Update 05
హోటల్ ముందుకి కి వెళుతుండగానే మీనాక్షి కి మిస్డ్ కాల్ చేసాను, ఇద్దరు బైటికి వచ్చారు.
శివ : వెళదామా
ముస్కాన్ : నీదే లేట్ భయ్యా
శివ : చిన్న పని అయిపోయింది, ఇదిగో తను నా ఫ్రెండ్ సందీప్ అని పరిచయం చేసాను, మీనాక్షి డ్రైవింగ్ సీట్లో పక్కన ముస్కాన్ వెనక నేను సందీప్ కూర్చున్నాం. కారు బైలుదేరింది.
ముస్కాన్ : భయ్యా లతీఫ్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చారాని చెప్పా కదా
శివ : హా
ముస్కాన్ : నన్ను లతీఫ్ కి అడగడానికి వచ్చారు, బాబా ఆలోచించి చెప్తా అన్నాడు.
శివ : ఇందులో ఆలోచించడానికి ఏముంది వద్దని చెప్పక, (మళ్ళీ వెంటనే తెరుకుని) సారీ ముస్కాన్ ఏదో అలా వచ్చేసింది సారీ, ఇంతకీ నువ్వేం అనుకుంటున్నావు?
ముస్కాన్ : పర్లేదు భయ్యా, నాకూ వాడంటే పడదు
శివ : వద్దులే ముస్కాన్, అది నీకు నీ మెంటాలిటీకి, నీ మంచితనానికి ఆ సంబంధం సెట్ అవ్వదు అనుకుంటున్నాను, అయినా చాచా అన్నీ ఆలోచించే చేస్తాడు కదా
ముస్కాన్ : ఇక్కడే భాభీ, లోపలికి పోనివ్వు.
ముస్కాన్ కార్ లోపలికి పోనిచ్చింది, పెద్దమ్మ ఆఫీస్ ముందే చెట్ల దెగ్గర ఎవరితోనో మాట్లాడుతుంది, నలుగురం దిగి ముందుకు వెళ్ళాము. మమ్మల్ని చూసి నవ్వి తిరిగి వాళ్ళతో మాట్లాడుతుంది.
ముందు ముస్కాన్ ఆ వెనుక సందీప్ ఆశ్రమం చూసుకుంటూ వెళుతుంటే మీనాక్షి నాతొ పాటు నడుస్తుంది.
మీనాక్షి : నువ్వు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి.
శివ : దేనికి?
మీనాక్షి : ఎప్పటికైనా అవసరం పడుతుంది కదా, అదీకాక మనం ఎటైనా ట్రిప్ కి వెళదాం అనుకున్నాంగా దానికి నేను ఒక్కదాన్నే వెళుతున్నా అని ఇంట్లో మా అమ్మని ఒప్పించాలంటే చాలా పెద్ద పని నిన్ను డ్రైవర్ గా పరిచయం చేపిస్తాను.
శివ : ఇవన్నీ గగన్ సర్ కి తెలుసా
మీనాక్షి : ట్రిప్ అని అది అని ఇది అని చివరికి నీ పేరు చెప్పా ఆయనకి అర్ధం అయ్యింది మా ఇంట్లోనే ఒప్పించాలి.
శివ : అవసరమా మరి
మీనాక్షి : అవసరమే ప్లీజ్ ప్లీజ్ వెళదాం.
శివ : చూద్దాంలే
ఇంతలో కావేరి పెద్దమ్మ మాట్లాడుతున్న వాళ్ళని పంపించేసి మా వైపు వచ్చింది, ముస్కాన్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ
కావేరి : ముస్కాన్ బాగున్నావా, శివా ఎప్పుడు రమ్మన్నాను ఎప్పుడు వచ్చారు
ముస్కాన్ : బాగున్నా పెద్దమ్మ
కావేరి : తను..?
