకు వదిలెయ్యండి మహేష్ సర్ .......
మేడం ...... ఒకసారి బయట చూస్తాను ఉండండి అంటూ నవ్వుకుంటూ వచ్చింది నర్స్ ......
ష్ ష్ ష్ .......
నర్స్ : Ok ok మహేష్ సర్ - ఇంతకూ వీరెవరు ? .
అదీ అదీ .......
ఓనర్ : రూమ్ క్లీనింగ్ మేడం అంటూ మూలన ఉన్న బ్రూమ్ స్టిక్ అందుకున్నారు .
నర్స్ : ఇంతకుముందెప్పుడూ చూడనేలేదే ......
ఓనర్ : కొత్తగా చేరాను మేడం ......
నర్స్ : Ok ok రండి అంటూ పిలుచుకునివెళ్లింది - మేడం ఇంకా రాలేదు , కౌంట్ చెయ్యమంటారా ? , అమ్మో కోపమే ...... ఎంత ఇష్టం అయితే ఇంత కోపం వస్తుంది కూల్ కూల్ ...... , రానివ్వనీ చెబుతానంటారా ? అంటూ నవ్వుతోంది .
ప్రక్కనే వార్డ్స్ లలో రాత్రి కంటి ఆపరేషన్ చేసుకున్న 10 మంది పిల్లలు ఎప్పుడెప్పుడు ఈ ప్రపంచాన్ని చూస్తామా అన్నట్లు పేరెంట్స్ ఒడిలో ఆడుకుంటున్నారు .
చాలా ఆనందం వేసింది - డాక్టర్ గారిని తలుచుకున్నాను , వెంటనే లోకల్ ఆన్లైన్ షాపింగ్ ఓపెన్ చేసి 10 టెడ్డీ బీర్స్ - గిఫ్ట్స్ - చాక్లెట్స్ - డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి హాస్పిటల్ స్పెషల్ రూమ్ కు డెలివరీ పెట్టాను , గంటలో డెలివరీ ఇస్తే అమౌంట్ డబల్ పే చేస్తాను అని స్పెషల్ గా మెన్షన్ చేసాను .
15 నిమిషాల తరువాత ఓనర్ బయటకువచ్చి , డన్ అంటూ సైగచేసారు .
థాంక్యూ ...... , సిస్టర్ ...... క్యాబ్ లో వెళ్లగలరా ప్లీజ్ ......
ఓనర్ : అర్థం చేసుకోగలను - లోపల చాలా కోపంతో ఉన్నారు - ఎన్ని దెబ్బలుపడతాయో మీకు అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు .
అమ్మ దెబ్బలకోసమే కదా ఇక్కడ వేచిచూస్తున్నది , అమ్మా ..... మే ఐ కం ఇన్ అంటూ డోర్ నాక్ చేసాను .
కం ఇన్ అంటున్నారు మేడం ...... అంటూ నర్స్ మాటలు వినిపించాయి .
కమింగ్ అంటూ లోపలకువెళ్లి డోర్ క్లోజ్ చేసి అమ్మవైపు చూసాను , బుంగమూతిపెట్టుకుని కోపంతో చూస్తున్న అమ్మనుచూసి చాలా సంతోషం వేసింది - నవ్వుకుంటూ వెళ్లి చేతులుకట్టుకుని బుద్ధిమంతుడిలా నిలబడ్డాను , సో సో soooo sorry అమ్మా ....... కొద్దిగా ఆలస్యం అయ్యింది .
అమ్మ : కొద్దిగా కాదు 16 నిమిషాల ఆలస్యం , 16 multiplies 60 సెకండ్స్ ఈక్వల్ టు 960 దెబ్బలు ..... అంటూ రాశారు .
ఇంకొక 40 కలిపి 1000 దెబ్బలు వెయ్యండి అమ్మా అప్పటికి కానీ బుద్ధిరాదు అంటూ వీపుచూయిస్తూ కూర్చున్నాను .
నర్స్ : మేడం .......
అమ్మ : 16 మినిట్స్ ముందుగానే వచ్చాడని చెప్పబోతున్నావు అంతేనా .......
నర్స్ : మేడం మీకెలా తెలిసింది ? .
అమ్మ : బిడ్డ కదలికలు అమ్మకు తెలియవా ఏమిటి ? .
ఆఅహ్హ్ ....... అమ్మా టచ్ చేశారు అంటూ బెడ్ పైకి వెనక్కు వాలిపోయి ఫీల్ అవుతున్నాను .
అమ్మ : జాగ్రత్త అంటూ ముందుకువచ్చి నవ్వుకున్నారు - రాధికా ...... నువ్వు బయటకువెళ్ళిచూసి రాలేదు మేడం అంటూ నవ్వుతూ చెప్పగానే ఫిక్స్ అయిపోయాను .
అమ్మా అమ్మా ...... కనీసం 100 దెబ్బలైనా వెయ్యండి - అమ్మ దెబ్బల రుచి తెలియకుండా పెరిగాను .
అమ్మ : బుగ్గను గిల్లుతూ కూర్చోబెట్టి , బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ...... చాలు అమ్మా చాలు అంటూ సంతోషంతో కేకలువేస్తూ మళ్లీ బెడ్ పైకి వాలిపోయాను .
అమ్మ సంతోషపు నవ్వులు ఆగడం లేదు .
నర్స్ : మీరు ఇలానే ఆనందిస్తూ ఉండండి నేనువెళ్లి టిఫిన్ తీసుకొస్తాను అంటూ ఇలా వెళ్లి అలా తీసుకొచ్చింది .
మహేష్ సర్ - మేడం ....... ఇడ్లీ - వడ - సాంబార్ - చట్నీ అంటూ పెద్ద క్యారెజీని టేబుల్ పై ఉంచి ఓపెన్ చేసి ముగ్గురికీ వడ్ఢిస్తోంది .
సిస్టర్ ....... డాక్టర్ గారికి కాల్ చేసి ఇవ్వండి .
Ok .......
స్పీకర్ ఆన్ చేసి , డాక్టర్ గారూ ...... నేను మహేష్ ను - అమ్మ ఏమైనా తినొచ్చుకదా ? .
" sorry మహేష్ ...... , ఈ ఒక్కరోజుకు సాఫ్ట్ గా ఉన్నవి తింటే బెటర్ , లైక్ ఇడ్లీ - ఉప్మా ...... "
ఇడ్లీ తినొచ్చు అన్నమాట - మరి వడ ? .
" నో నో నో ...... నో ఆయిల్ ఫుడ్ - గొంతులో గసగస అంటుంది , రేపటి నుండి ఏదైనా తినొచ్చు "
నిన్నకూడా ఇలానే అన్నారు డాక్టర్ .......
మొబైల్లో డాక్టర్ తోపాటు అమ్మకూడా నవ్వుతున్నారు .
అమ్మా ...... విన్నారుకదా ఓన్లీ ఇడ్లీ .......
అమ్మ : నాకు వడలంటే చాలా ఇష్టం మహేష్ .......
