Update 66

అమ్మ దెబ్బలు కురిపిస్తున్నారు .......
ఆఅహ్హ్ ఆఅహ్హ్హ్ ...... లవ్ టు లవ్ టు అమ్మా అంటూ చేతులను విశాలంగా చాపాను .
నర్స్ : మేడం ...... ఈదెబ్బలు దేనికో తెలుసుకోవచ్చా ? .
నాకు తెలుసుగా .......
అమ్మ : తెలిసి అన్నిసార్లు చెప్పకుండా ఆగిపోయావా మరి .......
ఆ మాట వెనక్కు తీసుకున్న ప్రతీసారీ ...... ఈ హృదయం ......
అమ్మ : నాకు ఇప్పుడే అర్ధమౌతోంది మహేష్ - నేను ఒక్కసారి ఆపుకున్నందుకే విలవిలలాడిపోయాను తెలుసా ...... ? , కొట్టానుకదా నొప్పివేస్తోందా ? .
ఆఅహ్హ్ .......
నర్స్ : మేడం ...... తెలిసే అడుగుతున్నారుకదూ .......? .
అమ్మ దెబ్బల మాధుర్యం తెలియకుండానే పెరిగాను - సిస్టర్ ..... ఎందుకు ఆపావు? .
నర్స్ : అమ్మో ....... తల్లీకొడుకులు అటు తిరిగి ఇటు తిరిగి నా వైపుకు వచ్చారన్నమాట .......
ఇద్దరమూ నవ్వుకున్నాము .
నర్స్ : ఇంతకూ ఏమాటో చెప్పనేలేదు ? .
" లవ్ యు మహేష్ - లవ్ యు అమ్మ " అంటూ ఒకేసారి పలికి నవ్వుకున్నాము .
నర్స్ : నాకుకూడా తెలుసు , ఇదిగో ఇలా మీతో ఒకేసారి చెప్పించాలని ప్లాన్ వేసి సక్సెస్ అయ్యాను .
థాంక్యూ - థాంక్యూ ...... సిస్టర్ - రాధికా అంటూ సంతోషంతో నవ్వుకున్నాను .

నర్స్ : మహేష్ సర్ ...... గాయాలకు ఇంత చల్లనైన గాలి ఎక్కువగా తగలకూడదు .
అంటీ : ఇప్పుడా చెప్పేది అంటూ ప్రేమతో మొట్టికాయవేశారు .
అవును సిస్టర్ ఇప్పుడా చెప్పేది - అమ్మా ...... లోపలికి వెళదాము .
అమ్మ : ప్చ్ ...... , రాధికా ...... కొద్దిసేపటి తరువాత చెప్పొచ్చుకదా , మహేష్ కౌగిలిలో ఎంత హాయిగా ఉందో తెలుసా ? .
నర్స్ : అమ్మ - మహేష్ సర్ ఏమో ఆలస్యంగా చెప్పినందుకు కోప్పడ్డారు మీరేమో ...... మరికొద్దిసేపు తరువాత చెప్పమంటున్నారు .
లవ్ యు సో మచ్ అమ్మా ........
అమ్మ : తారాజువ్వలు - పూలవర్షం ...... అంతేనా ? .
This is the best day of my life అమ్మా ....... except హాస్పిటల్ స్టే - అంతటి బెస్ట్ డే ను ఇలా కొన్నిక్షణాలే సెలెబ్రేట్ చేసుకుంటామా చెప్పండి , మా అమ్మ " అమ్మ నిలయంలోకి " అడుగుపెట్టేంతవరకూ ఆకాశంలో వెలుగులు మరియు పూలవర్షం కురుస్తూనే ఉంటుంది అంటూ విజిల్ వేసాను .

మరు క్షణంలో క్రాకర్స్ ...... ఆకాశంలో అద్భుతాన్నే సృష్టిస్తున్నాయి - ఆ స్పార్కిల్స్ పూలుగా రూపాంతరం చెందినట్లు మాపై కురుస్తున్నాయి .
అమ్మ : ఇంత ఇష్టమా మహేష్ అంటూ గట్టిగా కౌగిలించుకుని వదిలి సిస్టర్ తోపాటు గులాబీరేకుల వర్షాన్ని తనివితీరా ఎంజాయ్ చేస్తున్నారు - రాధికా ...... గాయాల గురించి చెప్పావు మరి మోకాలి నొప్పి గురించి చెప్పలేదే .......
నర్స్ : నొప్పి నొప్పి మోకాలి నొప్పి ....... ఆ ఆ ..... మహేష్ సర్ ..... మేడం ఇంతసేపు నిలబడే ఉండకూడదు ఇక మీ ఇష్టం .......
అమ్మ : ఆ సంగతి ఇప్పుడా చెప్పేది రాధికా అంటూ సున్నితంగా మొట్టికాయవేశారు.
నర్స్ : స్స్స్ ..... , ఈ మ్యాజిక్ సెలెబ్రేషన్స్ లో మరిచిపోయాను మేడం ...... , ఇప్పటికే ఆలస్యం అయ్యింది - మహేష్ సర్ మహేష్ సర్ ......

స్స్స్ ..... నొప్పి ఎత్తుకో అన్నట్లు చేతులను విశాలంగా చాపి దీనంగా కాదు ప్రేమతో కాదు కాదు ...... హృదయం పులకించిపోయేలా చూస్తున్నారు .
ఆ మైకంలో అమ్మ కళ్ళల్లోకే ప్రేమతో చూస్తూ వెళ్లి , sorry అమ్మా ...... మీకు నొప్పివేస్తే ఈపాటికి ఇక్కడ హృదయానికి తెలిసిపోయేదే ...... ఎందుకు తెలియలేదంటారు ? అంటూ ప్రాణంలా గుండెలపైకి ఎత్తుకున్నాను .
నర్స్ : ఎందుకంటే నొప్పిలేదు కాబట్టి - మీరు ఎత్తుకోవాలని ఆశపడుతున్నారు కాబట్టి అంటూ సంతోషంతో గుసగుసలాడుతోంది .
సిస్టర్ ...... ఏమిటో అన్నారు ? .
అమ్మ : ఏమీలేదు ఏమీలేదు అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు , ఇప్పుడు హాయిగా - వెచ్చగా ఉంది , ఎందుకో తెలియదు జీవితాంతం ఇలానే ఉండిపోవాలనిపిస్తోంది మహేష్ .......
లవ్ టు అమ్మా - అంతకంటే అదృష్టమా చెప్పండి , మై హార్ట్ ...... అమ్మకు నొప్పివేస్తోందని ఎందుకు చెప్పలేదు చెప్పు ....... , ఇక ఎప్పుడూ ఇలా చెయ్యకు సరేనా ...... ? .
అమ్మ : లేదు లేదు లేదు - నా మహేష్ హార్ట్ తప్పేలేదు .
నర్స్ : అంటే మీరే అపద్ధo చెప్పారన్నమాట .......
సిస్టర్ ...... వినిపించడం లేదు .
నర్స్ : అమ్మే ప్రాణం అయితే ఇక మా మాటలు ఎలా వినిపిస్తాయి చెప్పండి అంటూ నవ్వుకుంటోంది .
అమ్మ : రాధికా ...... నీకు దెబ్బలుపడాలి .
ఆ దెబ్బలేవో నన్ను కొట్టొచ్చు కదమ్మా ........
అమ్మ : సంతోషంతో నవ్వుకుంటూనే కొట్టబోయి హృదయంపై ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ .......
అమ్మ : మహేష్ మహేష్ ...... నేను కౌగిలించుకున్నప్పుడు మరియు ఇలా ముద్దులుపెట్టినప్పుడు ప్రతీసారీ , నీ హృదయం ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది కానీ అర్థం కావడం లేదు అంటూ చెవిని తాకించారు , అర్థం కాకపోతేనే వొళ్ళంతా జిల్లుమంటోంది తెలుసా .......
మా అమ్మను చూసిన క్షణం నుండీ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది అమ్మా ...... , ఏమిటో అర్థం కావడం లేదు - మీరే ఎలాగైనా తెలుసుకోవాలి .
అమ్మ : తెలుసుకోవాలంటే ఇదిగో ఇలాగే నీ హృదయంపైనే ఉండాలి .
నర్స్ : మహేష్ సర్ కాదనగలరా మేడం - మీరు అడగడం విడ్డూరం కాకపోతేనూ ....... , మేడం sorry ...... మహేష్ సర్ ...... మేడం గారు ఎక్కువసేపు ఇంతటి చలిలో ఉండనేకూడదు - తేమ ఎక్కువగా ఉంటుంది .
అమ్మ : చలి ఎక్కడ ఉంది రాధికా ...... , నీకు చలివేస్తోంది లోపలికివెళదాము అనిచెప్పు అంతేకానీ .......
నర్స్ : అలాగైనా అనుకోండి మంచిదే కదా ........
అమ్మా ....... లోపలికివెళదాము - అంటీ కూడా ఉన్నారుకదా ......
అమ్మ : అవునవును sorry మహేష్ ......

