Update 67

మన ఇంటిలో వంట వస్తువులు ఎక్కెక్కడ ఉన్నాయో ప్రస్తుతానికి నాకు మాత్రమే తెలుసు అంటూ పైనుండి పిండిని - ఫ్రిడ్జ్ లోనుండి చివరగా మిగిలిన కూరగాయలను - చట్నీ కోసం విత్తనాలను తీసుకున్నాను .
పిండిని ముద్ద చేసే యంత్రం ఉన్నప్పటికీ పూరీలు టేస్టీ గా రావాలంటే చేతులతోనే రెడీ చేసాను - కాసేపు ప్రక్కన ఉంచాను .
ఉల్లితోపాటు అవసరమైన కూరగాయలను కట్ చేసి వెజిటబుల్ కూర్మాను ప్రిపేర్ చేస్తూనే మరొక స్టవ్ పై విత్తనాలను మరియు పచ్చిమిర్చిని వేయించి మిక్సీలో వేసి చట్నీని రెడీ చేసాను .
కూర్మా ప్రిపేర్ అవుతుండగానే ఖాళీగా ఉన్న స్టవ్ పై బాలిగ ఉంచి నూనెను వేడిచేసాను .
పిండి అందుకుని చిన్న చిన్న వాటిగా చేసి ఒక్కొక్క దానిమధ్యన అప్పటికే రెడీ చేసుకున్న పన్నీర్ & కొత్తిమీర తురుమును ఉంచి చక్కగా తిక్కి నూనెలో వెయ్యగానే అంతే చక్కగా ఉబ్బడం చూసి ముచ్చటేసింది .
అమ్మా - అంటీ - సిస్టర్ ...... టిఫిన్ రెడీ , వేడివేడిగా తింటే బాగుంటాయి అంటూ పూరీలను హాట్ బాక్స్ లో ఉంచి అప్పటికే రెడీ అయిన కూర్మా మరియు చట్నీని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ పై ఉంచి , ఛైర్స్ ను చక్కగా సర్ది టేబుల్ ను అలంకరించాను , ఫ్రిడ్జ్ నుండి ఫ్రూట్స్ - జ్యూస్ & వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి టేబుల్ పై ఉంచాను .

మేముకూడా రెడీ మహేష్ సర్ అంటూ రెండు గదులలోనుండి అమ్మ , సిస్టర్ , అంటీ బయటకువచ్చారు .
చక్కగా సర్దిన డైనింగ్ టేబుల్ మరియు వాటిపై పాత్రలు - ఫ్రూట్స్ ను చూసి సంతోషంతో ఆశ్చర్యపోయారు .
అమ్మ కొత్త కాటన్ సారీలో రావడం ఒక్క నగ కూడా వేసుకోకపోవడం చూసి కాస్త నిరాశ చెందాను - సిస్టర్ ..... అన్ని జ్యూవెలరీ ఉన్నాయికదా .....
నర్స్ : చెప్పాను చెప్పాను మహేష్ సర్ ...... , ఏదైనా అకేషన్ కు వేసుకుంటే బాగుంటుంది అన్నారు .
అమ్మ : Sorry మహేష్ ......
అకేషన్ అకేషన్ ...... డన్ , అమ్మా - అంటీ ...... కూర్చోండి కూర్చోండి వేడివేడిగా తిందురు అంటూ అమ్మకు చైర్ చూయించాను .

అమ్మ : అక్కడ పూరీలు ......
అవునవును అంటూ వంట గదిలోకి పరుగులుతియ్యడం చూసి నవ్వుకున్నారు .
Wow కూర్మా - చట్నీ ...... చూస్తుంటే బాగానే ఉన్నాయనిపిస్తోంది , తింటే కానీ తెలియదు వాంతులు వస్తాయో ...... హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలో ...... , జస్ట్ కిడ్డింగ్ అంటూ నవ్వుకుంటున్నారు , ఒక్క పూరీ అయినా రౌండ్ గా వస్తుందో లేదో ........
నో నో నో లోపలికి అడుగుపెట్టడానికే వీల్లేదు .
అమ్మ : లేదులేదు డోర్ దగ్గర నుండే చూస్తాము ......
నర్స్ : మేడం ...... ప్రామిస్ గా చెబుతున్నాను నేనుకూడా అంత పర్ఫెక్ట్ గా తిక్కి అమ్మకు సహాయం చెయ్యలేదు , అమ్మా ...... ఎలా ఉన్నా తింటానులే అంటూ రకరకాల ఆకారాలు ....... మీరూ ఆశ్చర్యంలోనే ఉన్నారన్నమాట .
అమ్మ : పూరీలు ఎంత చక్కగా ఉబ్బుతున్నాయో చూడు ...... మహేష్ సూపర్ .
థాంక్యూ థాంక్యూ అమ్మా - సిస్టర్ ....... , అమ్మా ...... మామూలు పూరీలు కాదు పన్నీర్ స్టఫ్డ్ పూరీలు ........
అమ్మ : యూట్యూబ్ లో చూసాను కానీ నేనే ఎప్పుడూ ట్రై చెయ్యలేదు - త్వరగా త్వరగా పూర్తి చెయ్యి మహేష్ టేస్ట్ చెయ్యాలని ఆరాటంగా ఉంది .

ఇదిగో హాట్ బాక్స్ అంటూ తీసుకెళ్లి టేబుల్ పై ఉంచాను - మీరు వేడివేడిగా తింటూ ఉండండి నేను వేడివేడిగా సర్వ్ చేస్తూ ఉంటాను .
ముగ్గురూ : ఊహూ ఊహూ ఊహూ .......
నేను రావాల్సిందే అన్నమాట .
ముగ్గురూ : Yes yes yes .......
10 మినిట్స్ అంటూ పూరీలన్నీ పూర్తిచేసి మరొక హాట్ బాక్స్ తో డైనింగ్ టేబుల్ చేరుకున్నాను .