అమ్మా ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కరోజు .......
అమ్మ : ఈ ఒక్కరోజు ఆగుతాను రేపటి నుండి ఇష్టమైనవన్నీ తినేస్తాను .
అమ్మకు ఇడ్లీ - సాంబార్ - చట్నీ అందించి , ఇడ్లీ - వడ కాంబినేషన్ చూడగానే టెంప్ట్ అయిపోయి కోల్డ్ ఉన్నప్పటికీ కుమ్మేసాను , సిస్టర్ ...... ఇడ్లీ - వడ సూపర్ ,వడ అయితే కిరాక్ .......
అమ్మ కోపంతో చూస్తుండటం చూసి నవ్వుకున్నాము .
తిన్నాక అమ్మ ...... టాబ్లెట్స్ వేసుకున్నారు - నేను వెనక్కు తిరగడంతో మోకాలికి స్ప్రే చేసి సున్నితంగా మసాజ్ చేసింది సిస్టర్ ...... , అమ్మను నవ్విస్తూ సమయమే తెలియలేదు , 11:30 సమయంలో డోర్ నాక్ చేసి డెలివరీ అన్నారు .
హాస్పిటల్లో అదికూడా కాసేపటి కింద మనం ఎంటర్ అయిన ఈ గదికి డెలివరీ ఏమిటి అంటూ ఆశ్చర్యపోతూనే వెళ్లి డోర్ తెరిచింది సిస్టర్ .......
డెలివరీ బాయ్స్ ఐదుగురు చకచకా గదిమొత్తం నింపేసి బిల్ ఇచ్చారు - క్షణాల్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసి సంతకం చేసాను .
డబల్ అమౌంట్ ....... థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ సర్ అంటూ హ్యాపీగా వెళ్లిపోయారు .
ఇంత త్వరగా డెలివరీ ఇచ్చినందుకు మీకే థాంక్స్ బ్రదర్స్ అనిచెప్పి వెనక్కుతిరిగాను .
బెడ్ పై తప్ప రూమ్ మొత్తం ఆక్రమించేసిన గిఫ్ట్స్ ను 180 డిగ్రీస్ లో షాకింగ్ గా చూస్తున్న అమ్మ - నర్స్ ను చూసి నవ్వుకున్నాను .
నర్స్ షాక్ లోనే గిఫ్ట్ బాక్సస్ లో ఏవేవి ఉన్నాయో చూస్తోంది , మేడం ..... టెడ్డీ బేర్స్ - టాయ్స్ - బార్బీ డ్రెస్సెస్ - బిగ్ బిగ్ చాక్లెట్స్ ....... అంటూ చూయిస్తోంది .
అమ్మ : సైగలతో నర్స్ నుండి బుజ్జి టెడ్డి బేర్ ను అందుకుని , సో క్యూట్ అంటూ హత్తుకున్నారు - థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ , ఇందుకుకాదు మహేష్ అన్నా మహేష్ పేరు అన్నా నాకు ఎంత ఇష్టమో ......
అమ్మలకు కూడా టెడ్డీ బేర్స్ అంటే ఇంత ఇష్టమని ఇప్పుడే తెలిసింది నాకు ........
అమ్మ : అంటే ఇవన్నీ మాకోసం కాదా .......
కాదు .......
అంతే ఇద్దరూ భద్రకాళీల్లా చూస్తున్నారు .
అమ్మ : మరి ఎవరికోసం అంటూ దివ్యక్క - చెల్లెమ్మ - దేవకన్యలా ....... టెడ్డీ బేర్ ను వదలకుండా చుట్టేశారు .
నవ్వుకున్నాను - చెబుతాను అమ్మా ....... , సిస్టర్ ...... కాల్ చేసి డాక్టర్ గారు ఫ్రీగా ఉంటే రమ్మని చెప్పు .
నర్స్ : అవును ఈపాటికి రౌండ్స్ పూర్తయ్యే ఉంటాయి అంటూ కాల్ చేసింది - మహేష్ సర్ ...... ఇక్కడికే వస్తున్నారట , అదిగో డోర్ తెరుచుకుంది .
గిఫ్ట్స్ వలన సగం మాత్రమే తెరుచుకున్న డోర్ నుండి కాస్త ఇబ్బందిపడుతూనే లోపలికివచ్చి చూసి , అమ్మలానే ఆశ్చర్యపోయారు , టెడ్డీ బేర్ ....... నాకు నాకు అంటూ ఏకంగా నర్స్ నుండి లాక్కుని అమ్మలా ఇష్టంగా హత్తుకున్నారు .
మీకు కూడా ఇష్టమేనా ? డాక్టర్ గారూ ......
డాక్టర్ : చాలా అంటే చాలా ...... , అంటే నాకోసం కాదా ....... , అన్నీ మీ అమ్మకేనా అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
ఇలా అస్సలు expect చెయ్యలేదు అంటూ ఆనందించాను .
అమ్మ : ప్యాడ్ అందుకుని , ఈ అమ్మకోసం కూడా కాదట డాక్టర్ - నేనైతే ఇవ్వను అంటూ రాశారు .
డాక్టర్ : మరి ఎవరికోసం ? , నేనుకూడా ఇవ్వను అంటూ గిఫ్ట్స్ ను ప్రక్కకు జరుపుకుంటూ వెళ్లి అమ్మప్రక్కన కూర్చుని గుసగుసలాడుకుంటున్నారు .
సంతోషించి , అమ్మా - డాక్టర్ గారూ ...... ఎవరికో తెలుసుకోవాలని ఉందా ? .
డాక్టర్ : అసూయగానూ ఉంది .......
అవునన్నట్లు అమ్మ తలఊపారు .
అయితే వారిముందే బుంగమూతిపెట్టుకోండి , దానికోసం మీరు కళ్ళు మూసుకోవాలి - నేను తెరవండి అని చెప్పేంతవరకూ తెరవకూడదు .
డాక్టర్ : బుంగమూతిపెట్టుకోవడం కాదు వాళ్ళను కొట్టి అయినా లాగేసుకుంటాములే పదా పదా - అమ్మను ఎత్తుకోమరి ........
అమ్మా ..... Are you ready ? .
వాళ్ళ భరతం పట్టడానికి రెడీ అన్నట్లు ఒకచేతితో టెడ్డి బేర్ ను హత్తుకునే మరొకచేతిని విశాలంగా చాపారు ఎత్తుకోమని ........
చూద్దాము అమ్మా ...... ఎలా భరతం పడతారో అంటూ చిరునవ్వుతో వెళ్లి అమ్మను ఎత్తుకున్నాను .
డాక్టర్ : అవునవును నేనుకూడా భరతం పడతాను - లేకపోతే ఇన్ని బ్యూటిఫుల్ టెడ్డీ బేర్స్ అన్నీ వాళ్లకేనట ఎలా ఒప్పుకుంటాం వదిలేదేలేదు .
