Update 65

అమ్మ : ఏంటి ఆగిపోయావు , గదిలోకి పిలుచుకునివస్తే సరిపోయిందా , బెడ్ పైకి చేర్చు ........
Sorry sorry అమ్మా అంటూ నా కళ్ళల్లోకే ప్రాణంలా చూస్తున్న అమ్మను నెమ్మదిగా ఎత్తుకుని , అప్పటికే అడ్జస్ట్ చేసిన బెడ్ పై వెనక్కు ఆనుకుని కూర్చునేలా కూర్చోబెట్టాను .
అమ్మ నాచేతిని వదలకుండా పట్టుకోవడంతో లవ్ ...... లోలోపలే తెగ ఆనందిస్తూ ప్రక్కనే కుర్చీలో కూర్చున్నాను .
అమ్మ : మహేష్ ...... ఎంత ఎంత ఆనందం వేస్తోందో తెలుసా ? , థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో సో మచ్ అంటూ నాచేతిని వారి హృదయంపై గట్టిగా హత్తుకుని సంతోషిస్తున్నారు , పిల్లల అమ్మలందరూ థాంక్యూ అంటూ ఒకేసారి హత్తుకున్న సమయాన కలిగిన మాధుర్యం మాటల్లో వర్ణించలేనిది అంటూ ఏకంగా నాచేతిపై ముద్దుపెట్టారు .
అమ్మ చిరుముద్దుకే చాలా చాలా ఆనందo వేసి నవ్వుతూనే ఉన్నాను .
అమ్మ : ఈ అమ్మకూడా రెస్ట్ తీసుకోవాలనే కదా ఇదంతా .......
నర్స్ : ఇదాసంగతి , ఇంత ప్రేమను ఎక్కడా చూడనేలేదు అంటూ టాబ్లెట్స్ అందించి , మోకాలిపై స్మూత్ గా మసాజ్ చేసింది .
మా అమ్మ - పిల్లలు ...... ఇద్దరికోసం అంటూ ప్రాణంలా చెప్పాను , అమ్మా ...... ఉదయం నుండీ .......
అమ్మ : సరే సరే పడుకుంటానులే , కానీ చేతిని మాత్రం వదలకూడదు .
ప్రాణాలు వదలమన్నా వదిలేస్తాను అమ్మా - మా అమ్మ చేతిని వదలలేను .
అమ్మ : ఇంకొకసారి ఇలామాట్లాడితే దెబ్బలుపడతాయి అంటూ చెమ్మతో చెప్పారు.
ప్చ్ ....... దెబ్బలుపడతాయి దెబ్బలుపడతాయి అని ఉదయం నుండీ అంటున్నారే తప్ప కొట్టడం లేదు .
అమ్మ : కళ్ళల్లో చెమ్మ ఒక్కసారిగా సంతోషపు బాష్పలుగా మారిపోయినట్లు నవ్వుతూనే ఉన్నారు .
అమ్మా ...... మీ పెదాలపై ఈ సంతోషం కోసం ఏమైనా చేస్తాను .
అమ్మ : నీ చెయ్యి ...... నా చేతిలో ఉండగా ఈ చిరునవ్వు చేరిగిపోదు .
లవ్ ..... ఆఅహ్హ్ ...... ఇక్కడనుండి కదలను అమ్మా......
అమ్మ : మహేష్ ....... రెస్ట్ తీసుకోవాల్సింది నేనుకాదు నువ్వు .
అమ్మా ...... ఇంటికివెళ్లాక మీఇష్టప్రకారమే రెస్ట్ తీసుకుంటాను కదా , ఇప్పుడైతే మీరు హాయిగా పడుకోండి - టాబ్లెట్స్ వేసుకున్నారుకదా కాస్త మత్తుగానూ ఉంటుంది , సాయంత్రం ఫ్రెష్ గా పిల్లలను కలవవచ్చు , మా అమ్మను ఇలా ఎంతసేపైనా చూస్తూనే ఉండాలనిపిస్తోంది అంటూ బెడ్ ను ఫ్లాట్ గా మార్చి అమ్మను పడుకోబెట్టి , సిస్టర్ తెచ్చిన దుప్పటిని కప్పాను .
అమ్మ : నా హృదయంపై నీ చెయ్యి హాయిగా ఉంది - ఇంటికివెళ్లాక పిల్లలు ...... వాళ్ళ అమ్మల ఒడిలో పడుకున్న మాదిరిగా , నా మహేష్ ను ...... నా ఒడిలో పడుకోబెట్టుకుని హాయిగా నిద్రపుచ్చుతాను .
అంతకంటే అదృష్టమా అమ్మా ...... yes yes yes అంటూ మాటల్లో వర్ణించలేని ఆనందంతో పరవశించిపోతున్నాను , అమ్మా ...... ఇక అయితే మాట్లాడకుండా నిద్రపోండి .
అమ్మ : నా మహేష్ తో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను - నాకోసం ఎంతచేశావు ......
మీకోసమే అమ్మా ....... , పిల్లలు దేవుళ్ళతో సమానం అన్నారుగా - వాళ్ళను సంతోషపెడితే మా అమ్మ ప్రాణమైన ఆ ఒక్కరు మరియు మా అమ్మ తీరని కోరిక ఏదో అదికూడా తీరుతుందనే స్వార్థంతో ఇలాచేసాను .
అమ్మ : మహేష్ .......
అమ్మా ...... రాత్రి ఇద్దరమూ చూసాము , దైర్యంగా ఉండండి ఆ దుర్గమ్మ తల్లి సరైన సమయంలో మీకోరిక తీరుస్తారు .
అమ్మ : ఆనందబాస్పాలతో నా చేతిని మరింత ప్రాణంలా హత్తుకున్నారు , మహేష్ ........ నాకు ప్రాణమైనవారు ఒక్కరే కానీ ప్రాణం కంటే ఎక్కువైనవారు కూడా ఉన్నారు .
తెలుసమ్మా .......
అమ్మా : తెలుసా ...... ? .
అదే అదే అదే ....... మా అమ్మ మనసు తెలుసు అన్నాను అంటూ లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను .
అమ్మ : ఉమ్మా ...... అంటూ నాచేతిపై ముద్దుపెట్టారు , వారి పేర్లను చెబితే ఎలాగైనా నువ్వు కాంటాక్ట్ చెయ్యగలవు ఉదయం నుండీ నిన్ను చూస్తున్నానుగా అందుకే చెప్పను , నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పగలను నా తొలిప్రాణం పేరు కూడా మహేష్ ....... , నా కన్నయ్య నాప్రక్కన ఉండి ఉంటే నీలానే చూసుకునేవాడు.
నాకంటే ప్రాణంలా చూసుకునేవాడు అమ్మా ....... , మీరు ప్రేమతో కన్నయ్య అని పిలుస్తున్నారు అంటేనే అర్థమైపోతోంది .
అమ్మ : మాఇద్దరి మధ్యన ఇంత ప్రేమ ఉన్నా ...... , ఇప్పటికీ ఒకరినొకరం చూసుకోనేలేదు మహేష్ , అంతా తన దేవకన్య వల్లనే ...... , నా ప్రాణం కంటే ఎక్కువైన నా కన్నయ్య ...... నా ప్రాణమైన బిడ్డను ముద్దుగా దేవకన్య అని పిలుస్తాడు .
మరి మిమ్మల్ని ? .
అమ్మ : చెప్పనేలేదు కదూ ....... ," దేవత " అని పిలుస్తాడు , అమ్మా - దేవతా అంటూ ప్రాణంలా పిలిచిన ప్రతీసారీ ...... నా బిడ్డ పిలిచే పిలుపుకంటే మాధుర్యం కలుగుతుంది , నా కన్నయ్య గురించి చెప్పమంటే రోజంతా చెబుతాను అంటూ టాబ్లెట్స్ మత్తులోనే సంతోషంతో చెబుతున్నారు .
నేనూ రోజంతా వినమన్నా వింటానమ్మా ...... , ఇప్పుడైతే హాయిగా నిద్రపోండి అంటూ జోకొడుతున్నాను , క్షణాలలోనే నిద్రలోకిజారుకున్నారు .
అమ్మ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , తెగ మురిసిపోతున్నాను .

