Update 12
శివ చేతిలో గన్, అతను కాల్చడం చూసి ఏటోళ్ళు అటు పారిపోయారు, వచ్చిన పని అయిపోగానే సుశాంత్ కూడా అక్కడ నుంచి జారుకున్నాడు. కావేరి పరిగెత్తుకుంటూ వెళ్లి శివని పట్టుకుని వెంటనే పక్కన గుమి గూడి చూస్తున్న వారి సాయంతో కారులో పడుకోబెట్టి హాస్పిటల్ కి తీసుకెళ్ళింది. హాస్పిటల్ ముందు శివని స్ట్రెచర్ ఎక్కిస్తుండగా ఒక్కసారి స్పృహ వచ్చి గుండె గట్టిగా కొట్టుకుంది కావేరి ఏడుస్తూ శివ చెయ్యి పట్టుకుంది. లోపలికి తీసుకెళుతుంటే కావేరి చెయ్యి పట్టుకుని ఏదో చెప్పబోయాడు, కావేరి శివ దెగ్గర వంగి లోపలికి తీసుకెళుతుంటే శివ నోట్లో నుంచి విన్న ఒకే ఒక్క మాట చందు.
నా కళ్లు ఎందుకు తెరుచుకోవడంలేదో నాకు తెలియట్లేదు కాని చెవులకి ఏవేవో వినిపిస్తున్నాయి, ఒక్కటి అర్ధం కావట్లేదు. మీనాక్షి.. మీనాక్షి అక్కడ ఎలా ఉందొ.. తనిప్పుడు ప్రెగ్నన్ట్
మా మొదటి కలయిక జరిగి ఇవ్వాల్టికి రెండున్నర నెలలు, మీనాక్షికి పీరియడ్ మిస్ అవ్వగానే డౌట్ వచ్చి చెక్ చేపించింది. ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ అవ్వగానే నన్ను కలిసి చెప్పింది. కొంత భయపడింది కాని నేనే ఉంచమన్నాను, మా ఇద్దరి కలయిక జరిగిన ఆ రోజుని నేను ఎన్ని జన్మలకి మర్చిపోలేను అంత ప్రేమగా జరిగింది అందుకే నాకు ఆ గుర్తుని చేరిపెయ్యాలని లేదు, అందరికి తెలిసే లోగా పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. కాని ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందొ ఏంటో, నా నోరు పెగలడం లేదు, కనీసం ఈ విషయం అమ్మకి కూడా చెప్పలేదు మేము.
శివని లోపలికి తీసుకెళుతూ కావేరిని బైటే ఉండమని ఆపేసారు వెంటనే సందీప్ కి ఫోన్ చేసి ఆ వెంటనే మీనాక్షి వాళ్ళ నాన్నకి ఫోన్ కలిపింది అందరూ పది నిమిషాల్లో హాస్పిటల్లో ఉన్నారు.
సందీప్ : ఇప్పుడెలా ఉందమ్మా
కావేరి : ఇంకా ఏం తెలీదు
విషయం తెలుసుకున్న సెక్యూరిటీ ఆఫీసర్లు హాస్పిటల్ కి వచ్చారు, అక్కడికి వచ్చిన CI గగన్ ని చూసి గుర్తు పట్టాడు.
శంకర్ : సర్ మీరు..
గగన్ : ఎటాక్ జరిగింది శివ పైనే
శంకర్ : ఎవరు చేసారో తెలుసా
గగన్ : తెలుసు కాని ఏమి చెయ్యలేని పరిస్థితి
శంకర్ : పేరు చెప్పండి చాలు మిగతాది నేను చూసుకుంటాను.
గగన్ : నా అల్లుడు సుశాంత్
శంకర్ : ఇప్పుడేం చెయ్యమంటారు అరెస్ట్ చెయ్యమంటారా
గగన్ : ప్రత్యక్ష సాక్షి నా చెల్లెలు పేరు కావేరి ఇక్కడే ఉంది, ఎంత దూరం వెళ్ళడానికైనా రెడీ కాని మీరు ఏమి చెయ్యలేరు
శంకర్ : నాకు కొంచెం టైం ఇవ్వండి అని సీరియస్ గా బైటికి వెళ్ళిపోయాడు.
