Update 02

పూజా అరుపులు విన్న విక్కి, వినీత లోపలికి వెళ్లారు దాంతో పాటు ప్రమోద్, ప్రకాష్ కూడా వచ్చారు "హే పూజా ఎమ్ అయింది" అని అడిగాడు విక్కి పూజా ఇంకా షాక్ లోనే ఉండి ఎవరూ ఏమీ అడిగిన పిలిచిన పట్టించుకోవడం లేదు అప్పుడు ప్రమోద్ పూజా పక్కన కూర్చుని దగ్గర గా తీసుకొని అడిగాడు "ఎమ్ అయింది పూజా" అని అడిగాడు. అప్పుడే ప్రమోద్ అమ్మ నాన్న లోపలికి వచ్చారు "ఏమీ జరిగింది" అని అడిగారు పూజా తన మొహం పైన అంటుకున్న చెమట తుడుచుకుంటు "ఒక బారి శరీరం ఉన్న ఒక రూపం నను ఎత్తుకు వెళ్లినట్లు కళ వచ్చింది" అని భయపడుతు చెప్పింది. పూజా మాటలు విన్న ప్రమోద్ అమ్మ నాన్న మొహం లో ఏదో తెలియని అలజడి మొదలైంది అది అంత మౌనంగా గమనించాడు విక్కి.

కానీ వాళ్ల కంగారూ ఆప్పుకుని పూజా వైపు చూశారు షర్మిల వెళ్లి పూజా పక్కన కూర్చుని ఆప్యాయంగా తల నీమురుతు" అమ్మ పూజా నువ్వు ఇందాక జరిగిన గొడవకు బాగా దిగులు పెట్టుకున్నావ్ ఎమ్ భయపడదు మేము అంతా ఉన్నాం కదా" అని చెప్పింది పూజా ఏదో మాట్లాడబోతే తనని ఆపి "నువ్వు ఏమీ మాట్లాడవద్దు కావాలి అంటే ఈ రోజు ప్రమోద్ నీతో ఇక్కడే ఉంటాడు నీకు తోడుగా కాబట్టి హాయిగా నిద్రపో" అని చెప్పి వెళ్లి పోయారు ఇద్దరు ఆ తర్వాత విక్కి, వినీత, ప్రకాష్, ప్రమోద్ పూజా దగ్గరే ఉన్నారు కొద్ది సేపు అప్పుడు విక్కి కీ ఒక ఆలోచన వచ్చింది "అందరూ బాగా డల్ అయిపోయారు పెళ్లి ఇంట్లో ఇలాగే ఉంటార అందుకే నేను ఒక ప్లాన్ వేశాను "అని చెప్పాడు అందరూ విక్కి వైపు చూసి ఏంటి అని సైగ చేశారు.

"మనం అందరం కలిసి రేపు బయటికి వెళ్లదాం సరదాగా సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి వద్దాం" అని చెప్పాడు దానికి వినీత "పిచ్చా నీకు బయటకు వెళ్లితే ఎంత రిస్క్ తెలుసా నీకు నేను ఒప్పుకోను ప్రమోద్ సార్ అసలు ఒప్పుకోరు" అని వినీత మాట పూర్తి చేసే లోపే "చాలా బాగుంది వెళ్లదాం" అని ప్రమోద్ విక్కి కీ వత్తాసు పలికాడు.

దానికి షాక్ అయిన వినీత ప్రమోద్ తో "సార్ ఇప్పుడు మీరు బయటికి వెళ్లాలి అంటే ఎంత సెక్యూరిటీ ప్రాబ్లమ్ తెలుసా మీకు" అని నచ్చచెప్పింది. దానికి ప్రమోద్ "అయితే సెక్యూరిటీ లేకుండా ఎవరికి తెలియకుండా వెళ్లదాం ఇది నా ఆర్డర్ no more arguments" అని కరాకండి గా చెప్పాడు ప్రమోద్ దానికి వినీత ఇంక సరే అన్నట్లు తల ఊప్పింది. "అలా అయితే రేపు పొద్దున్న అందరూ కలిసి వెనుక ఫారెస్ట్ లోకి వెళ్లే గేట్ వైపు రండి" అని చెప్పాడు ప్రమోద్