సిస్టర్ - అంటీ ...... మీకు ప్రైవేసి కావాలనుకుంటే ఆ బిల్డింగ్ లో ఉండవచ్చు , మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యరు ......
నర్స్ : నో నో నో ...... ఈ బిల్డింగ్ లోకూడా బానే ఉంటుంది - అయినా మాకు ప్రైవసీ ఏమిటి మహేష్ సర్ .......
అమ్మ : మహేష్ ...... ఒంటరిగా ఉండటానికి రాధిక భయపడుతోంది అంటూ నవ్వుకుంటున్నారు .
నర్స్ : అవును అదిమాత్రం నిజం - అంత పెద్ద బిల్డింగ్ లో ఒంటరిగానా నో నో నో మహేష్ సర్ ......
అయితే మీ ఇష్టం - కింద నాలుగు రూమ్స్ ఉన్నాయి .
నర్స్ : అమ్మను రూంలో వదిలి నేను ..... మేడం దగ్గరే ఉంటాను , ఈ ఒక్కరాత్రికి అర్ధరాత్రి ఒకసారి టాబ్లెట్స్ ఇవ్వాలి .
థాంక్యూ సిస్టర్ .......
నర్స్ : మీకోసం ఏదైనా మహేష్ సర్ .......

సంతోషించి , ఆకాశంలో తారాజువ్వలు - మాపై పూలవర్షాన్ని ఆస్వాదిస్తూనే , అమ్మను గుండెలపై హత్తుకుని మెయిన్ డోర్ దగ్గరికి చేరుకున్నాము . అప్పటికే సెక్యూరిటీ ...... పూర్తిగా తెరిచి ఉండటంతో హృదయపూర్వక స్వాగతం అమ్మా - సిస్టర్ - అంటీ అంటూ లోపలికి అడుగుపెట్టగానే ...... బిల్డింగ్ మొత్తం ఆటోమేటిక్ లైట్స్ వెలిగాయి .
నర్స్ : Wow ఆటోమేటిక్ లైట్స్ అంటూ లోపలికివెళ్లి చుట్టూ చూసి సంతోషిస్తోంది . మేడం మేడం ...... ముందుగా sorry మహేష్ సర్ ...... అమ్మ అమ్మ అమ్మ అంటూ పదేపదే కలవరిస్తుంటే ...... క్షమించండి వదిలెయ్యండి , మేడం మేడం ...... నిజమే బిల్డింగ్ గోడలపై ఎక్కడ చూసినా " అమ్మ " అనే రాసి ఉంది - ఇక్కడ చూడండి ఎంత పెద్దగా అమ్మ అని రాసి ఉందో .......
అమ్మ : ఆపాటికే చూసినట్లు కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు మహేష్ ....... , అమ్మను ఎంత మిస్ అవుతున్నావో తెలుస్తోంది అంటూ ఎమోషనల్ అయినట్లు కిందకుదిగి ప్రాణంలా కౌగిలించుకున్నారు .
అమ్మ కౌగిలింత ఎలా ఉంటుందో మా అమ్మ ఈకౌగిలింతల్లోనే తెలిసింది అమ్మా ........ , ఇప్పటికి కౌగిలింత - హృదయంపై ముద్దు - బోలెడన్ని దెబ్బలు - చిరు చిరు గిల్లుళ్లు ........ ఒక్కరోజులో ఇన్ని అంటే తరువాత తరువాత ......
అమ్మ : తథాస్తు అన్నట్లు ఉమ్మా అంటూ నా హృదయంపై ముద్దుపెట్టి ఆనందిస్తున్నారు .
ఆఅహ్హ్ ...... లవ్ యు అమ్మా ...... , అమ్మా ...... నా ప్రేమతో బోర్ కొట్టిస్తున్నాను ఇప్పటికే ఆలస్యం అయ్యింది , మీకు రెస్ట్ అవసరం అని డాక్టర్స్ ఇద్దరూ పదేపదే చెప్పారు .
అమ్మ : డాక్టర్స్ కేమిటి ఎన్నైనా చెబుతారు - నాకు ఇలానే ఉండాలని ఉంది .
లవ్ టు లవ్ టు అమ్మా .......
అమ్మ : లవ్ టు లవ్ టు అంటావు కానీ చేతులను మాత్రం వెనుక కట్టేసుకున్నావు అంటూ ఛాతీపై దెబ్బలుకురిపిస్తున్నారు .
నర్స్ : అవును మేడం ...... అప్పటినుండీ నేనూ గమనిస్తూనే ఉన్నాను .
అదికాదు అమ్మా ...... , ఆ మధురానుభూతి ఎలా ఉంటుందో ఏమో అలా కౌగిలించుకున్నాక నేను తట్టుకోగలనో లేనో ...... , కొద్దిసేపైనా అలా అది ఎంతసేపైనా పట్టొచ్చు అందుకే అమ్మా .......
అమ్మ : ఎంతసేపైనా నేనుండగలను .......
ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకోవాలని ఆగుతున్నాను అమ్మా .......
అమ్మ : అంటే తప్పంతా ఆ ఇద్దరు డాక్టర్స్ దే అన్నమాట .......
సిస్టర్ తోపాటు నాకూ నవ్వు వచ్చేసింది . అంటీ ...... మీకిష్టమైన గదిలో రెస్ట్ తీసుకోండి అంటూ పంపించి అమ్మను వారి గదిలోకి ఎత్తుకునివెళ్లి బెడ్ పై కూర్చోబెట్టాను .

