Update 70
15 నిమిషాల తరువాత డ్రైవర్ వచ్చి సర్ రెడీ అన్నాడు .
అన్నా ...... మొదట వెజిటబుల్ మార్కెట్ కు తీసుకెళ్లండి షాపింగ్ చెయ్యాలి - ఇక అక్కడ నుండి ఎక్కడా ఆపకుండా ద్రాక్షారామం తీసుకెళ్లండి .
డ్రైవర్ : అలాగే సర్ అంటూ వెళ్లి caravan ఎక్కాడు .
ఫ్రేమ్ గిఫ్ట్ ను దాచుకుని Caravan డోర్ తీసుకుని ఎక్కి క్లోజ్ చేసి అమ్మా అంటూ అమ్మవైపుకు తిరిగాను - అమ్మ కళ్ళల్లో కోపం ...... , విషయం అర్థమై అమ్మా అమ్మా sorry sorry అంటూ వెళ్లి ఒకచేతితో చెవిని అందుకుని గుంజీలు తీస్తున్నాను .
అమ్మ : చాలు ఆపు అంటూ లేచారు - ఒక్కనిమిషం కాదు రెండు నిమిషాలు కాదు ఏకంగా 20 నిమిషాలు అంటూ ఛాతీపై దెబ్బలవర్షం కురిపిస్తున్నారు .
అమ్మా అమ్మా లవ్ యు లవ్ యు అంటూ బుగ్గపై చేతితో ముద్దులు కురిపించాను .
నవ్వేసినా కోపంతోనే నిలబడ్డారు - నా గుండెలపైకి చేరాలని ఉన్నా బెట్టుచేస్తున్నట్లు పిడికిళ్ళు బిగించి పెట్టుకుని కంట్రోల్ చేసుకుంటున్నారు .
నవ్వడంతో మళ్లీ దెబ్బలు కురిపిస్తున్నారు .
అంతలో బస్సు ఒక్కసారిగా కదలడంతో ......
అమ్మ పడిపోబోతే పట్టుకున్నాను - ఆస్పర్శకు ఇక కంట్రోల్ చేసుకోలేనట్లు నా గుండెలపైకి చేరి గట్టిగా చుట్టేశారు - ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు ఇంతసేపు చూడకుండా ఎలా ఉండగలను అనుకున్నావు .
ఆఅహ్హ్ ...... ఉమ్మా ఉమ్మా - నేనుకూడా ఉండలేను కదమ్మా ......
అమ్మ : మరి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అంటూ చేతిని ప్రేమతో అందుకుని నవ్వుతున్నావు కదూ అంటూ కొరికేశారు .
స్స్స్ ...... , అధికాదమ్మా ..... మా అమ్మకు విలువైన బహుమతి తీసుకురావడానికి వెళ్ళాను అంటూ గిఫ్ట్ చూయించాను .
అమ్మ : నాకళ్ళల్లోకి ప్రాణంలా చూస్తున్నారు - వెంటనే కోపం నన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్లిపోయావు ? .
నో నో నో దూరం వెళ్లగలనా ..... ? అదిగో ఎదురుగా ఉన్న షాప్ ......
అమ్మ : అయితే ok అంటూ ఆతృతతో అందుకున్నారు .
అమ్మా అమ్మా ...... కూర్చుని కూర్చుని చూడండి పడిపోతారు .
అమ్మ : పడిపోతే పడిపోనివ్వు ....... నా కన్నయ్య ప్రేమతో గిఫ్ట్ తీసుకొచ్చాడు ముందైతే చూడనివ్వు ......
కూర్చుని ఎంతసేపైనా చూడవచ్చు అంటూ కూర్చోబెట్టాను .
అమ్మ : నువ్వూ కూర్చో అంటూ చేతిని లాగి ప్రక్కనే కూర్చోబెట్టుకున్నారు - లవ్ యు అంటూ నా హృదయంపై ముద్దుపెట్టి అమితమైన ఆనందంతో గిఫ్ట్ కవర్ ను వేరుచేశారు - బెజవాడ కనకదుర్గమ్మ ఫ్రేమ్ ను చూసి భక్తితో మొక్కుకున్నారు - థాంక్యూ థాంక్యూ మహేష్ ...... దుర్గమ్మ సన్నిధికి వచ్చి దుర్గమ్మ ఫోటోను తీసుకోకుండా వెళ్లిపోతున్నాను .
అంటే అక్కడ షాప్ లలో చూసికూడా నన్ను అడగలేదన్నమాట .......
అమ్మ : అదీ అదీ .......
అమ్మవైపు తియ్యనైనకోపంతో చూస్తూ సోఫా చివరకు జరిగాను .
అమ్మ నవ్వుకుని దుర్గమ్మకు మొక్కుకుని లేచి sorry sprry అంటూ గుంజీలు తియ్యబోయారు .
ఆపి , ఇలాంటివాటికేమీ తక్కువలేదు అంటూ అమ్మ బుగ్గపై ముద్దుపెట్టి నవ్వేసి కూర్చోబెట్టాను .
అమ్మ : యాహూ యాహూ ....... కన్నయ్య నవ్వేశాడు - థాంక్యూ థాంక్యూ అమ్మా అంటూ భక్తితో ఫ్రేమ్ కు మొక్కుకున్నారు .
అమ్మా ...... ఇంకొకసారి మోహమాటపడినట్లు తెలిసిందో ...... నాకు వంద దెబ్బలు కొట్టాలి అమ్మవారిమీద ఒట్టు ......
అమ్మ : వంద దెబ్బలే ......
అవికూడా పెద్ద పెద్ద దెబ్బలు ......
అమ్మ : లేదు లేదు లేదు ఇక అలా చెయ్యనే చెయ్యను .
చెయ్యరా ...... , అయితే వంద దెబ్బలు లేనట్లేనా ...... ప్లీజ్ ప్లీజ్ అమ్మా .
అమ్మ నవ్వులు ఆగడం లేదు , మహేష్ ...... అమ్మవారి ఫోటో చాలా బాగుంది - జాగ్రత్తగా ఒక బ్యాగులో ఉంచుతాను .
అయితే ఒక కొత్త బ్యాగ్ తీసుకుందాము అమ్మా అంతవరకూ సెల్ఫ్ లో ఉంచుతాను అంటూ అందుకుని జాగ్రత్తగా ఉంచేసి వచ్చాను .
అమ్మ : లవ్ యు అంటూ నాచేతిని చుట్టేసి భుజంపై తలవాల్చారు - కన్నయ్యా ..... ఈ టాబ్లెట్స్ వద్దే వద్దు చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లున్నాయి వేసుకోగానే నిద్రవచ్చేస్తుంది .
హాయిగా రెస్ట్ తీసుకుంటే మంచిదే కదా అమ్మా - ఇక ఒక్క టాబ్లెట్ మాత్రమే రాత్రికి వేసుకుంటే అయిపోతాయి - ఇక స్ప్రే ఒక్కటే వాడితే సరిపోతుందని సిస్టర్ చెప్పింది .
అమ్మ : మంచిదే కాదనను కానీ ఆ రెండు మూడు గంటలు నా కన్నయ్యను చూడలేనుకదా .......
ఆఅహ్హ్ ...... అంటూ గుండెలపై చేతినివేసుకుని కదలకుండా ఉండిపోయాను .