మరుసటి రోజు ఉదయం అందరు కలిసి అడవిలోకి ప్రయాణం అయ్యారు పూజా ప్రమోద్ విక్కి జీప్ లో వినీత కోసం వెయిట్ చేస్తున్నారు వినీత విక్కి తనని మొదటి సారి ముద్దు పెట్టుకున్నపుడు వేసుకున్న అదే డ్రెస్ వేసుకొని వచ్చింది వచ్చి విక్కి పక్కన కూర్చుంది వాళ్లను చూసిన ప్రకాష్ "మీ లవ్ బర్డ్స్ మధ్య లో నేను ఎందుకు మీరే వెళ్ళండి" అని డ్రాప్ అయిపోయాడు ప్రకాష్. తరువాత ప్రమోద్, పూజా ఫ్రంట్ లో కూర్చున్నారు విక్కి, వినీత వెనక కూర్చున్నారు కార్ కుదుపులకు విక్కి, వినీత ఒకరి మీద ఒకరు పడ్డారు అప్పుడు సడన్ గా కార్ ఆగింది ఎదురుగా వాటర్ ఫాల్స్ ఉన్నాయి అందరూ దిగి అందులో ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడు విక్కి, వినీత వాటర్ ఫాల్స్ లో ఉండగా పూజా, ప్రమోద్ అలా వెళ్లి వస్తాం అని అడవిలోకి వెళ్లారు.

వినీత, విక్కి లేచి కార్ దగ్గరికి వెళ్లి డ్రస్ మార్చుకున్నారు తరువాత విక్కి కార్ ఇంజన్ మీద కూర్చున్నాడు అప్పుడే వచ్చిన వినీత వెళ్లి విక్కి ఒడిలో కూర్చుంది అప్పుడు చూస్తే సూర్యుడు అస్తమిస్తున్నాడు వీలు ఆ రొమాంటిక్ వాతావరణం లో ఒకరి పెదవులు ఒకరు జురుకున్నారు. అలా మరుసటి రోజు ఉదయం వరకు రెండు జంటలు ఆ అడవిలో ప్రణయ మదురిమలో తేలిపోయారు.

అలా రెండు రోజుల తరువాత పెళ్లి గణంగా జరుగుతోంది ప్రమోద్ పెళ్లి పీటల పైన కూర్చొని పూజలు చేస్తున్నాడు, ప్రకాష్ వచ్చిన గెస్ట్ లను రిసీవ్ చేసుకుంటున్నాడు, వినీత సెక్యూరిటీ పనులు చూసుకుంటూ బిజీ బిజీగా ఉంది ఇక్కడ పూజా రూమ్ లో రెడీ అవుతోంది తన దెగ్గర విక్కి, నిఖిల్ ఉన్నారు. పూజా మొహం లో ఏదో తెలియని భయం కనిపించింది విక్కి కీ "రేయి నాకూ ఈ పెళ్లి కరెక్ట్ ఏ అంటావా" అని సందేహం వ్యక్తం చేసింది పూజా దానికి విక్కి "నువ్వు ఏమీ భయపడొద్దు మేము అంతా ఉన్నాం" అని ధైర్యం చెప్పాడు అప్పుడే షర్మిల, వెంకట్ ఇద్దరు లోపలికి వచ్చి ఒక ఎర్రని పట్టు చీర పూజా కీ ఇచ్చారు "పూజా ఇది మా ఆచారం మా అమ్మమ్మ దగ్గరి నుంచి ఈ చీర కట్టుకుని పెళ్లి పీటల పైన కూర్చొని తాళి కట్టించుకున్నారు నువ్వు ఇదే చీర లో తయారు అయి రా "అని చెప్పి పూజా కీ ఆ చీర ఇచ్చాడు వెంకట రాయుడు పూజా ఆనందం గా ఆ చీర తీసుకుంది ఇంక తను చీర మార్చుకొని వస్తుంది అని అందరూ బయటికి వెళ్లారు ఒంటరిగా వదిలి.

అలా అందరూ ఎవరి పనుల్లో వాళ్లు ఉండగా పెళ్లి కూతురు నీ తీసుకురమ్మనీ చెప్పారు వెళ్లి చూస్తే పూజా రూమ్ లో లేదు అంతే కాకుండా ఆ రూమ్ కిటికీ విరిగి పడి ఉంది ఆ కిటికీ లో నుంచి బయటకు చూస్తే ఒక పాద ముద్ర కనిపించింది అది మనిషి పాదం కంటే 5 రేట్లు ఎక్కువ సైజ్ తో ఉంది.

