Update 69

లవ్ యు లవ్ యు సో మచ్ అమ్మా అంటూ సంతోషిస్తూ అమ్మను రూమ్స్ దగ్గరికి తీసుకెళ్ళాను - అమ్మా ...... మీ తల్లులకు ఇష్టమైన రూమ్ - ఈ ఫ్లైట్ లో ప్రయాణించిన ప్రతీసారీ ...... ఈ రూమ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటూ దేవకన్య దివ్యక్క చెల్లెమ్మను తలుచుకుని ఫీల్ అవుతున్నాను .
అమ్మ : నా తల్లులా ...... ? .
నాలుక కరుచుకున్నాను ...... అదే అదే అమ్మా నా ప్రాణమైనవారంతా కూడా మీ బిడ్డలేకదా .......
అమ్మ : అవును నా తల్లులే ...... , వారి గురించి వారు ప్రాణం అని చెబుతావే కానీ కనీసం మొబైల్లో అయినా చూయించనేలేదు .
మళ్లీ అయిపోయాను ....... , అదీ అదీ అమ్మా ...... మిమ్మల్ని హాస్పిటల్ కు తీసుకెళ్లే తొందరలో కిందపడి పగలడం వల్లనేకదా ఈరోజు కొత్త మొబైల్ తీసుకున్నది అంటూ చూయించాను .
అమ్మ : నావల్లనే అన్నమాట sorry మహేష్ .......
అమ్మా అమ్మా అమ్మా ...... కాసింత కూడా బాధపడకండి - మీరు బాధపడితే మేము తట్టుకోలేము - మనదగ్గర లెక్కలేనంత ఉందిలే - ఎలాగో ఆ మొబైల్ ను మార్చాలనుకున్నాను కారణమే దొరకలేదు మా అమ్మ వలన ఇదిగో లేటెస్ట్ మొబైల్ నాచేతిలోకివచ్చింది - థాంక్యూ సో సో sooooo మచ్ అమ్మా అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను .
అమ్మ చిరుకోపంతో నా బుగ్గను గిల్లేసి గదిలోకివెళ్లారు . లైట్స్ ఆటోమేటిక్ గా ఆన్ అవ్వడంతో నవ్వుకుని లైట్స్ ఆఫ్ అంటూ ఆర్డర్ వేసి బెడ్ పైకి చేరిపోయారు - అమ్మో ...... చీకటి .
అమ్మా .......
అమ్మ : నథింగ్ నథింగ్ .......
అమ్మకు ..... వారి తోడుగా ఉండాలని ఆశపడుతున్నారు కానీ నేను నిద్రపోవాలని కోరుకుంటున్నారని అర్థమయ్యి , లోపలికివెళ్లి అమ్మ భుజాలవరకూ దుప్పటిని కప్పి గుడ్ నైట్ చెప్పాను .
వెనక్కుతిరిగానోలేదో నాచేతిని అందుకుని వారి బుగ్గపై ఉంచుకుని గుడ్ నైట్ చెప్పారు .
గుడ్ నైట్ అమ్మా .......
అంతే చేతిపై గిల్లేసారు .......
స్స్స్ ......
అమ్మ : దీని అర్ధం ..... నా నుదుటిపై ముద్దుపెట్టి గుడ్ నైట్ చెప్పాలని అంటూ మళ్లీ గిల్లేసారు .
స్స్స్ ....... లవ్ టు లవ్ టు లవ్ టు అమ్మా అంటూ అమ్మ నుదుటిపై ముద్దుపెట్టి yes yes yes థాంక్యూ థాంక్యూ దుర్గమ్మా అంటూ సంతోషంతో ప్రార్థిస్తూ బయటకునడిచాను .
అమ్మ నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి .
అమ్మ : మహేష్ ...... డోర్ క్లోజ్ చెయ్యకు నాకు భయం ( ఈ గదిలో బెడ్ ఖాళీగానే ఉంది - సోఫా ఉంది ఇక్కడే పడుకుంటాను అనవచ్చుకదా ...... )
అలాగే అమ్మా ...... , అమ్మా పిలిచారా ..... ? .
అమ్మ : వినిపించలేదన్నమాట వెళ్లి ఆ గదిలో హాయిగా పడుకో అంటూ కాస్త కోపం .......
మీరుకూడా హాయిగా నిద్రపోండి అంటూ ఎదురుగా ఉన్న గదిలోకివెళ్ళానే కానీ అమ్మను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను - చప్పుడు చెయ్యకుండా ఆ గదిలోని సోఫాను మా డోర్స్ వరకూ లాగి అమ్మను చూస్తూనే వాలిపోయాను - రెండు రోజులు సరిగ్గా నిద్రపోకపోవడం వలన వెంటనే నిద్రపట్టేసింది .
****************