అమ్మ : మధురానుభూతిలోకి వెళ్లిపోయావా అంటూ తియ్యదనంతో నవ్వుతున్నారు .
అంతలో బస్సు ఆగింది .
అమ్మా వెజిటబుల్ మార్కెట్ వచ్చినట్లుగా ఉంది - మీరు లోపలికివెళ్లి బెడ్ పై హాయిగా రెస్టుతీసుకోండి 15 నిమిషాలలో వచ్చేస్తాను .
అమ్మ : నో నో నో అంటూ నిద్రమత్తు ఒక్కసారిగా ఎగిరిపోయినట్లు నన్ను కదలనీయకుండా గట్టిగా చుట్టేశారు - అయినా మార్కెట్ కు ఎందుకు ? .
మా అమ్మకు మధ్యాహ్నం వంట చెయ్యడం కోసం రైస్ - పిండి - వెజిటబుల్స్ - మసాలాలు అన్నీ తీసుకురావాలికదా , ఎలక్ట్రిక్ స్టవ్ - వంట పాత్రలు ఉంటే సరిపోతుందా చెప్పండి , 15 మినిట్స్ ఇలావెళ్లి అలా వచ్చేస్తాను .
అమ్మ : 15 మినిట్స్ ....... నావల్ల కానేకాదు అంటూ మరింత గట్టిగా చుట్టేశారు కదలనియ్యకుండా .......
మరి ఎలా అమ్మా ...... , వెజిటబుల్స్ కావాలికదా ....... ఫ్రిడ్జ్ లో బ్రెడ్ - జామ్ - బటర్ - ఐస్ క్రీమ్స్ & కూల్ డ్రింక్స్ తప్ప ఏమీలేవు .
అమ్మ : అయితే నేనూ వస్తాను .
మరి టాబ్లెట్స్ వలన మత్తుగా ఉంది అన్నారు .
అమ్మ : అది నిమిషం ముందువరకూ ...... , 15 నిమిషాలు అని షాక్ ఇచ్చావుకదా ఒక్కసారిగా ఎగిరిపోయింది .
అమ్మా ...... కాసేపు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చుకదా ......
అమ్మ : వెళితే ఇద్దరం వెళదాము లేకపోతే ఇక్కడే ఉందాము - 15 నిమిషాలు నిన్ను చూడకుండా నేనుండలేనబ్బా ....... , నేనూ ఉండలేను అని ప్రగల్బాలు పలకడం కాదు అంటూ రెచ్చగొట్టారు .
అమ్మా ..... మా అమ్మతో కేర్ఫుల్ గా ఉండాలి - అన్నీ గుర్తుంటాయి అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను .
అమ్మ : అయితే ఇద్దరం వెళుతున్నాము అన్నమాట యాహూ యాహూ అంటూ ఏకంగా నా బుగ్గపై పెదాలపై ముద్దుపెట్టి లేచి చెయ్యి అందుకుని లేపుతున్నారు .
ఇక తప్పుతుందా ...... , ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేశారు కదా ......
అమ్మ : మరి మిమ్మల్ని 9 నెలలు మోసి కన్నవాళ్ళం .......
అమ్మా ....... మరొకసారి చెప్పండి ప్లీజ్ అంటూ ఆనందబాస్పాలతో అడిగాను .
అమ్మ : ప్లీజ్ ఎందుకు ....... , నా కన్నయ్యను నవమాసాలు కడుపున మోయకపోయినా కన్నప్రేగుని కదిలించావు - నా తల్లుల తరువాత అమ్మతనంలోని మాధుర్యాన్ని మరింత తెలియజేశావు అంటూ బుగ్గలను అందుకుని పాదాలను పైకెత్తి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు - మీకే ఇంత ఉంటే మిమ్మల్ని కన్న అమ్మలం ........
లవ్ టు లవ్ టు అమ్మా అంటూ ప్రాణంలా కౌగిలించుకుని sorry sorry అమ్మా ఎమోషనల్ అయ్యాను అంటూ వదిలి వెనుకకు తిరిగాను .
అమ్మ : ఎమోషనల్ అయితేనే కదా ఇలా ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకునేది - నేనేమైనా కోప్పడ్డానా ...... అంటూ వీపుపై దెబ్బలు కురిపిస్తున్నారు .
Ok ok sorry అమ్మా ...... , ఇంతకూ మీ తల్లులెవరో చెప్పనేలేదు .
అమ్మ : కన్నయ్యా ...... అంటూ మరింత కోపంతో కొడుతూ నా గుండెలపైకి చేరారు.
లేదులేదులే అమ్మా ...... , మొబైల్ సేఫ్ కదా ? .
అమ్మ : డబల్ సేఫ్ అంటూ మళ్లీ కొట్టి నవ్వుకుంటున్నారు .
అమ్మా ...... మోకాలు నొప్పివేసినా - నిద్రమత్తు కలిగినా వెంటనే చెప్పాలి ఇక్కడికి వచ్చేద్దాము .
అమ్మ : సరే సరే ...... , మోకాలి నొప్పి అయితే మరిచిపో ఎందుకంటే ప్రేమతో టాబ్లెట్ తినిపించావు - స్ప్రే కొట్టుకున్నాను , మత్తుగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చెబుతాను డాక్టర్ మహేష్ ......
లవ్ యు అమ్మా అంటూ నవ్వుకుని , అమ్మచేతిలో చేతిని పెనవేసి కిందకుదిగాము.
అమ్మ : ఎక్కువ దూరం లేదు ఎదురుగానే మార్కెట్ ......
నేనుకూడా హ్యాపీ అంటూ ముందుగా కిరాణా షాప్ కు వెళ్లి క్వాలిటీ రైస్ - పిండితో మొదలుకుని వంటకు అవసరమైనవాటినన్నింటినీ 3 - 4 రోజులకు సరిపడేలా ప్యాక్ చేసి ఉంచమని 15 నిమిషాలలో వస్తాననిచెప్పి అడ్వాన్స్ ఇచ్చి వెజిటబుల్ మార్కెట్ కు వెళ్ళాము .
ఫ్రెష్ ఫ్రెష్ గా ఉన్న వెజిటబుల్స్ ను తీసుకోవడం చూసి అమ్మ ఆశ్చర్యంగా చూస్తున్నారు .
అమ్మ : మహేష్ ...... మా ఆడవాళ్ళ కంటే బాగా షాపింగ్ చేస్తున్నావు తెలుసా ..?.
మీ బిడ్డలకోసం షాపింగ్ చేసి అలవాటైపోయింది అమ్మా ......
అమ్మ : అమ్మో ...... నా తల్లులు సో సో లక్కీ ...... , ఈ కొన్నిరోజులు నేను ......
ఈ కొన్నిరోజులు ఏమిటి అమ్మా ఇక జీవితాంతం - మీరు ఎక్కడ ఉంటారో అక్కడికే వచ్చి ఉండెయ్యనూ ...... , ఇంట్లో కాస్త ప్లేస్ ఇస్తారుకదా అమ్మా ......
అమ్మ : లవ్ టు లవ్ టు అంటూ ఆనందబాస్పాలతో ఎమోషనల్ అవుతూ చెప్పి నా చేతిని ప్రాణంలా చుట్టేసి నాకళ్ళల్లోకే చూస్తున్నారు - కాస్త ప్లేస్ ఏమిటి ఇల్లే మనదైతేనూ .......