కావేరి ఏడుస్తూ కూర్చుంది. సందీప్ వెళ్లి కావేరి పక్కన కూర్చుని చెయ్యి పట్టుకున్నాడు. ఇంతలో భరత్ వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు.. గగన్ వెళ్లి కావేరి ముందు నిలుచున్నాడు.
కావేరి : ఏం మనుషులు వీళ్ళు చంపేస్తారా
గగన్ : వాడు ఎవ్వరి మాట వినట్లేదు, మా అత్తగారి మాట కూడా వినట్లేదు ఆవిడ గారాబమే వాడిని చెడ కొట్టింది. మీనాక్షికి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆపాలని ప్రయత్నిస్తున్నాను కాని నన్ను ఎవ్వరు లెక్క చెయ్యటం లేదు.
కావేరి : మీనాక్షి గారి అమ్మ?
గగన్ : తనే దెగ్గరుండి చేపిస్తుంది.. సుశాంత్ శివ మీనాక్షిల గురించి ఇంట్లో చెప్పేసాడు. నా భార్యకి ఏమి ఎక్కడం లేదు.
కావేరి : శివ లోపలికి వెళుతు వెళుతు చందు అన్నాడు.
గగన్ : చందు అన్నాడా
గగన్ వెంటనే చందుకి ఫోన్ చేసాడు.
చందు : డాడీ అక్కడ ఏం జరుగుతుంది..
గగన్ జరిగింది మొత్తం వివరించాడు.
చందు : ఏం చెయ్యాలో నాకు తెలుసు, నేను ఆల్రెడీ దెగ్గరికి వచ్చేసాను. అని ఫోన్ పెట్టేసాడు.
గగన్ : నేను అక్కడికి వెళతాను ముందు మీనాక్షికి ఈ విషయం చెప్పాలి అని కావేరికి చెప్పేసి అక్కడనుంచి బైటికి వెళ్ళిపోయాడు.
ఫోన్ పెట్టేసిన చందుకి, గగన్ చెప్పింది వినగానే కోపం వచ్చింది. ఊళ్ళోకి దిగగానే నేరుగా ఇంతక ముందు గంజాయి సప్లై చేసే వాడి దెగ్గరికి వెళ్లి వాడి సాయంతో చిన్న స్లం లోకి వెళ్లి ఒక గన్ కొని నేరుగా ఇంట్లోకి వెళ్ళాడు.
చందు : అమ్మా అమ్మా అక్క ఎక్కడా
రజిత : రేయి లోపల ఉంది వెళ్ళు, దాన్ని పెళ్ళికి ఒప్పించు ఇష్టమున్నా లేకపోయినా ఈ పెళ్లి జరిగే తీరుతుందని కూడా చెప్పు.
చందు లోపలికి వెళ్లి ఏడుస్తున్న మీనాక్షిని కలుసుకున్నాడు.
చందు : అక్కా
మీనాక్షి ఏడుస్తూ లేచి తన తమ్ముణ్ణి చూసి గట్టిగా వాటేసుకుని ఏడ్చేసింది.
చందు : అక్కా శివని సుశాంత్ కాల్చేశాడు, శివ ఇప్పుడు హాస్పటల్లో ఉన్నాడు
మీనాక్షి : ఏంటి నువ్వనేది..
చందు : అవునక్కా డాడీ చెప్పాడు.. ఇందాకే
మీనాక్షి : నేను ఇంతసేపు ఇక్కడ ఎదురు చూస్తున్నదే శివ వస్తాడని, ఇక ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను.. నేను ముందు శివని చూడాలి అని లేచి బైటికి పరిగెత్తింది.. అది చూసిన సుశాంత్ అడ్డు పడ్డాడు.
చందు : బావా అడ్డు తప్పుకో
సుశాంత్ : రేయి నీకేం తెలీదు, నువ్వు ముయ్యి
రజిత : ఏయి మీనాక్షి, నీ ఛాన్స్ అప్పుడే అయిపోయింది.. మర్యాదగా లోపలికి వెళ్ళు లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు.
మీనాక్షి : నీకు భయపడి ఇంట్లో ఉన్నాననుకున్నావా, శివ వచ్చి మీతో మాట్లాడి నన్ను తీసుకెళతాడని ఇంత సేపు ఆగాను.. కాని వీడు నా శివని షూట్ చేసాడు అని మోకాళ్ళ మీద కూర్చుని గట్టిగా ఏడ్చేసింది.