మహేష్ - బాబు - మహేష్ సర్ ...... కూర్చో సర్వ్ చేస్తాము .
ఇక్కడ అంతా ఆపోజిట్ అని చెప్పానుకదా అమ్మా .......
అమ్మ : అంటే ........
అవును నేనే స్వయంగా సర్వ్ చేసి ఆనందాన్ని పొందుతాను అంటూ అమ్మను కుర్చీలో కూర్చోబెట్టి , ల్యాప్ పై క్లోత్ ఉంచి , ప్లేట్ లో పూరీలు కూర్మా చట్నీ వడ్డించాను - ఒక గ్లాసులో జ్యూస్ మరొక గ్లాసులో వాటర్ పోసాను , అలా ముగ్గురికీ వడ్డించాను .
లవ్ యు మహేష్ అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , ప్రక్కనే కావడంతో అమ్మ ...... నాకు వడ్డించారు .
లవ్ యు సో మచ్ అమ్మా ......

మ్మ్మ్ ..... ఆఅహ్హ్ ..... ఘుమఘుమలు అవునవును లోపల పన్నీర్ ఉంది అంటూ వేడివేడిపూరీలను విరిచి కూర్మా & చట్నీ అద్దుకుని తిన్నారు .
మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్మ్ ...... సూపర్ మహేష్ మహేష్ సర్ ...... , ఇది నిజమేనా నమ్మశక్యం కావడం లేదు , పూరీ ఒక్కటే కాదు కూర్మా - చట్నీ వాటికవే సాటి .......
థాంక్యూ థాంక్యూ అమ్మా - సిస్టర్ ...... , ఇలా పొగిడితే కలిగే ఆనందమే వేరు అంటూ తిని అమ్మకు వడ్డించాను , పిల్లలుకూడా అమ్మ వంటలను పొగిడితే ఎంత ఆనందిస్తారో ఇప్పుడు అర్థమయ్యింది అమ్మా .......
అమ్మ : లవ్ యు మహేష్ ...... పన్నీర్ స్టఫ్డ్ పూరీలు చాలా చాలా రుచిగా ఉన్నాయి నేను మామూలుగా అయితే మూడు పూరీలు తింటాను కానీ ఇప్పుడు ఏకంగా 5 పూరీలు తిన్నాను - ఇది ఐదవది ......
యాహూ యాహూ ....... అంటూ సంతోషంతో కేకలువేస్తున్నాను .
అమ్మ : చిరునవ్వులు చిందిస్తున్నారు .

నర్స్ : నేనుకూడా డబల్ తింటున్నాను మహేష్ సర్ ...... , మహేష్ సర్ ...... ఇంతపెద్ద పొడవైన డైనింగ్ టేబుల్ ను చూడటం ఇదే ఫస్ట్ టైం .......
నా ప్రాణమైనవారు అని చెప్పానే వారంతా ఒకేసారి తినాలని ఆశపడతారు అందుకే ఇలా ప్రత్యేకంగా రెడీ చేయించాను .
నర్స్ : వారంతా ఎక్కడ మహేష్ సర్ ....... ? .
టూర్ ...... అదే అదే 15 డేస్ లో మ్యారేజ్ ఉంది అక్కడికి వెళ్లారు .
నర్స్ : మీరూ వెళ్లాలేమో ......
అమ్మ నా సమాధానం కోసం తలదించుకుని వేచిచూస్తున్నట్లు అనిపించింది , 14th డే వెళ్ళాలి ..... అయినా ఎలాంటి ఫంక్షన్ అయినా మా అమ్మ తరువాతనే ...... , మా అమ్మను వదిలి ఎక్కడికీ వెళ్ళేది లేదు , వాళ్ళు ప్రాణమైన వాళ్ళు అయితే మా అమ్మ ప్రాణం కంటే ఎక్కువ అంటూ లేచి అమ్మ కురులపై ముద్దుపెట్టాను .
అమ్మ : ఆనందబాస్పాలతో నావైపే చూస్తున్నారు .

అమ్మా - సిస్టర్ ..... మీరు టీవీ చూస్తూ కూర్చోండి డిషెస్ ఫినిష్ చేసేస్తాను .
అమ్మ : నో నో నో దెబ్బలుపడతాయి .
నేను ఎప్పుడైనా రెడీ కదమ్మా అంటూ చేతులను విశాలంగా చాపాను .
అమ్మ : మహేష్ .......
అమ్మా ...... మీరు నా ప్రాణం , మీరు కష్టపడితే ఈ హృదయం ఏమాత్రం తట్టుకోలేదు ఇక మీఇష్టం , ఎంచక్కా టీవీ ఎంజాయ్ చెయ్యండి నాకు అలవాటే అంటూ డైనింగ్ టేబుల్ నుండి చక్కగా అన్నింటినీ తీసుకోవడం చూసి ముగ్గురూ ఆశ్చర్యపోయారు .
నవ్వుకుని , అమ్మా ...... అమెజాన్ ప్రైమ్ - నెట్ఫ్లిక్ - Zee5 - ఆహా ...... అన్నీ OTT లు ఉన్నాయి మీకిష్టమైన మూవీ - సీరీస్ ఎంజాయ్ చెయ్యండి 20 నిమిషాలలో జాయిన్ అవుతానుగా .......