ఫ్లైట్ ల్యాండ్ అయిన కుదుపులకు కూడా మెలకువరానంత ఘాడంగా నిద్రపోయాను - కానీ అమ్మకు మెలకువవచ్చినట్లు లేచికూర్చున్నారు - చేతిలోని మొబైల్ లో చూస్తే సమయం 2AM - తెల్లవారేంతవరకూ ఫ్లైట్ లోనే ఉండవచ్చా లేదా ఫ్లైట్ లో ఉన్న సమయానికి అమౌంట్ పెరుగుతూనే ఉంటుందా అన్న కంగారు .......
అంతలో అనౌన్స్మెంట్ ...... విజయవాడలో safely ల్యాండెడ్ అంటూ ......
అమ్మ మరింత కంగారుపడిపోయి మహేష్ మహేష్ అంటూ చిన్నగా పిలిచారు .
ఫలితం లేకపోవడంతో లైట్స్ ఆన్ అంటూ పలికి బెడ్ దిగి బయటకువచ్చారు - నేను డోర్స్ దగ్గరే సోఫాలో పడుకుని ఉండటం చూసి , ఈ అమ్మ అంటే ఎంత ప్రాణం మహేష్ - ఎంత ఆనందం వేస్తోందో మాటల్లో చెప్పలేను అంటూ ఆనందబాస్పాలతో వొంగి నా బుగ్గపై ముద్దుపెట్టారు .
మ్మ్మ్ ....... అమ్మా అమ్మా అమ్మా , అమ్మా ...... నన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళకండి - ఇకనుండీ ఒక్క క్షణం కూడా అమ్మ ప్రేమ మీ ప్రేమ లేకుండా ఉండలేను అంటూ నిద్రలోనే కలవరిస్తూ నా కురులను ప్రాణంలా స్పృశిస్తున్న అమ్మచేతిని అందుకుని హృదయంపై హత్తుకున్నాను .
అమ్మ : మరింత సంతోషంతో నా బుగ్గపై ముద్దుపెట్టడానికి వొంగగానే అమ్మ కళ్ళల్లోని ఆనందబాస్పాలు నా బుగ్గపైకి చేరాయి .
వెచ్చగా అనిపించి కళ్ళుతెరిచాను - ఎదురుగా అంతులేని ఆనందానుభూతికి లోనౌతున్న అమ్మ .......
అమ్మ : లేచేశావా ...... sorry sorry కదలకు అంటూ నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టారు .
అమ్మో ...... ఆఅహ్హ్ ....... అంటూ బుగ్గను స్పృశిస్తూ లేచికూర్చుని అంతులేని ఆనందాన్ని ఆస్వాధిస్తున్నాను .
అమ్మ : లేవకు అన్నానుకదా ...... , నేనే హాయిగా నిద్రపో అని చెప్పి నేనే డిస్టర్బ్ చేసాను sorry sorry మహేష్ .......
మా అమ్మ ముద్దుని మించిన కమ్మదనం ఏముంటుంది అమ్మా ....... , అమ్మా ..... ఒక్కొక్కసారి పిడుగులు పడ్డప్పుడు ఫ్లైట్ షేక్ అవుతుంది కూర్చోండి .
అమ్మ నవ్వులు ఆగడం లేదు - నా బంగారూ ...... ఫ్లైట్ ఎప్పుడో ల్యాండ్ అయిపోయింది అంటూ నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి ప్రక్కనే కూర్చున్నారు .

" బంగారూ ...... " ఆఅహ్హ్ ...... ఎంత తియ్యనైన పిలుపు - లవ్ యు లవ్ యు లవ్ యు సో సో sooooo మచ్ అమ్మా అంటూ పులకించిపోతున్నాను , అమ్మ బుగ్గపై చేతితో ముద్దుపెట్టబోయి ఆగి నా హృదయంపై ముద్దులవర్షం కురిపిస్తూ ఆనందిస్తున్నాను .
అమ్మ : నిన్నూ అంటూ కోపంతో నా హృదయంపై ఉంచుకున్న చేతిపై గిల్లేసారు .
స్స్స్ ...... sorry sorry అమ్మా అంటూ అమ్మ బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను .
అమ్మ : ప్చ్ ...... సగం హ్యాపీ అంటూ నాచేతిని అందుకుని కందిపోయిన చోట ముద్దుపెట్టారు .
మా అమ్మ అందించే ముద్దులలోని కమ్మదనం ఇష్టమే - అందించే తియ్యనైన నొప్పి ఇష్టమే ...... , నిన్న కన్నయ్య - ఈరోజు బంగారూ ...... యాహూ యాహూ ...... అమ్మా దుర్గమ్మా థాంక్యూ థాంక్యూ అంటూ మొక్కుకుంటున్నాను .

అమ్మ : అదే అదే ఆవిషయమే చెప్పడానికి వచ్చాను బంగారూ ...... , మనం ఇప్పుడు ఆ దుర్గమ్మ సన్నిధిలోనే ఉన్నాము , ఫ్లైట్ వైజాగ్ లో కాకుండా ఆ కనకదుర్గమ్మ కొలువైన బెజవాడలో ల్యాండ్ అయ్యింది అంటూ ఒకవైపు కంగారుపడుతూనే మరొకవైపు సంతోషమే అన్నట్లు కళ్ళల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది .
మా అమ్మకోసమే - మా అమ్మ కళ్ళల్లో బయటపడని ఈ సంతోషం కోసమే అమ్మవారి మొక్కుని తీర్చుకోవడానికి తీసుకొచ్చాను .
అమ్మకళ్ళల్లో ఉద్వేగపు చెమ్మ - ఆశ్చర్యం .......
దీనికే ఇలా ఆశ్చర్యపోతే ఎలా - ఈ ఒక్క అమ్మవారే కాదు అమ్మా ....... , మా అమ్మ మనసులో ఎప్పటినుండో ఉండిపోయిన తీరని కోరికను , మా అమ్మ మొక్కుకున్న అతిపవిత్రమైన మొక్కుని తీర్పించడం కోసం దేశంలో ఉన్న అమ్మవార్లందరి సన్నిధికి - అమ్మల శక్తిపీఠాలకు తీసుకెళ్లబోతున్నాను - మొక్కుని తీర్చుకోబోతున్నాము .
" బెజవాడ కనకదుర్గమ్మ .......
పురుహూతిక .......
మాణిక్యాంబ - ద్రాక్షారామం ......
జోగులాంబ - అలంపూర్ ........
భ్రమరాంబిక - శ్రీశైలం .........
మధుర మీనాక్షి ........
కంచి కామాక్షి .......
మైసూర్ చాముండేశ్వరి .......
మహాలక్ష్మి - ముంబై .........
ఏకవీరిక - ముంబై .......
మహాకాళి - ఉజ్జయిని .......
గిరిజ - ఒరిస్సా .......
కామరూప - గౌహతి .......
మాదవేశ్వరి - ప్రయాగ .......
వైష్ణవి - జ్వాలాక్షేత్రం ......
మంగళ గౌరీ - బీహార్ .......
విశాలాక్షి - వారణాసి ......
శృంఖల పశ్చిమ బెంగాల్ ......
సరస్వతి - జమ్మూ ...... " ........ అంటూ గుక్కతిప్పుకోకుండా చెప్పాను .
అమ్మ సంతోషపు ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయారు .
మా అమ్మలో ఈ సంతోషం చూడటానికి - శక్తిపీఠాల మొక్కు తీర్చుకున్న తరువాత పొందబోయే మనస్సాoతిని వీక్షించడం కోసమే కదా ...... , అమ్మా ...... సూర్యోదయం కంటే ముందే కనకదుర్గమ్మ తొలి దర్శనం అదృష్టం తొందరగా రెడీ అవ్వండి నేనువెళ్లి కింద ఉన్న మన లగేజీ తీసుకొస్తాను అంటూ చిరునవ్వులు పూయిస్తున్న అమ్మ బుగ్గపై ముద్దుపెట్టి లేచాను .
మహేష్ అంటూ సడెన్ గా లేచి నా గుండెలపై అల్లుకుపోయారు అంతులేని ఆనందంతో .........

