Update 71

అమ్మ : కన్నయ్యా ...... ఎటుచూసినా పచ్చదనమే - మనసుకు ఉల్లాసాన్ని పంచుతోంది అంటూ సంతోషంతో నా చేతిని చుట్టేసి భుజంపై తలవాల్చి వీక్షిస్తున్నారు - కన్నయ్యా ..... ఎంత వేగంతో వెళుతున్నప్పటికీ స్మూత్ గా వెళుతున్నట్లుంది .
అదే ఈ లగ్జరీయోస్ caravan స్పెషల్ అమ్మా ..... పైగా డబల్ హైవే అంటూ అమ్మతోపాటు ప్రకృతిని ఆస్వాధిస్తున్నాను - అమ్మా ..... చివరిదైన టాబ్లెట్ వేసుకుంటారా ? .
అమ్మ : వేసుకోకపోతే ఊరుకుంటావా కన్నయ్యా ...... , కాసేపు కాసేపు ఆగి వేసుకుంటాను ప్లీజ్ ప్లీజ్ .......
సరే అమ్మా అంటూ నవ్వుకున్నాను - అమ్మా ముందైతే స్ప్రే కొట్టుకోండి అంటూ అందించి లేచాను .
మహేష్ ...... ఇప్పుడు ఎక్కడికి అంటూ చేతిని పట్టుకున్నారు అమ్మ .
జాగ్రత్తగా పోనివ్వమని డ్రైవర్ కు చెప్పేసి వస్తానమ్మా - caravan లో ఉన్నది మా ప్రాణం కంటే ఎక్కువైన మా అమ్మ అంటూ చేతిపై ముద్దుపెట్టాను .
అమ్మ : అయితే సరే తొందరగా వచ్చెయ్యి - నెక్స్ట్ టైం స్ప్రే కొట్టుకునేటప్పుడు ఏమి కారణం చెబుతావో చూస్తాను .........
తలదించుకుని ఫ్రిడ్జ్ లోనుండి కూల్ డ్రింక్ బాటిల్ అందుకుని సైలెంట్ గా డ్రైవింగ్ క్యాబిన్ కు వెళ్ళాను . అన్నా ..... స్పీడ్ గానే వెళ్ళండి కానీ జాగ్రత్త అనిచెప్పాను .
డ్రైవర్ : అలాగే సర్ ...... , మీరేమీ కంగారుపడకండి 10 ఇయర్స్ పైననే అనుభవం ఉంది - ప్రయాణాలలో మందుకూడా ముట్టను మీరు వెళ్లి రిలాక్స్ గా ప్రయాణాన్ని ఎంజాయ్ చెయ్యండి అనిచెప్పాడు .
థాంక్యూ అన్నా అంటూ కూల్ డ్రింక్ ఇచ్చాను .
డ్రైవర్ : థాంక్యూ సర్ ..... , సర్ మరొక మాట బిరియానీ సూపర్ గా ఉంది మేడం గారు చేశారా ? .
లేదు లేదు మీ సర్ స్వయంగా వండారు అంటూ వాకీలో అమ్మ మాటలు వినిపించాయి .
డ్రైవర్ : షాకింగ్ సర్ ...... సూపర్ అంటే సూపర్ అసలు - ఇద్దరు తినేంత తిన్నాను సర్ .
పో అన్నా సిగ్గేస్తోంది అంటూ నవ్వుకుంటూ అమ్మ చెంతకు చేరాను .
అమ్మ : ఎంతైనా సిగ్గుపడొచ్చు అంత టేస్టీ గా ఉంది కన్నయ్యా అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
థాంక్యూ అమ్మా ...... ఇక టాబ్లెట్ వేసుకునే టైం అంటూ అందించాను .
అమ్మ : టాబ్లెట్ మత్తులో పడుకున్నాక ఎక్కడికైనా వెళ్లాలనా ? .
కావాల్సినవన్నీ ఉన్నాయి - మా అమ్మను వదిలి నేనెక్కడికి వెళతాను - ఇక్కడినుండి కదలనంటే కదలను .
అమ్మ : అయితే మత్తుగా అనిపిస్తే ఇక్కడే నా కన్నయ్య భుజంపైనే పడుకుంటాను - ok కదా ......
డబల్ త్రిబుల్ ok అమ్మా ........
అమ్మ : టాబ్లెట్ వేసుకున్నారు - హమ్మయ్యా ..... ఇక్కడితో పూర్తయిపోయాయి .
ఒకవేళ మా అమ్మకు నొప్పి అనిపిస్తే తప్ప మన డాక్టర్స్ కు కాల్ చెయ్యను .
అమ్మ : నేను కాన్ఫిడెంట్ గా చెబుతున్నాను కదా అవసరమే లేదు - నాకు తెలిసి ఇంతవరకూ వేసుకున్నా టాబ్లెట్స్ కూడా అవసరం లేదు - నా బంగారు కన్నయ్య ఇచ్చిన బ్లడ్ ఎనర్జీ చాలు అంటూ చేతిలో చేతిని పెనవేసి ముద్దుపెట్టి నా భుజంపై తలవాల్చి మాట్లాడుతూ మాట్లాడుతూనే ఘాడమైన నిద్రలోకిజారుకున్నారు .
నుదుటిపై - కురులపై - పెనవేసిన చేతిపై ముద్దులతో జోకొడుతున్నాను , హాయిగా నిద్రపోతున్న అమ్మనే ప్రాణంలా చూస్తూ అమ్మా ..... మిమ్మల్ని ఇంత సంతోషంలో మహి చూస్తే ఎంత ఆనందిస్తుందో ....... , అమ్మో ...... మహికి కాల్ చేసి ఒకరోజు దాటిపోతోంది , దివ్యక్కకు - చెల్లెమ్మకు అయితే ఒక్కసారి కూడా చేయలేదు , ప్రస్తుతానికి ఇదే సరైన సమయం ...... అమ్మా అమ్మా ...... , అమ్మ టాబ్లెట్ మత్తులో నిద్రపోతున్నారు ok అంటూ అతినెమ్మదిగా ఎత్తుకునివెళ్లి బెడ్రూం లో పడుకోబెట్టి దుప్పటికప్పి డోర్ క్లోజ్ చేసేసి సోఫాలో చేరాను .

