Update 07
గగన్ : మొదటి నుంచి చెప్పు శివా (అని మధ్యలో కదిలించేసరికి శివ మళ్లీ మొదలుపెట్టాడు)
శివ : కంపెనీ మీ మావయ్య గారి ఆరోగ్యం బాగోలేనప్పుడో మరి ఎలానో నాకు తెలీదు కానీ ఈ కంపెనీ సుశాంత్ చేతుల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇండైరెక్ట్ గా ఎవ్వరికీ తెలీకుండా ఇక్కడున్న మేనేజర్స్ ని తీసేసి తన ఫ్రెండ్స్ అయినా గోపాల్ ని శ్యామ్ ని పెట్టుకున్నాడు.
ఇక ముగ్గురు కలిసి డబ్బులు దున్నుకోడం మొదలుపెట్టారు, నేను సుశాంత్ ని ఒక రోజు ఫోలో అయ్యాను తనకి డబ్బులు తాగుళ్ళకి, అమ్మాయిలకి, పేకాటకి, క్రికెట్ బెట్టింగులకి అవసరం అందుకు తనకీ ఎంత కావాలో అంతే తీసుకునేవాడు కానీ ఈ గోపాల్, శ్యామ్ లు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు, అందులోనూ ఈ ఇద్దరు బావ బామ్మర్దుల వరస. వాళ్ల చుట్టాలని తెలిసిన వాళ్ళని కంపెనీ తమ కంట్రోల్లో ఉంచుకోడానికి అందరినీ వాళ్ళకి సంబంధించిన వాళ్లనే ఎంప్లాయిస్ గా పెట్టుకున్నారు, అందరూ కలిసి కంపెనీ లాభాలు దున్నుకుంటూ బాగానే సంపాదించారు. అందుకే పొద్దున వాళ్ళని అరెస్ట్ చెయ్యగానే అందరూ కలిసి అంత ఎత్తుకు ఎగిరారు. ఇక ఆ సుశాంత్ కి అవసరమైనప్పుడల్లా డబ్బు ముడుతుండడంతొ వీటన్నిటిని పట్టించుకోకుండా తన జల్సాల్లో తను ఉన్నాడు.
(మీనాక్షి, గగన్ ఇద్దరూ విని నోరేళ్ళబెట్టారు)
మీనాక్షి : అందుకే నాన్నా మనకి ఈ కంపెనీ అమ్మమ్మ ఇస్తుంటే వద్దని మొండికేసాడు నేను మనకింకా సపోర్ట్ గా ఉన్నాడేమో మనకి లాభాల్లో ఉన్న కంపెనీ ఇప్పిస్తాడేమో అనుకున్నాను, తన ఇన్కం మీద దెబ్బ పడుతుందని జాగ్రత్త పడబోయాడు కానీ అమ్మమ్మ వినలేదు.
గగన్ ఆలోచిస్తూ అవునన్నట్టు తల ఊపి శివ వైపు చూసాడు.
శివ : కంపెనీ తన చేతిలోకి వచ్చాక, చిన్నగా లాభాలు తగ్గించాడు ఆ తరువాత మన ప్రోడక్ట్ మీద మొగ్గు చూపడంలేదని అందరిని నమ్మించాడని గోపాల్ మాటల ద్వారా తెలిసింది. లోకల్ ఇండియా బ్రాండ్స్ వరకు అమ్మేసి ఆ లాభాలను అకౌంట్స్ లో జీతాలకి ఖర్చులకి టాల్లి చేసి బాలన్స్ చేశారు. గ్లోబల్ గా ఎక్స్పోర్ట్ చేసే అస్సలైన కాస్టలీ ఫాబ్రిక్ ని మాత్రం బైట దుబాయ్ వాళ్ళకి అమ్మేస్తున్నాడు.