శివ : నా ఫ్రెండ్ పెద్దమ్మ, పేరు సందీప్
కావేరి : నమస్కారం బాబు
సందీప్ : నమస్తే అమ్మా
శివ : తను (అని మీనాక్షి చెయ్యి పట్టుకున్నాను)
కావేరి : ఆగాగు, మీనాక్షి కదా
శివ : అవునండి
కావేరి : నీ గురించి చెప్పాడు మీనాక్షి, చెప్పినట్టే కుందనపు బొమ్మల ముట్టుకుంటే మాసిపోయేలా ఉన్నావ్.
మీనాక్షి సిగ్గుపడింది.
ముస్కాన్ : మరి నేనో
కావేరి : నువ్వు కూడా అచ్చా హే ప్యారా ఔర్ కితనా కూబ్ సూరత్ లడ్కి హో
ముస్కాన్ షుక్రియ అని సలాం చేసింది. అందరం నవ్వుకున్నాం
కావేరి : శివా చికెన్ తెప్పించా ఇంట్లోనే ఉంది, నీ చేత్తో వండవూ
ముస్కాన్ : ఏంటి భయ్యాకి వంట వచ్చా
కావేరి : హా వచ్చు, చాలా బాగా చేస్తాడు
ముస్కాన్ : మరి కనీసం ఒక్కసారి కూడా హోటల్లో గరిట పట్టుకోలేదు!
నేను నవ్వి సందీప్ తొ పాటు పక్క సందులో ఉన్న పెద్దమ్మ ఇంటికి వెళ్లాను.
మీనాక్షి : ఇక్కడ చెట్లు చాలా ఉన్నాయి చాలా ప్రశాంతంగా ఉంది, అన్నీ చాలా బాగా చేసారు, మీకు చెట్లంటే ఇష్టమా?
కావేరి : నాకు ఇష్టమే కానీ శివకి చెట్లంటే ప్రాణం. పచ్చదనం, వాగులు చెరువులు జలపాతాలు ఎక్కడ పచ్చదనం ఎప్పుడు వాటి గురించే మాట్లాడతాడు తనకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం చెట్ల గురించి మట్టి గురించి ఎంతసేపైనా మాట్లాడతాడు, ఇక్కడున్న ప్రతీ ఒక్క చెట్టు శివ పెట్టిందే, చిన్నప్పటి నుంచి అంతే ఇప్పుడు కూడా బైటికి అలానే కనిపిస్తాడు కానీ చిన్న పిల్లోడి మనస్తత్వం.
మీనాక్షి : అమ్మా.. శివ గురించి చెప్తారా ఎక్కడ పుట్టాడు ఇక్కడికి మీ దెగ్గరికి ఎలా వచ్చాడు తన గురించి మీకు తెలిసిందంతా నాకూ తెలుసుకోవాలని ఉంది, తనని అడిగితే నవ్వాడు కానీ ఏం చెప్పలేదు.
కావేరి : చెప్తాను కానీ మళ్ళీ వాడికి గుర్తు చెయ్యడం లాంటివి చెయ్యకండి, బాధ పడతాడు.
ముస్కాన్, మీనాక్షి : చెప్పము
కావేరి ముందుకు నడుస్తూ...
సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం నేను పెళ్లి చేసుకుని అత్తారింటికని ఈ ఊరికి వచ్చాను వచ్చిన నెల రోజులకే తెలిసింది నేను మా ఆయన వాళ్ళ కుటుంబం చేతిలో మోసపోయానని.
ఆయనకి పిల్లలు పుట్టరని ముందే తెలిసి కూడా నాకు చెప్పకుండా నన్ను పెళ్లి చూసుకున్నాడు, ఎన్ని రోజులని కప్పిపుచ్చుతారు చివరికి నాకు తెలిసి కోపంలో మా ఇంటికి బైలుదేరాను.
రోడ్ మీదకి వచ్చి బస్సు కోసం ఎదురు చూస్తుండగా ఒకావిడ యూనిఫామ్ లో తల నిండా రక్తంతొ పసికందును ఎత్తుకుని పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లోడిని నాకిచ్చి నా కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ మళ్ళీ వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది తన వెనకాలే పది మంది కత్తులు పట్టుకుని తన వెనక పడుతున్నారు, నాకేం చెయ్యాలో అర్ధం కాలేదు పిల్లోడిని తీసుకుని మా ఇంటికి వచ్చేసాను ఎందుకో నాకు దేవుడు ఇచ్చిన ప్రసాదం అనిపించింది.