అమ్మ : 20 మినిట్స్ ...... టైం స్టార్ట్స్ ......
అమ్మో అంటూ వంట గదిలోకివెళ్లి , ముందుగా అమ్మకు సర్ప్రైజ్ కోసం కాల్స్ చేసి విత్ ఫ్యామిలీ wow wow థాంక్స్ థాంక్స్ చెప్పాను ఆ వెంటనే కొత్త మొబైల్ మరియు సిమ్ తోపాటు ఆర్డర్ చెయ్యాల్సినవాటిని ఆర్డర్ పెట్టి స్విచ్ ఆఫ్ చేసేసాను - డిషెస్ మరియు స్టవ్ ప్రాంతమంతా శుభ్రం చేసి , చేతులను శుభ్రం చేసుకుని న్యాప్కిన్ తో తుడుచుకుంటూ 18 మినిట్స్ లోనే అమ్మ ప్రక్కన చేరాను .
అమ్మ : షాక్ లో చూస్తున్నారు ......
అమ్మా అమ్మా ....... అంటూ చేతిపై ముద్దుపెట్టాను .
అమ్మ : మాకే గంట సమయం పడుతుంది తెలుసా ..... ? అంటూ నా చేతిని చుట్టేసి మూవీ చూస్తున్నారు .
ప్రియమైన వాళ్లకోసం ఇష్టంతో ...... అలా అలా ...... , సిస్టర్ ...... అమ్మ టాబ్లెట్స్ ఎక్కడ అంటూ లేవబోయాను .....
నర్స్ : నో నో నో కూర్చోండి కూర్చోండి , మేడం గారు ..... నాపై కోప్పడతారు ఎలాగో పెయిన్ కిల్లర్ స్ప్రే కూడా తీసుకురావాలి అంటూ వెళ్ళింది . టాబ్లెట్స్ తోపాటు వాటర్ బాటిల్ తీసుకొచ్చి అందించి , అమ్మ మోకాలిపై స్ప్రే చేస్తోంది .
అమ్మ : స్స్స్ ......
అమ్మా నొప్పివేస్తోందా అంటూ కంగారుగా అడిగాను .
అమ్మ : లేదు లేదు లేదు మహేష్ ...... , చల్లగా అనిపిస్తోంది అందుకే .......
నర్స్ : మంచిదే మేడం ...... , చల్లదనం అంటే స్పర్శ బాగా తెలుస్తోందన్నమాట అంటే నొప్పి పోయినట్లే .......
గుడ్ న్యూస్ చెప్పావు సిస్టర్ ..... అంటూ అమ్మ చేతిపై ముద్దుపెట్టాను .
అమ్మ : ప్చ్ ప్చ్ .......
అమ్మా ఏమైంది ? .
నర్స్ : నొప్పిలేకపోతే ఇక ఎత్తుకోరేమోనని మేడం బాధ ...... కదా మేడం ? .
అవునన్నట్లు నా గుండెల్లో తలదాచుకున్నారు .
మా అమ్మ ఇక చాలులే ప్రతీసారీ ఎత్తుకోవాలా అంటూ కొప్పుడేంతవరకూ ఎత్తుకుంటాను .
అమ్మ : యాహూ యాహూ ....... నేనైతే ఎప్పుడూ కోప్పడను కదా అంటూ నా హృదయంపై ఘాడంగా ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ...... అంటూ పెదాలపై అమితమైన ఆనందంతో సోఫాలో వెనక్కు వాలిపోయాను - అమ్మ ...... సంతోషమైన నవ్వులు మాత్రమే వినిపిస్తున్నాయి .

అమ్మ చిరునవ్వులు చిందిస్తూనే వెనక్కువాలిన నా ఛాతీపై వాలి , మహేష్ ......కదలకు కదలకు నీ హృదయస్పందన వింతగా అంటే హ్యాపీనెస్ పంచుతోంది .
ఇలాగే అమ్మా ...... ఏదో తెలియని మధురానుభూతి ......
అమ్మ : కదలకు అని చెబుతున్నాను కదా అంటూ ఛాతీపై సున్నితంగా కొడుతున్నారు .
Ok ok ok అమ్మా sorry sorry అమ్మా అంటూ జీవితంలో బెస్ట్ ఫీల్ ను అనుభూతిచెందుతున్నాను - అమ్మా అమ్మా ...... సంతోషంలో హాయిగా కళ్ళు మూతలుపడుతున్నాయి .
అమ్మ : సంతోషమే ..... రాత్రంతా ఈ అమ్మకోసం మేల్కొనే ఉన్నావుకదా - జోకొడతాను హాయిగా నిద్రపో .......
లవ్ టు లవ్ టు అమ్మా ..... , మా అమ్మ జోకొడుతుంటే హాయిగా నిద్రపోవాలని ఏ బిడ్డకు ఉండదు చెప్పండి కానీ పని ఉంది అంటూ అమ్మ చేతిని నా హృదయంపై హత్తుకుని లేచి కూర్చున్నాను , పైగా నిద్రపోతే మా అమ్మ ఈ సంతోషాలను కూడా మిస్ అయిపోతాను , ఊహ తెలిసినప్పటి నుండీ అమ్మ జ్ఞాపకాలు లేక ఈ హృదయం - మనసు ఖాళీగా ఉంది .
అమ్మ : ( నేనూ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను అన్నట్లు నా కళ్ళల్లోకే ప్రాణంలా చూస్తూ ) కళ్ళల్లో చెమ్మతో ఉద్వేగానికి లోనయ్యి ప్రాణంలా నా గుండెలపైకి చేరారు.
అమ్మ హృదయస్పందన ద్వారా అమ్మ అనుభవిస్తున్న బాధ తెలుస్తోంది - అమ్మకు ఈ బాధ నుండి విముక్తి కలిగించాలంటే అదే ఏకైక మార్గం అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను .
అమ్మ : మహేష్ ...... మత్తుగా అనిపిస్తోంది - కళ్ళు మూతలు పడుతున్నాయి .
నర్స్ : టాబ్లెట్స్ మేడం ...... , డాక్టర్స్ చెప్పారుకదా టాబ్లెట్స్ వేసుకున్నాక కాసేపు రెస్ట్ తీసుకోవాలని అప్పుడే బాగా పనిచేస్తాయి .
అయితే బెడ్ పై పడుకోబెడతాను .
అమ్మ : ఊహూ ...... నాకు ఇలానే హాయిగా ఉంది .
అలాగే అమ్మా అంటూ కదలకుండా అమ్మనే చూస్తూ కూర్చున్నాను .