నాలుగు రోజుల క్రితం గోపాల్ కి తెలీకుండా తన పెన్డ్రైవ్ తీసి అందులోని ఫైల్స్ కాపీ చేసి చూసాను, దుబాయ్ లో ఉన్న ఒక బ్లాక్ గ్యాంగ్ కి అమ్మేస్తున్నాడు, ఇవ్వాళ జరిగిన మీటింగ్ దాని గురించే. దుబాయ్ లోని మీ మావయ్య గారు బిజినెస్ చేసే పాత కంపెనీకి మెయిల్ పెట్టి వాళ్ళకి జరిగింది వివరించాను మన కంపెనీలో ఉన్న లోపాలని గుర్తించామని, కొత్త స్టాఫ్ ని పెట్టుకున్నామని ఇక నుంచి పర్ఫెక్ట్ గా బిజినెస్ చేద్దామని చెప్పాను, వాళ్ళు మళ్లి మనతో బిజినెస్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు.
సో ఇక మనకి ఒక ప్రాబ్లెమ్ తీరింది, ఇక ఢిల్లీలో మన దెగ్గర కొన్ని సంవత్సరాలుగా రా మెటీరియల్ సప్లై చేస్తున్న వాళ్ళు, నాలుగు నెలలుగా సప్లై చెయ్యడంలేదు, మెయిల్ చేసినా రిప్లై ఇవ్వలేదు. ఢిల్లీ వెళ్లి వాళ్ళని లైన్ లో పెట్టాలి. మన దెగ్గర కొనే రెగ్యులర్ వాళ్ళందరిని మళ్లి కలుపుకోవాలి. ఇంకా చాలా పనులున్నాయి, మనకి లోకల్ సపోర్ట్ లేదు వాళ్ళని మచ్చిక చేసుకోవాలి. వాళ్ళతో స్నేహంగా మెలిగితేనే అస్సలైన బిజినెస్.
ఈ కంపెనీకి చాల మంచి పేరు ఉంది దాన్ని మొత్తం సర్వ నాశనం చేశారు, మల్లి దీనికి పూర్వ వైభవం తీసుకు రావాలి, తీసుకొస్తాను. కచ్చితంగా లాభాలు వస్తాయి అని మాట్లాడుతూనే లేచి నిల్చున్నాను.
శివ మాటలకి గగన్, మీనాక్షి ముందు ఆనందపడ్డా, తరువాత గగన్ మాత్రం వెంటనే తన సందేహం బయట పెట్టడము.
గగన్ : అన్నీ ఓకే శివా, కానీ ఇప్పుడు ,మన దెగ్గర అస్సలు ఎంప్లాయిస్ లేరు కదా, మనం ఎం చెయ్యాలన్నా వర్కర్స్ లేకుండా ముందడుగు ఎలా వెయ్యడం?
శివ : ఎంప్లాయిస్ వస్తారు, రేపు పొద్దున్న పది గంటలకి వచ్చేయండి, మన కొత్త స్టాఫ్ ని పరిచయం చేస్తాను.
(ఆ మాటకి మీనాక్షి గగన్ ఆశ్చర్యంగా చూసారు, మీనాక్షికి గత పది రోజులుగా కనీసం శివ ఎందుకు ఫోన్ చెయ్యట్లేదో అప్పుడప్పుడు ఫోన్ చేసినా ఎందుకు ఎత్తడం లేదో అర్ధమైంది)
మీనాక్షి : ఒక్కడివే ఎలా చేస్తున్నావ్ ఇవన్నీ, మాకు మాత్రం ఏమి కనిపించటంలేదు ఏం జరుగుతుందో తెలీట్లేదు, పనులు మాత్రం జరుగుతున్నాయి.
శివ : నేను ఇక్కడ పనికి చేరిన క్షణం నుంచే అన్నీ గమనించడం మొదలుపెట్టాను, రెండోరోజు నుంచే ఎం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అన్ని ప్లాన్ చేసి పెడుతున్నాలే.
మీనాక్షి : ఆ బుర్రలో ఇంకా ఏమేమి ఉన్నాయో సస్పెన్సులు ఇవ్వకుండా అన్నీ చెప్పొచ్చు కదా.
దానికి నేను గగన్ సర్ ఇద్దరం నవ్వాము.
మీనాక్షి : నాన్నా ఇంటికి వెళ్తే మరి అమ్మమ్మకి ఎలా, ఏమని చెప్పాలి?
గగన్ సర్, మీనాక్షి ఇద్దరు నా వైపు చూసారు.