నర్స్ : మహేష్ సర్ మహేష్ సర్ ....... ఇంతవరకూ డౌట్ గా ఉండేది ఈ ముద్దుతో క్లారిటీ వచ్చేసింది - ఆ కన్నయ్య మహేష్ మీరే కదా ........
ష్ ష్ ష్ ....... అమ్మకు నిద్రలోనూ తెలిసిపోతుంది - నిన్న చూసాముగా .......
నర్స్ : అవునవును అంటూ నోటికి తాళం వేసేశారు .
నర్స్ : చాలా చాలా ఆనందం వేస్తోంది మహేష్ సర్ ...... , ఇంతకూ అమ్మ అమ్మే అని ఎలా తెలిసింది ? అంటూ గుసగుసలాడింది .
చూడగానే హృదయానికీ తెలిసిపోయింది - అమ్మ మాట్లాడగానే నాకు తెలిసిపోయింది .
నర్స్ : మరి అమ్మకు ....... , Ok ok ok మీకు కోల్డ్ వెయ్యడం వలన మీ వాయిస్ పూర్తిగా మారిపోవడం వలన .......
ఏదిజరిగినా మనమంచికే అన్నట్లు , నేను అని చెప్పకుండా అమ్మను సంతోషపెట్టి ఫైనల్ గా సర్ప్రైజ్ ఇస్తాను .
నర్స్ : Wow బ్యూటిఫుల్ మహేష్ సర్ , నన్ను ఏ హెల్ప్ చెయ్యమన్నా చేస్తాను .
థాంక్యూ సిస్టర్ ....... , ఎంతసేపని నిలబడతావు కూర్చో ......
నర్స్ : మా నర్సులకు అలవాటే మహేష్ సర్ .......
సర్ప్రైజ్ అంటే గుర్తుకువచ్చింది మొబైల్ మొబైల్ ఇవ్వు అంటూ నా మొబైల్ ను స్విచ్ ఆన్ చేసి ఒక నెంబర్ తీసుకుని వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసాను , ఆ నెంబర్ కు కాల్ చేసి బ్రదర్ ...... నేను మహేష్ - ఒకేసారి రెండుచోట్ల డెకరేట్ చెయ్యాలి అంటూ ప్లేసస్ చెప్పాను , హాస్పిటల్ పిల్లల వార్డ్ ను సాయంత్రం లోపు ఎన్నిరకాలు ఉంటే అన్నిరకాల రంగుల పూలతో అందంగా అలంకరించాలి - కలర్ఫుల్ గా ఉండాలి , 10 కేక్స్ అరేంజ్ చెయ్యాలి . ఇక మరొకచోట చీకటిపడేలోపు విద్యుత్ కాంతులతో వెలిగిపోయేలా అలంకరించాలి - స్వాగతపు ఏర్పాట్లు అధిరిపోవాలి ఎంత ఖర్చైనా పర్లేదు అంటూ మొత్తం వివరించి షాకింగ్ గా చూస్తున్న సిస్టర్ ను చూసి నవ్వుకున్నాను - చేతిని అమ్మ హృదయంపై కదల్చకుండా ప్రాణంలా చూస్తూ హృదయమంతా నింపుకుంటున్నాను , అమ్మ తప్ప ఎవ్వరూ గుర్తుకరావడం లేదు - ప్రపంచాన్నే మరిచిపోయాను .

మధ్యలో ఒకసారి డాక్టర్ గారు వచ్చి , అక్కడ పిల్లలు - ఇక్కడ అమ్మ ...... ఇద్దరూ సంతోషంతో నిద్రపోయేలా చేసేసావు సూపర్ , అమ్మ నుదుటిపై - మెడపై - మోకాలిని చెక్ చేసి గుడ్ ఇప్పుడే డిశ్చార్జ్ అవ్వవచ్చు అన్నారు .
అయితే వెంటనే హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకెళ్లు మహేష్ - నో నో నో ....... పిల్లల కట్లు విప్పినతరువాత తరువాత అంటూ నిద్రలోనే మాట్లాడుతున్న అమ్మను చూసి సంతోషంతో నవ్వుకున్నాము .
మా అమ్మ ఎలచెబితే అలా అంటూ అమ్మచేతిని అందుకుని ముద్దుపెట్టి నా గుండెలపై హత్తుకున్నాను .
డాక్టర్ : అవునవును అక్కడ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ కూడా రెడీ అవుతోంది తమరివల్లనే అన్నమాట , మహేష్ ...... మీవాళ్ళు ఎవ్వరూలేరా ? , ఉంటే వెళ్ళలేదు సరికదా కనీసం ఇంఫామ్ కూడా చెయ్యనేలేదు , మొబైల్కూడా స్విచ్ ఆఫ్ లో ఉంచేశావు .......
నర్స్ : మహేష్ సర్ కు అమ్మనే సర్వస్వం మేడం - ఇక్కడ కాదు కానీ బయటకురండి అంతా చెబుతాను , చూశారుకదా ...... నిద్రలోకూడా మహేష్ సర్ మాటలు వింటున్నారు అంటూ నవ్వుకుంటూ బయటకువెళ్ళారు , మహేష్ సర్ ...... నేనుకూడా అమ్మ దగ్గరికివెళ్లి సర్ప్రైజ్ సమయానికి వచ్చేస్తాను .
లవ్ యు అమ్మా ...... , నాకులానే మా అమ్మ హృదయం కూడా పసిగట్టేసిందన్నమాట , ఏమీ ఆలోచించకుండా హాయిగా నిద్రపోండి అమ్మా , మీపెదాలపై సంతోషాలను పరుమళింపచేసేందుకు నేనున్నానుకదా అంటూ ప్రాణంలా చేతిపై ముద్దులుపెడుతున్నాను - ముద్దుముద్దుకూ అమ్మ మరింత హాయిగా నిద్రపోవడం చూసి ఆనందం వేస్తోంది .
************

డోర్ తెరిచి మహేష్ సర్ మహేష్ సర్ ...... ఇంకా రెడీ అవ్వలేదా ? , అక్కడ ఆపరేషన్ చేసిన డాక్టర్ గారుకూడా వచ్చేసారు , ఏ నిమిషంలోనైనా కట్లు విప్పవచ్చు , మీ అమ్మను చూస్తూ మీరు - మీ అంతులేని ప్రేమలో మీ అమ్మ ...... సమయాన్నే మరిచిపోయారన్నమాట , కనీసం గోడపై ఉన్న గడియారం వైపు ఒక్కసారి చూసి ఉన్నా తెలిసేది , అవునులే అమ్మను చూడటానికే సమయం సరిపోయి ఉండదు అంటూ నవ్వుకున్నారు .
గడియారం వైపు చూసి 6:30 అయ్యిందా అంటూ ఆశ్చర్యపోయాను , క్షణం ముందేకదా మనం ఈ గదిలోకి వచ్చాము - అమ్మను నిద్రపుచ్చాము .........
నర్స్ : క్షణం ముందునా ...... ? , మహేష్ సర్ అది దాదాపు 3 గంటల ముందు ...... , త్వరగా త్వరగా మేడం ను లేపండి - రెడీ అవ్వడానికి కూడా సమయం పడుతుంది .
హాయిగా నిద్రపోతున్న అమ్మను ఎలా లేపగలను చెప్పు ......
నర్స్ : పిల్లలు కళ్ళుతెరిచే సమయానికి ఉండాలని చెప్పారుకదా - మేడం కూడా మాటిచ్చారుకదా ....... , నేను లేపనా అంటూ అమ్మ చెవిలో పిల్లలకు కట్లు విప్పుతున్నారు అంటూ గుసగుసలాడారు .

