Update 14

పొద్దున్నే శివ లేచి అరణ్య చెప్పినట్టే వెళ్ళాడు ఎప్పుడు హడావిడిగా ఉండే రోజు ఇవ్వాళ ప్రతీ పని సజావుగా సాగిపోవడం ఆ వెంటనే తన షేర్స్ అమ్ముడు పోవడం అనుకున్నదానికంటే ఎక్కువ లాభాలు రావడంతో అరణ్య చెప్పిన అన్ని విషయాలను చాలా సీరియస్ గా తీసుకున్నాడు. త్వరలోనే మంచి రోజు చూసి అరణ్య చెప్పిన టైం బట్టి సొంత బిజినెస్ చెయ్యాలనుకున్నాడు.

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*

ఇంకోవైపు సుశాంత్ ఇంటికొచ్చాడు, లోపలికి అడుగు పెట్టగానే తన తల్లి ఏడుస్తూ వెళ్లి ఇంట్లోకి తీసుకొచ్చింది.

రాజేశ్వరి : ఆగిపో అక్కడే

అత్తయ్యా అది..

రాజేశ్వరి : ముందు వాడిని చేసిన పాపలకి లొంగిపొమ్మను

సుశాంత్ : నా మనిషి ఒకడు లొంగిపోయాడు, నాకు బుద్ధిచ్చింది.. ఇక నుంచి బుద్ధిగా మన బిజినెస్లు చూసుకుంటాను. కావాలంటే మీనాక్షికి క్షమాపణలు చెపుతాను

అత్తయ్యా విన్నారుగా, ఈ ఒక్కసారికి వదిలెయ్యండి

రాజేశ్వరి : నీ వల్ల ఇంకోసారి మీనాక్షి కుటుంబం ఇబ్బంది పడిందని నాకు తెలిస్తే ఊరుకునేది లేదు.. నేనేం చేస్తానో నాకే తెలీదు అని వాడి మొహం చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది.

సుశాంత్ : అలాగే అని కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు..

తన అమ్మ ఏమైనా తినమంటే తరవాత తింటానని చెప్పి లోపలికి వచ్చి డోర్ పెట్టేసి మోకాళ్ళ మీద కూర్చుని కోపంగా పక్కనే ఉన్న దిండ్లు అన్ని విసిరికొట్టి, ఫోన్ ఓపెన్ చేసాడు.. వాట్సాప్ లో ఇంకో వీడియో వచ్చింది. శివ ఇంటిని గమనించమని ఒక మనిషిని పెట్టి వచ్చాడు వాడు పంపించిన వీడియోలు చూస్తూ కూర్చున్నాడు.

వీడియోలో మీనాక్షి తన పొట్ట పట్టుకుని మాట్లాడుకుంటూ తనలో తానే నవ్వుకుంటుంటే అక్కసుతో చూడసగాడు.. శివ మీనాక్షి దెగ్గరయినప్పుడల్లా కోపంగా పక్కనే ఉన్న వస్తువులు విసిరికొట్టాడు. వీడియో అంతా చూసి ఫోన్ మంచం మీద విసిరేసి.. లేచాడు

సుశాంత్ : దాన్ని వదలను, వాడిని కూడా.. ముందు నా ఆస్తులు నా చేతికి రావాలి. ఒక మూడు నెలలు నటిస్తే చాలు అంతా నా కంట్రోల్లోకి వస్తుంది.. అప్పుడు.. ఆ తరువాత దాన్ని ఎలా దక్కించుకోవాలో చూస్తాను.. ఆ శివ గాడి అంతు చూస్తాను. అవును ఇలాగే చెయ్యాలి.. అని పిచ్చి పిచ్చిగా వాడిలో వాడే నవ్వుకుంటూ సంతోషంగా కిందకి వెళ్లి అందరితో మంచిగా ఉంటూ నటించడం మొదలు పెట్టాడు.


*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*

మీనాక్షి : అరణ్య, చెప్పు ఇవ్వాళ మనం ఏం చేద్దాం

అరణ్య : ఎక్కడికైనా పచ్చటి వాతావరణం, చుట్టూ చెట్లు, చక్కటి గాల, పక్కనే చెరువు లేదా ఏదైనా జలపాతం లాంటిది అలాంటి ఒక చోటుకి వెళదాం అమ్మా

మీనాక్షి : నీకు కూడా మీ నాన్నలానే చెట్ల పిచ్చి ఉన్నట్టుందే

అరణ్య : అవును, నాన్న ఎప్పుడైనా చెట్లు నాటాడా

మీనాక్షి : చూపిస్తా పదా అని ఇంట్లో కావేరికి తన అమ్మ రజితకి చెప్పేసి చెప్తున్నా వినకుండా ఒక్కటే కార్ తీసుకుని ఆశ్రమానికి బైలుదేరింది, మూల మలుపు తీరుతుండగానే అమ్మా బ్రేక్ అని అరిచాడు అరణ్య.. వెంటనే మీనాక్షి బ్రేక్ నొక్కింది.. అప్పుడే రోడ్డు దాటుతున్న లారీ ఒకటి అదుపు తప్పి మీనాక్షి కారు ముందు నుంచి స్పీడ్ గా వెళ్లి అక్కడ ఉన్న ట్రాన్స్ఫర్ ని గుద్దింది.