శివ : నన్ను చూడకండి, అది నాకు సంబంధం లేని విషయం.
గగన్ : అది నేను చూసుకుంటాలే, ఇప్పటికే లేట్ అయ్యింది శివ రేపు కలుద్దాం. మీనాక్షి పదా వెళదాం.
అక్కడనుంచి వాళ్ళని పంపించేసి ముస్కాన్ కి ఫోన్ చేసాను, ఆ తరువాత పెద్దమ్మకి ఫోన్ చేసాను.
కావేరి : పడుకోడానికి వస్తున్నావా?
శివ : లేదు హాస్టల్ కి వెళ్ళిపోతా, సరే పడుకో నేను రేపు మాట్లాడతా.
కావేరి : గుడ్ నైట్.
శివ : హ్మ్.
చాచా బండి మీద హాస్టల్ కి వెళ్లి టీ షర్ట్ మార్చుకుని పక్కన మంచం మీకహ పడుకున్న సందీప్ ని చూసాను,అలిసిపోయి పడుకున్నాడు. నేను కూడా, మంచం మీద అలా ఆనుకోగానె నిద్ర పట్టేసింది.
ఇటు మీనాక్షి, గగన్ లు కార్ ఇంటి గ్యారేజ్లో పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లారు, ఆ ఇంటికి తగ్గట్టే పెద్ద హాలు, ఎంత పెద్దదంటే ఒక పెద్ద సినిమా హాల్ అంత. ఇంట్లో ఉన్న అందరూ గగన్ రాక కోసమే చూస్తున్నారు. గగన్ కూడా అన్ని ఆలోచిస్తూనే మెట్లు ఎక్కుతూ ఇంటి లోపలికి వెళ్ళాడు.
మీనాక్షి ముందుగా లోపలికి వెళ్లి హాల్లో సోఫాలో కూర్చున్న తన అమమ్మ రాజేశ్వరిని చూసి ఆగిపోయింది. తన పక్కనే మీనాక్షి వాళ్ళ అమ్మ రజిత, ఆ పక్కనే మీనాక్షి మావయ్యలు అత్తలు అందరూకూర్చుని ఉన్నారు. మిగతా పిల్లలు, మీనాక్షి ఇద్దరు బావలు వదినలు తన తమ్ముడు పైకి వెళ్లే మెట్ల మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు, సుశాంత్ కోపంగా ఉన్నాడు.
గగన్ లోపలికి నడిచి మీనాక్షి పక్కన నించొని ఎదురుగా ఉన్న రాజేశ్వరిని చూసాడు, ఇద్దరినీ కోపంగా చూస్తుంది, మీనాక్షి సుశాంత్ ని చూసింది, కోపంగా వాళ్ళ వైపే చూస్తూ పళ్ళు కోరుకుంటున్నాడు, మీనాక్షి మొహం మీదకి నవ్వు వచ్చింది అది చుసిన ఆ ఇంట్లో అందరిలోకల్లా పెద్దది ఎదురు లేనిదీ, అరవై ఏళ్ళ వయసులో డబ్బుతొ వచ్చిన పొగరులో ఉన్న రాజేశ్వరి కోపం నషాళానికి అంటింది.
రాజేశ్వరి : ఎవడా శివ?
రాజేశ్వరి : చెప్పు గగన్, ఎవడు వాడు ఏదేదో చేస్తున్నాడు, ఏంటి కధ?
మీనాక్షి వెంటనే "తను డ్రైవర్" అంది.
రాజేశ్వరి : డ్రైవరా ?
మీనాక్షి : అవును అమ్మమ్మ, నేనే పెట్టుకున్నాను.
రాజేశ్వరి : మరి కంపెనీ పనులు ఎందుకు చేస్తున్నాడు.
మీనాక్షి : నేను చెప్తే చేస్తున్నాడు, వాళ్ళ పని అదే కదా ఓనర్ ఏది చెప్తే అది చెయ్యడం. అంతే కదా మమ్మీ?