Wow ....... అంటూ కలుగుతున్న అనుభూతికి తియ్యదనంతో వణుకుతున్నాను .
అమ్మ : థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో మచ్ మహేష్ ....... , ఈసారి కూడా నా మొక్కు తీరదు అనుకున్నాను .
అమ్మా ...... అంటే మొక్కుతీర్చుకోవడం కోసమే బయలుదేరారా ? .
అమ్మ : అవును మహేష్ .......
ఒంటరిగా ......
అమ్మ : అవును అంటూ భయన్ని ఫీల్ అవుతూ నాకళ్ళల్లోకే చూస్తున్నారు .
అమ్మా ...... నాకొస్తున్న కోపానికి మిమ్మల్ని కొట్టాలనిపిస్తోంది అంటూ కళ్ళల్లో చెమ్మను కార్చాను .
అమ్మ : కోపం అంటూనే బాధపడుతున్నావే మహేష్ ....... , ఇలానే ఒంటరిని అయిపోయి ఇన్నాళ్లూ మొక్కు తీర్చుకోకుండా ఆగిపోయాను అందుకేనేమో నా బిడ్డకు దూరమవుతూనే వచ్చాను అంటూ బాధపడుతున్నారు .
అమ్మా అమ్మా అమ్మా ...... ఇక నేనున్నాను కదా - మా అమ్మ మొక్కు తీరబోతోంది అంటూ కన్నీళ్లను తుడిచి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
అమ్మ : థాంక్యూ మహేష్ అంటూ గుండెలపైకి చేరి ఆనందిస్తున్నారు - నా బిడ్డకోసం మొక్కుకున్న మొక్కును మరొక బిడ్డ ద్వారానే తీరబోతుండటం ఒక అమ్మగా అదృష్టం - ఇంతటి అదృష్టాన్ని పొందబోతున్న ఏకైక తల్లిని నేనేనేమో అంటూ తెగ మురిసిపోతున్నారు లవ్ యు లవ్ యు మహేష్ అంటూ హృదయంపై గట్టిగా ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ....... అంటూ సోఫాలోకి పడిపోయాను .
మహేష్ మహేష్ అంటూ అమ్మ నవ్వులు ........
ఆఅహ్హ్ ...... మా అమ్మలో ఈ ఆనందాలకోసం మన దేశంలోని శక్తిపీఠాలు మాత్రమేకాదు శ్రీలంకలోని శాంకరీదేవి - పాకిస్థాన్ లోని హింగ్లాజ్ అమ్మవారు మరియు ........
అమ్మ : చాలు చాలు చాలు ....... , అంతదూరం మొక్కుకోలేదు అయినా నీకు తెలియంది ఏముంది ఈ అమ్మ చేతిని రాత్రంతా పట్టుకుని వినాల్సినదంతా వినేశావుకదా .......
Sorry sorry అమ్మా అంటూ చెవులను పట్టుకుని గుంజీలు తియ్యబోయాను .
అమ్మ నవ్వుకున్నారు - నేను తప్పు అన్నానా అంటూ ఆపి గట్టిగా చుట్టేశారు - గత 20 ఏళ్లుగా అనుభవిస్తున్న శిక్ష ........
అమ్మా అమ్మా అమ్మా ...... మిమ్మల్ని బాధపెట్టాలని కాదు - మీకు గుర్తుచేయాలని కాదు - మొక్కు తీర్చుకున్న సంతోషంలో బాధకు కారణం అడుగుతాను - ఎప్పుడైతే ఎంచక్కా మొక్కు తీరిపోయి ఉంటుంది - మా అమ్మ మనసుకు ప్రశాంతత కూడా చేకూరి ఉంటుంది అంటూ నుదుటిపై మరొకముద్దుపెట్టాను .
అమ్మ : మ్మ్మ్ ...... నువ్వు ముద్దుపెట్టిన ప్రతీసారీ నువ్వు చెప్పిన ప్రశాంతత అంటూ నా హృదయంపై ముద్దుపెట్టారు .
నాకుకూడా అమ్మా ఆఅహ్హ్హ్ ...... అంటూ సోఫాలోకి పడిపోబోతుంటే పట్టుకుని నవ్వుకుంటున్నారు .
లవ్ యు అమ్మా ...... అయ్యో 2:30 అవుతోంది , నేనువెళ్లి లగేజీ తీసుకొస్తాను అంటూ అమ్మను సోఫాలో కూర్చోబెట్టి , లవ్ యు అమ్మా అంటూ బుగ్గపై ముద్దుపెట్టి తుర్రుమన్నాను .