అమ్మా ....... హాయిగా రెస్ట్ తీసుకోండి - నేను హాల్లోని సోఫాలో ఉంటాను , సిస్టర్ ...... ఏ అవసరం పడినా పిలవండి - ఎదురుగా ఉన్నది వంట రూమ్ - ఫ్రిడ్జ్ లో అన్నీ ఉన్నాయి .

అమ్మ : ఇక్కడే పడుకోవచ్చు కదా ..... అంటూ చుట్టూ చూసి నవ్వుకున్నారు . సరే సరే ...... ఒకేఒక బెడ్ ఉంది కదూ .......
అమ్మా ...... ప్రక్కనే ఉంటానుకదా గుడ్ నైట్ , సిస్టర్ ..... నీకుకూడా , నేను ఇక్కడే ఉన్నంతసేపూ అమ్మ పడుకోరు ......
నర్స్ : అది నిజమే అంటూ నవ్వుకుంది .
అమ్మా ...... తెల్లవారుఘామున మీకొక అద్భుతమైన సర్ప్రైజ్ చూయిస్తాను .
అమ్మ : Wow సర్ప్రైజ్ ...... వెయిటింగ్ మహేష్ , ప్చ్ ..... నువ్వు వదిలావా ఇదిగో ఇప్పుడు చలివేస్తోంది .
లవ్ యు అమ్మా అంటూ మందమైన దుప్పటిని చుట్టాను .
అమ్మ : ప్చ్ ...... ఆ వెచ్చదనపు తియ్యదనం వేరు .
ఆఅహ్హ్ ...... లవ్ టు అమ్మా అంటూ ఫీల్ అవుతూనే బయటకువెళుతున్నాను .
అమ్మ : నవ్వుకున్నారు , రాధికా ...... ఇప్పటివరకూ తెలియలేదు కానీ వెంటనే బాత్రూమ్ కు వెళ్ళాలి .
నర్స్ : నాకుకూడా అలాగే అనిపిస్తోంది మేడం - ముందు మీరు అంటూ నవ్వుకుంటూ వెళ్లారు .

పెదాలపై తియ్యదనంతో నేనుకూడా మరొకగదిలోకి వెళ్లివచ్చి , సోఫాను బెడ్ గా మార్చి , లైట్స్ ఆఫ్ అనేంతలో ...... మొబైల్ రింగ్ అయ్యింది .
చూస్తే స్టిచింగ్ షాప్ సిస్టర్ నుండి " మహేష్ సర్ ...... మీరిచ్చిన సారీస్ అన్నీ రెడీ సర్ - తీసుకునివచ్చాము బయటే ఉన్నాము " .
గుడ్ న్యూస్ చెప్పారు సిస్టర్ ...... , కమింగ్ అంటూ బయటకువెళ్ళాను , థాంక్యూ థాంక్యూ సిస్టర్ అంటూ వారితోపాటు వచ్చిన ఇద్దరు సిస్టర్స్ సహాయంతో అమ్మ గదిలోకి తొంగిచూసి , పర్ఫెక్ట్ అంటూ లోపలకు వెళ్లి నర్సుకు ష్ ష్ సైగలతో చకచకా అన్నింటినీ కప్ బోర్డ్స్ లో ఉంచేసి సైలెంట్ గా బయటకువచ్చేసాము .
సిస్టర్స్ కోరిన అమౌంట్ కంటే మాటిచ్చినట్లుగా డబల్ అమౌంట్ ను క్యాష్ ద్వారా ఇచ్చాను .
" మహేష్ సర్ ...... ప్రతీసారీ మమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు - థాంక్యూ సో మచ్ సర్ "
ఈసారైతే చెప్పిన సమయంలోపు హెల్ప్ చేసి ఇంత సమయంలోనూ వచ్చి ఆశ్చర్యపరిచారు మీకే థాంక్స్ చెప్పాలి - మీ ఇంటివరకూ వదిలేసివస్తాను .
" లేదు లేదు సర్ క్యాబ్ wait చేస్తోంది "
సిస్టర్స్ వెనుకే మెయిన్ గేట్ వరకూ వెళ్లి , సారీస్ తీసుకొచ్చిన లగేజీ వెహికల్ కు - క్యాబ్ కు పే చేసి జాగ్రత్తగా తీసుకెళ్లు అంటూ నెంబర్ నోట్ చేసుకున్నాను డ్రైవర్ ఫోటో తీసుకున్నాను .
" థాంక్యూ మహేష్ సర్ ...... , కంగారుపడకండి మాకు తెలిసిన వ్యక్తే "
అయితే ok సిస్టర్స్ ..... , మీకు ఎన్ని థాంక్స్ చెప్పినా తక్కువే గుడ్ నైట్ ......
" గుడ్ నైట్ మహేష్ సర్ ...... - దివ్య మహి వాళ్ళను అడిగినట్లు చెప్పండి " వెళ్లిపోయారు .
అవునుకదా ...... , అమ్మ మాధుర్యంలో అక్కయ్య - చెల్లి - ఫ్రెండ్ - నా ప్రియమైన దేవకన్యనే మరిచిపోయాను అంటూ నవ్వుకున్నాను , ఇక అమ్మ అంటారా ....... మా ఇంటిలో నాతోనే ఉన్నారు అంటూ హృదయంపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .

అమెరికా మేనేజర్ కు కాల్ చేసి అక్కడ నుండి కాల్ చేసినట్లు వేరే మొబైల్ నుండి కాల్ చేయించి ఇక్కడి నుండే మాట్లాడాలి అనుకుని స్విచ్ ఆన్ చేసేంతలో ......
అమ్మగదిలోనుండి నిరాశతో కూడిన నిట్టూర్పులు వినిపించడంతో డోర్ దగ్గరికివెళ్ళాను .
అమ్మ : ప్చ్ ప్చ్ ....... నిన్నటి నుండీ కాల్ చేస్తున్నాను స్విచ్ ఆఫ్ లోనే ఉన్నావు - కన్నయ్యా ..... నాతో మాట్లాడకుండా ఉండలేవు కదా , ఎక్కడ ఉన్నారు ఏమి చేస్తున్నారు ....... ? , నీ మాయలోపడి తల్లులు ఎలాగో కాల్ చేయరని తెలుసులే అంటూ నవ్వుకున్నారు , కన్నయ్యా ...... నీతో మాట్లాడకుండా ఉండలేను .
అమ్మ ...... నాగురించే కలవరిస్తున్నారు అంటూ లోలోపలే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాను . వెంటనే అమ్మా ...... రెస్ట్ తీసుకోండి అంటే మొబైల్లో గేమ్స్ ఆడుతున్నారా ? .
అమ్మ : గేమ్స్ ఆడుకునే మొబైలా ఇది .
నవ్వుకున్నాను - sorry sorry అమ్మా .....
అమ్మ : ఇప్పుడు నీ ప్లేస్ లో ఉంటే నీకంటే ఎక్కువ ప్రేమతో చూసుకునేవాడు నా కన్నయ్య అని చెప్పానే ఆ కన్నయ్యకే కాల్ చేస్తున్నాను - ఉదయం నుండీ స్విచ్ ఆఫ్ అని వస్తోంది ప్చ్ ......
ఏదీ నెంబర్ ఇవ్వు అమ్మా .......
అమ్మ : ఇదిగో నాకు నిద్రవస్తోంది మహేష్ గుడ్ నైట్ అంటూ దుప్పటిని పూర్తిగా కప్పుకుని నవ్వుకుంటున్నారు .
అంతలో సిస్టర్ బాత్రూమ్ నుండి వచ్చి సోఫాలో పడుకోబోయింది .
ఆ చప్పుడుకు అమ్మ దుప్పటి తెరిచి , రాధికా ...... మాస్టర్ బెడ్ ముగ్గురు కంఫర్టబుల్ గా పడుకోవచ్చు ......
నర్స్ : మేడం ...... అదీ అదీ నేను నిద్రలో కాలువేస్తాను - మీ మోకాలు దెబ్బతగలకుండా ఉండి ఉంటే ఎప్పుడో బెడ్ పైకి చేరేదానిని ......
థాంక్యూ సిస్టర్ అంటూ సోఫాను బెడ్ గా మార్చి బయటకువచ్చాను .
నర్స్ : Wow ...... ఇప్పుడు అటూ ఇటూ దొర్లుతూ హ్యాపీగా నిద్రపోవచ్చు అంటూ వాలిపోయింది .
బయటకువచ్చి , అమ్మో ...... ఈ మొబైల్ ను మాత్రం స్విచ్ ఆన్ చేయకూడదు చాలా రిస్క్ , దివ్యక్కా - చెల్లీ - మహీ ....... sorry లవ్ యు లవ్ యు స్వీట్ పెయిన్ కలిగించక తప్పదు అంటూ సోఫాలోకి చేరాను , బాగా అలసిపోవడం వలన వెంటనే నిద్రపట్టేసింది .