సరే సరే చూద్దాము - అంతకంటే ముందు కళ్ళుమూసుకోవాలని చెప్పానుగా ......
డాక్టర్ : sorry sorry , మళ్లీ నువ్వు తెరవమనేంతవరకూ తెరవము అంటూ ముగ్గురూ గట్టిగా కళ్ళుమూసుకున్నారు , అయ్యో మహేష్ చీకటి అంతా చీకటి ఒక్క అడుగుకూడా వెయ్యలేము - మీ అమ్మను హ్యాపీగా ఎత్తుకున్నావు అందుకే ఎలా నవ్వుతున్నారో చూడు .......
అవునవును మహేష్ సర్ అంటూ నర్స్ కూడా చెప్పింది .
Ok ok ఇద్దరూ నాభుజాలపై చేతులువెయ్యండి మిమ్మల్ని సేఫ్ గా తీసుకెళతాను .
డాక్టర్ - నర్స్ : సూపర్ ...... , ఎక్కడ ఎక్కడ అంటూ కళ్ళుమూసుకునే చేతులతో తడుముతూ చెరొకభుజంపై చెరొక చేతినివేసి లెట్స్ గో అన్నారు .
టెడ్డీ బేర్స్ ను మాత్రం ముగ్గురూ వదలడం లేదు - చూద్దాము ఎంతవరకూ అలా హత్తుకుంటారో .......
ఎంతవరకూ ఏమిటి ఇవి మాసొంతం అంటూ అమ్మ - డాక్టర్ - నర్స్ చిరుకోపంతో నవ్వుతున్నారు , ఇంతదూరం త్వరగా తీసుకెళ్లు .......
దగ్గరలోనే జస్ట్ ఫ్యూ స్టెప్స్ అంతే కళ్ళు మాత్రం తెరవకూడదు - మీ పాదాలముందు గిఫ్ట్స్ ఉన్నాయి నెమ్మదిగానే తీసుకెళతాను - ఇదిగో గది బయటకువచ్చేసాము .
డాక్టర్ : మాటిచ్చాముగా ...... మళ్ళీ నువ్వు తెరవమనేంతవరకూ తెరవము ఎన్నిసార్లు చెబుతావు .
Sorry sorry కూల్ కూల్ డాక్టర్ గారూ ....... , కళ్ళు తెరిస్తే ఒక చిన్న సర్ప్రైజ్ ను మిస్ అవుతారని మీకోసమే పదేపదే చెబుతున్నాను .
డాక్టర్ : అయితే ok .......
ఏమిటన్నట్లు అమ్మ కళ్ళు కదులుతున్నాయి .
అమ్మా ...... వీల్ చైర్లో కూర్చోబెట్టబోతున్నాను అంటూ జాగ్రత్తగా కూర్చోబెట్టాను , డాక్టర్ గారూ - సిస్టర్ ....... మీరు చేతులు తియ్యకండి మరికొన్ని స్టెప్స్ ......
డాక్టర్ - సిస్టర్ : Ok ok అంటూ నా భుజాలపై చేతులువేసి వెనుకేవచ్చారు - కొన్ని అడుగుల తరువాత ఇద్దరి చేతులను అందుకుని అమ్మ కూర్చున్న వీల్ చైర్ మీదకు చేర్చి అమ్మా - డాక్టర్ గారూ - సిస్టర్ ...... ఇక కళ్ళు తెరవచ్చు , గిఫ్ట్స్ ఎవరికోసం అని ఆడిగారుకదా మీ ఎదురుగానే ఉన్నారు .
అయిపోయారు అన్నట్లు కోపంతో ముగ్గురూ కళ్ళుతెరిచారు . ఎదురుగా ఇరువైపులా వరుస బెడ్స్ పై పిల్లలు తమ తమ పేరెంట్స్ ఒడిలో ఎప్పుడెప్పుడు వారిని చూస్తామా అన్నట్లు ఆనందిస్తున్నారు , అమ్మా అమ్మా ...... ఇంకెప్పుడు కట్లు తెరుస్తారు అంటూ ఆశతో అడుగుతున్నారు .
పేరెంట్స్ : అదిగో డాక్టర్స్ మేడమ్స్ వచ్చారు .
పిల్లలు : మేడమ్స్ మేడమ్స్ ...... మా కట్లు ఎప్పుడు తెరుస్తారు అంటూ ముద్దుముద్దుగా అడిగారు .
అప్పటికే ముగ్గురి కళ్ళల్లో ఆనందబాస్పాలు తిరిగాయి - వాటిని తుడుచుకుని , పిల్లలూ ...... ఈరోజు సాయంత్రం - ఎంచక్కా అమ్మానాన్నలను మీ సిస్టర్స్ బ్రదర్స్ ను మరియు కాలేజ్ కు వెళ్లి ఫ్రెండ్స్ ను చూడొచ్చు ......
పిల్లలు : మధ్యాహ్నం అన్నారుకదా మళ్లీ సాయంత్రం వరకూ ఆగాలా ..... ? .
అమ్మ ఆశతో డాక్టర్స్ వైపు చూసారు .
డాక్టర్ : సాయంత్రం వరకూ ఆగాల్సిందే అన్నట్లు కళ్ళతో సైగలుచేసారు .
పిల్లలు : చెప్పండి డాక్టర్ , అమ్మానాన్నలను మధ్యాహ్నమే చూడలేమా ? అంటూ అమ్మలను హత్తుకున్నారు .
అమ్మ : పిల్లలూ .......
అమ్మా .......
అమ్మ : మహేష్ ...... , I am perfectly alright నొప్పి ఏమాత్రం లేదు , నువ్విచ్చిన బ్యూటిఫుల్ సర్ప్రైజ్ - పిల్లలు దేవుళ్ళతో సమానం కదా వారితో మాట్లాడితే నొప్పి మరింత దూరం అయిపోతుందిలే కంగారుపడకు .......
స్వీటెస్ట్ స్వీటెస్ట్ స్వీటెస్ట్ షాక్ ....... స్వీటెస్ట్ షాక్ ఆఫ్ మై లైఫ్ , అమ్మ అమ్మ వాయిస్ అమ్మ ...... అమ్మ మాటలకు అమ్మ అని మనసుకు తెలిసిపోయింది , నేను రక్షించుకున్నది మా అమ్మనేనా మహీ ...... అమ్మను కలుసుకున్నాను - ఇలా కలుసుకుంటానని అనుకోలేదు లవ్ యు రా అంటూ కళ్ళల్లో చెమ్మ - ఆనందబాస్పాలతో హృదయంపై చేతినివేసుకుని అమ్మనే చూస్తున్నాను , అందుకేనా అమ్మ రక్తం చూసి ఈ హృదయం అంతలా విలవిలలాడిపోయింది - నా హృదయంలో సగం స్థానాన్ని ఆక్రమించించ నా ప్రాణం కంటే ఎక్కువైన అమ్మనేనా నేను ప్రాణం పెట్టి రక్షించుకున్నది ........
