Update 02
చాచా కొత్త హోటల్ చూసుకుంటున్నాడు రోజు మధ్యాహ్నం పూట ఒకసారి వచ్చి బిర్యానీ చేపించి వెళ్ళిపోతున్నాడు. నా స్థానంలో ఇంకొక అబ్బాయిని పెట్టుకున్నాను. ఏమైనా సందేహాలున్నా ఏమైనా జరిగినా చాచా వచ్చినప్పుడు ఆయనకి చెప్పి ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను.
చాచాకి కేటరింగ్ పనులు, పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు కూడా చేద్దాం అని చెప్పించి ఒప్పించాను, దానికి ఆయన నువ్వు కష్టపడతానంటే నేను మాత్రం ఎందుకు వద్దంటాను అని మాత్రమే అన్నాడు.
నేను కాలేజీకి వెళ్ళినప్పుడు మాత్రం లక్ష్మి గారు కౌంటర్ మీద కూర్చుంటుంది, తను కూడా నన్ను చాలా నమ్ముతుంది ఏదైనా పెద్ద కాంట్రాక్టు వచ్చినా పెళ్ళికి ఆర్డర్స్ కేటరింగ్ వచ్చినా తాను సొంతగా నిర్ణయం తీసుకోకుండా నన్నే మాట్లాడమని ప్రోత్సాహిస్తుంది.
ఈ ఒక్క నెలలోనే కస్టమర్స్ తొ ఎలా మాట్లాడాలి తోటి పనివారితో ఎలా మెలగాలి, వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలి, సామాను ఎక్కడనుండి తెచ్చుకోవాలి వారితో ఎలా మాట్లాడితే మనకు లాభం చేకూరుతుంది అన్నీ ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను.
రెండో నెల జీతంగా పదిహేను వేలు ఇచ్చాడు, కానీ నేను ఒప్పుకోలేదు.
ఖాసీం : చూడు బేటా.. మెయింటనెన్స్ మారిన మొదటి నెల ఎవరికైనా లాస్ వస్తుంది అది సహజం అదొక ఆనవాయితీ లాంటిది కానీ నీ కష్టంతొ లాస్ రాకుండా చేసావ్, బిల్లులు కూడా గమనిస్తున్నాను. లతీఫ్ వెళ్ళినప్పటి కంటే నీ ఫోన్ ద్వారానే మనకి సరుకులు తక్కువ పడుతున్నాయి.
నాకు అర్ధమైంది నువ్వు బిసినెస్ బాగా చేయగలవు మంచి మంచి టెక్నిక్స్ ఉన్నాయి నీ దెగ్గర, ఇలానే కష్టపడు నువ్వు చాలా పైకి వెళ్తావ్, అల్లా తేరేకు అచ్చా కరేగా. ఇక ఈ పదిహేను వేలు ఈ నెల జీతం మాత్రమే వచ్చే నెల నుంచి నీకు పార్టనర్ గా ఎంత రావాలో అంతా ఇస్తాను, ఇక నువ్వేం మాట్లాడకు సంతోషంగా ఉండు.
జీతం తీసుకుని హాస్టల్ కి వెళుతుంటే భలే ఆనందం వేసింది ఖాసీం చాచా మాటలకి, స్వార్థంగా ఇలానే నా కింద పనిచేసుకో అనలేదు మనస్ఫూర్తిగా నువ్వు కత్చితంగా పైకి వస్తావ్ అన్నాడు. ఆ మాటలకి నాకు నా మీద నమ్మకమొచ్చింది.
పని నేర్చుకుని మేనేజ్ చేసే పోస్టులో అలవాటు అయినా ఒక పది రోజులకి రోజులాగె హోటల్ కౌంటర్ మీద బిజీగా ఉన్నాను సరిగ్గా అదే టైంలో లతీఫ్ వచ్చాడు, నన్ను చూసి నా దెగ్గరికి వచ్చాడు.
లతీఫ్ : శివా కౌంటర్ నేను చూసుకుంటాను నువెళ్లి మిగతా పనులు చూసుకో.
శివ : అన్నా, మీది నూట పది అయ్యింది, gpayనా అక్కడుంది చూడండి. షరీఫ్, సార్ బిల్లెంతా?
లోపల నుంచి షరీఫ్ : రెండు ఫుల్ బిర్యాని ఒక చికెన్ 65..మూడు పుల్కా
లతీఫ్ అసహనంగా చూడటం గమనించాను.