మరి ఒకవేళ మీ తల్లులు వద్దు అంటేనూ .......
అమ్మ : వాళ్లనే బయటకు గెంటేస్తాను కానీ ఒక్క నా మహేష్ నో అంటే మాత్రం ......
అర్థమైంది అర్థమైంది అమ్మా ...... , నేన ..... అదే అదే ఆ మహేష్ అంటే ఎంత ప్రాణమో .......
అమ్మ : నా ప్రాణం కంటే ఎక్కువ - నువ్వుకూడా ...... నాకు ఇద్దరూ కావాలి .
యాహూ యాహూ .......
మార్కెట్ రద్దీ అంతా భయపడిపోయి మావైపుకు చూడటం చూసి అమ్మ నవ్వులు ఆగడం లేదు .
Sorry sorry అంటూ తీసుకున్న వెజిటబుల్స్ కు పే చేసి మరింత ముందుకు వెళ్ళాము సైలెంట్ గా - నవ్వుతున్న అమ్మ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి మురిసిపోతున్నాను .
కావాల్సినవన్నింటినీ తీసుకున్నాము .
సర్ హెల్ప్ కావాలా అంటూ అక్కడ ఉన్న ఒక వ్యక్తి రావడంతో ఇద్దరమూ తీసుకుని కిరాణా షాప్ దగ్గరికి చేరుకున్నాము , రైస్ - పిండి తప్ప మిగతావాటినన్నింటినీ బాక్స్ లో ప్యాక్ చేసి ఉండటంతో మిగిలిన అమౌంట్ పే చేసి అన్నింటినీ తీసుకుని caravan వైపుకు నడిచాము .
డ్రైవర్ పరుగునవచ్చి నాచేతిలోనివి అందుకుని caravan లో ఉంచాడు .
ఆ వ్యక్తికి డబ్బు ఇచ్చి పంపించేసి , డ్రైవర్ కు పోనివ్వమని ఎక్కాము .
బస్సు కదలగానే నా గుండెలపైకి చేరారు , హమ్మో ...... భయంకరంగా నిద్రవస్తోంది - కళ్ళు మూతలుపడుతున్నాయి - నా కన్నయ్యతోనే ఉండాలని ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా ...... ఇప్పుడు హాయిగా ఉంది అంటూ గట్టిగా చుట్టేశారు .
అయితే లోపలకువెళ్లి హాయిగా నిద్రపోండి అమ్మా - మీరు లేచేలోపు లంచ్ రెడీ చేసేస్తాను .
అమ్మ : నేనూ హెల్ప్ చేస్తాను అంటూ మళ్లీ హుషారులోకి వచ్చేసారు .
దెబ్బలుపడతాయి , ఇప్పుడే కదా అమ్మా మత్తుగా ఉందని చెప్పినది - వంట మాట ఎత్తారంటే నేనేమిచేస్తానో నాకే తెలియదు .
అమ్మ : నాకన్నయ్య ఏమిచేసినా నాకిష్టమే అంటూ మరింత గట్టిగా చుట్టేశారు .
అమ్మా బుద్ధిగావెళ్లి పడుకోండి - మీ పరిస్థితి చక్కబడ్డాక మీఇష్టం ......
అమ్మ : సరే ......
మా మంచి అమ్మ - అమ్మా ..... ఏమి వండమంటారు లంచ్ కు ? .
అమ్మ : ఏమాత్రం ఆలోచించకుండా బిరియానీ అన్నారు .
బిరియానీ ....... ? .
అమ్మ : వెజ్ వెజ్ ...... వెజ్ బిరియానీ కన్నయ్యా అంటూ నా హృదయంపై ముద్దుపెట్టి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు , మొక్కు పూర్తయ్యేంతవరకూ ఓన్లీ వెజ్ కదా ప్చ్ ప్చ్ ......
నిన్నటి బిరియానీకి మించిన టేస్ట్ తో వెజ్ బిరియానీ చేస్తానులే అమ్మా ......
అమ్మ : Wow ...... చెబుతుంటేనే నోరూరిపోతోంది .
నోరూరుస్తూనే వెళ్లి బెడ్ పై పడుకోండి .
అమ్మ : చెప్పానుకదా మత్తుగా ఉందని - ఒక్క అడుగుకూడా వెయ్యలేను - caravan కూడా మూవ్ అవుతోంది అంటూ తియ్యదనంతో నవ్వుకుంటున్నారు .
మా అమ్మ అందమైన మనసులోని అందమైన కోరిక అర్థమైంది అర్థమైంది .
అమ్మ : ఇప్పటికి అర్థమైందన్నమాట ఎప్పుడో నిన్న రాత్రి అనగా ఎత్తుకున్నావు అంటూ హృదయంపై ముద్దుపెట్టి చేతులను విశాలంగా చాపారు .
జిల్లుమన్నట్లు జలదరించి , లవ్ టు అమ్మా అంటూ రెండుచేతులతో ఎత్తుకున్నాను .
అమ్మ : యాహూ యాహూ ...... I am the happiest mom అంటూ నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెడుతూ కేకలువేస్తున్నారు .
I am the most happiest son ...... అంటూ అమ్మ ముద్దులను ఎంజాయ్ చేస్తూ లోపలికివెళ్లి లగ్జరీ బెడ్ పై పడుకోబెట్టాను - మిర్రర్ విండోస్ కు గల కర్టెన్స్ క్లోజ్ చేసి స్లీపింగ్ క్లైమేట్ కు AC ను సెట్ చేసి భుజాలవరకూ దుప్పటి కప్పి కాసేపు హాయిగా నిద్రపోండి లేకపోతే రోజంతా మత్తుగా ఉంటుంది అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను.
అమ్మ : నా కన్నయ్య ముద్దుకే కమ్మదనం అంటూ కళ్ళుమూసుకున్నారు .
లవ్ యు అమ్మా ......
అమ్మ : కన్నయ్యా ..... డోర్ క్లోజ్ చెయ్యకు .
అలాగే అమ్మా అంటూ నుదుటిపై మరొకముద్దుపెట్టి బెడ్రూం నుండి కిచెన్ దగ్గరకు చేరుకున్నాను .
మినీ డైనింగ్ టేబుల్ మీద నుండి కావాల్సిన కూరగాయలను తీసుకుని మిగతావాటిని ఫ్రిడ్జ్ లో ఉంచాను - వెజిటబుల్ బిరియానీకి పన్నీర్ కూడా కావాలికదా ....... - డైరీ దగ్గర ఆపమని డ్రైవర్ కు చెప్పాను .
నిమిషంలో ఆగడంతో మిర్రర్ విండోస్ నుండి చూస్తే ఎదురుగానే డైరీ ...... థాంక్స్ అన్నా అంటూ పర్సు అందుకుని అలా డోర్ తెరిచానో లేదో .......
నాకు తెలుసు కన్నయ్యా ...... నన్ను పడుకోబెట్టి ఎక్కడికో వెళ్లిపోతున్నావు అంటూ పరుగునవచ్చి నా గుండెలపైకి చేరారు - కదలకునీకుండా చుట్టేసి భుజంపై కొరికేస్తున్నారు అమ్మ ......
స్స్స్ అమ్మా స్స్స్ ...... అంటూ నవ్వుకుంటున్నాను .