మీనాక్షి : బుజ్జి.. వి ఆర్ వెరీ లక్కీ.. అని కారు తిప్పి పోనించింది..

అరణ్యతో మాట్లాడుతూ ఆశ్రమానికి అక్కడ శివ పెట్టిన చెట్లు తను పెరిగిన విధానం ఎలా ఆలోచిస్తాడు, కావరీకి శివకి ఉన్న బంధం.. ఎలా తను శివ కలుసుకున్నది.. శివ అస్సలు అమ్మ గురించి చెపుతుంటే అంతా వింటూ ఊ కొడుతున్నాడు అన్ని తెలిసినా.. ఆ తరువాత అక్కడ నుంచి పార్క్ కి వెళ్లి అక్కడ నుంచి రెస్టారెంట్ కి వెళ్లి ఓన్లీ ఫ్రూట్స్ తినేసి జ్యూస్ తాగేసి తిరిగి ఆశ్రమానికి వచ్చి సాయంత్రం వరకు అక్కడే పిల్లలతో గడిపారు.

శివ : హలో మీనాక్షి, పొద్దుననంగా వెళ్ళావట.. ఎక్కడున్నావ్

మీనాక్షి : ఆశ్రమంలో, అరణ్యకి బాగా నచ్చింది.

శివ : అక్కడే ఉండు వస్తున్నాను, కలిసి వెళదాం.. ఇంట్లో మనకి చిన్న ఎంగేజ్మెంట్ సెటప్ చేసారంట..

మీనాక్షి : అవునా.. హహ.. అలాగే అని ఫోన్ పెట్టేసి అరణ్యా.. నాన్న వస్తున్నారు.. యే..


*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*

చీకట్లో నీళ్లలోకి దూకిన ఆ అమ్మాయి ఎక్కువ లోతు లేనందున అరి కాళ్ళకి రాయి తగిలి కొంచెం కొట్టుకుపోయింది, పైనున్న గుండాలు ట్రైన్ వెళ్లిపోయిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి ఆ అమ్మాయి అక్కడే ఎవరో వదిలేసిన చిన్న పడవ బహుశా రోజు బ్రిడ్జికి ఉన్న మెట్లు దిగి ఆ పడవలో వెళ్లి చేపలు పట్టుకుంటారేమో అది ఎక్కి తాడు తీసి తెప్ప సాయంతో అవతలి ఒడ్డుకి పోవడానికి తెప్ప కదిలించింది.

గూండాలు కిందకి దిగి వచ్చేసరికి ఆ అమ్మాయి సగం దూరం వెళ్ళిపోయింది.

అన్నా ఇప్పుడు ఏం చేద్దాం

ఇంకో పడవ లేదు, మనం తిరిగి అటు వైపుకు వెళ్లేసరికి ఆ అమ్మాయి చేజారిపోతుంది. ఆ అమ్మాయి బతికుందంటే మనం బతికుండం

ఈ సుపారి అనవసరంగా ఒప్పుకున్నాము అన్నా

ఒప్పుకోకపోయినా మనల్ని చంపేసేవాళ్ళు.. వాడు చెప్పింది చెయ్యడం తప్ప మనకి ఇంకో దారి లేదు.. అటు వైపున మన వాళ్ళు ఉంటే ఫోటో పంపించి రెడీగా ఉండమనండి అని వెనక్కి మళ్ళాడు.

ఆ అమ్మాయి శక్తి లేకపోవడం వల్ల అటు వైపుకు వెళ్ళేవారికి తెల్లారింది, అక్కడ ఆల్రెడీ తనకోసం వెతుకుతున్నారని తెలిసి మధ్యలోనే ఆపేసి చిన్నగా వెళ్లి పిచ్చి చెట్లలో నుంచి బైటికి వచ్చి మట్టి రోడ్డు గుండా సిటీలోకి వెళ్ళింది.. మధ్యలో ముళ్ల చెట్లు ఉన్నాయేమో జాకెట్ దెగ్గర కొంచెం చినిగింది.

ఎవ్వరికంటా పడకుండా వెళ్లి బస్సు ఎక్కి కూర్చుంది, కండక్టర్ వచ్చి టికెట్ అడిగి ఆ అమ్మాయిని చూసి అనుమానంగా తన ఫోన్ కి వచ్చిన ఫోటో చూసుకున్నాడు.. ఆ అమ్మాయి వెంటనే ఏడుస్తూ కండక్టర్ కాళ్ళ మీద పడిపోయి తన మెడలో ఉన్న తాళి తీసి వాడి చేతిలో పెట్టి.. అన్నా కడుపుతో ఉన్నానన్నా దయ చూపించన్నా కావాలంటే ఈ కమ్మలు కూడా తీసుకో అని చెవులకి ఉన్న కమ్మలు కూడా తీసి వాడి చేతిలో పెట్టింది. వాడు ఇంకేం మాట్లాడకుండా చివరి సీట్లో కూర్చోమని చెప్పి టికెట్ కొట్టి తన చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు.

బస్సు బైలుదేరింది.. చిరిగిన జాకెట్ చూసుకుని చీర కొంగుని చుట్టూ కప్పుకుంది, జాకెట్ లో చెయ్యి పెట్టి తన అమ్మ ఇచ్చిన ఒక ఉత్తరం దానితో పాటు ఒక ఫోటో రెండు చేతిలో పట్టుకుని మరొక్కసారి చదివి.. ఏడుస్తూ చనిపోయిన అందరినీ తన అమ్మని తన భర్తని తలుచుకుని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.

