Update 06

మీనాక్షి భయపడుతూ పక్కకి వచ్చి నిల్చొని నన్ను చూస్తూ నా చెయ్యి పట్టుకుంది. తనని చూసి చిన్నగా నవ్వి కుర్చీలో కూర్చోబెట్టి గగన్ సర్ ని చూసాను, చైర్ లో నుంచి లేచాడు.

శివ : సర్ వర్కర్స్ తో మాట్లాడండి, కంపెనీ కోసం నిలబడేవాళ్లు, పని చేసుకుంటాం అనేవాళ్ళని ఉంచండి, ఇక మాట వినని మిగతావాళ్ళని ఎంత మంది ఉంటె అంత మందిని బైటికి తోసెయ్యండి.

గగన్ : కానీ శివా

శివ : నన్నింకా నమ్ముతున్నారు కదా

మీనాక్షి : (లేచి నా చెయ్యి అందుకుని) మనస్ఫూర్తిగా.

గగన్ : అలాగే శివ నువ్వు చెప్పినట్టే చేస్తాను, అని నీరసంగా బైటికి నడిచాడు.

శివ : సర్, అలా వెళితే వాళ్లే మిమ్మల్ని భయపెడతారు, సీరియస్ గా. మీరు క్లాస్ లోకి ఎలా అడుగుపెట్టేవారో ఒకసారి గుర్తుతెచ్చుకోండి, ఉంటె ఉంటారు లేకపోతే పోతారు మనకి వాళ్ళ అవసరం లేదు. ముందు మీరు ఆ పని చేసుకొని రండి, ఆ తరువాత ఎం చెయ్యాలో అస్సలు ఇదంతా ఎందుకు చేసానో వివరంగా చెప్తాను.

గగన్ ఒక్కసారి షర్ట్ సర్దుకుని గంభీరంగా ఫోజ్ పెట్టి బైటికి నడిచాడు, నేను మీనాక్షి నిల్చొని లోపలినుంచే అద్దం లోనుంచి చూస్తున్నాం. బైట అందరూ మూడు వందల మంది దాకా అందరూ కింద కూర్చుని డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తున్నారు.

గగన్ వాళ్ళ ముందుకి వెళ్ళగానే ఇంకా జోరు పెంచారు.

గగన్ : అందరూ సైలెంట్ గా వినండి, (కొంత సైలెంట్ అయ్యారు ).

వాళ్ళు తప్పు చేసారు జైలుకి వెళ్లిపోయారు బుద్దిగా పనిచేసుకుంటాం అనుకున్నోళ్ళు నాతో పాటు రండి, కాదు కూడదు అనుకుంటే ఇన్ని రోజుల వరకు మీకు రావాల్సిన అమౌంట్ సెటిల్ చేస్తాను గెటౌట్ ఫ్రొం హియర్. ఇంకొక్క మాట కూడా నాకు వినిపించకూడదు అండర్స్టాండ్, అని కోపంగా చూసాడు అంతే అందరూ సైలెన్స్ అయిపోయారు కానీ అందరిలో ఒకడు ఉంటాడు కదా గెలికాడు దాని వల్ల అందరూ నవ్వుతూ వర్కర్స్ లేకపోతే కంపెనీ మూత పడుతుందని హితులు చెప్పబోయారు.

నేను వెంటనే "మీనాక్షి వాళ్ళకి సెటిల్ చెయ్యడానికి డబ్బులు ?"

మీనాక్షి : మనకి వచ్చిన ఆస్తుల్లో కొన్ని డబ్బు రూపంలో కూడా ఇచ్చారు సరిపోతాయి కానీ

శివ : సెటిల్ చేసి వాళ్ళని వదిలించుకో, వాళ్ళు వర్కర్స్ కాదు పందికొక్కులు ఉంచితే మొత్తం తినేస్తారు, అందులో ఒక పది మంది పేర్లు చెప్తాను రాసుకో వాళ్ళని మాత్రం వదలద్దు, అత్యాశకి పోకుండా ఇక్కడే సంవత్సరాలుగా నిజాయితీగా పనిచేస్తున్నారు.

మీనాక్షి : అలాగే.