రజిత : ఏంటి నువ్వు చెప్పేది, సుశాంత్ ఇది నిజమేనా
రాజేశ్వరి : నేను కొట్టించమని మాత్రమే చెప్పాను, సుశాంత్.. మీనాక్షి చెప్పేది నిజామా
మీనాక్షి : నేను వెళ్ళాలి
సుశాంత్ : లోపలికి పో
మీనాక్షి మోకాళ్ళ మీద నుంచి లేచి సుశాంత్ చెంప పగలగొట్ట బోతే చెయ్యి పట్టుకున్నాడు, పక్కనే ఉన్న చందు సుశాంత్ ని ఒక్కటి తన్నాడు.
రజిత : చందు..
చందు : నీకేం తెలీదు మా.. నువ్వు ఊరుకో.. నా అక్కకి ఏది బెస్టో నాకు తెలుసు
సుశాంత్ కోపంగా లేచి ముందుకు రాబోతే చందు వెంటనే జేబులో ఉన్న గన్ తీసి సుశాంత్ కి పెట్టాడు. అది చుసిన అందరూ ఆశ్చర్యపోయి భయపడిపోయారు.
చందు : అక్కా నువ్వు పదా, ఎవడు ఆపుతాడో నేను చూస్తాను
మీనాక్షి ముందుకు నడుస్తుంటే చందు గన్ సుశాంత్ వైపు పెట్టి బైటికి నడుస్తుంటే, సుశాంత్ తన దెగ్గర ఉన్న గన్ తీసి రజితకి పెట్టాడు.
చందు : నువ్వు చంపవు
సుశాంత్ : అవునా అని గాల్లోకి ఒక సారి కాల్చాడు.
రాజేశ్వరి : రేయి సుశాంత్ ఏం చేస్తున్నావ్, గన్ దించు
సుశాంత్ : ఏం చేస్తున్నానో నాకు బాగా తెలుసు నువ్వు నోరు మూసుకుని పడి ఉండు అని ఒక్క మాటతో రాజేశ్వరిని నోరు మూపించేసాడు.
రజిత : ఒరేయి కన్నా అత్తని రా
సుశాంత్ : నా ఇగో కంటే నువ్వు గొప్పదానివేం కాదు అత్తయ్య, మీనాక్షి మర్యాదగా ఇంట్లోకి వెళ్లకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు
మీనాక్షి ఏడుస్తూ రాజేశ్వరి వైపు చూసింది
మీనాక్షి : అమ్మమ్మ నాకు సుశాంత్ అంటే నిజంగానే ఇష్టం లేదు అమ్మమ్మ, మీరు నాకు రాసిచ్చిన కంపెనీ పతనం అవ్వడానికి కారణం ఈ సుశాంత్, దొంగతనంగా సరుకు అమ్ముకున్నాడు, కాని ఏ రోజు నేను ఈ విషయం మీకు చెప్పలేదు, నా తమ్ముడితో బలవంతంగా గంజాయి డ్రగ్స్ తెప్పించుకునేవాడు, ఈ విషయం కూడా నేను చెప్పలేదు.. నాకు మీ ఎవ్వరి మీద పంతం, కోపం లేదు.. కాని వీడు నా శివని షూట్ చేసాడు.. నాకు ప్రెగ్నన్సీ కంఫర్మ్ అయ్యి ఇవ్వాల్టికి ముప్పై ఐదు రోజులు దాటింది ఇంకో పద్దెనిమిది రోజులు దాటితే నాకు మూడో నెల పడుతుంది.. ప్లీజ్ నన్ను వదిలెయ్యండి నాకు మీ డబ్బులు, ఆస్తులు హోదాలు ఏమి వద్దు అన్ని మీ పేరునే రాసేస్తాను, నన్ను వదిలెయ్యండి అని ప్రాధేయపడింది.
రాజేశ్వరికి ప్రెగ్నెన్సీ అన్న మాట వినగానే ముందు కోపం వచ్చినా మీనాక్షి ఏడుపు చూసి తన పంతాన్ని వెనక్కి తీసుకుంది. రజిత కూడా అంతే కూతురు బతిమిలాడుకోవడం చూసి ఆలోచించింది.