అమ్మ ...... నా కన్నీళ్లను చూసి , sorry sorry మహేష్ మాట్లాడనులే .......
లేదు లేదు అమ్మా ...... అంటూ వెంటనే అమ్మప్రక్కన మోకాళ్లపై చేరి చేతిని అందుకుని ముద్దుపెట్టబోయి ఆగిపోయాను - మీరు చెప్పినట్లు పిల్లలు దేవుళ్ళతో సమానం సంతోషంగా మాట్లాడండి , అవసరమైతే ప్రక్కనే డాక్టర్ గారు ఉన్నారుకదా అంటూ చేతిని బుగ్గపై హత్తుకున్నాను - ఆ చిరు స్పర్శకే హృదయం పరవశించిపోతోంది .
అమ్మకూడా అలానే ఫీల్ అవుతున్నట్లు అనిపించింది - మహేష్ ...... కొత్తగా అనిపించింది , ప్లీజ్ ప్లీజ్ అలాగే బుగ్గపై ఉంచుకో .......
పట్టరాని ఆనందంతో అంతకంటే అదృష్టమా అమ్మా అంటూ బుగ్గపై హత్తుకున్నాను - నాలానే అమ్మ నాకళ్ళల్లోకి కొత్తగా చూస్తున్నారు , మహేష్ ...... ఏదో తెలియని ఫీలింగ్ .......
ఆ ఫీలింగ్ ఏమిటో నాకు తెలిసిపోయింది అమ్మా ....... అంటూ లోలోపలే అంతులేనంత ఆనందిస్తున్నాను , అమ్మా అమ్మా ...... నుదుటిపై - మెడపై - మోకాలిపై నొప్పివేయ్యడంలేదుకదా .......
అమ్మ : ఏమిటి మహేష్ ...... కొత్తగా అడుగుతున్నావు ? .
అమ్మకదా ....... ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవాలికదా అమ్మా ......
అమ్మ : ఏంటి కొత్తగా ....... , నిన్నటినుండీ అంతలా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నావు కదా .......
ఇకపై అంతకుమించి ప్రాణంలా చూసుకుంటాను అమ్మా , చెప్పమ్మా ...... నొప్పివేస్తోందా ? అంటూ కళ్ళల్లో చెమ్మతో అడిగాను .
అమ్మ : ఏంటో కొత్తగా అడుగుతున్నావు ఏమైంది నీకు - ఏమిటా కన్నీళ్లు అయ్యో నాకళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కొద్దిగా కూడా నొప్పివేయ్యడం లేదు నిజం ప్రామిస్ ....... , డాక్టర్ చెప్పొచ్చుకదా అంటూ నా కన్నీళ్లను ప్రాణంలా తుడిచారు .
లేదు లేదు అమ్మా ....... , అమ్మకు నొప్పివెయ్యడం లేదు అంటూ ఆనందిస్తున్నాను - అమ్మా ...... మీరూ కన్నీళ్లను తుడుచుకోండి .
అమ్మ : నీకన్నీళ్ళనూ నేనే తుడిచి నా కన్నీళ్ళనూ నేనే తుడుచుకోవాలా ?.
నర్స్ : మహేష్ సర్ ...... మిమ్మల్ని ప్రేమతో తుడవమంటున్నారు .
లవ్ ...... సంతోషంగా సంతోషంగా అంటూ అమ్మ కన్నీళ్లను తుడిచాను , కీప్యాడ్ మొబైల్ చూసి అమ్మ అని ఫిక్స్ అయిపోయాను - మొబైల్ లో చూసి మాకెక్కడ కాల్ చేస్తారోనని మాసంతోషం మధ్యలోనే ఆగిపోకూడదని మొబైల్ ను వదలకుండా పట్టేసుకున్నారన్నమాట ( లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అమ్మా అంటూ తెగ ఆనందిస్తున్నాను ) .
అమ్మ : థాంక్యూ మహేష్ అంటూ ఆనందిస్తున్నారు .
డాక్టర్ : కాస్త మమ్మల్ని కూడా పట్టించుకోండి అంటూ మా చెవులలో గుసగుసలాడారు .
అంతలో పిల్లలు మరొకసారి అడిగారు , డాక్టర్ ...... మధ్యాహ్నం చూడలేమా అని .......
డాక్టర్ : అదీ అదీ .......
అమ్మ : పిల్లలూ ...... సాయంత్రం వరకూ అని తెలిసే కదా మేము మీదగ్గరకు వచ్చినది - మీకోసం ఏమి తీసుకొచ్చామో తెలుసా ? - సాయంత్రం వరకూ సంతోషంతో ఆడుకోవడానికి మీ అంత పెద్దవైన టెడ్డీ బేర్స్ - బొమ్మలు మరియు డాక్టర్స్ పర్మిషన్ ఇచ్చిన తరువాత తినడానికి బోలెడన్ని చాక్లెట్స్ తీసుకొచ్చాము .
యే యే యే బొమ్మలు - టెడ్డీ బేర్స్ ....... అంటూ సంతోషంతో కేకలువేస్తున్నారు పిల్లలు .......
అమ్మ : ఏమైంది నీకు మహేష్ ....... , అంత ప్రాణంలా కన్నార్పకుండా చూస్తూనే ఉన్నావు , వెళ్లి గిఫ్ట్స్ తీసుకురా .......
( జీవితాంతం ఇలాగే చూస్తుండమన్నా చూస్తూ ఉండిపోగలను అమ్మా ....... ) అమ్మా ...... వాళ్ళతోనే లాక్కుంటామన్నారు ఇప్పుడేమో మీదగ్గర ఉన్నవికూడా మొత్తం మొత్తం ఇచ్చేసేలా ఉన్నారు .
అమ్మ : డాక్టర్ తోపాటు సిగ్గుపడి , ముందు వెళ్లి గిఫ్ట్స్ అన్నీ మొత్తం మొత్తం తీసుకురాపో అంటూ ఆర్డర్ వేశారు .
తీసుకురాపో అంటూ నవ్వుతూ చెప్పారు డాక్టర్ గారు .....
ఆజ్ఞ అమ్మా - డాక్టర్ గారూ అంటూ అమ్మచేతిని నెమ్మదిగా వీల్ చైర్ పై ఉంచి ప్రక్కగదిలోకి పరుగులుతీసాను .
అమ్మనే అమ్మ అని తెలిసిన తరువాత ఇంత ఆనందమా ....... యాహూ యాహూ అంటూ నా హృదయంపై ముద్దులవర్షం కురిపిస్తున్నాను - మై హార్ట్ ...... నీకు ముందే తెలిసిపోయిందికదా అందుకే అంతలా కొట్టేసుకున్నావు సంతోషంతో - నాకే ఇందాక అమ్మ వాయిస్ ను బట్టి తెలిసింది ....... , అమ్మ ....... గిఫ్ట్స్ తీసుకురమ్మన్నారు అంటూ మిగిలిన 7 టెడ్డీ బేర్స్ ను ఒకేసారి ఎత్తుకుని అమ్మ దగ్గరికి చేరుకున్నాను .