శివ : అన్నా పదిహేను వందల యాభై అని చెప్పి కాష్ లెక్కపెట్టి కౌంటర్ లో వేస్తూ అన్నా మీకు ఫుల్ మీల్స్ కదా కూర్చోండి ఒక్క ఐదు నిమిషాలు పార్సెల్ చేస్తున్నారు, ఆ రఫీక్ భాయ్ సలాం వాలేకుం. శ్రీను, భాయ్ కొ ఏక్ స్పెషల్ చాయ్.
ఆ లతీఫ్ చెప్పు ఏంటి విశేషాలు?
లతీఫ్ : ఏంటి కొత్తగా పేరు పెట్టి పిలుస్తున్నావ్?
శివ : ఏ నా వయసు వాడివేగా పిలిస్తే తప్పేంటి.. ఏంటి ఇటోచ్చావ్?
లతీఫ్ : నా మామ హోటల్ కి నేను రాకూడదా?
శివ : ఏమైనా తింటావా లతీఫ్?
లతీఫ్ : ఇంకా నయ్యం నన్ను బిల్లు కట్టమనలేదు.
శివ : నువ్వు కడతానంటే నేను వద్దంటానా, సరే ఆ గ్యాస్ కొంచెం లోపల పెట్టెయ్.
లతీఫ్ : నేనా, అది నువ్వు చెప్పిన పని నేను చెయ్యాలా?
శివ : అదేంటి లతీఫ్ అలా అంటావ్ మీ మామా హోటలే కదా ఆ మాత్రం సహాయం చెయ్యలేవా అని మాట్లాడుకుంటూ లేచి గ్యాస్ భుజాన ఎత్తుకుని కిచెన్ లో పెట్టాను.
నేను బైటికి వచ్చేలోగా లతీఫ్ కౌంటర్ మీద కూర్చుని ఉన్నాడు డ్రా కీస్ కోసం చూసాడు, కీస్ నా దెగ్గరే ఉన్నాయి నా చేతి వేలుకి రింగ్ తోడిగి తన ముందే వేలు తిప్పుతూ కౌంటర్ దెగ్గరికి వెళ్ళాను. సరిగ్గా అప్పుడే నెలసరి కిరాణా సామాను పంపించే సేట్ వచ్చి కౌంటర్ దెగ్గర నిలబడ్డాడు.
శివ : నమస్కారం రాఘవ గారు, ఎలా ఉన్నారు?
రాఘవ : ఏంటి శివ, చాలా బిజీగా ఉన్నట్టున్నావ్. ఈ మధ్య సామానుకి కూడా రావట్లేదు.
శివ : బిల్ ఎంత అయ్యింది అన్నా.
రాఘవ : పద్దెనిమిది వేలు.
లతీఫ్ : పద్దెనిమిది వేలా? (ఆశ్చర్యంగా)
రాఘవ : అవును ఈ ఏరియా మొత్తంలో ఖాసీం చాచా హోటల్ ని కొట్టే హోటలే లేదు. నేను కూడా వింటున్నాను ఈ మధ్య మీల్స్ లో కూరలు అదిరిపోతున్నాయట మొన్న ఖాసీం భాయ్ కూడా కలిసి చెప్పాడు శివ గురించి తన కంటే చాలా బాగా మైంటైన్ చేస్తున్నావట, నిన్ను చాలా మెచ్చుకున్నాడు శివా.
శివ : అదంతా ఖాసీం చాచా మంచితనం. లతీఫ్ ఇలా రా.
లతీఫ్ : కీస్ ఇవ్వు నేనిస్తాను డబ్బులు.
శివ : ఇప్పుడు మీ మామా డబ్బులు మాత్రమే కాదు నావి కూడా కలిసి ఉన్నాయి, కీస్ ఇవ్వడం కుదరదు మర్యాదగా బైటికి రా. అని ఒక విధంగా అరుస్తున్నట్టే వార్నింగ్ ఇచ్చాను, షాక్ అయ్యి దెబ్బకి చైర్ లోనుంచి లేచి బైటికొచ్చాడు. రాఘవ గారిని చూసి నవ్వుతూ కౌంటర్ డ్రా తెరిచి డబ్బులు లెక్కపెట్టి తనకి ఇచ్చేసి బిల్లు తీసుకున్నాను.