అమ్మ : నేను కోపంలో ఉంటే నీకు నవ్వొస్తుందా ..... ? ఈ ఈ ఈ అంటూ ఏడుస్తున్నట్లు నటిస్తూ నా గుండెల్లో దాచుకుని నవ్వుకుంటున్నారు .
లేదు లేదు అమ్మా నొప్పి నొప్పి ......
అమ్మ : కన్నయ్యా నొప్పివేస్తోందా ..... ? Sorry sorry అంటూ కొరికినచోట సున్నితంగా స్పృశిస్తున్నారు .
అవును తియ్యనైన నొప్పి అంటూ నవ్వేసాను - నాకు తెలిసి మందును ముద్దులతో ........
అమ్మ : అవునుకదా మరిచేపోయాను అంటూ భుజంపై ముద్దులుపెట్టారు .
ఆఅహ్హ్ ...... హాయిగా ఉంది అమ్మా .
అమ్మ : నన్ను వదిలి ఎక్కడికి వెళుతున్నావో ముందు ఆ సంగతి చెప్పు ......
మా అమ్మను వదిలి నేనెక్కడికి వెళతాను - వెజిటబుల్ బిరియానీలోకి పన్నీర్ ను నూనెలో వేయించి వేస్తే మరింత టేస్టీ గా ఉంటుందని తీసుకురావడానికి వెళుతున్నాను అంతే - caravan అలా ఆగిందో లేదో లేచేశారు .......
అమ్మ : అయితే నేనూ వస్తాను పదా ......
ప్రక్కనే అమ్మా అదిగో డైరీ అంటూ చూయించాను .
అమ్మ : ప్రక్కనే అయినాసరే వస్తాను .
అమ్మా ...... ఒకటీ రెండు నిమిషాలు అయితే ok అన్నారుకదా చిటికెలో వచ్చేస్తాను.
అమ్మ : లేదు లేదు అలా నేనెప్పుడు అన్నాను అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
మార్కెట్ కు వెళ్లేముందు అన్నారుకదా అమ్మా ....... మా మంచి అమ్మ కదూ , ఇలా బస్సు ఎక్కిదిగితే మోకాలి నొప్పి మళ్లీ వచ్చేస్తుంది - నిమిషంలో వచ్చేస్తాను కదా చూస్తూ ఉండండి కావాలంటే ......
అమ్మ : ప్చ్ ...... నిమిషంలో రాకూడదూ ......
ఏమిచేస్తారమ్మా కొడతారా ? గిల్లుతారా ? కొరికేస్తారా ? .......
అమ్మ : అవన్నీ ఒకేసారి చేస్తాను - వాటికోసం ఆలస్యం చేసావో ...... ఊహూ నువ్వు ఆలస్యం చేస్తావు నేనూ వస్తాను .
మా అమ్మ రెస్ట్ తీసుకోవాలి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చెయ్యను - చూడండి కళ్ళు ఎర్రబడుతున్నాయి కనీసం రెండు గంటలైనా నిద్రపోవాలి అంటూ అమ్మ కళ్లపై ప్రాణమైన ముద్దులుపెట్టి సోఫాలో పడుకోబెట్టాను .
అమ్మ : ఊహూ ...... చూడాలికదా అంటూ కూర్చున్నారు .
లవ్ యు అమ్మా అంటూ నుదుటిపై ముద్దుపెట్టి పరుగులుతీసాను - డైరీకివెళ్లి పావు కిలో పన్నీర్ తీసుకుని నిమిషంలో అమ్మ ముందు ఉన్నాను - అమ్మా లెట్స్ గో ......
అందమైన నవ్వులతో ఎత్తుకోమన్నట్లు చేతులను చాపడంతో ...... ఎత్తుకుని అమ్మ ముద్దులను ఎంజాయ్ చేస్తూ వెళ్లి లోపల బెడ్ పై పడుకోబెట్టి దుప్పటి కప్పాను .
అమ్మో ...... బస్సు మాత్రం ఇక ఎక్కడా ఆగనేకూడదు అంటూ వెంటనే వాకీలో డ్రైవర్ కు చెప్పాను .
అమ్మ ముసిముసినవ్వులు ......
అమ్మా నవ్వులు ఆపి హాయిగా పడుకోండి ......
అమ్మ : మరి ముద్దు ..... ? .
లవ్ టు లవ్ టు అమ్మా అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
లవ్ యు టూ అంటూ అమ్మ ...... నాబుగ్గపై ముద్దుపెట్టి దుప్పటిని నిండుగా కప్పేసుకున్నారు .
ఆఅహ్హ్ ...... లవ్ యు లవ్ యు సో మచ్ అమ్మా అంటూ బుగ్గపై స్పృశిస్తూ ఫీల్ అవుతూ కిచెన్ దగ్గరకు చేరాను .
ముందుగా బాసుమతి రైస్ ప్యాకెట్ అందుకుని ముగ్గురికి సరిపడేలా రైస్ ఒక పాత్రలోకి మరియు మరొక పాత్రలోకి బఠాణీలను తీసికొని కడిగి నానబెట్టాను .
మరొకప్రక్కన కూరగాయలను చిన్నగా కట్ చేసుకున్నాను - కావాల్సిన మసాలాలను కిరాణా షాప్ నుండి తీసుకొచ్చిన బాక్స్ ఓపెన్ చేసి రెడీ చేసుకున్నాను .
పర్ఫెక్ట్ ...... అన్నీ రెడీ ఇక ప్రిపరేషన్ ఒక్కటే లంచ్ టైం ముందు మొదలెడదాము అంటూ డోర్ దగ్గరకువెళ్లి అమ్మనే చూస్తూ నిలబడిపోయాను సమయమే తెలియనట్లు .......
11 గంటలకు తేరుకుని వెంటనే మీడియం సైజ్ పాత్రను అందుకుని స్టవ్ పై ఉంచి తగినంత నూనె వేసాను - ఒక్కొక్కటిగా మసాలాలను వేసి వేయించాను - ఉల్లిపాయల ముక్కలను పచ్చిమిర్చి ముక్కలను వేసి రంగు మారేంతవరకూ మూత ఉంచి వేయించాను .
మరొక స్టవ్ పై చిన్న బాలిగను ఉంచి నూనె వేసి పన్నీర్ ముక్కలను లేలేత ఎరుపురంగులోకి మారేలా వేయించుకుని ప్రక్కన ఉంచాను .
ఇక మూత తెరిచి బాగా మిక్స్ చేసి కర్రీ లీవ్స్ - టమోటో ముక్కలను ను వేసి మిక్స్ చేసాను .
అటుపై బీన్స్ ముక్కలను - బాగా నానిన బఠాణీలను - క్యారెట్ ముక్కలను - ఆలు ముక్కలను- స్ప్రింగ్ ఆనియన్ ముక్కలను వేసి మిక్స్ చేసాను .
తగినంత జింజర్ గార్లిక్ పేస్ట్ మరియు సాల్ట్ వేసి మిక్స్ చేసి 5 నిమిషాలవరకూ మూతను ఉంచి చిన్నగా ఉడికించాను .
మూత తెరవగానే ఆవిరి గుప్పుమంది - గుడ్ గుడ్ ...... అటుపై ఫ్రైడ్ రైస్ మసాలా వేసి మిక్స్ చేసాను ...... మసాలా వాసన ఘుమఘుమలు ......