బస్సు హైవే మీదకి ఎక్కగానే కడుపులో తిండి లేక పరిగెత్తి పరిగెత్తి అరికాళ్ళ మంటలకి త్వరగానే అలిసిపోయి నిద్రపోయింది.. మళ్ళీ కండక్టర్ వచ్చి లేపాకే.. బస్సు దిగి బస్టాండ్ నుంచి బైటికి వచ్చి అందరినీ కావేరి ఆశ్రమం దెగ్గరికి దారి అడుగుతుంటే ఎవ్వరు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు

పొద్దున్ననుంచి బేరం తగలక విసుగ్గా కూర్చున్న ఒక పిల్లోడు ఆటోలో కూర్చుని ఉన్నాడు, అస్సలు వాడికి ఆటో నడపడం అంటే ఇష్టంలేదు.. కాని ఇంటర్ ఫెయిల్ అయ్యేసరికి వాడి నాన్న ఆటో కొనిచ్చి తోలుకొమని ఇంటి నుంచి గెంటేసరికి తప్పక వేరే దారిలేక ఆటో నడుపుతున్నాడు.

ఆ అమ్మాయి నేరుగా వాడి దెగ్గరికే వెళ్ళింది. తమ్ముడు కావేరి ఆశ్రమం దెగ్గరికి తీసుకెళ్ళవా.

నూట యాభై అవుతుంది అన్నాడు చిరాగ్గా తన మొహం, రేగిపోయిన జుట్టు, వాళ్లంతా చమట చినిగిన జాకెట్ చూసి..

అక్కడికి వెళ్ళాక ఇస్తాను తమ్ముడు కొంచెం త్వరగా తీసుకెళ్ళవా అని ఎక్కి కూర్చుంది.

ఏయి ముందు ఆటో దిగు.. నీ వాలకం చూస్తుంటే నాకు డబ్బులు ఇచ్చేదానిలా ఉన్నావా.. దిగు.. అని కసిరాడు.. భయంగా ఆటో దిగింది.

ఇంతలో రెండు సుమోలు వచ్చి ఆగి అందులో నుంచి నాలుగు రోజలుగా అమ్మాయిని వెంటాడుతున్న ఆ పది మంది దిగి బస్టాండ్ లోపలికి పరిగెత్తారు.

తమ్ముడు నీకు దణ్ణం పెడతాను తమ్ముడు, చూస్తే చంపేస్తారు తమ్ముడు.. అని ఇష్టం లేకపోయినా తన కడుపు చూపించి.. ఒక్క దాని వల్ల కావట్లేదు తమ్ముడు.. కావాలంటే ఇది తీసుకొ అని చివరిగా తన ఒంటి మీద ఉన్న ముక్కు పుడక తీసి వాడికి ఇచ్చింది.. వాడి నాన్న అన్నాడు నువ్వు ఎందుకు పనికిరావని.. వాడి చెల్లి మాత్రమే చెప్పింది.. నిన్ను నువ్వు ఎప్పటికి వదులుకోవద్దని.. నీ స్వభావాన్ని మార్చకోవద్దని..

ముందుకు చాచిన చెయ్యిని అలానే పట్టుకుని గుప్పిట బిగించాడు వద్దని.. నా దెగ్గర చదువు లేనంత మాత్రాన మనసు లేదనుకోకు అక్కా.. పదా నేను దించుతాను అనగానే థాంక్స్ తమ్ముడు అని కళ్ళు తుడుచుకుని ఆటో ఎక్కుతుంటే అక్కడే ఉన్న సుమో డ్రైవర్ అది చూసాడు.

ఆటో నేరుగా ఎక్కడా ఆపకుండా వయసుకు మించిన దూకుడుతో కట్లు కొడుతూ ఆటోని కావేరి ఆశ్రమానికి చేర్చి గేట్ లోనుంచి లోపలికి పోనించి అక్కడ ఉన్న కారు ముందు ఆపాడు.

సాయంత్రాన చీకటి పడుతుండేసరికి శివ మీనాక్షిలు ఇద్దరు మాట్లాడుకుని ఇంటికి వెళదాం అని కారు ఎక్కుతుంటే అదే సమయానికి ఒక ఆటో వచ్చి అందులో నుంచి ఆ అమ్మాయి దిగి వేగంగా శివ వైపు నడిచింది.

ఆటో వాడు వెనకాల ఫాలో అవుతూ వచ్చిన సుమోలని చూసి బెదిరిపోయి ఆటో వేగంగా వెనక్కి తిప్పి పారిపోయాడు.

ఆ అమ్మాయి ముందుకు వస్తూనే శివా.. అంది

శివ : నేనే అన్నాడు ఆశ్చర్యంగా

పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుని ఏడ్చేసింది అన్నయ్యా.. అంటూ

శివ అయోమయంగా ఆ అమ్మాయి వైపు, వెనకున్న గూండాల వైపు మీనాక్షి వైపు చూసాడు.