తెల్లారి కాలేజీలో గగన్ సర్ ని డౌట్ అడుగుదామని మాథ్స్ డిపార్ట్మెంట్ కి వెళ్లి ఆయన రూమ్ లోకి వెళ్తుండగా ఒకమ్మాయి నవ్వుతూ బైటికి వచ్చింది, నేను బస్సు కిటికీలో నుంచి చూసిన అదే అమ్మాయి, ఇప్పుడు స్పష్టంగా నా ఎదురుగా అదే నవ్వు మొహం కనిపించేసరికి ఏమైందో తెలీలేదు కానీ నా అడుగులు తడబడడం నాకు తెలుస్తుంది. నన్ను ఒకసారి చూసి దాటుకుని వెళ్ళిపోయింది.
రూమ్ లోపలికి వెళుతూనే నాకు తెలియకుండా నా అడుగులు తన వెనక పడ్డాయి తను ఆ చివరి వరకు వెళ్లి మెట్లు దిగే వరకు అలా చూస్తూ ఉండిపోయాను, సార్ పిలుస్తున్నా పట్టించుకోలేదు తను వెళ్లిపోయిన రెండు నిమిషాలకి కానీ తెరుకోలేదు నేను ఎక్కడున్నానో అని వెనక్కి తిరిగి చూసాను గగన్ సార్ నన్నే కోపంగా చూస్తున్నాడు, తల దించుకుని ఆయన ముందుకు వెళ్లి నిలబడ్డాను
గగన్ : శివా..
సార్ పిలవగానే నేను ఎక్కడున్నానో ఎందుకు వచ్చానో గుర్తొకొచ్చింది వెంటనే తల దించుకుని సర్ ముందుకు వెళ్లాను.
గగన్ : చెప్పు శివ.
సర్ కి నా డౌట్ చెప్పి ఆ ప్రాబ్లెమ్ చెప్పించుకుని వెనక్కి తిరిగాను క్లాస్ కి వెళ్ళడానికి.
గగన్ : శివా, ఇలా రా.
సర్ దెగ్గరికి వెళ్లాను, కుర్చీలో కూర్చోమన్నాడు ఇబ్బందిగానే కూర్చున్నాను.
గగన్ : ఆ అమ్మాయి నచ్చిందా?
లేచి నిల్చున్నాను భయంగా.
గగన్ : లేదు, ఏదో కాజువల్ గా అడిగాను. నీకు ఇబ్బంది అయితే వద్దు. కూర్చో, కొంచెంసేపు నాకు బోర్ కొడుతుంది, ఎలాగో క్లాస్లు కూడా లేవు కదా.
మళ్ళీ కూర్చున్నాను.
శివ : అలా ఏం లేదు సర్, కానీ తనే నేను చూసిన మొదటి అమ్మాయి.
గగన్ : అంటే నువ్వు చూసిన మొదటి అమ్మాయి తనేనా?
శివ : అలా కాదు సర్, అస్సలు అమ్మాయిలని చూడలేదని కాదు, ఒక అమ్మాయిని చూడగానే నా బాడీ పార్ట్స్ నా మాట వినడం ఆపేసాయి ఇందాక అలా చూస్తూ ఉండిపోయాను కదా అలాగ.
గగన్ : లవ్ ఎట్ ఫస్ట్ సైటా?
శివ : ఏమో నాకు తెలీదు, కానీ ఇప్పుడు కాదు పది రోజుల క్రితం బస్సులో వెళ్తుండగా చూసాను. ఆరోజు మళ్ళీ ఈ రోజు అంతే.
గగన్ : అలాగా, ఇంకేం తెలుసు తన గురించి?
శివ : ఇంకేం తెలీదు సర్.
గగన్ : కనీసం పేరు?
శివ : తెలీదు.
గగన్ : ఇలా అయితే ఎలా శివా, ఇవ్వాళా రేపు ఎలా ఉన్నారు చూస్తే చాలు వెంటపడిపోయి అన్నీ తెలుసుకుంటున్నారు.
శివ : వద్దులెండి సర్. ముందు నేను అనుకున్నది సాధించాలి ఆశ్రమాన్ని పెద్దమ్మ నడపలేకపోతుంది వీలైనంత త్వరగా నేను తనకి సహాయం చెయ్యాలి అప్పటివరకు వీటికి కొంత దూరంగా ఉంటేనే మంచిది. అని లేచి వెళ్ళడానికి వెనక్కి తిరిగాను.
