Update 73

మాకోసమే ఎదురుచూస్తున్నట్లు గుడ్ మార్నింగ్ సర్ అటువైపు అంటూ డ్రైవర్ పలకరించాడు .
అన్నా ...... ఎప్పుడు వచ్చావు ? .
డ్రైవర్ : నిన్న రాత్రే వచ్చేసి ఎయిర్పోర్ట్ పార్కింగ్ లోనే బాగా నిద్రపోయాను సర్ - ఇక నాన్ స్టాప్ గా రెండురోజులైనా డ్రైవింగ్ చేయగలను .
అవసరమైతే నేనున్నాను కదా అన్నా అంటూ caravan చేరుకున్నాము - అన్నా ..... మమ్మల్ని చాముండీ బెట్ట మెట్ల పాదాలదగ్గర వదిలి మీరు కొండపైకి వెళ్లిపోండి .
డ్రైవర్ : అలాగే సర్ అంటూ వెళ్లి స్టార్ట్ చేసాడు .
డోర్ తెరిచి అమ్మా అంటూ చేతిని అందుకుని ఎక్కించాను .
అమ్మ : లవ్ యు అంటూ చిరునవ్వులు చిందిస్తూ నా బుగ్గపై ముద్దుపెట్టివెళ్లి సోఫాలో విండో కూర్చున్నారు - నాచేతిని అందుకుని ప్రక్కనే కూర్చోబెట్టుకున్నారు .

వాకీలో ok అనడంతో caravan బయలుదేరింది .
అమ్మ : సిటీ అందాలను వీక్షిస్తూ కన్నయ్యా ...... ఎక్కడచూసినా పచ్చదనమే , కిలోమీటర్ కు ఒక అందమైన పార్క్స్ ఉన్నాయి , మా అదృష్టం caravan మైసూర్ మహల్ దగ్గరగా వెళ్లడం - కన్నయ్యా కన్నయ్యా ...... మహల్ మహల్ .
అమ్మవారి దర్శనం చేసుకున్న తరువాత వెళదాము అమ్మా ......
అమ్మ : లవ్ యు కన్నయ్యా .......
అక్కడనుండి 20 నిమిషాలలో మెట్ల పాదాలదగ్గరికి చేరుకున్నాము - బ్యాక్ ప్యాక్ వేసుకుని కిందకుదిగాము .

అమ్మా ...... తిరుమల కాలినడకను ఉదయం 7 గంటలకే మొదలెట్టాము - ఇప్పుడు చాముండీ బెట్టను 7 గంటలకే ఎక్కబోతున్నాము .
అమ్మ : అంతా అమ్మవారి అనుగ్రహం అంటూ తొలిమెట్టు దగ్గరకు చేరుకుని భక్తితో స్పృశించి మొక్కుకుని ఎక్కడం మొదలెట్టాము - ఎక్కుతున్నకొద్దీ అమ్మతో ఉత్సాహం .......
చిన్న కొండనే కావడం వలన అర గంటలో సగం దూరం చేరుకున్నాము - పెద్ద నంది విగ్రహం చుట్టూ భక్తులు ప్రదక్షణం చేస్తుండటం చూసి వెళ్లి మొక్కుకుని ప్రదక్షణం చేసుకుని మరొక అరా గంటలో పైకి చేరుకున్నాము .
దగ్గరలో కనిపిస్తున్న అమ్మవారి గోపురానికి మొక్కుకుని నడిచాము . దారిలో కనిపించిన మహిసాసురుడిని తిలకించి చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం చేరుకున్నాము .

అమ్మతోపాటు ద్వారానికి మొక్కుకుని లోపలికివెళ్లి చాముండీ అమ్మవారిని భక్తితో మొక్కుకున్నాము .
అమ్మ : చాముండీ మాతా ...... మీ మొక్కు తీర్చుకునే అదృష్టాన్ని ప్రసాధించినందుకు చాలా చాలా సంతోషం - మీ దర్శనానికి తీసుకొచ్చిన నా మహేష్ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి .
చాముండీ అమ్మా ...... మీకు తెలియనిది కాదు మా అమ్మ సంతోషమే నా సంతోషం .
అమ్మ సంతోషించి భక్తితో మొక్కుకుని గర్భగుడి చుట్టూ ప్రదక్షణలు చేసి హారతి - తీర్థప్రసాధాలను స్వీకరించారు , నా నుదుటిపై చాముండీ అమ్మవారి కుంకుమను ఉంచి చీరలో కుంకుమను తీసుకున్నారు , మరింత ప్రశాంతతతో ఆలయ ప్రాంగణంలో తనివితీరేంతవరకూ కూర్చుని , మరొకసారి దర్శనం చేసుకుని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి బయటకువచ్చాము .
యధావిధిగా అమ్మను షాప్ కు తీసుకెళ్ళాను , చాముండీ అమ్మవారి వెండి ప్రతిమను మరియు ఫ్రేమ్ ను తీసుకున్నారు .
అమ్మా ..... హ్యాపీకదా అంటూ పే చేసి వ్యూ పాయింట్ దగ్గరకు చేరుకున్నాము - సిటీ మొత్తం మరియు దూరంగా మహల్ కనిపిస్తుండటం చూసి కన్నయ్యా కన్నయ్యా ....... మహల్ .
మా అమ్మకు మొదట మహల్ చూయించాలి , ఇంటికి వెళ్ళాక ఆ మహల్ ను తలదన్నేలా " అమ్మ భవనాన్ని " మొదలుపెట్టాలి .
అమ్మ : నాచేతిని చుట్టేశారు - నేను వద్దు అంటే మాత్రం ఆగుతావా ఏమిటి అంటూ ఆనందిస్తున్నారు .
మా అమ్మ అనుమతి కూడా లభించేసింది అంటూ సంతోషంతో అమ్మ నుదుటిపై ముద్దుపెట్టి , అమ్మవారి ప్రసాదాన్ని కడుపునిండా తిన్నాము - సిటీ అందాలను తిలకించాము .

అమ్మా ...... ఇక మహల్ కు వెళదామా ? .
అమ్మ : నా మహేష్ ఎలా అంటే అలా అని చెప్పేసానుకదా అంటూ అమ్మవారి గోపురం వైపు భక్తితో మొక్కుకున్నారు .
బస్ స్టాండ్ లో పార్క్ చేసిన caravan ఎక్కి , అన్నా ..... టిఫిన్ చేశారా అని వాకీలో అడిగాను .
డ్రైవర్ : కొండపైకి వచ్చేటప్పుడు రోడ్డు ప్రక్కన టిఫిన్ బండిలో వేడి వేడి మైసూర్ బోండాలు ఫుల్ గా తిన్నాను సర్ ......
మైసూర్ బోండాలు ...... ఎలా ఉన్నాయి అన్నా ? .
డ్రైవర్ : సూపర్ టేస్ట్ సర్ ......
అమ్మా ...... మైసూర్ వచ్చి మైసూర్ బోండాలు తినకపోతే ఎలా చెప్పండి .
అమ్మ : అవునవును ......
నవ్వుకుని , అన్నా ...... టిఫిన్ బండి దగ్గర ఆపండి .
డ్రైవర్ : yes సర్ అంటూ పోనిచ్చాడు .
అమ్మ నుండి చాముండీ అమ్మ ప్రతిమ - ఫోటోను అందుకుని సెల్ఫ్ లో ఉంచి బాక్స్ ను అందించాను , చీర కొంగులో ముడివేసిన కుంకుమను మూతలోకి మార్చి సోఫాలోకిచేరారు .