అంతే అమ్మ సడెన్ గా కళ్ళుతెరిచారు . ఇక అర గంటే సమయం ఉంది అంటూ లేచి కూర్చున్నారు .
అమ్మా ...... జాగ్రత్త అంటూ నవ్వుకున్నాను - అమ్మా ...... రెడీ అవ్వండి నేను బయట ఉంటాను .
అమ్మ : నవ్వింది చాలు , మరి బాత్రూం వరకూ ఈ అమ్మను ఎవరు ఎత్తుకునివెళతారు .
నేను నేను నేను ........ , అమ్మా ...... ఇంకా నొప్పివేస్తోందా ? .
అమ్మ : లేదు లేదు అవునవును .......
అధికాదమ్మా ...... నొప్పిగా ఉంటే మరొకరోజు హాస్పిటల్లో ఉంచుతానన్నారు డాక్టర్ గారు ......
అమ్మ : నో నో నో ...... , పిల్లలకు చూపు వచ్చిన తరువాత ఇక ఒక్క క్షణం కూడా ఉండను అంటూ బెడ్ దిగారు , డాక్టర్ ఇప్పుడే డిశ్చార్జ్ అయిపోవచ్చు అనడం విన్నానులే , ఎత్తుకోవడం ఇష్టం లేదని చెప్పు - పదా రాధికా ......
నర్స్ : మీరు ok అనాలేకానీ రోజంతా ఎత్తుకోమన్నా ఎత్తుకుంటారు ......
అమ్మను అమాంతం ఎత్తుకునివెళ్లి బాత్రూమ్లోకి వదిలి ఆనందిస్తూ బయటకువచ్చాను .
అమ్మ : నాకు తెలియదా రాధికా .........

మహేష్ సర్ ....... ఇక్కడ ఉన్నారా అంటూ డెకరేట్ బ్రదర్ పలకరించాడు .
బ్రదర్ ....... రెడీనా ? .
బ్రదర్ : మీరు చెప్పడమూ మేము సమయానికి చెయ్యకపోవడమూనా ....... ఇక్కడ పూర్తయిపోతోంది - అక్కడ ఆల్మోస్ట్ రెడీ అయిపోతోంది , రండి లోపలికివచ్చి ఒకసారి చూడండి .......
నీ వర్క్ గురించి మళ్లీ చెప్పాలా బ్రదర్ ...... , నా సర్ప్రైజస్ అన్నీ నువ్వు రెడీ చేసినవే కదా , చూడాల్సినది నేను కాదు పిల్లలు మరియు అమ్మ అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను . బిల్ వాట్సాప్ చెయ్యి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను .
బ్రదర్ : అమౌంట్ సంగతి సెలెబ్రేషన్స్ పూర్తయ్యాక చూసుకుందాము మహేష్ సర్ .......
సరే బ్రదర్ ...... , ఇప్పుడే వస్తాను అంటూ హాస్పిటల్ పైనున్న పెంట్ హౌస్ కు చేరుకున్నాను - చూస్తే చిన్నగదిలా ఉంది , అంటీ అంటీ అంటూ డోర్ నాక్ చేసాను.
ఎవరు అంటూ డోర్ తెరిచారు .

అంటీ ....... నా పేరు మహేష్ , రాధిక చెప్పే .......
నర్స్ అమ్మ : బాబూ లోపలికి రా అంటూ ఆహ్వానించారు .
చూస్తే వంట గది - పడుకునే గది - హాల్ ....... అన్నీ ఒకే గది ......
నర్స్ అమ్మ : బాబూ ....... చిన్న గది కూర్చో అన్నారు .
పర్లేదు అంటీ ...... , అంటీ ...... కింద పిల్లల సెలెబ్రేషన్ .......
నర్స్ అమ్మ : రాధిక చెప్పింది బాబూ ...... , పండగలా జరిపిస్తున్నావని ......
ఆ పండుగకు మిమ్మల్నీ పిలుచుకువెళ్లడానికి వచ్చాను .
నర్స్ అమ్మ : అంత సంతోషానికి రాను అని ఎలా చెప్పగలను .
థాంక్స్ అంటీ ...... , మీరు రెడీ అయ్యి వచ్చెయ్యండి .......
నర్స్ అమ్మ : నేనెప్పుడో రెడీ బాబూ పదా .......
సూపర్ అయితే అంటూ కిందకువచ్చాము .

అదేసమయానికి అమ్మా - సిస్టర్ రెడీ అయ్యి బయటకువచ్చారు .
నర్స్ : అమ్మా ...... మీరు ఇక్కడ ? .
నర్స్ అమ్మ : ఇంతటి సంతోషానికి నువ్వు ఆహ్వానించకపోయినా మహేష్ స్వయంగా వచ్చి ఆహ్వానించాడు .
నర్స్ : థాంక్యూ సో మచ్ మహేష్ సర్ .......
రాత్రి నుండీ నువ్వు చేసినదానితో పోలిస్తే చాలా చాలా తక్కువ ......
అమ్మ : మీరిద్దరే మాట్లాడుతారా లేక ........
నర్స్ : sorry sorry మేడం ....... మా అమ్మ - అమ్మా ...... మహేష్ అమ్మగారు .
ఇద్దరూ పరిచయం చేసుకుని నవ్వుకున్నారు .

అంతలో డాక్టర్ మేడమ్స్ తోపాటు మరొక ముగ్గురు డాక్టర్స్ వచ్చారు .
రావడం రావడమే నైట్ డాక్టర్ గారు ....... నావైపు తెగ కోపంతో చూస్తున్నారు - నేరుగా మాదగ్గరికే వచ్చారు - నావైపు కోపంతో చూస్తూనే అమ్మను ఎలా ఉంది అంటూ పలకరించారు .
డాక్టర్ గారూ ...... మూడోకన్ను తెరవడానికి గల కారణం .......
మార్నింగ్ డాక్టర్ : మధ్యాహ్నం జరిగిన స్మాల్ సెలెబ్రేషన్ తాలూకు పిక్స్ వాట్సాప్ లో పంపించాను .
నైట్ డాక్టర్ : మహేష్ ...... ఒక్క కాల్ చేసి ఉంటే నేనూ జాయిన్ అయ్యేదానిని కదా , మీరొక్కరే ఎంజాయ్ చేసారన్నమాట ........
నాకేమి తెలుసు మేడం ...... , డాక్టర్ గారు - సిస్టర్ ...... ఒకమాటైనా చెప్పాల్సింది .
అంతే ఇద్దరినీ గిల్లేసారు .......
మార్నింగ్ డాక్టర్ : కష్టపడి నీమీదకు తోసేస్తే ఈజీగా మావైపుకు టర్న్ చేసేసావన్నమాట అంటూ రుద్దుకుంటున్నారు .
అమ్మతోపాటు నవ్వుకుని , డాక్టర్ గారూ ....... ఈ సంతోషాలకు కారణమే మీరు కదా ........
అవునవును మీరే కదా అంటూ అందరూ చెప్పారు .
అంతే పొంగిపోయి నవ్వేశారు నైట్ డాక్టర్ - మహేష్ ...... 5 మినిట్స్ డీన్ వచ్చేస్తారు వారి సమక్షంలో .......
సరే డాక్టర్ గారూ ....... , అమ్మా ...... మాట్లాడుతూ ఉండండి ఇప్పుడే వచ్చేస్తాను అంటూ బ్రదర్ దగ్గరికివెళ్ళాను - బ్రదర్ ...... హాస్పిటల్ పైన పెంట్ హౌస్ ఉంది అందులోని సామాగ్రి అంతా హాస్పిటల్ ప్రక్కనే ఉంటున్న లగ్జరీ అపార్ట్మెంట్ లోని హౌస్ లోకి మార్చాలి - ఎంత అయినా పర్లేదు అపార్ట్మెంట్ టాప్ ఫ్లోర్లో హౌస్ కావాలి అనిచెప్పాను .
బ్రదర్ : ఇప్పుడే మనుషులను పిలిపిస్తాను సర్ , నేనే స్వయంగా వెళ్లి హౌస్ సేల్ చేసి గుడ్ న్యూస్ చెబుతాను .
థాంక్యూ బ్రదర్ .......

పిల్లల వార్డ్ నుండి పిల్లల అమ్మలు బయటకువచ్చారు - అటూ ఇటూ చూసి హమ్మయ్యా అంటూ అమ్మ దగ్గరికి వచ్చారు , మేడం మేడం డాక్టర్ గారూ నర్స్ ...... పిల్లలంతా మిమ్మల్నే అడుగుతున్నారు , కట్లు విప్పేముందు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు .
అమ్మా - డాక్టర్స్ వెళ్ళండి వెళ్ళండి .......
డాక్టర్స్ : మేడం ..... మీరు వెళ్ళండి , డీన్ రాగానే వచ్చేస్తాము .
అమ్మ : సరే అంటూ నాచేతిని అందుకున్నారు .
అమ్మా ...... ఎత్తుకోవాలా ? అంటూ నవ్వుకుంటున్నాను .
అమ్మ : ఎత్తుకోమన్నప్పుడు ఎత్తుకోలేదు కానీ అంటూ చేతిపై సున్నితంగా గిల్లేసారు.
స్స్స్ ...... లవ్ ...... థాంక్యూ అమ్మా , ఇంకా నొప్పిగానే ఉన్నట్లుంది నిలబడటానికి ఇబ్బందిపడ్డారు జాగ్రత్త అమ్మా అంటూ నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్లి , అమ్మా ...... స్మాల్ సర్ప్రైజ్ అంటూ డోర్ తెరిచాను .