కూరగాయలు ఉడికి ఉండటంతో వేయించిన పన్నీర్ ముక్కలను మరియు నానబెట్టిన బాసుమతి రైస్ ను వేసి పూర్తిగా మసాలాలు అంటుకునేలా కలియతిప్పి నిమిషం పాటు మూత ఉంచాను .
ఆ తరువాత తగిన పాళ్లల్లో నీటిని వేసి మూత ఉంచాను - all సెట్ ..... వెజిటబుల్ బిరియానీ అదిరిపోవాలి సుమా ..... అమ్మకోసం అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , బెడ్రూం డోర్ దగ్గర చైర్ వేసుకుని హాయిగా నిద్రపోతున్న అమ్మనే ప్రాణంలా చూసి ఆనందిస్తూ కూర్చున్నాను .
హైవేపై పరుగులుపెడుతోంది caravan .....
నా బంగారూ ....... అమ్మను చూసింది చాలు స్టవ్ పై బిరియానీ రెడీ అయ్యింది చూడు .......
Yes yes yes అంటూ వెళ్లి మూత తీసి చూస్తే పర్ఫెక్ట్ గా ఉండికిఉంది - అమ్మ లేచారా అంటూ బెడ్రూం లోకి తొంగిచూస్తే హాయిగా నిద్రపోతున్నారు - లవ్ యు అమ్మా అంటూ చిరునవ్వుతో మొట్టికాయవేసుకుని బిరియానీకి కొత్తిమీర కలిపి మిక్స్ చేసి నేతిని add చేసి మూత ఉంచి నిమిషం పాటు ఉడికించి ఆఅహ్హ్ ..... ఘుమఘుమలే అధిరిపోతున్నాయి - థాంక్యూ థాంక్యూ బిరియానీ ......
అంతలో బస్సు ఆగింది ...... , నో నో నో ...... అంటూ విండోస్ నుండి బయటకుచూస్తే ద్రాక్షారామం వచ్చేసినట్లు అమ్మవారి దేవాలయం ముందే ఆగినట్లు ఎదురుగా కనిపిస్తోంది - టైం చూస్తే 12 గంటలు ...... నాలుగు గంటల ప్రయాణాన్ని 3 గంటల్లో తీసుకొచ్చేసాడన్నమాట థాంక్యూ డ్రైవర్ ......
అమ్మ ఏ క్షణంలోనైనా వచ్చేయ్యొచ్చు అంటూ మూత ఉంచి వెనక్కు తిరిగానో లేదో ....... కన్నయ్యా మళ్లీ ఎక్కడికి ? అంటూ నా గుండెలపైకి చేరిపోయారు .
ఇప్పుడైతే ఎక్కడికీ వెళ్లడం లేదు అమ్మా ..... , ద్రాక్షారామం అమ్మవారి గుడికి వచ్చేసాము .
అమ్మ : అంతలోనే వచ్చేసామా ఇప్పుడే కదా పడుకున్నది - మ్మ్మ్ ..... ఆఅహ్హ్ ఘుమఘుమలు .......
అమ్మా ..... వెజిటబుల్ బిరియానీ రెడీ తిన్నాక అమ్మవారి దర్శనానికి వెళదామా లేక ......
అమ్మ : నో నో నో మొదట దర్శనం .......
మా అమ్మ ఎలా అంటే అలా ..... , అమ్మా ..... తొందరగా రెడీ అవ్వండి మరి , లాస్ట్ ముద్దు మళ్లీ దర్శనం తరువాతనే అంటూ అమ్మ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
అమ్మ : నేనుకూడా అంటూ నా హృదయంపై ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ..... అంటూ సోఫాలోకి చేరిపోయాను .
అమ్మ : ముసిముసినవ్వులు ..... అమ్మ ముద్దును ఫీల్ అవుతూ ఉండు నేను రెడీ అయిపోతాను .
అమ్మా ..... మరొక కొత్త చీరలో ......
అమ్మ : అలాగే అంటూ నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి అందమైన నవ్వులతో లోపలికివెళ్లారు .
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... అంటూ హృదయంపై ముద్దులు కురిపించుకుంటూ ఎంతసేపు అమ్మ ముద్దును అనుభూతి చెందానో .......
కన్నయ్యా ...... నేను రెడీ అంటూ అమ్మ మాటలు వినిపించడంతో పెద్ద పెద్ద కళ్ళతో లేచి నిలబడ్డాను - మాదేవతలాంటి అమ్మను చూడటానికి నేనుకూడా రెడీ ......
కమింగ్ అంటూ అందమైన చిరునవ్వులు చిందిస్తూ పట్టుచీర కుచ్చిళ్ళను సరిచేసుకుంటూ బయటకువచ్చి బాగుందా అని అడిగారు .
దేవతే అమ్మా ఎంత ముచ్చటగా ఉన్నారో మాటల్లో చెప్పలేను ఆఅహ్హ్ ..... అంటూ హృదయంపై చేతినివేసుకుని మళ్లీ సోఫాలోకి కూలబడ్డాను .
అమ్మ నవ్వులు ఆగడం లేదు - థాంక్యూ కన్నయ్యా ...... , నేను వెజిటబుల్ బిరియానీని హాట్ బాక్స్ లో ఉంచుతాను నువ్వు వెళ్లి రెడీ అవ్వు ......
నో నో నో అమ్మా అంటూ అమ్మకంటే ముందుగా నేనేవెళ్లి హాట్ బాక్స్ లో ఉంచి అమ్మనే ప్రాణంలా చూస్తున్నాను .
అమ్మ : ఇక వెళ్లుమరి .......
దేవతలా మారిన మా అమ్మను వదిలి వెళ్లలేకపోతున్నాను - చూస్తూనే ఉండాలనిపిస్తోంది - హృదయమంతా నింపుకోవాలనిపిస్తోంది .
అమ్మ : ఎవరు అడ్డుపడ్డారు - అమ్మవారి దర్శనం తరువాత నీఇష్టం ...... వెళ్లు వెళ్లు అంటూ వెనకనుండి తోసుకుంటూ వెళ్లి బాత్రూమ్ దగ్గర వదిలారు , కన్నయ్యా ..... నీబట్టలను బెడ్ పై ఉంచాను .
15 మినిట్స్ అమ్మా వచ్చేస్తాను .......
అమ్మ : ఎంతసేపు తీసుకోవులే అంటూ ముసిముసినవ్వులతో వెళ్లారు .
అమ్మ చెప్పినట్లుగానే సెకండ్స్ లో బట్టలువిప్పి షవర్ కింద ఫ్రెష్ అయ్యి టవల్ చుట్టుకుని మరొక టవల్ తో తుడుచుకుంటూనే బెడ్ దగ్గరికివచ్చి తడి ఉండగానే కొత్త బట్టలు వేసుకుని 10 నిమిషాలలో అమ్మ ముందు నిలబడ్డాను రెడీ అంటూ .........
అమ్మ : నాకు తెలియదా అంటూ నన్ను సోఫాలో కూర్చోబెట్టి , జలుబు చేస్తుంది ఇలానే ఉంటే అంటూ తల తుడిచారు .
వెనక్కు తిరిగి తిరిగి అమ్మను చూస్తూనే ఉన్నాను .