కిందకువెళ్లి భుజంపై రెండు బ్యాగులను - తలపై ఒక బ్యాగును - చేతులతో రెండు బ్యాగులను పట్టుకుని అమ్మ చెంతకు చేరాను .
అమ్మ ...... కోపం - సంతోషం కలగలిపి నావైపుకు చూస్తున్నారు , మహేష్ ..... అంటూ హెల్ప్ చెయ్యడానికి లేచారు .
నో నో నో అమ్మా ...... ఇక ఏమైనా ఉందా అంటూ ఆపి ఐదు బ్యాగులను కిందకుదించాను హమ్మయ్యా అంటూ .......
అమ్మ : చాలా బరువు ఉన్నట్లున్నాయి అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
మ్మ్మ్ ...... మా అమ్మ ముద్దుకు ఎనర్జీ తిరిగి వచ్చేసింది .
అమ్మ : అలా అయితే అంటూ ఏకంగా పెదాలతో బుగ్గలపై చెరొక ముద్దుపెట్టారు .
మ్మ్మ్ మ్మ్మ్ ..... ఆఅహ్హ్ ..... అంటూ సోఫాలోకి పడిపోయాను .
అమ్మ నవ్వుకుంటూ నాప్రక్కన చేరి దెబ్బలు కురిపిస్తున్నారు .
Yes yes yes .......
అమ్మ : నిన్నూ ...... అంటూ భుజంపై కొరికేశారు - నాకు ఇంటిదగ్గరే అనుమానం వచ్చిందిలే - రాధిక తన కొత్త అపార్ట్మెంట్ నుండి తెచ్చినదేమో రెండే రెండు బ్యాగులు - ఎయిర్పోర్ట్ కు బయలుదేరేటప్పుడు మాత్రం కారుపై చాలా బ్యాగులు ఉన్నాయి .
అమ్మో అమ్మో మా అమ్మ టూ ఇంటెలిజెంట్ ....... అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను .
అమ్మ : పో మహేష్ సిగ్గేస్తోంది .
మా అమ్మ సిగ్గుపడుతుంటే ఇక్కడ వైబ్రేషన్స్ ముద్దొ ...... ముచ్చటగా ఉంది , అమ్మా ..... టైం అవుతోంది ఇదిగో ఈ రెండు బ్యాగ్స్ లో బట్టలు - ఒక బ్యాగులో జ్యూవెలరీ - మరొక బ్యాగులో ఫ్యాషన్ ఐటమ్స్ ...... ఇక ఈ బ్యాగ్ నాది , బాత్రూమ్లో సోప్ - షాంపూ - టవల్స్ ఉన్నాయి ఆలస్యమైనా పర్లేదు నెమ్మదిగానే ఫ్రెష్ అవ్వండి .
అమ్మ : రాధిక లేదని కంగారుపడకు మహేష్ ...... , నువ్వు పంచిన ప్రేమ మరియు ఈ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ కు కలిగిన ఆనందంలో ఎప్పుడో నొప్పి వెళ్ళిపోయింది అంటూ కాలిని వేగంగా కదిలించారు .
అమ్మా జాగ్రత్త .......
అమ్మ : నా బంగారం - నేనంటే అంతులేని ప్రేమ అంటూ నా హృదయంపైముద్దుపెట్టి బ్యాగులను అందుకోబోయారు .
అమ్మమ్మా ....... కూల్ కూల్ అంటూ బ్యాగులను తీసుకెళ్లి లగేజీ ప్లేస్ లో ఉంచి , చిరునవ్వులు చిందిస్తున్న అమ్మను చూస్తూ బయటకువచ్చి నా బ్యాగుతో గదిలోకివెళ్లి , కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకుని రాథోడ్ దగ్గరకు వెళ్ళాను .

కొద్దిసేపటి తరువాత మహేష్ ఎక్కడ ? - నేను రెడీ అంటూ అమ్మ నుండి కొత్త మొబైల్ కు మెసేజ్ రావడంతో పరుగున పైకివెళ్ళాను .
కొత్త పట్టుచీర - తగిన నగలలో అమ్మను అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను .
అమ్మ : మహేష్ మహేష్ ...... బాలేనా ? .
నో నో నో ...... బాలేకపోవడం ఏంటి అమ్మా ...... దేవతలా ఉంటేనూ ...... నాకిప్పుడు డౌట్ వస్తోంది ...... బెజవాడ కనకదుర్గమ్మ మొక్కు తీర్చుకోవడం కోసం మా అమ్మదేవత ఎదురుచూస్తున్నారా లేక ఈ అమ్మదేవత వారి బిడ్డను చూడటం కోసం స్వయానా ఆ కనకదుర్గమ్మ అమ్మవారే ఆశతో ఎదురుచూస్తున్నారా అని అనిపిస్తోంది .
అమ్మ : లేదు లేదు నేనే అమ్మవారి మొక్కును తీర్చుకోబోతున్నాను ...... అంటూనే నవ్వేశారు .
దేవతలాంటి మా అమ్మ వారి బిడ్డలా తొలిదర్శనం చేసుకోబోతున్నందుకు ఆ దుర్గమ్మ తల్లినే మురిసిపోతారేమో .......
అమ్మ : ఈ అదృష్టాన్ని కరుణించిన ఆ అమ్మకు - కల్పించిన నా బంగారానికి శతకోటి ధన్యవాదాలు ........
బంగారం ...... అమ్మా అలా పిలిచిన ప్రతీసారీ కలిగే ఆనందాలను వర్ణించలేను , బంగారం అని పిలుపు వినేలా కరుణించిన అమ్మవారికి - పలికిన మా దేవతలాంటి అమ్మకు శతకోటి ధన్యవాదాలు ........
అమ్మ నవ్వులను అలా ప్రాణంలా చూస్తూ ఉండిపోయాను .
అమ్మ : ఏంటి బంగారూ ...... అంతలా చూస్తున్నావు ? .
చూడకూడదా అమ్మా sorry sorry .......
అమ్మ : sorry చెప్పావంటే దెబ్బలుపడతాయి .......
కాస్త గట్టిగా కొడితే హ్యాపీ .......
అమ్మ నవ్వులు ఆగడం లేదు .......
ఆఅహ్హ్ ...... ఇలా జీవితాంతం చూడమన్నా హ్యాపీగా చూస్తుండిపోతాను అమ్మా ........
అమ్మ : అంతా ఈ పట్టుచీర మ్యాజిక్ ....... లక్ష ఉంటుంది కదా ? .
కట్టుకోరేమో అనుకున్నాను హమ్మయ్యా ...... థాంక్యూ థాంక్యూ అమ్మా అంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను .
అమ్మ : సంతోషంతో నవ్వుకుంటున్నారు , కట్టుకోకపోతే నా బంగారం ఊరుకుంటాడా ...... ? - బ్యాగులలో ఉన్నవాటిలో ఇదే తక్కువ ప్రైస్ ఇక మిగిలినవన్నీ దీనికి రెట్టింపు మూడింతలు ఉంటాయి .......
Wow లవ్ యు లవ్ యు రా మహీ - దివ్యక్కా - చెల్లెమ్మా ....... , ఈ తక్కువ ఖరీదు చీరలోనే దేవతలా ఉంటే ఇక ఆ చీరలలో ఎలా ఉంటారో అంటూ ఊహల్లోకివెళ్లిపోయాను .
అమ్మ : మహేష్ మహేష్ ...... అంటూ నవ్వుకుంటున్నారు - లవ్ యు for the సారీ ........
అమ్మా అమ్మా ..... నాకుకాదు మీ బిడ్డలకు చెప్పండి - మా అమ్మను ...... నేను ఇలా చేరుతాను అని తెలిసి ఇంతటి అందమైన చీరలను సెలెక్ట్ చేసినది వాళ్ళు ...... నన్ను పొగిడారని తెలిస్తే ఇక యుద్ధమే .......
అమ్మ : లవ్ యు తల్లులూ ........
ఆఅహ్హ్ ...... వాళ్ళు ఎంత ఆనందిస్తుంటారో కళ్లారా చూడలేకపోయినా మనసుకు తెలిసిపోతోంది -
అమ్మ : వాళ్లకు ఎలా చేరి ఉంటుంది .
నాకే కాదు వాళ్లకు కూడా మా అమ్మనే సర్వస్వం - త్వరలో మీకే తెలుస్తుందిలే అమ్మా .......
అమ్మ : మహేష్ ....... ఎంత ఆనందం వేస్తోందో తెలుసా ? - నిన్ను కలవడం నా అదృష్టమే .......
నా అదృష్టం .......
అమ్మ : అదృష్టం అంటావుకానీ ఆ తల్లుల ఫోటోలైనా చూయించవు - కొత్త మొబైల్ అంటూ మరిపిస్తున్నావు .
మా అమ్మ వారి చేతిలోని మొబైల్ ను తాకే అదృష్టం కలిగించిన మరుక్షణం మీ తల్లులందరినీ చూయిస్తాను .
అమ్మ : టైం చూసి , మహేష్ తొలిదర్శనం సమయం అవ్వబోతోంది అంటూ నన్ను దాటుకుని వెళ్లారు ముసిముసినవ్వులతో .......
నవ్వుకుని , అమ్మా అమ్మా మొబైల్ అనుగ్రహం మాత్రం లేదన్నమాట , సరే కానివ్వండి ఒక్కనిమిషం అమ్మా అంటూ అమ్మ టాబ్లెట్స్ మరియు స్ప్రే ను జేబులలో ఉంచుకున్నాను .
అమ్మ : నా బంగారం అంటూ సంతోషంతో నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టబోయారు .
అమ్మా అమ్మా ...... భక్తి భక్తి అంటూ వెనక్కుజరిగాను .
అమ్మ : నా బిడ్డ నా ఇష్టం ఆ కనకదుర్గమ్మకు కూడా ఇష్టమే అంటూ నా హృదయంపై చేతితో ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ...... అంటూ సీట్లోకి పడిపోయాను .
అమ్మ : ఎంతసేపు ఫీల్ అవుతావో ఫీల్ అవ్వు ఇక్కడే కూర్చుంటాను .
నో నో నో sorry sorry అమ్మా ...... , తొలిదర్శనం చేసుకోవాలి అంటూ అమ్మ చెంతకు చేరాను .
అమ్మ : నా బంగారం అంటూ నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి కిందకు చేరాము .