సిస్టర్ సిస్టర్ ..... అదిగో టీవీ ప్రక్కన ఉన్న లాప్టాప్ అందుకోండి అంటూ గుసగుసలాడాను - లాప్టాప్ ఓపెన్ చేసి సిస్టర్ ...... హైద్రాబాద్ లో ఎప్పటిలోపు ఉండాలి .
నర్స్ : రేపు ఉదయం 10 గంటలలోపు మెయిన్ govt హాస్పిటల్లో ఉండాలి మహేష్ సర్ .......
అయితే రాత్రినే వెళ్లడం మంచిది - డిన్నర్ చేసుకుని బయలుదేరావచ్చు - 10 గంటలకు ఫ్లైట్ ......
నర్స్ : ఫ్లైట్ ...... అంత ఖర్చు ఎందుకు మహేష్ సర్ - ఎప్పుడూ ప్రయాణించలేదు , ట్రైన్ ఆర్ బస్ ...... , ok ok అలా కోప్పడకండి మీఇష్టం అంటూ నవ్వుకుంది .
నువ్వు - అంటీ ...... ఎప్పుడో నా ఫ్యామిలీ అయిపోయారు , ట్రైన్ & బస్సులో కూడా ఫస్ట్ టైం వెళ్లి ఉంటావు కదా , ఎయిర్పోర్ట్ వరకూ నేను వదులుతాను - అక్కడ ల్యాండ్ అవ్వగానే మా మేనేజర్ గారు స్వయంగా మా కంపెనీ కాలనీకి తీసుకెళతారు - ఎంచక్కా రోజూ అక్కడి నుండే కారులో వెళ్ళిరావచ్చు ...... అంతా మనవాళ్లే ఉంటారు కాబట్టి అంటీకి బోర్ కూడా కొట్టదు , ఒకవేళ అక్కడ ఇబ్బంది అయితే హోటల్ కు తీసుకెళతారు .
నర్స్ : థాంక్యూ మహేష్ సర్ అంటూ కళ్ళల్లో చెమ్మను తుడుచుకుంది .
అంటీ : థాంక్యూ బాబూ .......
ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యన థాంక్యూ లు ఉండనే ఉండవు ....... , అంటీ ..... మీరుకూడా కాసేపు రెస్ట్ తీసుకోండి .

ఇంకొకసారి థాంక్యూ అమ్మా అంటే అంటూ గిల్లేసారు అమ్మ ......
స్స్స్ ...... అమ్మా ఇంకా నిద్రపోలేదన్నమాట .
అమ్మ : నా మహేష్ కౌగిలిలోని మాధుర్యాన్ని ఫీల్ అవుతున్నాను - ఎంత హాయిగా ఉందో మాటల్లో వర్ణించలేను అంటూ హృదయంపై ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ...... ముద్దు ద్వారా తెలిసిపోతోంది అమ్మా - నాకు కూడా అలానే అనిపిస్తోంది .
అమ్మ : అనిపిస్తోంది అంటున్నావు కానీ ముద్దుపెట్టడం లేదు .
లవ్ టు లవ్ టు అమ్మా ...... కాసేపు మాట్లాడకుండా హాయిగా నిద్రపోండి అంటూ నుదుటిపై పెదాలను తాకించాను .
మ్మ్మ్ ...... అంటూ అమ్మ పెదాలపై తియ్యదనం .
అమ్మా అమ్మా ...... వన్ మినిట్ వన్ మినిట్ వింటున్నారా ? .
అమ్మ : ఉమ్మా అంటూ హృదయంపై మధురమైన ముద్దు ......
ఆఅహ్హ్ ...... , అమ్మా ...... లంచ్ టైం లో స్మాల్ సర్ప్రైజ్ - ఇప్పుడు 10 గంటలు అవుతోంది 12 గంటలకల్లా లేచి నాకిష్టమైన పట్టుచీరలో .......
అమ్మ : అంతా చెప్పాల్సిన అవసరం లేదులే ...... , నువ్వే చూస్తావుకదా ......
యాహూ ...... అంటూ కేకవేయ్యబోయి కంట్రోల్ చేసుకున్నాను , సిస్టర్ - అంటీ మీరుకూడా ....... , పట్టుచీరలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అమ్మా అంటూ మరొక ముద్దుపెట్టాను .
మ్మ్మ్ ..... అంటూ మూలిగి నిద్రలోకిజారుకున్నారు టాబ్లెట్స్ పనిచేస్తున్నట్లు .....
సిస్టర్ - అంటీ ...... టికెట్స్ బుకింగ్ అయినట్లు కంఫర్మ్ అవ్వడంతో , రోజూ అర్ధరాత్రి అమ్మ కలవరించి బాధపడే మొక్కు తీర్చాలని దాదాపు అరగంటసేపు పక్కా ప్లాన్ రెడీ చేసాను - అమ్మా ...... FINISHED డాట్ .

కాలింగ్ బెల్ మ్రోగింది - సిస్టర్ వెళ్లబోతే ఆపి , అమ్మను ఎత్తుకునివెళ్లి జాగ్రత్తగా బెడ్ పై పడుకోబెట్టాను , AC ని రూమ్ టెంపరేచర్ కు సెట్ చేసి భుజాలవరకూ దుప్పటి కప్పాను , కాసేపు హాయిగా రెస్ట్ తీసుకోండి అమ్మా అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను .
మహేష్ సర్ ..... నేను చూసుకుంటాను .
పెదాలపై చిరునవ్వుతో రూమ్ నుండి బయటకువచ్చి , కమింగ్ అంటూ వెళ్లి డోర్ తెరిచి చికెన్ మటన్ తోపాటు డెలివరీస్ అన్నింటినీ తీసుకుని అమౌంట్ పే చేసి పంపించేసాను .
అన్నింటితోపాటు వంట గదిలోకివెళ్లి ముందుగా కొత్త మొబైల్ లోకి కొత్త సిమ్ వేసుకున్నాను .

మేనేజర్ గారి కొత్త నెంబర్ కు కాల్ చేసి ఇకనుండీ ఈ నెంబర్ కే చెయ్యమని చెప్పాను .
మేనేజర్ : మహేష్ సర్ ...... నిన్నటి నుండీ మేడమ్స్ నుండి వేలల్లో కాల్స్ అందుకే స్విచ్ ఆఫ్ లోనే ఉంచేసాను - అమెరికా ఆఫీస్ నెంబర్ కోసం ప్రయత్నిస్తున్నారు .
మరి అంత ప్రేమ - ఇక నాకు ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయో అర్థం చేసుకోండి - ఈరోజు ఎలాగైనా కాల్ చేస్తానులే - పరిస్థితులు అలా ఉన్నాయి తప్పడం లేదు మరి - ok చాలా పని ఉంది బై అంటూ కట్ చేసాను .

సెక్యూరిటీ సహాయంతో పెద్ద స్టవ్ - 50 మందికి ఒకేసారి బిరియానీలు మరియు కబాబ్ వండటానికి అవసరమైన మూడు పెద్ద పెద్ద పాత్రలను , చిన్న పాత్రలను , గరిటెలను - బిరియానీకి అవసరమైన మసాలాలు - వాటర్ క్యాన్స్ తీసుకుని కాంపౌండ్ లో నీడపడే చెట్టు కిందకుచేరాను .
అన్నా ...... ఇంతపెద్ద పాత్రలలో ఒక్కడే చెయ్యడం కష్టం కానీ ఇష్టంతో చెయ్యాలి అనిచెప్పి సెక్యూరిటీని పంపించేసాను .