బైట గగన్ : ఇంకే వెళ్ళండి.

"మా డబ్బులు మాకు సెటిల్ చేసేవరకు అడుగు కూడా బైటికి పడదు" అరిచాడెవడో గుంపులోనుంచి.

గగన్ సర్ కోపంగా లోపలికి వచ్చాడు.

మీనాక్షి : నేను బ్యాంకు కి వెళ్ళొస్తాను.

గగన్ : నేనూ వస్తాను.

శివ : మీరు ఆ పని మీద ఉండండి, నాకొక చిన్న పని ఉంది రెండు గంటల్లో అందరం మల్లి ఇక్కడే కలుద్దాం.

మీనాక్షి గగన్ సర్ వాళ్ళు వెళ్ళిపోగానే, ఫోన్ తీసాను.

శివ : సందీప్ ఎంత వరకు వచ్చింది.

సందీప్ : అయిపోవచ్చింది, సాయంత్రం ఐదు గంటల లోపు నీ ముందు ఉంటాను.

శివ : అలాగే అని ఫోన్ పెట్టేసి వెంటనే పెద్దమ్మకి ఫోన్ చేసాను.

కావేరి : చెప్పు శివా

శివ : ఎక్కడున్నావ్?

కావేరి : ఇంట్లోనే

శివ : రెడీ అవ్వు నీతో చాల పని ఉంది, వస్తున్నా.

వెంటనే చాచా దెగ్గరికి వెళ్ళాను. అక్కడ బండి తీసుకుని ముస్కాన్ తో మాట్లాడాను.

శివ : బిజీ నా?

ముస్కాన్ : లేదు భయ్యా, చెప్పు.

శివ : చాలా పని ఉంది, నువ్వు మన హోటల్ నుంచి మనందరికీ ఏడుగురికి బిర్యానీ తీసుకొని మధ్యానానికల్లా కంపెనీ దెగ్గరికి వచ్చేయి, చాచాకి చెప్పాను.

ముస్కాన్ : అలాగే ఒంటి గంటకల్లా నీ ముందు ఉంటాను.

శివ : నేను వెళుతున్నా, ఆ మర్చిపోయా నాకు బైక్ కీస్ ఇవ్వు, పెద్దమ్మని కూడా తీసుకెళ్లాలి.

ముస్కాన్ : ఒక్కనిమిషం (అంటూ లోపలి వెళ్ళి కీస్ తెచ్చి నా చేతికిచ్చింది)

అక్కడనుంచి నేరుగా పెద్దమ్మ దెగ్గరికి వెళ్లి తనని ఎక్కించుకుని కంపెనీ ఆఫీస్ దెగ్గర దింపి అన్ని చూపించి ఏమేం చెయ్యాలో అన్ని చెప్పి, వేరే రూంలోకి వెళ్లి మీనాక్షి పర్సనల్ లాప్టాప్ ఓపెన్ చేసాను పాస్వర్డ్ పెట్టి ఉంది మీనాక్షి అని టైపు చేసాను ఓపెన్ అవ్వలేదు, నవ్వుకుని మీనాక్షిశివ అని టైపు చేసాను ఓపెన్ అయింది.

దుబాయ్ కి సంబందించిన ఇంపోర్ట్ కంపెనీకి మెయిల్ పెట్టాను, అరగంటకి రిప్లై వచ్చింది. సాయంత్రం ఐదు గంటలకి మీటింగ్ ఆరెంజ్ అయినట్టు కన్ఫర్మేషన్ వచ్చింది. లాప్టాప్ మూసేసి బైటికి వచ్చి పెద్దమ్మని చూసాను. కంపెనీకి సంబంధించిన రికార్డ్స్ అన్నీ తిరగేస్తుంది. మీనాక్షికి ఫోన్ చేసాను.

మీనాక్షి : చెప్పు శివా

శివ : నాకొక సూట్ కావాలి.

మీనాక్షి : ఇంకా ?

శివ : నువ్వు కూడా ఒకటి వేసుకో, మీటింగ్ ఉంది.

మీనాక్షి : ఏం మీటింగ్?

శివ : అన్నీ చెప్తాను, మీ పని ఎంతవరకు వచ్చింది?