మహేష్ సర్ మహేష్ సర్ ....... అంటూ కంగారు కంగారు కేకలు వినిపించడంతో ఉలిక్కిపడిలేచాను - సిస్టర్ సిస్టర్ అంటూ అమ్మ గదిలోకి పరుగులుతీసాను , హాస్పిటల్లో లానే బాబూ ..... నన్ను క్షమించు - కన్నయ్యా ..... ఈ అమ్మను మన్నించు అంటూ నిద్రలోనే కలవరిస్తూ కదులుతున్నారు .
అమ్మా అమ్మా ...... అంటూ కంగారుపడుతూనే అమ్మ చేతిని అందుకున్నాను .
ఆశ్చర్యం అమ్మ ఒక్కసారిగా రిలాక్స్ అయ్యి నా చేతిని హృదయంపై హత్తుకున్నారు .
థాంక్ గాడ్ అంటూ సిస్టర్ కూల్ అయ్యింది - మహేష్ సర్ ...... చేతినిమాత్రం వదలకండి ......... , నిన్నలానే సరిగ్గా అర్ధరాత్రి సమయం .......
అమ్మ : బాబూ బాబూ ...... నిన్ను విడిచి ఎక్కడికీ వెళ్లను - నన్ను విడిచి ఎక్కడికీ వెళ్లకు అంటూ నా చేతిని ...... రెండుచేతులతో గట్టిగా పట్టుకుని కలవరిస్తున్నారు .
అమ్మా అమ్మా ...... అంటూ అమ్మ నుదుటిపై పట్టిన చెమటను తుడిచి ప్రాణంలా స్పృశిస్తున్నాను .
అమ్మ : బాబూ ...... నిన్ను దూరం చేసుకుని నేను బాధపడని రోజంటూ లేదు - నిన్ను ఈ అమ్మ ప్రేమకు దూరం చేసాను ....... , అందుకే ప్రాయశ్చిత్తంగా ******************************************************************************** అంటూ కలవరిస్తూనే ఉద్వేగానికి లోనౌతున్నారు .

నర్స్ : మహేష్ సర్ ...... మేడం లోలోపల చాలా పెయిన్ ను అనుభవిస్తున్నారు .
అమ్మా అంటూ చేతిపై ముద్దుపెట్టాను .
నర్స్ : మహేష్ సర్ మరొకసారి మళ్లీ మళ్లీ ...... , మహేష్ సర్ ...... ముద్దులుపెట్టిన ప్రతీసారీ మేడం హాయిగా నిద్రపోతున్నారు - కలవరింతలు ఆగిపోయాయి .
అమ్మా ...... నేను ప్రక్కనే ఉంటాను మీరు హాయిగా నిద్రపోండి అంటూ చేతిని ప్రేమతో స్పృశిస్తూ ముద్దులుపెడుతున్నాను - భుజాలవరకూ దుప్పటికప్పాను , సిస్టర్ ....... అమ్మ టాబ్లెట్ వేసుకోవాలి కదూ ......
నర్స్ : నాకు తెలిసి అవసరం లేదు మహేష్ సర్ ...... , అది మత్తు టాబ్లెట్ - మేడం హాయిగా నిద్రపోతున్నారుకదా ....... , ఒకవేళ లేపితే కంగారుపడతారు .
వద్దు వద్దు అయితే వద్దు ....... , కాసేపటి తరువాత సిస్టర్ ...... ఇక ఏమీ పర్లేదుకదా నువ్వు పడుకో ......
నర్స్ : మరి మీరు ? .
అమ్మ సంతోషం కంటే నాకింకేమి కావాలి చెప్పండి .
నర్స్ : అయితే నేనుకూడా ......
పర్లేదు నేనున్నానుకదా సిస్టర్ ...... , పైగా రేపు జర్నీ కూడా చెయ్యాలి వెళ్లు వెళ్లి పడుకో ....... , అమ్మా ...... మీ చేతిని వదలనే వదలను ఇలా హాయిగా నిద్రపోండి అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
మ్మ్మ్ ...... అంటూ ఒకవైపుకు తిరిగి నా చేతిని గట్టిగా హృదయంపై హత్తుకున్నారు - బాబూ ...... నన్ను వదిలి వెళ్లకు వెళ్లకు ......
వెళ్లనే వెళ్లను అమ్మా ....... అంటూ చెవిలో చెప్పగానే , అమ్మపెదాలపై తియ్యదనం ....... , నా సున్నితమైన స్పర్శకు - ముద్దుముద్దుకూ ...... అమ్మ పెదాలపై చిరునవ్వులు మరియు అమ్మ తియ్యనైన మూలుగులను వింటూ ఆనందిస్తూనే నిద్రపోకుండా అమ్మనే చూస్తూ కూర్చున్నాను .
*******************

ఉదయం 5:30 అవ్వగానే అలర్ట్ అయిపోయాను - నిమిషం నిమిషానికే గడియారం వైపు చూస్తూ అమ్మ చేతిపై ప్రాణమైన ముద్దులుపెడుతున్నాను .
ముద్దుముద్దుకూ అమ్మ పెదాలపై చిరునవ్వులు ...... , లవ్ యు అమ్మా అంటూ అమితమైన ఆనందాన్ని పొందుతున్నాను .

Its టైం అంటూ అమ్మ నుదుటిపై ముద్దుపెట్టి మందమైన దుప్పటితోసహా అమ్మను జాగ్రత్తగా గుండెలపైకి తీసుకున్నాను .
మరింత వెచ్చగా ఉన్నట్లు మ్మ్మ్ ...... అంటూ గువ్వపిల్లలా వొదిగిపోయారు నా గుండెలపై .......
సంతోషంతో నవ్వుకున్నాను - మా అమ్మకోసం ఎదురుచూస్తున్న ఒక అందమైన ప్రకృతి దగ్గరకు తీసుకెళ్లబోతున్నాను .
నీతోపాటు ఎక్కడికైనా రెడీ అన్నట్లు నా మెడ చుట్టూ చేతులువేసారు .
లవ్ యు సో మచ్ అమ్మా అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .

ఆ అలికిడికి మేల్కొన్నట్లు , మహేష్ సర్ ...... నన్ను వదిలివెళ్లిపోతున్నారు కదూ అంటూ నర్స్ నిద్రమత్తులో కాస్త కోపంగానే చూస్తోంది .
Sorry sorry సిస్టర్ - నిద్రను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టంలేక అంటూ నవ్వుకున్నాను .
నర్స్ : మేడం కు డబల్ సర్ప్రైజ్ అన్నమాట ......
ష్ ష్ ష్ ...... ఫాలో మీ సిస్టర్ అంటూ బుజ్జాయిలా నిద్రపోతున్న అమ్మనే చూస్తూ లిఫ్ట్ ద్వారా పైకివెళ్లి బ్రిడ్జ్ చేరుకున్నాను .
ఒక్కసారిగా అతిచల్లనిగాలి తాకినట్లు అమ్మ గట్టిగా అల్లుకుపోయారు - ఇక సిస్టర్ అయితే దుప్పటి తెచ్చుకోకపోవడంతో గజగజవణికిపోతోంది - అంతలో సముద్రాన్ని చూసి Wow అనబోయి వెంటనే నోటిని లాక్ చేసేసి ఆనందిస్తోంది .

ఇప్పుడేమి చూశావు సిస్టర్ ...... wait for one more మినిట్ ....... అండ్ here it is అంటూ సముద్రంవైపు చూడమని చెప్పి , అమ్మా అమ్మా ...... అంటూ ప్రేమతో లేపాను .
" మ్మ్మ్ మ్మ్మ్ ...... మహేష్ వెచ్చగా ఉంది అంటూ మరింత గట్టిగా అల్లుకుపోతున్నారు "
అమ్మా అమ్మా ...... మార్నింగ్ సర్ప్రైజ్ అని చెప్పానుకదా ......
" సర్ప్రైజ్ అంటూ సంతోషంతో అమ్మ కళ్ళు తెరవడం - రైజ్ అవ్వడానికి అనుమతి లభించినట్లు ఆ క్షణానే సూర్యుడు ఉదయించడం - చుట్టూ ఎర్రటి వాతావరణం అందమైన మేఘాలు ...... అమ్మకోసం అన్నట్లు పక్షులు గుంపుగా అలా దాటుకుంటూ వెళ్లిపోతున్నాయి " ......
ఆ సౌందర్యమైన ప్రకృతి అద్భుతాన్ని పెదాలపై చిరునవ్వులతో కన్నార్పకుండా తిలకిస్తున్నారు - బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ ...... సర్ప్రైజ్ మహేష్ ఈ దృశ్యాన్ని తిలకించడం నా అదృష్టం ......
నా అదృష్టం కూడానూ అంటూ నర్స్ ఉత్సాహంగా చూస్తోంది .
నాతోపాటు అమ్మ కూడా నవ్వుతున్నారు - చాలా చాలా అందమైన దృశ్యం మహేష్ - ఈ ప్రకృతి అందాన్ని నా మహేష్ గుండెలపైనుండి చూస్తుండటం మరింత సంతోషాన్ని పంచుతోంది - లవ్ యు అంటూ నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్హ్ ...... లవ్ యు లవ్ యు సో మచ్ అమ్మా ...... , అమ్మా ..... నిజం చెబుతున్నాను ఈ ప్రకృతి అద్భుతాన్ని నా ప్రాణం కంటే ఎక్కువైన వారికి చాలామందికి చూయించాను కానీ మా అమ్మకు చూయిస్తుంటే కలుగుతున్న సంతోషం ఎవరెస్టు అమ్మా మాటల్లో వర్ణించలేకపోతున్నాను అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో చెప్పి పరవశించిపోతున్నాను .
అమ్మ : నువ్వు చెప్పావు నేను చెప్పలేదు అంతే తేడా అంటూ నా హృదయంపై ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ...... మోస్ట్ హ్యాపీనెస్ ఎవర్ అమ్మా ..... , యాహూ యాహూ ...... థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ సన్ రైజ్ ...... ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతున్నాను .
అమ్మ : ( ప్చ్ ప్చ్ ...... ఆ ముద్దులేవో ఈ అమ్మకు పెట్టి ఉండొచ్చుకదా ) అంటూ నావైపు - సన్ రైజ్ వైపు చూస్తున్నారు .
అమ్మా ...... ఏదైనా చెప్పారా ? .
అమ్మ : అన్నీ తెలుస్తాయి ఇలాంటివి మాత్రం ...... , ప్చ్ ..... ఏమీలేదులే అంటూ వెలిగిపోతున్న కళ్ళతో ప్రకృతి అందాన్ని తిలకిస్తున్నారు .

అమ్మా ...... ఈ అద్భుతాన్ని మరింత ఆస్వాదించాలంటే అదిగో అలా సిస్టర్ లా దుప్పటిలేకుండా వీక్షించాలి .
నర్స్ : అవునుమేడం ...... , వణికిస్తున్న చల్లటి గాలిలో చూస్తుంటే మరింత అద్భుతంగా ఉంది .
అమ్మ : నా మహేష్ ఎలచెబితే అలా అంటూ నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , నా కళ్ళల్లోకే ప్రాణంలా చూస్తూ కిందకుదిగి , దుప్పటిని వెనుక ఉన్న సోఫాలోకి వదిలారు .
అంతే చలిచలి అంటూ నన్ను గట్టిగా హత్తుకున్నారు .
సిస్టర్తోపాటు నవ్వుకుని , అమ్మా అమ్మా ...... ఇప్పుడు వీక్షించండి .
అమ్మ : చలికి వణుకుతూనే సగం ఉదయించిన సూర్యుడివైపు చూసి Wow రియల్లీ బ్యూటిఫుల్ మహేష్ - రాధికా ...... , ప్రకృతితో మమేకమై చూస్తుంటే మరింత సౌందర్యం ...... లవ్ యు మహేష్ అంటూ నా హృదయంపై ముద్దుపెట్టి హత్తుకునే వీక్షించి పులకించిపోతున్నారు .
ఆఅహ్హ్ ...... అంటూ జలదరింతలుకు లోనై అమ్మ సంతోషాలను మనసారా ఎంజాయ్ చేస్తున్నాను .