రాజేశ్వరి : రేయి నువ్వు గన్ దించు అని గట్టిగా అరిచేసరికి సుశాంత్ బెదిరి గన్ దించాడు.. మీనాక్షి వెళ్ళు
సుశాంత్ : నానమ్మా
రాజేశ్వరి : నేను చెపుతున్నాను కదా, మీనాక్షి వెళ్ళిపో
సుశాంత్ : ఎక్కడికే వెళ్ళేది, ఏయి పో లోపలికి పో
రాజేశ్వరి : నన్నే ఎదిరిస్తావా
సుశాంత్ : చందు కోపంతో ముందుకు రాబోతే, కాల్లో షూట్ చేసాడు. రక్తం చూసి అందరూ భయంతో అరిచారు. రజిత పరిగెత్తుకుంటూ వెళ్లి చందుని పట్టుకుంది.
రాజేశ్వరికి కూడా అర్ధమైపోయింది, సుశాంత్ పూర్తిగా చెడిపోయాడని. మతి స్థిమితం లేని పనులు చేస్తున్నాడని కూడా అర్ధమైంది కాని ఇప్పుడు ఏం లాభం, జరగాల్సిన చెడు జరిగిపోయింది.
రజిత : రేయి సుశాంత్ ఏంట్రా ఇది, నువ్వేనా ఇలా చేస్తుంది నా బిడ్డల కంటే మిమ్మల్నే ఎక్కువగా ప్రేమించాను కదరా
సుశాంత్ : మా దెగ్గర డబ్బులున్నాయి కాబట్టి మమ్మల్నే ప్రేమిస్తావ్ అత్తా.. ఇప్పుడు మీనాక్షి దెగ్గర డబ్బు ఉంది కాబట్టి ఆ శివ గాడు దీన్ని ప్రేమించాడు. అంతా ఒకటే అత్తయ్య అని మీనాక్షి చెయ్యి పట్టుకుని బలవంతంగా బైటికి లాక్కెళ్ళాడు ఎంత మంది నచ్చజెప్పినా వినకుండా. గగన్ వచ్చేసరికి అప్పటికే అంతా అయిపోయింది. గగన్ వచ్చి చందుని హాస్పటల్ కి తీసుకెళ్లాడు.
మీనాక్షిని కారులో కూర్చోపెట్టి ఊరు దాటించి పాత గోడౌన్ల దెగ్గరికి తీసుకెళ్లి రూంలో లాక్ చేసి చుట్టు రౌడీలని కాపలా పెట్టి, హాస్పటల్ కి బైలుదేరాడు శివ బతికాడో చచ్చాడో చూద్దామని. మీనాక్షి ఒక్కటే చీకటిలో ఏడుస్తూ కూర్చుంది. సాయంత్రానికి తలుపు తెరుచుకోవడంతో మీనాక్షి తలుపు వైపు చూసింది.
సుశాంత్ : నేనే మీనాక్షి నీ బావని
మీనాక్షి : ఏం చేస్తున్నావ్ బావా, ఇద్దరం ఒకే ఇంట్లో పుట్టిన వాళ్ళం..కలిసి పెరిగిన వాళ్ళం.. ఎందుకు అంత కోపం, నన్ను అంత ప్రేమించిన వాడివైతే ఇలా చేస్తావా.. కేవలం నీ పంతం నెగ్గించుకోడానికేగా ఇదంతా.. మమ్మల్ని వదిలేయి బావ.. శివని తీసుకుని ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను మళ్ళీ నీకు కనిపించము అని కాళ్లు పట్టుకుంది.
సుశాంత్ : అదే కాలితో మీనాక్షి పొట్టలో తన్నాబోతే మీనాక్షి చేతులు అడ్డం పెట్టింది.. నాకు దక్కాల్సిన దాన్ని వేరేవడో ఎగరేసుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటానా, ప్రెగ్నన్సీ అని నువ్వేం టెన్షన్ పడకు టాబ్లెట్స్ ఇస్తాను వేసుకుంటే అదే పోతుంది. ఆ.. ఇంకోటి నీ శివ ఇంకా బతికే ఉన్నాడు కాని బాడ్ లక్ కోమాలో ఉన్నాడు ఎప్పుడు లేస్తాడో ఎవ్వరికి తెలియదట.. ఇంతలో ఏదో ఫోన్ వస్తే డోర్ లాక్ చేసి బైటికి వెళ్ళిపోయాడు.