లోపలికి అడుగుపెట్టగానే అమ్మ పెదాలపై సంతోషం - కన్నార్పకుండా చుట్టూ చూస్తూ ఉండిపోయారు , Wow బ్యూటిఫుల్ ........
అమ్మ మాటలువిని అమ్మా అమ్మా అమ్మా ....... అంటూ పిల్లలు మావైపు రావడం చూసి ......
పిల్లలూ పిల్లలూ ...... పడిపోతారు నేనెవస్తాను అంటూ వెళ్లి అందరినీ హత్తుకున్నారు , ఈ అమ్మకోసం ఎదురుచూస్తున్నారని అమ్మలు చెప్పారు వెంటనే వచ్చేసాను , బయటే ఉన్నాను - మీరు ఆజ్ఞ వేశాక రాకుండా ఉంటానా చెప్పండి , మీకోసం మీ అన్నయ్య బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ను రెడీ చేశారు ....... , అదేంటో మరికొద్దిసేపట్లో చూడబోతున్నారు - అదిగో డాక్టర్స్ లోపలికివచ్చారు ...... ఇక కొన్ని క్షణాలు మాత్రమే మీ పేరెంట్స్ ను చూడబోతున్నారు .
పిల్లలు : మిమ్మల్ని - అన్నయ్యను - డాక్టర్స్ ను కూడా ........
డాక్టర్స్ : థాంక్యూ పిల్లలూ ...... , పెద్ద డాక్టర్ గారు వచ్చారు ఎవరి బెడ్ దగ్గరకు వాళ్ళు వెళ్ళండి , పేరెంట్స్ తీసుకెళ్లండి .

డీన్ : నో నో నో గుంపుగా భలేగా ఉన్నారు ముందు గ్రూప్ ఫోటో తీసుకుందాము హాస్పిటల్ గొప్పతనం గురించి హెడ్లైన్ లో వేయించడానికి ........ , చుట్టూ చూసి ఆపరేషన్కు డబ్బులు అడిగితే లేవు అన్నారు కానీ ఇంత ఖర్చు పెట్టి సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు , మీ నుండి డబ్బుని ఎలా రాబట్టాలో నాకు తెలియదా ...... , ముందు ఫోటోషూట్ పేరెంట్స్ అందరూ దూరం వెళ్లిపోండి , నేను - కళ్ళు లేని పిల్లలు మాత్రమే .......
డాక్టర్స్ : సర్ సర్ .......
అమ్మను నెమ్మదిగా ప్రక్కకు తీసుకొచ్చాను .
డీన్ : అంతేకదా ...... , చూపు వచ్చేన్తవరకూ అలానే పిలుస్తారు , ఆపరేషన్ అయ్యాక కూడా అందరికీ చూపు వస్తుందని చెప్పలేము , దురదృష్టవంతులు కూడా ఉంటారు .
అమ్మతోపాటు నాకూ కోపం వచ్చేస్తోంది - కంట్రోల్ చేసుకుని అలా జరగనే జరగదు అమ్మా ...... , వీడు కాదు కదా ఆపరేషన్ చేసినది మన డాక్టర్ గారు ......
అమ్మ : నా చేతిని గట్టిగా చుట్టేసి దుర్గమ్మను ప్రార్థిస్తున్నారు .

ఒకటికాదు రెండు కాదు ....... పిల్లలను ఇబ్బందికి గురిచేస్తూ ఫోటోలు తీయించుకుంటున్నాడు - పేరెంట్స్ ఏమీ అనలేక బాధపడుతున్నారు .
ఇక తట్టుకోలేక , డాక్టర్ ....... పిల్లలు ఇబ్బందిపడుతున్నారు ఫోటోలు ఇక చాలు .......
డీన్ : ఎవడ్రా నువ్వు నాకే చెబుతావా ? .
పిల్లలు : మా అన్నయ్య అంటూ అక్కడనుండి భయపడుతూ వచ్చి మాఇద్దరినీ హత్తుకున్నారు .
అంతలో డాక్టర్స్ కల్పించుకుని , సర్ ...... ఇప్పటికే సమయం మించిపోయింది సో .........
డీన్ : నాపని అయిపోయింది , అంతా పూర్తయ్యాక పిలవండి వస్తాను అనిచెప్పి వెళ్ళిపోయాడు .

పిల్లలూ ...... అతడు వెళ్ళిపోయాడు - ఇది బాధపడే సమయం కాదు సంబరాలు చేసుకునే సమయం .......
అవునవును పిల్లలూ ...... అంటూ అమ్మ - డాక్టర్స్ చుట్టూ చేరి నవ్వించారు , పిల్లలను వారి వారి బెడ్స్ పైకి చేర్చి పేరెంట్స్ ను ప్రక్కన కూర్చోమని చెప్పి , ఒకేసారి 10 మంది డాక్టర్స్ ...... 10 మంది పిల్లల కట్లను నెమ్మదిగా విప్పుతున్నారు , పిల్లలూ ....... మేము చెప్పినప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ ఇష్టప్రకారం పేరెంట్స్ ను చూడండి , నెమ్మదిగా అతినెమ్మదిగా ...... ఇప్పుడు తెరవండి ......
పిల్లలు నెమ్మదిగా తెరిచి కనురెప్పలను కదిలించి , అమ్మా - నాన్నా ...... నాకు నాకు నాకు ...... నాకు అంటూ 10 మంది చెప్పారు కనిపిస్తున్నారు అని .......
ఆ పేరెంట్స్ అంతులేని ఆనందంతో హత్తుకోవడం చూసి , వార్డ్ మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది .
పిల్లలు : సంతోషంతో అమ్మా అమ్మా నాన్నా ...... రంగురంగులన్నీ కనిపిస్తున్నాయి పూలు పూలు ఎటుచూసినా పూలు అంటూ బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుతున్నారు , అమ్మ - అన్నయ్య ఎక్కడ ఎక్కడ ........
అమ్మలు : వెళ్ళండి పిల్లలూ ...... , ఇలా మీకోసం రంగురంగుల ప్రపంచాన్ని చూయించింది వారే .......
అమ్మ : పిల్లలూ ...... పేరెంట్స్ ఫస్ట్ మేమే వస్తాముకదా అంటూ అందరినీ ప్రేమతో పలకరించి సంతోషాలను పంచుకున్నారు - పిల్లల ముద్దులకు అమ్మ ఆనందాలు అవధులు దాటాయి - ప్రతీ ముద్దు సంతోషాన్ని నావైపు చూస్తూ పంచుకున్నారు .
అమ్మ చెవిలో కేక్ అనిచెప్పాను .
అమ్మ : పిల్లలూ ....... మీరు మీ పేరెంట్స్ ను ప్రపంచాన్ని చూసిన రోజుకు గుర్తుగా కేక్ కోసి సంబరాలు చేసుకుందామా ? .
పిల్లలంతా సంతోషంతో కేకలువేస్తున్నారు .

బయట ఉన్న బాయ్స్ కు సైగచెయ్యగానే పిల్లల ముందు 10 కేక్స్ ప్రత్యక్షo అయ్యాయి .
పిల్లలు : థాంక్యూ థాంక్యూ అమ్మా ......
అమ్మ : మధ్యాహ్నం మనం మాత్రమే ఎంజాయ్ చేశామని మీకు చూపు తెప్పించిన డాక్టర్ ఫీల్ అయ్యారు , మానం ముందుగా వారికి థాంక్స్ చెప్పుకోవాలి .
పిల్లలు : థాంక్యూ థాంక్యూ డాక్టర్ అంటూ పిల్లలంతా వెళ్లి డాక్టర్స్ కు ఫ్లవర్స్ అందించారు .
డాక్టర్ గారు ఆనందబాస్పాలతో థాంక్స్ చెప్పారు .
మార్నింగ్ డాక్టర్ : మేడం గారూ హ్యాపీనా .......
నైట్ డాక్టర్ : పోవే ...... , ఇంత ఆనందం నా కెరీర్ లోనే కలగలేదు అంటూ కౌగిలించుకున్నారు .
పిల్లలు కేక్స్ కోసి పేరెంట్స్ కు - అమ్మకు - డాక్టర్స్ కు - అంటీకు - నర్స్ కు - నాకు తినిపించారు మేమూ తినిపించి , పూలు - స్నో చల్లుకుని ఆనందించాము .