మీనాక్షి : ఇంకో అరగంట అంతే.

శివ : సరే అయితే.

ఫోన్ పెట్టేసి పెద్దమ్మ పక్కన కూర్చుని ఎంప్లాయ్ లిస్ట్ తీసి చూస్తున్నాను, సంతోషకరమైన విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు జీతాలు మాత్రం తీసుకుంటూనే ఉన్నారు ఎవ్వరికి పెండింగ్ లేదు, ఈ నెల జీతాలు సర్దితే చాలు. పిఎఫ్ ఎలాగో వాళ్ళకే ఉంటుంది కాబట్టి పెద్దగా టెన్షన్ పడనవసరం లేదు.

కొంతసేపటికి మీనాక్షి వాళ్ళు వచ్చాక, అందరికి ఏమేం చెయ్యాలో అన్ని వివరించాను. గగన్ సర్, పెద్దమ్మ పెద్దవాళ్ళు అవ్వడంతో కొంచెం ఇబ్బంది పడ్డా వాళ్ళు కూడా నేను చెప్పేది త్వరగానే అర్ధం చేసుకున్నారు.

మీనాక్షి : నాన్నా, తను కావేరి శివ వాళ్ల అమ్మగారు. అనాధ ఆశ్రమం నడుపుతున్నారు నా ఇన్స్పిరేషన్ లిస్ట్ లో చేరిన మొదటి మహిళ కావేరి గారు. అంటూ పరిచయం చేసింది.

గగన్ : నమస్కారం

కావేరి లేచి నవ్వుతూ నమస్కారం చేసి మళ్ళీ పనిలో పడిపోయింది. ఈ లోగా ముస్కాన్ కూడా వచ్చేసింది. పెద్దమ్మ ముస్కాన్ ఎవరికీ ఎంత ఇవ్వాలో సెటిల్ చేసి మీనాక్షికి ఫైల్ ఇస్తే, గగన్ సర్ మీనాక్షి చెప్పినట్టు వాళ్ళకి డబ్బులు పంచి అకౌంట్ క్లోజ్ చేస్తున్నాడు. అలా అందరిని సెటిల్ చేస్తుండగా మధ్యలో సర్ ఫోన్ రింగ్ అయ్యేసరికి లేచి నిల్చున్నాడు.

మీనాక్షి : ఏమైంది నాన్నా?

గగన్ : మీ అమ్మమ్మ రాజేశ్వరి.

మీనాక్షి : ఎవరో అన్నీ అప్పుడే మోసేసి ఉంటారు, ఇప్పుడు ఎలా?

ఇద్దరు ఆలోచనలో పడ్డారు, ఇంతలో ఫోన్ మల్లి రింగ్ అయింది.

శివ : ఏంటి భయపడుతున్నారా, అంతకాడికి ఇవ్వన్నీ ఎందుకు. సర్ మీరు ఆ ఫోన్ ఈ రాత్రి వరకు ఏత్తకండి, అస్సలు ఇక్కడ ఎం జరుగుతుందో ఎవ్వరికి తెలియనవసరం లేదు.

గగన్ : కానీ శివా

శివ : మీనాక్షి ఆ ఫోన్ సైలెంట్లో పెట్టి పక్కకి పారేసి నీ పని చూసుకో.

మీనాక్షి నేను చెప్పినట్టుగానే చేసి నా పక్కకి వచ్చి నిల్చుంది. ఏంటన్నట్టు చూసాను.

మీనాక్షి : ఏంటి నువ్వు మా ఇద్దర్ని డామినెట్ చేస్తున్నావా ?

శివ : అయ్యో సారీ మీనాక్షి, నేను...

గగన్ సర్, మీనాక్షి ఇద్దరు నవ్వారు. నేను వాళ్లిద్దరినీ చూసేసరికి మీనాక్షి "ఊరికే అన్నాలెవోయి కానీ కానీ" అని నవ్వుకుంటూ వెళ్లి పనిలో పడింది, నేనూ నవ్వుకున్నాను నా నోటిదూలకి.