అమ్మా ...... మీరు సన్ రైజ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి 10 మినిట్స్ లో వచ్చేస్తాను అంటూ అమ్మను వెనుక సోఫాలో కూర్చోబెట్టాను .
అమ్మ : పది నిమిషాలా ...... ఎక్కడికి ? అంటూ వదలడం లేదు .
ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను అమ్మా ......
అమ్మ : ప్చ్ ప్చ్ ...... వెళ్ళాల్సిందేనా ? .
మా అమ్మ సంతోషాలను చూడకుండా అంతకుమించి నేనూ ఉండలేను .......
అమ్మ : సంతోషంతో నవ్వుకున్నారు , అయితే సూర్యుడు పూర్తిగా ఉదయించేంతవరకూ ఉండు ......
లవ్ టు అమ్మా అంటూ ప్రక్కనే కూర్చున్నాను .
అమ్మ : వైజాగ్ లో ఉదయం మాత్రం చాలా చలిగా ఉంటుంది అంటూ నా చేతిని ప్రాణంలా చుట్టేసి సన్ రైజ్ వీక్షిస్తున్నారు .
అమ్మ కోపాన్ని ఆస్వాదించాలని ...... , అమ్మా ...... మన ఇల్లు వైజాగ్ లోనేనా ? అని అడిగాను .
అంతే కోపంతో చూస్తున్నారు .
అమ్మా కోపం వస్తే చేతిని కొరికేయ్యొచ్చు అంటూ నవ్వుకుంటున్నాను .
అమ్మ : అవును కొరికేస్తాను ......
స్స్స్ ...... sorry sorry అమ్మా అంటూ నవ్వుకున్నాను , మా అమ్మ కోపం కూడా ఇష్టమే నాకు - కోపంలో మా అమ్మ ఎర్రటి సన్ రైజ్ కంటే అందంగా ఉన్నారు ......
అమ్మ : పో మహేష్ అంటూ సిగ్గుపడుతున్నారు .
పోతాను అంటే మీరే వదలడం లేదు ......
అమ్మ : ఊహూ ...... వదలనంటే వదలను అంటూ మరింత గట్టిగా చుట్టేశారు .

నర్స్ : మహేష్ సర్ ...... , సూపర్ వ్యూ - ఇలా రోజూ ఎంజాయ్ చేస్తారా ? .
నా ప్రాణమైనవాళ్ళతో ...... , ఈరోజు నా ప్రాణం కంటే ఎక్కువైన అమ్మతో ......
అమ్మ : లవ్ యు మహేష్ ...... అంటూ నా భుజంపై తలవాల్చారు , నా జీవితంలో ఇక సంతోషం లేదనుకున్నాను ...... , తల్లులు - కన్నయ్య మరియు నువ్వు ...... జీవితంలో మరిచిపోలేని మధురస్మృతులను పంచుతున్నారు అంటూ ఎమోషనల్ అవుతున్నారు .
థాంక్యూ సో మచ్ అమ్మా ....... , అమ్మా ..... మరొక అనుభూతిని ఆస్వాదించాలంటే 10 నిమిషాలు .......
అమ్మ : వెళ్ళాల్సిందేనా అంటూ కోపంతో చూస్తున్నారు .
మా అమ్మ బంగారం అంటూ చేతిపై ముద్దుపెట్టి లేచాను - సిస్టర్ తోపాటు వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉండండి అంటూ దుప్పటిని చుట్టి అమ్మ నుదుటిపై ముద్దుపెట్టి తుర్రుమన్నాను .
ఆ ముద్దు ..... కన్నప్రేగును తాకినట్లు పులకించి ఆనందబాస్పాలతో నావైపే ప్రాణంలా చూస్తున్నారు .
మేడం ...... అంత ప్రాణంలా చూస్తున్నారేమిటి ? .
అమ్మ : రాధికా ...... మహేష్ ముద్దు ముద్దు ...... అంటూ కడుపుపై స్పృశించుకుంటున్నారు .
నర్స్ : మేడం ....... అమ్మతనం గురించి నాకు తెలియదుకానీ ఇప్పుడు మీ కళ్ళల్లో అదే కనిపిస్తోంది .
అమ్మ : అవును రాధికా ...... , మాటల్లో వర్ణించలేని మధురాతిమధురమైన అనుభూతి అంటూ పులకించిపోతున్నారు .

పరుగున కిందకువెళ్లి డోర్ స్టెప్స్ దగ్గర మిల్క్ ప్యాకెట్స్ కోసం చూస్తే లేవు - వంటగదిలో అలికిడి వినిపించడంతో అంటీ అనుకుని వెళ్ళాను .
పాలను స్టవ్ పైనున్న పాత్రలో పోస్తుండటం చూసి , అంటీ అంటీ ...... నేను నేను అంటూ అందుకున్నాను , మీరు వెంటనే ఇక్కడినుండి సెకండ్ ఫ్లోర్ కుడివైపుకు వెళ్ళండి .......
అంటీ : అంటే కాఫీ నువ్వు చేస్తావా బాబూ ......
కాఫీ నేకాదు టీ , టిఫిన్ , లంచ్ & డిన్నర్ నేనే చేస్తాను - ఎలా ఉంటాయో అని భయపడుతున్నారు కదూ - రేయ్ మహేష్ ...... ప్రెస్టీజ్ ఇష్యూ అంటూ అంటీని బయటకు వదిలి అలా వెళ్ళండి అంటూ చూయించాను .
నావైపు దీనంగా చూస్తూనే వెళ్లారు .

దైర్యంగా వెళ్ళండి అనిచెప్పి , టీ & కాఫీ కోసం పాలను రెండు పాత్రలలో పోసి , టీ - యాలకులు అందుకుని ఒకదానిలో వేసాను . అమ్మకు 10 నిమిషాలలో వస్తానని మాటిచ్చాను కమాన్ కమాన్ ఫాస్ట్ ఫాస్ట్ అంటూ 15 నిమిషాలలో పర్ఫెక్ట్ అనుకుని మొత్తం 8 కప్స్ లో టీ - కాఫీ వేరువేరుగా పోసుకుని పైకి చేరుకున్నాను .
మహేష్ సర్ ...... అమ్మ సూపర్ గా పెట్టేవారు కదా అంటూ నాచేతిలోనుండి అందుకుని అందరికీ సర్వ్ చేసింది .
అమ్మ - అంటీ : దేవుడిపై భారం వేసి త్రాగుదాము అంటూ భయపడుతూనే చిన్న సిప్ చేశారు - వెంటనే నార్మల్ సిప్ ......
మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్మ్ ...... సూపర్ సూపర్ సూపర్ అంటూ ముగ్గురూ ఒకేసారి వ్యక్తపరిచి మళ్లీ మళ్లీ సిప్ చేస్తున్నారు .
అమ్మ - అంటీ : Sorry మహేష్ - sorry బాబూ అంటూ ఓటమిని ఒప్పుకుని టీ కూడా అందుకుని వ్యూ ఎంజాయ్ చేస్తూ ఆస్వాధిస్తున్నారు .

నర్స్ : మహేష్ సర్ ...... , అమ్మకంటే రుచిగా ఉంది .
మ్మ్మ్ మ్మ్మ్ ...... సూపర్ అంటూ అమ్మ - అంటీ .....
నా సంతోషం కోసం చెబుతున్నారు కానీ ...... , సిస్టర్ ...... ఈ ప్రపంచంలో అమ్మ చేతి వంటను మించి ఎవ్వరూ చెయ్యలేరు .
అమ్మ - అంటీ ...... ఆనందిస్తున్నారు .
నర్స్ : లవ్ యు అమ్మా ...... , మహేష్ సర్ ..... ఇదిగో ఇలావచ్చి కూర్చోండి అంటూ సోఫాలోనుండి లేచింది .
పర్లేదు పర్లేదు సిస్టర్ కూర్చో ......
నర్స్ : మరొక్క క్షణంలో లెవకపోయుంటే మేడం గారు కొరికేసేలా ఉన్నారు .
అయితే కూర్చుంటాను అంటూ అమ్మ ప్రక్కన కూర్చున్నాను .