ఆ పాద ముద్ర చూసిన వెంటనే వెంకట రాయుడు మొహం అంతా చెమటలు పట్టాయి అంతే కాకుండా షర్మిల కూడా తన చీర కొంగు తో మోహని తుడుచుకుంటుది, ఇది అంత గమనిస్తునే ఉన్నాడు విక్కి ఆ తర్వాత వినీత, విక్కి ఇద్దరు కిందకు వెళ్లి ఆ అడుగు తరువాత ఎక్కడ పడిందో తెలుసుకోవడానికి వెళ్లారు కానీ ఆ అడుగు తరువాత ఎక్కడ పడిందో చూస్తే ఇంకో 10 అడుగుల దూరం పడింది. ఆ తర్వాత మళ్లీ ఇంకో అడుగు కూడా అలాగే కనిపించింది కానీ తరువాత మాయం అయింది వాళ్ల ఇద్దరికి అసలు ఏమీ అర్థం కాలేదు అలాగే నడుచుకుంటు ముందు కు వెళ్లారు అక్కడ వాళ్ళకి ఏమీ దొరకలేదు ఇంతలో ఏదో జీప్ సౌండ్ వినిపిస్తే అట్టు వైపు చూశారు కానీ అంతలోనే ప్రమోద్ తన అమ్మ నాన్న తో సెక్యూరిటీ అధికారి లతో అక్కడికి చేరుకున్నారు ప్రమోద్ మొహం లో ఏమి కంగారు భయం విక్కి కీ కనిపించలేదు.

అప్పుడే ACP శ్రీధర్ వచ్చి ప్రమోద్ నాన్న తో "సార్ మనం అనుకున్నటే జరిగింది కాబట్టి ఇప్పుడు ఏమీ చేసినా ప్రయోజనం లేదు అనిపిస్తుంది కాబట్టి ఎంక్వయిరీ అంతా టైమ్ waste మీరు ఒక మాట చెప్తే కేసు ముసేస్తాం" అన్నాడు, దాంతో విక్కి కీ ఒక సారిగా కోపం కట్టలు తెంచ్చుకుంది "మీ పని మీరు చేయకుండా టైమ్ waste అని ఎలా చెప్తున్నారు అసలు ఇంత జరిగాక కూడా మీరు situation లో seriousness చూపించడం లేదు "అని ఒక సారిగా గట్టిగా అరిచాడు. అంతా విన్న శ్రీధర్" హలో బ్రదర్ నీకు అసలు ఏమీ జరిగిందో ఐడియా లేదు ఒక రాక్షసుడు నీ ఫ్రెండ్ నీ ఎత్తుకు పోయాడు" అని చెప్పాడు శ్రీధర్ చెప్పింది విని విక్కి కీ మళ్లీ మండింది" ఈ రోజులో రాక్షసులు ఏంటి డ్యుటీ చేయడం చాత్తా కాక చందమామ కథలు చెప్తున్నావ్" అని శ్రీధర్ షర్ట్ పట్టుకున్నాడు.

దాంతో డ్యుటీ లో ఉన్న ఆఫీసర్ షర్ట్ పట్టుకున్నాడు అన్న కారణం తో సెక్యూరిటీ అధికారి లు విక్కి నీ అరెస్ట్ చేయబోయారు కానీ వెంకట రాయుడు సైగ చేసే సరికి అందరూ విక్కి నీ వదిలేసి వెళ్లిపోయారు అప్పుడు వెంకట రాయుడు విక్కి దగ్గరికి వచ్చి "వాడు చెప్పింది నిజమే నీ ఫ్రెండ్ నీ తీసుకోని వెళ్లింది ఒక రాక్షసుడు ఇది మా వంశం కీ ఉన్న శాపం మా ఇంట్లో ఎప్పుడు పెళ్లి జరిగినా వాడు ఆ పెళ్లి కూతురు నీ ఎత్తుకు పోతాడు" అని చెప్పాడు