ఎంత మంది చెప్పినా వినలేదు వాడిని నా కొడుకుని చేసుకున్నాను, ఎందుకంత పట్టుబట్టాను అంటే ఆవిడ చూసిన చూపు అలాంటిది, పది మంది కత్తులతో వెంటపడుతున్నా తన కళ్ళలో భయంలేదు తన కొడుకు మీద బెంగ తప్ప, తను శివని నా చేతిలో పెట్టి నా కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ వెళ్ళిపోయింది తిరిగి వెళ్ళేటప్పుడు చూసాను నాకింకా గుర్తే నా చేతుల్లో ఉన్న తన కొడుకుని ఒక్క క్షణం చూసి ఏడుపు ఆపేసి కోపంగా పరిగెత్తింది.
ఆ మొహం చూస్తేనే చెప్పొచ్చు ఎంతో నిజాయితీగా మంచిగా ఉంటే తప్ప అలాంటి ఒక గర్వం, తెగింపు మొహంలోకి రావు.
అదీ జరిగింది, తన కొడుకు కోసం ఎప్పటికైనా తిరిగి వస్తుందేమో అన్న చిన్న ఆశతొ ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను తిరిగి మా అత్త వాళ్ళతో కలిసిపోయినా వాళ్ళ మాట వినకుండా శివని నేనే పెంచుకున్నాను, అని కళ్ళు తుడుచుకుని ముగించింది.
ముస్కాన్, మీనాక్షి కూడా ఏడ్చేశారు.
మీనాక్షి : మరి ఈ అనాధఆశ్రమం?
కావేరి : అది నా ఆలోచనే, ఎప్పటికైనా జాబ్ చెయ్యాలనుకున్నాను కానీ మా అమ్మ వాళ్ళు నా మాట వినకుండా నాకు పెళ్లి చేసేసారు, ఆ తరువాత పది సంవత్సరాలకి ఇదే రోడ్డులో ఐదుగురు పిల్లలు అన్నానికి అల్లాడటం చూసి తట్టుకోలేక చేరదీసాను డబ్బు సరిపోక ఇలా చిన్న ట్రస్ట్ లాంటిది తెరిచి చాలా కష్టాలు పడితే చివరికి ఇలా ఆశ్రమంగా మారింది.
శివకి పదేళ్లు నిండే వరకు నా దెగ్గరే పెరిగాడు, కానీ అది మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. శివ ఇక తను కూడా ఆశ్రమంలోనే ఉండి చదువుకుంటానని నన్ను బలవంతంగా ఒప్పించి చివరికి తను ఎలా నా చేతుల్లోకి వచ్చింది తెలుసుకున్నాడు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి ఆశ్రమం నడపడం నా వల్ల కావట్లేదని నా మాట వినకుండా బైటికి వచ్చేసి హోటల్లో జాయిన్ అయ్యాడు అక్కడ నుంచి మీకు తెలుసు.
ముస్కాన్ : పెద్దమ్మా.. మరి మిమ్మల్ని భయ్యా పెద్దమ్మ అని పిలుస్తాడు.
కావేరి : నేనే అలా పిలిపించుకున్నాను, అమ్మా అని పిలిపించుకోవాలని ఉండేది కానీ నాకు శివ వాళ్ళ అమ్మ గుర్తొచ్చి ఆ కోరికని అణుచుకున్నాను.
మీనాక్షి : తను మీకు మళ్ళీ కనిపించలేదా, తన కోసం వెతకలేదా?
కావేరి : లేదు, తను శివని నా చేతుల్లో పెట్టేటప్పటికే చావు బతుకుల్లో ఉంది. ఆ తరువాత తను బతికి ఉంటుందని నేను అనుకోలేదు అందులోనూ నాకు తనని వెతికే సమయం లేకపోయింది.