అమ్మ : థాంక్యూ రాధికా .... అంటూనే నాచేతిని చుట్టేశారు , టీ మరియు కాఫీ ..... రెండూ అద్భుతంగా ఉన్నాయి మహేష్ లవ్ యు ......
ఈ మాట చాలు అమ్మా ...... , వంట నేర్చుకున్నందుకు ఈరోజుకు సార్థకత - ప్రతిఫలం లభించింది హుర్రే ...... అంటూ హద్దులులేని సంతోషంతో కేకలువేస్తున్నాను . అమ్మా - అంటీ ...... టిఫిన్ ఏమి చేయమంటారు ? .
అమ్మ : నో నో నో మేంఉన్నాము కదా ......
ఏమిటీ ...... మా అమ్మను వంట గదిలోకి ఇంకేమైనా ఉందా ? , అమ్మా దుర్గమ్మా ...... నన్ను మన్నించండి మన్నించండి అంటూ లెంపలు వేసుకోవడమే కాకుండా లేచి గుంజీలు కూడా తియ్యబోయాను .
అమ్మావాళ్ళు నవ్వుకుని , మహేష్ స్టాప్ స్టాప్ అంటూ కూర్చోబెట్టుకున్నారు .
ఇప్పుడే చెబుతున్నాను ముగ్గురిలో ఎవరైనా వంట గదిలోకి అడుగుపెడితే ఇదిగో ఇలానే 1000 గుంజీలు తీస్తాను - వంటలు బాగోకపోతే నేనే తప్పుకుంటాను .
సరే సరే అంటూ నవ్వుకున్నారు .

నర్స్ : మేడం ...... మీ ఈ ఆనందాలకు కారణం మీరు రాత్రంతా మహేష్ సర్ చేతినిపట్టుకుని హాయిగా ......
ష్ ష్ ష్ సిస్టర్ ......
నర్స్ : అయ్యో ...... sorry sorry సర్ అంటూ అటువైపుకు తిరిగింది .
అమ్మ : నాప్రక్కనే పడుకోమని చెప్పినా ఏదో కారణం చెప్పి మహేష్ హాల్లో కదా పడుకున్నది ......
ఏమీ ఏమీ లేదమ్మా ...... , నిన్న వెల్కమ్ సర్ప్రైజ్ లో చెయ్యి పట్టుకుని ..... , చెప్పు సిస్టర్ ......
నర్స్ : అదే అదే మేడం .......
అమ్మ : అంటే ప్రతీ రాత్రీ లానే నిన్న రాత్రికూడా ...... అంటూ నుదుటిపై చెమటతో జలదరిస్తూ నా గుండెలపై తలవాల్చి గట్టిగా హత్తుకున్నారు , అయితే నిన్న రాత్రికూడా మహేష్ ను నిద్రపోనివ్వలేదన్నమాట .......
నర్స్ : ఇక చెప్పకుండా ఉండలేను మహేష్ సర్ ...... , మహేష్ సర్ పరుగునవచ్చి కంగారుపడుతూ మీ చేతిని అందుకోగానే రిలాక్స్ అయ్యారు మేడం - ఇక అర్ధరాత్రి నుండీ సర్ప్రైజ్ వరకూ నిద్రపోకుండా చేతిని పట్టుకుని ప్రాణంలా జోకొడుతూనే ఉన్నారు .......
అమ్మ : మహేష్ ......
అమ్మా ...... మీరు హాయిగా నిద్రపోతుంటే నేను రెట్టింపు హాయిగా నిద్రపోయినట్లుంది కావాలంటే నా కళ్ళల్లోకి చూడండి రాత్రంతా మేల్కొన్నట్లు ఏమైనా ఆనవాళ్లు కనిపిస్తున్నాయా ? .
అమ్మ : నా కళ్ళల్లోకి చూసి ప్రాణంలా నా గుండెలపైకి చేరారు .
నర్స్ : స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోకపోయినా హాయిగా నిద్రపోయారంటే కారణం ......
అమ్మ : నా మహేష్ అంటూ నా హృదయంపై ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ....... , మా అమ్మ ముద్దు ఏదో తెలియజేయాలని ఆరాటపడుతోంది కానీ ప్చ్ ప్చ్ లాభం లేదు ........ , What is it మై హార్ట్ ? .
అమ్మ నవ్వుకుంటున్నారు .
నర్స్ : మహేష్ సర్ ...... మీ ముద్దులుకూడా మేడం కు ఇలానే తెలియజేస్తున్నాయని ఏమిటో తెలియడం లేదు అని మీరు వచ్చేన్తవరకూ తెగ ఫీల్ అవుతున్నారు .
అవునా అమ్మా ...... మనిద్దరికీ ముద్దుల మీనింగ్ తెలియాలంటే ఎలా అమ్మా ? .
అమ్మ : ఒకటే మార్గం ...... ఖచ్చితంగా వర్క్ ఔట్ అవుతుంది .
ఎలా ఎలా అమ్మా ...... అంటూ ఆతృతతో అడిగాను .
అమ్మ : ముద్దులు పెరగాలి - ప్రస్తుతం లా గంటలకు ఒక ముద్దు కాకుండా నిమిషానికొక ముద్దుపెట్టుకుంటే ఏదైనా తెలియవచ్చు , ( నేనైతే నా మహేష్ కు క్షణానికొక ముద్దుపెట్టమన్నా రెడీ ...... ) .
అమ్మా ......
అమ్మ : ఇలాంటివి మాత్రం వినిపించవు అంటూ అందమైనకోపంతో నా భుజంపై కొరికేశారు .
స్స్స్ ...... లవ్ యు అమ్మా ...... , మా అమ్మకు ఆకలివేస్తున్నట్లుగా ఉంది తెగ కొరికేస్తున్నారు , కిందకుతీసుకువెళతాను మీరు ఫ్రెష్ అయ్యేలోపు వంట రెడీ చేసేస్తాను .
అమ్మ : ఏ ఇంట్లోనైనా బిడ్డ రెడీ అయ్యేలోపు అమ్మలు వంట రెడీ చేస్తారు .......
అలాంటి కొడుకులకు వాతలు పెట్టాలి - అమ్మలు అంటే దేవతలతో సమానం నో నో నో దేవతలను మించి .......
అమ్మావాళ్ళు నవ్వుకుని , నా నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
లవ్ యు లవ్ యు సో మచ్ అమ్మా ...... , మా అమ్మకు వంట చేసిపెట్టే అదృష్టం లభించినందుకు ఎంత ఆనందం కలుగుతోందో ఆ వంటలను అమ్మ తింటుంటే చూస్తూ మరెంత ఆనందం వేస్తోందో .......
సరే అన్నట్లు ఎత్తుకోమని చేతులను విశాలంగా చాపి ఆనందిస్తున్నారు .
లవ్ టు అమ్మా ...... అంటూ గుండెలపైకి చేర్చుకుని , అంటీ - సిస్టర్ ...... మీరుకూడా రెడీ అవ్వండి అన్నాను .
నర్స్ : మేడం కు హెల్ప్ అవసరం - మేడం రెడీ అయ్యాక నేను ఫ్రెష్ అవుతాను .
థాంక్యూ సో మచ్ సిస్టర్ ...... , అంటూ నా కళ్ళల్లోకే చూస్తున్న అమ్మవైపు ప్రాణంలా చూస్తూనే లిఫ్ట్ లో కిందకు రూంలోకి చేరుకుని , అమ్మా ...... బాత్రూమ్లో వదలనా ? .