అమ్మ : టెడ్డీ బేర్స్ మాత్రమేనా ....... అన్నీ తీసుకురాపో అంటూ చేతిపై కొట్టారు .
లవ్ ...... థాంక్యూ థాంక్యూ అమ్మా , ఇదిగో ఇప్పుడే తెచ్చేస్తాను , అమ్మా ..... నాకు 10 చేతులు లేవుకదా .......
అమ్మ - డాక్టర్ గారు నవ్వుకున్నారు .
మహేష్ సర్ ....... నేనూ హెల్ప్ చేస్తాను అంటూ నర్స్ వెనుకే వచ్చింది .
ఐదారు షిఫ్ట్ లలో మొత్తం గిఫ్ట్స్ అన్నింటినీ తీసుకొచ్చాము - పిల్లల వార్డ్ మొత్తం నిండిపోయింది .
అమ్మో అమ్మో ...... అంటూ పిల్లల పేరెంట్స్ ఆశ్చర్యపోతున్నారు .
అమ్మా అమ్మా నాన్నా ...... ఏమైంది ఏమైంది .
పేరెంట్స్ : మనమున్న వార్డ్స్ మొత్తం బొమ్మలతో నిండిపోయింది .
పిల్లలు : అమ్మా అమ్మా నాన్నా ...... ఎవరికోసం ఎవరికోసం ? .
మీకోసమే పిల్లలూ ........ అంటూ అమ్మ - డాక్టర్ గారు బదులిచ్చి ఆనందిస్తున్నారు
పిల్లలు : మాకోసమా మాకోసమా ....... అంటూ కిందకుదిగడానికి తెగ ఉత్సాహం చూయిస్తున్నారు .
అమ్మ : పిల్లలూ పిల్లలూ ...... టెడ్డీ బేర్ - బొమ్మలు అంటే మీకెంత ఇష్టమో మాకు తెలుసు , మీకీవిషయం తెలుసా ఈ టెడ్డీ బేర్స్ ను చూసి మేమే ఫ్లాట్ అయిపోయాము , మాకు కాదు వేరేవారికి అని తెలియగానే మిమ్మల్ని కొట్టి లాక్కుని వెళదామని వచ్చాము అంటూ నవ్వించారు , నన్ను రమ్మని సైగచేసి నా చేతిని పట్టుకుని పైకిలేచారు .
అమ్మా ........ ok ok నొప్పి ఏమాత్రం లేదు తెలుసు తెలుసు జాగ్రత్త అమ్మా , మీకు చిన్నగా నొప్పివేసినా ఈ హృదయం తట్టుకోలేదు .
అమ్మ : నాకు తెలియదా చెప్పు - నువ్వు పంచిన ఈ ఆనందంలో నొప్పి ఎప్పుడో మాయమైపోయింది , డాక్టర్ నర్స్ ...... మీరు అటువైపు ఇవ్వండి - మేము ఇటువైపు ఇస్తాము .
అమ్మను నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్లి మొదటి బెడ్ పై కూర్చునేలా చేసాను , టెడ్డీ బేర్ - టాయ్స్ - డ్రెస్ - చాక్లెట్స్ తీసుకొచ్చి అమ్మకు అందించగా , పాపా నీకోసం మీ అన్నయ్య .......
అమ్మ అమ్మ ....... పాపా ....... , అమ్మా ...... ప్లీజ్ ప్లీజ్ ......
అమ్మ ఆనందించి , పాపా ...... ఇదిగో అన్ని రంగులతో ముద్దుగా ఉన్న టెడ్డీ బేర్ మరియు బొమ్మలు మరియు పింక్ బార్బీ డ్రెస్ మరియు బిగ్ బిగ్ చాక్లెట్స్ ....... సాయంత్రం ఈ రంగులన్నింటినీ మీ బుజ్జి బుజ్జి కళ్ళతో మీరే స్వయంగా చూడబోతున్నారు అంటూ అందించారు .
పాప : టెడ్డీ బేర్ ....... అమ్మా అమ్మా ఎంత మెత్తగా ఉందో నాకు చాలా చాలా ఇష్టం సాయంత్రం చూడబోతున్నాను , థాంక్యూ డాక్టర్ అంటూ అమ్మను బుజ్జిబుజ్జి చేతులతో తడుముతూ బుగ్గలను అందుకుని చేతులతో ముద్దుపెట్టింది .
అమ్మ : చేతులతోనా ....... ? , నేను బుంగమూతిపెట్టుకున్నాను .
పాప : మీకిష్టమో లేదో అని .......
అమ్మ : ఇంత క్యూట్ క్యూట్ గా ఉండే బుజ్జాయి ముద్దుపెడతాను అంటే ఏ అమ్మైనా కాదంటుందా చెప్పు ....... అంటూ బుజ్జి బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టారు .
పాప : పెదాలపై అందమైన బుజ్జాయి నవ్వులతో ...... , థాంక్యూ అమ్మా ...... అంటూ అమ్మ బుగ్గలను బుజ్జిచేతులతో అందుకుని బుగ్గపై ముద్దుపెట్టింది .
ఆ ముద్దుకు అమ్మ - అటువైపు డాక్టర్ గారు - సిస్టర్ ....... కళ్ళల్లో ఆనందబాస్పాలతో ఒకరినొకరు చూసుకుని మాటల్లో వర్ణించలేని అనుభూతికి లోనౌతున్నారు , నీవల్లనే అంటూ నావైపుకు చూసారు .......
నో నో నో ....... పిల్లల మొత్తం ప్రేమ మీకే చెందాలని ఆ దుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తున్నాను - దుర్గమ్మ తల్లీ ...... నాకు ఇంత అంటే ఇంత కూడా వద్దు ప్లీజ్ ప్లీజ్ .........
అమ్మ - డాక్టర్ గారు - నర్స్ ....... ముగ్గురూ నవ్వుకున్నారు .
అమ్మ : హలో హలో మహేష్ ....... , నువ్వు ఇలా ప్రార్థించినంత మాత్రాన అలానే జరగదు - ఆ దుర్గమ్మ తల్లికి తెలియదనుకుంటున్నావా ? .
అందుకేకదా అమ్మా ....... ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమాలుకుంటున్నది .
అమ్మావాళ్ళు మళ్లీ నవ్వుకుని , పాపా ...... నీ సంతోషం చూస్తుంటే బొమ్మలన్నీ నచ్చినట్లే అన్నమాట - మీ ఫ్రెండ్స్ కు కూడా ఇస్తాము .
పాప : చాలా అంటే చాలా నచ్చాయి , థాంక్యూ అమ్మా అంటూ మరొక ముద్దుపెట్టింది .
అమ్మ : నీ ముద్దు ఎంత తియ్యగా ఉందో అంటూనే నావైపు ప్రాణంలా చూస్తూ నా చేతిని పట్టుకుని లేచి ప్రక్క బెడ్ దగ్గరకు చేరారు .