మిర్రర్ విండోస్ నుండి చాముండీ బెట్ట ప్రకృతి అందాలను - సిటీని వీక్షిస్తూ నిమిషాలలో కిందకుచేరాము - కాస్త దూరం వెళ్ళాక ఆగింది .
అమ్మా ...... ఇలా వెళ్లి అలా తీసుకొస్తాను .
అమ్మ : 5 మినిట్స్ అంతే ......
అమ్మో అంటూ అమ్మ నుదుటిపై చేతితో ముద్దుపెట్టి పరుగులుతియ్యడం చూసి , జాగ్రత్త అంటూ నవ్వుకున్నారు అమ్మ ......
అప్పుడే వేడివేడిగా తీస్తుండటంతో హమ్మయ్యా అనుకుని రెండు ప్లేట్లు పార్సిల్ తీసుకుని అంతే పరుగున అమ్మ ప్రక్కకు చేరిపోయాను - అన్నా ...... ప్యాలస్ కు తీసుకెళ్లండి .
అమ్మ : 7 మినిట్స్ అయ్యింది అంటూ తియ్యనైనకోపంతో రెండు దెబ్బలువేసి పార్సిల్ అందుకుని ప్లేటులో వడ్డించుకునివచ్చి తినిపించి తిన్నారు - బోండాలు ఖాళీ అయ్యేసరికి caravan ...... మహల్ మెయిన్ డోర్ ముందు ఆగింది .

అమ్మకు నీళ్లు అందించి త్రాగాను - అమ్మా ...... మనం మైసూర్ మహల్ ను చూడటానికి వెళ్లడం లేదు అంతకుమించిన " మాదేవత అమ్మ మహల్ " ను నిర్మించడం కోసం ఐడియా కోసం చూడటానికి వెళుతున్నాము - ఎలా ఉండాలో ప్లానింగ్ మా అమ్మనే వెయ్యాలి .
అమ్మ : ఫిక్స్ అయిపోయావన్నమాట అంటూ సిగ్గుపడుతూనే సరే అన్నట్లు నా గుండెలపైకి చేరారు .
లవ్ యు సో మచ్ అంటూ అమ్మ నుదుటిపై ముద్దుపెట్టి , అమ్మ చేతిని అందుకుని కిందకుదిగి టికెట్ తీసుకుని లోపలికివెళ్లాము .
నలువైపులా అందమైన ఉద్యానవనాలతో మధ్యలో అద్భుతమైన రాజభవనాన్ని తిలకించి ఫోటోలు తీసుకుని లోపలికివెళ్లాము .
అమ్మా ...... చూడండి చూడండి బాగా చూసి ఇంతకుమించిన మహల్ ......
అమ్మ : ష్ ష్ ష్ సరే అంటూ చిరునవ్వులు చిందిస్తూనే నాచేతిని అందుకుని మహల్ మొత్తం వీక్షించి సంతోషంతో బయటకువచ్చారు - మహల్ ప్రక్కనే ఉన్న మ్యూజియం ను కూడా తిలకించాము .
బయట షాప్ లలో స్వచ్ఛమైన గాంధాన్ని - గంధపు చెక్కను తీసుకున్నారు .

అమ్మా ...... లంచ్ టైం , మన RRR మూవీ లా ఇక్కడ RRR హోటల్ పేమస్ అక్కడ భోజనం చేద్దామా ? .
అమ్మ : మరొకసారి ఆడిగావంటే కొరికేస్తాను అంటూ చేతిపై గిల్లేసారు .
స్స్స్ ...... నాకు రెండూ ఇష్టమే ఉమ్మా అంటూ అమ్మ బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను - exit మరొకవైపు వదలడంతో డ్రైవర్ కు కాల్ చేసి చెప్పడంతో వచ్చాడు - అన్నా ...... RRR HOTEL కు తీసుకెళ్లండి .
డ్రైవర్ : ఒక బ్రాంచ్ దగ్గరలోనే ఉంది సర్ - 5 మినిట్స్ .......
Wow అంటూ caravan ఎక్కాము - 10 నిమిషాలలో మెయిన్ సర్కిల్ దాటుకుని కొద్దిదూరం వెళ్లి ఆపాడు .
అమ్మా వచ్చేసాము .
అమ్మ చూసి , కన్నయ్యా ...... వెజ్ & నాన్ వెజ్ హోటల్ వద్దు అన్నట్లు నాచేతిని చుట్టేశారు - నాకు అచ్చ తెలుగు పప్పన్నం తినాలని ఆశగా ఉంది .
పప్పన్నం ...... వింటుంటేనే నోరూరిపోతోంది - లవ్ టు లవ్ టు అమ్మా - అదీ అలా ఆర్డర్ వెయ్యండి ....... , అమ్మా ...... ఒక గంటసేపు ఆగగలరు కదా ......
అమ్మ : నా కన్నయ్య చేతివంట ఉమ్మా ఉమ్మా అంటూ సంతోషంతో నా బుగ్గపై ముద్దుపెట్టారు .
మ్మ్మ్ ఆఅహ్హ్ ...... అంటూ సోఫాలోకి వాలిపోయాను .
కన్నయ్యా కన్నయ్యా అంటూ తియ్యదనంతో నవ్వుతూనే ఉన్నారు అమ్మ ......
అమ్మో లంచ్ టైం - అమ్మకు ఆకలివేస్తుంది అంటూ వాకీ అందుకుని , అన్నా ...... వెజిటబుల్ మార్కెట్ కు తీసుకెళ్లండి అనిచెప్పాను .

Caravan కదులగానే అమ్మ నుదుటిపై ముద్దుపెట్టి లేచాను - అమ్మా దర్జాగా కాలుమీదకాలువేసుకుని టీవీ చూడండి - కిచెన్ వైపుకు కదిలారో .......
అమ్మ : కొడతావా ? గిల్లుతావా ? కొరికేస్తావా ? ...... నాకు మూడూ ఇష్టమే అంటూ నా రెండు బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి నవ్వుతున్నారు .
అరె ఏంటి మన మాటలు మనకే రివర్స్ అయినట్లున్నాయి ......
అమ్మ : అవునవును నా బంగారు కన్నయ్యా ...... , నీకే కాదు నా కన్నయ్య దెబ్బలు - కోపం నాకూ ప్రాణమే .......
కోపం - దెబ్బలతో కుదిరేలా లేదు కాళ్ళ భేరానికి వెళ్లాల్సిందే , అమ్మా అమ్మా ...... ఆ దుర్గమ్మ తల్లి వంట నేర్పించినది వారి బిడ్డ అయిన మా దేవతమ్మకు వండిపెట్టడం కోసమేనేమో , ఒకటి అడుగుతాను ...... నా వంట బాగుంటుందా లేదా ? .
అమ్మ : అమృతం అంటూ పెదాలను తడుముకున్నారు - ఆ దుర్గమ్మ తల్లి ఒకసారి రుచి చూశారంటే అమృతం వదిలేసి నా కన్నయ్య చేతివంటనే తింటారేమో ......
లవ్ యు సో మచ్ అమ్మా అంటూ సిగ్గుపడ్డాను - కాబట్టి అమ్మా ......
అమ్మ : అర్థమైంది అర్థమైంది కన్నయ్యా ......
మా మంచి అమ్మ అంటూ టీవీ ఆన్ చేసి రిమోట్ ను అమ్మచేతికి అందించి కిచెన్ దగ్గరకువెళ్ళాను .
అమ్మ : నాకు ...... నా కన్నయ్యనే చూస్తూ ఉండాలనిపిస్తోంది అంటూ టీవీ ఆఫ్ చేసి సౌండ్ బార్లో పాటలు ఉంచి కిచెన్ కు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని , తొందరగా కానివ్వు ఆకలివేస్తోంది అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలారు .

జంప్ చేసిమరీ క్యాచ్ అందుకుని హృదయానికి హత్తుకున్నాను - లవ్ యు అమ్మా - అమ్మా ...... వన్ hour అంతే అంటూ రైస్ మరియు దాల్ ను వేరువేరు పాత్రలలోకి తీసుకుని కడిగి , దాల్ ను మాత్రం కుక్కర్ లోకి ఉంచి స్టవ్ పై ఉడికించాను .
Caravan ఆగడంతో విండోస్ నుండి చూసి అమ్మా ...... 5 మినిట్స్ ఆకుకూరలు తీసుకొచ్చేస్తాను .
ఊహూ ...... అంటూ లేచి నా గుండెలపైకి చేరారు .
5 మినిట్స్ కూడా ఉండలేకపోతే ఎలా అమ్మా ...... ? .
అమ్మ : నా కన్నయ్య ఉండగలడన్నట్లు ఎలా చెబుతున్నాడో విన్నారా అమ్మలూ ........
అమ్మో ....... నావల్లకాదు అంటూ అమ్మకంటే గట్టిగా కౌగిలించుకోబోయి ఆగిపోయాను .
అమ్మ : అదిగో మళ్లీ అంటూ ఈసారి ఏకంగా కళ్ళల్లో చెమ్మతో ఛాతీపై దెబ్బలవర్షం కురిపిస్తున్నారు .
ఆఅహ్హ్ ...... నాకు కావాల్సినది ఇదేకదా అంటూ అమ్మను అమాంతం పైకెత్తి చుట్టూ తిప్పాను .
ఇలా మాటమార్చి సంతోషపెట్టడం మాత్రం బాగా తెలుసు , అక్కడ బ్యాళ్ళు ఉడికిపోయేలా ఉన్నాయి .
అవునవును అంటూ అమ్మను సోఫాలో కూర్చోబెట్టాను .
అమ్మ : అదిగో మళ్లీ అంటూ లేచి నాచేతిని గట్టిగా చుట్టేశారు .

లవ్ యు అమ్మా అంటూ కురులపై ముద్దుపెట్టి అమ్మతోపాటు మార్కెట్ కు వెళ్లి నేతాకు - పలకలాకు - మెంతాకు మరియు ఆలూ తీసుకునివచ్చాము .
అమ్మా ..... 5 నిమిషాలుకూడా ఉండలేరే అంటూ ఎంజాయ్ చేస్తూనే ఇక కూర్చోండి అన్నాను తియ్యనైనకోపంతో ......
అమ్మ : అమ్మో ఒక్కక్షణం కూడా ఉండలేను - ఇక డిస్టర్బ్ చెయ్యనులే ......
లవ్ యు అమ్మా అంటూ చేతితో బుగ్గపై ముద్దుపెట్టి కిచెన్ దగ్గరికి చేరుకున్నాను , ఆకుకూరలను కట్ చేసి శుభ్రన్గా కడిగి కుక్కర్ లోకి వేసాను , పచ్చిమిర్చి పసుపు ఉప్పు కరివేపాకు చింతపండు రసం ...... వేసి కుక్కర్ ను క్లోజ్ చేసి స్టవ్ పై ఉంచాను .
మరొక స్టవ్ పై ఒక పాత్రలో నీటిని మరిగేవరకూ వేడిచేసి అందులోకి కడిగిన రైస్ ను వేసి కాసింత ఉప్పును కలిపాను .

అమ్మో ఎంత చక్కగా చేస్తున్నావు కన్నయ్యా ముచ్చటేస్తోంది తెలుసా అంటూ నాప్రక్కన చేరారు .
నో నో నో అమ్మా వెళ్ళండి వెళ్ళండి అంటూ సున్నితంగా తోసాను .
అమ్మ : నేనేమీ వంట చెయ్యడం కోసం రాలేదులే అంటూ చీరకొంగుతో నా నుదుటిపై పట్టిన చెమటను తుడిచారు .
లవ్ యు అమ్మా ......
ప్రక్కనే నిలబడి బుగ్గపై చేతితో ముద్దులుకురిపిస్తూనే ఉన్నారు .
మ్మ్మ్ మ్మ్మ్ ...... పప్పు - అన్నం రెడీ అయ్యేలోపు బంగాళాదుంపలను శుభ్రం చేసి చిన్నగా కట్ చేసుకున్నాను , అంతలో విజిల్స్ పూర్తవ్వడంతో కిందకుదించి ఆలూ ఫ్రై చేసాను - పప్పుకు తడ్క కలిపాను , అమ్మా ..... మీరు కోరిక పప్పన్నం రెడీ అంటూ డైనింగ్ టేబుల్ పైకి చేర్చాను .
అమ్మ : కన్నయ్యా ...... పప్పు రెడీ అయ్యాక తడ్క కలపవేమో అనుకున్నాను - వంటలో నీకు డిగ్రీ ఇవ్వవచ్చు .
పోమ్మా సిగ్గేస్తోంది కూర్చోండి కూర్చోండి ఆకలేస్తోంది అన్నారుకదా ...... , అంటూ ఒక బాక్స్ లో అన్నం పప్పు ఆలూ ఫ్రై తీసుకుని డ్రైవర్ కు ఇచ్చాను స్టాప్ చేసి తినమని - అన్నా .... తక్కువ పడితే మొహమాటం లేకుండా అడగండి .
డ్రైవర్ : సర్ అంటూ బాక్స్ వైపు చూసాడు ......
సరే సరే పూర్తిగా తినాలి అనిచెప్పి అమ్మ చెంతకు చేరాను - అంతలో లంచ్ బ్యాగ్ లో ప్యాక్ చేసి ఉండటం చూసి ఆశ్చర్యపోయాను .
అమ్మ : కన్నయ్యా ...... అంటూ విండో నుండి పార్క్ వైపుకు చూయించారు .
లవ్ టు అమ్మా అంటూ అమ్మచేతిలోనుండి అందుకుని పార్క్ లోకివెళ్లి ప్రకృతి ఒడిలో భోజనం చేసి , అక్కడంతా శుభ్రం చేసి సాయంత్రం వరకూ సరదాగా గడిపి అమ్మా వెళ్ళాలి అంటూ caravan ఎక్కాము .