పిల్లల స్వచ్ఛమైన సంతోషాలను చూస్తూ పేరెంట్స్ సంతోషంలో మునిగిపోయారు .

ఆ సంతోషాల మధ్యన స్టాప్ స్టాప్ స్టాప్ అంటూ డీన్ లోపలికివచ్చాడు . Wow కేక్ సెలెబ్రేషన్స్ కూడా అన్నమాట అంటే అన్ని డబ్బులు ఉన్నాయన్నమాట - క్యాషియర్ ...... వీళ్ళు రెండు రోజులముందు govt కార్డ్ ద్వారా జాయిన్ అయినప్పటినుండీ హాస్పిటల్ బిల్స్ అన్నింటినీ లెక్కవెయ్యండి .
పేరెంట్స్ : సర్ సర్ ...... అన్నీ ఫ్రీ అన్నారుకదా సర్ .......
డీన్ : ఫ్రీ ....... ఫ్రీ అని ఎవరు చెప్పారు ? , మీ అదృష్టం మీకు సరైన సమయానికి కళ్ళు డొనేట్ చనిపోయారు కాబట్టి ఇక్కడ ఉన్నారు , కేవలం ఆపరేషన్ మాత్రమే ఫ్రీ , హాస్పిటల్ స్టే - మందులు ....... ఎవడబ్బ ఇస్తాడు , వెంటనే మొత్తం అమౌంట్ పే చేసి ఇక దొబ్బేయ్యండి ...... , మీలాంటి పేదవారి ఏడుపులు నాకు పడవు ......
డాక్టర్స్ : సర్ ...... పిల్లలు కనీసం రెండురోజులైనా observation లో ఉండాలి .
డీన్ : ఇంకా రెండు రోజులా ...... కుదరదు , సెక్యూరిటీ పిల్లలను ఉంచుకుని పేరెంట్స్ ను బయటకు గెంటెయ్యండి , క్యాష్ కౌంటర్లో బిల్ పే చేస్తేనే పిల్లలను కలవనివ్వండి .
డాక్టర్స్ ఎంతచెబుతున్నా వినడం లేదు .

అమ్మ కంగారుపడుతూ నాచేతిని పట్టేసుకున్నారు .
Yes సర్ అంటూ ముందుకువచ్చిన సెక్యూరిటీని , అమ్మా ఒక్క నిమిషం అంటూ కురులపై ముద్దుపెట్టి వెళ్లి వెనక్కు తోసేసాను - పిల్లల విషయంలోకూడా బిజినెస్ లానే ఆలోచించే నీకు మాటలతో బుద్ధి చెప్పలేము అలా అని చేతితో గుణపాఠం చెప్పడంలో నేను ...... నిన్ను తాకడం కూడా అమ్మకు ఇష్టం లేదు .
అమ్మ : అవునన్నట్లు తలఊపారు కళ్ళల్లో చెమ్మతో .......
ఇదిగో నా కార్డ్ , మొత్తం అమౌంట్ తీసుకోండి , డాక్టర్స్ ..... పిల్లలు ఇంకా ఎన్నిరోజులు ఉంటే మంచిది ? .
డాక్టర్స్ : మూడురోజులు మహేష్ ........
ఆ మూడు రోజులకు సరిపడా కూడా తీసుకోండి - వెంటనే పిల్లలను వేరే హాస్పిటల్ కు షిఫ్ట్ చేసేసేవాడిని కానీ ఈ డాక్టర్స్ ఉన్నారన్న ధైర్యంతో ఆగిపోయాను - థాంక్యూ డాక్టర్స్ ........
ఈ మూడురోజులూ ....... ఫుడ్ విషయంలో మొదలెట్టి అన్నీ విషయాలలో క్వాలిటీ లో తేడా వచ్చిందని తెలిస్తే అప్పుడు ఇలా మాట్లాడను , నర్స్ ...... మేమూ డిశ్చార్జ్ అవుతున్నాము ఆ బిల్ కూడా వేయించండి .......
క్యాషియర్ : డన్ సర్ .......
డీన్ వెళ్లిపోబోయాడు .
స్టాప్ డీన్ ...... పిల్లలకు - పేరెంట్స్ కు sorry చెప్పి వెళ్లు , ఎందుకో మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను .
డీన్ : చుట్టూ చూసి , పిల్లలూ - పేరెంట్స్ ...... sorry అనిచెప్పి తలదించుకుని వెళ్ళిపోయాడు .
అంతే లోపల మరియు బయట గుమికూడిన వారందరూ చప్పట్లు కొడుతున్నారు - పేరెంట్స్ వచ్చి మీరుణం తీర్చుకోలేము అంటూ నమస్కరిస్తున్నారు .
నో నో నో మీరు పెద్దవారు అంటూ ఆపాను - రుణం తీరనిది అని ఎవరన్నారు - ఇప్పుడే ఇక్కడే తీర్చవచ్చు ......
పేరెంట్స్ : ఏమిచెయ్యాలో చెప్పండి సర్ .......
ఓ ఓ ఓ కూల్ కూల్ ...... మీ ఉత్సాహం చూస్తుంటే ఏమైనా చేసేలా ఉన్నారు - అలాంటివేమీ అవసరం లేదు , పిల్లలూ ....... వెళ్లి అమ్మకు - డాక్టర్స్ మేడమ్స్ కు - అంటీకు - నర్సకు వాళ్ళు చాలు అనేంతవరకూ ముద్దులుకురిపిస్తే రుణం తీరిపోయినట్లే ......
Yes yes yes అంటూ అందరూ సంతోషంతో చప్పట్లుకొడుతుంటే , పిల్లలు కేకలువేస్తూ మరీ నావైపే ప్రాణంలా చూస్తున్న అమ్మావాళ్ళ దగ్గరికివెళ్లి బెడ్స్ పైకి ఎక్కి బుగ్గలపై వన్ టూ త్రీ ...... అంటూ ముద్దులు కురిపిస్తూనే ఉన్నారు .

20 21 22 ....... అమ్మా అలసిపోయాము - మీకు చాలు అనిపించడం లేదా ? అంటూ పిల్లలు ముద్దుముద్దుగా అడిగారు .
అమ్మ : మాకైతే చాలు అనిపించడం లేదు అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దులుపెట్టారు , మీ అన్నయ్యకు పెట్టరా ? .
పిల్లలూ ....... సరిపోలేదన్నారు కదా అమ్మకే పెట్టండి ......
పిల్లలు : అమ్మకు ఒకటి మరియు మా అన్నయ్యకు ఒకటి అంటూ నాదగ్గరికివచ్చి కింద కూర్చోండి అని ఆర్డర్స్ వేసి బుగ్గలపై ముద్దులు కురిపించారు .
అమ్మ - డాక్టర్స్ - నర్స్ ...... హ్యాపీ కాబట్టి రుణం తీరిపోయింది కానీ మీరంటే ఇష్టం ఎప్పటికీ ఇలానే ఉంటుంది . కాసేపట్లో పిజ్జా బర్గర్ సాండ్ విచ్ రాబోతున్నాయి ఎవరెవరికి ఇష్టం ? .
నాకు నాకు నాకు అంటూ సంతోషంతో కేకలువేస్తున్నారు .
పేరెంట్స్ : సర్ ....... ఇప్పటికే మాకోసం చాలా చేశారు .
పిల్లలు దేవుళ్ళతో సమానం అని మా అమ్మ చెప్పారు - ఆ దేవుళ్ళు ఇచ్చినది ఈ బుజ్జి దేవుళ్ళ కోసం ఖర్చుపెడుతున్నాను అంతే ....... అదిగో వచ్చేసాయి , మీకిష్టమైనవి తీసుకెళ్లి మీ పేరెంట్స్ తోపాటు తినండి ......
థాంక్యూ థాంక్యూ అన్నయ్యా ........