అంతా విన్న తర్వాత విక్కి పగల బడి నవ్వుతూన్నాడు "మొత్తం ఈ ఊరిలో అందరికీ పిచ్చి ముదిరిపోయింది రా ఇంకోది సేపు ఇక్కడే ఉంటే నాకూ పిచ్చి ఎక్కుతుంది రా బాబు "అని కోపంగా పాలెస్ వైపు వెళ్లాడు, వెళుతున్న విక్కి వైపు చూసి వెంకట రాయుడు తన సెక్యూరిటీ వాడిని పిలిచి "వాడి మీద ఒక కన్ను వేసి ఉంచు" అని చెప్పాడు విక్కి పాలెస్ కి వెళ్ళి సరాసరి పూజా రూమ్ లోకి వెళ్లాడు ఏదైనా clue దొరుకుతుంది అన్న అనుమానం తో, రూమ్ అంతా వెతికిన విక్కి కీ ఏమీ దొరకలేదు కోపం లో పక్కనే ఉన్న అల్మారా నీ ఒక్కటి కొట్టాడు అంతే దాని పైన ఉన్న ఒక సూట్కేస్ కింద పడింది దాంట్లో నుంచి కొని ఫొటోలు కింద పడ్డాయి అవి పూజా తను కాలేజీ లో దిగిన ఫొటోలు అవి అని తీసి చూస్తూ పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు.

అలా ఫోటోలు ఒక దాని తర్వాత ఒకటి చూస్తుంటే విక్కి కీ ఒక ఫోటో కనిపించింది అందులో పూజా ఒక అబ్బాయి తో lip to lip కిస్ పెట్టుకుంది అంతే కాకుండా అలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి ఇంకో ఫోటోలో ప్రమోద్, పూజా, ఆ అబ్బాయి ముగ్గురు ఉన్నారు అంతే కాకుండా పూజా ఆ అబ్బాయి ఆ ఫోటో లో engagement రింగ్ మార్చుకున్నారు, అంతే కాకుండా ఆ సూట్కేస్ లో సగం కాలిపోయిన డైరీ దొరికింది అది తెరిచి చూస్తే "అజయ్ i love you and I really miss you నేను చేసేది తప్పే కానీ తప్పడం లేదు నేను ఈ పెళ్లి చేసుకోక తప్పదు నను క్షమించు" అని రాసింది పూజా దాంతో ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి పేరు అజయ్ అని విక్కి కీ అర్థం అయింది.

అంతే దొరికిన సాక్ష్యం తో బయటకు వచ్చాడు విక్కి అలా తన రూమ్ వైపు వెళుతున్న విక్కి నీ సెక్యూరిటీ వాళ్లు ఆపి "సార్ ఇంక నుంచి మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు కాబట్టి మీరు ఇప్పుడే ఈ పాలెస్ వదిలి వెళ్లిపోవాలి అని మేడమ్ చెప్పారు" అని విక్కి luggage అతని చేతికి ఇచ్చి బయటకు పంపారు, బయటకి వచ్చిన తర్వాత విక్కి ప్రమోద్ రూమ్ వైపు చూశాడు తార ప్రమోద్ ఇద్దరు ఒకరి కౌగిలి లో ఒక్కరూ అతుకుపొయి ముద్దుల సమరం చేస్తున్నారు

తార ప్రమోద్ నీ అలా చూసేసరికి విక్కి మొహం లో రంగులు మారిపోయాయి, తరువాత సెక్యూరిటీ వాళ్లు రావడం చూసి బయటికి నడిచాడు. అప్పుడే వినీత వచ్చి విక్కి ముందు సెక్యూరిటీ అధికారి కార్ ఆపి నాకూ" 3 డేస్ లీవ్ కావాలి అంటే వైజాగ్ లో నా ఫ్లాట్ లో ఉండొచ్చు నువు" అని ఎక్కించుకోని వెళ్లింది తన ఫ్లాట్ కీ. కానీ విక్కి మొహం లో ఉన్న విచారం అర్థం అయింది వినీత కు "విక్కి మనం ఇప్పుడు ఏమీ చేయలేము పూజా పోయింది కానీ తనని ఎలా కనిపెట్టాలో కూడా మనకు తెలియదు అంతే కాకుండా ఇప్పుడు నిఖిల్ ఎక్కడ ఉన్నాడో ముందు తెలుసుకోవాలి లేక పోతే వాడి ఆవేశం కీ చాలా దారుణాలు జరుగుతాయి" అని చెప్పింది, అప్పుడు గుర్తు వచ్చింది విక్కి కీ మొన్న రాత్రి గోడవ జరిగిన దగ్గరి నుంచి నిఖిల్ కనిపించడం లేదు, అలాగే పూజా అన్న ఒక మాట గుర్తు వచ్చింది" నిఖిల్ కీ ఎప్పుడు కోపం భాధ వచ్చిన వాడు సలీం బార్ లో ఉంటాడు "అని పూజా చెప్పిన మాట గుర్తుకు వచ్చింది