మీనాక్షి : శివ మీరు ఒంటరిగా ఉంటున్నారని చెప్పాడు?
కావేరి : రెండేళ్ల క్రితం మా ఆయన చనిపోయాడు, నాకు పిల్లలు లేరు ఉన్న ఒకేఒక్క దారం మా ఆయన. ఆయన కూడా లేకపోయేసరికి మా ఆయన వాళ్ళ కుటుంబం వాళ్లు నన్ను వదిలించున్నారు. మా అమ్మ వాళ్లతొ నాకు ఉండాలనిపించలేదు అందుకే ఒంటరిగా ఉంటున్నాను.
ఇప్పుడు డబ్బు శివ పంపిస్తున్నాడు, అప్పుడప్పుడు చిన్న చిన్న డొనేషన్స్ వస్తాయి, ఈ ఆశ్రమం చూసుకుంటూ బతికేస్తున్నాను.
మీనాక్షి : మీరు ఒంటరిగా ఉంటున్నారు కదా అయినా శివ మీ దెగ్గర కాకుండా వేరేగా ఎందుకు ఉంటున్నాడు?
కావేరి : అది నాకు కూడా తెలీదు, బతిమిలాడినా శివ ఒప్పుకోలేదు నన్ను వదిలి వెళ్ళేటప్పుడు వాడు ఎంతగా ఏడ్చి ఉంటాడో నాకు తెలుసు కానీ ఎందుకు నాకు దూరంగా ఉంటున్నాడో నాకూ తెలీదు, వాడు ఎప్పుడు ఏం ఆలోచిస్తాడో ఏ మూడ్ లో ఉంటాడో మనకి తెలీదు. ఏడుపు వచ్చినా వాడి మొహం మీద చిరునవ్వు చెరిగిపోదు అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతాడో.. బహుశా వాళ్ళ అమ్మ జీన్స్ అయ్యి ఉంటుంది.
ఇంతలో శివా, సందీప్ లు ఇద్దరు రావడం చూసి కావేరి మాట్లాడడం ఆపేసింది, మీనాక్షి ముస్కాన్ లు కళ్ళు తుడుచుకుని మాములు అయిపోయారు.
కావేరి : అయిపోయిందా
శివ : ఆ అయిపోయింది, పదండి వెళదాం అంటూనే మీనాక్షి మొహం చూసి ఏమైంది అని సైగ చేసాను, ఏం లేదు అని తల ఊపింది.
నలుగురం పెద్దమ్మ ఇంటికి వెళ్లి భోజనం చేసాం, ముచ్చట్లు పెట్టుకుని అందరం కూర్చున్నాం.
శివ : సందీప్, ఖాసీం చాచా దెగ్గరికి వెళ్ళు బైక్ ఇస్తాడు తీసుకునిరా, తొందర ఏమి లేదు ఏమైనా పనులుంటే చూసుకునిరా
సందీప్ : అలాగే అని వెళ్ళిపోయాడు.
మీనాక్షి ముస్కాన్ ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేను లేచి కిచెన్ లోకి వెళ్లాను పెద్దమ్మ అందరికి కూల్ డ్రింక్స్ పోస్తుంది. వెళ్లి తన పక్కన నిల్చున్నాను.
కావేరి : ఏంట్రా?
శివ : మీనాక్షి నీకు నచ్చిందా?
కావేరి : చాలా మంచి అమ్మాయి, నీకు ఈడైన జోడి. అయినా ఏంటి కొత్తగా అడుగుతున్నావు, నువ్వేం చేస్తున్నావో ఏం తింటున్నావో అస్సలు నీ గురించిన ఒక్క విషయం కూడా నాతో పంచుకోవు, మీనాక్షి గురించి మాత్రం గుచ్చి గుచ్చి అడుగుతున్నావ్.