అమ్మ : నేనూ తినొచ్చా ? .
డాక్టర్స్ వైపు చూసాను .
డాక్టర్స్ : చికెన్ లెగ్ పీసస్ నే లాగి లాగి కుమ్మేశారు - ఇక ఏమైనా తినొచ్చు .
అందరమూ నవ్వుకోవడంతో అమ్మ సిగ్గుపడుతూ నా వెనుక వీపుపై తలదాచుకున్నారు .
పర్మిషన్ వచ్చేసింది అమ్మా ...... , హ్యాపీగా వెళ్లి పిల్లలతోపాటు తినండి .
అమ్మ : నువ్వూ రా - మీరూ రండి అంటూ లాక్కునివెళ్లారు పిల్లలదగ్గరకు ........
అమ్మ అందించిన పిజ్జా పీస్ ను తింటూ , వారి సంతోషాలను ఎంజాయ్ చేస్తున్నాను .

సిస్టర్ ....... అంటీతోపాటు కొన్నిరోజులు మాతో మాఇంటికి రాగలవా ? , ఎటువంటి లోటూ లేకుండా చూసుకుంటాను .
అమ్మ ...... నాచేతిని ప్రాణంలా అందుకున్నారు .
సిస్టర్ Ok మహేష్ సర్ ...... అంటుండగానే , డాక్టర్స్ ఇద్దరూ కుదరదుగా అన్నారు .
నర్స్ : మేడమ్స్ ....... అంటూ తలను ఊపింది .
డాక్టర్స్ : రాధికా ....... అంటూ ఆగిపోయారు .
అంటీ కూడా సిస్టర్ మాటలకే ఇష్టపడ్డారు .
గమనించి , డాక్టర్స్ ఏదైనా కారణం ఉందా ? - ఈ డీన్ ఏమైనా .......
నర్స్ : అలాంటిదేమీ లేదు మహేష్ సర్ ...... , సంతోషంగా వస్తాను .
డాక్టర్స్ ....... రీజన్ ఏమిటి ? .
ఆర్స్ : మహేష్ సర్ ..... మనం వెళదాము .
సిస్టర్ ఆగు - డాక్టర్స్ చెప్పండి ప్లీజ్ .......
డాక్టర్స్ : ఎల్లుండి హైద్రాబాద్ వెళ్ళాలి - అక్కడి govt హాస్పిటల్లో నెలరోజులపాటు నర్స్ సేవలు అందిస్తే , టాప్ సర్వీస్ ను బట్టి govt హాస్పిటల్ నర్స్ గా పర్మనెంట్ అవుతుంది - లైఫ్ సెటిల్ అవుతుంది .
సిస్టర్ ....... మాకోసం , అంటీ మీరుకూడా ...... ఒక్కరోజు పరిచయం అయిన మా సంతోషం కోసం మీ బిడ్డ కెరీర్ ను త్యాగం చేస్తున్నారా ? .
అంటీ : ఒక్కరోజులో మీరంటే ఏంటో చెప్పింది మహేష్ - కొద్దిసేపటి ముందు కళ్లారా చూసాను - మీకోసం ...... నా బిడ్డ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాబట్టి సమర్థించాను .
నో నో నో ...... అమ్మ ఒప్పుకోనే ఒప్పుకోరు .
అమ్మ : కొట్టడం ఒక్కటే తక్కువ - రాధికా ...... అంటూ ప్రేమతో గుండెలపైకి తీసుకున్నారు .
సిస్టర్ ...... ఎల్లుండి అటునుండి హైద్రాబాద్ పంపించే బాధ్యత నాది .
నర్స్ : థాంక్యూ మహేష్ సర్ .......

అంతలో డిన్నర్ అంటూ హాస్పిటల్ ఫుడ్ డెలివరీ బాయ్స్ వచ్చారు .
అంతే అందరూ వారివైపే కోపంతో చూస్తున్నారు .
బాయ్స్ : నో నో నో సర్ - డాక్టర్స్ ...... ఇంతకుముందులా కాదు , ఒకసారి చెక్ చేసుకోండి , క్వాలిటీ లో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు .
అమ్మా ...... లెట్ మీ చెక్ అంటూ వెళ్లి , చూసి టేస్ట్ చేసాను - ఒక్క వార్నింగ్ తో ఇంత మార్పు , పిల్లలూ ...... అన్నీ వంటలూ సూపర్ .
పిల్లలు : అన్నయ్య చెబితే ok ...... , అమ్మా - డాక్టర్స్ ...... మాకు చందమామను చూస్తూ తినాలని ఉంది .
పేరెంట్స్ : చిన్నప్పుడు చందమామ పాటతో తినిపిస్తుంటే , చందమామ ఎలా ఉంటాడు అని అడిగేవారు .......
అమ్మ : మహేష్ ...... షిఫ్ట్ టు టాప్ అని ఆర్డర్ వేశారు .
బాయ్స్ విన్నారుకదా ఓపెన్ టాప్ లో డిన్నర్ ఏర్పాట్లు రెడీ చెయ్యండి .
Ok సర్ అంటూ వెళ్లారు .

అమ్మకోసం వీల్ చైర్ తీసుకొచ్చాను . బుజ్జాయిని అమ్మ ఒడిలోకి చేర్చి , ఇద్దరు పిల్లలను ఎత్తుకున్నాను . పిల్లలూ - పేరెంట్స్ లెట్స్ గో ....... , లిఫ్ట్ లో అందరమూ టాప్ చేరుకున్నాము .
బ్రదర్ వచ్చి డన్ అంటూ హౌస్ తాళాలు అందించాడు .
థాంక్యూ బ్రదర్ ........

పిల్లల అదృష్టం నిండు పున్నమిలా వెన్నెల కురిపిస్తున్న చందమామను చూసి చిందులువేస్తున్నారు .
పిల్లలను వాళ్ళ అమ్మలకు అందించాను - బాయ్స్ తోపాటు అందరికీ వడ్డించాను , అమ్మ తినిపిస్తుంటే ఎంజాయ్ చేస్తున్నాను .

అంతలో అంటీ వచ్చి , తల్లీ రాధికా ...... మన ఇంట్లో ఒక్క సామాను కూడా లేదు .
నర్స్ : ఏమైపోతాయి అమ్మా అంటూ కంగారుపడుతూ వెళుతుంటే ఆపాను .
సిస్టర్ - అంటీ ....... అంటూ అమ్మచేతితో తాళాలు ఇప్పించాను - ఎదురుగా కనిపిస్తున్న అపార్ట్మెంట్ వైపుకు తిరిగి అదిగో టాప్ ఫ్లోర్లో ఉన్న హౌస్ మీదే అంటూ చూయించాను , మీ సామానులన్నీ సాయంత్రమే షిఫ్ట్ అయిపోయాయి సిస్టర్ ......
మహేష్ సర్ ....... అంటూ నా గుండెలపైకి చేరింది .
మాకోసం కెరీర్ నే వదులుకోవడానికి సిద్ధపడిన మీకు ఈ శిక్ష వెయ్యడంలో తప్పేలేదు ......
అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .
అమ్మ ...... నాచేతిని అందుకుని ముద్దుపెట్టి ఆనందిస్తున్నారు .
సిస్టర్ - అంటీ ....... ఇంటికివెళ్లాక ఎంతసేపైనా ఉద్వేగానికి లోనుకావచ్చు , ఆకలేస్తోంది తిందాము అంటూ వడ్డించాను .
అమ్మ ప్రాణంలా తినిపించారు - అమ్మా అమ్మా చందమామ పాట అంటూ వింటూ సంతోషంతో తింటున్నారు పిల్లలు ........
తిన్నాక కూడా పిల్లలు కాసేపు ఆడుకుని ఆడుకుని వాళ్ళ అమ్మల ఒడిలోకి చేరారు.