మా అమ్మకు ఇంతకుమించిన ఆనందం పంచాలి అంటూ వాకీ లో బృందావన్ గార్డెన్ కు తీసుకెళ్లమని చెప్పాను .
అమ్మ : ఉమ్మా అంటూ నా హృదయంపై చేతితో ముద్దుపెట్టారు .
అమ్మా ...... 5 మినిట్స్ కూర్చోండి డిషెస్ ఫినిష్ చేసేస్తాను .
అమ్మ : వంట అయితే ok కానీ డిషెస్ నో నో నో ....... , నేను ......
మా దేవతతో వంటనే చేయించలేదు ఇక డిషెస్ ...... నెవర్ నెవర్ - మీతల్లులకు ఈ విషయం తెలిస్తే ఇక నా కథ అంతే ...... , దేవత పూజింపబడాలి కానీ ఇలా పనులు చేయకూడదు అంటూ సోఫాలోకి తోసేసి అమ్మ ఆనందబాస్పాలను ఎంజాయ్ చేస్తూ నుదుటిపై ముద్దుపెట్టి సింక్ దగ్గరకువెళ్ళాను .
అమ్మ వెనుకే వచ్చినట్లు లవ్ యు లవ్ యు సో మచ్ కన్నయ్యా అంటూ ప్రాణం కంటే ఎక్కువగా తెలియజేస్తూ వెనకనుండి హత్తుకుని వీపుపై పెదాలను తాకించారు .
అంతే థౌజండ్ హార్స్ పవర్ తో నిమిషాలలో డిషెస్ పూర్తిచేసేసి చేతులను శుభ్రం చేసుకుని అమ్మవైపుకు తిరిగాను - అమ్మా ..... మాటల్లో వర్ణించలేని అనుభూతి లవ్ యు లవ్ యు ......
అమ్మ : అంతటి మధురానుభూతిని నేను పంచుతున్నాను కానీ నువ్వుమాత్రం పంచడం లేదు అంటూ ప్రాణంలా కొడుతున్నారు .
అదీ అదీ ...... ఆ ఆ అమ్మా బృందావన్ గార్డెన్ దగ్గరలో ఉన్నట్లు బోర్డ్ కనిపించింది - అంతలోపు మనం రెడీ అవ్వాలి .
అమ్మ : ఇలా మాట మార్చడంలో ముందుంటావు అంటూ తియ్యనైన కోపంతో చూసి లోపలికివెళ్లారు .
అమ్మ వచ్చాక నేనూ ఫ్రెష్ అయ్యి గార్డెన్ కు వెళ్ళాము .

బృందావన్ గార్డెన్ పచ్చని అందాలను తిలకిస్తూ మ్యూజిక్ ఫౌంటెన్ దగ్గరకు చేరుకునేసరికి చీకటిపడింది - మ్యూజిక్ కు అనుగుణంగా విద్యుత్ కాంతులతో అద్భుతాలను అవిష్కృతం చేస్తున్న ఫౌంటైన్ ను చూసి అమ్మ ఆనందాలకు అవధులులేవు - బ్యూటిఫుల్ కన్నయ్యా అంటూ నాచేతిని చుట్టేసి తనివితీరా ఆస్వాధిస్తున్నారు - 9 గంటలకు క్లోజింగ్ టైం అని అనౌన్స్మెంట్ వినిపించగానే అమ్మ కళ్ళల్లో నిరాశ ....... , అయినా ఫుల్ గా ఎంజాయ్ చేసాములే అంటూ బోలెడన్ని సెల్ఫీలు తీసుకుని సంతోషంతో బయటకువచ్చి caravan ఎక్కాము .
అమ్మా ...... నెక్స్ట్ మధురై మీనాక్షి అమ్మవారి దర్శనానికి ......
అమ్మ సంతోషంతో ప్రార్థిస్తోంది - అంతా నా కన్నయ్య వల్లనే అంటూ గుండెలపైకి చేరారు .
మా అమ్మ సంతోషం కంటే నాకింకేమి అవసరం లేదు - అమ్మా ...... డిన్నర్ కు ఏమిచెయ్యమంటారు .
అమ్మ : లంచ్ కే ఫుల్ గా తినేసాము కాబట్టి లైట్ గా రోటీలు తింటే సరిపోతుంది - ఏదైనా హోటల్లో తిందాము - లేకపోతే caravan లో తిందాము .
అయితే ఫ్లైట్లోనే తిందాము తిని వెంటనే రెస్ట్ తీసుకోవచ్చు అంటూ ఎయిర్ హోస్టెస్సెస్ కు తెలియజేసి , driver కు ఎయిర్పోర్ట్ కు పోనివ్వమని చెప్పాను .

ఎయిర్పోర్ట్ చేరుకుని , డ్రైవర్ కు మదురైలో కలుద్దాము అనిచెప్పి , సెక్యూరిటీ చెకింగ్ ద్వారా చివరి రన్ వే పై ఉన్న ఫ్లైట్ దగ్గరకుచేరుకున్నాము .
అమ్మో ఇన్ని స్టెప్స్ , నావల్ల కాదు కన్నయ్యా అంటూ లోలోపలే ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
కొండలు మాత్రం భక్తి - ఉత్సాహం మరియు హుషారుగా అవలీలగా ఎక్కేస్తారు , ఈ కొద్ది స్టెప్స్ మాత్రం ...... , అంటే మా అమ్మను ప్రాణంలా ఎత్తుకోవడం నాకూ ఇష్టమే అంటూ అమ్మను అమాంతం ఎత్తుకుని నేరుగా తీసుకెళ్లి ఫస్ట్ ఫ్లోర్ లోని డైనింగ్ టేబుల్ పై కూర్చోబెట్టాను - ఫ్లైట్ బయలుదేరింది .
అమ్మ : కన్నయ్యా ఆకలి ......
డిన్నర్ రెడీ మేడం అంటూ ఎయిర్ హోస్టెస్సెస్ వచ్చి వడ్డించారు .
అమ్మ : మీరు తిన్నారా ? .
ఎయిర్ హోస్టెస్సెస్ : Sorry మేడం 8 గంటలకే తినేసాము .
అమ్మ : నో నో నో sorry ఎందుకు ? , టైం కు తిన్నారు హ్యాపీ ......
లవ్ యు అమ్మా ......
భోజనం చేసి , అమ్మ చేతులు చాపడంతో ఎత్తుకెళ్ళి బెడ్ పై పడుకోబెట్టాను - కన్నయ్యా .......
అమ్మా ..... ఇదిగో ఇక్కడే డోర్ దగ్గర ఉన్న సోఫాలో పడుకుంటాను - మీరు హాయిగా పడుకోండి అంటూ గుడ్ నైట్ కిస్సెస్ పెట్టుకుని నిద్రపోయాము , 12:30 గంటవరకూ అమ్మనే చూస్తూ ...... అమ్మలగన్న అమ్మలకు మొక్కుకుని నిద్రలోకిజారుకున్నాను .
***********