మీనాక్షి నిస్సహాయంగా అక్కడే పడుకుండిపోయింది.. కనీసం బతికున్నాడన్న వార్త విని దేవుడికి దణ్ణం పెట్టుకుంది.. కొంత సేపటికి తప్పించుకోడానికి ఏదైనా దారి దొరుకుతుందేమో అని చూసింది కాని లాభం లేదు ఏడుస్తూ అలానే అక్కడే నిద్రపోయింది.. రాత్రికి ఎవరో తలుపు తెరిచి ఒకడు వచ్చి అన్నం ప్లేట్ పెట్టి వెళ్ళాడు. ఆకలేసి తిందామని ప్లేట్ తీసుకుంది కాని ప్రెగ్నన్సీ పోవడానికి, సుశాంత్ ఏదైనా మందు ఇందులో కలిపి ఉంటాడని అనుమానంతో తినలేదు అన్నం మూలకి పారేసి కాళీ ప్లేట్ పెట్టింది.
నాలుగు రోజుల పాటు గుక్క మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు, నోట్లో ఉన్న ఉమ్ము మాత్రమే మింగుతూ కాలం గడిపి చివరికి నాలుగో రోజు రాత్రి స్పృహ తప్పి పడిపోయింది.. చిమ్మ చీకటిలో మీనాక్షి ఉన్న రూంలో నుంచి ఒక వెలుగు వచ్చేసరికి అక్కడ కాపలాగా ఉన్న రౌడీలు వెళ్లి తలుపు తీసి చూసారు కాని ఏ వెలుతురు లేదు, మళ్ళీ తలుపులు మూసి వెళ్లిపోయారు.
తెల్లారి మెలుకువ వచ్చి లేచింది, కడుపు చిన్నగా నొప్పి అనిపించి చెయ్యి వేసింది కాని ఎమ్మటే నొప్పి పోయింది, ఆకలి వెయ్యడం లేదు దాహంగా కూడా లేదు. పెట్టిన అన్నం నీళ్లు మాత్రం తిన్నట్టే నటిస్తూ మూలకి పారేసింది.. మధ్యలో సుశాంత్ బలవంతం చెయ్యబోతే కిటికీకి ఉన్న గాజు పెంకు సాయంతో అడ్డం పెట్టుకుని తనని తాను కాపాడుకుంటుంది.. వేరే ఆప్షన్ లేక చచ్చినట్టు అదే ఒప్పుకుంటుందిలే అన్న ధీమాతో ఇటు సుశాంత్ అటు సెక్యూరిటీ ఆఫీసర్లకి ఇటు తన ఇంట్లో వాళ్ళకి దొరక్కుండా జాగ్రత్త పడుతున్నాడు.
ఇవ్వాల్టికి మీనాక్షిని బంధించి ఇరవై మూడు రోజులు, ఇప్పటివరకు మీనాక్షి నోటికి ఆహరం కాని నీళ్లు కాని అందలేదు. మీనాక్షి ఆశ్చర్యపోయినా దీని వల్ల పుట్టే బిడ్డకి ఏమైనా అవుతుందేమో అన్న భయంతోనే గడుపుతుంది.
ఒళ్ళంతా నొప్పిగా అనిపించేసరికి ఏం చెయ్యాలో తెలీక కొంతసేపు నొప్పి తట్టుకోలేక కింద పడి దొల్లింది. కొంత సేపటికి నొప్పి పోయింది కాని ఒకటే నిద్ర కమ్ముతుంది. రాత్రి పన్నెండు దాటినట్టుంది మీనాక్షికి రోజు రోజుకి పిచ్చెక్కుతుంది. అటు తమ్ముడు ఎలా ఉన్నాడో తెలీదు ఇటు శివ ఎలా ఉన్నాడో తెలీదు, సుశాంత్ ఏమి చెప్పడం లేదు కాని మీనాక్షిని అనుభవించాలన్న పట్టు మాత్రం వదలడం లేదు.. ఇంతలో మీనాక్షిని ఎవరో పిలిచినట్టు ఒక సన్నని గొంతు వినిపించింది.. ఆ గొంతు కొంత సేపటికి పెద్దగా వినిపించింది
అమ్మా...