ఆ వెంటనే వాళ్లు హర్బర్ దెగ్గర ఉన్న ఆ బార్ వైపు వెళ్లారు కానీ దారిలో వాళ్ళకి నిఖిల్ ఎవరో జీప్ అతనితో గోడవ పడుతూ కనిపించాడు, వీలు కార్ దిగి వెళ్లారు ఆ జీప్ డ్రైవర్ నిఖిల్ నీ గుద్దాడు అని గోడవ జరుగుతుంది, విక్కి ఆప్పడానికి చూసిన వాళ్ళు ఆప్పలేదు కానీ సడన్ గా మంత్రం వేసినట్లు. అందరూ పారిపోయారు ఎందుకు అంటే అక్కడికి ఆ ఏరియా రౌడీ సలీం భాయ్ వచ్చాడు అతని చూసి డ్రైవర్. పారిపోతూంటే నిఖిల్ పట్టుకున్నాడు వాడిని గట్టిగా "ఎందుకు వీడని చంపాలి అని చూశావ్" అని అడిగాడు దాంతో అందరూ షాక్ అయ్యారు కోపంతో వాడిని లాగి ఆ జీప్ బార్నెట్ కీ వేసి కోడితే "సార్ ఇది అంతా ఆ ప్రమోద్ చేయించాడు" అని చెప్పాడు, దాంతో నిఖిల్ కోపంతో ప్రమోద్ కోసం పాలెస్ కి బయలుదేరాడు, కానీ నిఖిల్ కీ తెలియని విషయం ఆ డ్రైవర్ విక్కి కీ చెప్పాడు.

దాంతో విక్కి, వినీత ఇద్దరు కలిసి అరకు వైపు వెళ్లారు వాళ్లు 1 గంట లో అరకు చేరుకున్నారు తరువాత ఆ డ్రైవర్ చెప్పిన దారిలో వాళ్లు పూజా నీ వేతకడానికి వెళ్లారు

(ఆ డ్రైవర్ పూజా నీ ఎవరూ ఎక్కడ దాచి పెట్టారు అని విషయాలు చేప్పేసాడు) వాళ్లు చివరగా వెతికిన చొట్ట ఎడమ వైపు దట్టమైన అడవుల్లో ఒక 5 km నడిస్తే ఒక పాత చెక్క ఇళ్లు కనిపించింది దాంట్లో కీ వెళ్లి పూజా కోసం వేతికారు ఆ ఇంట్లో ఎక్కడ దొరకక పోవడంతో విక్కి గట్టిగా తన కాలితో కోడితే కింద చెక్క విరిగి ఆ బొక్కలో నుంచి పూజా కనిపించింది వాళ్లకు వెంటనే వెళ్లి పూజా నీ తీసుకోని బయటకు వచ్చారు పూజా చాలా నీరసముగా ఉంది స్ప్రుహ లో కూడా లేదు వెంటనే వైజాగ్ కీ వెళ్లి హాస్పిటల్ లో చేర్పించారు, నిఖిల్ విక్కి కీ ఫోన్ చేసి ప్రమోద్ గురించి కనుక్కోమన్నాడు వాడు పాలెస్ లో లేడు అని చెప్పాడు దాంతో విక్కి ప్రకాష్ కీ ఫోన్ చేసి అడిగాడు.

అప్పుడు ప్రమోద్ తన ప్రైవేట్ yatch లో ఉండి ఉంటాడు అని చెప్తే అక్కడికి వెళ్లారు అప్పుడే ఒక BMW కార్ పోర్ట్ నుంచి హడావిడి గా రోడ్డు పై పరుగులు తీసింది అలా అందరూ లోపలికి వెళ్లేసరికి ప్రమోద్ గొంతు తెగి రక్తపు మడుగులో పడి ఉన్నాడు.​
Next page: Update 03
Previous page: Update 01