రాజేశ్వరి : అంతేనా గగన్, అంటే ఇదంతా మీ పనేనా? ఒక్క రోజులో కంపెనీని రోడ్డుకి లాగేసారు, ఉన్న ఎంప్లాయిస్ స్ట్రైక్ చేస్తే తెలివిగా ఆపాల్సింది పోయి మీరే వాళ్ళని బైటికి వెళ్ళగొట్టారట.
అప్పటికే అలిసిపోయి ఉన్న మీనాక్షికి రాజేశ్వరి మాటలు వినగానే చిర్రెత్తుకొచ్చింది.
మీనాక్షి : అవును, అయితే ఏంటి? కంపెనీ ఇప్పుడు మా చేతుల్లో ఉంది నేను ఏదో ఒకటి చేసుకుంటాను లాభమో నష్టమో మాకే కదా, అయినా ఏదో లాభాల్లో ఉన్న కంపెనీ ఇచ్చినట్టు మాట్లాడతారేంటి, లాభాలు వచ్చేవన్నీ మీరు తీసుకుని ఎందుకు పనికిరాని దాన్ని తెలివిగా మా మోహన కొట్టారు. అంతేగా
రజిత : మీనాక్షి..
మీనాక్షి : ఏంటి మమ్మీ, నువ్వు అలానే కూర్చో నీకు తిండి బట్టా ఉంటె చాలు, నేను నీలా ఎందుకు పనికిరాకుండా పక్షవాతం వచ్చినదానిలా బతకలేను.
రాజేశ్వరి : ఏయ్ మీనాక్షి, నోరు అదుపులో పెట్టుకో. ఏంటి కొత్తగా నోరు లేస్తుంది. ఏంటి గగన్ ఇది, పిల్లని పెంచే పద్ధతి ఇదేనా?
మీనాక్షి : నన్ను మా నాన్నతో పాటు మా అమ్మ కూడా పెంచింది.
రాజేశ్వరి : నువ్వు నోరుముయ్యి, నా ముందు మీ నాన్నే మాట ఎత్తడు నువ్వెంత నీ బిసాదెంత ఇంట్లో పద్ధతిగా ఉండక పోతే ఊరుకునే ప్రసక్తే లేదు.
మీనాక్షి : మా నాన్న నోరు ఎత్తట్లేదు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి అని గొణిగి, ఇంకో విషయం నేను దుబాయ్ వెళుతున్నాను.
రాజేశ్వరి : దేనికి ?
మీనాక్షి : కంపెనీ డీల్ గురించి మాట్లాడడానికి.
రాజేశ్వరి : ఆహా, నువ్వెళ్ళి మాట్లాడితే ఐపోద్దా (అని చిన్నచూపుగా నవ్వింది)
మీనాక్షి : ఏమో, ఎవరికి తెలుసు.
రాజేశ్వరి : అయితే ఇంట్లో మేమంతా ఎందుకు పనికిరాము అంటావా ఇన్ని రోజులు మేము చెయ్యలేనిది నీవల్ల అవుతుందంటావ్.
మీనాక్షి : ఇన్ని రోజులు కంపెనీ మీ చేతిలోనే ఉందిగా, మరి అప్పుడు లాభాల్లోకి రాలేదే. అయినా మీరేదో తెగ సంపాదిస్తున్నారని అనుకోకండి అదంతా తాతయ్య కష్టం. మీరు వాటి లాభాలని తింటున్నారు అంతే.
ఆ మాటతో పక్కనే ఉన్న గగన్ మీనాక్షి చెయ్యి పట్టుకుని ఆపబోయాడు. అప్పటికే ఇదంతా సహించని రజిత, మీనాక్షి చెంప మీద ఒక్కటి పీకింది. అక్కడే ఉన్న సుశాంత్ మిగతా వాళ్లంతా అది చూసి నవ్వారు. మీనాక్షి ఏడ్చేసింది.
రాజేశ్వరి : సరే నీకు సంవత్సరం టైం ఇస్తున్నాను కంపెనీ లాభాలు చూపించు, నీకు నా పేరు మీద ఉన్న ఐదు కంపెనీలలో రెండు నీ పేర రాస్తాను.
మీనాక్షి : (కళ్ళు తుడుచుకుని నవ్వుతున్న అందరి వైపు చూసి) మాట మీద నిలబడతారని గ్యారంటీ ఏంటి?