మీనాక్షి అటు ఇటు చూసింది కాని ఎవ్వరు లేరు
అమ్మా ఇక్కడా..
మీనాక్షి కిటికీ దెగ్గరికి వెళ్లింది అక్కడ ఎవ్వరు లేరు, వెంటనే డోర్ దెగ్గరికి వచ్చింది ఏ చప్పుడు లేదు.
అమ్మా ఇక్కడ ఇటు చూడు, నా మాట నీకు తప్ప ఎవ్వరికి వినపడదు
మీనాక్షి : ఎవరు.. సుశాంత్.. నువ్వేనా.. బావా..
అమ్మా నేను నీ కొడుకుని, ఒక్కసారి నీ పొట్ట మీద చెయ్యి పెట్టి చూడు అనగానే మీనాక్షి భయపడిపోయి ఆ వెంటనే తన పొట్ట మీద చెయ్యి వేసి చూసుకుంది.. ఇన్ని రోజులు గమనించలేదు కాని కొంచెం పొట్ట తెలుస్తుంది..
మీనాక్షి : ఎవరు
నేనేనమ్మా
మీనాక్షి : కాదు.. కానీ..
ఆశ్చర్యపోకు నీ బిడ్డనే.. నాన్న దెగ్గరికి వెళదామా అన్న మాటలు వినపడేసరికి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని స్థితిలో కళ్ళు తిరిగి పడిపోయింది.
పొద్దున్నే తలుపు చప్పుడు కావడంతో మీనాక్షి లేచి కూర్చుంది, రాత్రి జరిగినవి ఏవేవో గుర్తుకొస్తున్నాయి.. సుశాంత్ లోపలికి వచ్చాడు.
మీనాక్షి : సుశాంత్ నన్ను పోనీ, టైం వేస్ట్ చేసుకోకు.. నీకు నేను దక్కడం ఇంపాసిబుల్.
సుశాంత్ : ఇవ్వాళ సాయంత్రం నీకు నాకు పెళ్లి, మధ్యాహ్నం డాక్టర్ వస్తున్నాడు నీ ప్రెగ్నెన్సీ కూడా తీసేస్తాడు. అప్పుడు ఆ తరువాత చూస్తావ్ నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో
మీనాక్షి : ఛీ..
సుశాంత్ నవ్వుతూ వెళ్ళిపోయాడు.
మీనాక్షికి వెంటనే రాత్రి జరిగిన సంభాషణ గుర్తొచ్చి కొంచెం అనుమానంగా తన పొట్ట మీద చెయ్యి వేసుకుని నిమిరి
మీనాక్షి : బుజ్జి
అమ్మా..
ఆ మాట వినగానే మరొక్కసారి ఆశ్చర్యపోయింది
మీనాక్షి : బుజ్జి.. ఎలా ఇదంతా నాకు ఏం అర్ధం కావడం లేదు
ఇప్పటికైనా నమ్ముతావా లేదా అని కసురుకున్నట్టు మాట్లాడేసరికి
మీనాక్షి : ఆమ్మో.. నమ్ముతాను నమ్ముతాను.. కోప్పడకు అని నవ్వుకుంది
కడుపు దెగ్గర వెచ్చగా అయ్యింది.. మీనాక్షి పొట్ట మీద చెయ్యి వేసుకుని బుజ్జి అంటూ కంగారు పడింది
అమ్మా కంగారు పడకు, నేను కూడా నవ్వుతున్నాను
మీనాక్షి : బుజ్జి ఏంటిదంతా, ఇది ఎలా..
అవన్నీ ఎందుకు.. సాధ్యం అయ్యిందిగా, నాకు నాన్నని చూడాలనుంది
మీనాక్షి : నువ్వు చూడగలవా
నీ కళ్ళున్నాయిగా.. నీ శరీరాన్ని నేను వాడుకోగలను
మీనాక్షికి ఒకింత ఆశ్చర్యం ఒకింత సంతోషం కొంత భయం కూడా పట్టుకుంది.
అమ్మా.. భయపడకు, ముందు ఇక్కడినుంచి వెళ్ళిపోదాం.. నీకు నాన్నని చూడాలని ఎంత ఆశగా ఉందొ నాకు తెలుస్తుంది.