అమెరికా మేనేజర్ కు కాల్ చేసాను .
సర్ ...... మేడం కు కనెక్ట్ చెయ్యమంటారా ? .
ఫాస్ట్ ఫాస్ట్ గా మేనేజర్ గారూ ...... ఇప్పటికే అక్కడ యుద్ధమేఘాలు కమ్ముకుని ఉంటాయి .
Yes సర్ అంటూ కనెక్ట్ చేశారు .....

" మహేష్ మహేష్ ....... "
డియర్ లవ్లీ సిస్టర్ ......
" ఇంకా అమెరికాలోనే ఉన్నారుకదూ ...... అంటూ బాధ "
లవ్ యు లవ్ యు లవ్ యు ...... లవ్ యు లవ్ యు లవ్ యు .........
" చాలు చాలు నవ్వానులే ...... "
లవ్ యు సో మచ్ ఉమ్మా ఉమ్మా ఉమ్మా .......
" లవ్ యు టూ డియరెస్ట్ బ్రదర్ అంటూ ముద్దుల వర్షం కురిపించింది - దేవుడా ..... ఇంకా కోల్డ్ తగ్గినట్లు లేదు "
నా వెచ్చనైన దేవకన్య కౌగిలిలోకి చేరేంతవరకూ తగ్గేలా లేదేమో ...... , ఇక్కడ 24/7 మంచు కురుస్తూనే ఉంది మహీ ...... , ఇబ్బంది అయితే లేదులే నిన్నే తలుచుకుంటూ అలా అలా ఊహల్లోకి .......
" లవ్ యు ....... "
ప్చ్ ప్చ్ ....... నాదేవకన్య సిగ్గుపడటాన్ని చూడలేకపోతున్నాను .
" వీడియో కాల్ చెయ్యనా ...... ? "
నిన్ను చూశానో ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను .......
" లవ్ యు సో మచ్ మై గాడ్ ....... , ఇంకెన్ని రోజులు ? "
నో ఐడియా మహీ ...... , ఈరోజు కాస్త ఊరటను ఇచ్చిందనే చెప్పాలి , ఇంతకూ అక్కడ అంతా హ్యాపీ కదా .......
" హ్యాపీనే కానీ మా దేవుడు లేడు కదా - వీలైనంత త్వరగా వచ్చెయ్యి మిస్ యు సో sosooooo మచ్ బ్రదర్ ....... "
నా దేవకన్యకు డబల్ మిస్ అవుతున్నాను .
" నాకు తెలియదా చెప్పు ...... "
లవ్ యు సో మచ్ సిస్టర్ ...... , మహీ ...... నిన్నటి నుండీ ఇప్పటివరకూ ఎలా ఎంజాయ్ చేశారో వినాలని ఉంది .
" లవ్ టు లవ్ టు మై గాడ్ అంటూ మినిట్ టు మినిట్ చెబుతోంది ........ "
Wow బ్యూటిఫుల్ సూపర్ ...... సిస్టర్స్ కూడా హ్యాపీ అన్నమాట , మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ ...... , సమయాన్ని మరిచిపోయి మాట్లాడుతూనే ఉన్నాము .
" మైగాడ్ ...... దివ్య - చెల్లెమ్మ మిస్ అవ్వడమే కాదు కాల్ కూడా చేయలేదని కోపంగానే ఉన్నారు , ఏక్షణమైనా మూడో కన్ను తెరవచ్చు "
నవ్వుకున్నాను ...... అమ్మో అమ్మో అయితే ముందు కాన్ఫరెన్స్ కలుపు మరి ......
" లవ్ టు అంటూ దివ్యక్కను - చెల్లెమ్మను కాల్ లోకి తీసుకుంది "
దివ్యక్కా - చెల్లెమ్మా .......
" అన్నయ్యా - అన్నయ్యా ........ మేము అలిగాము "
తప్పేలేదు , లవ్ యు లవ్ యు లవ్ యు సో సో soooo మచ్ దివ్యక్కా - చెల్లెమ్మా ....... , పరిస్థితుల వలన తప్పడం లేదు - ఇదిగో గుంజీలు తీస్తున్నాను అంటూ నిజంగానే లేచి 1 2 3 ...... అంటూ గుంజీలు తీస్తున్నాను .
" మీ శ్వాసలో మార్పు తెలుస్తోంది , ఇక చాలు చాలు ఆపండి అంటూ ఇద్దరితోపాటు దేవకన్య - సిస్టర్స్ నవ్వులు కూడా వినిపిస్తున్నాయి .
యాహూ యాహూ ...... అమ్మో అమ్మ అంటూ సైలెంట్ అయిపోయాను , హమ్మయ్యా ...... లవ్ యు లవ్ యు దివ్యక్కా - చెల్లెమ్మా .....
" లవ్ యు లవ్ యు అన్నయ్యా - అన్నయ్యా ....... , అన్నయ్యా ...... కోల్డ్ ఎలా ఉంది ? "
నా దేవకన్య ప్రక్కన లేదుకదా తగ్గడం లేదు .
" దివ్యక్క - చెల్లెమ్మ ...... చిలిపినవ్వులు వినిపిస్తున్నాయి , సిస్టర్స్ ..... గిలిగింతలు పెడుతున్నట్లు డార్లింగ్స్ డార్లింగ్స్ అంటూ నవ్వులు వినిపిస్తున్నాయి , అన్నయ్యా ..... మిస్ అయినవన్నీ వడ్డీ చక్రవడ్డీతో సహా సమర్పించుకుంటుంది లే "
ఆ క్షణం కోసం ఎదురుచూస్తూ ఉంటాను ......
" అంతకుమించి బ్రదర్ అంటూ దేవకన్య సిగ్గులు ...... , దివ్యక్క - చెల్లెమ్మ - సిస్టర్స్ ....... చిలిపినవ్వులు "
అలా సంతోషంతో ఎంతసేపు మాట్లాడామో తెలియదు బయట చీకటిపడటం - caravan లో లైట్స్ వెలిగాయి .