రాజేశ్వరి : మాటంటే మాటే, అందరి ముందు చెప్తున్నా కదా, చూద్దాం నువ్వెంత పోటుదానివో.
మీనాక్షి : అయితే ఇక డిస్కషన్ అనవసరం, ఇక నుంచి నేను ఎం చేసినా అడ్డు చెప్పకూడదు.
రాజేశ్వరి : కంపెనీ వరకు అన్ని నువ్వన్నట్టే చేసుకో, కానీ ఇలా పద్ధతి లేకుండా మాట్లాడితే కుదరదు, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, పెళ్లి చేసి ఇంట్లో కూర్చోబెడతా ఏమనుకున్నావో.
సుశాంత్ : దుబాయ్ కి నేనూ వస్తాను.
మీనాక్షి : అవసరం లేదు, నా విషయంలో నువ్వు ఎంత జోక్యం చేసుకోకపోతే నీకు అంత మంచిది. నీ హద్దుల్లో నువ్వుండు అని కోపంగా చూస్తున్న తన అమ్మ రజితని తోసుకుంటూ వెళ్ళిపోయింది. వెనకే గగన్ కూడా.
రజిత కోపంగా మీనాక్షి బెడ్ రూంకి వచ్చి "మీనాక్షి నా రూంకి రా, నీతో మాట్లాడాలి" అని చెప్పి వెళ్లిపోయింది. మీనాక్షి విసురుగా తన చేతిలో ఉన్న హ్యాండ్ బాగ్ విసిరేసి తన అమ్మా నాన్నా బెడ్ రూంకి వెళ్ళింది, లోపల తన తమ్ముడు చందు కూడా ఉన్నాడు.
మీనాక్షి లోపలికి వచ్చి మంచం మీద కూర్చుంది, రజిత వెళ్లి డోర్ పెట్టేసి మీనాక్షి వైపు తిరిగి కోపంగా చూసింది దానికి మీనాక్షి ఎం బెదరలేదు. దానికి రజిత ఒకింత కంగుతినింది, ఎప్పుడు ఏమన్నా తలదించుకుని ఉండే తన కూతురు ఇవ్వాళ తను నోరు విప్పితే ఎలా ఉంటుందో చూసింది. చందు మాత్రం ఎం జరుగుతుందా అని అయోమయంగా చూస్తున్నాడు.
రజిత : ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో ఏమైనా అర్ధం అవుతుందా?
మీనాక్షి : చందు వెళ్లి ఆడుకోపో
రజిత : ఉండనీ వాడు ఈ ఇంటికి మగపిల్లాడు తెలుసుకోకపోతే నీలాగే తయారు అవుతాడు.
మీనాక్షి : వాణ్ని ఇందులో కలపకు, వాడికింకా ఏమి తెలీదు చిన్నపిల్లోడు ఏది వింటే అదే నమ్మే వయసు వాడిది.
రజిత : అంటే నువ్వు పెద్దదానివి ఐపోయావా?
మీనాక్షి : ఇప్పుడు నీ బాదేంటి?
గగన్ : మీనాక్షి, మర్యాద తగ్గుతుంది. అమ్మతో అలాగేనా మాట్లాడేది.
మీనాక్షి : మరేంటి నాన్నా, ఇలా ఎన్ని రోజులు. చూడమ్మా వీళ్ళు నీ తోడబుట్టిన వాళ్ళే కావొచ్చు నీకు వీళ్ళు తప్ప ఇంకెవ్వరు లేరు మాకు కూడా అని నాకు జ్ఞాపకం ఉంది, అలా అని నీలా నంగిలా కూర్చుని నా జీవితమంతా వీళ్ళకి ఊడిగం చేస్తూ కూర్చోలేను. ఏమైనా మాట్లాడాలని ఉంటే నాన్నతో మాట్లాడుకో అని అక్కడనుంచి రజిత మాట్లాడుతున్నా పట్టించుకోకుండా లేచి వెళ్ళిపోయింది.
తన అక్క ఇంట్లో మొదటి సారి గొంతు ఎత్తినప్పుడే షాక్ ఐన చందు ఇప్పుడు అమ్మ మీద అరిచేసరికి అస్సలు అక్కకి ఏమైందో అన్న మీమాంసతో అక్క వెనుకే వెళ్ళాడు.