అరణ్య : అమ్మా.. ఎట్టి పరిస్థితుల్లో అత్తయ్యని కాపాడమని చెప్పు

మీనాక్షి : శివా..

శివ : వినపడింది.. మీనాక్షి అమ్మాయిని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టు. అని పక్కనే శివ పోయిన నెల నాటిన కొబ్బరి చెట్టు మొక్కని పీకి వాళ్లకి అడ్డంగా నిలబడ్డాడు.

హలో అన్నా

సుశాంత్ : చెప్పరా

ఎవరో ఇక్కడ ఆశ్రమం దెగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, తన వెనక పడుతూ ఒక పది మంది కత్తులతో వచ్చారు. అందరూ శివ మీదకి వెళుతున్నారు.. ఏం చెయ్యమంటావ్

సుశాంత్ : నీకు వెళ్లి వాడిని కాపాడేంత సీన్ ఉందా

ఆమ్మో లేదన్నా

సుశాంత్ : మూసుకుని చెప్పింది మాత్రమే చెయ్యి.. వాడిని వేసేస్తే హ్యాపీ.. మన చెయ్యి పడకుండానే పోతాడు.. నాకు ఆ రౌడీల ఫోటోలు పంపించు మనకేమైనా ఫ్యూచర్లో ఉపయోగ పడతారేమో

అలాగే అన్నా అని ఫోన్ పెట్టేసాడు.

సుశాంత్ : శివని కత్తులతో వెంటపడి చంపేంత పగ పెట్టుకున్నది ఎవరు.. ఒకవేళ వాళ్ళతో కలిసి ప్లాన్ చేస్తే.. క్రైమ్ వాళ్ళ మీదకి వెళుతుంది, నా పగా తీరుతుంది.. ఎస్.. ఇదే కరెక్ట్.. ముందు వాళ్లెవరో.. ఎందుకు వీడి వెనక పడుతున్నారో తెలుసుకోవాలి.

ఇక్కడ శివ కొబ్బరి మట్టతో ఒకడు ముందుకు రాగానే వాడి తల మీద గట్టిగా కొట్టాడు.. మళ్ళీ ముగ్గురు ముందుకు రాబోతే దాన్ని తిప్పి కొబ్బరి ఆకులతో వాళ్ళ మొహం మీద కొట్టాడు.. అవి కోసుకుని మంట పుట్టి ఆగిపోయారు, ఇంతలో ఆ గుంపు వెనకాల ఉన్నవాడి తల పగిలి అరిచాడు గట్టిగా.. అందరూ అటు వైపు చూసారు.

శివ : రేయి ఎప్పుడు ఫోన్ చేసాను.. ఎప్పుడు వస్తున్నావ్

సందీప్ : నువ్వు మూడు రింగులకి కట్ చెయ్యగానే అమర్ జాన్సీ అని అర్ధమయ్యింది.. ఇదిగో ఈ రాడ్లు తెచ్చే వరకు లేట్ అయ్యింది అని ఒక రాడ్ శివ వైపు విసరగానే శివ అందుకుని ఎదురుగా ఉన్న వాడి మెడ మీద ఎగిరి కొట్టాడు.

శివ : అది అమర్.. జాన్సీ.. కాదురా... ఎమర్జెన్సీ..

సందీప్ : తెలుసు లేరా బాబు.. ఏదో జోక్ వేసాను.. నీకు కొంచెం హ్యూమర్ సెన్స్ ఉన్నా ఈ పాటికి నవ్వేవాడివి అంటూనే ఒకడి గుండె మీద తన్ని రాడ్ తో ఇంకొకడి తల పగలగొట్టాడు.

శివ : ఏంట్రా మావా.. తెగ ఇరగ్గొడుతున్నావ్ ఫైట్ సీన్..

సందీప్ : నీ మీద ఎటాక్ జరిగాక చాలా జాగ్రత్తలు తీసుకున్నానులే.. చాలా నేర్చుకున్నాను..

శివ : నేనంటే ఎంత ప్రేమరా నీకు.. లవ్ యు

సందీప్ : అంత లేదు నాన్నా.. నీ మీద ఎటాక్ జరిగితే అందరికంటే ముందు పారిపోడానికి.. అని కొడుతూనే మాట్లాడుతున్నాడు

శివ : ఒకడి చెయ్యి విరిచి ఇంకొకడిని తన్ని.. మిత్ర ద్రోహి

సందీప్ : సర్లేరా బాబు.. నిన్ను కాపాడుకోడానికే.. ఇలా కండలు పెంచాను సరేనా.. హ్యాపీయే గా

శివ : హహ.. అని చివరిగా ఉన్న వాడిని ఇద్దరం కలిసి వాడి గుండె మీద తన్నాము.. వెంటనే వాడి కాలర్ పట్టుకున్నాను.. ఎవడు పంపించాడు..

తెలీదు.. సుపారీ ఫోన్ లో వచ్చింది అని మాట్లాడుతుండగానే సందీప్ రాడ్ తో వాడి సెంటర్లో ఒకటి పీకాడు

శివ : ఎందుకురా

సందీప్ : వాడికేం తెలీదు వదిలేయి.. ఆమ్మో మర్చిపోయా.. మామా.. ఒక హెల్ప్

శివ : మామా అని ఇంత సాగిందంటే.. లవ్వే.. ఎవరు ?