మహేష్ మహేష్ ...... అడగాలంటే అదోలా ఉంది - ముందైతే సారీ కావాలికదా ...... అంటూ కిందకుదిగి తలదించుకున్నారు .
నర్స్ : అనుక్షణం మీ సంతోషం గురించి ఆలోచించే మహేష్ సర్ దగ్గర మొహమాటం ఏమిటి మేడం తప్పు చాలా చాలా పెద్ద తప్పు , కొండమీద కోతిని తీసుకురమ్మని ఆర్డర్ వెయ్యండి చిటికెలో మీ ముందు ఉంచుతారు , మీరు ఆర్డర్ వేస్తేనే మహేష్ సర్ కు ఆనందం ...... , ఒకసారి ఇటువైపు చూడండి అంటూ రెండు బిగ్ బిగ్ కప్ బోర్డ్స్ ఓపెన్ చేసింది - సర్ప్రైజ్ ...... ఈ చీరలన్నీ మీకోసమే ......
అమ్మ : ఆశ్చర్యం - షాక్ తో ఒకేసారి కళ్ళల్లో చెమ్మ - ఆనందబాస్పాలతో చూస్తున్నారు .
నర్స్ : సారీస్ ఉన్నాయి జాకెట్ - లంగాలు కావాలి కదా అని అడుగుతారేమో అంటూ నాలుగైదు సారీలను తీసుకొచ్చి , సారీస్ లోపల ఉన్నట్లు చూయించింది . సారీస్ - జాకెట్స్ - లంగాలు ఉన్నాయి ....... నాకు సరిపోతాయో లేదో అంటారేమో ....... , నిన్న హాస్పిటల్లో ...... మన రూంలోకి వచ్చిన ఆమె పనిమనిషి కాదు మీ కొలతలను తెలుసుకోవడానికి వచ్చిన డిజైనర్ .......
అమ్మ : అందుకేనా కళ్ళతోనే స్కాన్ చేసేసింది - వెనుక నుండి భుజాలు టచ్ కూడా చెయ్యడంతో కంగారుపడ్డాను .
Sorry sorry అమ్మా అంటూ తలదించుకుని నవ్వుకున్నాను .
నర్స్ : నవ్వుకుని , మేడం ...... ఒక్కరోజులో ఇన్ని చీరలకు మీ కొలతలతో జాకెట్ - లంగాలు కుట్టించేశాడు , మనం అనుకున్నా అలా సాధ్యపడేది కాదేమో ..... మీరంటే అంత ప్రాణం , రాత్రి మీరు బాత్రూమ్లో ఉన్నప్పుడు డెలివరీ వచ్చింది .
అమ్మా ...... మీ లగేజీ పోవడంలో తొలి ద్రోహిని నేనేకదా , ఇలా రుణం తీర్చుకున్నాను అంతే అంటూ నవ్వుకుంటున్నాను .
అమ్మ : ఆ బ్యాగు పోవడమూ సంతోషమే - ఇలా సర్ప్రైజ్ సంతోషమే , లవ్ యు సో మచ్ మహేష్ అంటూ నా గుండెలపైకి చేరారు .
ఆఅహ్హ్ ...... లవ్ యు అమ్మా అంటూ మురిసిపోతున్నాను .

నర్స్ : మేడం ఫాన్సీ చీరలు మొదలుకుని costliest పట్టు చీరల వరకూ అన్నిరకాల చీరలు ఉన్నాయి మేడం ....... , ఇంతకూ మిగతా రెండు కప్ బోర్డ్స్ లో ఎమున్నాయబ్బా అంటూ తెరిచి Wow అంటూ జిగేలుమంటున్న కళ్ళతో చూస్తూ ఉండిపోయింది , మేడం - అమ్మా ...... ఎవరైనా వచ్చి పట్టుకోండి ఏక్షణమైనా పడిపోవచ్చు .
అమ్మ : నేనైతే ఎప్పుడో పడిపోయాను రాధికా అంటూ కప్ బోర్డ్ మొత్తం ధగధగలాడుతున్న గోల్డ్ - డైమండ్ - ప్లాటినం జ్యూవెలరీస్ ను చూస్తూ షాక్ లో ఉండిపోయారు .
అమ్మా ...... నా ప్రాణమైనవారు , నా ప్రాణం కంటే ఎక్కువైన మా అమ్మకోసం వరల్డ్ షాపింగ్ లో సెలెక్ట్ చేసిన నగలు , అన్నీ మీకోసమే ...... , మీరు ధరించడం కోసం ఆశతో ఎదురుచూస్తున్నాయి అంటూ కురులపై ప్రాణమైన ముద్దులుపెట్టాను , మీరు ధరిస్తే సంతోషించే మొదటి వ్యక్తిని నేనే ..... నా వెనుక చాలా మందే ఉన్నారనుకోండి , మీరు రెడీ అవ్వండి పూరీ రెడీ చేసేస్తాను .
అమ్మ : పూరీ ....... హమ్మయ్యా ఈరోజుకూడా ఇడ్లీ నే అనుకున్నాను .
ఇక వెళ్లనా అమ్మా ...... ? .
అమ్మ : ఈ అమ్మ అంటే ఇంత ప్రాణం ...... ? .
అమ్మ అన్నారు కదమ్మా ....... , ప్రాణం కంటే ఎక్కువ అంటూ నుదుటిపై ముద్దుపెట్టి పైన గదిలోకివెళ్లి లాక్ చేసుకున్నాను , మహీ ...... అమ్మను ఎంత సంతోషపెట్టాలో అంత సంతోషపెడతాను అంటూ గోడ అంత పరిమాణంలో ఉన్న ఫోటోను హత్తుకున్నాను , నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలుసు కానీ తప్పడం లేదురా ...... , ఇప్పుడు నాకు అమ్మ సంతోషం తప్ప ఏమీ అవసరం లేదు , తొందరగా వెళ్లి వంట చెయ్యాలి అంటూ పెదాలపై ముద్దుపెట్టి , టవల్ అందుకుని బాత్రూమ్లోకివెళ్లి షవర్ కింద చకచకా స్నానం చేసి బట్టలు వేసుకుని వంట గదిలోకి అడుగుపెట్టాను . అప్పటికే అక్కడ ముగ్గురూ పిండి కోసం - కూరగాయలకోసం చూస్తుండటం చూసి మూడో కన్ను తెరిచాను .
ముగ్గురూ ...... ముసిముసినవ్వులతో తలలుధించుకుని నవ్వుకుంటున్నారు .
మిమ్మల్నీ ...... మాటలతో చెబితే వినరు అంటూ ముగ్గురికీ సున్నితంగా మొట్టికాయలువేసి , అమ్మను అమాంతం ఎత్తుకుని రండి అంటూ అమ్మగదిలో వదిలి , బిగ్ వార్నింగ్ ఇచ్చి వంట గదికి చేరుకున్నాను .
అమ్మ సంతోషమైన నవ్వులు అక్కడిదాకా వినిపిస్తున్నాయి .
Next page: Update 67
Previous page: Update 65