రోజూలానే కన్నయ్యా అంటూ ప్రాణమైన పిలుపు ......
కళ్ళుతెరిచి చూస్తే కొత్తపట్టుచీర - నగలలో దేవతలా అమ్మ ...... , సూర్యోదయం కావస్తుండటంతో వెళ్లి రెడీ అయ్యాను , ఎయిర్పోర్ట్ బయటకువచ్చేసరికి caravan రెడీగా ఉంది .
20 నిమిషాలలో దేవాలయం చేరుకున్నాము - దేవాలయం నలువైపులా అద్భుతమైన భక్తి గోపురాలతో అందమైన దేవాలయాన్ని మొక్కుకుని లోపలికివెళ్లాము .
దేవాలయం లోపల అద్భుతాలను తిలకిస్తూ వెళ్లి భక్తితో మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకుని , హారతి తీర్థప్రసాధాలను స్వీకరించి , అమ్మ కోరిక ప్రకారం మరొకసారి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రశాంతంగా కోనేరు మెట్లపై కూర్చుని , అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాము .
మధ్యాహ్నానికి బయటకువచ్చి అమ్మా సెలవు అంటూ చివరిసారి భక్తితో మొక్కుకుని , షాపులో మీనాక్షి అమ్మవారి ప్రతిమను - ఫోటోను తీసుకుని caravan చేరుకున్నాము .
మీనాక్షి అమ్మవారి కుంకుమను బాక్స్ లోని మూతలోకి మార్చారు అమ్మ - కన్నయ్యా ...... మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కుతీర్చుకున్నాను చాలా చాలా ప్రశాంతంగా ఉంది , ఆ అమ్మలే నిన్ను నాచెంతకు చేర్చారేమో అంటూ ఆనందబాస్పాలతో గుండెలపైకి చేరారు .
మా అమ్మకు మిక్కిలి సంతోషం కలిగించడానికి ఇద్దరినీ ఒక్కటి చేసారేమో అంటూ భక్తితో ప్రార్థించాను .

డ్రైవర్ కు కంచికి తీసుకెళ్లమని చెప్పి , అమ్మకు ఇష్టమైన భోజనం వండి దారిలోని తోటలో ప్రకృతి ఒడిలో భోజనం చేసాము , కంచి చేరేసరికి రాత్రి అయ్యింది .
ఉదయం ఫ్రెష్ గా అమ్మవారి దర్శనం చేసుకుందాము అని అమ్మచెప్పడంతో డిన్నర్ వండి తిని caravan లోనే రెస్ట్ తీసుకున్నాము .
*********

రోజూలానే అమ్మ తియ్యనైన పిలుపుతో లేచి దేవతమ్మను అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను - ఈరోజుకూడా సంతోషాలే సంతోషాలు అంటూ లోపలికివెళ్ళాను .
అమ్మ : నా కన్నయ్య ప్రక్కనే ఉంటే సంతోషాలే .......
లవ్ యు అమ్మా అంటూ గట్టిగా చెప్పి ఫ్రెష్ అయ్యివెళ్లి కామాక్షి అమ్మను దర్శించుకుని మొక్కు తీర్చుకున్నాము .
అత్యద్భుతమైన దేవాలయం లోపలి అందాలను అమ్మ పదేపదే తిలకిస్తూ మూడుసార్లు అమ్మవారి దర్శనం చేసుకుని బయటకువచ్చాము .
ఫోటోను తీసుకుని కుంకుమను బాక్స్ లోకి మార్చారు .

అమ్మా ...... మీ తల్లులకు కంచి పట్టుచీరలు తీసుకోవాలని మనసులో ఉంటే ..... , మా అమ్మ కళ్ళే చెబుతున్నాయిలే ...... , అన్నా ...... షాపింగ్ .
అమ్మ : నాకోసం ఇన్ని అందమైన చీరలను సెలెక్ట్ చేసిన నా తల్లులకు కూడా అంటూ నా గుండెలపైకి చేరారు .
మా అమ్మ మనసులో ఏముందో ఈ బిడ్డకు తెలియదా చెప్పండి , మీరు మీ తల్లులందరికీ సెలెక్ట్ చెయ్యండి - నేను ..... మా దేవతలాంటి అమ్మకు సెలెక్ట్ చేస్తాను .
అమ్మ : వద్దు వద్దు కన్నయ్యా ...... , ఇప్పటికే ఇంకా ఒక లగేజీ నిండా ఉన్నాయి .
ఇప్పుడు మరొక లగేజీ అవుతుంది - అయినా మీరు చెప్పినట్లు మీరు నో అంటే మాత్రం ఆగుతానా చెప్పండి .
అమ్మ : ఊహూ ...... అంటూ సిగ్గుపడుతూ నా గుండెల్లో దాచుకున్నారు .
అమ్మా ...... మీ తల్లులు అంటే మీ ఈ చేతిలో ఉన్న మొబైల్లోని తల్లులు కూడానూ ........
అమ్మ : కన్నయ్యా అంటూ ఆనందబాస్పాలతో నాకళ్ళల్లోకే ప్రాణంలా చూస్తున్నారు .
( ఇద్దరూ ఒక్కటే అమ్మా ...... కానీ ఇదిగో మాఅమ్మ కళ్ళల్లో ఈ సంతోషం కోసం దివ్యక్క - చెల్లెమ్మ - సిస్టర్స్ - దేవకన్య కోసం డబల్ డబల్ , అమ్మ సెలెక్ట్ చేశారని తెలిస్తే ఎంత ఆనందిస్తారో ...... ) అమ్మా ..... ఇదిగో కార్డ్ - ఇందులో వందల కోట్లు ఉన్నాయి - మీ ఇష్టం ఆ డబ్బుకు తగ్గట్లుగా మొబైల్లోని తల్లులకు అందమైన పట్టుచీరలను తీసుకోండి - ఏమాత్రం నో కన్నయ్యా అన్నా నానుండి రాక్షసుడు బయటకువచ్చేస్తాడు మా అమ్మను తినేస్తాడు .
అమ్మ : నేనైతే రెడీ ....... ఎప్పుడు తింటావు కన్నయ్యా ప్లీజ్ ప్లీజ్ చెప్పు .
అమ్మ పూర్తిగా మనలా మారిపోయిందన్నమాట అంటూ నవ్వుకున్నాము .
అమ్మా ...... మీకిష్టమైనన్ని తీసుకుంటారని మాటివ్వండి - ఇవ్వాల్సిందే అంటూ చేతిని అందుకుని ఒట్టు వేయించి యాహూ యాహూ అంటూ కేకలువేసి , పరవశించిపోతున్న అమ్మను పెద్దషాప్ కు తీసుకెళ్ళాను .
అమ్మ ...... ఏంజెల్స్ కు - నేను ..... అమ్మకు , రాత్రివరకూ సెలెక్ట్ చేసిన చీరలతో caravan నిండిపోయింది .
లవ్ యు అమ్మా అంటూ పైకెత్తి సంతోషాన్ని పంచుకున్నాను .

Caravan లో కంచి నుండి 3 గంటలలో చెన్నై ఎయిర్పోర్ట్ చేరుకుని , అమ్మవారి ఫోటోలను - ప్రతిమలను - కుంకుమను మరియు లగేజీ - చీరలన్నింటినీ ఫ్లైట్లోకి చేర్చాము .
అన్నా ..... ఇక సెలవు మీరు విజయవాడ వెళ్లిపోండి , మా ప్రయాణాన్ని మరింత సులభం చేశారు అంటూ అయినదానికంటే ఎక్కువే అమౌంట్ పే చేసి పంపించాను.

ఇక చెన్నై నుండి ఫ్లైట్ లో కొల్హాపూర్ మహారాష్ట్ర చేరుకుని , లోకల్ వెహికల్లో వెళ్లి మహాలక్ష్మి అమ్మవారిని .......
అక్కడ నుండి నాందేడ్ చేరుకుని ఏక వీరిక అమ్మవారిని దర్శించుకున్నాము .