అమ్మ : ఎన్నిసార్లు ఎంతసేపు చూస్తావు ? ఎంజాయ్ చేస్తూనే అడిగారు . Ok ok నా కన్నయ్య సమాధానం కూడా తెలుసులే అంటూ వెంట్రుకలను సరిచేసి బుగ్గలపై రెండు చేతులతో ముద్దులుపెట్టి , ఇక వెళదామా అన్నారు .
Ok అమ్మా అంటూ caravan దిగి దేవాలయం బయట పూజా సామాగ్రిని తీసుకున్నాము , దేవాలయ ద్వారం దగ్గరకు చేరగానే మహేష్ ..... అష్టాదశ శక్తిపీఠాలలో ఒక అమ్మవారి దగ్గరకు వస్తానని అనుకోనేలేదు అంటూ అమ్మ కళ్ళల్లో వెలుగుతో కూడిన మార్పు - భక్తితో ద్వారాన్ని స్పృశించి మొక్కుకుని అడుగుపెట్టారు - క్యూ లో అమ్మవారి సన్నిధికి చేరుకున్నాము - అమ్మా మాణిక్యాoభ ..... నా బిడ్డ వలన మీ దర్శనం చేసుకుని మొక్కు తీర్చుకునే అదృష్టం కలిగింది - నా కోరిక కంటే ముందు నా బిడ్డ సంతోషంగా ఉండాలి అంటూ ప్రార్థిస్తున్నారు .
అమ్మా మాణిక్యాంబ తల్లీ ..... గత 20 ఏళ్లుగా అమ్మ అనుభవించిన బాధను పోగొట్టి వారి మనసులోని కోరికను తీర్చండి - ఇక జీవితంలో ఏ కోరికా కోరుకోను అంటూ సాష్టాంగ నమస్కారం చేసుకుని పూజ జరిపించి హారతి తీర్థప్రసాదాలు స్వీకరించాము - అమ్మ ...... నాకు కుంకుమ ఉంచి చీరలో కుంకుమ తీసుకున్నారు - భక్తితో సంతృప్తిగా మొక్కుకున్నారు - దేవాలయం ఆవరణలో ప్రశాంతంగా కూర్చుని భక్తితో మొక్కుకున్నారు .
అమ్మా ...... ఒక్కసారి దర్శించుకుంటే మీకు తనివితీరదు కదా ......
అవునవును అంటూ తలఊపుతూనే లేచి నిలబడ్డారు - క్యూ లో రద్దీ తక్కువగా ఉండటంతో మనసారా అమ్మవారి దర్శనం చేసుకుని , అమ్మ అనుగ్రహం లభించినట్లు భక్తి పారవశ్యానికి లోనౌతున్నారు .
మా అమ్మ సంతోషం చూస్తుంటే బీజం మొలకెత్తినట్లుగానే అనిపిస్తోంది .
అమ్మ : అంతా అమ్మవారి అనుగ్రహం అంటూ మరొకసారి మొక్కుకుని దేవాలయం బయట ఉన్న షాప్ కు తీసుకెళ్లారు - మాణిక్యాంబ అమ్మవారి శక్తిపీఠపు ప్రతిమను మరియు ఫ్రేమ్ ను తీసుకున్నారు .
సంతోషమేనా అమ్మా ...... ? .
అమ్మ : ఇద్దరు అమ్మవార్ల అనుగ్రహం అంటే మాటలా ...... చాలా చాలా ఆనందంగా ఉంది - మనసు ప్రశాంతం అయ్యింది అంటూ మొక్కుకున్నాను , ఇదంతా నా మహేష్ వల్లనే అంటూ హృదయంపై చేతితో ముద్దుపెట్టారు - కన్నయ్యా ...... ఆకలేస్తోంది ? .
రెండుసార్లు ప్రసాదం స్వీకరించారు ....... ? .
అమ్మ : అమ్మవారి ప్రసాదంతోపాటు అమ్మవారి అనుగ్రహమైన నా బిడ్డ చేతివంట కూడా రుచిచూడాల్సిందే అంటూ గోపురాన్ని మొక్కుకుని caravan లోకి లాక్కునివెళ్లారు .
అమ్మా కూర్చోండి వెజిటబుల్ బిరియానీలోకి పెరుగు ఉల్లిపాయ పచ్చడి రెడీ చేసేస్తాను అంతలోపు మీరు కుంకుమను బాక్స్ లోకి చేర్చండి అంటూ అందించి , ఫోటో - ప్రతిమను జాగ్రత్తగా సెల్ఫ్ లో ఉంచాను .
అమ్మ : అవునవును ...... నా బంగారం అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు - కిచెన్ కు ఎదురుగా కూర్చుంటాను so that నా కన్నయ్య మనసారా చూసుకోవచ్చు - హృదయమంతా ఈ అమ్మను నింపుకోవచ్చు .......
ఆఅహ్హ్ ...... లవ్ యు లవ్ యు సో సో సో మచ్ అమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూనే వెనక్కు కిచెన్ వరకూ వెళ్ళాను - డ్రైవర్ కు ఊరు బయట ఒక మంచి స్పాట్ లో ఆపమని అమ్మకు వినిపించకుండా వాకీ లో చెప్పడంతో బస్సు కదిలింది .
ఫ్రిడ్జ్ నుండి పెరుగు ప్యాకెట్ అందుకుని ఉల్లిపాయలు కట్ చేస్తూ కళ్ళల్లో కన్నీళ్ళతో అమ్మవైపే చూస్తున్నాను .
అమ్మ : కన్నయ్యా .......
నో నో నో అమ్మా ...... ఉల్లిపాయల వలన మీకళ్ళల్లో కన్నీళ్లను చూశానంటే , నా కన్నీళ్లు కళ్ళల్లోనుండి కాదు హృదయం నుండి వచ్చేస్తాయి , ఇదిగో అయిపోయింది అంటూ అంటూ ఉల్లిపాయల ముక్కలను - కొత్తిమీరను - చిన్న చిన్న పచ్చిమిర్చి ముక్కలు పెరుగులో కలిపి రెడీ అమ్మా అంటూ సోఫావైపు చూస్తే అమ్మ లేరు .... , అమ్మా .......
ఈ ఉల్లిపాయలు ఒకటి ఎవరి కళ్ళల్లోనుండైనా కన్నీళ్లు తెప్పించగలవు వాటికేమి తెలుసు తల్లిప్రేమ అంటూ చీరకొంగుతో కన్నీళ్లను తుడిచి కళ్లపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
ఆఅహ్హ్ ...... చల్లగా - హాయిగా ఉందమ్మా లవ్ యు లవ్ యు సో మచ్ అంటూ అమాంతం కౌగిలించుకుని sorry sorry అంటూ వదిలాను .
అమ్మ : నిన్నూ అంటూ కోపంతో చూస్తూ నా ఛాతీపై దెబ్బలు కురిపించి గట్టిగా హత్తుకున్నారు - తొందరగా ముద్దుపెట్టు లేకపోతే కోపం పెరుగుతూనే ఉంటుంది .
మా అమ్మకోపం కూడా ఇష్టమే అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
అమ్మ : ఆఅహ్హ్హ్ ..... ఇంత హాయిగా ఫీల్ అయ్యావన్నమాట నా ముద్దులకు , ఆ సంతోషానికి ఒక్క కౌగిలింతనే కాదు ఏకంగా ఎత్తి తిప్పినా తప్పులేదు అంటూ ఆనందిస్తున్నారు .