సర్ ని అడుగుదామనుకున్నాను ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని కానీ ధైర్యం చాల్లేదు..రూమ్ లోనుంచి బైటికి వస్తుండగా సార్ గొంతు వినబడింది.
గగన్ : తన పేరు మీనాక్షి.
వెనక్కి చూడకుండా ముందుకు నడిచాను.
హోటల్ నుంచి హాస్టల్ కి వెళ్లి పడుకున్నాననే గాని ఇంకా కాలేజీలో కనిపించిన తన మొహమే కనిపిస్తుంది, సార్ చెప్పాడు తన పేరు మీనాక్షి అని ఎంత బాగుంది పేరు కూడా తన లాగే.
తను వెళ్లిన కార్ చూస్తుంటే చాలా ఉన్నోళ్ల లాగ ఉంది, మరి ఈ కాలజీలో తనకేం పని కొంపదీసి సర్ వాళ్ల బంధువులు అయితే కాదు కదా. అలా తన ఊహలతో వారం గడిచింది కానీ తనని మర్చిపోలేదు తన జాడ కూడా లేదు తన గురించి సర్ ని అడిగేంత ధైర్యము నాకు లేదు.
పొద్దున్నే లేచి హోటల్ కి వెళ్ళాను చాచా కలిసాడు కానీ లతీఫ్ గురించి ఏం మాట్లాడలేదు నేను మౌనంగానే ఉన్నాను, నాకు దాని గురించి మాట్లాడాలని లేదు.
కాలేజీకి వెళ్లాను ఇవ్వాళ క్లాస్ కి గగన్ సర్ రాలేదు కానీ కాలేజీకి వచ్చాడని విన్నాను. గత మూడు రోజులుగా సర్ దిగులుగా ఉండటం గమనించాను ఏమైందో వెళ్లి కనుక్కుందామని వెళ్ళాను కానీ రూమ్ దాకా వెళ్లేసరికి ఇలా తన ప్రాబ్లెమ్స్ గురించి అడిగితే సార్ అవమానంగా ఫీల్ అవుతారేమో అనిపించి ఇంకేం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చేసాను.
సాయంత్రం హోటల్ కి వెళ్లి కౌంటర్ లో కూర్చున్నాను ఇంతలో లక్ష్మి గారు వచ్చారు.
లక్ష్మి : వచ్చావా శివ, నేను వెళ్తున్నాను.
ఇంతలో షఫీర్ వచ్చాడు.
శివ : ఏంటి షఫీర్ చాలా హుషారుగా ఉన్నావ్ ఏంటి సంగతి?
షఫీర్ : నా నీఖా పక్కా అయ్యింది భయ్యా, వచ్చే నెలే షాది.
శివ : అందుకేనా మొహం వెలిగిపోతుంది, కంగ్రాట్స్. అవును పక్కన ఏంటి చాలా మంది ఉన్నారు?
షఫీర్ : పక్క వాళ్లు స్థలం అమ్ముతున్నారు భయ్యా అందుకే కొలతలకి వచ్చారు.
శివ : అవునా నువ్వు చూసుకో, ఇప్పుడే వస్తాను.
బైటికి వెళ్లి చూసాను హోటల్ పక్కనే ఆనుకున్న స్థలం అది, వాళ్ల దెగ్గరికి వెళితే వేలం వేస్తున్నారని తెలిసింది అక్కడ ఏడుస్తూ కూర్చున్నాడు ఒక ముసలాయన. వెంటనే ఖాసీం చాచాని రమ్మన్నాను.
పావుగంటలో చాచా వచ్చి, ఆ ముసలాయన తన ఫ్రెండ్ వాళ్ల నాన్న అని తన ఫ్రెండ్ ఆక్సిడెంట్ లో చనిపోయాక ఇప్పుడు కూతురు దెగ్గర ఉంటున్నాడని చెప్పి తనని పలకరించడానికి వెళ్ళాడు. నాకో ఆలోచన వచ్చింది వెంటనే చాచా దెగ్గరికి వెళ్లాను. ఆ ముసలాయనని ఓదారుస్తున్నాడు, చాచాకి సైగ చేస్తూ పిలిచాను, నన్ను గమనించి లేచి నా దెగ్గరికి వచ్చాడు.
ఖాసీం : ఏంటి శివ?
శివ : చాచా మీ దెగ్గర డబ్బులుంటే ఆ స్థలం మీరే తీసుకోండి చాచా మీ ఫ్రెండ్ కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది మనకి కూడా అవసరం పడుతుంది.