అమ్మా దుర్గమ్మా ...... మీరే సహాయం చెయ్యాలి అంటూ ప్రార్థించి టెంకాయ కొట్టాను - అంతే అంతులేని ఉత్సాహం ........ , లోపలకు వెళ్లి 20 కేజీ లకు అవసరమైన ఉల్లిపాయలను - తమోటాలను - కొత్తిమీరను కట్ చేసుకుని , జింజర్ వెల్లుల్లి పేస్ట్ మరియు మసాలాలను వేరువేరుగా మిక్సీకి వేసుకున్నాను - పాత్రలలో బయటకు తీసుకొచ్చి స్టవ్ లు వెలిగించి రెండు పాత్రలను రెండు మంటలపై ఉంచాను .
లోపలకువెళ్లి 20 కేజీల చికెన్ - 10 కేజీల మటన్ తీసుకొచ్చి ట్యాప్ వాటర్ తో శుభ్రం చేసి ప్రక్కన ఉంచాను .
వేడిగా అయిన పాత్రలలోకి సరిగ్గా సరిపోయేలా ఆయిల్ పోసి , కొన్ని క్షణాల తరువాత బిరియానీలకు అవసరమైన మసాలాలను బిరియానీ ఆకు ఆ వెంటనే స్లైస్ చేసిన ఉల్లిపాయలను మరియు పచ్చిమిర్చిని నూనెలో వేసి ఉల్లిపాయలు రంగు మారేంతవరకూ కలియతిప్పాను .
నెక్స్ట్ జింజర్ వెల్లుల్లి పేస్ట్ లను రెండు పాత్రలలో బాగా తిప్పాను - కొన్నిక్షణాల తరువాత టమోటో ముక్కలను వేసాను - మొత్తం కలిసేలా తిప్పి లోపలకువెళ్లి ఫ్రిడ్జ్ లోనుండి పెరుగు ప్యాకేట్స్ తీసుకొచ్చి అవసరమైనంత రెండు పాత్రలలో వేసి బాగా తిప్పాను .
అటుపై తగినంత ఉప్పు - పిల్లలు తినగలిగేలా ఉండేలా కారం పూడి మరియు ధనియా పుడి వేసి కలియతిప్పాను .
మసాలాలు - కారం పుడి బాగా కలవడం వలన పాత్రలలో రంగు మరియు మసాలా ఘుమఘుమలే నోరూరించేస్తున్నాయి , ఇలాగే ఫైనల్ బిరియానీలు కూడా అధిరిపోవాలి అంటూ మరింత ఉత్సాహంతో ఒక పాత్రలోకి 10కేజీ చికెన్ మరొక పాత్రలోకి 10కేజీ మటన్ వేసి మసాలాలన్నీ ముక్కలతో కలిసిపోయేలా బాగా మిక్స్ చేసాను - మంటను చిన్నగా ఉంచాను .

మరొకవైపు ముఖ్రొక పెద్ద స్టవ్ పై రెండు ఫ్లేమ్స్ వెలిగించి రెండు పాత్రలను ఉంచి సగం వరకూ నీటిని పోసి మరిగేంతవరకూ వేడిచేసాను .
మరుగుతున్న నీటిలో కొత్తిమీర - ఉప్పు - చెక్క లవంగ కాసింత మసాలా పుడి - పసుపు వేసి మిక్స్ చేసి , 50 మందికి సరిపడే రైస్ (అప్పటికే కడిగి ఉంచిన ) వేసాను రెండు పాత్రలలోకి .......
రైస్ సగం ఉడికేదాకా wait చేసి రైస్ ను ఫ్రై అవుతున్న చికెన్ - మటన్ పాత్రలలోకి చేర్చాను . రైస్ కు కింద ఉన్న మసాలాలు పైపైన తగిలేలా ( ముక్కలు మాత్రం కిందే ఉండేలా ) మిక్స్ చేసాను - రైస్ సగం సగం మసాలా రంగులోకి మారడం చూస్తే అప్పుడే తినేయ్యాలనిపించింది .
కంట్రోల్ కంట్రోల్ ...... అంటూ రైస్ పైన మిగిలిన కొత్తిమీర - ఫ్రైడ్ ఆనియన్స్ - తగినంత నెయ్యి - కొద్దిగా కలర్ వేసి ...... వేడి ఏమాత్రం బయటకు వెళ్లకుండా మూత మరియు గుడ్డ సహాయంతో ప్యాక్ చేసి కాస్త మంటను పెంచి అలా వదిలేసాను .
అయినప్పటికీ మసాలా ఘుమఘుమలు రావడంతో మ్మ్మ్ ..... ఆఅహ్హ్ సూపర్ అంటూ మురిసిపోతున్నాను .
ఆ ఘుమఘుమలు లోపలికీ వెళ్లినట్లు సిస్టర్ వాసనను పసిగట్టి బయటకు వచ్చి చూసి , wow ...... మహేష్ సర్ అంత పెద్ద పెద్ద పాత్రలు ...... మీరు ఒక్కరే ..... ఇంతకూ ఏమిచేస్తున్నారు ? .
ష్ ష్ ష్ సిస్టర్ ...... , సర్ప్రైజ్ లోపలికి వెళ్లు అంటూ మెయిన్ డోర్ వరకూ వదిలి చిరునవ్వులు చిందిస్తూ డోర్ క్లోజ్ చేసాను .

ఇక కబాబ్ సంగతి చూద్దాము అంటూ మిగిలిన సగం చికెన్ ను మసాలాలు మరియు corn పౌడర్ తో మిక్స్ చేసి ఒకవైపున ఉంచాను మారినేట్ అయ్యేలా ...... , గెస్ట్స్ అందరూ వచ్చాక వేడివేడిగా వేసి సర్వ్ చెయ్యొచ్చు .......