ఉజ్జయిని మధ్యప్రదేశ్ లోని " ఉజ్జయిని మహాకాళీ అమ్మవారిని " దర్శించుకున్నాము .
అక్కడనుండి ఒడిస్సా కు వెళ్లి " గిరిజా దేవి అమ్మవారిని " దర్శించుకున్నాము .
కలకత్తాలోని " కాళీ మాతను " - గువాహతి అస్సామ్ లోని " కమాఖ్య దేవాలయాన్ని " - ప్రయాగ ఉత్తర్ ప్రదేశ్ లోని " మాదవేశ్వరి దేవి అమ్మవారిని " - బీహార్ లోని " మంగళ గౌరీ అమ్మవారిని " మరియు వారణాసి లోని " కాశీ విశాలాక్షి అమ్మవారిని " దర్శించుకుని మొక్కు తీర్చుకుని షిమ్లా ( హిమాచల్ ప్రదేశ్ ) చేరుకున్నాము .

నిద్రలో ఉన్న నాకు కాసేపట్లో షిమ్లా లో ల్యాండ్ అవ్వబోతున్నాము అన్న అనౌన్స్మెంట్ తోపాటు ఒక్కసారిగా ఫ్రీజ్ అయ్యేలా చల్లదనం ....... , అంతలో ల్యాండ్ అయ్యింది .
లేచి అర చేతులను రుద్దుకుంటూ వెళ్లి విండో నుండి బయటకుచూస్తే చీకట్లోకూడా ఎయిర్పోర్ట్ మరియు రన్ వే కు ఇరువైపులా దట్టంగా పరుచుకున్న మంచు ప్రస్ఫూటంగా కనిపిస్తోంది .
సమయం చూస్తే అర్ధరాత్రి అవుతోంది - నాకే ఇంత చలివేస్తుంటే అమ్మకు ఇంకెంత చలివేస్తోందో అంటూ గదిలోకి వెళ్ళిచూస్తే చలికి వణుకుతూ ముడుచుకుని పడుకున్నారు .
వెంటనే AC ఆఫ్ చేసి , మిర్రర్ విండోస్ అన్నింటినీ క్లోజ్ చేసేసి , మందమైన దుప్పటిని అందుకుని అమ్మ చెవులవరకూ నిండుగా కప్పాను - ఆఅహ్హ్హ్ హ్హ్హ్ హ్హ్హ్ అంటూ ఇంకా వణుకుతూనే ఉండటంతో మరొక దుప్పటిని కప్పి నుదుటిపై ముద్దుపెట్టాను .
మ్మ్మ్ ..... కన్నయ్యా అంటూ కలవరించి పెదాలపై తియ్యదనంతో హాయిగా - వెచ్చగా నిద్రపోతున్నారు - చప్పుడు చెయ్యకుండా బయటకువచ్చి డోర్ ను కూడా పూర్తిగా క్లోజ్ చేసాను , హాల్లో ఉన్న డిస్ప్లే లో చూస్తే టెంపరేచర్ 5 డిగ్రీస్ ఉంది అమ్మో చలి ఎక్కువే - లవ్ యు అమ్మా ...... రెండు మందమైన దుప్పట్లు కప్పుకోవాలని తెలియజేసారు అంటూ నా రూంలోనుండి తీసుకొచ్చి పూర్తిగా కప్పుకున్నాను , ఆఅహ్హ్హ్ వెచ్చగా ఉంది - అంటే అమ్మ ఇంత వెచ్చగా నిద్రపోతున్నారన్నమాట అంటూ దుప్పట్లకు థాంక్యూ చెప్పి హాయిగా నిద్రపోయాను .
***************