ఆ సందర్భం తొందరలోనే రావాలని ఆ అమ్మవారిని కోరుకుంటాను .
అమ్మ : వినపడలేదు మహేష్ ......
నథింగ్ నథింగ్ అమ్మా ...... , అంతలో బస్సు ఆగింది - విండోస్ నుండి చూసి పర్ఫెక్ట్ అనుకున్నాను , అమ్మా ఆకలివేస్తోంది అన్నారు ......
అమ్మ : భయంకరంగా ...... , త్వరగా త్వరగా వడ్డించుకుని నా బంగారానికి తినిపించి తింటాను .
Wow wow ...... , Wait wait ఓకేఒక్కనిమిషం అమ్మా అంటూ అమ్మను డైనింగ్ టేబుల్ చైర్ పై కూర్చోబెట్టి , హాట్ బాక్స్ లోని వెజిటబుల్ బిరియానీని - పెరుగుపచ్చడిని మా ఇద్దరికి సరిపోయేంత బాక్సస్ లోకి మార్చి , ఫ్రిడ్జ్ నుండి ఐస్ క్రీమ్ - కూల్ డ్రింక్ - వాటర్ బాటిల్స్ మరియు ప్లేట్స్ తీసుకుని అన్నింటినీ ఒక బ్యాగులోకి షిఫ్ట్ చేసాను .
అమ్మ : కన్నయ్యా ...... మనం తినబోయేది ఇక్కడ కాదా ? - రెండు ప్లేట్స్ ఎందుకు ఒక్కటి చాలు ......
లవ్ యు అమ్మా - సర్ప్రైజ్ ..... , మరొక్కనిమిషం అంటూ బిరియానీ పాత్రను మరియు ప్లేట్ ను తీసుకెళ్లి డ్రైవర్ అన్నకు అందించాను .
డ్రైవర్ : థాంక్యూ సర్ అంటూ డ్రైవింగ్ క్యాబిన్ లోనే తిన్నారు .
నీకే థాంక్స్ చెప్పాలి బ్యూటిఫుల్ ప్లేస్ లో ఆపినందుకు అనిచెప్పి వెనక్కువచ్చాను .
అమ్మ : సర్ప్రైజ్ ఎక్కడ కన్నయ్యా ....... , నేనైతే ఆగలేకపోతున్నాను .
సంతోషంతో నవ్వుకుని ఒకచేతితో లంచ్ బ్యాగును అందుకుని మరొకచేతితో వెనకనుండి అమ్మ కళ్ళను క్లోజ్ చేసి నెమ్మదిగా నడవండి అమ్మా అన్నాను - అమ్మా స్టెప్స్ జాగ్రత్త జాగ్రత్త ......
అమ్మ : నా కన్నయ్య ఉండగా నాకు భయమేలేదు - నువ్వేమీ కంగారుపడకు అంటూ వారి కళ్లపై ఉన్న చేతిపై చేతితో ముద్దుపెట్టి ఆనందిస్తున్నారు .
ఫ్యూ మోర్ అడుగులు అమ్మా అంటూ నడిపించుకుంటూ వెళ్లి చేతిని తీసేసాను - ఆశ్చర్యం అప్పటివరకూ ఉన్న సూర్యతాపం మా అమ్మకోసం అన్నట్లుగా మబ్బుల వెనుక చేరడం - ఎదురుగా పూలతోట మరింత సౌందర్యంగా కనిపించడంతో ......
Wow ..... బ్యూటిఫుల్ కన్నయ్యా - బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అంటూ అలాగే వెనక్కు నా గుండెలపైకి వాలిపోయారు అందమైన అనుభూతికి లోనౌతూ .......
అమ్మా ...... మరింత ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పటివరకూ నేను చూసేంతవరకూ సూర్యుడి భగభగలు - మా అమ్మ కళ్ళు తెరవగానే మా అమ్మకోసం ఏకంగా ఆ సూర్యుడే మబ్బు చాటుకు వెళ్లిపోయారు .
అమ్మ : పో కన్నయ్యా ...... , థాంక్యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ...... , తొందరగా లోపలికి తీసుకెళ్లు ......
ఇటువైపు అమ్మా అంటూ పిలుచుకునివెళ్లి కర్రలతో చేసిన ద్వారాన్ని తీసాను .
ఏయ్ ఏయ్ ఎవరు మీరు నేరుగా లోపలికి వెళ్లిపోతున్నారు అంటూ ఒక పెద్దాయన వచ్చారు - పూలు కోతకు వచ్చాయి సాయంత్రం పనివాళ్ళు వచ్చి కోసేంతవరకూ తాకకూడదు - తాకితే పూలు వాడిపోతాయి ...... అని చెబుతుండగానే ,
పర్సులోనున్న మొత్తం డబ్బును పెద్దాయన చేతిలో ఉంచాను .
నోరుతెరిచి షాక్ లో ఉండిపోయాడు .
పెద్దాయనా ...... ఇప్పుడు లోపలికివెళ్లవచ్చా ? .
పెద్దాయన : పూలు కోసి మార్కెట్ కు తరలించినా ఇంత డబ్బు రాదు సామీ ..... మీరు చల్లగా ఉండాలి , లోపలికి ఏమిటి వెళ్లి ఎన్ని పూలైనా కోసుకోండి మీఇష్టం అంటూ దండం పెడుతున్నాడు .
పెద్దాయనా ...... ఇంతటి అందమైన పూలను పాడుచేస్తామా చెప్పండి - సాయంత్రం మీఇష్టప్రకారమే కోసి మార్కెట్ కు తరలించి మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకోండి - రైతులు సంతోషంగా ఉండాలి అంటూ ఆపాను .
పెద్దాయన : నువ్వు నిజంగానే దేవుడిలా వచ్చావు బాబూ ...... , సాయంత్రం వరకూ మీఇష్టం అంటూ సంతోషంగా వెళ్ళిపోయాడు .
నా కన్నయ్య నిజంగా బంగారమే అంటూ అమితమైన ఆనందం - ఆనందబాస్పాలతో నా బుగ్గపై చేతితో ఒకటి కాదు ముద్దులు కురిపిస్తూనే ఉన్నారు అమ్మ .
మా అమ్మ సంతోషం కోసం ఏమైనా చేస్తాను - మా అమ్మ వలన ఒక రైతు కళ్ళల్లో సంతోషం చూసాను అంటూ అమ్మ చేతిపై ముద్దుపెట్టి లోపలికి తీసుకెళ్ళాను .
Wow బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటూ నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి పరుగున పూల మొక్కల దగ్గరికివెళ్లి సాఫ్ట్ గా పూలను స్పృశిస్తూ ఆనందిస్తున్నారు .
వెంటనే మొబైల్ తీసి రికార్డ్ చేస్తూ ఆనందిస్తున్నాను - అమ్మా ..... ఇలా చూస్తుంటే మీరు పదహారేళ్ళ పడుచులా మారిపోయినట్లున్నారు - మీ తల్లుల కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు .
అమ్మ : అమ్మలైతే మాత్రం ఇంత సౌందర్యాన్ని చూసి ఊరికే ఉండాలా అంటూ మధ్యలోకివెళ్లి చేతులను విశాలంగా చాపి చుట్టూ తిరుగుతూ లవ్ యు లవ్ యు సో మచ్ మహేష్ అంటూ ఆనందిస్తున్నారు .