కన్నయ్యా ........
అమ్మ లేచారు అయిపోయాను , దివ్యక్కా - చెల్లెమ్మా - మహీ ...... మీటింగ్ ఉంది వెళ్ళాలి బై బై బై రేపు కాల్ చేస్తాను అంటూ కట్ చేసి బుద్ధిగా మ్యాగజైన్ చూస్తూ కూర్చున్నాను - అమ్మ అడుగుల్లోనే కోపం తెలిసిపోతోంది - ఎదురుగా వచ్చి నిలబడ్డారు - అమ్మ కళ్ళల్లోకి చూడటానికి కూడా ధైర్యం సరిపోవడం లేదు - అమ్మా ...... లేచారా బాగా నిద్రపోయినట్లున్నారు కూర్చోండి కూర్చోండి అంటూ నవ్వుని కంట్రోల్ చేసుకుంటున్నాను .
అమ్మ : ఈ బొంగులో మ్యాగజైన్ చదవడం కోసం నన్ను లోపల పడుకోబెట్టడమే కాకుండా డోర్ కూడా క్లోజ్ చేసేసావు కదూ అంటూ వెళ్లి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు కోపంతో ....... , కంట్రోల్ చేసుకోనట్లు ..... నేను లేచేలోపు అమ్మనే వచ్చి నా ప్రక్కన కూర్చున్నారు .
అహ్హ్హ్ .... హ్హ్హ్ ..... ఇంతకంటే ఏమికావాలి - నేను లేకుండా మా అమ్మ ఉండలేరు ఉమ్మా ఉమ్మా అంటూ నా హృదయంపై ముద్దుపెట్టుకుంటున్నాను .
అమ్మ : అవును నిజమేకానీ ...... , లోపల ఎందుకు పడేశావో చెప్పు ......
పడేశానా ...... అంటూ నవ్వు ఆగడం లేదు .
అమ్మ : నవ్వింది చాలు అంటూ కొడుతున్నారు - గిల్లేస్తున్నారు - భుజంపై కొరికేస్తున్నారు , నీకు నవ్వు వస్తోంది కదూ అంటూ అమ్మ కళ్ళల్లో చెమ్మ ......
అమ్మా అమ్మా అమ్మా అంటూ అమ్మ ముందు మోకాళ్లపైకి చేరి చేతులను అందుకుని ముద్దులుకురిపించాను - లెంపలేసుకున్నాను .
అమ్మ : నా బుగ్గలపై ముద్దులుపెట్టి స్పృశిస్తూ ...... చెప్పానుకదా నీభుజంపైనే పడుకుంటాను అని ......
అమ్మా ...... అలా పడుకుంటే ఇబ్బందిగా ఉంటుందని ......
అమ్మ : నా నుదుటిపై - చేతిపై ముద్దులతో జోకొడుతుంటే ఎంత హాయిగా నిద్రపోయానో తెలుసా అంటూ నాచేతిని అందుకుని కొరికేశారు .
స్స్స్ ...... , రేయ్ మహేష్ గా నీకు బుద్ధే లేదురా నీకు ఈ శిక్ష పడాల్సిందే అంటూ లెంపలేసుకుని గుంజీలు తీస్తున్నాను .
అమ్మ : కన్నయ్యా కన్నయ్యా అంటూ ఆపి ముసిముసినవ్వులతో లేచి నా గుండెలపైకి చేరారు - నా కన్నయ్య ప్రక్కనే ఉంటే స్వర్గం లేకపోతే నరకం ఇదిమాత్రం చెప్పగలను , నొప్పివేసిందా కన్నయ్యా అంటూ కొట్టినచోట - గిల్లినచోట - కొరికినచోట ముద్దులతో మందు రాస్తున్నారు .
ఆఅహ్హ్ ...... అంటూ నన్ను నేను మైమరచి వెనుక సోఫాలోకి కూలబడ్డాను .
అమ్మ నవ్వులు ఆగడం లేదు .
ఆఅహ్హ్ ...... ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ హృదయంపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .
అమ్మ : అంత కోపాన్ని చిటికెలో మాయం చేసేసావు - ఎంత కోపం బాధ కలిగిందో తెలుసా ...... అంటూ నా ప్రక్కన చేరి దెబ్బలు కురిపిస్తున్నారు .
Sorry sorry అమ్మా ..... ఇక ఎప్పుడూ ఇలా చెయ్యను - మా అంద ...... అపురూపమైన అమ్మను బాధపెట్టను , నేనైతే ఫుల్ హ్యాపీ ...... మా అమ్మ చేతి దెబ్బలు - గిల్లుళ్లు - కొరుకుళ్ళు ...... స్వీట్ స్వీట్ గా ఉన్నాయిలే , మళ్లీ ఎప్పుడో ఏమో .......
అమ్మ : చిలిపి కన్నయ్య అంటూ కొట్టబోయి నాచేతిని చుట్టేశారు .
కొట్టాలనిపిస్తే మాత్రం ముందూ వెనుకా ఏమాత్రం ఆలోచించకండి - అమ్మచేతి తియ్యనైన దెబ్బలు తినాలంటే అదృష్టం ఉండాలి .
అమ్మ : లవ్ యు కన్నయ్యా ...... , ఇందుకేకదా నీప్రక్కనే ఉండాలనుకునేది - ఎంత సంతోషం కలుగుతుందో మాటల్లో వర్ణించలేను అంటూ హృదయంపై ముద్దుపెట్టారు .
వొళ్ళంతా జివ్వుమంది - ఆ మాధుర్యంలో నాకు తెలియకుండానే అమ్మచుట్టూ చేతినివేసి హత్తుకుని నుదుటిపై పెదాలను తాకించాను .