స్స్స్ ...... చలిచలి అంటూ చేతులు చుట్టుకున్నారు .
అమ్మా ..... స్వేటర్ తీసుకొస్తాను .
అమ్మ : వద్దు వద్దు మహేష్ ...... , ప్రకృతిని ఫీల్ అవుతూ దర్శించుకోవాలని అమ్మ కోరుకుంటున్నట్లు ఉన్నారు - ఎంత చలివేసినా ఇలానే వెళదాము , అయినా ఆ వీల్ చైర్ దేనికి ? .
అమ్మా ...... మనం చివరి రన్ వే పై ఉన్నాము - సెక్యూరిటీ రీజన్స్ వలన చీకటిలో మన వెహికల్ ను లోపలికి వదలలేదు - Exit చాలాదూరం ఉంది .
అమ్మ : అక్కడివరకూ చేరేలా ఆ దుర్గమ్మ తల్లే అనుగ్రహిస్తారు - చెప్పానుకదా అమ్మ ఎలా కోరుకుంటే అలా అంటూ నాచేతిని అందుకుని నడిచారు .
అమ్మా అమ్మా ...... , స్లిప్పర్స్ కూడా వేసుకోలేదు .
అమ్మ : కంగారుపడకు మహేష్ ...... అంతా అమ్మే చూసుకుంటుంది - అంటూ నడిచారు .
అమ్మా అమ్మా కనీసం ఈ స్ప్రే అయినా ......
అమ్మ : అవసరం లేదని చెప్పానా అంటూ చిరుకోపం - నవ్వులతో లాక్కునివెళ్లారు .
అమ్మా నెమ్మది అమ్మా నెమ్మది అన్న ప్రతీసారీ మరింత వేగంగా నడుస్తున్నారు - అమ్మా దుర్గమ్మా ...... అంటూ ప్రార్థిస్తూ ఎలాగోలా సెక్యూరిటీ ద్వారా ఎయిర్పోర్ట్ బయటకు చేరుకున్నాము , హమ్మయ్యా ...... అంటూ మాకోసం ఎదురుచూస్తున్న వెహికల్ వైపు చేతితో సైగచెయ్యడంతో మా ముందు వచ్చి ఆగింది .
అమ్మ : వెహికల్ అంటే కారు అనుకున్నాను బస్సులా ఉందే .......

అమ్మా ...... అంటూ డోర్ తెరిచి లోపలికి చూయించాను - అమ్మా జాగ్రత్త ......
అమ్మ : నొప్పి లేదులే అంటూ నాచేతి సపోర్ట్ తో పైకిఎక్కారు - లోపల లైట్స్ అన్నీ ఆన్ అవ్వడంతో కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు .
ఉమ్మా ..... అంటూ అమ్మ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి ఎంజాయ్ చేస్తున్నాను , లగ్జరీ CARVAN అమ్మా ...... మా అమ్మ కంఫర్ట్ - లగ్జరీ నే నాకు ముఖ్యం - New one అలా బయటకువచ్చింది - మా అమ్మకోసం నిన్న బుక్ చేసేసాను .
అమ్మ : ఆనందబాస్పాలతో నా గుండెలపైకి చేరబోయారు .
నో నో నో భక్తి భక్తి మొదట దర్శనం ఆ తరువాతనే అంటూ సోఫాలో కూర్చోమని చెప్పాను .
అమ్మ : Caravan ను చూడనివ్వు , ఎప్పుడో 20 ఏళ్ల ముందు చూసాను .
లవ్ టు లవ్ టు అమ్మా ...... , అమ్మా ..... 20 ఏళ్ల ముందే caravan లో ప్రయాణించారా ? .
ఆరోజులు గుర్తుకువచ్చినట్లు అమ్మ కళ్ళల్లో చెమ్మ ........
నో ...... నో నో నో , రేయ్ మహేష్ నీకు బుద్ధే లేదు అంటూ లెంపలేసుకోవడం చూసి అమ్మ నవ్వేశారు - హమ్మయ్యా ...... మా అమ్మ నవ్వుతూనే ఉండాలి అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను .

అమ్మ : నా కన్నయ్య ప్రక్కనే ఉండగా బాధ అన్నది దరిచేరగలదా ....... లవ్ యు బంగారూ అంటూ చెమ్మను తుడుచుకుని నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
నా కన్నయ్య - బంగారూ ....... ఆఅహ్హ్హ్ అంటూ హృదయంపై చేతినివేసుకుని సోఫాలోకి కూలబడ్డాను .
అమ్మ : కన్నయ్యా జాగ్రత్త అంటూ నవ్వుకున్నారు - ఇక నువ్వు చూయించలేవులే నేనే చూస్తాను .
లవ్ టు లవ్ టు అమ్మా అంటూ లేచాను , అమ్మా ...... ఇది హాల్ , టీవీ - ఫ్రిడ్జ్ - AC .......
అమ్మ : కనిపిస్తున్నవాటిని చెప్పక్కర్లేదులే ......
పంచ్ ......
అమ్మ నవ్వుతున్నారు .
ఆఅహ్హ్ ...... అమ్మ నవ్వులను అందుకుని నా హృదయంపై హత్తుకున్నాను - ఆఅహ్హ్ ...... హాయిగా ఉంది , అమ్మా అమ్మా ...... ఇది హాల్ మాత్రమే కాదు ఇదిగో సోఫాలవెనుక ఉన్నది హాల్ కం డైనింగ్ రూమ్ అన్నమాట - మా అమ్మకు హోటల్ ఫుడ్ ఇష్టమో లేదో ...... నేనే స్వయంగా వండుతాను .
అమ్మ : నిజం చెప్పమంటావా మహేష్ ...... , నిన్న నీ వంటకు అడిక్ట్ అయిపోయాను - ఇక తినలేనేమోనని బాధపడుతున్నాను తెలుసా .......
యాహూ యాహూ ...... లవ్ టు లవ్ టు అమ్మా , మీకు ఏమేమి ఇష్టమో సోఫాలో కాలుమీద కాలువేసుకు కూర్చుని ఆర్డర్ వెయ్యండి అలా రెడీ చేసేస్తాను , అలా అని వంటలో సహాయం చెయ్యాలని వచ్చారో .......
అమ్మ : కన్నయ్యా ....... , ok ok లేదు లేదు అంటూ సంతోషంతో నవ్వుకున్నాము .
ఉమ్మా ఉమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను - ఇకపోతే మరింత లోపల మా అమ్మ బెడ్రూం ఇంకా లోపల బాత్రూమ్ .......
అమ్మ : అమ్మ బెడ్రూం ఏంటి ? .
Caravan లో ఉన్నది ఒకే బెడ్రూం అమ్మా - నేను హాల్లోని సోఫాల్లో పడుకుంటానులే ........
చేతిపై కాస్త గట్టిగానే గిల్లేసారు .
స్స్స్ .......
అంతలో మా లగేజీని ముగ్గురు ఎయిర్పోర్ట్ సిబ్బంది తీసుకురావడంతో అందుకుని బెడ్రూం లో ఉంచి డబ్బు ఇచ్చి పంపించేసాను . అమ్మా ...... ఇట్స్ టైం అంటూ సోఫాలో కూర్చోమనిచెప్పి ప్రక్కనే కూర్చుని వాకీలో పోనివ్వమని చెప్పడంతో 20 నిమిషంలో చేరుకున్నాము .

నేను సమయాన్ని వృధాచేసినా సమయానికి చేరుకున్నాము , 4 గంటలకు అమ్మవారి దివ్యమైన ధర్మ దర్శనం మరియు ముఖ మండపం ....... , మీరు చెప్పినట్లుగానే మొక్కు తీర్చడానికి ఆ అమ్మవారి అనుగ్రహం లభించింది .
అమ్మ కూడా సంతోషించారు - ఆలస్యం చేసినది నువ్వు కాదు నేను .......
కాదు అమ్మా నేను ......
కాదు మహేష్ .... నేను .
కాదు .......
అమ్మ : సరే సరే ఇద్దరమూ ఒప్పుకోము - ఇద్దరమూ ....... అయినా సమయానికి వచ్చేసాము కదా అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టారు .
అవునవును వచ్చేసాము అంటూ చలిలోనే భక్తితో నడుచుకుంటూనే పైకిచేరుకున్నాము - పూజా సామాగ్రిని తీసుకున్నాము .

అమ్మ : అమ్మా దుర్గమ్మా ...... ఇన్ని సంవత్సరాలకు నాకు అదృష్టాన్ని ప్రసాధించారా ...... మీ దర్శనానుగ్రహం అందించబోతున్నారా అంటూ ద్వారాన్ని భక్తితో తాకి భక్తితో మొక్కుకుంటూ క్యూ లైన్లోకి మొదటగా మేమే ప్రవేశించాము - మహేష్ అంటూ అమ్మ ఆనందాలకు అంతులేకుండాపోయింది - ద్వారం దగ్గరనుండి చూస్తున్నాను భక్తితో ప్రార్థిస్తూనే ఉన్నావు అంత బలంగా ఏమి కోరుకుంటున్నావు అంటూ వెనక్కు నన్ను చూస్తూనే అమ్మవారి చెంతకు వెళుతున్నారు .
నాకేమి కోరికలు ఉంటాయి అమ్మా ........ , నాతోపాటు ఉన్న మా అమ్మ మరియు మా అమ్మ ప్రాణమైన బిడ్డలు ఎల్లవేళలా సంతోషాలతో ఉండాలని - మా అమ్మ మొక్కు తీరి వారి మనసులోని కోరిక తీరాలని ప్రార్థిస్తున్నాను .
అమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో అమ్మవారి చెంతకు చేరుకున్నారు .