మీనాక్షి వెళ్లి మంచం మీద కూర్చుని ఇంకా కోపంగా ఆలోచిస్తూనే ఉంది, అది గమనించి చందు ఫ్యాన్ వేసాడు, మీనాక్షి తల తిప్పి చందు ని చూసి, రమ్మని సైగ చేసింది. చందు డోర్ లాక్ చేసి మంచం మీద తన అక్క ముందు కూర్చుని చూసాడు.
చందు : అక్కా ఎందుకంత కోపంగా ఉన్నావ్, నిన్ను ఎప్పుడు ఇలా చూడలేదు.
మీనాక్షి : నా గురించి వదిలేయి చందు, నీ గురించి ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు, నువ్వు వాడే ఫోన్ ఎవరిది?
చందు : పెద్ద బావది.
మీనాక్షి : తిరిగే బండి?
చందు : చిన్న బావది.
మీనాక్షి : ఎందుకు నీకు కొనివ్వడానికి వీళ్ళ దెగ్గర డబ్బులు లేవా, వాళ్ళు వాడుకుని నీకు ఇస్తారు. ఏమైనా అంటే ఉన్నవి పారేసుకుంటామా అని చిందులు తొక్కుతుంది అమ్మ. మరి ప్రకాష్ నీకంటే నాలుగేళ్లు చిన్నవాడు, వాడికి కొత్త ఆపిల్ ఫోన్ కొన్నారు, మొన్న బర్తడే కి గోల్డ్ చైన్ పెట్టింది అమ్మమ్మ నీకు నాకు ఎప్పుడైనా వేసిందా, కనీసం ఎప్పుడైనా మనతో ప్రేమగా మాట్లాడిందా?
చందు : లేదు.
మీనాక్షి : సరే ఇవన్నీ వదిలేద్దాం, ఆస్తి పంపకాల్లో మనకి ఎంత అన్యాయం చేసారో తెలుసా వాళ్లంతా తిని మనకి మాత్రం కొంత పొలం, ఒక పాడు బడ్డ కంపెనీ మన మొహం మీద కొట్టారు అది కూడా ఇంటికి మొగపిల్లాడివి నీ పేరు మీద రాయకుండా నా పేరు మీద ఎందుకు రాసారో తెలుసా?
చందు : ఎందుకు?
మీనాక్షి : నన్ను మళ్ళి పెద్ద బావకో లేక చిన్న బావకో ఇచ్చి పెళ్లి చేస్తే ఆ ఆస్తి కూడా మళ్ళి వాళ్ళకే చేరుతుంది అందుకని. అది అడిగితే నువ్వు చిన్న పిల్లాడివి ఇప్పుడే వాడి చేతికి అంత ఆస్తి ఇవ్వడం మంచిది కాదు అన్నారు. అన్ని నాటకాలు.
చందు : ఇదంతా నిజమా
మీనాక్షి : కళ్ళ ముందు కనిపిస్తుంటే మళ్ళీ అడుగుతావేంట్రా, ఎప్పుడైనా నీతో అమ్మమ్మ ప్రేమగా మాట్లాడడం చూసావా, బైటికి వెళ్ళేటప్పుడు నిన్ను ఎందుకు తీసుకెళ్తారు నీతో పనులు చేపించుకోడానికి. ఎటిఎంలో డబ్బులు తీసుకురడానికి వీటన్నిటికీ పంపిస్తుంటే నిన్ను కూడా వాళ్ళతో కలుపుకుంటున్నారని భ్రమ పడకు నీతో పనులు చేయించుకుంటున్నారు అంతే. ఇలాగే చదువు అన్ని వదిలేసి వీళ్ళ వెనక తిరిగావనుకో నీకు కెరీర్ ఉండదు ఆఖరికి చేతులు దులుపుకుంటారు, వాళ్ళు ఓనర్లగా ఉన్న అదే కంపెనీలో నువ్వు ప్యూన్ అవుతావు ఇప్పటికైనా తెలుసుకో. ఇవన్నీ నేను చెప్పకుండానే అర్ధం చేసుకుంటావేమో అనుకున్నా ఇన్నిరోజులు కానీ నువ్వు ఇంకా నిజమేనా అని అడుగుతున్నావు. ఇక నీ ఇష్టం.