పెద్దమ్మని వెనక నుంచి కౌగిలించుకుని హాల్లోకి వస్తుంటే, మీనాక్షి చూసింది. మాట్లాడకుండా మీనాక్షిని చూసి బైటికి వెళ్లిపోయాను.
మీనాక్షి లోపలికి వెళ్లి కావేరి పక్కన నిల్చుంది, కావేరి ఏడుస్తుండడం చూసి మాట్లాడింది.
మీనాక్షి : ఏమైంది?
కావేరి కొంగుతో కళ్ళు తుడుచుకుని, నవ్వుతూ
కావేరి : ఏం లేదు, వాడలా నన్ను కౌగిలించుకుని చాలా సంవత్సరాలు దాటిపోయింది. పదా వెళదాం.
రాత్రి వరకు అక్కడే గడిపి బైటికి వచ్చి మీనాక్షిని ముస్కాన్ ని పంపించేసాను. పెద్దమ్మ వాళ్ళకి బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది.
ముస్కాన్ : గుడ్ నైట్ భయ్యా
శివ : గుడ్ నైట్, అని మీనాక్షిని చూసి కెమెరా తెచ్చావా అని అడిగాను.
మీనాక్షి : ఆ తెచ్చాను, ఇదిగో
శివ : బాయ్.
మీనాక్షి చెయ్యి ఊపి కార్ ఎక్కి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్లాను. పెద్దమ్మ టీవీ ముందు సోఫాలో కూర్చుని ఉంది. వెళ్లి పక్కన కూర్చున్నాను.
శివ : ఏం చెప్పావ్ వాళ్ళకి, మొహాలు వేలాడేసుకుని ఉన్నారు.
పెద్దమ్మ నా ఒళ్ళో పడుకుంది, ఏం మాట్లాడలేదు. టీవీ ఆపాను.
శివ : ఎందుకు ఏడుస్తావ్, లే ఇప్పుడేమైందని.
పెద్దమ్మ : నా దెగ్గర ఉండిపో కన్నయ్యా.
చిన్నగా తల నిమురుతూ పడుకోపెట్టాను కొంత సేపటికి పడుకుంది, ఇంతలో బైక్ సౌండ్ అయితే పెద్దమ్మని పక్కకి పడుకోబెట్టి లేచి బైటికి వెళ్లాను సందీప్ బైక్ తీసుకుని వచ్చాడు. లోపలికి వచ్చి పెద్దమ్మ తల కింద దిండు పెట్టి దుప్పటి కప్పి లైట్ ఆపేసి కెమెరా తీసుకుని బైటికి వచ్చాను.
శివ : పెట్రోల్ ఉందా అందులో
సందీప్ : ఉంది
శివ : పదా వెళదాం
సందీప్ : ఎక్కడికి
శివ : చెప్తా పోనీ
ఇద్దరం బైలుదేరి మీనాక్షి వాళ్ళ కంపెనీ వెనక్కి వెళ్లి రోడ్ మీదే ఆపాను.
శివ : ఇక్కడ ఆపు.
సందీప్ : ఇక్కడా? ఈ టైం లోనా?
శివ : ఆ ఆపు ఇంకా టైం అవ్వలేదు.
సందీప్ : సరే
ఒక అరగంటకి ట్రక్ వస్తుంటే నేను చెట్టు వెనకాలకి వెళ్ళాను, నన్ను చూసి సందీప్ కూడా అదే చేసాడు.
శివ : సందీప్ పదా పదా, బండి ఇక్కడే ఉంచు నా వెనకాలే రా అని గోడ వైపుకు నడిచాను.
ఇద్దరం గోడ దెగ్గర నిలబడ్డాము.
శివ : నీ మీద ఎక్కుతాను, కొంచెం ఒంగో
సందీప్ భుజాల మీద నిల్చొని గోడ మీద నుంచి చూసాను పెద్ద గ్రౌండ్ లాగ ఉంది ఆల్రెడీ మూడు ట్రక్స్ వచ్చేసి ఉన్నాయి, నేను వంగోని కెమెరా గోడ మీద పెట్టి దొరికిన సమయంలో ఎన్ని ఫోటోలు తీయ్యాలో అన్నీ తీసి కిందకి దిగి మళ్ళీ బండి దెగ్గరికి వచ్చేసాం.