అమ్మ ఎదురుగానే గర్భగుడి పరదాను తీసివేయ్యడం - దుర్గమ్మ తల్లి తొలి దివ్య దర్శనాన్ని అమ్మనే మొదట దర్శించుకోవడం ...... అమ్మ కళ్ళల్లో ఆ ఆనందభరితమైన అద్భుతం తెలుస్తూనే ఉంది .
పూజారిగారికి పూజా వస్తువులను అందించి అమ్మ మనసులోగల ఒకేఒక కోరిక తీరాలని భక్తితో మొక్కుకుంటున్నారు - హారతి తీసుకుని తీర్థప్రసాధాలను స్వీకరించారు - అమ్మవారి కుంకుమను నుదుటిపై ఉంచుకుని నా నుదుటిపై ఉంచారు - అమ్మవారి కుంకుమను పట్టుచీరలో తీసుకున్నారు .
తనివితీరా భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ తల్లిని దర్శించి గుడి ఆవరణలోకి చేరుకున్నాము .

అమ్మా ...... సంతోషమేనా ? .
అమ్మ : మహేష్ ..... కృష్ణమ్మ ఒడిలోకి చేరి వచ్చి దుర్గమ్మను దర్శించుకోవాలని ఉంది .
అలాగే అమ్మా అంటూ జలజలాపారుతున్న కృష్ణమ్మ ఒడిలో మునకలువేసి తడిబట్టలతోనే దుర్గమ్మ దర్శనం చేసుకుని అమ్మ పొందిన సంతోషాన్ని వీక్షిస్తూ గుడి ఆవరణలో కూర్చున్నాము .
అమ్మ : ప్రసాదాన్ని మొక్కుకుని నాకు అందించి స్వీకరించారు - మహేష్ ...... దివ్య దర్శనం ఎన్నిసార్లు చేసుకున్నావు ? .
ఒంటరిగా ఒకసారి మరియు నా ప్రాణమైన మీ బిడ్డలతో రెండు మూడుసార్లు ప్రయత్నించాను కానీ ఈ అదృష్టం దివ్యా దర్శనం మా ప్రాణం కంటే ఎక్కువైన అమ్మతోపాటు చేసుకోవాలని రాసిపెట్టుంటే ఎవరైనా ఏమిచెయ్యగలరు చెప్పండి - మా అమ్మతో ఈ అదృష్టం పొందినందుకు ఎంత ఆనందం కలిగిందో మాటల్లో చెప్పలేను థాంక్స్ అమ్మా అంటూ భక్తితో గోపురం వైపు మొక్కుకున్నాను .
అమ్మ : నాకు నా బిడ్డతో రాసిపెట్టిందన్నమాట థాంక్యూ మహేష్ అంటూ నాతోపాటు భక్తితో మొక్కుకున్నారు .
అమ్మ మనసు తేలిక అయినట్లు ముఖంలో తెలుస్తోంది .
సూర్యోదయం అయ్యింది .

అమ్మా ...... తొలి ధర్మ దర్శనం చేసుకున్నారు - కృష్ణమ్మ ఒడిలోకి చేరి అమ్మవారి దర్శనం చేసుకున్నారు ...... ఇప్పుడు సూర్యోదయం అయ్యింది సూర్యోదయం తరువాత కూడా దర్శనం ........
అమ్మ : నా మనసులోని మాటనే చెప్పావు మహేష్ ......
నేను గెస్ చేసి చెప్పినది కూడా మా అమ్మ మనసులోనిదే .......
అమ్మ : థాంక్యూ మహేష్ ...... , భక్తుల రద్దీకూడా పెరుగుతోంది - అలా అని ఈ అమ్మకోసం ప్రత్యేకమైన దర్శనం గురించి ఆలోచనే వద్దు - భక్తులతోపాటే క్యూ లోవెళ్లి దర్శించుకుందాము .
మా అమ్మ ఎలచెబితే అలా - ఎన్ని సార్లు అంటే అన్నిసార్లు ......
అమ్మ : నిజమా మహేష్ ..... ? .
అమ్మా ...... ఈ యాత్ర మా అమ్మ మొక్కు తీర్చుకోవడం కోసం - మీఇష్టమే న ఇష్టం ....... , మీకిష్టమైనన్నిసార్లు ...... అయినా అమ్మవారిని అన్నిసార్లు దర్శించుకోవడం అదృష్టమే కదా - మా అమ్మకు బోలెడన్ని థాంక్స్ లు చెప్పాలి .
అమ్మ మనసు ప్రశాంతత చెందేలా తదుపరి రెండుసార్లు భక్తితో దర్శనం చేసుకుని తీర్థప్రసాధాలను స్వీకరించి బయటకువచ్చాము .

అమ్మా ...... హ్యా.....పీ.....నా ? అనేంతలో .......
అమ్మవారి గర్భ గోపురం వైపుకు మొక్కి నా గుండెలపైకి చేరారు అమ్మ ......
అమ్మా అమ్మా .......
అమ్మ : అమ్మవారి దర్శనాన్ని భక్తితో దర్శించుకున్నాము ఇక నాయిష్టం - లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ మహేష్ - మనసు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అంటూ అంతులేని ఆనందంతో ఆనందబాస్పాలతో చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు .
మా అమ్మలోని ఈ డ్రాస్టిక్ చేంజ్ ను దివ్యదర్శనం చేసుకున్నప్పుడే గమనించి ఎంజాయ్ చేసాను - ఒక అమ్మవారిని దర్శించి మొక్కు తీర్చుకుంటేనే మా అమ్మలో ఇంత సంతోషాన్ని చూస్తున్నాను ....... లెట్స్ గో లెట్స్ గో అమ్మా ......
అమ్మ : లవ్ యు మహేష్ ....... అంటూ గుడి బయటకువచ్చాము .

గుడి బయట దారికి ఇరువైపులా ఉన్న షాప్స్ చూస్తూ ...... మహేష్ మహేష్ అంటూ ఒక షాప్ దగ్గరికి లాక్కెళ్లారు . మహేష్ ...... అదికావాలి అంటూ చిన్న చిన్న మూతలు 20 వరకూ గల ఒక బాక్స్ వైపు చూయించారు .
వెంటనే అందుకుని అమ్మకు ఇచ్చి , ఇంకేమైనా కావాలా అమ్మా అని అడిగి పే చేసాను .
అమ్మ : లవ్ యు అంటూ అందుకుని , చీరకొంగు చివరన ముడినివిప్పి చూస్తే ఆశ్చర్యం ...... కృష్ణమ్మ నీటిలో మూడుసార్లు మునకవేసినా కూడా అమ్మవారి కుంకుమ ఏమాత్రం తడవకుండా ఉండటం ...... , అమ్మాదుర్గమ్మా ...... కరుణించావా అంటూ అక్కడినుండే గోపురం వైపుకు భక్తితో మొక్కుకున్నారు .
అమ్మా ...... మీ మనసులోని కోరికను తీర్చేలా ఆ దుర్గమ్మ తల్లి బీజం వేశారు అనడానికి ఇదే సాక్ష్యం .
అమ్మ : కుంకుమను కళ్ళకు హత్తుకుని బాక్స్ లోని ఒక చిన్న మూతలోవేసి , నాచేతిని చుట్టేసి ఉద్వేగానికి లోనౌతున్నారు .
మా అమ్మకోసం స్వయంగా ఆ అమ్మవారే వేసిన బీజం మొలకెత్తాలి అంటే తరువాతి శక్తిపీఠాన్ని దర్శించుకోవాలి అంటూ దేవాలయం వైపు తిరిగి మొక్కుకుని caravan లోకి చేరాము .