సడెన్ గా caravan ఎడమవైపుకు తిరగడంతో ఇద్దరమూ కుడివైపుకు సోఫానుండి కిందకు పడిపోబోయాము అమ్మ అయితే నామీదకు వాలిపోయారు అంతలోనే caravan పూర్తిగా కుడివైపుకు తిరగడంతో మేము ఎడమవైపున సోఫాలో ఏకంగా అమ్మమీదకు ఒరిగిపోబోతూ సోఫాను పట్టుకుని ఆగిపోయాను .
అమ్మ : ప్చ్ ...... నేను నీమీద పడ్డప్పుడు నువ్వుకూడా నామీద పడాలికదా అంటూ కింద నుండి ఛాతీపై దెబ్బలుకురిపిస్తున్నారు .
అంతలోనే మళ్లీ ఎడమవైపుకు పూర్తిగా తిరిగింది .
యాహూ ...... అంటూ అమ్మ నామీదకు నిలువునా వాలేంతలో ...... అమ్మా జాగ్రత్త అంటూ సరిగ్గా సోఫాలో కూర్చోబెట్టి విండోస్ నుండి బయటకుచూస్తే చీకటిలో హెయిర్ పిన్ బెండ్స్ కనిపించాయి - అమ్మా ..... హెయిర్ పిన్ బెండ్స్ శ్రీశైల అమ్మవారి దగ్గరికి వచ్చేసాము .
భ్రమరాంబిక అమ్మవారి దగ్గరకు వచ్చేసామా అంటూ లేచి నాదగ్గరకువచ్చారు - అమ్మో ...... లోయ అంటూ కళ్ళను గట్టిగా బిగించి నా గుండెలపైకి చేరారు .
మా అమ్మకు లోయ అంటే భయం అన్నమాట అంటూ నవ్వుకుంటున్నాను .
అమ్మ : నీకు నవ్వు వస్తోందా ...... ? , ముద్దులతో ధైర్యం పంచడం మానేసి అంటూ కళ్ళుమూసుకునే ఛాతీపై కొరికేశారు .
స్స్స్ ...... లవ్ టు లవ్ టు అమ్మా అంటూ ఒకచేతితో చుట్టేసి అమ్మ కురులపై ప్రాణమైన ముద్దులుపెడుతున్నాను .
అమ్మ : పెదాలపై తియ్యదనంతో ఇప్పుడు దైర్యంగా ఉంది అంటూ మరింత గట్టిగా హత్తుకున్నారు .
అయితే లోయను చూడండి చూద్దాం ......
అమ్మ : అమ్మో ...... నాకు భయం అంటూ వీపు వెనుకకుచేరి వెనకనుండి చుట్టేశారు .
ముద్దులకు భయం పోయింది అన్నారుకదా అమ్మా .......
అమ్మ : నేనేమీ భయపడటం లేదులే ...... , నా కన్నయ్య ఉండగా నాకు భయమేల , ఇదిగో ఇలా హత్తుకోవాలని అంతే .......
Ok ok ...... , అమ్మా ...... మరికొద్దిసేపట్లో కొండమీద అమ్మవారి సన్నిధికి చేరతాము అంతలోపు రెడీ అవ్వండి మరి .
అమ్మ : అలాగే కన్నయ్యా అంటూ లోపలికి నడిచారు .
అమ్మా ........
అమ్మ : కొత్త పట్టుచీరనే కదా అంటూ సంతోషంతో లోపలికివెళ్లారు .
అమ్మా ...... బాత్రూమ్లో జాగ్రత్త ఇంకా చాలా హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి అంటూ కేకవేశాను .
లవ్ యు కన్నయ్యా ........

లవ్ యు అమ్మా ........ , డ్రైవర్ దగ్గరకువెళ్లి అన్నా ...... అనుకున్న సమయం కంటే ముందుగానే తీసుకొచ్చారు సూపర్ డ్రైవింగ్ ......
డ్రైవర్ : థాంక్యూ సర్ ...... , శ్రీశైలం - తిరుమల - ఊటీ ...... ట్రిప్స్ చాలానే వేసాను సర్ .
అనుభవం చాలానే ఉందన్నమాట గుడ్ గుడ్ అంటూ మాట్లాడుతూ అక్కడే కూర్చున్నాను .
డ్రైవర్ : సర్ ...... ఇదే లాస్ట్ ది పైకి వచ్చేసాము .

అంతలో మహేష్ అంటూ అమ్మ పిలుపు ......
కమింగ్ అమ్మా ...... , అ.....మ్మా ......
అమ్మ : చెప్పు ఇక దేవతలా ఉన్నానని అంటూ సంతోషంతో నవ్వుతున్నారు .
మళ్లీ చెప్పాలా అమ్మా ....... , ఆ అమ్మవారి బిడ్డనేమో మీరు - అమ్మలగన్న అమ్మ దగ్గరికి దేవత లాంటి అమ్మను రప్పించుకోవడమేనేమో ఈభక్తి యాత్ర .........
అమ్మ : అవునా ....... , అమ్మ చెంతకు నా బిడ్డ తీసుకొచ్చాడు ...... మరింత సంతోషం అంటూ నా గుండెలపైకి చేరబోయారు .
నో నో నో అమ్మా ...... పైకి వచ్చేసాము - 10 మినిట్స్ లో రెడీ అయ్యి వచ్చేస్తాను అంటూ బాత్రూమ్లోకివెళ్లి షవర్ కింద ఫ్రెష్ అయ్యి బెడ్ పై అమ్మ ఉంచిన డ్రెస్ వేసుకుని అమ్మ దగ్గరికి వచ్చాను .
అమ్మ : నా బిడ్డకూడా సూపర్ .......
థాంక్యూ అమ్మా ...... , బస్సు ఆగడంతో సమయం చూసుకున్నాను - 8గంటలు పర్ఫెక్ట్ టైం ....... , అమ్మా ...... అమ్మను రెండు గంటలపాటు దర్శించుకోవచ్చు అంటూ కిందకుదిగాము .

పార్కింగ్ నుండి నడుచుకుంటూనే వెళ్లి దేవాలయం బయట పూజా వస్తువులను తీసుకున్నాము - విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న గోపురం వైపు సంతోషంతో మొక్కుకున్నారు - యధావిధిగా దేవాలయ ద్వారాన్ని భక్తితో మొక్కుకున్నారు - లోపలికివెళ్లి క్యూ లో నిలుచున్నాము - అమ్మవారి నామస్మరణతో అమ్మవారి చెంతకు చేరుకున్నారు .
భ్రమరాంబిక అమ్మవారిని చూడగానే అమ్మ కళ్ళల్లో సంతోషపు చెమ్మ - అమ్మా ..... ఇన్నేళ్లకు మీ దర్శనానుగ్రహం కలిగించారు అంటూ భక్తితో మొక్కుకున్నారు - అమ్మా ...... నా మనసులోని కోరిక మీకు తెలిసిందే ఆకోరికతోపాటు నా బిడ్డలు కూడా సంతోషంగా ఉండాలి అంటూ తనివితీరా మొక్కుకుని హారతి తీర్థప్రసాధాలను స్వీకరించారు - నాకు కుంకుమ ఉంచి చీర కొంగులో అమ్మవారి కుంకుమను కట్టుకుని భక్తితో మొక్కు తీర్చుకుని ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్నాము .
థాంక్యూ థాంక్యూ మహేష్ అంటూ అమ్మ అంతులేని ఆనందం ......
ఇదంతా ఆనందమే కూల్ కూల్ అమ్మా అంటూ మెట్లపై కూర్చోబెట్టాను .
అమ్మ : ఓకేరోజులో ముగ్గురు అమ్మలను ...... " కనకదుర్గమ్మ - మాణిక్యాంబ - భ్రమరాంబిక అమ్మ " దర్శించుకునే అదృష్టంఎవరికి లభిస్తుంది చెప్పు , నా బిడ్డ వలన నాకీ అదృష్టం కలిగినందుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అంటూ అమ్మవారి గర్భగుడివైపు మొక్కుకుని కొబ్బరి ముక్కను అందించారు .
ముగ్గురు అమ్మలగన్న అమ్మలను మా అమ్మతో దర్శించుకోవడం అంటే ఇక నేనెంత అదృష్టవంతుడినో ...... మా అమ్మకు థాంక్స్ - అమ్మవారికి మొక్కులు అంటూ మురిసిపోతున్నాను , అమ్మా ....... ప్రతీ అమ్మవారి శక్తిపీఠం పరమ పవిత్రమైన ప్రదేశాలలో ఎయిర్పోర్ట్స్ లేవు ఉండి ఉంటే ఈపాటికి మనం 10 అమ్మవార్లనైనా దర్శించుకునేవాళ్ళం .......
అమ్మ : పర్లేదు మహేష్ నెమ్మదిగానే దర్శించుకుని మొక్కు తీర్చుకుందాము .
మా అమ్మ ఇష్టమే నా ఇష్టం ...... అంటూ అమ్మవారి సన్నిధిలో భక్తిలో మునిగిపోయాము .