అలా పిల్లలందరికీ గిఫ్ట్స్ అందించి , వారి అమితమైన ఆనందపు ముద్దులకు అమ్మావాళ్ళు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు , ముగ్గురూ ...... పిల్లలుగా మారిపోయి పిల్లలతో సరదా సరదాగా గడుతుండటం , అమ్మ ఆనందాలను ప్రాణంలా అలా చూస్తూ హృదయమంతా నింపుకుంటున్నాను .
లంచ్ అంటూ వార్డ్ కాంట్రాక్టర్స్ భోజనం తీసుకొచ్చేన్తవరకూ తెలియలేదు అంతలోనే లంచ్ టైం అయ్యిందని .......
పేరెంట్స్ వెళ్లి బెడ్ కు మూడు చొప్పున పార్సిల్స్ తీసుకున్నారు .
అమ్మ - డాక్టర్ : సమయమే తెలియలేదు మీతో గడుపుతుంటే - మీ సంతోషాలను చూస్తుంటే ....... , మీరు హ్యాపీగా భోజనం చెయ్యండి మళ్లీ వచ్చి కలుస్తాము .
పిల్లలు : సరే అమ్మా - డాక్టర్ ...... మీరు వెళ్ళండి , వెళ్ళండి అన్నందుకు sorry అమ్మా ...... , ఎందుకంటే ఈ భోజనం మీరు చెయ్యలేరు , అన్నం సరిగ్గా ఉడికి ఉండదు - అన్నం లోకి రసం మాత్రమే అందులో అదికూడా సప్పగా ఉంటుంది - గుడ్డు అయితే ........
కాంట్రాక్టర్స్ : ఇంత పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో తిండికి కూడా గతిలేని మీకు ఫ్రీగా ఆపరేషన్ చెయ్యడమే గొప్ప ఏదో govt ఇస్తున్న అరకొర ఫండ్స్ తో ఇంత రుచికరమైన భోజనం పెడుతుంటే , పిల్లలతో ఇలా కంప్లైంట్స్ చేయిస్తున్నారా ? .
పిల్లలు : Sorry sorry సర్ ....... , మేము - అమ్మానాన్నలు ...... ఈ భోజనాన్ని సంతోషంగా తింటాము , కొత్తగా మాకోసం మా అమ్మ - డాక్టర్ వచ్చారు ...... వారు ఈ భోజనాన్ని తినలేరు అందుకే వెళ్లిపోమంటున్నాము .
కాంట్రాక్టర్స్ : డాక్టర్ గారు ఉన్నారా ? అంటూ సైలెంట్ అయిపోయారు .
డాక్టర్ : ఏదీ ఆ భోజనాన్ని ఇటు తీసుకురండి ......
కాంట్రాక్టర్స్ : జెన్యున్ గా వంటలు ఉంటాయి మేడం , వీళ్ళు ఎప్పుడూ ఇలానే , ఉచితంగా పెడుతున్నాము కదా ఎన్నైనా మాట్లాడతారు .
డాక్టర్ : మాటలు జాగ్రత్త - మీరేమైనా ఫ్రీగా పెడుతున్నారా ? , govt నుండి పెద్దమొత్తంలోనే తీసుకుంటున్నారుకదా ....... , రాత్రికి క్వాలిటీ ఫుడ్ లేకపోతే కంప్లైంట్ చేయాల్సి వస్తుంది .
కాంట్రాక్టర్స్ : మేడం ...... డీన్ గారే ఇలా చెయ్యమని వీళ్లకు ఇలాంటి ఫుడ్ చాలని సగం అమౌంట్ తీసేసుకుంటున్నారు , మమ్మల్ని ఏమిచెయ్యమంటారు చెప్పండి అనిచెప్పి వెళ్లిపోయారు .
పిల్లలు : పర్లేదు అమ్మా ...... మాకు ఇలాంటి భోజనం అలవాటే , అమ్మానాన్నలు ఉన్న డబ్బునంతా మా కనుచూపుకోసమే ఖర్చుపెట్టేశారు , మాకు చూపు రావడం తప్ప వారికి వేరే సంతోషం ఏమీలేదు అంటూ వారి వారి తల్లుల ఓడిలోకిచేరారు .
పేరెంట్స్ ...... పిల్లలకు తినిపించబోతే , అమ్మ ఆపి ముద్ద రుచిచూశారు , పిల్లలూ ........ ఈ ఫుడ్ ఎలా తింటున్నారు ? , కడుపు నొప్పివేస్తుంది తెలుసా ? .
పిల్లలు : అలాంటిదేమీలేదు అమ్మా ....... , మీరెందుకు తిన్నారు తినకండి తినకండి మీరు వెళ్ళండి అంటూ అమ్మ చేతిని తినకుండా ఆపారు .
అమ్మకళ్ళల్లో చెమ్మ ....... , పిల్లలూ అంటూ ప్రేమతో స్పృశిస్తూ బిరియానీ ఇష్టమేనా మీకు అని అడిగారు .
పిల్లలు : బిరియానీ అంటే చాలా చాలా ఇష్టం అమ్మా ....... , నిన్న బిరియానీని తలుచుకుంటూనే కదా ఈభోజనం తిన్నది అంటూ బుజ్జిబుజ్జినవ్వులతో బదులిచ్చారు .
అమ్మ - డాక్టర్ గారి మనసులు చలించిపోయాయి .
పేరెంట్స్ : తమ పిల్లలకు ఎలాగైనా బిరియానీ తినిపించాలి జేబులోని కొద్దిపాటి డబ్బును మందుల చిట్స్ తోపాటు బయటకుతీసారు .
అమ్మ : వద్దు వద్దు వద్దు ....... మందులకోసం ఉంచుకున్నట్లున్నారు , నాకు తెలిసి ఈపాటికి బిరియానీ దారిలో వచ్చేస్తూ ఉంటుంది అంటూ కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని నావైపు చూసారు .
మా అమ్మ సూపర్ అంటూ దిష్టి తీసి చెమ్మను తుడుచుకుని చిన్న నవ్వు నవ్వాను - డాక్టర్ గారూ , పిల్లలు ....... చికెన్ బిరియానీ - మటన్ బిరియానీ మరియు ఐస్ క్రీమ్స్ తినొచ్చుకదా .......
డాక్టర్ : ఆపరేషన్ తరువాత కంటి నరాలు బలపడాలంటే పోషకాహారం తీసుకోవాలి , మాంసం లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి .
థాంక్యూ డాక్టర్ గారూ ...... , అమ్మా ...... 15 మినిట్స్ .......
అమ్మ : మహేష్ సూపర్ అన్నట్లు సంతోషంతో సైగలుచేసి , పిల్లలూ ...... 15 మినిట్స్ - బిరియానీ వచ్చేస్తోంది .
పిల్లలు : బిరియానీ బిరియానీ అంటూ సంతోషంతో కేకలువేస్తున్నారు .