సందీప్ : శ్రావణి

శివ : భరత్ చెల్లెలా.. ఎప్పుడు.. ఎలా రా

సందీప్ : నువ్వు కోమాలోకి పొయ్యి ఎవడికైనా మంచి జరిగిందంటే అది నా ఒక్కడికే.. నీ వెనక తిరిగి తిరిగి ఒక్కసారి నువ్వు లేకపోయేసరికి కొంత ఆడ గాలి సోకింది.. (నవ్వుతూ) హాస్పిటల్ కి ఇంటికి తిరుగుతుంటే.. పిల్ల కొంచెం చనువు ఇచ్చింది.. అల్లుకుపోయా.. అని నవ్వుతుంటే

శివ : ఓయబ్బో.. ఇదంతా సిగ్గే..

మీనాక్షి : శివా.. ఈ అమ్మాయి స్పృహ కోల్పోయింది..

వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి అడ్మిట్ చేసాము, గంట తరవాత డాక్టర్ బైటికి వచ్చింది.

డాక్టర్ : ఏడు నెలలు దాటిపొయ్యాయి.. ఇలాంటి టైంలో ఇంత వీక్ గా ఉంటే ఎలా.. తను సరిగ్గా తినక నాలుగు రోజులు అయినట్టుంది.. సెలైన్ ఎక్కించాము.. స్పృహ రావచ్చు.. జాగ్రత్తగా చూసుకోండి.. మీనాక్షి నువ్వు కూడా ఇంత వరకు చెకప్ కి రాలేదు.. వేరే డాక్టర్ చూస్తున్నారా

మీనాక్షి : ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు.. అయినా ప్రాబ్లెమ్ వస్తే మీ దెగ్గరికే కదా మేడం పరిగెత్తేది..

డాక్టర్ : (నవ్వుతూ) వెళ్లి చూడండి.. అని లేచింది..

బైటికి వచ్చాము.. సందీప్ బైట ఉంటే నేను మీనాక్షి ఆ అమ్మాయిని చూడడానికి లోపలికి వెళ్ళాము

మీనాక్షి : శివా.. తన చేతిలో ఈ చిట్టీ ఉంది అని పేపర్ అందించింది.

తీసుకుని తెరిచాను.. ఒక ఫోటో ఎవరో ఒక ఆవిడ చిన్న పిల్లాడిని ఎత్తుకుని దిగిన ఫోటో.. చాలా పరిశీలించి చూస్తే అప్పుడు అర్ధమయ్యింది అది నేనే అని.. స్పృహలో లేని ఆ అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూస్తూనే వెంటనే అమ్మకి ఫోన్ చేసాను హాస్పిటల్ కి రమ్మని. ఆ చీటీ తెరిచి చూసాను..

శివా.. నీకు నా మీద ఏ మూలనో చాలా కోపంగా ఉంటుందని నాకు తెలుసు, సారీ నన్ను నేను పరిచయం చేసుకోలేదు కదా.. నా పేరు అవంతి.. అవంతి IPS.. నిను కన్న అమ్మని.

నీ పూర్తి పేరు శివ కేశవ్, అప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు నా దెగ్గర ఉండటం కంటే బతికుంటే చాలని అనుకున్నాను అందుకే నిన్ను ఆ మహాతల్లి కావేరి గారి దెగ్గర విడిచిపెట్టాను. ఆవిడ నిన్ను ప్రేమించినంతగా నేను కూడా ప్రేమించలేనేమో అనిపించింది.. ఏమి తెలియక పోయినా నీ పేరు నీకే పెట్టింది..

నా సమస్యలు తీరాక నిన్ను నాతో తీసుకెళదామని మళ్ళీ నీకోసం వచ్చాను కాని నిన్ను కావేరి గారిని చూసాక మిమ్మల్ని విడతీయడానికి నా మనసు ఒప్పుకోలేదు.. చాలా ఏడ్చాను కాని ఇన్నేళ్ల నా కడుపు కోతని మళ్ళీ తనకి ఆ బాధ మిగల్చకూడదని అనుకున్నాను అందుకే నిన్ను తన దెగ్గరే ఉండనిచ్చాను.

నీకు గుర్తుందా ఒకసారి నువ్వు కావేరి గారు గుడి మెట్ల మీద అడుక్కునే వాళ్ళకి బట్టలు పంచారు, అందులో నేను కూడా కూర్చున్నాను నీ చేతుల మీద తీసుకున్న చీర ఇప్పటికి నా దెగ్గర పదిలంగా ఉంది. నువ్వంటే నాకు అంత ప్రేమ కాని అప్పుడున్న పరిస్థితుల వల్ల మళ్ళీ నీ దెగ్గరికి రాలేకపోయాను.

ఇప్పుడు నీ దెగ్గరికి పంపించానే అది నీ చెల్లి.. పేరు కస్తూరి.. నిన్ను నేను కావేరి గారి చేతుల్లో పెట్టినప్పుడు అది నా కడుపులోనే ఉంది.. అది నీ రక్తం పంచుకుపుట్టిన నీ చెల్లి..