అక్కడున్న మూడు వందల మందికి సెటిల్ చేసి అందరిని పంపించేసరికి సాయంత్రం ఐదు అయ్యింది, నాకు మీటింగ్ గుర్తొచ్చి మీనాక్షిని పిలిచాను.

మీనాక్షి : నువ్వు పేర్లు రాసిచ్చిన ఎనిమిది మంది ఇక్కడే ఉన్నారు, నాన్న వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడాడు, నువ్వు వెళ్ళు నేను వాళ్ళతో మాట్లాడి పంపించి మధ్యలో జాయిన్ అవుతాను. బట్టలు ఆ కేబిన్ లో ఉన్నాయ్ చూడు.

శివ : మీటింగ్ సంగతి నేను చూసుకుంటాలే ముందు నువ్వు అన్నం తిను ముస్కాన్ తీసుకొచ్చింది, అందరూ తినెయ్యండి అని ఫ్లోలో మాట్లాడుతూ పని వల్ల చెమటతొ ఉన్న తన మొహం మీదకి వచ్చిన కురులని చెవి వెనక్కి సర్దుతూ నుదిటి మీద ముద్దు పెట్టుకుని లోపలి పరిగెత్తాను.

లోపలికి వెళ్లి లాప్టాప్ ఓపెన్ చేసాకగాని గుర్తురాలేదు, అక్కడ అందరి ముందు మీనాక్షిని ముద్దు పెట్టుకున్నానని. ఛా అని తల కొట్టుకుని ఇప్పుడు ఇక చేసేది ఏం లేక నన్ను నేనే తిట్టుకుంటూ మీటింగ్ లింక్ ఓపెన్ చేసాను.

ఇక్కడ మీనాక్షి ఇంకా షాక్ లోనే ఉండిపోయింది, శివ అలా ముద్దు పెట్టేసరికి, తేరుకుని పక్కన ఉన్న ముస్కాన్ ని చూసింది. ముస్కాన్ నవ్వుతుంటే పెద్దమ్మ తల దించుకుని నవ్వు ఆపుకుంటుంది, మొహమాటంగా వెనక్కి తిరిగి గగన్ ని చూసింది. గగన్ నడుము మీద రెండు చేతులు వేసుకుని మీనాక్షిని చూస్తూ నవ్వుతుంటే సిగ్గుగా వెళ్ళి తన నాన్నని వాటేసుకుంది.

మీనాక్షి : నాన్నా, నవ్వకు.

గగన్ : సర్లే ఇప్పుడు నేనేం అన్నాను, చూడు నువ్వే ఎలా సిగ్గుపడుతున్నావో అని బుగ్గ మీద ముద్దు పెట్టాడు.

ముస్కాన్ టేబుల్ మీద పేపర్ ప్లేట్స్ లో బిర్యానీ వడ్డిస్తూ అందరినీ పిలిచింది భోజనానికి. అందరూ చేతులు కడుక్కుని కూర్చున్నారు.

కావేరి : మీనాక్షి నువ్వు రా

మీనాక్షి : లేదు మీరు తినండి నేను కొంచెం ఆగి తింటాను.

గగన్ నవ్వుతూ చూస్తుంటే, ముస్కాన్ "భయ్యాతో కలిసి తింటుందేమోలే పెద్దమ్మా అలా పిలవకండి" అని నవ్వింది.

మీనాక్షి గగన్ ని చూస్తూ "లేదు నాన్న, మనకోసం అంత కష్ట పడుతుంటే తను తినకుండా ఎలా తినను, ఆయన వచ్చాక తింటాను మీరు తినండి".

గగన్ : ఆయన వచ్చాకే తిను, సరేనా.

మీనాక్షి : పొ నాన్నా, అంటూ మొహం చేతులతో చాటేస్తూ సిగ్గుపడుతూ బైటికి పరిగెత్తింది.

అందరూ మీనాక్షి సిగ్గుని చూస్తూ ఎవరికి వాళ్ళు నవ్వుకుంటూ తింటున్నారు.