చందు తల దించుకుని ఆలోచిస్తుంటే, మీనాక్షి ప్రేమగా చందు బుగ్గ మీద ముద్దు పెట్టింది.
మీనాక్షి : సారీ రా కొంచెం అరిచాను కదా, నీకోసమే చెప్తున్నా నన్ను తప్పుగా అర్ధం చేసుకోకు.
చందు : లేదక్కా ఐ లవ్ యు. ఎవరెన్ని చెప్పినా నేను ఎవరి వెనక తిరిగినా ఎప్పుడు నీతోనే.
మీనాక్షి : నా బంగారం, ఇవ్వాళ అన్నం ఇక్కడికే తీసుకురా మన ఇద్దరికీ. నీక్కూడా నేనే తినిపిస్తా. నువ్వు వచ్చేలోగా ఫ్రెష్ అవుతాను అని చందుని బుజ్జగిస్తూ లేచింది.
మీనాక్షి ఫ్రెష్ అయ్యి తాను అన్నం తింటూ తన తమ్ముడికి కూడా తినిపించి తన పక్కనే పడుకోబెట్టుకుని ముచ్చట్లు చెపుతూ చందు ని నిద్రబుచ్చి ఆలోచిస్తుంది.
మీనాక్షి : ఇవ్వాళ ఇంత ధైర్యంగా అందరిని ఎదిరించినా, గట్టిగా తెలివిగా మాట్లాడినా, నా ధైర్యం వెనుక ఉన్నది శివ అని నాకు తెలుసు, నిజమే ఒక మనిషి మనకోసం ఉన్నాడు అంటే ఆ ధైర్యమే వేరు. శివా లవ్ యు అని తన తమ్ముడి తల నిమురుతూ నిద్రలోకి జారుకుంది.
పొద్దున్నే మీనాక్షి లేచే సరికి తన తమ్ముడికి కూడా మెలుకువ వచ్చి లేచాడు.
చందు : గుడ్ మార్నింగ్ అక్కా
మీనాక్షి : గుడ్ మార్నింగ్ రా
చందు : అక్కా ఇవ్వాల్టి నుంచి నేను కూడా నీతో పాటే ఆఫీస్ కి వస్తాను, నీకు హెల్ప్ చేస్తాను.
మీనాక్షి : మరి కాలేజీ
చందు : అది ఉంటుందిలే
మీనాక్షి : వద్దు రా, నువ్వు డిగ్రీ అయినా కంప్లీట్ చెయ్యి ఆ తరువాత మన కంపెనీ లోనే పని చేద్ధు, ముందు స్టడీ ఇంపార్టెంట్.
చందు : మరి నువ్వు కూడా చేస్తున్నావ్ కదా
మీనాక్షి : నాకు తప్పదు కదా, వేరే ఆప్షన్ లేదు అదీ కాక నేను కాలేజీ కూడా అటెండ్ అవుతున్నాను, ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాను. నువ్వు కూడా డిగ్రీలో జాయిన్ అయ్యాక నాలాగే అటు స్టడీస్ ఇటు కాలేజీ మేనేజ్ చెయ్యి ఇప్పుడు మాత్రం రోజు కాలేజీకి వెళ్లి చదువుకో సరేనా
చందు : అలాగే
మీనాక్షి : నేను ఇవ్వాళ పని మీద దుబాయ్ వెళ్తున్నా, నీకేం కావాలి చెప్పు తీసుకొస్తా
చందు : నేనూ వస్తా
మీనాక్షి : వద్దు
చందు : అబ్బా ప్లీజ్, కావాలంటే మమ్మీని అడగనా
మీనాక్షి : నేనేమైనా టూర్ కి వెళుతున్నానా, ఆఫీస్ మీటింగ్స్ కి వెళుతున్నా అక్కడ ఎక్కడికి వెళ్లాలో, మీటింగ్ ఎంత సేపు పడుతుందో నాకే తెలీదు నిన్ను ఎక్కడని కూర్చోపెట్టనూ. టైం వచ్చినప్పుడు నేను వెళ్లకుండా ఒకరోజు నిన్నే పంపిస్తాను. అప్పుడేమంటావో తెలుసా అక్క పని చెయ్యకుండా నన్ను తిప్పుతుంది అని గొడవ చేస్తావ్.