శివ : నన్ను పెద్దమ్మ దెగ్గర వదిలేసి నువ్వు వెళ్ళిపో, బైక్ నీ దెగ్గరే పెట్టుకో పొద్దున్నే చాచాకి ఇచ్చేద్దాం.
సందీప్ : సరే.
నన్ను పెద్దమ్మ దెగ్గర దింపి సందీప్ వెళ్ళిపోయాడు, ఇంట్లోకి వెళ్లి డోర్ లాక్ చేసి సోఫాలో పడుకున్న పెద్దమ్మని చూసి బెడరూం లోకి వెళ్లి నేనూ పడుకున్నాను.
పొద్దున్నే లేచేసరికి పెద్దమ్మ లేచి పనులు చేసుకుంటుంటే వెళ్లి బ్రష్ చేసుకుని తన పక్కన నిల్చున్నాను. నా చేతికి కాఫీ అందించి తను కూడా తాగుతూ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంది, తన ఎదురుగా కూర్చున్నాను.
శివ : పెద్దమ్మా అలా ఉండకు, నాకేం బాలేదు.
కావేరి : (కళ్ళు తుడుచుకుంది తప్ప ఇంకేం మాట్లాడలేదు)
ఇంతలో మీనాక్షి నుంచి వచ్చిన ఫోన్ చూసి శివ లేచాడు, కావేరి కప్పులు అందుకుని లోపలికి వెళ్ళిపోయింది.
శివ : గుడ్ మార్నింగ్ మేడం.
మీనాక్షి : మార్నింగ్ మార్నింగ్ (అని నవ్వుతూ). నేను, నాన్న నీకోసం వెయిటింగ్, ఆఫీస్ లో ఉన్నాం.
శివ : వస్తున్నా.
కాల్ కట్ చేసి లోపలికి పరిగెత్తి స్నానం చేసి కావేరి పెద్దమ్మ నాకోసం ఇంట్లో ఉంచిన ఇంకో జత బట్టలు వేసుకుని ఆఫీస్ కి బైలుదేరాను. లోపల అంతా సాఫీగానే సాగుతుంది వెళ్లి గగన్ సర్ ని పలకరించి మీనాక్షి కోసం గోడౌన్ దెగ్గరికి వెళ్లాను, అక్కడున్న పనివాళ్ళతో మాట్లాడుతుంది.
శివ : (వెనకగా వెళ్లి) మేడం గారు బిజీగా ఉన్నట్టున్నారు.
మీనాక్షి : (నా గొంతు వింటూనే నావైపు తిరిగింది) హమ్మయ్య వచ్చావా, ఇందాకటి నుంచి నీకోసమే చూస్తున్నాను.
శివ : దేనికి?
మీనాక్షి : నీతో మాట్లాడాలి. (ఏంటా అన్నట్టు చూసాను) ఇప్పుడు కాదు సాయంత్రం కార్ డ్రైవింగ్ నేర్చుకోడానికి రా, అప్పుడు మాట్లాడదాం.
సరే అంటూ వెళ్లి పని చేసుకుంటున్నాను, గంటా గంటన్నరకి సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చారు, అందరూ గుంపు గూడి దీని గురించే మాట్లాడుకుంటున్నారు, నేను నవ్వుతూ పని చేసుకుంటున్నా. మీనాక్షి భయపడుతూ నా దెగ్గరికి వచ్చింది తనతో పాటే ఆఫీస్ దెగ్గరికి వెళ్ళాను, గగన్ సర్ వాళ్ళని కూర్చోపెట్టి మాట్లాడుతున్నారు. లోపలికి వెళుతూనే నోరు తెరిచాను.
శివ : హాయ్ సర్ నేనే మీకు ఫోన్ చేసింది, అని ఆయనని చూస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చాను.