మీనాక్షి : కానీ ఎలాగ బుజ్జి, మనల్ని బంధించేసారు
నువ్వు ముందుకు వెళ్ళు, అనుమాన పడకు నన్ను నమ్ము ఆ తలుపుని ముట్టుకొనవసరం కూడా లేదు. వెళ్ళు అనగానే మీనాక్షి ముందుకు నడిచింది, తలుపు దెగ్గర ఆగింది కాని తన కొడుకు మళ్ళీ వెళ్ళమనేసరికి అడుగు ముందుకు వేసింది. ఆశ్చర్యం.. తలుపు లోనుంచే బైటికి వచ్చేసింది.
మీనాక్షి : (సంతోషంగా) బుజ్జి ఎలాగా
పదా వెళదాం..
మీనాక్షి : అక్కడ చాలా మంది ఉన్నారు
వాళ్ళు నిన్ను ముట్టుకోలేరు, ధైర్యంగా ముందుకెళ్ళు. ఇన్ని రోజులు కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా ఇంకా బతికే ఉన్నావంటే నీకింకా అర్ధం కావట్లేదా
మీనాక్షి : అవును బుజ్జి నేనిది గమనించనేలేదు. సరే.. ఆ సుశాంత్ కూడా లేడు ఇదే మంచి టైం అని వేగంగా ముందుకు నడుస్తుంటే అక్కడే కాపలాగా ఉన్న వాళ్ళు మీనాక్షి దెగ్గరికి వచ్చారు
రేయి ఆవిడ బైటికి ఎలా వచ్చింది..
ఏమో ముందు ఆపండి, అన్న వచ్చాడంటే మనల్ని చీరేస్తాడు
అందరూ మీనాక్షిని పట్టుకోబోయరు కాని కనీసం మీనాక్షిని ముట్టుకోలేకపోయారు, మీనాక్షి మీద కనీసం చెయ్యి కూడా వెయ్యలేకపోయారు ఏదో శక్తి రెండు అడుగుల ముందే ఆపేసింది. మీనాక్షి అది చూసి తన పొట్ట మీద చెయ్యి వేసి బుజ్జి అంది.
నేను చెప్పాను కదమ్మా
మీనాక్షి : అవును బుజ్జి.. అక్కడ కారు ఉంది పదా వెళదాం అని అక్కడికెళ్లి చూస్తే తాళం దానికే ఉంది. వెంటనే స్టార్ట్ చేసి అక్కడనుంచి పోనించింది.
బైటికి రోడ్డు మీదకి వచ్చి ఎక్కడుందో తెలుసుకుని, నేరుగా శివ ఇంటికి వెళ్ళింది కాని ఇంటికి తాళం వేసి ఉండటంతో కంపెనీ దెగ్గరికి వెళ్ళింది అక్కడ ఫోన్ తీసుకుని వెంటనే కావేరికి ఫోన్ చేసింది.
కావేరి : హల్లో అంది నీరసంగా
మీనాక్షి : అత్తయ్యా
కావేరి : మీనాక్షి.. మీను..
మీనాక్షి : ఎక్కడున్నారు అత్తయ్యా
కావేరి : ఇక్కడే లైఫ్ కేర్ హాస్పటల్
మీనాక్షి : వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి కళ్ళు తుడుచుకుని హాస్పటల్ వైపు కారుని పరిగెత్తించింది.
హాస్పటల్లో ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న శివ పక్కన కూర్చుని, మాట్లాడుతుంది కావేరి.
కావేరి : శివుడు.. నీ మీనాక్షి ఫోన్ చేసింది.. వస్తుంది నాన్నా
సందీప్ : మీనాక్షి వస్తుందా
కావేరి : అవును ఇప్పుడే ఫోన్ చేసింది, వస్తున్నానంది.
పావుగంటలో మీనాక్షి కారుని హాస్పిటల్ ముందే వదిలేసి లోపలికి పరిగెత్తింది. రిసెప్షన్ లో కనుక్కుని మూడో ఫ్లోర్ ఎక్కి శివ ఉన్న రూం దెగ్గరికి వెళ్లి డోర్ దెగ్గరే శివని చూస్తూ ఏడుస్తూ ఉండిపోయింది.
కావేరి తల తిప్పి మీనాక్షిని చూసి లేచి వెళ్లి కౌగిలించుకొని ఏడ్చేసింది.
కావేరి : మీను.. ఎలా ఉన్నావ్.. ఏమైపొయ్యవ్ రా
మీనాక్షి : శివ..