కన్నయ్యా కన్నయ్యా .......
అమ్మా ...... లవ్లీ గుడ్ మార్నింగ్ అమ్మా అంటూ పెదాలపై తియ్యదనంతో కళ్ళు తెరిచాను .
ఆశ్చర్యం కొత్త పట్టుచీర - నగలలో లేకపోయినా దేవతలా ఉన్న అమ్మ కళ్ళల్లో ...... భద్రకాళీ కోపం .
అమ్మా ...... అనేంతలో దెబ్బలు - గిల్లుళ్లు ......
స్స్స్ స్స్స్ అమ్మా అమ్మా ఏమైంది అంటూ ఒకచేతితో రుద్దుకుంటూనే మరొకచేతితో అమ్మ బుగ్గపై ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ ముద్దులు కురిపిస్తూ ఎంజాయ్ చేస్తున్నాను .
అమ్మ : డోర్ ఎందుకు వేశావు ? అంటూ కళ్ళల్లో చెమ్మతో నాప్రక్కనే చేరి చేతిని కాకుండా ఏకంగా నడుమును చుట్టేశారు .
అమ్మా అమ్మా అమ్మా ...... మా అమ్మ కళ్ళల్లో చెమ్మను చూడటానికా నేనున్నది అంటూ అమ్మ బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టాను .
అమ్మ : కళ్లపై కూడా ......
లవ్ టు అమ్మా అంటూ కళ్లపై ప్రాణమైన ఒక్కొక్క ముద్దుపెట్టాను .
అమ్మ : ఆఅహ్హ్హ్ ...... వెచ్చగా ఉంది - కన్నయ్యా ...... దుప్పట్లోనుండి బయటకు వచ్చినప్పటి నుండీ ఒకటే చలి - ముద్దులుమాత్రం ఆపకు అంటూ ఏకమయ్యేలా అల్లుకుపోయారు .
ఆఅహ్హ్హ్ ...... అంటూనే మందమైన దుప్పటిని మాఇద్దరికీ కప్పి అమ్మ నుదుటిపై ముద్దులుకురిపిస్తున్నాను .
అమ్మ : ఆఅహ్హ్ ...... మరింత వెచ్చగా ఉంది - బుగ్గలపై కూడా ......
లవ్ యు అమ్మా అంటూ బుగ్గపై ముద్దులుకురిపిస్తూనే ఉన్నాను - ఈ వెచ్చదనం కోసమే అమ్మా రాత్రి డోర్ క్లోజ్ చేసినది .
అమ్మ : మరి వెచ్చనైన దుప్పట్లు కప్పినది .......
అవునమ్మా ...... అదిగో ఆ డిస్ప్లే లో అర్ధరాత్రి 5 డిగ్రీస్ వరకూ తగ్గిపోయింది - ఇప్పుడు నయం 13 డిగ్రీస్ ఉంది - బయట అయితే అరిపాదాలు మూసుకుపోయేంత మందంలో మంచు ......
అమ్మ : అది రాత్రి ఇప్పుడైతే ఏకంగా మోకాలివరకూ మునిగిపోయేంత పరుచుకుంది కన్నయ్యా ...... , ఇంతకూ మనం ఎక్కడ ఉన్నాము .
షిమ్లా లో అమ్మా ....... , ఇక్కడి శక్తిపీఠం అయిన " జ్వాలముఖి దేవీ అమ్మవారిని " దర్శించుకుని మా అమ్మ మొక్కుని తీర్చుకోబోతున్నాము .
అమ్మ : అంటే ఇదే చివరి శక్తిపీఠం అన్నమాట .......
మన దేశంలో చివరిది అనే చెప్పాలి ......
అమ్మ : అర్థం కాలేదు కన్నయ్యా .......
పోను పోను అర్థం అవుతుందిలే అమ్మా అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను .
అమ్మ : నా కన్నయ్య ముద్దుముద్దుకూ వొళ్ళంతా వెచ్చదనం అంటూ చిరునవ్వులు చిందిస్తూ నా బుగ్గపై కొరికేశారు .
స్స్స్ .......
అమ్మ : స్స్స్ స్స్స్ ...... లు తరువాత ముందు ఈ విషయం చెప్పు , 13 డిగ్రీస్ కే తట్టుకోలేకపోతున్నాను రాత్రి 5 డిగ్రీస్ కు ఎలా తట్టుకున్నానో ...... ఇలా ముద్దులుపెట్టావా లేదా ? అంటూ దెబ్బలు కురిపిస్తున్నారు .
ఆఅహ్హ్హ్ ఆఅహ్హ్ ...... హాయిగా ఉంది , మా అమ్మ మంచిగా అడిగారు - దెబ్బదెబ్బకూ బుగ్గపై ముద్దుపెట్టి నవ్వించాను , అమ్మా అమ్మా ఏమిజరిగిందో తెలుసా ...... ఫ్లైట్ ల్యాండ్ అవుతోందన్న అనౌన్స్మెంట్ తోపాటు భయంకరమైన చలి వెంటనే మా అమ్మ గుర్తుకువచ్చి గదిలోకి అడుగుపెట్టానా ....... చలికి ఒకటే వణుకు గువ్వపిల్లలా ముడుచుకున్నారు ఒకటే మూలుగులు ..... నవ్వు వచ్చేసింది .
అమ్మ : నవ్వు వచ్చిందా నవ్వు వచ్చిందా ...... అంతటి చలికి ఎవరైనా అంతే కదా అంటూ కొడుతున్నారు .
నిజం చెబుతున్నాను నవ్వు కాదు ముద్దొచ్చేశారు అమ్మా ...... బుజ్జిపాపాయిలా అనిపించారు అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
అమ్మ : లవ్ యు సో మచ్ కన్నయ్యా ...... , ఇంతలా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే నా కన్నయ్యకు నేనుమాత్రం బుజ్జిపాపాయినే అంటూ నా గుండెలపై గువ్వపిల్లలా వొదిగిపోయారు , మ్మ్మ్ ...... మరింత హాయిగా - వెచ్చగా ఉంది ముద్దులు ఎందుకు ఆపావు అంటూ నడుముపై గిల్లేసారు .
ఉలిక్కిపడ్డాను , లవ్ యు లవ్ యు అమ్మా అంటూ నుదుటిపై - బుగ్గపై ముద్దులుపెడుతూనే ఉన్నాను .
అమ్మ : అవును కన్నయ్యా ....... మరి రాత్రి ఇలా వెచ్చనైన ముద్దు ఒక్కటైనా పెట్టావా లేదా ? అంటూ భద్రకాళీ కోపంతో చూస్తున్నారు .
పూర్తిగా చెప్పేంతలో ..... నవ్వు వచ్చిందా నవ్వు వచ్చిందా అంటూ కొట్టింది ఎవరో ........
అమ్మ : లవ్ యు లవ్ యు అంటూ బుద్ధిగా నోటికి తాళం వేసి ప్రాణంలా చూస్తున్నారు .
ఇలా గువ్వపిల్లలా - బుజ్జిపాపాయిలా ...... ముద్దొచ్చేలా వణకడం చూసి వెంటనే మందమైన ఒక దుప్పటిని కప్పాను .
అమ్మ : అంటే ముద్దుపెట్టలేదన్నమాట ......
పో అమ్మా అంటూ తియ్యనైనకోపంతో అమ్మ బుగ్గపై సున్నితంగా కొరికేసాను .
అమ్మ : స్స్స్ ...... యాహూ యాహూ అంటూ నాకంటే సంతోషంతో కేకలువేసి , లవ్ యు లవ్ యు sooooo మచ్ కన్నయ్యా అంటూ బుగ్గపై ముద్దులుకురిపిస్తూనే ఉన్నారు - ఎన్నెన్నాళ్లకు నాకోరిక తీరింది - అదేదో కాస్త గట్టిగా కొరికి తినేసి ఉండవచ్చు కదా .......
తియ్యదనంతో నవ్వుకున్నాను - అమ్మా నొప్పివేస్తోందా లవ్ యు అంటూ కొరికిన బుగ్గపై ముద్దుపెట్టాను .
అమ్మ : ఎంత నొప్పివేస్తోంది తెలుసా ...... కాస్త మందుని గట్టిగా రాయవచ్చు కదా .......
అలాగే అమ్మా అన్నట్లు అమ్మ కళ్ళల్లోకి ప్రాణంలా చూస్తూ సైగచేసి , లవ్ యు సో మచ్ అమ్మా అంటూ ఘాడంగా ముద్దుపెట్టాను .
అమ్మ : ఆఅహ్హ్హ్ ...... నా ప్రతీముద్దుకు ఇంత ఎంజాయ్ చేస్తూ వచ్చావన్నమాట - ఆ ఫీల్ ను ఇప్పటికి ఆస్వాదించగలిగాను - కనికరమే లేదు కన్నయ్యా నీకు అంటూ మరింత గట్టిగా చుట్టేసి చెప్పు చెప్పు చెప్పు అన్నారు ఆతృతతో .......
మందమైన దుప్పటిని కప్పినా మా అమ్మ వణుకు ఆగనేలేదు అందుకని మరొక మందమైన దుప్పటిని అందుకుని కప్పాను .
అమ్మ : అంటే ముద్దు పెట్టనేలేదన్నమాట - దుప్పటి అంట దుప్పటి ఎవరికి కావాలి ఆ మందమైన దుప్పటి అంటూ కోపంతో భుజంపై కొరికేస్తున్నారు .
స్స్స్ స్స్స్ ..... మా అమ్మ పూర్తిగా చెప్పనిచ్చేలా లేనేలేదు .
అమ్మ : Ok ok ఇంకా ఉందన్నమాట ఇదిగో సైలెంట్ సైలెంట్ అంటూ నవ్వుకుంటున్నారు .
రెండు దుప్పట్లు కప్పినా వణుకు ఆగకపోవడంతో నా దేవతమ్మ దేవతలైన అమ్మలగన్న అమ్మలను ప్రార్థించి నుదుటిపై వెచ్చనైన ముద్దు ఒక్కటంటే ఒకటి అలా పెట్టానో లేదో మూలుగులు అక్కడితో ఆగిపోయి వెచ్చగా నిద్రపోయారు , ఇక్కడ హృదయంలో కలిగిన ఆనందంతో మరొక ముద్దుపెట్టి , మా అమ్మకు మరింత వెచ్చదనం కోసం డోర్ క్లోజ్ చేసుకుని , మా అమ్మ కప్పుకున్నట్లుగానే రెండు మందమైన దుప్పట్లు కప్పుకోగానే వెచ్చగా నిద్రపట్టేసింది - మళ్లీ మా అమ్మ వలన లేచాను .
అమ్మ : ( అన్ని దుప్పట్లు కప్పే బదులు ఇలా ప్రేమతో ఏకమయ్యేలా కౌగిలించుకుని ముద్దులుపెట్టి వెచ్చదనం పంచి ఉంటే మరింత వెచ్చగా - హాయిగా నిద్రపోయేదానిని ) అంటూ గుసగుసలాడారు .
అమ్మా ...... వినిపించలేదు .
అమ్మ : ఇలాంటివి మాత్రం వినిపించనే వినిపించవు ప్చ్ ప్చ్ ...... పో కన్నయ్యా అంటూ నిరాశ - కోపంతో కొట్టి ఏకమయ్యేలా అల్లుకుపోయారు , కన్నయ్యా ...... అంతలా చలికి వణుకుతుంటే కేవలం రెండే రెండు ముద్దులా ? పెట్టేది .
ఆ రెండు ముద్దులకే హాయిగా - వెచ్చగా నిద్రపోయారమ్మా .......
అమ్మ : బుద్ధిలేదే నీకు మరికాసేపు వణుకుతూనే ఉండొచ్చుకదా అంటూ మొట్టికాయలు - లెంపలు వేసుకుంటున్నారు కోపంతో .......
సంతోషంతో నవ్వులు ఆగడం లేదు - స్టాప్ స్టాప్ అమ్మా .......
అమ్మ : Why ? .
మా అమ్మను కొట్టే అర్హత మీకు లేదు , మీ తల్లులకు మాత్రమే ఉంది .
అమ్మ : తల్లులతోపాటు నీకూ ఉంది కానీ కొట్టడం లేదే అంటూ అంతులేని సిగ్గుతో నా గుండెల్లో దాచుకున్నారు , క్షణాలు - నిమిషాలు గడిచినా సిగ్గు పెరుగుతోందే కానీ తగ్గకపోవడం చూసి ఆశ్చర్యం వేసింది .