బిరియానీ రెడీ అయ్యేలోపు ...... అక్కడ తెగ కంగారు పడుతూ ఉన్న నా దేవకన్యకు కాల్ చేద్దాము .
ఏమిటి ఇది ధైర్యం చాలడం లేదు - బోలెడన్ని అపద్దాలు చెప్పబోతున్నందుకా ..... , sorry లవ్ యు లవ్ యు రా మహీ ...... అమ్మకు తోడుగా ఉండాలికదా తప్పడం లేదు , టూర్ నుండి వచ్చాక ఎన్ని ముద్దులు కావాలంటే అన్ని ఇస్తానుకదా ......
కొత్త సిమ్ గల కొత్త మొబైల్ అందుకుని , మొదట అమెరికా మేనేజర్ కు కాల్ చేసి విషయం చెప్పి నెంబర్ ఇచ్చాను .
అమెరికా మేనేజర్ : We have చైర్మన్ నెంబర్ సర్ .......
Sorry మేనేజర్ అంటూ నవ్వుకున్నాను .
మేనేజర్ గారు అమెరికన్ ల్యాండ్ లైన్ నుండి మహికి కాల్ చేసి స్పీకర్లో ఉంచి వారి మొబైల్ ను స్పీకర్లో ఉంచి ప్రక్కనే ఉంచారు - అంటే నేను అమెరికా నుండి మాట్లాడుతున్నట్లు ........

హలో మహీ .......
మహేష్ మహేష్ మహేష్ ....... అంటూ ప్రాణంలా పిలిచింది అంతే కాసేపటి వరకూ మౌనం .......
లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు సో సో soooooo మచ్ మహీ ........ , కన్నీళ్లు కార్చేస్తున్నావా ...... నా ప్రియసఖీ నా బంగారూ నా బుజ్జీ నా దేవకన్యా మై హార్ట్ మై మై .......
" చాలు చాలు ఇక అంటూ నవ్వేసింది "
హమ్మయ్యా ...... నా ముద్దుల దేవకన్య నవ్వేసింది యాహూ యాహూ ....... , మళ్లీ లవ్ యు లవ్ యు లవ్ యు ........ , కాల్ చెయ్యలేకపోయాను ......
" ఎంత కోపం ఉండేదో తెలుసా ...... "
" కోపం కాదు మహేష్ సర్ ........ "
అంతులేని ప్రేమ తెలుసు తెలుసు సిస్టర్స్ ....... , మీరున్నారనే కదా నా ధైర్యం ......
" ప్రేమ కాదు కోపమే ....... ఇప్పుడు కనుక కాల్ చెయ్యకపోయి ఉంటే మేమంతా అమెరికా వచ్చేసేవాళ్ళము "
నా దేవకన్య గురించి నాకు తెలియదా ...... ? ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......
" ఇంకా అమెరికా నెంబర్ నుండే కాల్ చూస్తున్నావేమిటి ? - ఎయిర్పోర్ట్ లో ఉన్నావా ....... "
Sorry రా ఇంకా మన ఆఫీస్ లోనే ఉన్నాను - ఉండాల్సి వచ్చింది - అదీ అదీ ...... అమెరికన్ govt మారింది కదా పైనుండి కాస్త పెద్ద సమస్యలే వచ్చిపడ్డాయి , అంతా ఆ పిచ్చ ట్రంప్ గాడు పాస్ చేసిన వీసా ప్రాబ్లమ్స్ వల్లనే ........
" మహి - సిస్టర్స్ నవ్వులు ....... "
ఆఅహ్హ్ ....... నా దేవకన్య నవ్వులు విని ...... ఆఅహ్హ్ హాయిగా ఉంది లవ్ యు రా ........
" చాలులే సంబరం ....... , ఇంతకూ సర్ ఎప్పుడు వస్తారో ...... ? "
చెప్పలేను మహీ ....... ఆఫీసర్స్ వచ్చి కలుస్తున్నారు మరికొన్నిరోజులు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి .......
" అయితే నేనూ వచ్చేస్తాను ....... "
నేను కోరుకునేది కూడా అదే ...... కానీ మహీ ....... మన సంతోషం కోసం సిస్టర్స్ ను ఇబ్బందిపెట్టడం భావ్యం కాదు - మనపై ప్రేమతో వాళ్ళు ok అనే అంటారు .
" నావల్ల కావడం లేదు "
నా దేవకన్య ముద్దులకు దూరం అంటే నరకాన్ని మించి .......
" లవ్ యు సో మచ్ మై గాడ్ ...... - ఏంటి disturbence ..... ? "
కనేసిటింగ్ కాల్ కదా ......
" What ...... ? "
నా దేవకన్య వెచ్చని కౌగిలింత లేకపోవడం - ఇక్కడ మంచు కురుస్తుండటంతో కోల్డ్ తగ్గనేలేదు - కంగారు కంగారుపడకు డాక్టర్ ను ప్రక్కనే ఉంచారు మన మేనేజర్ గారు ...... , బాగా తింటున్నాను - రెస్ట్ తీసుకుంటున్నాను , ఇక్కడి రొమాంటిక్ ప్లేసస్ అన్నింటినీ నీతోనే తిరగాలని హౌస్ - ఆఫీస్ తప్ప ఎక్కడికీ వెళ్లడం లేదు ......
" లవ్ యు లవ్ యు ఉమ్మా ఉమ్మా ....... "
కాల్ చేసిన అర గంటకు ముద్దులిచ్చింది నా దేవకన్య ...... ప్చ్ ప్చ్ ......
" అందమైన నవ్వులు ....... లవ్ యు లవ్ యు మై గాడ్ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ....... "
లవ్ యు సో మచ్ మహీ ....... , బిరియానీ రెడీ అయి ఉంటుంది .......
" బిరియానీ ఏంటి "
బిరియానీ బిరియానీ ....... ఇప్పుడేలేచాను - మేనేజర్ గారు ఇండియన్ చెఫ్ తో టిఫిన్ కే బిరియానీ చేయిస్తానని చెప్పారు - ఈపాటికి రెడీ అయ్యే ఉంటుంది .......
" ఇక్కడ అప్పుడే భోజన సమయం మహేష్ ....... "
మహీ ...... అక్కడ అంతా ok కదా ? .
" మిస్సెస్ వైజాగ్ మేనేజర్ గారు అన్నీ దగ్గరిండి చూసుకుంటున్నారు - ఎడ్యుకేషన్ తోపాటు రోజూ ట్రిప్స్ ....... "
ఈ రెండు రోజులూ మూడీగా .......
" అవునవును మహేష్ సర్ ....... "
మహీ ...... మనవల్ల సిస్టర్స్ ఏమాత్రం ఇబ్బందిపడకూడదు .
" లవ్ యు మై గాడ్ ....... ఇకనుండీ అలా చెయ్యను "
Thats మై డియరెస్ట్ సిస్టర్ ......
" లవ్ యు డియరెస్ట్ బ్రదర్ ......"
దివ్యక్క - చెల్లెమ్మకు విషయం చెప్పు , ఇక్కడి సమస్యలన్నీ పూర్తిచేసుకుని వీలైనంత తొందరగా నా దేవకన్య గుండెలపైకి చేరుతాను .
" ఆఅహ్హ్ ...... లవ్ టు లవ్ టు మై గాడ్ అంటూ ముచ్చటైన నవ్వులు - బ్రదర్ ...... అమ్మ మెసేజ్ చేస్తున్నారు కానీ కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదు "
నేను మాట్లాడనులే ...... , అమ్మకు ..... నేను అమెరికా వెళ్లినట్లు తెలియదు , మనల్ని డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేదని - మనం ఫుల్ గా టూర్ ఎంజాయ్ చెయ్యాలని అమ్మ ఆశపడుతున్నారు , అమ్మను ...... ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నానులే ....... అదే అదే చూసుకునే ఏర్పాట్లు చేసానులే అంటూ హృదయంపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .
" ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాలా బ్రదర్ ...... లవ్ యు "
ఇక్కడ బిరియానీ ఘుమఘుమలు అధిరిపోతున్నాయి .......
" అందమైన నవ్వులు ...... జాగ్రత్త కాల్ చెయ్యి అని ఆర్డర్ వేసింది "
లవ్ యు సిస్టర్ ...... ఉమ్మా ఉమ్మా బై బై బై అంటూ కట్ చేసాను - పరుగునవెళ్లి స్టవ్ లు ఆఫ్ చేసాను - ప్లేట్ ఎత్తగానే ఆఅహ్హ్ ...... పర్ఫెక్ట్ కరెక్ట్ టైం అంటూ మురిసిపోయాను , సమయం చూస్తే 12:30 అయ్యింది .