ఖాసీం : కానీ
శివ : నన్ను నమ్మండి చాచా, పెద్ద హోటల్ కడితే చాలు క్యూ కడతారు మన హోటల్ ముందు.
ఖాసీం : డబ్బులు ఉన్నాయి కానీ అవి నా కూతురు పెళ్లి కోసం దాచినవి, ఇప్పుడు అలోచించి చెప్పు నువ్వు ఊ అంటే ముందుకు వెళదాం.
శివ : పెట్టండి చాచా, చెల్లి పెళ్లి మీరు అనుకున్నదానికంటే అంగరంగ వైభవంగా చేద్దాం.
చాచా ఇంకేం మాట్లాడలేదు, అప్పటికప్పుడు ఎవరికో ఫోన్ చేస్తే డబ్బు తెచ్చిచ్చారు అక్కడ సాయంత్రం వరకు బ్యాంకు వాళ్ళకి సెటిల్ చేసి ఇప్పుడు ఈ ఏరియా ల్యాండ్ రేట్ ఎంత పలుకుతుందో అంతా ఇచ్చాడు.
తిరిగి హోటల్ కి వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నన్ను చూసి నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు ఆ నమ్మకానికి నేను ఇంకా కష్టపడి పని చెయ్యాలని నిర్ణయించుకున్నాను.
రాత్రంతా హాస్టల్లో మంచం మీద కూర్చుని తరువాత ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని కాలేజీ నోట్స్ తీసి అన్నీ పాయింట్ల ప్రకారం రాసుకుని పడుకున్నాను.
పొద్దున్నే ఐదు గంటలకే మెలుకువ వచ్చింది లేచి రెడీ అయ్యి హోటల్ కి వెళ్లిపోయాను, అందరూ పనులు చూసుకుంటుంటే కౌంటర్ దెగ్గర లైట్ వేసి దేవుడికి దణ్ణం పెట్టుకుని మనసులో శివుడిని తలుచుకుని కౌంటర్ తాళం తెరిచాను.
డెస్క్ కింద ఉన్న హోటల్ డాకుమెంట్స్ తీసి వాటి లింక్ డాకుమెంట్స్ అన్నీ ఒక్కొకటి వెతికి సర్దే సరికి ఎనిమిది అయ్యింది, నన్ను కదిలించకుండా మెయింటనెన్స్ బాధ్యత షఫీర్ తీసుకున్నాడు.
అన్ని డాకుమెంట్స్, చాచా ప్రూఫ్ డాకుమెంట్స్, నేను వచ్చిన దెగ్గర నుంచి హోటల్ ఖర్చులు ఎంత వస్తున్నాయి ఎంత పోతున్నాయి అని లెక్కలు రాస్తున్నాను వాటికి సంబంధించిన అకౌంట్స్ పుస్తకం అన్నీ తీసుకుని చాచాతో పాటు పదకొండు గంటలకి బ్యాంకుకి వెళ్లాను.
అక్కడ వాళ్లు చాచాని చూడగానే పలకరించి వచ్చిన పని తెలుసుకుని ఆనంద పడ్డారు. కావలసిన ప్రూఫ్స్ అన్నీ ఇచ్చిన తరువాత మాములు లోన్ కాకుండా మోర్ట్ గేజ్ లోన్ పెట్టుకోమన్నారు ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయ్యి ఒక్క రోజే అవుతుంది త్వరగా పని అయిపోతుందంటే ఒప్పుకున్నాం.
నేను అకౌంట్స్ మైంటైన్ చెయ్యడం మంచిదయింది, అక్కడే ప్రాసెస్ అన్నీ చూసుకుని వాళ్ళకి కావాల్సిన ప్రూఫ్స్ సంతకాలు చేయించేసరికి నాలుగు రోజులు పట్టింది, లోన్ రాడానికి కనీసం రెండు నెలలన్నా పడుతుంది అన్నారు.
ఇప్పటికే కాలేజీకి వెళ్ళక నాలుగు రోజులవుతుంది తెల్లారి కాలేజీకి వెళ్లాను అందరినీ పలకరించి క్లాస్ లో కూర్చున్నాను రెండో పీరియడ్ లో గగన్ సర్ వచ్చాడు, మమ్మల్ని చదువుకోమని చెప్పి ఆయన కళ్ళు మూసుకుని ఏదో అలోచించడం గమనించాను, ఎందుకో డల్ గా ఉన్నారనిపించింది. నేను ఆయన్ని కదిలివ్వలేదు అంత చనువు నాకు ఉందొ లేదో నాకు ఇంకా అర్ధం కాలేదు.