మీ నాన్న జయ కేశవ్.. ఒక పెద్ద బిజినెస్ కంపెనీలో పార్టనర్ గా ఉండేవాళ్ళు. దానికి సంబంధించిన చిన్న తప్పు ఒకటి మీ నాన్నకి దొరికింది దాన్ని నేను బైటికి లాగాను.. దాని వల్ల వాళ్ళ అస్సలు బాగోతం బైట పడింది.. ఇండియా లోనే బిగ్గెస్ట్ స్కాం బైటికి ఎక్సపోజ్ అయ్యింది.. వాడు తప్పించుకోలేక జైల్లోనే గుండె ఆగి చచ్చాడు దానితో వాడి కొడుకులు మా మీద పగ పెంచుకుని నాన్నని చంపేసి నన్ను ట్రాప్ చేసి శత్రుశేషం లేకుండా చెయ్యాలని నిన్ను నన్ను చంపాలని ప్లాన్ చేసారు.. అప్పుడే తప్పక నిన్ను కావేరి గారి చేతుల్లో పెట్టి వెళ్లిపోయాను.

అక్కడ నుంచి తప్పించుకుని కేరళ చేరాను, నా ఒంటి మీద గాయాలు కస్తూరి పుట్టిన సంవత్సరానికి గాను నయం అవ్వలేదు.. నిన్ను చూడాలని ఎంత తపించానో నాకే తెలుసు.. నీకోసం ఏడవని రోజంటూ లేదు.. కాని ఈలోపే నీ చెల్లెలు కస్తూరి పుట్టింది.. ఆ తరువాత గవర్నమెంట్ కి ఎక్సపోజ్ కాకుండా దాన్ని పెంచాల్సి వచ్చి చిన్న కాలేజ్లో టీచర్ గా జాయిన్ అయ్యాను.. నువ్వు నా పక్కన ఉండుంటే నా జీవితం ఇంకోలా ఉండేదేమో కాని లేవు కదా చాలా సంవత్సరాలికి చుట్టు ఉన్న అందరూ బలవంతంతో కస్తూరికి నాన్న అవసరం మీద మళ్ళీ పెళ్లి చేసుకున్నాను.

ఇన్ని రోజులు బాగానే సాగాయి.. చెల్లికి నీ గురించి నేను ఏమి చెప్పలేదు తనని సంతోషంగానే ఉంచాలనుకున్నాను, నీ గురించి తెలిస్తే నిన్ను వెతుక్కుంటూ నీ జీవితంలోకి వచ్చి నన్ను కూడా నీ జీవితంలోకి లాగి నిన్ను డిస్టర్బ్ చేస్తుందని భయపడ్డాను.. అందుకే చెప్పలేదు వేరే ఉద్దేశం లేదు.. తన పెళ్లి నా ఫ్రెండ్ కొడుకుతో చేసాను..కాని పెళ్ళై తను వెళ్ళిపోయాక ఒక రోజు నీ ఫోటో చూస్తూ నాలో నేనే మాట్లాడుకుంటుంటే ఎప్పుడు వచ్చిందో చూసి నన్ను నిలదీసేసరికి చెప్పాల్సి వచ్చింది.. మొట్ట మొదట ప్రశ్న ఏమని అడిగిందో తెలుసా నా అన్నయ్య ఎక్కడా అని.. చెపుదామనుకున్నాను కాని ఎప్పుడు ఆ రాక్షసుల కంట బడ్డామొ తెలీదు చూడగానే వాడికి నా మీద పగే గుర్తు కొచ్చినట్టుంది మళ్ళీ మా పరుగులు మొదలయ్యాయి.

కడుపుతో ఉన్న నీ చెల్లిని నేను కాపాడగలనన్న నమ్మకం నాకు లేదు, అందుకే నీ దెగ్గరికి పంపిస్తున్నాను. నా శివ నేను అనుకున్నట్టే ఉంటాడని నమ్మి నీ దెగ్గరికి పంపిస్తున్నాను.. మీ నాన్నలోని మంచితనం నాలోని దూకుడుతనం రెండు నీలో ఉన్నాయని అనుకుంటున్నాను అందులోనూ నువ్వు పెరిగింది చాలా మంచి మనిషి చేతుల్లో పెద్దగా సందేహం పెట్టుకోలేదు.

ఒకవేళ నేను అనుకున్న నా శివ కేశవుడు అలానే ఉంటే నీ చెల్లిని కాపాడుకో.. ఒకవేళ అలా లేకపోతే తనని దాయి.. ఆ ధైర్యం కూడా లేకపోతే ఎక్కడికైనా దూరంగా పంపించేయి తన బతుకు తను బతుకుతుంది.. ఇక ఈ ఉత్తరం, నీ చెల్లెలు నీ దెగ్గరికి చేరేటప్పటికి నేను ఉంటానో లేదో నాకు తెలీదు ఎక్కడ దాక్కున్నా కనిపెట్టేస్తున్నారు. చివరి వరకు నా మొహం నీకు చూపించనేలేదు అందుకు నన్ను క్షమించు.