కావేరి : అడుగో కోమాలో ఉన్నాడు అని వదిలేసారికి.. మీనాక్షి వెళ్లి శివని చూస్తూ మోకాళ్ళ మీద కూర్చుని శివ చెయ్యి అందుకుంది.
అమ్మా..
మీనాక్షి అటు ఇటు చూసింది, కంగారుగా
కంగారుపడకు నా మాటలు నీకు తప్ప ఇంకెవ్వరికి వినిపించవు. ముందు అందరినీ ఇక్కడ నుంచి పంపించేయ్యి.
మీనాక్షి : ఎందుకు
కావేరి : ఏంటి మీను..
మీనాక్షి : ఏం లేదు అత్తయ్య
ముందు పంపించేయ్యి.. నాన్నని లేపుదాం అనగానే శివ చేతిని పట్టుకున్న మీనాక్షి ఇంకొంచెం గట్టిగా పట్టుకుంది. ఆనందం వేసి
మీనాక్షి : సరే.. అని లేచింది
మీనాక్షి తన అత్తయ్య దెగ్గర కూర్చుని ఇన్ని రోజులుగా జరిగిందంతా వింటూ శివ ని చూస్తూ కూర్చుంది. ఇటు మీనాక్షికి కూడా అంతా అయోమయంగా ఉంది కడుపులో ఉన్న పిండం మాట్లాడడమేంటో ఎంత ఆలోచించినా పిచ్చి ఎక్కిపోతుంది కాని తన బిడ్డ వల్లే బయట పడి శివని కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది, కాని బిడ్డ అలా ఉండటంతో చాలా భాయంగా ఉంది. చిన్నగా ఎవ్వరికి కనిపించకుండా పొట్ట మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరింది, అక్కడ వెచ్చగా అయ్యేసరికి తన బిడ్డ ఆనందంగా ఉన్నాడని గ్రహించి నవ్వుకుంది.. ఇదంతా గమనిస్తున్న కావేరికి మాత్రం ఏం అర్ధం కాలేదు.. ఇన్ని రోజులు శివకి దూరంగా ఉంది కదా ఇప్పుడు ఈ స్థితిలో వాడిని చూసి పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుందేమో అని తనకి తానే సర్ది చెప్పుకుని మీనాక్షి భుజం మీద చెయ్యి వేసింది. మీనాక్షి పొట్ట మీద చెయ్యి తీసేసి మాములుగా కూర్చుంది. కొంతసేపటికి సందీప్ లేచాడు
సందీప్ : అమ్మా రాత్రి కూడా ఏం తినలేదు, ముందు ఏమైనా తిందాం పదా
కావేరి : తిందాంలేరా
మీనాక్షి : అత్తయ్యా వెళ్ళండి, నేను వచ్చేసాను కదా.. మీరందరూ కూడా వెళ్ళండి. నాకు కొంత సేపు శివతో ఒంటరిగా గడపాలని ఉంది అని భరత్ చెల్లిని చూసింది.. అందరూ లేచి వెళ్లిపోయారు.
అందరూ వెళ్ళగానే మీనాక్షి లేచి డోర్ పెట్టేసి శివ దెగ్గరికి వచ్చి నిలుచుంది.
మీనాక్షి : బుజ్జి ఇప్పుడేం చేద్దాం, అని పొట్ట మీద చెయ్యి వేసింది
నాన్న తలని నాకు ఆనించు, అదే నీ పొట్ట మీద పెట్టుకొని పడుకోబెట్టుకో అనగానే, మీనాక్షి శివని పక్కకి జరిపి తన పక్కన పడుకుని చుడిధార్ పైకి లేపి శివని ఒళ్ళోకి తీసుకుని శివ తలని తన పొట్ట మీద ఆనించింది.
రెండు నిమిషాలకి మీనాక్షి కడుపు మొత్తం వెచ్చగా అవుతూ, ఏదో చిన్న వెలుతురు ఒకటి పొట్ట చీల్చుకుని వచ్చినట్టు అనిపించి మళ్ళీ మాములుగా అయ్యింది కాని మీనాక్షి పొట్ట ఎవరో కోసినట్టు పెద్ద గాటు ఒకటి ఏర్పడింది. శివ కళ్ళు తెరిచాడు.