లవ్ యు టూ అమ్మా ...... , పచ్చని గడ్డి ఉన్నచోట లంచ్ ను ఉంచి రంగురంగుల పూలను అందుకుని అమ్మ కూర్చునే చోట చుట్టూ అందంగా అలంకరించాను - అమ్మను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక అమ్మ సంతోషాలను చూస్తుండిపోయాను .
తనివితీరా ఆస్వాదించినట్లు లవ్ యు లవ్ యు మహేష్ - కన్నయ్యా - బంగారూ ....... అంటూ వచ్చి నా గుండెలపైకి చేరారు .
ల....వ్ యు ల....వ్ యు ..... అ....మ్మా అంటూ తడబడుతున్నాను .
అమ్మ : ఏమైంది - వెనుక చేతిలో ఏంటి ? .
నథింగ్ నథింగ్ ..... ఏమీలేదు అమ్మా .......
అమ్మ : ఏదో దాస్తున్నావు ఏదీ అదీ చూయించు అంటూ చేతిని ముందుకు తీసుకొచ్చారు - గులాబీ పువ్వు బ్యూటిఫుల్ ఎవరికోసం ? నాకోసం కాదా ? .
మీకోసమే అమ్మా మీకోసమే అమ్మా ...... అంటూ తలదించుకున్నాను .
అమ్మ : మరి ఇవ్వకుండా వెనుక దాచుకున్నావు ...... కంగారుపడుతున్నావు దేనికి అంటూ సిగ్గుపడ్డారు - ఇవ్వు మరి ......
వణుకుతున్న చేతితో అందించాను .
అమ్మ : లవ్ యు - నాకన్నయ్య చేతులతో అందుకున్న గులాబీ మరింత అందంగా వెలిగిపోతోంది అంటూ నా హృదయంపై ముద్దుపెట్టి వారి హృదయానికీ హత్తుకున్నారు - కన్నయ్యా ..... నా తల్లుల్లా అంటే పడుచుపిల్లలా కురులలో ఉంచుకోనా ? .
మీ ఇష్టం అమ్మా .......
అమ్మ : నా కన్నయ్యకు ఇష్టమైతేనే అంటూ కురులలో ఉంచుకుని ఎలా ఉంది అని అడిగారు .
బ్యూటిఫుల్ ...... చాలా బాగుంది అమ్మా ......
అమ్మ : అంటే నేను బ్యూటిఫుల్ గా లేనన్నమాట అంటూ బుంగమూతితో నా ఛాతీపై కొట్టి ముందుకువెళ్లారు - wow బ్యూటిఫుల్ అంటూ పూలచుట్టూ కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ చేతితో ఆహ్వానించారు .
అమ్మా అలిగినట్లున్నారు .......
అమ్మ : నా కన్నయ్య ఈ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ కు అలక హుష్ కాకి అయిపోయింది అంటూ ఎదురుగా కూర్చోబెట్టుకుని ప్లేటులో వడ్డించుకున్నాను తెగ ఆకలివేస్తోంది అంటూ ......
మా అమ్మ వలన పువ్వుకు మరింత అందం వచ్చింది .
అమ్మ : లవ్ యు అంటూ ప్రేమతో తినిపించి తిన్నారు - మ్మ్మ్ మ్మ్మ్ ...... సూపర్ నిన్నటి కంటే టేస్టీ థాంక్యూ థాంక్యూ కన్నయ్యా అంటూ పెరుగుపచ్చడితో కలిపి తినిపించి తిన్నారు .
ముద్దముద్దకూ నాకళ్ళల్లో చెమ్మ ......
అమ్మ : కన్నయ్యా .......
అమ్మ గోరుముద్ద మాధుర్యం కోసం 20 ఏళ్లకు పైనే వేచిచూసాను అమ్మా ...... , కన్నీళ్లు కాదు ఆనందబాస్పాలు అంటూ తుడుచుకుని మనసారా మాధుర్యాన్ని ఆస్వాధిస్తున్నాను .
అమ్మ : మన ఇద్దరి పరిస్థితీ ఒకటేలా ఉంది మహేష్ అంటూ ఉద్వేగానికి లోనౌతూ ప్రాణంలా తినిపిస్తూ తిన్నారు .
నాకోరిక అయితే తీరిపోయింది , అమ్మ ప్రేమను - అమ్మ గోరుముద్దల అనుభూతిని పొందాను , ఇక మా అమ్మ మనసులోకి కోరిక అనే బీజం మొలకెత్తడమే కాదు మొక్కై మానై పూలు - పళ్ళు పూయాలి .
అమ్మ : నాకు తోడుగా నా కన్నయ్య ఉన్నాడుకదా ....... , అమ్మ అదికూడా అనుగ్రహిస్తే ఏకంగా ముగ్గురు కొడుకులు ........
అమ్మకోరిక తీరాలి అంటూ ప్రార్థించాను - అమ్మా ..... ఇక చాలు కడుపు నిండిపోయింది .
చివరి ముద్ద అంటూ తినిపించి తిన్నారు - కన్నయ్యా ..... ప్రయాణానికి సమయం ఉందికదా .......
టైం చూసుకుని ఉంది అమ్మా మీ ఇష్టం ......
అమ్మ : లవ్ యు ...... , ఐస్ క్రీమ్ తినిపించు నేను పూలతో కలిసిపోతాను .
అంతకంటే అదృష్టమా అమ్మా అంటూ ఐస్ క్రీమ్ అందుకుని అమ్మ వెనుకే వెళ్లి అమ్మ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తూ అమ్మకు తినిపించాను - నాకూ తినాలని ఉన్నా ఆగిపోతున్నాను .
అమ్మ : అంతేలే నా ఎంగిలి అయ్యింది తినవు అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
ఈ మాటకోసమే ఎదురుచూస్తున్నట్లు అదే స్పూన్ తో తిని మ్మ్మ్ ..... అంటూ ఫీల్ అయ్యాను .
అమ్మ : గుడ్ బాయ్ అంటూ హృదయం పై ముద్దుపెట్టి తనివితీరా పూలతో సరదాగా గడుపుతూ నా చేతి ఐస్ క్రీమ్ తిన్నారు . సంతోషపు ఆయాసంతో ఇక చాలు వెళదాము అంటూ నా గుండెలపైకి చేరారు - పాత్రలు ఉన్నాయికదా నిమిషంలో శుభ్రం చేసేస్తాను .
అమ్మ తలపై సున్నితంగా మొట్టికాయవేసి , మరొక్క నిమిషం పూలతో ఎంజాయ్ చెయ్యండి అనిచెప్పి వెళ్లి , పూలమొక్కలకోసం ఉన్న పంపు సెట్టు నీటిలో పాత్రలను శుభ్రం చేసేసి బ్యాగులో ఉంచేసి , కూల్ డ్రింక్స్ తాగుతూ తోటలోకి వెళ్లకుండా కర్రల ద్వారాన్ని ఉంచి caravan ఎక్కాము - సోఫాలో ప్రక్కప్రక్కనే కూర్చున్నాము .
డ్రైవర్ ...... నెక్స్ట్ స్టాప్ శ్రీశైలం - రాత్రి 9 గంటలలోపు తీసుకెళ్లాలి అంటూ వాకీలో చెప్పాను .
Yes సర్ పోనిచ్చాడు .