గుడి మూసే సమయం అయ్యిందని దేవాలయ సిబ్బంది రావడంతో సమయం చూస్తే 10 గంటలు దాటింది .
అమ్మ : అమ్మ సన్నిధిలో రెండు గంటలుకూడా రెండు నిమిషాల్లా గడిచిపోయాయి అంటూ లేచి చివరగా మనసారా ప్రార్థించుకుని బయటకువచ్చాము .
అమ్మా ...... అమ్మవారి ఫోటోను తీసుకోవాలికదా .....
అమ్మ : అవును తీసుకోవాలి అంటూ దేవాలయం బయట ఉన్న ఒక షాపులోకివెళ్లి లోపల గర్భగుడిలోని అమ్మవారిలా ఉండే ఫ్రేమ్ ను తీసుకున్నారు .
పే చేసేసి caravan వైపుకు నడిచాము .
అమ్మా ...... డిన్నర్ కు ఏమి చెయ్యమంటారు ? .
అమ్మ : నా బిడ్డ చేతి వంట ప్రాణం కానీ ఇప్పటికే ఆలస్యం అయ్యింది , ఉదయం - మధ్యాహ్నం నేను పడుకుని రెస్ట్ తీసుకున్నాను నువ్వు మేల్కొనే ఉన్నావు కాబట్టి మహేష్ ....... ఈపూటకు హోటల్లో తినేద్దాము .
మా అమ్మ ఇష్టమే నా ఇష్టం అంటూ హోటల్ కు తీసుకెళ్లి అమ్మకోరికప్రకారం రోటీ - రోటీలోకి మూడు కూరలు ఆర్డర్ ఇచ్చాను , డ్రైవర్ కు కాల్ చేస్తే ఆపాటికే పార్కింగ్ ప్రక్కనే ఉన్న హోటల్లో తినేశానని చెప్పాడు .

భోజనం చేసి caravan చేరుకున్నాము - అమ్మ నుండి భ్రమరాంబిక అమ్మవారి ఫ్రేమ్ అందుకుని మొక్కుకుని సెల్ఫ్ లో జాగ్రత్తగా ఉంచాను .
అమ్మ బాక్స్ అందుకుని కళ్ళకు హత్తుకుని ఒక చిన్న మూతలో భ్రమరాంబిక అమ్మవారి కుంకుమను ఉంచి సెల్ఫ్ లో ఉంచారు - మహేష్ ...... ఓకేరోజులో ముగ్గురు అమ్మలను దర్శించుకోగలిగాను నీవలన అంటూ సోఫాలో నా ప్రక్కనే చేరి చేతిని చుట్టేశారు - బుగ్గపై చేతితో ముద్దులుకురిపిస్తున్నారు .
అంతా మా అమ్మ చేసుకున్న అదృష్టం అంటూ చేతిపై ముద్దుపెట్టాను .
అమ్మ : నేను నిన్ను పొగిడితే నువ్వు నన్ను పొగుడుతున్నావు అంటూ ఆనందిస్తున్నారు .
ప్చ్ ...... కొడతారని expect చేసాను .
అమ్మ మరింత సంతోషంతో నవ్వుతున్నారు - కన్నయ్యా ..... నెక్స్ట్ ఎక్కడికి ? .
మైసూర్ లో కొండపై వెలసిన చాముండేశ్వరీ అమ్మవారిని వారి బిడ్డ దర్శించుకోవడం ......
అమ్మ : నా బిడ్డతోపాటు అంటూ చిరునవ్వులు చిందిస్తున్నారు - కన్నయ్యా ..... నీ మొబైల్ ఇవ్వు .
ఇలా అడగ్గానే మా అమ్మ ఇచ్చేస్తుంది పాపం ......
అమ్మ : వద్దులే ......
ప్చ్ ..... పో అమ్మా , కొట్టి తీసుకుంటారేమోనని ఆశపడ్డాను - మీకు సర్వహక్కులూ ఉన్నాయి మీ బిడ్డపై ...... , కొట్టి తీసుకోండి ప్లీజ్ ప్లీజ్ .......

అమ్మ కళ్ళల్లో చెమ్మ .......
అమ్మా అమ్మా ...... sorry sorry అంటూ అమ్మ ముందు మోకాళ్లపైకి చేరి చేతులను అందుకున్నాను .
అమ్మ : నో నో నో ఇవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు సంతోషంతో వచ్చినవి లెగు లెగు ప్రక్కన కూర్చో - ఇంతలోనే నీ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయా ...... అయితే నేనూ మోకాళ్లపై కూర్చుని మన్నించమని .......
నో నో నో , మీరు ...... మా దేవత అంటూ లేచి ప్రక్కన కూర్చున్నాను .
అమ్మ : నా బంగారం ఉమ్మా ...... , నాకన్నయ్య మాటలకు ఎంత సంతోషం కలిగిందో మాటల్లో చెప్పలేక ఆనందబాస్పాలతో వ్యక్తపరిచాను అంతే , ఇదిగో కొట్టి తీసుకుంటాను అంటూ మొబైల్ లాక్కున్నారు - అలా అని నా మొబైల్ లాక్కున్నావో దెబ్బలు ...... ప్చ్ ప్చ్ దెబ్బలు ఇష్టమే ఎంజాయ్ చేస్తాడు అంటూ నవ్వేశారు .
అమ్మా ...... మీరే స్వయంగా సంతోషంతో ఇచ్చినప్పుడు మాత్రమే టచ్ చేస్తాను .
అమ్మ : నన్ను అర్థం చేసుకున్నందుకు అంటూ నా బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .

మొబైల్ తీసుకుని గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి రెండు రూట్స్ సెర్చ్ చేశారు - క....న్న....య్యా .......
మా అమ్మ తియ్యనైన పిలుపులోనే ఏదో అడగాలన్నట్లు తెలిసిపోతోంది - ఆర్డర్ వెయ్యండి అమ్మా ......
అమ్మ : లవ్ యు - నా బంగారం అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు , కన్నయ్యా ....... శ్రీశైలం టు మైసూర్ కు రెండు దారులు ఉన్నాయి , ఒకటేమో ..... వయా కర్నూల్ అనంతపూర్ బెంగళూరు మీదుగా మరొకటి తిరుపతి మీదుగా ......
అర్థమైంది అర్థమైంది రెండు గంటలు ఆలస్యం అయినా తిరుపతి మీదుగా వెళదాము అంటారు అంతేకదా - ఈ మాత్రం దానికి ...... , మా అమ్మ ...... తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని ఆశపడుతున్నారు .
అవునవును అన్నట్లు సంతోషంతో తలఊపారు అమ్మ .....
Ok వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే వెళదాము on one condition ...... తిరుమల కొండపైకి కాలినడకన అని మాత్రం చెప్పకండి .
అమ్మ : నామనసులో అయితే లేదు కానీ గుర్తుచేసి మంచిపనిచేశాడు నా కన్నయ్య ఉమ్మా ఉమ్మా ....... , తిరుమలకు కాలినడకన వెళ్లి దర్శనం చేసుకుంటేనేకదా మొక్కు తీరినట్లు .......
నో అంటే నో అమ్మా ....... , ఈ పరిస్థితులలో అమ్మో ...... వద్దు వద్దు అంటూ వెళ్లి ఎదురుగా సోఫాలో కూర్చున్నాను .
అమ్మ : yes అంటే yes అంతే అంటూ ముసిముసినవ్వులతో లేచివచ్చి నాప్రక్కన కూర్చున్నారు , కన్నయ్యా కన్నయ్యా ప్లీజ్ ప్లీజ్ ...... ముగ్గురు అమ్మలను దర్శించుకున్నాము వారే శక్తిని ఇస్తారని మనసు చెబుతోంది - అందరి కోర్కెలనూ తీర్చే ఆ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోబోతున్నాము ఆ దేవదేవుడు చూసుకోరా చెప్పు - ఆయన అనుగ్రహం లేనిదే నేను ఇలా మాట్లాడానని అనుకుంటున్నావా ..... ? ఏమైనా అయినా చూసుకోవడానికి ప్రక్కనే నా ప్రాణం కంటే ఎక్కువైన కన్నయ్య ఉండనే ఉంటాడుకదా .......
ఉంటాను ఉంటాను .......
అమ్మ : యాహూ యాహూ ...... నాకన్నయ్య ఒప్పుకున్నాడు .
లేదు లేదు అమ్మా ......
అమ్మ : ఉంటాను అని ఇప్పుడే ఒప్పుకున్నావు కదా ......
ఒప్పుకున్నానా ....... ? , అమ్మా ...... కాలినడక గురించి మీకు ఐడియా నే లేదు కదూ .......
అమ్మ : లేనేలేదు - ఆ స్వామివారే నీ నోటి నుండి అలా పలికించారేమో ......
నాకు బుద్ధిలేదు అంటూ మొట్టికాయలు వేసుకుంటున్నాను .
ప్రతీ మొట్టికాయకు అమ్మ నవ్వుకుని ఆ స్థానంలో ప్రాణమైన ముద్దులుపెడుతున్నారు .

నాకైతే తెగ కంగారుగానే ఉంది అమ్మా ..... , మరొక్కసారి ఆలోచించండి దాదాపు 3 - 4 గంటలు కాలినడకన నడవడం కాదు మెట్లు ఎక్కాలి .
అమ్మ : అవి పరమపవిత్రమైన మెట్లు వాటిని స్పృశిస్తూ - గోవింద నామస్మరణ చేస్తూ వెళ్లి స్వామివారి దర్శనం చేసుకునే అదృష్టాన్ని వదులుకోమంటావా చెప్పు నా కన్నయ్య ఎలా అంటే అలా .......
లేదు లేదు మా అమ్మ ఇష్టమే నా ఇష్టం - అంతా ఆ ఏడుకొండల స్వామివారే చూసుకుంటారు .
అమ్మ : లవ్ యు లవ్ యు సో మచ్ కన్నయ్యా ...... అంటూ హత్తుకున్నారు .
మా అమ్మ సంతోషం కంటే నాకు ఏమికావాలి అంటూ వాకీ అందుకుని తిరుపతికి పోనివ్వమని డ్రైవర్ కు చెప్పాను - వెంటనే caravan కదిలింది .