నువ్వు నన్ను అమ్మా అని పిలవకపోయినా, నా దురుదృష్టవశాత్తు నువ్వు నన్ను అసహ్యించుకున్నా నాకు బాధ లేదు.. నా పరిస్థితులు అలాంటివి మిమ్మల్ని బతికించుకోవాలన్న ఒకే ఒక్క ధ్యాసలో ఏదీ తోస్తే అది చేసుకుంటూ పోయాను.. కాని ఒక్కటి నువ్వు ఒక నిజాయితీ మరియు మంచితనం కలిగిన ఒక గొప్ప కుటుంబంలో పుట్టావని చాలా గర్వంగా చెప్పగలను.. వీలైతే నన్ను క్షమించు.. ఇంకో జన్మ ఎత్తితే ఒక తల్లిగా నీకు చెయ్యని సేవలు చేసుకోవాలని ఆశగా ఉంది. చెల్లెలి సంగతి.. మర్చిపోకు.. జాగ్రత్త..

కావేరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయ్యి...

లెటర్ మూసి జేబులో పెట్టుకున్నాను.. వెళ్లి కస్తూరి పక్కన కూర్చున్నాను..

అరణ్య : అమ్మా తన దెగ్గరికి వెళ్ళు

శివ : నాకు అరణ్య మాటలు వినిపిస్తున్నాయి కాని మీనాక్షికి తెలియకూడదని నటిస్తూనే లేచి నిలబడ్డాను.

మీనాక్షి కస్తూరి దెగ్గరికి వెళ్లి తన పక్కన కూర్చుంది.

అరణ్య : తన పొట్ట మీద చెయ్యి పెట్టు

మీనాక్షి కస్తూరి హాస్పిటల్ డ్రెస్ పైకి అని తన పొట్ట మీద చెయ్యి వేసింది.

అరణ్య :

ఆడపిల్ల
అందమైన ఆడపిల్ల
కృష్ణ భగవానుడి భక్తురాలు
సంగీతం అంటే చాలా మక్కువ
ఏమి చదవనవసరం లేదు, చదువుల తల్లి.. అన్ని నేర్చుకునే అడుగు పెడుతుంది
అన్ని ఉన్నా ఏమి ఉండవు
మంచి చతురత కలది
గుణవంతురాలు
అరచేతిలో దిక్సూచితో పుడుతుంది


లేపుతున్నాను.. అని కస్తూరిని లేపాడు అరణ్య

శివ వెళ్లి తన చెల్లి పక్కన కూర్చుని చూసాడు.

కస్తూరి : అన్నయ్యా.. అని ఏడ్చేసింది..

శివ : కస్తూరి.. అమ్మ...?

కస్తూరి : ఎవ్వరు లేరు.. అందరినీ చంపేశారు.. అని వాటేసుకుని ఏడ్చేసింది.

శివ కళ్ళు మూసుకున్నాడు, కన్నీళ్లు జలజలా రాలాయి..

శివ : వాళ్ళ కార్యక్రమాలు ?

కస్తూరి : లేదు.. ఇంకా అక్కడే ఉన్నారు..

శివ : నువ్వు ఓకే నా.. ముందు ఏమైనా తిను

కస్తూరి : లేదు అన్నయ్యా.. నాకిప్పుడు బానే ఉంది.. ఇంతక ముందు కంటే ఇప్పుడే ఇంకా ఆరోగ్యంగా ఉన్నానని అనిపిస్తుంది.

శివ : నాకు తెలుసు, అని లేచి మీనాక్షి ముందు మోకాళ్ళ మీద కూర్చుని అరణ్యకి ముద్దు పెట్టి లేచి కస్తూరి వైపు తిరిగి.. వదిన అన్నాడు..

కస్తూరి చెయ్యి చాపగా మీనాక్షి ఆ చెయ్యి అందుకుని నిలబడింది.. ఇంతలో సందీప్ లోపలికి వచ్చాడు.

సందీప్ : శివా.. అమ్మ వచ్చింది.

శివ తన చేతిలో ఉన్న లెటర్ ఫోటో తీసుకుని బైటికి వెళ్లి కావేరికి చూపించాడు.

కావేరి : శివుడు.. అమ్మరా.. తనేరా నీ అమ్మ.. ఈ ఫోటో ఎక్కడిది..

శివ తన చేతిలో ఉన్న లెటర్ కావేరికి ఇచ్చాడు.. అంతా చదివి శివ వైపు చూసింది బాధగా..

కావేరి : ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నావ్

శివ : ముందు కేరళ వెళతాను

కావేరి శివ చెయ్యి పట్టుకుంది గట్టిగా

కావేరి : ప్రమాదం అని తెలిసి..

శివ : ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అనగానే కావేరి పట్టుకున్న చెయ్యి వదిలేసింది.. నా చెల్లెలు లోపల ఉంది అనగానే కావేరికి అర్ధమయ్యింది శివ ఈ విషయంలో ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాడని.. కస్తూరిని చూడటానికి లోపలికి వెళ్ళింది.

డాక్టర్ వచ్చి చెక్ చేసి ఇంకెప్పుడు ఆహారం విషయంలో నెగ్లెక్ట్ చెయ్యొద్దని హెచ్చరించి డిశ్చార్జ్ చేసింది. అందరూ వెళ్లిపోతుంటే సందీప్ అయోమయంగా శివ వంక చూసేసరికి.. శివ మొత్తం వివరించాడు.

శివ : బైటికి నడుస్తూనే కళ్ళు తుడుచుకుంటూ నన్ను కన్న అమ్మలా ధైర్యంగా ఉండాలని నవ్వుతూ ఆలోచించాను. సందీప్.. సంపాదించింది చాలు.. వాటికవే పెరుగుతాయిలే.. కేరళ వెళ్ళాలి ఏర్పాట్లు చెయ్యి

సందీప్ : ఓకే

శివ : విత్ గన్స్

సందీప్ : డబల్ ఓకే

ఇంతలో కస్తూరి బైటికి వచ్చి శివ చెయ్యి పట్టుకుంది.