చందు : (నవ్వుతూ) సరే, అయితే వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురా
మీనాక్షి : ఏం కావాలి
చందు : నీకు నచ్చింది తీసుకురా.
మీనాక్షి : పో లేచి రెడీ అయ్యి కాలేజీకి వేళ్ళు.
ఇంతలో ఫోన్ వచ్చి చూసేసరికి శివ కాల్ చేస్తున్నాడు.
మీనాక్షి : హలో
శివ : ఏంటి చాలా ఆనందంగా ఉన్నట్టున్నావ్
మీనాక్షి : హా ఫ్లైట్ లో చెపుతా
శివ : పదింటికే ఫ్లైట్
మీనాక్షి : అయిపోయింది రెడీ అయ్యి బైలుదేరడమే
శివ : ఓకే అయితే, ఎయిర్పోర్ట్ లో కలుద్దాం
మీనాక్షి ఫోన్ పెట్టేసి చక చకా రెడీ అయ్యి కిందకి వెళ్లి టిఫిన్ చేస్తుంటే తన అమ్మమ్మ, మావయ్యలు, అత్తయ్యలు తన వైపే చూడటం చూసి చిన్నగా నవ్వొచ్చినా ఆపుకుని తన పని తను చేసుకుని లేచింది.
ఒకసారి డాకుమెంట్స్ మొత్తం సరిగ్గా ఉన్నాయా లేదా అని ఆఖరి సారి చెక్ చేసుకుని కార్ తీసి బైలుదేరింది కానీ మీనాక్షిని ఫాలో అవ్వడానికి తన అమ్మమ్మ మనిషిని పెట్టిన సంగతి మాత్రం గ్రహించలేకపోయింది. నేరుగా ఎయిర్పోర్ట్ కి వెళ్లి శివకి ఫోన్ చేసింది.
మీనాక్షి : శివా ఎక్కడా
శివ : ఇక్కడే ఉన్నా, ఎక్కడున్నానో చెప్పుకొ చూద్దాం.
మీనాక్షి : వావ్ తమరి దెగ్గర ఈ చిలిపి ఆటలు కూడా ఉన్నాయన్నమాట.
శివ : హ్మ్.. సరే వస్తున్నా
మీనాక్షి : ఏ వద్దొద్దు ఇంకా బొచ్చెడు టైం ఉంది, ప్లీస్ ఆడదాం.
శివ : సరే కనిపెట్టు.
మీనాక్షి : ఎక్కడున్నావ్, క్లూ ఇవ్వు.
శివ : నేను నిన్ను చూస్తూనే ఉన్నాను.
మీనాక్షి : అయితే త్వరగా దొరికిపోతావు.
శివ : మీనాక్షి ఒక్కసారి సడన్ గా ఆగు.
మీనాక్షి : ఏమైంది?
శివ : ఒక ఇరవై అడుగులు నేరుగా అటు ఇటు చూడకుండా వెళ్లి వాటర్ బాటిల్ కొను.
మీనాక్షి : దేనికి?
శివ : చెప్పింది చెయ్యి
మీనాక్షి : అలాగే
శివ : నిన్ను ఎవడో ఫాలో చేస్తున్నాడు.
మీనాక్షి : ఎక్కడా?
శివ : అ.. ఆ.. ఆ.. అ.. అలా సడన్ గా కాదు, డౌట్ రాకుండా చిన్నగా తిరిగి చూడు బ్లాక్ కాప్, గ్రీన్ షర్ట్ వేసుకుని ఒకడు ఫాలో అవుతున్నాడు. ఎవరో తెలుసా?
మీనాక్షి : ఎవరో తెలీదు కానీ, ఎవరి పనో తెలుసు. ఇప్పుడేం చేద్దాం
శివ : నేను చెప్పినట్టు చెయి.