మీటింగ్ అవ్వగొట్టి వాళ్ళని ఒప్పించేసరికి గంటన్నర పట్టింది, నాకు తలనొప్పి కూడా వచ్చేసింది, టైం చూస్తే ఏడు అయిపోయింది, లాప్టాప్ స్క్రీన్ ముసేసి సూట్ పక్కన పడేసి కిటికీ తెరిచి చూసాను చీకటి పడింది. చిన్నగా రూంలో నుంచి తొంగి చూసా ఎవ్వరూ కనిపించలేదు ఇక అస్సలు పని బాలన్స్ ఉండిపోయిందని గుర్తొచ్చి ఫోన్ తీసి సందీప్ కి కాల్ చేసాను.

సందీప్ : శివ నేను రెడీ.

శివ : ఏమైనా తిన్నావా అస్సలు?

సందీప్ : లేదు, తింటాను.

శివ : అంతా రెడీనే కదా?

సందీప్ : ఆ రెడీ, నా పని మొత్తం అయిపోయింది.

శివ : సరే, ఇక అందరినీ పంపించేసేయి. ఇవ్వాళ పని అయిపోవాలనుకున్నాం కానీ ఇవ్వాలె అవ్వాలనేం లేదు కదా, మిగతావి రేపు చూసుకోవచ్చు ముందు పక్కన అక్కడ ఏ హోటల్ ఉంటే అక్కడికి వెళ్లి తినేసేయి నేను హాస్టల్ కి వచ్చాక మాట్లాడుకుందాం.

సందీప్ : అలాగే శివ.

శివ : సరే, బై.

ఫోన్ పెట్టేస్తూనే బైటికి వచ్చాను, తల ఎత్తి చూసాను మీనాక్షి ఎదురుగా నన్నే చూస్తుంది. తన చెయ్యి పట్టుకున్నాను.

శివ : సారీ, ఇందాక నేను కావాలని చెయ్యలేదు, అదీ..

మీనాక్షి : (ప్రేమగా చూస్తూ) ష్... ముందు తిందువు పదా.

శివ : హా, పదా చాలా ఆకలిగా ఉంది.

మీనాక్షి : అటు కాదు అది చల్లగా అయిపోయి గట్టిగా ఉంది, ఇంకోటి తెప్పించాను ఇటు రా

వెంటనే వెళ్లి టేబుల్ మీద కూర్చున్నాను, మీనాక్షి వడ్డించగానే వేగంగా ప్లేట్ అందుకుని ముద్ద నోట్లో పెట్టుకుంటూనే ఆగిపోయాను.

శివ : నువ్వు తిన్నావా?

మీనాక్షి ఏం మాట్లాడలేదు, నా చెయ్యి నాకు తెలీకుండానే తన వైపు వెళుతుంటే ఆగిపోయాను పెట్టాలా వద్దా అని ఒకసారి చుట్టూ చూసాను ఎవ్వరు లేరు, ఈలోపే మీనాక్షి నా చెయ్యి పట్టుకుని తన నోటి దెగ్గరికి తీసుకుంది నన్ను చూసి నవ్వుతూ, తినిపించాను.

శివ : ఎందుకు తినలేదు?

మీనాక్షి : అప్పుడు ఆకలి అవ్వలేదు.

శివ : నిజంగా?

మీనాక్షి : నిజంగా

శివ : ఇంతకీ అందరూ ఏరి?

మీనాక్షి : నాన్న బైటికి తీసుకెళ్లాడు, కొంచెం రెస్ట్ కోసం చల్లగాలికి ఫ్రెష్ అవుతారని.

ఇంతలో మీనాక్షికి ఎక్కిళ్ళు వస్తే లేచి వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చాను, తాగి నన్నే చూస్తుంది.

శివ : ఏంటి?

మీనాక్షి : శివా... (అని పిలిచి నేను పెట్టిన అన్నం ముద్ద తింటుంది)

శివ : ఆ

మీనాక్షి : నన్ను జీవితాంతం ఇలానే చేసుకుంటావా?

నేను నోట్లో పెట్టుకునే ముద్ద నోటి దెగ్గరే ఆగిపోయింది, మీనాక్షిని చూసాను.