అమ్మా ...... ఏమైంది ? - ఎందుకంత సిగ్గు ? , నాకూ చెబితే నేనుకూడా .......
అమ్మ : అమ్మో సిగ్గేస్తుంది - ఎందుకో నీకు తెలిసినప్పుడు నాకంటే ఎక్కువ సిగ్గుపడతావులే అంటూ హృదయంపై స్వీట్ గా కొరికేశారు .
స్స్స్ ...... అంటూ తియ్యదనంతో జలదరించిపోయాను - కొత్తగా అనిపించింది - తేరుకోవడానికి కాస్త సమయమే పట్టింది .
అమ్మ : ఎంజాయ్ ఎంజాయ్ కన్నయ్యా అంటూ కొరికినచోట ముద్దులుకురిపిస్తూనే ఉన్నారు .
వొళ్ళంతా జివ్వుమంటూనే ఉంది .
అమ్మ : నా కన్నయ్య వలన ఈరోజుకు అమ్మవారి దర్శనం ఆలస్యం అయ్యేలా ఉంది అంటూనవ్వుకుంటున్నారు .
లేదు లేదు అమ్మా ...... , అమ్మో అప్పుడే 8 గంటలు అవుతోంది - మనం ఇంకా రెడీ కూడా అవ్వనేలేదు , అమ్మా ...... తెల్లవారేలోపు రెడీ అయిపోయేవారుకదా ? .
అమ్మ : మెలకువ అయితే వచ్చింది , ఒకవైపు విపరీతమైన చలి మరొకవైపు డోర్ క్లోజ్ చేసి ఉండటంతో నా ముద్దుల కన్నయ్యపై భయంకరమైన కోపం వచ్చేసింది .
చూసాను చూసాను అమ్మా ...... కళ్ళుతెరవగానే దేవత భద్రకాళీ కోపం చూసానులే అంటూ కళ్లపై చెరొకముద్దుపెట్టాను , అదిగో అమ్మా ...... మంచు కురవడం కూడా ఆగిపోయింది - ఫ్రెష్ అయ్యివెళ్లి ఎయిర్పోర్ట్ లో వేడివేడి కాఫీ తాగి బయలుదేరుదాము .
అమ్మ : సరే కన్నయ్యా ...... , అమ్మవారి దర్శనం తరువాత మాత్రం షిమ్లా వదిలివెళ్లేంతవరకూ ఇలాగే నా ముద్దుల కన్నయ్య గుండెలపై గువ్వపిల్లలా - బుజ్జిపాపాయిలా వొదిగిపోతాను , కాదు అన్నావో .......
మా అమ్మకు ...... కాదు అని నేను ? Is it పాజిబుల్ ...... , ఈరోజు ఏంటో అంతా కొత్తగా హాయిగా మధురంగా ...... ఏదో మాటల్లో వర్ణించలేని అతి మధురాతిమధురమైన అనుభూతి , నేనే అడుగుదాము అనుకున్నాను ఇంతలో మా అమ్మనే ...... అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
అమ్మ : లవ్ యు ముద్దుల కన్నయ్యా ...... , అడగటంలో ఎప్పుడూ ఆలస్యమే అంటూ భుజంపై కొరికేశారు ప్రాణంలా .......
స్స్స్ ...... మూడవసారి అంటూ మురిసిపోతున్నాను .
అమ్మ : మూడవసారి ఏంటి కన్నయ్యా ...... ? .
మా ముద్దుల అమ్మ మూడుసార్లు ముద్దుల కన్నయ్య అని ప్రేమతో పిలవడం - పిలిచిన ప్రతీసారీ ఇక్కడ హృదయంలో ...... ఆఅహ్హ్హ్ వర్ణించలేని పులకింత .
అమ్మ : " ముద్దుల అమ్మ " ఆఅహ్హ్ ...... ఆ తియ్యని పులకింత నాకూ కలిగింది కన్నయ్యా అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి పులకించిపోతున్నారు .
లవ్ యు సో మచ్ అమ్మా ...... , అమ్మా ...... ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెచ్చనైన నీటితో కాదు కాదు వేడి నీళ్లతో వెచ్చగా స్నానం చేసి రెడీ అవుదాము .
అమ్మ : నా ముద్దుల కన్నయ్య చెబుతుంటేనే వెచ్చంగా అనిపిస్తోంది అంటూ ఏకమయ్యేలా హత్తుకుని హృదయంపై ఘాడంగా ముద్దుపెట్టి లేచారు .
అమ్మా ...... అంటూ లేచి దుప్పటిని కప్పాను .
అమ్మ : ఈ దుప్పటి వెచ్చదనం సరిపోదు - దర్శనం తరువాత ఇక్కడ చేరిపోతానుగా అంటూ హృదయంపై చేతితో ముద్దుపెట్టి , దుప్పటిని నిండుగా కప్పుకుని రూంలోకివెళ్ళారు .
నేనూ వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని వేడివేడి షవర్ కింద స్నానం చేసివచ్చి డ్రెస్ వేసుకున్నాను .

13 డిగ్రీస్ టెంపరేచర్ కు డ్రెస్ ఏమాత్రం సరిపోకపోవడంతో , జర్కిన్స్ ఎక్కడ ఉంచానబ్బా అంటూ లగేజీలో వెతికితే కింద ఉన్నాయి , ఒకటి వేసుకుని ఒకటి చేతిలోకి తీసుకున్నాను, జర్కిన్స్ మాత్రమేనా గ్లవ్స్ పెట్టుకోవడం మరిచిపోయాను అంటూ నన్నునేను తిట్టుకుని , అమ్మకోసం హాల్లో వేచిచూస్తూ కూర్చున్నాను.​
Next page: Update 74
Previous page: Update 72