అమ్మా ...... కాలినడకన వెళ్లాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మీరైతే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి .
అమ్మ : నేనంటే ప్రాణమైన నా కన్నయ్య ఉండగా ఏ జాగ్రత్తలూ తీసుకొనవసరమే లేదు - నువ్వు ఏమీ కంగారుపడకు , నీకంటే చిన్నవయసు ఉన్నప్పుడు ఒకసారి కాలినడకన వెళ్ళాను .
అదేకదా అమ్మా నా భయం కూడా ...... , అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు .......
అమ్మ : ఏమీకాదు , అప్పుడు నేనే ప్రాణమైన అమ్మానాన్నలతో వెళ్ళాను - ఇప్పుడు అంతే ప్రాణంలా చూసుకుంటున్న నా కన్నయ్యతో వెళ్లబోతున్నాను .
ఆఅహ్హ్ ...... అంటూ అంతులేని ఆనందానుభూతికి లోనయ్యాను - సిగ్గుపడుతూనే అది ok అమ్మా కానీ ......
అమ్మ : మోకాలు నొప్పి గురించే కదా ...... , ఇప్పుడు నొప్పి లేదు ఒకవేళ కొండ ఎక్కితే మళ్లీ నొప్పివేస్తుంది అనేకదా నీ భయం .
అవును అవునమ్మా .......
అమ్మ : కన్నయ్యా ...... ఏమాత్రం భయపడకు , 20 ఏళ్లుగా తీరని మొక్కు ఇప్పుడు నీవలన తీర్చుకుంటూ ఇక్కడిదాకా చేరాము అంటే అమ్మల అనుగ్రహం ఉన్నట్లేకదా , భారమంతా వాళ్లపైనే వేసి దైర్యంగా అడుగులువేద్దాము .
నాకు కావాల్సింది మా అమ్మ సంతోషం అంటూ రెండుచేతులతో అమ్మచేతిని అందుకుని ముద్దుపెట్టాను .
అమ్మ : నా తల్లులను ప్రాణంలా చూసుకుంటూనే ఈ అమ్మే సర్వస్వమైన నా బిడ్డ మహేష్ మరియు నా సంతోషం కోసం ఏమైనా చేసే మరొక బిడ్డ మహేష్ దొరకడం నా జన్మజన్మల అదృష్టం అంటూ గుండెలపైకి చేరారు .

లవ్ యు అమ్మా ........ , అమ్మా ...... ఇప్పుడు 11 దాటింది తిరుపతి చేరుకునేసరికి తెల్లవారిపోతుంది - మీరు ఎంత యక్టీవ్ గా ఉంటే అంత ఉత్సాహంగా కాలినడకన వెళ్ళవచ్చు వెళ్లి హాయిగా రెస్ట్ తీసుకోండి .
అమ్మ : మరి నువ్వు ? .
నైట్ అంతా ఒక్కడే డ్రైవింగ్ చెయ్యడం కష్టం కదా , కొండ దిగగానే కాసేపు నేనూ డ్రైవింగ్ చేస్తాను .
అమ్మ : అవును నిజమే , నా కన్నయ్యకు హెవీ వెహికల్స్ డ్రైవింగ్ కూడా వచ్చన్నమాట .......
మీ బిడ్డలు ఒక్కటిగా కాలేజ్ వెళ్లడం కోసం - షికారు షాపింగ్ కు వెళ్లడం కోసం మూడు బస్సులు ఉన్నాయమ్మా - అప్పుడప్పుడూ డ్రైవర్ అన్నలను లాగి నేను డ్రైవింగ్ చెయ్యడం అలవాటు - బస్సులో కాకుండా వాళ్ళ కార్స్ లో తీసుకెళితే ఒక్కొక్కరూ ఒక్కొక్క పరాశక్తి అవతారం ఎత్తేస్తారు .
అమ్మ : ఆశ్చర్యం ...... నా తల్లులు కూడా అంతే ......
ఎవరెవరు అమ్మా వారి పేర్లేంటి అంటూ అమ్మను కవ్వించడానికి అడిగాను - అంతే దెబ్బల వర్షం కురుస్తోంది .
వన్ మోర్ వన్ మోర్ అమ్మా అంటూ అమ్మకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ ఎంజాయ్ చేస్తున్నాను .

అమ్మ : పో కన్నయ్యా ........
లవ్ యు లవ్ యు లవ్ యు అమ్మా అంటూ చేతులను అందుకుని ముద్దులుకురిపిస్తున్నాను అమ్మ పెదాలపై అందమైన నవ్వులు పరిమళించేంతవరకూ ...... , యాహూ యాహూ ...... అమ్మ నవ్వేశారు .....
సిగ్గుపడుతూ నా గుండెలపైకి చేరారు .
ఆఅహ్హ్ ....... హాయిగా ఉంది ఈ ఉత్సాహంతో తిరుపతి వరకూ డ్రైవ్ చేసేస్తానేమో , అమ్మా ..... లోపలకువెళ్లి హాయిగా పడుకోండి .
అమ్మ : హాయిగా పడుకో అంటే సరిపోతుందా ...... , లోపలకు అంత దూరం నడవడానికి శక్తి ఉందో లేదో ....... , నావల్ల అయితే కాదు కన్నయ్యా అంటూ ముసిముసినవ్వులతో నన్ను చుట్టేశారు .
10 అడుగులు వేయడానికి శక్తి లేదుకానీ తిరుమల కొండ మాత్రం ఎక్కేస్తారట అంటూ అమాంతం ఎత్తుకున్నాను .
అమ్మ : దొరికిపోయానన్నమాట అంటూ మరింత సిగ్గుతో దాచుకున్నారు - బెడ్రూం వరకూ ముసిముసినవ్వులు నవ్వుతూనే ఉన్నారు .
అమ్మను బెడ్ పై పడుకోబెట్టి AC ఆన్ చేసాను .
అమ్మ : ఎక్కడికి వెళ్లిపోతున్నావు ..... దుప్పటి ఎవరు కప్పుతారు ? - ప్రాణమైన గుడ్ నైట్ కిస్ ఎవరు పెడతారు ? .
లవ్ టు లవ్ టు అమ్మా అంటూ తెగ పరవశించిపోతూ దుప్పటిని కప్పి గుడ్ నైట్ అమ్మా అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
గుడ్ నైట్ కన్నయ్యా అంటూ రెండుచేతులతో హత్తుకుని నా బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టారు .
Wow ...... మరింత ఎనర్జీ వచ్చేసింది అంటూ అమ్మ బుగ్గపై ముద్దుపెట్టి తుర్రుమన్నాను - డ్రైవింగ్ క్యాబిన్ వరకూ అమ్మ నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి .

అన్నా అన్నా ...... ప్రక్కకు ఆపు నేను డ్రైవింగ్ చేస్తాను .
డ్రైవర్ : సర్ మీరు ? .
తెల్లవారుఘామున నుండి రెస్ట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నావు కొన్ని గంటలు పడుకో నేను డ్రైవ్ చేస్తాను .
డ్రైవర్ : సర్ ...... కార్స్ లా కాదు సర్ కాస్త హెవీ గా ఉంటుంది - నాకు అలవాటే ........
ఒక్కసారి నా డ్రైవింగ్ చూడు నువ్వు satisfy కాకపోతే నీఇష్టం .......
డ్రైవర్ : సరే సర్ అంటూ ప్రక్కకు ఆపి సీట్లోనుండి ప్రక్కకువచ్చాడు .
డ్రైవింగ్ సీట్లో కూర్చుని గేర్ మార్చి పోనిచ్చాను ...... , అంతే షాక్ లో అలా చూస్తుండిపోయాడు .
డ్రైవర్ : సర్ ...... హెవీ వెహికల్ ? - అనుభవం ఉన్న వారిలా డ్రైవ్ చేస్తున్నారు .
అంతలోనే తెలిసిపోయిందా ...... ? .
డ్రైవర్ : అన్నం ఉడికింది అని తెలుసుకోవడానికి మొత్తం చూడాల్సిన అవసరం లేదు కదా సర్ .......
థాంక్యూ ....... ఇక లోపలకువెళ్లి కాసేపు రెస్ట్ తీసుకో ......
డ్రైవర్ : ఇక్కడే బెడ్ ఉంది సర్ అంటూ డ్రైవింగ్ సీట్ వెనుక పడుకున్నాడు .

నిమిషం నిమిషానికి టైం చూస్తూ గేర్స్ మారుస్తూ హైవే పై జాగ్రత్తగానైనా వేగంగా పోనిస్తున్నాను .
సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు కాగానే caravan ను సైడ్ కు ఆపి బెడ్రూం డోర్ దగ్గరకు పరుగులుతీసాను , 12:01 - 12:05 - 12:10 - 12:15 ...... అమ్మ ముందులా కలవరించకుండా హాయిగా నిద్రపోతుండటం చూసి దుర్గమ్మ తల్లికి - మాణిక్యాంబ తల్లికి - భ్రమరాంబిక తల్లికి మొక్కుకున్నాను ఆనందబాస్పాలతో ...... అమ్మలూ ...... అమ్మ మొక్కు తీర్చుకుంటున్నారని అనుగ్రహించారన్నమాట అంటూ భక్తితో ప్రార్థించాను , సంతోషంతో అమ్మ నుదుటిపై ముద్దుపెట్టాను .
మ్మ్మ్ ...... కన్నయ్యా అంటూ పెదాలపై తియ్యదనం ......
అమితమైన ఆనందంతో వెళ్లి మరింత హుషారుగా పోనిచ్చాను - గంటగంటకూ caravan ఆపి అమ్మదగ్గరికి వెళ్లివస్తున్నాను , అలా 3 గంటవరకూ డ్రైవ్ చేసాను .
సర్ ...... 4 గంటల రెస్ట్ చాలు ఇక మీరుకూడా వెళ్లి పడుకోండి ఇక నేను చూసుకుంటాను అంటూ ముఖంపై నీళ్లు చల్లుకున్నాడు .
Are you sure అన్నా ...... ? .
డ్రైవర్ : డబల్ sure సర్ ...... , మీలా ఇంతవరకూ ఎవ్వరూ కేర్ చూయించలేదు సర్ థాంక్యూ థాంక్యూ సర్ , సగం దూరం వచ్చేసినట్లున్నాము తెల్లవారేలోపు తిరుపతికి తీసుకెళ్లిపోతాను .
సూపర్ అయితే అంటూ సైడ్ కు ఆపాను - మళ్లీ మళ్లీ చెబుతున్నాను అని అనుకోకు జాగ్రత్త అనిచెప్పి అమ్మదగ్గరకువెళ్ళాను - ఘాడమైన నిద్రలో ఉండటం చూసి డిస్టర్బ్ చెయ్యకుండా ముద్దుపెట్టి హాల్ లోకి వచ్చి సోఫాలో వాలాను - బాగా అలసిపోవడం వలన వెంటనే నిద్రపట్టేసింది .
*************

కన్నయ్యా కన్నయ్యా నా బంగారుకొండ అంటూ అమ్మ మాటలు వినిపించడంతో అమ్మా అంటూ కళ్ళుతెరిచాను .
అమ్మ అప్పుడే స్నానం చేసినట్లు కొత్తపట్టుచీర నగలలో చిరునవ్వులు చిందిస్తూ గుడ్ మార్నింగ్ కన్నయ్యా అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు .
మ్మ్మ్ ఆఅహ్హ్ ...... అమ్మా స్వర్గానికేమైనా వెళ్లిపోయానా ? - దేవలోకానికేమైనా చేరానా ? ...... wow బ్యూటిఫుల్ దేవతలా ఉన్నారమ్మా అంటూ లేచికూర్చున్నాను .
అమ్మ : లవ్ యు సో మచ్ కన్నయ్యా ...... , దేవత దేవత అంటూ నన్ను నిజంగా దేవతను చేసేలా ఉన్నావు అంటూ చిరునవ్వులు చిందిస్తూ సిగ్గుపడుతున్నారు .
దేవతను చెయ్యడం ఏమిటమ్మా ...... మా అమ్మ నిజంగా దేవతనే - అందుకే కదా దేవతలే వారి బిడ్డను తమ చెంతకు చేర్చుకుంటున్నారు - మా అమ్మను చూడటానికి రెండు కళ్ళూ చాలడం లేదమ్మా .......
అమ్మ : కన్నయ్యా ...... ఇక చాలులే , తిరుపతి వచ్చేసాము తిరుమల మెట్ల పాదాల దగ్గర ఉన్నాము .
ఏంటీ వచ్చేసామా అంటూ బయటకుచూస్తే ఎదురుగా ప్రకృతితో పచ్చదనంతో నిండుకున్న ఏడుకొండలు - నాకు తెలియకుండానే నా చేతులను జోడించి ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందా అంటూ మొక్కుతున్నాను .
నా బంగారం అంటూ నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , అమ్మకూడా మొక్కుకున్నారు .
గుడ్ మార్నింగ్ అమ్మా కాదు కాదు దేవమ్మా ......
అమ్మ : పో కన్నయ్యా అంటూ గుండెలపైకి చేరబోయారు .
నో నో నో అమ్మా ...... మా అమ్మ దేవతలా రెడీ అయ్యింది - నేను పాడు ముఖంతో ఉన్నాను అంటూ వెనక్కు జంప్ చేసాను - అమ్మో ...... 6 గంటలు అమ్మా ..... వెంటనే స్నానం చేసివస్తాను బయలుదేరుదాము అంతవరకూ టీవీ చూస్తూ ఉండండి అంటూ అమ్మ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి లోపలికి పరుగులుతీసాను .
Next page: Update 72
Previous page: Update 70