అమ్మా ....... డిశ్చార్జ్ సమయం .
అమ్మ : పిల్లలూ ...... ఇక మేము ఇంటికి వెళతాము .
సంతోషంగా సంతోషంగా అమ్మా అమ్మా అమ్మా ....... అంటూ అమ్మను హత్తుకున్నారు .
సంతోషించి , పిల్లల పేరెంట్స్ దగ్గరకువెళ్లి , ఎటువంటి సహాయం కావాలన్నా ఒక్క కాల్ చెయ్యండి కొన్నిరోజులు స్విచ్ ఆఫ్ లో ఉంటుంది నేరుగా ఈ అడ్రస్ కు వచ్చెయ్యండి అనిచెప్పాను .
మళ్లీ నమస్కరించారు .
ఆపి , పిల్లలూ ...... బాగా చదువుకోవాలి , గుడ్ నైట్ ...... మీకు తనివితీరేంతవరకూ చందమామను ఎంజాయ్ చెయ్యండి .
Ok ok అన్నయ్యా ........
షిఫ్ట్ మారినా మాకోసం ఉన్న డాక్టర్స్ కు థాంక్స్ చెప్పి , త్వరలోనే డిన్నర్ కు ఆహ్వానిస్తాను అనిచెప్పి కిందకుదిగాము .
వద్దు వద్దు అన్నా పేరెంట్స్ - పిల్లలు హాస్పిటల్ బయటవరకూ వచ్చి వదిలారు .

అమ్మా ...... ఇదే మన కార్ ......
అమ్మ : ఇదే మన కార్ ok , మోకాలిని తగిలించకుండా ఎవరు కూర్చోబెట్టేది ? అంటూ చేతులను విశాలంగా చాపి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
Its me అమ్మా - అమ్మా ...... ఇంకా నొప్పివేస్తోందా ? .
అమ్మ : కోపంతో చూసి , నొప్పివేస్తుంది అంటే ఇటునుండి ఇటే హాస్పిటల్ లోపలికి తీసుకెళదామని కదూ ........
అయితే నొప్పిలేకున్నా ఎత్తుకోవాలన్నమాట - ఈ మాట నాకు చాలా చాలా సంతోషాన్నిస్తుంది - మా అమ్మ ఇష్టమే నా ఇష్టం అంటూ వీల్ చైర్ నుండి జాగ్రత్తగా ఎత్తుకున్నాను , అమ్మా ...... కారులో కూర్చోబెట్టేటప్పుడు తలకు తగలకుండా చూసుకోండి .
అమ్మ : అవన్నీ నువ్వే చూసుకోవాలి ఎందుకంటే నేను కేవలం నాకు ఇంత ఆనందాన్ని పంచిన నా మహేష్ ను మాత్రమే చూస్తాను ........
లవ్ ....... సంతోషం అమ్మా ...... , సిస్టర్ వెనుక చూడండి .
నర్స్ వచ్చి అమ్మ తలకు తగలకుండా చేతిని ఉంచడంతో జాగ్రత్తగా కారు ముందు సీట్లో కూర్చోబెట్టాను - అమ్మా ..... కంఫర్టబుల్ ? .
అమ్మ : చాలా .......
అమ్మా ...... సీట్ బెల్ట్ పెట్టుకోండి .
అమ్మ : సరే అంటూ ఎక్కడ ఉందో తెలిసినట్లు అందుకుని , ఎలా పెట్టుకోవాలి మహేష్ అంటూ ఏమీ తెలియనట్లు అమాయకంగా అడిగి లోలోపలే నవ్వుకుంటున్నారు .
అమ్మా ...... నిజంగా తెలియదా ? .
అమ్మ : ప్రామిస్ ......
మరి అక్కడే ఉంటుందని ఎలా తెలుసు ?.
అమ్మ : అదీ అదీ ....... ఇక్కడేదో తగిలింది అందుకున్నాను అంతే ......
Ok ok అమ్మా ...... డోర్ వేస్తున్నాను చూసుకండి , సిస్టర్ - అంటీ ...... కూర్చోండి అంటూ వెనుక డోర్ తెరిచి ఎక్కాక క్లోజ్ చేసాను , పిల్లలకు టాటా చెబుతూ అటువైపుకు వచ్చి డ్రైవింగ్ సీట్లోకి చేరాను .
అమ్మ : దొరికిపోయాను అన్నట్లు నవ్వుతూనే , మహేష్ ...... నువ్వుకూడా సీట్ బెల్ట్ పెట్టుకో అన్నారు .
ప్చ్ ....... సీట్ బెల్ట్ పెట్టడం మా అమ్మకు వచ్చి ఉంటే బాగుండేది అంటూ పెట్టుకున్నాను .
అమ్మ : కదా ప్చ్ ...... అంటూ నవ్వుకుంటున్నారు - పిల్లలకు టాటా చెబుతున్నారు .

అమ్మా - అంటీ ....... పోనివ్వనా ? అని అడిగి స్టార్ట్ చేసాను , నేరుగా అపార్ట్మెంట్ దగ్గరకు పోనిచ్చాను , సెక్యూరిటీ ఆపడం - సిస్టర్ కీస్ చూయించడంతో లోపలికిపోనిచ్చాను .
సిస్టర్ - అంటీ ...... వెళ్లి మీ అపార్ట్మెంట్ చూసుకుని , అవసరమైన లగేజీ తీసుకోండి - పైనుండి ఒక సైగ చేశారంటే కిందకు తీసుకొస్తాను .
నర్స్ : అలాగే మహేష్ సర్ అంటూ ఇద్దరూ లోపలికివెళ్లారు .
అమ్మ : నన్నూ తీసుకెళ్ళొచ్చుకదా నేనూ చూస్తాను .
వెంటనే కిందకుదిగబోతే ఆపి , ఊరికే తమాషాకు అన్నాను , నాకోసం ఏమైనా చేస్తావా ? మహేష్ ...... , స్టాప్ స్టాప్ స్టాప్ ...... ఆ మాట అన్నావంటే దెబ్బలుపడతాయి .
అమ్మతోపాటు నవ్వుకున్నాను .
అమ్మ : నాకోసం ఏమేమిచేసావో చూసానుకదా - మహేష్ పేరుగల వాళ్లందరికీ నేనంటే ఎందుకింత ప్రాణమో అర్థం కావడం లేదు .
అమ్మా ...... మీ మహేష్ కు మీరంటే అంత ప్రాణమా ? .
అమ్మ : ప్రాణం కంటే ఎక్కువ - నిన్ను తక్కువ చెయ్యడం కాదు కానీ ....... , నువ్వే ఇంత చేస్తే ఇక నీ ప్లేస్ లో నా కన్నయ్య ఉండి ఉంటే ఇంకెంత ప్రాణంలా చూసుకునేవాడో .......
అమ్మ మాటలకు పొంగిపోతున్నాను .
అమ్మ : మహేష్ ...... నా కన్నయ్య మహేష్ ను నీతో పోల్చుతూ పొగుడుతుంటే నీకు కోపం రావడం లేదా ? మురిసిపోతున్నావు .
మా అమ్మను నాకంటే ప్రాణంలా చూసుకునే వ్యక్తి ఉన్నాడని తెలిసి మరింత ఆనందం వేస్తోందమ్మా ....... , మా అమ్మ సంతోషం కంటే నాకేదీ అనవసరం ...... , ఒకసారి ఆ మహేష్ ను .......
అమ్మ : ప్లీజ్ ప్లీజ్ మహేష్ ...... నేను పూర్తిగా కోలుకునేంతవరకూ అడగను అని మాటివ్వు - ఇలా జరిగింది అని వాళ్లకు మాత్రం తెలియకూడదు - ఎంత బాధపడతారో నాకుమాత్రమే తెలుసు ......
అటువైపుకు తిరిగి కన్నీళ్లను తుడుచుకున్నాను , sorry అమ్మా ...... మీకు మాటిచ్చాను ఇబ్బందిపెట్టను అని , మిమ్మల్ని మీ కన్నయ్య మహేష్ అంత కాకపోయినా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను అంటూ అమ్మచేతిపై ముద్దుపెట్టబోయి ఆగిపోయాను .
అమ్మ నవ్వుకుంటున్నారు ......