సాయంత్రం హోటల్ కి వెళ్లాను చాచా కౌంటర్ మీద కూర్చుని ఉన్నాడు, వెళ్లి తన ముందు నిల్చున్నాను.
ఖాసీం : ఏంటి బేటా ఏదో ఆలోచిస్తున్నావ్?
శివ : ఏం లేదు చాచా మా సార్ ఎందుకో వారం రోజులనుంచి డల్ గా ఉంటున్నాడు ఎందుకో తెలియడం లేదు అడుగుదామంటే ఆయన ఇబ్బంది పడతాడేమో అని ఆగిపోతున్నాను, ఎప్పుడు హైపర్ ఆక్టివ్ గా ఉండే ఆయనని అలా చూస్తుంటే బాలేదు.
ఖాసీం : నిన్ను అంత ప్రియం అనుకుంటే నీకు కచ్చితంగా చెప్తారులే. ఇదిగో డబ్బు నిన్న సంఘంలో ఐదు లక్షలు తీసుకున్నాను, లోన్ వచ్చేవరకు ఇవి వాడు ఆ తరువాత ఇది మూసేద్దాము.
శివ : డెస్క్ లోనే ఉంచండి చాచా, అవసరమైనప్పుడు వాడతాను.
అటు నుంచి అటు అడ్డా మీదకి వెళ్లి హోటల్ కి రోజూ వచ్చే టాపి మేస్త్రిని ఒకాయనని కలిసాను, రోజు ఆయనతో రెండు నిముషాలు మాట్లాడడం వల్ల కొంత మంచివాడని తెలుసు, ఆయన దెగ్గర నెంబర్ తీసుకుని మట్టి గురించి మాట్లాడాను.
ఒక రెండు గంటల తరువాత నేను మాట్లాడిన అతను వచ్చి ల్యాండ్ చూసుకున్నాడు, కొంచెం గుంట ప్రదేశం అవ్వడం వల్ల మట్టి ఎక్కువ పడుతుందన్నాడు కనీసం మూడొందల ట్రిప్పులు ఈజీగా అవుతాయి అనే సరికి రేట్ మాట్లాడుకుని మొదలెట్టమని చెప్పాను.
రాత్రి హోటల్లోనే భోజనం చేసేసి షాప్ కెళ్ళి నాలుగు బుల్బులు పది మీటర్ల వైర్ కొనుక్కొచ్చి, స్థలంలో గునపం తీసుకుని నాలుగు రంధ్రాలు చేసి గుంజలు పాతి బుల్బులు కట్టి వైర్ కనెక్షన్ ఇచ్చి చిన్న బుక్, పెన్ తో లారీల కోసం ఎదురుచూస్తున్నాను.
మొదటి టిప్పర్ లారీ రానే వచ్చింది లారీ నెంబర్ రాసుకుని పక్కన ఒక గీత గీసాను అలా ఒకటేమ్మట ఒకటి లారీ వస్తుంటే నెంబర్ రాసుకోడం వాటి పక్కన ప్లస్ వన్ అని రాసుకుంటూ పోతున్నాను.
రాత్రి పదకొండు అవుతుండగా ఏదో కార్ ఒకటి హోటల్ ముందు ఆగింది అందులోనుంచి ఖాసీం చాచా ఎవరో అమ్మాయితో దిగి బ్యాగ్ తో లోపలికి వెళ్ళాడు.
పొద్దున నాలుగింటి వరకు మట్టి పొయ్యడం అయిపోయింది, మూడొందలు అనుకున్నది మూడొందల ఎనభై ట్రిప్పులు అయ్యింది, మధ్యలో లారీ డ్రైవర్లు ఒక్కొక్క ట్రిప్ ఎక్కువ పోసాం అని గొడవ చేసినా వాళ్ళతో గొడవ పడినా మొత్తానికి అనుకున్నట్టుగా ఎగుడు దిగుడు లేకుండా పని పూర్తి చేసాను.
కాళ్ళు పీకుతున్నాయి, నిద్ర ఆగడం లేదు ఒక్కసారిగా లారీల మోత ఆగిపోవడంతో చెవులకి ప్రశాంతంగా ఉంది, హోటల్ కి వెళ్లి అక్కడే బెంచ్ మీదే పడుకుండిపోయాను.