డాక్టర్ : రాధికా ...... , ఈ ఉడకని ఫుడ్ ను తీసుకెళ్లమని రిసెప్షన్ కు కాల్ చెయ్యి , రాత్రికి క్వాలిటీ ఫుడ్ ఎలా పెట్టరో నేనూ చూస్తాను .
నేను చప్పట్లు కొట్టడంతో వింటున్న పిల్లలు ...... పిల్లలను చూసి అమ్మ సంతోషంతో చప్పట్లు కొట్టారు .
డాక్టర్ : Sorry పిల్లలూ ...... రెండు రోజులుగా ఇలాంటి ఫుడ్ తింటున్నా మేము పట్టించుకోలేదు - ఈ పూటకు మీ అమ్మంటే ప్రాణమైన మహేష్ వలన బిరియానీ తినబోతున్నారు - నేనుకూడా అనుకోండి అంటూ అందరినీ నవ్వించారు .
అమ్మ : పిల్లలూ ...... ఆకలివేస్తోందా ? అంతవరకూ చాక్లెట్ తినండి .
పిల్లలు : అవునవును ...... , అమ్మలూ ...... చాక్లెట్ ఎక్కడే ? అంటూ అందుకుని అమ్మకు - డాక్టర్ - పేరెంట్స్ కు అందించి తిన్నారు , అమ్మా - డాక్టర్ ...... ఇంత పెద్ద - ఇంత టేస్టీ చాక్లెట్ ఇంతవరకూ తిననేలేదు థాంక్యూ అమ్మా .......
అమ్మ : థాంక్స్ మాత్రమేనా ? అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
పిల్లలు : బుజ్జిబుజ్జినవ్వులతో అమ్మ - డాక్టర్ గారి - సిస్టర్ బుగ్గలపై ముద్దులవర్షమే కురిపించారు .
అమ్మ : తన సంతోషాన్ని చూస్తూ హృదయంపై చేతినివేసుకుని మురిసిపోతున్న నన్ను చూసి మరింత ఆనందంతో , ఈ ముద్దులన్నీ నీకే సొంతం అంటూనే ..... మురిసిపోయింది చాలు మహేష్ ....... 15 నిమిషాలు అయ్యింది బిరియానీ ఎక్కడ ? - పిల్లలూ ...... నాకు సపోర్ట్ ఇవ్వచుకదా ......
అమ్మ - పిల్లలు : బిరియానీ బిరియానీ బిరియానీ ....... అంటూ సంతోషంతో కేకలువేస్తున్నారు , డాక్టర్ గారు - సిస్టర్ కూడా జతకలిసి కేకలువేస్తూనే నవ్వుకుంటున్నారు .
టైం చూసుకుని sorry sorry అంటూ గుంజీలు తీసి , బయట చూసొస్తాను అంటూ పరుగులుతీసాను .
అంతలోనే హోటల్ డెలివరీ వెహికల్ హాస్పిటల్ లోకి ఎంటర్ అయ్యింది - చేతితో సైగలుచేస్తూ మెయిన్ డోర్ దగ్గరకు రప్పించాను - ఫాస్ట్ ఫాస్ట్ అంటూ వారికి సహాయం చేస్తూ రెండు పెద్ద పెద్ద బిరియానీ పాత్రలను పట్టుకుని నేరుగా పిల్లల వార్డుకు చేరుకున్నాము , వెనుకే ఐస్ క్రీమ్స్ - కూల్ డ్రింక్స్ - వాటర్ బాటిల్స్ ...... తీసుకొచ్చారు .
పాత్రల మూతలను తెరవగానే అంతవరకూ కేకలువేస్తున్న పిల్లలు - అమ్మావాళ్ళు ...... బిరియానీ ఘుమఘుమలకు ఆఅహ్హ్హ్ ఆఅహ్హ్హ్ ...... అంటూ ఆనందిస్తున్నారు .
నవ్వుకుని , ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేనే స్వయంగా ప్లేట్స్ అందుకుని రెండు బిరియానీలూ వడ్డించుకుని పిల్లల చెంతకు చేర్చాను , పిల్లలూ ...... మీ అమ్మ - డాక్టర్ గారు ఐస్ క్రీమ్స్ - కూల్ డ్రింక్స్ కూడా తెప్పించారు , మీఇష్టం బిరియానీ ముందు తింటారో - బిరియానీతో తింటారో - బిరియానీ తరువాత తింటారో ....... , నా వెనుకే డెలివరీ బాయ్స్ పిల్లలతోపాటు పేరెంట్స్ కు చకచకా వడ్డించారు .
అమ్మ - డాక్టర్ : పిల్లలకు తినిపించి మీరూ తినండి ....... అంటూ పేరెంట్స్ కు చెప్పారు .
పిల్లలు : అమ్మా ...... మీరూ తినండి .
అమ్మ : ఈరోజంతా తినకూడదు - అదిగో నేనిక్కడ తింటానో గొంతు నొప్పివేస్తుంది ఎలా కన్నింగ్ గా చూస్తున్నాడో చూడు మీ అన్నయ్య .......
అమ్మా ....... డాక్టర్ గారు ok అంటే నాకేమీ ఇబ్బందిలేదు - డాక్టర్ గారూ ...... జెన్యున్ గా చెప్పండి .
డాక్టర్ : మహేష్ ....... రాత్రే చెప్పానుకదా మా ట్రీట్మెంట్ కంటే ఈ సంతోషమే త్వరగా కోలుకునేలా చేస్తుంది కాబట్టి హ్యాపీగా తినవచ్చు .......
అమ్మ : ఇక తినొచ్చా మహేష్ .......
లవ్ ...... సంతోషంగా అమ్మా అంటూ హృదయంపై చేతినివేసుకుని , అమ్మకు - డాక్టర్ గారికి వడ్డించాను .
అమ్మ : థాంక్యూ థాంక్యూ థాంక్యూ ...... ఎదురుగా బిరియానీ ఉండి తినకపోతే అంతకంటే నరకం మరొకటి లేదు పిల్లలూ ...... మీతోపాటే తింటాను అంటూ సంతోషంతో చెప్పారు .
మరి నాకు మహేష్ సర్ అంటూ నర్స్ అడిగింది .
సిస్టర్ ...... ముందు ఇక్కడున్నవన్నీ తీసుకుని పైనున్న అమ్మకు ఇచ్చివచ్చిన తరువాతనే .......
నర్స్ : కదా ....... , ఈ సంతోషంలో అమ్మ సంగతే మరిచిపోయాను థాంక్యూ సో మచ్ మహేష్ సర్ అంటూ తీసుకెళ్లింది .
పిల్లలు : అమ్మా నాన్నా ....... ఐస్ క్రీముతోపాటు తినిపించండి చాలా బాగుంది .
అమ్మ : అవునవును చల్లగా ఉంటుంది అంటూ అందరికీ వడ్డిస్తున్న నన్ను పిలిచి ముందు నా మహేష్ తినాలి అంటూ తొలి ముద్ద నోటికి అందించారు .