సిస్టర్ - అంటీ ...... నన్నుపిలవమని చెప్పానుకదా అంటూ అమ్మచేతిని వారి తొడపై నెమ్మదిగా ఉంచి కారు దిగివెళ్లి ఇద్దరి చేతుల్లోని లగేజీ అందుకుని , కారులో వెనుక ఉంచాను .
ముందుకురాగానే మహేష్ సర్ అంటూ గుండెలపైకి చేరింది - అంటీ రెండు చేతులను జోడించారు .
అంటీ ఆపండి ప్లీజ్ , సిస్టర్ ...... అంత నచ్చిందన్నమాట అపార్ట్మెంట్ .....
నర్స్ : చాలా చాలా మహేష్ సర్ - మేడం ...... ఫైవ్ స్టార్ హోటల్లా ఉంది .
అమ్మ : Wow ....... , నేనూ వస్తాను అంటే ఎత్తుకోవడం నావల్లకాదు అన్నాడు మీ మహేష్ సర్ అంటూ నవ్వుకుంటున్నారు అమ్మ ......
నవ్వుకుని , సిస్టర్ ...... ఇప్పటికే ఆలస్యం అయ్యింది ఇంటికి వెళదాము అంటూ డోర్ తియ్యడంతో ఎక్కి కూర్చున్నారు , డోర్ క్లోజ్ చేసి ఎక్కి 20 నిమిషాలలో ఇంటికి చేరుకున్నాను , సెక్యూరిటీ ...... సెల్యూట్ చేసి మెయిన్ గేట్ తెరవడంతో కాంపౌండ్ సగం వరకూ వెళ్లి ఆపాను .

అమ్మా - సిస్టర్ వచ్చేసాము అంటూ అటువైపుకువచ్చి ముందు - వెనుక డోర్స్ తెరిచాను .
అయితే తీసుకెళ్లు చలివేస్తోంది అంటూ చేతులను చాపారు అమ్మ .......
సిస్టర్ : చలితోపాటు అంతా చీకటిగా ఉంది మహేష్ సర్ ....... , కింద పాదాలకు మెత్తగా ఉంది .
నవ్వుకున్నాను ....... అమ్మను ఎత్తుకుని , సిస్టర్ ...... చేతులు ఖాళీగా లేవు కాస్త చప్పట్లు కొట్టగలవా ? .
అనుమానంగానే చప్పట్లు కొట్టింది నర్స్ ......

అంతే ఒక్కసారిగా రెండు బిల్డింగ్స్ మరియు కాంపౌండ్ మొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోయాయి , " WELCOME అమ్మ " అంటూ స్వాగతం పలకడం - అదేసమయానికి ఆకాశంలో చీకటిని ప్రాలద్రోలుతూ వెలుగులను వెదజళ్లుతున్న తారాజువ్వలు ......
సంతోషపు ఆశ్చర్యంతో చూస్తుండగానే మాపై పూలవర్షం కురుస్తోంది .
అమ్మ సంభ్రమాశ్చర్యాలకు లోనుకావడం చూసి ఎంజాయ్ చేస్తున్నాను . మన ఇంటికి స్వాగతం అమ్మా ....... - అమ్మా ...... ఈ ఇంటి పేరు ఏమిటో తెలుసా ? .
నర్స్ : " అమ్మ నిలయం " - అదిగో అక్కడ ఉందిలే మహేష్ సర్ ....... , మేడం ..... పైనాపూల వర్షం - కిందేమో పూల దారి , ఇలాంటి స్వాగతాన్ని ఎన్నడూ ఎరుగలేదు అంటూ దోసిళ్ళతో పూలు అందుకుని అమ్మపై కురిపించింది .

అమ్మ : మహేష్ ...... తొందరగా కిందకు దించు తొందరగా తొందరగా ...... , దిగగానే సిస్టర్ కంటే చిన్నవారైనట్లు పూలవర్షాన్ని - తారాజువ్వాలను ఆస్వాధిస్తున్నారు .
అమ్మా ...... జాగ్రత్త .
అమ్మ : పడిపోతే పట్టుకోవడానికి నువ్వున్నావు కదా ...... , తనివితీరేంతవరకూ సిస్టర్ తోపాటు ఆనందించి , ఇన్ని ఏర్పాట్లు ఇంత ఖర్చు అవసరమా మహేష్ ? .
తొలిసారి మా అమ్మ వారి నిలయంలోకి అడుగుపెడుతున్నారు ఈమాత్రం లేకపోతే ఎలా అమ్మా - మా అమ్మకోసం ఏమైనా చేస్తాను - మా అమ్మ సంతోషం కంటే నాకింకేమి అవసరం లేదు .
అమ్మకళ్ళల్లో ఆనందబాస్పాలతో నా గుండెలపైకి చేరిపోయారు - థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ , ఏ జన్మలో అనుబంధమో ఈ జన్మలో ఇలా రక్తంతో ఏకం చేసింది అంటూ పరవశించిపోతున్నారు .
ఆఅహ్హ్ ...... నా హృదయం ఈ కౌగిలింత కోసమే ఎదురుచూస్తున్నట్లు మాటల్లో వర్ణించలేని సంతోషంతో గెంతులువేస్తోంది - అంతులేని ఆనందంతో మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తూ అలా కదలకుండా ఉండిపోయాను .

అమ్మ : మహేష్ ...... నీ గుండెచప్పుడు నన్ను ఎక్కడికో తీసుకెళ్లినట్లు అనిపిస్తోంది - జీవితాంతం నీ కౌగిలిలో ఉండిపోవాలనిపిస్తోంది .
మా అమ్మ చెప్పారు - నేను చెప్పలేదు అంతే తేడా అమ్మా ........ , అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని ఆస్వాదించడం ఇదే తొలిసారి అమ్మా అంటూ ఒకేసారి కళ్ళల్లో చెమ్మ - ఆనందబాస్పాలతో ఉద్వేగానికి లోనౌతున్నాను , అమ్మ కళ్ళల్లోకి చూస్తే అచ్చు నాలానే ఫీల్ అవుతున్నట్లు నా కళ్ళల్లోకే ప్రాణంలా చూస్తున్నారు .
ఇద్దరమూ ఒకేసారి నవ్వుకుని ఒకరి కన్నీళ్లను మరొకరం తుడుచుకున్నాము .
అమ్మా ...... మరికొద్దిసేపు ఇలానే ......
అమ్మ : మరికొద్దిసేపు ఏమిటి మహేష్ ...... , చెప్పానుకదా జీవితాంతం ఇలాగే ఉండిపొమ్మన్నా ఉండిపోతానని , అంత సంతోషం కలుగుతోంది ఇప్పటికే ఒకరోజంతా మిస్ అయ్యానని తెగబాధపడుతున్నాను అంటూ నా హృదయంపై తలవాల్చి ప్రాణంలా హత్తుకున్నారు . మహేష్ ...... ఇందాకటి నుండీ నీ హృదయం ఏదో చెప్పాలని తెగ కొట్టుకుంటోంది .
అవునమ్మా ....... మిమ్మల్ని చూసిన క్షణం నుండీ అలాగే చేస్తోంది - ఏమిటో అర్థం కావడం లేదు , మీకు అర్థమైతే చెప్పగలరు .......
అమ్మ : నెమ్మదిగా అర్థమవుతోంది - పూర్తిగా తెలిసాక ఖచ్చితంగా చెబుతాను మహేష్ అంటూ నవ్వుకున్నారు . వెంటనే కోపంతో నువ్వుమాత్రం కౌగిలించుకోవడం లేదు అంటూ ఛాతీపై కొట్టబోయి ఆగిపోయారు .
మా అమ్మ అనుమతి కోసం వేచిచూస్తున్నాను .
అమ్మ : అన్నీ ...... ఈ అమ్మ అనుమతితోనే చేశావా ? , నీ ప్రతీ సర్ప్రైజ్ ఎంతలా ఆనందించానో తెలుసా ? , లవ్ యు మహేష్ .......
ఆఅహ్హ్ ....... లవ్ యు సో మచ్ అమ్మా - ఈమాట చెప్పడం కోసం ఎంతలా ఆరాటపడుతున్నానో తెలుసా అమ్మా - " లవ్ యు సో మచ్ అమ్మా " అంటూ ఆకాశానికి వినిపించేంతలా కేకలువేసి అమ్మను ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపైకి తీసుకున్నాను .
ఆఅహ్హ్హ్ - ఆఅహ్హ్హ్ ....... హాయిగా - హాయిగా ఉంది అమ్మా - మహేష్ అంటూ నవ్వుకున్నాము ........
నర్స్ : " తల్లీ - బిడ్డ " స్వచ్ఛమైన ప్రేమను చూస్తూ మాకుకూడా చాలా సంతోషం వేస్తోంది మహేష్ సర్ అంటూ పూలవర్షం కురిపించారు .
Next page: Update 66
Previous page: Update 64