శివ : నేను ఎప్పుడు ఆలోచించి చెయ్యను మీనాక్షి, ఇంతకముందుది కూడా నాలోనుంచి వచ్చిందే కానీ ముందు ప్లాన్ చేసింది కాదు, నేను ఎప్పటికీ అలానే ఉంటానో లేదో నాకు తెలీదు కానీ నీకు ఇలా నేను నచ్చి ఉంటే మాత్రం నా క్యారెక్టర్ ని మార్చుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. కానీ ఒక్కటి నిన్ను అస్సలు వదులుకోను. ఐ ప్రామిస్.

మీనాక్షి నా ఒళ్ళోకి వచ్చి వాటేసుకుంది, అలానే కూర్చుని ఉండేసరికి తనకి తినిపించి నేనూ తిన్నాను, ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండగా కార్ వచ్చిన సౌండ్ విని విడిపడ్డాము, నేను చెయ్యి కడుక్కుందామని వెళుతుంటే సర్ వాళ్ళు ఎదురు వచ్చారు ముస్కాన్ చేతిలో ఐస్ క్రీం డబ్బా ఉంది, నవ్వుతూ వెళ్లి కడుక్కుని వచ్చేసరికి అందరూ కూర్చుని ఐస్ క్రీం తింటూ మాట్లాడుకుంటున్నారు, నేనూ వెళ్లి ముస్కాన్ పక్కన కూర్చున్నాను నాకు కప్ లో వేసి ఇచ్చింది.

గగన్ : శివ, ఏదో చెప్తా అన్నావు, చెప్పు శివ సస్పెన్స్ తట్టుకోలేకున్న.

శివ : తరువాత మాట్లాడుకుందాం సర్, ముందు నేను పెద్దమ్మని, ముస్కాన్ ని దించాలి ఇప్పటికే లేట్ అయిపోయింది, అక్కడ చాచా వాళ్లు తనకోసం ఎదురు చూస్తూ ఉంటారు.

గగన్ : పర్లేదు శివ డ్రైవర్ ఉన్నాడు, (అని డ్రైవర్ ని పిలిచాడు, అటు వెళ్లి తనతో ఏదో మాట్లాడుతున్నాడు)

పెద్దమ్మని చూసాను.

శివ : మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను.

ముస్కాన్ : (కోపంగా) భయ్యా.

పెద్దమ్మ తల మీద మొట్టింది, నవ్వాను.

శివ : నేను డ్రాప్ చెయ్యనా, కార్ లో వెళతారా?

పెద్దమ్మ : వెళతాలే శివ, ఇప్పటికే అలిసిపోయావు, నేను కూడా అని నవ్వింది.

కొంతసేపు మాట్లాడుకుని, ముస్కాన్ ని పెద్దమ్మని పంపించేసాను. కార్ ఎక్కి కూర్చున్నారు బైట నుంచే చూస్తూ

శివ : పెద్దమ్మ ముందు ముస్కాన్ దిగిన తరువాత నువ్వు ఇంటికి వేళ్ళు.

పెద్దమ్మ : రేయి పొద్దున నుంచి చెప్పింది విన్నానని ఓవర్ చెయ్యకు, నాకే జాగ్రత్తలు చెప్తున్నావా, బాబు నువ్వు పోనీ (అని డ్రైవర్ కి చెప్పింది)

ముస్కాన్ నవ్వుతుంటే, నేను నవ్వుతూ బై చెప్పి మీనాక్షితొ పాటు వెనక్కి తిరిగి వచ్చేసాను.

గగన్ సర్ నా కోసం ఎదురు చూస్తుంటే వెళ్లి పక్కన కూర్చున్నాను, మీనాక్షి కూడా నా పక్కన కూర్చుని నన్ను చూస్తుంటే.

శివ : ఈ కంపెనీ ఇలా అవ్వడానికి కారణం సుశాంత్.

గగన్ : ఏ సుశాంత్?

శివ : మీ పెద్దల్లుడు సుశాంత్, ఈ కంపెనీ మీ చేతికి రాకముందు తనే ఇండైరెక్ట్ గా నడిపేవాడు, ఎవ్వరికీ తెలీదు ఆ గోపాల్ మరియు శ్యామ్ ఇద్దరు మీ అల్లుడు మనుషులే తనతో పాటు చదువుకున్న కాలేజీ ఫ్రెండ్స్.
Next page: Update 07
Previous page: Update 05