అంతలో లోపలనుండి మెయిన్ డోర్ నాక్ చెయ్యడంతో కమింగ్ కమింగ్ సిస్టర్ అంటూ వెళ్లి తెరిచాను .
ఉమ్మ్ ఆఅహ్హ్ ....... రాధికా నువ్వు చెప్పినది నిజమే ఘుమఘుమలు అధిరిపోతున్నాయి అంటూ అమ్మ .......
నేను చెప్పినట్లుగానే అమ్మ లేచి ఫ్రెష్ అయ్యి నాకిష్టమైన పట్టుచీర మరియు అవసరమైన నగలతో చిరునవ్వులు చిందిస్తుండటం చూసి , దివినుండి భువిపైకి దేవతే స్వయంగా దిగివచ్చినట్లు నా హృదయంపై చేతినివేసుకుని వెనక్కు పడిపోయాను .
కారు అడ్డుగా ఉన్నందువలన అనుకున్నాను .

మహేష్ మహేష్ జాగ్రత్త అంటూ వచ్చి నా చేతిని పట్టుకున్నారు .
ఆఅహ్హ్ .......దేవతే సేవ్ చేసిందా ? .
అమ్మ : నేను దేవతను కాదు అమ్మను ...... అంటూ తియ్యదనంతో నవ్వుకుంటున్నారు .
అమ్మా ....... పట్టుచీర నగలలో దివినుండి నాకోసం దిగివచ్చిన దేవతలా ఉన్నారమ్మా ...... , రెండు కళ్ళూ చాలడం లేదు - అమ్మా దుర్గమ్మా ...... మరొక రెండు కళ్ళు ఇవ్వచ్చుకదా .......
అమ్మ : చాలా ....... ? అంటూ నవ్వుకుంటున్నారు , నా మహేష్ ...... ఇంత పొగడాల్సిన అవసరం లేదు అంటూ అందంగా సిగ్గుపడుతున్నారు .
మా అమ్మ ఈ సంతోషం కోసం ఇలా ఎంతసేపైనా పొగుడుతూనే ఉంటాను ఆఅహ్హ్హ్ ....... ఇక్కడ కలుగుతున్న ఆనందాన్ని ఎలా వ్యక్తపరచగలను ......
ఏదీ అంటూ అమ్మ వచ్చి నా హృదయంపై చెవిని ఉంచారు . ఆఅహ్హ్ ...... తెలుస్తోంది తెలుస్తోంది మహేష్ ...... ఇంత ప్రాణంలా పొగిడినందుకు అంటూ హృదయంపై ఉమ్మా అంటూ ప్రాణమైన ముద్దుపెట్టారు అమ్మ ......
ఆఅహ్హ్ ...... అంటూ మళ్లీ వెనక్కు వాలిపోయాను - లవ్ యు లవ్ యు sooooo మచ్ అమ్మా అంటూ గట్టిగా కేకవేశాను .

మహేష్ మహేష్ ....... అమ్మపై ప్రేమ మెయిన్ గేట్ వరకూ తెలుస్తోంది అంటూ రెండు కార్ల నుండి డాక్టర్స్ ...... వాళ్ళ ఫ్యామిలీతోపాటు దిగారు .
డాక్టర్స్ డాక్టర్స్ welcome welcome అంటూ దగ్గరికివెళ్ళాను .
అమ్మ : సర్ప్రైజ్ అంటూ వచ్చి డాక్టర్స్ ఇద్దరినీ కౌగిలించుకున్నారు .
డాక్టర్స్ : బానే నడుస్తున్నారు - దెబ్బలుకూడా నయమైపోతున్నాయి , సంతోషం రెట్టింపు అయ్యింది - బ్యూటిఫుల్ సారీ అండ్ జ్యూవెలరీ .......
అమ్మ : నావైపు ప్రాణంలా చూస్తున్నారు .
డాక్టర్స్ : మహేష్ వల్లనే అని అర్థమైపోతోందిలే ....... , మహేష్ మహేష్ మా శ్రీవారు పిల్లలు .......
Welcome welcome సర్ అంటూ చేతులుకలిపాను - Hi hi పిల్లలూ ...... క్యూట్ అంటూ హైఫై కొట్టుకున్నాము .
డాక్టర్స్ హస్బెండ్స్ : Hi hi మహేష్ ...... బిరియానీ ఛాలెంజ్ లో గెలిచినట్లున్నావు - నువ్వు కాల్ చేసినప్పటి నుండీ ఇదే విషయం చెబుతున్నారు - చెప్పిన సమయానికి రాకపోతే అంటూ ఆర్డర్స్ కూడా వేశారు - ఆఫీస్ నుండి వచ్చేసాము .
డాక్టర్స్ : మాకు తెలిసి వీరు ముగ్గురూ చేసి ఉంటారు .