ఒక్కసారిగా కళ్ళల్లో ఆనందబాస్పాలు ఆగడం లేదు - హృదయం పులకించిపోతోంది - అమ్మచేతిముద్ద ....... ఈ తియ్యదనం కోసమే ఇన్నిరోజులూ ఆగామేమో - వర్త్ అంటూ పరవశించిపోతున్నాను , చేతిలో పాత్ర ఉందికాబట్టి సరిపోయింది లేకపోతే డాన్స్ చేసేసేవాన్ని ....... , అలా అందరికీ వడ్డిస్తూనే అమ్మచేతిముద్దలను తింటున్నాను . పిల్లలూ ...... ఒక్క ఐస్ క్రీమ్ మాత్రమేకాదు మీకు ఇష్టమైనన్ని తినవచ్చు - బాక్సులు బాక్సులు తెప్పించారు అమ్మ ......
పిల్లలు : థాంక్యూ అమ్మా మొత్తం తినేస్తాములే .......
అమ్మ : అంతకంటే సంతోషమా అంటూ వారూ తింటూ నన్ను పిలిచి పిలిచి మరీ తినిపించారు .
అమ్మచేతి బిరియానీ మరింత రుచిగా ఉంది - సిస్టర్ ..... వచ్చావా కూర్చో కూర్చో అంటూ వడ్డించాను .
నర్స్ : అమ్మ చాలా హ్యాపీ మహేష్ సర్ - థాంక్యూ ......
వెల్కమ్ సిస్టర్ ........
పిల్లలు : అమ్మా నాన్నా ...... మాకోసం మీరు కొన్నిరోజులుగా సరిగ్గా తినడం లేదు తినండి మీరు తిని తినిపించండి .
పేరెంట్స్ కళ్ళల్లో చెమ్మ - ఆనందబాస్పాలతో వాళ్ళ వాళ్ళ పిల్లలకు ముద్దులుపెట్టి , ప్రాణంలా తినిపిస్తూ తిన్నారు .
ఆ మాటలకు అమ్మ ఉద్వేగానికి లోనైనట్లు నావైపు ప్రాణంలా చూస్తున్నారు .
స్మైల్ అమ్మా .......
అమ్మ : చాలా చాలా ఆనందం వేస్తోందన్నట్లు హృదయంపై చేతినివేసుకుని కళ్ళతోనే తెలిపారు .
పిల్లలంతా ఇష్టంగా సంతృప్తిగా భోజనం చేసి , పేరెంట్స్ సహాయంతో అమ్మ - డాక్టర్ గారి చుట్టూ చేరి చిరునవ్వులు చిందిస్తూ మరొకరౌండ్ ఐస్ క్రీమ్స్ తింటున్నారు .
సమయానికి తీసుకొచ్చినందుకు - టేస్టీ గా ఉన్నందుకు అంటూ బిల్ అమౌంట్ కంటే extraa ట్రాన్స్ఫర్ చేసాను .
థాంక్యూ సర్ అంటూ వాళ్ళ సామానులతో హ్యాపీగా వెళ్లిపోయారు డెలివరీ బాయ్స్ ........
కాసేపు పిల్లలతో సరదాగా గడిపారు అమ్మావాళ్ళు ....... , మహేష్ ...... రౌండ్స్ కు సమయం అయ్యింది అన్నారు డాక్టర్ గారు .
అమ్మా ...... మనం కూడా .......
అమ్మ : ఆ గదిలోకంటే ఇక్కడే బాగుంది - పిల్లలతో గడుపుతుంటే సమయమే తెలియడం లేదు .
మీ ఆనందం కంటే నాకింకేమి కావాలి చెప్పండి - కానీ కట్లు విప్పేముందు పిల్లలు కాసేపు వాళ్ళ అమ్మల ఒడిలో హాయిగా రెస్ట్ తీసుకుంటే బాగుంటుందేమో ........
అమ్మ : అవునవును ...... , సెల్ఫిష్ అయిపోయాను అంటూ లెంపలేసుకున్నాను చిరునవ్వుతో .......
డాక్టర్ : మహేష్ ...... MBBS కూడా పూర్తిచేశావా ఏమిటి ? , కరెక్ట్ గా చెప్పావు .....
అలాంటిదేమీ లేదు డాక్టర్ గారూ ........
అమ్మ : పిల్లలూ ...... మనం సాయంత్రం కలుద్దాము - అంతవరకూ మీ డాక్టర్ అన్నయ్య చెప్పినట్లు మీ అమ్మల ఒడిలో హాయిగా పడుకోండి .
పిల్లలు : మీరు చెబితే ok అమ్మా ...... , అమ్మా - అన్నయ్యా ...... చూపు రాగానే అమ్మానాన్నలతోపాటు మిమ్మల్ని కూడా చూడాలని ఆశగా ఉంది .
అమ్మ : చూపురాగానే మీ సంతోషాలను చూడటం కోసమైనా పరిగెత్తుకుంటూ వచ్చెయ్యమూ అంటూ నా చేతిలో చేతిని పెనవేశారు - పిల్లలూ ...... హాయిగా నిద్రపోండి .
పిల్లల అమ్మలువచ్చి , పిల్లల పెదాలపై చిరునవ్వులు మీవల్లనే అంటూ సంతోషంతో అమ్మను - డాక్టర్ - సిస్టర్ ను కౌగిలించుకున్నారు .
ఆ క్షణం వాళ్ళ కళ్ళల్లో చూసిన ఆనందం జీవితాంతం గుర్తుండిపోతుంది .
డాక్టర్ : మహేష్ ....... ఎంతోమందిని ట్రీట్ చేసాను కానీ ఈక్షణం కలిగిన ఆనందాన్ని ఎప్పటికీ మరిచిపోను - థాంక్యూ సో మచ్ ..... అనిచెప్పి వెళ్లారు .
అమ్మ అయితే నావైపు కన్నార్పకుండా ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నారు .
అమితమైన ఆనందంతో అమ్మా ..... వీల్ చైర్ తీసుకురానా అన్నాను .
నర్స్ : తెచ్చాను మహేష్ సర్ .......
అమ్మ : పిల్లలు జాగ్రత్త అంటూ పేరెంట్స్ కు చెప్పి చైర్లో కూర్చున్నారు . కూర్చున్నారన్నమాటే తప్ప వెనక్కు తిరిగి తోస్తున్న నావైపే చూస్తున్నారు .
అమ్మా ...... ఒక్కనిమిషం ఆగండి , అలా చూస్తే నొప్పివేస్తుంది .
అమ్మ : అయినా పర్లేదు అంటూ మా గదిలోకి వెళ్లేంతవరకూ వెనక్కు తిరిగితిరిగిచూస్తూనే ఉన్నారు .
నా ఆనందం అంతకంతకూ రెట్టింపవుతూనే ఉంది - అమ్మ కురులపై ముద్దుపెట్టాలన్న కోరికను ఎంతగా కంట్రోల్ చేసుకున్నానో నాకుమాత్రమే తెలుసు .