గగన్ సర్, మీనాక్షి ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నన్నే చూస్తున్నారు. వాళ్ళని చూసి సర్ ని పరిచయం చేసాను ఈయన పేరు శంకర్. మన సిటీకి CI, శంకర్ గారు చాలా నిజాయితీ గల హ్యాండ్సమ్ ఆఫీసర్ మాత్రమే కాదు రఫ్ అండ్ టఫ్ కూడా రీసెంట్ గా రేప్ కేసులో నిందితులని ఎన్కౌంటర్ చేసింది సారే, అన్నాను శంకర్ గారిని చూస్తూ.
శంకర్ : థాంక్స్, సారీ నీ పేరు?
శివ : శివ సర్.
శంకర్ : థాంక్స్ శివా, ఇక వచ్చిన పని చూద్దాం. నాకు ఎందుకు ఫోన్ చేసారు?
శివ : సర్ మా కంపెనీలో గత కొన్ని రోజులుగా రా మెటీరియల్ మిస్ అవుతుంది, అలాగే వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసే కాస్టలీ ఫాబ్రిక్ కూడా మిస్ అవుతుంది, దాని గురించి మీకు కంప్లైంట్ చేద్దామనే పిలిపించాము అని పక్కనే నిల్చొని చూస్తున్న గోపాల్ మరియు శ్యామ్ ని చూస్తూ అన్నాను.
శంకర్ : అలాగా, నాకు రెండు రోజులు టైం ఇవ్వండి, ఎవడైనా సరే బొక్కలో వేస్తాను.
శివ : తప్పుగా అనుకోకండి సర్, మీరు సమర్ధులే అని నాకు తెలుసు కానీ మీకు నేను శ్రమ తగ్గించాను, ఒక్క సారి ఈ ఎవిడెన్స్ చూడండి అని పెన్డ్రైవ్ చూపిస్తూ మీనాక్షిని చూసాను, వెంటనే లాప్టాప్ తీసి ముందు పెట్టింది దాన్ని కనెక్ట్ చేసి రాత్రి తీసిన ఫోటోలు, వీడియోలు, స్టాఫ్ వర్కర్స్ నాతో చెప్పినవి రికార్డింగ్స్. మేనేజర్ గోపాల్, అసిస్టెంట్ మేనేజర్ శ్యామ్ చాటు వ్యవహారాలు మాటలు అన్ని శంకర్ గారి ముందు పెట్టాను.
పదిహేను నిమిషాల పాటు ఆఫీస్ లో ఉన్న అందరూ అన్ని విని చూసి పక్కకి చూసేసరికి వాళ్లిద్దరూ జారుకోవడం గమనించి సైగ చెయ్యగానే గోపాల్ ని శ్యామ్ ని అదుపులోకి తీసుకున్నారు, వాళ్లిద్దరూ నన్ను కోపంగా చూడటం గమనించాను.
శంకర్ : ఇంటెలిజెంట్ బాయ్, ముందుగా అన్ని సిద్ధం చేసే నన్ను పిలిచావన్నమాట. పక్కా సాక్ష్యాలతో వాళ్లు తప్పించుకోలేని నాన్ బెయిలెబుల్ అరెస్ట్ ఇది నా సర్వీస్ లో ఇదే మొదటిది, శభాష్.
శివ : థాంక్యూ సర్. అంటునే మీనాక్షిని చూసాను నన్నే ఓరగా కోపంగా చూస్తుంది. చిన్నగా నవ్వాను.
శంకర్ గారు గోపాల్ శ్యామ్ ని తీసుకువెళుతుంటే స్టాఫ్ అడ్డుపడ్డారు, శంకర్ గారు వాళ్ళకి చెప్పి జీప్ ఎక్కించాడు. కానీ గోపాల్ ఈ గ్యాప్ లో వాళ్ళకి ఏం చెప్పాడో ఏమో కానీ నినాదాలు మొదలెట్టారు. అది అరగంట లోపే స్ట్రైక్ గా మారిపోయింది.
గగన్ సర్ మీనాక్షి భయపడుతూ నా వైపు చూసారు.