నర్స్ : నో నో నో మేడమ్స్ ...... , 10 గంటలకు మమ్మల్ని లోపలవేసి లాక్ చేసేసారు ఇదిగో ఇప్పుడే తెరిచారు - సమయానికి మీరు వచ్చారు , కనీసం సహాయం కూడా చెయ్యనివ్వలేదు .
డాక్టర్స్ ...... ఇలా అంటారని తెలిసే చికెన్ కబాబ్ ..... మీ సమక్షంలో వేయాలని మారినేట్ లో ఉంచాను .
డాక్టర్స్ : Ok ok చూద్దాము ...... , మహేష్ ..... బ్యూటిఫుల్ హౌస్ ......
అమ్మ నిలయం అంటూ అమ్మవైపు ప్రాణంలా చూస్తున్నాను .
డాక్టర్స్ : చూసాము చూసాము నేమ్ బోర్డ్ ......
నర్స్ : ఇక్కడ ఏమి చూసారు మేడం - మహేష్ సర్ కు అమ్మ అంటే ఎంత ప్రాణమో లోపలికివస్తే మీకే తెలుస్తుంది .
డాక్టర్స్ : అవునా ...... , మహేష్ ...... లోపలికి వెళ్ళొచ్చా ? .
Sorry sorry డాక్టర్స్ & సర్స్ ...... లవ్ టు లవ్ టు , అమ్మా - అంటీ - సిస్టర్ ...... లోపలికి తీసుకెళ్లండి , లంచ్ టైం అయ్యిందికదా కబాబ్ కూడా రెడీ చేసేస్తాను .
సర్స్ : మహేష్ ....... మేమూ హెల్ప్ చేస్తాము , హౌస్ చూసి జాయిన్ అవుతాము .
డాక్టర్స్ : లవ్ యు హస్బెండ్స్ .......
అమ్మ : పిల్లలూ ...... వెనుకవైపు అందమైన బీచ్ ఉంది - తినగానే వెళ్లిపోదాము - నిన్న రాత్రి నుండీ వేచిచూస్తున్నాను మీ అన్నయ్య తీసుకెళ్లనేలేదు .
Sorry అమ్మా ......
అమ్మ : Sorry అంటే దెబ్బలుపడతాయి ......
ఆఅహ్హ్ ...... అంటూ చేతులను విశాలంగా చాపాను .
అమ్మ తియ్యదనంతో నవ్వుకున్నారు .

అన్నయ్యా అన్నయ్యా ...... అంటీ కొడతారు అంటే పారిపోకుండా కొట్టండి అంటున్నారే - మమ్మీ అలా అనగానే పరిగెత్తుకుంటూ వెళ్లిపోతాము .
అమ్మ దెబ్బలు తినాలంటే అదృష్టం ఉండాలి పిల్లలూ ...... , అమ్మ దెబ్బలు ఎంత తియ్యగా ఉంటాయో తెలుసా ...... , కొట్టిన తరువాత ప్రతీ దెబ్బకూ ప్రాణమైన ముద్దులుపెడతారు , అమ్మలకు సంతోషమైన కోపం తెప్పించాలి కానీ బాధపడేలా చేయకూడదు .
పిల్లలు : అవును ముద్దులైతే పెడతారు ..... , మీరు చెబుతుంటేనే ఎంత బాగుందో - మమ్మీ మమ్మీ ..... ఇకనుండీ పారిపోము - అన్నయ్య చెప్పినట్లు మీ దెబ్బలు తింటాము .
అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .
అమ్మ అయితే ప్రాణంలా నావైపే చూస్తున్నారు .

డాక్టర్స్ : పిల్లలూ పిల్లలూ ...... అదిగో బస్ వచ్చేసింది . మీకు తోడుగా మరొక 10 మంది పిల్లలు వచ్చేసారు , మహేష్ ...... నువ్వు చెప్పినట్లే బస్ ఏర్పాటుచేసాము పిల్లలు ...... ఫ్యామిలీస్ తోపాటు వచ్చారు .
అంతలోనే పిల్లలు ...... అమ్మ - డాక్టర్స్ పంచిన కొత్త కొత్త డ్రెస్సులలో బస్సు దిగి అమ్మా అమ్మా ...... అంటూ పరుగునవచ్చి అమ్మను చుట్టేశారు , అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ చేతులను ఊపారు .
అమ్మ ఆనందాలకు అవధులులేనట్లు ఆనందబాస్పాలతో పిల్లలతో సంతోషాలను పంచుకున్నారు .
Wow డబల్ సర్ప్రైజ్ అన్నమాట అంటూ మొబైల్ తీసి ఆ ఆనందాలను క్యాప్చర్ చేస్తోంది .
థాంక్యూ సిస్టర్ అంటూ అమ్మ ఆనందాలను ఎంజాయ్ చేస్తూనే వెనక్కు నడుస్తూ వెళ్లి , పిల్లల పేరెంట్స్ కు స్వాగతం పలికాను .
వారి ఆనందాలకు అవధులులేకుండా పోయాయి - పిల్లల సంతోషాలను చూసి , బాబూ ...... ఉదయం లేచిన దగ్గర నుండీ అమ్మ అమ్మ అంటూ మేడం ను చూడాలని ఆశపడ్డారు .
పిల్లల ఆనందంలోనే తెలుస్తోంది రండి రండి అంటూ అందరినీ లోపలికి తీసుకెళ్లాము .
Next page: Update 68
Previous page: Update 66