శివ తన వంక చూసాడు..

కస్తూరి : అన్నయ్యా.. నేను నీకు బరువవుతున్నానా.. వాళ్ళు చాలా గోరంగా..

శివ : ష్.. నన్ను నమ్ముతున్నావా

కస్తూరి : నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారు అన్నయ్యా

శివ : ఇప్పటి వరకు అమ్మతో ఎలా ఉన్నావో అంతే చనువుగా నాతోనూ ఉండు.. నిన్ను అమ్మలా చూసుకుంటాను..

కస్తూరి : నాకు తెలుసు

శివ : ఏం తెలుసు

కస్తూరి : అమ్మ చెప్పింది.. నువ్వు ఎలాంటి వాడివో ఎలా ఉంటావో

శివ : అంటే..

కస్తూరి : మాకు ఎవ్వరికి చెప్పకుండా దొంగతనంగా వచ్చి నిన్ను చూసుకుని వెళ్ళేదట.. అప్పుడే అమ్మని వాళ్ళ మనుషులు ఎవరో చూసి ఉంటారని అనుమాన పడింది కాని ఇప్పుడు అమ్మే లేదు

శివ : నువ్విలా బాధ పడితే పుట్టబోయే బిడ్డకి మంచిది కాదు.. మన చేతుల మీదగా వాళ్ళకి కర్మకాండలు జరిపిద్దాం. అని నా చెల్లెలి భుజం మీద చెయ్యి వేసి ముందుకు నడిపించాను.. వెనకాలే కావేరి చేతిలో ఉన్న ఉత్తరం చదువుతూ కన్నీళ్లతో కావేరి చెయ్యి పట్టుకుని ముందు వెళుతున్న అన్నా చెల్లెళ్ళని చూస్తూ ఉంది మీనాక్షి.

ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని అందరం ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాం. కస్తూరి నాకు ఒక పక్కన, మీనాక్షి ఇంకో పక్కన కూర్చున్నారు.

శివ : అమ్మ గురించి చెప్పు.. తను నాకోసం వచ్చేదా

కస్తూరి : అవును.. అప్పుడప్పుడు నిన్ను దూరం నుంచి చూసుకునేదట

శివ : నన్ను ఒక్కసారి కలిసి ఉండొచ్చు కదా

కస్తూరి : అమ్మకి ఎప్పుడు ఒక అనుమానం ఉండేది, వాళ్ళు అమ్మ కోసం వెతుకుతూనే ఉంటారని.. ఎందుకంటే అమ్మ వల్ల వాళ్ల ఆస్తిని పేరుని వాళ్ల నాన్నని కోల్పోయారట.. మళ్ళీ నిన్ను కలిస్తే నీకు ప్రమాదమని నీకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకుంది..

శివ : కాని చివరికి నిన్ను నానా దెగ్గరికే చేర్చింది కదా.. అదేదో మనం ముందే కలిసుంటే.. అని కళ్ళు తుడుచుకున్నాను.

కస్తూరి : నాకొక సారి చెప్పింది.. నీకు తన గురించి తెలిస్తే వదలవని ఎంత దూరం అయినా వచ్చేస్తావని చాలా మొండివాడివని చెప్పింది.

మీనాక్షి : అవును మీ అన్నయ్య చాలా మొండోడు

కస్తూరి : భయంగా ఉంది అన్నయ్యా

శివ : నిన్ను సురక్షితంగా ఉంచే బాధ్యత నాది

కస్తూరి : అది కాదు అన్నయ్య.. నేను నీ దెగ్గరికి వచ్చింది వాళ్ళకి భయపడొ లేక ఇంకేదో అవుతుందనొ కాదు.. ఈ బిడ్డని బతికించుకోవాలనుకున్నాను.. అంతకంటే ఎక్కువగా నిన్ను చూడాలని చాలా గట్టిగా అనుకున్నాను.. కాని ఇప్పుడు నీకేమైనా జరిగితే..

మీనాక్షి : ఏమి జరుగుతుందో చూద్దాం.. నీకు తోడుగా మీ అన్న మాత్రమే కాదు.. నేను నా తో పాటు నా కొడుకు ఉన్నాడు అంతలోనే కవర్ చెయ్యడానికి ఉంటాడు అని ఆపేసింది.. మళ్ళీ ఏమి తెలియనట్టే ఏరా బుజ్జి అంది

అరణ్య ఏమి మాట్లాడలేదు..

వీడొకడు అప్పుడప్పుడు మాట్లాడతాడు అప్పుడప్పుడు అస్సలు లెక్కే చెయ్యడు.. అని మనుసులో అనుకుంటూనే బైటికి నవ్వుతుంటే అరణ్య కూడా నవ్వాడు.. మీనాక్షి కడుపు వెచ్చగా అవ్వగానే.. దొంగ అని అనుకుని నవ్వుకుంది..

ఫ్లైట్ కేరళలో ల్యాండ్ అయ్యింది.
Next page: Update 15
Previous page: Update 13