అమ్మో అమ్మా టైం 9 గంటలు అయ్యింది .
అమ్మ : అయితే ఏంటి కన్నయ్యా .......
చాలమ్మా చాలు దాదాపు 5 గంటలపాటు నిలబడింది చాలు ఇక హాయిగా కూర్చోండి అంటూ సోఫాలోకూర్చోబెట్టి నుదుటిపై ముద్దుపెట్టాను .
అమ్మ : నా బంగారం ముద్దుపెట్టేసాడు కదా 5 గంటల ఎనర్జీ వచ్చేసింది .
ఈ మాటలు నేను విననంటే వినను - కాసేపు కదలకుండా రెస్ట్ తీసుకోవాలి - వితిన్ మినిట్స్ లో బ్రెడ్ టోస్ట్ చేసేస్తాను తినేసి టాబ్లెట్స్ వేసుకోవాలి .......
అమ్మ : మళ్లీ తినాలా ..... ? , నావల్ల కాదబ్బా ...... , ఇప్పటికే కడుపు నిండిపోయింది .
కడుపు నిండిపోయిందా ...... ? , ఎప్పుడు తిన్నామని అమ్మా ? .
అమ్మ : ఎప్పుడు తిన్నామని ఎలాడుతున్నాడో చూడు కనకదుర్గమ్మ తల్లీ ...... , తొలి దర్శనం తరువాత మహాప్రసాదమైన నేతితో చేసిన చక్కెర పొంగలి తిన్నామా ...... ? .
భలేగా ఉంది అమ్మా ......
అమ్మ : నవ్వుకుని , కృష్ణమ్మ ఒడిలో మునిగిన తరువాత దర్శనంలో కేసరి బాత్ తిన్నామా ? .
అబ్బా ...... గుర్తుచేసుకుంటేనే నోరూరిపోతోంది .
అమ్మ : దర్శనం తరువాత ఆవరణలో ప్రశాంతంగా కూర్చుని , నువ్వు తీసుకొచ్చిన అమ్మవారి లడ్డూ ప్రసాదం తిన్నామా ? .
గుర్తుచెయ్యకు అమ్మా మనసు లాగేస్తోంది - తిరుపతి లడ్డూ తరువాత రుచి ......
అమ్మ : హ హ హ ...... , సూర్యోదయం తరువాత రెండుసార్లు దర్శనంలో ఏ ఏ ప్రసాదాలు తిన్నావో గుర్తుకొచ్చిందా బంగారూ .......
అవునవునమ్మా కడుపునిండిపోయింది అంటూ ఫ్రిడ్జ్ నుండి నార్మల్ కూల్ వాటర్ తీసుకొచ్చి అమ్మకు టాబ్లెట్ అందించాను .
అమ్మ : నా బంగారం అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , టాబ్లెట్ వేసుకున్నారు . ఏదీ వెళ్లు వెళ్లి బ్రెడ్ టోస్ట్ తిను .......
అమ్మా ...... నావల్లకాదు అంటూ అమ్మప్రక్కనే చేరాను .
అమ్మ నవ్వులు ఆగడం లేదు .
లవ్ యు సో మచ్ అమ్మా అంటూ అమ్మ నవ్వులనే ప్రాణంలా చూస్తూ ఉండిపోయాను .
నా బుగ్గలపై - హృదయంపై ...... చేతులతో ముద్దులుపెడుతూనే ఉన్నారు .

అమ్మా అడగడం మరిచిపోయాను నిలబడే ఉన్నారుకదా నొప్పివేస్తోందా ? అంటూ మోకాలిని స్పృశించబోయి ఆగిపోయాను .
అమ్మ కోపంతో ఆ చేతిపై గిల్లేసారు .
స్స్స్ ....... తాకనందుకా ? - తాకడానికి ప్రయత్నించినందుకా ? అమ్మా అంటూ అమాయకంగా అడిగాను .
ఈసారి ఏకంగా భుజంపై కొరికేశారు .......
స్స్స్ ...... , నాకైతే అర్థం కాలేదు - అమ్మా ...... స్ప్రే చేసుకోండి అంటూ జేబులో ఉన్న బాటిల్ అందించి పైకిలేచాను .
అమ్మ : ఎక్కడికి వెళుతున్నావు - మళ్లీ దెబ్బలుపడాలా ...... ? .
మీరు స్ప్రే చేసుకోండి అంతలోపు డ్రైవర్ ను పిలుస్తాను బయలుదేరాలికదా ......
అమ్మ : అలా అయితే ok - నేను స్ప్రే చేసుకోవాలని చూడకూడదు అని వెళ్లిపోతున్నావేమో అనుకున్నాను .
అమ్మ మాటలు మళ్లీ అర్థం కాక తల గోక్కుంటూ కిందకుదిగి ఎదురుగా హోటల్లో ఉన్న డ్రైవర్ ను పిలిచాను - తింటున్న డ్రైవర్ చేతులుకడుక్కుని పరుగునవచ్చాడు - అన్నా ...... అంత అర్జెంట్ ఏమీలేదు తిన్నాకనే రండి బయలుదేరాలి అంటూ కాస్త డబ్బు ఇచ్చి పంపించాను .
థాంక్యూ సర్ అంటూ సంతోషంతో వెళ్ళాడు .
హోటల్ ప్రక్కన అమ్మవారి ఫ్రేమ్స్ ఫోటోలు గల షాప్ ఉండటం చూసి అక్కడకువెళ్ళాను .
Next page: Update 70
Previous page: Update 68